జేసీ ఫోర్జరీ కేసులో సరికొత్త ట్విస్ట్‌ | New Twist In JC Travels Forgery Case | Sakshi
Sakshi News home page

జేసీ ఫోర్జరీ కేసులో సరికొత్త ట్విస్ట్‌

Published Sat, Feb 29 2020 2:35 PM | Last Updated on Sat, Feb 29 2020 2:57 PM

New Twist In JC Travels Forgery Case - Sakshi

సాక్షి, అమరావతి : జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. సీఐలు, ఎస్సై, ఆర్టీఏ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ క్లియరెన్స్‌ సర్టిఫికేట్లను సృష్టించడమే కాకుండా.. నకిలీ ఇన్సూరెన్స్‌ సర్టిఫికేట్లను కూడా తయారు చేశారు. యూనైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ పేరుతో ఫేక్‌ డాక్యుమెంట్లను తయారు చేసి రవాణశాఖ అధికారులకు సమర్పించారు. జేసీ ఫోర్జరీ వ్యవహారంపై విచారణ జరుపుతున్న రవాణాశాఖ టాస్క్‌ఫోర్స్‌ బృందం.. ఇప్పటివరకు 56 నకిలీ ఇన్సూరెన్స్‌ సర్టిఫికేట్లను గుర్తించింది.

(చదవండి: బయటపడ్డ జేసీ మరో చీటింగ్‌ వ్యవహారం)

బీఎస్‌-3 వాహనాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి ఫోర్జరీ డాక్యుమెంట్స్‌తో బీఎస్‌-4గా రిజిస్ట్రేషన్‌ చేయించారు. నాగాలాండ్‌, కర్ణాటక రాష్ట్రాలలో 154 లారీలను నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటిదాకా 20లారీలను సీజ్‌ చేశారు. మిగిలిన వాహనాలను జేసీ ట్రావెల్స్‌ అజ్ఞాతంలోకి తరలించారు. రెండు లారీలను బస్సులుగా మార్చేసి వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తాజాగా వెలుగు చూసిన ఫేక్‌ ఇన్సురెన్స్‌ సర్టిఫికేట్ల బాగోతంపై రవాణా శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

(చదవండి : జేసీ ట్రావెల్స్‌లో బయటపడ్డ ఫోర్జరీ బాగోతం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement