jC travels
-
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ వ్యవహారంలో కొత్త ట్విస్ట్
-
జేసీ ప్రభాకర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: అనంతపురం(ఏపీ) టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో దివాకర్ ట్రావెల్స్ BS3 వాహనాలను.. BS4గా మార్చి నడుపుతున్నారని అభియోగాలకుగానూ ఈ పరిణామం చోటు చేసుకుంది. నెలలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆయన్ని నోటీసుల్లో హైకోర్టు ఆదేశించింది. దివాకర్ ట్రావెల్స్ బీఎస్-3 వాహనాలను కొని బీఎస్-4 వాహనాలుగా మార్చి నడుపుతున్నట్టు గతంలో అధికారుల సోదాల్లో నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసి.. కర్ణాటక, ఏపీలోని పలు వాహనాలను సైతం సీజ్ చేశారు. అయితే తెలంగాణలో మాత్రం ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. జేసీ ట్రావెల్స్ వ్యవహారాలపై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సీబీఐకి విచారణకు అప్పగించాలని పిటిషన్ వేశారు. 2020, అక్టోబర్ 12న తెలంగాణ రవాణా శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశానని, అయినా చర్యలు తీసుకోలేదని తన పిటిషన్లో ఎమ్మెల్యే పెద్దారెడ్డి తెలిపారు. తెలంగాణలో మాత్రం బస్సులను అక్రమంగా నడుపుతున్నారని, ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించిన హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ.. జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు ప్రతివాదులైన తెలంగాణ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, రవాణాశాఖ కమిషనర్, డీజీపీ, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. -
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో రంగంలోకి సీబీఐ
-
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో సీబీఐ ఎంట్రీ.. స్క్రాప్ కింద కొన్న వాహనాలను..
సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోరర్జీ కేసులో సీబీఐ రంగంలోకి దిగింది. తాడిపత్రిలోని జేసీ దివాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డి ఆఫీసులో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో బీఎస్-3 వాహనాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి బీఎస్-4గా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. జేసీ ట్రావెల్స్ 154 వాహనాలను నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేసిందన్నారు. కాగా, జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో ఇప్పటికే రూ.22 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ షాక్.. భారీగా ఆస్తుల అటాచ్
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ర్డెఇకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చిది. బస్సుల కొనుగోలు కుంభకోణం కేసులో ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరుడు గోపాల్‌రెడ్డి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. దివాకర్ రోడ్‌లైన్స్, జఠాదర ఇండస్ట్రీస్‌కు చెందిన 22.10 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. జీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్‌లో అవకతవకలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. అశోక్ లేలాండ్ నుంచి తక్కువ ధరకు వాహనాలు కొన్నట్లు తెలిపింది. స్క్రాప్ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లతో కొత్త వాహనాలు నడిపినట్టు ఈడీ పేర్కొంది. బీఎస్ 4 వాహనాల స్కాంలో రూ. 38.36 కోట్ల కుంభకోణం జరిగినట్లు తెలిపింది. రూ.6.31 కోట్ల విలువైన నగదు, అభరణాలు, బ్యాంక్ డిపాజిట్లు సీజ్ చేశారు. రూ. 15.79 కోట్ల విలువైన 68 చరాస్తులను సీజ్ చేశారు. చదవండి: ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు షాక్ అక్రమాల బాగోతం ఇలా.. టీడీపీ సీనియర్ నేతలు జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి బ్రదర్స్ సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్–3 కేటగిరీకి చెందిన 154 లారీలు, బస్సులను తుక్కు కింద జటాధర ఇండస్ట్రీస్ పేరున 50, సి. గోపాల్‌రెడ్డి అండ్ కో పేరున 104 వాహనాలను కొన్నారు. నకిలీపత్రాలతో వాటిని బీఎస్–4 వాహనాలుగా చలామణిలోకి తీసుకొచ్చారు. అనంతరం వాటిని నాగాలాండ్ రాజధాని కోహిమాలో రిజిస్ట్రేషన్ చేయించి, ఎన్ఓసీ పొందారు. ఆ తర్వాత 15 రోజుల్లోనే వాటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లలో మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆంధ్రప్రదేశ్‌లో 101 వాహనాలు, తెలంగాణలో 33 వాహనాలు, కర్ణాటకలో 15 వాహనాలు, తమిళనాడులో ఒకటి, ఛత్తీస్‌గఢ్‌లో ఒక బస్సు నిర్వహిస్తున్నారు. ఆ వాహనాల లైసెన్సులకు కూడా ఫోర్జరీ పత్రాలు సమర్పించారు. అంతేకాక.. వాహనాల బీమాలోనూ వీరు ఫోర్జరీకి పాల్పడ్డారు. వీటిని కొద్దిరోజులపాటు తిప్పి ఆ తర్వాత పోలీసుల ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లతో (ఎన్ఓసీ) వాటిని ఇతర రాష్ట్రాల వారికి విక్రయించేశారు. కానీ, వీటిని కొనుగోలు చేసినవారు తాము మోసపోయామని గుర్తించి ఫిర్యాదుచేశారు. సమగ్ర సమాచారం కోసం పోలీసులు ‘నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎన్ఐసీ)’ రికార్డులను పరిశీలించారు. జేసీ కుటుంబం సమర్పించిన బీమా పత్రాలు నకిలీవని తేలింది. దీంతో అనంతపురం డిప్యూటీ రవాణా శాఖ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 2020 జూన్‌లో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డితోపాటు 23 మందిపై వివిధ సెక్షన్ల కింద 35 కేసులు నమోదు చేశారు. ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను అరెస్టుచేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. -
గది ఖాళీ చేయమంటే.. చంపుతామంటున్నారు
సాక్షి, అనంతపురం: అనంతపురం నగరంలోని నందినీ హోటల్ ఎదురుగా ఉన్న జేసీ ట్రావెల్స్ గదిని ఖాళీ చేయకుండా తమను తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి బెదిరిస్తున్నారని మల్లికార్జున ఆచారి దంపతులు ఎస్పీ ఫక్కీరప్పను కలిసి కన్నీరు మున్నీరయ్యారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్‌కు హాజరైన వారు తమ ఆవేదనను ఎస్పీకి విన్నవించుకున్నారు. గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి పిటీషన్లు స్వీకరిస్తున్న ఎస్పీ తమ షాపును 2000లో బాబాయ్య అనే వ్యక్తికి బాడుగకు ఇచ్చామని, అయితే తమ నుంచి అద్దెకు తీసుకొని అతను షాపును తాడిపత్రి జేసీ ట్రావెల్స్‌కు అద్దెకు ఇచ్చాడన్నారు. ఇప్పుడు వారిద్దరు కుమ్మక్కై నాకు బాడుగ ఇవ్వకుండా ఖాళీ చేయకుండా వేధిస్తున్నారని తెలిపారు. నేరుగా జేసీ ప్రభాకర్‌రెడ్డిని కలిశామని, స్పందించాల్సిన పెద్దమనిషి బెదిరించారన్నారు. షాపు పగల గొడతా, మర్డర్ చేస్తానన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని వేడుకున్నారు. స్థానిక కమలానగరులో ఇండిపెండెంట్ బిజినెస్ కన్సల్టర్ సెంటర్ (ఐబీసీసీ) పేరుతో పేద విద్యార్థులకు డబ్బు ఆశ చూపి మోసం చేస్తున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐక్య విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మతి హనుమంతురెడ్డి, ఏపీఎస్ఎఫ్ అధ్యక్షుడు ఆకుల రాఘవేంద్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్యచంద్ర.. ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మొత్తం 97 మంది నుంచి ఎస్పీ పిటీషన్లు స్వీకరించారు. అనంతం ఎస్పీ మాట్లాడుతూ ఆస్తులు కాజేయడం, కబ్జాలకు తెగబడటం, డబ్బు ఆశ చూసి చీటింగ్‌కు పాల్పడటం వంటి మోసాలకు పాల్పడివారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. అలాంటి వంచకులపై ఫిర్యాదులు అందితే తాట తీస్తామని హెచ్చరించారు. చదవండి: (మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్.. ఒకేసారి 50 బృందాలతో..) -
కదులుతున్న అక్రమాల పుట్ట.. స్లీపర్ కోచ్ బస్సులో అసాంఘిక కార్యకలాపాలు!
టీడీపీ పాలనలో జేసీ సోదరులు (మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి) అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారు. నాలుగు దశాబ్దాలుగా ట్రావెల్స్ వ్యాపారంలో అక్రమంగా రూ.కోట్లు దండుకున్నారు. ఒక బస్సుతో ప్రారంభమైన ట్రావెల్స్ వ్యాపారం నుంచి వందల సంఖ్యలో బస్సులు పుట్టుకొచ్చాయి. ఒక పర్మిట్ నంబర్‌తో నాలుగు బస్సులు తిప్పుతూ ఆర్టీఏ అధికారులనే బురిడీ కొట్టించారు. ఎట్టకేలకు వీరి అక్రమాల పుట్ట కదులుతోంది. నిన్న త్రిశూల్... నేడు దివాకర్ ట్రావెల్స్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాడిపత్రి అర్బన్: జేసీ సోదరులు అడ్డగోలు వ్యాపారాలు, అవినీతి అక్రమాలతో రూ.కోట్లు పోగేసుకున్నారు. ఒకేనంబర్పై పలు బస్సులను అనధికారికంగా నడిపారు. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ బస్సులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఓ ప్రయాణికురాలు ఇచ్చిన సమాచారం మేరకు 2012లో రవాణాశాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య స్వయంగా అధికారులతో కలిసి కర్నూలు–హైదరాబాద్ జాతీయ రహదారిలో తనిఖీలు నిర్వహించారు. మొబైల్ వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించి దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ బస్సును సీజ్ చేశారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్‌లపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేని బస్సులను సీజ్ చేయడం సంచలనం రేపింది. కండీషన్ లేని బస్సులు నడపడం వల్ల తరచూ ప్రమాదాలకు గురవుతుండటం, ట్రావెల్స్ వ్యవహారంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలపై నిఘా అధికమైంది. అనుమతులు లేకుండా తిరుగుతున్న బస్సులను ఎక్కడికక్కడ సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. గ్రానైట్ మాఫియా తాడిపత్రిలో 850 వరకు గ్రానైట్ పరిశ్రమలున్నాయి. వీటన్నింటికీ కలిపి 70 లారీలతో 20 నుంచి 30 మంది ట్రాన్స్పోర్టర్లు గ్రానైట్ రాళ్లను చిత్తూరు, మడకశిర, కర్నూలు ప్రాంతాల నుంచి తీసుకువస్తుంటారు. ఒక లోడు గ్రానైట్ క్వారీ నుంచి తాడిపత్రికి చేరాలంటే రూ.45 వేల నుంచి రూ.50 వేల మేర రాయల్టీ చెల్లించాలి. అయితే రాయల్టీ లేకుండా క్వారీ నుంచి తాడిపత్రికి గ్రానైట్ చేర్చేలా క్వారీ యాజమాన్యం, తాడిపత్రి పాలిష్ మిషన్ వ్యాపారుల మధ్య కుదిరిన ఒప్పందం మాఫియాను తలపించింది. అలాగే లారీలో ఉన్న గ్రానైట్ పరిమాణాన్ని బిల్లులో తగ్గించి, ఒకే బిల్లుతో ఐదారు లోడ్లు రవాణా చేస్తుండేవారు. ఈ డబ్బులు మొత్తం మాఫియాను నడిపే ఓ ‘పెద్దమనిషి’ ఇంటికి చేరవేసేవారు. అక్కడ వాటాల పంపకం జరుగుతుండేది. నిజాయితీ అధికారులకు వేధింపులు మైనింగ్ విజిలెన్స్ ఏడీగా ప్రతాప్‌రెడ్డి 2015 ఆగస్టు 21న బాధ్యతలు స్వీకరించారు. తాడిపత్రిలోని అక్రమాల గురించి తెలిసి షాక్ అయ్యారు. ఈ అక్రమ దందాపై ఉక్కుపాదం మోపారు. 2015కు ముందు ఏటా రూ.కోటి కూడా పెనాల్టీ రూపంలో వచ్చేవి కావు. కానీ 2015–16లో రూ.5.40 కోట్లు, 2016–17లో రూ.5.55 కోట్లు రాబట్టారు. దందా ఏ స్థాయిలో సాగిందో ఈ జరిమానాలు చూస్తే తెలిసిపోతుంది. ఇలాంటి నిజాయితీ అధికారి ఇక్కడ ఉంటే ఆటలు సాగవని బదిలీ చేయించాలని చూశారు. చివరకు చంపుతామంటూ బెదిరింపులకు కూడా దిగారు. దీంతో గ్రానైట్ మాఫియాతో తనకు ముప్పు ఉందంటూ మైనింగ్ విజిలెన్స్ డైరెక్టర్‌కు ప్రతాప్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. అప్పటి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పీఏ రవీంద్రారెడ్డిని ఏ1గా, గ్రానైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరెడ్డి, బిల్లుల బాబు నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తర్వాత ప్రతాప్‌రెడ్డిని ఇక్కడి నుండి ఆ మాఫియానే బదిలీ చేయించి తమ అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగించేది. అధికారాన్నీ అడ్డుపెట్టుకుని గ్రానైట్ మాఫియా ద్వారా రూ.200 కోట్లకు పైగా ఆర్జించారన్న ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి. ట్రాన్స్‌పోర్టు ద్వారా రూ.300 కోట్లు అర్జాస్ స్టీల్‌ప్లాంట్ కోసం హుసేనాపురం, జంబులపాడు, చల్లవారిపల్లి, వీరాపురం గ్రామాల ప్రజలు దాదాపు 2వేల ఎకరాల వరకు స్వాధీనం చేశారు. వీరు లారీలు, ఇతర మార్గాల ద్వారా ఈ ప్లాంటుపై ఆధారపడి జీవించే వారు. అయితే దివాకర్ రోడ్‌లైన్స్, ట్రాన్స్ ఇండియా పేరుతో జేసీ బ్రదర్స్ సొంతంగా ట్రాన్స్‌పోర్టు ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జేసీ బ్రదర్స్ ట్రాన్స్‌పోర్టును కాదనే ధైర్యం ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఉండేది కాదు. దీంతో తొలి ప్రాధాన్యత వారికే ఇస్తూ వచ్చేవారు. అయతే ఇందుకు సంబందించిన బిల్లులను జేసీ బ్రదర్స్ ట్రాన్స్‌పోర్టు పేరు మీద కాకుండా తాడిపత్రి లారీ అసోసియేషన్ పేరుపై చేయిస్తూ ప్రభుత్వానికి ట్యాక్స్ కూడా ఎగ్గొడుతున్నట్లు సమాచారం. లారీలపై జేసీపీఆర్ అని ఉంటుంది. బిల్లులు మాత్రం ఆయన పేరుతో ఉండవు. మొత్తం బినామీ లెక్కలే. ఈ లారీలు మినహా ఇతర లారీలు స్టీల్‌ప్లాంట్‌లో వెళ్లేందుకు వీల్లేదు. ఇలా ఐదేళ్ళలోట్రాన్స్పోర్టు ద్వారా రూ.300 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. డ్రై స్లాగ్ ద్వారా కోట్లు కొల్లగొట్టారు అర్జాస్ స్టీల్ ప్లాంట్‌లో డ్రైస్లాగ్‌ను టన్ను రూ.10 తో టీడీపీ నేతలు కొనుగోలు చేసేవారు. దీనిని అ్రల్టాటెక్ సిమెంట్, సాగర్ సిమెంట్ పరిశ్రమలకు తరలించి టన్ను రూ.850 చొప్పున విక్రయించేవారు. ట్రాన్స్‌పోర్టు, ఇతర ఖర్చుల కింద రూ.250 పోగా రూ.600 మేర మిగులుతుండేది. ప్రతి నెలా 25వేల టన్నులకు పైగా డ్రై స్లాగ్‌ను ఈ స్థాయిలో తరలించే వారు. ఈ లెక్కన నెలకు రూ.1.5 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.100కోట్ల ఆదాయం గడించినట్లు తెలుస్తోంది. రాజకీయ అవసరాలకు మట్కా డాన్ తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ రాజకీయ అవసరాలకు మట్కా డాన్ రషీద్ స్పాన్సర్‌గా వ్యవహరించేవాడు. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కార్లు కొనుగోలు చేస్తే వాటికి నెలవారీ కంతులు కూడా రషీద్ చెల్లించేవాడని తెలిసింది. దేవుని మాన్యాన్నీ వదలని సోదరద్వయం పెద్దపప్పూరు మండలం చిన్నపప్పూరులో వెలసిన పప్పూరమ్మ ఆలయానికి దాదాపు 19 ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి. ఈ భూముల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఆలయంలో ధూప దీప నైవేద్యాలు, నిత్య కైంకర్యాలు చేస్తుండేవారు. అయితే తాడిపత్రి – పెద్దపప్పూరు ప్రధాన రహదారి పక్కన ఉన్న ఈ భూములను మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కబ్జా చేసి పంట సాగు చేపట్టారు. రెండు పెద్ద ఫారంపాండ్లు ఏర్పాటు చేయించి బోరుబావుల నీటితో వాటిని నింపారు. ఈ నీటితో మాన్యం భూముల్లో కరివేపాకు, అరటి సాగు చేశారు. పంట దిగుబడుల ద్వారా రూ.లక్షలు ఆర్జిస్తున్నా ఆలయంలో పూజలకు కనీసం ఒక్క పైసా చెల్లించలేదనే ఆరోపణలు వినిపించాయి. ఏడాది క్రితం విచారణకు వచ్చిన దేవదాయ శాఖ అధికారులు ఆ భూములన్నీ జేసీ ఆధీనంలో ఉన్నాయని గుర్తించారు. మూడు నెలల క్రితం ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆదర్శ మున్సిపాలిటీని గలీజు చేసి.. తాడిపత్రి మున్సిపాలిటీ పేరుకే ఆదర్శం. జేసీ సోదరులు, వారి అనుచరులు ఆదర్శ మున్సిపాలిటీ మాటున రూ.200 కోట్లకు పైగా దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభాకర్‌రెడ్డి బినామీగా వ్యవహరించిన ఎస్.వి.రవీంద్రారెడ్డి తాడిపత్రిలోని జేసీ నాగిరెడ్డి మున్సిపల్ కాంప్లెక్స్‌లో మొదటి అంతస్తు టెండర్ దక్కించుకున్నాడు. ఏడాదికి రూ.7.36 లక్షలు అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. దీనికి గుడ్‌విల్ రూపంలో రూ.2.66 కోట్లు మున్సిపాలిటీకి బకాయి చెల్లించాల్సి ఉంది. మొదటి అంతస్తుకు సంబంధించి రూ.2.73 కోట్లు మున్సిపాలిటీకి బకాయి పడ్డారు. ఈ మొత్తం కాంప్లెక్స్‌ను దాదాపు 50 మంది వ్యాపారులకు సబ్లీజుకు ఇచ్చేశారు. ఒక్కో వ్యాపారి నుంచి రూ.20వేల నుంచి రూ.30వేల చొప్పున అద్దె వసూలు చేశారు. నెలకు రూ.10 లక్షలు నుంచి రూ.15 లక్షలు ఆదాయం వచ్చేది. ఇదే కాంప్లెక్స్‌లో 64, 68 షాపులు కూడా ఎస్.వి.రవీంద్రారెడ్డి దక్కించుకున్నాడు. వీటికి సంబంధించి రూ.3.52 లక్షలు గుడ్‌విల్ రూ.3.33 లక్షలు బాడుగ కలిపి మొత్తం రూ.7.83 లక్షలు బకాయి పడ్డారు. దీంతో ఈ దుకాణాల లీజును మున్సిపల్ అధికారులు రద్దు చేశారు. కానీ ఈ దుకాణాలు లీజుకు ఇచ్చి ప్రతినెలా భారీగా అద్దె వసూలు చేశారు. గడిచిన ఐదేళ్లుగా ఇదే తంతు కొనసాగించారు. దీంతో పెద్ద ఎత్తున మున్సిపల్ ఆదాయానికి గండిపడింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మున్సిపల్ కాంప్లెక్స్‌లో 64, 76, 68, 62 నంబర్ షాపులను కూడా ఎస్.వి.రవీంద్రారెడ్డి దక్కించుకున్నాడు. వీటికి రూ.2వేల చొప్పున మాత్రమే అద్దె చెల్లిస్తున్నాడు. వ్యాపారులకు మాత్రం రూ.20వేల నుంచి రూ.30వేల వరకు సబ్లీజుకు ఇచ్చుకున్నాడు. రెండు కాంప్లెక్స్‌లోని అద్దెలు రవీంద్రారెడ్డి వసూలు చేసినా, ఈ డబ్బులు తిరిగి జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి చేరినట్లు సొంత పార్టీ నేతలే చెబుతుండడం గమనార్హం. -
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఈడీ ప్రశ్నల వర్షం
-
‘జేసీ’లపై బిగుస్తున్న ఉచ్చు!.. బట్టబయలైన అక్రమాలు
సాక్షి, అమరావతి/హైదరాబాద్: నకిలీపత్రాలతో వాహనాల రిజిస్ట్రేషన్లు, ఫోర్జరీ ఎన్ఓసీలతో వాహనాల కొనుగోలు, అమ్మకాల వెనుక భారీగా నల్లధనం చేతులు మారిన బాగోతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జేసీ కుటుంబ సభ్యులపై ఉచ్చుబిగుస్తోంది. దీనికి సంబంధించి మనీ లాండరింగ్ చట్టాలను ఉల్లంఘించిన వ్యవహారంలో విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీచేయడంతో ఆయన హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో శుక్రవారం విచారణకు హాజరయ్యారు. ఆయనతోపాటు ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి కూడా ఉన్నారు. దాదాపు 5 గంటలపాటు అధికారులు ప్రశ్నించారు. విచారణానంతరం ప్రభాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అధికారులు విచారణకు రమ్మని నోటీసులివ్వడంతో వచ్చానని, లారీల కొనుగోలుపై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. విచారణకు సహకరిస్తానని, ఎప్పుడు పిలిచినా తాను విచారణకు హాజరవుతానన్నారు. అక్రమాల బాగోతం ఇలా.. టీడీపీ సీనియర్ నేతలు జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి బ్రదర్స్ సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్–3 కేటగిరీకి చెందిన 154 లారీలు, బస్సులను తుక్కు కింద జటాధర ఇండస్ట్రీస్ పేరున 50, సి. గోపాల్‌రెడ్డి అండ్ కో పేరున 104 వాహనాలను కొన్నారు. నకిలీపత్రాలతో వాటిని బీఎస్–4 వాహనాలుగా చలామణిలోకి తీసుకొచ్చారు. అనంతరం వాటిని నాగాలాండ్ రాజధాని కోహిమాలో రిజిస్ట్రేషన్ చేయించి, ఎన్ఓసీ పొందారు. ఆ తర్వాత 15 రోజుల్లోనే వాటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లలో మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆంధ్రప్రదేశ్‌లో 101 వాహనాలు, తెలంగాణలో 33 వాహనాలు, కర్ణాటకలో 15 వాహనాలు, తమిళనాడులో ఒకటి, ఛత్తీస్‌గఢ్‌లో ఒక బస్సు నిర్వహిస్తున్నారు. మరో మూడు బస్సులు ఎక్కడ ఉన్నాయన్నది తెలియలేదు. ఆ వాహనాల లైసెన్సులకు కూడా ఫోర్జరీ పత్రాలు సమర్పించారు. అంతేకాక.. వాహనాల బీమాలోనూ వీరు ఫోర్జరీకి పాల్పడ్డారు. వీటిని కొద్దిరోజులపాటు తిప్పి ఆ తర్వాత పోలీసుల ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లతో (ఎన్ఓసీ) వాటిని ఇతర రాష్ట్రాల వారికి విక్రయించేశారు. కానీ, వీటిని కొనుగోలు చేసినవారు తాము మోసపోయామని గుర్తించి ఫిర్యాదుచేశారు. సమగ్ర సమాచారం కోసం పోలీసులు ‘నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎన్ఐసీ)’ రికార్డులను పరిశీలించారు. జేసీ కుటుంబం సమర్పించిన బీమా పత్రాలు నకిలీవని తేలింది. దీంతో అనంతపురం డిప్యూటీ రవాణా శాఖ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 2020 జూన్‌లో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డితోపాటు 23 మందిపై వివిధ సెక్షన్ల కింద 35 కేసులు నమోదు చేశారు. ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను అరెస్టుచేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రత్యేక దర్యాప్తునకు కేంద్రానికి లేఖ ఆ తర్వాత జేసీ కుటుంబం అక్రమాలపై ప్రత్యేకంగా దర్యాప్తు జరపాలని సూచిస్తూ రాష్ట్ర పోలీసులు కేంద్రానికి లేఖ రాశారు. దీంతో జేసీ కుటుంబం వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు కోసం ఈడీని రంగంలోకి దింపింది. కొన్నినెలల క్రితం ఈడీ అధికారులు అనంతపురం రవాణా శాఖ అధికారుల నుంచి ఆధారాలు, కీలక పత్రాలను తీసుకున్నారు. ఆ తర్వాత జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి, వారి వ్యాపార భాగస్వామి సి. గోపాల్‌రెడ్డి నివాసాలు, కార్యాలయాలతోపాటు తాడిపత్రి, హైదరాబాద్, బెంగళూరు తదితర చోట్ల నిర్వహించిన సోదాల్లో కీలక ఆధారాలు సేకరించి ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి ఫోన్లను జప్తుచేసినట్లు సమాచారం. -
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కీలక పురోగతి
-
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కీలక పురోగతి
సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. జేసీ ట్రావెల్స్‌పై నమోదైన 33 కేసుల్లో ఛార్జిషీట్ సిద్ధం చేశారు. తాడిపత్రి, అనంతపురం కోర్టుల్లో ఛార్జిషీట్‌ను పోలీసులు దాఖలు చేయనున్నారు. టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య జేసీ ఉమారెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి, ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డి సహా మొత్తం 23 మందిపై ఫోర్జరీ కేసు నమోదయిన సంగతి తెలిసిందే. చదవండి: వైఎస్సార్సీపీ నేత వేణుబాబుపై హత్యాయత్నం సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్-3 వాహనాలను స్క్రాప్ కింద జేసీ ట్రావెల్స్ కొనుగోలు చేసింది. నిషేధిత 154 బస్సులు, లారీలను ఫోర్జరీ డాక్యూమెంట్లతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారు. నకిలీ ఇన్వాయిస్, ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లతో బీఎస్-4 వాహనాలుగా చూపి అక్రమ రిజిస్ట్రేషన్‌కు జేసీ ప్రభాకర్‌రెడ్డి పాల్పడ్డారు. నాగాలాండ్ రాష్ట్రం కోహిమా ఆర్టోవో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆధారాలతో సహా కోర్టులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు. -
‘జేసీ భూములు ఇప్పిస్తామనడం హాస్యాస్పదం’
సాక్షి, తాడిపత్రి: మండలంలోని వంగనూరు, బొందలదిన్నె గ్రామంలోని భూములను రైతులు స్వచ్ఛందంగా విక్రయించారని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం రైతులు తమ భూములు కొనుగోలు చేయవచ్చన్నారు. అయితే ఆ భూములను రైతులకు ఇప్పిస్తామని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసమే గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దొంగ లారీలు, దొంగ భూములు కొనుగోలు చేయడం కేవలం జేసీ సోదరులకు మాత్రమే చెందుతుందని విమర్శించారు. కర్ణాటక రవాణాశాఖ అధికారులు స్పందించకుండా ఉంటేనే లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించడం దివాకర్ ట్రావెల్స్ వారికే సాధ్యమని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. -
జేసీ పవన్‌పై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: జేసీ దివాకర్‌రెడ్డి తయుడు జేసీ పవన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆయనపై కేసునమోదు చేసినట్లు తెలిపారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి విడుదల సందర్భంగా కోవిడ్ ఆంక్షలును ఉల్లంఘించి ర్యాలీ చేయొద్దని జేసీ పవన్‌కు తాడిపత్రి పోలీసులు ముందుగానే సూచించారు. అయిన్పటికీ పోలీసుల ఆంక్షలను బేఖాతరు చేస్తూ ర్యాలీ నిర్వహించి, బాణాసంచా కాల్చారు.అంతే కాకుండా పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి సామాజిక దూరం పాటించకుండా వ్యవహరించడంతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. (మళ్లీ జైలుకు జేసీ..) దళిత సీఐ దేవేంద్రను దూషించినందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అనంతరం జేసీ ప్రకర్‌రెడ్డిని కడప సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఇక లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన జేసీపై మరో నాలుగు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
జేసీ ప్రభాకర్, అస్మిత్‌కు చేదు అనుభవం
సాక్షి, అనంతపురం: దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి హైకోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు నిషేధించిన వాహనాలను రోడ్లపై ఎలా తిప్పుతారని న్యాయస్థానం సూటిగా ప్రశ్నించింది. ప్రమాదాలకుఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేసింది. మోసపూరిత పనులను అనుమతించమని తెల్చిచేప్పింది. బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. (దివాకర్ ట్రావెల్స్ అక్రమాలపై లోతుగా విచారణ) దీంతో హైకోర్టులో మూడు కేసుల్లో దాఖలు చేసిన బెయిల్ పిటీషన్లను జేసీ కుటుంబసభ్యులు ఉపసంహరించుకున్నారు. అదే విధంగా కింది కోర్టులో బెయిల్ దరఖాస్తు చేసుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా చూపి రిజిస్ట్రేషన్ చేయించి దివాకర్ ట్రావెల్స్ అక్రమాలకు పాల్పడ్డ విషయం తెలిసిందే. 154 బస్సులు, లారీలను ఫోర్జరీ డాక్యూమెంట్స్‌తో అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. నాగాలాండ్ రాష్ట్రంలో కూడా పలు వాహనాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్‌లు కడప సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. -
దివాకర్ ట్రావెల్స్ అక్రమాలపై లోతుగా విచారణ
సాక్షి, అనంతపురం: దివాకర్ ట్రావెల్స్ అక్రమాలపై లోతుగా విచారణ చేస్తున్నట్లు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శివరాంప్రసాద్ తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఫోర్జరీ డాక్యుమెంట్లతో 154 వాహనాలను అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు. అందుకు సంబంధించిన 62 బస్సులు, లారీలను అనంతపురం జిల్లాలో ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాం. మిగిలిన వాహనాలను ఎక్కడ దాచారన్న సమాచారంపై విచారణ కొనసాగిస్తున్నాం. నకిలీ ఇన్వాయిస్, ఫేక్ ఇన్సూరెన్స్‌లపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. (కర్నూల్ పీఎస్‌లో ముగిసిన జేసీ విచారణ) కరోనా కట్టడికి చర్యలు రవాణాశాఖలో కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నాము. అందులో భాగంగానే బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేశాము. ఎక్కువ మంది బయోమెట్రిక్ తాకటం వల్ల కరోనా సోకే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఓటీపీ ద్వారా రవాణాశాఖ సేవలు పొందవచ్చు. అందుకోసమే ఓటీపీ విధానాన్ని అమల్లోకి తెచ్చిన ఆర్టీఏ అధికారులు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్లు,పర్మిట్లు జారీ వంటి 18 రకాల సేవలను ఓటీపీ ద్వారా అందించున్నట్లు శివరాంప్రసాద్ తెలిపారు. (నేరం అంగీకరించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి!) -
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో పురోగతి..
సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు పురోగతి సాధించారు. శనివారం ముగ్గురు జేసీ వర్గీయులను అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలు సమర్పించి బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా మార్చి రిజిస్ట్రేషన్ చేయించిన కేసులో నాగేశ్వర్‌రెడ్డి, సోమశేఖర్,రమేష్‌లను తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సహకారంతో ప్రైవేట్ ఆపరేటర్లకు లారీలు విక్రయించారు. నకిలీ క్లియరెన్స్ సర్టిఫికెట్లు తయారు చేసి పోలీసుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు విచారణలో వెల్లడయ్యింది. (ఫోర్జరీ జేసీ.. వాహనాల కొనుగోల్‌మాల్) మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి లను కోర్టు పోలీసు కస్టడీ కి అప్పగించింది. వారిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. (జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌లకు షాకిచ్చిన కోర్టు!) -
జేసీని విచారించేందుకు కోర్టు అనుమతి
సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ డాక్యూమెంట్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని రెండు రోజుల పాటు విచారించేందుకు కోర్టు పోలీసులకు అనుమతిని ఇచ్చింది. కోర్టు ఆదేశం మేరకు జేసీ ప్రభాకర్‌రెడ్డిని, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిలను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. (జేసీ ప్రభాకర్ రెడ్డిపై పీటీ వారెంట్) అంతేగాక మరో ఐదు కేసుల్లో పీటీ వారెంట్లను కూడా కోర్టు జారీ చేసింది. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడైన చవ్వా గోపాల్‌రెడ్డిని 154 బస్సులు, లారీల అక్రమ రిజిస్ట్రేషన్‌పై విచారించేందుకు కూడా కోర్టు పోలీసులకు అనుమతించింది. దీంతో అనంతపురం వన్‌టౌన్ పోలీసులు చవ్వా గోపాల్‌రెడ్డి ఒకరోజు కస్టడీలోకి తీసుకుని విచారించారు. (జేసీ ట్రావెల్స్ అక్రమాలపై లోతుగా విచారణ) -
జేసీ ట్రావెల్స్ అక్రమాలపై లోతుగా విచారణ
సాక్షి, అనంతపురం : దివాకర్ ట్రావెల్స్ అక్రమాలపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. జేసీ ఫోర్జరీ డాక్యుమెంట్స్ కేసుకు సంబంధించి అనంతపురం వన్‌టౌన్ పోలీసులు దాఖలు చేసిన రెండు పిటీ వారెంట్లకు కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా పిటీ వారెంట్‌లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్లో తెలిపారు. ఈ మేరకు పిటీషన్‌పై వాదనలు విన్న కోర్టు జేసీ దివాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డిని కస్టడీకి ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. జేసీ ట్రావెల్స్ నకిలీ ఇన్ వాయిస్‌లతో 154 వాహనాలను నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించిన సంగతి తెలిసిందే. కాగా క్లియరెన్స్ సర్టిఫికెట్ల కోసం ఎస్సై , సీఐ సంతకాలను జేసీ ట్రావెల్స్ ఫోర్జరీకి పాల్పడింది. (జేసీ ప్రభాకర్ రెడ్డిపై పీటీ వారెంట్) (మరో వివాదంలో జేసీ దివాకర్ రెడ్డి) -
మరో వివాదంలో జేసీ దివాకర్ రెడ్డి
సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తన భవనాన్ని జేసీ బ్రదర్స్ ఆక్రమించారంటూ బాధితుడు మల్లికార్జున తెలిపారు. ఈ సందర్భంగా మల్లిఖార్జున తన కుటుంబసభ్యులతో కలిసి అనంతపురంలోని జేసీ ట్రావెల్స్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కాగా మల్లికార్జున 2009లో బాబయ్య అనే వ్యక్తికి భవనాన్ని లీజుకివ్వగా , అదే భవనంలో దివాకర్‌రెడ్డి జేసీ ట్రావెల్స్ కార్యలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. 2009 నుంచి భవనంకు సంబంధించిన అద్దె చెల్లించలేదని మల్లిఖార్జున ఆరోపించారు. అన్యాయంగా తమ భవనాన్ని ఆక్రమించడమే కాకుండా తమ జోలికి వస్తే చంపుతానంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించారంటూ మల్లిఖార్జున వాపోయారు. తమ భవనం నుంచి జేసీ ట్రావెల్స్ కార్యాలయాన్ని తరలించేవరకు తన పోరాటం ఆగదని మల్లిఖార్జున వెల్లడించారు. వారి బండారం బట్టబయలు: రోజా -
‘జేసీ బ్రదర్స్’ బాగోతం.. బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, అనంతపురం: నకిలీ రిజిస్ట్రేషన్ వాహనాల కుంభకోణంలో జేసీ సోదరులతో చేయి కలిపిన పాత్రదారులపై ఉచ్చు బిగిస్తోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను తుంగలోకి తొక్కి అక్రమార్జన కోసం జేసీ సోదరులు అడ్డదారులు తొక్కారు. జాతీయస్థాయి స్కాం ఎక్కడ బయట పడుతుందోనని మరిన్ని నేరాలకు పాల్పడ్డారు. ఇందులో కొందరు అధికారులు, మరికొంత మంది ప్రైవేటు వ్యక్తులు ప్రమేయముందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశముందని తెలుస్తోంది. 154 బీఎస్–3 వాహనాలకు రిజిస్ట్రేషన్.. ప్రభుత్వం నిషేధించిన బీఎస్–3 లారీలు, టిప్పర్లను నాగాలాండ్ రాష్ట్ర రాజధాని కోహిమాలో ఒకేసారి 154 వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ అక్రమ బాగోతంలో కీలక నిందితుడు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, జఠాధర కంపెనీ డైరెక్టర్‌గా బాధ్యతలు వ్యవహరిస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. 2017 మార్చిలో సుప్రీంకోర్టు బీఎస్–3 వాహనాలపై ఆంక్షలు విధించింది. 2017, ఏప్రిల్ 1 తర్వాత సదరు వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయడం చట్టారీత్యా నేరం. ఈ విషయం తెలిసినప్పటికీ జేసీ సోదరులు వాహనాలను కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ అనంతరం ఎన్ఓసీలతో జిల్లాకు తీసుకొచ్చారు. ఒక్కో వాహనంపై రూ.3 నుంచి రూ.4 లక్షల్లోపు ఖర్చు చేసి రూ. కోట్లు లబ్ధి పొందారు. చదవండి: అనంతపురం జైలు వద్ద హైడ్రామా! మరింత లోతుగా దర్యాప్తు.. జేసీ బ్రదర్స్ అవినీతి బండారం బయటపడడంతో ఆధారాలు సేకరించిన అధికారులు శనివారం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డిలను అరెస్ట్ చేశారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఈ కుంభకోణంలో సూత్రదారులు, పాత్రదారులందరిపైనా వేటు పడే అవకామున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. జేసీ బ్రదర్స్ అవినీతి అక్రమాలు బయటపడిన తర్వాత రాష్ట్ర రవాణాశాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నేరుగా నాగాలాండ్‌కు వెళ్లి సదరు వాహనాలకు సంబంధించిన వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. విషయం తెలుసుకున్న జేసీ సోదరులు సదరు వాహనాలను కనుమరుగు చేసేందుకు యత్నించారు. కొన్ని వాహనాలను ఇతరులకు విక్రయించగా.. మరికొన్నింటిని ఇతర రాష్ట్రాలకు బదలాయించారు. ఈ వ్యవహారంలో వివిధ సెక్షన్ల కింద మొత్తం 24 కేసులు నమోదయ్యాయి. చదవండి: ఫోర్జరీలు 'జేసి'.. కటకటాల్లోకి..! పాత్రదారులందరిపైనా వేటు.. జేసీ బ్రదర్స్ కంపెనీలు చేసిన అవినీతి కుంభకోణంలో పాత్రదారులు, సూత్రదారులందరిపైనా త్వరలో వేటు పడనున్నట్లు తెలుస్తోంది. వాహనాల లావాదేవీల్లో పాత్రదారులను ఇప్పటికే గుర్తించారు. అయితే వాహనాలు కొని మోసపోయి వారిపైనా కేసులు నమోదయ్యాయి. అలాగే ఒకేసారి నాగాలాండ్ నుంచి 154 వాహనాలు (అందులో వందకు పైగా జిల్లాకు) ట్రాన్స్ఫర్ అయినా ఆర్టీఏ అధికారులు పసిగట్టలేదు. నకిలీ పోలీసు క్లియరెన్స్‌ల ద్వారా ఇతరులకు విక్రయించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్టీఏ అధికారుల పాత్ర కూడా లేకపోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో మరిన్ని అరెస్ట్‌లుంటాయని సమాచారం. దీంతో నకిలీ రిజిస్ట్రేషన్ వాహనాల కుంభకోణంలో పాత్ర ఉందని భావిస్తున్న వారిందరిలోనూ ఆందోళన ప్రారంభమైంది. -
కడప జైలుకి జేసీ ప్రభాకర్‌రెడ్డి
సాక్షి, అమరావతి: జేసీ బ్రదర్స్ కంపెనీ.. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లకు ఫోర్జరీ, నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు వాడినందునే రవాణా శాఖ పోలీసులతో క్రిమినల్ కేసులను నమోదు చేయించింది. ఆ తప్పుడు పత్రాల్లో ఉన్న సంతకాల ఆధారంగానే కేసులు పెట్టింది. ఇప్పటివరకు అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనే 27 క్రిమినల్ కేసులను నమోదు చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన జిల్లాల్లో ఈ నకిలీ రిజిస్ట్రేషన్ వాహనాలు కొనుగోలు చేసిన వారు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తే చీటింగ్ కేసులు నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన లారీలను జటాధర కంపెనీ ప్రతినిధులు ఆయా జిల్లాల్లో విక్రయించారు. కొనుగోలు చేసిన వారు కూడా తాము మోసపోయామని గుర్తించి జేసీ బ్రదర్స్ కంపెనీపై చీటింగ్ కేసులు పెట్టారు. (‘జేసీ బ్రదర్స్’ బాగోతం.. బిగుస్తున్న ఉచ్చు) మార్చిలోనే రవాణా శాఖ లేఖ ఈ ఏడాది మార్చి 11న నేషనల్ ఇన్సూరెన్స్, రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ తదితర బీమా కంపెనీలకు రవాణా శాఖ లేఖ రాసింది. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన 56 వాహనాలకు సంబంధించిన బీమా పత్రాలను పరిశీలిస్తే 55 వాహనాల ఇన్సూరెన్స్ పత్రాలు బీమా కంపెనీల వద్ద లేవు. దీంతో వాహనాల బీమా పత్రాలు సైతం నకిలీవేనని తేలింది. ► జేసీ బ్రదర్స్ కంపెనీ అక్రమంగా 154 వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించింది. ఇందులో ఏపీలో గుర్తించిన 101 లారీల్లో 95 లారీల రిజిస్ట్రేషన్లను రవాణా శాఖ రద్దు చేసింది. ► ఈ 95 లారీల్లో 80 లారీలు అనంతపురంలో, కర్నూలులో 5, చిత్తూరులో 5, కడపలో 3, గుంటూరులో 2 ఉన్నాయి. ఇంకా ఆరు లారీల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాల్సి ఉంది. ► 154 వాహనాల్లో నాగాలాండ్‌లో 98, ఏపీలో 32, ఇతర రాష్ట్రాల్లో 24 లారీలను జేసీ బ్రదర్స్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించింది. 62 వాహనాలు సీజ్ చేశాం బోగస్ పేపర్లలో ఉన్న సంతకాలు, ఎవరి పేర్లు ఉన్నాయో.. అవి ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యాయో వారి పైనే పోలీసులకు ఫిర్యాదు చేశాం. 154 వాహనాల్లో 101 ఏపీలోనే ఉన్నాయి. తాజాగా వాటిలో 95 వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు చేయడంతోపాటు ఇప్పటివరకు 62 వాహనాలు సీజ్ చేశాం. – ప్రసాదరావు, సంయుక్త రవాణా కమిషనర్ కడప కేంద్ర కారాగారానికి జేసీ ప్రభాకర్‌రెడ్డి కడప అర్బన్/అనంతపురం క్రైమ్: వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో అరెస్టయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిలను అనంతపురం పోలీసులు ఆదివారం కడప కేంద్ర కారాగారానికి తరలించారు. మొదట అనంతపురం జిల్లాలోని రెడ్డిపల్లె కారాగారానికి తీసుకెళ్లారు. అయితే.. అక్కడ కరోనా కేసు నమోదు కావడంతో అనంతపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. తాడిపత్రి జైలుకు మార్చాలని జడ్జి ఆదేశించడంతో అక్కడ శాంతిభద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో కడప జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేయడంతో అనంతపురం నుంచి తెల్లవారుజామున 3.58 గంటల సమయంలో కడప కేంద్ర కారాగారానికి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా జైలు అధికారులు కరోనా పరీక్షలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. రిమాండ్ ఖైదీలుగా ప్రభాకర్‌రెడ్డికి 2707, అస్మిత్‌రెడ్డికి 2708 నంబర్లను కేటాయించారు. -
'బాధ్యులెవరో త్వరలోనే తేలుతుంది'
సాక్షి, విజయవాడ : బీఎస్- 3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్లు చేయించి జేసీ సోదరులు అతి పెద్ద కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో శనివారం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై విజయవాడ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ ప్రసాద్‌రావు స్పందిస్తూ...' బోగస్ పేపర్లు సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్లు చేసుకున్నందుకే కేసు నమోదు చేశాము. బోగస్ పేపర్లలో ఉన్న సంతకాలు, ఎవరి పేర్లు ఉన్నాయో, అవి ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యాయో వారి పైనే పోలీసులకు ఫిర్యాదు చేశాము. కంప్లెట్ తీసుకుని పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఓనర్లు బాధ్యులా....అశోక్ లైలాండ్ కంపెనీ బాధ్యత ఉందా.. లేక మధ్యలో ఏజెంట్లు నిలబడి మోసం చేశారా అన్నది క్రిమినల్ కేసులో తేలతాయి. 154 వాహనాలల్లో నాగాలాండ్, ఏపీ లో కొన్ని అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి. వారు నాగాలాండ్‌లో కేసులు పెట్టారన్న సమాచారం మా దృష్టికి రాలేదు. నాగాలాండ్‌లో బోగస్ పేపర్లు సబ్మిట్ చేసాకే మాకు ఎన్వోసీ వచ్చింది. 154 వాహనాల్లో 101 వాహనాలు ఏపీలో ఉన్నాయి తాజాగా వాటి రిజిస్ట్రేషన్లు రద్దు చేశాము. ఇప్పటివరకు 62 వాహనాలు సీజ్ చేశాము. మిగిలిన వాహనాలు ఇతర రాష్టాల్లో తిరుగుతున్నాయా లేక ఎక్కడైనా పార్క్ చేసి ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది' అంటూ పేర్కొన్నారు. (ఫోర్జరీలు 'జేసి'.. కటకటాల్లోకి..!) ఈ వ్యవహారంపై కూపీ లాగగా నకిలీ పత్రాలు సృష్టించి ఇప్పటివరకు 154 వాహనాలు నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు. వాటికి సంబంధించిన ఫేక్ ఎన్ఓసీ, ఫేక్ ఇన్సూరెన్స్‌ల కేసుల్లో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జేసీ ట్రావెల్స్‌పై 24 కేసులు నమోదయ్యాయి. కాగా.. అనంతపురం, తాడిపత్రి పోలీసు స్టేషన్లలో జేసీ ట్రావెల్స్‌పై ఇప్పటిదాకా 27 కేసులు నమోదయ్యాయి.(జేసీ ట్రావెల్స్ అక్రమాల పుట్ట) -
సుప్రీం కోర్టు నిబంధనలను జేసీ ఉల్లంఘించారు
-
ఫోర్జరీలు 'జేసి'.. కటకటాల్లోకి..!
అధికారాన్ని అడ్డం పెట్టుకొని దౌర్జన్యకాండ సాగించిన జేసీ సోదరుల పాపం పండుతోంది. 40 ఏళ్ల క్రితం ఒక్క బస్సుతో మొదలైన ప్రస్థానం.. అక్రమాలతో కోట్లాది రూపాయల మాఫియా సామ్రాజ్యంగా విస్తరించింది. తాజాగా బీఎస్–3 లారీలను బీఎస్–4గా మార్చి ఎంతో మందిని ముంచిన ఘటన వెలుగులోకి రాగా.. ఏకంగా పోలీసుల సంతకాలనే ఫోర్జరీ చేసిన ఘటన కటకటాల్లోకి నెట్టింది. సాక్షి, అనంతపురం : ఏ బస్సులను అడ్డం పెట్టుకొని ఇంత కాలం అక్రమాలకు పాల్పడ్డారో, అదే బస్సుల కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి జైలు పాలయ్యారు. ఒక పర్మిట్‌తో రెండు మూడు బస్సులు తిప్పడం, ఆర్టీసీని నష్టాలపాలు చేస్తూ అనుమతిలేని రూట్లలోనూ బస్సులు తిప్పిన ఘటనలు కోకొల్లలు. ఇదే సమయంలో అనుభవం లేని డ్రైవర్ల కారణంగా దివాకర్ ట్రావెల్స్ బస్సులు ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నాయి. తాజాగా బస్సుల విక్రయం కేసులో ఏకంగా పోలీసులనే బురిడీ కొట్టించిన ఘటన జేసీ సోదరుల మూలాలను కదిలిస్తోంది. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సుల(ఏపీ02టీసీ9666, టీఎస్09యుబీ7034) విక్రయానికి సంబంధించి పోలీసు సంతకాలను ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ స్టాంపులతో రవాణా శాఖకు ఎన్ఓసీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. అనంతరం వీటిని తెలంగాణలో విక్రయించారు. అయితే, తమకు దరఖాస్తు చేసింది ఫోర్జరీ డాక్యుమెంట్లు అని గుర్తించిన రవాణాశాఖ అధికారులు అనంతపురం 1వ పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఆరుగురిపై క్రైం నెంబర్ 28/2020.. 420, 467, 468, 471, 472, 120 బీ, 201 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో శనివారం ఉదయం అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు రెండు బృందాలుగా హైదరాబాద్‌కు వెళ్లి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిలను అరెస్టు చేశారు. మరికొన్ని కేసుల్లో తదుపరి విచారణ నిమిత్తం వన్‌టౌన్ పోలీసులు నేడో రేపో పీటీ వారెంట్ వేయనున్నట్లు తెలిసింది. చదవండి: జేసీ ప్రభాకర్‌రెడ్డికి రిమాండ్..హైడ్రామా! మొత్తం 25 కేసులు జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల పేరు మీద జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, సి.గోపాల్‌రెడ్డి అండ్ కో కంపెనీలు నిర్వహిస్తున్నారు. జఠాధర ఇండస్ట్రీస్‌కు జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య జేసీ ఉమారెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి డైరెక్టర్లు. అదేవిధంగా సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీకి జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య జేసీ ఉమారెడ్డి, చవ్వా గోపాల్ రెడ్డితో పాటు మరికొందరు డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ కంపెనీలను అడ్డం పెట్టుకుని దివాకర్ ట్రావెల్స్ భారీ అక్రమాలకు పాల్పడడంతో డీటీసీ ఫిర్యాదు మేరకు పోలీసులు 25 కేసులు నమోదు చేశారు. ఇందులో తాడిపత్రిలోనే 17 కేసులు ఉండగా.. అనంతపురం వన్‌టౌన్‌లో 8 కేసులు ఉన్నాయి. తుక్కు లారీలతోనూ మోసం బీఎస్–3 శ్రేణి వాహనాలను 2017 మార్చి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో విక్రయాలు, రిజిస్ట్రేషన్లు చేయరాదని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉండడంతో అప్పటి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి నాగాలాండ్ రాష్ట్రానికి వెళ్లి ఒకేసారి 154 వాహనాలను జఠాధర కంపెనీ పేరుతో జేసీ ఉమారెడ్డి పేరు మీద, సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీతో సి.గోపాల్‌రెడ్డి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత బీఎస్–3 శ్రేణి వాహనాలను బీఎస్–4 వాహనాలు రిజి్రస్టేషన్ చేయించి తీవ్రమైన నేరానికి పాల్పడ్డారు. వీటిలో 101 వాహనాలు ఆంధ్రపదేశ్‌లో, 33 కర్ణాటకలో, 15 తెలంగాణలో, 3 నాగాలాండ్‌లో, ఒక్కొక్కటి చొప్పున తమిళనాడు, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో ఉన్నట్లు గుర్తించారు. నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆయాప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయించారు. మనరాష్ట్రంలో 79 వాహనాలు అనంతపురం జిల్లాకు, 8 వాహనాలు నెల్లూరు జిల్లాకు, 5 వాహనాలు చిత్తూరు జిల్లాకు, 3 కడప జిల్లాకు, 2 గుంటూరు జిల్లాకు ట్రాన్స్ఫర్ అయ్యాయి. మరికొన్నింటిని గుర్తించాల్సి ఉంది. జిల్లాలో ఉన్న వాహనాల్లో ఇప్పటి వరకూ 53 వాహనాలను సీజ్ చేశారు. చదవండి: జేసీ దివాకర్‌రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి టీడీపీ నాయకుల ఓవరాక్షన్ వన్‌టౌన్ పోలీసు స్టేషన్ ఎదుట టీడీపీ చోటా నాయకులు ఓవరాక్షన్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలంటూ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టగా పోలీసులు టూటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. మధ్యాహ్నం టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, ఆ పార్టీ నాయకులు బండారు శ్రావణి, బి.వెంకట్రాముడు, ఉమామహేశ్వర నాయుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని కలిసేందుకు స్టేషన్‌కు వచ్చారు. కానీ పోలీసులు వారిని లోపలికి అనుమతించలేదు. చివరకు జేసీ పవన్‌కుమార్ రెడ్డి స్టేషన్ నుంచి బయటకు వచ్చి వారితో మాట్లాడి వెళ్లిపోయారు. కేసులో నిందితులు ఏ1 – జేసీ ఉమారెడ్డి ఏ2 – జేసీ ప్రభాకర్ రెడ్డి ఏ3 – నాగేంద్ర ఏ4 – బాబయ్య ఏ5 – జేసీ విజయ (జేసీ దివాకర్ రెడ్డి సతీమణి) ఏ6 – జేసీ అస్మిత్ రెడ్డి (వీరిలో ఇది వరకే నాగేంద్ర, బాబయ్యను అరెస్టు చేయగా.. ప్రస్తుతం జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ) అరెస్ట్ పర్వం ఇలా.. ఉదయం 5.30 : జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను హైదరాబాద్ నుంచి అనంతపురానికి తరలింపు 11.07 : అనంతపురం వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు తండ్రీకుమారులు మధ్యాహ్నం 2.43 : వైద్య చికిత్సల నిమిత్తం సర్వజనాసుపత్రికి.. 3.09 : తిరిగి వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు.. 5.20 : జడ్జి ఎదుట హాజరు 5.45 : రెడ్డిపల్లి సబ్‌జైలుకు తరలింపు 6.02 : రెడ్డిపల్లి సబ్‌జైలులోకి.. రాత్రి 7.05 : సబ్‌జైలులో ఇటీవల కరోనా కేసు నిర్ధారణ నేపథ్యంలో తిరిగి అనంతపురం వన్‌టౌన్ స్టేషన్‌కు తరలింపు -
ట్రాన్స్పోర్ట్ కేటుగాళ్లు
-
అనంతపురం జైలు వద్ద హైడ్రామా!
సాక్షి, అనంతపురం: దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని జైలుకు తరలించే విషయంలో హైడ్రామా నడిచింది. అనంతపురం జిల్లా జైలులో ఓ ఖైదీకి కరోనా లక్షణాలు బయటపడటంతో.. అక్కడ ఉండలేమని వారు అభ్యంతరం తెలిపారు. మరో జైలుకు మార్చాలని జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి న్యాయమూర్తి వద్ద మరో పిటిషన్ దాఖలు చేశారు. కడప, గుత్తి, తాడిపత్రి జైళ్లలో ఏదో ఒక జైలుకు తమను తరలించాలని పిటిషన్లో విన్నవించారు. కాగా, ఫోర్జరీ కేసులో అరెస్టైన వీరిద్దరికి న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. (చదవండి: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్) (చదవండి: తీగలాగితే డొంక కదిలింది!) -
టీడీపీ అనవసరంగా రాద్దాంతం చేస్తోంది..
-
జేసీ ప్రభాకర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్
-
తప్పు చేసినవారే తప్పించుకునే యత్నం..
సాక్షి, తాడేపల్లి: అవినీతిపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అక్రమాలను వెలికి తీస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నారని సూటిగా ప్రశ్నించారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘ప్రజల సొమ్ముకు కాపలాదారుడుగా ఉంటానని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ప్రజల సొమ్మును దోచుకున్న వారిని ఉపేక్షించేది లేదు. పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ద్వారా 2,200 కోట్లు ఆదా చేశారు. (అచ్చెన్న.. ఖైదీ నెంబర్ 1573) వెలిగొండ, సోమశిల ప్రాజెక్టులలో సైతం రివర్స్ టెండరింగ్ ద్వారా సత్ఫాలితాలు వచ్చాయి. రూ.100 కోట్లు దాటిన టెండర్లను జ్యూడీషియల్ వ్యవస్థ కిందకు తీసుకువచ్చాం. అవినీతి తోడుతుంటే అంత భయమెందుకు, కులం కార్డు వాడి తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. రూ.150 కోట్ల అవినీతిపై చంద్రబాబు హయాంలోని మంత్రే సంతకం పెట్టారు. ఈఎస్ఐ స్కాంలో తప్పు చేసినవారే తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. మంత్రి హోదాలో ఒక కంపెనీకి కాంట్రాక్ట్‌లు ఇవ్వాలని అచ్చెన్నాయుడు సిఫార్సు చేశారు. ట్రావెల్స్ పేరుతో స్క్రాప్ వాహనాలతో 2017లో 45 మంది ప్రాణాలు గాలిలో కలిపేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్టాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి లారీలను బస్సులుగా మార్చారు. అవినీతి కులం అధికారం ఉంటుందా....?. అధికారంలో ఉంటే పంది కొక్కుల్లా దోచేయవచ్చా...?. చంద్రబాబు హయంలో జరిగిన అవినీతి అక్రమాలు అంతులేనివి. అవినీతి జరిగిందని నిరూపిస్తే ఎదురుదాడి చేస్తున్నారు. నిప్పు తుప్పు అని చెప్పే మాటలు ఇప్పుడు ఏమయ్యాయి. కార్మికులు సొమ్ము పందికొక్కులులా తిన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అవినీతి చేసింది మీరా మేమా....?. 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసింది ఎవరు?. చంద్రబాబు ఇప్పుడు ప్రలోభాల గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. ప్రజాస్వామ్య విలువలు కాపాడటమే మా ప్రభుత్వ లక్ష్యం. వ్యక్తులపై కాదు.. దోపిడీ, అవినీతిపై మాది కక్షసాధింపు. మీ పాలనలో 6లక్షల కోట్లు అవినీతి మయం చేశారు. ఎలుక, దోమల పేరుతో కూడా దోపిడీకి పాల్పడ్డారు. ట్రావెల్స్ పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోంది. అవినీతిపరులను అరెస్ట్ చేయొద్దని చంద్రబాబు చెప్పదలచుకున్నారా?. వారిపై చర్యలు తీసుకుంటుంటే బాబు కులప్రస్తావన తెస్తున్నారు. తన వంతు, తన కొడుకు వంతు వస్తుందని బాబుకు భయం పట్టుకుంది’ అని వ్యాఖ్యానించారు. (జేసీ ప్రభాకర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్) -
జేసీ ప్రభాకర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్
సాక్షి, అనంతపురం: దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో అరెస్టైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డికి న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు వారిద్దరినీ అనంతపురంలోని రెడ్డిపల్లి జైలుకు తరలించారు. అంతకు ముందు ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డికి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. కాగా, బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నకిలీ పత్రాలు సృష్టించి ఇప్పటివరకు 154 వాహనాలను నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జేసీ ట్రావెల్స్‌పై 24 కేసులు నమోదయ్యాయి. (చదవండి: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్) (చదవండి: తీగలాగితే డొంక కదిలింది!) -
జేసీ దివాకర్‌రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి
-
జేసీ దివాకర్‌రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి
సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డి అరెస్ట్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని తాడిపత్రి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఫోర్జరీ డాక్యూమెంట్స్‌తో 154 వాహనాలను జేసీ ప్రభాకర్‌రెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలన్నారు. దివాకర్‌రెడ్డి అండతోనే ఈ అక్రమాలు జరిగాయని మండిపడ్డారు. తాడిపత్రి సీఐ, ఎస్సై సంతకాలను కూడా జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ చేసిందని పెద్దారెడ్డి విమర్శించారు. (మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్) జేసీ కుటుంబ సభ్యుల అరెస్ట్ వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని పెద్దారెడ్డి తెలిపారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి తప్పు చేశారని అందుకే అరెస్ట్ అయ్యారని తెలిపారు. వందలాది మంది ప్రయాణికులను జేసీ ట్రావెల్స్ పొట్టన పెట్టుకుందని దుయ్యబట్టారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై కూడా కేసు నమోదు చేయాలన్నారు. జేసీ ట్రావెల్స్ అరాచకాలపై లోతుగా దర్యాప్తు చేయాలని పెద్దారెడ్డి అన్నారు. -
జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్
-
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్
అనంతపురం: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయనతో పాటు కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం వీరిని హైదరాబాద్ నుంచి అనంతపురానికి తరలిస్తున్నారు. బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాల కొనుగోలుకు సంబంధించి సుమారు మూడు గంటల పాటు విచారణ చేపట్టారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ వ్యవహారంపై కూపీ లాగగా నకిలీ పత్రాలు సృష్టించి ఇప్పటివరకు 154 వాహనాలు నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు. వాటికి సంబంధించిన ఫేక్ ఎన్ఓసీ, ఫేక్ ఇన్సూరెన్స్‌ల కేసుల్లో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జేసీ ట్రావెల్స్‌పై 24 కేసులు నమోదయ్యాయి. కాగా.. అనంతపురం, తాడిపత్రి పోలీసు స్టేషన్లలో జేసీ ట్రావెల్స్‌పై ఇప్పటిదాకా 27 కేసులు నమోదయ్యాయి. చదవండి: జేసీ బ్రదర్స్ చాతుర్యం: స్క్రాప్‌లోనూ స్కాం -
జేసీ బ్రదర్స్ చాతుర్యం: స్క్రాప్‌లోనూ స్కాం
సాక్షి, అనంతపురం: బీఎస్–3 వాహనాలను బీఎస్–4 వాహనాలుగా రిజిస్ట్రేషన్లు చేయించి అతి పెద్ద కుంభకోణానికి జేసీ సోదరులు పాల్పడ్డారు. ఈ అవినీతి బాగోతం రాష్ట్ర ఉన్నతాధికారులు బయటపెట్టారు. అయితే సదరు వాహనాలను సీజ్ చేయాల్సిన అధికారులు యజమానులతో కుమ్మక్కయ్యారు. విడిభాగాలు తొలగించుకున్న తర్వాత సీజ్ చేసి ఆర్టీఏ కార్యాలయానికి తీసుకొస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే... గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిలు అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు. అప్పటికే ట్రావెల్స్ రంగంలో ఆరితేరిన జేసీ సోదరులు అతి తక్కువ రేటుకు వస్తున్నాయని చెప్పి బీఎస్ 3 వాహనాలను కొనుగోలు చేశారు. సుప్రీంకోర్టు బీఎస్3 వాహనాల విక్రయాలు రద్దు చేయాలని ఉత్తర్వులు వెలువడించిన తర్వాత షోరూంలలో నిలిచిపోయిన వాహనాలను కొనుగోలు చేశారు. అదికూడా నాగాలాండ్ రాష్ట్రంలో అశోక్‌లైలాండ్ కంపెనీ చెందిన దాదాపు 160 వాహనాలు కొనుగోలు చేశారు. ఈ తంతంగమంతా ఆలస్యంగా రాష్ట్ర రవాణాశాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ కావడంతో ఈ అక్రమ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. సదరు వాహనాలన్నీ బీఎస్3 కాగా నకిలీ ధ్రువపత్రాలతో బీఎస్4గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తేలింది. ఈ విషయాన్ని ఆర్టీఏ జాయింట్ కమిషనర్ జిల్లాకు వచ్చి మీడియా సమావేశంలో ధ్రువీకరించారు. ఇలా జిల్లాలో దాదాపు 80 వాహనాలున్నాయని గుర్తించారు. మిగిలినవి వివిధ జిల్లాలో తిరుగుతున్నట్లు తెలిపారు. చదవండి: ‘ఆ వాహనాలు ఎక్కడున్నా సీజ్ చేయాలి’ యజమానులకు సహకరిస్తున్న ఆర్టీఏ ఉద్యోగులు దాదాపు నాలుగు నెలల క్రితం ఆర్టీఏ జాయింట్ కమిషనర్ జిల్లాకు వచ్చి జేసీ బ్రదర్స్ అవినీతి వ్యవహారం బయటపెట్టారు. సదరు వాహనాలను జప్తు చేయడానికి ప్రత్యేక టీం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కానీ జిల్లాలో అధికారులు మాత్రం ఆ దిశగా పనిచేయడం లేదు. ఇప్పటి వరకూ 50 వాహనాలు సీజ్ చేశారు. మిగిలిన 30 వాహనాలను గుర్తించాల్సి ఉంది. అయితే నాలుగు నెలల క్రితమే వాహనం నెంబర్‌తో సహా ఏఏ వాహనాలు అక్రమంగా రిజిస్ట్రర్ అయ్యాయో అధికారులు బహిర్గతపర్చారు. దాని ఆధారంగా యజమానులను సులభంగా గుర్తించవచ్చు. కానీ ఇక్కడి అధికారులు ఆదిశగా చర్యలు తీసుకోలేదు. పైగా యజమానులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాహనాలను పట్టుకోవడంలో జాప్యం.. నాగాలాండ్‌లో కొనుగోలు చేసిన వాహనాలను కొన్నింటిని జేసీ ఉమారెడ్డి పేరుతో ఉండగా మరికొన్ని జఠాధర కంపెనీకి సి. గోపాల్‌రెడ్డితో ఉన్నాయి. వాహనాలను పట్టుకోవడంలో జాప్యం చేయడంతో అక్రమార్కులు ముందు జాగ్రత్తలు పడుతున్నారు. కొన్ని వాహనాలను ప్రైవేటు వ్యక్తులకు అంటగట్టారు. మరికొన్నింటికి విడిబాగాలు తొలగించి విక్రయించేశారు. ఏకంగా టైర్ల వద్ద నుంచి బ్యాటరీలు, ఇంజన్, బాడీ మొత్తం తొలగించిన వాహనాలు కూడా ఉన్నాయి. కేవలం ఛాసీలు మాత్రమే ఉంటుండడంతో అవే వాహనాలను తీసుకొచ్చి ఆర్టీఏ కార్యాలయంలో ఉంచుతున్నారు. నిబంధనల ప్రకారం ఇలా తొలగించడానికి వీల్లేదు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవచ్చు. కానీ ఆర్టీఏ ఉన్నతాధికారులు సదరు యజమానులపై సానుభూతి చూపిస్తుండడం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్ -
‘ఆ వాహనాలు ఎక్కడున్నా సీజ్ చేయాలి’
సాక్షి, విజయవాడ: జేసీ ట్రావెల్స్ 154 బీఎస్-3 వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిందని ఆర్టీఏ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు మంగళవారం వెల్లడించారు. జటాధర ఇండస్ట్రీస్ పేరు మీద 50 వాహనాలు, సి.గోపాల్‌రెడ్డి పేరుతో 104 వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించారని పేర్కొన్నారు. కర్ణాటకలో 33, తెలంగాణలో 15 వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించినట్లు, ఆంధ్రప్రదేశ్‌లో 101 వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయని ఆర్టీఏ జాయింట్ కమిషనర్ తెలిపారు. అనంతపురంలో 27, కర్నూలులో 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. డేటా బేస్‌లో ఈ వాహనాలను బ్లాక్ లిస్ట్ చేయాలని కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. దేశంలో ఈ వాహనాలు ఎక్కడ తిరుగుతున్నా.. సీజ్ చేసేలా ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. (కరోనా: కేంద్రం కొత్త మార్గదర్శకాలు) ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా నేషనల్ డేటాబేస్‌లో అప్డేట్ చేయాలని కోరినట్లు ప్రసాదరావు తెలిపారు. అనంతపురంలో 80, కర్నూలులో 5, చిత్తూరులో 5, కడపలో 3 వాహనాలు రిజిస్ట్రేషన్లు రద్దు చేశామన్నారు. నెల్లూరులో ఉన్న 6 వాహనాలపై కోర్టు కేసులు ఉన్నందున.. రిజిస్ట్రేషన్ల రద్దు వాయిదా వేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 62 వాహనాలు సీజ్ చేశామని, మరో 39 వాహనాలు సీజ్ చేయాల్సి ఉందన్నారు. తెలంగాణలో 12 వాహనాలు గుర్తించి ఆ రాష్ట్రానికి సమాచారం ఇచ్చామన్నారు. జేసీ ట్రావెల్స్ వాహనాలను కొనుగోలు చేసిన వారిని ముందే హెచ్చరించామని, 71 నకిలీ ఇన్సూరెన్స్ పాలసీలను కూడా గుర్తించామని పేర్కొన్నారు. జేసీ ఉమారెడ్డి, జేసీ అశ్మిత్‌రెడ్డి జటాధర ఇండస్ట్రీస్ డైరెక్టర్లుగా ఉన్నారని ఆర్టీఏ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. (యజమాని ఆత్మహత్య చేసుకున్న చోటే శునకం..) (జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్) -
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, అనంతపురం : జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. 76 వాహనాల రిజిస్ట్రేషన్లను అధికారులు రద్దు చేశారు. బీఎస్-3 వాహనాలను నకిలీ డాక్యుమెంట్లతో బీఎస్-4గా మార్పుచేసి రిజిస్ట్రేషన్ చేయించినట్లు అధికారులు గుర్తించారు. 154 వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లు సమర్పించినట్లు అధికారుల విచారణలో తేలింది. 60 వాహనాలను రవాణా అధికారులు సీజ్ చేశారు. మిగతా 94 వాహనాలను జేసీ బ్రదర్స్ అజ్ఞాతంలో దాచిపెట్టారు. వాటిలో నాలుగు లారీలను బస్సులుగా మార్చి తిప్పుతున్నట్లు అధికారులు గుర్తించారు. జేసీ ట్రావెల్స్ వాహనాల్లో ప్రయాణించే వారికి ఇకపై ఇన్సూరెన్స్ వర్తించదని అధికారులు తేల్చి చెప్పారు. జేసీ ట్రావెల్స్ చాలా తప్పులు చేసింది జేసీ ట్రావెల్స్ చాలా తప్పులు చేస్తూ, ప్రయాణికుల జీవితాలతో చెలగాటం ఆడిందని అనంతపురం డిప్యూటి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శివరాంప్రసాద్ అన్నారు. స్క్రాప్ కింద కొనుగోలు చేసిన బస్సులు, లారీలను రోడ్లపై నడపడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్దమని పేర్కొన్నారు. ఈ విషయంపై జేసీ కుటుంబ సభ్యులకు నోటీసులు అందిస్తామని చెప్పారు. జేసీ ఫోర్జరీ వ్యవహారంపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేసినట్లు శివరాంప్రసాద్ పేర్కొన్నారు. -
జేసీ ట్రావెల్స్‌కు షాక్
-
జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మరో కేసు
సాక్షి, అనంతపురం : తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తాజాగా మరో కేసు నమోదైంది. జేసీ ట్రావెల్స్ మాజీ ఉద్యోగులు నాగేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు మరో ఐదుగురిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. అంతకు ముందు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి ముందు లారీ ఓనర్లు ధర్నాకు దిగారు. బీఎస్-3 వాహనాలను బీఎస్ - 4 వాహనాలుగా మార్చి తమకు అమ్మారని.. నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లారీ ఇంజిన్ నంబర్లను అక్రమంగా వాడుకొని తమ లారీలు సీజ్ అయ్యేందుకు కారణం అయ్యారంటూ ప్రభాకర్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో పోలీసులు రంగప్రవేశం చేసి లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఫోర్జరీ డాక్యుమెంట్లతో బీఎస్-3 వాహనాలను జేసీ బ్రదర్స్ అక్రమ రిజిస్ట్రేషన్ చేయించి ప్రైవేట్ ఆపరేటర్లకు విక్రయించిన విషయం తెలిసిందే. (చదవండి : వెలుగులోకి జేసీ అవినీతి బాగోతాలు) -
మరోసారి బయటపడ్డ జేసి అక్రమాలు
-
వెలుగులోకి జేసీ అవినీతి బాగోతాలు
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అక్రమాలు మరోసారి బయటపడ్డాయి. దివాకర్ ట్రావెల్స్ పేరుతో జేసీ సాగిస్తున్న తెరవెనుక బాగోతాలు రవాణాశాఖ జరుపుతున్న దర్యాప్తులో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బీఎస్-3 వాహనాలను నకిలీ డాక్యుమెంట్లతో బీఎస్-4గా మార్పుచేసి రిజిస్ట్రేషన్ చేయించిన మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. తాజాగా.. జేసీ ట్రావెల్స్‌కు చెందిన 4 టిప్పర్లను సీజ్ చేయగా.. ఇప్పటివరకు మొత్తంగా 54 వాహనాలను రవాణాశాఖ సీజ్ చేసింది. ఇంకా 97 బస్సులు, లారీలను రహస్య ప్రదేశాల్లో దాచినట్లు తెలుస్తోంది. చదవండి: గ్రామ వాలంటీర్ గొప్పతనం -
జేసీ ట్రావెల్స్ రిజిస్ట్రేషన్ల రద్దుకు చర్యలు
సాక్షి, విజయవాడ : దివాకర్ ట్రావెల్స్ పేరుతో జేసీ దివాకర్‌రెడ్డి అక్రమాలు బయటపడుతున్నాయి. రవాణాశాఖ జరుపుతున్న దర్యాప్తులో అనేక వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు, నాగాలాండ్ రాష్ట్రాల్లో జేసీ ట్రావెల్స్ అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. అశోక్ లేలాండ్ వద్ద స్కాప్ లారీలను కొనుగోలు చేసిన జేసీ వాటిని బస్సులుగా మార్చినట్లు ఆయన తెలిపారు. నాలుగు రాష్ట్రాల్లో స్కాప్ లారీలను బస్సులుగా రిజిస్టర్ చేయించారని, సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీ పేరుతో 43 వాహనాలు, జఠాథర కంపెనీ పేరుతో 26 వాహనాలు కొన్నట్లు రికార్డులు సృష్టించారని వెల్లడించారు. ఆరు వాహనాలను తనిఖీలు చేసినప్పుడు అక్రమాలు వెలుగు చూశాయని ప్రసాద్‌రావు తెలిపారు. రవాణాశాఖ ప్రత్యేక బృందం నాగాలాండ్‌లో కూడా దర్యాప్తు జరుపుతుందని, నాగాలాండ్‌లో కొన్నట్లు చూపిన బస్సులో కూడా బోగస్ సర్టిఫికెట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీస్ శాఖ ఇచ్చే నో క్లియరెన్స్ సర్టిఫికెట్లు కూడా బోగస్‌వే పెట్టారని తెలిపారు. ఇప్పటి వరకు 66 స్కాప్ లారీలను బస్సులుగా మర్చినట్లు గుర్తించారని, మరో 88 వాహనాలు కూడా ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. సుప్రీంకోర్టు చట్టాల ప్రకారం ఈ బస్సులకు అనుమతి లేదని, జేసీ ట్రావెల్స్‌లోని బస్సుల రిజిస్ట్రేషన్ల రద్దుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇతర రాష్ట్రాలకు కూడా సమాచారం ఇచ్చామని ,అక్కడ కూడా రిజిస్ట్రేషన్లు రద్దు అవుతాయన్నారు. తమ శాఖలో ఎవరి పాత్ర అయినా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జేసీ ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేశామని, బోగస్ సర్టిఫికెట్లు పెట్టినందుకు పోలీస్ శాఖ కూడా కేసు నమోదు చేసిందని తెలిపారు. కేవలం జేసీ ట్రావెల్స్పైనే తనిఖీలు చేయలేదని, గత ఏడాది కాలంలో 14వేల కేసులు నమోదు చేశామని వెల్లడించారు. రూ.4కోట్లకుపైగా ఫైన్ వసూలు చేశామని ప్రసాద్‌రావు తెలిపారు. -
జేసీ ట్రావెల్స్ బాగోతం
-
జేసీ ఫోర్జరీ కేసులో సరికొత్త ట్విస్ట్
సాక్షి, అమరావతి : జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. సీఐలు, ఎస్సై, ఆర్టీఏ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ క్లియరెన్స్ సర్టిఫికేట్లను సృష్టించడమే కాకుండా.. నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లను కూడా తయారు చేశారు. యూనైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ పేరుతో ఫేక్ డాక్యుమెంట్లను తయారు చేసి రవాణశాఖ అధికారులకు సమర్పించారు. జేసీ ఫోర్జరీ వ్యవహారంపై విచారణ జరుపుతున్న రవాణాశాఖ టాస్క్‌ఫోర్స్ బృందం.. ఇప్పటివరకు 56 నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లను గుర్తించింది. (చదవండి: బయటపడ్డ జేసీ మరో చీటింగ్ వ్యవహారం) బీఎస్-3 వాహనాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి ఫోర్జరీ డాక్యుమెంట్స్‌తో బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేయించారు. నాగాలాండ్, కర్ణాటక రాష్ట్రాలలో 154 లారీలను నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటిదాకా 20లారీలను సీజ్ చేశారు. మిగిలిన వాహనాలను జేసీ ట్రావెల్స్ అజ్ఞాతంలోకి తరలించారు. రెండు లారీలను బస్సులుగా మార్చేసి వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తాజాగా వెలుగు చూసిన ఫేక్ ఇన్సురెన్స్ సర్టిఫికేట్ల బాగోతంపై రవాణా శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. (చదవండి : జేసీ ట్రావెల్స్‌లో బయటపడ్డ ఫోర్జరీ బాగోతం) -
బయటపడ్డ జేసీ మరో చీటింగ్ వ్యవహారం
-
బయటపడ్డ జేసీ మరో చీటింగ్ వ్యవహారం
సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఫోర్జరీ కేసుతో పాటు పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జేసీకి మరో షాక్ తగిలింది. తాజాగా జేసీ దివాకర్‌రెడ్డి మరో చీటింగ్ వ్యవహారం బయటపడింది. సుప్రీం కోర్టు నిషేధించిన బీఎస్-3 వాహనాలు కొనడమే కాకుండా నకిలీ పత్రాలతో 68 లారీలను నాగాలాండ్‌లో జేసీ రిజిస్ర్టేషన్ చేయించారు. ఇందులో దాదాపు పది వాహనాలను సామాన్యులకు విక్రయించినట్టు తాజాగా వెలుగు చూసింది. స్క్రాప్ కింద ఒక్కో లారీని రూ.6లక్షలకు కొనుగోలు చేసి రూ.23 లక్షలకు విక్రయించారు. జేసీ దివాకర్‌రెడ్డి మోసం చేశారని బాధితులు అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. (చదవండి : 40 ఏళ్ల నుంచి అక్రమంగా దివాకర్ ట్రావెల్స్ నిర్వహణ) స్క్రాప్ కింద 68లారీలను కొనుగోలు చేసిన జేసీ ట్రావెల్స్.. వాటిలో 10 లారీలను అనంతపురంలో విక్రయించి, మిగిలినవి సొంతంగా నడుపుకుంటుంది. ఈ లారీలన్నింటినీ ఫోర్జరీ డాక్యుమెంట్స్‌తో నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించారు. సుప్రీం కోర్డు నిషేధించిన బీఎస్ 3 లారీలను సైతం అడ్డదారిలో కొనుగోలు చేశారు. రవాణాశాఖ అధికారుల ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్‌రెడ్డి సతీమణి, జేసీ ట్రావెల్స్ ఎండీ జేపీ ఉమారెడ్డి, జేసీ అనుచరుడు చవ్వాగోపాల్‌రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అనంతపురం వన్‌టౌన్ పీఎస్‌లో జేసీ ట్రావెల్స్‌పై మరో కేసు నమోదయ్యే అవకాశం ఉంది. చదవండి : జేసీ ట్రావెల్స్‌లో బయటపడ్డ ఫోర్జరీ బాగోతం జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసు: మరో ఇద్దరు అరెస్ట్ -
జేసీ జాతీయ స్థాయి భారీ కుంభకోణం
-
జేసీ ట్రావెల్స్‌పై రూ.100 కోట్ల జరిమానా!
సాక్షి, అనంతపురం: తప్పుడు సమాచారం ఇచ్చిన జేసీ ట్రావెల్స్‌పై సుమారు రూ.100 కోట్ల జరిమానా విధించే అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు అన్నారు. అంతేకాక జేసీ ట్రావెల్స్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను కోరామన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2017లో సుప్రీంకోర్టు పర్యావరణ పరిరక్షణ కోసం బీఎస్-3 వాహనాలు నిషేధిస్తూ తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. దీని ప్రకారం 2017 ఏప్రిల్ 1 నుంచి బీఎస్-4 వాహనాలు మాత్రమే విక్రయించాలన్న నిబంధనలు అమల్లోకి వచ్చాయని పేర్కొన్నారు. కానీ దీనికి విరుద్ధంగా అనంతపురం జిల్లాలో 68 నిషేధిత బీఎస్-3 వాహనాలు గుర్తించామని తెలిపారు. అయితే వీటిని స్క్రాబ్ కింద విక్రయించామని అశోక్ లేలాండ్ కంపెనీ తమకు వివరాలు పంపిందని వెల్లడించారు. (నకిలీలు 'జేసి'!) సుప్రీం నిబంధనలకు విరుద్ధంగా.. ‘నాగాలాండ్‌లో బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా మార్చారు. ఇందులో ఆరు వాహనాలు జేసీ దివాకర్ రెడ్డి అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ జరిగాయి. ఒక వాహనం జేసీ ట్రావెల్స్ సంస్థ జటాధర ఇండస్ట్రీస్ పేరిట రిజిస్టరయ్యాయి. మరో నాలుగు లారీలు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి జేసీ ఉమారెడ్డి పేరిట రిజిస్టరయ్యాయి. దీనిపై వన్‌టౌన్ పీఎస్‌లో జేసీపై ఫిర్యాదు అందింది. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న జేసీ ట్రావెల్స్‌పై విచారణ చేయాలని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు’ అని ఆయన పేర్కొన్నారు. కాగా పర్మిట్లు లేని వ్యవహారంతోపాటు, ఫోర్జరీ డాక్యుమెంట్ల తయారీతో జేసీ బ్రదర్స్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజా ఫిర్యాదుతో రవాణాశాఖ ఉన్నతాధికారులు జేసీ ట్రావెల్స్ అక్రమాలను వెలికితీసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పోలీసుల జోలికి వెళ్లే పతనమయ్యావ్! -
జేసీ నేర చరిత్రపై త్వరలో మూడో భాగం..
అనంతపురం సెంట్రల్: ‘అధికారాన్ని అడ్డుపెట్టుకొని జేసీ సోదరులు తాడిపత్రిలో తమ నేర సామ్రాజ్యాన్ని విస్తరించారు. చివరకు రేషన్ బియ్యం కూడా వదలని గజదొంగలు’ అని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం ఆయన స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో వైఎస్సార్సీపీ నాయకులు కందిగోపుల మురళీమోహన్‌రెడ్డి కలిసి విలేకరులతో మాట్లాడారు. 2019 సెప్టెంబర్ 10న గుత్తిలో బలరాం అనే వ్యక్తి అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారని, అయితే ఇందుకు సంబంధించిన రికార్డులు, కేసు పూర్వాపరాలు పోలీసులు వెల్లడించలేదన్నారు. సదరు నిందితుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి బినామీ అన్నారు. నకిలీ సర్టిఫికెట్ల దందాలో ఆంధ్ర , కర్ణాటక రాష్ట్రాల్లో పేరు మోసిన గుంతకల్లు చెందిన గ్లెయిన్ బ్రిక్స్‌ను జేసీ ప్రభాకర్‌రెడ్డి మించిపోయాడని పెద్దారెడ్డి విమర్శించారు. నకిలీ సీళ్లతో ఎన్ఓసీ పొంది బెంగళూరులో విక్రయించిన లారీలన్నీ జేసీ ప్రభాకర్‌రెడ్డి భార్య జేసీ ఉమారెడ్డి పేర్ల మీద ఉన్నాయన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి పేరుతో కేవలం 2 వాహనాలే ఉండగా, జేసీ ఉమారెడ్డి పేరుతో ఏకంగా 80 వాహనాలు, కోడలు నిఖిలారెడ్డి పేరుతో 10 వాహనాలు ఉన్నట్లు వెల్లడైందన్నారు. సదరు వాహనాలన్నీ అక్రమమేనని, ఒకే నంబర్‌తో రెండు మూడు వాహనాలు నడపడం, ఇన్సూరెన్స్ తదితర రికార్డులన్నీ నకిలీవి సృష్టించారన్నారు. వీటికి సంబంధించిన ‘మీ–సేవ’ సర్టిఫికెట్లు కూడా నకిలీవేనన్నారు. అధికారులు పట్టుకుంటే ఇబ్బందలొస్తాయనుకున్న వాహనాలన్నింటినీ కుటుంబంలోని మహిళల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించడం చూస్తే.. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎంతకైనా దిగజారుతాడని అర్థమవుతోందన్నారు. సీఐ దాడి వెనుక జేసీ మంత్రాంగం జేసీ ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రిలో ఎవరికీ తెలియని చికెన్‌స్కాం(అధిక రేట్లకు విక్రయించి) నడిపాడన్నారు. మట్కా నిర్వాహకున్ని అరెస్ట్ చేయడానికి కడప జిల్లా నుంచి ఓ సీఐ వస్తే అతనిపై దాడి చేయించాడన్నారు. అంతేకాకుండా మట్కా నేరస్తున్ని కాపాడేందుకు ఎమ్మెల్యే హోదాలో రోడ్డుపై ధరా>్న చేసిన నీచమైన వ్యక్తి జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత తాడిపత్రిలో జేసీ సోదరులు చేసిన నేరాలు మొత్తం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు. దీన్ని తట్టుకోలేని జేసీ దివాకర్‌రెడ్డి ముఖ్యమంత్రిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడన్నారు. జేసీ తన అక్రమ సంపాదన కోసం అక్రమ రూట్లో బస్సు నడిపి గతంలో ఆత్మ డీపీడీ ప్రసాద్‌ను పొట్టనపెట్టుకున్నాడన్నారు. ఇప్పటికే జేసీ నేరచరిత్రకు సంబంధించిన రెండు భాగాలు విడుదలయ్యాయని, త్వరలో మూడో భాగం విడుదలవుతుందన్నారు. జేసీ సోదరులు యల్లనూరు మండలం యల్లుట్ల అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ చేయగా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తాను దాన్ని అడ్డుకున్నానన్నారు. రాజీకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, ఎవరైనా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. లేదంటే ఇప్పడు జేసీ సోదరులకు పట్టే గతే పడుతుందని హెచ్చరించారు. -
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసు: మరో ఇద్దరు అరెస్ట్
సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో మరో ఇద్దరు నిందితులను తాడిపత్రి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రామ్మూర్తి, ఇమామ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు నలుగురు జేసీ ట్రావెల్స్ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. సీఐలు, ఎస్సైలు, ఆర్టీఏ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ క్లియరెన్స్ సర్టిఫికెట్లు సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. జేసీ ట్రావెల్స్ యాజమాన్యం ఆదేశాలతోనే నకిలీ క్లియరెన్స్ సర్టిఫికెట్లు తయారు చేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు. తాడిపత్రి ఎస్ఐ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన నకిలీ స్టాంపులు వినియోగించినట్లు విచారణలో బయటపడింది. నకిలీ పత్రాలతో 6 లారీలను జేసీ ట్రావెల్స్ బెంగుళూరులో విక్రయించింది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమారెడ్డి జేసీ ట్రావెల్స్ ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఫోర్జరీ సర్టిఫికెట్ల తయారీ వెనుక జేసీ దివాకర్ రెడ్డి హస్తం జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ బాగోతంపై సమగ్ర విచారణ జరిపించాలని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అవినీతికి చిరునామా అని ధ్వజమెత్తారు. జేసీ వ్యాపారాలన్నీ అక్రమాలేనని, బోగస్ సర్టిఫికెట్లు తయారీలో జేసీ దివాకర్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. జేసీ బద్రర్స్ డబ్బు పిచ్చి వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే జేసీ ట్రావెల్స్ బస్సులు నడిపారని.. అక్రమ మైనింగ్‌తో వందల కోట్ల రూపాయలు జేసీ దోచుకున్నారని పెద్దారెడ్డి మండిపడ్డారు. జేసీ దివాకర్‌రెడ్డి పాపం పండిందని.. ఆయన చేసిన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. జేసీ బ్రదర్స్‌ను అరెస్ట్ చేసి విచారించాలని పోలీసులకు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి విజ్ఞప్తి చేశారు. (చదవండి: జేసీ ట్రావెల్స్‌లో బయటపడ్డ ఫోర్జరీ బాగోతం) -
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ బాగోతం
-
జేసీ ట్రావెల్స్‌లో బయటపడ్డ ఫోర్జరీ బాగోతం
సాక్షి, అనంతపురం : జేసీ దివాకర్‌రెడ్డి ట్రావెల్స్‌లో ఫోర్జరీ బాగోతం బయట పడింది. పలు అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసిన జేసీ ట్రావెల్స్ ఉద్యోగులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ల్యాప్ టాప్, థంబ్ మిషన్, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు రామ్మూర్తి, ఇమాం పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. సీఐలు, ఎస్సైలు, ఆర్టీఏ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. (వెలుగులోకి జేసీ దివాకర్‌రెడ్డి అవినీతి బాగోతం) కాగా పోలీసు, రవాణాశాఖ అధికారుల సంతాకాలను జేసీ ట్రావెల్స్ ప్రతినిధులు ఫోర్జరీ చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో 6 లారీలను జేసీ ట్రావెల్స్ కర్ణాటకలో విక్రయించారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి సతీమణి ఉమాదేవి జేసీ ట్రావెల్స్ ఎండీగా ఉన్నారు. ట్రావెల్స్ యాజమాన్యం ఒత్తిడి మేరకే సంతకాలు ఫోర్జరీ చేసినట్లు నిందితులు పోలీసులు విచారణలో వెల్లడించారు. చదవండి :'జేసీ బ్రదర్స్ దొంగల కన్నా హీనం' కొండలను దోచుకోవడంలో జేసీ దిట్ట: కేతిరెడ్డి -
జేసీకి షాకిచ్చిన రవాణా శాఖ
సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి మరో షాక్ తగిలింది. రవాణా శాఖ అధికారులు గురువారం జరిపిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని ఆరు జేసీ ట్రావెల్స్ బస్సులు పట్టుబడ్డాయి. సరైన రికార్టులు లేకపోవడంతో అధికారులు ఈ బస్సులను సీజ్ చేశారు. కాగా గడిచిన పది రోజుల్లో జేసీకి చెందిన ట్రావెల్స్‌ను సీజ్ చేయడం ఇది రెండో సారి. ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ పర్మిట్లలో అక్రమాలు కారణంగా ఇటీవల 36 బస్సులు.. 18 కాంట్రాక్టు బస్సులను అధికారులు సీజ్ చేసి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించిన జేసీ బ్రదర్స్ సరైన పర్మిట్లు లేకుండా బస్సులు నడపటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
మాజీ ఎంపీ జేసీకి మరో ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. రవాణా శాఖ అధికారులు మంగళవారం జరిపిన తనిఖీల్లో ఐదు జేసీ ట్రావెల్స్ బస్సులు పట్టుబడ్డాయి. ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ పర్మిట్లు లేకపోవడంతో అధికారులు ఈ బస్సులను సీజ్ చేశారు. అనంతపురం డీటీసీ శివరాంప్రసాద్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. తాజా దాడులతో ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ పర్మిట్లలో అక్రమాలు కారణంగా మొత్తం 36 బస్సులు.. 18 కాంట్రాక్టు బస్సులను అధికారులు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించిన జేసీ బ్రదర్స్ సరైన పర్మిట్లు లేకుండా బస్సులు నడపటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
జేసీ ట్రావెల్స్‌కు ఆర్టీఏ షాక్
-
రెండేళ్ల క్రితమే బస్సు అమ్మేశాం: జెసి ప్రభాకర్ రెడ్డి
-
రెండేళ్ల క్రితమే బస్సు అమ్మేశాం: జేసీ ట్రావెల్స్
-
రెండేళ్ల క్రితమే బస్సు అమ్మేశాం: జేసీ ట్రావెల్స్
అనంతపురం : మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రమాదానికి గురైన వోల్వో బస్సుతో తమ ట్రావెల్స్‌కు ఎలాంటి సంబంధం లేదని జేసీ ట్రావెల్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. తాము రెండేళ్ల క్రితమే బస్సును అమ్మివేసినట్లు యాజమాన్యం బుధవారమికర్కడ తెలిపింది. జబ్బర్ ట్రావెల్స్తో తమకు ఎలాంటి సంబంధం లేదని... అయితే టైటిల్ మార్చకపోవటం వల్లే తమ ట్రావెల్స్ పేరు ఉందన్నారు. ప్రమాదం జరిగిన జబ్బార్ బస్సు (AP 02 TA 0963) దివాకర్ ట్రావెల్స్ పేరిట రిజిస్ట్రేషన్ అయింది. అయితే ఈ బస్సును 2010 అక్టోబర్‌లో విక్రయించినట్టుగా ఆర్టీఏ రికార్టులు చెబుతున్నాయి. కాగా ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 49 మంది ప్రయాణీకులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో 42 మంది అగ్నికి అహుతైపోయారు. ప్రమాదం జరిగే సమయంలో ప్రయాణీకులు గాఢ నిద్రలో ఉన్నారు. వారంతా నిద్రలోనే మృత్యువడికి చేరుకున్నారు. -
ప్రమాదానికి గురైన బస్సు జేసీ ట్రావెల్స్ పేరుతో రిజిస్టర్
-
ప్రమాదానికి గురైన బస్సు జేసీ ట్రావెల్స్ పేరుతో రిజిస్టర్
హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రమాదానికి గురైన వోల్వో బస్సు జేసీ ట్రావెల్స్ పేరుతో రిజిస్టర్ అయినట్లు సమాచారం. AP 02 TA 0963 నెంబర్ గల బస్సు దివాకర్ రోడ్డు లైన్ పేరుతో అనంతపురంలో రిజిస్టర్ అయ్యింది. అయితే ఆర్టీఏ రికార్డుల్లో బస్సు స్టేటస్ ఇనాక్టివ్‌గా ఉంది. జేసీ ట్రావెల్స్ పేరుతో రిజిస్ట్రర్ అయిన బస్సు....జబ్బర్ ట్రావెల్స్ పేరుతో ఎందుకు నడుస్తుందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.