
అనంతపురం జిల్లా జైలులో ఓ ఖైదీకి కరోనా లక్షణాలు బయటపడటంతో.. అక్కడ ఉండలేమని వారు అభ్యంతరం తెలిపారు.
సాక్షి, అనంతపురం: దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని జైలుకు తరలించే విషయంలో హైడ్రామా నడిచింది. అనంతపురం జిల్లా జైలులో ఓ ఖైదీకి కరోనా లక్షణాలు బయటపడటంతో.. అక్కడ ఉండలేమని వారు అభ్యంతరం తెలిపారు. మరో జైలుకు మార్చాలని జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి న్యాయమూర్తి వద్ద మరో పిటిషన్ దాఖలు చేశారు. కడప, గుత్తి, తాడిపత్రి జైళ్లలో ఏదో ఒక జైలుకు తమను తరలించాలని పిటిషన్‌లో విన్నవించారు. కాగా, ఫోర్జరీ కేసులో అరెస్టైన వీరిద్దరికి న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
(చదవండి: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్)
(చదవండి: తీగలాగితే డొంక కదిలింది!)