
సాక్షి, అనంతపురం : దివాకర్ ట్రావెల్స్ అక్రమాలపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. జేసీ ఫోర్జరీ డాక్యుమెంట్స్ కేసుకు సంబంధించి అనంతపురం వన్‌టౌన్ పోలీసులు దాఖలు చేసిన రెండు పిటీ వారెంట్లకు కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా పిటీ వారెంట్‌లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్‌లో తెలిపారు. ఈ మేరకు పిటీషన్‌పై వాదనలు విన్న కోర్టు జేసీ దివాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డిని కస్టడీకి ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. జేసీ ట్రావెల్స్ నకిలీ ఇన్ వాయిస్‌లతో 154 వాహనాలను నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించిన సంగతి తెలిసిందే. కాగా క్లియరెన్స్ సర్టిఫికెట్ల కోసం ఎస్సై , సీఐ సంతకాలను జేసీ ట్రావెల్స్ ఫోర్జరీకి పాల్పడింది.
(జేసీ ప్రభాకర్ రెడ్డిపై పీటీ వారెంట్)
(మరో వివాదంలో జేసీ దివాకర్ రెడ్డి)
Comments
Please login to add a commentAdd a comment