
సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలకు ఈ నెల 26 వరకు కోర్టు రిమాండ్ విధించింది. కస్టడీ గడువు ముగియడంతో శనివారం పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం వారిని కడప జైలుకు తరలించారు. ఆదివారం వన్‌టౌన్‌లో సీఐ ప్రతాప్‌రెడ్డి దాదాపుగా 40 వాహనాలకు సంబంధిన రిజిస్ట్రేషన్‌లపై లోతుగా విచారణ చేపట్టారు.(జేసీ ట్రావెల్స్ అక్రమాల పుట్ట)
పోలీసు కస్టడీలో తండ్రీకొడుకులు కీలక విషయాలు వెల్లడించినట్లు అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి పేర్కొన్నారు. బీఎస్-3 వాహనాలను ఎలా బీఎస్-4 గా మార్చి నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించారో ప్రశ్నించామని తెలిపారు. ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా ఎలా రిజిస్ట్రేషన్ చేయించారు? నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఎలా తయారు చేసి చలామణి చేశారన్న దానిపై చాలా వివరాలు రాబట్టామన్నారు. అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పిస్తామని డీఎస్పీ తెలిపారు. (ఫోర్జరీ జేసీ.. వాహనాల కొనుగోల్‌మాల్)
Comments
Please login to add a commentAdd a comment