JC Ashmit Reddy
-
తాడిపత్రిలో టీడీపీ నేతల దౌర్జన్యం
సాక్షి, అనంతపురం జిల్లా: వైఎస్సార్సీపీ నేత జావేద్ ఇంటి వద్ద ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి అనుచరుడు వీరంగం సృష్టించాడు. డబ్బులు బాకీ ఉన్నారంటూ వైఎస్సార్సీపీ నేత ఇంటి వద్ద అనుచరులతో దౌర్జన్యానికి దిగాడు. కుటుంబ సభ్యులను నిర్బంధించారని పోలీసులకు వైఎస్సార్సీపీ నేత జావేద్ ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి పేరుతో బెదిరింపులకు దిగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేత గోరాకు ఎలాంటి బాకీ లేనని జావెద్ స్పష్టం చేశారు.హోంగార్డుపై టీడీపీ నేత దౌర్జన్యం శింగనమల మండలంలోని ఉల్లికల్లు గ్రామానికి చెందిన టీడీపీ నేత రంగారెడ్డి తనపై దాడికి ప్రయత్నించాడంటూ శింగనమల పీఎస్‌లో పనిచేస్తున్న హోంగార్డు నాగేంద్ర మంగళవారం సీఐ కౌలుట్లయ్యకు ఫిర్యాదు చేశారు. వివరాలు... సెప్టెంబరులో ఒక రోజు రాత్రి నాయనపల్లి క్రాస్ నుంచి మరువకొమ్మ వరకూ హెడ్ కానిస్టేబుల్ గిరి మహేష్‌తో కలసి, హోంగార్డు నాగేంద్ర గస్తీ విధులు నిర్వర్తించాడు.ఆ సమయంలో టీడీపీ నేత ఉల్లికల్లు రంగారెడ్డికి చెందిన టిప్పరులో అక్రమంగా ఇసుక తరలిస్తుండడం గుర్తించి పోతురాజుకాలువ సమీపంలో అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. దీంతో అప్పటి నుంచి హోంగార్డు నాగేంద్ర ఎక్కడ కనిపించిన రంగారెడ్డి కోపంతో దుర్భాషలాడేవాడు. ఈ క్రమంలో మంగళవారం నాయనవారిపల్లిలో జరిగిన శుభకార్యానికి ఎమ్మెల్యేలు బండారు శ్రావణి, ఎంఎస్ రాజు హాజరుకానుండడంతో ఎస్ఐ, ఎఎస్ఐ, హెడ్ కానిస్టేబులు, సిబ్బందితో ఎస్కార్ట్ విధుల్లో నాగేంద్ర కూడా పాల్గొన్నాడు. అక్కడ సిబ్బంది భోజనం చేస్తున్న సమయంలో నాగేంద్రపై రంగారెడ్డి దాడికి ప్రయతి్నంచాడు. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది అడ్డుకోవడంతో నీ కథ చూస్తా అంటూ బెదిరిస్తూ వెళ్లిపోయాడు. టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐకి బాధితుడు ఫిర్యాదు చేశాడు. -
జేసీ అస్మిత్‌తో నేను దురుసుగా ప్రవర్తించలేదు: సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి
సాక్షి, అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి క్షమాపణల విషయంపై అనంతపురం జిల్లా తాడిపత్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ స్పందించారు. మంగళవారం తాడిపత్రిలో జరిగిన ఘటనలో తన తప్పేమీ లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్నే తాను జిల్లా ఎస్పీకి కూడా వ్యక్తిగతంగా కలిసి వివరించానని సి.ఐ. క్ష్మీకాంత్ రెడ్డి బుధవారం తెలిపారు. ఎస్పీ జగదీష్‌ను కలిసిన తరువాత సి.ఐ. విలేకరులతో మాట్లాడుతూ మంగళవారం నాటి ఘటన వివరాలను తెలిపారు. ‘తాడిపత్రి ఘటనలో నా తప్పు ఏమీ లేదు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌తో నేను దురుసుగా ప్రవర్తించలేదు. ఎస్సీ, ఎస్టీ కేసు నా పరిధిలోని అంశం కాదు. డీఎస్పీ విచారణ చేస్తారని ఆయనతో చెప్పాను. నేను తాడిపత్రిలో 14 నెలల నుంచి పనిచేస్తున్నాను. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నాపై ఎలాంటి చర్యలు తీసుకున్నా నాకు ఓకే’ అని కామెంట్స్ చేశారు. తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీకి ఇదేం రాక్షసానందం? సీఐ లక్ష్మీకాంత రెడ్డితో క్షమాపణలు చెప్పించుకున్న @JaiTDP ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అధికారమదంతో పోలీసుల మనోభావాల్ని దెబ్బతీస్తూ అందరి ముందు సీఐ నుంచి క్షమాపణలు చెప్పించుకున్న జేసీ అస్మిత్ రెడ్డి pic.twitter.com/UNSgk2TEMt— YSR Congress Party (@YSRCParty) August 27, 2024 -
తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అత్యుత్సాహం
-
పరారీలో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత రెడ్డి..
-
జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌లపై హత్యాయత్నం కేసు
తాడిపత్రి అర్బన్(అనంతపురం జిల్లా): తాడిపత్రిలో వైఎస్సార్సీపీ కార్యకర్త గండికోట హాజీబాషా అలియాస్ ఘోరా హాజీపై దాడి చేసి గాయపరిచిన ఘటనకు సంబంధించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అతని కుమారుడు, జేసీ అస్మిత్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ వీఎన్కే చైతన్య తెలిపారు. ఈ నెల 23న తాడిపత్రిలోని మూడో వార్డు పర్యటనకు వెళ్లిన అస్మిత్‌రెడ్డి, ఆయన అనుచరుడు ఖాదర్‌బాషా మరికొందరు.. అదే వార్డుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు దిగారు. అంతటితో ఆగకుండా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో హాజీబాషా తీవ్రంగా గాయపడ్డాడు. అతని ఫిర్యాదు మేరకు జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డి, అనుచరులు ఖాదర్‌బాషా, ఫిల్టర్ బీడీ యజమాని అయూబ్‌తో పాటు మరో పది మంది టీడీపీ నేతలపై 147, 148, 307, 506 రెడ్‌విత్ 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చదవండి: హైకోర్టు జడ్జీల బదిలీపై టీడీపీ యాగీ -
వాహనాల కుంభకోణం; జేసీ కొత్త నాటకం
‘జేసీ’....తన బస్సులాగే రూట్ మార్చాడు. తుక్కు వాహనాల కొనుగోలులో నకిలీలు జేసి జైలులో ఉన్న తండ్రీ, తనయులు జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డిలు కేసు నుంచి తప్పించుకునేందుకు కొత్త నాటకానికి తెరలేపారు. ఈ కేసులో తమకేం తెలియదని.. బ్రోకర్ ద్వారా వాహనాలు కొనుగోలు చేశామని బుకాయిస్తున్నారు. అయితే తప్పుడు వ్యవహారంలో వారిద్దరూ తప్పించుకోలేరని..తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని అధికారులు చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: తుక్కు వాహనాల కొనుగోలు కేసులో అరెస్టైన జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డిలు కేసుల నుంచి తప్పించుకునేందుకు కొత్త నాటకానికి తెరతీసినట్లు తెలుస్తోంది. ఈ కేసుతో తమకు సంబంధం లేదని.. కేవలం బ్రోకర్ ద్వారా వాహనాలను కొనుగోలు చేశామని బుకాయిస్తున్నట్లు సమాచారం. మొత్తం 154 బీఎస్–3 వాహనాలను తప్పుడు రిజి్రస్టేషన్లతో బీఎస్–4 వాహనాలుగా రిజి్రస్టేషన్ చేయించడంతో పాటు పలువురికి విక్రయించిన కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆయన తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డిలతో పాటు మరో నలుగురిపై 27 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై విచారణ సమయంలోనే జేసీ కొత్త నాటకానికి తెరతీసినట్లు తెలుస్తోంది. స్క్రాబ్ వాహనాల కుంభకోణంలో తమకేమీ తెలియదని బుకాయించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా తాము నమ్మిన బ్రోకర్లే ఈ వ్యవహారం నడిపారని కేసు నుంచి తప్పించుకునే యత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే నాగాలాండ్ కేంద్రంగా బీఎస్–3 వాహనాలను తప్పుడు సరి్టఫికెట్లతో బీఎస్–4గా మార్చడంతో పాటు ఏకంగా పోలీసు అధికారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేశారు. అయితే, ఈ తప్పంతా తాము జేసీ ఆదేశాలతోనే చేసినట్లు ఇతర నిందితులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డి తప్పించుకునే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ కేసులో ఏ–1గా జేసీ ఉమారెడ్డి (జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి), ఏ–2గా జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఏ–3గా నాగేంద్ర, ఏ–4గా బాబయ్య, ఏ–5గా జేసీ విజయ (జేసీ దివాకర్‌రెడ్డి సతీమణి), ఏ–6గా జేసీ అస్మిత్ రెడ్డి (జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు)పై అనంతపురం, తాడిపత్రి స్టేషన్లల్లో మొత్తం 27 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ తప్పుడు రిజిస్ట్రేషన్ వ్యవహారంలో వీరి పాత్రకు తగిన ఆధారాలతో పాటు సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయని...బుకాయింపులతో కేసు నుంచి తప్పించునే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఇదీ జరిగింది..! వాతావరణాన్ని కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా 2017 ఏప్రిల్ 1 నుంచి బీఎస్–3 వాహనాల రిజి్రస్టేషన్లను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో బీఎస్–3 వాహనాలను విక్రయించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కాలం చెల్లిన బీఎస్–3 వాహనాలను...నాగాలాండ్‌లో జేసీ ట్రావెల్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. మొత్తం 157 రవాణా వాహనాలను స్క్రాప్ కింద విక్రయించేందుకు ముందుకు రాగా... వీటిని తక్కువ ధరకు దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. ఈ విధంగా కొనుగోలు చేసిన వాహనాలను బీఎస్–4గా పేర్కొంటూ నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత వీటిని అనంతపురం రవాణాశాఖ కార్యాలయం ద్వారా ఎన్ఓసీ తీసుకుని దర్జాగా జిల్లాలో ఇష్టారాజ్యంగా తిప్పారు. కొద్ది మందికి కూడా కొత్త బీఎస్–4 వాహనాల కంటే కొంచెం తక్కువ ధరకు విక్రయించారు. అయితే, వీటిపై రవాణాశాఖ ఉన్నతాధికారులకు కాస్తా అనుమానాలు, ఫిర్యాదులు రావడంతో నాగాలాండ్‌కు వెళ్లి విచారణ ప్రారంభించారు. తీగలాగితే డొంక కదలగా... అక్రమంగా తిరుగుతున్న ఈ వాహనాలను ఎక్కడికక్కడ పట్టుకుని సీజ్ చేశారు. ఈ క్రమంలోనే జేసీ మరో ఎత్తుగడ వేశారు. విలువైన సామానులను తీసేసి.. కేవలం ఛాసీస్ మాత్రమే ఉంచి వాహనాలు అప్పగిస్తున్నారు. మరోవైపు తమను మోసం చేసి వాహనాలను విక్రయించారని పలువురు తాడిపత్రిలో ధర్నా చేయడంతో పాటు జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసులు కూడా పెట్టారు. పక్కాగా ఆధారాలు ! వాస్తవానికి ఈ విధంగా బీఎస్–3 వాహనాలను...బీఎస్–4 వాహనాలుగా పేర్కొంటూ తప్పుడు రిజి్రస్టేషన్ జరిగిన వాహనాలకు ఎన్ఓసీ ఇవ్వడం సాధ్యం కాదని రవాణాశాఖ అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ వాహనాలను తాము రిజి్రస్టేషన్ చేస్తే తమకు ఇబ్బందులు తప్పవని, అందువల్ల తాము ఈ పనిచేయలేమని తేలి్చచెప్పినట్లు సమాచారం. అయితే, నాగాలాండ్‌లో రిజి్రస్టేషన్ చేసిన తర్వాత ఆర్సీలో బీఎస్–4 వాహనాలు అని పేర్కొన్నారని.. మీకేమీ ఇబ్బంది ఉండదంటూ వివిధ రకాలుగా రవాణాశాఖ అధికారులకు ఆశపెట్టి, బెదిరించి ఎన్ఓసీ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు మాత్రం ఎన్ఓసీ ఇచ్చిన రవాణాశాఖ అధికారులది తప్పంటూ జేసీ బ్రదర్స్ వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. అంతేకాకుండా తాము నేరుగా ఈ వాహనాలను కొనుగోలు చేయలేదని.. తప్పంతా బ్రోకర్లదేనని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, మొత్తం వ్యవహారంలో వీరి పాత్ర స్పష్టంగా ఉండటంతో ఎన్ని నాటకాలు ఆడినా తప్పించుకునే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
జేసీ ప్రభాకర్‌రెడ్డికి పీటీ వారెంట్లు జారీ
సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో అరెస్టైన జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డికి రెండు కేసుల్లో జిల్లా కోర్టు శనివారం పీటీ వారెంట్లు జారీ చేసింది. తాడిపత్రి కేసుల్లో వారిద్దరికీ కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. కడప సెంట్రల్ జైల్లో ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు.మరోవైపు నిషేధిత వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లు, మోసపూరిత విక్రయాలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. తాడిపత్రిలో రవికుమార్ అనే ఆర్టీఏ బ్రోకర్‌ను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఇన్వాయిస్, ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ల తయారీపై పోలీసులు అతన్ని ఆరా తీస్తున్నారు. నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ల చెలామణిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, జేసీ ట్రావెల్స్ ఫొర్జరీ కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డికి అనంతపురం కోర్టు జూలై 1 దాకా రిమాండ్ పొడిగిస్తూ శుక్రవారం ఆదేశించింది. (చదవండి: జేసీ ప్రభాకర్‌రెడ్డికి రిమాండ్ పొడిగింపు) -
జేసీ ప్రభాకర్‌రెడ్డికి రిమాండ్ పొడిగింపు
సాక్షి, అనంతపురం : జేసీ ట్రావెల్స్ ఫొర్జరీ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిలకు అనంతపురం కోర్టు జూలై 1 దాకా రిమాండ్ పొడిగించింది. ప్రస్తుతం కడప జైలులో ఉన్న ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు విచారణకు హాజరుపరిచారు. దీంతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. రిమాండ్ పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.(చదవండి : జేసీ ట్రావెల్స్ కేసు.. కీలక విషయాలు) మరోవైపు ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలకు బెయిల్ ఇవ్వాలని అనంతపురం జిల్లా కోర్టులో వారి తరఫు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే దీనిపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేశారు. అలాగే ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను తమ కస్టడీకి అప్పగించాలని తాడిపర్తి పోలీసులు గుత్తి కోర్టులో పిటిషన్లో దాఖలు చేశారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లు, మోసపూరిత విక్రయాలపై జేసీ వారి నుంచి వివరాలు సేకరించేందుకు అనుమతివ్వాలని పోలీసులు ఈ పిటిషన్లో కోరారు. -
కడప జైలుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి..
అనంతపురం క్రైమ్: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డిల విచారణ పూర్తయింది. బీఎస్ 3 అక్రమ వాహనాల రిజిస్ట్రేషన్లపై వన్‌టౌన్ పోలీసులు వారిని రెండ్రోజులు పోలీసు కస్టడీకి తీసుకున్న విషయం విధితమే. సోమవారం ఉదయం 9 గంటల వరకు వన్‌టౌన్ సీఐ ప్రతాప్‌రెడ్డి వారిని విచారించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఆ తర్వాత కస్టడీ పూర్తి కావడంతో వారిద్దరినీ కడప జైలుకు తరలించారు.(జేసీ ట్రావెల్స్ కేసు.. కీలక విషయాలు) -
జేసీ ట్రావెల్స్ కేసు.. కీలక విషయాలు
సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలకు ఈ నెల 26 వరకు కోర్టు రిమాండ్ విధించింది. కస్టడీ గడువు ముగియడంతో శనివారం పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం వారిని కడప జైలుకు తరలించారు. ఆదివారం వన్‌టౌన్‌లో సీఐ ప్రతాప్‌రెడ్డి దాదాపుగా 40 వాహనాలకు సంబంధిన రిజిస్ట్రేషన్లపై లోతుగా విచారణ చేపట్టారు.(జేసీ ట్రావెల్స్ అక్రమాల పుట్ట) పోలీసు కస్టడీలో తండ్రీకొడుకులు కీలక విషయాలు వెల్లడించినట్లు అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి పేర్కొన్నారు. బీఎస్-3 వాహనాలను ఎలా బీఎస్-4 గా మార్చి నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించారో ప్రశ్నించామని తెలిపారు. ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా ఎలా రిజిస్ట్రేషన్ చేయించారు? నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఎలా తయారు చేసి చలామణి చేశారన్న దానిపై చాలా వివరాలు రాబట్టామన్నారు. అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పిస్తామని డీఎస్పీ తెలిపారు. (ఫోర్జరీ జేసీ.. వాహనాల కొనుగోల్‌మాల్) -
నేడు మెజిస్ట్రేట్ ముందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి
సాక్షి, అనంతపురం: దివాకర్ రోడ్‌లైన్స్, బీఎస్ 3 వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలను వన్‌టౌన్ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఆదివారం వన్‌టౌన్‌లో సీఐ ప్రతాప్‌రెడ్డి దాదాపుగా 40 వాహనాలకు సంబంధిన రిజిస్ట్రేషన్లపై లోతుగా విచారణ చేపట్టారు. వాహనాలను ఎక్కడ కొనుగోలు చేశారు? నాగాలాండ్‌లో ట్రక్కు వాహనాల కొనుగోలు, రిజిస్ట్రేషన్లు, తదితరాలపై తండ్రీకొడుకులపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం మెజిస్ట్రేట్ ముందు మరోసారి వీరిద్దరినీ వన్‌టౌన్ పోలీసులు హాజరుపర్చనున్నారు. కస్టడీని పొడిగించాలని కోరనున్నట్లు సమాచారం. చదవండి: కస్టడీకి జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి -
జేసీని విచారించేందుకు కోర్టు అనుమతి
సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ డాక్యూమెంట్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని రెండు రోజుల పాటు విచారించేందుకు కోర్టు పోలీసులకు అనుమతిని ఇచ్చింది. కోర్టు ఆదేశం మేరకు జేసీ ప్రభాకర్‌రెడ్డిని, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిలను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. (జేసీ ప్రభాకర్ రెడ్డిపై పీటీ వారెంట్) అంతేగాక మరో ఐదు కేసుల్లో పీటీ వారెంట్లను కూడా కోర్టు జారీ చేసింది. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడైన చవ్వా గోపాల్‌రెడ్డిని 154 బస్సులు, లారీల అక్రమ రిజిస్ట్రేషన్‌పై విచారించేందుకు కూడా కోర్టు పోలీసులకు అనుమతించింది. దీంతో అనంతపురం వన్‌టౌన్ పోలీసులు చవ్వా గోపాల్‌రెడ్డి ఒకరోజు కస్టడీలోకి తీసుకుని విచారించారు. (జేసీ ట్రావెల్స్ అక్రమాలపై లోతుగా విచారణ) -
జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌లకు షాకిచ్చిన కోర్టు!
సాక్షి, అనంతపురం : జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌ల బెయిల్ పిటిషన్‌ను గురువారం కోర్టు తిరస్కరించింది. ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌లను రెండు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ ఇద్దరిపై మరో ఐదు కేసుల్లో పీటీ వారెంట్లు జారీ అయ్యాయి. 154 బస్సులు, లారీల అక్రమ రిజిస్ట్రేషన్‌పై.. జేసీ దివాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డిని పోలీసులు విచారించారు. ( జేసీ ట్రావెల్స్ అక్రమాలపై లోతుగా విచారణ ) కాగా, రెండు బస్సులకు సంబంధించి నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్తో ఎన్ఓసీ పొందిన కేసులో ఈ నెల 13న ఏ2 జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏ6 జేసీ అస్మిత్ రెడ్డిలకు మెజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారిని వన్‌టౌన్ పోలీసులు వారిని కడప కారాగారానికి తరలించారు. గత సోమవారం జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిల బెయిల్‌కు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు దాఖలైంది. నేడు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరష్కరించింది. ( మరో వివాదంలో జేసీ దివాకర్ రెడ్డి) -
జేసీ ప్రభాకర్ రెడ్డిపై పీటీ వారెంట్
సాక్షి, అనంతపురం: దివాకర్ ట్రావెల్స్ అక్రమాల్లో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. అనంతపురం వన్‌టౌన్ పోలీసులు మూడు కేసులకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలపై సోమవారం కోర్టులో పీటీ వారెంట్(క్రైం నెంబర్ 33) వేశారు. గతేడాది జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ తుక్కు కింద బీఎస్ 3 వాహనాలను కొనుగోలు చేశారు. తప్పుడు ఇన్వాయిస్లతో తుక్కు కింద కొనుగోలు చేసిన ఆ వాహనాలను నాగాలాండ్ రాజధాని కొహిమా.. అనంతపురం, ఇతర రాష్ట్రాల్లో బీఎస్ 4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతపురంలో రిజిస్ట్రేషన్ చేయించిన 80 వాహనాలపై రవాణాశాఖాధికారులు వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ కేసులకు సంబంధించి వన్‌టౌన్ పోలీసులు కోర్టులో పీటీ వారెంట్‌ను వేశారు. తండ్రీ, కొడుకులు కడప కారాగారంలో ఉండగానే పోలీసులు పీటీ వారెంట్ నమోదు చేయడం చర్చనీయాంశమైంది. మెజిస్ట్రేట్ పీటీ వారెంట్‌పై విచారణ నేటికి(మంగళవారం) వాయిదా వేశారు. చదవండి: ‘జేసీ బ్రదర్స్’ బాగోతం.. బిగుస్తున్న ఉచ్చు బెయిల్ దాఖలు.. జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిల బెయిల్‌కు సంబంధించి సోమవారం ఆన్లైన్లో దరఖాస్తు దాఖలైంది. రెండు బస్సులకు సంబంధించి నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్తో ఎన్ఓసీ పొందిన కేసులో ఈ నెల 13న ఏ2 జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏ6 జేసీ అస్మిత్ రెడ్డిలకు మెజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ క్రమంలో వన్‌టౌన్ పోలీసులు వారిని కడప కారాగారానికి తరలించారు. ఈ కేసుకు సంబంధించి బెయిల్ దరఖాస్తుపై విచారణను మెజిస్ట్రేట్ నేటికి వాయిదా వేశారు. చదవండి: జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పరీక్షలు -
జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పరీక్షలు
సాక్షి, అనంతపురం: దివాకర్ ట్రావెల్స్ అక్రమాల కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉంటున్న వీరికి వైద్య సిబ్బంది స్వాబ్ పరీక్షలు నిర్వహించారు. వీటికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా కడప సెంట్రల్ జైలులో ఖైదీలకు ములాఖత్ నిలిపివేశారు. అయితే నేడు జేసీ కుటుంబాన్ని పరామర్శించడానికి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతపురం జిల్లా తాడిపత్రికి రానున్నారు. కాగా.. బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేయించి అక్రమాలకు పాల్పడిన జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి కడప సెంట్రల్ జైలులో ఉంట్నున్న సంగతి తెలిసిందే. చదవండి: ‘జేసీ బ్రదర్స్’ బాగోతం.. బిగుస్తున్న ఉచ్చు కడప జైలుకి జేసీ ప్రభాకర్‌రెడ్డి -
‘జేసీ బ్రదర్స్’ బాగోతం.. బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, అనంతపురం: నకిలీ రిజిస్ట్రేషన్ వాహనాల కుంభకోణంలో జేసీ సోదరులతో చేయి కలిపిన పాత్రదారులపై ఉచ్చు బిగిస్తోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను తుంగలోకి తొక్కి అక్రమార్జన కోసం జేసీ సోదరులు అడ్డదారులు తొక్కారు. జాతీయస్థాయి స్కాం ఎక్కడ బయట పడుతుందోనని మరిన్ని నేరాలకు పాల్పడ్డారు. ఇందులో కొందరు అధికారులు, మరికొంత మంది ప్రైవేటు వ్యక్తులు ప్రమేయముందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశముందని తెలుస్తోంది. 154 బీఎస్–3 వాహనాలకు రిజిస్ట్రేషన్.. ప్రభుత్వం నిషేధించిన బీఎస్–3 లారీలు, టిప్పర్లను నాగాలాండ్ రాష్ట్ర రాజధాని కోహిమాలో ఒకేసారి 154 వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ అక్రమ బాగోతంలో కీలక నిందితుడు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, జఠాధర కంపెనీ డైరెక్టర్‌గా బాధ్యతలు వ్యవహరిస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. 2017 మార్చిలో సుప్రీంకోర్టు బీఎస్–3 వాహనాలపై ఆంక్షలు విధించింది. 2017, ఏప్రిల్ 1 తర్వాత సదరు వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయడం చట్టారీత్యా నేరం. ఈ విషయం తెలిసినప్పటికీ జేసీ సోదరులు వాహనాలను కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ అనంతరం ఎన్ఓసీలతో జిల్లాకు తీసుకొచ్చారు. ఒక్కో వాహనంపై రూ.3 నుంచి రూ.4 లక్షల్లోపు ఖర్చు చేసి రూ. కోట్లు లబ్ధి పొందారు. చదవండి: అనంతపురం జైలు వద్ద హైడ్రామా! మరింత లోతుగా దర్యాప్తు.. జేసీ బ్రదర్స్ అవినీతి బండారం బయటపడడంతో ఆధారాలు సేకరించిన అధికారులు శనివారం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డిలను అరెస్ట్ చేశారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఈ కుంభకోణంలో సూత్రదారులు, పాత్రదారులందరిపైనా వేటు పడే అవకామున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. జేసీ బ్రదర్స్ అవినీతి అక్రమాలు బయటపడిన తర్వాత రాష్ట్ర రవాణాశాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నేరుగా నాగాలాండ్‌కు వెళ్లి సదరు వాహనాలకు సంబంధించిన వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. విషయం తెలుసుకున్న జేసీ సోదరులు సదరు వాహనాలను కనుమరుగు చేసేందుకు యత్నించారు. కొన్ని వాహనాలను ఇతరులకు విక్రయించగా.. మరికొన్నింటిని ఇతర రాష్ట్రాలకు బదలాయించారు. ఈ వ్యవహారంలో వివిధ సెక్షన్ల కింద మొత్తం 24 కేసులు నమోదయ్యాయి. చదవండి: ఫోర్జరీలు 'జేసి'.. కటకటాల్లోకి..! పాత్రదారులందరిపైనా వేటు.. జేసీ బ్రదర్స్ కంపెనీలు చేసిన అవినీతి కుంభకోణంలో పాత్రదారులు, సూత్రదారులందరిపైనా త్వరలో వేటు పడనున్నట్లు తెలుస్తోంది. వాహనాల లావాదేవీల్లో పాత్రదారులను ఇప్పటికే గుర్తించారు. అయితే వాహనాలు కొని మోసపోయి వారిపైనా కేసులు నమోదయ్యాయి. అలాగే ఒకేసారి నాగాలాండ్ నుంచి 154 వాహనాలు (అందులో వందకు పైగా జిల్లాకు) ట్రాన్స్ఫర్ అయినా ఆర్టీఏ అధికారులు పసిగట్టలేదు. నకిలీ పోలీసు క్లియరెన్స్‌ల ద్వారా ఇతరులకు విక్రయించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్టీఏ అధికారుల పాత్ర కూడా లేకపోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో మరిన్ని అరెస్ట్‌లుంటాయని సమాచారం. దీంతో నకిలీ రిజిస్ట్రేషన్ వాహనాల కుంభకోణంలో పాత్ర ఉందని భావిస్తున్న వారిందరిలోనూ ఆందోళన ప్రారంభమైంది. -
ఫోర్జరీలు 'జేసి'.. కటకటాల్లోకి..!
అధికారాన్ని అడ్డం పెట్టుకొని దౌర్జన్యకాండ సాగించిన జేసీ సోదరుల పాపం పండుతోంది. 40 ఏళ్ల క్రితం ఒక్క బస్సుతో మొదలైన ప్రస్థానం.. అక్రమాలతో కోట్లాది రూపాయల మాఫియా సామ్రాజ్యంగా విస్తరించింది. తాజాగా బీఎస్–3 లారీలను బీఎస్–4గా మార్చి ఎంతో మందిని ముంచిన ఘటన వెలుగులోకి రాగా.. ఏకంగా పోలీసుల సంతకాలనే ఫోర్జరీ చేసిన ఘటన కటకటాల్లోకి నెట్టింది. సాక్షి, అనంతపురం : ఏ బస్సులను అడ్డం పెట్టుకొని ఇంత కాలం అక్రమాలకు పాల్పడ్డారో, అదే బస్సుల కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి జైలు పాలయ్యారు. ఒక పర్మిట్‌తో రెండు మూడు బస్సులు తిప్పడం, ఆర్టీసీని నష్టాలపాలు చేస్తూ అనుమతిలేని రూట్లలోనూ బస్సులు తిప్పిన ఘటనలు కోకొల్లలు. ఇదే సమయంలో అనుభవం లేని డ్రైవర్ల కారణంగా దివాకర్ ట్రావెల్స్ బస్సులు ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నాయి. తాజాగా బస్సుల విక్రయం కేసులో ఏకంగా పోలీసులనే బురిడీ కొట్టించిన ఘటన జేసీ సోదరుల మూలాలను కదిలిస్తోంది. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సుల(ఏపీ02టీసీ9666, టీఎస్09యుబీ7034) విక్రయానికి సంబంధించి పోలీసు సంతకాలను ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ స్టాంపులతో రవాణా శాఖకు ఎన్ఓసీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. అనంతరం వీటిని తెలంగాణలో విక్రయించారు. అయితే, తమకు దరఖాస్తు చేసింది ఫోర్జరీ డాక్యుమెంట్లు అని గుర్తించిన రవాణాశాఖ అధికారులు అనంతపురం 1వ పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఆరుగురిపై క్రైం నెంబర్ 28/2020.. 420, 467, 468, 471, 472, 120 బీ, 201 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో శనివారం ఉదయం అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు రెండు బృందాలుగా హైదరాబాద్‌కు వెళ్లి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిలను అరెస్టు చేశారు. మరికొన్ని కేసుల్లో తదుపరి విచారణ నిమిత్తం వన్‌టౌన్ పోలీసులు నేడో రేపో పీటీ వారెంట్ వేయనున్నట్లు తెలిసింది. చదవండి: జేసీ ప్రభాకర్‌రెడ్డికి రిమాండ్..హైడ్రామా! మొత్తం 25 కేసులు జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల పేరు మీద జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, సి.గోపాల్‌రెడ్డి అండ్ కో కంపెనీలు నిర్వహిస్తున్నారు. జఠాధర ఇండస్ట్రీస్‌కు జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య జేసీ ఉమారెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి డైరెక్టర్లు. అదేవిధంగా సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీకి జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య జేసీ ఉమారెడ్డి, చవ్వా గోపాల్ రెడ్డితో పాటు మరికొందరు డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ కంపెనీలను అడ్డం పెట్టుకుని దివాకర్ ట్రావెల్స్ భారీ అక్రమాలకు పాల్పడడంతో డీటీసీ ఫిర్యాదు మేరకు పోలీసులు 25 కేసులు నమోదు చేశారు. ఇందులో తాడిపత్రిలోనే 17 కేసులు ఉండగా.. అనంతపురం వన్‌టౌన్‌లో 8 కేసులు ఉన్నాయి. తుక్కు లారీలతోనూ మోసం బీఎస్–3 శ్రేణి వాహనాలను 2017 మార్చి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో విక్రయాలు, రిజిస్ట్రేషన్లు చేయరాదని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉండడంతో అప్పటి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి నాగాలాండ్ రాష్ట్రానికి వెళ్లి ఒకేసారి 154 వాహనాలను జఠాధర కంపెనీ పేరుతో జేసీ ఉమారెడ్డి పేరు మీద, సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీతో సి.గోపాల్‌రెడ్డి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత బీఎస్–3 శ్రేణి వాహనాలను బీఎస్–4 వాహనాలు రిజి్రస్టేషన్ చేయించి తీవ్రమైన నేరానికి పాల్పడ్డారు. వీటిలో 101 వాహనాలు ఆంధ్రపదేశ్‌లో, 33 కర్ణాటకలో, 15 తెలంగాణలో, 3 నాగాలాండ్‌లో, ఒక్కొక్కటి చొప్పున తమిళనాడు, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో ఉన్నట్లు గుర్తించారు. నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆయాప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయించారు. మనరాష్ట్రంలో 79 వాహనాలు అనంతపురం జిల్లాకు, 8 వాహనాలు నెల్లూరు జిల్లాకు, 5 వాహనాలు చిత్తూరు జిల్లాకు, 3 కడప జిల్లాకు, 2 గుంటూరు జిల్లాకు ట్రాన్స్ఫర్ అయ్యాయి. మరికొన్నింటిని గుర్తించాల్సి ఉంది. జిల్లాలో ఉన్న వాహనాల్లో ఇప్పటి వరకూ 53 వాహనాలను సీజ్ చేశారు. చదవండి: జేసీ దివాకర్‌రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి టీడీపీ నాయకుల ఓవరాక్షన్ వన్‌టౌన్ పోలీసు స్టేషన్ ఎదుట టీడీపీ చోటా నాయకులు ఓవరాక్షన్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలంటూ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టగా పోలీసులు టూటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. మధ్యాహ్నం టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, ఆ పార్టీ నాయకులు బండారు శ్రావణి, బి.వెంకట్రాముడు, ఉమామహేశ్వర నాయుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని కలిసేందుకు స్టేషన్‌కు వచ్చారు. కానీ పోలీసులు వారిని లోపలికి అనుమతించలేదు. చివరకు జేసీ పవన్‌కుమార్ రెడ్డి స్టేషన్ నుంచి బయటకు వచ్చి వారితో మాట్లాడి వెళ్లిపోయారు. కేసులో నిందితులు ఏ1 – జేసీ ఉమారెడ్డి ఏ2 – జేసీ ప్రభాకర్ రెడ్డి ఏ3 – నాగేంద్ర ఏ4 – బాబయ్య ఏ5 – జేసీ విజయ (జేసీ దివాకర్ రెడ్డి సతీమణి) ఏ6 – జేసీ అస్మిత్ రెడ్డి (వీరిలో ఇది వరకే నాగేంద్ర, బాబయ్యను అరెస్టు చేయగా.. ప్రస్తుతం జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ) అరెస్ట్ పర్వం ఇలా.. ఉదయం 5.30 : జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను హైదరాబాద్ నుంచి అనంతపురానికి తరలింపు 11.07 : అనంతపురం వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు తండ్రీకుమారులు మధ్యాహ్నం 2.43 : వైద్య చికిత్సల నిమిత్తం సర్వజనాసుపత్రికి.. 3.09 : తిరిగి వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు.. 5.20 : జడ్జి ఎదుట హాజరు 5.45 : రెడ్డిపల్లి సబ్‌జైలుకు తరలింపు 6.02 : రెడ్డిపల్లి సబ్‌జైలులోకి.. రాత్రి 7.05 : సబ్‌జైలులో ఇటీవల కరోనా కేసు నిర్ధారణ నేపథ్యంలో తిరిగి అనంతపురం వన్‌టౌన్ స్టేషన్‌కు తరలింపు -
జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్
-
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్
అనంతపురం: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయనతో పాటు కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం వీరిని హైదరాబాద్ నుంచి అనంతపురానికి తరలిస్తున్నారు. బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాల కొనుగోలుకు సంబంధించి సుమారు మూడు గంటల పాటు విచారణ చేపట్టారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ వ్యవహారంపై కూపీ లాగగా నకిలీ పత్రాలు సృష్టించి ఇప్పటివరకు 154 వాహనాలు నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు. వాటికి సంబంధించిన ఫేక్ ఎన్ఓసీ, ఫేక్ ఇన్సూరెన్స్‌ల కేసుల్లో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జేసీ ట్రావెల్స్‌పై 24 కేసులు నమోదయ్యాయి. కాగా.. అనంతపురం, తాడిపత్రి పోలీసు స్టేషన్లలో జేసీ ట్రావెల్స్‌పై ఇప్పటిదాకా 27 కేసులు నమోదయ్యాయి. చదవండి: జేసీ బ్రదర్స్ చాతుర్యం: స్క్రాప్‌లోనూ స్కాం -
తాడిపత్రిలో ‘జేసీ’కి వ్యతిరేక పవనాలు..
సాక్షి, తాడిపత్రి : తాడిపత్రినియోజకవర్గం.. అనంతపురం జిల్లాలోని ఈ సిగ్మెంట్లో జేసీ కుటుంబీకులదే హవా..జేసీ కుటుంబసభ్యులే ఏడుసార్లు ఇక్కడినుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి మాత్రం తాడిపత్రి ఓటర్లు జేసీ కుటుంబానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వనున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ దివాకర్‌రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో దివాకర్‌రెడ్డి సోదరుడు ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. దివాకర్‌రెడ్డి అనంతపురం ఎంపీగా గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ ప్రత్యక్షరాజకీయాల నుంచి విశ్రమించారు. వారి వారసులను బరిలోకి దించారు. తాడిపత్రి నుంచి ప్రభాకర్‌రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా, జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నుండి తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటీచేస్తున్నారు. జేసీ బ్రదర్స్‌కు వ్యతిరేకంగా.. స్థానికంగా జేసీ దివాకర్ రెడ్డి ఎదురులేని నాయకుడిగా ఎదిగారు. అయితే ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తాడిపత్రిలో అరాచకం ఎక్కువైంది. ‘లగాన్’ బ్యాచ్ పేరుతో ఒక బృందం జేసీ కనుసన్నల్లో గ్రానైట్ పరిశ్రమను పీల్చిపిప్పి చేసింది. గెర్డావ్ పరిశ్రమలో కూడా ఉద్యోగాలు, వాహనాలు, ఇతరత్రా వ్యవహారాలన్నీ జేసీ కనుసన్నల్లో సాగుతున్నాయి. చివరకు మునిసిపల్ కాంప్లెక్స్‌లు కూడా జేసీ చెప్పిన వారికే అధికారులు కేటాయిస్తున్నారు. ఇన్నేళ్లుగా వారికి ఎదురు చెప్పలేకపోయిన తాడిపత్రి వాసులు ఇప్పుడు గళం విప్పుతున్నారు. తాడిపత్రిలో పాత టీడీపీ ఖాళీ! జేసీ బ్రదర్స్ సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరినప్పుడు వారితో కేడర్ టీడీపీలోకి రాలేదు. కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు మొత్తం వైఎస్సార్సీపీలో చేరారు. అప్పటి వరకూ జేసీపై పోటీ చేస్తూ వచ్చిన పేరం నాగిరెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గుత్తా వెంకటనాయుడు, జగదీశ్వరరెడ్డి, కాకర్ల రంగనాథ్, ఫయాజ్, జయచంద్రారెడ్డి, జేసీ చిత్తరంజన్‌రెడ్డి తదితరలు జేసీకి అండగా నిలిచి టీడీపీని గెలిపించారు. ఆ తర్వాత వారిని జేసీ బ్రదర్స్ దూరం పెట్టారు. ఇది తట్టుకోలేక వారంతా జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఇది జేసీ బ్రదర్స్‌కు కోలుకోలేని దెబ్బ. ఇక అన్ని రకాలుగా అండగా ఉన్న భోగాతి నారాయణరెడ్డి కుటుంబం కూడా జేసీ బ్రదర్స్‌ను వీడి వైఎస్సార్సీపీలో చేరింది. ఇలా అందరూ వెళ్లిపోవడంతో బ్రదర్స్, వారి వారసులు మినహా చెప్పుకోదగ్గ ద్వితీయ శ్రేణి నేతలు ఒక్కరూ కూడా జేసీతో ప్రస్తుతం లేరు. అస్మిత్‌కు అంతా వ్యతిరేకం.. రాజకీయ ఆరంగేట్రం చేస్తున్న జేసీ అస్మిత్‌రెడ్డి, బలమైన పెద్దారెడ్డిని ఢీకొట్టబోతున్నారు. ప్రస్తుత పరిస్థితులు జేసీ బ్రదర్స్‌కు అనుకూలంగా లేవు. అందరిపై నోరు పారేసుకోవడం, తాడిపత్రి తమ సొత్తు అనేలా ప్రవర్తిస్తుండటతో జేసీ బ్రదర్స్ అంటే తాడిపత్రి ప్రజలకు మింగుడుపడని పరిస్థితి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అస్మిత్‌రెడ్డి నెగ్గుకురావడం కష్టమే అనే చర్చ సాగుతోంది. ఆత్మవిశ్వాసంతో పెద్దారెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో వైఎస్సార్సీపీ బాధ్యతలు తీసుకున్న తర్వాత జేసీ బ్రదర్స్‌ను గట్టిగా నిలువరించారు. దీంతో భారీగా పార్టీలో చేరారు. పెద్దారెడ్డి నాయకత్వంలో వైఎస్సార్సీపీ శ్రేణులు కదనోత్సాహంతో ఉన్నాయి. తాను గెలిస్తే తాడిపత్రికి వాక్స్వాతంత్య్రం తీసుకొస్తానని పెద్దారెడ్డి చెబుతూ ప్రజలను ఆకర్షిస్తోంది. మొత్తం ఓటర్లు: 2,20,678 పురుషులు : 1,10,923 మహిళలు : 1,09,745 – మొగిలి రవివర్మ, సాక్షిప్రతినిధి, అనంతపురం -
జేసీ పవన్, అస్మిత్‌రెడ్డిలపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు
అనంతపురం: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి జేసీ దివాకరరెడ్డి తనయుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి, తాడిపత్రి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డిలపై తాడిపత్రి మేజిస్ట్రేట్ కోర్టు గురువారం నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. 2009 ఏప్రిల్ 24న తెలుగుదేశం పార్టీకి చెందిన కందిగోపుల మురళి ఇంటిపై దాడి చేసి వస్తువుల్ని దహనం చేశారని తాడిపత్రి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. జేసీ ప్రభాకర్‌రెడ్డి సహా 14 మందితో పాటా పవన్‌కుమార్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలు కూడా నిందితులు. అదే సమయంలో నమోదైన మరో కేసు లోనూ వీరిద్దరి పేర్లను తొలుత చేర్చి తరువాత తొలగించారు. ఈ విధంగానే ఇంటిపై దాడి కేసులోనూ పేర్లు తొలగించాలని వారు హోం మంత్రికి అర్జీ పెట్టుకున్నారు. మేజిస్ట్రేట్ కోర్డు విచారణ నివేదిక ఆధారంగా వారి పేర్లను తొలగించారు. దీన్ని సవాల్ చేస్తూ బాధితులు గుత్తి సెషన్స్ కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. గుత్తి సెషన్స్ కోర్టు నిందితుల పేర్లు తొలగించరాదని తీర్పు వచ్చింది. దీనిపై నిందితులిద్దరూ హైకోర్టును ఆశ్రయించి 2013లో స్టే తెచ్చుకున్నారు. 2014 ఏప్రిల్ 4న స్టే తొలగించడంతో సెషన్స్ కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరినీ తిరిగి గురువారం నిందితుల జాబితాలో చేర్చి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు జేసీ పవన్, అస్మిత్‌లను అరెస్ట్ చేయడానికి వారి ఇంటి వద్దకు వెళ్లగా, వారు అప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. -
కౌన్సిలర్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి నామినేషన్
తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని పేర్కొన్న మున్సిపల్ మాజీ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అనూహ్యంగా సోమవారం తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలోని 18, 34 వార్డులకు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజు చివరి నిమిషంలో తన అనుచరులతో వచ్చి టీడీపీ తరపున నామినేషన్లు వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ వార్డుల్లో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా బెదిరించేందుకే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఈ ఎత్తు వేశారనే చర్చ జరుగుతోంది. ఈ రెండు వార్డుల్లో ఏదో ఒక వార్డు నుంచి ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి లేదా కుటుంబ సభ్యుల్లో ఒకరిని పోటీ చేయించనున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిపించి.. జేసీ తన నామినేషన్లు ఉపసంహరించుకుంటారని సమాచారం. తొలి రోజు 11 నామినేషన్లు అనంతపురం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోసం సోమవారం 11 నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక కార్పొరేషన్, 11 మునిసిపాలిటీల పరిధిలోని 373 వార్డులు ఉన్నాయి. మొదటి రోజున సోమవారం అనంతపురం కార్పొరేషన్, ఐదు మునిసిపాలిటీల్లో 11 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో వైఎస్ఆర్సీపీ తరఫున నాలుగు, టీడీపీ తరఫున 7 నామినేషన్లు వచ్చాయి.