
సాక్షి, అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి క్షమాపణల విషయంపై అనంతపురం జిల్లా తాడిపత్రి సర్కిల్ ఇన్స్‌పెక్టర్ స్పందించారు. మంగళవారం తాడిపత్రిలో జరిగిన ఘటనలో తన తప్పేమీ లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్నే తాను జిల్లా ఎస్పీకి కూడా వ్యక్తిగతంగా కలిసి వివరించానని సి.ఐ. క్ష్మీకాంత్ రెడ్డి బుధవారం తెలిపారు. ఎస్పీ జగదీష్‌ను కలిసిన తరువాత సి.ఐ. విలేకరులతో మాట్లాడుతూ మంగళవారం నాటి ఘటన వివరాలను తెలిపారు. ‘తాడిపత్రి ఘటనలో నా తప్పు ఏమీ లేదు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌తో నేను దురుసుగా ప్రవర్తించలేదు. ఎస్సీ, ఎస్టీ కేసు నా పరిధిలోని అంశం కాదు. డీఎస్పీ విచారణ చేస్తారని ఆయనతో చెప్పాను. నేను తాడిపత్రిలో 14 నెలల నుంచి పనిచేస్తున్నాను. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నాపై ఎలాంటి చర్యలు తీసుకున్నా నాకు ఓకే’ అని కామెంట్స్ చేశారు.
తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీకి ఇదేం రాక్షసానందం?
సీఐ లక్ష్మీకాంత రెడ్డితో క్షమాపణలు చెప్పించుకున్న @JaiTDP ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి
అధికారమదంతో పోలీసుల మనోభావాల్ని దెబ్బతీస్తూ అందరి ముందు సీఐ నుంచి క్షమాపణలు చెప్పించుకున్న జేసీ అస్మిత్ రెడ్డి pic.twitter.com/UNSgk2TEMt— YSR Congress Party (@YSRCParty) August 27, 2024
