సాక్షి, అనంతపురం: కూటమి సర్కార్ పాలనలో లిక్కర్ మాఫియా హవా కొనసాగుతోంది. పలుచోట్ల కూటమి నేతలకు మద్యం షాపులు దక్కకపోవడంతో కమీషన్ల కోసం టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ఈ కారణంగా తాడిపత్రిలో నేటికీ నాలుగు మద్యం షాపులు ప్రారంభం కాలేదు.
వివరాల ప్రకారం.. తాడిపత్రి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై మద్యం వ్యాపారులు ఫిర్యాదు చేశారు. అయితే, తాడిపత్రిలో నాలుగు మద్యం షాపులను విజయవాడకు చెందిన వ్యాపారులు గోపీనాథ్, గురునాథం దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో తన అనుమతి లేనిదే మద్యం షాపులు ప్రారంభించవద్దని జేసీ ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు. వ్యాపారులను బెదిరించే ప్రయత్నం చేశారు.
దీంతో, నాలుగు మద్యం షాపులు దక్కించుకున్నప్పటికీ తాడిపత్రిలో మాత్రం అవి ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో విజయవాడ మద్యం వ్యాపారులు గోపీనాథ్, గురునాథం.. తమకు భద్రత కల్పించాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, తాడిపత్రిలో మద్యం షాపులు తమ వారికి దక్కకపోవడంతో టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. తమకు 15 శాతం కమీషన్ ఇచ్చాకే మద్యం షాపులు నిర్వహించాలని వార్నింగ్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment