liquor business
-
ప్రీమియం వైన్ స్టోర్స్ కాన్సెప్ట్ తో కూటమి కొత్త దందా
-
కూటమి నేతల కమీషన్ దందా.. జేసీ ప్రభాకర్‌పై ఫిర్యాదు!
సాక్షి, అనంతపురం: కూటమి సర్కార్ పాలనలో లిక్కర్ మాఫియా హవా కొనసాగుతోంది. పలుచోట్ల కూటమి నేతలకు మద్యం షాపులు దక్కకపోవడంతో కమీషన్ల కోసం టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ఈ కారణంగా తాడిపత్రిలో నేటికీ నాలుగు మద్యం షాపులు ప్రారంభం కాలేదు.వివరాల ప్రకారం.. తాడిపత్రి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై మద్యం వ్యాపారులు ఫిర్యాదు చేశారు. అయితే, తాడిపత్రిలో నాలుగు మద్యం షాపులను విజయవాడకు చెందిన వ్యాపారులు గోపీనాథ్, గురునాథం దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో తన అనుమతి లేనిదే మద్యం షాపులు ప్రారంభించవద్దని జేసీ ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు. వ్యాపారులను బెదిరించే ప్రయత్నం చేశారు.దీంతో, నాలుగు మద్యం షాపులు దక్కించుకున్నప్పటికీ తాడిపత్రిలో మాత్రం అవి ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో విజయవాడ మద్యం వ్యాపారులు గోపీనాథ్, గురునాథం.. తమకు భద్రత కల్పించాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, తాడిపత్రిలో మద్యం షాపులు తమ వారికి దక్కకపోవడంతో టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. తమకు 15 శాతం కమీషన్ ఇచ్చాకే మద్యం షాపులు నిర్వహించాలని వార్నింగ్ ఇచ్చారు. -
ఆయిల్ ట్యాంకర్లో బీర్ బాటిళ్లా?! ఎంతకు తెగించారు రా? వైరల్ వీడియో
బీహార్‌లో ఓ ఆయిల్ ట్యాంకర్లో మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యవహారం తెలుగులోకి వచ్చింది.దీంతో పోలీసులు వల పన్నడంతో డ్రైవర్ ,మద్యం వ్యాపారి ట్యాంకర్‌ను జాతీయ రహదారిపై వదిలి అక్కడి నుంచి ఉడాయించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.పోలీసు అధికారులు అందించిన సమాచారం ప్రకారం హిందుస్థాన్ పెట్రోలియం ట్యాంకర్లో సుమారు 200 బీరు డబ్బాలను తరలించేందుకు ప్రయత్నించారు స్మగర్లు. అయితే దీనికు ఎక్సైజ్ శాఖకు పక్కా సమాచారం అందిండంతో స్మగ్లర్లను పట్టుకునేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని గమించిన స్మగ్లర్లు ట్యాంకర్‌ను జాతీయ రహదారి వైపు మళ్లించడాన్ని గమనించిన అధికారులు రోడ్డు దిగ్బంధనం చేశారు. దీంతో డ్రైవర్, మద్యం వ్యాపారి అక్కడినుంచి పలాయనం చిత్తగించారు. నాగాలాండ్‌లో రిజిస్టర్ అయిన ట్యాంకర్‌ను ముజఫర్‌పూర్‌లో స్వాధీనం చేసుకున్నామని అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ విజయ్ శేఖర్ దూబే తెలిపారు. అలాగే పట్టుబడిన మద్యం అరుణాచల్ ప్రదేశ్‌లో తయారైందని వెల్లడించారు. మద్యం అక్రమ రవాణా చేసిన స్థానిక వ్యాపారిని గుర్తించి, అతడిని అరెస్టు చేసేందుకు దాడులు నిర్వహిస్తున్నామని, అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.కాగా బీహార్‌లో మద్యం అమ్మకం నిషేధం అమల్లో ఉంది. దీంతో మద్యం, అక్రమ రవాణాకు, విక్రయాలకు వ్యాపారులు వినూత్న మార్గాలను ఆశ్రయిస్తున్నారు. కొన్నిసార్లు అంబులెన్స్‌లు, ట్రక్కులలో తరలించిన వైనాన్ని చూశాం. అంతేకాదే మద్యం బాటిళ్లను నిల్వ చేసేందుకు పెట్రోల్ ట్యాంకుల లోపల కంపార్ట్మెంట్లు నిర్మించుకున్న సందర్భాలూ ఉన్నాయి. మరోవైపు కల్తీ మద్యం బారిని పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ये बिहार है बाबू! मुजफ्फरपुर में तेल टैंकर से पेट्रोल की बजाय निकलने लगी अवैध शराब#Bihar pic.twitter.com/gE0GJP4afl— Mangal Yadav (@MangalyYadav) October 23, 2024 -
రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందబ్బా.. చంద్రబాబును ఇమిటేట్ చేసిన జగన్
-
ధర్మవరంలో రెచ్చిపోయిన కూటమి మద్యం మాఫియా
-
తాడేపల్లిలో మద్యం షాపును అడ్డుకున్న మహిళలు
-
లిక్కర్ పాలసీ గొప్పదే అయితే.. బెదిరింపులు ఎందుకు ?
-
లిక్కర్ మాఫియాకు సూత్రధారి.. పాత్రధారి నువ్వు కాదా ?
-
అన్ని దుకాణాలు మావే!
-
బాలకృష్ణ ఇలాకాలో మద్యం షాపు దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్
-
కూటమి నేతల బెదిరింపులు
-
టెండర్ గెలిస్తే.. కమీషన్ లేదా కరెన్సీ టీడీపీ బెదిరింపులు
-
కూటమి నేతల బెదిరింపులు
-
కిడ్నపులు, బెదిరింపులతో టీడీపీ నేతలు మద్యం షాపుల దందా
-
టీడీపీ లిక్కర్ మాఫియా దెబ్బకు ప్రభుత్వానికి 2000 కోట్లు నష్టం
-
అక్రమాల టై‘టానిక్’
సాక్షి, హైదరాబాద్: ఎలైట్ పేరుతో మద్యం వ్యాపా రంలోకి ప్రవేశించిన టానిక్ గ్రూపు ఏకంగా రాష్ట్రంలోని లిక్కర్ దందాను కబ్జా చేసేందుకు శతవిధాలా ప్రయత్నించింది. రెండు షాపులు పెడతామని, విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్ముతామని నమ్మబలికి ఎంట్రీ ఇచ్చిన ఆ సంస్థ ఆ తర్వాత ఇష్టారాజ్యంగా చెలరేగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే ప్రణాళికల్లో భాగంగా ఏకంగా గొలుసు వ్యాపారానికి (చైన్ బిజినెస్) సిద్ధమైంది. నాటి ప్రభుత్వంలోని ఒకరిద్దరు కీలక వ్యక్తుల (ఒక మాజీ ప్రజా ప్రతినిధి, ఒక మాజీ ఉన్నతాధికారి) సాన్నిహిత్యం, సంపూర్ణ సహకారంతో నిబంధనలను తన కనుసన్నల్లో రూపొందించుకుని, తనకు మాత్రమే సాధ్యమయ్యేలా రూల్స్ పెట్టి ఇంకెవరూ ఎలైట్ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు వీలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్న టానిక్ సంస్థ గత ఆరేళ్లుగా అనేక అక్రమాలకు పాల్పడిందని తెలుస్తోంది. ఖాళీగా ఉన్నాయంటూ ‘టెండర్’ ఎక్సైజ్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.... రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీలో భాగంగా 2016–18 సంవత్సరాల్లో లాటరీ పద్ధతిన 2,216 ఏ4 షాపులకు లైసెన్సులిచ్చే ప్రక్రియను తనకు అనుకూలంగా మార్చుకుంటూ టానిక్ గ్రూపు రంగంలోకి దిగింది. అప్పట్లో జీహెచ్ఎంసీ పరిధిలోని 70 వరకు షాపులను తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడాన్ని ఆసరాగా చేసుకుని నాటి ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించింది. అప్పట్లో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ ఎంపీ అండ తీసుకుని ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తామంటూ లిక్కర్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఎలైట్ స్టోర్ పేరుతో కేవలం విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్ముకునేందుకు వీలుగా తమకు మాత్రమే సాధ్యమయ్యేలా నిబంధనలను రూపొందించేలా మరీ అడుగుపెట్టింది. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఉన్నతాధికారే ఎక్సైజ్ శాఖ అధిపతిగా ఉండడం, టీఎస్బీసీఎల్కూ ఆయనే బాస్ కావడంతో ఆయన్ని మచ్చిక చేసుకుని ఎలైట్ స్టోర్ ఏర్పాటు కోసం ప్రత్యేక జీవోను వచ్చేలా చేసింది. కనీసం ఎక్సైజ్ శాఖకు సమాచారం లేకుండానే ఆ జీవో ముసాయిదాను బయట తయారుచేయించి ఆ ముసాయిదాతోనే ఫైల్ నడిపించిందని ఎక్సైజ్ అధికారులు చెపుతున్నారంటే టానిక్ సంస్థ ముందస్తు వ్యూహం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఎలైట్ షాపు ఏర్పాటు చేసేందుకు గాను ప్లింత్ ఏరియా 10వేల చదరపు అడుగులు ఉండాలనీ, సదరు షాపును సూపర్మార్కెట్లు, మాల్స్‌లో ఏర్పాటు చేయాలంటే ఆయా మాల్స్ మొత్తం వైశాల్యం 25వేల చదరపు అడుగులు ఉండాలని, కనీసం 100 ఇంపోర్టెడ్ బాటిళ్లు ఎప్పుడూ డిస్ప్లే ఉండాలని... ఇలా తమకు మాత్రమే సాధ్యమయ్యే నిబంధనలను జీవోలో పెట్టించి ఇంకెవరూ ఈ ఎలైట్ షాపుల ఏర్పాటుకు ముందుకు వచ్చే వీలులేకుండా చూసుకుంది. 2016, అక్టోబర్ 26న వచ్చిన జీవోనెం:271 ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేయడం, వారం రోజుల్లో అనిత్‌రాజ్ లక్ష్మారెడ్డి పేరిట లైసెన్సు ఇవ్వడం కూడా పూర్తయిపోయాయి. చైన్ బిజినెస్ స్థాయికి ప్రణాళిక.. ముందుగా రెండు షాపులు ఏర్పాటు చేస్తామని దరఖాస్తు చేసుకున్న టానిక్ సంస్థ తొలుత ఒక్క దుకాణాన్ని మాత్రమే తెరిచింది. కొన్నిరోజుల పాటు విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్మిన తర్వాత ఇండియన్ ప్రీమియం లిక్కర్ కూడా అమ్ముతామంటూ ఎక్సైజ్ శాఖకు దరఖాస్తు చేసుకుంది. టానిక్ అడిగిందే తడవుగా ఎక్సై జ్ శాఖ అనుమతి కూడా ఇచ్చేసింది. దీంతో ఈ ఒక్క షాపు ద్వారానే ఊహించిన దాని కంటే ఎక్కువ ఆదాయం వస్తుండడం, ఎప్పుడో వస్తుందని ఊహించిన ఆదాయం తొలి ఏడాది నుంచే రావడంతో గొలుసు వ్యాపారం చేయాలనే ఆలోచన టానిక్ యాజమాన్యానికి తట్టింది. పుల్లారెడ్డి స్వీట్లు, ప్యారడైజ్ బిర్యానీ పాయింట్లు, నారాయణ, చైతన్య కళాశాలల తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలైట్ దుకాణాలు తెరుస్తామని ప్రతిపాదించింది. కానీ అప్పటికే ఏ4 షాపుల టెండర్లు పూర్తి కావడంతో సదరు షాపుల లైసెన్సీల నుంచి ప్రతికూలత వస్తుందని, న్యాయపరంగా అడ్డంకులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అభ్యంతరం చెప్పడంతో వెనక్కు తగ్గింది. క్యూ/టానిక్‌గా పేర్లుగా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్న ప్రణాళిక దెబ్బతినడంతో వైన్స్‌షాపుల వైపు టానిక్ దృష్టి మళ్లింది. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే లాటరీ పద్ధతిలో పాల్గొనేందుకు ప్రయత్నించింది. అడపాదడపా షాపులు వచ్చినా టెండర్ ఫీజు భారీగా కట్టాల్సి వస్తుండడంతో లైసెన్స్ పొందిన ఏ4 షాపులను మచ్చిక చేసుకునే పనిలో పడింది. శంషాబాద్, సరూర్‌నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల పరిధిలోనికి వచ్చే దాదాపు 10 షాపుల్లో భాగస్వామ్యం తీసుకుంది. తమ వాటా ఉన్న వైన్‌షాపులకు క్యూ/టానిక్‌గా పేర్లు మార్చుకుంది. అచ్చం మాతృ టానిక్ షాపులాగానే ఎలైట్గా వీటిని తయారు చేసి విదేశీ మద్యంతో పాటు ఇండియన్ ప్రీమియం లిక్కర్‌ను మాత్రమే విక్రయించేది. చీప్ లిక్కర్‌తో పాటు తక్కువ ధర ఉండే బ్రాండ్లు అమ్మేందుకు వైన్స్‌లకు అనుమతి ఉన్నప్పటికీ ఈ టానిక్ చైన్షాపుల్లో మాత్రం లభించేవి కావు. ఇలా భాగస్వామ్యం తీసుకునే ప్రక్రియలో, తనిఖీల విషయంలో తమకు సహకరించిన ఆరుగురు అధికారులకు అప్పటి ప్రభుత్వ పెద్దల సహకారంతో మంచి పోస్టింగులే కాదు... ఆమ్యామ్యాలను కూడా సమర్పించుకున్నట్టు తెలిసింది. ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తోన్న ఒకరి బంధువులు కూడా ఈ టానిక్ చైన్షాపుల్లో భాగస్వామిగా ఉన్నారని సమాచారం. ఏకంగా ఐదేళ్లకు లైసెన్సు... ఆ తర్వాత రెన్యువల్ సాధారణంగా తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఏ4 షాపులు (వైన్స్), వాకిన్ స్టోర్లకు రెండేళ్ల కాలపరిమితితో కూడిన లైసెన్సులిస్తారు. బార్లకు కూడా రెండేళ్లకే లైసెన్స్ ఇచ్చినా గడువు ముగిసిన తర్వాత వాటిని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, టానిక్ ఎలైట్ వాకిన్ స్టోర్‌కు ఏకంగా ఐదేళ్ల లైసెన్సు మంజూరు చేశారు. ఈ మేరకు జీవోలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అలా ఐదేళ్ల పాటు లైసెన్సు ఇవ్వడమే కాదు మళ్లీ ఆ లైసెన్సును రెన్యువల్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఇదే కాదు... రాష్ట్రంలోని అన్ని వైన్స్‌షాపులకు ఉన్న టర్నోవర్ ట్యాక్స్ (టీవోటీ)లోనూ ఈ ఎలైట్ షాపునకు మినహాయింపులిచ్చారు. మూడేళ్ల పాటు ఎంత వ్యాపారం చేసినా టీవోటీ వసూలు చేయవద్దన్న వెసులుబాటు కల్పించారు. ఈ నిబంధనతోనే రూ.వందల కోట్ల వ్యాపారాన్ని యథేచ్ఛగా టానిక్ చేసుకున్నా ఒక్క రూపాయి కూడా ఎక్సైజ్ శాఖకు అదనపు పన్ను చెల్లించే పనిలేకుండా పోయింది. ఇప్పుడు ఈ పన్నుల కోసమే జీఎస్టీ అధికారులు రంగంలోకి దిగారు. అనివార్యంగా ఎక్సైజ్ శాఖ కూడా నోటీసులు జారీ చేస్తూ గత తప్పిదాలను సవరించుకునే పనిలో పడింది. -
ఒడిశా ఐటీ దాడుల మొత్తం రూ.351 కోట్లు
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశా కేంద్రంగా మద్యం వ్యాపారం చేస్తున్న సంస్థకు సంబంధించిన ప్రాంతాల్లో ఆదాయ పన్ను(ఐటీ) అధికారులు చేసిన సోదాల్లో దొరికిన నగదు మొత్తం రూ.351 కోట్లకు చేరింది. దేశంలో ఒక దర్యాప్తు సంస్థ ఒకేసారి చేసిన సోదాల్లో ఇంతటి భారీస్థాయిలో కరెన్సీ బయటపడటం ఇదే తొలిసారి! బౌద్ధ్ డిస్టిల్లరీ ప్రైవేట్ లిమిటెడ్, దాని ప్రమోటర్లు, ఇతరులకు సంబంధించిన చోట్ల ఐటీ అధికారుల సోదాలు ఐదోరోజైన ఆదివారమూ కొనసాగాయి. మద్యం వ్యాపారం ద్వారా పొందిన దాంట్లో లెక్కల్లో చూపని ఆదాయం గుట్టుమట్లను ఐటీ శాఖ రట్టుచేస్తోంది. తనిఖీల్లో భాగంగా రాంచీలోని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ ప్రసాద్ సాహూ సంబంధిత ప్రాంతాల్లోనూ ఐటీ అధికారులు చెక్‌చేశారు. ఇక్కడ ఎంత మొత్తంలో నగదు, ఇతర పత్రాలు లభించాయనేది అధికారులు వెల్లడించలేదు. ‘ఈ అంశం ధీరజ్ సాహూ కుటుంబ విషయం. దాదాపు వందేళ్లకు పైగా వారి కుటుంబం ఉమ్మడి వ్యాపారం చేస్తోంది. అందులో సాహూకు చిన్న వాటా ఉంది. ఏదేమైనా ఆయనకు సంబంధించిన చోట్ల సోదాలు జరిగాయికాబట్టి ఆయన ఈ విషయంలో వివరణ ఇవ్వాల్సిందే. అందుకే ఆయన నుంచి వివరణ తీసుకున్నాం. కాంగ్రెస్ పారీ్టకి ఈ సోదాలకు సంబంధం లేదు’’ అని జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్చార్జ్ అవినాశ్ పాండే ఆదివారం స్పష్టంచేశారు. విపక్షాలపై అమిత్ విమర్శలు ఐటీ దాడులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ‘‘ దర్యాప్తు సంస్థలను కేంద్రం దురి్వనియోగం చేస్తుందని ఇన్నాళ్లూ విపక్షాలు ఎందుకు అన్నాయో ఇప్పుడు అర్థమవుతోంది. విపక్షాలు తమ అవినీతి, అక్రమ సొమ్ము వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే ఇన్నాళ్లూ విషప్రచారం చేశాయి. తీరా ఇప్పుడు కరెన్సీ కట్టలు బయటపడ్డాక కాంగ్రెస్, టీఎంసీ, జేడీయూ, డీఎంకే, ఆర్జేడీలు మౌనం వహిస్తున్నాయి’’ అమిత్ వ్యాఖ్యానించారు. -
అప్పుడెట్లనో.. ఇప్పుడట్లనే ఉండాలే..!
మంచిర్యాల: ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీల నాయకులు మద్యం పంపిణీపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. దీంతో మద్యం పంపిణీని కట్టడి చేసేందుకు ఎక్సైజ్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా పెంచారు. 2018 ఎన్నికల సమయంలో ప్రధానంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో మద్యం అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పడు కూడా అలాగే ఉండాలని వైన్స్ యజమానులకు ఎక్సైజ్ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మద్యం ఏరులై పారకుండా ఐఎంఎల్ డిపో నుంచి భారీ మద్యం కొనుగోలు చేయడానికి వీలు లేకుండా కట్టడి చేశారు. జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేట లిక్కర్ డిపో పరిధిలో 208 మద్యం దుకాణాలు, దాదాపు 45 వరకు బార్లు ఉన్నాయి. ఇప్పటికే వీటిపై నిఘా పెంచారు. పరిమితికి మించి మద్యం నిల్వలు ఉంచినా, మద్యం తరలింపు చేపట్టినా ఎక్సైజ్, పోలీస్ శాఖలు పట్టుకుని సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదు చేయనున్నారు. ఒక వ్యక్తికి పరిమితికి మించి మద్యం విక్రయించినా ఆ వైన్ దుకాణాలను సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. నిరంతరం నిఘా.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే మద్యం అమ్మకాలపై నిరంతరం నిఘా పెట్టాం. మద్యం అమ్మకాలు గతంలోని అమ్మకాలను పోల్చి చూస్తూ మద్యం విక్రయాలపై దృష్టి సారించాం. మద్యం నియంత్రణ చేపడుతూ ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా చర్యలు చేపడుతున్నాం. మద్యం దుకాణా దారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి. అక్రమ మద్యం రవాణా కట్టడికి రెండు చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశాం. అక్రమ మద్యం నిల్వలు, సరఫరా అరికట్టేలా మూడు తనిఖీ బృందాలు ప్రత్యేకంగా గస్తీ చేపడుతున్నాయి. – నరేందర్, సీఐ, ఎక్సైజ్ శాఖ, మంచిర్యాల -
ఎమ్మెల్సీ కవితపై వైఎస్ షర్మిల సెటైర్
సాక్షి, హైదరాబాద్: ‘బీ ది ఛేంజ్ యు వాంట్ టూ సీ’అంటూ 33% మహిళా రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవితకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సలహా ఇచ్చారు. నిజంగా కవితకు మహిళా రిజర్వేషన్లపై గౌరవం ఉంటే..రానున్న ఎన్నికల్లో 33% అమలు చేయించాలని మంగళశారం ఆమె ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సిట్టింగులకు ఇచ్చిన సీట్లలో 33 స్థానాలు మహిళా అభ్యర్థులకు అవకాశం ఇప్పించి కవిత తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. 33 శాతం రిజర్వేషన్లకు చిత్తశుద్ధితో పార్టీలు కలిసి రావాలని చిలక పలుకులు పలుకుతున్న కవితమ్మ.. ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు.. రాష్ట్రంలో సీట్లిచ్చే దమ్ముండాలన్నారు. 115 సీట్లలో 7 స్థానాలు ఇస్తే చిత్తశుద్ధి ఉన్నట్టా అని నిలదీశారు. తెలంగాణ జనాభాలో 50 శాతం మహిళలున్నా కేబినెట్లోనూ ప్రాధాన్యత దక్కలేదన్నారు. లిక్కర్, రియల్ ఎస్టేట్ బిజినెస్‌ల గురించి కాకుండా మీ నాన్నతో మాట్లాడి.. కేబినెట్లో, పెద్దల సభలో, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్ ఇప్పించాలంటూ సెటైర్ వేశారు. లిక్కర్ స్కాం పక్కదారి పట్టించేందుకు ఎత్తుకున్న నినాదమే 33 శాతం రిజర్వేషన్లు తప్ప.. మీకెక్కడిది మహిళల పట్ల చిత్తశుద్ధి అని మండిపడ్డారు. -
నా ముక్కు కాదు..కేసీఆర్ ముక్కునే నేలకు రాయిస్తా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/ జగిత్యాల టౌన్: ‘నేను నిరాధార ఆరోపణలు చేస్తున్నానని, నా ముక్కును నేలకు రాయాలని కవిత అంటోంది. నేను ముక్కు కాదు కదా.. కాలు కూడా నేలకు రాయను, కవిత తండ్రి కేసీఆర్ ముక్కునే గజ్వేల్‌లో నేలకు రాయిస్తాను’అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లపై నిర్వహించిన ధర్నాలో అర్వింద్ మాట్లాడుతూ, తెలంగాణకు పట్టిన దరిద్రం కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. పేదలకు నాలుగు లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని భారీగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం, అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం వివిధ బడ్జెట్లలో కలిపి రూ.30 వేల కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం చూపించినా ఇళ్లు మాత్రం కట్టించలేదని, ఈ విషయాన్ని రాష్ట్ర ఆడిట్ విభాగమే తేల్చిందన్నారు. ఇక్కడ నొక్కేసిన డబ్బులతోనే కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసిందని, ఐరన్‌లెగ్ కవితను నమ్ముకున్న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జైలుపాలయ్యారని అన్నారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర నిధులకు రాష్ట్ర ప్రభుత్వ వాటా జోడించి పేదలకోసం 8 లక్షల ఇళ్లు కట్టించగా, తెలంగాణలో మాత్రం ఈ ప్రభుత్వం కట్టించిన ఇళ్లు గుండుసున్నా అని అర్వింద్ వ్యాఖ్యానించారు. జీవన్‌రెడ్డి నాకు తండ్రిలాంటి వారు ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి తనకు తండ్రిలాంటి వారని, కానీ, ఆయన సేవలు అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ పని ఖతమైందని అర్వింద్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రం తహసీల్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో అరి్వంద్ మాట్లాడుతూ, పేద మహిళలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తానన్న హామీని కేసీఆర్ తుంగలో తొక్కారన్నారు. -
10 రోజుల్లో రూ.1,262 కోట్ల మద్యం..ఏకంగా 20 లక్షల లీటర్లు తాగేశారు
సాక్షి, శివాజీనగర: ఐటీ సిటీలో కొత్త సంవత్సర సంబరాల్లో మద్యం ఏరులై పారింది. కొత్త వేడుకల సమయంలో గత రెండేళ్లుగా కరోనా వల్ల మద్యం వ్యాపారం పూర్తిగా తగ్గుముఖమైంది. ఈసారి కోవిడ్ బెడద అంతగా లేకపోవడంతో మద్యం షాపులు కళకళలాడాయి. క్రిస్మస్ నుంచి నెలాఖరు వరకు వ్యాపారం ఊపందుకుంది. 20 లక్షల లీటర్ల మద్యం తాగేశారు డిసెంబర్ 31న సుమారు మూడు లక్షల లీటర్ల మద్యం, 2.41 లక్షల లీటర్ల బీర్ల అమ్మకాలు జరిగాయి. దీనిద్వారా ఎక్సైజ్ శాఖకు రూ.81 కోట్ల ఆదాయం వచ్చింది. డిసెంబర్ 21 నుంచి 31వ తేదీ వరకూ లెక్కిస్తే 20.66 లక్షల లీటర్ల మద్యం, 15.04 లీటర్ల బీర్లను తాగారు. తద్వారా రూ.1,262 కోట్ల వ్యాపారం జరిగితే, పన్ను రూపంలో ఎక్సైజ్ శాఖ రూ.651 కోట్లు ఆర్జించింది. గత కొన్నేళ్లతో పోలిస్తే ఇదే రికార్డు ఆదాయమని ఎక్సైజ్‌వర్గాలు తెలిపాయి. న్యూ ఇయర్‌కు చర్చి స్ట్రీట్‌లో పబ్‌లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. దీంతో మామూలు కంటే 50 శాతం ధరను పెంచారు. అయినా కూడా యువతీ యువకులతో పబ్‌లు కిటకిటలాడాయి. (చదవండి: స్నేహితురాలి ఇంటికే కన్నం..మహిళకు ఆరేళ్లు జైలు శిక్ష) -
ఒక్క మునుగోడులోనే 300 కోట్ల మద్యం అమ్మకాలు
-
పాఠశాలనే మద్యం గోదాం.. లిక్కర్ మాఫియా పనితో టీచర్స్ షాక్!
పాట్నా: మద్య నిషేధం అమలులో ఉన్న బిహార్ రాష్ట్రంలో లిక్కర్ మాఫియా కొత్త కొత్త ఎత్తుగడలతో రెచ్చిపోతోంది. విదేశీ మద్యం సీసాలను నిల్వ ఉంచేందుకు ఏకంగా గ్రామంలోని ఉన్నత పాఠశాలనే గోదాముగా మార్చింది. బిహార్ రాష్ట్ర వైశాలి జిల్లా లాల్గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బృందావన్ గ్రామ హైస్కూలులో ఈ సంఘటన జరిగింది. పాఠశాలలోని ఓ గదిలో ఏకంగా 140 కాటన్ల అక్రమ మద్యం లభించటం అధికారులు, స్థానికులతో పాటు నెజిటన్లను షాక్‌కు గురి చేస్తోంది. లిక్కర్ కాటన్లను కొందరు దుండగులు రాత్రి సమయంలో పాఠశాలలో దాచి పెట్టినట్లు ప్రధానోపాధ్యాయుడు పవన్ కుమార్ శుక్లా తెలిపారు. స్కూల్లోని ఓ గది తాళం పగలగొట్టి బాటిళ్లను అందులో పెట్టాక కొత్త తాళం వేశారని, బుధవారం ఉదయం పాఠశాలకు వచ్చిన టీచర్ ఆదేశ్పాల్ ఈ తాళాన్ని గమనించి, ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. లాల్గంజ్ పోలీసులు తాళం పగలగొట్టి చూడగా గదిలో 140 పెట్టెల మద్యం నిల్వ ఉంది. మద్యాన్ని పోలీస్‌స్టేషనుకు తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల గదిలో దాచిన మద్యం పెట్టెలు ఇదీ చదవండి: ఇదెక్కడి గొడవ.. కారు ఢీకొని గాల్లోకి ఎగిరిపడ్డా తగ్గేదేలే..! -
చంద్రన్న మార్కు మద్యం దందా: కాగ్ నివేదికలో వెల్లడి
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో మద్యం దందా ఇష్టారాజ్యంగా సాగిందని.. లెక్కలేనన్ని అక్రమాలు చోటుచేసుకున్నాయని ఇటీవల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక స్పష్టం చేసింది. ధరలు పెంచి మద్యం విక్రయాలు సాగించినా.. విడి అమ్మకాలు జరిపినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్పష్టం చేసింది. పైగా అలాంటి అక్రమాలను ప్రోత్సహించేలా వ్యవహరించిందని కాగ్ ఎత్తి చూపింది. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో ఎక్సైజ్ శాఖ పనితీరుకు సంబంధించి లోపాలను, అక్రమాలను కాగ్ వెల్లడించింది. లైసెన్సుదారులు అపరాధ రుసుం చెల్లించకపోయినా లైసెన్సులు రద్దు చేయలేనదని, చాలా కేసుల్లో పన్నులు, సుంకాలు వసూలు చేయకపోవడంతో రాష్ట్ర ఖజానాకు ఆదాయ నష్టం ఏర్పడిందని స్పష్టం చేసింది. మద్యం విక్రయాల్లో నేరాలకు పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలను తీసుకోకపోవడంతో వారు మళ్లీ నేరాలకు పాల్పడే అవకాశం కల్పించినట్టయిందని కాగ్ వ్యాఖ్యానించింది. కాగ్ వెల్లడించిన అక్రమాల్లో కొన్ని ఇలా.. మద్యం కోటా దస్త్రాలను పరిశీలించగా.. కమిటీ సిఫార్సు లేకుండానే 5 మద్యం ఉత్పత్తి కంపెనీలకు అదనపు మద్యం కోటాను మంజూరు చేశారు. ఇందులో 4 కంపెనీల నుంచి రుసుములు వసూలు చేయలేదు. బీవీఎస్ డిస్టిలరీస్, విశాఖ డిస్టిలరీస్, పీఎంకే డిస్టిలరీస్, శ్రావణి ఆల్కో బ్రూవరీస్ నుంచి రూ.22.40 కోట్ల రుసుములు వసూలు చేయలేదు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాబడి కోల్పోయింది. మద్యం ఉత్పత్తి కంపెనీలు అదనంగా సామర్థ్యం పెంచుకోవడానికి 2016 ఆగస్టు, సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అయితే అదనంగా మంజూరు చేసిన మద్యం కోటాను పరిగణనలోకి తీసుకోకుండా ఉన్న సామర్థ్యం ప్రకారమే రుసుములను వసూలు చేసింది. దీనివల్ల రుసుముల రూపేణా రూ.13.24 కోట్లు, వడ్డీ రూపేణా రూ.6.02 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం రాబడి కోల్పోయింది. 2014–15 నుంచి 2018–19 మధ్య కాలంలో 20,475 నేరాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల స్థితిగతులకు సంబంధించిన వివరాలను నేర చిట్టాల నివేదికలో పొందుపరచలేదు. -
అరే ఏంట్రా ఇది.. అలా తాగేస్తున్నారు!
సాక్షి,మహబూబ్‌నగర్ : మద్యం ప్రియులు తెగ తాగేస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఈనెలలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బ్రాండెండ్ లిక్కర్ అత్యధికంగా అమ్ముడైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పలు పార్టీల నేతలు ఓటర్లకు విలువైన మద్యం పంపిణీ చేయడం వల్ల ఉమ్మడి జిల్లాలో చాలా మద్యం దుకాణాల్లో విలువైన బ్రాండెడ్ లిక్కర్ కొరత ఏర్పడింది. మద్యం ప్రియులు ఎక్కువగా మూడు నాలుగు బ్రాండ్లు వాడడం వల్ల వాటి సరఫరా బాగా పెరిగింది. గత ఏడాది మార్చి నెలలో లిక్కర్ 1,39,890 కాటన్లు విక్రయించగా ఈ ఏడాది ఈనెల 1నుంచి 17వరకు 1,10,036కాటన్ల విక్రయాలు జరిగాయి. ఈ 17రోజులలో ఉమ్మడి జిల్లాలో రూ.89కోట్ల 99లక్షల మద్యం అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పొల్చితే ప్రస్తుతం 17 రోజుల్లో రెండింతల అమ్మకాలు పెరిగాయి. దీనికి తోడు జిల్లాలో వేసవితాపం మొదలైంది. ఎన్నడూలేనంత ఉష్ణోగ్రతలు ఈ ఏడాది నమోదవుతుండటంతో మద్యం ప్రియులు బీర్లవైపు మొగ్గు చూపుతున్నారు. లేనివిధంగా ఎండలు మండిపోవడంతో బీర్ల అమ్మకాలు బాగా పెరిగాయి. లిక్కర్‌కు పెరిగిన గిరాకీ గత ఏడాది కాలంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది చల్లని బీర్లు తాగడానికి ఇష్టపడటం లేదు. సాధారణంగా మార్చి నెలలో ఎండల వేడికి బీర్లు తాగడానికి ఆసక్తి చూపేవారు కానీ ప్రస్తుతం వైరస్ వల్ల కొంత వెనుకడుగు వేస్తున్నారు. దీంతో బీర్ల అమ్మకాలు కొంత తగ్గాయి. ఇక లిక్కర్‌కు అయితే ఉమ్మడి జిల్లాలో డిమాండ్ పెరిగింది. సహజంగా ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మద్యం విక్రయాలు తారస్థాయిలో జరుగుతుంటాయి. గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితి సంప్రదాయంగా వస్తుంది. దీనికి కారణం కూడా వేసవి నేపథ్యంలో బీర్లవైపు ఎక్కువగా ఆసక్తి చూపుతుండటమే కారణంగా అధికారులు చెబుతున్నారు. బీర్లకు అసలైన సీజన్ ఏప్రిల్, మే నెలలే. ఎండలను బట్టి జూన్, జూలైలో కూడా బీర్ల అమ్మకాలు తారాస్థాయిలోనే ఉంటున్నా ఏప్రిల్, మే నెలల సింహభాగంగా డిమాండ్ ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో మాత్రం ఈ నెలలో లిక్కర్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగిందని అధికారులు చెబుతున్నారు. 2020 ఏడాదిలో ఉమ్మడి జిల్లాలో అయిన మద్యం అమ్మకాలలో మెజార్టీ బీర్ల విక్రయాలే. ఈ నెల చివరి నాటికి గతేడాది లక్ష్యాన్ని దాటి అంచనాలను మించి రికార్డులు నెలకొల్పే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఎండలు మే చివరి నాటికి అధిగమించే అవకాశం ఉండటంతో బీర్ల అమ్మకాలు పెరగవచ్చు. లిక్కర్ అమ్మకాలు పెరిగాయి ఉమ్మడి జిల్లాలో లిక్కర్ సెల్స్ అధికంగా ఉన్నాయి. బీర్ల అమ్మకాలు మరింత పెరగాల్సిన అవసరం ఉంది. మద్యం కొరత ఏ మాత్రం లేదు. అన్ని రకాల బీర్లు, లిక్కర్ మద్యం దుకాణాలలో అందుబాటులో ఉంది. – విజయ్‌భాస్కర్, ఈఎస్, మహబూబ్‌నగర్ -
‘లాక్’తెంచుకున్న ‘కిక్కు’
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌తో అన్నీ బంద్ అయ్యాయి కానీ, ‘మందు దందా’మాత్రం ఆగలే దు. లాక్డౌన్ అమల్లోకి వచ్చిన 37 రోజుల తర్వా త కూడా మద్యం విచ్చలవిడిగా లభిస్తోంది. కాకపోతే కావాల్సిన బ్రాండ్ దక్కించుకోవడం కాస్త ‘ఖరీదైన’వ్యవహారమే.. ఆబ్కారీ అధికారులకు తెలిసి మరీ బ్లాక్మార్కెట్లో లభిస్తోన్న ఈ మ ద్యం కొనాలంటే జేబు ఫుల్లుండాలి. లాక్డౌన్ పు ణ్యం, వైన్‌షాప్ యజమానుల కక్కుర్తి, ఆబ్కారీ అధికారుల సహకారం వెరసి రాష్ట్రంలో మద్యం మేలిమి బంగారమంత ఖరీదైపోయింది. వైన్స్ నుంచి దొడ్డిదారిన తెచ్చి గుట్టుచప్పుడు కాకుండా అమ్మేస్తున్నారు. ఇందుకు ఎక్సైజ్ యంత్రాంగం కూడా సహకరిస్తుండటంతో వాడపల్లి నుంచి వాంకిడి వరకు, అచ్చంపేట నుంచి భద్రాచలం వరకు అన్ని పట్టణ ప్రాంతాల్లో మద్యం దొరకని చోటంటూ లేదు. విచ్చలవిడిగా సరుకు బయటకి.. వాస్తవానికి, రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించినప్పుడు వైన్ షాపులకు సీల్ వేయలేదు. లాక్డౌన్ గడువు తొలిసారి పెంచినప్పుడు ఆబ్కారీ శాఖ లిఖితపూర్వకంగా ఉత్తర్వులిచ్చింది కానీ అందులో షాపులు సీజ్ చేయాలని పేర్కొనలేదు. ఇదే అదనుగా వైన్స్ యజమానులు సరుకు అక్రమంగా బయటకు తీసుకువచ్చారనే ఆరోపణలు వచ్చాయి. పరిస్థితిని గమనించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెంటనే మద్యం దుకాణాలు సీజ్ చేయాలని ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలిచ్చారు. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ఆ తర్వాత కూడా కొన్నిచోట్ల మంత్రి ఆదేశాలు బేఖాతరు చేస్తూ వైన్‌షాపులకు సీల్ వేయలేదనే ఆరోపణలున్నాయి. వైన్స్ సిండికేట్లకు ఆబ్కారీ అధికారులు సహకరిస్తున్నారనేది బహిరంగ రహస్యమేనని వినిపిస్తోంది. ఎంతగా అంటే ఇటీవల హైదరాబాద్ శివారులోని ఓ దుకాణం నుంచి మద్యం తరలిస్తున్నారని తెలిసి కూడా చర్యలు తీసుకోలేదనే కారణంతో ఒక ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. మొక్కుబడిగా అక్కడక్కడా మద్యం పట్టుకున్నట్టు కొద్దోగొప్పో సరుకును ఎక్సైజ్ అధికారులు చూపిస్తున్నారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఈ మద్యం ఖమ్మం సరిహద్దు జిల్లాలైన తెలంగాణలోని సూర్యాపేట, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నుంచి వచ్చిందని చెబుతున్నారు. జిల్లాలు, రాష్ట్రాల మధ్య ఏర్పాటుచేసిన సరిహద్దు చెక్‌పోస్టుల నుంచి మనుషులు రావడమే గగనమైతే మద్యం ఎలా రాగలిగిందో చెక్‌పోస్టుల సిబ్బందికి, ఎక్సైజ్ అధికారులకే తెలియాలి. ఎవరి వాటా వారికే! రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచే మద్యం విక్రయాలు ఏదో రూపంలో సాగుతున్నాయి. ముందుగానే సరుకు తెచ్చుకున్న వైన్‌షాపుల యజమానులు దళారుల ద్వారా ఈ మద్యాన్ని కమీషన్లు ఇచ్చి అమ్మిస్తున్నారు. పనిలో పనిగా ఆబ్కారీ అధికారుల చేతులూ తడుపుతున్నారు. ఇదంతా బహిరంగ రహస్యమే అయినా చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అయితే, మద్యం అక్రమ అమ్మకాలు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని నగర, పట్టణ ప్రాంతాలు, మండల కేంద్రాల్లోనే జరుగుతున్నాయి. గ్రామాల్లోని బెల్టుషాపుల్లో సరుకు ఎప్పుడో ఖాళీ అయిపోయింది. కొన్నిచోట్ల పట్టణ ప్రాంతాల నుంచి గ్రామాలకు మందు తెచ్చినా రేట్లు ఎక్కువ ఉండడంతో ఎవరూ కొనడం లేదని తెలుస్తోంది. దీంతో చాలా వరకు పట్టణ ప్రాంతాల్లోనే ఈ వ్యాపారం మూడు క్వార్టర్లు, ఆరు ఫుల్లులుగా కొనసాగుతోంది. గ్రేటర్లో సర్వీస్ చార్జీ అదనం! గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బస్తీల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడి మద్యం ధరలతో పోలిస్తే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ధరలు తక్కువేనని చెప్పుకోవచ్చు. ఇక్కడ రాయల్ స్టాగ్ (రూ.4,600), ఐబీ (రూ.3,700), ఎంసీ డైట్ (రూ.3,700), బ్లెండర్స్ ప్రైడ్ (రూ.6,000), బ్లాక్ లేబుల్, వైట్ లేబుల్ (రూ.11,000), సిగ్నేచర్ (రూ.5,500), రాయల్ గ్రీన్ (రూ.4,600) చొప్పున అమ్ముతున్నారు. కొన్ని చోట్ల రూ.100–350 వరకు సర్వీస్ చార్జీ కూడా వసూలు చేస్తున్నారు. ఈ రేట్లకు అమ్మేందుకు యువకులు గ్రూపులుగా పనిచేస్తున్నారు. అమ్మిన తర్వాత పెట్టుబడిదారుడికి ఇవ్వాల్సింది పోను మిగిలిన డబ్బులతో ‘పార్టీ’చేసుకుంటున్నారు. కాగా, బీర్లు నిల్వ ఉండవు కనుక రాష్ట్రంలో ఎక్కడా ఇవి దొరకడం లేదు. ఎక్కడైనా ఉన్నా లైట్ బీర్ రూ.400–500కి అమ్ముతున్నారు. ఖమ్మం మార్కెట్లో పలుకుతున్న రేట్లకు, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో రేట్లకు కొంచెం తేడా ఉంది. బ్రాండ్, అవసరాన్ని బట్టి రూ.500 ఎక్కువ తక్కువకు అమ్ముతున్నారు. హైదరాబాద్‌లో అయితే.. కొనేవాళ్ల కెపాసిటీని బట్టి రేటు ఫిక్స్ చేసి అమ్ముతున్నారు. -
‘రాత్రయితే తాగుడే.. లేదంటే కుదరదే..!’
భోపాల్ : పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు పెంచేందుకు సీఎం కమల్‌నాథ్ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి గోపాల్ సింగ్ వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. మద్య నిషేదం చేసేందుకు తాను వ్యతిరేకమని.. మనిషికి నచ్చిన మద్యం సేవించేందుకు అడ్డుచెప్పొద్దని ఆయన పేర్కొన్నారు. ఒక మనిషి తనకు నచ్చిన ఆహారాన్ని తినేందుకు, నచ్చిన మద్యాన్ని తాగేందుకు స్వతంత్ర భారత్‌లో అన్ని హక్కులు కలిగి ఉన్నాడని మంత్రి సెలవిచ్చారు. ఎవరి బలవంతం మీదనో ప్రజలు మందు కొట్టరని.. అలాంటప్పుడు మందు తాగొద్దని ఎవరినీ కట్టడి చేయలేమని అన్నారు. ‘రాత్రి పూట ఒక పెగ్ వేయనిదే కుదరదు. రోజూరాత్రి ఒక్క గ్లాస్ మందు కూడా తాగకుంటే ఆ మరుసటి రోజంతా అదోలా ఉంటుంది. ఈ సంగతి నా మిత్రుడొకరు చెప్పారు’అని గోపాల్ సింగ్ తెలిపారు. శారీరకంగా, మానసికంగా తగిలిన గాయాల్ని మాన్పడానికి చాలామంది మద్యం సేవిస్తారని చెప్పారు. ఆరోగ్యంగా ఉండటానికి డాక్టర్ల సలహామేరకు రోజూ పెగ్గు వేయాల్సిందేనని ఎంతోమంది చెప్పినట్టు ఆయన వెల్లడించారు.కాగా, మద్యం దుకాణాలను పెంచాలనే ప్రభుత్వ నిర్ణయంపై మధ్యప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ మండిపడ్డారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి మద్యం అమ్మకాలను విచ్చలవిడి చేస్తే.. మధ్యప్రదేశ్ కాస్తా.. మదిర(మద్యం)ప్రదేశ్ అవుతుందని ఎద్దేవా చేశారు. -
మద్యాన్ని నిషేధించే వరకు పోరాటం: సీపీఐ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం విక్రయాలను ప్రభుత్వం అరికట్టాలని సీపీఐ ఆధ్వర్యంలో నాంపల్లి ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మద్యం విక్రయాలను ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై అత్యచారాలకు కారణం.. విచ్చలవిడిగా మద్యం దొరకడమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక మంది మహిళలు అపహరణకు గురైనా.. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతమంది బాలికలు కిడ్నాప్, అపహరణకు గురయ్యారో పోలీసులు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పల్లెల్లో కిరాణం కొట్టులు కూడా బెల్టు దుకాణాలుగా మారాయని విమర్శించారు. మద్యంతో మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే బెల్టు దుకాణాలు లేకుండా చూడాలని కోరారు. ఏపీ లాగా.. తెలంగాణలో కూడా మద్యపాన విక్రయాలు నియంత్రించాలని, మద్యాన్ని నిషేధించే వరకు సీపీఐ అధ్వర్యంలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇతర పార్టీలు, ప్రజా సంఘాలతో కలుపుకుని పోరాటం మరింత ఉధృతం చేస్తామని చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. -
మద్యం రాబడి ఫుల్లు..
సాక్షి, కొత్తగూడెం: ఆబ్కారీ శాఖ ఆదాయం మద్యం కిక్కుతో తడిసి ముద్దయింది. మద్యం దుకాణాల దరఖాస్తుల రూపంలో జిల్లాలో దండిగా ఆదాయం సమకూరింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు రావడంతో ఎక్సైజ్ శాఖ మరింత ఉత్సాహంగా ఉంది. 2017 సెప్టెంబర్‌లో మద్యం దుకాణాలకు దరఖాస్తుల రూపంలో రూ.22 కోట్ల ఆదాయం రాగా.. ప్రస్తుతం సరికొత్త మద్యం పాలసీ ద్వారా మరింత రాబడి వచ్చింది. గత సీజన్‌తో పోలిస్తే జిల్లాలో దాదాపు మూడు రెట్ల ఆదాయం అధికంగా రావడం విశేషం. దరఖాస్తు ఫీజు గత సీజన్లో రూ.లక్ష ఉన్నప్పుడు మొత్తం 2,204 దరఖాస్తులు రాగా, ప్రస్తుతం 3402 దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఎక్సైజ్ శాఖకు ఈ ఏడాది రూ.68.04 కోట్ల ఆదాయం సమకూరింది. దరఖాస్తు రుసుము రూ.2 లక్షలకు పెంచినా, ఊహించని రీతిలో భారీగా అప్లికేషన్లు వచ్చాయి. ఈ ఏడాది దరఖాస్తులు తగ్గినా పెంచిన దరఖాస్తు ఫీజుల ద్వారా ఆదాయం బాగానే వస్తుందని అధికారులు భావించారు. అయితే అందరి అంచనాలను తారు మారు చేస్తూ మద్యం వ్యాపార ఆశావహులు ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు దాఖలు చేశారు. దీంతో ఆదాయం గ్రాఫ్‌లో మరింతగా పైకి దూసుకుపోయింది. ఇక దరఖాస్తుదారులు తమ అదృష్టం పరీక్షించుకునేందుకు వేచి చూస్తున్నారు. కాగా, కొత్తగూడెంలోని కమ్మవారి కల్యాణ మండపంలో శుక్రవారం (18వ తేదీ) కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ లాటరీ తీయనున్నారు. ఇందుకోసం ఆశావహులైన వ్యాపారులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో మొత్తం 76 మద్యం దుకాణాలు ఉండగా, 35 ఏజెన్సీ పరిధిలో, 41 మైదాన, మున్సిపాలిటీల పరిధిలో ఉన్నాయి. లైసెన్స్ ఫీజు పెంచినా దరఖాస్తులు తగ్గలే... ఈసారి ప్రకటించిన మద్యం పాలసీ ప్రకారం దరఖాస్తు ఫీజు రెట్టింపు చేయడంతో పాటు లైసెన్సు ఫీజులు జనాభా ప్రాతిపదికన మరింతగా పెంచారు. దీంతో పాటు ప్రతి దుకాణానికి ప్రత్యేక రిటైల్ ట్యాక్స్ పేరుతో అదనంగా రూ.5 లక్షలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయినప్పటికీ వ్యాపారులు, ఆశావహులు వెనుకడుగు వేయలేదు. ఇప్పటివరకు మద్యం వ్యాపారం చేస్తున్న వారు గతం కంటే ఎక్కువగా దరఖాస్తులు దాఖలు చేయడం గమనార్హం. ఎప్పటిలాగే ఒకటి, రెండు దరఖాస్తులు వేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకునే వారు సైతం దాఖలు చేశారు. ఇక కొత్తగా ఎన్ఆర్ఐలు సైతం మద్యం వ్యాపారంలోకి దిగారు. ఇక్కడ ఉన్న తమ కుటుంబ సభ్యుల ద్వారా ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు దాఖలు చేయించారు. కొందరు ఎన్ఆర్ఐలు చుట్టుపక్కల ఐదారు జిల్లాల్లోనూ భారీ సంఖ్యలో దరఖాస్తులు దాఖలు చేశారు. ఇక సరిహద్దున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారులు సైతం జిల్లాలో భారీగానే దరఖాస్తులు దాఖలు చేశారు. జిల్లాలో 3402 దరఖాస్తులు దాఖలు కాగా, అందులో సుమారు 1000 అప్లికేషన్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు దాఖలు చేసినవేనని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా వచ్చి ఇక్కడ టెండర్ వేయడం గమనార్హం. ఏజెన్సీలో బినామీ పేర్లతో... జిల్లాలోని మున్సిపాలిటీ, మైదాన ప్రాంత దుకాణాలతో పాటు ఏజెన్సీ పరిధిలో ఉన్న దుకాణాలకు సైతం వ్యాపారులు బినామీల ద్వారా దరఖాస్తులు దాఖలు చేశారు. ప్రస్తు తం ఇతర వ్యాపారాల్లో పోటీ ఎక్కువగా ఉండడంతో పాటు, పలు విభాగాల కాంట్రాక్ట్ పనుల్లో బిల్లులు సక్రమంగా అందకపోవడంతో పలువురు కొత్తవారు సైతం మద్యం వ్యాపారం వైపు దృష్టి సారించారు. అదేవిధంగా మద్యం వ్యాపారం పూర్తిగా లిక్విడ్ క్యాష్ వ్యాపారం కావడంతో మరింత ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నవారు సైతం మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం. ఇన్ని రకాల విశేషాల నేపథ్యంలో ఆబ్కారీ శాఖకు కాసుల వర్షం కురిసింది. -
జోరు తగ్గిన మద్యం అమ్మకాలు
సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం: గతంతో పొలిస్తే ఈసారి మద్యం వ్యాపారులు కొంత డీలాపడ్డారు. 2017–19 సమయంలో ఎన్నికల హడావుడి.. దరఖాస్తు ఫీజు తక్కువగా ఉండటం వల్ల తీవ్రంగా పోటీ పడ్డారు. ఈసారి ఎన్నికలు లేకపోగా ఫీజు కూడా రెండింతలు పెంచడం వల్ల వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. కొత్త మద్యం పాలసీ ప్రకారం అన్ని లాభానష్టాలు బేరీజు వేసుకుని ఈసారి ఆశించిన లాభాలు రాకపోవచ్చని చాలా వరకు వ్యాపారులు టెండర్లు వేసేందుకు ముందుకు రాలేదు. 2017లో జరిగిన టెండర్లలో మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో 67 దుకాణాలకు 1579దరఖాస్తులు రాగా ఈసారి 1384 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈసారి టెండర్ల ద్వారా ప్రభుత్వానికి రూ.27కోట్ల 68లక్షల ఆదాయం సమకూరింది. జడ్చర్ల ఎస్హెచ్ఓ పరిధిలో మాత్రం రికార్డు స్థాయిలో 512 టెండర్లు వచ్చాయి. గతంలో మహబూబ్‌నగర్‌లో అధిక పోటీ ఉంటే ఈసారి మాత్రం జడ్చర్ల పరిధిలో ఉన్న దుకాణాల కోసం తీవ్ర పోటీ కనిపించింది. టెండర్లు ప్రారంభంలో ఓ మోస్తారు స్పందన ఉండగా.. చివరి రెండు రోజులు మంగళ, బుధవారం ఊపందుకుంది. బుధవారం గడువు ముగియడంతో చివరి రోజు దరఖాస్తుదారులు కొంత వరకు పోటీపడ్డారు. ఈనెల 18న సుదర్శన్ గార్డెన్లో లాటరీ పద్ధతిన కొత్త దుకాణాదారులను ఎంపిక చేసి, నవంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త మద్యం దుకాణాల్లో అమ్మకాలను చేపట్టనున్నారు. డిమాండ్ ఉన్న దుకాణాలు ఇవే.. మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా డిమాండ్ ఉన్న దుకాణంగా మిడ్జిల్ రికార్డు సృష్టించింది. ఈసారి మిడ్జిల్‌లో ఉన్న దుకాణం కోసం 63 మంది టెండర్లు వేశారు. అదేవిధంగా బాలానగర్ ఒకటో దుకాణానికి 58, బాలానగర్ రెండో దుకాణానికి 53 దరఖాస్తులు వచ్చాయి. హన్వాడ దుకాణానికి 45టెండర్లు పడ్డాయి. తక్కువ టెండర్లు వచ్చిన దుకాణాలలో మక్తల్, నారాయణపేట, మహబూబ్‌నగర్‌లో ఐదు దుకాణాలు ఉన్నాయి. సీమాంధ్ర వ్యాపారుల పోటీ ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విక్రయాలు ప్రభుత్వమే నిర్వహిస్తుండటంతో వ్యాపారుల దృష్టి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాపై పడింది. ఏపీ నుంచి కర్నూలు, గుంటూరు, కృష్ణ, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల నుంచి పలువురు మహబూబ్‌నగర్, గద్వాల, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలో టెండర్లు వేశారు.జిల్లాలో వచ్చిన టెండర్లలో దాదాపు 80 నుంచి 100వరకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యాపారుల టెండర్లు ఉన్నట్లు సమాచారం. అయితే సీమాంధ్ర వ్యాపారులు అధికంగా జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లో ఉన్న మద్యం దుకాణాలకు మాత్రమే అధికంగా టెండర్లు వేశారు. మక్తల్, నారాయణపేట ఇతర రిమోట్ ఏరియాల్లో ఉన్న దుకాణాల జోలికి వెళ్లలేదు. అయితే భారీగా మద్యం అమ్మకాలు ఉన్న దుకాణాల వివరాలు సేకరించి రెండేళ్ల కాలంలో ఏ దుకాణం ఏస్థాయిలో అమ్మకాలు చేశారు.. ఏ స్థాయిలో లాభాలు వచ్చాయనే అంశాలను క్షుణ్ణంగా తెలుసుకుని టెండర్లు వేసినట్లు తెలుస్తోంది. మహిళా వ్యాపారులు నూతన మద్యం దుకాణాల కోసం టెండర్లు వేయడానికి మహిళ వ్యాపారులు సైతం ఈఎస్ కార్యాలయానికి వచ్చారు. కొందరు వ్యక్తులు సెంటిమెంట్ కోసం భార్యలను, ఇతర కుటుంబ సభ్యులను టెండర్ వేయడానికి తీసుకు వస్తే.. మరికొందరు మహిళలు వారి పేర్లమీద టెండర్లు వేయడానికి కార్యాలయానికి క్యూ కట్టారు. మద్యం టెండర్లు వేయడానికి వచ్చిన వారితో ఈఎస్ కార్యాలయం పూర్తిగా సందడిగా కన్పించింది. ఓ సమయంలో ఆ రోడ్డు వెంట వాహనాల రద్దీ కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. తగ్గిన దరఖాస్తులు టెండర్ వేసిన సొమ్ము రూ.1 లక్ష నుంచి రూ. 2లక్షలకు పెంచి దుకాణం రాకుంటే వెనక్కి చెల్లించే పరిస్థితి లేకపోవడం దరఖాస్తులపై ప్రభావం చూపిందని అధికారులు భావిస్తున్నారు. చివరి రోజు మహబూబ్‌నగర్ జిల్లాలో భారీగా దరఖాస్తులు వచ్చాయి. మంగళవారం నాటికి 589 రాగా.. ఒక్క బుధవారం రోజే 785 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో మొత్తం 67 దుకాణాలకు 1384 దరఖాస్తులు రావడం కొత్త చరిత్రను తిరగరాయలేక పోయింది. ఇందులో మహబూబ్‌నగర్ 435, జడ్చర్ల 512, నారాయణపేట 287, కోస్గిలో 150 దరఖాస్తులు వచ్చాయి. అయితే జిల్లాలో నూతన మద్యం పాలసీ లైసెన్స్ కోసం దరఖాస్తులు చేసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.27కోట్ల 68లక్షల ఆదాయం వచ్చింది. 18న దుకాణాల కేటాయింపు ఈనెల 9నుంచి 16వరకు ఉమ్మడి జిల్లాలో ఉన్న 164 మద్యం దుకాణాలకు టెండర్లు తీసుకున్నాం. చివరి రోజు ఉమ్మడి జిల్లాలో 2,104టెండర్లు వేశారు. మహబూబ్‌నగర్ 1,384, నాగర్‌కర్నూల్ 1,064, గద్వాల 418, వనపర్తి 516 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 164 దుకాణాలకు 3,382టెండర్లు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.67.64కోట్ల ఆదాయం సమకూరింది. టెండర్‌దారులకు ఈనెల 18న లక్కీడిప్ ద్వారా దుకాణాలను కేటాయిస్తాం. పాస్ జారీ చేసిన వ్యక్తులు మాత్రమే లక్కీడిప్ తీసే ప్రదేశానికి రావాల్సి ఉంటుంది. – జయసేనారెడ్డి, ఉమ్మడి జిల్లా డీసీ -
మద్యం దుకాణాలపై ఆంధ్ర వ్యాపారుల ఆసక్తి
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో మద్యం దుకాణాలను దక్కిం చుకునేందుకు ఆంధ్రా ప్రాంతానికి చెందిన మద్యం వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. సుమారు 30 మందికి పైగా ఆ రాష్ట్రానికి చెందిన వ్యాపారుల నుంచి దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. వీరు స్థా నిక మద్యం వ్యాపారుల భాగస్వా మ్యంతో ఇక్కడ మద్యం దుకాణాలను పొందేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటివరకు జిల్లాకు చెం దిన వ్యాపారులే దుకాణాలను దక్కించుకునేవారు. ఈసారి కొత్త గా ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఆసక్తి చూపడం ఆశాఖ వర్గా ల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మద్యం దుకాణాలకు మహిళల పేర్లతోనూ దరఖాస్తులు రావడం గమనార్హం. సుమారు 55 దరఖాస్తులు మహిళల పేర్లతో వ చ్చాయి. కొందరు వ్యాపారులు సెంటిమెంట్‌గా దరఖాస్తులు చేసుకున్నారు. నిబంధనల్లో కొన్ని మార్పులు, చేర్పులు చేసి జిల్లాలో 91 షాపులకు ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 9 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. మంగళవారం వరకు మొత్తం 383 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఒక్క మంగళవారం 181 మంది దరఖాస్తులు చేశారు. నేటి సాయం త్రం 4 గంటలతో దరఖాస్తులకు గడువు ముగుస్తుంది. నాలుగు గంటల లోపు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యా లయంలోకి వచ్చిన వారందరికి టోకెన్లు జారీ చే సి దరఖాస్తులు చేసుకునేందుకు అనుమతినిస్తారు. 17న దరఖాస్తుల జాబితా.. దరఖాస్తుదారుల జాబితాను ఈనెల 17న ప్రకటిస్తారు. 18న స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరి యంలో డ్రా నిర్వహిస్తారు. ఆరంభంలో దరఖా స్తుదారుల నుంచి స్పందన అంతంత మాత్రం గా ఉండగా.. గడువు ముగిసే సమయం వచ్చేసరికి కాస్త ఊపందుకుంది. రెండేళ్ల క్రితం 93 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తే మొత్తం 1,326 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల రూపంలోనే ఎక్సైజ్‌శాఖకు రూ. 132.60 కోట్లు ఆదాయం లభించింది. ఈసారి దరఖాస్తు ఫీజును రూ.రెండు లక్షలకు పెం చడంతో దరఖాస్తుల సంఖ్య కొంత మేరకు తగ్గే అవకాశాలున్నాయి. 16 దుకాణాలకు నిల్ జిల్లా వ్యాప్తంగా 16 మద్యం దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. చివరి రోజు వచ్చే అ వకాశాలున్నట్లు ఎక్సైజ్‌శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఆర్మూర్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో ఎనిమిది, బోధన్ సర్కిల్ పరిధిలో నాలుగు, నిజా మాబాద్ సర్కిల్ పరిధిలో మూడు, మోర్తాడ్ పరిధిలో ఒక మద్యం దుకాణానికి దరఖాస్తులు చే యడానికి మంగళవారం వరకు ఎవ్వరూ ముం దుకురాలేదు. గతంలో ఆర్మూర్ మండలం మ చ్చర్ల మద్యం దుకాణానికి కూడా చివరి వరకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దీంతో ఎక్సైజ్ అధికారులు మద్యం వ్యాపారులతో సంప్రదింపులు జరిపారు. ఈసారి కొన్నింటికి ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. డ్రా కోసం ఏర్పాట్లు చేస్తున్నాం మద్యం దుకాణాల కోసం ఆసక్తి గల వ్యాపారులు సకాలంలో తమ దరఖాస్తులను సమర్పించాలి. గడువు బుధవారం సాయంత్రం 4 గంటలతో ముగుస్తుంది. ఈలోపు కార్యాలయానికి వచ్చిన వారి దరఖాస్తులను స్వీకరిస్తాము. ఈనెల 18న డ్రా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. -నవీన్‌చంద్ర, ఎక్సైజ్ సూపరింటెండెంట్ -
మనోళ్లు ‘మామూలోళ్లే’!
నిజామాబాద్ నగరంలో హైదరాబాద్ రోడ్డులోని వంశీ వైన్స్, ద్వారకామాయి వైన్స్‌లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తుండగా హైదరాబాద్ నుంచి వచ్చిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) బృందం శనివారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. నిర్వాహకులపై కేసు నమోదు చేసి, రూ.2 లక్షల జరిమానా విధించింది. ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ కేసులు నమోదు చేస్తుంటే.. మరి జిల్లాలోని ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు ఏం చేస్తున్నట్లు..? సాక్షి, నిజామాబాద్: జిల్లాలో మద్యం వ్యాపారులు దండుకుంటున్నారు. ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మార్పీ కంటే అధనంగా వసూలు చేస్తున్నారు. అయినా జిల్లా ఎక్సైజ్ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఎంతైనా వాళ్లు కూడా ‘మామూలోళ్లే’ కదా! అందుకే అధికారులు, సిబ్బంది కార్యాలయాలకే పరిమితమయ్యారు. అయితే, పైనున్న వారు వీళ్లలా ‘మామూలు’ అధికారులు కారు కదా..! జిల్లాలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న దుకాణాలపై దాడులు చేసి, కేసులు నమోదు చేశారు. అయితే, క్షేత్ర స్థాయిలో పూర్తి బలగం ఉన్న జిల్లా ఎక్సైజ్ యంత్రాంగం ఎందుకు దాడులు చేయలేదనే దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఐదు ఎక్సైజ్ స్టేషన్లున్నాయి. ఒక్కో స్టేషన్లో సీఐ, ఎస్సై, ఇతర సిబ్బంది పని చేస్తున్నారు. నిజామాబాద్ స్టేషన్లో అదనంగా మరో ఎస్సై, వీటికి తోడు అసిస్టెంట్ కమిషనర్ నేతృత్వంలోని ఓ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఉంది. దీనికి అదనంగా మరో టాస్క్‌ఫోర్స్ విభాగం పని చేస్తోంది. ఇవి కాకుండా ఓ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం, ఉమ్మడి జిల్లాలకు కలిపి మరో డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఉంది. జిల్లా వ్యాప్తంగా మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి బహిరంగంగా అడ్డ్డగోలుగా రూ.కోట్లలో దోపిడీకి పాల్పడుతుంటే, ఇంత యంత్రాంగం ఉన్న ఎక్సైజ్‌శాఖ ఏం చేసినట్లు? కేవలం వారికి వచ్చే మామూళ్ల వసూళ్లకే పరిమితమయ్యారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దసరా వరకు దండుకున్నారు.. మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి అధిక ధరలకు మద్యం విక్రయించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పట్టణాలతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని వైన్సుల్లో క్వార్టర్‌పై రూ.10, హాఫ్ బాటిల్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 వరకు ధర పెంచేసి అడ్డుగోలుగా దోపిడీకి పాల్పడ్డారు. ఇలా ఒక్కో రోజు రూ.లక్షల్లో దండుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పది రోజుల్లో రూ.కోట్లలో వెనకేసుకున్నారు. నెల వారీగా లైసెన్సు ఫీజు భారమవుతోందంటూ హడావుడి చేసిన మద్యం వ్యాపారులు చివరి నెల అందిన కాడికి దండుకుంటున్నారు. వీరితో జిల్లాలోని ఎక్సైజ్ ఉన్నతాధికారులు చేతులు కలపడంతో దోపిడీ యథేచ్ఛగా కొనసాగింది. ఈ క్రమంలో మందు బాబుల జేబులకు చిల్లు పడింది. జిల్లా వ్యాప్తంగా 95 వైన్సులుంటే దాదాపు అన్ని వైన్సులు దసరా వరకు ఎమ్మార్పీ నిబంధనలను ఉల్లంఘించారు. దసరా తర్వాత కూడా కొన్ని వైన్సుల్లో యథేచ్ఛగా ఎమ్మార్పీ నిబంధన ఉల్లంఘన జరుగుతోంది. కొత్త లైసెన్సుల సిండికేట్‌కు బాటలు.. నవంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త వైన్సులు ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని ఎక్సైజ్ ఉ న్నతాధికారుల తాజా నిర్వాకం కారణంగా కొత్త వైన్సులు ప్రారంభమయ్యాక కూడా సిండికేట్ దోపిడీ కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. అధికారులు మామూళ్ల మత్తులో ఇలాగే వ్యవహరిస్తే మద్యం దోపిడీ యథేచ్ఛగా కొనసాగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసులు సైతం తారుమారు.. నవ్వి పోదురుగానీ నాకేటి సిగ్గు అన్న చందంగా తయారైంది ఎక్సైజ్ అధికారుల పనితీరు. మూడు నెలల క్రితం ఓ కల్లు దుకాణం నిర్వాహకుడి వద్ద లంచం డిమాండ్ చేస్తూ ఎక్సైజ్‌శాఖ టాస్క్‌ఫోర్స్ సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్సై స్రవంతి ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌ను కూడా తనిఖీ చేశారు. కేసులను తారుమారు చేసేందుకు ఏ ఒక్క రికార్డును కూడా నమోదు చేయలేదని ఉన్నట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. అయితే, ఈ స్టేషన్లో ఉండాల్సిన జనరల్ డైరీ, ఈ–2 రిజిస్టర్, కాంట్రవన్ రిజిస్టర్లను ప్రతిరోజు నమోదు చేయాల్సి ఉండగా, వారం రోజులుగా పెండింగ్‌లో పెట్టినట్లు తేటతెల్లమైంది. ఈ అడ్డగోలు వ్యవహారంపై ఏసీబీ ఎక్సైజ్‌శాఖ రాష్ట్ర కమిషనరేట్‌కు, రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి నివేదిక ఇచ్చింది. కానీ దానిపై ఇప్పటివరకు రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు కనీస చర్యలు తీసుకోక పోవడంతో ఇలాంటి అడ్డగోలు దందాలు యథేచ్చగా కొనసాగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాకు ఫిర్యాదు అందలేదు.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు మాకు ఒక్కరు కూడా ఫిర్యాదు చేయక పోవడంతో జిల్లా ఎక్సైజ్ అధికార యంత్రాంగం కేసులు నమోదు చేయలేక పోయింది. హైదరాబాద్‌కు ఫిర్యాదులు చేస్తే హైదరాబాద్ టీం వచ్చి కేసులు చేసింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అధిక ధరలకు మద్యం విక్రయాలు ఆపేశారు. – డేవిడ్ రవికాంత్, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్‌శాఖ -
మహబూబ్‌నగర్‌లో సిండికేట్‌గాళ్లు
సాక్షి, మహబూబ్‌నగర్: ఇంకా కొత్త మద్యం పాలసీ ఖరారు కాకున్నా.. పాత పాలసే మరో నెల రోజుల పాటు గడుపు పెంచడంతో వచ్చే నెలలో ఉన్న దసరా పర్వదినం.. ఉమ్మడి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వైన్‌షాపులు నిర్వహిస్తోన్న మద్యం వ్యాపారులకు జాక్‌పాట్‌గా మారింది. మద్యం టెండర్ గడువు ఈ నెలతోనే పూర్తి కావాల్సి ఉండగా కొందరు మద్యం వ్యాపారులు కొన్ని నెలల క్రితమే సిండికేట్‌గా మారి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా షాపుల నిర్వహణ గడువు పెరిగిన క్రమంలో వచ్చే నెలలో ఉన్న దసరాను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. సాధారణ రోజుల కంటే దసరా సీజన్లో మద్యం విక్రయాలు 50శాతం ఎక్కువగా ఉండడంతో పెద్ద మొత్తంలో అక్రమ సంపాదనకు తెరలేపారు. ఇప్పటికే ఎక్కువగా వ్యాపారం జరిగే చోట్ల అందరూ సిండికేట్‌గా ఏర్పడ్డారు. ఉమ్మడి జిల్లాలో 164 దుకాణాలు ఉండగా.. వీటి నిర్వహణ గడువు ఈ నెలాఖరు వరకు ఉంది. అన్ని షాపుల్లో కలిపి ప్రతి నెలా సుమారుగా రూ.130కోట్ల నుంచి రూ.140కోట్ల వరకు మద్యం అమ్ముడుపోతోంది. కొత్త పాలసీపై ఉత్కంఠ ఇంకా స్పష్టత లేని మద్యం కొత్త పాలసీపై ఆయా వ్యాపారుల్లో ఉత్కంఠ నెలకొంది. నిబంధనల ప్రకారం ఈనెలాఖరుతోనే మద్యం టెండర్ గడువు ముగుస్తుంది. దీంతో ఇప్పటికే కొత్త పాలసీని ప్రకటించి.. టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు నోటిఫికేషన్ వెలువడకపోవడంతో.. నోటిఫికేషన్ వెలువడేంత వరకు ప్రస్తుతం వైన్ షాపులు నిర్వహించుకుంటోన్న వ్యాపారులే కొనసాగనున్నారు. ఇదీలా ఉంటే 2017లో టెండర్లలో పాల్గొన్న ప్రతి అభ్యర్థి ఒక్కో దుకాణానికి రూ.లక్ష వరకు డిపాజిట్ చేశారు. అయితే ప్రభుత్వం ఈ సారి టెండర్ ఫీజును రూ.2లక్షలకు పెంచే ఆలోచనతో ఉండడంతో ఎంత మంది టెండర్లలో పాల్గొంటారో అనే దానిపై చర్చ జరుగుతోంది. మరోపక్క.. ఒకరిద్దరు వ్యక్తులు ఒక షాపుతో ఆగకుండా పలు మండలాలు, పట్టణాల్లో ఉన్న అనేక వైన్ షాపులకు టెండర్లు దాఖలు చేశారు. కల్వకుర్తి, దేవరకద్ర ప్రాంతంలో నల్లగొండ వాసులు, అలంపూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న మండలాల్లో షాపులకు కర్నూలుకు చెందిన వారు టెండర్లు దాఖలు చేశారు. కొందరు స్థానికులకు డబ్బులు ఇచ్చి మరీ వారితో టెండర్లు వేయించి.. వాటిని చేజిక్కించుకున్నారు. ఇప్పటికీ అదే ఆనవాయితీ కొనసాగుతోంది. అలంపూర్ నియోజకవర్గ పరిధిలో సిండికేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దు కావడంతో కర్నూలుకు చెందిన కొంతమంది మద్యం వ్యాపారులు స్థానికులతో కలిసి దుకాణాల కోసం పోటీ పడుతున్నారు. ముఖ్యంగా అలంపూర్ చౌరస్తా, ఎర్రవెల్లి చౌరస్తా, శాంతినగర్, అయిజ ప్రాంతాల్లో మద్యం షాపులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కల్వకుర్తి మండల కేంద్రంతో పాటు చారకొండ, వెల్దండలో సిండికేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. దేవరకద్ర మండల కేంద్రంలో స్థానికులు, నల్లగొండ వ్యాపారులతో కలిసి సిండికేట్‌గా మారి వ్యాపారం చేస్తున్నారు. చిన్నచింతకుంట, అడ్డాకుల, భూత్పూర్, మూసాపేటలో సిండికేట్ వ్యాపారం ఎక్కువగా ఉంటుంది. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి, తెలకపల్లిలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇవి చాలా హాటు గురూ.. అత్యధిక మద్యం వ్యాపారం జరిగే ప్రాంతాల్లో టెండర్లు దక్కించుకునేందుకు చాలా మంది బడా వ్యాపారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తమ ఆధీనంలో ఉన్న షాపులను వదులుకోవడం ఇష్టంలేని వ్యాపారులు తమకు పోటీగా ఎవరూ రాకుండా ఇప్పట్నుంచే జాగ్రత్త పడుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఉన్న పలు షాపులకు ప్రతిసారి ఎక్కువ పోటీ ఉంటుంది. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని జడ్చర్ల, బాదేపల్లి, మిడ్జిట్, బాలానగర్, రాజాపూర్ మండలాలు.. నారాయణపేట జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఏరియా, మరికల్, ధన్వాడ, దామరగిద్ద మండలాల్లో, వనపర్తి జిల్లా పాన్‌గల్, రేవల్లి, గోపాల్పేట, ఘనాపూర్, అమరచింత, నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంతో పాటు బిజినేపల్లి, తెలకపల్లి, జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఎర్రవెల్లి చౌరస్తా, అలంపూర్, ఇటిక్యాల మండలాల్లో మద్యం షాపులు దక్కించుకునేందుకు పోటీ భారీగా ఉంటుంది. -
చివరి బస్సు
చీకటి మడుగు. చీకటి అపాయం. చీకటి పాపం.చీకటి తప్పు.సత్యాన్ని కనుగొనడానికి చివరి బస్సు బయలుదేరింది.చీకటిలో జరిగింది ‘సూర్యు’ని వెలుగుతో బయటపడింది. 07– 07– 2017.తారీఖులో చాలా ‘7’లు ఉన్నాయి.అందుకే ఆ రోజుకి ‘ఏడు’పుకి దగ్గర సంబంధం నిర్ణయించినట్టుంది విధి. పగతో రిగలిన ఓ గుండె చీకటి కాగితంపై రక్తసంతకం చేసింది.తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో జరిగిందీ సంఘటన. రాత్రి పది గంటలు.బెల్ట్‌షాప్ అనబడే ఆ మద్యం షాప్ దగ్గర జనం పలచబడ్డారు. అడపా దడపా కొనుక్కెళ్లేవారు వస్తున్నారు. తాగి వెళ్లేవారు అక్కడే కూర్చొని తాగుతున్నారు. ఒకరిద్దరు పక్కనే ఉన్న పర్మిట్ రూమ్‌లో కూర్చొని తాగి, తిని వెళుతున్నారు. షాప్‌కి కూతవేటు దూరంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి తూలుకుంటూ వెళుతూ వెళుతూ కింద పడిపోయాడు.ఇలాంటి ఘటనలు ఆ షాప్ దగ్గర మామూలే! తాగి మత్తుతో పడిపోవడం, ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడు లేచి ఇళ్లకి వెళ్లిపోవడం తరచూ జరుగుతుంటాయి.రోడ్డుకు ఓ వైపుగా పడి ఉన్న వ్యక్తిని చూసిన జనాలు ‘మందు ఎక్కువై ఉంటుంది’ అనుకుని వెళ్లిపోయారు. బెల్ట్ షాప్‌లోని పర్మిట్‌రూమ్‌లో పనిచేసే ఒకామె పడిపోయిన ఆ వ్యక్తిని దూరం నుంచే చూసి ఎక్కడిదక్కడ వదిలేసి పనుందని గబగబ అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. రాత్రి పదిన్నర దాటింది.పోలీస్‌స్టేషన్‌లో ఫోన్ మోగింది. ‘సార్, ఇక్కడి బెల్ట్ షాప్(మద్యంషాప్) దగ్గర ఓ మనిషి పడున్నాడు. అతని తల చుట్టూ రక్తం పేరుకుపోయి ఉంది’ అని సమాచారం చేరవేశాడు ఓ వ్యక్తి. హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కిందపడున్న వ్యక్తిని పరిశీలించారు. తల చుట్టూ రక్తం ఇంకా పచ్చిగానే ఉంది. పక్కనే రాయి ఉంది. బహుశా మద్యం మత్తులో తూలి ఆ రాయిమీద పడుంటాడు తలకు దెబ్బతగిలింది ఆసుపత్రికి చేర్చుదాం.. అనుకున్న పోలీసులకు అచేతనంగా పడి ఉన్న ఆ వ్యక్తి శరీరం ప్రాణం లేదని స్పష్టం చేసింది. అతని వద్ద ఏమైనా ఆధారాలు ఉంటాయేమో అని వెతికారు. కానీ, ఎలాంటి ఆధారం దొరకలేదు. బెల్ట్‌షాప్ ఓనర్ని అడిగారు. తమకేమీ తెలియదని చెప్పాడు అతను. అక్కడున్న సిబ్బందీ అదే విషయం చెప్పారు. గుర్తుతెలియని వ్యక్తి ప్రమాద సంఘటనగా కేసుగా నమోదు చేసుకొని పోలీసులు బాడీని పోస్టుమార్టంకి పంపించారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది. అది చూసి పోలీసులు షాక్ అయ్యారు.ఎడమ వైపు కణతిలో తుపాకీ గుండు దూసుకెళ్లడం కారణంగా ఆ వ్యక్తి మరణించాడు అని ఉంది రిపోర్ట్‌లో. పోలీసులు అలర్ట్ అయ్యారు.రాయి తగిలి ప్రమాదవశాత్తు మరణించాడని అనుకున్నారు. అలాంటిది పిస్టల్‌తో చంపేటంత ప్రొఫెషనల్స్ ఎవరై ఉంటారు? ఇది ఏదైనా ముఠాకు సంబంధించిన ఇష్యూనా? ఇంతకీ చనిపోయిన ఈ వ్యక్తి ఎవరు? ఇతని వద్ద ఫోన్ ఆధారం కూడా లేదు. నిద్రాహారాలు లేవు పోలీసులకు.విచారణ ముమ్మరమైంది. బెల్ట్‌షాప్ దగ్గర సంఘటన జరిగింది కాబట్టి అక్కడ నుంచే విచారణ మొదలుపెట్టారు పోలీసులు. బెల్ట్ షాప్ ఓనర్ని, అందులో పనిచేసే సిబ్బందినీ పిలిపించారు.అందరిదీ ఒకే మాట.. ‘ఎలా జరిగిందో, ఎవరు చేశారో మాకు తెలియదు’ అన్నారు. బెల్ట్‌షాపు పక్కనే ఉండే పర్మిట్ రూమ్‌లో పనిచేసే ఆమె వంతు వచ్చింది. బెరుకుగా చూస్తున్న ఆమెను అనుమానంగా చూశారు పోలీసులు. ‘ఏమైందో నీకు తెలుసు. విషయం చెప్పు’ గద్దించాడు ఎస్సై. ‘నాకేం తెలియదు సార్! భోజనం పెట్టమని ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారికి అన్నం పెట్టాను. మాటల్లో వాళ్లు సూర్యాపేటకు వెళ్లడం గురించి మాట్లాడుకోవడం వినిపించింది. అందులో ఒకతని దగ్గర తుపాకీ ఉంది. అన్నం తిని వాళ్లు వెళ్లిపోయారు. రూమ్ అంతా శుభ్రం చేసే పనిలో పడిపోయాను. బయట చెత్త వేయడానికి వచ్చినప్పుడు ఏదో పేలిన శబ్దం చిన్నగా వచ్చింది. ఆ శబ్దం వచ్చిన వైపుగా చూస్తే ఆ దారిలో ఓ వ్యక్తి పడిపోయున్నాడు. ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్ల దగ్గర తుపాకీ ఉందని గుర్తుకు వచ్చింది. భయమేసింది. పని మానేసి ఇంటికి వెళ్లిపోయాను’ భయపడుతూనే చెప్పింది ఆమె. ‘సార్.. ఇ ఇద్దరు ఎవరో.. ఎలా పట్టుకోవడం?’ అన్నారు సిబ్బంది. ఎస్సై క్షణం సేపు ఆగి.. ‘సూర్యాపేట. ఇదే క్లూగా ఈ కేసు చేధించాలి’ దృఢంగా అన్నాడు ఎస్సై. ‘ఎస్ సర్!’ అన్నారు సిబ్బంది.హత్య జరిగింది లేట్‌నైట్. తెలిసిన వివరాల ప్రకారం ఆ వ్యక్తులిద్దరి వద్దా సొంత వాహనం లేదు. వాళ్లు సూర్యాపేటకు ఏదో పద్ధతిలో వెళ్లి ఉంటారు. హత్య చేసిన వాళ్లు ఇక్కడే ఉండరు..’ అంటూ బయల్దేరాడు ఎస్సై. అతనితో పాటూ అతని సిబ్బందీ కదిలారు. బస్‌స్టేషన్‌కు వెళ్లారు పోలీసులు.సూర్యాపేటకు వెళ్లే దారిలో ఏయే గ్రామాలు ఉన్నాయి చివరి బస్సు ఎన్ని గంటలకు వెళ్లింది? అనే దిశగా ఎంక్వైరీ మొదలుపెట్టారు. చివరి బస్సు వెళ్లిన టైమ్ వివరాలు డిపోలో తీసుకున్నారు. ఆ బస్సు డ్రైవర్, కండక్టర్ని విచారించారు.కండక్టర్ వివరాలు చెబుతూ ‘సార్, నిన్న రాత్రి చివరి బస్సుకు పది మందికి మించి జనం లేరు. మీరు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం ఇద్దరు మగవాళ్లు సూర్యాపేటలో దిగారు. అయితే, వారితో పాటు ఒక ఆడమనిషి కూడా ఉంది. సూర్యాపేటలో దిగేవారికి టికెట్ ఆమే తీసుకుంది. రెండు టికెట్లు వాళ్లకిచ్చేసి ఆమె మద్దిరాల స్టేజ్‌మీద దిగిపోయింది’ చెప్పాడు అతను.మహబూబాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్లేదారిలో మద్దిరాల అనే గ్రామ స్టేజ్ ఉంది. ఆ ఊరు చేరుకోవాలంటే హైవే నుంచి రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్లాలి. అంత చీకట్లో ఆ ఊరికి వెళ్లిన ఆడమనిషి ఎవరు? సూర్యాపేటకు వెళ్లినవారికి ఆమె టికెట్ ఎందుకు తీసుకుంది?! ఎంక్వైరీ వేగవంతమైంది. పోలీసులు మద్దిరాల బయల్దేరారు. ఆ ఊరి వాళ్లను కలిసి, చనిపోయిన వ్యక్తి ఫొటోలు చూపించారు. ‘సార్.. ఇతనిది ఇక్కడికి దగ్గరలోనే ఉండే దంతాలపల్లి ఊరు. పేరు మల్లయ్య’ చెప్పారు ఒకరిద్దరు గ్రామస్తులు.‘ఇతని గురించి వివరాలు ఇంకేమైనా తెలుసా!’‘ఇతను చేసే పనులైతే ఏమీ లేవు. భార్య ద్వారా వచ్చిన ఆస్తిని అమ్ముకుని బలాదూర్ తిరుగుతుంటాడు. జల్సాలు ఎక్కువ. డబ్బుల కోసం ఒకరిద్దరితో గొడవలు కూడా ఉన్నాయి’ చెప్పాడు ఆ ఊరి పెద్ద. ‘రెండు నెల్ల కిందట ఈ ఊళ్లోనే ఉండే శేషమ్మ(పేరు మార్చాం)తో పెద్ద గొడవ అయ్యింది సార్. శేషమ్మ తన బావమరిది యాదగిరిని పెళ్లి చేసుకుందని ఆమెతో గొడవపడ్డాడు’ చెప్పాడు ఆ ఊళ్లో ఉండే ఇంకో అతను. పోలీసుల వరకు రాని ఆ తగాదా గురించి తెలుసుకోవడానికి శేషమ్మ ఇంటి తలుపు తట్టారు పోలీసులు.అయితే, ఇంట్లో శేషమ్మ లేదు. తాళం వేసి ఉంది. గ్రామస్తులు చెప్పిన వివరాలతో దంతాలపల్లి వెళ్లారు పోలీసులు. ఆ ఊళ్లో యాదగిరి ఇంటి తలుపు తట్టారు. ‘ఎవరూ..’ అంటూ శేషమ్మ తలుపు తీసింది. పోలీసులను చూసిన శేషమ్మ షాక్ అయ్యింది.ఆమె షాక్ నుంచి తేరుకునేలోపే శేషమ్మ చేతులకు బేడీలు వేశారు పోలీసులు. విచారణ మొదలయ్యింది. ఒక్కో విషయం వెలుగులోకి వచ్చింది.. పోలీసులు శేషమ్మ చెప్పింది వింటూ వున్నారు. మద్దిరాలకు చెందిన శేషమ్మ భర్త పదేళ్ల క్రితం చనిపోయాడు. ఆమెకో కూతురు ఉంది. ఒంటరిగా ఉంటున్న శేషమ్మకు దంతాలపల్లికి చెందిన యాదగిరితో పరిచయం ఏర్పడింది. మల్లయ్య బావమరిదే యాదగిరి. శేషమ్మ, యాదగిరి ఇటీవల గుళ్లో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయానికి మల్లయ్య ఊళ్లో లేడు. ఊరికి వచ్చి, విషయం తెలిసిన మల్లయ్య కోపంతో ఊగిపోయాడు. అమాయకుడైన తన బావమరిదిని శేషమ్మ వల్లో వేసుకుని పెళ్లి చేసుకున్నదని, అతని ఆస్తి కొట్టేయడానికే ఈ పన్నాగం పన్నిందని గొడవకు దిగాడు. శేషమ్మకు, మల్లయ్యకు మాటా మాటా పెరిగింది. యాదగిరి వారిస్తున్నా వినకుండా శేషమ్మను జుట్టు పట్టుకొని నడివీధిలోకి ఈడ్చుకొచ్చాడు మల్లయ్య. ఊరి జనం ముందు శేషమ్మను అరుస్తూ కొట్టాడు. ‘యాదగిరిని వదిలేయకపోతే నిన్నూ, నీ కూతురుని ఇద్దరినీ చంపేస్తా’ హెచ్చరించాడు మల్లయ్య. అవమానంతో బిక్కచచ్చిపోయింది శేషమ్మ. బయటకు ఎక్కడికెళ్లినా దారి కాచి మరీ వార్నింగ్‌లు ఇచ్చేవాడు. బిడ్డను ఒంటరిగా బయటకు పంపించాలన్నా భయంతో వణికిపోయేది శేషమ్మ. ‘మల్లయ్య అసలే మూర్ఖుడు. నన్నూ, నా బిడ్డను చంపడానికి వెనకాడడు. రోజూ ఎప్పుడు ఛస్తానో అని భయపడేకన్నా ముందు నేనే అతన్ని చంపేస్తే..’ అనే ఆలోచనకు వచ్చింది. మల్లయ్యతో పాత కక్షలు ఉన్నవారు ఆ ఊళ్లో నలుగురు ఉన్నారు. అవన్నీ భూ తగాదాలే! వెళ్లి వారిని కలిసింది శేషమ్మ. మల్లయ్య ఎక్కడెక్కడ ఒంటరిగా చిక్కుతాడో వివరాలు సేకరించింది. మల్లయ్యతో శత్రుత్వం ఉన్న ఆ నలుగురు మరో ఇద్దరు వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మొత్తం ఏడుగురు మల్లయ్య హత్యకుపథకం వేశారు. మొహబూబాబాద్లో పని ఉందని మల్లయ్య వెళ్లిన సంగతి శేషమ్మ తెలుసుకొని, మిగతావారికి సమాచారం అందించింది. తనూ టౌన్‌కి బయల్దేరింది.సాయంత్రం దాకా స్నేహితులతో తిరిగిన మల్లయ్య బెల్ట్ షాప్ వద్దకు మాత్రం ఒక్కడే వెళ్లాడు. మందు తీసుకొని, అక్కడ కూర్చొని మద్యం సేవించాడు. అతన్ని అనుసరిస్తున్న ‘ఇద్దరు’ వ్యక్తులు మందు తీసుకొని, పర్మిట్‌రూమ్‌లో చేరి, తింటూ మల్లయ్యను గమనిస్తూ ఉన్నారు. ‘పని’ పూర్తి కాగానే ముందే అనుకున్న విధంగా బస్‌స్టాప్‌కు చేరుకున్నారు ఇద్దరు. అక్కడే శేషమ్మతో పాటు మరో నలుగురు కలిశారు. ఏడుగురూ కలిసి రాత్రి చివరి బస్సుకు బయల్దేరారు. ఆ రాత్రి మద్దిరాలలో శేషమ్మ దిగింది. ఆ తర్వాత దంతాలపల్లిలో నలుగురు దిగారు. ఇద్దరు సూర్యాపేటలో దిగారు. నేరం ఏదైనా కావచ్చు. తప్పించుకోవడం సాధ్యం కాదు. జీవితంలో ఎవరైనా ఇబ్బంది పెడితే రక్షించడానికి చట్టం ఉంది. ఆ సంగతి మరిచి సొంత నిర్ణయాలు తీసుకుంటే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. – నిర్మలారెడ్డి -
అప్పుడెంత.. ఇప్పుడెంత
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపే మద్యం అమ్మకాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ మేరకు మద్యం అమ్మకాల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నిబంధనలను రూపొందించింది. సాధారణంగా పోలింగ్ సందర్భంగా 44 గంటల పాటు ఎలాంటి మద్యం అమ్మకాలు జరపకూడదు. ఓట్ల లెక్కింపు రోజున ఇదే నిబంధన అమలు చేస్తారు. అయితే పోలింగ్, ఓట్ల లెక్కింపు రోజుల్లోనే కాకుండా ఎన్నికల నిబంధనావళి అమల్లో ఉన్న రోజుల్లోనూ మద్యం అమ్మకాల నియంత్రణపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు, ఎన్నికల అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగే.. గ్రామాల్లో పోలింగ్ పరిస్థితులపై ప్రభావం చూపే బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించాలని స్పష్టం చేసింది. ‘రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్ షాపులు లేకుండా నియంత్రించాలి. నాటుసారా తయారీని పూర్తిగా నియంత్రించడంతోపాటు మద్యం, బీరు ఉత్పత్తి ప్రక్రియలను దగ్గరగా పరిశీలించాలి. మద్యం ఉత్పత్తి, నిల్వలు, అమ్మకాల్లో గతేడాదికీ, ప్రస్తుత ఏడాదికీ ఉన్న తేడాలను నిశితంగా గమనించాలి. మద్యం దుకాణాల వారీగా నిల్వలను పరిశీలించి తేడా ఉన్న వాటిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. వీడియో దృశ్యాలను చిత్రీకరించాలని, ఎక్సైజ్ శాఖ ఎల్లవేళలా అమ్మకాలను పర్యవేక్షించాలి. వైన్‌షాపులు, బార్లలో రోజువారీ అమ్మకాలపైనా పర్యవేక్షణ ఉండాలి. ఎక్సైజ్ శాఖ అధికారులు తమ పరిధిలోని మద్యం అమ్మకాలపై ప్రతిరోజు సాయంత్రం జిల్లా కలెక్టర్లకు నివేదికివ్వాలి. మద్యం దుకాణాలను తెరిచే, మూసే సమయాల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి. నల్లబెల్లం నిల్వలు, అమ్మకాల విషయంలోనూ ప్రత్యేక నిఘా పెట్టాలి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు జరిగినట్లు అందే ఫిర్యాదులను స్వీకరించేందుకు జిల్లాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలి’అని రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. -
ఎమ్మార్పీకి ‘బెల్టు’తో బురిడీ!
సాక్షి, హైదరాబాద్: మద్యం వ్యాపారులు రూటు మార్చారు. ఎమ్మార్పీ నిబంధనను ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తుండటం, పర్మిట్ రూం సామర్థ్యం చూపించి ఎక్సైజ్ అధికారులు వసూళ్లు చేస్తుండటంతో కొత్త పంథా ఎంచుకున్నారు. దుకాణం ద్వారా రోజువారిగా విక్రయించే మద్యంను సగానికి కుదించుకోని ఆ మొత్తాన్ని బెల్టు దుకాణాలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి ప్రతి క్వార్టర్ సీసా మీద కనీసం రూ. 5 చొప్పున ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. దీంతో చట్టవిరుద్ధమైన ఈ బెల్టు దుకాణాల్లో ఎమ్మార్పీ ఉల్లంఘన కేసులు నమోదు చేయడం కుదరక ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కళ్లు తేలేస్తోంది. అక్రమ మద్యం కేసులు పెట్టి బెల్టు లేకుండా చేస్తే మద్యం విక్రయాల రేటు పడిపోతుందని వెనకడుగు వేస్తోంది. నిబంధనలు పాటిస్తూనే.. మద్యం గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) నిబంధనను ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. ధర ఉల్లంఘనను నిరోధించడంతో పాటు అక్రమ, కల్తీ మద్యాన్ని నిరోధించడం కోసం ’లిక్కర్ ప్రైస్’ యాప్‌ను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో విక్రయిస్తున్న 880 లిక్కర్ బ్రాండ్లను ఈ యాప్ పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రతి సీసాకు సంబంధించి క్వార్టర్, ఫుల్ బాటిల్ ఎమ్మార్పీ ఎంత? ఏ డిపో నుంచి తెచ్చారు?.. తదితర విషయాలను యాప్‌తో తెలుసుకోవచ్చు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తే ఆ యాప్ ద్వారానే ఫిర్యాదు చేయొచ్చు. వాట్సాప్ నంబర్ 7989111222, టోల్ ఫ్రీ నంబర్ 18004252523కు కూడా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించారు. నిర్ణీత సమయం తరువాత మద్యం విక్రయించినా, సమయం కంటే ముందే దుకాణం తెరిచినా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. దీంతో గతంలో టెండర్లు వేసినా లైసెన్స్ దక్కని పాత మద్యం వ్యాపారులు నిత్యం దుకాణాల మీద కన్నేసి.. అవకాశం దొరికితే ఫిర్యాదు చేస్తున్నారు. ఎమ్మార్పీ ఉల్లంఘన కేసులో దొరికితే రూ. 2 లక్షల జరిమానా, 7 రోజుల పాటు లైసెన్స్‌ను ప్రభుత్వం రద్దు చేస్తోంది. దీంతో ఈ సమస్యలకు మద్యం వ్యాపారులు విరుగుడు కనిపెట్టారు. బెల్టుతో రూ. 8 వేల కోట్ల వ్యాపారం దుకాణంలో నిబంధనలు పాటిస్తూనే.. రోజు వారి మద్యం విక్రయాలను సగానికి తగ్గించారు. గ్రామీణ ప్రాంతంలోని ప్రతి మద్యం దుకాణంలో సగటున 75 నుంచి 100 కేసుల మద్యం విక్రయించేవాళ్లు. ఇప్పుడు 40 నుంచి 45 పెట్టెలకు మించి అమ్మడం లేదు. మిగిలిన మద్యాన్ని బెల్టు దుకాణాలకు తరలించి ఎమ్మార్పీ మీద రూ. 5 అదనపు ధరకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో 8,685 రెవెన్యూ గ్రామాలు, 21 వేల హాబిటేషన్లు ఉన్నాయి. ప్రతి రెవెన్యూ గ్రామంలో సగటున 5 చొప్పున, ప్రతి హాబిటేషన్ గ్రామంలో ఒకటి చొప్పున 65 వేలకు పైగా బెల్టు దుకాణాలు నడుస్తున్నాయి. వీటి ద్వారా ఏటా రూ. 8 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు అంచనా. ఎక్సైజ్ అధికారుల మధ్యవర్తిత్వం ఏడాదికి కనీసం 633 లక్షల కేసుల మద్యం విక్రయించాలని ప్రభుత్వం టార్గెట్‌గా నిర్ణయించింది. కానీ అధీకృత మద్యం దుకాణాల ద్వారా 50 శాతం మద్యం కూడా అమ్ముడవదు. దీంతో బెల్టు దుకాణాలను ఎక్సైజ్ శాఖ ప్రోత్సహిస్తోంది. ఒకటి కంటే ఎక్కువ మద్యం దుకాణాలున్న మండలాల్లో బెల్టు దుకాణాలకు మద్యం సరఫరా చేసే విషయంలో వ్యాపారులకు గొడవలు రాకుండా ఎక్సైజ్ అధికారులే మధ్య వర్తిత్వం చేసి ఊళ్లను పంచారు. ఒకరికి కేటాయించిన గ్రామంలో మరో వ్యాపారి అడుగు పెట్టకూడదు. ఒప్పందం అతిక్రమించిన వారిపై అధికారులు అక్రమ మద్యం వ్యాపారం కేసులు పెడుతున్నారు. -
ఎమ్మార్పీ ఉఫ్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)కు మద్యం అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవడంలో ఎక్సైజ్‌శాఖ విఫలమవుతోంది. ఎమ్మార్పీకి మించి జరుగుతున్న విక్రయాలకు కళ్లెం వేయడానికి ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా.. వాటిని అమలు చేయడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతినెలా వైన్స్‌ల నుంచి మామూళ్లు వసూలు చేస్తూ మద్యం దుకాణాదారులకు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బెల్టుషాపుల నిర్వాహకుల నుంచి మద్యం దుకాణాల యజమానులు దండుకోవడంలో ఆబ్కారీ అధికారులు అన్నివిధాలుగా సహకరిస్తున్నారని బహిరంగంగానే చర్చ జరుగుతోంది. మద్యం దుకాణం నిర్వాహకులు బ్రాండ్‌తో సంబంధం లేకుండా ఎమ్మార్పీపై అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. క్వార్టర్ సీసాకు రూ.5, హాఫ్‌కు రూ.10, ఫుల్ బాటిల్‌కు రూ.20, బీర్‌పై రూ.10 అదనంగా వారినుంచి నొక్కుతున్నారు. వైన్స్‌ల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేస్తున్న వీరు.. గ్రామాల్లో మందుబాబులకు మరింత ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చూసీ చూడనట్లుగా.. జిల్లాలో సరూర్‌నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 113, శంషాబాద్ ఈఎస్ పరిధిలో 74 మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. రిటైల్ షాప్ ఎక్సైజ్ ట్యాక్స్ (లైసెన్స్ ఫీజు) చెల్లించి కొనసాగుతున్న మద్యం దుకాణాలు విధిగా ఎమ్మార్పీని అమలు చేయాలి. ఈవిషయమై ఇటీవల ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రతి వైన్స్ దుకాణం ఎదుట మద్యం ధరల ఎమ్మార్పీలు కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే బ్రాండ్, పరిమాణం వారీగా లిక్కర్ ధరలు సులువుగా తెలుసుకునేందుకు వీలుగా ‘తెలంగాణ లిక్కర్ యాప్’ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. అధిక ధరల అమ్మకాలపై సులభంగా ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేక వాట్సాప్ నంబర్‌ను సైతం రాష్ట్ర ఆబ్కారీ శాఖ ఏర్పాటు చేసింది. ఇదంతా అమల్లోకి వచ్చినా అధిక ధరల నియంత్రణ అంతంతమాత్రంగానే ఉంది. క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని వైన్స్‌లు ఎమ్మార్పీకే మద్యం విక్రయిస్తుండగా.. ఇంకొన్ని మాత్రం నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. అక్కడి రూటే సపరేటు! జిల్లా పరిధిలోని మాడ్గుల మండల జనాభా సుమారు 50 వేలు. మొత్తం 16 గ్రామ పంచాయతీలు ఉండగా వీటి పరిధిలో మరో 11 అనుబంధ గ్రామాలు, 27 తండాలు ఉన్నాయి. ఈ పల్లెలన్నింటికీ స్థానిక వైన్స్ నుంచి మద్యం సరఫరా అవుతున్నట్లు సమాచారం. ఇక్కడ మద్యం లభించని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. వైన్స్ నిర్వాహకులే ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి బెల్టు షాపులకు మద్యం పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఇలా ప్రతివారం దాదాపు అన్ని గ్రామాలకు సరఫరా చేస్తున్నా అటు ఆబ్కారీశాఖ అధికారులు గాని, సివిల్ పోలీసులుగాని పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ వ్యవహారం మూడు హాఫ్‌లు.. ఆరు ఫుల్ బాటిళ్లు అన్నవిధంగా సాగుతున్నా దాడులు చేసి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రతినెలా వైన్స్ నిర్వాహకుల నుంచి మామూళ్లు పుచ్చుకుంటున్న నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు మిన్నకుండిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మిగిలిన మండలాల్లో ప్రత్యేక వాహనాల ద్వారా సరఫరా లేకపోయినప్పటికీ ఎమ్మార్పీని తుంగలో తొక్కుతున్నారు. రెండు ఫిర్యాదులు అందాయి.. కొన్ని వైన్స్‌లు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించినట్లు తమకు ఫిర్యాదులు అందాయని సరూర్‌నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రఘురాం తెలిపారు. రెండు చోట్ల దాడులు చేసి మద్యం దుకాణాల నిర్వాహకులపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇంకేమైనా ఫిర్యాదులు అందింతే.. తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మార్పీకి మించి మద్యంపై అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి రాలేదని శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని, ఆకస్మికంగా దాడులు చేస్తామని హెచ్చరించారు. వాస్తవంగా బెల్టు షాపులు ఎక్కడా లేవన్నారు. ఒకవేళ ఉంటే నిర్వాహకులపై, వీరికి మద్యం సరఫరా చేస్తున్న వైన్స్ నిర్వాహకులపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. -
ఘల్లుమంది గ్లాసు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడంతో అమ్మకాల వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. గతేడాది జనవరిలో రాష్ట్రంలో రూ.1,306 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగ్గా, ఈ ఏడాది జనవరిలో రూ.1,690 కోట్లు విక్రయాలు జరిగాయి. అంటే.. 29.4 శాతం వృద్ధి రేటు నమోదైంది. గత ఫిబ్రవరిలో రూ.522 కోట్ల మద్యం విక్రయించగా, ఈ నెల 15 నాటికే అమ్మకాల విలువ రూ.780 కోట్లకు చేరింది. ఫిబ్రవరిలో 15 రోజులకే రూ.258 కోట్ల అధికంగా అమ్మకాలు జరిగాయి. 15 రోజులకే గతేడాది ఫిబ్రవరి కంటే 49.22 శాతం వృద్ధి రేటు నమోదు కావడంపై ఎక్సైజ్ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. ఈ ఫిబ్రవరిలో మద్యం విక్రయాలను పరిశీలిస్తే.. అమ్మకాల్లో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉండగా, వైఎస్సార్ జిల్లా చివరి స్థానంలో ఉంది. చిత్తూరు జిల్లాలో రూ.79 కోట్లు, వైఎస్సార్ జిల్లాలో రూ.19.58 కోట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాది అమ్మకాలపై మొత్తం రూ.15,133 కోట్లకు పైగా ఆర్జించగా, ఈ ఏడాది రూ.17 వేల కోట్ల అమ్మకాల లక్ష్యాన్ని విధించడం గమనార్హం. 2014లో రూ.11,569 కోట్లుగా ఉన్న అమ్మకాల విలువ ఇప్పటివరకు సుమారు రూ.4 వేల కోట్ల వరకు పెరగడం గమనార్హం. ఈవెంట్ల పేరిట విచ్చలవిడిగా అమ్మకాలు మద్యం అమ్మకాల్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈవెంట్ల పేరుతో ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్మకాలకు అనుమతిలిచ్చింది. కొత్త ఏడాది ప్రారంభం రోజు పార్టీల కోసం ఇష్టమొచ్చినట్లు ఈవెంట్ల పర్మిషన్లు, పగలూ, రాత్రి తేడా లేకుండా అమ్మకాలకు అనుమతులివ్వడంతో అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. ఇటీవల మహాశివరాత్రి పర్వదినాన కూడా ఈవెంట్ల పేరుతో ఎక్సైజ్ శాఖ అనుమతులు జారీ చేసింది. అమ్మకాలు పెరగడానికి కారణాలివే.. - డిస్టిలరీల నుంచి మద్యం నిల్వకు 13 జిల్లాల్లో మద్యం డిపోల సంఖ్య పెరిగింది. డిపోలను పెంచి సరుకు సరఫరాకు అందుబాటులో ఉంచారు. - గతేడాది రూ.15 వేల కోట్ల మద్యం ఆదాయం కోసంరాష్ట్ర ప్రభుత్వం 15 వేల కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జిల్లా ప్రధాన రహదారులుగా (ఎండీఆర్‌లుగా) మార్చేసింది. - చీప్ లిక్కర్‌ను ఏరులై పారించేందుకు ఏకంగా టెట్రా ప్యాకెట్లలో సరఫరా చేసింది. - మద్యం వ్యాపారులకు కమీషన్లను 7 శాతం నుంచి 15 శాతానికి పెంచే విధంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. - బెల్టు షాపుల సంఖ్య గతంలో కంటే అధికంగా పెరిగాయి. ఫోన్ చేస్తే ఇంటికే మద్యం వచ్చేలా సిండికేట్లు ఏర్పాట్లు చేశారు. -
ఆబ్కారీ ‘మంద’స్తు జాగ్రత్త!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పంచాయతీ ఎన్నికల కోసం ఆబ్కారీ శాఖ ‘మంద’స్తు ప్రణాళిక వేసింది. ఎన్నికల సమయంలో మద్యం కోటాపై ఈసీ ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో అధికారులే ముందస్తు నిల్వలకు వెసులుబాటు కల్పిస్తున్నారు. జనవరిలోనే డిపోల నుంచి ‘ప్రణాళికబద్ధంగా’ సరుకు కొనుగోలు చేసుకోవాలని మద్యం దుకాణం/అమ్మకందారులకు విజ్ఞప్తి చేశారు. మద్యం అమ్మకాల జోరు పెంచాలని తెలంగాణ రాష్ట్ర పానీయాల సంస్థ (టీఎస్‌బీసీఎల్) రాష్ట్రంలోని 17 ఐఎఫ్ఎంఎల్ డిపోలకు ఆదేశాలు జారీ చేయగా, మేనేజర్లు 2,216 మద్యంషాపులు, 700కుపైగా ఉన్న 2డి బార్ల యజమానులకు లేఖలు రాస్తున్నారు. ఎన్నికల సంఘం ఆంక్షల నేపథ్యంలో... ఎన్నికల వేళ మద్యం, డబ్బు పంపిణీ సాధా రణంగా మారింది. నోటిఫికేషన్ మొదలు ఫలితాల వరకు మద్యం కోటాపై 2012 నుంచి ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధిస్తోంది. ఎన్నికలు జరిగే నెలలో డిపోల నుంచి సరుకును కొనుగోలు చేసే మద్యం వ్యాపారులు ఏడాది క్రితం అదే నెలలో ఎంత సరకు లిఫ్ట్ చేశారో అంతమేరకే తీసుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు వచ్చే నెల (2018 ఫిబ్రవరి)లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే, నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి అంతకు ముందు ఏడాది అదే నెల (2017 ఫిబ్రవరి)లో ఏయే తేదీల్లో ఎంత మేర సరుకు తీసుకున్నారో, అంతే మద్యం కొనాల్సి ఉంటుంది. ఎన్నికల సమ యం కదా అని ఎక్కువ మద్యాన్ని లిఫ్ట్ చేద్దామంటే కుదరదు. ఎన్నికల సంఘానికి ఈ మేరకు లెక్కలు అందజేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, అంతకుముందు జరిగిన స్థానిక సంస్థలు, ఉపఎన్నికల వేళగాని అనేక జిల్లా ల్లోని మద్యం దుకాణాల్లో కొరత ఏర్పడింది. ఈసారి ఆబ్కారీ శాఖ అప్రమత్తమైంది. దుకాణదారులకే లేఖలు పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పానీ యాల సంస్థ (టీఎస్‌బీసీఎల్) వ్యాపారులకు నేరుగా లేఖలు రాస్తోంది. ‘‘ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం మద్యంపై ఆంక్షలు విధించనున్న దృష్ట్యా ముందుగానే కావలసిన సరుకును తీసుకొని నిల్వ చేసుకోవాల్సిందిగా’’ డిపో మేనేజర్లు లేఖలు రాశారు. ఈ మేరకు మంచిర్యాల డిపో మేనేజర్ రవిశంకర్ ఈ నెల 19న రాసిన లేఖ ‘సాక్షి’కి లభించింది. దీనిపై టీఎస్‌బీసీఎల్‌లో విచారించగా, అన్ని డిపోలకు మద్యం సరుకుకు సంబంధించి లేఖ లు రాసిన విషయాన్ని ధ్రువీకరించారు. నెలలో రూ.1,300 కోట్ల అమ్మకాలు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు సరాసరిగా నెల కు రూ.1,300 కోట్ల మేరకు సాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.16,000 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని ఆబ్కారీ శాఖ భావిస్తోంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరిగితే కోటాపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించనుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి, మార్చి అదనపు కోటాను కూడా జనవరి లోగా వ్యాపారులకు అంటగట్టాలని సర్కారు భావిస్తోంది. ఎన్నికల సమయంలో 30 శాతానికిపైగా ఆదాయాన్ని ఆర్జించాలనేది ఆబ్కారీ శాఖ వ్యూహం. -
మద్యం షాపు ఏర్పాటుపై నిరసన
నిడమర్రు: పశ్చిమగోదావరి జిల్లా పత్తేపురంలోని పాటిదిబ్బ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటును నిరసిస్తూ మంగళవారం 20 మంది మహిళలు చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మద్యం దుకాణం అనుమతులు రద్దు చేయాలని, బ్రాందీ షాపును తొలగించాలని డిమాండ్ చేస్తూ నాలుగు రోజులుగా పత్తేపురం గ్రామ మహిళలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వీరి ఆందోళనకు మహిళా సంఘాలు, వివిధ పార్టీల నేతలు మద్దతు తెలిపారు. అయితే అటు అధికారులు, ఇటు స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో గ్రామానికి చెందిన 20 మంది మహిళలు చేపల చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో స్థానికులు హుటాహుటిన వారిని గట్టుమీదకు తీసుకువచ్చారు. వీరిలో బొక్కా లక్ష్మి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యులు చికిత్స చేయడంతో కోలుకుంది. -
ఎంత తాగినా.. వాసన రాదట!
సాక్షి, హైదరాబాద్: బీరు, విస్కీ, బ్రాందీ.. ఇలా మద్యం ఏదైనా ఓ రకమైన వాసన వస్తుంది.. అదోరకమైన చేదు రుచితో ఉంటుంది. కాస్త మందెక్కువైతే... తలపోటు, వికారం దగ్గరి నుంచి ఒళ్లు నొప్పులు, మగతగా ఉండటం దాకా ఎన్నో సైడ్ ఎఫెక్టులు. అయితే త్వరలో రాష్ట్ర మార్కెట్లోకి రానున్న విదేశీ ‘బయో మద్యం’ఇలాంటి సైడ్ ఎఫెక్టులన్నింటికీ అతీతమట. వాసన కూడా రాకపోవడం దాని ప్రత్యేకత అని, పలు రకాల ఔషధ ఉత్పత్తులను కలిపి దీనిని తయారు చేస్తున్నామని తయారీదారులు చెబుతున్నారు. తెలంగాణలో ఈ మద్యాన్ని విక్రయించేందుకు ప్రభుత్వం ఇటీవలే అనుమతించింది. అయితే ఈ బయో మద్యంలోనూ సాధారణ మద్యంలో ఉండే స్థాయిలోనే ఆల్కాహాల్ ఉంటుంది. వాసన రాకపోవడం, సైడ్ ఎఫెక్టులు లేకపోవడం తప్ప మిగతా అంతా సాధారణ మద్యం లాగానే ఉంటుంది. తాగేసి వాహనం నడిపితే ‘డ్రంకెన్ డ్రైవ్’లో దొరికిపోవడం ఖాయమే. తెలుగువారి కంపెనీయే వాస్తవానికి గుంటూరుకు చెందిన సింధూరా హెర్బల్స్ సంస్థ వ్యవస్థాపకుడు అమర్నాథ్ బయో మద్యాన్ని తయారు చేశారు. దీనిని ఇక్కడి మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అయితే కొన్ని శాస్త్రీయపరమైన సందేహాలను నివృత్తి చేయలేకవటంతో... బయో మద్యం ఇక్కడి మార్కెట్లోకి రాలేదు. తరువాత ఈ బయో మద్యానికి విదేశీ హంగులు జోడించి అమెరికా, నేపాల్ మార్కెట్లలో ప్రవేశపెట్టారు. తాజాగా రాష్ట్రంలో విదేశీ మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం, జీఈఎస్ సదస్సు నేపథ్యంలో ఇక్కడి మార్కెట్‌పై దృష్టి పెట్టారు. ఇక్కడ మద్యం మార్కెట్ తీరు, వినియోగంపై ఒక సర్వే చేయించినట్లు తెలిసింది. వాసన లేని, తలపట్టేయడం, వికారం వంటి సైడ్ ఎఫెక్టులు లేని మద్యానికి మంచి మార్కెట్ ఉన్నట్లు గుర్తించి.. తెలంగాణలో విక్రయాల కోసం కేఎస్ బయో నాచురల్స్ మార్కెటింగ్ సంస్థ పేరుతో దరఖాస్తు చేసుకున్నారు. ఈ మద్యం తాగితే నిషా వస్తుందిగానీ.. తలపట్టడం వంటి సైడ్ ఎఫెక్టులు ఉండవని, వాసన రాదని ఆ సంస్థ ప్రభుత్వానికి నివేదించి అనుమతి పొందింది. ప్రస్తుతం బయో బీరు, బయో విస్కీలకు అనుమతి వచ్చింది. త్వరలోనే బయో ఓడ్కా, బ్రాందీ, రమ్లను కూడా తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఏం కలుపుతారు? విదేశాల్లో మొక్కజొన్నలు, బార్లీ, జొన్నలు వంటి ధాన్యం ఆధారంగా తయారు చేసిన ఆల్కాహాల్ ఈఎన్ఏ (ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్)కు చక్కెరను మండించి తయారు చేసిన ‘బరంట్ షుగర్’ను, ప్రత్యేక కృత్రిమ (సింథటిక్) ఫ్లేవర్లను కలిపి మద్యాన్ని తయారు చేస్తారు. మన దేశంలో మొలాసిస్ ఆధారిత ఈఎన్ఏను వాడుతారు. అదే బయో మద్యంలో బరంట్ షుగర్ స్థానంలో తేనె ఆధారిత చక్కెరను, అశ్వగంధ లాంటి 16 రకాల మూలికలను కలిపి సహజ ఫ్లేవర్లతో మద్యాన్ని ఉత్పత్తి చేస్తామని కంపెనీ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్‌కు సమర్పించిన బ్రాండ్ లేబుల్ రిజిస్ట్రేషన్ దరఖాస్తులో పేర్కొంది. విదేశీ మద్యం అమ్మకాలు పెరిగే అవకాశం ప్రస్తుతం రాష్ట్రంలో 500 రకాల విదేశీ మద్యం బ్రాండ్లు ఉన్నాయి. ఏటా 280 లక్షల కేసుల దేశీ మద్యం అమ్ముడుపోతుండగా.. లక్ష కేసుల మేర విదేశీ మద్యం విక్రయిస్తున్నారు. విదేశీ మద్యం నుంచి సుమారు రూ.2,890 కోట్ల మేర రాబడి వస్తోంది. తాజాగా బయో మద్యంతో విదేశీ మద్యం అమ్మకాలు పెరుగుతాయని.. రాబడి మరో వెయ్యి కోట్ల వరకు పెరుగుతుందని ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రత్యేకత ఏమీ లేదు హైదరాబాద్‌లో తరచుగా అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు జరుగుతున్నందున విదేశీ మద్యానికి డిమాండ్ పెరుగుతోంది. ఆ క్రమంలోనే ఇటీవల 58 విదేశీ మద్యం బ్రాండ్లకు అనుమతించాం. అందులో బయో మద్యం ఉత్పత్తులు కూడా ఉన్నాయి. అంతేగానీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏ మద్యాన్ని ప్రోత్సహించడం లేదు.. – టీఎస్‌బీసీఎల్ చైర్మన్ దేవీప్రసాద్ -
సిండికేట్ల సిత్రాలు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మద్యం దుకాణాలపై లిక్కర్ సిండికేట్లు పట్టు బిగిస్తున్నారు. లాటరీలో లైసెన్స్ దక్కకపోయినా లక్షలకు లక్షలు గుడ్‌విల్ పోసి దుకాణాలు సొంతం చేసుకుంటున్నారు. లిక్కర్ విక్రయాల డిమాండ్‌ను బట్టి ఒక్కో షాపునకు కనిష్టంగా రూ.లక్ష నుంచి గరిష్టంగా రూ.కోటి వరకు గుడ్‌విల్ ఇచ్చి లీజుకు తీసుకుంటున్నారు. ఎక్సైజ్ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,031 మద్యం దుకాణాలు సిండికేట్ల చేతుల్లోకి వెళ్లినట్లు అంచనా. కొత్త లైసెన్స్‌దారులు సిండికేట్ల గుడ్‌విల్ ఎరకు చిక్కి దుకాణాలు అప్పగిస్తుండగా.. మరికొందరు సిండికేట్లు ఇచ్చే డబ్బులు తీసుకోవడంతోపాటు వ్యాపారంలో భాగస్వాములుగా మారుతున్నారు. గుడ్‌విల్ పేరుతో ఎర.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కువ శాతం దుకాణాలను సిండికేట్లు చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత స్థానంలో రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. ఆంధ్రాలో లైసెన్స్‌లు దక్కని మద్యం వ్యాపారులు ఇక్కడ పెట్టుబడి పెట్టి దుకాణాలు తీసుకున్నారు. సూర్యాపేట జిల్లాలోని 71 మద్యం దుకాణాలకుగానూ 54 మంది కొత్త వారికి లైసెన్స్ దక్కింది. వీళ్లలో దాదాపు 80 శాతం మంది సిండికేట్ల వలకు చిక్కి వ్యాపారం నుంచి తప్పుకున్నావారే. రాష్ట్రంలోనే ఎక్కువ దరఖాస్తులతో సంచలనం సృష్టించిన జాన్‌పహడ్ మద్యం దుకాణాన్ని ఆంధ్రా చెందిన ఓ సిండికేటు రూ.కోటికి సొంతం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మున గాల మండలంలోని ఓ దుకాణాన్ని రూ.63 లక్షలకు, మేళ్లచెరువులో ఓ షాపును రూ.44 లక్షలకు, గరిడేపల్లి మండ లం కీతవారిగూడెంలోని దుకాణాన్ని రూ.48 లక్షలకు, హుజూర్‌నగర్‌లోని ఓ షాపు ను రూ.40 లక్షలకు, సూర్యాపేటలో రెండు దుకాణాలకు రూ.40 లక్షలు, తుంగతుర్తి మండల కేంద్రంలోని దుకాణానికి రూ.15 లక్షలు చెల్లించి సిండికేటు గ్రూపులు వ్యాపారాన్ని సొంతం చేసుకున్నాయి. ఏజెన్సీ దుకాణాలు అన్యాక్రాంతం.. ఏజెన్సీలోని మద్యం దుకాణాలు సిండికేట్ల చేతుల్లోనే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మొత్తం 109కుగాను 98 దుకాణాలకు ఎౖక్సైజ్ అధికారులు లైసెన్స్‌లు కేటాయించారు. నిబంధనల ప్రకారం ఈ దుకాణాలను గిరిజనులే నిర్వహించాలి. కానీ, వీటిలో 90 షాపులు సిండికేట్ల చేతుల్లోకి వెళ్లాయి. గిరిజన లైసెన్స్‌దారునికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఇచ్చి వ్యాపారాన్ని సొంతం చేసుకున్నారు. ఎమ్మార్పీ ధరల ఉల్లంఘన.. : ఎమ్మార్పీ ఉల్లంఘనలపై ఎౖక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కఠినంగా ఉండటంతో సిండికేట్లు.. బెల్టు షాపులను సంపాదనా సాధనాలుగా మార్చుకుంటున్నారు. గత నెల వరకు ప్రతి క్వార్టర్‌పై రూ.2 అదనంగా వసూలు చేసిన సిండికేట్లు 10 రోజులుగా దీన్ని రూ.5కు పెంచారు. రెవెన్యూ గ్రామంలో సగటున 5, ప్రతి హాబిటేషన్ గ్రామంలో ఒకటి చొప్పున రాష్ట్రంలోని 65 వేలకుపైగా బెల్టుషాపులు ఉన్నాయి. ఎక్సైజ్ అధికారులే మధ్యవర్తులు? ఒకరికి వచ్చిన దుకాణాన్ని మరొకరు నడపటం ఎౖక్సైజ్ నిబంధనలకు విరుద్ధం. రూ.లక్షలు గుడ్‌విల్ ఇచ్చి లాభా లు ఆర్జించేందుకు వక్రమార్గం పడతారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటువంటి వాటిని స్థానిక ఎక్సైజ్ అధికారులు ఆదిలోనే గుర్తించి నివారించాలి. కానీ, కొన్ని చోట్ల వారే మధ్యవర్తిత్వం చేసి దుకాణాలు అప్పగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
అమ్మకాలు పెరిగాయి.. మేమేం చేయాలి?
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో గ్రోత్ (వృద్ధి) జరిగింది. దానికి మేమేం చేయగలం?’’అని ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావుగౌడ్ వ్యాఖ్యానించారు. మద్యం అమ్మకాల ద్వారా రూ.21 వేల కోట్ల భారీ ఆదాయాన్ని ఆర్జించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్న బీజేపీ సభ్యుల ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో గుడుంబా నిర్మూలన, పునరావాస చర్యలపై మంగళవారం శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో పద్మారావుగౌడ్ మాట్లాడారు. గుడుంబా కారణంగా తమవారు చనిపోతున్నారని గతంలో వరంగల్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో కొందరు మహిళలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారని.. దాంతో చలించిపోయిన ముఖ్యమంత్రి గుడుంబాను నిర్మూలిస్తామని ప్రకటించారని చెప్పారు. ఈ మేరకు ఆబ్కారీ శాఖ 2015 సెప్టెంబర్‌లో గుడుంబాపై యుద్ధాన్ని ప్రారంభించిందన్నారు. రాష్ట్రంలో 98 శాతం ప్రాంతాల్లో గుడుంబాను నిర్మూలించామని.. 89 మందిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. గుడుంబా తయారీ, విక్రయంలో నిమగ్నమైన కుటుంబాలకు పునరావాసం, ప్రత్యామ్నాయ జీవనోపాధి కోసం 100 శాతం సబ్సిడీతో రూ.2 లక్షల రుణాలు అందజేస్తున్నామన్నారు. చట్టంలో లోపంతో.. బడులు, ప్రార్థనా స్థలాలకు 100 మీటర్లలోపు దూరంలో మద్యం షాపులు ఏర్పాటు చేయరాదనే నిబంధన ఉన్నా.. చట్టంలోని పలు లోపాలతో పలు ప్రాంతాల్లో అనుమతి ఇవ్వకతప్పడం లేదని పద్మారావుగౌడ్ చెప్పారు. మద్యం షాపులకు గుడి/బడికి మధ్య రోడ్డు డివైడర్లు ఉంటే.. డివైడర్ల వల్ల పెరిగే దూరాన్ని సైతం పరిగణనలోకి తీసుకోవాలని ఎక్సైజ్ చట్టంలో ఉందన్నారు. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు ఎక్సైజ్ చట్టానికి సవరణ చేయాల్సి ఉందన్నారు. ఇక హైదరాబాద్‌లో గుడుంబా తయారీ, అమ్మకాలకు కేంద్రమైన ధూల్‌పేట్ ప్రాంతవాసులకు పునరావాసం కల్పించేందుకు ముఖ్యమంత్రితో చర్చించి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని చెప్పారు. ఆ ప్రాంతంలోని ఐదెకరాల ఖాళీ స్థలంలో చేతివృత్తులు, లేదా ఏదైనా ఇతర పరిశ్రమ ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తామన్నారు. ప్రమాదకర స్థాయికి మద్యం అమ్మకాలు ఆందోళన వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ప్రమాదకర స్థాయికి చేరాయని శాసనసభలో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. గుడుంబా నిర్మూలన, పునరావాస కార్యక్రమంపై చర్చ సందర్భంగా ప్రభుత్వ తీరును ఎండగట్టాయి. చిన్న రాష్ట్రమైన తెలంగాణలో ఏటా రూ.30– 40 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతు న్నాయని.. ఉత్తరప్రదేశ్‌లాంటి పెద్ద రాష్ట్రాల్లో సైతం ఇంత భారీ స్థాయిలో మద్యం అమ్మకాలు జరగడం లేదని బీజేపీఎల్పీనేత కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మద్యం అమ్మకాల ద్వారా రూ.21 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని.. ఇందుకోసం మద్యం విక్రయాల సమయాన్ని రాత్రి 11 గంటల వరకు పెంచిందని, మాల్స్‌లో సైతం విక్రయాలకు అనుమతిచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వం రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తుంటే.. జనం మద్యపానం కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని బీజేపీ సభ్యుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ధూల్‌పేట్‌లో ఖాళీగా ఉన్న ఐదెకరాల స్థలంలో పరిశ్రమను నెలకొల్పి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని బీజేపీ మరో సభ్యుడు రాజాసింగ్ లోధా డిమాండ్ చేశారు. ఇక గుడుంబా నిర్మూలన స్ఫూర్తితో రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి గుడుంబా అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలని టీఆర్ఎస్ సభ్యురాలు గొంగిడి సునీత సూచించారు. గుడులు, ప్రార్థనా స్థలాల సమీపంలోని మద్యం షాపులను తొలగించాలని ఎంఐఎం సభ్యుడు కౌసర్ మొహియుద్దీన్ డిమాండ్ చేశారు. -
జోరుగా ‘బెల్ట్’ దందా
షాబాద్(చేవెళ్ల): షాబాద్ మండలంలో ఏ గ్రామంలో చూసినా బెల్ట్‌షాపుల దందా జోరుగా కొనసాగుతున్నాయి. సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో పడి అసలు బెల్ట్‌షాపుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఓ వైపు ప్రభుత్వం బెల్ట్‌షాపులపై కోరడా ఝులిపించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా బెల్ట్‌షాపు నిర్వాహకులకు మాటలు చెవికెక్కడం లేదు. దీనికి తోడు ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మండలంలోని వివిధ గ్రామాల్లో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. వేలాపాలా లేకుండా 24 గంటల పాటు లభించే మద్యం దుకాణాలు గ్రామాల్లో ఉన్నాయి. దీంతో పాటు తండాల్లో సారాబట్టిలు కూడా పెట్టి మద్యం విక్రమాలు, బెల్టుషాపుల ద్వారా బహటంగా నడుస్తున్నాయి. ఒక చిన్న పాటి గ్రామంలో 5నుంచి 10వరకు బెల్టు దుకాణాలున్నాయి. వీటిని మూసి వేయాల్సిందేనని ప్రభుత్వం అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసినా అధికారులు ఖాతరు చేయడం లేదు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని గ్రామాల్లో తాగడానికి నీరు దొరకపోయినా, మద్యం మాత్రం తప్పకుండా దొరుకుతుంది. పట్టించుకోని ఎక్సైజ్ శాఖ.. షాబాద్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో మొదలుకుని అనుబంధ గ్రామాల్లో కూడా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మండల పరిదిలోని అన్ని గ్రామాలతో పాటు తండాల్లోను సారాబట్టీలు, బెల్ట్‌షాపులు జోరుగా వెలుస్తున్నాయి. వీటిని పట్టించుకోనే పర్యవేక్షించాల్సిన ఎక్సైజ్ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఇతర ప్రాంతాల ‡నుంచి ఆటోల్లో కల్తీ మద్యం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా ఈ బెల్ట్ దుకా>ణాల్లో మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ మందు బాబులను దోచేస్తున్నారు. ఏదో నామమాత్రపు తనిఖీలు నిర్వహించి చూసిచూడన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాలని ఆయా గ్రామాల యువజన సంఘాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఎక్సైజ్ ఎస్ఐ అరుణ్‌కుమార్‌ను వివరణ కోరగా.. గ్రామాల్లో బెల్టుషాపులు నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
రూ.68.57 కోట్లు.. తాగేశారు
ఆదిలాబాద్: ప్రతీ దసరా పండుగకు ఎక్సైజ్ శాఖకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతోంది. దసరా పండుగ ఈసారి సెప్టెంబర్ 30వ తేదీన వచ్చింది. వాస్తవానికి సెప్టెంబర్ ప్రారంభం నుంచే మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. పండుగకు మరోవారం ఉందన్న సమయంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పట్టణాలు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు అధికంగా సాగాయి. దీంతోపాటు పల్లెల్లోనూ మద్యం ప్రియులు బీరుతో పాటు విస్కీ ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేశారు. ఫలితంగా ఒక్క సెప్టెంబర్‌లోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 158 మద్యం దుకాణాల పరిధిలో రూ.68.57కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 55శాతం అమ్మకాలు పెరిగాయి. ఇందులో బీరు కేసుల ద్వారా రూ.17.42కోట్లు రాగా, ఐఎంఎల్ మద్యం కేసుల ద్వారా రూ.51.15కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో చివరి వారం రోజుల్లోనే రూ.25కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది సెప్టెంబర్‌లో మద్యం అమ్మకాల ద్వారా రూ.41.25కోట్లు, బీరు అమ్మకాల ద్వారా 12.34కోట్ల ఆదాయం వచ్చింది. చివరి నెలలోనే అధికం.. జిల్లాలో మద్యం అమ్మకాలు మూడు పువ్వులు.. ఆరుకాయలుగా సాగుతోంది. ఒకప్పుడు రెవెన్యూ విభాగంలో ఓ భాగంగా ఉన్న ఎక్సైజ్ శాఖ.. ఇప్పుడు రెవెన్యూ పరంగా ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారిందనడానికి రోజురోజుకు పెరుగుతున్న మద్యం అమ్మకాలే నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆదాయం ఊహించని రీతిలో సమకూరుతోంది. ఏటా సెప్టెంబర్‌లోనే మద్యం విక్రయాలు జోరుగా సాగుతాయి. గతేడాది సెప్టెంబర్‌లో ఉమ్మడి జిల్లాలో లక్షా 27వేల 304 మద్యం కేసులు, 93వేల 521 బీరు కేసులు అమ్ముడుపోగా, వీటి ద్వారా రూ.53.59కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1నుంచి 30వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షా 45వేల 388 మద్యం కేసులు, లక్షా 32వేల 26 బీరు కేసులు విక్రయించగా, వీటి ద్వారా రూ.68.57కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే రూ.15కోట్ల ఆదాయం సమకూరి 27.96శాతం ఆదాయం పెరిగింది. మద్యం కేసుల విక్రయాల్లో 14.21శాతం, బీరు కేసుల విక్రయాల్లో 41.17శాతం పెరిగింది. గుడుంబా తగ్గడంతోనే.. రాష్ట్ర ప్రభుత్వం 2015లో రెండేళ్ల మద్యం పాలసీని తీసుకొచ్చింది. అంతకుముందు ప్రతీ ఏడాది జూన్‌లో మద్యం టెండర్లు నిర్వహించేవారు. అయితే 2015–17 కాల పరిమితితో ప్రభుత్వం కొత్త పాలసీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఆయా జిల్లాల్లో గుడుంబాను నిర్మూలించి మద్యం అమ్మకాలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు, పోలీసులు విస్తృత దాడులు నిర్వహించి గతేడాది ఉమ్మడి జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించారు. ఓ వైపు దాడులు.. మరోవైపు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో చాలా వరకు గుడుంబా తగ్గి మద్యం అమ్మకాలు పెరిగాయి. గతంలో ప్రతీ సంవత్సరం రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు వచ్చే ఎక్సైజ్ ఆదాయం 2015 నుంచి ప్రతీ ఏడాది రూ.700 కోట్లు దాటుతోంది. ఈ లెక్కన ఎక్సైజ్ ఆదాయం పెరగడానికి గుడుంబా నియంత్రణ కూడా కారణమని చెప్పవచ్చు. గుడుంబా నియంత్రణతోనే.. ఉమ్మడి జిల్లాలో చాలా వరకు గుడుంబాను నియంత్రించాం. దీంతోనే మద్యం అమ్మకాలు పెరిగి ఆదాయం సమకూరుతోంది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించాం. ప్రజల్లో చైతన్యం వచ్చింది. – రమేశ్‌రాజ్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ -
నేడే లక్కీ డే
నిర్మల్‌రూరల్/ఆదిలాబాద్: మద్యం దుకాణాల లక్కీ డ్రాకు సమయం ఆసన్నమైంది. దరఖాస్తు చేసుకున్న వ్యాపారుల్లో ఎవరిని అదృష్టం వరించనుందో శుక్రవారం తెలిసిపోతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా జిల్లా కలెక్టర్ల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించి మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలకు ఎవరూ ఊహించని స్థాయిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ నెల 13 నుంచి వారం రోజులపాటు నిర్వహించిన దరఖాస్తుల ప్రక్రియలో చివరి రోజు వెయ్యికిపైగా దరఖాస్తులు రావడం గమనార్హం. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 160 మద్యం దుకాణాలకు ఏకంగా 2,372 దరఖాస్తులు వచ్చాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జనార్దన్‌రెడ్డి గార్డెన్, నిర్మల్‌లో స్టార్ఫంక్షన్హాల్, కుమురం భీం జిల్లాలో కలెక్టర్ కార్యాలయం, మంచిర్యాల జిల్లాలో పద్మావతి గార్డెన్లో మద్యం టెండర్లకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో మద్యం దుకాణాలను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయనున్నారు. జిల్లాలో రెండేళ్ల కాలపరిమితితో దుకాణం దక్కించుకున్న వారు 2019 సెప్టెంబర్ 30 వరకు మద్యం అమ్మకాలు సాగించవచ్చు. 9.30 గంటలకే హాజరుకావాలి.. శుక్రవారం లక్కీ డ్రాకు హాజరయ్యే మద్యం వ్యాపారులు ఉదయం 9.30 గంటలకే రావాలని అధికారులు చెబుతున్నారు. వ్యాపారులకు ఎంట్రిపాస్ ఉంటేనే అనుమతిస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా కలెక్టర్ల సమక్షంలో ఉదయం 11 గంటలకు మొదటి లక్కీ విజేతను ప్రకటిస్తారు. ఏజెన్సీ వ్యాపారులు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్లు వెంట తీసుకురావాల్సి ఉంది. దుకాణం దక్కించుకున్న వ్యాపారులు 1/6 వంతు లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల ద్వారా రూ.20.37 కోట్ల ఆదాయం ఎక్సైజ్‌శాఖకు అదనంగా వచ్చింది. భారీ ఎత్తున దరఖాస్తులు రావడం, దరఖాస్తు ఫీజు నాన్రిఫరండేబుల్గా ఉండడంతో ఈ ఆదాయం సమకూరింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్‌లోని షాప్‌నెంబర్ 4కు అత్యధికంగా 75 దరఖాస్తులు రాగా, ఆ తర్వాతి స్థానంలో బెజ్జూర్ 70, గత మద్యం పాలసీ 2015–17 సంవత్సరంలో కూడా ఉమ్మడి జిల్లాలో బెజ్జూర్‌కు 75 దరఖాస్తులతో మొదటిస్థానంలో నిలవడం గమనార్మం. తాళ్లపల్లి షాప్‌నెంబర్ 1, 2 దుకాణాలకు సింగిల్ దరఖాస్తులే రాగా, మంచిర్యాలలోని సింగపూర్ షాప్‌నెంబర్ 1, 3, తాళ్లగుర్జాల, దండేపల్లి దుకాణాలకు రెండేసి దరఖాస్తులు వచ్చాయి. -
కుప్పలు..తెప్పలు
♦ మద్యం దుకాణాలకు దరఖాస్తుల వెల్లువ ♦ 138 దుకాణాలకు 1466 దరఖాస్తులు ♦ 13 దుకాణాలకు సింగిల్ టెండర్లు ♦ 5 దుకాణాలకు సున్నా దరఖాస్తులు ♦ అత్యధికంగా నిడమనూరు మండలం తుమ్మడం దుకాణానికి 52 ♦ దరఖాస్తుల రూపంలో వచ్చిన ఆదాయం రూ.14.66 కోట్లు ♦ నేటితో దరఖాస్తుల స్వీకరణ ఆఖరు నల్లగొండ : మద్యం దుకాణాలు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడ్డాయి. సోమవారం త్రయోదశి మంచి రోజు కావడంతో భారీ సంఖ్యలో దరఖాస్తు చేశారు. జిల్లాలో 138 దుకాణాలకు సోమవారం ఒక్క రోజే 875 దరఖాస్తులు రావడం విశేషం. దీంట్లో అత్యధికంగా నిడమనూరు మండలం తుమ్మడం దుకాణానికి 52 మంది పోటీ పడుతున్నారు. రెండో స్థానంలో కనగల్ మండలం దర్వేశిపురం దుకాణానికి 31మంది పోటీలో ఉన్నారు. సింగిల్ టెండర్లు వచ్చిన దుకాణాలు 13 ఉన్నాయి. వీటిల్లో నల్లగొండ మున్సిపాలిటీ, దేవరకొండ నగర పంచాయతీ దుకాణాలే ఉన్నాయి. అసలు దరఖాస్తులు రాని దుకాణాలు 5 ఉన్నాయి. ఇవి కూడా నల్లగొండ మున్సిపాలిటీలోనే చెందినవే. ఈ నెల 13నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకాగా తొలిరోజు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. 14 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకాగా, ఆదివారం నాటికి 591 దరఖాస్తులు వచ్చాయి. సోమవారం వచ్చిన 875 దరఖాస్తులతో కలిపి ఇప్పటివరకు 138 దుకాణాలకు 1466 మంది దరఖాస్తు చేశారు. ఒక్కో దరఖాస్తు రుసుము రూ.లక్షలు కాగా...ప్రభుత్వానికి దరఖాస్తుల రూపంలో ఇప్పటి వరకు రూ.14.66 కోట్ల ఆదాయం సమకూరింది. దరఖాస్తుల స్వీకరణ మంగళవారంతో ముగియనుంది. అంచనాలకు మించి... ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతంలో మూడు వేలకుపైగా దరఖాస్తులు రాగా దాంట్లో కేవలం నల్లగొండ జిల్లాలోనే 1700 దరఖాస్తులు వచ్చాయి. ఈ లెక్కన ఈ దఫా 1300 దరఖాస్తులు వస్తాయని అధికారలు అంచనా వేశారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ రికార్డు స్థాయిలో వ్యాపారుస్తుల నుంచి పోటీ రావడంతో అధికారులు బిత్తరపోయారు. సూర్యాపేట జిల్లాలో పోటీ ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతానికి చెందిన వారు కూడా నల్లగొండ జిల్లాలోని దుకాణాలకు పోటీ పడుతున్నారు. అలాగే గుంటూరు జిల్లాకు చెందిన వ్యాపారులు కూడా మిర్యాలగూడ, దామరచర్ల ప్రాంతంలోన దుకాణాలకు టెండర్లు వేస్తున్నారు. ఆంధ్రాలో లిక్కర్ మాఫియాకు అడ్డుకట్టపడటంతో అక్కడి వ్యాపారులు నల్లగొండ జిల్లా పై కన్నేశారు. దరఖాస్తుదారుల్లో మహిళలు కూడా ఉండటం విశేషం. -
వందా.. బొందా.!
► మూమూళ్ల కోసం దారులనే మార్చిన అధికారులు ► అధికారపార్టీ నేతల కోసం నిబంధనలకు సడలింపులు ► ఎక్సైజ్‌శాఖ అధికారుల వింత పోకడ సాక్షి, అమరావతి బ్యూరో : మద్యం ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్న అధికార పార్టీ నాయకులకు ఎక్సైజ్ అధికారులు రాచబాట వేస్తున్నారు. అధికార పార్టీ నేతల ప్రాపకంతో పాటు వారిచ్చే మామూళ్ల కోసం నిబంధనలకే కొత్త భాష్యం చెబుతున్నారు. బడి, గుడి, ఆస్పత్రులకు 100 మీటర్ల దూరం తరువాతే మద్యం షాపులకు అనుమతి ఇవ్వకూడదని చెబుతున్న నిబంధనలకు సవరణలు చేసి దొడ్డిదారిలో అనుమతులు ఇచ్చేశారు. విజయవాడ నగరంలో ప్రముఖ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపులు, బార్లకు అనుమతులు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయిన వారి కోసం దారుల కొలతలనే మార్చేసిన అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. నిబంధనలను ఏమార్చిన విషయమై విజయవాడ ఎక్సైజ్ శాఖ ఏసీ సత్యప్రసాద్‌ను వివరణ కోరగా నిబంధనల విషయంలో సడలింపు జరగదని తెలిపారు. కొలతలు సక్రమంగా ఉంటేనే అనుమతులు ఇస్తామని చెప్పారు. రమేష్ హాస్పిటల్ వద్ద ఇలా.. విజయవాడ లబ్బీపేట పరిధిలోని బందరు రోడ్డు ర‡మేష్ హాస్పిటల్‌కు ఎదురుగా ఉండే వైన్కార్నర్ షాపు అధికార పార్టీ నేతకు చెందింది. 30 పడకల హాస్పిటల్‌కు వంద మీటర్లు దూరం తరువాతే మద్యం షాపు ఉండాలన్నది నిబం ధన. నడిచే దారి కూడా వంద మీటర్ల దూరాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఎక్సైజ్ అధికారులు కొలతలు తీయడంతో చాకచక్యంగా వ్యవహరించారు. మద్యం షాపు నుంచి అవతలవైపునకు నడిచివెళ్లే దారి ప్రకారం చూస్తే సుమారు 60 మీటర్లు ఉంటుంది. కానీ అధికారులు ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధమంటూ రోడ్డును మూయించి, అవతల ఉన్న డివైడర్ వరకు దారి మళ్లించేలా చేసి, వందమీటర్లుకు పైగా దారి చూపించి అనుమతులు ఇచ్చేశారు. దీనికి పోలీసుల సహకారం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. మనోరమా వద్ద ఇలా.. బందరు రోడ్డులోని పాత బస్టాండ్ సమీపంలో మనోరమ హోటల్, బార్ అండ్ రెస్టారెంట్ ఉన్నాయి. ఆ బార్ వెనుక నుంచి విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారికి 500 మీటర్లు దూరం లోపు ఉంది. అయితే హోటల్ పక్కరోడ్డులో నోఎంట్రీ బోర్డు పెట్టించి.. రోడ్డు ముందు భాగం నుంచి కొలతలు తీసి, 500 మీటర్లపైగా దూరం చూపించి అనుమతులు ఇచ్చేశారు. ఆ బార్ కోసం ప్రజలు నడిచే రోడ్డునే బ్లాక్ చేయించడం గమనార్హం. పున్నమి ఘాట్ వద్ద.. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారికి దగ్గరలోనే ఉన్న పున్నమిఘాట్లో టూరిజం శాఖ బార్ ఏర్పాటు చేసింది. జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలో బార్ ఉండాలన్న నిబంధనలను ప్రభుత్వ అధికారులే ఉల్లంఘించారు. జాతీయ రహదారికి కేవలం 300 మీటర్ల లోపే ఉండే కాటేజ్‌లో మూడో అంతస్తులో బార్ ఓపెన్ చేసి బోర్డు మాత్రం పెట ్టలేదు. రహదారి నుంచి నేరుగా ఘాట్‌లోకి వెళ్లే దారిని మూసివేసి, దూరంగా ఉన్న మరో మార్గాన్ని చూపించారు. అప్పటికీ 500 మీటర్ల కొలత రాకపోవడంతో మూడో అంతస్తులో ఉన్న బార్ వరకు కొలతలు చూపి అనుమతి తీసుకున్నారని సమాచారం. నిబంధనలన్నీ బేఖాతరు గుంటూరు(లక్ష్మీపురం): స్థానిక జూట్‌మిల్లు రోడ్డు నుంచి స్వామి థియేటర్ వైపుగా వెళ్లే ప్రదేశంలో మసీదు ఉంది. అదే ప్రాంతంలోని రోడ్డుకు ఎదురు భాగంలో అయ్యప్పస్వామి వారి దేవాలయం ఉంది. మసీదుకు ఎదురుగా, అయ్యప్ప స్వామి ఆలమం పక్కగా ఎస్ వైన్స్ పేరుతో మద్యం దూకాణం ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉండటంతోపాటు పక్కనే పెట్రోల్ బంక్ కూడా ఉంది. నిబంధనల ప్రకారం బడి, గుడికి వంద మీటర్లకు అవతల మాత్రమే మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకొనే వీలుంటుంది. అయితే వంద మీటర్ల దూరాన్ని అష్ట వంకర్లు తిప్పి నిబంధనలన్నింటికీ చెల్లుచీటి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ మద్యం దుకాణం ఆలయాలకు వంద మీటర్ల కంటే తక్కువ దూరం ఉంటుంది. అధికారులు ఎలా అనుమతులిచ్చారో అర్థం కావడం లేదు. రోడ్లపైనే మద్యం బాబుల హల్చల్ మంగళగిరి: పట్టణంలోని గౌతమబుద్ధారోడ్ వెంట ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఆటోనగర్ వరకు మద్యం దుకాణాలు, బార్లు వెలిశాయి. మద్యం ప్రియులతో మూడు దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. సాయంత్రం ఆరు గంటల నుంచి గౌతమబుద్ధారోడ్డుపైకి స్థానికులు రావాలంటేనే హడలిపోతున్నారు. మద్యం ప్రియులందరూ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఆయా దుకాణాల వద్ద వాహనాలను రోడ్డుపైనే నిలిపి ఉంచుతున్నారు. దీంతో పట్టణం నుంచి ఆటోనగర్, ఎన్ఆర్ఐ ఆసుపత్రి, చినకాకాని మీదుగా గుంటూరు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక దుకాణంలో మద్యం తాగేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు లేకపోవడంతో రోడ్లపైనే గ్లాసులతో మందుబాబులు దర్శనమిస్తున్నారు. ఇళ్ల మధ్య దుకాణం ఏర్పాటును స్థానికులతో కలిసి అడ్డుకుంటున్న కౌన్సిలర్లు..వ్యాపారుల వద్ద వాటాలు తీసుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నారు. మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో ఇప్పటికే 17 దుకాణాలు ఏర్పాటు చేయగా మరో 3 నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే బార్లు 14 ఉండగా ఇప్పటికే 13 ప్రారంభించారు. మరొకటి ఆటోనగర్‌లో ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. -
ఆంధ్రా ఉద్యోగులను పంపిస్తాం
బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ పరిధిలో పని చేస్తున్న ఆంధ్రప్రాంత ఉద్యోగులను త్వరలోనే వారి రాష్ట్రానికి పంపించి అక్కడ పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను ఇక్కడకు తీసుకు వస్తామని టీఎస్‌బీసీఎల్ చైర్మన్ దేవీప్రసాద్‌రావు అన్నారు. గురువారం ఆయన ఎక్సైజ్ భవన్‌లోని తన నూతన కార్యాలయంలో ‘సాక్షి’ప్రతినిధితో మాట్లాడారు. కార్పొరేషన్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన 12 మంది ఉద్యోగులు ఉన్నారని, ఆంధ్రలో తెలంగాణకు చెందిన నలుగురు ఉద్యోగులు ఉన్నారని, 10–15 రోజుల్లో అక్కడి వారిని ఇక్కడకు తీసుకువస్తామని చెప్పారు. ఈమేరకు రెండు రాష్ట్రాల కార్పొరేషన్ ఎండీలు కలసి మాట్లాడుకున్నారని తెలిపారు. త్వరలోనే 135 పోస్టులకు నోటిఫికేషన్ కార్పొరేషన్‌కు వివిధ స్థాయిల్లో మొత్తం 258 ఉద్యోగులు అవసరం కాగా, ప్రస్తుతం 115 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారని దేవీప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డిపోల కోసం 55 పోస్టులను కలుపుకొని త్వరలో135 పోస్టులకు నియామకాలు చేపట్టాలను కుంటున్నట్టు వెల్లడించారు. టీఎస్పీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీనికి అనుమతి ఇచ్చారని చెప్పారు. మద్యం విక్రయాలు పెరిగాయి... రాష్ట్రంలో డిమాండ్‌కు తగినంత మద్యం ఉత్పత్తి ఉందని దేవీప్రసాద్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే మద్యం విక్రయాలు పెరిగాయని చెప్పారు. మద్యం పంపిణీ కోసం 18 డిపోలు ఉన్నాయన్నారు. అయితే రవాణా ఇబ్బందిగా మారిందని దుకాణదారుల నుంచి విజ్ఞప్తులు వస్తున్న నేపధ్యంలో సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తి, వికారాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో కొత్తగా డిపోలు పెట్టాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. -
మద్యంపై మహిళల యుద్ధం
మద్యం దుకాణం ఏర్పాటుపై మహిళలు మండిపడ్డారు. దుకాణాన్ని మూసేయాలని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులకు, మహిళలకు తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకొంది. చివరకు పోలీసులను మహిళలు ప్రతిఘటించడంతో మద్యం విక్రయాలను నిలిపివేశారు. సాలూరు: పట్టణంలోని బంగారమ్మపేట మార్గంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ మహిళలు పెద్ద ఎత్తున శనివారం ఆందోళనకు దిగారు. దుకాణం వద్దకు బంగారమ్మపేట, శ్రీనివాసనగర్‌తో పాటు కూర్మరాజుపేట గ్రామానికి చెందిన మహిళలు చేరుకుని మద్యం అమ్మకాలు నిలిపి వేయడమే కాకుండా, షాపును ఇక్కడి నుంచి ఎత్తేయాలని డిమాండ్ చేశారు. దీంతో సాలూరు, పాచిపెంట, రామభద్రపురం మండలాల ఎస్ఐలు మద్యం షాపు వద్దకు చేరుకుని ఆందోళనకారులను కట్టడి చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, మహిళలకు మధ్య వాగ్యుద్ధం జరిగింది. దుకాణంలోకి వెళ్లేందుకు యత్నించిన మహిళలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పెద్ద సంఖ్యలో మహిళలు రావడంతో మద్యం విక్రయాలను నిలిపివేశారు. దీంతో మహిళలు మద్యం దుకాణం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. -
వద్దే.. వద్దు
మార్టూరులో మద్యం దుకాణం నిర్మాణాన్ని అడ్డుకున్న మహిళలు మార్టూరు : మండల కేంద్రమైన మార్టూరులో నూతనంగా ఏర్పాటు చేయబోయిన మరో మద్యం దుకాణం నిర్మాణాన్ని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. స్థానిక నాగరాజుపల్లి రోడ్డులోని కాకతీయ నగర్ సమీపంలో కొత్తగా మద్యం దుకాణం నిర్మాణానికి నిర్వాహకులు పనులు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. మద్యం దుకాణం నిర్మాణాన్ని అడ్డుకున్నారు. నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటుకు ససేమిరా అన్నారు. తమకు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిందని, షాపు నిర్మాణాన్ని అడ్డుకోవద్దని నిర్వాహకులు కోరారు. లైసెన్స్ ఉంటే దుకాణం మీ ఇళ్ల వద్ద పెట్టుకోండంటూ మహిళలు తెగేసి చెప్పారు. ఇళ్ల మధ్య దుకాణం పెడితే సహించేది లేదని మహిళలు హెచ్చరించారు. విషయం తెలుసుకున్న హెడ్ కానిస్టేబుల్ వివేక్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చి ఆందోళనకారులను వారించే ప్రయత్నం చేశారు. అప్పటికీ మహిళలు శాంతించలేదు. చేసేది లేక షాపు నిర్మాణాన్ని పోలీసులు నిలిపి వేయించడంతో వివాదం సద్దుమణిగింది. -
‘కంటైనర్’లో మద్యం విక్రయాలు
- నెల్లూరు జిల్లా పంటపాళెంలో దుకాణాలు - తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న స్థానికులు సరుకులు రవాణా చేసే కంటైనర్లను మద్యం దుకాణాల మాదిరిగా ఉపయోగిస్తున్నారు. ఏకంగా కంటైనర్లలోనే మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాళెం, పోర్టు బైపాస్‌రోడ్డులో ఇలా కంటైనర్లలో మద్యం దుకాణాలు నడుపుతున్నారు. దీనిపై స్థానికుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. –ముత్తుకూరు (సర్వేపల్లి) -
ఆగని మద్యం సెగలు
⇒ ఇళ్ల మధ్య దుకాణాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు ⇒ఎక్సైజ్ శాఖకు 30కి పైగా అభ్యంతరాలు ⇒ ప్రజాందోళనలతో తెరచుకోని 35 శాతం మద్యం షాపులు నెల్లూరు : జిల్లాలో మద్యం దుకాణాలపై రణరంగం కొనసాగుతూనే ఉంది. ఇళ్ల మధ్యన.. గుడి, బడిలకు సమీపంలో దుకా ణాలు పెట్టొద్దంటూ సర్వత్రా నిరసనలు వెల్లువెత్తున్నాయి. నెల్లూరు నగరంతోపాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నిరసనల పర్వం కొనసాగుతూనే ఉంది. రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాలో మహిళలు రోడ్డెక్కి నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రజా ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ముఖ్యనేతలు మద్దతు పలికి ఆందోళనల్లో పాలుపంచుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా 30కి పైగా ప్రాంతాల్లో షాపుల్ని వ్యతిరేకిస్తూ ప్రజల నుంచి ఎక్సైజ్ అధికారులకు వినతులు అందాయి. ఈ పరిణామాల క్రమంలో జిల్లాలో మద్యం వ్యాపారం మందగించింది. 20 రోజులుగా నిరసనలే మద్యం దుకాణాల ఏర్పాటును నిరసిస్తూ జిల్లాలో 20 రోజులుగా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. నెల్లూరు నగరం ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని ఇళ్ల మధ్య దుకాణం ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. నగర ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ పాల్గొన్నారు. అక్కడి దుకాణాన్ని తొలగించే వరకు పరిస్థితిని సమీ క్షించారు. నెల్లూరు రూరల్‌లో పలుచోట్ల నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు, ధర్నాలు జరగ్గా.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పాల్గొని, ముందుండి ఉద్యమం నడిపించారు. ఎక్సైజ్ శాఖ అధికారులను కలిసి షాపులు మార్చే వరకు పరిస్థితిని సమీక్షించారు. కావలిలోని టీచర్స్ కాలనీలో మహిళల ఆందోళనకు అక్కడి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మద్దతు పలికి ధర్నా నిర్వహించారు. షాపును మార్చేవరకు విశ్రమించలేదు. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని వెంకటాచలం మండలం గూడ్లూరువారి పాళెంలో షాపు వద్దంటూ స్థానికులు ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఎమ్మె ల్యే అధికారులతో మాట్లాడారు. తోటపల్లి గూడూరు, ఆత్మకూరు రూరల్‌లోని బజార్ వీధి, నెల్లూరు నగరంలోని తల్ప గిరి కాలనీ సెంటర్, కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెం శివాలయం, ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి, గూడూరు మండలంలోని ఎస్సీ కాలనీ, సోమశిల, ఆత్మకూరు పట్టణంలో షాపుల ఏర్పాటును నిరసిస్తూ ఆందోళనలు కొనసాగాయి. నెల్లూరులోని శెట్టిగుంట రోడ్డులోని షాపు వద్ద మహిళలు నిరసన తెలిపి బోర్డుల్ని ధ్వంసం చేశారు. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ మొదలుకొని జిల్లా కలెక్టర్ వరకు పెద్దసంఖ్యలో వినతిపత్రాలు అందటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. -
ఇళ్ల మధ్యన మద్యం దుకాణాలు వద్దు
విజయనగరం గంటస్తంభం: జనావాసాల మధ్య మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు ఏర్పాటు తగవంటూ పలువురు కలెక్టరేట్ గ్రీవెన్స్‌సెల్ వద్ద సోమవారం ధర్నా చేశారు. విజయనగరం పట్టణం 34వ వార్డులోని మద్యం దుకాణాన్ని ఎత్తేయాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్ రామపండు ఆధ్వర్యంలో కలెక్టర్ వివేక్‌యాదవ్‌కు వినతిపత్రం అందజేశారు. ఉడాకాలనీలో కవిత బార్ ఏర్పాటుపై స్థానిక మహిళలు ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఇప్పటికే మద్యం దుకాణం ఉండగా బార్ ఏర్పాటు చేయడంపై మండిపడ్డారు. తోటపాలెం 22వ వార్డులో కాలేజీలు, స్కూల్స్, దేవాలాయాలు, మసీదు, చర్చిలు ఉన్న చోట మద్యం దుకాణం ఏర్పాటు చేస్తున్నారని, తక్షణం తొలిగించాలని మాలమహనాడు ప్రధాన కార్యదర్శి గొండేల ప్రకాశరావు కోరారు. గ్రీవెన్స్‌సెల్‌కు మొత్తం 188 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో కొన్ని పరిశీలిస్తే.. జన్మభూమి కమిటీలు రాజకీయం చేసి తమ పింఛన్లు తొలిగించారని గరివిడి మండలం కోనూరుకు చెందిన పల్లి పరిశి నాయుడు, పూడి నారాయణ ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఏకంగా 70 మంది ఫించన్లు తొలిగించారని, పోరాడితే 50 మంది పింఛన్లు పునరుద్ధరించారని తెలిపారు. అర్హులందరికీ పింఛన్లు మంజూరయ్యేలా చూడాలని కలెక్టర్‌కు విన్నవించారు. దత్తిరాజేరు మండలం కోరపుకొత్తవలస వద్ద ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించాలని ఎస్.బూర్జవలస సర్పంచి పొట్నూరు రమణ కలెక్టర్‌కు విజ్ఞప్తిచేశారు. బ్యాటరీ ట్రైసైకిళ్లు మంజూరు చేయాలని పార్వతీపురం మండలం పెదబొండపల్లికి చెందిన ఉర్లాప్ ప్రకాశ్, జె.సింహాచలం, జె.సీమమ్మ, గుంట పైడియ్య తదితరులు కోరారు. దత్తిరాజేరు మండలం బోజరాజపురం వీఆర్యే లేకపోవడం వల్ల తమకు సరైన సమాచారం అందడం లేదని, తక్షణమే ఆ పోస్టు మంజూరు చేయాలని గ్రామానికి చెందిన సారిపల్లి చంద్రుడు కోరారు. పింఛన్లు మంజూరు చేయాలని కొందరు... భూసమస్యలు పరిష్కరించాలని మరికొందరు... రుణాలు మంజూరు చేయాలని ఇంకొందరు... ఇలా అనేక సమస్యలపై పలువురు వినతిపత్రాలు సమర్పించారు. -
ఇళ్ల మద్యరణ రంగం
►జిల్లావాసుల ఆందోళనబాట ►అధికారుల తీరుపై కన్నెర్ర ►పలుచోట్ల నిరసనలు ►భీమవరంలో విద్యార్థుల రాస్తారోకో ►ఎక్సైజ్ సీఐని నిలదీసిన మహిళలు ఏలూరు : ఇళ్ల మధ్య మద్యం దుకాణాల ఏర్పాటుపై సోమవారం జిల్లావాసులు కన్నెర్ర చేశారు. సర్కారు, అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. పలు చోట్ల మహిళలు దుకాణాల ఏర్పాటును అడ్డుకున్నారు. రోడ్లపై బైఠాయించి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భీమవరం బైపాస్ రోడ్డులో ఆలయాల ఎదురుగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలంటూ మహిళలు ధర్నా చేపట్టారు. ఆ సమీపంలోనే సిద్ధార్థ ఐటీఐ కళాశాలకు ఎదురుగా ఏర్పాటు చేసిన మరో మద్యం దుకాణ కూడా తొలగించాలంటూ విద్యార్థులు రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ సీఐ కేబీఎల్ రామరాజు అక్కడికి చేరుకుని మహిళలతో చర్చించారు. చివరకు దేవాలయం ఎదురుగా ఉన్న మద్యం దుకాణాన్ని తొలగిస్తామని ఎక్సైజ్ సీఐ హామీ ఇవ్వడంతో మహిళలు ధర్నా విరమించారు. విద్యార్థులు కూడా తమ కళాశాల ఎదురుగా ఉన్న దుకాణం తొలగించాలని ఎక్సైజ్ సీఐని పట్టుబట్టారు. ఆచంట మండలం కొడమంచిలిలోనూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం గ్రామంలోనూ సుమారు 150 మంది మహిళలు ఆందోళన చేశారు. పెంటపాడు మండలం కె.పెంటపాడు గ్రామంలో మూడు రోజులుగా స్థానికులు ఆందోళన చేస్తున్నారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్లో జరిగిన మీ కోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేయడానికి వచ్చారు. ఉండి బాలాజీరావుపేటలో ఇళ్ల మధ్య దుకాణం ఏర్పాటును వందమంది మహిళలు అడ్డుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. నరసాపురం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జరిగిన మీకోసం కార్యక్రమానికీ ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు పెట్టవద్దంటూ వినతులు వెల్లువెత్తాయి. గతంలోనూ ఆందోళనలు ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు లో మద్యం షాపు వద్దంటూ ఇటీవల మహిళలు ఆందోళనలకు దిగారు. అత్తిలి మండలం గోగులమ్మపేటలోనూ గతంలో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. పెరవలి మండలంలోనూ మూడురోజుల క్రితం ఆందోళనలు మిన్నంటాయి. మద్యం షాపులు తొలగించే వరకు పోరాటం చేస్తామని, ఒకవేళ తొలగించడానికి ప్రభుత్వం యత్నించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలకు సీపీఎం, ప్రజా సంఘాలు నాయకత్వం వహించాయి. -
ఎగసిన మద్యం మంటలు
నెల్లూరు (సెంట్రల్) : ఇళ్లమధ్య.. ప్రధాన రహదారుల వెంబడి మద్యం దుకాణాల ఏర్పాటును నిరసిస్తూ జిల్లా మహిళలు ఉద్యమ బాట పట్టారు. సారా వ్యతిరేక ఉద్యమకారిణి దివంగత దూబగుంట రోశమ్మ స్ఫూర్తితో మద్యం మహమ్మారిని నియంత్రించాలంటూ బావుటా ఎత్తారు. పలుచోట్ల నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న మద్యం దుకాణాలను ఇళ్ల మధ్య ఏర్పాటు చేస్తే సహించేది లేదంటూ అక్కడక్కడా ధ్వంస రచనకు పూనుకున్నారు. జాతీయ రహదారి, ప్రధాన రహదారుల వెంబడి దుకాణాలు ఏర్పాటు చేయడంపై సుప్రీం కోర్టు కన్నెర్ర చేయడంతో ఇళ్ల మధ్య వాటిని ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు పూనుకుంటున్నారు. దీనివల్ల తాము ఇళ్లనుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదని, విద్యార్థునులు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే అవకాశం కోల్పోతారనే ఆందోళన నెలకొంది. ఇందుకు వ్యతిరేకంగా మహిళలు ఎక్కడికక్కడ ఆందోళనబాట పట్టారు. జిల్లా వ్యాప్తంగా ధర్నాలు.. నిరసనలు ఇళ్లమధ్య మద్యం దుకాణాలు వద్దంటూ జిల్లా వ్యాప్తంగా సోమవారం ధర్నాలు, నిరసనలు హోరెత్తాయి. నెల్లూరు నగరంలోని తల్పగిరి కాలనీ, కోవూరు నియోజకవర్గ పరిధిలో బుచ్చిరెడ్డిపాలెంలోని శివా లయం వద్ద, ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి ప్రాంతంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయకుండా నిలువరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ డేలో అర్జీలు ఇచ్చారు. వెంకటగిరిలో మద్యం దుకాణాలు వద్దంటూ మనులాలా పేట వాసులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గూడూరు మండలం విందూరు ఎస్సీ కాలనీలో మద్యం షాపు నిర్మాణ పనులను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. తోటగూడూరు మండలంలో మద్యం షాపు వద్దంటూ నరుకూరు సెంటరులో ర్యాలీ నిర్వహించారు. వెంకటాచలం మండలంలోని గుడ్లూరు వారిపాళెంలో మద్యం దుకాణం వద్దంటూ స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. పొదలకూరులో మద్యం షాపు వద్దంటూ తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. కావలి పట్టణంలోని వైకుంఠపురంలో మద్యం షాపు వద్దంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. తుమ్మలపెంట రోడ్డులో మద్యం షాపులు వద్దంటూ ఆందోళన కార్యక్రమాలు జరి గాయి. ఆత్మకూరు పట్టణంలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా దుకాణం ఏర్పాటును దళితులు అడ్డుకున్నారు. అనంతసాగరం మండలం సోమశిల బీసీ కాలనీలో పాత కలువాయి రోడ్డు వద్ద మద్యం దుకాణం ఏర్పాటును స్థానికులు అడ్డుకున్నారు. మద్యం బాటిళ్లు ధ్వంసం ఆత్మకూరు రూరల్ : ఇళ్లమధ్య మద్యం దుకాణం పెట్టొద్దంటూ ఆర్డీఓతోపాటు ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందజేసినా పట్టించుకోకుండా దుకాణం ఏర్పాటు చేయడంతో ఆత్మకూరు పట్టణ మహిళలు ఆగ్రహోదగ్రులయ్యారు. పట్టణంలోని బజారు వీధికి సమీపంలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట మిరియాలకట్ట వద్ద ఏర్పాటు చేసిన దుకాణంలోకి చొచ్చుకెళ్లి మద్యం సీసాలను, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఇక్కడ దుకాణం ఏర్పాటును నిరసిస్తూ ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం ప్రదర్శన, ధర్నాలు నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. సోమవారం రాత్రి అదే స్థలంలో మద్యం దుకాణం తెరవడంతో దళిత మహిళలు ఆగ్రహించి దాడికి దిగారు. మొండిగా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారు. -
మద్యంపై ‘అనంత’ యుద్ధం
జనావాసాల్లో దుకాణాల ఏర్పాటుపై పెల్లుబికిన ఆగ్రహం జిల్లా వ్యాప్తంగా కొనసాగిన ధర్నాలు, రాస్తారోకోలు అనంతపురం : గుడి, బడి తేడా లేకుండా జనావాసాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుపై అనంత ప్రజలు భగ్గుమన్నారు. సోమవారం అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మహిళలు, విద్యార్థులు ఆందోళనలకు దిగారు. నల్లమాడలో కేంద్రంలోని ఆర్డీటీ ఏరియా కార్యాలయం ఎదురుగా మద్యం ఏర్పాటు చేయడంపై ఆర్డీటీ మహిళా సంఘాల సభ్యులు అభ్యంతరం తెలిపారు. సోమవారం నల్లమాడ, ఓడీ చెరువు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఆర్డీటీ సంఘ సభ్యులు ర్యాలీ, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఓడీచెరువు మండల కేంద్రంలోని షాదీమహల్, టీటీసీ కళాశాలకు ఎదురుగా కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం షాపును వెంటనే ఎత్తివేయాలంటూ కళాశాల విద్యార్థులు, సీపీఐ నాయకులు సోమవారం కదిరి- హిందూపురం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాయదుర్గంలోని దాసప్ప రోడ్డులో మద్యం షాపు ఏర్పాటును నిరసిస్తూ కార్మికులు, చిరు వ్యాపారులు తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఇక కదిరి మున్సిపల్ పరిధిలోని ఎర్రగుంటపల్లికి చెందిన మహిళలు సోమవారం తమ గ్రామంలో మద్యం దుకాణం వద్దంటూ జాతీయరహదారిపై ఆందోళన నిర్వహించారు. డిగ్రీ కళాశాలకు సమీపంలో జాతీయరహదారిపై అడ్డంగా బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. జనావాసాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల శాంతిభద్రల సమస్య ఉత్పన్నమవుతుందని, అందువల్ల వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో మొత్తం మద్యం దుకాణాలు : 245 జనావాసాల్లోని మద్యం దుకాణాలు : 178 బెల్టు షాపులు : 2,780 -
కిక్కే.. కిక్కు!
► కర్నూలు గోదాములో ‘వంద కోట్ల’ మద్యం స్టాక్ ► రహదారుల పక్కన ఉన్న 167 దుకాణాలు, 17 బార్లు రద్దు ► జిల్లా వ్యాప్తంగా తెరుచుకున్న 40 దుకాణాలు, రెండు బార్లు ► మొదటి రోజు రూ.1.50 కోట్ల మద్యం కొనుగోలు ► లైసెన్సుల జారీకి అర్ధరాత్రి వరకు కొనసాగిన కసరత్తు ► దరఖాస్తులు సక్రమంగా ఉంటేనే అనుమతి కర్నూలు: మద్యాన్ని భారీగా విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కల్లూరు శివారు పందిపాడు సమీపంలోని హంద్రీనది ఒడ్డున ఉన్న ఐఎంఎల్ డిపోలో దాదాపు వంద కోట్ల రూపాయల విలువ చేసే మద్యం నిల్వ చేసింది. నూతన మద్యం పాలసీలో భాగంగా అనుమతి పత్రాలు పొందిన వ్యాపారులు ఆదివారం మొదటి రోజు రూ.1.50 కోట్ల విలువ చేసే 3500 బాక్సుల మద్యం, 2200 కేసుల బీర్లను కొనుగోలు చేసి దుకాణాలకుతరలించి అమ్మకాలు ప్రారంభించారు. 204 మద్యం దుకాణాలకు ఈ ఏడాది మార్చిలో లాటరీ విధానం ద్వారా లైసెన్సీలను ఖరారు చేయగా, బార్ల పాలసీలో భాగంగా ఐదేళ్ల కాల పరిమితితో పాతవి 37, తాజాగా 10 బార్లను వ్యాపారులకు ఎక్సైజ్ అధికారులు ఖరారు చేశారు. ఆదివారం నంద్యాల ప్రాంతానికి చెందిన రెండు బార్లకు అనుమతి పత్రాలు జారీ కావడంతో అవసరమైన మద్యాన్ని డిపో నుంచి వారు తరలించారు. బారులు తీరిన మందు బాబులు... కొంతమంది మాత్రమే దుకాణాలు తెరవడంతో మందు బాబులు వాటి ముందు బారులు తీరారు. రెండు రోజులుగా జిల్లాలో మద్యం సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. కర్నూలులోని వక్కెర వాగు పక్కనున్న జీవీఆర్ దుకాణంలో గంట వ్యవధిలో రూ.2.50 లక్షల మద్యం అమ్ముడపోయింది. డిపో నుంచి తీసుకొచ్చిన సరుకును దుకాణం వద్ద దింపుతుండగానే మద్యం బాబులు బారుతీరి కొనుగోలు చేశారు. కర్నూలు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కేవలం 10 దుకాణాలు మాత్రమే తెరుచుకోవడంతో అన్ని చోట్ల కూడా కొనుగోలు కోసం మందు బాబులు క్యూకట్టారు. కోర్టు తీర్పుకోసం ఎదురుచూపు.. నగర, పట్టణాల్లో జాతీయ రహదారులను మేజర్ డిస్ట్రిక్ రోడ్స్ (ఎండీఆర్)గా మార్పు చేయాలని కోరుతూ కర్నూలు పట్టణానికి చెందిన కొందరు వ్యాపారులు కోర్టుకెళ్లారు. హైదరాబాద్–బెంగుళూరు జాతీయ రహదారి ఏర్పాటుకు ముందు కర్నూలు మున్సిపల్ కార్యాలయం, ఐదురోడ్ల కూడలి, వయా రాజ్‌విహార్ మీదుగా చిత్తూరు–కర్నూలు రోడ్డు ఉండేది. ప్రభుత్వ రికార్డుల్లో ఇప్పటికే ఆ రోడ్డు జాతీయ రహదారిగా కొనసాగుతుండటంతో నగరంలోని 80 శాతం దుకాణాలు, బార్లు ఇతర ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆ రోడ్డును మేజర్ డిస్ట్రిక్ రోడ్స్‌గా మార్పు చేయాలని కోరుతూ కేఈ జగదీష్‌గౌడ్ అనే వ్యాపారి కోర్టును ఆశ్రయించాడు. ఈ నెల 6వ తేదీన తీర్పు వెలువడనుంది. అది అమలైతే జాతీయ, రాష్ట్ర రహదారులకు 220 మీటర్ల దూరంలో బార్లు కొనసాగించవచ్చన్న ఆశతో వ్యాపారులు ఉన్నారు. కర్నూలు ఎక్సైజ్ జిల్లా పరిధిలో 17 బార్లు, నంద్యాల ఎక్సైజ్పరిధిలో రెండు బార్లు రోడ్సైడు ఉన్నాయి. చివరగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం అటు వ్యాపారులు, ఇటు ఎక్సైజ్ అధికారులు ఎదురు చూస్తున్నారు. ఎలాంటి అభ్యంతరం లేని దుకాణాలకు మాత్రం లైసెన్సులను జారీ చేసేందుకు ఎక్సైజు అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్యూకట్టిన లారీలు... ఐఎంఎల్ డిపోలో భారీ మొత్తంలో స్టాక్ నిల్వ ఉండటంతో ఆదివారం వచ్చిన సరుకును దింపుకోవడానికి ఇబ్బందిగా మారింది. విజయవాడ, తిరుపతి, సింగరాయికొండతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 27 లారీలు మద్యంతో తరలివచ్చాయి. వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి లారీలతో అక్కడికి తరలిరావడంతో డిపో కిటకిటలాడుతోంది. డిపోలో ఉన్న మద్యాన్ని వ్యాపారులకు కేటాయించిన తర్వాతనే లారీల్లో ఉన్న సరుకును గోదాములోకి అనుమతించారు. స్థానచలనం.. జిల్లాలో 167 మద్యం దుకాణాలు, 17 బార్లకు స్థాన చలనం కలగనుంది. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి నిబంధనలు పాటించని షాపులు, బార్లు కనిపిస్తే సీజ్ చేయాలని తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు వ్యాపారుల నుంచి వచ్చిన దరఖాస్తులు సక్రమంగా ఉంటేనే ఎక్సైజ్ అధికారులు లైసెన్సు జారీ చేస్తున్నారు. రహదారులకు 500 మీటర్ల అవతల మాత్రమే మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు శనివారం నుంచే అమలులోకి వచ్చింది. దీంతో నూతన మద్యం పాలసీలో భాగంగా జిల్లాలో 204 దుకాణాలకు 40 మంది లైసెన్సీలు మాత్రమే అనుమతి పత్రాలను తీసుకెళ్లారు. ఇంకా 164 దుకాణాలకు అనుమతి పత్రాలు పెండింగ్‌లో ఉన్నాయి. నంద్యాల ప్రాంతంలో రెండు బార్లకు మాత్రం అనుమతి పత్రాలను ఎక్సైజ్ అధికారులు మంజూరు చేశారు. -
మందుకెందుకో లై‘సెన్స్’?
ఇవన్నీ చూస్తే మద్యం అమ్మకాలు సహజమే కదా? అనిపించవచ్చు! కానీ అవన్నీ అనుమతి లేకుండా జరుగుతున్న విక్రయాలు! వాస్తవానికి పాత మద్యం దుకాణాల లైసెన్స్ గడువు జూన్ 30వ తేదీ అంటే శుక్రవారం రాత్రితో ముగిసిపోయింది. కొత్త మద్యం పాలసీ శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. కానీ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జాతీయ, రాష్ట్రీయ రహదారులకు సమీపంలో ఉండకూడదు. అలాగే విద్యాసంస్థలు, ఆలయాల దగ్గర నిర్వహించకూడదు. ఇవన్నీ పరిశీలించి ఎక్సైజ్ శాఖ లైసెన్స్ ఇవ్వాల్సి ఉంది. కానీ ఆ ప్రక్రియ మొదలుకాలేదు. ఈ దృష్ట్యా పాత దుకాణాలకు మూత వేయాలి... కొత్తవి ఇంకా ప్రారంభించకూడదు! అంటే మద్యం అమ్మకాలు జరగకూడదు! కానీ బెల్ట్‌షాపులు, దాబాలు, కిళ్లీ దుకాణాల్లోనే కాదు సిండికేట్ల గోదాంల నుంచి కేసులకొద్దీ మద్యం మందుబాబులకు శనివారం కావాల్సినంత దొరికింది! ఇంకో వారం పది రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు! సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో 235 మద్యం దుకాణాలకు మూడు నెలల క్రితమే లాటరీ ద్వారా కేటాయింపులు జరిగాయి. అయితే పాత మద్యం దుకాణాల యజమానులకు జూన్ 30వ తేదీ వరకూ లైసెన్స్ గడువు ఉంది. ఈ కారణమే గాకుండా సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు కొత్త లైసెన్స్‌ల జారీ చేపట్టలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జాతీయ, రాష్ట్రీయ రహదారులకు 500 మీటర్ల దూరంలో ఉండకూడదు. అయితే జనాభా 20 వేల కంటే తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం 220 మీటర్లలోపు మద్యం దుకాణాలు ఏర్పాటు చేయవచ్చు. ఈ ప్రకారం ఎక్సైజ్ సిబ్బంది దూరం కొలతలు వేసే పనిలో ఉన్నారు. అలాగే విద్యాసంస్థలు, ఆలయాలకు సమీపంలో ఉండకూడదనే నిబంధనలను కూడా కచ్చితంగా అమలు చేయాలని కోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఈ ప్రకారం దుకాణాల పరిశీలన ఈ మూడు నెలల కాలంలోనే ఎక్సైజ్ అధికారులు పూర్తి చేసి లైసెన్స్‌లు జారీ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ పూర్తికాలేదు. ఇందుకు మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. యథేచ్ఛగా అమ్మకాలు పాత దుకాణాలు మూతపడినా, కొత్త దుకాణాలు ఇంకా తెరుచుకోకపోయినా మద్యం మాత్రం ఎప్పటిలాగే మందుబాబులకు అందుబాటులో ఉంటోంది. బెల్ట్‌షాపులతో పాటు దాబాలు, కిళ్లీబడ్డీలు, సిండికేట్ మద్యం గొడౌన్ల వద్ద కూడా శనివారం అమ్మకాలు యథావిధిగా కొనసాగాయి. జిల్లాలో కొన్నిచోట్ల మద్యం దుకాణాలకు తాళాలు వేసినా వెనుక ద్వారం నుంచి అమ్మకాలు జరిగాయి. కొంతమంది వ్యాపారులు శుక్రవారం రాత్రే సరుకును దుకాణం సమీపంలోని మరో ప్రదేశానికి తరలించి అక్కడే అమ్మకాలు సాగించారు. కాశీబుగ్గ పాత జాతీయ రహదారిలో ఉన్న రెండు మద్యం దుకాణాలు, కేటీ రోడ్డులోని మూడు దుకాణాలు, పలాసలో మూడు దుకాణాల వద్ద బహిరంగంగానే మద్యం విక్రయాలు జరిగాయి. పాత జాతీయ రహదారిలో సాయిబాబా మందిరం వద్ద, జామియా మసీదుకు సమీపంలో సైతం ఈ జోరు కనిపించింది. టెక్కలిలో కూడా దొడ్డి దారిలో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. మందుబాబుల జేబులకు చిల్లు సాధారణంగా వారంతమైన శనివారం, సెలవు దినమైన ఆదివారం మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. పాత, కొత్త మద్యం విధానాల సంధికాలంలో మద్యం అమ్మకాలు అధికారికంగా సాగే అవకాశం లేదు. దీంతో మందుబాబులు శనివారం నాడే బాటిళ్లపై ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఇక ఆదివారం డిమాండును బట్టి ఈ ధర ఇంకా పెరగవచ్చు. దొడ్డిదారిన మద్యం విక్రయాలతో మందుబాబుల జేబులకు చిల్లు పెట్టి సిండికేట్ సొమ్ము చేసుకుంటోంది. సరిహద్దులు మారుతున్నాయ్ జిల్లాలోని జాతీయ, రాష్ట్రీయ రహదారులకు ఆనుకొని 40 వరకూ మద్యం దుకాణాలు, బార్లతో పాటు మద్యం దొరుకుతున్న దాబాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దూరంగా జరిపించడానికి ఎక్సైజ్ అధికారులు కొలతలు వేస్తున్నారు. అలాగే జిల్లాలో ప్రస్తుతం ఉన్న 15 బార్లకు అదనంగా మరో రెండింటికి కొత్తగా అనుమతి వచ్చింది. వీటన్నింటికీ లైసెన్స్‌ల కోసం దుకాణాలు, బార్ల యజమానులు శ్రీకాకుళం, పలాస సర్కిళ్ల పరిధిలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. -
వారికి ‘మామూలే’!
► మద్యం అమ్మకాల్లో ఎమ్మార్పీ తప్పనిసరి చేసిన ఎక్సైజ్ కమిషనర్ ► ఎక్సైజ్ అధికారులకు మామూళ్ల నిలిపివేసిన వ్యాపారులు ► అర్ధరాత్రి అమ్మకాల కోసం పోలీస్ శాఖకు మామూళ్లు ► రక్షకభటుల్లోనూ మార్పు వస్తే అక్రమ అమ్మకాలకు చెక్ సాక్షి, అమరావతిబ్యూరో: మద్యం అక్రమంగా విక్రయించడం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టాల్సిన పోలీసులే పరోక్షంగా ఇందుకు కారణమవుతున్నారు. మద్యం వ్యాపారుల వద్ద మమూళ్లు తీసుకుని అక్రమ అమ్మకాలను చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీనివల్ల పేద, మధ్య తరగతి కుటుంబాల్లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఎక్సైజ్ శాఖ కమిషనర్ లక్ష్మీనరసింహం... ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలని ఆదేశించారు. ఈ మేరకు వ్యాపారులు ఎమ్మార్పీకే మద్యం విక్రయిస్తున్నందున ఎక్సైజ్ శాఖకు నెలవారీ మామూళ్లను నిలిపివేశారు. అయితే, అర్ధరాత్రి వరకు అమ్మకాలు కొనసాగిస్తున్నప్పటికీ పట్టించుకోని పోలీసులు మాత్రం యథావిధిగా డబ్బులు తీసుకుంటూనే ఉన్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఎక్సైజ్ శాఖ కమిషనర్ లక్ష్మీనరసింహం స్వయంగా డీజీపీకి లేఖ రాశారు. దీంతో ఎవరూ మామూళ్లు తీసుకోవద్దని డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీలకు చెప్పినట్లు సమాచారం. పోలీసులు కూడా లంచాలు తీసుకోకుండా... నిబంధనలు పాటించాలని వ్యాపారులను హెచ్చరిస్తే మద్యం అక్రమ విక్రయాలను అరికట్టే అవకాశం ఉంటుంది. ఎక్సైజ్‌కు చెక్..! రాజధాని ప్రాంతంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, తెనాలి, నరసరావుపేట ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల పరిధిలో 695 మద్యం దుకాణాలు ఉన్నాయి. నెలకు ఒక వైన్ షాపు నుంచి రూ.30వేలు చొప్పున మామూళ్లు ఇచ్చేవారు. ఈ లెక్కన 695 షాపుల నుంచి రూ.2.85 కోట్లు వసూలు చేసేవారు. ఆ నగదును ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు పంచుకునేవారు. మరోవైపు స్టేట్ టాస్క్‌ఫోర్స్, జిల్లా టాస్క్‌ఫోర్స్ పేరుతో అదనపు మామూళ్లు ఇచ్చేవాళ్లమని వైన్ షాపుల యజమానులు తెలిపారు. ఇందుకు ప్రతిఫలంగా నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు సాగించేవారు. ఎమ్మార్పీ ఉల్లంఘించేవారు. బెల్టు దుకాణాలు నిర్వహించేవారు. లూజు విక్రయాలు, రాత్రి, పగలు అనే తేడా లేకుండా విక్రయించడం, మద్యంలో కల్తీ చేయడం.. ఇలా అడుగడుగునా ఇష్టానుసారంగా వ్యవహరించేవారు. ఇటీవల ఎక్సైజ్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీనరసింహం నిర్ణయాల వల్ల నెలవారీ మామూళ్లకు చెక్ పడింది. ఎమ్మార్పీ తప్పకుండా అమలు చేయడంతో వైన్ షాపుల యజమానులకు మామూళ్ల బెడద తగ్గింది. అదే సమయంలో ఆదాయం కూడా కాస్త తగ్గింది. దీంతో ఎక్సైజ్ శాఖకు మామూళ్లు ఇచ్చుకోలేమని చెప్పేశారు. నెలవారీ ఆదాయం రాక అధికారులు మథనపడుతూ ఇండెంట్ల పేరుతో ఎంతో కొంత రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నా, వ్యాపారులు మాత్రం ససేమిరా అంటున్నారు. పోలీస్ శాఖ విషయంలో మార్పు లేదు ఎక్సైజ్ శాఖకు మామూళ్లు నిలిపివేసిన మద్యం వ్యాపారులు... పోలీస్ శాఖకు మాత్రం యథావిధిగానే ఇస్తున్నారు. ఒక్కో మద్యం షాపు నుంచి ప్రతి నెలా పోలీస్‌స్టేషన్‌కు రూ.13 వేల చొప్పున సమర్పించుకుంటున్నట్లు వ్యాపారులు తెలిపారు. ఈ క్రమంలో 695 దుకాణాలకు నుంచి నెలకు రూ.90 లక్షల వరకు ముట్టజెబుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఎమ్మార్పీకి మద్యం విక్రయిస్తున్నందున లాభాలు తగ్గాయని, పోలీసులు కూడా కఠినంగా వ్యవహరిస్తే తాము నష్టపోతామని వ్యాపారులు చెబుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విక్రయాలు సాగిస్తే తమకు లాభాలు వస్తాయని, అందుకోసం పోలీసులకు మామూళ్లు ఇస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో రాత్రిళ్లు షాపులు మూసివేసి, పక్కనే బడ్డీ కొట్లు, చిన్న గదుల్లో బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేసి తెల్లవారే వరకు మద్యం విక్రయిస్తున్నారు. పోలీసులు కూడా మమూళ్లు తీసుకోకుండా ఉంటే మద్యం షాపులు నిబంధనల ప్రకారం నడిపే అవకాశం ఉంటుంది. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
ఆదాయానికి అడ్డదారి
⇒ఎక్సయిజ్ ఆదాయానికి కొత్త ఎత్తుగడ ⇒సుప్రీంకోర్టు తీర్పుకు నిలువునా తూట్లు ⇒ఎన్‌హెచ్, ఎస్‌హెచ్‌లు లోకల్ రోడ్లేనట ⇒మద్యం దుకాణాల మార్పుపై కొత్త రూటు ⇒జిల్లాలో 300లకు పైగా దుకాణాలు అక్కడే మద్యం దుకాణాలను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం ‘ నా దారి అడ్డదారే..’ అనే ధోరణిలో ముందుకు వెళుతోంది. రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడానికి జాతీయ రహదారులు (ఎన్‌హెచ్), రాష్ట్ర రహదారుల(ఎస్‌హెచ్)పై ఉన్న మద్యం దుకాణాలే కారణమని.. వీటిని అక్కడి నుంచి తీసేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వక్రీకరిస్తోంది. ఆదాయార్జనకు కొత్త ఎత్తుగడలు వేస్తోంది. చిత్తూరు (అర్బన్): మద్యం విషయంలో ఆదాయార్జనే ముఖ్యంగా సర్కారు వ్యవహరిస్తోంది. జిల్లాలో 430 మద్యం దుకాణాలు, 26 బార్లు ఉన్నాయి. దుకాణా లకు రెండేళ్ల పాటు లైసెన్సులివ్వడం ద్వారా రుసుము, పర్మిట్ల రుసుం రూపంలో రూ.172 కోట్ల ఆదాయం లభిస్తోంది. మద్యం అమ్మకాల ద్వారా ఏటా రూ.2 వేల కోట్ల లావాదేవీలు జరుగుతున్నా యి. ఇంత భారీ స్థాయిలో ఆదాయం సమకూరుతుండటంతో ఆదాయ వనరులను కాపాడుకోవడానికి సుప్రీం కోర్టు తీర్పును అపహాస్యం చేయడానికి సన్నద్ధమవుతోంది. ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదనే వైఖరిలో ఉంది. కోర్టు తీర్పుకు కొత్త భాష్యం.. ఎన్‌హెచ్‌పై 500 మీటర్లు, ఎస్‌హెచ్‌లపై 220 మీటర్ల లోపు మద్యం దుకాణాలు ఉండకూడదని సుప్రీంకోర్టు గతేడాది తీర్పునిచ్చింది. వాహనాలను ఆయా ప్రాంతాల్లో ఆపి మద్యం సేవించడం వల్లే రోడ్డు ప్రమాదాలకు కారణమని కూడా వ్యాఖ్యానించింది. జూలై 1 నుంచి ఈ తీర్పు అమలు చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వానికి ఈ తీర్పు మింగుడుపడలేదు. దీంతో కొత్త ప్రతిపాదనలకు తెరతీసింది. ఇప్పటికే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ఉన్న మద్యం దుకాణాలను అక్కడి నుంచి కదలించకుండా ఎండీఆర్ (జిల్లా మేజర్ రోడ్లు)గా మార్పు చేయాలని భావించింది. 250 కిలో మీటర్ల రోడ్లను ఎండీఆర్ పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఎక్సైజ్ అధికారుల నుంచి ప్రతిపాదనలు తెప్పించుకుంది. వీటిని కేంద్ర రహదారులు, రవాణ మంత్రిత్వశాఖకు పంపించడానికి రంగం సిద్ధం చేసుకుంది. కేంద్ర ఆమోదం తర్వాత∙జిల్లాలోని 250 కి.మీ దూరం ఉన్న రోడ్లు ఎండీఆర్‌గా మారిపోనున్నాయి. ఫలితంగా మద్యం వ్యాపారులు ఎక్కడికక్కడే ఎన్‌హెచ్, ఎస్‌హెచ్‌లపై వ్యాపారాలు పెట్టుకోవచ్చు. వీటికి తోడు జిల్లాలో 9 ప్రాంతాల్లో జాతీయ రహదారులపై ఉన్న బార్లు కూడా యధాస్థితిలో కొనసాగుతాయి. కలిసొస్తున్న బైపాస్ రోడ్లు.. నగరాలు, పట్టణాల్లో వాహనాలు ఎన్‌హెచ్‌లపై వెళ్లకుండా బైపాస్ రోడ్ల మీదుగా వెళ్లడానికి ట్రాఫిక్‌ను మళ్లించారు. జిల్లాలోని చెన్నై–బెంగళూరు, కాణిపాకం–బెంగళూరు, తిరుపతి–పుత్తూరు, తిరుపతి నాయుడుపేట లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న బైపాస్ రోడ్లను ఎన్‌హెచ్‌లుగా గుర్తించి.. మద్యం దుకాణాలున్న జాతీయ రహదారులను స్థానిక రోడ్లుగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపడానికి నివేదిక సిద్ధం చేసింది. -
తీరంలో కిక్..
► ఆలయాలకు దగ్గరలోనే మద్యం దుకాణాలు ► భక్తులు, పర్యాటకుల ఇబ్బందులు చోద్యం చూస్తున్న అధికారులు బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): సాగరతీరం.. విశాఖకు మణిహారం. సాయంత్రమైతే కుటుంబ సమేతంగా నగర వాసులు కాసేపు గడపడానికి ఎంచుకునే రమణీయ స్థలం. నగర వాసులే కాకుండా దూర ప్రాంతా లకు చెందిన సందర్శకులు ఇక్కడి వస్తుంటారు. అయితే బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలు బీచ్ ఖ్యాతికి మాయని మచ్చలా మారుతున్నాయి. పైగా బీచ్‌లో ఉన్న ప్రసిద్ధ ఆలయాల చెంతనే ఉన్న ఈ మద్యం షాపులు భక్తులకు చింతను కలిగిస్తున్నాయి. బీచ్‌రోడ్డులో ఉన్న ఆలయాలను సందర్శించడానికి నిరంతరం వేల సంఖ్యలో భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. అలాంటి చోట మద్యం షాపులను ఏర్పాటు చేయడంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆలయాలు, పాఠశాలలకు 200 అడుగుల దూరం లోపు మద్యం షాపులు ఏర్పాటు చేయకూడదనే నిబంధన ఉంది. అధికారులు, అధికార పార్టీ నాయకుల అండతో నిబంధనలు విరుద్ధంగా ఇక్కడ మద్యం దుకాణాలను నిర్వహిస్తున్నారు. దీనిపై భక్తులు, స్థానికులు తీవ్ర అభ్యంతరం చెబుతున్నా.. అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఇక్కడ మద్యం సేవించిన వారు సముద్రంలో ఈతకు దిగి ప్రమాదాలకు గురైన సందర్భాలెన్నో. కొంత మంది మందుబాబులు తాగిన మత్తులో సందర్శకులను వేధించిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇక్కడ తాగి గొడవలు చేసే వారితో ప్రశాంతత కరువవుతోందని స్థానికులు అంటున్నారు. ఈ విషయమై నెల రోజుల కిందట నగరానికి వచ్చిన ఎక్సైజ్ శాఖ మంత్రికి ఫిర్యాదు చేశామని, సమస్య పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారని స్థానికులు తెలిపారు. ఈ షాపుల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేకపోవడం కొసమెరుపు. బీచ్‌లో కాళీమాత ఆలయానికి చాలా ప్రాధాన్యం ఉంది. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అలాంటి ఈ ఆలయానికి కూతవేటు దూరంలో సాగర వైన్స్ పేరిట మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశారు. అలాగే జూమ్ బార్ పేరుతో నిర్వహిస్తున్న మరో మద్యం షాపు రెండు ఆలయాలకు 50 అడుగుల దూరంలోనే ఉంది. రోజూ వేల సంఖ్యలో పర్యాటకులు తమ పిల్లలతో సేద తీరేందుకు సాగర తీరానికి వస్తుంటారు. వారికి కొట్టొచ్చినట్టు కనిపించేలా మద్యం షాపులు నిర్వహిస్తున్నారు. పెద్ద పెద్ద బోర్డులు పెట్టి మరీ మందుబాబులను ఆకర్షించేలా దుకాణాలు నడపడం గమనార్హం. -
మద్యంపై యుద్ధం
► రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు..దుకాణాల మూత ► ఆత్మాహుతి యత్నాలు – 27 మంది అరెస్ట్ ► లాఠీచార్జ్‌పై ఆగ్రహజ్వాల ► పోలీసు అధికారికి మానవహక్కుల కమిషన్ నోటీస్ సాక్షి ప్రతినిధి, చెన్నై: మద్యం అమ్మకాలపై జనం మరోసారి యుద్ధం ప్రకటించారు. కొత్తగా టాస్మాక్ దుకాణాలను తెరిచే ప్రయత్నాలను అడ్డుకుంటూ బుధవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాస్తారోకోలు, టాస్మాక్ దుకా ణాలపై దాడులు, ఆత్మాహుతి యత్నాలు, నిరాహారదీక్షలతో రాష్ట్రం అట్టుడికిపోయింది. రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం విధించాలని గత ఏడాది ఆరంభంలో ప్రజాందోళనలు సాగాయి. సరిగ్గా అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిషేధం విధిస్తామని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, దశలవారీ మధ్య నిషేధానికి సిద్ధమని అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత హామీ ఇవ్వడంతోపాటూ తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. జయ అధికారంలోకి రాగానే 500 టాస్మాక్‌లను మూసివేయించారు. ఎడపాడి సీఎం అయిన తరువాత మరో 500 టాస్మాక్‌ల ఎత్తివేతకు రంగం సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్రీయ రహదారుల్లో ఉండే మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో తమిళనాడులోని 3231 టాస్మాక్ దుకాణాలు మూతపడ్డాయి. అకస్మాత్తుగా మూతవేస్తే తమగతేమిటని టాస్మాక్ ఉద్యోగులు ఉద్యమానికి దిగారు. సుప్రీంకోర్టుషరతులకు లోబడి కొత్త ప్రాంతాలను గుర్తించి మద్యం దుకాణాలు పెట్టుకోవచ్చని టాస్మాక్ యాజమాన్యం వెసులుబాటు కల్పించింది. కొత్త దుకాణాల ప్రయత్నాలను అడ్డుకుంటూ తిరుప్పూరు జిల్లా సామలాపురంలో మంగళవారం ఆందోళనను చేపట్టిన మహిళలుపై పోలీసులు లాఠీచార్జీకి పాల్పడడం, ఒక మహిళపై చేయిచేసుకోవడం అగ్నిలో ఆజ్యం పోసినట్లయింది. ఉద్యమం ఉగ్రరూపం– అమరణదీక్షలు : పోలీసుల లాఠీచార్జీతో టాస్మాక్ ఉద్యమం బుధవారం ఉగ్రరూపం దాల్చింది. అనేక గ్రామాల్లో ప్రజలు సమావేశమై మద్యం దుకాణాలకు బాడుగకు లేదా లీజుకు ఇవ్వరాదని, కొత్త దుకాణాలను అనుమతించరాదని, పాత దుకాణాలను తరిమివేయాలని తీర్మానాలు చేశారు. నగరాలు, పట్టణాల్లో యువజన సంఘాలు సమావేశమై మంగళవారం రాత్రి నుండి అమరణ నిరాహార దీక్షలు ప్రారంభించారు. రాష్ట్రంలోని మద్యం దుకాణాలన్నీ మూసివేయాలని నినాదాలు చేశారు. తిరుప్పూరు సామలపురం ఈశ్వరన్ ఆలయం సమీపంలోని మైదానంలో ప్రజలు గుమికూడారు. రాత్రంగా దీక్షల్లో ఉన్నవారిని బుధవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. లాఠీచార్జీలకు నిరసనగా రాష్ట్రంలో అనేక దుకాణాలను మూసివేశారు. నామక్కల్, ధర్మపురి, తిరువారూరు, తిరుచ్చిరాపల్లి, తంజావూరు తదితర జిల్లాల్లో సైతం ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేశారు. మహిళపై దాడి చేసిన ఏడీఎస్పీ పాండియరాజన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. మధురైలో సుమారు పది మంది మహిళలు సెల్‌ఫోన్ టవర్ ఎక్కిపోరాటం చేశారు. కోవై, దిండుగల్లు జిల్లాల్లో ఆత్మాహుతి యత్నానికి పాల్పడ్డారు. నడిరోడ్డులో వంటకాలు చేసి నిరసన ప్రకటించారు. టాస్మాక్‌లను నిషేధించకుంటే గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోతామని హెచ్చరించారు.ఈ సందర్బంగా 27 మందిని అరెస్ట్ చేశారు. పోలీసులు జరిపిన లాఠీచార్జీని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, ఎంపీ కనిమొళి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై తీవ్రంగా ఖండించారు. పోరాటం ఆగదు : బాధిత మహిళ ఈశ్వరి పోలీసుల లాఠీచార్జీలకు బెదిరేది లేదు, టాస్మాక్లపై తన పోరాటం కొనసాగుతుందని బాధిత మహిళ ఈశ్వరి బుధవారం ప్రకటించారు. ఏడీఎస్పీ పాండియరాజన్ మహిళలపై లాఠీ చార్జీ చేసుకుంటూ తన వద్దకు వచ్చి స్వయంగా చెంపపై గట్టిగా కొట్టడంతో దిమ్మదిరిగి కళ్లు బైర్లు కమ్మాయని, చెవులు వినిపించలేదని ఆమె వాపోయారు. శాంతియుతంగా సాగుతున్న ఆందోళనను పోలీసులే రెచ్చగొట్టారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వానికి మానవ హక్కుల కమిషన్ నోటీసు: టాస్మాక్ ఉద్యమంలో పాల్గొన్న మహిళలపై విచక్షణా రహితంగా విరుచుకుపడి లాఠీచార్జీ చేసిన సంఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజపీ, పోలీస్ అధికారి పాండియరాజన్‌లకు జాతీయ మానవ హక్కుల కమిషన్ బుధవారం నోటీసు పంపింది. హైకోర్టులో పిటిషన్: తిరుప్పూరు జిల్లా సామలాపురం లో టాస్మాక్ దుకాణాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలపై లాఠీచార్జీ చేసిన అదనపు ఎస్పీ పాండియరాజన్ తదితర పోలీసులను విధులను శాశ్వతంగా తొలగించి తగిన చర్య తీసుకోవాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. -
మరింత పెరిగిన కిక్కు
నేను అధికారంలోకి వస్తే మద్యం అమ్మకాలను విడతల వారీగా తగ్గిస్తా. అక్క చెల్లెమ్మల కన్నీళ్లు తుడుస్తా. బెల్టు షాపు లేకుండా చేస్తా’’ అంటూ 2014 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సభల్లో హమీ ఇచ్చారు. ఇందుకు ఆయా సభలకు హాజరైన ప్రజలే ప్రత్యక్ష సాక్షులుగా నిలిచారు. ఎన్నికలు ముగిశాయి, బాబు ముఖ్య మంత్రి అయ్యారు. ఇక తమ గ్రామంలో ఉన్న బెల్టు షాపు తీసేస్తారనుకున్న మహిళలకు కొద్ది రోజులకే బాబు తత్వం బోధపడింది. ఉన్నవి తొలగించడం దేవుడెరుగు కొత్తగా మరిన్ని బెల్టు షాపులు పుట్టుకొచ్చాయి. ► జిల్లాలో 545 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ► ఇప్పటి వరకు ఉన్నవి 499 ► ఈ ఏడాది నుంచి మరో 46 దుకాణాలు అదనం ► నీటి మూటలవుతున్న బాబు హామీలు ► ఆదాయమే అజెండాగా మద్యం దుకాణాల పెంపు ► మరోవైపు మద్యం వ్యాపారులకు బాబు టోపీ తూర్పుగోదావరి: మద్యం అమ్మకాలను క్రమంగా తగ్గిస్తామన్న హామీ మేరకు దుకాణాల సంఖ్య కుదిస్తారని అనుకున్న మహిళల ఆశలు ఆడియాశలయ్యాయి. రెండేళ్ల కాలపరిమితితో జిల్లాలో 2015 జూలై నుంచి 2017 జూన్ వరకు 499 మద్యం దుకాణాలకు జిల్లాలో అనుమతులు ఇచ్చారు. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం అబ్కారీ సూపరింటెండెంట్ల పరిధిలో ఇవి ఉన్నాయి. అయితే జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణాలను వాటికి 500 మీటర్ల దూరానికి తరలించాలని, లేనిపక్షంలో ఆయా దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట దాదాపు 75 శాతం మద్యం దుకాణాలున్నాయి. జిల్లాలో ఉన్న 499 దుకాణాల్లో 376 దుకాణాలు సుప్రీం కోర్టు తీర్పు పరిధిలోకి వస్తున్నాయి. లైసెన్సు కాలపరిమితి మరో మూడు నెలలున్నా కూడా సుప్రీం తీర్పు నేపథ్యంలో ముందుగానే ఆయా దుకాణాలకు మరో రెండేళ్ల కాలపరివిుతికి లైసెన్సులు జారీ చేసేందుకు ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 545 దుకాణాలకు నోటిఫికేషన్ జారీ... ఇప్పటి వరకు జిల్లాలో 499 మద్యం దుకాణాలున్నాయి. వీటి కాలపరిమితి మరో మూడు నెలలుంది. అయితే సుప్రీం తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ముందుగానే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి జిల్లాలో 545 దుకాణాలకు లైసెన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గతంతో పోల్చుకుంటే అదనంగా 46 దుకాణాలు జిల్లాలో కొత్తగా ఏర్పాటు కానున్నాయి. ఎన్నికల వేళ మద్యం అమ్మకాలను క్రమంగా తగ్గిస్తామన్న చంద్రబాబు ఇప్పడు అందుకు విరుద్ధంగా చేస్తుండడంపై మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మద్యం అమ్మకాలను తగ్గించకపోగా ఆదాయమే ప్రధాన ఎజెండాగా జిల్లాలో ఉన్న దుకాణాలకు అదనంగా మరో 10 శాతం పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా లైసెన్సులు జారీ చేసే దుకాణాలు 2019 జూన్ వరకు కొనసాగనున్నాయి. వ్యాపారులకూ చంద్రబాబు దెబ్బ.. సుప్రీం కోర్టు తీర్పునకు ప్రభావితమయ్యే దుకాణాలు జిల్లాలో 376 ఉన్నాయి. ఇందులో 299 దుకాణాలను తరలిచుకునేందుకు మద్యం వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు సుప్రీం తీర్పును అమలు చేస్తున్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారులు రెండూ కూడా తీర్పులో ఉండడంతో ఎక్కువ సంఖ్యలో దుకాణాలు తరలించడం లేదా తొలగించాల్సి వస్తోంది. జిల్లాలో జాతీయ రహదారుల వెంట 499లో కేవలం 39 దుకాణాలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 335 దుకాణాలు రాష్ట్ర రహదారుల వెంట ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉండడంతో రాష్ట్ర రహదారులను కేసీఆర్ సర్కారు రోడ్లు భవనాల రహదారులుగా మార్పు చేసింది. దాంతో అక్కడ ఉన్న వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. దరఖాస్తులు, లైసెన్సు ఫీజులు రూపంలో లక్షల రూపాయలు ప్రభుత్వానికి కట్టిన వ్యాపారులు మరో మూడు నెలలు ముందుగానే దుకాణాలు సర్దేసేయాలనడంతో భారీగా నష్టపోతున్నారు. అధికారికంగా చెల్లించే ఫీజులుగాక అందుకు అదనంగా కొన్ని చోట్ల యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు మామూళ్లు కూడా సమర్పించుకున్నారు. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలు వ్యాపార సీజన్ కావడం, సుప్రీం తీర్పు అమలు చేస్తుండడంతో మద్యం వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయంపై సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటీషన్ కూడా ఉపసంహరించుకుంది. ప్రస్తుతం వ్యాపారులు వేసిన పిటీషన్ తీర్పు ఈ నెల 27కు వాయిదా పడింది. సుప్రీం తీర్పు అమలుకు మరో ఐదు రోజులు మాత్రమే ఉండడంతో తీర్పు ఎలా వస్తుందోనన్న ఉత్కంఠలో మద్యం వ్యాపారులున్నారు. తెలంగాణ రాష్ట్రంలోలా ఇక్కడ కూడా రాష్ట్ర రహదారులను రోడ్లు భవనాల రోడ్లుగా మారిస్తే దాదాపు 90 శాతం మద్యం దుకాణాలు తొలగించాలి్సన అవసరం ఉండదు. ఫలితంగా తాము పెద్దగా నష్టపోకుండా ఉంటామని వ్యాపారులు పేర్కొంటున్నారు. 24. 27 నెలలకు లైసెన్స్ జారీ చేస్తుండడంతో ప్రభుత్వానికి ఆదాయం మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో బాబు గారి కాసుల వేటలో వ్యాపారులు ఆశలు అడియాశలే కానున్నాయి. -
మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం
► 2017–19 సంవత్సరానికి మద్యం విధానం ప్రకటించిన ప్రభుత్వం ► 30 వరకు దరఖాస్తుల స్వీరణ ► 31న లాటరీ నిర్వహణ విజయనగరం రూరల్ : నూతన మద్యం విధానాన్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 2017–19 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 210 దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ వివేక్‌యాదవ్ శుక్రవారం గజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తులు స్వీకరించడానికి కలెక్టరేట్ సముదాయంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో సర్కిల్ వారీగా బాక్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 31న పట్టణంలోని నాయుడు ఫంక్షన్ హాల్లో లాటరీ నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగలక్ష్మి తెలిపారు. మద్యం విధివిధానాలపై ఎక్సైజ్‌శాఖ అధికారులతో శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం విధానం ద్వారా ఏడు శ్లాబ్‌ల్లో దుకాణాలకు ఫీజు వసూలు చేయనున్నట్లు చెప్పారు. గతేడాది లైసెన్స్ ఫీజుల రూపంలో ఎక్సైజ్ శాఖకు సుమారు వంద కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూరిందన్నారు. అయితే గతంలో ఉన్న లైసెన్స్ ఫీజును ప్రభుత్వం భారీగా తగ్గించి, దరఖాస్తు ఫీజును పెంచిందని తెలిపారు. ఐదు వేల లోపు జనాభా ఉన్న ప్రాంతంలో దుకాణం ఏర్పాటుకు లైసెన్స్ ఫీజు గతంలో రూ. 30 లక్షలుండగా, ప్రస్తుతం రూ. 7.5 లక్షలు.. ఐదు వేల నుంచి 10 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో దుకాణం ఏర్పాటుకు గతంలో రూ. 34 లక్షలుండగా, ప్రస్తుతం రూ. 8.5 లక్షలు.. పది వేల నుంచి 25 వేల లోపు జనాభా ఉంటే గతంలో రూ. 37 లక్షలు కాగా ప్రస్తుతం రూ. 9.5 లక్షలు.. 25 వేల నుంచి 50 వేల లోపు జనాభా ఉంటే గతంలో రూ. 40 లక్షలు వసూలు చేయగా నేడు రూ. 10 లక్షలు వసూలు చేయనున్నట్లు చెప్పారు. అలాగే గతంలో 50 వేలకు పైబడి 3 లక్షల లోపు జనాభా ఉంటే లైసెన్స్ ఫీజు కింద రూ. 45 లక్షలు వసూలు చేయగా ప్రస్తుతం రూ. 11.25 లక్షలు వసూలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో కేవలం 50 వేల లోపు జనాభా, 50 వేల నుంచి మూడు లక్షల జనాభా ఉన్న శ్లాబులే ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా మండలాల పరిధిలో 160 దుకాణాలు, నాలుగు మున్సిపాలిటీల్లో 50 మద్యం దుకాణాలు ఉన్నాయని తెలిపారు. మండల పరిధిలో దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తు ఫీజు ఐదు వేల రూపాయలతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. 50 వేలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో అయితే దరఖాస్తు ఫీజు ఐదు వేల రూపాయలతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు 75 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలాగే వీటితో పాటు ఈఎండీ కింద మూడు లక్షల రూపాయలు డీడీ జతచేయాల్సి ఉంటుందని చెప్పారు. పూర్తి చేసిన దరఖాస్తులను కలెక్టరేట్లోని ఎక్సైజ్ ఈఎస్ కార్యాలయంలో స్టేషన్ల వారీగా ఏర్పాటు చేసిన డబ్బాల్లో వేయాలని సూచించారు. అయితే ఒక ఈఎండీతో ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు తిరిగి చెల్లించరని, దరఖాస్తు చేసుకోవాల్సిన వారు ప్రభుత్వం సూచించిన వెబ్సైట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నారు. వెబ్సైట్లో దరఖాస్తు పూర్తిచేసి, వాటితో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు, ఈఎండీ మూడు లక్షల రూపాయల డీడీ జతచేయాల్సి ఉంటుందని తెలిపారు. పార్వతీపురం డివిజన్ పరిధిలో 69 మద్యం దుకాణాలు ఉండగా, విజయనగరం డివిజన్ పరిధిలో 141 మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే రహదారులకు ఇరువైపులా ఉన్న మద్యం దుకాణాల్లో ఇప్పటికే తరలించిన వాటికి 24 నెలలకు, ఇంకా తరలించని దుకాణాలకు 27 నెలలకు లైసెన్స్ ఫీజు వసూలు చేసి దుకాణాలు కేటాయించనున్నామని డీసీ నాగలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్లు శంభూప్రసాద్, విక్టోరియా రాణి, ఏఈఎస్‌లు వెంకటరావు, త్యాగరాజు, భీమ్‌రెడ్డి, ఎక్సైజ్ సీఐలు, ఎస్ఐలు, తదితరులు పాల్గొన్నారు. -
మద్యం టెండర్లకు కసరత్తు
నేడో.. రేపో నోటిఫికేషన్ - ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ - 29, 30 తేదీల్లో లాటరీ పద్ధతిలో షాపుల కేటాయింపు - 75శాతం మేర తగ్గనున్న లైసెన్సు ఫీజు మచిలీపట్నం : జిల్లాలోని మద్యం దుకాణాల కేటాయింపునకు నోటిఫికేషన్ జారీ చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. బుధవారం లేదా గురువారం నోటిఫికేషన్ విడుదలవుతుందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ఐదు రోజులపాటు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 29, 30 తేదీల్లో మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. జాతీయ, రాష్ట్ర రహదారులకు ఇరువైపులా 500 మీటర్ల మేర మద్యం దుకాణాలు ఉండకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నూతన మద్యం దుకాణాల విషయంలో అమలు చేస్తారు. ఈసారి ముందుగానే... ఈ ఏడాది జూన్ నెలాఖరుకు మద్యం దుకాణాల గడువు ముగియనుంది. జాతీయ, రాష్ట్ర రహదారులకు సమీపంలో మద్యం దుకాణాలు ఉండకూడదనే సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వుల నేపథ్యంలో ఏప్రిల్ ఒకటో తేదీకే మార్పు చేసిన మద్యం విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు మచిలీపట్నం ఎక్సైజ్ ఈఎస్ తెలిపారు. జూన్ 30వ తేదీ వరకు మద్యం దుకాణాలకు పర్మిట్ ఉన్నా.. సుప్రీం ఆంక్షల నేపథ్యంలో ముందస్తుగానే దుకాణాలను కేటాయించనున్నారు. తగ్గనున్న లైసెన్సు ఫీజు గతంలో మండలాలు, నగర పంచాయతీలు, మునిసిపాల్టీలు, కార్పొరేషన్ల వారీగా మద్యం లైసెన్సు ఫీజులను నిర్ణయించారు. మచిలీపట్నం పురపాలక సంఘంలో ఒక్కో షాపునకు రూ.45 లక్షలు లైసెన్సు ఫీజుగా ఉంది. మారిన మద్యం పాలసీ ప్రకారం రూ.12.50 లక్షలు లైసెన్సు ఫీజు నిర్ణయించారు. మండలాల్లో ఒక షాపునకు గతంలో రూ.30 లక్షలు లైసెన్సు ఫీజుగా ఉంటే ప్రస్తుతం రూ.7.5లక్షలుగా ఉంటుంది. గతంలో జనాభా ప్రాతిపదికన వార్డు లేదా గ్రామాల్లో మద్యం దుకాణాలను కేటాయించేవారు. ప్రస్తుతం జాతీయ రహదారులకు దగ్గరగా మద్యం దుకాణాలు ఉండకూడదనే కోర్టు ఉత్తర్వులతో మండలం, పురపాలక సంఘం, కార్పొరేషన్, నగర పంచాయతీలను ఒక యూనిట్‌గా పరిగణిస్తున్నారు. ఈసారి నోటిఫికేషన్లో ఏ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయాలో సంబంధిత ప్రాంతాన్ని ప్రస్తావించరని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. మద్యం దుకాణాలకు పర్మిట్ రూమ్ అనుమతి కోసం రూ.5 లక్షలు, ఏడాది పూర్తయిన తరువాత రీ–రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంది. అధిక ధరకు మద్యం విక్రయిస్తూ పట్టుబడితే రూ.5 లక్షలు జరిమానా విధిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.5వేలు మద్యం దుకాణాలకు రూ.5వేలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి. మండలంలో రూ.50వేలు, మునిసిపాల్టీలో రూ.75వేలు, కార్పొరేషన్లో రూ.లక్ష రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎక్సైజ్‌శాఖ రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు, ఐటీ రిటర్న్స్ తదితర వివరాలను పరిశీలించి హాల్‌టికెట్ ఇస్తారు. ఈ హాల్‌టికెట్‌కు యూనిక్ ఐడీ, పాస్వర్డ్ ఉంటుంది. వీటిని సంబంధిత ఎక్సైజ్ సీఐ, సూపరింటెండెంట్ పరిశీలించి ఆమోదం తెలుపుతారు. ఈ హాల్‌టికెట్ యునిక్ కోడ్ సక్రమంగా ఉంటేనే దరఖాస్తుదారులు లాటరీ సమయంలో హాజరయ్యేందుకు అవకాశం ఇస్తారు. మద్యం షాపుల కేటాయింపు, దరఖాస్తుల స్వీకరణ అంతా ఆన్లైన్లోనే ఉన్నా.. షాపుల కేటాయింపు మాత్రం దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ పద్ధతిలోనే నిర్వహిస్తారు. గతంలో జిల్లాలోని 334 మద్యం దుకాణాలకు 3,333 దరఖాస్తులు రాగా, రూ.12.57 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. ఈసారి అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చి రూ.15 కోట్లు ఆదాయం వస్తుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. -
తాళిబొట్లు తెంచడమే బాబు లక్ష్యమా?
బీటీఆర్ కాలనీలో గుడిపక్కన మద్యం షాపు ఏర్పాటుపై మండిపాటు అడ్డుకున్న స్థానిక మహిళలు తిరుపతి మంగళం: అడుగడుగుకూ మద్యం షాపులు పెట్టి సీఎం చంద్రబాబు నాయుడు ఆడపడుచుల తాళిబొట్లు తెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మంగ ళం బీటీఆర్‌కాలనీ మహిళలు మండిపడ్డారు. హైవేల్లో మద్యం షాపులు తొలగించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను పక్కనబెట్టి మంగళవారం రాత్రి తిరుపతి అర్బన్ మండలం శెట్టిపల్లి పంచాయతీ బీటీఆర్‌కాలనీ సమీపంలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి 20మీటర్ల దూరంలో తిరుపతి–కరకంబాడి రోడ్డులో మద్యం షాపు ఏర్పాటుకు ప్రయత్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఇన్చార్జ్ లక్ష్మీనారాయణ, సీపీఐ నాయకులు వరగంటి లక్ష్మయ్యతో కలిసి స్థానిక మహిళలు దాన్ని అడ్డుకున్నారు. రెండుగంటల పాటు మద్యం షాపు యజమానులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. షాపు పెడిగే తీవ్ర పరిణా మాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మహిళలు హెచ్చరించారు. అలిపిరి పోలీసులు అక్కడికి చేరుకుని ఎక్సై జ్ అధికారులతో మాట్లాడిన తర్వాత మద్యం షాపు ఏర్పాటు చేసుకోవాలని యజమానులకు సూచించా రు. వైఎస్సార్సీపీ నాయకుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పేదలకు గుక్కెడు తాగునీరు ఇవ్వలేని చంద్రబాబు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు కూలీనాలి చేసుకుని సంపాదించిన డబ్బును తాగుడికే తగలేస్తున్నారని, తద్వారా వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయని తెలిపారు. నిత్యం విద్యార్థులు తిరిగే ప్రాంతంలో మద్యం షాపునకు అనుమతి ఇవ్వకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. -
మద్యం షాపులకు తప్పని స్థాన చలనం
⇔సుప్రీం కోర్టు ఉత్తర్వులతో జిల్లాలో 200 మద్యం షాపుల తరలింపు ⇔ప్రధాన రహదారులకు 500 మీటర్ల దూరంలో ఏర్పాటుకు కసరత్తు ⇔ఇప్పటికే నోటీసులు జారీ చేసిన ఎక్సైజ్ అధికారులు తిరుపతి క్రైం: రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు పక్కన ఉన్న మద్యం షాపులను తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమ ఉత్తర్వులను 2017 ఏప్రిల్ 1 నుంచి తప్పని సరిగా అమలు చేయాలని ఆదేశించింది. ఆయా ప్రధాన రహదారులకు 500 మీటర్ల దూరంగా ఆలయాలకు, విద్యాసంస్థలకు 100 మీటర్ల దూరంలో ఉండాలని నిర్దేశించింది. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం జిల్లాలోని సుమారు 200 దుకాణాలను తొలగించాల్సింది. దీంతో మద్యం దుకాణాల నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. ఇటు ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే అలాంటి దుకాణాలకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో వేరొక చోట షాపుల ఏర్పాటుకు ఎక్సైజ్ అధికారులు, వైన్‌షాపు యజమానులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా జిల్లాలో మద్యం దుకాణాలు విచ్చలవిడిగా ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో జనసాంధ్రతను బట్టి దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ అంతర్రాష్ట్ర సరిహద్దుల ఆధారంగా దుకాణాలు వెలిశాయి. ప్రస్తుతం చిత్తూరు ఎక్సైజ్‌శాఖ పరిధిలో 206, తిరుపతి పరిధిలో 190 దుకాణాలకు ప్రభుత్వం లైసెన్స్‌లు జారీ చేసింది. ఏటా సగటున రూ.255 కోట్లుకు పైగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. అలాగే లైసెన్స్ ఫీజుల రూపంలో రూ.350 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. ఈ తరుణంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లాలోని సుమారు 200 షాపుల వరకు తొలగించి వేరొక చోట ఏర్పాటు చేసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ప్రధాన రహదారుల్లో... ⇔చెన్నై– బెంగళూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 4)లో 28 మద్యం దుకాణాలు ఉన్నాయి. ⇔కలకడ–చిత్తూరు (ఎన్‌హెచ్ 40) రోడ్డుపై 11 మద్యం దుకాణాలు ఉన్నాయి. ⇔మదనపల్లె – క్రిష్ణగిరి (ఎన్‌హెచ్ 42) రోడ్డుపై 18 మద్యం దుకాణాలు ఉన్నాయి. ⇔రేణిగుంట (ఎన్‌హెచ్ 716) రోడ్డులో 21 మద్యం దుకాణాలు ఉన్నాయి. ⇔పూతలపట్టు – తిరుపతి (ఎన్‌హెచ్ 140) రోడ్డులో 32 మద్యం దుకాణాలు ఉన్నాయి. ⇔పుత్తూరు రాష్ట్ర రహదారిపై 17 మద్యం దుకాణాలున్నాయి. ⇔జిల్లాలో ఎన్‌హెచ్, ఎస్‌హెచ్‌లపై 8 బార్లు, జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న 98 అనధికార మద్యం దుకాణాలను తొలగించాల్సిందే. కోర్టు తీర్పుపై ఎదురుచూపు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు చేసింది. జాతీయ ప్రధాన రహదారులను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. రాష్ట్ర రహదారులు ఇళ్ల మధ్యలో కూడా వెళ్లాయని, అటువంటి వాటిని మినహాయించాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై ఈ నెల 22వ తేదీన కోర్టు తీర్పు వెలువడనుంది. ఈ తీర్పుపైనే మద్యం షాపుల యజమానులు, ఎక్సైజ్ అధికారులు ఆశలు పెట్టుకున్నారు. తీర్పు ఎలా వస్తుందనేది వేచి చూడాలి. -
సీన్ రివర్స్..!
నల్లగొండ : సరిగ్గా ఏడాది క్రితం మద్యం విక్రయాల్లో రాష్ట్రంలో నల్లగొండ జిల్లా మూడో స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. పల్లె నుంచి పట్నం వరకు నాటుసారా నామరూపాలు లేకుండా చేయడం ద్వారా మద్యం ఏరులై పారింది. దీంతో మద్యం విక్రయాల ద్వారా నెలకు సుమారు రూ.138.93 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. దీనికి పూర్తి భిన్నంగా ప్రస్తుత పరిస్థితులు పయనిస్తున్నాయి. కారణాలు ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం నెలకు రూ.2.75 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. మద్యం విక్రయాల్లో ఎక్సైజ్ శాఖ వైఫల్యాన్ని పసిగట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నేరుగా రంగం ప్రవేశం చేయాల్సి వచ్చింది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో మద్యం దుకాణాలు 264, బార్లు 25 ఉన్నాయి. వీటి ద్వారా 2016 జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు లిక్కర్ 2,37,794 పెట్టెలు అమ్ముడుకాగా...బీర్లు 2,52,750 పెట్టెలు అమ్మారు. తద్వారా ప్రభుత్వానికి రూ.114.92 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది అదే రోజుల్లో లిక్కర్ 2,29,661 పెట్టెలు, బీర్లు 2,16,328 పెట్టెలు మాత్రమే అమ్ముడయ్యాయి. దీంతో ప్రభుత్వానికి రూ.112.17 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే మద్యం విక్రయాలు 2.39 శాతానికి పడిపోయాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.2.75 కోట్ల లోటు ఏర్పడింది. ఈ లోటును పూడ్చేందుకు ఎక్సైజ్ శాఖ శతవిధాలా ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. స్టేషన్ల వారీగా పరిశీలిస్తే.... మూడు జిల్లాల్లో కలిపి ఎక్సైజ్ ఎస్హెచ్ఓలు 15 ఉన్నాయి. వీటిల్లో భువనగిరి ఎస్హెచ్ఓ మినహా మిగిలిన 14 స్టేషన్ల పరిధిలో లిక్కర్, బీర్ల విక్రయాలు దారుణంగా పడిపోయాయి. ప్రధానంగా బీర్ల విక్రయాలు మిర్యాలగూడ స్టేషన్ పరిధిలో 41.75 శాతం, నకిరేకల్ స్టేషన్ పరిధిలో 34.73, చండూరులో 19.70, హాలియాలో 29.91, నాంపల్లిలో 25.01, సూర్యాపేటలో 14.19, తుంగతుర్తిలో 27.73, హుజూర్‌నగర్‌లో 15.46 శాతానికి పడిపోయాయి. లిక్కర్ అమ్మకాలు దేవరకొండ స్టేషన్ పరిధిలో 12.17 శాతం, హాలియా 21.11 శాతం పడిపోయి. మిగిలిన స్టేషన్లల్లో 7.80 శాతం నుంచి 0.15 శాతానికి తగ్గాయి. అధికారుల అన్వేషణ మద్యం విక్రయాలు అమాంతంగా పడిపోవడానికి గల కారణాలను అన్వేషించే పనిలో భాగంగా ఎక్సైజ్ శాఖ కొన్ని ప్రధానమైన అంశాలతో ఒక నివేదిక రూపొందించింది. జిల్లా అధికారుల నివేదికలు, మద్యం వ్యా పారులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను క్రోడీకరించిన స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్...వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు నేరుగా రంగ ప్రవేశం చేసింది. నివేదికలోని ప్రధానాంశాలు లిక్కర్ విక్రయాలు తగ్గిన ప్రాంతాల్లో నాటుసారా ఆనవాళ్లు పూర్తిగా సమసిపోలేదని తెలిసింది. ప్రధానంగా దేవరకొండ, హాలియా, నాంపల్లి, మిర్యాలగూడ, చండూరు, తుంగతుర్తి స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో నాటుసారా విక్రయాలు ఊపందుకున్నాయి. సారాపై ఉక్కుపాదం మోపిన తర్వాత గ్రామాల్లో విపరీతంగా సేల్ అయిన ఆర్డనరీ (చీప్ లిక్కర్) లిక్కర్ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. గతేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో చీప్ లిక్కర్ సేల్స్ నల్లగొండ, దేవరకొండ, నకిరేకల్, చండూరు, హాలియా, నాంపల్లి స్టేషన్ల పరిధిలో 14 శాతానికి పడిపోయాయి. కరెన్సీ ఇబ్బందుల వల్ల గ్రామాల్లో మందుబాబులు సారా బాట పట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇటీవల పెంచిన మద్యం ధరల్లో స్ట్రాంగు బీరు రూ.95 నుంచి రూ.110కి పెంచారు. దీంతో బీర్లు సేవించే వారంతా మీడియం బ్రాండ్ల వైపు మొగ్గుచూపుతున్నారు. అలాగే ఎగువ మధ్యతరగతి వారు సేవించే ప్రీమియం బ్రాండ్ల ధరలు కూడా విపరీతంగా పెరగడంతో వాటి సేల్స్ కూడా 8 శాతానికి పడిపోయాయి. -
మద్య నిషేధాన్ని అమలు చేయాలి
వీహెచ్ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఏఐసీసీ కార్యదర్శి వి.హను మంతరావు డిమాండ్ చేశారు. ఆదివారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లా డుతూ.. ఖజానా నింపుకోవడానికి విచ్చల విడిగా మద్యం దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆరోపించారు. మద్యం అమ్మకాలు పెరగడం వల్ల తాగుబోతులతో మహిళలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని అన్నారు. మద్యం వల్ల యువత పక్కదారి పడుతోందన్నారు. బిహార్ తరహాలో మద్యపాన నిషేధంపై రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఒక నిర్ణయానికి రావాలని వీహెచ్ కోరారు. మద్యపాన నిషేధంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలని తమ పార్టీని కోరుతానని వీహెచ్ చెప్పారు. -
మత్తులో మునిగి తేలారు..
ఇక మందు ప్రియులు మద్యపానంలో ముందున్నారు. కనుమ పండగ ఆదివారం రావడంతో ఎక్సైజ్ అధికారులు ’మందు’జాగ్రత్తలు తీసుకున్నారు. ఇండెంటును బట్టి రోజువారీ వినియోగంకంటే రెండు, మూడు రెట్ల అధికంగా మద్యాన్ని ఆయా షాపులకు సరఫరా చేశారు. సాధారణంగా జిల్లాలో సగటున రూ.4 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయి. ఈ లెక్కన కనీసం రూ.8 కోట్ల లిక్కర్ విక్రయాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖలోని అనధికార వర్గాల సమాచారం. ఆదివారం సెలవు దినం కావడం వల్ల మద్యం అలవాటున్న వారు తమ స్నేహితులు, చుట్టాలతో కలిసి మజా చేశారు. ప్రత్యేకంగా పార్టీలు ఏర్పాటు చేసుకున్నారు. మామూలు రోజులకంటే ఆదివారం మరింతగా మత్తులో మునిగితేలారు. మొత్తమ్మీద కనుమ పండగ సందర్భంగా మందు, చికెన్, మటన్లకు జిల్లా వాసులు రూ.20 కోట్లు ఖర్చు చేసినట్టు స్పష్టమవుతోంది. -
‘కొత్త’ సంబరం.. రూ.35 కోట్లు
ఉమ్మడి జిల్లాలో రూ.20 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు దసరాను మరిపించిన మాంసం విక్రయాలు జోరుగా కేక్‌లు, మిఠాయిల అమ్మకాలు కనిపించని నోట్ల రద్దు ప్రభావం మంచిర్యాల రూరల్(హాజీపూర్) కొత్త ఏడాది సంబరం అంబరాన్నంటింది. ఉమ్మడి జిల్లాలో ప్రజలు సుమారు రూ.35 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 31 శనివారానికి తోడు ఆదివారం సెలవు దినం కలిసి రావడంతో కావడంతో జోష్ పెంచింది. మద్యం, మాంసం, కేక్‌లు, మిఠాయిల విక్రయాలు జోరుగా సాగాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని హాజీపూర్ మండలం గుడిపేట లిక్కర్ డిపో పరిధిలో 140 వరకు మద్యం దుకాణాలు, బార్లు, ఉట్నూర్ లిక్కర్ డిపో పరిధిలో 90 మద్యం దుకాణాలు, బార్లు ఉన్నాయి. ఆయా దుకాణాలకు శుక్ర, శని, ఆదివారాల్లో సుమారు రూ.20 కోట్ల విలువైన మద్యం సరఫరా జరిగినట్లు తెలుస్తోంది. గత ఏడాది అమ్మకాల కన్నా ఈ ఏడాది 25 శాతం ఎక్కువగా అమ్మకాలు జరిగిట్లు అంచనా. మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మద్యంతోపాటు మాంసం, కేక్‌లు, మిఠాయిల, శీతల పానీయాల విక్రయాలు జోరుగా సాగాయి. పలువురు మిఠాయిలు పంచుతూ స్నేహితులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. యువకులు గ్రీటింగ్‌లు, మొబైల్స్‌లో ఇంటర్నెట్ డాటా, ఎస్సెమ్మెస్‌లు, మహిళలు ఇళ్ల ముందు ముగ్గులు వేయడానికి రంగుల కొనుగోలుకు డబ్బులు ఖర్చు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు స్థాయిలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మాంసం, మద్యం విక్రయాలు దసరా పండుగను మరిపించాయి. అన్ని వర్గాల ప్రజలు నూతన సంవత్సర వేడుకలు చేసుకోవడంతో కొనుగోలు పెరిగినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. మంచిర్యాలలో మాంసం దుకాణాలు 50, చికెన్‌సెంటర్లు 30 వరకు ఉన్నాయి. మొత్తంగా జిల్లాలో రూ.60 లక్షల వరకు వ్యాపారం సాగినట్లు తెలుస్తోంది. మంచిర్యాల, సింగరేణి ప్రాంతంలో చికెన్, మటన్ విక్రయాలు శని, ఆదివారాల్లో భారీగా సాగాయి. కేక్‌లు.. మిఠాయిలు.. నూతన సంవత్సర వేడుకలతో బేకరీలు, మిఠాయి దుకాణాలు కిటకిటలాడాయి. ఒక్క మంచిర్యాల పట్టణంలోనే రూ.70 లక్షల వరకు కేక్‌లు, కూల్‌డ్రింక్స్ అమ్మకాలు జరిగాయి. ఈ లెక్కన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.2 కోట్లపై వరకు అమ్మకాలు జరిగినట్లు అంచనా. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడానికి ఇంటి లోగిళ్ల ముందు రంగులతో ముగ్గులు వేయడానికి మంచిర్యాల పట్టణంలోనే రూ.12 లక్షల విలువైన రంగులు వాడారని వ్యాపారులు తెలిపారు. నాలుగు జిల్లాల వ్యాప్తంగా రూ.కోటి వరకు రంగుల అమ్మకాలు జరిగినట్లు అంచనా. వీటితోపాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి పూలు, బొకెలు, బాణాసంచా తదితర వాటికి పెద్ద మొత్తంలోనే ఖర్చు జరిగినట్లు తెలుస్తుంది. ఏదేమైనా కొత్త సంవత్సరం ప్రజలకు ఆనందాన్ని పంచడానికి భారీగా ఖర్చు పెట్టించింది. నోట్ల రద్దు ప్రభావం ఎక్కడా మచ్చుకు కూడా కనిపించకపోవడం కొసమెరుపు. -
ఫుల్‌గా తాగేశారు!
వారం రోజుల్లో రూ. 23 కోట్ల పైగా మద్యం విక్రయాలు గతేడాది కన్నా రూ. 2 కోట్ల 33 లక్షలు అధికం నిజామాబాద్ క్రైం : కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. వారం రోజుల్లో రూ. 23 కోట్ల 75లక్షలకు పైగా మద్యం అమ్మకాలు సాగాయి. కొత్త సంవత్సరం సందర్భంగా మ ద్యం వ్యాపారులు భారీ స్థాయిలో మద్యాన్ని డంప్ చేసుకున్నారు. గతేడాది డిసెంబర్ చివరి వారం రోజు ల్లో అమ్ముడైన మద్యం కంటే ఈ ఏడాది రూ. 2 కోట్ల 33 లక్షల మద్యం విక్రయాలు ఎక్కువ అయ్యాయి. ప్ర భుత్వం ఎప్పటిలాగే ఈసారి కూడా కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయాలకు గంట సమయం పొడిగించింది. నిత్యం మద్యం దుకాణాలు రాత్రి 10 గం టలకు, బార్లు రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుండ గా, పొడిగించిన ప్రకారం మద్యం దుకాణాలకు 11 గంటల వరకు, బార్లు రాత్రి 12 గంటల వరకు అ నుమతించారు. దీంతో మందుబాబులు ఎగబడి మ ద్యాన్ని కొనుగోలు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా వ్యాపారులు వారం రోజుల క్రితం నుంచే మ ద్యాన్ని డంప్ చేసుకున్నారు. మాక్లూర్ మండలం మా దాపూర్లో గల తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్(ఐఎంఎఫ్ఎల్ డిపో) నుంచి ఈ నెల 24 నుంచి 31 వరకు రూ. 23 కోట్ల 75లక్షల 89వేల 346లు మద్యం విక్రయాలు జరిగాయంటే ఏ మేరకు మద్యాన్ని డంప్ చేసుకున్నారో అర్థమవుతోంది. విక్రయాలలో ఈసారి కూడా బీర్ల హవా కొనసాగింది. లిక్కర్ 40,642 కార్టు న్లు అమ్ముడు పోగా, బీర్లు 49,717 అమ్ముడుపోవడం గమనార్హం. గతేడాది 2015 డిసెంబర్ చివరి వారంలో ఐఎంఎల్ 30,570 కార్టున్లు, బీర్లు 44,732 కార్టున్లు విక్రయించారు. వీటి విలువ రూ. 21 కోట్ల 42 లక్షల 53వే ల 617లు జిల్లా రెండుగా విడిపోయినప్పటికి ఇంకా కామారెడ్డి జిల్లాకు ఐఎంఎల్ డిపోను ఏర్పాటు చేయలేదు. ఇప్పటికి నిజామాబాద్ జిల్లా మాక్లూర్ ఐఎంఎల్ డిపో నుండే మద్యం కామారెడ్డి జిల్లాకు వెళ్తోంది. 2016 డిసెంబర్ 24 నుంచి 31వరకు మద్యం విక్రయాలు జరిగిన తీరు.. -
మద్యాన్ని నియంత్రించకుంటే ఉద్యమం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ హెచ్చరిక - మద్యం అమ్మకాల నియంత్రణకు పార్టీ ఆధ్వర్యంలో దీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం నియం త్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే ఈ అంశంపై తమ పార్టీ తీవ్ర స్థారుులో ఉద్యమిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ హెచ్చరించారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్న ప్రభు త్వం, మద్యాన్ని కేవలం ఆదాయ వనరుగానే చూడడం మానుకోవాలన్నారు. పేదలు, యువత ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఆదాయా న్ని సమకూర్చుకోవడాన్ని చూస్తూ, ప్రేక్షక పాత్ర వహించాలా అని ప్రశ్నించారు. ప్రభు త్వ విధానాలతో సమాజం విచ్ఛిన్నమవుతుం టే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమన్నా రు. ప్రభుత్వపరంగా మద్యంపై నియంత్రణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని ఎక్సైజ్, ప్రొహిబిషన్ కార్యాలయం ఎదుట బీజేపీ సీనియర్ నేత ప్రొఫెసర్ ఎస్వీ శేషగిరిరావు శుక్రవారం చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షను లక్ష్మణ్ ప్రారంభించారు. లక్ష్మణ్ మాట్లాడుతూ అబ్కారీ శాఖను ప్రొహిబిషన్ శాఖగా పేర్కొంటున్న ప్రభు త్వం మద్యం నియంత్రణకు కనీసం ఒక్క అడుగు కూడా వేయలేదన్నారు. మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోందని అన్నారు. మద్యాన్ని నియంత్రించి పేద ప్రజలను కాపాడాలని పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు సూచించారు. పెన్షన్ల డబ్బులు మద్యానికే... తెలంగాణలో మద్యాన్ని అడ్డుకోవడానికి బీజేపీ నడుం కట్టిందని శేషగిరిరావు అన్నా రు. జాతీయ ఉపాధిహామీ కూలీలు, వృద్ధా ప్య, వితంతు పెన్షన్ల డబ్బులు, సింగరేణి కార్మికులు జీతాలు.. ఇలా అధికశాతం మద్యం కోసం ఖర్చవుతున్నాయంటే అతిశ యోక్తి కాదన్నారు. ఆదాయమే పరమావధిగా మద్యం అమ్మకాలను పెంచుతూ బంగారు తెలంగాణ లక్ష్యాన్ని మరచిపోయారని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పేదల ఆరోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అమ్మకాలపై దశల వారీగా నియంత్ర ణ చేపట్టాలన్నారు. పార్టీ నేతలు ఎన్.రామ చంద్రరావు, నాగం జనార్దన్‌రెడ్డి, పేరాల శేఖర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్,ఎం.ధర్మారావు, టి.రాజేశ్వరరావు, బద్దం బాల్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, వన్నాల శ్రీరాములు, జి.ప్రేమేందర్‌రెడ్డి, కొండ్రు పుష్పలీల, ఆకుల విజయ తదిత రులు పాల్గొన్నారు. -
వైన్ షాపు.. వెల వెల..
• ‘గ్రేటర్’లో 60% పడిపోరుున మద్యం అమ్మకాలు • పాత నోట్ల కారణంగా బోసిపోయిన వైన్ షాపులు, బార్లు పెద్ద నోట్ల రద్దు గ్రేటర్లో మందుబాబులకూ కష్టాలు తెచ్చిపెట్టింది. బుధ, గురువారాల్లో మహానగరం పరిధిలోని 300మద్యం దుకాణాలు, 571 బార్లలో మద్యం అమ్మకాలు 60% మేర పడిపోరుునట్లు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం దుకాణంలో కొనుగోలు కోసం వస్తున్న వారు రూ.500, రూ.1,000 నోట్లను తీసుకువస్తుండడంతో దుకాణదారులు ఆ నోట్లను తిరస్కరిస్తున్నారు. దీంతో 50 నుంచి 60 శాతం మంది మద్యం కొనకుండానే తిరిగి వెళ్లిపోతున్నారని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. నగర శివారు ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి కటాన్ల కొద్ది మద్యం కొనుగోలు చేసేవారు సైతం దిక్కులేకపోవడంతో దుకాణాలు వెలవెలబోతున్నారుు. కోఠి రంగ్‌మహల్ చౌరస్తాలోని బగ్గా వైన్సలో ఈ రెండు రోజుల్లో 40% అమ్మకాలు మాత్రమే జరిగినట్టు దుకాణం యజమానులు తెలిపారు. హైదరాబాద్ వైన్ షాపుల నిర్వాహకులు వంద నోట్లు ఉంటేనే మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. కొన్ని దుకాణాల్లో మాత్రం డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా అమ్మకాలు సాగుతున్నారుు. మద్యం ప్రియులకు డెబిట్, క్రెడిట్ కార్డుల వల్ల మద్యం సీసాలు దొరుకుతుండడంతో వారు కొంత ఊరట చెందుతున్నారు. వైన్ షాపు నిర్వాహకులు సైతం డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నవారికి మాత్రం ఆహ్వానించి కార్డు స్వైప్ చేసుకుని మద్యం బాటిళ్లను వారి చేతుల్లో పెడుతున్నారు. బార్లు సైతం వెలవెల.. పెద్ద నోట్ల రద్దుతో బార్లు కూడా వెలవెలబోతున్నారుు. బారు వద్ద పార్కింగ్ నుంచి మొదలుకుని వెరుుటర్ వరకు వంద నోట్లు ఉన్నాయా అని మందుబాబులను ముందే ప్రశ్నిస్తున్నారు. బారులో బిల్లు వందల నుంచి వేల రూపాయల వరకు అరుునా దర్జాగా కట్టి వెరుుటర్కు ఓ వంద టిప్పు ఇచ్చే వాళ్లను సైతం వంద నోటు ఉంటేనే సాదరంగా ఆహ్వానిస్తున్నారు. దీంతో చాలా బార్లు మందుబాబులు లేక వెలవెలబోతున్నారుు. -
ఇక అడుగుకో బార్
-
ఇక అడుగుకో బార్
బీచ్‌లలో మద్యం విక్రయాలకు లైసెన్స్ సాక్షి, అమరావతి: బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి మాటల స్ఫూర్తితో ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం అడుగుకో బార్‌కు అనుమతులు ఇచ్చేయనుంది. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో గల ఆహార పార్లర్స్లోను, బీచ్‌లలోనూ మద్యం విక్రయాలకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా బార్ లైసెన్స్ ల నిబంధనల్లో సవరణలు తీసుకువస్తూ గురువారం జీవో జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం జీవో 470ను జారీ చేశారు. బీచ్‌ల్లోను, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎక్కడపడితే అక్కడ బార్లను తెరవడానికి వీలుగా కనీసం నిర్మాణ జాగాను తగ్గించేశారు. కనీసం 200 చదరపు మీటర్ల నిర్మాణ స్థలం ఉండాల్సి ఉండగా ఇప్పుడు బార్ల ఏర్పాటునకు కనీసం 100 చదరపు మీటర్లు ఉంటే చాలని నిబంధనల్లో సవరణలు చేశారు. రెడీ టూ డ్రింక్... జాతీయ రహదారుల వెంబడి మద్యం షాపులను వంద మీటర్ల లోపు ఉన్న వాటిని తొలగించాల్సిందిగా సుప్రీం కోర్టు కమిటీ రాష్ట్రాన్ని హెచ్చరిస్తుండగా... దాన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా జాతీయ రహదారులకు వంద మీటర్ల లోపు బార్ లెసైన్‌సలు ఇచ్చేందుకు వీలుగా నిబంధనల్లో సవరణలు చేశారు. పర్యాటక కేంద్రాలుగా పేర్కొన్న బీచ్‌ల్లోను, ఇతర ప్రాంతాల్లోను విరివిగా బార్ లెసైన్‌సలను మంజూరు చేయనున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లలో స్థానిక పట్టణాభివృద్ధి సంస్థ నుంచి హోటల్‌కు లెసైన్‌స పొంది ఉన్న అన్నింటికీ కూడా బార్ లెసైన్‌సలను జారీ చేయనున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తినడానికి ఆహారం దొరికే ప్రతీ దుకాణం, ఆహార పార్లర్లలో మద్యం విక్రయాలకు లెసైన్‌సలను మంజూరు చేస్తారు. -
ఊరూరా బీరు-బారు అన్నట్లుగా ఉంది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఊరూరా బీరు-బారు అన్నట్లుగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయని, రాష్ట్ర ప్రభుత్వం కళ్లున్నా కబోదిలా వ్యవహరిస్తోందని విమర్శించారు. సంపూర్ణ అక్షరాస్యత, ఆరోగ్యం, విద్య వంటి అంశాల్లో నంబర్‌వన్‌గా ఉండాలని కోరుకుంటే మద్యం అమ్మకాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా మారుతోందన్నారు. ఈ ఏడాది మద్యానికి సంబంధించి వివిధ రూపాల్లో రూ.35వేల కోట్ల వరకు ఆదాయం రానున్నదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చునన్నారు. గోల్డెన్ అవర్స్ అని, హ్యాపీ అవర్స్ అనీ బార్లు ప్రోత్సాహకాలు ప్రకటించి యథే చ్చగా మద్యం అమ్మకాలు సాగిస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. మద్యం మహమ్మారి కారణంగా పేద, బడుగు వర్గాల ప్రజల జీవితాలు ఛిద్రం అవుతున్నాయన్నారు. ఈ భయానక పరిస్థితులపై ప్రభుత్వానికి కనువిప్పు కలిగి, మద్యం అమ్మకాల నియంత్రణకు చర్యలు తీసుకునేలా బీజేపీ సీనియర్ నేత ప్రొఫెసర్ శేషగిరిరావు ఈనెల 11న ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నారన్నారు. ఈ దీక్ష కరపత్రాన్ని సోమవారం లక్ష్మణ్ విడుదల చేశారు. బీజేపీలోకి టీఆర్ఎస్ నాయకులు సోమవారం మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు, హెచ్ఎంఎస్ యూనియన్ నాయకుడు పేరం రమేశ్ నేతృత్వంలో దాదాపు 200 మంది తమ పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సమక్షంలో చేరినట్లు బీజేపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ప్రధాని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై రాష్ట్రంలో అనేక మంది బీజేపీలో చేరుతున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. -
మద్యం అమ్మకాల్లో రాష్ట్రం నంబర్ వన్
మహిళా ఉద్యమ పోస్టర్ ఆవిష్కరణలో ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ పాలనలో మద్యం అమ్మకాల్లో మాత్రమే రాష్ట్రం నంబర్‌వన్‌గా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. మహిళా సమస్యలపై ఏడాదిపాటు జరిగే ఉద్యమానికి సంబంధించిన పోస్టర్‌ను గాంధీభవన్‌లో ఉత్తమ్, టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద శనివారం ఆవిష్కరించారు. ఉత్తమ్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ మహిళలను అవమానిస్తున్నారన్నారు. రాష్ట్రం ఏర్పాటై రెండున్నరేళ్లు పూర్తికావస్తున్నా రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు అవకాశం దక్కలేదన్నారు. మద్యం అమ్మకాల్లో మాత్రమే దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రం నిలిచిపోయిందన్నారు. శారద మాట్లాడుతూ... మహిళలకు మంత్రివర్గంలో చోటు లేకపోవడం, నానాటికీ పెరుగుతున్న అత్యాచారాలు, డ్వాక్రా రుణాలు అందకపోవడం, బెల్టు షాపులతో మహిళా సాధికారతకు వ్యతిరేకంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని.. దీనికి నిరసనగా ఏడాదిపాటు పోరాటం చేస్తామని అన్నారు. ‘మహిళా మేలుకో-రాష్ట్రాన్ని ఏలుకో’ నినాదంతో ధర్నాలు, చర్చలు, నిరసనలు నిర్వహిస్తామన్నారు. టీపీసీసీ మహిళా విభాగం నేతలు పద్మాగౌడ్, స్వప్న పాల్గొన్నారు. -
రూ.106 కోట్లు తాగేశారు!
♦ గ్రేటర్ హైదరాబాద్ లో దసరాకు భారీగా మద్యం అమ్మకాలు ♦ గతేడాదితో పోలిస్తే సుమారు 13 శాతం ఎక్కువ సాక్షి, హైదరాబాద్: దసరా సంబురాల్లో మద్యం అమ్మకాలు చుక్కలను తాకాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.106 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఆది, సోమ, మంగళ, బుధవారాల్లో వరుసగా నాలుగురోజులు సెల వులు రావడంతో మద్యం అమ్మకాలు పెరి గాయి. హైదరాబాద్ మహానగరం పరిధిలోని 590 బార్లు, మరో 400 వరకు ఉన్న మద్యం దుకాణాలు కిటకిటలాడాయి. అమ్మకాల్లో ఐఎంఎల్ మద్యం కంటే యువత ఎక్కువగా కొనుగోలు చేసే బీర్లే ఎక్కువగా అమ్ముడయ్యా యి. మొత్తంగా గతేడాది దసరాతో పోలిస్తే ఈ సారి సుమారు 13 శాతం అధికంగా మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీశాఖ లెక్కలు వేసింది. రోజుకు రూ.33 కోట్లు! దసరా సంబురాల్లో భాగంగా ఆది, సోమ, మంగళ వారాల్లో రోజుకు సగటున రూ.33 కోట్లకు పైగా మద్యం (బీర్లు, ఐఎంఎల్ కలిపి) అమ్ముడైనట్లు ఆబ్కారీశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. బుధవారం కూడా సుమా రు రూ.7కోట్లు విలువైన మద్యం విక్రయమైనట్లు లెక్కించారు. మొత్తంగా పండుగ వేడుకల కోసం ఈసారి రూ.106 కోట్ల మద్యం అమ్ముడైనట్లు అంచనా వేశారు. సాధారణంగా హైదరాబాద్‌లో రోజూ సగటున రూ.10 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతుం డగా.. పండుగ రోజుల్లో మూడున్నర రెట్లు అధికంగా అమ్మకాలు జరిగాయి. బీరు అమ్మకాలే ఎక్కువ.. పండుగ అమ్మకాల తీరును పరిశీలిస్తే గత నాలుగు రోజులుగా హైదరాబాద్ పరిధిలో 1,31,655 కేసుల బీరు, 1,20,524 కేసుల ఐఎంఎల్ మద్యం అమ్ముడయినట్లు ఆబ్కారీశాఖ అధికారులు అంచనా వేశారు. ఐఎం ఎల్లో సాధారణ రకంతో పాటు ప్రీమియం బ్రాండ్లు కూడా పెద్ద మొత్తంలో అమ్ముడైనట్లు తెలిపారు. మొత్తంగా గతేడాది కంటే సుమా రు 13 శాతం అమ్మకాలు పెరిగినట్లు తెలి పారు. పండుగ వేడుకల కోసం సొంత ఊళ్లకు బయలుదేరిన వారు సైతం నగరం నలుమూలల్లో ఉన్న మద్యం దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసుకుని వెళ్లారని పేర్కొన్నారు. బార్లలో రెండు పెగ్గులు ఆర్డర్ చేస్తే.. మరో పెగ్గు ఉచితం అన్న ఆఫర్లతోనూ ఎక్కువ మద్యం వినియోగమైందన్నారు. -
మద్యం వరదలా..
ఐదు నెలల్లో రూ.5775 కోట్లు తాగేశారు..! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి నెలా సగటున రూ. 1000 కోట్లకు పైగా విలువైన మద్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. గత ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల్లో జరిగిన మద్యం అమ్మకాల విలువ రూ. 5775 కోట్లు. ఈ అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తం నుంచి ఖర్చులు పోగా... ఆబ్కారీ శాఖకు వచ్చిన రెవెన్యూ రూ. 5, 729.77 కోట్లు. గతేడాది (2015)లో ఐదు నెలల్లో రూ. 4,692 కోట్ల మద్యాన్ని విక్రయించగా, ఈసారి 23 శాతం వృద్ధితో అదనంగా రూ. 1000 కోట్లకు పైగా విలువైన మద్యాన్ని మందుబాబులు కొనుగోలు చేయడం గమనార్హం. వ్యాట్ రూపంలో రూ. 3,770 కోట్లు ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయాల ద్వారా ఐదు నెలల్లో రూ. 5,775 కోట్లు ఆర్జించగా, అందులో నుంచి పన్నుల రూపంలో ప్రభుత్వమే 65 శాతం తన ఖాతాలో వేసుకుంది. విక్రయించిన ప్రతి మద్యం సీసాకు లెక్కలేసి మరీ వ్యాట్ బై ఎక్సైజ్ రూపంలో రూ. 3,770 కోట్లు లాగేసుకుంది. ఇక ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 93.75 కోట్లు చేరింది. ప్రభుత్వ ఆదాయంలో ప్రధాన వాటా ఆబ్కారీ శాఖ నుంచే కావడంతో ఇదే రీతిన మద్యం అమ్మకాలు సాగిస్తే వచ్చే సంవత్సరం (2017) మార్చి నాటికి రూ. 14,161 కోట్ల రెవెన్యూ సాధించాలని ఆబ్కారీ శాఖ లక్ష్యంగా పెట్టుకొంది. ఇందులో సర్కార్‌కు ‘వ్యాట్ బై ఎక్సైజ్’ కింద రూ. 9,618 కోట్లు పన్ను రూపంలో వెలుతుంది. కాగా లక్ష్యం సాధనకు జిల్లాల వారీగా టార్గెట్లు నిర్ణయించిన ఎకై ్సజ్ అధికారులు తదనుగుణంగా అమ్మకాలు పెంచేందుకు కృషి చేస్తున్నారు. 2015 కన్నా 2016లో బీర్లు, ఐఎంఎల్ విక్రయాలు భారీగా పెరిగి ఏకంగా 32 శాతం వృద్ధి సాధించాయి. -
ఖజానాకు ‘మద్యం’ కిక్కు!
-
ఖజానాకు ‘మద్యం’ కిక్కు!
• రాష్ట్రంలో భారీగా పెరిగిన ఆదాయం • ఏప్రిల్ నుంచి జూలై వరకు • రూ.4,729 కోట్ల రెవెన్యూ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఏడాదికేడాది పెరుగుతున్నాయి. ఖజానాకు ప్రధాన ఆదాయవనరుగా ఉన్న ఆబ్కారీ శాఖ రెండేళ్లుగా మద్యం అమ్మకాల్లో భారీగా వృద్ధి సాధిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల పాటు మద్యం అమ్మకాల్లో దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో తెలంగాణ తొలిస్థానంలో నిలిచింది. ఈ సమయంలో ఏకంగా 23.61 శాతం వృద్ధి సాధించింది. 11.83 శాతంతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. తరువాత స్థానాల్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక నిలి చాయి. ఈ నాలుగు నెలల్లో రాష్ట్ర ఆబ్కారీ శాఖకు వచ్చిన రెవెన్యూ రూ.4,728.57 కోట్లు. అయితే తమిళనాడు, కర్ణాటకల్లో తెలంగాణ కన్నా రెవెన్యూ ఎక్కువగా ఉన్నా... వృద్ధిరేటులో మూడేళ్లుగా అవి చివరి స్థానాల్లోనే ఉన్నాయి. గత (2015-16) ఆర్థిక సంవత్సరంలో కూడా తెలంగాణ 19.16 శాతం ఎక్సైజ్ రెవెన్యూ వృద్ధితో మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. ఐఎంఎల్ అమ్మకాల్లో భారీగా.. తెలంగాణలో ఐఎంఎల్ (దేశీ తయారీ మద్యం) అమ్మకాలు బాగా పెరుగుతున్నాయి. 2014-15తో పోల్చితే 2015-16లో 18.24 శాతం వృద్ధితో 2.38 కోట్ల కేసుల ఐఎంఎల్ విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల్లోనే ఏకంగా 30.19 శాతం వృద్ధితో 85.47 లక్షల కేసులను విక్రయించారు. ఇదే సమయంలో బీర్ల అమ్మకాల్లో 1.31 కోట్ల కేసులతో 8.73 శాతం పెరుగుదల నమోదైంది. ఆంధ్రప్రదేశ్ బీర్ల అమ్మకాల్లో 14.18 శాతం వృద్ధితో తొలిస్థానంలో నిలవగా.. తెలంగాణ రెండో స్థానంలో ఉంది. • సమగ్ర ఎక్సైజ్ పాలసీ రూపొందించాలి • కల్లుగీత పనివారల సంఘం డిమాండ్ సాక్షి, హైదరాబాద్: వచ్చే అక్టోబర్‌లో ప్రారం భం కానున్న ఎక్సైజ్ (కల్లుగీత) పాలసీని సమగ్రంగా రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర కల్లుగీత పనివారల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.రాష్ట్రంలో మూతపడిన కల్లు దుకాణాల లెసైన్స్‌లను పునరుద్ధరించి, శాశ్వ త ప్రాతిపదికన లెసైన్సులు ఇవ్వాలని కోరింది. కల్లుగీత వృత్తిని ఆధునీకరించాలని, ఆహార, ఆహారేతర ఉత్పత్తుల పరిశ్రమలను నెలకొల్పాలని, ట్యాంక్‌బండ్‌పై ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, గీతవృత్తిదారుల నాయకుడు బొమ్మగాని ధర్మభిక్షం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని శనివారం సంఘ అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీర్మానించారు. ఈ నెల, సెప్టెంబర్లలో గీతవృత్తిదారులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్, తహసీల్దార్, కలెక్టర్లకు వినతిపత్రాల సమర్పణ, ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. సమావేశం లో డీజీ సాయిలుగౌడ్, పి.రాములు, పబ్బు వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. -
అక్రమంగా మద్యం విక్రయిస్తోన్న వ్యక్తి అరెస్ట్
అక్రమంగా మద్యం అమ్ముతున్నఓ వ్యక్తిని అరెస్టు చేసిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రింగ్ బస్తీ నివాసి శ్రీనివాస్‌గౌడ్ (51) కిరాణా వ్యాపారం నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో అందులో బెల్టు షాపు కూడా నిర్వహిస్తు మద్యం బాటిళ్లు విక్రయాలు చేపట్టసాగాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు ఆదివారం మధ్యాహ్నం తనిఖీలు చేయగా 12 క్వార్టర్ బాటిళ్లు దొరికాయి. ఈ మేరకు పోలీసులు శ్రీనివాస్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
13 వేల మందికో బార్
విస్తీర్ణాన్ని బట్టి లెసైన్స్ ఫీజు వసూలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూలై 1 నుంచి అమలు కానున్న కొత్త బార్ల పాలసీ తుది రూపు దిద్దుకుంటోంది. 2016-17 సంవత్సరానికి వర్తించే ఈ పాలసీ తుది ముసాయిదాను ఆబ్కారీ శాఖ సోమవారం ప్రభుత్వానికి పంపించింది. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేయనుంది. కొత్త పాలసీలో బార్ల లెసైన్సు ఫీజులను విస్తీర్ణం ఆధారంగా వసూలు చేస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 3 స్లాబుల్లోని ఫీజులను యథాతథంగానే కొనసాగించనున్నారు. జనాభా ఆధారంగా 13 వేలకు ఒక బార్ చొప్పున లెసైన్సులు మంజూరు చేయనున్నారు. బార్లలో మద్యం సరఫరా చేసే ఏరియా 500 చదరపు మీటర్ల వరకు ఇప్పుడున్న ఫీజులు వర్తిస్తాయి. 500 నుంచి 700 చదరపు మీటర్లు ఉంటే 10 శాతం, 700 నుంచి 1,000 చదరపు మీటర్లు ఉంటే 20 శాతం, వెయ్యి చదరపు మీటర్ల పైన ఉన్న బార్లు 40 శాతం అదనంగా ఫీజు చెల్లించాలి. నగరంలో 70కి పైగా ఉన్న స్టార్ హోటళ్లను టార్గెట్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హైవేలకు వంద మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలు ఉండకూడదన్న సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ నిబంధనలు రాష్ట్రంలో వర్తించవని తేల్చిన నేపథ్యంలో గతంలో తిరస్కృతికి గురైన బార్ల దరఖాస్తులను పరిశీలించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా జీహెచ్ఎంసీ పరిధిలో మరో 98 వరకు బార్లను ఏర్పాటు చేసే వెసులుబాటు లభించనుంది. -
మద్యంపై సర్వీస్‌ట్యాక్స్ తప్పించుకునేదెలా?
- ఢిల్లీస్థాయిలో సర్కార్ యత్నం - ఢిల్లీ వెళ్లిన ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ సాక్షి, హైదరాబాద్: సర్వీస్‌ట్యాక్స్ నిబంధనలను కేంద్రం సవరించిన నేపథ్యంలో మద్యం విక్రయాలపై పన్నుభారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. సర్వీస్ ట్యాక్స్ నుంచి ఎక్సైజ్ శాఖ అనుబంధ సంస్థ తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్‌ను మినహాయింపు పొందేందుకు ఢిల్లీలో ఓ కన్సల్టెన్సీని సంప్రదించడంతోపాటు కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ(ఎక్సైజ్)శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రా, కమిషనర్, టీఎస్‌బీసీఎల్ ఎండీ ఆర్.వి. చంద్రవదన్, డెరైక్టర్ సంతోష్‌రెడ్డి, ఓ న్యాయవాదితో కలసి సోమవారం ఢిల్లీకి వెళ్లారు. ప్రభుత్వ రంగ సంస్థగా, ఎక్సైజ్ శాఖకు అనుబంధంగా కొనసాగుతున్న తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ (టీఎస్‌బీసీఎల్) సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తే ఏటా సుమారు రూ. 600 కోట్లకు పైగానే సమర్పించుకోవాలి. దీన్ని నివారించేందుకు కన్సల్టెన్సీ ద్వారా తతంగం నడపాలని అధికారులు నిర్ణయించారు. చివరికి కన్సల్టెన్సీ సాయంతో... రాష్ట్రంలో టీఎస్‌బీసీఎల్ ద్వారానే మద్యం విక్రయాలు జరుగుతాయి. గత ఏడాది సుమారు రూ. 12 వేల కోట్ల విలువైన మద్యం అమ్మకాలను టీఎస్‌బీసీఎల్‌కు చెం దిన 17 డిపోల ద్వారా నే జరిపారు. కంపెనీల చట్టం ప్రకారం ఆదా యం పొందే ఏ సంస్థ అయినా ఆదాయపు పన్ను తోపాటు సర్వీస్ ట్యాక్స్‌ను కూడా కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ మేరకు గత ఏడాది ఆదాయపు పన్ను శాఖ ప్రభుత్వ ఖాతా నుంచి రూ.1,240 కోట్లు లాగేసుకుంది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి సర్కార్ తంటాలు పడింది. కేంద్రస్థాయిలో పైరవీలు జరిపి ఆర్థికశాఖ నుంచి ఆ మొత్తాన్ని తిరిగి తెప్పించుకుంది. సర్వీస్ట్యాక్స్కు సంబంధించి కూడా టీఎస్‌బీసీఎల్‌కు నోటీసులు జారీ కాగా, అప్రమత్తమైన ప్రభుత్వం కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అధికారులతో చర్చించి పన్ను మినహాయిం పు పొందారు. ఇటీవల కేంద్రం సర్వీస్ ట్యాక్స్ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. దీని ప్రకారం టీఎస్‌బీసీఎల్ కూడా పన్ను పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ రెవె న్యూ(ఎక్సైజ్), టీఎస్‌బీసీఎల్ ఎండీ చంద్రవదన్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. సర్వీస్‌ట్యాక్స్ చెల్లించకుండా మినహాయింపు పొంద డానికి మల్లగుల్లాలు పడ్డ అధికారులు కన్సల్టెన్సీ ద్వారా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. -
అమెరికాలో మద్యం విక్రయాలపై మంత్రి పరిశీలన
సాక్షి, హైదరాబాద్: అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్ గురువారం న్యూయార్క్‌లోని మద్యం దుకాణాలను పరిశీలించారు. మద్యం తయారీ, విక్రయాలు జరిగే తీరును ఆయన తెలుసుకున్నారు. అమెరికాలో మద్యం ధరలు, మన రాష్ట్రంలో ధరలకు మధ్య తేడాలను పరిశీలించారు. మంత్రి వెంట ప్రత్యేకాధికారి రాజేశ్వర్‌రావు ఉన్నారు. -
పేరుకే ఉల్లిగడ్డల లారీ, కానీ..
వరంగల్: పేరుకు ఉల్లిగడ్డల లారీ..కానీ అందులో ఉండేది మద్యం బాటిల్స్.. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వరంగల్ జిల్లా మహబూబాబాద్‌కు వెళ్తున్న లారీని తనిఖీ చేయగా బయటపడిన విషయమిది. సోమవారం ఉల్లిగడ్డల లోడుతో వెళ్తున్న లారీని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అందులో మద్యం, మద్యం తయారీ సామగ్రి బయటపడింది. మెత్తం ఆరు టన్నుల నల్లబెల్లం, 5 క్వింటాళ్ల పటిక, 40 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. -
మూణ్ణాళ్ల ముచ్చటే!
ఎమ్మార్పీకి మద్యం విక్రయం మూణ్ణాళ్ల ముచ్చటగా మిగలనుంది. రాజమండ్రిలో మద్యం మామూళ్ల పంపకాల్లో అధికార, మిత్రపక్షం నేతల మధ్య సయోధ్య కుదరక పోవడంతో అధికారపార్టీ కీలకనేత ఒకరు సీఎంకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దాంతో మద్యం విక్రయాల్లో ఎమ్మార్పీ తెరపైకి తీసుకువచ్చారు. త్వరలో జిల్లా పర్యటనకు వచ్చే దీనిపై చర్చించి షరా ‘మాములు’గానే అమ్మకాలను పునరుద్ధరిస్తారని సిండికేట్ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మండపేట : జిల్లాలో దాదాపు 504 వరకు మద్యం దుకాణాలు, 34 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వాటి ద్వారా రోజుకు సుమారు రూ. 1.85 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. మద్యం అమ్మకాలను పెంచుకోవడమే లక్ష్యంగా లిప్టింగ్ (మునుపటి ఏడాది నెల ప్రామాణికంగా 10 శాతం అదనపు కొనుగోళ్లు చేయడం) విధానాన్ని తెరపైకి తెచ్చిన సర్కారు ప్రభుత్వ దుకాణాలను ప్రైవేటు పరం చేసింది. అమ్మకాలను పెంచేందుకు ఎమ్మార్పీ, బెల్టుషాపుల ఏర్పాటు విషయాల్లో వ్యాపారులకు అధికారులు స్వేచ్ఛ ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఒక్కో మద్యం బాటిల్‌పై రూ. 15 వరకు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. బెల్టుషాపులు ఎత్తివేస్తామంటూ సీఎం చేసిన రెండవ సంతకాన్ని నీరు గారుస్తూ జిల్లా వ్యాప్తంగా రెండు వేలకు పైగా బెల్టుషాపులు ఏర్పాటు చేశారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నందుకు, బెల్టుషాపుల ఏర్పాటుకు అటు ఎక్సైజ్, పోలీసులకు సిండికేట్ వర్గాలు నెలవారీ మామూళ్లు సమర్పించుకుంటున్నాయి. అది కాకుండా వారు తాజాగా అధికారపార్టీ ఎమ్మెల్యేలకు లక్షలాది రూపాయలు ముడుపులు ముట్టచెప్పినట్టు తెలుస్తోంది. విజయవాడ ఘటనతో.. ఐదు నెలల క్రితం విజయవాడలో చోటుచేసుకున్న కల్తీ మద్యం ఘటన నేపథ్యంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల దాడిని ఎదుర్కొనేందుకు అప్పట్లో ప్రభుత్వం ఎమ్మార్పీని అమలులోకి తెచ్చింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత షరా మామూలుగానే ఎమ్మార్పీకి మించి అమ్మకాలు మొదలైపోయాయి. అయితే మద్యం మామూళ్ల విషయంలో రాజమండ్రిలో అధికార, మిత్ర పక్షాల మధ్య సయోధ్య కుదరలేదు. ఈ విషయం అధికారపార్టీకి చెందిన ముఖ్యనేత ఒకరు ఇటీవల సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. దాంతో ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలని ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాలివ్వడంతో ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్పీకి విక్రయాలు మళ్లీ అమలులోకి వచ్చాయి. ఇప్పటికే జిల్లాలోని మద్యం సిండికేట్లు ఆ ముఖ్యనేతతో ఈ విషయమై సంప్రదించగా కొన్ని రోజుల పాటు ఎమ్మార్పీ కొనసాగించాలని సూచించినట్టు తెలుస్తోంది. త్వరలోనే జిల్లా పర్యటనకు వస్తున్న సీఎంతో ఈ విషయం మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో కొద్ది రోజుల్లో షరా మాములుగానే అమ్మకాలు జరుగుతాయన్న ఆశతో సిండికేట్ వర్గాలుఉన్నాయి. -
బెల్టు బార్లా...
నీటిచుక్కకు నోచుకోని పల్లెలున్నాయి... మద్యం దొరకని ప్రాంతమే లేదు. అనధికారికంగా నెలకొల్పిన బెల్టు దుకాణాలు వేలల్లో ఉన్నాయి... వాటిని అడ్డుకునే ప్రయత్నాలు కానరావడంలేదు. నిర్దేశించిన గరిష్ట విక్రయధరకు మించి అమ్మకాలు సాగుతున్నాయి... అదుపు చేసేందుకు చర్యలు లేవు. మన్యంలోనే కాకుండా మైదానంలోనూ సారా ప్రవహిస్తోంది... కట్టుదిట్టంగా నియంత్రిస్తున్న దాఖలాల్లేవు. ఇదీ విజయనగరం జిల్లా పరిస్థితి. గడచిన ఆరేళ్లుగా రోజురోజుకూ మద్యం విక్రయాలు పెరుగుతున్నాయంటే అదంతా బార్లా తెరచుకున్న బెల్టుషాపులవల్లేనన్న వాస్తవాలు తెలిసినా పాలకులు పట్టించుకోవడంలేదు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : ‘బెల్ట్‌షాపులను పూర్తిగా నియంత్రిస్తాం....మద్యమే పరమావధిగా వ్యవహరించం.’ ఇదీ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయడు చేసిన వాగ్దానం. అధికారానికి వచ్చాక ప్రమాణస్వీకార వేదికపై చేసిన తొలి సంతకాల్లోనూ బెల్టు నియంత్రణ ఫైల్ ఉంది. కానీ అవేవీ అమలుకు నోచుకోలేదు. ఎక్కడికక్కడ దర్శనమిస్తున్న బెల్ట్‌షాపులే ఈ వాస్తవానికి సజీవ సాక్ష్యాలు. గతంలో చాటు మాటుగా నిర్వహించే బెల్టు విక్రయాలు నేడు బార్లా తెరచుకుంటున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలుండటం వల్ల అధికారులు సైతం వాటిపై కన్నెత్తయినా చూడటం లేదు. ఫలితంగా టీడీపీ అధికారంలోకి వచ్చాక విక్రయాలు భారీగా పెరిగాయి. అద్దు... అదుపు లేని సారా ప్రభుత్వ మద్యమే ఏరులై పారుతుందనుకుంటే దానికి సారా తోడైంది. ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ సారా విచ్చల విడిగా తయారవుతోంది. ఎక్కడికక్కడ రవాణా జరుగుతోంది. ఇప్పుడీ నాటుసారా ఎంతమంది ప్రాణాలు తీసేస్తుందో ఎవరికీ తెలియడం లేదు. మొత్తానికి అటు ప్రభుత్వ మద్యానికి, ఇటు సారాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. తినడానికి తిండి లేకపోయినా, చేయడానికి పనిలేకపోయినా తాగడానికి మద్యం మాత్రం దొరుకుతుండటంతో ఎంతోమంది ఆర్థికంగా, ఆరోగ్య పరంగా ఇబ్బందులు పడుతున్నారు. విచ్చలవిడిగా ఏర్పాటైన బెల్టుషాపుల్లో కల్తీ మద్యం విక్రయాలు చేపడితే ఎంతమంది ప్రాణాలు గాలిలో కలసిపోతాయో వేరే చెప్పనవసరం లేదు. అప్పుడు ప్రభుత్వమే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. నాటి పోరాటం ఏమైందో... గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో మద్యం ఏరులై పారుతుందని, సిండికేట్లు చెలరేగిపోతున్నారని సాక్షాత్తూ చంద్రబాబునాయుడే ప్రతిపక్ష నేత హోదాలో జిల్లా కొచ్చి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. నాడు పెద్ద హైడ్రామాయే సృష్టించారు. ఇప్పుడాయనే ముఖ్యమంత్రి అయ్యాక వాడవాడలా పెద్ద ఎత్తున ఏర్పాటైన బెల్టుదుకాణాలను నిలువరించలేకపోతున్నారు. దీనికి కారణం తమ్ముళ్ల ఒత్తిళ్లేనా.. అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఆర్పీకి మించి విక్రయాలు దీనికి తోడు గరిష్ట విక్రయ ధరకు మించి అమ్మకాలు సాగిస్తోంది. ఒక్కో బాటిల్‌పై రూ. 10 నుంచి రూ. 15వరకు పెంచి విక్రయించడంతో మద్యంబాబులు దోపిడీకి గురవుతున్నారు. గతేడాది ఎంఆర్పీకి మించి చేపట్టిన విక్రయాలపై మంత్రి మృణాళిని ఎక్సైజ్ అధికారులు సమావేశం పెట్టి నానా రాద్ధాంతం చేశారు. ఈ సారి ఏమైందో తెలియదు గానీ యథేచ్ఛగా వాటిని ఉల్లంఘిస్తున్నా నోరుమెదపడంలేదు. అధికారికంగా ఏర్పాటైన దుకాణాల్లోనే దోపిడీ ఇలా సాగుతుంటే... ఇక బెల్టు షాపుల్లో ఎంతలా దోచేస్తున్నారో వేరే చెప్పనవసరం లేదు. -
తెగ తాగేస్తుండ్రు
నల్లగొండ : జిల్లా ప్రజానీకం కరువు కోరల్లో చిక్కుకున్నప్పటికీ.. ఆ ప్రభావం మద్యం అమ్మకాలపై ఏమాత్రం కనిపించడం లేదు. గ్రామాల్లో ఎక్కడిపడితే అక్కడ బెల్టుదుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకు రావడంతో కరువుతీరా మద్యం లభిస్తోంది. గ్రామాల్లో తాగేందుకు గుక్కెడు నీరు దొరకకున్నా మద్యానికి కొదవలేదు. రెండు, మూడు బెల్టుదుకాణాలు ఉన్న గ్రామాల్లో ప్రస్తుతం 20 నుంచి 30 షాపులు కొత్తగా పుట్టుకొచ్చాయి. నూతన ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వచ్చిన 2015 అక్టోబర్ 1 నుంచి 2016 మార్చి 31 వరకు జిల్లా వ్యాప్తంగా రూ.802 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటే అతిశయోక్తి కాదు. అంతకుముందు 2014 అక్టోబర్ నుంచి 2015 మార్చి వరకు కేవలం రూ.504 కోట్లు మద్యం అమ్మకాలు మాత్రమే జరి గాయి. 2014తో పోలిస్తే ఈ ఆరు మాసాల్లోనే మద్యం సేల్స్ రూ.298 కోట్లకు పెరగడం విశేషం. సర్కిళ్ల వారీగా ఆదాయం.. పట్టణం, పల్లె వ్యత్యాసం లేకుండా మందుబాబులు మద్యం మత్తులో మునిగి తేలుతున్నా రు. ఓ మోస్తారు మ ద్యం అమ్మకాలు జరిగే నాం పల్లి, చండూరు, ఆలే రు ఎస్హెచ్ఓ పరిధిలో కూ డా మద్యం అమ్మకా లు గరిష్టస్థాయికి చేరా యి. మద్యం అమ్మకాలు అత్యధికంగా జరిగిన సర్కిళ్లలో నల్లగొండ మొదటి స్థానం లో ఉంది. ఈ సర్కిల్ పరిధిలో ఆరు మాసాల కాలంలో రూ.119 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. రెండో స్థానం సూర్యాపేట సర్కిల్ పరిధిలో రూ.82.51 కోట్లు, మూడో స్థానంలో భువనగిరి సర్కిల్ రూ.77.40 కోట్లు, నాలుగో స్థానం మిర్యాలగూడ సర్కిల్ పరిధిలోని దుకాణాల్లో రూ.75.01 కోట్ల మద్యం విక్రయూలు జరిగాయి. గతంలో ఈ సర్కిళ్ల పరిధిలో అమ్మకాలు రూ.48 కోట్ల నుంచి రూ.82 కోట్లకు మించలేదు. మారుమూల ప్రాంతాలైన నాంపల్లి సర్కిల్ పరిధిలో రూ.9.68 కోట్ల నుంచి రూ.19.47 కోట్లకు మద్యం అమ్మకాలు పెరిగాయి. హాలియా సర్కిల్లో రూ.26.16 కోట్ల నుంచి రూ.47.70 కోట్లకు, చండూరు సర్కిల్లో రూ.17.37 కోట్ల నుంచి రూ.27.40 కోట్ల కు, ఆలేరు సర్కిల్ పరిధిలో రూ.23.36 కోట్ల నుంచి రూ.38.07 కోట్లకు పెరగడం విశేషం. బీర్లకు ఎక్కువ గిరాకీ మద్యం అమ్మకాల్లో లిక్కర్‌తో పోలిస్తే బీర్లకు గిరాకీ అధికంగానే ఉంది. అదీగాక ప్రస్తుతం వేసవి పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరడంతో మందుబాబులు బీర్లపైనే మక్కువ చూ పిస్తున్నారు. 2015 అక్టోబర్ నుంచి 2016 మార్చి నెలాఖరు వరకు జరిగిన అమ్మకాల్లో బీర్లు 20,99,735 పెట్టెలు అమ్ముడుగాకా...లిక్కర్ 15,53,983 పెట్టెలు అమ్ముడయ్యాయి. 2014 అక్టోబర్ నుంచి 2015 మార్చి వరకు జరిగిన అమ్మకాల్లో బీర్లు 16,03,378 పెట్టెలు అమ్ముడైతే.. లిక్కర్ కేవలం 8,64,763 పెట్టెలు మాత్రమే అమ్ముడయ్యాయి. 2014తో పోలిస్తే ప్రస్తుతం పెరిగిన బీర్ల పెట్టెలు 4,96,357 కాగా లిక్కర్ 6,89,220 పెట్టెలకు పెరిగి రికార్డు సృష్టించింది. మద్యం ప్రియులు మీడియం రకానికి చెందిన లిక్కర్‌నే ఎక్కువగా సేవిస్తున్నారు. ఆర్డనరీ రకానికి చెందిన బ్రాండ్లు 1,94, 807 పెట్టెలు అమ్ముడుకాగా.. మీడియం 8,5 7, 244 పెట్టెలు, ప్రీమియం 5,01,932 పెట్టెలు అమ్ముడయ్యాయి. ఇది లావుంటే వేసవి ఎండలు మరింత ముదురుతున్నా కొద్దీ బీర్లు అమ్మకాలు మరింత పెరుగుతాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. బీర్లకు ఎలాంటి కొరత లేకుండా అన్ని రకాల బ్రాండ్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. -
కలెక్షన్.. అటెన్షన్.. మధ్యలో టార్గెట్
* ఓవైపు మద్యం అమ్మకాల పెంపు.. మరోవైపు కల్తీ, గుడుంబాల నియంత్రణ * జిల్లాల్లో ఎక్సైజ్ కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ల * విస్తృత పర్యటనలు సాక్షి, హైదరాబాద్: అక్రమ మద్యాన్ని అరికట్టడంతోపాటు వార్షిక ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆబ్కారీ శాఖ తంటాలు పడుతోంది. ఆబ్కారీ శాఖ ఫిబ్రవరి నెల వరకు సాగించిన మద్యం అమ్మకాలు, లెసైన్స్ ఫీజు, ప్రివిలేజ్ ఫీజు తదితరాల ద్వారా వచ్చిన మొత్తంలో ఖర్చులు, చెల్లింపులు పోగా వచ్చిన రెవెన్యూ రూ.10, 238 కోట్లు. ఇందులో వాణిజ్యపన్నుల శాఖకు వ్యాట్, సీఎంఆర్ఎఫ్ చెల్లింపులుపోగా రూ.3,484 కోట్లు ఆదాయంగా సమకూరింది. అయితే, కేవలం రెవెన్యూ రూపంలోనే రూ.12,500 కోట్ల మేర వార్షికాదాయం సమకూర్చుకోవాలన్న లక్ష్యంతో ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ తనవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు సాగే మద్యం అమ్మకాలు, డిస్టిలరీలు, బ్రూవరీలు చెల్లించే ఫీజుల రూపంలో ఈ లక్ష్యం చేరుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కఠిన చర్యలు... అదే సమయంలో గుడుంబా రహిత జిల్లాలుగా ప్రకటించిన 8 జిల్లాల్లో మళ్లీ నాటుసారా తయారీ జరగకుండా కఠినంగా వ్యవహరించాలని కూడా ఆబ్కారీ శాఖ భావిస్తోంది. ఈ బాధ్యత ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ తీసుకున్నారు. 8 జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లను అప్రమత్తం చేసి, ఆయా సర్కిళ్ల ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లను బాధ్యులను చేస్తున్నారు. హైదరాబాద్, వరంగల్ మినహా మిగతా ఎనిమిదింటిని గుడుంబా రహిత జిల్లాలుగా ప్రకటించారు. గుడుంబాను నిర్మూలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనలోనే నిర్ణయానికి వచ్చి, ఆ దిశగా చర్యలకు ఆదేశించినా వరంగల్‌లో ఇంకా గుడుంబా పేదలను పట్టి పీడిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో గుడుంబాను నిర్మూలించే పనిని అకున్‌సబర్వాల్ భుజానికి ఎత్తుకున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్ చంద్రవదన్, అకున్ సబర్వాల్ విడివిడిగా జిల్లా పర్యటనలు నిర్వహిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మెదక్ వంటి జిల్లాల్లో ఈనెలాఖరు వరకు లక్ష్యాలకు అనుగుణంగా మద్యం అమ్మకాలు జరిపేలా ఒత్తిళ్లు తెస్తున్నారు. రాష్ట్రానికి ప్రధాన ఆదాయవనరుగా మారిన ఆబ్కారీ శాఖ నుంచి భారీ రెవెన్యూ సాధించాలన్న ఆలోచనతో ఉన్న ఇద్దరు అధికారులు ఎంత వరకు సఫలీకృతులవుతారో చూడాలి. -
ఊళ్లు.. ఊగుతున్నయ్
అప్పుడు ఒకటి.. ఇప్పుడు వెయ్యి గుప్పుమంటున్న చీప్ లిక్కర్ గణనీయంగా పెరిగిన వినియోగం తొర్రూరు పరిధిలో ఎక్కువ గత ఏడాది ఒక కేసు అమ్మితే.. ఈ ఏడాది 1643 కేసుల అమ్మకం వరంగల్ : ఆదాయమే లక్ష్యంగా మద్యం విక్రయాలు పెంచుతున్న ఎక్సైజ్ శాఖ తీరుతో గ్రామాల్లోని పేదల కుటుంబాల్లో చిచ్చురేగుతోంది. నాటు సారాను నియంత్రించామని ప్రకటించుకున్న ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారు. నాటు సారాను తయారు చేసే వారిపై చర్యలు తీసుకోకుండా.. వారికి ప్రత్యామ్నాయ ఉపాధిగా బెల్ట్ షాపులు నిర్వహించుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులు సూచనలు ఇస్తున్నారు. దీంతో జిల్లాలో బెల్ట్ షాపుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. నాటుసారా విక్రయించే వారూ బెల్ట్ షాపులు తెరుస్తుండడంతో ఒక గ్రామంలో గతంలో ఒకటిరెండు బెల్ట్ షాపులు ఉంటే.. ఇప్పుడు కనీసం పది వరకు పెరిగాయి. గ్రామాల్లో కొత్తగా వెలుస్తున్న బెల్ట్ షాపుల్లో అమ్ముడుపో యే మద్యంలో 90 శాతం చీప్ లిక్కరే ఉంటోం ది. చీప్ లిక్కర్ వినియోగం జిల్లాలో గణనీయం గా పెరిగిందని అధికారిక లెక్కలే చెబుతున్నా యి. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం 2014 నవంబరులో జిల్లా వ్యాప్తంగా 1209 కేసుల చీప్ లిక్క ర్ అమ్మకాలు జరిగగా.. ఈ ఏడాది ఏకంగా 25, 848 కేసుల చీప్ లిక్కర్ వినియోగమైంది. మద్యపాన నియంత్రణపై అవగాహన కల్పించాల్సిన ఎక్సైజ్ శాఖ ఈ పనిని పూర్తిగా పక్కనబెట్టింది. ఈ కారణంగానే జిల్లాలో చీప్ లిక్కర్ వినియో గం పెరిగింది. ఈ చీప్ లిక్కర్ పేద కుటుంబాలను నాశనం చేస్తోంది. నాటుసారా పోయింద ని సంతోషపడే సమయంలో బెల్ట్ షాపులు తమను దెబ్బతీస్తున్నాయని మహిళలు వాపోతున్నారు. కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు చొర వ తీసుకుని.. గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తుంటే ఎక్సైజ్ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. దీంతో ఎక్సైజ్ శాఖ వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. ఎక్సైజ్ శాఖకు సంబంధించి జిల్లాలో వరంగల్, మహబూబాబాద్ యూనిట్లు ఉన్నాయి. వరంగల్ యూనిట్ పరిధిలో తొమ్మిది, మహబూబాబాద్ యూనిట్ పరిధిలో ఎనిమిది ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. ఏడాది క్రితం వరకు నాటుసారా ఎక్కువగా ఉండి ఇప్పుడు తగ్గిపోయిన మహబూబాబాద్ యూనిట్ పరిధిలో చీప్ లిక్కర్ వినియోగం భారీగా పెరిగింది. ఈ యూనిట్ పరిధిలో గత ఏడాది నవంబరు లో 657 కేసుల చీప్ లిక్కర్ విక్రయాలు జరిగా యి. ఈ ఏడాది నవంబరులో ఏకంగా 8,409 కేసుల చీప్ లిక్కర్ అమ్ముడుపోయింది. తొర్రూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో చీప్ లిక్కర్ అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. గత ఏడాది ఈ స్టేషన్ పరిధిలో కేవలం ఒక్క కేసు మాత్రమే అమ్ముడుపోయింది. ఈ ఏడాది 1643 కేసుల చీప్ లిక్కర్ అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోల్చితే ఈ స్టేషన్ పరిధిలో బెల్ట్ షాపులు సంఖ్య పది రెట్లు పెరిగింది. ఇక్కడి ఎక్సైజ్ శాఖ అధికారులు నాటుసారా విక్రయించే వారికి ప్రత్యామ్నాయ ఉపాధిగా బెల్ట్ షాపులను నిర్వహించుకోండని సూచిస్తున్నట్టు కొందరు ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. వరంగల్ అర్బన్ పరిధిలోనూ చీప్ లిక్కర్ అమ్మకాలు ఊహించని విధంగా పెరిగాయి. అర్బన్ స్టేషన్ పరిధిలో గత ఏడాది కేవలం 255 కేసులు అమ్ముడుపోగా ఈ ఏడాది ఏకంగా 6,108 కేసులను విక్రయించారు. వరంగల్ రూరల్ స్టేషన్ పరిధిలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ స్టేషన్ పరిధిలో గత నవంబరులో 25 కేసుల చీప్ లిక్కర్ విక్రయాలు జరిగగా.. ఈ ఏడాది నవంబరులో 4,131 కేసులు వినియోగమైంది. -
రహదారులపై మద్యం దుకాణాలు వద్దు
జస్టిస్ అంబటి లక్ష్మణరావు సుందరయ్య విజ్ఞాన కేంద్రం: రహదారులపై మద్యం షాపులను తొలగించాలని అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అంబటి లక్ష్మణరావు కోరారు. మద్యం వల్ల అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ఆదాయ వనరుగా భావించరాదని ప్రభుత్వానికి సూచించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అప్సా, మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో ‘రహదారులు-మద్యం షాపులు’ అనే అంశంపై శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర, జాతీయ రహదారుల పక్కన ఉన్న దాదాపు 1500 మద్యం దుకాణాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. రహదారి భద్రతపై సుప్రీం కోర్టు నియమించిన ఉన్నత స్థాయి కమిటీ డిసెంబర్ 31లోగా అన్ని రాష్ట్రాల్లోని జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కనున్న మద్యం షాపులను తొలగించి... రోడ్డు ప్రమాదాలను నివారించాలని ఆదేశించిందని గుర్తు చేశారు. ఈ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్.దిలీప్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలతోనే మద్య నియంత్రణ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. బిహార్, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల్లో మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారని.. తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. చీప్ లిక్కర్‌ను తీసుకువచ్చేందుకు గుడుంబాను అరికట్టే ప్రయత్నం చేశారని, దీనివల్ల కల్తీ కల్లు పెరిగి అనేక మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యంతో రూ.15 వేల కోట్ల ఆదాయం వస్తోందని తెలిపారు. దీన్ని ఇంకా పెంచుకోవాలని చూస్తున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదని విమర్శించారు. స్వాతంత్య్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ తాగుడు వల్ల అవినీతి పెరిగిపోయిందని అన్నారు. మద్య నిషేధఉద్యమానికి పెద్ద ఆయుధాలు అక్కర లేదని... అగ్గి పుల్ల ఉంటే చాలని వ్యాఖ్యానించారు. మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ అధ్యక్షుడు వి.లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి ఎం.పద్మనాభరెడ్డి, మన తెలంగాణ ఎడిటర్ కె.శ్రీనివాస్ రెడ్డి, ట్రాన్స్‌పోర్టు మాజీ అడిషనల్ కమిషనర్ సి.ఎల్.ఎన్. గాంధీ, అప్సా డెరైక్టర్ ఎస్.శ్రీనివాస్ రెడ్డి, బడుగుల చైతన్య సమితి అధ్యక్షురాలు జి.శారద గౌడ్ పాల్గొన్నారు. -
అర్ధరాత్రి అమ్మకాలపై సందిగ్ధం!
♦ మద్యం అమ్మకాల సమయం పెంచాలని కోరుతున్న వ్యాపారులు ♦ సానుకూలంగానే స్పందించిన ప్రభుత్వం ♦ ఇతర రాష్ట్రాల వివరాలతో సర్కార్‌కు ఎక్సైజ్ కమిషనర్ నివేదిక ♦ మద్యం విక్రయాలకు గంటపాటు సమయం పెంచాలని సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం అమ్మకాల సమయం పెంచాలన్న నిర్ణయంపై ప్రభుత్వ శాఖల్లోనే తర్జనభర్జన జరుగుతోంది. దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌తో పాటు పర్యాటకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో అర్ధరాత్రి వరకు మద్యాన్ని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఫిబ్రవరిలోనే ఎక్సైజ్ శాఖను నివేదిక కోరింది. ఎక్సైజ్ శాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాల సమయాన్ని పెంచడంపై పరిశీలన జరిపారు. సమయాన్ని మరో గంట పాటు పెంచాలంటూ సీఎంకు సూచించారు కూడా. నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చిన అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త సమయాన్ని అమలు చేయాలని భావించారు. కానీ అప్పట్లో చీప్‌లిక్కర్‌పై తలెత్తిన వివాదం నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రభుత్వం పక్కనబెట్టింది. శాంతిభద్రతల సమస్యతో.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అంబర్‌పేట నుంచి రామంతాపూర్ దాకా రాత్రి 10 గంటల వర కు మద్యం దుకాణాలు, రాత్రి 11.00 వరకు బార్లు తెరిచి ఉంటాయి. కానీ గ్రేటర్‌లోనే భాగమైన ఉప్పల్ ప్రాంతంలో మాత్రం రాత్రి 9.30కు మద్యం దుకాణాలను, 10.30కు బార్లను మూసివేయాల్సిందే. శాంతిభద్రతల కారణంతో రంగారెడ్డి జిల్లా పోలీస్ యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే పరిస్థితి అన్ని జిల్లాల్లోనూ ఉంది. బార్లలో 11 గంటలకు మద్యం విక్రయాలు నిలిపివేసినా... అర్ధరాత్రి 12 గంటల వరకు రెస్టారెంట్లు పనిచేసే వెసులుబాటును కొద్ది నెలల క్రితం కార్మిక శాఖ కల్పించింది. కానీ పోలీస్ యంత్రాంగం శాంతిభద్రతల కారణంతో కార్మికశాఖ ఉత్తర్వులను పాటించడం లేదు. ఈ నేపథ్యంలో మద్యం వ్యాపారులు, బార్ల యజమానులు ఇటీవలే ఎక్సైజ్ మంత్రి పద్మారావుగౌడ్‌ను కలసి సమయం పెంపు గురించి విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లోనైనా మద్యం విక్రయాల సమయాన్ని పెంచాలని కోరారు. సచివాలయంలో ఆగిన ఫైలు మద్యం విక్రయాల సమయాన్ని పెంచడం వల్ల ఒనగూరే ప్రయోజనాలను పేర్కొంటూ ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ ప్రభుత్వానికి నివేదిక పంపించారు. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, చెన్నై, ఒడిశా, హరియాణా, కేరళలో, మన రాష్ట్రంలో బార్లు, మద్యం దుకాణాల సమయాలను కూడా పొందుపరిచారు. సమయం పెంచడం వల్ల విక్రయాలు పెరిగి, ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరుతుందని సూచించారు. అయితే ఈ ఫైలు సచివాలయంలో అధికారుల వద్దే నిలిచిపోయినట్లు సమాచారం. ఈ ఫైలు మంత్రి పద్మారావు ద్వారా ముఖ్యమంత్రికి చేరి, ఆయన ఆమోద ముద్ర వేస్తే... సమయం పెంపు అమలులోకి వస్తుంది. -
ఫుల్ జోష్
గ్రేటర్లో జోరుగా మద్యం విక్రయాలు రోజుకు రూ.20 కోట్లకు పైగానే.. సిటీబ్యూరో: గ్రేటర్లో మద్యం అమ్మకాలు కిక్కెక్కిస్తున్నాయి. దసరా పర్వదినం సందర్భంగా వరుస సెలవులు కలిసిరావడంతో మందుబాబులు ‘ఫుల్లు’గా పండగ చేసుకుంటున్నారు. నూతన విధానం ప్రకారం ఈనెల తొలివారంలోనే లెసైన్సులు దక్కించుకున్న మద్యం వ్యాపారులకు పండగ బాగా కలిసివచ్చింది. గ్రేటర్ పరిధిలోని 460 మద్యం దుకాణాలు, మరో 483 బార్లలో ఇటీవల మద్యం అమ్మకాల జోరు పెరిగిందని ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. అక్టోబరు 1 నుంచి 21వ తేదీ వరకు అమ్మకాలు చుక్కలను తాకినట్లు చెబుతున్నారు. సాధారణంగా మహా నగర పరిధిలో రోజుకు రూ.10 కోట్లకుపైగా మద్యం అమ్మకాలు సాగుతుండగా.. దసరా సందర్భంగా మంగళ, బుధ, గురు, శుక్ర వారాల్లో అమ్మకాలు రూ.20 కోట్లకు పైగానే ఉంటాయని ఆబ్కారీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తగ్గని విక్రయాలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 602 మద్యం దుకాణాలకు గాను ఇటీవల టెండర్ల ప్రక్రియలో 70 దుకాణాలకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. దీంతో అవి ఖాళీగామిగిలాయి. వీటిని దశల వారీగా రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్‌కు అప్పగించాలని నిర్ణయించారు. ఉభయ జిల్లాల పరిధిలో దుకాణాల సంఖ్య తగ్గినప్పటికీ లిక్కర్ అమ్మకాల్లో జోరు తగ్గకపోవడంగమనార్హం. పొంగుతున్న బీరు జీహెచ్ఎంసీ పరిధిలోని మద్యం దుకాణాల్లో ఐఎంఎల్ మద్యంతో పోలిస్తే బీర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. బీర్ల అమ్మకాలు ‘చుక్క’లను తాకుతున్నాయి. గ్రేటర్ పరిధిలో గత 20 రోజులుగా 7.01 లక్షల కేసుల బీర్లు అమ్ముడు పోయినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కగట్టింది. ఐఎంఎల్ మద్యం 5.53 లక్షల కేసులు అమ్ముడుపోయినట్లు అంచనా వేసింది. పండగ సీజన్ కావడంతో అక్టోబరు చివరి నాటికి అమ్మకాలు మరింత జోరందుకోనున్నట్లు అంచనా వేస్తోంది. స్టాకు ఫుల్లు.. బీర్లతో పాటు ఐఎంఎల్ ప్రీమియం, మీడియం రకం మద్యం డిపోల్లో ఫుల్లుగానే ఉండడంతో వ్యాపారులు నూతన దుకాణాల్లో భారీగా నిల్వ చేశారు. నగరంలోని టీఎస్‌బీసీఎల్ (తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్) గోడౌన్లలోనూ అన్ని రకాల బ్రాండ్లకు చెందిన మద్యం స్టాకు ‘ఫుల్లు’గా అందుబాటులో ఉందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. -
అమ్మకాలపైనే ఆశలు!
-
అమ్మకాలపైనే ఆశలు!
సాక్షి, హైదరాబాద్: నూతన మద్యం విధానంతో ప్రభుత్వానికి వచ్చే రాబడి తగ్గిపోతుందా, పెరుగుతుందా..? అన్నదానిపై రాష్ట్ర ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. కొత్త విధానం ప్రకారం చీపెస్ట్ లిక్కర్‌ను రూ.15కు 90 ఎంఎల్ సీసా చొప్పున విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ధరలో అమ్మాలంటే మద్యంపై ఇప్పుడున్న వ్యాట్‌ను 49 శాతానికి తగ్గించాలని భావిస్తున్నారు. దీనివల్ల సర్కారుకు వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోతుంది. కానీ అతి తక్కువ ధరకు మద్యం వస్తుందనే ఉద్దేశంతో వినియోగం భారీగా పెరుగుతుందని.. తద్వారా మొత్తంగా వచ్చే ఆదాయం దాదాపు ప్రస్తుత స్థాయిలోనే ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చీపెస్ట్ లిక్కర్ అందుబాటులోకి వస్తే ఎక్కువ ధర ఉన్న మద్యం విక్రయాలు పడిపోతాయని, దానివల్ల ఎక్సైజ్‌పై వచ్చే వ్యాట్ ఆదాయం తగ్గుతుందనే భావన కూడా వ్యక్తమవుతోంది. మొత్తంగా కొత్త మద్యం విధానమంతా ‘అమ్మకాల’ చుట్టే తిరుగుతోంది. ప్రస్తుతం 90 ఎంఎల్ చీప్ లిక్కర్ రూ.30 ధరకు విక్రయిస్తున్నారు. వివిధ రకాల మద్యంపై కనిష్టంగా 70 శాతం నుంచి గరిష్టంగా 190 శాతం వరకు వ్యాట్ ఉంది. దీన్ని తగ్గించటంతో వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతుందని ఆర్థిక శాఖ లెక్కలేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌పై వ్యాట్ ద్వారా రూ.8,291 కోట్లు రాబట్టాలని ప్రభుత్వం అంచనాలు వేసుకుంది. కానీ కొత్తగా వచ్చే చీపెస్ట్ లిక్కర్ కారణంగా వ్యాట్ ఆదాయం తగ్గిపోతుంది. కానీ ప్రస్తుతం రూ.60 చెల్లించి మద్యం కొనుగోలు చేస్తున్నవారు తక్కువ ధరకు వస్తుందని రెండు చీపెస్ట్ బాటిళ్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుం దని... వినియోగం పెరిగితే వ్యాట్ శాతం తగ్గినా ప్రమాదమేమీ లేదనే వాదన ఉంది. నష్టమని చెబుతున్న ఎక్సైజ్ శాఖ.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చీప్‌లిక్కర్ 48 బాటిళ్లు (180 ఎంఎల్) ఉన్న పెట్టెపై రూ.1,885 పన్ను రూపంలో రాష్ట్ర ఖజానాలో జమవుతుంది. వ్యాట్ తగ్గింపు కారణంగా ఇది రూ.734కు తగ్గిపోతుంది. అంటే ఒక్కో పెట్టెపై రూ.1,151 ఆదాయం తగ్గిపోతుందని ఎక్సైజ్ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. కానీ వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం అమ్మకాలతో ముడిపడి ఉన్నందున దీని ప్రభావం రూ.200 కోట్ల నుంచి రూ.500 కోట్ల మధ్యలో ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వ్యాట్, అమ్మకపు పన్నుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంచనా వేసిన స్థాయిలో ఉండడం లేదు. ప్రతి నెలా రూ.3,000 కోట్లు రావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ గత నాలుగు నెలల ఆదాయ గణాంకాలను చూస్తే ఒక్క జూలైలో గరిష్టంగా రూ.2,500 కోట్లు మాత్రమే వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త విధానంతో వచ్చే లాభనష్టాలను ఆర్థిక శాఖ ప్రభుత్వానికి నివేదించనుంది. లెసైన్సు ఫీజుతో లోటు భర్తీ.. వ్యాట్ ద్వారా తగ్గే ఆదాయాన్ని లెసైన్స్ ఫీజు, స్టేట్ ఎక్సైజ్ ద్వారా రాబట్టుకునే ప్రత్యామ్నాయాలను సైతం ప్రభుత్వం ఇప్పటికే పరిశీలించింది. దీనికి అనుగుణంగా కొత్త విధానానికి రూపకల్పన చేసింది. ప్రస్తుతమున్న మద్యం దుకాణాల లెసైన్సుల ద్వారా ప్రభుత్వానికి రూ.900 కోట్ల ఆదాయం వచ్చింది. నిర్దేశించిన కోటాకు మించి మద్యం అమ్మకాలు చేసినందుకు దుకాణాదారులు చెల్లించిన ఫీజు మరో రూ.420 కోట్లు ఖజానాలో జమ అయింది. మొత్తంగా ఆదాయం రూ.1,320 కోట్లకు మించింది. దీంతో ఈసారి లెసైన్సులకు నిర్దేశించే రుసుము అంతకంటే ఎక్కువగా ఉండాలని ప్రభుత్వం లెక్కలేసుకుంది. దీనిద్వారానే దాదాపు రూ.2,000 కోట్లు సంపాదించాలని భావిస్తోంది. వ్యాట్‌కు గండి పడినా... ఇలా ఆదాయం రాబట్టుకోవాలనేది సర్కారు వ్యూహంగా కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల ద్వారా రూ.3,916 కోట్ల రాబడిని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో తొలి నాలుగు నెలల్లో రూ.1,150 కోట్లు ఆదాయం వచ్చింది. దీంతో కొత్త మద్యం విధానం లాభసాటిగా ఉంటుందా, నష్టం వస్తుందా.. అని తేల్చలేకపోతోంది. అమ్మకాలతో ముడిపడి ఉన్నందున విక్రయాలు పెరిగితే, వ్యాట్ తగ్గించినా ఇబ్బందేమీ లేదని.. విక్రయాలు ఇప్పుడున్న స్థాయిలో ఉంటే ఆదాయం తగ్గిపోతుందని భావిస్తోంది. ఈ ఏడాది మద్యం విక్రయాల ఆదాయం.. ఏప్రిల్ ⇒ రూ.185 కోట్లు మే ⇒ రూ.190 కోట్లు జూన్ ⇒ రూ.525 కోట్లు జూలై ⇒ రూ.250 కోట్లు -
ఆందోళన ... మద్యం దుకాణం మూసివేత
ఉలవపాడు: ‘మహమ్మారి మద్యం షాపు బస్టాండ్‌లో వద్దయ్యా ... తమ పిల్లల భవిష్యత్తు పాడవుతుందంటూ’ గత పది రోజులుగా మహిళలు మంగళవారం ప్రదర్శనగా వచ్చి దుకాణాన్ని మూసివేయించారు. మండల కేంద్రమైన ఉలవపాడు పాత బస్టాండ్ సెంటర్లో మంగళవారం ఈ సంఘటన జరిగింది. ఉలవపాడుకు ఈసారి 3వ షాపును కేటాయించారు. దీన్ని పాత బస్టాండ్ సెంటర్లో నిర్మించడంతో తొలినుంచీ స్థానిక మహిళలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల నుంచి వచ్చిన వారు ఇక్కడ నుంచే బస్సులు ఎక్కాలి. విద్యార్థులు కూడా వచ్చీపోతుంటారు. ఇలాంటి ప్రాంతంలో మద్యం షాపేమిటంటూ మూడు రోజుల కిందట ధర్నా చేశారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నతపాఠశాల నుంచి మద్యం షాపు వరకు ప్రదర్శన నిర్వహించారు. తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం షాపు వద్దకు వచ్చి యజమానులతో వాగ్వివాదానికి దిగారు. స్థలం మార్చుకోవాలని కోరినా నిర్వాహకులు వినకపోవడంతో బలవంతంగా షాపును మూసివేయించారు. స్టేషన్లో మహిళల ఫిర్యాదు.... తమతో అసభ్యంగా ప్రవర్తించిననవారిపై మహిళలు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పంచాయితీ తీర్మానం లేకుండా నిర్మించారని, అడిగితే అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదులో ప్రస్తావించారు. ఫిర్యాదు చేసినవారిలో పంచాయతీ వార్డు సభ్యురాలు ప్రభావతి, వాసవీ క్లబ్ మహిళలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు రైతు కూలీసంఘం నాయకులు మోహన్, సురేష్, వాసవీ వనితాక్లబ్ సభ్యులు హేమలత, కుమారి, ప్రసన్న, దళిత నాయకులు దాసరి. వెంకటరావు, బాలకోటయ్య, సతీష్, ఆర్య వైశ్యసంఘం నాయకులు గిరి, బాలాజీ, నారాయణ, సత్యం, బీసీ నాయకులు తన్నీరు. రమణయ్య, మున్వర్‌భాషా తదితరులు పాల్గొన్నారు షాపు జోలికొస్తే పై కేసులు పెడతాం మద్యం షాపు జోలికొస్తే మీ పై కేసులు పెట్టి లోపల వేస్తామని ఎక్సైజ్ ఎస్.ఐ బాలకృష్ణ మహిళలను బెదిరించారు. కలెక్టర్‌తో మాట్లాడుకోండి...ఆమె మార్చమంటే అప్పుడు ఆలోచిస్తామని అన్నారు. -
పెగ్గు మీద పెగ్గు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : మద్యం విక్రయాల్లో జిల్లా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మునుపెన్నడూ లేనంతగా వేల కోట్ల రూపాయలు సర్కారు ఖజానాకు చేరుతున్నాయి. రాష్ట్ర బొక్కసాన్ని భర్తీ చేసే ప్రధాన వనరు జిల్లా మద్యం విక్రయాలే. ప్రస్తుత ఏడాది గత నెలాఖరు నాటికి జిల్లాలో ఏకంగా 2,419.17 కోట్ల మద్యం వ్యాపారం సాగినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. 2014 సంవత్సరంలో 2,260.6 కోట్ల మేర వ్యాపారం సాగింది. ఈ క్రమంలో గతంతో పోలిస్తే తాజా ఏడాదిలో ఏకంగా 7 శాతం విక్రయాలు పెరగడం గమనార్హం. దేనికదే సాటి.. జిల్లాలో మద్యం విక్రయాలకు సంబంధించి మూడు ఎక్సైజ్ డివిజన్లున్నాయి. మేడ్చల్ డివిజన్ పరిధిలో పట్టణ మండలాలే అధికంగా ఉండగా.. సరూర్‌నగర్, రాజేంద్రనగర్ డివిజన్ల పరిధిలో గ్రామీణ ప్రాంతాలు మిలితమై ఉన్నాయి. అయితే మద్యం విక్రయాల్లో మాత్రం అన్ని డివిజన్లు రికార్డులు తిరగరాస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం మేడ్చల్ డివిజన్లో 6శాతం విక్రయాలు పెరగ్గా.. సరూర్‌నగర్ పరిధిలో 5శాతం విక్రయాలు పెరిగాయి. అయితే రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలో ఏకంగా 12శాతం అమ్మకాలు పెరిగి.. ఆదాయాన్ని భారీగా పెంచేశాయి. బీరుదే జోరు.. మద్యం విక్రయాల్లో బీరుదే హవా కనిపిస్తోంది. ఎక్సైజ్ అధికారుల గణాంకాల ప్రకారం గతేడాది 44.21లక్షల లిక్కర్ కేసులు విక్రయించగా.. ప్రస్తుతం 45.35 లక్షలకు పెరిగింది. ఇందులో 3శాతం పెరుగుదల నమోదైంది. అయితే బీరు విక్రయాల్లో మాత్రం భారీ పెరుగుదల కనిపిస్తోంది. గతేడాది బీరు విక్రయాలు 58.52లక్షల కేసులు ఉండగా.. ఈ ఏడాది 65.09లక్షల కేసులకు ఎగబాకింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం 11 శాతం అమ్మకాలు పెరగడం గమనార్హం. -
పోలీస్ vs వ్యాపారులు
మామూళ్ల పంచాయితీ నగరంలో 55 మద్యం షాపులు, 117 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిల్లో విక్రయాలు, పనివేళలు, పార్కింగ్ విషయాల్లో పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తారు. ఇందుకుగాను వ్యాపారులు వారికి నెలవారీ మామూళ్లు ముట్టజెబుతారన్నది బహిరంగ రహస్యమే. ఇప్పుడీ విషయంలో ఇరువర్గాల మధ్య పంచాయితీ నడుస్తోంది. విజయవాడ సిటీ : పోలీసు అధికారులు, మద్యం వ్యాపారుల మధ్య మామూళ్ల పంచాయితీ నడుస్తోంది. ఇప్పటివరకు ఇస్తున్నట్లే షాపుల నుంచి నేరుగా నెలవారీ మామూళ్ల కోసం పోలీసు అధికారులు పట్టుబడుతుంటే.. సిండికేట్ ద్వారా ఇస్తామంటూ మద్యం వ్యాపారులు తెగేసి చెబుతున్నారు. దీనికి ససేమిరా అంటున్న పోలీసు అధికారులు పార్కింగ్, నిర్దేశిత వేళలు, బహిరంగ మద్య సేవనంపై హడావుడికి తెరతీశారు. ఈ పరిస్థితి కొనసాగితే ఇద్దరికీ నష్టమేనంటూ ఇరువర్గాల పెద్దల అభిప్రాయం. వివాదం ముదరకుండా చూసేందుకు చర్చలు సాగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కొద్ది రోజుల్లో వీరి మధ్య వివాదానికి తెరదించి సమస్యను కొలిక్కి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నగరంలో 55 మద్యం షాపులు, 117 రెస్టారెంట్ అండ్ బార్లు ఉన్నాయి. వీటిని చూసీ చూడనట్లుగా వ్యవహరించినందుకు పోలీసు అధికారులకు నెలవారీ మామూళ్లు ఇవ్వాలి. లేదంటే నిబంధనలను సాకుగా చూపించి పోలీసులు హడావుడి చేస్తారు. రానున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు కూడా పోలీసుల ఆదేశాలను పాటించి మామూళ్లు ముట్టచెబుతుంటారు. కొత్తగా లెసైన్స్‌లు మంజూరైన మద్యం వ్యాపారులతో కుదిరే అవగాహన కోసం బార్ల్ల నిర్వాహకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇదీ జరిగింది.. నగరంలో 55 మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో ఆరు షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవి కాగా మిగిలిన 49 ప్రైవేటు వ్యక్తులవి. రాజకీయ నేతలు భాగస్వాములుగా ఉన్న సిండికేట్లకు ఎక్కువ ప్రైవేటు షాపులు దక్కాయి. ఇప్పటివరకు షాపు ఉన్న ప్రాంతాన్ని బట్టి రూ. 15 వేల నుంచి రూ.20 వేల వరకు షాపు యజమానులు పోలీసు స్టేషన్‌కి ముట్టచెప్పారు. కొత్త షాపులు దక్కిన వారిలో ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఉన్నందున అంతంత మొత్తాల్లో మామూళ్లు ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. పెరిగిన అద్దెలు, ఉద్యోగుల జీతాలు, నెలవారీ వడ్డీలను దృష్టిలో ఉంచుకుని గతం కంటే తగ్గించి ఇవ్వాలనేది వీరి నిర్ణయం. విడిగా ఇవ్వడం వలన సాధ్యపడదని భావించిన మద్యం వ్యాపారులు సిండికేట్ ద్వారా మంత్లీ మామూలు నిర్ణయించి శ్లాబు (అన్ని చోట్లా ఒకే రేటు) విధానం అమలులోకి తేవాలనేది నిర్ణయంగా ఉంది. దీనికి పోలీసు అధికారులు అంగీకరించడం లేదు. గత అనుభవాల దృష్ట్యానే.. సిండికేట్ ద్వారా మామూళ్లు తీసుకునేందుకు పోలీసు అధికారులు నిరాకరించడానికి కారణం గత అనుభవాలేనని తెలిసింది. గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఆధిపత్యపోరులో మద్యం వ్యాపారంపై ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. ఆ విచారణలో సిండికేట్ల ద్వారా మంత్లీ మామూళ్లు తీసుకునే పోలీసు అధికారుల పాత్ర వెలుగులోకి వచ్చింది. సిండికేట్ చిట్టాల్లో పలువురు అధికారుల పేర్లు ఉండటంలో కేసులు నమోదు చేశారు. ఇంకా కేసు విచారణ సాగుతోంది. సిండికేట్ల ద్వారా తీసుకోవడం వల్లే ఇది జరిగిందనేది ఇప్పుడు అధికారుల అభిప్రాయం. ఇదే నేరుగా తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు ఎదురైనా పేర్లు వెలుగులోకి రావనేది వారి భావన. -
మద్యంపై ఆగని పోరు
ఉలవపాడు : నిత్యం ప్రయాణికులు ఎక్కే బస్టాండ్ సెంటర్లో మద్యం షాపు ఏర్పాటుచేస్తే ఊరుకోబోమని మహిళలు, ఆటోయూనియన్ నాయకులు, స్థానికులు హెచ్చరించారు. ఈ మేరకు ఉలవపాడు బస్టాండ్ వద్ద ఉన్న స్థలంలో ప్రారంభం కానున్న నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఉలవపాడులో రెండు మద్యం షాపులుండేవి. అదనంగా మరోషాపు ఇవ్వడంతో అది ఎక్కడ పెట్టాలని నిర్వాహకులు బస్టాండ్ దగ్గరున్న ఓ స్థలంలో నిర్మించడానికి నిర్ణయించుకున్నారు. ఉలవపాడు నుంచి ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా ప్రయాణికులు అక్కడ నిలబడాల్సిందే. ఇలాంటి చోట మద్యం దుకాణం ఏర్పాటుచేస్తే మందుబాబుల ఆకృత్యాలు మితిమీరుతారని ఆందోళనకారులు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు. మద్యం దుకాణాన్ని మార్చాలి గుడ్లూరు: స్థానిక బస్టాండ్ సెంటర్లో ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న మద్యం దుకాణాన్ని, దాని పక్కనున్న బెల్ట్ షాపులను అక్కడ నుంచి మార్చి వేయాలని గుడ్లూరు గ్రామస్తులు తహశీల్దార్ మెర్సీ కుమారికి గురువారం వినతిపత్రం అందజేశారు. మద్యం దుకాణం బస్టాండ్‌లో నిర్వహించడం వల్ల మందు బాబుల ఆగడాలు ఎక్కువయ్యాయిని, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు కాంతమ్మ, చెంచులమ్మ, సుబ్బారావు, తిరుమల తదితరులు తహశీల్దార్ దృష్టికి తీసుకు వచ్చారు. ఒక పక్క మద్యం కారణంగా కాపురాలు గుల్లవుతుంటే మరింత విచ్చలవిడి చేయడం మంచి పద్దతి కాదన్నారు. విచారించి తగిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ మెర్సీకుమారి హామీ ఇచ్చారు. నాంచారమ్మ కాలనీలో... కందుకూరు: పట్టణంలోని నాంచారమ్మకాలనీలో నివాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం షాపును తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానిక మహిళలు ఆందోళను కొనసాగిస్తున్నారు. గత మూడు రోజులుగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను మద్యం షాపును ఇక్కడ నిర్వహించడానికి అంగీకరించేది లేదని హెచ్చరించారు. వీరికి స్థానిక నాయకులతోపాటు, వామపక్ష నేతలు మద్దతు తెలిపారు. సిపిఐ సీనియర్ నాయకుడు వలేటి రాఘవులు, సిపిఎం నాయకుడు ఎస్ఎ గౌస్‌లు మహిళలకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ఇలాగే మొండి వైఖరి అవలంబిస్తే మరింత ఉధృతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. -
టీడీపీ నేతల లిక్కర్ దందా !
- పేట యువనేత అరాచకం - యల్లమంద సొసైటీ మాజీఉపాధ్యక్షుని పరిస్థితి విషమం - సూసైడ్ నోట్‌పై ఆరా తీస్తున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు - నేడు గుంటూరులో గురజాల మద్యం వ్యాపారుల సమావేశం సాక్షి ప్రతినిధి, గుంటూరు : మద్యం షాపుల కేటాయింపులో యువ నాయకుడు తమకు అన్యాయం చేశాడంటూ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన యల్లమంద సొసైటీ వైస్ చైర్మన్ పరిస్థితి విషయంగా ఉంది. నరసరావుపేట పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. బీపీ లెవల్స్ క్రమంగా తగ్గడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న గ్రామస్తులు ఆసుపత్రి వద్దకు తరలివచ్చారు. వెంటిలెటర్ల మీద చికిత్స అందిస్తున్నామని వైద్యులు బాధితుల బంధువులకు చెప్పినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా సాక్షిలో వచ్చిన కథనం నియోజకవర్గంలో కలకలం రేపింది. యల్లమంద వైన్‌షాపును టెండర్ దక్కించుకున్న వ్యాపారిని సాక్షిలో వచ్చిన కథనంపై ఖండన ఇవ్వాలని యువ నాయకుని సలహాదారులు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. సామాన్యులు ఆత్మహత్యాయత్నం చేస్తే నానా హడావుడి చేసే పోలీసులు ఈ వ్వవహారంలో ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ సొసైటీ ఉపాధ్యక్షుడి ఆత్మహత్యాయత్నంపై జిల్లా రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ దృష్టి సారించినట్టు పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఆత్మహత్యాయత్నానికి పాల్పడే ముందు రాసిన సూసైడ్ నోట్‌పై స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఆరా తీస్తున్నారు. గుంటూరులో నేడు సమావేశం గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ళ, గురజాల, దాచేపల్లి, మాచవరం మండలాలకు చెందిన మద్యం వ్యాపారులతో ఆ నియోజకవర్గ ముఖ్యనేత సోమవారం గుంటూరులో సమావేశం నిర్వహించనున్నట్టు పార్టీవర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం నిర్వహించిన లాటరీలో మద్యం దుకాణాలు లభించిన వీరంతా ఆ నియోజకవర్గ నాయకుని ఆదేశాల మేరకు సమావేశానికి వెళుతున్నారు. నియోజకవర్గ పరిధిలో వ్యాపారం చేసుకునే ప్రతీ వ్యాపారి తమకు 50 శాతం వరకు వాటా ఇవ్వాల్సిందేనని హుకుం చేసినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలోని గురజాలలో ఒకటి ప్రభుత్వ మద్యం దుకాణం కాగా ఐదు ప్రైవేటు దుకాణాలు ఉన్నాయి. దాచేపల్లిలో ఐదు ప్రైవేటు దుకాణాల్లో నడికుడి మద్యం దుకాణంపై ముఖ్యనేత కన్ను పూర్తిగా పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా గతంలో రూ.5 కోట్లకు దీనిని వేలంలో కైవసం చేసుకున్నారు. పైగా ఇక్కడ మద్యం అమ్మకాలు ఎక్కువుగా ఉండటంతో ఈ షాపును పూర్తిగా తమకే కావాలంటూ ఆ నేత డిమాండ్ చేస్తున్నట్టు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. మాచవరంలోని మూడు దుకాణాలు, పిడుగురాళ్ళ పట్టణంలోని ఒకటి ప్రభుత్వ దుకాణం కాగా తొమ్మిది దుకాణాల్లో కూడా వాటాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గంలోని 22 ప్రైవేటు మద్యం దుకాణాలు, రెండు ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇవికాక మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి మండలంలో ఉన్న మూడు మద్యం దుకాణాల్లో వాటాలు కావాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. వీరంతా ముఖ్యనేత ఆదేశాల మేరకు గుంటూరు సమావేశానికి వెళుతున్నట్టు సమాచారం. -
ఎక్సైజ్ మంత్రి అడ్డాలో.. ప్రభుత్వ వైన్ షాప్ పంచాయితీ
లక్ష్మీ టాకీస్ సెంటర్ నుంచి కోనేరు సెంటర్‌కు షాప్ తరలింపు మసీదుకు 50 మీటర్ల దూరంలోనే ప్రభుత్వ వైన్ షాప్ మద్యం సిండికేట్‌కు అనుకూలంగా చక్రం తిప్పిన అమాత్యుని బంధువు విజయవాడ: ఎక్సైజ్‌శాఖ మంత్రి అడ్డాలో అడ్డగోలు పంచాయితీ సాగుతోంది. అక్కడ నిబంధనలు పాటించరు. కావాల్సిన వారికి మేలు చేయటానికి నిబంధనలకు పూర్తిగా నీళ్లు వదిలేస్తున్నారు. గుడి, బడి నిబంధన పక్కన పెట్టి మరీ అడ్డగోలుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. పర్యవసానంగా విక్రయాలు జరిగే ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వ వైన్ షాప్‌ను అక్కడి వ్యాపారుల కోసం వేరే సెంటర్‌కు మార్చివేశారు. మార్చిన సెంటర్లో పక్కనే మసీదు ఉన్నప్పటికి కనీసం పట్టించుకోకుండా షాపు ఏర్పాటు చేయటానికి సిద్ధం చేసి షాపు ఏర్పాటు చేసి మద్యం లోడ్లు దించటంతో స్థానికులు, ముస్లింలు ఆందోళణకు దిగటంతో వివాదంగా మారింది. జిల్లాలో కేటాయించిన 33 ప్రభుత్వ దుకాణాల్లో భాగంగా మచిలీపట్నంలో ఒక ప్రభుత్వ వైన్ షాప్ ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ అధికారులు నిర్ణయించారు. ఎక్కువ విక్రయాలు జరిగే ప్రాంతంలోనే వైన్ షాప్ పెట్టాలని ఎక్సైజ్ శాఖ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. కాగా, మచిలీపట్నం పట్టణంలో మద్యం విక్రయాలు ఎక్కువగా లక్ష్మీటాకీస్ సెంటర్లో జరగుతాయి. ఇక్కడి ైవైన్షాపులు రోజుకు సగటున రూ.రెండు లక్షల వరకు విక్రయాలు సాగుతుంటాయి. ఈ ప్రాంతంలో ప్రభుత్వ వైన్ షాప్ ఏర్పాటు చేస్తే కనీసం సగటున రోజుకి రూ.లక్ష వరకు విక్రయాలు జరుగుతాయని ,శాఖకు ఎక్కువగా ఆదాయం వస్తుందని ఎక్సైజ్ శాఖ భావించి అక్కడ ఏర్పాటుకు అంతా రంగం సిద్ధం చేసుకున్నారు. దీనిపై అక్కడి వైన్ షాపులు, బార్ల యజమానులు అమాత్యుని వ్యవహారాలు చూసే ఆయన సమీప బంధువును ఆశ్రయించారు. దీంతో సదరు బంధువు ఎక్సైజ్ అధికారులను పిలిచి మాట్లాడి షాపును వేరే చోట పెట్టాలని ఆదేశించారు. అది కొంత కష్టమని అధికారులు బదులిచ్చే క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో అక్కడి నుంచి షాపును కోనేరు సెంటర్లో ఏర్పాటు చేయాలని ఆదేశించటంతో అధికారులు చేసేదేమీలేక కోనేరు సెంటర్లో షాపును వెతికారు. అయితే సదరు సెంటర్లో ఇప్పటికే 3 వైన్ షాపులు, 3 బార్లు ఉన్నాయి. అక్కడ ఒక్కొక్క షాపులో రోజుకి సగటున రూ.70 వేల నుంచి నుంచి రూ.లక్ష వరకు విక్రయాలు జరుగుతాయి. ఈ క్రమంలో అక్కడ షాపును ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. శనివారం మద్యం నిల్వలు దించి షాపును ప్రారంభించటానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఏర్పాటు చేసిన షాపు మసీదుకు 50 మీటర్లు దూరంలోనే ఉంది. దీనికి ఎక్సైజ్ అధికారులు మాత్రం కొత్త వాదన వినిపిస్తున్నారు. వారి లెక్క ప్రకారం వంద మీటర్లు దూరం ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ముస్లింలు, స్థానికులు, స్థానిక వ్యాపారులు షాపు ఏర్పాటు నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. -
రండి బాబూ రండి.. ఎమ్మార్పీకే మద్యం!
చిల్లకల్లు (జగ్గయ్యపేట) : ప్రభుత్వ దుకాణంలో ఎమ్మార్పీకే మద్యం అమ్మకాలు జరుగుతాయని పేర్కొంటూ పేట ఎక్సైజ్ అధికారులు మద్యం దుకాణంలో మద్యాన్ని విక్రయించారు. గ్రామంలో గురువారం రాత్రి ప్రభుత్వ మద్యం దుకాణాన్ని సీఐ వీవీవీఎన్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మండలానికి ఒక మద్యం దుకాణాన్ని కేటాయించిందన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ దుకాణంలో ఎమ్మార్పీకే మద్యం అమ్మకాలు జరుగుతాయన్నారు. కొన్ని రోజులు పాటు ఎక్సైజ్ కానిస్టేబుల్స్ మద్యం విక్రయిస్తారన్నారు. అనంతరం ఆయన కొద్దిసేపు కౌంటర్లో కూర్చొని మందుబాబులకు మద్యం విక్రయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శివప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మరో అవకాశం
41 మద్యం షాపులకు మళ్లీ నోటిఫికేషన్ రేపటి నుంచే తెరుచుకుంటున్న సర్కారు దుకాణాలు విశాఖపట్నం : ప్రభుత్వానికి కాసులు కురిపిస్తున్న మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. జిల్లాలోని మొత్తం 406 మద్యం షాపుల్లో 39 షాపులు ప్రభుత్వం నిర్వహించనుంనుండగా మిగిలిన 367 షాపుల్లో 326 షాపులను రెండు రోజుల క్రితం లాటరీలో ప్రైవేటు వ్యాపారులకు అందించారు. అయితే 41 మద్యం షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడంతో వాటికి మరోసారి దరఖాస్తులు ఆహ్వానించాల్సి వచ్చింది. దీంతో ఎక్సైజ్ అధికారులు బుధవారం 41 షాపులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీలోగా వ్యాపారులు నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు గడువు పూర్తయిన వెంటనే అంటే 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకూ దరఖాస్తులు స్వీకరించి సాయంత్రం 5గంటలకు లాటరీ తీస్తారు. విశాఖ మురళీనగర్‌లోని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఈ ప్రక్రియ పూర్తిచేసి షాపులు కేటాయించాలని నిర్ణయించారు. మరోవైపు ప్రభుత్వం నిర్వహించదలిచిన 39 మద్యం దుకాణాలను ఎప్పుడు తెరవాలనేదానిపై అధికారులు తర్జన భర్జన పడ్డారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్‌కల్లాం ఎక్సైజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మద్యం షాపుల కేటాయింపులపై అధికారులతో సమీక్ష జరిపిన ఆయన వెంటనే ప్రభుత్వ దుకాణాలు తెరవాలని ఆదేశించారు. దీంతో గురువారం విశాఖలో కనీసం మూడు షాపులు తెరవనున్నట్లు ఎక్సైజ్ డీసీ ఎం.సత్యనారాయణ బుధవారం ‘సాక్షి’ కి వెల్లడించారు. ఈ నెల 5 లేదా 6వ తేదీ కల్లా జిల్లాలో 39 ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరుస్తామని ఆయన తెలిపారు. అయితే ఈ షాపులను కూడా తామే దక్కించుకోవాలని, సింగిల్ టెండర్ల ద్వారా తమ పని జరుపుకోవాలని సిండికేట్లు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. -
లాటరీ షురూ
- ఆలస్యంగా ప్రారంభమైన ప్రక్రియ - ఒకరికి ఒక షాపే కేటాయింపు - సౌకర్యాలు నిల్ - ఆందోళనకు దిగిన టెండరుదారులు మచిలీపట్నం : లాటరీ పద్ధతిలో మద్యంషాపుల కేటాయింపు ప్రక్రియ కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం జరిగింది. జిల్లాలో 335 మద్యం షాపులు ఉన్నాయి. వీటిలో 33 మద్యం దుకాణాలను ప్రభుత్వం ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు. మిగిలిన 302 షాపులకు టెండర్లు ఆహ్వానించగా 294 మద్యం దుకాణాలకు 6,995 దరఖాస్తులు వచ్చాయి. ఎనిమిది మద్యం షాపులకు అసలు టెండర్లు దాఖలు కాలేదు. 29 మద్యం దుకాణాలకు సింగిల్ టెండర్లు వచ్చాయి. తొలుత సింగిల్ టెండర్లు దాఖలు చేసిన వారికి షాపులను కేటాయించారు. కలెక్టర్ బాబు.ఎ, జేసీ గంధం చంద్రుడు, ట్రైనీ కలెక్టర్ సలోమి సైదాని, ఎక్సైజ్ డీసీ బాబ్జిరావు, మచిలీపట్నం, విజయవాడ ఎక్సైజ్‌శాఖ ఈఎస్‌లు జి.మురళీధర్, ఎంవీ రమణ పర్యవేక్షణలో లెసైన్సులను జారీ చేశారు. ఒక్కో షాపునకు వచ్చిన టెండర్ల ఆధారంగా టెండరు దాఖలు చేసిన వారిని పేర్ల వారీగా పిలిచి వారి సమక్షంలోనే లాటరీ తీశారు. ఆలస్యంగా ప్రారంభం లాటరీ ప్రక్రియ ఉదయం 10.30కు ప్రారంభమవుతుందని ప్రకటించినా 11.45కు ప్రారంభించారు. సింగిల్ టెండర్లు దాఖలు చేసిన వారికి లెసైన్సులు జారీ చేయగా, 11.55కు మచిలీపట్నం ఈఎస్ పరిధిలోని ఒకటో నంబరు షాపును లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. అనంతరం కలెక్టర్ మీకోసం కార్యక్రమానికి వెళ్లారు. జేసీ గంధం చంద్రుడు, బందరు ఆర్డీవో సాయిబాబు, ఎక్సైజ్ అధికారులు ఆయా షాపులకు వచ్చిన దరఖాస్తులు, టెండరు బాక్సుల్లో ఉన్న దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించారు. సాయంత్రం 5గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న అనంతరం లాటరీ పద్ధతిలో షాపుల కేటాయింపును జేసీ ప్రారంభించారు. ఒకరికి ఒక షాపే మచిలీపట్నం ఈఎస్ పరిధిలోని షాపులకు చంద్రుడు, విజయవాడ ఈఎస్ పరిధిలోని మద్యం దుకాణాలకు బందరు ఆర్డీవో సాయిబాబు లాటరీ తీశారు. సింగిల్ టెండర్లు దాఖలు చేసిన వారు, లాటరీ పద్ధతిలో ఒక షాపు దక్కించున్నవారిని గుర్తించి మిగిలిన షాపులకు నిర్వహించే లాటరీలో వారి పేర్లు తొలగిస్తున్నట్లు జేసీ ప్రకటించారు. ఒకరి పేరున ఒక షాపు మాత్రమే కేటాయించటం జరుగుతుందని తెలిపారు. అర్ధరాత్రి సమయానికీ లాటరీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. లాటరీలో మద్యం దుకాణం దక్కించుకున్న వారికి చలానాలు ఇచ్చి, లెసైన్సు ఫీజులోని 25 శాతం నగదును ఎక్సైజ్‌శాఖ బ్యాంకు ఖాతాలో జమ చేయాలని అధికారులు సూచించారు. టెండరుదారుల ఆందోళన లాటరీలో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచి టెండరుదారులు తరలివచ్చారు. దీంతో కలెక్టరేట్ ప్రాంగణం కిటకిటలాడింది. ఎక్సైజ్ అధికారులు కుర్చీలు కూడా ఏర్పాటు చేయకపోవటం, తాగునీటిని అందుబాటులో ఉంచకపోవటంతో టెండరుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి కూడా మద్యం షాపుల కేటాయింపు ప్రారంభం కాకపోవటం, సౌకర్యాలు లేకపోవటంతో అంతా ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలు వద్దకు వెళ్లి తమదైన శైలిలో అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం వస్తే వేలాది కుర్చీలు వేస్తారని, లక్షలాది రూపాయలు ప్రభుత్వానికి చెల్లించిన తమకు కూర్చునేందుకు కుర్చీలు వేయలేదని, తాగునీరు అందుబాటులో ఉంచలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పది నిమిషాల పాటు ఆందోళన కొనసాగింది. విషయం తెలుసుకున్న జేసీ బయటకు వచ్చి దరఖాస్తులు అధికంగా ఉండటంతో వాటన్నింటినీ పరిశీలించటంలో ఆలస్యం జరుగుతోందని సర్ది చెప్పారు. పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు చేస్తామని నచ్చజెప్పటంతో ఆందోళన విరమించారు. మహిళలు కూడా రావడంతో కొంత ఇబ్బందులు పడ్డారు. భారీగా పోలీస్ బందోబస్తు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వాహనాల్లో టెండరుదారులు తరలిరాగా వారి వాహనాలను కలెక్టరేట్‌లోకి అనుమతించలేదు. కలెక్టరేట్‌కు సమీపంలో ఉన్న ఆర్అండ్బీ అతిథి గృహం, కలెక్టర్ బంగ్లాకు వెళ్లే రోడ్డు, జిల్లాపరిషత్ రోడ్డు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో కలెక్టరేట్ ప్రాంగణం చుట్టూ జిల్లా పరిషత్ ప్రాంగణంలో కార్లు బారులు తీరాయి. కలెక్టరేట్‌కు ఉన్న మూడు ప్రధాన గేట్ల వద్ద ఎక్సైజ్ శాఖ జారీచేసిన పాస్‌లు ఉన్న వారినే లోనికి అనుమతించారు. -
సిండికేట్లదే గెలుపు
- 328 మద్యం షాపులకు లాటరీ - అనుకున్నది సాధించిన సిండికేట్లు - చేయి కలిపిన రియల్టర్లు, అధికారులు? - ఆందోళన చేసిన మహిళలు అరెస్ట్ సాక్షి, విశాఖపట్నం: ఆదాయమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించిన పాలసీ ప్రకారం సోమవారం మద్యం షాపుల కేటాయింపు జరిగింది. ఉదయం 10 గంటలకే ప్రారంభమైన లాటరీ ప్రక్రియ తెల్లవారు జాము వరకూ సాగింది. జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్,జాయింట్ కలెక్టర్ జె.నివాస్, ఎక్సైజ్ కమిషనర్ శ్రీనివాస శ్రీనరేష్, ఎక్సైజ్ డీసీ ఎం.సత్యనారాయణలు కైలాసపురంలోని డాడ్ లేబర్ బోర్డ్ కళ్యాణమండపంలో మద్యం దుకాణాలకు లాటరీ తీశారు. ప్రభుత్వ తీరకు నిరసనగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన నిర్వహించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోనే గతేడాది మద్యం అమ్మకాల్లో రికార్డు సృష్టించిన విశాఖ జిల్లా కేటాయింపుల్లోనూ అదే ఒరవడి కొనసాగించింది. 406 మద్యం షాపుల్లో 39 షాపులను ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించి మిగతా 367 షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తే 328 షాపులకు 5835 దరఖాస్తులు దాఖలయ్యాయి. 39 షాపులకు ఒక్క దరఖాస్తు దాఖలు కాలేదు. దీంతో 328 షాపులకు సోమవారం కేటాయింపు ప్రక్రియ ప్రారంభించారు. రాత్రి 8 గంటల ప్రాంతానికి దాదాపు 200 షాపులకు లాటరీ తీశారు. అన్ని షాపులకు లాటరీ తీయడానికి అర్ధరాత్రి దాటిపోతుందని డీసీ వెల్లడించారు. రెడ్డి సీతారాం అనే వ్యక్తి గెజిట్ నెం.118,119లకు సింగిల్ టెంటర్లు వేశారు. లాటరీకి అటెండ్ కాకపోవడంతో అతనికి ఒక షాపు మాత్రమే కేటాయిస్తామని కలెక్టర్ ప్రకటించారు. సిండికేట్లు, రియల్టర్లదే హవా: మద్యం షాపులకు దరఖాస్తు చేయడం దగ్గర్నుంచి లాటరీ పూర్తయ్యే వరకూ సిండికేట్లు చక్రం తిప్పారు. అనుమానం రాకుండా వారు అనుకున్నది చేయగలిగారు. సింగిల్ టెండర్లు, డబుల్ టెండర్లు, మూడు నుంచి 10 టెండర్లు..ఇలా వచ్చిన దరఖాస్తులన్నీ సిండికేట్ల మాయాజాలమేనంటే నమ్మకతప్పదు. 59 షాపులకు సింగిల్ దరఖాస్తులు వచ్చాయి. దాదాపుగా ఇవన్నీ సిండికేట్ల కనుసన్నల్లో వచ్చినవేనంటున్నారు. గాజువాకలో 30, అనకాపల్లిలో 16, విశాఖలో 13 షాసులు సిండికేట్ల చేజిక్కిట్లేనని భావించవచ్చు. మరో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల మందగించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి కొందరు రియల్టర్లు, ఉన్నతాధికారులు తమ పెట్టుబడులను మద్యం దుకాణాలవైపు మళ్లించినట్లు తెలుస్తోంది. పలువురు ఉన్నతాధికారులు తాము వెనకుండి బినామీలతో దరఖాస్తులు చేయించినట్లు సమాచారం. ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు మద్యం దుకాణాలను దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. గ్రామీణ, ఏజెన్సీ పరిధి లోని షాపులకోసం 4665 దరఖాస్తులు రాగా కేవలం సిటీ పరిధిలోని 60షాపులకు 1170దరఖాస్తులు రావడంతో ఆ విషయం స్పష్టమవుతోంది. సిటీని ఆనుకుని ఉన్న గాజువాక, అనకాపల్లి ప్రాంతాల్లోని షాపులకు ఇవే డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వామే వత్తాసు పలికితే ఎలా? ఐద్యా, ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన చేపట్టారు. మంచినీళ్లు ఇవ్వండి బాబూ, మద్యం వద్దు అంటూ నినాదాలు చేశారు. షాపింగ్ మాల్స్‌లో మద్యం అమ్మకాలు ఏంటని నిలదీశారు.డిఎల్‌బి కళ్యాణమండపంలోకి దూసుకువెళ్లి లాటరీ ప్రక్రియను అడ్డుకోవాలని ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని వారించి వెనక్కు పంపాలని చూశారు. కుదరకపోవడంతో అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. డిఎల్‌బీకి కిలో మీటరు దూరంలోనే మహిళలను అడ్డుకున్న పోలీసులు వారిని నిర్ధాక్షిణ్యంగా ఈడ్చిపాడేశారు. -
లక్కు ఎవరిదో!
ఎంత పెట్టుబడి పెట్టినా నష్టం రానిది మద్యం వ్యాపారం. అందుకే షాపులకోసం అన్ని వేల మంది పోటీ పడుతుంటారు. జిల్లాలో 410 మద్యం దుకాణాల నిర్వహ ణ కోసం ఏకంగా మూడువేల మందికి పైగా దరఖాస్తులు వేశారంటే ఎంత ఆదా యం ఉందో అర్థమయిపోతోంది. దరఖాస్తులు వేసిన వారందరికీ దుకాణాలు రావు. కాస్త అదృష్టం కూడా ఉండాలి. ఈ అదృష్టం ఎవరిని వరిస్తుందో సోమవారం తేలనుంది. లక్కీడిప్ పద్ధతిలో దుకాణాలు కేటాయిస్తారు. ఇందుకోసం ఎక్సైజ్ అధికారులు ఏర్పాట్లు చేశారు. - నేడు మద్యం దుకాణాల కేటాయింపు - పీవీకేఎన్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి - తొలి విడతలో 320దుకాణాలకే దరఖాస్తులు - 90 దుకాణాలకు పడని టెండర్లు - దరఖాస్తు రుసుంతో రూ.12 కోట్ల ఆదాయం చిత్తూరు (అర్బన్): జిల్లాలోని మద్యం దుకాణాల కోసం నిర్వహించే లక్కీడిప్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో లాటరీ పద్ధతిలో దుకాణాల కేటాయిస్తారు. కలెక్టర్, ఎక్సైజ్ అధికారుల సమక్షంలో ఈ వ్యవహారం జరుగుతుంది. ఉదయం 10.30 గం టల నుంచి సర్కిళ్ల వారీగా దుకాణాలకు లాటరీ తీస్తారు. దరఖాస్తులన్నింటినీ టెండరు బాక్సుల్లోంచి బయటకు తీసి, వాటికి టోకెన్ నంబర్లు కేటాయిస్తారు. వీటిని ఒక డబ్బాలో వేసి ప్రతి దుకాణానికీ మూడు టోకెన్లు బయటకు తీస్తారు. ఇందులో తొలిగా వచ్చిన టోకెన్ నంబర్ వారికి దుకాణం కేటాయిస్తారు. ఇతను ఆ దుకాణం లెసైన్సు ఫీజులో 1/3 వంతు నగదును సాయంత్రం లోపు అధికారులకు చెల్లిస్తే, మంగళవారం ప్రొవిజన్ లెసైన్సు జారీ చేస్తారు. అలా చెల్లించకున్నా, తనకు దుకాణం వద్దని చెప్పినా, రెండోసారి వచ్చిన టోకెను నెంబరు ఆధారంగా మరో వ్యక్తికి, అతనూవద్దనుకుంటే మూడోసారి వచ్చిన వ్యక్తికి కేటాయిస్తారు. అతను వద్దనుకుంటే సం బంధిత దుకాణానికి రీ-టెండరు నిర్వహిస్తారు. 90 దుకాణాలకు నిల్... జిల్లాలో 410 మద్యం దుకాణాల్లో 320 దుకాణాలకు మాత్రమే టెండర్లు పడ్డాయి. 90 దుకాణాలకు ఒక్క టెండరు కూడా పడలేదు. ఈ ప్రాం తాల్లో వ్యాపారం జరగదనే ఉద్దేశంతోనే ఎవరూ ముందుకురాలేదని తెలుస్తోంది. 320 దుకాణాలకు 3,048 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు రుసుం ద్వారా జిల్లాలో తొలి విడతగా ప్రభుత్వానికి రూ.12 కోట్ల ఆదాయం లభించింది. దరఖాస్తులు పడని దుకాణాలు ఇవే.. దరఖాస్తులు పడని దుకాణాల్లో చిత్తూరు ఎక్సైజ్ పరిధిలో చిత్తూరు అర్బన్ స్టేషన్‌లోని 4, రూరల్‌లో 4, కార్వేటినగరంలో 3, మదనపల్లెలో 3, మొలకలచెరువులో 4, పుంగనూరులో 7, పలమనేరులో 9, వాల్మీకిపురంలో 4, పీలేరులో 4 ఉన్నాయి. మిగిలిన 147 దుకాణాలకు 1,418 దరఖాస్తులు వచ్చాయి. తిరుపతి ఎక్సైజ్ పరిధిలో దరఖాస్తులు రానివి తిరుపతి అర్బన్‌లో 3, రూరల్‌లో 4, పాకాలలో 13, పుత్తూరులో 8, శ్రీకాళహస్తిలో 2, సత్యవేడులో 7, నగరిలో 10 ఉన్నాయి. మిగిలిన 173 దుకాణాలకు 1,556 దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాది జిల్లాలో 458 దుకాణాల్లో 70తీసుకోవడానికి ఎవరూ ముందురాలేదు. ఈ సారి 70 దుకాణాలతో పాటు అదనంగా మరో 20కి దరఖాస్తులు పడకపోవడంతో రీ-టెండర్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. అప్పటికీ ఎవరూ రానిపక్షంలో వీటి స్థానంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు వెలుస్తాయి. -
ఖజానాకు కిక్
- 328 మద్యం షాపులకు 5835 దరఖాస్తులు - చివరిరోజు అత్యధికంగా 5431 దాఖలు - మూడింతలు పెరిగిన దరఖాస్తుల ఫీజు - గతేడాది రూ.8.25కోట్లు.. ఈ ఏడాది రూ.21కోట్లు - మద్యం షాపులకు 50 మంది మహిళల దరఖాస్తు - 39 షాపులకు నిల్.. 59 షాపులకు సింగిల్ - కె.కోటపాడు మండలం ఆనందపురం షాపునకు 130 దరఖాస్తులు - నేడు లాటరీలో కేటాయింపు సాక్షి, విశాఖపట్నం : రికార్డులు బ్రేకవుతున్నాయి. మద్యం షాపులకు ఊహించని స్పందన వచ్చింది. కేవలం ఒకే ఒక్కరోజులో రాష్ర్టంలోనే రికార్డుస్థాయిలో 5,431 దరఖాస్తులు దాఖలయ్యాయి. దరఖాస్తు రుసుంలో కూడా రికార్డుల మోత మోగింది. గతేడాది రూ.8.25 కోట్లు వస్తే ఈసారి ఏకంగా రూ.21కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరింది. మహిళలు సైతం ఈసారి పోటీపడుతూ దరఖాస్తులు దాఖలు చేశారు. సోమవారం లాటరీ ద్వారా షాపుల కేటాయింపు కోసం జిల్లా ఎక్సైజ్ శాఖాధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 406 మద్యం షాపుల్లో 39 షాపులను ప్రభుత్వం మినహాయించుకుంది. మిగిలిన 367 షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తే 328 షాపులకు 5835 దరఖాస్తులు దాఖలయ్యాయి.కాగా మిగిలిన 39 షాపులకు ఒక్క దరఖాస్తు దాఖలు కాలేదు. దరఖాస్తులు దాఖలైన షాపుల్లో 59 షాపులకు సింగిల్ దరఖాస్తులు వచ్చాయి. తొలి నాలుగు రోజులు సింగిల్ దరఖాస్తు పడలేదు. ఐదవ రోజు ఏకంగా 134 షాపులకు 406 దరఖాస్తులు దాఖలవగా, చివరిరోజు శనివారం ఏకంగా 5,431 దరఖాస్తులు పడ్డాయి. విశాఖసిటీ పరిధిలోని 60 షాపులకు 1170 దరఖాస్తులు రాగా, గ్రామీణ, ఏజెన్సీ పరిధి లోని షాపులకు 4665 దరఖాస్తులు వచ్చాయి. సుమారు 50 మంది మహిళలు మద్యం షాపుల కోసం దరఖాస్తు చేయగా, ఎక్కువ మంది సిటీ పరిధిలోని షాపుల కోసమే పోటీపడుతున్నారు. లీజు కాలం పెంచడమే కారణం! గతేడాది 406 షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తే 298 షాపులకు 3312 దరఖాస్తులు రాగా, రూ.8.25కోట్ల ఆదాయం సమకూరింది. 108 షాపులకు ఒక్క దరఖాస్తు కూడా దాఖలు కాలేదు. అలాంటిది ఈసారి దరఖాస్తుల ఫీజులతో పాటు ైలెసైన్సింగ్ ఫీజులును సైతం పెంచినప్పటికీ మద్యం షాపులకు యమ గిరాకీ ఏర్పడింది. వ్యాపారులు పోటీ పడి మరీ దరఖాస్తు చేశారు. గతేడాది వరకు లీజుకాలం ఏడాది మాత్రమే ఉండగా, ఈఏడాది నుంచి షాపుల లీజు కాలం రెండేళ్లకు పెంచడం వల్లే వ్యాపారులు ఎక్కువగా ఆసక్తి చూపారని భావిస్తున్నారు. సిటీలో 13 షాపులకు సింగిల్ దరఖాస్తు సిటీ పరిధిలో జ్ఞానాపురం జంక్షన్‌లోని షాపునకు అత్యధికంగా 115 దరఖాస్తులు దాఖలు కాగా, రూరల్ పరిధిలో కె.కోటపాడు మండలం ఆనందపురం గ్రామంలోని షాపునకు రికార్డు స్థాయిలో 130 దరఖాస్తులు వచ్చాయి. సిటీ పరిధిలో జ్ఞానాపురం తర్వాత తాటిచెట్లపాలెం షాపునకు 63, పెదవాల్తేరు షాపునకు 52 దరఖాస్తులు దాఖలయ్యాయి. సిటీ పరిధిలో పూర్ణామార్కెట్, చావులమదుం, సీతమ్మదార, రైల్వే న్యూ కాలనీ, మల్కాపురం, శ్రీహరిపురం, బీచ్‌రోడ్, మురళీనగర్ ప్రాంతాల్లోని 13 షాపులకు సింగిల్దరఖాస్తులు వచ్చాయి. పెరిగిన దరఖాస్తు ఫీజుల వల్ల రాష్ర్ట ఖజానాకు ఏకంగా రూ.21కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది లెసైన్సింగ్ ఫీజుల రూపంలో 141.95 కోట్ల ఆదాయం సమకూరితే ఈ ఏడాది పెరిగిన లెసైన్సింగ్ ఫీజుల వల్ల ఈ మొత్తం రూ.175కోట్లకు పైగా వస్తుందని అంచనా వేస్తున్నారు. స్పాట్లో లెసైన్స్ ఫీజు చెల్లించకపోతే.. ఇక సోమవారం ఉదయం 10.30గంటలకు షాపుల కేటాయింపు కోసం లాటరీ తీసేందుకు కైలాసపురంలోని డాక్లేబర్ బోర్టు కల్యాణ మండపంలో ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ యువరాజ్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ ఎం.సత్యనారాయణ సమక్షంలో జరుగనున్న ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. గతంలో లాటరీలో షాపు దక్కించుకున్న వారు తొలి క్వార్టర్లో ఎప్పుడైనా లెసైన్సింగ్ ఫీజులో మూడవ వంతు చెల్లించే వారు. మారిన నిబంధనల ప్రకారం లాటరీలో షాపు దక్కించుకున్న వ్యక్తి వెంటనే మూడవ వంతు లెసైన్స్ ఫీజు చెల్లించాలి. లేకుంటే ఆ తర్వాత రెండు, మూడు ఆప్షన్ కింద లాటరీ తీసి వారిలో ఎవరు ైలెసైన్స్ ఫీజు చెల్లిస్తే వారికే షాపు కేటాయిస్తారు. -
లక్కీ డ్రాప్స్
సాక్షి ప్రతినిధి, కర్నూలు : ఈ నెలాఖరుకు మద్యం షాపుల లెసైన్స్ గడువు ముగియనుంది. ఇదే అదనుగా మద్యం సిండికేట్లు సరికొత్త అవతారం ఎత్తాయి. తమకు వచ్చిన సరుకులో అధిక భాగాన్ని బెల్టు షాపులకు మళ్లించారు. కొద్దిపాటి స్టాకును మాత్రమే తమ వద్ద ఉంచుకుని.. అధిక ధరకు బెల్టు షాపులకు విక్రయించడం ద్వారా సిండికేట్లు భారీగా దండుకున్నాయి. కట్టడి చేయాల్సిన ఎక్సైజ్ అధికారులు చేష్టలూడిగి చూస్తున్నారు. అంతేకాదు.. మద్యం సిండికేట్ల వద్ద వసూలు చేస్తున్న తరహాలోనే బెల్టు షాపుల వద్ద కూడా మాముళ్లకు తెగబడ్డారు. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా బెల్టు షాపుల జోరు అధికమైంది. ప్రస్తుతం మద్యం షాపుల్లో మద్యం కొరత వేధిస్తోంది. కేవలం రెండు, మూడు బ్రాండ్ల లిక్కరు మాత్రమే అధికారిక మద్యం షాపుల్లో లభిస్తోంది. మిగిలిన బ్రాండ్ల కోసం బెల్టుషాపులను ఆశ్రయించాల్సి వస్తోంది. దొరుకుతున్న బ్రాండ్లు కూడా కేవలం చీప్‌లిక్కరే కావడం గమనార్హం. ఓల్డ్ తవేరా వంటి చీప్ లిక్కరు బ్రాండ్లు మాత్రమే అధికారిక మద్యం షాపుల్లో ఉంచుతున్నారు. జిల్లాలోని మెజార్టీ మద్యం దుకాణాల్లో నెలకొన్న పరిస్థితి ఇదే. మంచి బ్రాండ్ల మద్యం కొనుగోలు చేయాలంటూ బెల్టు షాపుల్లో అదనంగా రూ.30 నుంచి రూ.100 వరకు వెచ్చించాల్సి వస్తోందని మద్యం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కట్టడి చేయాల్సిన ఎక్సైజ్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. బాటిల్‌పై భారీగా వసూలు మద్యం సిండికేట్ల ఎత్తుగడలతో మద్యం ప్రియుల జేబుకు భారీగా చిల్లు పడుతోంది. మద్యం కావాలంటే బాటిల్‌కు అదనంగా చెల్లించుకోవాల్సి వస్తోంది. క్వాటర్ బాటిల్‌కు ఏకంగా రూ.30 వరకు మట్టజెబితే కానీ దొరకని పరిస్థితి. ఫుల్ బాటిల్‌కు రూ.80 నుంచి రూ.100 వరకు అదనంగా దండుకుంటున్నారు. ఒకవైపు మద్యం షాపుల్లో మంచి బ్రాండ్లు దొరక్కపోవడం.. బెల్టు షాపులే దిక్కవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధిక ధరకు కూడా మద్యాన్ని కొని తాగాల్సిన దుస్థితి మందుబాబులది. ఈ వ్యవహారమంతా ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లోనే సాగుతుండటం గమనార్హం. బెల్టు షాపులపై దాడులు చేయకుండా ఉండేందుకు షాపు రకాన్ని బట్టి ఏకంగా రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బెల్టు షాపులపై ప్రత్యేక డ్రైవ్ చేపడతాం జిల్లా వ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు బెల్టు షాపులపై ప్రత్యేక డ్రైవ్ చేపడతాం. బెల్టు షాపులు నిర్వహిస్తున్న వారిపై దాడులు చేసి చర్యలు తీసుకుంటాం. మద్యం షాపుల యాజమాన్యాలు తమకు వచ్చిన స్టాకును బ్లాకులో బెల్టు షాపులపై విక్రయించినట్టు తేలితే కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే కొన్ని బెల్టు షాపులను గుర్తించాం. వీటిపై త్వరలో దాడులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. - హేమంత్ నాగరాజు, ఎక్సైజ్‌శాఖ ఇన్చార్జి డీసీ -
మద్యం షాపులకు దరఖాస్తు చేయొద్దు
సాక్షి, గుంటూరు : ‘‘హలో..బాస్ ఈ మండలంలో పలానా మద్యం షాపులను మేమే చేయాలి. వాటికి దరఖాస్తులు చేయొద్దు. ఒకవేళ చేసిన తరువాత లాటరీలో వస్తే అందులో సగం వాటా మాకివ్వాల్సి ఉంటుంది. మా మాట కాదని ఎక్కువ చేస్తే వ్యాపారం ఎలా చేస్తావో మేమూ చూస్తాం.’’ ఇదీ మద్యం వ్యాపారులను టీడీపీ నేతలు బెదిరిస్తున్న తీరు... మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా ఎంతో మంది వ్యాపారులు డీడీలు తీసి దరఖాస్తు చేసుకొనేందుకు ప్రయత్నిస్తుండగా, టీడీపీ మండల నాయకులు, ఎమ్మెల్యేలు నేరుగా వారికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో లాభాలు ఎక్కువగా వచ్చే దుకాణాలను గుర్తించి వాటికి ఎవరూ పోటీ తగలవద్దంటూ హుకుం జారీ చేస్తున్నారు. ముఖ్యంగా నరసరావుపేట, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, ప్రత్తిపాడు, సత్తెనపల్లి, తెనాలి నియోజకవర్గాల్లో గిరాకీ ఉన్న దుకాణాలకు ఎక్కువ దరఖాస్తులు రాకుండా టీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్టు తెలుస్తోంది. గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం నడికుడి దుకాణం అప్పట్లో రూ. 5.20 కోట్లకు టెండర్ వేసి అక్కడి వ్యాపారులు దక్కించుకున్నారు. అంత గిరాకీ ఉన్న దుకాణానికి ప్రస్తుతం ఎవరూ దరఖాస్తు చేయవద్దంటూ అక్కడి టీడీపీ నేతలు వ్యాపారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కొందరైతే ఒక అడుగు ముందుకేసి ఎక్సైజ్ అధికారులతోనే రాయబారాలు నడుపుతున్నారు. ఎక్కడైనా టీడీపీ సిండికేట్ మాత్రమే ఉండాలట... జిల్లాలో ఏ మండల కేంద్రంలో నైనా సరే ఎవరికి షాపులు వచ్చినా అందులో టీడీపీ నేతలకు వాటాలు ఇచ్చి వారి ఆధ్వర్యంలో మాత్రమే సిండికేట్‌గా ఏర్పాటవ్వాలన్నది టీడీపీ నేతల ఆకాంక్ష. ఏ పార్టీకి చెందిన వారైనా సరే స్లీపింగ్ పార్టనర్లుగా మాత్రమే ఉండాలి. పెత్తనమంతా తమ వారే చేయాలి. లేదంటే ఆ సిండికేట్లపై ఎక్సైజ్ అధికారుల చేత పదేపదే దాడులు చేయించి కేసులు నమోదు చేయిస్తామంటూ నేరుగా హెచ్చరికలు జారీ చేస్తుండటంతో ఎంతో మంది వ్యాపారులు దరఖాస్తు చేయకుండా వెళుతున్నట్టు సమాచారం. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. ఎప్పటి నుంచో వ్యాపారం చేస్తున్న తాము వీరి దయాదాక్ష్యణ్యాల మీద బతకాల్సిన అవసరం లేదంటూ టీడీపీ నేతల తీరుపై వ్యాపారులు మండిపడుతున్నారు. ఎక్సైజ్ అధికారులపై పెరుగుతున్న ఒత్తిళ్లు... తమకు కావాల్సిన దుకాణాలకు ఎవరైతే దరఖాస్తు చేస్తారో వారి వివరాలు వెంటనే చెప్పాలంటూ టీడీపీ నేతల నుంచి ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. దరఖాస్తుదారుల అడ్రస్ తెలుసుకుని వారిని నయానో భయానో ఒప్పించి లాటరీ తగిలినా ఆ షాపును తమకు అమ్మే విధంగా మంతనాలు సాగిస్తున్నారు. అయితే దుకాణాలన్నీ టీడీపీ నేతలకే దక్కేలా ఉండటంతో తాము ఏమీ చేయలేని పరిస్థితి ఉందని ఎక్సైజ్ అధికారులు భయాందోళన చెందుతున్నారు. -
మద్యం ఫుల్లు...మంచినీళ్లు నిల్లు
- 29 మద్యం టెండర్లను అడ్డుకుంటాం... - మండిపడ్డ మహిళా సంఘాలు.. - నూతన ఎక్సైజ్ పాలసీ జీవో ప్రతుల దహనానికి యత్నం - ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతితో పాటు పలువురు అరెస్టు విశాఖపట్నం (డాబాగార్డెన్స్) : ‘మద్యం పారించి ఖజానాని నింపుకొంటావా..? జనాభా ప్రాతిపదికన మద్యాన్ని పెడతానంటున్నావ్..అదే జనాభా ప్రాతిపదికన మంచినీళ్లు అందివ్వగలుగుతున్నావా....గృహాలు నిర్మించగలుగుతున్నావా? షాపింగ్ మాల్స్‌లో మద్యం అమ్మకాలా? సిగ్గు సిగ్గు...అంటూ మహిళా సంఘాలు నూతన మద్యం పాలసీపై విరుచుకుపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఎక్సైజ్ పాలసీని వ్యతిరేకిస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా), ఏపీ మహిళా సమాఖ్య, పలు మహిళా సంఘాలు గురువారం పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. యల్లమ్మతోట నండూరి ప్రసాదరావు భవన్ నుంచి వైఎస్సార్ విగ్రహ కూడలి మీదుగా జగదాంబ జంక్షన్ వరకూ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ‘బాబూ...మాకు జాబులు కావాలి, మద్యం షాపులు కాదు, మద్యం అమ్మకాలను పెంచొద్దు..కుటుంబాలను నాశనం చెయ్యొద్దు...’ అంటూ నినాదాలు చేశారు. జగదాంబ జంక్షన్లో నూతన ఎక్సైజ్ పాలసీ జీవో ప్రతులను దహనం చేసేందుకు ప్రయత్నించారు. దానిని పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఘర్షణ తలెత్తింది. ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేస్తున్న పలువురు మహిళల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి మాట్లాడుతూ మద్యం ద్వారా వచ్చే ఆదాయమే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ షాపింగ్ మాల్స్‌లో కూడా మద్యం లభించే విధంగా ప్రతి మండలానికి బార్ అండ్ రెస్టారెంట్ పెట్టే విధంగా ఈ పాలసీ ఉండడం దుర్మార్గమన్నారు. మద్యం వల్ల తల్లి, భార్య, చెల్లి, కన్నకూతురు అనే తేడా లేకుండా మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం ప్రజల జీవితాన్ని చిధ్రం చేస్తున్నా...ఆ మహమ్మారిని తరిమి కొట్టాల్సిన ప్రభుత్వాలు ఆదాయమే ప్రధానంగా వ్యవహరిస్తుండడం సిగ్గుచేటన్నారు. ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎ.విమల మాట్లాడుతూ సారా కాంట్రాక్టర్లు, మద్యం సిండికేట్స్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి చెందిన వారే అవుతున్నారని ఆరోపించారు. ఈ నెల 29న జరగనున్న మద్యం టెండర్లను అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐద్వా నగర అధ్యక్ష కార్యదర్శులు బి.పద్మ, ఆర్ఎన్ మాధవి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.ద్రాక్షాయణి, కె.నాగమణి, పీఓడబ్ల్యూ నాయకురాలు ఇందిర, వెంకటలక్ష్మీ, ఏపీ మహిళా సమాఖ్య నాయకురాలు బేగం, ఐద్వా నాయకులు ఎ.వి.పద్మావతి, ఎం.సుజాత, కె.వి.సూర్యప్రభ, బి.సూర్యమణి, పుష్ప, ఆర్.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
తాగినోడికి తాగినంత!
- ఇక ఎక్కడపడితే అక్కడ మద్యం లభ్యం - జిల్లాలో రూ.3 వేల కోట్ల ఆదాయమే లక్ష్యం - లైసైన్సుల నుంచి సమకూరనున్న రూ.200 కోట్లు - బాగా వ్యాపారం జరిగే దుకాణాల స్థానంలో ఔట్లెట్లు చిత్తూరు (అర్బన్) : ఎప్పుడు పడితే అప్పుడు కావాల్సిన చోట మద్యం అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో మద్యం అమ్మకాల ద్వారా రెండేళ్లకు ఏకంగా రూ.3 వేల కోట్ల ఆదాయం సేకరించడమే లక్ష్యంగా 2015-17 మద్యం పాలసీ గెజిట్‌ను విడుదల చేసింది. గత ఏడాది జిల్లాలో మద్యం దుకాణాల లెసైన్సు ఫీజులు, పర్మిట్ రూమ్‌లు, దరఖాస్తు రుసుముల ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.150 కోట్లు సమకూరింది. మద్యం అమ్మకాల ద్వారా రూ.వెయ్యి కోట్ల వరకు ఆదాయం లభించింది. అయితే గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ ఆదాయం ఆర్జించడానికి కొత్త ఎత్తుగడ వేసింది. గత ఏడాది జిల్లాలో ఎక్కడయితే ఎక్కువ మొత్తంలో మద్యం అమ్మకాలు జరిగాయో ఆ ప్రాంతాల్లో ఈసారి ప్రభుత్వ మద్యం దుకాణాల ఔట్ లెట్లు వెలుస్తాయి. జిల్లాలోని ఎక్సైజ్ పోలీసు స్టేషన్లను ఆధారంగా చేసుకుని ప్రతి సర్కిల్లో గత ఏడాది ఎక్కడయితే అత్యధికంగా మద్యం అమ్మకాలు జరిగాయో ఆ ప్రాంతంలో పది శాతం ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేయడానికి గెజిట్‌లో ఆదేశాలు జారీ చేసింది. ఈ లెక్కన చిత్తూరు రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో 28 మద్యం దుకాణాలుంటే గత ఏడాది ఎక్కువ మొత్తంలో వ్యాపారం జరిగిన ఐరాల పాటూరు సంతగేటు, రంగంపేట క్రాస్, యాదమరి కన్నికాపురం ప్రాంతాల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తారు. దీంతో పాటు జిల్లాలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలకు చెందిన షాపింగ్ మాల్స్, మండలానికి యాభై వరకు ఉన్న అనధికార బెల్టు షాపులు, ప్రైవేటు మద్యం దుకాణాల్లో నిత్యం మద్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక గత ఏడాది ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలను తెరవడానికి సమయం కేటాయించారు. అయినప్పటికీ ఉదయం 8 నుంచే దుకాణాల్లో మద్యం దొరికేలా వెసులుబాటు ఉండేది. ఈసారి అధికారిక మద్యం విక్రయాల సమయాన్ని కూడా మార్చేశారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయించుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలిచ్చేసింది. సమకూరే ఆదాయమిదీ అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో ఈ సారి రూ.30 లక్షలు లెసైన్సు ఫీజు నిర్ణయించిన 151 దుకాణాల నుంచి రూ.45.3 కోట్లు, రూ.34 లక్షలు జరిగే 11 దుకాణాల నుంచి రూ.3.74 కోట్లు, రూ.37లక్షలు జరిగే 46 దుకాణాల నుంచి రూ.17.02 కోట్లు, రూ.45 లక్షలు జరిగే 112 దుకాణాల నుంచి రూ.50.4 లక్షలు, రూ.50 లక్షలు జరిగే 68 దుకాణాల నుంచి రూ.34 కోట్లు, రూ.40 లక్షలు జరిగే 21 దుకాణాల నుంచి రూ.8.4 కోట్లు లెసైన్సుల రుసుముల రూపంలో ఆదాయం సమకూరనుంది. ఇది కాకుండా ఒక్కో దుకాణానానికి 4 దరఖాస్తులు వచ్చి పడ్డా దరఖాస్తుకు సగటున రూ.40 వేలు రుసుము లెక్కన రూ.6.56 కోట్లు, 410 మద్యం దుకాణాలకు పర్మిట్ గదుల రుసుము రూపంలో (ఒక్కో పర్మిట్ రూమ్‌కు రూ.2లక్షలు) రూ.8.2 కోట్లు వసూలు కానుంది. వీటితో పాటు మద్యం విక్రయాలు కలిపి రెండేళ్లకు జిల్లాలో సుమారు రూ.3 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి లభించనుంది. -
ఇక ‘సహకార’ మద్యం
-
ఇక ‘సహకార’ మద్యం
రాష్ట్ర సర్కారు నిర్ణయం.. ♦ వాటికి లెసైన్సు ఫీజు ఉండదు.. ♦ మద్యం విక్రయాల్లో ఇంత శాతం ఫీజు ప్రభుత్వానికి చెల్లించాలనే నిబంధన విధింపు! ♦ పదివేల చదరపు అడుగులున్న షాపింగ్‌మాల్స్‌లోనే మద్యం విక్రయాలకు అనుమతి.. జీవోలో స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: సహకార సంఘాల్లోనూ మద్యం విక్రయాలకు అనుమతిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే.. గ్రామాలు, మండల, పట్టణాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతోపాటు మార్కెటింగ్ సహకార సంఘాల్లోనూ మద్యాన్ని విక్రయించేందుకు వీలు కల్పించింది. ప్రభుత్వం అధీనంలో నిర్వహించాలనుకున్న పదిశాతం మద్యం దుకాణాలను సహకార సంఘాల్లోను, ప్రభుత్వ కా ర్పొరేషన్లలోను ఏర్పాటు చేయడానికి కమిషనర్ అనుమతించేందుకు నూతన మద్యం విధానంలో అవకాశం కల్పించారు. ప్రభుత్వ కార్పొరేషన్లు, సహకార సంఘాల్లో అనుమతించే మద్యం దుకాణాలకు లెసైన్సు ఫీజు ఉండదు. మద్యం విక్రయాల్లో ఇంత శాతం ఫీజు ప్రభుత్వానికి చెల్లించాలనే నిబంధన విధిస్తారు. ♦ షాపింగ్‌మాల్స్‌లో మద్యం విక్రయాలకు అనుమతించిన ప్రభుత్వం దీనిపై షరతులు విధించింది. పదివేల చదరపు అడుగుల నిర్మాణ ప్రాంతమున్న షాపింగ్‌మాల్స్‌లోనే మద్యం విక్రయాలకు అనుమతించనున్నట్లు జీవో 218లో స్పష్టం చేశారు. ఇటువంటి షాపింగ్‌మాల్స్‌లో ఆ ప్రాంతం ఆధారంగా మద్యం దుకాణాలకున్న లెసైన్సు ఫీజును వసూలు చేస్తారు. ♦ ఒక్కో మద్యం దుకాణానికి లాటరీద్వారా మూడు దరఖాస్తులను తీస్తారు. దరఖాస్తుదారు లేకున్నప్పటికీ జిల్లా కలెక్టర్ సమక్షంలో డ్రా తీయనున్నట్టు జీవోలో స్పష్టం చేశారు. లాటరీలో తొలుత వచ్చిన దరఖాస్తుదారునికి మద్యం దుకాణం కేటాయిస్తారు. అదేసమయంలో మరో రెండు దరఖాస్తులను కూడా లాటరీద్వారా తీస్తారు. తొలుత వచ్చిన దరఖాస్తుదారు దుకాణం ఏర్పాటునకు ముందుకు రానిపక్షంలో రెండో దరఖాస్తుదారునికి అవకాశమిస్తారు. రెండో దరఖాస్తుదారూ రానిపక్షంలో మూడో దరఖాస్తుదారునికి దుకాణం కేటాయిస్తారు. ♦ లాటరీద్వారా తీసిన దరఖాస్తుదారుల కాలపరిమితి 90 రోజులుగా నిర్ధారించారు. అది దాటితే ఆ దరఖాస్తులకు విలువుండదు. ♦ షాపింగ్‌మాల్స్, కోఆపరేటివ్ సొసైటీలు, ప్రభుత్వ కార్పొరేషన్లకు ఒకటికన్నా ఎక్కువ లెసైన్సులు మంజూరు అధికారం ఎక్సైజ్ కమిషనర్‌కు ఉంటుంది. గతంలో మద్యం దుకాణాల్లో విక్రయాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగేవి. ఇప్పుడు మద్యం దుకాణాల్లో విక్రయాల సమయాన్ని గంట పెంచారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతించారు. కొత్త విధానానికి మంచి స్పందన.. ఇదిలా ఉండగా నూతన మద్యం విధానానికి జిల్లాల్లో మంచి స్పందన ఉందని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. కొంతమంది ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను రెండేళ్లకు బదులు ఏడాదికే పరిమితం చేయాలని కోరుతున్నారని తెలిపారు. ఎందుకంటే గతంలో ఆదాయపుపన్ను రిటర్న్స్ దాఖలు చేయనివారు ఇప్పుడు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసి మద్యం దుకాణాలకోసం తీసుకుంటున్నారని, అందుకే ఏడాదికే పరిమితం చేయాలని కోరుతున్నారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
డేంజర్ జర్నీ!
రోడ్డెక్కితే చాలు.. అడుగడుగునా ప్రమాద భయం..! కండిషన్ లేని వాహనాలు.. వాటిని నడిపే డ్రైవర్లకు మద్యం మత్తు లేదంటే నిద్రమత్తు.. వాహనంలో అపరిమిత లోడు.. కారణాలేవైనా అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీపై శనివారం జరిగిన దుర్ఘటనలో 23 ప్రాణాలు హరీమన్నాయి. మన జిల్లాలోనూ ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని జరిగినా రవాణాశాఖ పట్టీపట్టనట్లు వ్యవహరించడం గమనార్హం. సాక్షి, గుంటూరు : వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే రాజ్యలక్ష్మి, శివమ్మ అనే తల్లీ కూతుళ్లు ఈ నెల 11వ తేదీ రాత్రి మంగళగిరి సమీపంలోని హ్యాపీక్లబ్‌లో జరిగే వివాహానికి హాజరై ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపైకి వచ్చారు. కళ్లు మూసి తెరిచేలోగా ఓ గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టి వెళ్లింది. దీంతో ఆ కుటుంబం వీధుల పాలైంది. ► జిల్లాకు చెందిన ఇద్దరు సీఏ విద్యార్థులు విజయవాడలోని ఓ కళాశాలలో చదువుతున్నారు. స్నేహితుని ద్విచక్ర వాహనం తీసుకుని గుంటూరుకు వచ్చారు. కొరిటెపాడు సెంటర్లో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇరువురూ మృత్యు ఒడిలోకి చేరారు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చారు. ఇలా నిత్యం జిల్లాలో ఎవరో ఒకరు, ఎక్కడో ఓ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నారు. ► కొందరు చేజేతులా ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటుంటే.. మరికొందరు ఇతరుల నిర్లక్ష్యంవల్ల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. వీటన్నింటికీ ప్రత్యక్షంగా, పరోక్షంగానూ మద్యం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఆ తర్వాత రహదారుల దుస్థితి, అధికారులు ప్రమాదాల నివారణకు సరైన చర్యలు తీసుకోకపోవటమే కారణంగా కనిపిస్తోంది. ఏటా ప్రమాదానికి గురై మృత్యువాత పడే వారి సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. హైవేల్లో ఎనీటైమ్ మద్యం.. లారీలు, ఆటోల ప్రమాదాలకు మద్యపానమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పట్టణాల్లో అర్ధరాత్రి వేళల్లోసైతం మద్యం విక్రయాలు యదేచ్ఛగా జరుగుతుండగా హైవేల్లో మాత్రం 24 గంటలూ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో ఎన్‌హెచ్-5 కృష్ణానది నుంచి చిలకలూరిపేట వరకు ఉంది. మొత్తం హైవే 70 కిలో మీటర్లకు పైగా విస్తరించి ఉంది. ఈ దారిలో ప్రతి ఐదు, పది కిలోమీటర్ల మార్గంమధ్యలో దాబాల్లో, మద్యం దుకాణాలలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. ఆటోలు, లారీడ్రైవర్లు రోడ్డు పక్కనే వాహనాలు నిలుపుకొని మద్యం తాగడం నిత్యకృత్యంగా మారుతోంది. ఈ తంతు తెలిసినా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గుంటూరు నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రాస్తున్న అధికారులు హైవేలపై లారీ డ్రైవర్లను ఆపి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించకపోవటం వల్ల కూడా డ్రైవర్లు ఇష్టారాజ్యంగా మద్యం సేవిస్తూ వాహనాలు నడుపుతున్నారు. గుంటూరు-చిలకలూరిపేట జాతీయ రహదారిలోనే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మొక్కుబడిగా భద్రతా కమిటీ.. రహదారుల్లో జరిగే ప్రమాదాలను నివారించేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రహదారి భధ్రతా కమిటీలను ఏర్పాటు చేశారు. కమిటీలో జిల్లా ఎస్పీ, ఎన్‌హెచ్-5 అధికారులు, జీజీహెచ్ సూపరింటెండెంట్, రవాణాశాఖా అధికారులు, ఆర్టీసీ అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తారు. రహదారుల ప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసిన ఈ కమిటీ సభ్యులు మొక్కుబడి సమీక్షలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
మద్యం ప్రియుడిపై వైన్స్ సిబ్బంది దాడి
గిర్నిబావి(దుగ్గొండి) : మద్యం బాటిళ్లను ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించినందుకు మద్యం షాపు సిబ్బంది కొనుగోలుదారుడిపై దాడి చేసిన సంఘటన మండలంలోని గిర్నిబావిలో శుక్రవారం జరిగింది. రాయపర్తి మండలం బుర్హాన్‌పల్లి గ్రామానికి చెందిన ఇంతల వీరన్న తన బంధువులతో కలిసి గీసుకొండ మండలం కొమ్మాల గ్రామానికి పెళ్లి వేడుకలకు వచ్చాడు. అక్కడి నుంచి మద్యం తాగడానికి కొందరు బంధువులతో కలిసి గిర్నిబావిలోని వినాయక వైన్స్‌కు వచ్చాడు. ఓ బీరు తీసుకున్నాడు. అయితే బీరుకు రూ.115 ఇవ్వాలని సిబ్బంది చెప్పారు. అయితే మా దగ్గర రూ.100 కే ఇస్తున్నారు. మీరు ఎందుకు ఎక్కువ తీసుకుంటారని ప్రశ్నించాడు. దీంతో గొడవ పెద్దదిగా మారి వీరన్నపై షాపు సిబ్బంది వంశీ, పాలడుగు రాజు, పెరుమాండ్ల ప్రవీణ్ దాడి చేసి కొట్టారు. దీంతో వీరన్నకు కన్ను కింది భాగంలో, పెదవులపై, దంతాలకు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వీరన్నను నర్సంపేటకు తరలించారు. దాడికి పాల్పడ్డ ముగ్గురు షాపు సిబ్బంది పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధితుడి పిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు
విజయనగరం జిల్లా: విజయనగరం జిల్లా గుర్లా మండలంలోని దేవునిపాక గ్రామంలో ఎక్సైజ్ అధికారులు గురువారం విస్తృత స్థాయిలో దాడులు జరిపారు. ఈ దాడుల్లో సుమారు 1300 లీటర్ల నాటు సారాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా 2500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. కాగా, ఎక్సైజ్ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి ఈ దాడులు జరిపారు. అయితే, ఈ దాడుల విషయం ముందే తెలియడంతో నిందితులందరూ పరారయ్యారని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. (గుర్లా) -
జాతీయ రహదారులపై మద్యం షాపులు వద్దు
హెల్మెట్‌ధారణ తప్పనిసరి 15 రోజుల్లో కాలువ గట్లపై ఆక్రమణలు తొలగించండి 108 వాహనం వచ్చే సమయాన్ని తగ్గించాలి రోడ్డు భద్రతా సమావేశంలో కలెక్టర్ కీలక నిర్ణయాలు విజయవాడ : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జిల్లాలోని జాతీయ రహదారులపై ఉన్న మద్యం షాపులను కొనసాగించరాదని ఎక్సైజ్ అధికారులను కోరుతూ జిల్లాస్థాయి రహదారి భద్రతా సమావేశం తీర్మానించింది. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లాస్థాయి రహదారి భద్రతా సమావేశం జరిగింది. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తున్నాయని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలోని ముఖ్య అధికారుల బృందం ఎట్టి పరిస్థితిలోనూ జాతీయ రహదారులపై మద్యం దుకాణాలు మూసి వేయించాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. కీలక నిర్ణయాలివే.. కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ టోల్గేట్ల వద్ద బ్రీత్ ఎనలైజర్ల ద్వారా డ్రైవర్లకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదం సంభవించిన సందర్భంలో 108 వాహనం ప్రమాద స్థలాన్ని చేరుకునే సమయాన్ని మరింత తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని, తద్వారా మరణాలను తగ్గించవచ్చని కలెక్టర్ సూచించారు. జిల్లావ్యాప్తంగా ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ ధారణ తప్పనిసరని ఆదేశించారు. నీటిపారుదల శాఖ కాలువలు, కరకట్టలపై ఆక్రమణలు తొలగింపు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోరారు. సంబంధిత వ్యక్తులకు ముందుగా నోటీసులు జారీచేసి 15 రోజుల వ్యవధిలో వాటిని తొలగించాలన్నారు. నగర పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతకు సంబంధించి 18 అంశాలతో కూడిన నివేదిక ప్రభుత్వానికి పంపించామన్నారు. వాహనాదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడంతో పాటు అతిక్రమించిన వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేస్తున్నట్లు సీపీ చెప్పారు. జాతీయ రహదారుల సంస్థ నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మునిసిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ తెలిపారు. నగరంలో 62 ముఖ్య కూడళ్లను గుర్తించి వాటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉప రవాణా కమిషనర్ ఎస్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆటో, స్కూలు బస్సులు నడిపే డ్రైవర్లకు ఈ నెల, వచ్చే నెలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో డీసీపీ అశోక్‌కుమార్, అడిషనల్ ఎస్పీ సాగర్, ఆర్ అండ్ బీ ఎస్ఈ శేషుకుమార్, ఇరిగేషన్ ఎస్ఈ రామకృష్ణ, రవాణా అధికారులు పాల్గొన్నారు. -
ఇక సర్కారీ ‘కిక్’
మద్యం వ్యాపారంలోకి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆదాయం లక్ష్యంగా ప్రభుత్వ నిర్ణయం వచ్చే జూలై నుంచి కొత్త ఎకై్సజ్ విధానం: యనమల తమిళనాడు తరహాలో విక్రయాలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా మద్యం వ్యాపారంలోకి దిగనుంది. తమిళనాడు తరహాలో మద్యం విక్రయాలు చేపట్టనుంది. ఇందుకోసం కమీషన్ విధానాన్ని అవలంభించనుంది. రేషన్ షాపుల తరహాలో ఒక్కో మద్యం దుకాణంలో ఇద్దరేసి డీలర్లను ఔట్ సోర్సింగ్ విధానంలో నియమిస్తారు. ఆ డీలర్లు మద్యం విక్రయిస్తారు. ఇందుకోసం వారికి కమీషన్ చెల్లిస్తారు. అంటే ఎంత ఎక్కువ మద్యం విక్రయిస్తే అంత ఎక్కువ కమీషన్ డీలర్లకు వస్తుంది. బీమా ఏజెంట్లకు ఎలాగైతే ఎంత ఎక్కువ మందితో ఇన్సూరెన్స్ చేయిస్తే అంత ఎక్కువ కమీషన్ వస్తుందో.. ఆ తరహాలోనే వీరికి కూడా విక్రయించిన మద్యం మేరకు కమీషన్ లభిస్తుందన్నమాట. తమిళనాడులో మద్యం దుకాణానికి అనుబంధంగా బార్లు కూడా ఏర్పాటుచేస్తారు. రాష్ట్రంలో కూడా అదే విధానం అమల్లోకి రానుంది. ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి తమిళనాడు తరహా నూతన ఎకై్సజ్ విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం తనను కలిసిన విలేకరులతో చెప్పారు.పస్తుత ఆర్థిక సంవత్సరంలో మద్యం ద్వారా రూ.3,738 కోట్ల ఆదాయం ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా జనవరి నాటికి రూ.2,998 కోట్ల ఆదాయం వచ్చింది. వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ఇలా ఉండగా వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రాథమిక మిషన్‌లోని రంగాలపై సమీక్షలు పూర్తి అయినట్లు యనమల చెప్పారు. ‘వ్యవసాయ ఉత్పత్తి పెరగడంతో పాటు వ్యవసాయ పెట్టుబడి వీలైనంత తక్కువగా ఉండేలాగ చర్యలు చేపట్టనున్నాం. వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం. సాగునీటి రంగంపై బడ్జెట్ సమీక్ష పూర్తి అయ్యింది. ప్రస్తుతం నీటి తీరువాను రెవెన్యూ శాఖ వసూలు చేస్తోంది. ఇకపై సాగునీటి వినియోగ సంఘాల ద్వారా వసూలు చేయించాలని నిర్ణయించాం. సాగునీటి శాఖలో లష్కర్ల కొరత ఉండటంతో ఔట్ సోర్సింగ్ విధానంలో వారిని నియమించేందుకు ఆమోదం తెలిపాం. అదనపు ఆదాయ వనరుల సమీకరణకు ప్రస్తుతానికి గనులు, అటవీ రంగాలపై దృష్టి సారించాం. గతంలో మంజూరు చేసి.. నిలిపివేసిన సీఎం ప్రత్యేక నిధి పనుల్లో రూ.180 కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం.14వ ఆర్థిక సంఘం సిఫారసుల ద్వారా రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు వస్తాయని ఆశిస్తున్నాం..’ అని మంత్రి చెప్పారు. అధికారికంగా బెల్ట్‌షాపులు చంద్రబాబునాయుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో బెల్ట్‌షాపుల విధానానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 10వేల బెల్ట్ షాపులు నడిచాయి.అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులను ఎత్తేస్తామని చెప్పిన బాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నెపంతో అధికారికంగా మద్యం షాపులను తెరవడానికి రంగం సిద్ధం చేశారు. ప్రభుత్వమే అధికారికం గా బెల్ట్ షాపులను నిర్వహించడమేనని అధికారుల మాట. -
నిబంధనలు గాలికి!
సిద్దిపేట రూరల్ : జిల్లాలోనే అన్ని రంగాల్లో సిద్దిపేట ముం దుకెళుతోంది. గత కొన్నేళ్లుగా రాజీవ్ రహదారిపై పట్టణ శివారులో ఉన్న దాబా హోటళ్లు మద్యం సిట్టింగ్ కేంద్రాలుగా ఉండేవి. జిల్లా ఎస్పీ సుమతి రాకతో సిద్దిపేట డివిజన్ వ్యాప్తం గా దాబాలు గత వారం రోజులుగా వెలవెలబోతున్నాయి. దాబాల్లో మద్యం సిట్టింగ్ లేకపోవడంతో మద్యం బాబులు పర్మిట్ రూంలను ఆశ్రయిస్తున్నారు. దీంతో పర్మిట్ రూంల నిర్వాహకులు ఇష్ఠారీతిలో డబ్బులను దండుకుంటున్నారు. సిద్దిపేట కేంద్రంగా కరీంనగర్, హైదరాబాద్‌ల వైపు వెళ్లే అన్ని రకాల వాహనాలు ఇక్కడ నిలుపుతుంటారు. దాబా హోటళ్లలో భోజనంతో పాటు రహస్యంగా మద్యం అంది స్తున్నారు. ఇటీవల సుమతి ఎస్పీగా బాధ్యతలు తీసుకోవడంతో ముందు జాగ్రత్తగా స్థానిక పోలీసులు దాబాల్లో మద్యం సిట్టింగ్‌లను నిలిపివేయించారు. దీంతో మద్యం బాబులంతా వైన్స్‌ల పక్కనే ఉండే పర్మిట్ రూంలలోకి వెళ్తున్నారు. పర్మిట్ రూంను నిబంధనల మేరకు నడిపించాల్సి ఉన్నప్పటికి మద్యం బాబులు ఎక్కువగా రావడంతో నిర్వాహకులకు కిక్కు ఉండడంతో నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. ఇష్టారీతిగా పర్మిట్ రూంను పెంచేసుకుంటూ మందుబాబులకు కావాల్సిన తిండిని సమకూరుస్తూ వారి నుంచి అధిక మొత్తంలో డబ్బులు గుంజుతున్నారన్న ఆరోపణలున్నాయి. నిబంధనలు పాటించని పర్మిట్ రూంల్లో అధికారులు ఎలాంటి తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. దాబాలను కట్టడి చేసిన మాదిరిగానే పర్మిట్ రూంల్లో నిబంధనలు పాటించే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉంది. ఇప్పటికైనా ఎస్పీ స్పందించి పర్మిట్ రూంలను నిబంధనల మేరకు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
మద్యం అమ్మకాలకు సంక్రాంతి కిక్కు
శ్రీకాకుళం క్రైం : పండుగ అంటే ఖుషీ చేయడమే. అందులోని సంక్రాంతి పండుగ మూడో రోజు కనుమ, ఆ తర్వాత వచ్చే ముక్కనుమ గురించి వేరే చెప్పనవసరం లేదు. ఆ రెండు రోజూలూ మందుబాబులదే అసలైన పండుగ. ఇంకేముంది ఎక్సైజ్ శాఖకు, మద్యం వ్యాపారులకు కాసుల కిక్కు ఎక్కింది. గత ఏడాది కంటే రూ.1.38 కోట్ల వరకు మద్యం అమ్మకాలు పెరిగాయి. పండుగ మూడు నాలుగు రోజులే కాకుండా ఈ నెల మొదటి వారం నుంచి 17వ తేదీ వరకు మద్యం దుకాణాలు, బార్లు కళకళలాడాయి. జిల్లాలో 230 మద్యం దుకాణాలు, 15 బార్లు ఉన్నాయి. ఒకప్పుడు ఎక్సైజ్ అధికారులు పండగకు అంత స్టాక్ పెట్టాలి.. ఇంత స్టాక్ పెట్టాలంటూ పరిమితులు, టార్గెట్లు పెట్టేవారు. ఈ ఏడాది అటువంటి ఒత్తిళ్లేవీ లేకపోవడంతో మద్యం వ్యాపారులు పండగను దృష్టిలో పెట్టుకుని ముందుగానే మద్యాన్ని దండిగా నిల్వ చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు బాగా పెరిగాయని ఎక్సైజ్ అధికారులే చెబుతున్నారు. రూ.31.31 కోట్ల అమ్మకాలు ఈ ఏడాది పండగ రోజుల్లో జరిగిన అమ్మకాలు ఎక్సైజ్ అధికారులనే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు చాలా పెరిగాయి. ఈ నెల 1 నుంచి 17వ తేదీ వరకు జరిగిన అమ్మకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. గత ఏడాది జనవరి నెల మొదటి 17 రోజుల్లో 75,404 కేసుల లిక్కర్, 43,242 కేసుల బీరు అమ్మకాలు జరిగాయి. మొత్తం రూ.29.93 కోట్ల వ్యాపారం జరిగింది. ఈ ఏడాది అదే 17 రోజుల్లో 76,388 కేసుల లిక్కర్, 45,645 కేసుల బీరు అమ్మకాలతో మొత్తం రూ.31.31 కోట్ల వ్యాపారం జరిగింది. 984 కేసుల లిక్కర్, 2403 కేసుల బీర్లు.. వెరసి రూ.1.38 కోట్ల అమ్మకాలు పెరిగాయి. ఎక్సైజ్ అధికారులు మాత్రం తాము ఎటువంటి టార్గెట్లు ఇవ్వకపోయినప్పటికీ మద్యం అమ్మకాలు ఈ స్థాయిలో జరగటం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
రూ.54 కోట్లు
మంచిర్యాల రూరల్ : మూడు నెలల విరామం తరువాత డిసెంబర్ నెలలో వరుస పెళ్లిళ్లు జరగడం, దానికి 31 సంబురాలు తోడవడంతో జిల్లాలో మద్యం అమ్మకాలు విపరీతంగా జరిగాయి. ఒక్క డిసెంబర్ నెలలోనే రూ.54 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ జరుపుకునే 31న రూ.15 కోట్లకు పైగా వ్యాపారం అయ్యింది. జిల్లాలో రెండు మద్యం డిపోలు ఉన్నాయి. మంచిర్యాల, ఉట్నూర్‌లో ఉండగా.. 157 మద్యం దుకాణాలు, రెండు ప్రభుత్వ మద్యం ఔట్లెట్లు, 22 బార్లు ఉన్నాయి. ఈ మద్యం డిపో పరిధిలో కేవలం డిసెంబర్ నెలలోనే 2.22 లక్షల పెట్టెల మద్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేశారు. దీంతో ఎక్సైజ్ శాఖకు రూ. 54 కోట్ల ఆదాయం వచ్చింది. 2013 డిసెంబర్లో రూ.48 కోట్ల మద్యం అమ్ముడు పోగా.. ఈసారి ఆరు కోట్ల మద్యం అదనంగా సరఫరా అయ్యింది. ఏటా పెరుగుతున్న విక్రయాలు.. జిల్లాలో మద్యం విక్రయాలు ఏటా పెరుగుతున్నాయి. మంచిర్యాల మద్యం డిపో పరిధిలో 64 మద్యం దుకాణాలు, రెండు ప్రభుత్వ ఔట్లెట్లు, ఆరు బార్లు ఉన్నాయి. ఇక్కడ డిసెంబర్ నెలలో 81,267 మద్యం పెట్టెలు అమ్ముడు పోగా, రూ.19.53 కోట్ల ఆదాయం వచ్చింది. ఉట్నూరు మద్యం డిపో పరిధిలో 93 మద్యం దుకాణాలు, 16 బార్లు ఉండగా, 1,40,739 మద్యం పెట్టెలు అమ్మగా, రూ.33.56 కోట్ల ఆదాయం చేకూరింది. మద్యం అమ్మకాలు జిల్లాలో 2013 డిసెంబరులో 2,02,500 మద్యం పెట్టెలు పోగా, 2014 డిసెంబరు నెలలో 2,22,006 పెట్టెలు అమ్ముడయ్యాయి. ఏడాదిలో 19,506 పెట్టెల అమ్మకాలు పెరిగాయి. దీంతో ఏడాదిలో రూ.6 కోట్ల ఆదాయం పెరిగింది. 2013లో మద్యం దుకాణాలు 174 ఉంటే, ఈ ఏడాది 159 దుకాణాలే నడుస్తున్నాయి. దుకాణాల సంఖ్య తగ్గినా మద్యం అమ్మకాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. గ్రామాల్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్టుషాపుల్లోనే మద్యం విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. జిల్లాలో బెల్టుషాపుల నిర్వహణతోనే మద్యం అమ్మకాలు జోరుగా సాగుతుండగా, వాటిని నియంత్రించే ఎక్సైజ్ శాఖ కేవలం ఆదాయంపైనే దృష్టి పెట్టడం కొసమెరుపు. -
ఎక్సైజ్.. ఫుల్ కిక్
రికార్డు స్థాయిలో రూ. వెయ్యి కోట్లు దాటిన డిసెంబర్ రాబడి.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టిస్తున్నాయి.. 2013-14తో పోలిస్తే 16 శాతం వరకు విక్రయాలు ఎక్కువగా నమోదవుతున్నాయి.. 2014-15లోనే అత్యధికంగా డిసెంబర్లో రూ. 1,005.67 కోట్ల మేర మద్యం అమ్మకాలు సాగాయి. నవంబర్ నెలతో పోలిస్తే ఇది రూ. 150 కోట్లు ఎక్కువ. అంతేకాదు గత ఏడాది డిసెంబర్‌తో పోల్చినా... రూ. 130 కోట్లు ఎక్కువ కావడం గమనార్హం. అయితే ఇదంతా నూతన సంవత్సర వేడుకల్లో వినియోగం పెరిగినందువల్లేనని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. 2014 సంవత్సరాంతానికి వారం ముందు నుంచే మద్యం వ్యాపారులు వందల కోట్ల రూపాయల మద్యం స్టాక్‌ను గోదాముల్లో నిల్వ చేసుకున్నారు. డిసెంబర్ 24వ తేదీ నుంచే మద్యం డిపోల నుంచి స్టాక్ కొనుగోళ్లు పెరగగా.. 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మూడు రోజుల్లోనే రూ. 225 కోట్ల మేర మద్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేశారు. తద్వారా గత సంవత్సరంతో పోలిస్తే ఈ నెలలో 16 శాతం అమ్మకాలు పెరిగాయి. రోజువారీ విక్రయాలు రూ. 30 కోట్ల లోపే.. రాష్ట్రంలోని 17 టీఎస్ బీసీఎల్ గోడౌన్ల ద్వారా ప్రతిరోజు సగటున వ్యాపారులు కొనుగోలు చేసే మద్యం రూ. 30 కోట్ల లోపే. నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని 24వ తేదీ నుంచే గోడౌన్ల నుంచి భారీగా స్టాక్‌ను కొన్నా రు. 24న రూ. 52.26 కోట్ల విలువైన మద్యాన్ని కొనుగోలు చేయగా, 26న రూ. 49.95 కోట్లు, 27న రూ. 54 కోట్ల మద్యాన్ని కొన్నారు. ఇక 29, 30, 31వ తేదీల్లో వరుసగా రూ. 79 కోట్లు, రూ. 78.26 కోట్లు, 70.53 కోట్ల విలువైన మద్యాన్ని దుకాణాలు, బార్లు, క్లబ్బులకు తరలించారు. అంటే ఈ వారం రోజుల్లో రూ. 180 కోట్లకుపైగా మద్యాన్ని అదనంగా కొన్నారు. అమ్మకాలు పెరిగాయి: డిసెంబర్లో మద్యం అమ్మకాలు కొంత పెరిగాయని ఎక్సైజ్ శాఖ కమిషనర్ అహ్మద్ నదీం చెప్పారు. ఈ ఒకే నెలలో రూ. 1,005 కోట్లకు పైగా రికార్డు స్థాయిలో రాబడి వచ్చిందన్నారు. అలాగే నూతన సంవత్సర వేడుకల కోసం ‘పార్టీలు’ చేసుకునేందుకు 118 ఈవెంట్ పర్మిట్లు ఇచ్చినట్లు తెలిపారు. -
ఏపీలో మద్యం అమ్మకాల జోరు
వ్యాట్ కాకుండా రూ.7,581 కోట్ల విలువైన మద్యం వినియోగం అగ్రస్థానంలో విశాఖ.. శ్రీకాకుళంలో అత్యల్ప విక్రయాలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గత ఏడాదితో పోల్చిచూస్తే ఇప్పటివరకు మద్యం ఆదాయంలో పెరుగుదల 4.06 శాతం నమోదైంది. అమ్మకాలపై విధించే వ్యాట్ కాకుండానే ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నెల వరకు రూ.7,581 కోట్ల విలువైన మద్యం వినియోగం జరిగింది. రాష్ట్రం జూన్ నుంచి విడిపోయినప్పటికీ ఎక్సైజ్ శాఖ మాత్రం ఏప్రిల్ నుంచి జిల్లాల వారీగా మద్యం విక్రయాలు, వ్యాట్ ఆదాయాలను విభజించింది. దాని ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 188.07 లక్షల కేసుల మద్యం వినియోగం జరిగింది. అలాగే 122.58 లక్షల కేసుల బీరు వినియోగం జరిగింది. మద్యం వినియోగంలో విశాఖపట్నం జిల్లా అగ్రస్థానంలో ఉండగా శ్రీకాకుళం జిల్లా చివరిస్థానంలో ఉంది. విశాఖపట్నం జిల్లాల్లో ఇప్పటి వరకు రూ.800 కోట్ల విలువైన మద్యం వినియోగం జరగ్గా, శ్రీకాకుళం జిల్లాలో రూ.364 కోట్ల విలువైన మద్యం వినియోగించారు. ఒక్క నవంబర్ నెలలో చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో 25.45 లక్షల కేసుల మద్యం, 9,44 లక్షల కేసుల బీరు వినియోగం జరిగింది. వీటి విలువ రూ.947.47 కోట్లు. ఈ నెలలో మద్యం విక్రయాలపై ఎక్సైజ్ రెవెన్యూ ద్వారా రూ.188.41 కోట్లు రాగా, విక్రయాలపై వ్యాట్ ద్వారా రూ.555.68 కోట్ల ఆదాయం వచ్చింది. ఎక్సైజ్, వ్యాట్ ద్వారా మొత్తం రూ.744.09 కోట్ల ఆదాయం వచ్చిందన్నమాట. -
మద్యం కల్తీ.. జేబు లూటీ
మద్యం ప్రియులకు కిక్కు దిగిపోయే విషయమిది. సీలు మద్యం సీసాలో ‘స్పిరిట్’ చేరుతోంది. సర్కారు పుణ్యమా అంటూ బార్లు బార్లాగా తెరవడంతో మద్యం విక్రయాలు కూడా పెరిగాయి. ఎమ్మార్పీ ధరలకు మించి అమ్మకాలు జరుగుతున్నాయి. అధికార పక్ష నాయకుల ఆశీస్సులున్న దుకాణాల వైపు అధికారులు కనీసం కన్నెత్తి చూడడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు రాత్రివేళల్లో గుట్టుచప్పుడు కాకుండా మద్యంలో స్పిరిట్ కలిపి కల్తీ చేస్తున్నారు. దీంతో మందుబాబులు మరింత అనారోగ్యం పాలవుతున్నారు. * మందుబాబులకు టోకరా *మత్తు కోసం ‘స్పిరిట్’ వినియోగం * రోజుకు రూ.30 వేలు అక్రమార్జన * శివారు ప్రాంతాలే టార్గెట్ * అనారోగ్యం పాలవుతున్న మద్యం ప్రియులు కైకలూరు : సాయంత్రం 6 గంటలు.. కైకలూరు పట్టణ శివారులోని ఓ మద్యం దుకాణం.. రోజంతా కష్టపడిన కూలీలు మద్యం కోసం కౌంటర్ వద్ద గుమిగూడారు. ఇంతలో ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి రెండు క్వార్టర్ల మద్యం కొన్నారు. ఓ చేపల చెరువు గట్టుపై కూర్చుని తాగడం మొదలుపెట్టారు. అలా నోటి దగ్గర పెట్టారో లేదో వాంతులయ్యాయి. అసలు విషయం ఏమిటంటే అది కల్తీ మద్యం. వివిధ బ్రాండ్లకు చెందిన క్వార్టర్, హాఫ్ సీసాల్లో ఈ కల్తీ ఎక్కువగా జరుగుతోంది. సీసాల మూతలను చాకచక్యంగా తీసి అందులో కొంత మద్యాన్ని తీసి, అనుమానం రాకుండా నీరు, స్పిరిట్‌తో నింపేస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్యం ప్రియులు తాగే మందులో నాణ్యత ఎంత అనేది నేడు ప్రశ్నార్థకంగా మారింది. మందు బాబులు దుకాణదారులను గట్టిగా నిలదీద్దామంటే.. గొడవ జరిగితే పరువు పోతుందని మిన్నకుంటున్నారు. కొంతమంది కల్తీ మందు అంటగట్టారని అడిగితే అదేదో సీసా మూత తీయకముందే చెప్పాలంటూ దుకాణ సిబ్బంది వారిపై ఎదురుదాడికి దిగుతున్నారు. కల్తీ ఎలా జరుగుతోందంటే... మద్యం దుకాణం మూసేసిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా ఈ తంతును దుకాణంలో పనిచేసే సిబ్బందితో చేయిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ అమ్మకాలు జరిగే బ్రాండ్లపై వీరు దృష్టి సారిస్తున్నారు. మూడు అంగుళాల సైజులో స్క్రూ డ్రైవర్ (కనెక్టర్) అనే చిన్న పరికరంతోసీసా మూతను తీస్తున్నారు. ఒక్కో బాటిల్ నుంచి మద్యం తీసి, దాని స్థానంలో నీరు, ‘స్పిరిట్’ కలుపుతున్నారు. తిరిగి యథావిధిగా మూతను పెడుతున్నారు. అలా సేకరించిన మద్యాన్ని ఖాళీ ఫుల్బాటిల్స్లో పోసి దుకాణం వద్ద లూజు విక్రయాల్లో వినియోగిస్తున్నారు. ఎక్కువగా మెన్స్‌క్లబ్, ఎంసీ బ్రాందీ, ఎంసీ విస్కీ బ్రాండ్లలో కల్తీ చేస్తున్నారు. కల్తీ చేసిన మద్యం సీసాలను తాము గుర్తించడం కోసం దుకాణంలో ఒక అరలో పెడుతున్నారు. రోజూ వచ్చే వ్యక్తులకు కాకుండా కొత్తవారు, ప్రయాణంలో వెళుతూ ఆగి తీసుకునేవారికి కల్తీ చేసిన మందును అంటగడుతున్నారు. కల్తీలో ఉపయోగించే స్పిరిట్‌ను మందుల దుకాణాల్లో తీసుకుంటున్నారు. కేసుకు రూ.1,850 లాభం... కల్తీదారులు ఒక క్వార్టర్ బాటిల్ నుంచి 60 ఎంఎల్ మద్యం తీస్తున్నారు. సాధారణంగా క్వార్టర్‌కు 180 మిల్లీలీటర్ల మద్యం ఉంటుంది. దీనిని ఒక్కో పెగ్గుగా మూడు బాగాలుగా విభజిస్తారు. పెగ్గు 60 ఎంఎల్‌గా ఉంటుంది. ఉదాహరణకు ఒక రకం బ్రాందీ క్వార్టర్ సీసాకు రూ.115 వసూలు చేస్తున్నారు. దీనిని బట్టి కేసులోని 48 బాటిళ్లలో పెగ్గు మందు చొప్పున తీస్తే వారికి రూ.1,850 మిగులుతుంది. బ్రాండు రేటు పెరిగితే ఆదాయం మరింత పెరుగుతుంది. దీనికి తోడు ఈ విధంగా సేకరించిన మద్యాన్ని ఖాళీ ఫుల్ బాటిల్స్‌లో పోసినప్పుడు నీటిని కలుపుతున్నారు. అంటే లూజు విక్రయాల ద్వారా మరికొంత ఆదాయం వస్తుంది. ఇక బాటిల్లో కల్తీ చేసే ‘స్పిరిట్’ 500 ఎంఎల్ ధర సుమారు రూ.150 ఉంటుంది. దీనిని ప్రభుత్వాస్పత్రుల్లో శస్త్రచికిత్సల సమయంలో పైపూతగా వాడతారు. స్పిరిట్‌లో ఆల్కహాల్ ఇమిడి ఉంటుంది. ఒక కేసుకు రెండు స్పిరిట్ బాటిళ్లను వినియోగిస్తారు. దీనిని బయట మందుల దుకాణాల్లో విక్రయించడం లేదు. ఆస్పత్రుల నుంచి వీటిని సేకరిస్తున్నట్లు సమాచారం. స్పిరిట్ అందుబాటులో లేనప్పుడు చీప్ క్వార్టర్ బాటిళ్లలోని మందును నింపుతున్నారు. ప్రధాన బ్రాండ్ల విషయంలో స్పిరిట్ వాసన వచ్చే అవకాశం ఉన్నప్పుడు నీళ్లు కలిపి మూత బిగించేస్తున్నారు. అమలుకు నోచని ‘ఎమ్మార్పీ’ విక్రయాలు... ఎమ్మార్పీ ధరలకు మద్యం విక్రయాలు జరగాలని అధికారులు ఆదేశాలిస్తున్నా అనేక చోట్ల అమలు కావడం లేదు. క్వార్టర్‌కు రూ.5, హాఫ్‌కు రూ.10, ఫుల్ బాటిల్‌కి రూ.20 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. ఇదేమిటని సామాన్యులు అడిగితే అధికార సిండికేట్లు రంగంలోకి దిగితున్నారు. వాళ్ల అండ చూసుకుని దుకాణాల్లో పనిచేసే సిబ్బంది రెచ్చిపోతున్నారు. రాత్రిపూట నిర్ణీత సమయం దాటిన తరువాత కూడా విక్రయాలు సాగిస్తున్నారు. అదేమిటంటే ‘అధికారం మాది.. రాత్రి ఎన్ని గంటలైనా అమ్ముతాం ఏంటంటా?’ అని సమాధానం ఇస్తున్నారు. అధికార పక్ష అండదండలున్న దుకాణాల వైపు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కనీసం కన్నెత్తి చూడడం లేదు. కొద్ది నెలల క్రితం ఓ దుకాణంలో కల్తీ మద్యం కొనుగోలు చేసిన వ్యక్తి, ఇంటికి వెళ్లిన తర్వాత గుర్తించి దుకాణంలో సిబ్బందితో గొడవకు దిగాడు. దీంతో అతనికి మరో బాటిల్ అందించారు. ఇటీవల కైకలూరులో రాత్రివేళ మందు తాగిన యువకులను గొడ్డును బాదినట్లు బాదిన ఓ ఎస్సై ఆ సమయంలో తెరిచి ఉన్న మద్యం దుకాణం జోలికి వెళ్లకపోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న కల్తీ విక్రయాలపై కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తాం కల్తీ మద్యం అమ్మకాలపై ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే దుకాణదారులపై కేసులు నమోదు చేస్తామని కైకలూరు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సీఐ సి.భార్గవ చెప్పారు. అనుమానం కలిగిన మద్యం బాటిళ్లను ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేసిన తర్వాత కల్తీ కలిసిందని తెలిస్తే సదరు దుకాణదారులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు
హుద్‌హుద్ బీభత్సంలోనూ భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు ఆశ్చర్యపోతున్న అబ్కారీ శాఖాధికారులు రూ.6 కోట్ల అదనపు ఆదాయం విశాఖపట్నం సిటీ: ‘విశాఖ నగరమంతా హుద్‌హుద్ తుపాను ధాటికి తల్లడిల్లిపోయింది. అంతా కష్టంలో చిక్కుకున్నారు. ఎవరూ మద్యం జోలికి వచ్చే అవకాశం లేదు. ఈ నెల కాస్త అమ్మకాలు తగ్గొచ్చు’... ఇదీ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు గత నెలలో వేసుకున్న లెక్కలు. అదే నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. అమ్మకాలు తగ్గినా ఫర్వాలేదు... వచ్చే నెలలోనైనా సరిగ్గా చూసుకోండంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. కానీ అధికారులు ఊహించింది ఒకటైతే విశాఖలో జరిగింది మరొకటి. అనూహ్యంగా అమ్మకాలు జరిగిపోయాయి. ఇప్పుడు ఆ సంగతి గుర్తు చేసుకుని ఇంత మద్యం ఎలా అమ్మకాలు జరిగాయోనని సర్వేలు చేసుకుంటున్నారు. తుపానులో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత నష్టం జరిగింది. ఈ తరుణంలో మద్యం అమ్మకాలు తగ్గాల్సింది పోయి పెరగడమేంటంటూ అబ్కారీ శాఖ ఆశ్చర్యపోతోంది. అసలేం జరిగింది? జిల్లాలో దాదాపు 310 మద్యం దుకాణాలున్నాయి. వీ టన్నింటి ద్వారా నెలకు రూ.90 కోట్ల ఆదాయం వ స్తుందని అంచనా. హుద్‌హుద్ కారణంగా అంత మొ త్తంలో అమ్మకాలు జరిగే అవకాశం లేదని భావించారు. వారం రోజుల పాటు విశాఖ అంధకారంలో ఉండడం, చాలా మద్యం దుకాణాల రేకులు ఎగిరిపోవడం, గోడలు పడిపోవడం, మద్యం గొడౌన్లు కూలిపోవడం కారణంగా వ్యాపారానికి ఎంతో కొంత నష్టం వచ్చి ఉంటుందని అనుకున్నారు. రూ.90 కోట్లు కన్నా ఓ అయిదో పదో కోట్లు తక్కువ రావచ్చని అంచనా వేశారు. కానీ ఊహించని రీతిలో రూ.96 కోట్ల మేర అమ్మకాలు సాగండంతో ఎక్సైజ్ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. జిల్లాలోని మద్యం ప్రియులు దాదాపు 2.36 లక్షల కేసుల మద్యాన్ని గుటుక్కున మింగేశారు. రెండు లక్షల కేసుల మద్యం అమ్మడమే చాలా గొప్ప అనుకున్న తరుణంలో విశాఖ వాసుల మద్యం పట్టు ఏంటో తాజాగా తెలిసొచ్చింది. దీంతో ప్రతి నెలా ఇచ్చే లక్ష్యాన్ని ఈ సారి అబ్కారీ శాఖ విశాఖకు మరింత పెంచే అవకాశముంది. వ్యాపారం లేదనుకున్న సమయంలోనే ఊహించనంత ఆదాయం వచ్చినప్పుడు శీతాకాలంలో మరింత ఎక్కువగా వ్యాపారం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో నవంబర్ నెల నుంచి మరో 20 శాతం అదనపు వ్యాపార లక్ష్యాన్ని జిల్లాకు నిర్దేశించినట్టు సమాచారం. ఈ మొత్తం అమ్మకాలు పెంచుకునేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. రూ.6 కోట్ల మద్యం తాగిందెవరు? జిల్లాలో అధనంగా రూ.6 కోట్ల మద్యం ఎవరు తాగేశారని సర్వే చేస్తున్న అబ్కారీ శాఖకు పొరుగు రాష్ట్రాల నుంచి పనులు కోసం ఇక్కడికి వచ్చిన వారిపైనే అనుమానం కలుగుతోంది. హుద్‌హుద్ తుపాను తర్వాత వివిధ పనులు నిమిత్తం విశాఖ జిల్లాకు వచ్చిన కార్మికులే మద్యం భారీగా సేవించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. తుపాను తర్వాత వారం రోజుల వరకూ మంచి నీళ్లే దొరకని పరిస్థితిలో ఈ మద్యాన్నే కార్మికులు, రోజూ వారి కూలీలు ఎక్కువగా కొని ఉంటారని అంచనా వేస్తున్నారు. తమిళనాడు, తెలంగాణ , ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో బాటు రాయలసీమ నుంచి వచ్చిన కార్మికులు మస్తుగా మద్యం సేవించి ఉండొచ్చని భావిస్తున్నారు. వారు రోజు 10 నుంచి 12 గంటలు పైగా కష్టపడేవారని, అలాంటప్పుడు మద్యం సేవించకపోతే అన్ని గంటలు ఎలా పని చేస్తారని చెబుతున్నారు. -
మద్యం దుకాణాన్ని తొలగించాలి
కొంకుదురు(బిక్కవోలు) : బ్రాందీ షాపు తొలగించాలంటూ కొంకుదురు గ్రామంలో సోమవారం శెట్టిబలిజ పేట వాసులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే... 2014 సంవత్సరానికి గాను కొంకుదురు గ్రామానికి రెండు మద్యం షాపులకు టెండర్లు నిర్వహించారు. ఒక షాపును ప్రైవేట్ వ్యక్తులు పాడుకొని శెట్టిబలిజ పేటలో ఉన్న 4-1 డోర్ నంబర్ గల ఇంటిలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. దీనిని పట్టాభిరామ శెట్టి బలిజ సొసైటీ ఆధ్వర్యంలో శెట్టిబలిజలు అడ్డుకున్నారు. ఊరు బయట షాపు నిర్వహించుకోవాలని సూచించారు. ఇక రెండో షాపునకు పాటదారులెవరూ ముందుకు రాకపోవడంతో ఏపీబీసీఎల్ ద్వారా ప్రభుత్వమే మద్యం దుకాణాన్ని శెట్టిబలిజపేటలో ఉన్న 4-1 డోర్ నంబరు గల ఇంటిలో ఈ నెల ఒకటో తేదీన ఏర్పాటు చేసింది. దీంతో శెట్టిబలిజలు మరోసారి ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం సుమారు 500 మంది మద్యం షాపు ఏర్పాటుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మద్యం షాపు ముందు టెంట్ వేసి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న బిక్కవోలు ఎస్సై పి.దొరరాజు తన సిబ్బందితో వచ్చి ఆందోళనకారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మద్యం షాపును ఊరి మధ్య నుంచి తరలించాలని కోరారు. దీనికి ఎస్సై పి.దొరరాజు బదులిస్తూ ఈ సమస్యను తనపై అధికారులు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు దృష్టికి తీసుకు వెళతానని, అంత వరకు కానిస్టేబుల్‌ను దుకాణం వద్ద కాపలా పెడతానని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. -
ఊగుతున్న పల్లెలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మద్యం దుకాణాల యజమానులు ను తుంగలో తొక్కి రూటు మార్చి వ్యాపారం చేస్తున్నారు. మద్యం దుకాణాల ముందు ఎంఆర్పీ పట్టికలను ప్రదర్శిస్తూనే మాయాజాలం చేస్తున్నారు. డిపో ల నుంచి లెసైన్స్ దుకాణాలకు తరలించే మద్యంలో కొంత మద్యాన్ని నేరుగా బెల్టుషాపులకు తరలించి 20 శాతం అధిక ధరల కు విక్రయిస్తున్నారు. కొత్త మార్గదర్శకాలు అమలులోకి వచ్చినప్పటికీ జిల్లాలో ‘సిండికేట్’ దందాకు మాత్రం తెరపడటం లేదు. తాజా మాజీ సిండికేట్లు మద్యం అక్రమ వ్యా పారాన్ని చాపకింది నీరులా కొనసాగిస్తున్నారు. ఇందుకోసం అబ్కారీ, పోలీసు శాఖలకు చెందిన కొందరికి పెద్ద మొత్తంలో మామూళ్లు ముట్టుచెప్తున్నట్లు సమాచారం. ప ల్లెలలో బెల్టుషాపుల దందా యథేచ్ఛగా సాగడానికి వారే కారణమన్న చర్చ సాగుతోంది. డైనమిక్ కలెక్టర్‌గా పేరున్న రొనాల్డ్ రోస్ జోక్యం చేసుకుంటే దీనికి అడ్డుకట్ట పడుతుందని పలువుని అభిప్రాయంగా ఉంది. యథా సిండికేట్, తథా ఆబ్కారీ మద్యం విక్రయాలపై ప్రభుత్వ విధానం మారింది. క్షేత్రస్థాయిలో మాత్రం ‘వ్యాపారం’ తీరు మారలేదు. వ్యాపారులు సిండికేట్ వీడలేదు. మామూళ్లు ఆగడం లేదు. ఏసీబీ దాడుల నేపథ్యంలో ‘మా ఖర్చులు మాకుంటాయి కదా, చూడండి’ అంటూ సున్నితంగా మొదలైన ఎక్సైజ్, పోలీసుల మామూళ్ల దందా మళ్లీ బెదిరింపుల స్థాయి కి చేరింది. దీంతో సిండికేట్ వ్యాపారులు అడుగడుగునా బెల్టుషాపులను నిర్వహిస్తూ ‘గరిష్ట చిల్లర ధర’కు వక్రభాష్యం చెప్తున్నారు. ఎమ్మార్పీ ఉల్లంఘనలు యథేచ్చగా సాగుతున్నాయి. సగటున 20-25 శాతం ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. క్వార్టర్ సీసా ధర రూ.65 ఉంటే.. రూ.75కి విక్రయిస్తున్నారు. గతంలో ఏసీబీ దాడుల్లో ఈ బండారం బయటపడింది. నిజామాబాద్, కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల పరిధిలోని 100 గ్రామ పంచాయతీలలో 148 బెల్టుషాపులు ఉన్నట్లు ఇటీ వల ఓ స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వేలో తేలింది. ఈ లెక్కన 718 గ్రామ పంచాయతీలు, వాటి శివారు గ్రామాలలో ఎన్ని బెల్టుషాపులుంటాయో అర్థం చేసుకోవచ్చు. జిల్లావ్యాప్తంగా లెసైన్సులు పొందిన 130 బ్రాందీషాపులు, 14 బార్లు, మూడు క్లబ్బులున్నాయి. ఆయా షాపుల నుంచి రెన్యూవల్ మొదలుకొని పండగలు, పబ్బాల పేరిట గుం జుతున్న మామూళ్లతో సమానంగా బెల్టుషాపుల నుంచి వస్తున్నట్లు ఆ శాఖకు చెందిన కొందరు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. వెయ్యికి పైగా బెల్టుషాపులు జిల్లాలో వెయ్యికి పైగా బెల్టుషాపులు ఉన్నట్లు అధికారుల లెక్కలే చెప్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూరు, బోధన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బాల్కొండ, జు క ్కల్, నిజామాబాద్ రూరల్ తదితర నియోజకవర్గాల పరిధిలో విచ్చలవిడిగా బెల్టుషాపులు నడుస్తున్నాయి. వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘించినా అబ్కారీ అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. మద్యం దుకాణాల వద్ద లూజ్ అమ్మకాలు చేయకూడదన్న నిబంధనలు ఎవరూ పట్టించుకోవడం లేదు. పర్మిట్ గదులను అ న ధికారికంగా ఏర్పాటు చేసుకుని అమ్మకాలు చేపడుతున్నారు. ప్రతి దుకాణం ముందు ఖచ్చితంగా ధరల పట్టికను సూచించే బోర్డును ఏర్పాటు చేయాలన్న నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎలక్ట్రానిక్ బిల్లులను వినియోగదారులకు అందజేయాలని పేర్కొన్నా ఎవరూ పాటించడం లేదు. తమ పరిధిలో ఎక్కడా బెల్లు దుకాణాల్లేవని, అక్రమ మద్యం అమ్మకాలు జరగడం లేదంటూ ప్రతి ఎస్హెచ్ఓ కూడా అఫిడవిట్ సమర్పించాలన్న ఆదేశాలను ఎక్సైజ్ అధికారులే అమలు చేయడం లేదు. ప్రతి దుకాణం ముందు గ్రిల్స్ ఏర్పాటు చేయాలని నిబంధనలున్నా. ఒకటి రెండు చోట్ల తప్ప ఏ దుకాణం వద్దా ఇలాంటి ఏర్పాట్లు లేవు. దసరా నేపథ్యంలో, కలెక్టర్ జోక్యం చేసుకుని ఈ దందాను నివారించాలని తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
నేడే శోభాయాత్ర
- వినాయకుడి వీడ్కోలుకు అంతా సిద్ధం - నాలుగు చోట్ల విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు - బందోబస్తులో 1,483 మంది పోలీసులు - సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు - రెండురోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్ నిజామాబాద్ క్రైం: పదకొండు రోజులపాటు భక్త జనుల నుంచి విశేష పూజలందుకున్న గణేశుడు సోమవారం నిమజ్జనానికి తరలనున్నాడు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు పోలీసు లు భారీగా బలగాలను రంగంలోకి దించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి గట్టి నిఘా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా ప్రతి కదలికను కనిపెట్టనున్నారు. నిజామాబాద్ నగరం, కామారెడ్డి, ఆర్మూరు, బోధన్ పట్టణాలతోపాటు మండలాలు, గ్రామాలలో సోమవారం నిమజ్జన యాత్ర కొనసాగనుంది. కామారెడ్డిలో ఆదివా రం రాత్రే శోభాయాత్ర ప్రారంభమైంది. నగరంలో నిమజ్జనాన్ని తిలకించేందుకు సుమారు రెండు లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇ క్కడ 649 మంది పోలీసులను భద్రత కోసంనియమించగా, కామారెడ్డి, ఆర్మూర్ పట్టణాలతో పాటు నిమజ్జనం జరిగే వివిధ ప్రాంతాలలో 834 మందిని బందోబస్తు విధులకు కేటాయించారు. జిల్లా కేంద్రంలో ప్రధాన ఊరేగింపు జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతం నుంచి పగలు 1.30కు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. నిజామాబాద్ ఎంపీ కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, నగర మేయర్ సుజాత జెండా ఊపి రథాన్ని ప్రారంభిస్తారు. గుర్బాబాది రోడ్డు, రైల్వే గేట్, గాంధీ గంజ్, ఒకటవ పట్టణ ఠాణా, గాంధీ చౌక్, నెహ్రూపార్కు, బోధన్ బస్టాండ్, అహమద్బజార్, గురుద్వార, పెద్దబజార్ వాటర్ ట్యాంక్, పెద్దబజార్ చౌరస్తా, ఆర్య సమాజ్, గోల్ హన్మాన్, పులాంగ్ చౌరస్తా మీదుగా వినాయక్‌నగర్‌లోని గణపతుల బావి వరకు శోభాయాత్ర చేరుకుంటుంది. నాలుగు చోట్ల నిమజ్జనం జిల్లా కేంద్రంలో నెలకొల్పిన గణేశ్ విగ్రహాలను నాలుగు చోట్ల నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. చిన్న, మధ్యతరహా గణపతులను వినాయక్‌నగర్ గణపతుల బావిలో నిమజ్జనం చే స్తారు. పెద్ద విగ్రహాలను నగర శివారులోని బోర్గాం (పి) వాగు లో నిమజ్జనం చేస్తారు. భారీ విగ్రహాలను ఎడపల్లి మండలం జాన్కకం పేట్ గ్రామ సమీపంలో అశోక్‌సాగర్, బాసర గోదావరి నదికి తరలిస్తారు. మద్యం అమ్మకాలు బంద్ నిమజ్జనం సందర్భంగా జిల్లాలో సోమవారం మద్యం అమ్మకాలను నిషేధించారు. జిల్లా కేంద్రంలో మంగళవారం కూడా మద్యం అమ్మకాలు ఉండవు. ఆరోజు జెండా బాలాజీ తీర్థయాత్ర ఉన్నందున అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. -
సిండి‘కేటు’గాళ్లు
సాక్షి, గుంటూరు: చెప్పేదొకటి... చేసేది మరొకటి.. ఇది జిల్లాలో టీడీపీ నేతల తీరు. ఒకపక్క టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు బెల్టుషాపులను రద్దు చేస్తున్నట్లుగా ప్రమాణ స్వీకారం సమయంలోనే ఫైల్‌పై సంతకం చేయగా జిల్లాలో ఆ పార్టీ నాయకులు మాత్రం సిండికేట్లుగా ఏర్పడి అడ్డగోలుగా మద్యం విక్రయాలు జరుపుతున్నారు. వీరికి జిల్లాకు చెందిన ఓ మంత్రి, పలువురు టీడీపీ ఎమ్మెల్యేల అండదండలు ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో గ్రామాల్లో ఒకటో రెండో బెల్టుషాపులు ఉండేవి. అయితే ప్రస్తుతం బెల్టుషాపులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించడంతో అధికారిక బెల్టుషాపులను తొలగించి బడ్డీ బంకుల్లో పప్పు, బెల్లం అమ్మినట్లుగా మద్యం విక్రయాలు జరుపుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనిని నియంత్రించాల్సిన ఎక్సైజ్ అధికారులు ఏమీ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. జిల్లాలో 80 శాతం మద్యం సిండికేట్లు టీడీపీ నేతలకు చెందినవి కావడంతో వాటి పరిధిలో బెల్టుషాపుల జోలికి గానీ, అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుపుతున్న షాపుల జోలికిగానీ వెళ్ళాలంటే అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ దుకాణాల వద్దకు వెళ్ళి తనిఖీలు చేస్తుండగానే జిల్లా మంత్రో, లేదా అధికార పార్టీ ఎమ్మెల్యేనో వెంటనే ఫోన్లో లైనులోకి వస్తున్నారు. దీంతో ఏమీ చేయలేక వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజల పక్షాన నిలబడి పోరాడాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలే మద్యం సిండి‘కేటు’గాళ్లకు అండదండలు అందిస్తుండటం శోచనీయమని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో అసలు మద్యం దుకాణాలు, బెల్టుషాపుల జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిదనే అభిప్రాయానికి ఎక్సైజ్ అధికారులు వచ్చినట్లు తెలిసింది. అయితే సందట్లో సడేమియాలా కొందరు ఎక్సైజ్ అధికారులు మద్యం సిండికేట్ల వద్ద నెలవారీ మామూళ్లు తీసుకుంటూ చూసీచూడనట్లు మిన్నకుంటున్నారు. మండుతున్న మద్యం ధరలు.. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో మద్యం షాపులు కేటాయించిన వారం రోజుల నుంచే ఎమ్మార్పీ కంటే ఒక్కో సీసాకు రూ.30 చొప్పున అధికంగా వసూలు చేస్తున్నారు. అదేమని ప్రశ్నించి ఆందోళనకు దిగితే వెంటనే కౌంటర్లో ఉన్న మంచి బ్రాండ్లను పక్కకు తప్పించి ఎవరికి తెలియని బ్రాండ్లను పెట్టి అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో ఎంత డబ్బు ఎక్కువైనా పర్వాలేదు, ఫలానా బ్రాండ్ ఇవ్వండని అడిగేలా చేస్తూ మందుబాబుల వీక్నెస్ను క్యాష్ చేసుకుంటున్నారు. దీనికి తోడు ఉదయం 5 గంటలకే మద్యం దుకాణాలు తెరుచుకుంటున్నాయి. అర్ధరాత్రి ఒంటిగంట వరకు నిర్వగ్నంగా కొనసాగుతూనే ఉన్నాయి. రాత్రి 9 గంటలు అయిందంటే రోడ్లపై ఉన్న తోపుడు బండ్లు, చిన్న చిన్న బడ్డీ దుకాణాలను సైతం మూసివేయించే పోలీసులు మద్యం దుకాణాలను మాత్రం తెల్లవారుజాము వరకు అనుమతిస్తుండటం చూస్తుంటే వీరికి ఏ స్థాయిలో మామూళ్ళు ముడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా బాధ్యతగల మంత్రులు, ఎమ్మెల్యేలు మద్యం సిండికేట్లకు వత్తాసు పలకకుండా ప్రజల పక్షాన పోరాటాలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
గుడ్‌విల్... రూ.3 కోట్లు
ఎక్సైజ్‌శాఖలో మామూళ్ల వ్యవహారంపై అవినీతి నిరోధకశాఖ కొరడా ఝులిపించిన సమయంలో అన్నీ సంచలనాలే. వ్యాపారులే కాదు.. అధికారులు సైతం కేసుల పాలయ్యారు. అయినా, ఈ భయం కొన్నాళ్లే కనిపించింది. ఈ ఏడాది కొత్తగా ఏర్పా టైన మద్యంషాపులపై అప్పుడే పడిపోతున్నారు. ఆబ్కారీశాఖలోని విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు జిల్లావ్యాప్తంగా ఏర్పాటైన కొత్త దుకాణాలనుంచి గుడ్‌విల్ రూపంలో జిల్లా ఎక్సైజ్ అధికారులు కనీసం రూ.3కోట్లు వసూలు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెలనెలా ఇచ్చే మామూళ్లకు తోడు, ‘గుడ్‌విల్ ’ కింద ఒక్కో షాపునుంచి సగటున రూ.లక్ష డిమాండ్ చేస్తుండడంతో దుకాణదారులు గుడ్లు తేలేస్తున్నారు. జిల్లాలో మొదటివిడతలో 255 మద్యం దుకాణాలను లాటరీ ద్వారా ఖరారు చేశారు. ఆ తర్వాత మరో 12 షాపులనూ ఓకే చేశారు. మొత్తంగా ఇప్పుడు 267 మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. నెలరోజులపాటు ఓపిక పట్టిన ఎక్సైజ్ అధికారులు ఇక, తమ ప్రతాపం మొదలుపెట్టారు. ప్రతిషాపునకు కనీసం రూ.లక్ష గుడ్‌విల్‌గా ఇవ్వాలని షరతు పెట్టారు. ప్రతిషాపు నుంచి రూ.లక్ష వ సూలు చేస్తే ఆ మొత్తమే రూ.2.67కోట్లు అవుతోంది. వ్యాపారం ఎక్కువగా సాగే దుకాణాలు, ఒక మండలంలో కేవలం రెండు షాపు లు మాత్రమే ఉంటే వారి బిజినెస్ ఎక్కువగా సాగుతుంది కాబట్టి అలాంటి షాప్‌కు లక్ష కంటే ఎక్కువే డిమాండ్ చేస్తున్నారు. అంతా కలిపి గుడ్‌విల్ కింద రూ.3కోట్ల వసూలుకు స్కెచ్ వేశారని సమాచారం. ఇదీ... లెక్క! ప్రతీ షాప్ కొత్తగా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వ్యాపారులు, డిపార్టుమెంటు మధ్య మంచి సంబంధాలు ఉండాలి కాబట్టి, గుడ్‌విల్ ఇవ్వాలన్నది ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారుల కండీషన్.నెల నెలా ప్రతీ దుకాణం నుంచి ఇవ్వాల్సిన మామూలు దీనికి అదనం. షాపు ఉన్న ఏరియా, జరిగే వ్యాపారాన్ని బట్టి రూ.6వేల నుంచి రూ.15వేలు ఒక్కో సర్కిల్ పరిధిలో ఇవ్వాలి. ఇది రమారమి ఒక్కో షాప్‌కు ఇది ఏటా రూ.1.50లక్షలు అవుతోంది.ఇంతే మొత్తంలో పోలీసులకు ముట్టజెప్పాల్సి ఉంటోంది. అంటే మరో రూ.1.50లక్షలు. వెరసి ఏడాదిలో ఒక దుకాణం నుంచి రూ.3లక్షలు మామూళ్లు ముట్టజెప్పాల్సిందే. మద్యం వ్యాపారులు విక్రయాల్లో పాటించాల్సిన నిబంధనలను అక్కడక్కడా అమలు చేయరు. దీంతో ఒక షాప్‌పై కేసు రాస్తే రూ.లక్ష ఫైన్‌తో పాటు, 15రోజులు దుకాణం బంద్ పెట్టాలి. దీంతో ఇదంతా ఎందుకు, ముందే గుడ్‌విల్, మామూళ్లు ఇచ్చేసుకుంటే, ఎక్సైజ్ అధికారులు కూడా చూసీచూడనట్లు వదిలేస్తారన్న ఆశ వ్యాపారులది.ుంచి ఆదాయం ఉంటే స్టేషన్లలో పోస్టింగ్ కోసం కొందరు ఎక్సైజ్ సీఐలు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి ఆర్డర్లు తెచ్చుకుంటున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఒక్క నల్లగొండ ఎస్హెచ్ఓ కింద ఏకంగా 56 మద్యం దుకాణాలు ఉన్నాయి. అంటే, ఇక్కడ పనిచేసే వారికి వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఇక్కడ పనిచేస్తున్న కొందరు సిబ్బంది మధ్య పర్సెంటీజీల పంపకాల్లో తేడాలో వచ్చి ఘర్షణ పడినట్లు చెబుతున్నారు. మద్యం దుకాణాల లెసైన్సులను ఖరారు చేసి, ఫైల్క్లియర్ చేసేది తామే కాబట్టి ఎస్సైలకు గుడ్‌విల్ అమౌంట్ ఎందుకు పంచాలి..? అంతా మాకే కావాలని కొందరు సీఐలు పేచీ పెడుతున్నట్లు సమాచారం. మొత్తంగా తెలుస్తోందేమంటే, జిల్లా ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారులు, మరికొందరు ఉద్యోగులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. -
ఏపీలో ‘మద్యం’ ఇక ఆన్లైన్లోనే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలన్నీ ఇకపై ఆన్లైన్లోనే కొనసాగనున్నాయి. హెడొనిక్ పాత్ ఫైండర్ సిస్టం (హెచ్‌పీఎఫ్‌ఎస్) ప్రాజెక్టు పేరుతో మూడేళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానానికి ప్రభుత్వం ఇప్పుడు పచ్చజెండా ఊపింది. దీని ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందనేది రోజువారీ తెలుసుకోవచ్చని, సెక్యూరిటీ హాలోగ్రామ్స్ వాడకంతో ఏ డిస్టిలరీలో మద్యం తయారైందనే సమాచారంతో పాటు ఏ షాపు నుంచి వచ్చిందనేది సులువుగా తెలుసుకునే వీలుంటుందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. యుఫ్లెక్స్, స్రిస్టెక్, సి-టెల్ (యూఎస్సీ) అనే కన్సార్షియం ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. మద్యం ఆన్లైన్ ఆమ్మకాల ప్రాజెక్టును ప్రైవేటుకు అప్పగించడంపై తీవ్ర విమర్శలు వినవస్తున్నాయి. -
మామూళ్లతోనే మనుగడ!
ఎక్సైజ్‌కు బడ్జెట్ నిల్.. ఖర్చులు పుల్ సీఎం పర్యటన నుంచి వీఐపీల బాధ్యత మంజూరు కాని బిల్లులు వార్షిక బడ్జెట్ రూ 1.5 లక్షలు ఖర్చు రూ.15 లక్షలు సాక్షి, విజయవాడ : ప్రభుత్వం పైసా విదిల్చకపోవడంతో నిత్యం కాసులతో కళకళలాడే ఎక్సైజ్ శాఖ మాముళ్లతోనే మనుగడ సాగించాల్సి వస్తోంది. వార్షిక బడ్జెట్ నామమాత్రంగా ఉండగా ఖర్చులు మాత్రం రూ. లక్షలు దాటుతున్నాయి. ఏటా మద్యం షాపుల టెండర్ల నిర్వహణ ద్వారా వందల కోట్ల ఆదాయం ఆర్జిస్తున్న ఎక్సైజ్ శాఖకు కనీసం తెల్ల కాగితాలు కొనడానికే నిధులు విడుదల కావడం లేదు. శాఖ పరంగా నిర్వహించే కార్యక్రమాలు మొదలుకుని వీఐపీల పర్యటనల వరకు అన్ని ఖర్చులు ఎక్సైజ్శాఖపైనే పడుతున్నాయని, పర్యవసానంగా ఎక్సైజ్ అధికారులు తీసుకునే మామూళ్ల నుంచే ఈ ఖర్చులు పెట్టాల్సి వస్తుందని సిబ్బంది వాపోతున్నారు. గతేడాది నిర్వహించిన ఎక్సైజ్ కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్లు మొదలుకుని మొన్న జరిగిన సమాచార హక్కు కమిషనర్ పర్యటన వరకు ఆర్థిక భారమంతా ఎక్సైజ్శాఖపైనే పడింది. సాధారణంగా ప్రతియేటా స్టేషనరీ, ఇతర అఫీసు అవసరాల కోసం ఎక్సైజ్‌శాఖ జిల్లాకు రూ 1.5 లక్ష వరకు బడ్జెట్ మంజూరు చేస్తుంది. ఇది కాక అదర్ అఫీసు ఎక్స్పెండేచర్ (ఓఓఐ) కింద ఏడాదికి మరో రూ.50వేలు మంజూరు చేస్తారు. వీటిలోనే ఆ శాఖ మంత్రి పర్యటన ఖర్చు, ఇతర ముఖ్యుల పర్యటన ఖర్చు, ఇవికాక జిల్లాకు వచ్చే ఇతర వీఐపీల ప్రోటోకాల్ తదితర ఖర్చులన్నీ భరించాలి. ప్రధానంగా గతేడాది ఎక్సైజ్ కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ ప్రకియ 40 రోజులపాటు జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జిల్లాలో సుమారు 190 మంది కానిస్టేబుళ్ల నియామకాలు జరిగాయి. దీనికి గానూ సుమారు ఆరు లక్షల రూపాయలు ఖర్చు కాగా వీటిలో సుమారు రూ.1లక్ష మాత్రమే బిల్లు మంజూరు అయింది. మిగిలిన మొత్తం సంగతి సరేసరి. ఈ క్రమంలో కార్యాలయ సిబ్బంది, ముఖ్య అధికారులు తలాకొంత వేసుకుని ఖర్చును పంచుకున్నారు. ఆ తర్వాత ఇటీవల నిర్వహించిన మద్యం షాపుల వేలం ప్రకియకు షామియానా, 30 వరకు కొత్త స్టీల్బాక్సులు, స్టేషనరీ , జిల్లాలోని అన్ని సర్కిళ్ల నుంచి వచ్చిన సిబ్బందికి భోజనాలు, టీలు ఇలా అన్ని కలిపి సుమారు రూ.రెండు లక్షలు ఖర్చయింది. అది కూడ ఉన్నతాధికారుల ఆదేశాలతో పెట్టిన ఖర్చు. ఇది జరిగి నెలరోజులు గడుస్తున్నా ఇంతవరకు బిల్లులు మంజూరు కాలేదు. మామూళ్లతో వీఐపీలకు ఖర్చు.... ఇదిలా ఉంటే శాఖపరమైన ఖర్చుతోపాటు ఇతర ఖర్చుల తాకిడి ఎక్సైజ్‌కు అధికంగా ఉంటుంది. జిల్లా ఉన్నతాధికారులు ముఖ్యుల ప్రోటోకాల్ బాధ్యతలు ఎక్సైజ్‌కు కేటాయిస్తారు. ఒక్క వీఐపీ నగరానికి వచ్చి వెళితే ఎక్సైజ్‌కు సగటున రూ.10వేలు ఫైన్ పడినట్లే. ముఖ్యంగా రెండు నెలల కిత్రం జరిగిన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారసభకు తరలివచ్చిన కొందరు వీఐపీల ప్రోటోకాల్ బాధ్యతలను ఎక్సైజ్ శాఖకు కేటాయించారు. దీంతో సుమారు రూ.ఆరు లక్షలు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎక్సైజ్‌శాఖ అధికారులు ఖర్చు చేయాల్సి వచ్చింది. దీనికి తోడు ఎక్సైజ్ మంత్రి జిల్లాకు చెందిన వ్యక్తే కావడంతో నెలకు సగటున నాలుగుసార్లైనా పర్యటన జరుగుతుంది. దీంతో మంత్రి పర్యటన ప్రోటోకాల్ ఖర్చు కూడ ఎక్సైజ్‌కు తప్పనిసరిగా మారింది. మొత్తంమీద ఆదాయ వనరుగా ఉన్న ఎక్సైజ్‌శాఖ బడ్జెట్ లోటుతో సతమతమవుతుంది. -
మళ్లీ సప‘రేటు’
జిల్లాలో మద్యం వ్యాపారుల పంథా మారింది. వ్యాపారులు మళ్లీ సిండికేటు అవతారమెత్తారు. ఏసీబీ దాడులతో కొంత కాలంగా స్తబ్దుగా వ్యవహరించిన ‘మద్యం సిండికేట్లు’ తమ రూపాన్ని మార్చుకున్నారు. ‘హోల్‌సేల్-రిటైల్’ పేరుతో కొత్త రకం వ్యాపారానికి తెరతీశారు. గతంలో ఎమ్మార్పీ ధరలను ఉల్లంఫుంచిబాహాటంగానే లిక్కర్ దందా సాగించిన వ్యాపారులు ఈ సారి కొత్తరూటు వెతుక్కున్నారు. మద్యం అమ్మకాల విషయంలో ఎక్సైజ్ శాఖ వేస్తున్న ఎత్తులను వ్యాపారులు చిత్తు చేస్తున్నారు. జిల్లా ఎక్సైజ్ శాఖ, ఎన్ఫోర్స్మెంట్ ప్రోత్సాహంతోనే సిండికేట్లు మళ్లీ జీవం పోసుకున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. - నీలగిరి గ్రామీణ ప్రాంతాలే టార్గెట్.. ప్రభుత్వం అమలు చేసిన కొత్త మద్యం పాలసీ వ్యాపారులకు కలిసిరాకపోవడంతో గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ చేశారు. దుకాణాల వద్ద బాటిల్‌పై ము ద్రించిన (ఎమ్మార్పీ) ధరలకే మద్యం అమ్ముతున్న వ్యాపారులు బెల్టుషాపులను లక్ష్యంగా చేసుకున్నారు. గ్రామానికి కనీసం రెండు లేదా మూడు బెల్టుషాపులు న డుస్తున్నాయి. దీంతో బెల్టుషాపుల నిర్వహకులు తాము కొనుగోలు చేసిన మ ద్యంపై ఎమ్మార్పీకి మించి రూ.5 నుంచి రూ.10 లు ఎక్కువ ధరకు అమ్ముతున్నా రు. గతంలో వ్యాపారులు పొందిన ఈ లాభాన్ని బెల్టుషాపులు ఆర్జిస్తుండటంతో వ్యాపారులు జీర్ణించులేకపోతున్నారు. దీంతో మండల, పట్టణ కేంద్రాల్లో వ్యాపారులు సిండికేటుగా ఏర్పడి బెల్టుషాపులను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. హుజూర్నగర్, గరిడేపల్లి, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నకిరేకల్, మునుగోడు, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో సిండికేట్ జూలు విదుల్చుకుంది. కో దాడ సిండికేట్‌లో వ్యాపారుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో పోటీతత్వం ఏర్పడి ఎమ్మారీ కంటే తక్కువ ధరలకు మద్యం అమ్ముతుండటం గమనార్హం. దందా తీరిది.. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ గిరాకీ ఉండే బ్రాండ్లు, వ్యాపారులకు డిసౌంట్ల రూపం లో కలి సొచ్చే బ్రాండ్లను మాత్రమే డిపోల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. బెల్టుషాపులకు సరుకు అమ్మేటప్పుడు ఒక్కో బాటిల్‌పై ఎమ్మా ర్పీ మించి రూ.5 నుంచి 10 వసూలు చేస్తున్నా రు. గ్రామా ల్లో బెల్టుషాపులు వసూలు చేస్తున్న మొత్తాన్ని వ్యా పారులు దుకాణాల వద్దనే లాగేస్తున్నారు. దీంతో బెల్టుషాపుల నిర్వహకులు కూడా వ్యాపారులు వసూలు చేస్తున్న దానిపై అదనంగా రూ.5లు పెంచి గ్రామాల్లో అమ్ముతున్నారు. ఉదాహరణకు ఏదేని ఒక కంపెనీకి చెందిన క్వార్టర్ బాటిల్ ధర రూ.110లు ఉన్న వాటిపై వ్యాపారులు రూ.10లు పెంచి బెల్టు షాపులకు అమ్ముతున్నారు. దీంతో దుకాణం వద్దనే క్వార్టర్ ధర రూ.120 లకు పెరుగుతుంది. అదేవిధంగా ఆఫ్ బాటిల్ ధర రూ.215 ఉన్న వాటిపై రూ.235 లకు, ఫుల్ బాటిల్ ధర రూ.430లు ఉన్న వాటిపై రూ. 40లు పెంచి రూ.470 లకు అమ్ముతున్నారు. దీనిని రాబట్టుకునేందుకు బెల్టుషాపు నిర్వహకులు క్వార్టర్ కు రూ.5 పెంచి గ్రామాల్లో అమ్ముతున్నారు. అంటే దుకాణం వద్ద రూ.430లు ఉన్న ఫుల్ బాటిల్ ధర చేతుల మారి గ్రామానికి వచ్చే సరికి రూ.490 లకు చేరుతుంది. ఒక్కో బాటిల్‌పై నిర్ణయించిన ధర కంటే రూ.60లు ఎక్కువ అమ్ముతున్నారు. ఈ అక్రమ దందా వల్ల వ్యాపారులు, బెల్టుషాఫులు నడిపేవారు బాగుపడుతున్నా...మందుబాబుల జేబులకు చిల్లుపడుతున్నాయి. మామూళ్లే...మామూళ్లు.. అక్రమ మద్యం వ్యాపారం, సారా విక్రయాలను అరికట్టేందుకు జిల్లాలో ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ విగ్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఈఎస్ పరిధిలో ప్రత్యేకంగా ఓ టాస్క్‌ఫోర్స్‌ను కూడా నియమించారు. కానీ ఈ రెండు వింగ్‌లు వ్యాపారుల అక్రమ దందాకు కొమ్ముకాస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సిండికేట్ దందాలో అన్ని షాపుల సరుకు మొత్తం ఒకే దుకా ణం వద్ద నిల్వ ఉంచి బెల్టుషాపులకు అమ్ముతుంటారు. ఈ రెండు నిఘా వర్గాలు దాడి చేస్తే సిండికేట్ గుట్టును రట్టు చేయడం పెద్ద సమస్య కాదు. కానీ అధికారులకు తెలిసే ఇదంతా జ రుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో ఎన్ఫోర్స్మెంట్ విగ్ బెల్టుషాపులను వదిలేసి సారా విక్రయేతరల పైనే దాడులు చేస్తోంది. ఎక్సైజ్ శాఖ ప్రోద్బలంతో జరుగుతున్నట్లు వస్తున్న ఈ ప్రచారంలో సివిల్ పోలీస్‌లకు భాగం ఉన్నట్లు వినికిడి. -
మద్యం బాటిళ్లకు బార్కోడ్
వైరా: ఇక నుంచి మద్యం అమ్మకాలు పారదర్శకంగా జరుగుతాయి. దుకాణ యజమానులు నాన్ డ్యూటీ పెయిడ్(ఎన్డీపీ) మద్యం అమ్మకాలు జరపకుండా చూసేందుకు కొత్తగా 2డీ బార్‌కోడ్‌ను ఎక్సైజ్ శాఖ అమలు చేయనుంది. బాటిల్‌పై ఉండే హోలోగ్రామ్‌ను కంప్యూటర్ స్కానర్‌తో పరిశీలించగానే.. దాని (బాటిల్) ధర, ఎక్కడ తయారైంది తదితర వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఈ విధానాన్ని వైన్ షాపు యజమానులు వ్యతిరేకిస్తున్నారు. సాఫ్ట్వేర్ సిద్ధం ప్రస్తుతం మద్యం బాటిళ్ళపై ఎక్సైజ్ అడిహసీవ్ లేబుల్ బార్కోడ్ ఉంది. ఇకపై హోల్‌గ్రామ్ 2డీ బార్కోడ్ ఉంటుంది. దీనికి సంబంధించి హెడానిక్ పాత్ ఫైన్డర్ సిస్టమ్ (హెచ్‌పీఎఫ్‌ఎస్) అనే స్టాఫ్‌వేర్‌ను ప్రభుత్వం రూపొందించింది. డిస్టీలరీ నుంచి మొదలుకుని మద్యం డిపోలు, వైన్ షాపులను అనుసంధానం చేసే ప్రక్రియను చేపట్టింది. అధిక ధరకు అడ్డుకట్ట మద్యం బాటిల్‌పై హోలోగ్రామ్‌ను స్కాన్ చేయగానే బాటిల్ తయారైన డిస్టీలరీ, డిస్టీలరీ నుంచి డిపో, డిపో నుంచి మద్యం దుకాణం, ఏ రకం బ్రాండ్, దాని ధర తదితర వివరాలు వస్తాయి. తద్వారా బాటిల్‌పై ఉన్న ఎమ్మార్పీకంటే షాపులో ఎక్కువ ధరకు అమ్మే పరిస్థితి ఉండదు. వైన్ షాపు యజమానులు గతంలో ఎమ్మార్పీకన్నా 10 నుంచి 20 రూపాయలు అదనంగా వసూలు చేస్తుండేవారు. బార్కోడ్ విధానంతో దీనికి అడ్డుకట్ట పడుతుంది. మద్యం యజమానులకు సౌలభ్యం.. జిల్లా సరిహద్దు ప్రాంతాలలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌తోపాటు కల్తీ లిక్కర్‌ను విసృ్తతంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బార్కోడ్ అమల్లోకి వస్తే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌కు కూడా చెక్ పడే అవకాశాలున్నాయి. బార్ కోడ్ విధానం వైన్ షాపు యజమానులకు లాభకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా వైన్ షాపు యజమాని కౌంటర్ మీద ఉన్నా లేకున్నా కంప్యూటర్ నుంచి సెల్‌ఫోన్‌కు అనుసంధానమైతే అమ్మకాలపై సంక్షిప్త సమాచారం వస్తుంది. సరుకు కొనుగోలుకు సంబంధించి ఇదే ఆన్లైన్లో సేల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ప్రతి రోజు అకౌంట్ వివరాలు తెలుసుకునేందుకు సులువవుతుంది. దుకాణంలో ఎన్ని బాటిళ్ళు అమ్ముడుపోయాయి.. ఏయే బాటిళ్ళు విక్రయాలు జరుగుతున్నాయనే వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చు. అయినా అసంతృప్తే.. బార్కోడ్ విధానంపై గత వారం మద్యం దుకాణాలను ప్రారంభించిన వైన్‌షాపు యజమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాటిల్‌ను స్కానింగ్ చేయాలంటే ప్రధానంగా కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ ఏర్పాటు చేసుకోవాలంటే 50 వేల నుంచి 80వేల వరకు ఖర్చవుతుంది. దీనిని ఆపరేట్ చేసేందుకు ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లను నియమించుకోవాలి. ఇదంతా తమకు భారమవుతుందని వారు అంటున్నారు. మద్యం వ్యాపారంలోకి కొత్తగా వచ్చిన వారు.. ఈ బార్కోడ్ విధానాన్ని కొరకరాని కొయ్యగా భావిస్తున్నారు. అధికారులకు ఆండ్రాయిడ్ ఫోన్లు తనిఖీల కోసం వెళ్ళే అధికారులకు స్కానింగ్ అప్లికేషన్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లను ఇవ్వనున్నట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ ఫోన్ల ద్వారా మద్యం బాటిల్‌ను స్కానింగ్ చేసినప్పుడు పూర్తి వివరాలు సెల్లో వస్తాయని, తద్వారా అది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరా, డ్యూటీ పెయిడ్ లిక్కరా అనేది తెలుస్తుంది. -
ఇదేంటి వెంకటరమణా..?
- తిరుమల బైపాస్ రోడ్డులో బార్లను నిషేధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు - ఆ మార్గంలో బార్లకు అనుమతించాలంటూ సర్కారుపై ఎమ్మెల్యే ఒత్తిడి..! - భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ ప్రజాసంఘాల ఆగ్రహం సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మద్యం ఏరులై పారుతుండటం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. తిరుపతిలో మద్యం అమ్మకాలను నిషేధించి.. భక్తుల మనోభావాలను కాపాడాలన్న ప్రజాసంఘాల డిమాండ్‌ను ప్రభుత్వం చెవికెక్కించుకోవడం లేదు. కనీసం తిరుపతిలోనైనా మద్యాన్ని నిషేధించాలంటూ భారీ ఎత్తున పోరాటాలు చేసినా సర్కారు ఖాతరు చేయలేదు. ఖజానాను నింపుకోవడానికి భక్తుల మనోభావాలను తాకట్టు పెడుతోంది. ఈ నేపథ్యంలో కనీసం తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో.. అంటే రైల్వేస్టేషన్, విష్ణునివాసం, ఆర్టీసీ బస్టాండు, శ్రీనివాసం, లీలామహల్ సర్కిల్, నంది సర్కిల్(తిరుమల బైపాస్ రోడ్డు) వరకూ మద్యం దుకాణాలు, బార్లను నిషేధించాలనే డిమాండ్ భక్తుల నుంచి వచ్చింది. ఆ డిమాండ్‌కు కూడా స్పందించకపోవడంతో ప్రజాసంఘాలు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు ఉత్తర్వుల మేరకు గతేడాది తిరుమల బైపాస్ రోడ్డులో మద్యం దుకాణాలను ప్రభుత్వం ఏర్పాటుచేయలేదు. కానీ.. ఆ మార్గంలో తొమ్మిది బార్లకు లెసైన్సులు మాత్రం ఇచ్చింది. తిరుమల బైపాస్ రోడ్డులో బార్లను కూడా అనుమతించకూడదంటూ ప్రజాసంఘాలు మరోసారి కోర్టును ఆశ్రయించాయి. ఇప్పుడు ఈ అంశం కోర్టు విచారణలో ఉంది. దీంతో తిరుపతి బైపాస్ రోడ్డులోని తొమ్మిది బార్ల లెసైన్సులను ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు. మిగతా పదిబార్లకు రెన్యువల్ చేసింది. ఆ తొమ్మిది బార్ల లెసైన్సుదారులు ఎమ్మెల్యే వెంకటరమణకు ప్రధాన అనుచరులు. సార్వత్రిక ఎన్నికల్లో వెంకటరమణ విజయానికి వీరు భారీ ఎత్తున ఖర్చుచేసినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో ఖర్చు చేసిన సొమ్మును రాబట్టుకునేందుకు బార్ల లెసైన్సుదారులు ఎమ్మెల్యే వెంకటరమణపై ఒత్తిడి తెస్తున్నారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన వెంకటరమణ తిరుమల బైపాస్ రోడ్డులో తొమ్మిది బార్లకు అనుమతించాల్సిందేనంటూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. సోమవారం ఇదే అంశంపై హైదరాబాద్‌లో ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులతో భేటీ కావడం గమనార్హం. దేవదేవుడు కొలువైన తిరుమలకు వెళ్లే మార్గంలో మద్యం దుకాణాలు, బార్లు ఏర్పాటుచేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనంటూ ఆధ్యాత్మికవేత్తలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా తిరుమల బైపాస్ రోడ్డులో బార్లు ఏర్పాటుచేస్తే ఉద్యమాలు తప్పవని ప్రజాసంఘాలు హెచ్చరిస్తున్నాయి. కానీ ఇవేవీ ఎమ్మెల్యే వెంకటరమణ పట్టించుకోకపోవడం గమనార్హం. తన అనుచరులకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా తిరుమల బైపాస్ రోడ్డులో తొమ్మిది బార్లకు లెసైన్సులు ఇప్పించేందుకు పోరాటం చేస్తోండటం కొసమెరుపు. -
భారీగా పెరుగుతున్న అమ్మకాలు
కర్నూలు: వర్షం వచ్చినా.. రాకపోయినా.. పంటలు పడినా.. పండకపోయినా.. నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నా.. కూరగాయలు, ఆకుకూరల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నా.. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగినా.. వీటితో ఏ మాత్రం సంబంధం లేకుండా మందుబాబులు మత్తులో జోగుతున్నారు. కోట్ల రూపాయల మద్యాన్ని తాగేస్తున్నారు. మద్యం కొత్త విధానం ఈ నెల నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పది రోజుల్లోనే రూ. 31 కోట్ల మద్యం తాగేశారు. 2011-12 సంవత్సరంలో రూ. 503 కోట్లు, 2012-13లో రూ.620 కోట్లు, 2013-14లో రూ.660 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. మద్యం.. ప్రభుత్వాలను నడిపిస్తున్న ఇం‘ధనం’. సర్కార్ ప్రతి యేటా మద్యం విక్రయాలను పెంచుతోంది. ప్రజలను మత్తులో ముంచేస్తోంది. కాసుల వర్షం కురుస్తుందని పాలకులు సంబరపడుతున్నారే గాని.. ప్రజల ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుందని ఆలోచించడం లేదు. మద్యం మత్తులో కాపురాలు కూలిపోతున్నాయి. పేదల బతుకులు రోడ్డున పడుతున్నాయి. లక్షల రూపాయలు పెట్టి లెసైన్స్ దక్కించుకున్న వ్యాపారులు మారుమూల గ్రామాల్లో కూడా మద్యం అమ్మకాలను విస్తరిస్తున్నారు. మంచినీళ్లలాగా మద్యం అందుబాటులో ఉండడంతో మందుబాబుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మద్యానికి బానిసలైన వారు సమాజ ంలో మృగాలుగా మారుతున్నారు. కుటుంబ బంధాలను సమాధి చేస్తున్నారు. పెళ్లాం బిడ్డలను హింసిస్తున్నారు. చంపడానికి కూడా వెనుకాడడంలేదు. తాగుడుకు బానిసలైన భర్తల వేధింపులను భరించలేక మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పిల్లలు అనాధలుగా మారుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య కూడా ఏడాదికేడాది పెరుగుతోంది. ఏటేటా పెరుగుతున్న మద్యం విక్రయాలు.. కరువు ప్రాంతంగా గుర్తింపు ఉన్న కర్నూలు జిల్లాలో మద్యం విక్రయాల్లో మాత్రం కరువు ఛాయలు ఎక్కడా కనిపించడంలేదు. జిల్లాలో 194 మద్యం దుకాణాలు, 35 బార్లు ఉన్నాయి. ఏటేటా మద్యం అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. గత మూడు సంవత్సరాలుగా మద్యం అమ్మకాలను పోల్చి చూస్తే మూడు రెట్లు అమ్మకాలు పెరిగాయి. జిల్లాలో మద్యం దుకాణాలు, బార్ల సంఖ్య స్థిరంగా ఉన్నప్పటికీ అమ్మకాలు మాత్రం గణనీయంగా పెరిగాయి. ప్రతి గ్రామంలో బెల్టు షాపుల ద్వారా అయితేనేం, మద్యం షాపుల ద్వారా అయితేనేం మద్యం పుష్కలంగా దొరుకుతుంది. నెలకు 2.40 లక్షల కేసుల మద్యం అమ్ముడుపోతోంది. వాటి ద్వారా నెలకు రూ.60 కోట్లు ప్రభుత్వానికి రాబడి వస్తోంది. ప్రభుత్వ ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా.. ప్రభుత్వ ఖజానాను నింపుకోవడమే లక్ష్యంగా పాలకులు సాగిస్తున్న వికృత క్రీడలో సామాన్యుడు బలైపోతున్నాడు. గుక్కెడు నీరు లేక గొంతెండుతున్న పల్లెల్లోనూ సీసాల కొద్దీ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. 18 ఏళ్ల యువకులు సైతం మద్యానికి అలవాటుపడుతున్నారు. ఇది తప్పు అని తేల్చుకోలేక సతమతమవుతున్నారు. పగలంతా కష్టం చేసి సంపాదించిన డబ్బును సాయంత్రానికి మద్యానికి తగలేస్తున్నారు. మద్యం సేవించడం వల్ల సంభవించే దుష్ఫలితాలు తెలిసినప్పటికీ మద్యాన్ని సేవించే వారి సంఖ్య రోజురోజుకు అధికమవుతోంది. నేటి యువతరం మద్యం సేవించడం ప్యాషన్‌గా చేసుకుంటున్నారు. మరికొంత మంది మానసిక ఒత్తిడికి తట్టుకోలేక మద్యానికి బానిసలవుతున్నారు. రోగాలే.. రోగాలు.. మద్యం మనిషిని ఆర్థికంగా దెబ్బతీయడమే కాక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. మందుబాబులకు కాలేయం, గుండె, మెదడు, పాంక్రియాస్, కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోగాలతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మద్యం మానేస్తే తప్ప వ్యాధులు తగ్గవని వైద్యులు హెచ్చరిస్తున్నా అలవాటును మానుకోలేకపోతున్నారు. రోగాల తీవ్రత ఎక్కువై లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కార్యాచరణ ఏదీ? ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఏర్పాటు చేసిన మద్య విమోచన కమిటీ నామమాత్రంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. మద్యపానం వల్ల కలిగే దుష్పలితాలను వివరించడానికి కార్యాచరణ ఇప్పటిదాకా లేకపోవడమే ప్రధాన లోపం. ఇప్పటికైనా కమిటీ ముందుగా చైతన్యవంతమై.. ఆతర్వాత మందుబాబులను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. -
వైన్ స్కాన్
నిజామాబాద్ క్రైం: ఇక నుంచి మద్యం అమ్మకాలు పారదర్శ కం కానున్నాయి. దుకాణ యజమానులు నాన్‌డ్యూటీ పెయిడ్(ఎన్డీపీ) మద్యం అమ్మకాలు జరిపేందుకు వీలుండదు. ఎందుకంటే ఎక్సైజ్‌శాఖ వైన్స్‌ల్లో కొత్తగా 2డీ బార్‌కోడ్‌ను అమలు చేయనుంది. బాటిల్‌పై నుండే హోలోగ్రామ్‌పై కంప్యూటర్ స్కానర్‌తో పరిశీలించగానే ఆ వస్తువు ధరతో పాటు అది ఎక్కడ తయారైందో తదితర వివరాలు ప్రత్యక్షమవుతాయి. అయితే ఈ విధానాన్ని వైన్‌షాపు యజమానులు మా త్రం వ్యతిరేకిస్తున్నారు. పాత ఎక్సైజ్ పాలసీ ప్రకారం ప్రస్తుతం మద్యం బాటిళ్లపై ఎక్సైజ్ అడిహసీవ్ లేబుల్ బార్కోడ్ ఉంటుంది. త్వర లో హోలోగ్రామ్ 2డీ బార్‌కోడ్‌ను తెలంగాణ ప్రభుత్వం అమలు పరుచనుంది. దీనికి సంబంధించి హెడానిక్ పాత్ ఫైన్డర్ సిస్టమ్ (హెచ్‌పీఎఫ్‌ఎస్) అనే స్టాఫ్‌వేర్‌ను రూపొందించింది. డిస్టిలరీ నుంచి మొదలుకుని మద్యం డిపోలు, వైన్‌షాపులను అనుసంధానం చేసే ప్రక్రియ చేపట్టింది. మద్యం బాటిల్‌పై స్కాన్ చేయగానే బాటిల్ తయారైన డిస్టిలరీ, డిస్టిలరీ నుంచి డిపో, డిపో నుంచి మద్యం దుకాణం, ఏ రకం బ్రాండ్, దాని ధర తదితర వివరాలు వస్తాయి. తద్వారా బాటిల్‌పై ఉన్న ఎమ్మార్పీ కంటే షాపు లో ఎక్కువ ధరకు అమ్మే పరిస్థితి ఉండదు. గతంలో ఎమ్మార్పీ కంటే రూ. 10 నుంచి రూ. 20 అదనంగా వైన్స్‌షాపుల్లో వసూలు చేస్తుండేవారు. దాంతో మందుబాబుల జేబుకు చిల్లు పడేది. బార్కోడ్ విధానంతో అధిక వసూలుకు అడ్డుకట్ట పడనుంది. జిల్లా సరిహద్దు ప్రాంతాలలో నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్‌తో పా టు కల్తీ లిక్కర్‌ను విస్తృతంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బార్కోడ్ అమలైన పక్షంలో నాన్‌డ్యూటీపెయిడ్ లిక్కర్‌కు కూడ చెక్ పడే అవకాశాలు ఉన్నాయి. కాగా బార్కోడ్ విధా నం వైన్‌షాపు యజ మానులకు లాభం చేకూరే విధంగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా వైన్‌షాపు యజమాని కౌంటర్ మీద ఉన్నా.. లేకున్నా కంప్యూటర్ నుంచి సెల్‌ఫోన్‌కు అనుసంధానం చేస్తే అమ్మకాలపై సంక్షిప్త సమాచారం వస్తుంది. సరుకు కొనుగోలుకు సంబంధించి ఇదే ఆన్లైన్లో సేల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు.అంతేకాకుండా ప్రతిరోజు అకౌంట్ వివరాలు తెలుసుకునేందుకు సులువవుతుం ది. దుకాణంలో ఎన్ని బాటిళ్లు అమ్ముడు పో యాయి, ఏఏ బాటిళ్లు విక్రయాలు జరుగుతున్నాయనే వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చు. అధికారులకు అండ్రాయిడ్ ఫోన్లు తనిఖీల కోసం వెళ్లే అధికారులకు స్కానింగ్ అప్లికేషన్ ఉన్న అండ్రాయిడ్ ఫోన్లను ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ ఫోన్ల ద్వారా మద్యం బాటిల్‌ను స్కానింగ్ చేసినప్పుడు పూర్తి వివరాలు సెల్లో వస్తాయని, తద్వారా అది నాన్‌డ్యూటీపేయిడ్ లిక్కరా? డ్యూటీపెయిడ్ లిక్కరా అనేది తేలిపోతుంది. ఇదిలా ఉండగా గతవారం మద్యం దుకాణాల ను ప్రారంభించిన వైన్‌షాపు యజమానులు బార్కోడ్ విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కానింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. బాటిల్‌ను స్కానింగ్ చేయాలంటే ప్రధానంగా కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ ఏర్పాటు చేసుకోవాలంటే రూ. 50 వేల నుంచి రూ. 80 వేల వరకు ఖర్చు అవుతుం ది. దానిని ఆపరేట్ చేసేందుకు విద్యార్హత కలి గిన ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లను నియమించుకోవాలి. వారికి అధిక జీతం ఇచ్చి నియమించుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇప్పటికే పర్మిట్ రూం పేరిటా రూ. 2 లక్షలు, ప్రివిలేజ్ పేరిట ఏడు రెట్ల మద్యం అమ్మిన తర్వాత 13 శాతం ట్యాక్స్ విధిస్తున్నారని, ఈ విధానం అమలు చేస్తే తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుందంటున్నారు. పాత వ్యాపారులకు బార్కోడ్ విధి విధానాలు కొంత వరకు అవగాహన ఉన్న కొత్తగా ఈ రంగంలోకి వచ్చిన వ్యాపారులను బార్కోడ్ సమస్య పట్టిపీడిస్తోంది. ఈ నేపథ్యంలో 2డీ బార్కోడ్ విధానం అమలు అవుతుందా అనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
భద్రాద్రిలో మద్యం వద్దే వద్దు..!
భద్రాచలం: పుణ్య క్షేత్రమైన భద్రాచలంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయవద్దంటూ గ్రామ సభ తీర్మానించింది. పట్టణంలోని అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) కాలనీలో బుధవారం ఏర్పాటైన గ్రామసభకు మహిళలు అధిక సంఖ్యలో వచ్చారు. మద్యం షాపులు వద్దంటే వద్దంటూ ఏకోన్ముఖంగా గళం విప్పారు. ఇక్కడి మహిళల్లోని చైతన్యాన్ని చూసి ఎక్సైజ్ అధికారులు విస్తుపోయారు. భద్రాచలం పట్టణంలో తొమ్మిది మద్యం దుకాణాల ఏర్పాటుకు టెండర్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. వీటిని గిరిజనులకు ఇప్పటికే లాటరీ పద్ధతిలో కేటాయించారు. కానీ, పీసా చట్టం ప్రకారంగా మద్యం దుకాణాల ఏర్పాటుకు గ్రామసభల ఆమోదం తప్పనిసరి. లేనట్టయితే లెసైన్స్ ఇవ్వరు. దీంతో, ప్రజాభిప్రాయ సేకరణ కోసం గిరిజనులు ఎక్కువగా ఉన్న నాలుగు కాలనీలను అధికారులు గుర్తించి గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఏఎస్ఆర్ కాలనీలో బుధవారం గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ భూక్యా శ్వేత అధ్యక్షతన జరిగిన ఈ గ్రామసభలో ఎక్సైజ్ సీఐ రాంకిషన్, ఎస్సై రాధ, ఎంపీడీవో కార్యాలయ సూపరింటెం డెంట్ ప్రసాద్‌రాజు, పంచాయతీ ఇంచార్జి ఈవో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామసభ ఏర్పాటు కారణాలను సర్పంచ్ శ్వేత వివరించారు. ఈ గ్రామ సభకు మొత్తం 154 మంది హాజరయ్యారు. మద్యం షాపుల ఏర్పాటుకు అనుకూలంగా 29 మంది, వ్యతిరేకంగా 125 మంది నిర్ణయం ప్రకటించారు. సభకు హాజరైన వారిలో మహిళలే ఎక్కువమంది ఉన్నారు. ఈ గ్రామసభ నిర్ణయాన్ని నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు తెలుపుతానని ఎంపీడీవో సూపరింటెం డెంట్ ప్రసాదరాజు అన్నారు. ఫలించని సిండికేట్ వ్యూహం ఇప్పటికే రాజుపేటలో నిర్వహించిన గ్రామసభలో (మద్యం దుకాణాల ఏర్పాటుకు) వ్యతి రేకత రావటం, సుందరయ్య నగర్ కాలనీ లోని సభలో స్పష్టమైన నిర్ణయం వెలువడకపోవటంతో, ఏఎస్ఆర్ కాలనీలో నిర్వహిం చిన గ్రామసభకు కోరం వచ్చే రీతిలో జనాన్ని తరలించేందుకు మద్యం బినామీ వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి వ్యూహం పన్నారు. దుకాణాల ఏర్పాటుకు అనుకూలంగా అభిప్రాయం చెప్పాలంటూ కాలనీలోని కొందరికి డబ్బు ఎరగా చూపారు. దీనిని మహిళలు వ్యతిరేకించారు. అంతేకాదు.. గ్రామసభకు కూడా స్వచ్ఛందగా తరలివచ్చి, మద్యం దుకాణాల ఏర్పాటుకు వ్యతిరేకంగా నిర్ణయం ప్రకటించారు. -
భద్రాచలం ఏజెన్సీలో మద్యం బంద్
భద్రాచలం: భద్రాచలం ఏజెన్సీలో మద్యం బాబులకు నేటి నుంచి కష్టాలు వచ్చిపడినట్లే. అందుకు కారణం సోమవారం రాత్రి 11గం.లకు భద్రాచలం, వెంకటాపురం ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో గల మద్యం దుకాణాలకు ప్రస్తుత లెసైన్స్‌ల గడువు ముగిసింది. దీంతో మంగళవారం నుంచి ఈ దుకాణాలు తెరిచే పరిస్థితి లేదు. మద్యం దుకాణాల ఏర్పాటుకు ఆయా పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభల్లో ప్రజల నుంచి వ్యతిరేకత రాగా మరి కొని చోట్ల కోరం లేక సభలు వాయిదా పడ్డాయి. ఫలితంగా భద్రాచలం ఏజెన్సీలో మద్యం దుకాణాలకు తాళాలు పడనున్నాయి. భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 11, వెంకటాపురం పరిధిలో 5 దుకాణాలకు కొత్తగా గ్రామసభల ఆమోదం లభించే వరకూ తాళాలు వేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. బెల్టుషాపులకు మద్యం తరలింపు..? అధికారికంగా మద్యం దుకాణాలు మూతవేయాల్సి రావడంతో సిండికేట్‌గా ఏర్పడిన కొంతమంది మద్యం వ్యాపారులు మిగిలిన సరుకును గ్రామాల్లోని బెల్ట్ షాపులకు తరలిస్తున్నారు. భద్రాచలం పట్టణంలో ఉన్న ప్రతీ మద్యం దుకణానికి అనుబంధంగా గ్రామాల్లో బెల్ట్‌షాపులు ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం దుకాణాల కాలపరిమితి ముగియడంతో మిగిలిన మద్యాన్ని అక్కడికి తరలించి విక్రయించేందుకు సిండికేట్‌దారులు వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. దీనికి అడ్డకట్ట వేసేందుకు ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని స్థానిక మహిళా సంఘాల వారు కోరుతున్నారు. భద్రాద్రిలో బెడిసికొట్టిన వ్యూహం : భద్రాచలంలో ఉన్న తొమ్మిది మద్యం దుకాణాలకు ఇప్పటికే టెండర్లు పూర్తి కాగా, వీటిని లాటరీ ద్వారా కేటాయించడం కూడా పూర్తయింది. తొమ్మిది దుకాణాలు కూడా ఇతర మండలాలకు చెందిన గిరిజనులకే దక్కాయి. కానీ ఇప్పటి వరకు బినామీలుగా వ్యవహరించిన సిండికేట్ దారులు ఈ ఏడాది కూడా దుకాణాలు దక్కించుకున్న గిరిజనులకు భారీ నజరానా(గుడ్ విల్) ముట్టజెప్పి షాపులను కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలోనే మద్యం షాపుల ఏర్పాటుకు సంబంధించి రెండు రోజుల క్రితం భద్రాచలం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభలో ఎలాగైనా ఆమోదింపజేసుకునేందుకు వ్యూహం పన్నారు. కానీ చివరకు వారి వ్యూహం బెడిసి కొట్టింది. డబ్బులు ఇచ్చి మరీ ప్రజలను గ్రామసభకు రప్పించారనే ఆరోపణలు వచ్చాయి. కానీ వచ్చిన వారిలో తగినంతమంది గిరిజనులు లేకపోవడంతో గిరిజన చట్టాల మేరకు గ్రామసభను రద్దు చేశారు. మరోమారు నిర్వహించే గ్రామసభలో వీటిని ఆమోదింపజేసుకునేందుకు భద్రాద్రి సిండికేట్ దారులు మళ్లీ పావులు కదుపుతున్నారు. ఆంధ్రాకు పరుగు తీయాల్సిందే... ఏజెన్సీలోని మద్యం ప్రియులు ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరుకు పరుగులు తీయాల్సిందే. అందుకు కారణం చింతూరు మండలంలో రెండు మద్యం దుకాణాలకు గ్రామసభ ఆమోదం లభించింది. దీంతో నూతనంగా దుకాణాలను లాటరీలో దక్కించుకున్న వారికి మంచి వ్యాపారమే సాగనుంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో దుకాణాల ఏర్పాటుకు గ్రామసభ ఆమోదం లేదు. అదే విధంగా చింతూరు మండలం మోతుగూడెంలో గ్రామసభకు కోరం లేక వాయిదా పడింది. దీంతో చింతూరు మండల కేంద్రంలో ఉన్న దుకాణంతో పాటు, ఇదే మండలంలోని ఎర్రంపేట దుకాణాల్లో మాత్రం అధికారికంగా మద్యం లభించనుంది. ఈ పరిణామాలు మద్యం ప్రియులకు కష్టాలు తెచ్చిపెట్టనుండగా, మహిళా సంఘాలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నాయి. భద్రాచలం ఏజెన్సీలో పూర్తిగా మద్యం లేకుండా చేయాలని వారు కోరుతున్నారు. అదే విధంగా బెల్ట్ షాపులు కూడా లేకుండా ఎక్సైజ్ అధికారులు నిఘా ఏర్పాటు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
భద్రాద్రిలో ‘మద్యం’ రగడ
భద్రాచలం: భద్రాచలం పట్టణంలో మద్యం షాపుల ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కోసం శనివారం ఏర్పాటు చేసిన గ్రామ సభ రసాభాసగా మారింది. పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో మద్యం దుకాణాలు వద్దని కొంతమది డిమాండ్ చేయగా, ఏర్పాటు చేయాల్సిందేనని మరి కొందరు పట్టుబట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు పోలీసు పహారా నడుమ గ్రామసభ నిర్వహించారు. భద్రాచలం పట్టణంలో తొమ్మిది మద్యం దుకాణాల ఏర్పాటుకు సం బంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి లాటరీ పద్ధతి లో గిరిజనులకు కేటాయించారు. కానీ ఈ నెల 21వ తేదీన నిర్వహించిన గ్రామసభలో మద్యం దుకాణాలు వద్దంటూ తీర్మానించారు. ఈ క్రమంలో పీఓ ఆదేశాల మేరకు మరోసారి గ్రామసభ నిర్వహిం చారు. మొదటిసారి నిర్వహించిన గ్రామసభకు కేవ లం 75 మంది హాజరుకాగా, శనివారం నిర్వహిం చిన గ్రామసభకు ఐదువందల మందికిపైగానే హాజరయ్యారు. వ్యతిరేకించిన పలు రాజకీయ పార్టీలు.. పట్టణంలో మద్యం దుకాణాల ఏర్పాటును సీపీఎంతో పాటు, వైఎస్సార్సీపీ, టీడీపీలోని ఓ వర్గం నాయకులు, వివిధ గిరిజన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మద్యం దుకాణాలు వద్దంటూ సభావేదిక ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభ వెనుక కూర్చున్న వారంతా దుకాణాలు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని చెదరగొట్టడంతో గ్రామ సభ రసాభాసగా మారింది. చివరకు ఎంపీడీఓ రమాదేవి కల్పించుకుని సభకు వచ్చిన వారంతా ఒక్కొక్కరుగా వచ్చి తమ పేరు, చిరునామాతో పాటు అభిప్రాయాన్ని చెప్పాలని సూచించారు. దీంతో గ్రామసభకు వచ్చిన వారంతా లైన్లో నిలబడి తమ అభిప్రాయాలను వెల్లడించారు. మొత్తం 325 మంది గ్రామసభలో అభిప్రాయాలను వెల్లడించగా, ఇందులో 231 మంది మద్యం దుకాణాల ఏర్పాటుకు అనుకూలంగా, 94 మంది వ్యతిరేకంగా చెప్పారు. ఈ నివేదికను ఐటీడీఏ పీఓకు అందజేస్తామని ఎంపీడీఓ రమాదేవి ప్రకటించారు. హైకోర్టు తీర్పును ధిక్కరిస్తే ఎలా..? భద్రాచలంలో మద్యం దుకాణాల ఏర్పాటుపై హైకోర్టు స్టే విధించినా, అధికారులు అత్యుత్సాహం చూపుతూ గ్రామసభ ఏర్పాటు చేయడంపై సీపీఎం పట్టణ కార్యదర్శి ఎంబీ నర్సారెడ్డి, వైఎస్సార్సీపీ బీసీ సెల్ కమిటీ సభ్యులు కడియం రామాచారి, పంచాయతీ వార్డు సభ్యులు బండారు శరత్, కొండరెడ్ల సంఘం నాయకులు ముర్ల రమేష్, ఆదివాసీ నాయకులు మడవి నెహ్రూ, కొర్సా చినబాబు దొర, కుంజా రమాదేవి, టీడీపీ పట్టణ అధ్యక్షులు కుంచాల రాజారామ్‌తో పాటు పలువురు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై సర్పంచ్ శ్వేత కల్పించుకొని తప్పు మాది కాదని, ఐటీడీఏ పీఓ, కలెక్టర్దేనన్నారు. గ్రామసభను మళ్లీ నిర్వహించమని వారు ఆదేశించటంతోనే ఇలా చేస్తున్నామని, ఏదైనా ఉంటే వారి తోనే చెప్పుకోవాలని సమాధానం ఇచ్చారు. హైకోర్టు స్టే విధించినట్లు తమకు సమాచారం లేదని ఎంపీడీఓ రమాదేవి, ఎక్సైజ్ సీఐ రాంకిషన్ వెల్లడించారు. దీనిపై ఆయా పార్టీల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో గ్రామసభలో కోరం సరిపోలేదని, సభను రద్దు చేసినట్లు ఎంపీడీఓ రమాదేవి ప్రకటించారు. కాగా సిండికేట్ వ్యాపారులు తమ దుకాణాలు బంద్ చేసుకుని గ్రామ సభకు ప్రజలను తరలించడం గమనార్హం. -
408 మద్యం షాపులకు లెసైన్స్
- 154 షాపులకు దరఖాస్తులు నిల్ - 80 షాపులకు ఒకే ఒక్క దరఖాస్తు - దరఖాస్తు రుసుం ద్వారా రూ. 14.89 కోట్ల ఆదాయం కాకినాడ క్రైం : జిల్లాలో 562 మద్యం షాపులకు గాను 408 షాపులకు మాత్రమే లెసైన్స్‌లు మంజూరయ్యాయి. లక్కీడిప్ ద్వారా వ్యాపారులకు ఈ షాపులను కేటాయించారు. జిల్లాలో 555 మద్యంషాపులు ఉండగా రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలం డివిజన్లోని 7 షాపులు కొత్తగా చేరాయి. దాంతో వీటి సంఖ్య 562కు చేరింది. 154 షాపులకు దరఖాస్తులేవీ అందలేదు. రెండేళ్ల క్రితం జారీ చేసిన మద్యంషాపుల లెసైన్స్‌ల గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుండడంతో కొత్తగా లెసైన్స్‌ల మంజూరుకు ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. గతసారి 555 షాపులకు దరఖాస్తులు ఆహ్వానించగా 434 షాపులకు 4500 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దఫా 562 షాపులకుగాను 408 షాపులకు మాత్రమే 5,957 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాజమండ్రి డివిజన్లో 96 షాపులకు 1,654, కాకినాడ డివిజన్లో 149 షాపులకు 2,563, అమలాపురం డివిజన్లో 163 షాపులకు 1,740 దరఖాస్తులు అందాయి. కాకినాడ నార్త్ స్టేషన్ పరిధిలోని ఒక షాపునకు అత్యధికంగా 117 దరఖాస్తులు వచ్చాయి. రాజమండ్రి డివిజన్లో15 షాపులకు, కాకినాడ డివిజన్లో 23 షాపులకు, అమలాపురం డివిజన్లో 42 షాపులకు ఒక్కో దరఖాస్తు మాత్రమే వచ్చాయి. భద్రాచలంలోని ఏడు షాపులకు గాను రెండు షాపులకు మాత్రమే దరఖాస్తులు అందాయి. మిగిలిన 154 షాపులకు మరోమారు దరఖాస్తులు ఆహ్వానించవచ్చని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది కేవలం మద్యంషాపుల దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి రూ. 14.89 కోట్ల ఆదాయం లభించింది. లక్కీడిప్ ద్వారా కేటాయింపు మద్యం షాపుల లెసైన్స్‌లను లక్కీడిప్ ద్వారా వ్యాపారులకు కేటాయించారు. కాకినాడ అంబేద్కర్ భవన్లో భారీ ఏర్పాట్ల మధ్య శనివారం డీఆర్ఓ బి. యాదగిరి రాజమండ్రి డివిజన్లోని షాపులకు లక్కీ డ్రా తీశారు. అలాగే కాకినాడ డివిజన్‌కు కాకినాడ ఆర్డీఓ అంబేద్కర్, అమలాపురం డివిజన్‌కు జెడ్పీ సీఈఓ భగవాన్ లక్కీడిప్ తీశారు. లక్కీ డిప్లో షాపులు దక్కించుకున్న వారికి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ లెసైన్స్‌లు అందజేశారు. భారీ బందోబస్తు జిల్లా నలుమూలల నుంచి సుమారు ఆరు వేల మంది వ్యాపారులు, వారి అనుచరులు కాకినాడ అంబేద్కర్ భవన్‌కు చేరుకోవడంతో డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కర రెడ్డి నేతృత్వంలో సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతబస్టాండు సెంటర్ నుంచి వార్ఫు రోడ్డు మీదుగా ట్రాఫిక్ మళ్లించారు. -
‘ఫుల్’గా దరఖాస్తులు
విజయనగరం రూరల్ : మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు వెల్లువెత్తారుు. మేము సైతం అంటూ మహిళలు కూడా దరఖాస్తు చేయడం ఆసక్తి రేకెత్తించింది. చంటి బిడ్డలతో వచ్చి మరీ మహిళలతో భర్తలు దరఖాస్తు చేరుుంచారంటే మద్యం దుకాణాల్లో లాభం ఏ స్థారులో ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆఖరి రోజు శుక్రవారం ఒక్క రోజే 400కు పైగా దరఖాస్తులు అందారు. 2014-2015 సంవత్సరానికి సంబంధించి మద్యం దుకాణాలు కేటాయించేందుకు దరఖాస్తుల స్వీకరణకు ఆఖరి రోజైన శుక్రవారం దరఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లాలో 202 మద్యం దుకాణాలను కేటాయించేందుకు ఈ నెల 23న ఎక్సైజ్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి 27 వరకు దరఖాస్తులు స్వీకరించేందుకు గడువు విధించింది. అయితే శుక్రవారం దరఖాస్తులు స్వీకరించేందుకు ఆఖరిరోజు కావడంతో దరఖాస్తుదారులు పోటెత్తారు. పట్టణంలోని నాయుడు ఫంక్షన్ హాల్లో దరఖాస్తులు స్వీకరించేందుకు ఎక్సైజ్ అధికారులు ఏర్పాట్లు చేయగా... శుక్రవారం అమావాస్య కావడంతో మధ్యాహ్నం రెండు గంటల వరకు దరఖాస్తుదారులు ఆసక్తి చూపలేదు. తరువాత ఒక్కసారిగా వందలాది మంది దరఖాస్తుదారులు రావడంతో అక్కడి ప్రాంతమంతా కిటకిట లాడింది. శుక్రవారం ఒక్కరోజే 400లకు పైబడి దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉంటేనే దరఖాస్తుదారులను లోపలికి అనుమతించారు. గురువారం విజయనగ రం యూనిట్ పరిధిలో 35 దుకాణాలకుగాను 76 దరఖాస్తులు రాగా, పార్వతీ పురం యూనిట్లో 33 మద్యం దుకాణాలకు 78 దరఖాస్తులు వచ్చాయి. మూడు రోజుల్లో 95 దుకాణాలకు 187 దరఖాస్తులు రాగా, ఆఖరి రోజు 400లకు పైబడి దరఖాస్తులు వచ్చాయని విజయనగరం ఎక్సైజ్ సూపరిం టెండెంట్ పి.శ్రీధర్ తెలిపారు. దరఖాస్తులు ఎక్కువగా రావడం తో అర్థరాత్రి వరకు అధికారులు దరఖాస్తులను లెక్కించారు. మహిళలు సైతం... మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మహిళలు దరఖాస్తులు చేసుకున్నారు.సుమారు 20 నుంచి 30 మంది వరకు మహిళలు దరఖాస్తులు అందజేశారు. నేడు లాటరీ... మద్యం దుకాణాలకు సంబంధించి శనివారం నాయుడు ఫంక్షన్ హాల్లో కలెక్టర్ కాంతిలాల్ దండే లాటరీని తీస్తారని ఈఎస్ పి.శ్రీధర్ తెలి పారు. కలెక్టర్ ఆడిటోరియంలో భవన మరమ్మతులు జరుగుతున్నందున వేదిక స్థలాన్ని నాయుడు ఫంక్షన్ హాల్‌కు మార్చటం జరిగిందని చెప్పారు. లాటరీ కార్యక్రమం మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభిస్తామని తెలిపారు. -
తెగ తాగేస్తున్నారు..
జిల్లాలో గుక్కెడు మంచినీటికి కరువు ఉందేమో కాని మద్యానికి లేదు. ఊరు, పట్టణం అని తేడాలేకుండా మద్యం ఏరులై పారుతోంది. మద్యం అమ్మకాలు ఏటా పెరుగుతున్నాయి. గడిచిన ఐదేళ్లలో జిల్లాలో మద్యం అమ్మకాలు రెట్టింపయ్యాయి. మద్యం ప్రియులు తెగ తాగేస్తుండడంతో సర్కారు ఖజానా నిండుతోంది. వరుసగా వచ్చిన ఎన్నికల సందర్భంగా మద్యం అమ్మకాలపై ఆంక్షలు ఉన్నప్పటికీ అమ్మకాలు ఏమాత్రం తగ్గలేదు. నిజామాబాద్ క్రైం : జిల్లాలో మద్యాన్ని మంచినీళ్లలా తాగేస్తున్నారు. నాలుగేళ్లలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. కోట్లాది రూపాయల మద్యం వ్యాపారం జరిగింది. గత మార్చి నెల నుంచి మే వరకు జిల్లాలో ఎన్నికల సందర్భంగా మద్యం అమ్మకాలపై ఆంక్షలు ఉన్నప్పటికీ అమ్మకాలు ఏమాత్రం తగ్గలేదు. పైగా మే నెలలో రికార్డు స్థాయిలో రూ. 57.90 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఎన్నికల కమిషన్ ఆంక్షలు లేకుంటే ఇంకా పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగి ఉండేవి. ఏటా పెరుగుతున్న అమ్మకాలు... జిల్లాలో మద్యం అమ్మకాలు ఏటా పెరుగుతున్నాయి. గడిచిన ఐదేళ్లలో (2009-10) మధ్య జిల్లాలో రూ. 253.13 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయి. ఆ సంఖ్య ఇప్పుడు రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం మే 2014 వరకు మద్యం అమ్మకాలు రూ. 494.51 కోట్లకు పెరిగాయి. దీనిని బట్టి మద్యాన్ని ఏ విధంగా తాగేస్తున్నారో అర్థమవుతోంది. 2009 -10లో రూ. 253.13 కోట్లు, 2010-11లో రూ. 296.55 కోట్లు, 2011-12లో రూ. 329.86 కోట్లు, 2012-13లో రూ. 396.40 కోట్లు, 2013 -14(జూన్ 2013 నుంచి మే నెల 2014 వరకు) రూ. 494.51 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. జూన్ నెలలో కనీసం రూ. 65 కోట్లకు పైగా అమ్మకాలు జరుగుతాయని ఎక్సైజ్‌శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యాపారులకు షాకిచ్చిన ఈసీ... ఈ ఏడాది ఎన్నికల సీజన్ కావటంతో మద్యం అమ్మకాలతో అందినకాడికి సొమ్ము చేసుకుందామని అనుకున్న వ్యాపారులకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఈసారి మద్యం రహిత ఎన్నికల నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ చెప్పినట్లే చేసి చూపించింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి మద్యం విక్రయాలపై ఆంక్షలు పెరిగాయి. గతేడాది ఏ నెలలో ఎంత మద్యం అమ్మకాలు జరిపారో ఈ సంవత్సరం అంతే మద్యం దుకాణాలకు కేటాయించారు. దీంతో మార్చి, ఏప్రిల్, మే నెలలో మద్యం అమ్మకాలు పడిపోయాయి. కొన్ని దుకాణాల్లో మద్యం స్టాక్ లేకపోవటంతో మూసి ఉంచుకున్నారు. లేకుంటే మద్యం అమ్మకాలు ఇంకా బాగా జరిగేవి. అయినప్పటికీ కొందరు వ్యాపారులు మహారాష్ట్ర,కర్ణాటల రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యాన్ని తెప్పించి దందా సాగించారు. ఈనెల 30 నాటికి మద్యం దుకాణాల లెసైన్స్ కాల పరిమితి పూర్తవుతుండగా, జూలై ఒకటి నుంచి కొత్త టెండర్లు రానున్నాయి. పాత పాలసే ... టెండర్ విధానానికి స్వస్తి చెబుతూ జనాభా ప్రకారం ధరను నిర్ణయిస్తూ ప్రభుత్వం రెండేళ్ల క్రితం నూతన మద్యం పాలసీని అమల్లోకి తెచ్చింది. 2013-14లో 142 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో 17 దుకాణాలకు దరఖాస్తులు రాలేదు. మిగిలిన 125 దుకాణాలకు దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులు ఎక్కువగా వచ్చిన దుకాణాలకు డ్రా తీసి దుకాణాలు కేటాయించారు. దరఖాస్తుకు రూ. 25 వేల చలానాగా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించరు. గతేడాది మిగిలి పోయిన దుకాణాలకు తిరిగి టెండర్లు నిర్వహించటంతో ఐదు దుకాణాలకు దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది 130 దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించగా, 127 దుకాణాలకు 993 దరఖాస్తులు వచ్చాయి. మిగిలిన మూడు దుకాణాలకు తిరిగి టెండర్లు నిర్వహించనున్నారు. ఈ ఏడాది వచ్చిన 993 దరఖాస్తుల ద్వారానే ఎక్సైజ్ శాఖకు రూ. 2.32 కోట్ల ఆదాయం సమకూరింది. -
కిక్కు తగ్గింది..!
కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరైన మద్యం టెండర్లకు జిల్లాలో ఈ సారి ఆశించిన స్పందన రాలేదు. గతేడాది 170 దుకాణాలకు 2,404 దరఖాస్తులు రాగా ఈ సారి 194 మద్యం దుకాణాలకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించగా, 181 దుకాణాలకు 1930 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. తుగ్గలి, ఉల్లిందకొండ, పులకుర్తి, నందికొట్కూరు, డోన్‌లో 2, సున్నిపెంటలో 2, ఆత్మకూరులో 2, కోవెలకుంట్లలో 1, బనగానపల్లె 2 షాపులకు దరఖాస్తులు రాలేదు. గత రెండేళ్ల నుంచి ప్రభుత్వం లాటరీ పద్ధతిని అమలు చేస్తోంది. నాటి నుంచి ఆశించిన మేరకు దరఖాస్తులు రావడం లేదు. గతేడాది మిగిలిపోయిన 20 దుకాణాలకు వ్యాపారులకు అప్పగించేందుకు పలుమార్లు టెండర్లు ఆహ్వానించినా ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరికి ప్రభుత్వమే జిల్లాలోని తొమ్మిది కేంద్రాల్లో ఔట్లెట్ల పేరుతో దుకాణాలను తెరిచి నిర్వహించింది. ఈసారి కూడా ఖచ్చితంగా గరిష్ట ధరకే విక్రయాలు జరపాలనే నిబంధన విధించడం బెల్టు షాపులకు విక్రయాలు లేకపోవడం వంటి కారణాల రీత్యా దరఖాస్తు చేయడానికి వ్యాపారులు వెనుకడుగు వేశారు. బెల్టు షాపుల్లో 24 గంటలు మద్యం అందుబాటులో ఉండి 50 నుంచి 100 శాతం అధిక ధరలకు విక్రయించుకునే వీలుంది. అయితే బెల్టు షాపుల రద్దుపై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తే పెట్టుబడులు కూడా రావన్న ఉద్దేశంతో వ్యాపారులు వెనుకడుగు వేశారన్న చర్చ జరుగుతోంది. లెసైన్స్ ఫీజుకు ఏడు రెట్లు అమ్మకాలు జరిపే విక్రయాలపై తొమ్మిది శాతం ప్రివిలేజ్ ఫీజు, వ్యాట్‌ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. దీంతో లాభాలు తగ్గిపోయి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వ్యాపారులు అంచనాకు వచ్చారు. డిమాండ్ ఉన్న దుకాణాలకు మాత్రం పదుల సంఖ్యలో దరఖాస్తులు చేశారు. ఏడాదికి రూ.6 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న దుకాణాలకు మాత్రం వ్యాపారులు పోటీ పడ్డారు. మొదటి రెండు రోజులు 474 దరఖాస్తులు రాగా చివరి రోజు శుక్రవారం, అమావాస్య అయినప్పటికీ సెంటిమెంట్‌ను సైతం లెక్క చేయకుండా జిల్లా నలుమూలల నుంచి వ్యాపారులు జిల్లా కేంద్రానికి తరలివచ్చి 1456 దరఖాస్తులను సమర్పించారు. చివరి రోజు కావడంతో మధ్యాహ్నం మూడు గంటల సమయానికి కార్యాలయానికి వచ్చిన వారందరినీ మైదానంలో క్యూలో నిలబెట్టి గేట్లు మూసి వేసి దరఖాస్తులను స్వీకరించారు. ఈనెల 24వ తేదీ ప్రారంభమైన ఈ ప్రక్రియ శుక్రవారం రాత్రి పొద్దు పోయే దాకా కొనసాగింది. గతంలో దుకాణాలు పొందిన వారిలో కొందరు ఈసారి కూడా తమ చేయి దాటకూడదని భావించి అనుచరులు, బంధుగణంతో పదుల సంఖ్యలో దరఖాస్తులు వేయించారు. గతంలో జి.శింగవరం, రేమటలో ఉన్న దుకాణాలను కర్నూలు నగరానికి మార్పు చేశారు. ఇదిలా ఉండగా శనివారం.. లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించనున్నారు. ఇందుకు జిల్లా పరిషత్ సమావేశ భవనంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా నలుమూలల నుంచి దరఖాస్తుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున అక్కడ భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
రెడీ.. ‘చార్జ్’షీట్!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:బినామీల పేరిట లెసైన్సులు.. సిండికేట్‌గా ఏర్పడి ధరలను ఇష్టారాజ్యంగా పెంచేయడం.. తప్పుల తడకలుగా రికార్డుల నిర్వహణ.. ఇలా చెప్పుకొంటూపోతే రెండేళ్ల క్రితం వరకు మద్యం మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోయింది. ఎక్సైజ్, పోలీసులు అధికారులు, సిబ్బంది అండ చూసుకొని మద్యం మారాజులు తెగ రెచ్చిపోయారు. రెండేళ్లక్రితం అవినీతి నిరోధక శాఖ పంజా విసిరి, దాడులు చేయడంతో వీరి బండారం బయటపడింది. అప్పటినుంచి కొనసాగుతున్న ఈ కేసు విచారణ ఎట్టకేలకు తది దశకు చేరుకుంది. విచారణాధికారులు చార్జిషీట్లు కూడా ఇటీవలే దాఖలు చేయడంతో ఇక హైకోర్టు తీర్పు ఇవ్వడం.. మద్యం బాస్‌లు కటకటాలు పాలు కావడమే మిగిలింది. ఒక్కసారి వెనక్కి వెళితే.. జిల్లా వ్యాప్తంగా 38 మండలాల్లోని సుమారు 232 మద్యం దుకాణాల్లో అధిక శాతం సిండికేట్ల చేతుల్లోనే ఉండేవి. వీటిలో చాలా దుకాణాలు తెల్లరేషన్ కార్డుదారులను బినామీలుగా పెట్టి బడాబాబులు లెసైన్సు పొందినవే. ఇలా గుత్తగా గుప్పిట్లో పెట్టుకున్న షాపుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలు అమలు చేయడం మానేశారు. సిండికేట్ నిర్ణయించిన అధిక ధరలకు అమ్మకాలు సాగించి యథేచ్ఛగా మందుబాబులను దోచుకున్నారు. అమ్మకాలకు సంబంధించి రికార్డుల నిర్వహణలోనూ చేతివాటం చూపారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. ఎక్సైజ్, పోలీస్ అధికారులకు లంచాల ముడుపులు కట్టి వారి చేతులు కట్టేశారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం ఏసీబీ విస్తృత దాడులు జరిపి మద్యం మాఫియా భరతం పట్టింది. శ్రీకాకుళం జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ దాడుల్లో పలువురు జైలుపాలు కాగా.. మరెంతోమందిపై విచారణ ప్రారంభమైంది. అయితే ఏళ్ల తరబడి విచారణ కొనసాగుతుండటంపై సాక్షాత్తు హైకోర్టు మొట్టికాయిలు వేసింది. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించడంతో ఉరుకులు, పరుగుల మీద ఏసీబీ అధికారులు పని ముగించారు. ఎంతమందిపై కేసులు మద్యం షాపుల్లో పనిచేసిన అకౌంటెంట్లు, తెల్ల రేషన్కార్టుదారులతో పాటు ముగ్గురు మద్యం వ్యాపారులు, సీఐ నుంచి ఉన్నతాధికారి స్థాయి వరకు ఎక్సైజ్ అధికారులు, పలు స్టేషన్ల పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లపైనా ఏసీబీ కేసులు నమోదు చేసింది. కొందరిని జైలుకు కూడా పంపించారు. ఇప్పుడు పరిస్థితి మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన ఏర్పడిన తరువాత పెండింగ్‌లో ఉన్న కేసులను ‘శాంక్షన్ ఆర్డర్ల’ పేరిట పరిష్కరించాలని నిర్ణయించడంతో రాష్ట్రంలోని దాదాపు అన్ని కేసులూ ముగింపు దశకు వచ్చాయి. అందులో భాగంగానే మద్యం కేసులోనూ చార్జిషీటు దాఖలైంది. ప్రస్తుత పరిస్థితి ఇదీ కేసు పూర్తయితేనే రాష్ట్ర విభజన నేపథ్యంలో బదిలీ కావాల్సిన సిబ్బందిని వారి ప్రాంతాలకు పంపిస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో అధికారులూ అంతే స్పీడుగా విచారణ పూర్తిచేశారు. అయితే పలువురు ఎక్సైజ్ సిబ్బంది, పోలీసులపై ట్రైబ్యునల్, బెనిఫిట్ ఆఫ్ డౌట్, డిపార్టమెంటల్ యాక్షన్, డిసిప్లినరీ యాక్షన్లు కోరుతూ ఆయా శాఖల విభాగాధిపతులకు లేఖలు రాశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ కొటారు రామకృష్ణ, కానిస్టేబుల్ అప్పన్న, మద్యం వ్యాపారి ఓరుగంటి ఈశ్వరరావు, ముగ్గురు అకౌంటెంట్లకు త్వరలోనే జైలు శిక్ష ఖాయమవుతుందని ఏసీబీ అధికారులే చెబుతున్నారు. ‘ఓ కానిస్టేబుల్ జీతం రూ.15వేలు కాగా.. అతనికి నెలనెలా వచ్చే మామూళ్లు సుమారు రూ.30 వేలు ఉన్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చని’ ఓ దర్యాప్తు అధికారి వ్యాఖ్యానించారు. మరికొందరు కిందిస్థాయి సిబ్బంది మద్యం మామూళ్లతోనే వాహనాలు కొనుగోలు చేసి ప్రభుత్వ శాఖలకు అద్దెకివ్వడంతోపాటు మద్యం దుకాణాల్లో భాగస్వాములుగా ఉండేవారని ఆ అధికారి చెప్పారు. అటువంటి వారెవరూ ఈ కేసు నుంచి తప్పించుకోలేరని ఆయన అభిప్రాయపడ్డారు. అందరికీ జైలు శిక్ష పడకపోయినా.. ఉద్యోగం నుంచి తొల గింపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిలుపుదల వంటి శిక్షలు తప్పవని అన్నారు. -
మద్యం దుకాణాలకు రెండో రోజూ దరఖాస్తులు నిల్
విజయనగరం రూరల్: జిల్లాలోని 202 మద్యం దుకాణాలకు 2014-15 సంవత్సరానికి సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఎకై్సజ్ అధికారులు విడుదల చేసిన నోటిఫికేషన్‌కు రెండో రోజూ స్పందన కరువైంది. ప్రభుత్వం నూతన మద్యం విధానం ప్రకటించడంతో ఎకై్సజ్‌శాఖ అధికారులు జిల్లాలోని 202 మద్యం దుకాణాలు, 29 బార్లుకు సోమవారం గజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తులను సర్కిల్ వారీగా స్వీకరించడానికి కలెక్టరేట్ సముదాయంలోని ఎకై్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో బాక్సులను ఏర్పాటు చేశారు. ఈ నెల 27 మధ్యాహ్నం మూడు గంటలతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుంది. గత ఏడాది కంటే రూ.2.86కోట్ల అదనపు ఆదాయం నూతన మద్యం విధానం ద్వారా మద్యం దుకాణాలకు పెంచిన లెసైన్స్ ఫీజుల రూపంలో గత ఏడాది కంటే అదనంగా 2.86 కోట్ల రూపాయలు ఎకై్సజ్ శాఖకు సమకూరనుంది. గత ఏడాది లెసైన్సు ఫీజుల రూపంలో ఎకై్సజ్ శాఖకు సుమారు రూ.80 కోట్ల ఆదాయం లభించింది. ఈ ఏడాది 86 కోట్ల రూపాయల పైబడి ఆదాయం లభించనుంది. కొన్ని మద్యం దుకాణాలకు, బార్లకు లెసైన్స్ ఫీజును పెంచారు. గత ఏడాది రూ.64 లక్షలు, 32.5 లక్షలు ఉన్న దుకాణాల లెసైన్స్ ఫీజులో ఎటువంటి మార్పు చేయలేదు. కొత్తవలస సర్కిల్ పరిధిలో ఒక దుకాణానికి 64 లక్షల లెసైన్స్ ఫీజును యథావిధిగానే ఉంచారు. రూ.32.5 లక్షల లెసైన్స్ ఫీజు ఉన్న దుకాణాల్లో విజయనగరం డివిజన్లో 77, పార్వతీపురం డివిజన్లో 42 ఉన్నాయి. 42 లక్షల లెసైన్స్ ఫీజు ఉన్న దుకాణాలు జిల్లాలో 44 ఉండగా వీటి లెసైన్స్ ఫీజును రూ.45 లక్షలుగా నిర్ణయించారు. గత ఏడాది రూ.34 లక్షల లెసైన్స్ ఫీజు ఉన్న దుకాణాలు జిల్లాలో 38 ఉండగా వీటి లెసైన్స్ ఫీజును రూ.36 లక్షలుగా నిర్ణయించారు. గత ఏడాది రూ.35 లక్షల లెసైన్స్ ఫీజు ఉన్న బార్లు 26 ఉండగా వీటి ఫీజును రూ.38 లక్షలుగా నిర్ణయించారు. రూ.25 లక్షల లెసైన్స్ ఫీజు ఉన్న బార్ల లెసైన్స్ ఫీజులో ఎటువంటి మార్పులేదు. కాగా, లాటరీ ద్వారా లెసైన్స్ దక్కించుకున్న వ్యాపారులు తప్పనిసరిగా కంప్యూటరైజ్డ్ బిల్లింగ్ మిషన్ మద్యం దుకాణాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఎకై్సజ్ సూపరింటెండెంట్ పి.శ్రీధర్ తెలిపారు. పర్మిట్ రూమ్ ఏర్పాటుకు రూ.రెండు లక్షల లెసైన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. లేనిపక్షంలో లెసైన్స్‌లు మంజూరు చేయడం జరగదన్నారు. -
‘మద్యం అమ్మకాల్లో కాంగ్రెస్, టీడీపీ ఒక్కటే’
గజపతినగరం రూరల్: రాష్ట్రంలోని మద్యం అమ్మకాల్లో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఒకే విధానాన్ని అమలు చేస్తున్నాయని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీషెట్టి బాబ్జీ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మద్యం అమ్మకాల విధానంలో కాం గ్రెస్, టీడీపీ ప్రభుత్వాలకు ఎటువంటి తేడా లేదన్నారు. తమిళనాడు తరహాలో మద్యం అమ్మకాలు చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట తప్పి లాటరీ పద్ధతి చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొత్త పాలసీ ద్వారా మద్యం అమ్మకాలు చేపట్టడానికి సమయం చాలకపోతే ఇప్పుడున్న పాలసీని కొద్ది రోజులు పొడిగించి, తరువాత కొత్త పాలసీ అమలు చేయవచ్చున న్నారు. కానీ అవేవీ కాకుండా ప్రభుత్వం రాష్ట్రంలోని 4380 మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఇందులో 2300 మద్యం దుకాణాలకు లెసైన్స్ ఫీజు పెంచారని విమర్శించా రు. ఆయనతో పాటు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దేవర ఈశ్వర రావు, గజపతినగరం, బొండపల్లి మండలాల పార్టీ అధ్యక్షులు ఆరిశెట్టి రామకృష్ణ, ఎంఎస్ఎన్ రాజు ఉన్నారు.