సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మద్యం దుకాణాల యజమానులు ను తుంగలో తొక్కి రూటు మార్చి వ్యాపారం చేస్తున్నారు. మద్యం దుకాణాల ముందు ఎంఆర్‌పీ పట్టికలను ప్రదర్శిస్తూనే మాయాజాలం చేస్తున్నారు. డిపో ల నుంచి లెసైన్స్ దుకాణాలకు తరలించే మద్యంలో కొంత మద్యాన్ని నేరుగా బెల్టుషాపులకు తరలించి 20 శాతం అధిక ధరల కు విక్రయిస్తున్నారు. కొత్త మార్గదర్శకాలు
అమలులోకి వచ్చినప్పటికీ జిల్లాలో ‘సిండికేట్’ దందాకు మాత్రం తెరపడటం లేదు.
తాజా మాజీ సిండికేట్లు మద్యం అక్రమ వ్యా పారాన్ని చాపకింది నీరులా కొనసాగిస్తున్నారు. ఇందుకోసం అబ్కారీ, పోలీసు శాఖలకు చెందిన కొందరికి పెద్ద మొత్తంలో మామూళ్లు ముట్టుచెప్తున్నట్లు సమాచారం. ప ల్లెలలో బెల్టుషాపుల దందా యథేచ్ఛగా సాగడానికి వారే కారణమన్న చర్చ సాగుతోంది. డైనమిక్ కలెక్టర్‌గా పేరున్న రొనాల్డ్ రోస్ జోక్యం చేసుకుంటే దీనికి అడ్డుకట్ట పడుతుందని పలువుని అభిప్రాయంగా ఉంది.
యథా సిండికేట్, తథా ఆబ్కారీ
మద్యం విక్రయాలపై ప్రభుత్వ విధానం మారింది. క్షేత్రస్థాయిలో మాత్రం ‘వ్యాపారం’ తీరు మారలేదు. వ్యాపారులు సిండికేట్ వీడలేదు. మామూళ్లు ఆగడం లేదు. ఏసీబీ దాడుల నేపథ్యంలో ‘మా ఖర్చులు మాకుంటాయి కదా, చూడండి’ అంటూ సున్నితంగా మొదలైన ఎక్సైజ్, పోలీసుల మామూళ్ల దందా మళ్లీ బెదిరింపుల స్థాయి కి చేరింది. దీంతో సిండికేట్ వ్యాపారులు అడుగడుగునా బెల్టుషాపులను నిర్వహిస్తూ ‘గరిష్ట చిల్లర ధర’కు వక్రభాష్యం చెప్తున్నారు.
ఎమ్మార్పీ ఉల్లంఘనలు యథేచ్చగా సాగుతున్నాయి. సగటున 20-25 శాతం ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. క్వార్టర్ సీసా ధర రూ.65 ఉంటే.. రూ.75కి విక్రయిస్తున్నారు. గతంలో ఏసీబీ దాడుల్లో ఈ బండారం బయటపడింది. నిజామాబాద్, కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల పరిధిలోని 100 గ్రామ పంచాయతీలలో 148 బెల్టుషాపులు ఉన్నట్లు ఇటీ వల ఓ స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వేలో తేలింది. ఈ లెక్కన 718 గ్రామ పంచాయతీలు, వాటి శివారు గ్రామాలలో ఎన్ని బెల్టుషాపులుంటాయో అర్థం చేసుకోవచ్చు.
జిల్లావ్యాప్తంగా లెసైన్సులు పొందిన 130 బ్రాందీషాపులు, 14 బార్లు, మూడు క్లబ్బులున్నాయి. ఆయా షాపుల నుంచి రెన్యూవల్ మొదలుకొని పండగలు, పబ్బాల పేరిట గుం జుతున్న మామూళ్లతో సమానంగా బెల్టుషాపుల నుంచి వస్తున్నట్లు ఆ శాఖకు చెందిన కొందరు బహిరంగంగానే మాట్లాడుతున్నారు.
వెయ్యికి పైగా బెల్టుషాపులు
జిల్లాలో వెయ్యికి పైగా బెల్టుషాపులు ఉన్నట్లు అధికారుల లెక్కలే చెప్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూరు, బోధన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బాల్కొండ, జు క ్కల్, నిజామాబాద్ రూరల్ తదితర నియోజకవర్గాల పరిధిలో విచ్చలవిడిగా బెల్టుషాపులు నడుస్తున్నాయి. వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘించినా అబ్కారీ అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు.
మద్యం దుకాణాల వద్ద లూజ్ అమ్మకాలు చేయకూడదన్న నిబంధనలు ఎవరూ పట్టించుకోవడం లేదు. పర్మిట్ గదులను అ న ధికారికంగా ఏర్పాటు చేసుకుని అమ్మకాలు చేపడుతున్నారు. ప్రతి దుకాణం ముందు ఖచ్చితంగా ధరల పట్టికను సూచించే బోర్డును ఏర్పాటు చేయాలన్న నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఎలక్ట్రానిక్ బిల్లులను వినియోగదారులకు అందజేయాలని పేర్కొన్నా ఎవరూ పాటించడం లేదు. తమ పరిధిలో ఎక్కడా బెల్లు దుకాణాల్లేవని, అక్రమ మద్యం అమ్మకాలు జరగడం లేదంటూ ప్రతి ఎస్‌హెచ్‌ఓ కూడా అఫిడవిట్ సమర్పించాలన్న ఆదేశాలను ఎక్సైజ్ అధికారులే అమలు చేయడం లేదు. ప్రతి దుకాణం ముందు గ్రిల్స్ ఏర్పాటు చేయాలని నిబంధనలున్నా. ఒకటి రెండు చోట్ల తప్ప ఏ దుకాణం వద్దా ఇలాంటి ఏర్పాట్లు లేవు. దసరా నేపథ్యంలో, కలెక్టర్ జోక్యం చేసుకుని ఈ దందాను నివారించాలని తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఊగుతున్న పల్లెలు
Published Mon, Sep 29 2014 2:19 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement