belt shops
-
ఇదీ చంద్రబాబు సర్కార్ డొల్లతనం
సాక్షి, ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లాలో చంద్రబాబు సర్కార్ డొల్లతనం బయటపడింది. బెల్టు షాపులకు ఐదు లక్షల జరిమానా విధించాలంటూ సీఎం చంద్రబాబు చెబుతుంటే.. ధర్మవరంలో మాత్రం డబ్బులు తీసుకుని బెల్ట్ షాపులకు అనుమతి ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గం లో ఓ టీడీపీ నేత వీడియో వైరల్‌గా మారింది. డబ్బులు తీసుకుని బెల్టుషాపులకు అనుమతిస్తున్నారంటూ ధర్మవరం టీడీపీ నేత మరస హరి ఆరోపిస్తున్నారు.పోలీసులు అరెస్ట్ చేస్తే ఏ ఒక్కరూ పట్టించుకోలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి ముఖ్య నేతలు, అధికారులు లంచం తీసుకుని బెల్ట్ షాపులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తల వద్ద డబ్బు తీసుకుని మద్యం బెల్ట్ షాపులు కేటాయించడం సరికాదన్నారు. బీజేపీ నేతలతో మాట్లాడితే.. టీడీపీలో ఉండొద్దంటున్నారంటూ ధర్మవరం టీడీపీ నేత మరస హరి చెప్పుకొచ్చారు. -
ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలి
సాక్షి, అమరావతి: మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీకి మించి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మద్యం ధరలు, ఇసుక లభ్యత–సరఫరాపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మద్యం దుకాణం యజమానులు ఎవరైనా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తే ఊపేక్షించేందిలేదన్నారు.ఎమ్మార్పీకి కంటే ఎక్కువ రేటుకు మద్యం విక్రయిస్తూ, బెల్డ్ షాపులను ప్రోత్సహిస్తూ పట్టుబడితే తొలిసారిగా రూ.5 లక్షలు జరిమానా విధించాలన్నారు. అదే తప్పును పునరావృతం చేస్తే దుకాణం లైసెన్స్‌ను రద్దు చేయాలని ఆదేశించారు. ప్రతి దుకాణంలో సీసీ కెమెరాలు, ఫిర్యాదుల కోసం ఒక టోల్ ఫ్రీ నంబర్, ధరల పట్టికను ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఇసుక లభ్యతను పెంచాలని సీఎం సూచించారు. ఇసుకలో అక్రమాలు జరిగితే దానికి అధికారుల పైనే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
నలభై ఏళ్లుగా మద్యానికి దూరం.. కాట్రేవ్
చౌటుప్పల్ రూరల్: ఇప్పుడు ఏ పల్లెలో చూసినా బెల్ట్ షాపుల జోరుతో మద్యం ఏరులై పారుతోంది. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కాట్రేవ్ గ్రామంలో మాత్రం మద్యం జాడే కనిపించదు. గ్రామంలో నాలుగు దశాబ్దాలుగా సంపూర్ణ మద్య నిషేధం అమలవుతోంది. అప్పట్లో గ్రామ పెద్దలు నిర్ణయించిన కట్టుబాటును ఇప్పటికీ కొనసాగిస్తూ.. తమ ప్రత్యేకతను నిలుపుకొంటున్నారు కాట్రేవ్ గ్రామ ప్రజలు. రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని గ్రామాల్లోనూ కొన్నేళ్లు మద్యం విక్రయాలు, వినియోగంపై నిషేధం పెట్టుకోవడం గమనార్హం. కాట్రేవ్లో అయితే సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతోంది.గ్రామ యువత కూడా దూరమే..కాట్రేవ్ గ్రామం ఒకప్పుడు ఆరెగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. ఐదేళ్ల కింద నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. సుమారు 700కుపైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో అంతా రైతులే. రోజంతా వ్యవసాయ పనుల్లో మునిగిపోతారు. సాయంత్రానికి ఇంటికొచ్చి సేదతీరుతారే తప్ప మద్యం జోలికి వెళ్లరు. ఈ గ్రామం నుంచి బయట పట్టణాల్లో ఉద్యోగం, ఉపాధి, చదువు కోసం వెళ్లిన యవత కూడా.. ఈ గ్రామానికి ఎప్పుడూ మద్యం తీసుకురారు. ఇక్కడ వినియోగించరు. మద్య నిషేధమేకాదు.. అభివృద్ధిలోనూ కాట్రేవ్ గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. పక్కనే ఉన్న దివిస్ పరిశ్రమ అందించే ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)’ నిధులతో గ్రామంలో ప్రతి వీధిలో సీసీ రోడ్లు, ఎల్ఈడీ లైట్లు, ప్రతి ఇంటికి శుద్ధిచేసిన సురక్షిత నీరు అందించేలా ఏర్పాటు చేసుకున్నారు. పక్కనే ఉన్న ఆరెగూడెంలోనూ రెండు దశాబ్దాలుగా మద్యం విక్రయాలు లేవు.గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామస్తుల సహకారంతోనే కొనసాగిస్తున్నా..నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ గ్రామంలో మద్యపానం అలవాటు లేదు. 40 ఏళ్ల కింద పెద్దలు పెట్టుకున్న కట్టుబాటును.. గ్రామస్తుల సహకారంతో కొనసాగిస్తున్నాం. అభివృద్ధిలోనూ ముందుకెళ్తున్నాం.– బచ్చ రామకృష్ణ మాజీ సర్పంచ్, కాట్రేవ్ -
బెల్టు షాపులంటూ గిల్టు కథనాలా?
సాక్షి, అమరావతి: అసలు బెల్టు షాపులు ఎవరు పెడతారు? వీటిని నిర్వహించేది లాభాపేక్షతోనే కదా? మరి షాక్ కొట్టే ధరలతో ప్రభుత్వమే పరిమిత సంఖ్యలో, నియమిత వేళల్లో మాత్రమే మద్యాన్ని విక్రయిస్తోందంటే సర్కారుకు లాభాపేక్ష లేనట్లే కదా? అయినా అసలు ప్రభుత్వానికి దుకాణాల్లో చిల్లరగా మద్యాన్ని అమ్ముకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఎక్కడైనా ఆ పరిస్థితి ఉందా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా? మరి రామోజీ ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు? గతంలో ఐదేళ్లు మత్తుగా పడుకుని ఇప్పుడే నిద్ర లేచారు కాబట్టేనా! టీడీపీ నేతలు ఎవరైనా వాళ్ల దుకాణాల్లో మద్యం అమ్ముతుంటే ఆయన ఫొటోలు తీశారా? అనే సందేహాలు వస్తున్నాయి. ఇప్పుడు 236 బెల్టు షాపులు లెక్క తేల్చానంటూ గుండెలు బాదుకుంటున్న ఆయన చంద్రబాబు హయాంలో 43వేల బెల్టు షాపులు ఏర్పాటైతే నోరెత్తకపోవడం గమ్మత్తుగా లేదా? సాధారణంగా ప్రైవేట్ దుకాణదారులు తాము అమ్ముకోవడంతోపాటు మరింత మద్యాన్ని తాగించేందుకు రకరకాల దుకాణాల్లో బెల్టు షాపులు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చి మద్యపానాన్ని నిరుత్సాహపరుస్తూ పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోనే విక్రయాలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను సైతం ఏర్పాటు చేసింది. బాబు హయాంలో ఏరులై పారిన మద్యం.. చంద్రబాబు హయాంలోటీడీపీ మద్యం సిండికేట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. గత సర్కారు వేలం ద్వారా 4,380 మద్యం దుకాణాలకు లైసెన్సులు కేటాయించగా వాటన్నింటిని టీడీపీ నేతలే దక్కించుకున్నారు. ఒక్కో మద్యం దుకాణానికి అనుబంధంగా మరో 4,380 పర్మిట్ రూమ్‌లకు చంద్రబాబు అనుమతులు ఇచ్చారు. వాటికి అదనంగా టీడీపీ నేతలు 43 వేల బెల్ట్ దుకాణాలను తెరచి దోపిడీకి తెగబడ్డారు. గుడి, బడి తేడా లేకుండా వీధికి ఒకట్రెండు చొప్పున బెల్ట్ షాపులను తెరిచి మద్యం ఏరులై పారించారు. ఎమ్మార్పీ ధరల కంటే 25 శాతం వరకు అధిక ధరలకు అమ్ముకున్నా అడిగే నాథుడే లేడు. ఉక్కుపాదం మోపిన సీఎం జగన్ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మద్యం మాఫియాపై ఉక్కుపాదం మోపారు. 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్‌లను ఒకేసారి రద్దు చేశారు. 2019 అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వ పరం చేసేశారు. టీడీపీ హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు అధికారంగా విక్రయాలు సాగించేవి. అనధికారికంగా 24 గంటలూ విక్రయిలు సాగించాయి. ఇప్పుడు సమయాన్ని కుదించి ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకే విక్రయిస్తున్నారు. 2019లో రాష్ట్రంలో 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండగా ప్రస్తుతం 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలే ఉన్నాయి. ఇక 2019లో ఖరారు చేసిన 840 బార్లే ఇప్పటికీ ఉన్నాయి. -
అధికారంలోకి రాగానే బెల్టుషాపులు రద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాగానే బెల్టుషాపుల్ని రద్దు చేస్తామని, అక్రమ మద్యం ప్రభావాన్ని ఉక్కుపాదంతో అణచివే స్తామని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు. దశలవారీగా మద్యాన్ని నియంత్రిస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం కంటే ఆదాయం కోసం బీఆర్ఎస్ సర్కారు గ్రామగ్రామనా ఇష్టారాజ్యాంగా బెల్టు షాపుల్ని ప్రోత్సహిస్తూ ప్రజల రక్తాన్ని తాగుతోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఇప్పటికే దివాళా తీసిందని, మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే తమ చేతికి చిప్ప మిగులుతుందని ప్రజలకు అర్ధం అయిందన్నారు. అందుకే కేసీఆర్ ప్రభు త్వాన్ని ఓడించేందుకు తెలంగాణ ప్రజలు పోలింగ్ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. గురువారం పార్టీ కార్యాలయంలో కరీంనగర్ జిల్లా మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, వికా రాబాద్ జిల్లా పరిగికి చెందిన వన్నె ఈశ్వరప్పతో పాటు పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, నేతలు కిషన్ రెడ్డి, పార్టీ పార్లమెంటరీబోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్‌ల సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి నేతలు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు అమ్ముడుపోతారని ప్రజలకు తెలుసునని, 2014, 2018లో అమ్ముడుపోయిన విషయం ప్రజలకు గుర్తుందని చెప్పారు. కేసీఆర్ ఆటలో రేవంత్, హరీశ్ బలిపశువులు కేసీఆర్ ఆటలో రేవంత్, హరీశ్‌రావు బలి పశువులు కాబోతున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం వద్ద మేనిఫెస్టోపై హరీశ్, కేటీఆర్ చర్చ పెద్ద డ్రామా అని సీఎం పదవి కోసమే ఆ ఇద్దరూ కొట్టుకుంటున్నారనే టాక్ నడుస్తోందన్నారు. కేసీఆర్ ఆమోద ముద్ర పడనందునే కాంగ్రెస్ లిస్ట్ ఫైనల్ కాలేదన్నారు. ‘ౖకాంగ్రెస్ లిస్ట్ ఇంకా ప్రగతి భవన్ లో ఉంది. కేసీఆర్ స్టాంప్ పడలేదు. ఆయన 30 మంది అభ్యర్థుల పేర్లు చెప్పి ఆమోదముద్ర వేసినాక ఢిల్లీకి పోతది. పాపం రేవంత్ రెడ్డికి తెల్వదు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి ఎట్లైనా అధికారంలోకి రావాలని కుట్ర చేస్తున్నయ్. ఈ మొత్తం ఎపిసోడ్ లో హరీషన్న, కాంగ్రెస్‌లో రే వంతన్న బలిపశువులు కాబోతున్నరు.’’ అని పే ర్కొన్నారు. డా. లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ నేతలు రాహుల్, రేవంత్ రెడ్డిలకు లేదన్నారు. రాజకీయంగా బీసీల అభ్యున్నతికి బీజేపీనే పెద్దపీట వేసిందని గుర్తు చేశారు. -
రామోజీ ‘రక్త’ కన్నీరు!
రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేయాలో రామోజీ కంటిచూపుతో డిసైడ్ చేస్తాడు.. కాంట్రాక్టులు ఎవరికి కట్టబెట్టాలో ఆయనే శాసిస్తాడు.. విధానపరమైన నిర్ణయాలనూ రామోజీరావే నిర్దేశిస్తాడు.. ఇదంతా 2019 చంద్రబాబు హయాం వరకు ఉన్న పరిస్థితి. అప్పటి వరకు ఆయన ఆడింది ఆట.. పాడింది పాటగా సాగింది.. చెల్లింది కూడా. ఆ తర్వాత సీన్ మారింది.. ఇప్పుడు నాలుగేళ్లుగా రాష్ట్రంలో రామోజీ ఆటలు సాగడంలేదు.. తన సమీప బంధువు నుంచి పోలవరం కాంట్రాక్టు మొదలుకుని నిన్నమొన్నటి మార్గదర్శి చిట్‌ఫండ్స్ వరకూ ఆయనకు తరచూ నోట్లో పచ్చివెలక్కాయలు పడుతున్నాయి. గొంతులో ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్నది జీ హుజూరంటూ తలూపే చంద్రబాబు సర్కారు కాదు కదా.. పుష్కలంగా ప్రజామద్దతు ఉన్న వైఎస్ జగన్ సర్కార్ ఇది. పైగా తన జేబులో మనిషి.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు వైభవం మరోవైపు మిణుకుమిణుకుమంటోంది. దీంతో రామోజీకి దిక్కుతోచడంలేదు..సరికదా పిచ్చెక్కినట్లు ఉంటోంది. అంతే.. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు వైఎస్ జగన్ సర్కారుపై అడ్డగోలుగా.. తన పాఠకులు విసుగెత్తిపోయారనే కనీస స్పృహ కూడా లేకుండా నిత్యం కలంకూట విషం చిమ్ముతున్నాడు. అందులో భాగంగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వ మద్య విధానంపై వాస్తవాలను వక్రీకరిస్తూ ‘రక్త మాంసాలతో వ్యాపారం’ అంటూ ఎప్పటిలాగే మరోసారి విషం కక్కాడు. ఈ విషబీజాలు మీకు కిక్కు ఇస్తాయేమోకానీ మీరనుకున్న లక్కు నెరవేరదు రామోజీ..! నిత్యం అబద్ధాలు అల్లుతూ రాసే విషపు రాతలోని పచ్చినిజం ‘ఏది నిజం’.. ఇదిగో... సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ మద్య విధానంపై వాస్తవాలను వక్రీకరిస్తూ ‘రక్త మాంసాలతో వ్యాపారం’ అంటూ ఈనాడు మరోసారి విషం చిమ్మింది. చంద్రబాబు అధికారంలో లేడన్న బాధ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా విజయవంతంగా కొనసాగుతున్నారన్న అక్కసు అంతా కలగలిపి మరీ అక్షరాల్లో కూర్చి తన కరపత్రికలో కడుపుమంట తీర్చుకున్నాడు రామోజీ. కానీ, వాస్తవం ఏమిటంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా అమలుచేస్తున్న మద్యం విధానం అందిస్తున్న ఫలాలు ఏమిటో ప్రజలకు తెలుసు.. బెల్ట్ దుకాణాల్లేని పల్లెలకు తెలుసు.. పర్మిట్‌రూమ్‌లు లేని ఊర్లకు తెలుసు.. మద్యం రేట్లు అమాంతంగా పెరగడంతో ఆ వ్యసనానికి తమ భర్తలు, పిల్లలు క్రమంగా దూరమవుతుండటంతో ఊరట చెందుతున్న అక్కాచెల్లెమ్మలకు తెలుసు.. దశాబ్దాలుగా నాటుసారా తయారీ తప్ప మరో దిక్కులేని అగత్యం నుంచి బయటపడి, ప్రస్తుతం దర్జాగా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలతో సామాజిక గౌరవం పొందుతున్న కుటుంబాలకు తెలుసు.. సంక్షేమ పథకాలతో ఆర్థిక వృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద కుటుంబాలకూ తెలుసు. ప్రజలు అందరికీ వాస్తవాలు తెలుసు అన్నదే ఈనాడు రామోజీరావు దుగ్థ. ప్రజలు చంద్రబాబును ఏమాత్రం నమ్మడం లేదనే ఆయన ఆక్రోశం. వైఎస్ జగన్మోహన్రెడ్డిపట్ల జనాదరణ రోజురోజుకు మరింతగా పెరుగుతుండడమే ఆయన ఆందోళన. అందుకే తనకు అలవాటైన రీతిలో విష ప్రచారంతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. రామోజీ, చంద్రబాబు ద్వయానికి కష్టంగా ఉన్నా సరే వారు ఇప్పటికైనా గుర్తించాల్సిన వాస్తవం ఏమిటంటే.. మీ టైమ్ అయిపోతోంది.. మీ కట్టుకథలకు కాలం చెల్లింది. తెలుస్తోందా రామోజీ.. అప్పట్లో మూడు పర్మిట్ రూమ్‌లు..ఆరు బెల్ట్ దుకాణాలు.. మద్యం విక్రయాలను దశల వారీగా నియంత్రిస్తామన్న మేనిఫెస్టోలోని హామీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోటీడీపీ నేతల మద్యం సిండికేట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మూడు పర్మిట్ రూమ్‌లు.. ఆరు బెల్ట్ దుకాణాలుగా మద్యం ఏరులై పారిందన్న నిజం పాపం రామోజీరావుకు గుర్తుండి ఉండదు. అప్పట్లో మద్యం మాఫియా యథేచ్ఛగా ప్రజలను దోపిడీ చేసింది. మద్యం దుకాణాలన్నీ టీడీపీ నేతల గుప్పెట్లోనే ఉండేవి. వేళాపాళా లేకుండా 24గంటలూ మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగేవి. ఎమ్మార్పీ ధరల కంటే 25శాతం వరకు అధిక ధరలకు అమ్ముతున్నా సరే నాడు ఎక్సైజ్ శాఖ చోద్యం చూస్తూ ఉండాల్సి వచ్చేది. సీఎంగా జగన్ వచ్చాక.. కానీ, ఈ మద్యం మాఫియా అరాచకాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్క విధాన నిర్ణయంతో తుడిచిపెట్టేశారు. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని ఆయన రద్దుచేశారు. 2019, అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వపరం చేసేశారు. దాంతో రాష్ట్రంలో మద్యం మాఫియాను తుదముట్టించారు. అందుకోసం.. మద్యం దుకాణాల వేళలు కుదింపు ప్రైవేటు వ్యక్తులు అయితే ఎంతగా మద్యం విక్రయాలు పెంచితే తమకు అంతటి లాభం వస్తుందని అనుకుంటారు. ప్రస్తుతం మద్యం దుకాణాలు ప్రభుత్వానివే కాబట్టి మద్యం అమ్మకాలను ప్రోత్సహించాల్సిన అవసరమేలేదు. ఇక మద్యం విక్రయాల సమయాలను బాగా కుదించారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రైవేటు మద్యం దుకాణాలు ఉ. 10గంటల నుంచి రాత్రి 11గంటల వరకు అధికారంగా విక్రయాలు సాగించేవి. అనధికారికంగా 24గంటలూ విక్రయిస్తూ ఉండేవి. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం మద్యం దుకాణాల సమయాన్ని కుదించి కచ్చితంగా అమలుచేస్తున్నారు. ఉ.10గంటల నుంచి రాత్రి 9గంటల వరకే విక్రయాలను అనుమతించారు. బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌ల రద్దు అంతేకాదు.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుబంధంగా రాష్ట్రంలో 43వేల బెల్ట్ దుకాణాలు ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించింది. టీడీపీ ప్రభుత్వంలో మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లకు అనుమతించారు. అంటే మద్యం దుకాణాలే అనధికారికంగా బార్లుగా కూడా చలామణి అయ్యేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే ఇవీ రద్దయ్యాయి. మద్యం దుకాణాలు క్రమంగా తగ్గింపు చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో 4,380 మద్యం దుకాణాలు ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాలను పూర్తిగా తొలగించి ప్రభుత్వ పరం చేసింది. అంతేకాదు.. మద్యం దుకాణాలను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. 2019లో రాష్ట్రంలో 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండగా ప్రస్తుతం 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలే ఉన్నాయి. ఈ సంఖ్యను ఇంకా తగ్గించే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. ఇవన్నీ కాదనగలరా రామోజీరావుగారూ.. బార్ల సంఖ్య పెంచలేదు టీడీపీ ప్రభుత్వం ఏటా బార్ల సంఖ్యను పెంచేది. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం బార్ల సంఖ్యను పెంచలేదు. 2019లో ఖరారుచేసిన 840 బార్లే ఉన్నాయి. కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. భారీగా తగ్గిన మద్యం అమ్మకాలు ఇక దశలవారీగా మద్య నియంత్రణ విధానం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం విక్రయాలను సగానికి పడిపోయాయి. అందుకు ఈ గణాంకాలే తార్కాణం.. మేనిఫెస్టోలో హామీ మేరకే షాక్ కొట్టేలా మద్యం ధరలు.. మద్యం విక్రయాలను నిరుత్సాహపర్చడమే తమ పార్టీ విధానమని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లోనూ మేనిఫెస్టోలోనూ స్పష్టంగా చెప్పారు. తద్వారా పేదలను మద్యం వ్యసనానికి దూరం చేయాలన్నది తమ విధానమన్నారు. అంతేగానీ, మద్యం విక్రయాలను ప్రోత్సహించి సొమ్ము చేసుకోవడం ప్రభుత్వ లక్ష్యం కాదని ఆయన స్పష్టంచేశారు. అదేమాటకు కట్టుబడుతూ అధికారంలోకి వచ్చాక మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచారు. అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్ఈటీ) పన్నునూ విధించారు. దాంతో మద్యం ధరలు పెరిగాయి. ప్రభుత్వం అమలుచేస్తున్న దశలవారీ మద్య నియంత్రణతో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. మరోవైపు.. మద్యం వ్యసనాన్ని నిరుత్సాహ పరిచేందుకు విధించిన ఏఆర్ఈటీ పన్నుతో మద్యం రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వాస్తవాన్ని రామోజీ వక్రీకరిస్తూ రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెరిగాయని ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కిందామీదా పడుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. పేదలు మద్యం వ్యసనానికి క్రమంగా దూరమవుతున్నారు. పేదలు మద్యానికి దూరమవుతుండటం కూడా రామోజీరావుకు ఆవేదన కలిగిస్తుందంటే నిజంగా ఆయనకు మామూలు చికిత్స కాదు మానసిక చికిత్స అవసరమనిపిస్తోంది. డిస్టిలరీలన్నీ బాబు హయాంలోనివే.. ఇక రాష్ట్రంలో ఉన్న మద్యం డిస్టిలరీలన్నీ చంద్రబాబు హయాంలో అనుమతులు ఇచ్చినవే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఒక్క కొత్త డిస్టిలరీకీ అనుమతివ్వలేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభలో స్లైడ్లు ప్రదర్శించి మరీ వివరించారు. అయినా సరే.. కళ్లున్న కబోదిగా వ్యవహరిస్తున్న రామోజీని ఏమనాలి.. ఏం చేయాలి? సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ తప్పా రామోజీ.. రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ ద్వారా ఎన్సీడీలు జారీచేసి ప్రభుత్వం నిధులు సమీకరించింది. వీటిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం వెచ్చిస్తున్నామని కూడా స్పష్టంచేసింది. పేదల సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం తగినన్ని నిధులు సమీకరించడం కూడా రామోజీరావుకు కంటగింపుగా మారుతోంది. తాను, తన చంద్రబాబు తప్ప పేదలు బాగుపడకూడదని ఆయన భావన కావచ్చు. ఆ రోజులకు కాలం చెల్లింది. మీకు అర్ధమవుతోందా రామోజీ.. అక్రమ మద్యంపై ఎస్ఈబీ ఉక్కుపాదం అలాగే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అక్రమ మద్యం, నాటుసారాపై ఉక్కుపాదం మోపుతోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా సాగిన అక్రమ మద్యం, నాటుసారా దందాను సమర్థంగా కట్టడి చేస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటుచేయడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. ఎస్ఈబీ మూడు విధాలుగా అక్రమ మద్యం, నాటుసారాను అరికడుతోంది. ఎలాగంటే.. ► అక్రమ మద్యం, నాటుసారా తయారీ దశాబ్దాలుగా సాగుతున్న 147 గ్రామాలను గుర్తించి దాడులు నిర్వహిస్తోంది. ► గ్రామ వలంటీర్లు, వార్డు వలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా కచ్చితమైన సమాచారాన్ని తెప్పించుకుని అక్రమ మద్యం దందాను అడ్డుకుంటోంది. ► ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ.. పొరుగు రాష్ట్రాలతో కలిసి దాడులు నిర్వహిస్తోంది. సారా సిండికేట్‌కు గుండెల్లో రైళ్లు 2019 నుంచి 2023 మార్చి వరకు పోలీసు, ఎస్ఈబీ విభాగాలు నాటు సారా తయారీదారులపై 1,44,254 కేసులు నమోదు చేశాయి. మొత్తం 1,12,604 మందిని అరెస్టుచేశారు. 18.41లక్షల లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకోవడంతోపాటు 5.34కోట్ల లీటర్ల సారా ఊటలను ధ్వంసం చేయడం ప్రభుత్వం చేపడుతున్న కఠిన చర్యలకు నిదర్శనం. మొత్తం 14,556 వాహనాలను జప్తుచేశారు. బైండోవర్ కేసులు, పీడీ యాక్ట్‌లు.. రాష్ట్రంలో నాటుసారా, అక్రమ మద్యం, అక్రమంగా నల్లబెల్లం తయారీదారులపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. వారిపై బైండోవర్ కేసులు నమోదుచేస్తోంది. 2020 జూన్ నుంచి 2023 మార్చి 14 వరకు మొత్తం 74,674 బైండోవర్ కేసులు నమోదు చేసింది. అలాగే, రాష్ట్రంలో అక్రమ మద్యం, నాటుసారా దందాకు అలవాటుగా మారిన నేరస్తులను గుర్తించి పీడీ యాక్ట్‌లను ప్రయోగిస్తున్నారు. 2020, మే 16 నుంచి 2023, మార్చి 16 వరకు రాష్ట్రంలో ఏకంగా 206 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించడం ప్రభుత్వం చేపడుతున్న కఠిన చర్యలకు నిదర్శనం. అక్రమ మద్యం దందాకు చెక్ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అక్రమ మద్యం దందా యథేచ్ఛగా సాగింది. టీడీపీ నేతలు ఇతర రాష్ట్రాల నుంచి పన్ను చెల్లించని మద్యాన్ని అక్రమంగా స్మగ్లింగ్ చేసి భారీగా దోపిడీకి పాల్పడ్డారు. ఆనాటి ప్రభుత్వం కూడా ఆ దందాపై ఉదాసీనంగా ఉండేది. రామోజీ కూడా ఏనాడు పెన్నెత్తి మాట్లాడలేదు. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ మద్యం దందాకు సమర్థంగా చెక్‌పెట్టింది. ఎస్ఈబీ విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ మద్యం స్మగ్లింగ్‌ను కట్టడి చేస్తోంది. దీనిని కాదనగలరా రామోజీ.. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలతో ‘నవోదయం’ దశాబ్దాలుగా నాటుసారా తయారీయే జీవనోపాధిగా చేసుకున్న కుటుంబాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త వెలుగులు తెచ్చింది. నవోదయం పేరుతో వినూత్న సంస్కరణలను తీసుకొచ్చింది. ఆ కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించి వారికి ఆర్థికంగా దన్నును అందించడంతోపాటు సామాజికంగా గౌరవాన్ని పెంచింది. అందుకోసం ఎస్ఈబీ ప్రత్యేకంగా సర్వే నిర్వహించి అటువంటి గ్రామాలను గుర్తించి ఆయా జిల్లాల యంత్రాంగాల సహకారంతో పటిష్ట కార్యాచరణ చేపట్టింది. ఆ కుటుంబాలకు ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి అందిస్తోంది. 2022 ఏప్రిల్ నాటికి రాష్ట్రంలో 1,891 గ్రామాలను గుర్తించారు. ఆ గ్రామాల్లో ఇప్పటికే 1,552 కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం రూ.11.46 కోట్ల మేర సహాయం చేసింది. మిగిలిన కుటుంబాలకు కూడా కల్పించే ప్రక్రియ కొనసాగుతోంది రామోజీ.. చంద్రబాబు, రామోజీ మధ్య ఉన్నది మద్యం బంధమే రక్తమాంసాలతో వ్యాపారం వారిద్దరిదే వ్యాపార ప్రయోజనాల కోసం ఎంతటి కుట్రపూరిత రాజకీయాలు చేయాలో.. ప్రభుత్వ పాలనా వ్యవస్థను ఎంతగా దుర్వినియోగం చేయాలో ఈ ప్రపంచంలో చంద్రబాబు, రామోజీరావులకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు. ఆ విషయంలో పేటెంట్ వారిద్దరిదే. 1989–94లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడం.. అప్పట్లో తమ పోటీ పత్రిక ‘ఉదయం’ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు రామోజీరావు సంపూర్ణ మద్య నిషేధం ఉద్యమాన్ని ప్రోత్సహించారు. ఎన్టీరామారావు అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధాన్ని విధించారు. ఆ తర్వాత ఎన్టీరామారావుకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యారు. వెంటనే రామోజీరావు ఏమాత్రం సిగ్గూఎగ్గూ లేకుండా ప్లేటు ఫిరాయించి సంపూర్ణ మద్య నిషేధం విధానానికి టాటా చెప్పారు. అంతే.. నిషేధాన్ని చంద్రబాబు ఎత్తేశారు. ఎందుకంటే అప్పుడే రామోజీ ఫిల్మ్‌సిటీ నిర్మాణం చేపట్టారు. అందులోని స్టార్‌హోటళ్లలో మద్యం విక్రయాల కోసం రామోజీరావు నిజంగా ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేశారు. ఇప్పుడు ఈయన శ్రీరంగ నీతులు చెబుతున్నాడు.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు! జిల్లాల వారీగా పీడీ యాక్ట్ కేసులు.. జిల్లా కేసులు శ్రీకాకుళం 3 విజయనగరం 1 అల్లూరి సీతారామరాజు 5 పార్వతీపురం మన్యం 4 అనకాపల్లి 2 కాకినాడ 12 అంబేడ్కర్ కోనసీమ 6 తూర్పు గోదావరి 36 పశ్చిమ గోదావరి 8 ఏలూరు 12 కృష్ణా 6 ఎన్టీఆర్ 8 బాపట్ల 14 పల్నాడు 15 ప్రకాశం 7 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 3 చిత్తూరు 22 తిరుపతి 1 వైఎస్సార్ 5 కర్నూలు 6 నంద్యాల 19 అనంతపురం 6 శ్రీసత్యసాయి 4 అన్నమయ్య 1 మొత్తం 206 -
ఏది నిజం?: 3 అబద్ధాలు 6 అభాండాలు.. ‘ఈనాడు’ మరో విష కథనం
ఆయనే కర్త... కర్మ... క్రియ 1990ల మొదట్లో... మద్య నిషేధ ఉద్యమానికి... 1996 నుంచీ రాష్ట్రంలో అక్రమ మద్యం పెరిగిపోవటానికి... అలా పెరిగిపోయిందంటూ ‘ఈనాడు’విచ్చలవిడిగా రాయడానికీ... రైల్వే స్టేషన్లో రెండు బాటిళ్లు దొరికినా ఓ పేద్ద వార్త ప్రచురించడానికి... 1997లో చంద్రబాబు మద్య నిషేధం ఎత్తివేయటానికి... అన్నిటికీ ఆయనే కర్త..కర్మ... క్రియ. ఆయనే రామోజీరావు!!. విచిత్రమేంటంటే ఈ 86 ఏళ్ల మద్య నిషేధ ఉద్యమకారుడు 1997లో చంద్రబాబు నిషేధాన్ని ఎత్తివేసినపుడు తన పత్రిక ‘ఈనాడు’లో ఓ విచిత్రమైన సంపాదకీయం రాశాడు. ప్రభుత్వాలు నిషేధాన్ని అమలు చేయటం సాధ్యం కాదని, జనం ఎవరికి వారు తాగటం మానేస్తే తప్ప ఈ మహమ్మారిని అంతం చేయలేమని సూత్రీకరించాడు.. అలా నిషేధాన్ని ఎత్తేశాక తన రామోజీ ఫిలిం సిటీలోని ఫైవ్‌స్టార్ హోటళ్లలో దేశ, విదేశీ బ్రాండ్ల మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మకానికి పెట్టాడు. వాటిని మరింత తాగించడానికి బెల్లీ డ్యాన్సులు పెట్టాడు. వారానికో ప్రత్యేక కార్నివాల్‌ను పెట్టి... తన పత్రికలో ప్రకటనలిచ్చి మరీ జనాన్ని రప్పించి తాగించాడు. ఎందుకంటే ఆయన దృష్టిలో నిషేధం అనేది ఎవరికి వారు విధించుకోవాలి తప్ప ప్రభుత్వమో... అమ్మకం దార్లో చేయటం కష్టం!. అంటే... ఎవరికి వారు తాగటం మానేయాలి తప్ప తాను మాత్రం అమ్ముతూనే ఉంటానని, ఇష్టం వచ్చిన వాళ్లు తాగొచ్చని చాలా పద్ధతిగా చెప్పారు. ఇదీ... ఈయన గారి పాత్రికేయ పాతివ్రత్యం!. రామోజీరావు చాలా నికార్సయిన మనిషి. సిద్ధాంతానికి కట్టుబడే తత్వం. కాకపోతే ఆ సిద్ధాంతమే కాస్త తేడా!. అదేంటంటే తన చంద్రబాబు అధికారంలో ఉంటే మద్య నిషేధం అక్కర్లేదు. వేరెవ్వరు అధికారంలో ఉన్నా... మద్య నిషేధం కావాలి. లేదంటే ఊరుకోరు. అందుకే... నాడు: బాబు హయాంలో ఊరూరా విరగకాసిన 43,000 బెల్టు షాపుల్ని ‘ఈనాడు’ ఏనాడూ చూడలేదు. నేడు: ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి రాకుండా ఎక్కడో ఒకటీ అరా నడుస్తున్నా... ‘3 పెగ్గులు–6 గ్లాసులు’ అంటూ తాగినట్లే ఊగిపోతారు. నాడు: అప్పట్లో ఏకంగా 4,380 మద్యం దుకాణాలు... పక్కనే పర్మిట్ రూమ్‌లతో సహా మందు పోస్తుంటే అది విచ్చలవిడితనమని ‘ఈనాడు’కు అనిపించలేదు. నేడు: షాపులో కొనుక్కుని ఎక్కడో పొలాల్లో తాగుతున్న వారిని కూడా ఫోటోలు తీసి... బెల్టు షాపులో కొని తాగుతున్నట్లుగా చిత్రీకరిస్తాడు. నాడు: బాబు హయాంలో అమ్మే ఏ మద్యమైనా ఆయన దృష్టిలో అమృతమే. నేడు: అవే డిస్టిలరీలు, అదే మద్యాన్ని తయారు చేసి విక్రయిస్తుంటే... అది విషమంటూ నీచపు రాతలు రాస్తాడు. కోవర్టులతో కలిసి దొంగ టెస్టులు చేయించి మరీ దుష్ప్రచారానికి దిగుతాడు. నాడు: చంద్రబాబు ఏ బ్రాండుకు అనుమతిచ్చినా అది చాలా గొప్పదని ‘ఈనాడు’ భావం. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్ ఆ పత్రిక దృష్టిలో అప్పట్లో గొప్పపేర్లు. నేడు: బాబు దిగిపోవటంతో... ఇవన్నీ ప్రస్తుత ప్రభుత్వం పెట్టిన ఘోరమైన పేర్లంటూ ఆందోళన వ్యక్తం చేస్తుంది. అంతేకాదు!! త్రీ క్యాపిటల్స్, స్పెషల్‌స్టేటస్ అంటూ లేని పేర్లను కూడా ఉన్నట్టుగా ఎల్లో రాతలు రాసి యాగీ చేస్తుంది. ► ఇక ఏ డిస్టిలరీ నుంచి ప్రభుత్వం ఎంత మద్యం కొంటోందన్న విషయంలోనూ విషప్రచారమే. రాష్ట్రంలో చంద్రబాబు అనుమతిచ్చిన 20 డిస్టిలరీలుండగా... వాటిలో ఒక డిస్టిలరీకి 6 శాతం ఆర్డర్లు ఇవ్వటం కూడా రామోజీరావు దృష్టిలో ‘అడ్డగోలు’ వ్యవహారమే. బాబు హయాంలో ఒకే డిస్టిలరీకి 15–20 శాతం ఆర్డర్లిచ్చినా అందులో ఎలాంటి తప్పూ కనిపించదు. ► ఇవన్నీ ఎందుకంటే... బేసిగ్గా చంద్రబాబు తప్ప వేరెవ్వరూ పదవిలో ఉండకూడదన్నది రామోజీరావు సిద్ధాంతం. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ వద్దనుకున్నాక రామోజీ అభీష్టంతో పనిలేదు కదా? కాకపోతే ఆ వాస్తవం రామోజీకి మూడున్నరేళ్లు గడిచినా జీర్ణం కావటంలేదు. ఎప్పుడో ఎన్టీఆర్ కాలం మాదిరిగా తాను తలచుకుంటే ఎవరినైనా పదవిలో కూర్చోబెట్టగలనన్న అహం ఇప్పటికీ చావలేదు. విషపు రాతలతో ప్రభుత్వానికి మద్యంపై పైసా ఆదాయం రాకుండా చేయాలని... అలా ప్రభుత్వ ఆదాయ వనరును దెబ్బతీస్తే ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలూ అమలు చేయలేని పరిస్థితిలో పడి ప్రజాభిమానాన్ని కోల్పోతుందనేది ఆయన పరమోద్దేశం. కాకపోతే ఇక్కడొక చిన్న లాజిక్‌ను రామోజీరావు మిస్సవుతూనే ఉన్నాడు. మద్యంపై చెప్పింది చెప్పినట్టే... రామోజీ మిస్సయిన లాజిక్కేంటంటే... అధికారంలో ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మాటకు కట్టుబడే వైఎస్సార్ లక్షణానికి అక్షరాలా వారసుడు. రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రిస్తూ వెళతానని ఎన్నికలకు ముందే చెప్పారాయన. ఆ నియంత్రణలో భాగంగానే... తాను ఎన్నికల్లో గెలిస్తే మద్యం ధరలు షాక్ కొట్టేలా నిర్ణయిస్తానని, అమ్మకాలను తగ్గిస్తానని చెప్పారు. అన్నట్టే ధరలు పెంచటంతో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. 2018–19లో చంద్రబాబు హయాంలో 384.36 లక్షల మద్యం కేసులు విక్రయిస్తే 2021–22లో ఆ సంఖ్య ఏకంగా 277.16 లక్షలకు తగ్గింది. ఇక బీర్ల విక్రయానికొస్తే 2018– 19లో ఏకంగా 278.50 లక్షల కేసులు విక్రయించగా... 2021–22లో ఆ సంఖ్య కేవలం 82.60 లక్షలకు తగ్గిపోయింది. కాకపోతే ఇదేదీ రామోజీరావుకు కనిపించదు. బాబు హయాంలో చాలా పక్కాగా పరిమితంగా మద్యం విక్రయాలు జరిగినట్లు... ఇప్పుడేమో విచ్చలవిడిగా అమ్మేస్తున్నట్లు ఆయనకు కలలు వస్తుంటాయి. అవి ‘ఈనాడు’లో రాతల రూపంలో ప్రత్యక్షమవుతుంటాయి. ఈ చర్యలు ‘ఈనాడు’కు ఎన్నడూ కనిపించవా? వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 43 వేల బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించింది. మద్యం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే బెల్టు షాపులను అడ్డుకోవడం అసాధ్యం కనక... ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వమే పరిమితంగా మద్యం దుకాణాలను నిర్వహించాలని నిర్ణయించింది. 4,380 మద్యం దుకాణాలను ఏకంగా 2,934కి తగ్గించడంతోపాటు విక్రయ వేళలను కుదించారు. అందుకే విక్రయాలు గణనీయంగా తగ్గాయి. 2018–19తో పోలిస్తే 2020–21లో మద్యం విక్రయాలు 40%, బీర్ విక్రయాలు 73% తగ్గడమే ఇందుకు నిదర్శనం. కాకపోతే ఇలా తగ్గిన విషయాన్ని ‘ఈనాడు’ ఏనాడూ ప్రస్తావించదు. ఇంత తగ్గినా... మద్యం ఏరులై పారుతోందని, విచ్చలవిడిగా బెల్టుషాపులు పెట్టి అమ్మేస్తున్నారని చేతికొచ్చిన రాతలు రాసి అచ్చేస్తుంటుంది. బెల్టు షాపులు రాష్ట్రంలో ఎక్కడా కనిపించకూడదని, పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చి అక్రమంగా మద్యం విక్రయించకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను (సెబ్) ఏర్పాటు చేసింది. సెబ్‌కు ఎవ్వరైనా ఫిర్యాదు చేసేలా ఆ ఫోన్ నెంబర్‌ను మద్యం దుకాణాల వద్ద కూడా ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో మద్యానికి సంబంధించిన వ్యవస్థ చాలా పెద్దది. ఎన్ని చర్యలు తీసుకున్నా ఒకటో రెండో చోట్ల అనధికారికంగా విక్రయించటం జరుగుతూ ఉండొచ్చు. కాకపోతే ఇది 1 శాతానికన్నా తక్కువే. కాకపోతే రామోజీరావు మాత్రం దీన్నే వంద శాతంగా చిత్రించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఒకటో రెండో చోట్ల జరిగిన సంఘటనలను చూపిస్తూ... మొత్తం రాష్ట్రమంతటా ఇలాగే ఉందని చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. అదే చంద్రబాబు హయాంలో మాత్రం మొత్తం 100 శాతం అక్రమ విక్రయాలు జరిగినా పెన్నెత్తి రాయడు. ఒక్కచోట కూడా అక్రమం జరిగినట్లు చెప్పడు. అసలు బాబు హయాంలో బెల్టు షాపుల్ని నియంత్రించడానికి గానీ, షాపుల్లో మద్యం ధరలను పెంచి విక్రయిస్తే అడ్డుకోవటానికి గానీ ఏదైనా వ్యవస్థ ఉందా? ఇప్పుడలా కాదు కదా? గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో మద్యానికి సంబంధించి ఎన్ని కేసులు బుక్ చేశారో తెలుసా? ఎందరిని అరెస్టు చేశారో తెలుసా? ఎన్ని వాహనాలను సీజ్ చేశారో తెలుసా? మరి ఇన్ని చేస్తున్నారంటే అక్రమంగా విక్రయించే వారిని వెతికి వెతికి పట్టుకుంటున్నారనే కదా అర్థం? ఈ వాస్తవాలనెందుకు రాయరు రామోజీరావు గారూ? ప్రభుత్వంపై బురద జల్లేటపుడు ఆ ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధిని కూడా ప్రస్తావించాలి కదా? మీ పాఠకులేం పాపం చేశారు? మీ సూత్రం ఇప్పుడు వర్తించదా రామోజీ? రామోజీరావు సూత్రం ప్రకారం మద్య నిషేధాన్ని అమలు చేయటం ప్రభుత్వాలకు అసాధ్యం. నిషేధమే కాదు... మద్యాన్ని నియంత్రించటం కూడా సాధ్యం కాదు. ఎవరికి వారు మద్యం మానేయాలి తప్ప... వారి చేత మద్యం మాన్పించటం ప్రభుత్వాలతో అయ్యే పనికాదు. నిజానికి 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచీ రామోజీరావు ఈ సూత్రానికే కట్టుబడ్డారు. 2004లో దిగిపోయి... మళ్లీ చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇదే వైఖరి. అందుకే బెల్టు షాపుల జోలికి వెళ్లలేదు. మద్యం దుకాణాలన్నీ ప్రయివేటు మాఫియా చేజిక్కించుకుని ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు విక్రయిస్తున్నా పెన్నెత్తలేదు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వమే ఎమ్మార్పీ ధరలకు ఖచ్చితంగా కట్టుబడి విక్రయిస్తున్నా... బెల్టు షాపుల్ని నామరూపాల్లేకుండా చేసినా ఆయనకు లోపాలు కనిపిస్తున్నాయి. ఎక్కడో ఒకటీ రెండు చోట్ల చిన్న దుకాణాల్లో మద్యం అమ్ముతున్నారని, దీన్ని ప్రభుత్వం నియంత్రించటం లేదు కాబట్టి... రాష్ట్రమంతటా ‘3 పెగ్గులు– 6 గ్లాసుల’ మాదిరి ఉందని బురద జల్లేశారు. మరి రామోజీ లాజిక్ ప్రకారమే చూసుకుంటే వీటిని ప్రభుత్వమెలా నియంత్రిస్తుందని ఆయన అనుకోవాలి కదా? ఎవరికి వారు మద్యం మానాలి తప్ప ప్రభుత్వం వారిచేత ఎలా మాన్పిస్తుందని చెప్పింది ఆయనే కదా? కాకపోతే ఈ ప్రభుత్వ వైఖరి చంద్రబాబులా లేదు. కఠినంగా నియంత్రించడానికే ఎస్ఈబీని ఏర్పాటు చేసింది. ఎస్ఈబీ దాడులు చేసి కఠినంగా వ్యవహరిస్తోంది. ఇదిగో... ఇప్పుడు ‘ఈనాడు’ రాసిన వ్యవహారంపై కూడా కచ్చితంగా ఎస్ఈబీ తనిఖీలు చేసి తన బాధ్యత తాను నిర్వహిస్తుంది. కాకపోతే ఇదే పరిస్థితి రాష్ట్రమంతటా ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ దుర్మార్గపు రాతలు రాయటమే ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. ‘‘బాబు కళ్లలో సంతోషం కోసం’’ అన్న రీతిలో టైమ్ టేబుల్ పెట్టుకుని మరీ ప్రతి పక్షం రోజులకోసారి ఇలా మద్యంపై విషపు రాతలు రాస్తున్న రామోజీకి... ఇది ‘ఈనాడు’ చెబితే నమ్మేసే కాలం కాదని అర్థమయ్యేదెప్పుడో..? -
ఏది నిజం?: బాబు కోసమే ఆ ‘మత్తు’!!
గోదావరిలో ఇసుక మేటలు వేస్తే!!... తొలగించకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఆందోళన. పోనీ ఇసుకను తొలగిస్తుంటే!!... బంగారంలాంటి ఇసుకను కావాల్సిన వారికి కట్టబెట్టేసి తరలించేస్తున్నారంటూ ఆవేశం. మద్యం విక్రయాలు పెరిగితే!!... ఊరూరా మద్యం ఏరులై పారుతోందని, పేదల ఆరోగ్యాన్ని బలిపెడుతున్నారని ఆక్రందన. పోనీ... మద్యం విక్రయాలు తగ్గితే!!... ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని, రేట్లు పెంచి సొమ్ము చేసుకుంటున్నారని గగ్గోలు. అంతేకాదు!! రోడ్లు బాగులేకుంటే పట్టించుకోవటం లేదంటూ అరుపులు. బాగు చేస్తుంటే అప్పులు తెచ్చేస్తున్నారంటూ పెడబొబ్బలు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నా... ఉద్యోగాల కల్పన పెరుగుతున్నా కూడా అవేమీ పట్టనట్లుగా అభివృద్ధి లేదని, వెనకబడిపోయామని దుష్ప్రచారం. ఇవన్నీ పది తలల రామోజీరావులోని రంగులు. ఆయన పుత్రిక ‘ఈనాడు’లో రోజూ పేజీల కొద్దీ పరిచే వార్తలు. పోనీ రామోజీలో ఇన్ని భావావేషాలు అన్నివేళలా ఉంటాయా అంటే.. ఆ ఛాన్సే లేదు. చంద్రబాబు నాయుడు కాకుండా వేరొకరు అధికారంలో ఉంటేనే ఈ వేషాలన్నీ బయటకు వస్తాయి. బాబు అధికారంలో ఉంటే ఐదేళ్లూ రోడ్లేయకపోయినా... రోడ్లేయటానికి ఉన్న ఇబ్బందులే రామోజీకి కనిపిస్తాయి. ఇసుక ఉచితమంటూ ఎమ్మెల్యేలు మాఫియా డాన్లలా మారి అమ్మేసినా అదంతా ఆయన దృష్టిలో జనహితమే. బెల్టు షాపులు పెట్టి మద్యం ఊరూరా పారించినా... ఆ తప్పు తాగేవాళ్లదే తప్ప బాబుది కాదు. టీకొట్టు నడిపేవాళ్లని దావోస్ తీసుకెళ్లి.. వాళ్లకి కోట్లు తొడిగి ఎంఓయూలు చేసుకుంటే... వాళ్లంతా రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే పారిశ్రామికవేత్తలే. ఇంతెందుకు!! బాబు ఎవరితో పొత్తు పెట్టుకున్నా... అది చారిత్రక అవసరమే. బాబు ఏం చేసినా... అది దేశ ప్రయోజనాల కోసమే. ఇప్పుడు కూడా చంద్రబాబు గెలవాల్సిన చారిత్రక అవసరాన్ని పదేపదే గుర్తు చేస్తూ ఇలాంటి దగుల్బాజీ రాతలు రాసేవాళ్లు ఆశిస్తున్నది ఒక్కటే. ఈ ప్రభుత్వానికి జనాదరణ తగ్గటం లేదు. కాబట్టి దీన్ని ఏ పనీ చేయకుండా కట్టడి చేయాలి. రాష్ట్రంలో కరెంటు, రోడ్లు, నీళ్లు ఏవీ లేవని విపరీతంగా దుష్ప్రచారం చెయ్యాలి. నిరుపేదల సంక్షేమాన్ని నిలిపేసేలా చెయ్యాలి. ఆదాయం తగ్గినా... అప్పులు మాత్రం తేనివ్వకూడదు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ఉన్న జనాదరణ తగ్గిపోవాలి. తామెన్ని చేసినా ఆయనే గెలుస్తాడు కనక ప్రతిపక్షాలన్నీ కలిసిపోవాలి. లేకపోతే తామే కలిపేయాలి. ఏ మార్గంలో అయినా... ఎవరి సాయంతో అయినా అర్జెంటుగా చంద్రబాబును కుర్చీ ఎక్కించేయాలి. ‘ఈనాడు’ చూసేవారికి ఎవరికైనా అర్థమయ్యేది ఇదే!!. ఏ రాష్ట్రానికైనా ప్రధాన ఆదాయ వనరులు తక్కువే. పన్నుల్లో అధికభాగం వచ్చేది మద్యం.. పెట్రోలు నుంచే. పెట్రోల్‌లో కేంద్రానిదే సింహభాగం. వీటితో పాటు రుణాలు, గ్రాంట్లు ఇతరత్రా ఆదాయంపైనే ఏ రాష్ట్ర బడ్జెట్టయినా నడుస్తుంది. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేదీ ఈ నిధులతోనే. అలాంటిది రాష్ట్రం ఒక వంక మద్య నియంత్రణకు కట్టుబడి షాపులు తగ్గించి.. బెల్టు షాపులు తీసేసి... అమ్మకాలను తగ్గిస్తూ పకడ్బందీ వ్యూహంతో ముందుకు కెళుతుంటే ఈ రాతలేంటి రామోజీ? రాష్ట్రానికి ఆదాయం వస్తే తప్పా? చంద్రబాబు హయాంలో ఏటేటా మద్యం విక్రయాలు విపరీతంగా పెరుగుతూ పోయినా మీ పెన్నులోంచి ఒక్క అక్షరమూ రాలి పడలేదెందుకు? 7.81 కాంపౌండెడ్ వృద్ధితో 2015–16లో 306 లక్షల కేసులుగా ఉన్న మద్యం విక్రయాలు 2018–19లో బాబు దిగిపోయే నాటికి ఏకంగా 384 లక్షల కేసులకు చేరాయి. మద్య నిషేధ ఉద్యమాన్ని నడిపి... తన ఫిలింసిటీలో క్యాబరేలకూ ఓకే చేసిన ఉద్యమనేత రామోజీ బీరు విక్రయాలైతే 168 లక్షల కేసుల నుంచి ఏకంగా 227 లక్షలకు చేరాయి. నిజానికి అదే వృద్ధి నేటికీ కొనసాగితే 2021–22లో 481 లక్షల మద్యం కేసులు విక్రయించి ఉండాలి. కానీ వాస్తవంగా 266 లక్షల కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. దీన్నిబట్టే ప్రభుత్వం మద్య నియంత్రణకు ఏ స్థాయి కృషి చేస్తోందన్నది అర్థమవుతుంది. అంకెలు చెబుతున్న ఈ వాస్తవాలను కూడా రామోజీరావు పరిగణనలోకి తీసుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఎంత దారుణమైన వార్తలు రాసయినా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచటమే ఆయన ధ్యేయం. తనవాడైన చంద్రబాబును మళ్లీ పీఠంపై చూడాలన్నది ఆయన కల. జనం గుండెల్లో నిలిచి...ఎందరినైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్న వైఎస్ జగన్ తన వాడు కాదు మరి!!. అదే అసలు తేడా. పకడ్బందీ దుష్ప్రచారపు వ్యూహం ‘ఈనాడు’ సహా ఎల్లో పత్రికల్లో మొదట పతాక శీర్షికల్లో వేస్తారు. తరవాత ఆ వార్తను పట్టుకుని టీడీపీ నేతలు రకరకాలుగా మీడియాతో మాట్లాడతారు. అవన్నీ మళ్లీ ఆ మీడియా ప్రాధాన్యం ఇచ్చి ప్రచురిస్తుంది. వీటిని మళ్లీ టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికలపై పోస్ట్ చేస్తారు. ఈ పోస్ట్‌లనూ మీడియాలో సందర్భాన్ని బట్టి వేస్తారు. ఇదీ... నచ్చని ప్రభుత్వాలపై దుష్ప్రచారానికి ఎల్లో మీడియా చేసే పకడ్బందీ దుష్ప్రచార ప్రణాళిక. ఇప్పుడీ ప్రణాళికలో సీబీఎన్ దత్తపుత్రుడు కూడా చేరిపోయాడు. ‘ఈనాడు’ వార్తకు తన వెటకారపు పైత్యాన్ని జోడించి చెలరేగిపోయాడు. పథకం ప్రకారం దాన్ని మళ్లీ ‘ఈనాడు’ తన వెబ్సైట్లో పెట్టేసింది. ఇంకెన్నాళ్లు రామోజీ ఈ ఎల్లో జర్నలిజం? పత్రిక పేరిట రాజకీయాలెందుకు? నేరుగా రాజకీయాల్లో చేరిపోవచ్చుగా? ‘మత్తు’ ఎవరిది రామోజీరావు గారూ? ఇక స్వయంగా రామోజీ విషయానికొస్తే... ఆయన ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మద్య నిషేధ ఉద్యమానికి సారథి. పోటీగా వచ్చిన ‘ఉదయం’ పత్రిక ఆర్థిక మూలాలు మద్యం డబ్బులోనే ఉన్నాయని భావించి... అందరినీ ఎగదోసి ఉద్యమాన్ని నడిపిన ‘నాయకుడు’. నాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దింపి... చంద్రబాబును ఎక్కించాక... నిషేధానికి తూట్లు పొడిచిన మహా పత్రికావ్రతుడు. ఇక ఇప్పుడు నేరుగా తన పేరిట పెట్టుకున్న ఫిలింసిటీలో మద్య ప్రవాహాన్ని పారిస్తూ... క్యాబరేలు, అర్థనగ్న నృత్యాలక్కూడా తెరలు తీసిన ఫక్తు వ్యాపారి. మరి ఇలాంటి వ్యక్తి నీతులు చెబితే ఎలా? తెలుగు రాష్ట్రాల్లో ఈ చరిత్ర తెలియనిదెవరికి? ఇదే చంద్రబాబు అయ్యుంటేనా...!! ఆదివారం ‘ఈనాడు’ అచ్చేసిన రామోజీ ‘మత్తు’ వార్తలో ప్రధానంగా పేర్కొన్న విషయం ఒక్కటే. ఇప్పుడున్న వడ్డీ రేట్లతో పోలిస్తే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ చాలా ఎక్కువ వడ్డీకి రుణం తెచ్చేసిందని, అది మున్ముందు భారమైపోతుందని!!. నిజానికి ఏ ప్రభుత్వమైనా నేరుగా తను జారీ చేసే రాష్ట్రాభివృద్ధి బాండ్లపై తక్కువ వడ్డీయే చెల్లిస్తుంది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు జారీ చేసే బాండ్లపై మాత్రం కాస్త ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. ఇదే కోవలో ఇపుడు రాష్ట్ర ప్రభుత్వ బాండ్లకు 8.03 శాతం వడ్డీ చెల్లిస్తుండగా బెవరేజెస్ కార్పొరేషన్ మాత్రం 9.32 శాతం వడ్డీతో బాండ్లు జారీ చేసింది. నిజానికిపుడు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగి అనిశ్చితి రాజ్యమేలుతోంది. గతనెల దేశంలో ద్రవ్యోల్బణం 7.79 శాతానికి చేరగా... గ్రామాల్లో ఈ రేటు 8.38 శాతంగా ఉంది. గత ఎనిమిదేళ్లలో ఇదే రికార్డు. అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరటంతో అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచింది. మన ఆర్బీఐ ఇదే బాటలో నడవగా... యూరోపియన్ సెంట్రల్ బ్యాంకూ ఈ ది«శగానే వెళుతోంది. ఇలాంటి సమయంలో 9.32 శాతం వడ్డీ అంటే చాలా తక్కువకిందే లెక్క. ఇదే గనక చంద్రబాబు చేసి ఉంటే రామోజీ మంగళహారతులు పట్టి మరీ పతాక శీర్షికల్లో బాబు గొప్పతనాన్ని, చాణక్యాన్ని కుమ్మేసేవారు. కానీ ముఖ్యమంత్రి జగన్ కనక ఈ అప్పు తేవటమే నేరమన్న తీరులో ధ్వజమెత్తుతున్నారు. టీడీపీ హయాంలో... అబ్బో!! టీడీపీ హయాంలో ఏపీసీఆర్డీఏ బాండ్లు జారీ చేసి రూ.2,000 కోట్లు సమీకరించింది. అప్పట్లో రాష్ట్రాభివృద్ధి రుణాలకు ప్రభుత్వం 8.42 శాతం చెల్లిస్తుండగా... సీఆర్డీఏ 10.32 శాతం వడ్డీకి బాండ్లు జారీ చేసింది. రూ.1,300 కోట్ల మేర జారీ చేయగా రూ.2,000 కోట్లకు (1.5 రెట్లు) బిడ్లు వచ్చాయి. దీంతో చంద్రబాబును, ఆయనపై ఇన్వెస్టర్లకున్న నమ్మకాన్ని వర్ణిస్తూ ‘ఈనాడు’ ఆకాశానికి ఎత్తేసింది. బాబు ముంబయి వెళ్లి తన సక్సెస్‌పై ఇంటర్వ్యూలిచ్చారు. కానీ ఇపుడు తక్కువ వడ్డీకి బెవరేజెస్ కార్పొరేషన్ జారీ చేసిన బాండ్లకు ఏకంగా 4.5 రెట్ల స్పందన వచ్చింది. అయినా దీన్ని వ్యతిరేక కోణంలో చూస్తూ దుష్ప్రచారానికి పూనుకున్నారు రామోజీ జర్నలిజాన్ని ఏమనుకోవాలన్నది జనం విజ్ఞతకే వదిలిపెట్టాల్సిన అంశం. ప్రభుత్వ సంస్థలు అప్పులు తెస్తే తప్పా? ప్రభుత్వ రంగ సంస్థలు అప్పులు తేవటం నేరమన్నట్లు, అదేదో ఘోరమన్నట్లు రామోజీరావు గుండెలు బాదేసుకున్నారు. నిజానికి ప్రభుత్వ గ్యారెంటీతో ప్రభుత్వ పీఎస్‌యూలు అప్పులు తేవటమన్నది చంద్రబాబు హయాంలో బీభత్సంగా జరిగింది. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర పీఎస్‌యూలకు రూ.14,028 కోట్ల అప్పులు రాగా... వాటిని చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలనలో ఏకంగా రూ.59,250 కోట్లకు తీసుకెళ్లిపోయారు. అంటే దాదాపు నాలుగు రెట్లు పెంచేశారు. అయినా రామోజీకి ఎన్నడూ ఇది కనిపించకపోవటమే చిత్రాతిచిత్రం. మద్యం తగ్గటం కనిపించటం లేదా? మద్యాన్ని దశలవారీగా తగ్గించి, నియంత్రిస్తామని ఎన్నికలకు ముందే వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కూడా దానికే కట్టుబడి... దానికి తగ్గట్టే చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగా మద్యం దుకాణాల సంఖ్యను ఏకంగా 40 శాతం తగ్గించేశారు. బాబు హయాంలో ఏకంగా 4,300 మద్యం దుకాణాలుండగా... వాటి సంఖ్యను 2,934కు పరిమితం చేశారు. మద్యం షాపులకు అనుబంధంగా ఉండే పర్మిట్ రూమ్‌లను పూర్తిస్థాయిలో రద్దు చేశారు. దీనికితోడూ చంద్రబాబు ఊరూరా ప్రోత్సహించిన దాదాపు 43,000 బెల్టు షాపుల ఉనికే లేకుండా చేశారు. ఫలితంగా మద్యం వినియోగం రాష్ట్రంలో అంతకంతకూ తగ్గుతూ వస్తోంది. జనం దూరంగా ఉంటారన్న ఉద్దేశంతో ముందు చెప్పినట్లే కొన్నింటిపై రేట్లు పెంచారు. ఇవన్నీ నచ్చని రామోజీరావు తన దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూనే వస్తున్నారు. వైఎస్సార్ నోరు పారేసుకున్నారు.. చంద్రబాబు క్లాస్ పీకారు... చంద్రబాబు, ఇతర నాయకుల విషయంలో రామోజీ రాసే వార్తల్లో ఎంత ‘విష’యం ఉంటుందన్నది ఈ చిన్న వార్తను చూస్తే తెలుస్తుంది. 2008 జూన్ 19న ఒకే రోజు అటు నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశాలు నిర్వహించారు. అందులో కొందరు విలేకరుల తీరుపై ఇద్దరూ అసహనం వ్యక్తం చేశారు. కానీ దానిపై ‘ఈనాడు’ ప్రచురించిన వార్తలకు శీర్షికలేంటో తెలుసా? ఒకదానికేమో ‘మీడియాపై నోరు పారేసుకున్న వైఎస్’. మరోదానికేమో ‘మీడియాకు క్లాస్ పీకిన చంద్రబాబు’. అదీ కథ. ‘ఈనాడు’ జర్నలిజం గురించి, రామోజీ నీతినియమాల గురించి చెప్పటానికి ఇదొక్కటి చాలేమో. అదే విషయాన్ని ఆ మర్నాడు నాటి సీఎల్పీ ఎండగట్టింది. -
అక్కడ ఎనీ టైం మందు.. ఫుల్ కిక్కే కిక్కు..!
సాక్షి,ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మారుమూల గిరిజన తండాల్లో మద్యం ఏరులై పారుతోంది. ఏ సమయంలోనైన(ఏనీటైం) మద్యం బాటిళ్లు దొరకడంతో మందుబాబులు తెల్లవారు జాము నుంచే మత్తులో తూగుతున్నారు. అర్ధరాత్రి గడిచిన గ్రామాల్లో బెల్డ్షాపుల్లో మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. తండాలు, గ్రామాల్లోని కిరాణా దుకాణాల్లోనే బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలకేంద్రంతోపాటు గ్రామాలు, తండాల్లో విచ్చలవిడిగా అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలో 18 గ్రామాలుండగా, 25 బెల్టుషాపులు అనధికారికంగా ఏర్పాటు చేశారు. ఈ షాపుల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు మద్యం విక్రయిస్తున్నారు. హోటళ్లు, బార్లను తలపిస్తున్నాయి. చీప్‌లిక్కర్‌తో మొదలుకొని అన్ని రకాల బ్రాండ్లను అందుబాటులో ఉంచుతున్నారు. బహిరంగంగానే మద్యం విక్రయాలు జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి అందుబాటులో మద్యం వీర్నపల్లి మండలంలోని తండాలు, గ్రామాల్లో నిర్వహిస్తున్న బెల్టుషాపుల్లో ఎప్పుడైనా మందు అమ్ముతున్నారు. ప్రభుత్వ అనుమతులు పొందిన మద్యం దుకాణాలను రాత్రి పదిన్నర గంటలకే మూసివేస్తుండగా, ఇక్కడ మాత్రం అర్ధరాత్రి వరకు కొనసాగిస్తున్నారు. డోర్ డెలీవరీ పద్ధతిలోనూ మద్యం విక్రయాలు సాగడం మరో విశేషం. ఒకప్పుడు నాటుసారా, గంజాయి మత్తులో తూగిన పల్లెలు.. ఇప్పుడు మద్యం కిక్కులో ఉంటున్నాయి. చర్యలు తీసుకుంటాం అక్రమంగా బెల్టు షాపులను ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. దొంగచాటుగా మద్యం విక్రయాలు, హోటళ్లలో సిట్టింగులు పెట్టిన చట్టరీత్యనేరం. దాడులు చేసి బెల్టుషాపులను గుర్తించి మూసివేస్తాం. – ఎంపీఆర్ చంద్రశేఖర్, ఎక్సైజ్ సీఐ,ఎల్లారెడ్డిపేట -
తగ్గిన మద్యం వినియోగం
కావలి: రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 27 నెలలుగా అమలు చేస్తున్న దశల వారీ మద్య నియంత్రణ కారణంగా మద్యం వినియోగం గణనీయంగా తగ్గిందని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. బెల్ట్ దుకాణాలు పూర్తిగా తొలగించడంతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు 40 శాతం, బీరు అమ్మకాలు 78 శాతం తగ్గుముఖం పట్టాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయనేందుకు ఇదే నిదర్శనమని చెప్పారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలోని సెబ్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019 జూన్ నాటికి రాష్ట్రంలో 4,408 మద్యం దుకాణాలు ఉండగా, ప్రభుత్వం 33 శాతం మేర దుకాణాల సంఖ్యను తగ్గించడంతో ప్రస్తుతం 2,975 దుకాణాలు మాత్రమే కొనసాగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వాలు లాభాపేక్షతో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా మద్యం దుకాణాలు నిర్వహించగా.. ప్రస్తుత ప్రభుత్వం దశల వారీ నియంత్రణకు దుకాణాలు తెరిచి ఉంచే సమయాన్ని తగ్గించడంతో పాటు ప్రభుత్వ పర్యవేక్షణలో విక్రయాలు జరిగేలా చర్యలు చేపట్టిందన్నారు. అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కృష్ణకిషోర్‌రెడ్డి, సెబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు,తదితరులు పాల్గొన్నారు. -
గ్రామ‘మందు’ ప్రశాంతత!
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకుని ఉండే మూలపాడు, త్రిలోచనపురం జంట గ్రామాల జనాభా దాదాపు 7 వేలు. సమీపంలోని కేతనపల్లిలో మరో 5 వేల జనాభా ఉంది. రెండేళ్ల క్రితం వరకు మూలపాడులో ఓ మద్యం దుకాణం ఉండేది. సాయంత్రం 4 గంటలు అయితే చాలు పరిస్థితి అదుపు తప్పేది. గొడవలు, కొట్లాటలు నిత్యకృత్యం. దీనికి అనుబంధంగా నాలుగైదు బెల్ట్ దుకాణాలు ఉండేవి. జాతీయ రహదారి నుంచి గ్రామంలోకి వెళ్లే దారిలో ఏర్పాటైన మద్యం దుకాణం పక్క నుంచి నడవాలంటే మహిళలు హడలిపోయేవారు. శుభకార్యాలు జరిగినా మనశ్శాంతి ఉండేది కాదు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దశలవారీ మద్య నియంత్రణలో భాగంగామూలపాడులోని మద్యం దుకాణాన్ని తొలగించారు. దీంతో మూడు గ్రామాల్లో పరిస్థితులు చక్కబడ్డాయి. ఇప్పుడు సాయంత్రం వేళ ఏ గొడవలు, కొట్లాటలూ లేవు. అల్లరిమూకల ఆగడాలు లేవు. మహిళలు ధైర్యంగా రోడ్డుపై నడవగలుగుతున్నారు. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ మద్యపానాన్ని నిరుత్సాహ పరచడంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న దశలవారీ మద్య నియంత్రణ విధానం రాష్ట్రంలోని పల్లెల్లో తెచ్చిన సానుకూల మార్పులు ఇవీ. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 43 వేలకు పైగా బెల్ట్ దుకాణాలను తొలగించారు. దీంతో ప్రతి పల్లెలో మళ్లీ ప్రశాంత వాతావరణం పరిఢవిల్లుతోంది. బెల్ట్ దుకాణాల రద్దు... మద్యం దుకాణాల సంఖ్య తగ్గింపు... మద్యం షాపుల వేళల కుదింపు... షాక్ కొట్టేలా మద్యం ధరలు పెంపు... ఇలా మద్యం విక్రయాలను తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. మద్యం అమ్మకాలు రెండేళ్లలో గణనీయంగా తగ్గడమే ఇందుకు నిదర్శనం. దశలవారీగా కట్టడి ఇలా.. ► రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగుగా బెల్ట్ దుకాణాలను తొలగించింది. టీడీపీ హయాంలో ఒక్కో మద్యం దుకాణానికి అనుబంధంగా విచ్చలవిడిగా బెల్ట్ దుకాణాల వ్యవస్థ కొనసాగింది. ఎటుచూసినా మద్యం లభ్యం కావడంతో విచ్చలవిడిగా విక్రయాలు సాగాయి. పాన్ షాపులు, కాకా హోటళ్లు కూడా బెల్ట్ దుకాణాలుగా రూపాంతరం చెందాయి. గ్రామాల్లో మద్యం ఏరులైపారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 43 వేలకు పైగా బెల్ట్ దుకాణాలను పూర్తిగా నిర్మూలించింది. ► రెండో అడుగుగా టెండర్ల ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు మద్యం దుకాణాలను కేటాయించే విధానాన్ని పూర్తిగా తొలగించింది. ప్రభుత్వమే పరిమితంగా మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. ప్రైవేట్ వ్యక్తులైతే ధనార్జనే లక్ష్యంగా విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగిస్తారు. అందువల్ల ప్రైవేట్ వ్యక్తులకు మద్యం దుకాణాల కేటాయింపు విధానాన్ని తొలగించి ప్రభుత్వమే నిర్వహిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు లేకుండా చేసింది. ► మద్యం దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా తగ్గిస్తోంది. 2019 మే నాటికి రాష్ట్రంలో 4,408 మద్యం దుకాణాలు ఉండగా రెండేళ్లలో ప్రభుత్వం 1,433 దుకాణాలను తగ్గించింది. 2019–20లో 836 దుకాణాలు, 2020–21లో 597 దుకాణాలను రద్దు చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,975 దుకాణాలే ఉన్నాయి. అంటే రెండేళ్లలో 33 శాతం మద్యం దుకాణాలను ప్రభుత్వం రద్దు చేసింది. ► మద్యం దుకాణాల వేళలను కూడా ప్రభుత్వం కుదించింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే అనుమతినిచ్చింది. రెండేళ్లలో గణనీయంగా తగ్గిన విక్రయాలు ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మద్యం విక్రయాలను నిరుత్సాహపరుస్తోంది. దశలవారీగా మద్య నియంత్రణ కోసం అమలు చేస్తున్న విధానాలతో రాష్ట్రంలో రెండేళ్లలో మద్యం అమ్మకాలు భారీగా తగ్గాయి. 2019 మేతో పోలిస్తే 2021 ఆగస్టు నాటికి రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు 40 శాతం తగ్గగా బీరు అమ్మకాలు ఏకంగా 78 శాతం పడిపోవడం గమనార్హం. 40 శాతం పడిపోయిన లిక్కర్ అమ్మకాలు రాష్ట్రంలో లిక్కర్(ఐఎంఎల్) అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. 2018 అక్టోబర్ నుంచి 2019 సెప్టెంబర్ వరకు 3,12,43,860 లిక్కర్ కేసులు అమ్మకాలు జరిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానం తరువాత 2019 అక్టోబరు నుంచి 2020 సెప్టెంబరు వరకు 1,88,81,430 లిక్కర్ కేసులు మాత్రమే విక్రయాలు జరిగాయి. ఇక 2020 అక్టోబర్ నుంచి 2021 జూలై ఆఖరు వరకు 1,72,33,528 లిక్కర్ కేసులు విక్రయించారు. అంటే లిక్కర్ అమ్మకాలు 40 శాతం తగ్గాయి. బీరు అమ్మకాలు 78 శాతం డౌన్ రాష్ట్రంలో బీరు విక్రయాలు భారీగా తగ్గాయి. 2018 అక్టోబరు నుంచి 2019 సెప్టెంబరు వరకు 2,44,07,717 బీరు కేసులు విక్రయించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానం తరువాత 2019 అక్టోబరు నుంచి 2020 సెప్టెంబరు వరకు కేవలం 52,26,185 బీరు కేసులు మాత్రమే విక్రయించడం గమనార్హం. 2020 అక్టోబరు నుంచి 2021 జూలై 31 నాటికి 52,00,915 బీరు కేసులే విక్రయించారు. రాష్ట్రంలో బీరు అమ్మకాలు ఏకంగా 78 శాతం తగ్గాయి. అశాంతి నుంచి శాంతివైపు మాది మత్స్యకార గ్రామం. రెండేళ్ల క్రితం వరకు మద్యం దుకాణం ఉండేది. సాయంత్రమైతే చాలు మందుబాబుల అరుపులు, కేకలు, గొడవలతో భయం వేసేది. ఆడవాళ్లు, పిల్లలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయేవారు. చీకటి పడితే ఇతర ప్రాంతాల నుంచి మా ఊరికి రావడానికి జంకేవారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామంలో మద్యం దుకాణాన్ని తొలగించారు. దీంతో మా ఊరిలో శాంతి నెలకొంది. కాయకష్టం చేసుకునే వాళ్లు పొదుపు చేయడం ప్రారంభించడం సంతోషం కలిగిస్తోంది. – పినపోతు దుర్గ, పీబీవీపాలెం, కోరంగి, తూర్పు గోదావరి జిల్లా ఊర్లో ప్రశాంతత.. సాయంత్రమైతే చాలు మా ఊరిలో మద్యం మత్తులో గొడవలు, కొట్లాటలు జరిగేవి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత మద్యం దుకాణాన్ని తొలగించడంతో ప్రశాంతంగా ఉంది. సాయంత్రమైనా రాత్రి అయినా సరే ఆడవాళ్లు ధైర్యంగా గ్రామంలోకి రాగలుగుతున్నారు. – దేవరకొండ నాగరాణి, మూలపాడు, కృష్ణా జిల్లా రోడ్డు ప్రమాదాలు తగ్గాయి మద్యం మత్తులో ఈ ప్రాంతంలో ఎంతోమంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల క్రితం మద్యం దుకాణం తొలగించడంతో మా గ్రామంలో రోడ్డు ప్రమాదాలు బాగా తగ్గాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. – గొట్టిముక్కల పోతురాజు, మూలపాడు, కృష్ణా జిల్లా. బెల్టు రద్దుతో మనశ్శాంతి టీడీపీ హయాంలో మా ఊర్లో నాలుగు బెల్టు దుకాణాలు ఉండేవి. సాయంత్రమైతే చాలు మందుబాబుల చిందులతో బయటకు రావాలంటేనే భయపడేవాళ్లం. రెండేళ్ల క్రితం బెల్టు దుకాణాలను తొలగించడంతో ఊరు ప్రశాంతంగా ఉంది. కుటుంబాల్లో మనశ్శాంతి నెలకొంది. – బండి వెంకటలక్ష్మి, కె సముద్రపుగట్టు, అత్తిలి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా పేద కుటుంబాలు బాగుపడుతున్నాయి గత ప్రభుత్వ హయాంలో మా గ్రామంలో మద్యం దుకాణం ఉండేది. ఎంతోమంది మద్యానికి బానిసలుగా మారి ఆరోగ్యం పాడుచేసుకోవడంతో పాటు కష్టార్జితాన్ని మద్యం దుకాణాలకే ధారపోసేవారు. ఇప్పుడు మద్యం దుకాణాన్ని తొలగించారు. ఊర్లో మందు దొరకడంలేదు. మద్యం ధరలు కూడా బాగా పెంచడం మంచిదైంది. పేదలు మరో ఊరు వెళ్లి అంత డబ్బు పెట్టి కొనేందుకు సాహసించడం లేదు. దీంతో కుటుంబాలు బాగు పడ్డాయి. – సాకే గౌతమి, సర్పంచ్, సనప గ్రామం, అనంతపురం జిల్లా -
సీఎం జగన్ ఆదేశంతో 108 కోట్లు మిగులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వం 108 కోట్ల రూపాయలు ఆదా చేసిందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... గతంలో మద్యం షాపులు రెంట్‌కు తీసుకున్నామని, ఇదే విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. దీంతో ఆయన మద్యం షాపులపై రివర్స్ టెండరింగ్ వేయాలని ఆదేశించారన్నారు. సీఎం జగన్ ఆదేశం మేరకు మద్యం దుకాణాలపై రివర్స్ టెండరింగ్ వేశామన్నారు. (చదవండి: డిసెంబర్ 10 నాటికి ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్‌లు) ఈ నేపథ్యంలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బెల్టు షాపుల రెంట్‌పై దాదాపు 108 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగిలాయని వెల్లడించారు. 2019-20లో షాపులకు 671.04 కోట్ల రూపాయల రెంటు చెల్లించామని చెప్పారు. అదే రివర్స్ టెండరింగ్ ద్వారా 2020-21 ఏడాది కేవలం 562.2 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించామని తెలిపారు. అంటే దాదాపు 16.22 శాతం ప్రభుత్వ నిధులు ఆదా చేశామన్నారు. అంతేగాక మద్యపానం తగ్గించడం వల్ల రాష్ట్రంలో నేరాలు ప్రమాదాలు బాగా తగ్గాయని ఆయన పేర్కొన్నారు. (చదవండి: ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లు) -
తూలేవాడిని నిలబెట్టింది!
సాక్షి కడప: మందుబాబులకు మద్యం బరువుగా, భారంగా మారుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం నెరవేరుతోంది. అక్క చెల్లెమ్మల జీవితాల్లో కష్టాలు తొలగి వెలుగు రేఖలు ప్రసరిస్తున్నాయి. ప్రజారోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం కఠినంగా మద్య నియంత్రణ చర్యలను అమలు చేస్తుండటంతో మార్పు కళ్ల ముందే కనిపిస్తోంది. టీడీపీ హయాంలో వైఎస్సార్ జిల్లాలో 1,200కిపైగా బెల్ట్ షాపులు ఉండగా ప్రభుత్వం వీటిని పూర్తిగా నిర్మూలించింది. ఇక టీడీపీ హయాంలో జిల్లాలో 255 మద్యం దుకాణాలు ఉండగా ప్రస్తుతం 173కి కుదించారు. ధరలు భారీగా పెంచడం, విక్రయ వేళలను తగ్గించడం, దుకాణాల కుదింపుతో చాలామంది మద్యానికి దూరంగా ఉంటున్నారు. సాధారణంగా అయితే ఆపను.. ‘నాకు 15 ఏళ్లుగా మద్యం అలవాటు ఉంది. రోజూ తాగనిదే నిద్ర పట్టేది కాదు. నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటిసారి మద్యం ధరలు పెంచినప్పుడు గతేడాదే మానేద్దామనుకున్నా. ఇటీవల మరోసారి రేట్లు పెంచడంతో అనవసరంగా డబ్బులు తగలేయడం తప్ప ఒరిగేదేమీ లేదని పూర్తిగా మానేశా. ఇక ఎప్పుడూ మద్యాన్ని ముట్టను. సాధారణంగా అయితే మద్యాన్ని మానుకునేవాడిని కాదు. సీఎం జగన్ సార్‌కు కృతజ్ఞతలు’ – ఎస్.సిరాజ్‌ఖాన్ (జమాల్‌పల్లె, సీకే దిన్నె మండలం, కమలాపురం నియోజకవర్గం) ఎక్కడబడితే అక్కడ పడేవాడ్ని.. ‘కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తా. నాకు పదేళ్లకు పైగా మద్యం అలవాటు ఉంది. కుటుంబ బాధ్యతలు పట్టించుకోకుండా తిరిగేవాడిని. తాగిన మత్తులో ఎక్కడంటే అక్కడ పడిపోయేవాడిని. పిల్లల ఛీత్కారా లతోపాటు మద్యం ధరలు పెరగడంతో తాగుడంటే విరక్తి చెంది మారిపోయా. నాలుగు నెలలుగా మందు జోలికి వెళ్లడం లేదు. కలహాలు లేకుండా కుటుంబంతో ఆనందంగా ఉన్నా. మద్యానికి వెచ్చించే డబ్బులతో పిల్లలకు పండ్లు, చిరుతిండ్లు తెచ్చి ఇస్తున్నా. వారి కళ్లల్లో ఆనందం చూసి ఇక జీవితంలో తాగకూడదని నిర్ణయిం చుకున్నా. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు’ – ఎస్.హరిబాబు (కడప) సానా వరకు తాగటం తగ్గింది... ‘రాజంపేట సబ్‌స్టేషన్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నా. కూలి పనులకు కూడా వెళతా. రాత్రి మందు పడితేగానీ పొద్దున పనికి వెళ్లేవాడిని కాదు. కరోనా కారణంగా దాదాపు రెండు నెðలలు మందు దొరక లేదు. మళ్లీ షాపులు తెరిచాక రెండు రోజులు తాగా. గతంలో రూ.200–250 మాత్రమే అయ్యే మద్యం ఖర్చు ఇప్పుడు రూ.600 వరకు అవుతోంది. లాక్డౌన్ లో మందు లేకుండా ఉండగలిగినప్పుడు ఇప్పుడు ఎందుకు ఉండలేననే పట్టుదలతో మందు మానేశా. పనులు లేనప్పుడు ఇంటివద్దే మనవళ్లు, మనవరాళ్లను ఆడిస్తూ సంతోషంగా ఉన్నా. మా ఊళ్లో మందు తాగే టోళ్లంతా సానా వరకు తాగడం తగ్గించినారు. సీఎం జగన్ మంచి పనే చేశారు. మిగతా షాపులు కూడా ఎత్తేస్తే అందరికి నాలుగు డబ్బులు మిగులుతాయి’ – గొంటు సుబ్బన్న (కొమ్మివారిపల్లె, రాజంపేట మండలం) మత్తు వదిలింది...! ‘భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ రోజుకు రూ.500 దాకా సంపాదిస్తా. భార్యతోపాటు ఇద్దరు కుమారులున్నారు. మద్యం మత్తుతో ఒళ్లు నొప్పులు తెలియవని దీర్ఘకాలంగా తాగుడు వ్యసనానికి బానిసనయ్యా. నిత్యం రూ.150 వరకు తాగుడుకు ఖర్చయ్యేది. లాక్డౌన్ వల్ల చాలా రోజులు మద్యానికి దూరమయ్యా. ఇప్పుడు మద్యం రేట్లు పెరగడంతో తాగుడు మానుకున్నా. ఇప్పుడు ఆరోగ్యం కూడా బాగుంది. అంతా కలసి భోజనం చేయడం, పిల్లలతో గడపడం ఆనందాన్ని ఇస్తోంది. మద్యం మత్తు నుంచి బయటపడటం చాలా సంతోషంగా ఉంది’ – మద్దెల సుధాకర్ (సిద్దవటం, రాజంపేట నియోజకవర్గం) -
30 ఏళ్ల వ్యసనం పోయింది
సాక్షి ప్రతినిధి, ఏలూరు: దశలవారీ మద్య నియంత్రణ చర్యలతో దశాబ్దాలుగా తాగుడుకు బానిసలైన వారిలో పరివర్తన, పశ్చాత్తాపం కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ హయాంలో 475 మద్యం దుకాణాలుండగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే గతేడాది వంద షాపులను తగ్గించింది. ఈ ఏడాది మరికొన్ని దుకాణాలను తగ్గించడంతో ప్రస్తుతం 318 మద్యం షాపులే మిగిలాయి. గతంలో ఒక్కో మద్యం దుకాణానికి అనుసంధానంగా నాలుగైదు బెల్టు షాపులుండేవి. రాష్ట్ర ప్రభుత్వం 2 వేలకుపైగా బెల్టు షాపులను పూర్తిగా నిర్మూలించడంతో ప్రశాంతత నెలకొంది. గతేడాదితో పోలిస్తే మద్యం విక్రయాలు కూడా భారీగా తగ్గాయి. షాక్ కొట్టేలా ధరలను పెంచడంతో పలువురు తాగుడును విడనాడి కుటుంబంతో కలసి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆరోగ్యంతోపాటు వ్యాపారమూ బాగుంది. తొమ్మిదేళ్లుగా గ్రామంలో బిర్యానీ వ్యాపారం చేస్తున్నా. రోజూ సంపాదనలో ఎక్కువ భాగం మందుకే ఖర్చు చేసేవాడిని. ధరలు పెరగడంతో ఎనిమిది నెలలుగా తాగడం మానేశా. ఆరోగ్యం బాగుపడటంతోపాటు వ్యాపారం కూడా పెరిగింది. వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటున్నా. ముఖ్యమంత్రి నిర్ణయంతో చాలా మంది మద్యానికి దూరం అవుతున్నారు. – తుంగతుర్తి వెంకటరాజు, సీహెచ్ పోతేపల్లి, ద్వారకా తిరుమల మండలం మందుతోనే ముఖం కడిగా.. నిరుపేద కుటుంబంలో జన్మించా. చదువు అబ్బలేదు. కూలీ పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బంతా తాగుడుకే తగలేసేవాడిని. మందుతోనే ముఖం కడిగి మందుతోనే నిద్రపోయేవాడిని. పెళ్లి అయినా నేను మారలేదు. ఈ హింస భరించలేక పిల్లల భవిష్యత్తు కోసం నా భార్య కువైట్ వెళ్లిపోయింది. ఇద్దరు పిల్లల్ని నానమ్మ, తాత వద్ద ఉంచి మళ్లీ మందులోనే మునిగిపోయా. జగనన్న మద్యాన్ని నియంత్రిస్తానంటే మా కడుపు కొడుతున్నాడని తిట్టుకున్నా. అంచెలంచెలుగా ధరలు పెంచి విక్రయాలను కట్టడి చేయడంతో తాగుడు పూర్తిగా మానేశా. తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకుంటూ పిల్లలతో గడుపుతున్నా. –పుచ్చకాయల సత్యానందం, పాలకోడేరు మండలం ఇంటి కోసం ఖర్చు చేస్తున్నా.. నాకు 30 ఏళ్లుగా తాగుడు అలవాటు ఉంది. కూలి పనులు ఉన్నా లేకున్నా ప్రతి రోజూ తాగేవాడిని. ఏడాదిగా మద్యం రేట్లు విపరీతంగా పెరగడంతో తాగుడు మానుకున్నా. ఆ డబ్బును ఇంటి కోసం ఖర్చు చేస్తున్నా. కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నా. – ఎంవీవీ సుబ్బారావు గోపాలపురం -
మందు బాబులను ఆగమాగం చేస్తోంది...
సాక్షి, హైదరాబాద్: కరోనా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కడుపులో సమయానికి ముద్ద లేకున్నా ఫర్వాలేదు కానీ చుక్క పడకపోతే కాళ్లు చేతులు ఆడవు. నాలుక పిడచ కట్టుకుపోతుంది. నరాలన్నీ ఒక్కసారిగా లాగుతూ మందు బాబును నిలబడనీయడంలేదు. ఏ బ్రాండ్ అయినా ఫర్వాలేదు పెగ్గు ఉన్నా చాలు అన్నట్లుంది వారి పరిస్థితి. ఏదో ఒకటి నాలుగు చుక్కలు నోట్లో పడితే చాలన్నట్లు మందు కోసం ఉరుకులు పరుగులు తీస్తున్నారు. చివరకు గుడుంబా, నాటుసారాల వైపు చూస్తున్నారు. అదీ లేకుంటే కల్లు కోసం కల్లు దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాటి వనాల వద్ద ఈ మందు బాబుల హాల్చల్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం నిద్రలేవగానే గొంతులో మందు చుక్క పడనిదే అడుగు ముందుకు వేయని మందుబాబులు...లాక్డౌన్ కారణంగా కొన్ని రోజులుగా మద్యం లభించకపోవడంతో పిచ్చివాళ్లుగా మారుతున్నారు. లాక్‌డౌన్‌తో మద్యం దుకాణాలను సైతం బంద్ చేశారు. నగరంలోని పలుచోట్ల కొందరు మద్యం లేక నానా అవస్థలు పడుతున్నారు. మద్యం షాపు వద్దకు వచ్చి మద్యం ఇవ్వాలంటూ మారాం చేస్తున్నారు. మరికొంతమంది వైన్ షాపుల వద్ద మద్యం కోసం పడిగాపులు పడుతున్నారు. మరోవైపు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్‌లో ఉంటున్న మధు అనే పెయింటర్ మద్యం దొరక్క మతిస్థిమితం కోల్పోయాడు. భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లాక్‌డౌన్‌తో కిక్కు కరువై కరోనా వైరస్ (కోవిడ్–19) మందు బాబులను ఆగమాగం చేస్తోంది. లాక్‌డౌన్‌తో బార్లు, మద్యం దుకాణాలు కూడా మూత పడడంతో మద్యం కోసం నానాయాతనలు పడుతున్నారు. అక్కడక్కడా బెల్టు షాపులు ఆదుకున్నా.. అక్కడ కూడా నిల్వలు అడుగంటిపోవడం.. ధరలు నింగినంటడంతో లబోదిబోమంటున్నారు. మొన్నటి వరకు ఖరీదైన బ్రాండ్లు తప్ప మద్యం ముట్టని బడాబాబులు కూడా చోటామోటా బ్రాండ్లతో సరిపుచ్చుకుంటున్నారు. కేవలం 24 గంటలపాటే జనతా కర్ఫ్యూ ఉంటుందని భావించిన మందుబాబులు.. మద్యం కొనుగోళ్లపై ముందుచూపు ప్రదర్శించలేదు. రాత్రికి రాత్రే ఏప్రిల్ 14వరకు లాక్డౌన్ ప్రకటించడంతో బిత్తరపోయారు. (కరోనా: ధోని విరాళం రూ. లక్ష.. సిగ్గు పడండి!) చేసేదేమీలేక వైన్స్‌షాపులు, బెల్టు షాపుల్లో ఉన్నవాటిని గుట్టుగా కొని గుటకేసినా.. అక్కడ కూడా మందు సీసాలు ఖాళీ కావడంతో దేశీ మద్యం వైపు చూస్తున్నారు. దేశీ మద్యం అంటే అదేంటో అనుకుంటున్నారా? అదేనండీ గుడుంబా, నాటుసారా. ఆఖరికి కల్లు. ఈ మూడే ప్రస్తుతం మందుబాబులకు ఆదుకుంటున్నాయి. అయితే, ఇవీ కూడా ఎక్కడపడితే అక్కడ దొరకడంలేదు. కేవలం మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనే ఇవి లభ్యమవుతున్నాయి. గుడుంబా అమ్మకాలను నిషేధించడంతో ఐదేళ్ల క్రితమే వీటి తయారీని నిలిపివేసిన తయారీదారులు.. అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. దీంతో గుట్టుగా నాటుసారా బట్టీలను మొదలుపెట్టారు. (అగ్రరాజ్యం అతలాకుతలం) తాటివనాల్లో మందు..విందు! ఉద్యోగ, ఉపాధిరీత్యా ఇన్నాళ్లూ హైదరాబాద్ సహా పట్టణాల్లో ఉన్నవారంతా లాక్డౌన్ పుణ్యామా అని పల్లెబాట పట్టారు. మద్యం లభ్యం కాకపోవడం... దొరికినా భారీ రేట్లు పలుకుతుండడంతో కల్లు సేవించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని తాటి వనాల్లో ఎక్కడ చూసినా మందుబాబుల సందడే కనిపిస్తోంది. దీనికితోడు చికెన్ ధరలు కూడా పడిపోవడంతో కల్లు చుక్క..చికెన్ ముక్కతో ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో మొన్నటివరకు రూ.20 నుంచి 30 వరకు దొరికే కల్లు సీసా ఇప్పుడు రూ.40 నుంచి రూ.50 వరకు పలుకుతోంది. పట్టణాలు, మండలాల్లో కల్లు దుకాణాలు బంద్ కావడంతో కల్లు ప్రియులు గందరగోళంలో పడ్డారు. కల్లు డిపోలు తెరవాలని ముస్తేదార్లపై ఒత్తిడి తెస్తున్నారు. కలుకు బానిసలైన కొంతమంది మాత్రం మానసికంగా బాధపడుతూ ఆస్పత్రుల పాలవుతున్నారు. (కేవలం 5 నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ!) ఆస్పత్రులకు క్యూ కడుతున్న కల్లు బాధితులు నిజామాబాద్ జిల్లాలో కల్లు ప్రియులు ఆందోళనకు గురవుతున్నారు. లాక్డౌన్ కారణంగా కల్లు దుకాణాలు మూతపడటంతో కల్తీ కల్లు బాధితులు మతి స్థిమితం తప్పి ప్రవర్తిస్తున్నారు. దీంతో చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు ... వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా నగరంలోని ముదిరాజ్‌గల్లిలో భూషణ్ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందారు. అయితే లాక్డౌన్ కారణంగా కల్లు దొరకకపోవడంతో పిట్స్ వచ్చి మృతి చెందాడని స్థానికులు చెబుతున్నారు. వైన్ షాపులో చోరీ ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో మందుబాబులు ఏకంగా వైన్ షాపుకే కన్నం వేశారు. చేతికి అందినన్ని మందు బాటిల్స్‌ను పట్టుకెళ్లారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజీగూడెంలోని శ్రీ సాయి వైన్స్‌లో ఆగంతకులు షాపు షట్టర్స్ పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఫిర్యాదు అందుకున్న సివిల్, ఎక్సైజ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, విచారణ చేపట్టారు. -
బెల్ట్ షాపుల వెనుక టీడీపీ ముఖ్య నేతలు ఉన్నారు
-
బెల్టు షాపులు మూసేస్తే నగదు బహుమతి
-
బెల్టు షాపుల మూసివేతపై 'ఆ' శాఖల మధ్య వివాదం
సాక్షి, బాల్కొండ: విచ్చలవిడిగా మద్యం అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండగా.. ప్రభుత్వం తమకు ఇచ్చిన టార్గెట్‌కు అనుగుణంగా మద్యం అమ్మకాలను ఎక్సైజ్ శాఖ ప్రోత్సహిస్తుంది. బెల్టుషాపుల కొనసాగింపుపై ఎక్సైజ్ శాఖ సానుకూలంగా వ్యవహరిస్తుండగా, పోలీసులు కఠినంగా ఉన్నారు. దీంతో ఇరుశాఖల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. మూసి ఉన్న బెల్టుషాపులను పునఃప్రారంభించుకోవచ్చని ఎక్సైజ్ అధికారులు నిర్వాహకులకు అనధికారికంగా సూచించిగా ఒక రోజు దుకాణాలు తెరిచారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో బెల్టుషాపులకు తాళాలు పడ్డాయి. ఇలా బెల్టుషాపుల నిర్వహణపై ఎక్సైజ్, పోలీసు శాఖలు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. జిల్లాలో లైసెన్స్డ్ మద్యం దుకాణాలు 95 ఉన్నాయి. నిజామాబాద్ నగర కార్పొరేషన్ పరిధిలోని మద్యం దుకాణాలను మినహాయించి జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో ఉన్న మద్యం దుకాణాలకు అనుబంధంగా బెల్టుషాపులు కొనసాగుతున్నాయి. లైసెన్స్డ్ మద్యం దుకాణాల్లో రోజుకు రూ.లక్ష మద్యం విక్రయిస్తే బెల్టు షాపులకు తరలించిన మద్యం ద్వారా అదనంగా రూ.రెండు లక్షల గిరాకీ పెరుగుతుంది. బెల్టుషాపుల ద్వారానే అత్యధికంగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. అనధికార సూచనలు! ప్రభుత్వం తమకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం మద్యం అమ్మకాలు జరగడానికి ఐఎంఎల్ డిపోల నుంచి వ్యాపారులు మద్యం కొనుగోలు చేసేలా ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మద్యం అమ్మకాలు పెరగాలంటే బెల్టుషాపులు ప్రధానం అని భావించిన ఎక్సైజ్ అధికారులు లైసెన్స్డ్ మద్యం దుకాణాలు లేని గ్రామాల్లో బెల్టుషాపులు కొనసాగించడానికి అనధికార అనుమతి ఇచ్చారు. ‘దిశ’ ఘటన మద్యం మత్తులో జరిగిందనే విషయాన్ని గుర్తించిన పోలీసులు మద్యం అమ్మకాలను నియంత్రించడంపై దృష్టి సారించారు. లైసెన్స్డ్ మద్యం దుకాణాలను మూయించే అధికారం లేకపోవడంతో పోలీసులు బెల్టు దుకాణాలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని బెల్టుషాపులను మూయించడానికి ఉన్నతాధికారులు ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు. సుమారు పదిహేను రోజుల నుంచి బెల్టుషాపులను పోలీసుల ఆదేశాలతో నిర్వాహకులు మూసి ఉంచుతున్నారు. బెల్టుషాపులు మూసి ఉండటంతో మద్యం అమ్మకాలు అనుకున్నంత సాగడం లేదని వ్యాపారులు ఎక్సైజ్ అధికారులకు వివరించారు. తాము పోలీసు ఉన్నతాధికారులతో చర్చించామని ఎక్సైజ్ అధికారులు చెప్పడంతో నిర్వాహకులు బుధవారం బెల్టుషాపులను తెరిచారు. దీనిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో గురువారం నుంచి మళ్లీ దుకాణాలను మూసి ఉంచుతున్నారు. బెల్టుషాపులు మూసి ఉంచడంతో ఐఎంఎల్ డిపోల నుంచి ఎక్కువ మొత్తం మద్యం కొనుగోలు చేయలేమని వ్యాపారులు పేర్కొంటున్నారు. అటు ప్రభుత్వం మద్యం అమ్మకాలకు టార్గెట్ నిర్ణయించడం, ఇటు బెల్టుషాపులు మూసి ఉండటంతో ఎక్సైజ్ అధికారులు సందిగ్ధంలో పడ్డారు. మద్యం అమ్మకాల విషయంలో రెండు ప్రభుత్వ శాఖల మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఏర్పడటం చర్చనీయాంశం అయింది. మాకు టార్గెట్ ఉంది మద్యం దుకాణాల ద్వారా నిర్ణీత లక్ష్యం మేరకు మద్యం అమ్మాలని టార్గెట్ నిర్ణయించారు. లైసెన్స్డ్ వ్యాపారులు ఐఎంఎల్ డిపోల నుంచి టార్గెట్ ప్రకారం మద్యం కొను గోలు చేయాలి. ప్రస్తుత పరిస్థితిలో మద్యం అమ్మకాలు తగ్గడం మాకు కొంత ఇబ్బందే. – శేఖర్, ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్, మోర్తాడ్ -
మంచిగా చెప్తే వినరురా మీరు : మహిళలు
సాక్షి, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : కెరమెరిలో మండలంలో బెల్టు షాపు నిర్వాహకుడిపై ఆదివాసీ మహిళలు బుధవారం దాడి చేశారు. బెల్టు షాపు నిర్వహించవద్దని గతంలోనే మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. అయినా తీరు మారకపోవడంతో ఆగ్రహించిన మహిళలు నిర్వాహకుడిని చితకబాదారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఏజెన్సీలో సంపూర్ణ మద్య నిషేధం అమలవుతుండగా, గిరిజన సంఘాల తీర్మానం మేరకు ఏజెన్సీ ప్రాంతంలోని వైన్‌షాపులకు అధికారులు టెండర్లు పిలవలేదు. దీంతో ఏజెన్సీలో వైన్‌షాపులు లేవు, మద్యం అమ్మకాలు లేవు. బెల్టుషాపులు కూడా ఉండొద్దంటూ ఆదివాసీ మహిళలు ఊరూరా తిరిగి షాపులలో ఉన్న మద్యం సీసాలను అప్పుడే ధ్వంసం చేశారు. సంఘాల తీర్మానాన్ని ఎవరైనా అతిక్రమిస్తే పది వేల రూపాయల జరిమానాతో పాటు దుకాణాల మీద దాడులు తప్పవని గతంలోనే హెచ్చరించారు. -
మందు.. మేమే అందిస్తాం..!
సాక్షి, ములుగు: జిల్లాలో మద్యం వాప్యారం యధేచ్ఛగా కొనసాగుతోంది. ఉన్నత అధికారులతో సంబంధం లేకుండా ప్రతి రోజూ విచ్ఛలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు నియమాలను అమలు చేయాల్సిన సంబంధిత శాఖ అధికారులు నిద్రమత్తులో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నూతనంగా ఏర్పాటైన వైన్స్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో బెల్టు షాపులు యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. స్పందించాలి్సన అధికారులు తూతూ మంత్రంగా దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులతో పోలిస్తే పోలీసు శాఖ జరిపే దాడుల్లోనే అధికంగా కేసులు నమోదు అవుతుండడం విశేషం. ప్రత్యేక వాహనాల్లో బెల్టు షాపులకు మద్యం..! గతంలో జిల్లాలోని వివిధ గ్రామాల బెల్టు షాపుల వ్యాపారులు మండల కేంద్రాల్లోని వైన్స్ నుంచి మద్యం కొనుగోలు చేసి గ్రామాల్లో అమ్మకాలు జరిపేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి తారుమారయింది. ఉన్నత అధికారుల నిఘా లోపించడంతో వ్యాపారులు ఒకడుగు ముందుకు వేసి ఆయా మండలాల వారీగా సిండికేట్‌గా మారి ప్రత్యేక వాహనంలో గ్రామాలకు మద్యం తరలిస్తూ బహిరంగంగా వ్యాపారాన్ని కొనసాగిస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నారని తెలుస్తుంది. ఈ దందాను నిలవరించే వారే లేకపోవడంతో వైన్స్ వ్యాపారులు రోజు వారీగా బహిరంగ వ్యాపారాలు జరుపుకుంటూ మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందాన దందాను విస్తరిస్తున్నారు. ములుగు, వెంకటాపురం(ఎం), ఏటూరునాగారం, వెంకటాపురం(కే), వాజేడు, మంగపేట, ఎస్ఎస్ తాడ్వాయి మండలాల్లోని వైన్స్ వ్యాపారులు నిత్యం బెల్టు షాపుల నిర్వాహకులకు ఏదో ఒక సమయంలో గుట్టుచప్పుడు కాకుండా మద్యం సరఫరా చేస్తూ దందా కొనసాగిస్తున్నారు. మంగపేటలో ఇతర ప్రాంతాల నుంచి.. మంగపేట మండలంలోని రాజుపేట, చుంచుపల్లిలో 1/70 చట్టంలో భాగంగా వైన్స్ నిర్వహణ లేదు. ఈ పరిణామాన్ని ఆసరాగా తీసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక మండలం జానంపేట, ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని కాటాపురం, ఏటూరునాగారం మండలకేంద్రం నుంచి ఆటోల ద్వారా బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారని తెలుస్తుంది. కొంత మంది నేరుగా ద్విచక్ర వాహనాల ద్వారా బెల్టు షాపులకు మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం. ఒక్కో బాటిల్‌పై రూ.30 అధికం గ్రామాల్లోని »బెల్టు షాపులకు వైన్స్ వ్యాపారులు ఒక్కో బీరు, క్వార్టర్ బాటిల్‌ను రూ. 10 చొప్పున ఎక్కువకు సరఫరా చేస్తున్నారు. దీంతో బెల్టు షాపుల వ్యాపారులు అదే బాటిల్‌పై రూ. 30 అధికంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని మద్యం ప్రియులు తమ జేబులను గుళ్ల చేసుకోవాలి్సన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో పలుమార్లు ఫిర్యాదులు అందినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. ఈ విషయంలో ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి్సన అవసరం ఉంది. -
బెల్ట్ షాపులపై మహిళల దాడి
సాక్షి, వేంసూరు(ఖమ్మం) : అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను తొలగించాలని అనేకసార్లు ఎక్సెజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో గ్రామంలోని మహిళలందరూఏకమై బెల్ట్ షాపును తొలగించారు. మండల పరిధిలోని జయలక్ష్మీపురంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్‌షాపులపై సోమవారం మహిళలు దాడులు నిర్వహించారు. మద్యంసీసాలను ధ్వంసం చేశారు. బెల్ట్ షాపులు తొలగించాలని నినాదాలు చేస్తూ సోమవారం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. జయలక్ష్మీపురం పంచాయతీ ఆంధ్రా సరిహద్దులో ఉందని, అక్కడ మద్యపాన నిషేధం అమలు కావడంతో, గ్రామంలో అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు చేస్తున్నారని ఆరోపించారు. మహిళలు కిరాణా షాపునకు వెళ్లాలన్నా ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యపానం వల్ల యువత పెడదోవ పట్టడంతో పాటు కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా బెల్ట్ షాపులను పూర్తి తొలగించాలని కోరారు. -
బెల్టు తీయాల్సిందే!
‘కంచె.. చేను మేసిన రీతి’గా.. జిల్లాలో కొందరు ఆబ్కారీ అధికారుల అండదండలతో అడ్డగోలుగా బెల్ట్ షాపులను నడుపుతున్నారు. నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నా.. వీరికి మాత్రం అవి వర్తించవన్నట్లుగా ఈ తతంగం సాగుతుంది. దీంతో గ్రామాలు మద్యం మత్తులో జోగుతున్నాయి. ఇటీవల కొత్త మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు కట్టబెట్టడంతో కొత్తగా బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసుకునే పని ఊపందుకుంది. సాక్షి, మహబూబ్‌నగర్ : నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్నారు. జిల్లాలో మొత్తం 67 మద్యం దుకాణాలున్నాయి. ఇటీవల వీటన్నింటికి కొత్తగా లైసెన్సులు జారీ చేశారు. మరో రెండేళ్ల పాటు వీరే దుకాణాలను నడిపించనున్నారు. దుకాణాలతో పాటు అనధికారికంగా దుకాణాలు ఏర్పాటవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా అనధికారికంగా బెల్టు దుకాణాలు సుమారు 350పైబడి ఉన్నట్లు సమాచారం. అత్యధికంగా నవాబ్‌పేట, దేవరకద్ర, జడ్చర్ల ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి అధికారిక దుకాణాల కంటే రెండింతలు అధికంగా ఈ దుకాణాలున్నాయి. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో రోజుకి రూ.3.50కోట్ల మేర అమ్మకాలు జరుగుతున్నాయి. కేవలం అనుమతుల్లేని దుకాణాల ద్వారానే రూ.30 లక్షల నుంచి రూ.40లక్షల వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. పలు బెల్టు దుకాణాల్లో రోజుకి రూ.50వేల మద్యం అమ్ముడవుతోంది. వీటిల్లో పగలు, రాత్రిళ్లు మద్యం విక్రయాలు జరుగుతుండడంతో యువత మద్యానికి బానిసవుతున్నారు. నిబంధనలు ఇలా.. ఎలాంటి లైసెన్సులు లేకుండా మద్యం విక్రయాలు జరపడం చట్టవిరుద్ధం. ఇలాంటి వారిపై ఆబ్కారీ శాఖ అధికారులకు నేరుగా కేసులు నమోదు చేసే అధికారం ఉంది. పట్టుబడిన వారికి శిక్షతో పాటు భారీ జరిమానాలు అమలవుతాయి. 34ఏ టీఎస్ ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేస్తారు. ఒక వ్యక్తి వద్ద ఆరు లీటర్లు(బాటిళ్ల) మద్యం కలిగి ఉండవచ్చన్న నిబంధన ఉంది. అంతకు మించి ఉంటే అక్రమ మద్యంగా గుర్తిసారు. శుభకార్యాలు జరిగినా, విందు కార్యక్రమాలు ఉన్నా ఆరు బాటిళ్లకు మించి తీసుకోవద్దు. వాస్తవానికి ఒక వ్యక్తికి ఇంతకు మించి విక్రయించొద్దు. ఆబ్కారీ శాఖ నుంచి అనుమతి ఉంటే గానీ నిబంధనలు దాటి మద్యం ఇవ్వకూడదు. ఇంత కఠినంగా నిబంధనలు ఉన్నా బెల్టు దుకాణాలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. మొక్కుబడిగా కేసులు బెల్టు దుకాణాల్లో కొందరు సిబ్బంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. తమ బంధువులు, స్నేహితుల ద్వారా అనధికారికంగా మద్యం దుకాణాలు ఉంటే మొక్కబడిగా కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారు. బెల్టు దుకాణాల నుంచి సర్కిళ్ల వారీగా మామూళ్లు ముడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న బెల్టు దుకాణాల నుంచి నెలకు రూ.2నుంచి రూ.4వేల వరకు వసూలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. దీంతో వీటిపై దాడులు చేసేందుకు సాహసించట్లేదు. నిజానికి గొలుసు దుకాణంపై దాడి జరిగినపుడు మద్యం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై దర్యాప్తు జరగాలి. ఆ దుకాణంపై కూడా కేసు నమోదు చేయాలి. మద్యం సీసాలపై పక్కా ఆధారాలు కూడా ఉంటాయి. కానీ, ఈ తరహాలో అధికారులు దర్యాప్తు చేయట్లేదు. ఒకవేళ వివరాలు తెలిస్తే లైసెన్సుదారులతో బేరసారాలు చేసి కేసులు లేకుండా వదిలేస్తున్నారే ప్రచారం ఉంది. వారిదే ప్రధాన ప్రాత బెల్టు దుకాణాల నిర్వహణలో మద్యం దుకాణాదారులదే ప్రధాన పాత్ర ఉంటోంది. ఒక్కో అధికారిక దుకాణం పరిధిలో 10 నుంచి 15 బెల్టు దుకాణాలు కొనసాగుతున్నాయి. ఎమ్మార్పీ ధరపై రూ.5 నుంచి రూ.50 వరకు తక్కువ చేసి ఈ దుకాణాదారులకు మద్యాన్ని కట్టబెడుతున్నారు. తిరిగి వీరు ఎమ్మార్పీపై రూ.10 నుంచి రూ.60 వరకు అదనం చేసి విక్రయాలు జరుపుతున్నారు. వీరికి ఎక్సైజ్ శాఖతో సంబంధాలు ఉండడంతో బెల్టు దుకాణాలపై దాడులు చేయకుండా చూసుకుంటున్నారు. చాలా చోట్ల లైసెన్సులు కలిగిన దుకాణాదారులే ఆబ్కారీ సిబ్బందికి నెలనెలా కొంత అమ్యామ్యాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్లో ప్రత్యేక తనిఖీలు కొత్త మద్యం దుకాణాలు ఇప్పుడే ఏర్పాటు చేస్తున్నారు. బెల్టు దుకాణాల నిర్వహణపై డిసెంబర్ మొదటి వారంలో ప్రత్యేక తనిఖీలు చేస్తాం. మద్యం దొరికితే కేసులు నమోదు చేస్తాం. ఎవరూ అనుమతి లేకుండా మద్యం అమ్మకాలు చేయరాదు. బెల్టు దుకాణాల కోసం ప్రత్యేక దృష్టి పెడుతున్నాం తనిఖీల్లో పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయి. – జయసేనారెడ్డి, డీసీ ఉమ్మడి జిల్లా -
‘బెల్టు’ అండగా.. గల్లా నిండగా
సాక్షి, ఆసిఫాబాద్ : సరిహద్దు మండలాల్లో మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులకు బెల్టు షాప్‌లు అండగా నిలుస్తున్నాయి. బెల్టు షాప్‌ల మాటున అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపడుతూ వ్యాపారులు దండుకుంటున్నారు. దీనికి తోడు పొ రుగు రాష్ట్రానికి మద్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ధనార్జనే ధ్యేయంగా మద్యం దుకాణదారులు బెల్టు షాపులతో ఒప్పందం చేసుకుని దందాను సాగిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాకు సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర గ్రామాలకు విచ్చలవిడిగా మద్యం అక్రమ రవాణా సాగుతోంది. సరిహద్దు జిల్లా అయిన చంద్రాపూర్, గడ్చిరోలిలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉండడంతో మహారాష్ట్రకు ఆనుకుని ఉన్న వైన్స్‌లకు కాసుల వర్షం కురిపిస్తోంది. సరిహద్దుల్లో నిత్యం దందా.. మహారాష్ట్రలోని చంద్రాపూర్, గడ్చిరోల్లి జిల్లాలో ప్రస్తుతం సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉంది. దీంతో బార్డర్లో వైన్సులను దక్కించుకునేందుకు వ్యాపారులు కొత్త దుకాణాల లైసెన్సు పొందే సమయంలో పోటాపోటీగా టెండర్లు వేశారు. ఈక్రమంలో వాంకిడి, సిర్పూర్(టి), కౌటాల, రవీంద్రనగర్, బెజ్జూరు వైన్సులకు ‘మహా’క్రేజీ ఏర్పడింది. అయితే కొంత మంది టెండర్లలో లక్షల రూపాయలు పోగొట్టుకుని మద్యం షాపులు దక్కని వారు లక్కీ లాటరీలో షాపు దక్కించుకున్న వారికి గుడ్‌విల్ కింద లక్షల రూపాయలు ముట్టజెప్పి తిరిగి మద్యం వ్యాపారంలో కొనసాగుతున్నారు. ఇక కొందరు పెట్టుబడి భరిస్తామని వాటాలు మార్చుకుని దందా సాగిస్తున్నారు. ఈ దందా మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న వైన్సుల్లో అధికంగా జరిగుతోంది. వాంకిడిలో ఇదే తరహాలో లక్కీడీప్‌లో పొందిన వ్యక్తికి పెద్ద మొత్తంలో గుడ్ విల్ ఇచ్చి ఓ షాపును సొంతం చేసుకుని అడ్డగోలుగా మద్యాన్ని బెల్టుషాపులకు తరలిస్తూ ఆక్రమ సంపాదనకు తెరలేపారు. వైన్స్‌లను తలపిస్తున్న వైనం.. సరిహద్దుల్లో ఉన్న వైన్సుల నుంచి యథేచ్ఛగా నిత్యం మద్యం సరఫరా సాగుతూనే ఉంది. ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో కిరాణా దుకాణాలు, బెల్టుషాపుల కేంద్రంగానే దందా సాగుతోంది. వాంకిడిలో ఉన్న ఓ వైన్ షాపు నేరుగా బెల్టుషాపులను గంప గుత్తగా అడ్వాన్సుగా మద్యం సరఫరా చేస్తూ అక్రమంగా నిల్వలు చేస్తూ సరఫరా చేస్తున్నారు. ఏకచత్రాధిపత్యంగా వాంకిడి మండలం గోయగాంలో ఓ బెల్టుషాపునకు నేరుగా డంప్ చేస్తూ మహా రాష్ట్రకు తరలిస్తున్నారు. వాస్తవానికి మద్యం స్టాక్ ఊట్నూర్ డిపో నుంచి ఎక్సైజ్ అధికారులు సూచించిన గోదాంల్లో నిల్వ ఉంచుకుని అవసర మేర సరఫరా చేస్తూ వైన్సుల్లో విక్రయించాలి. అలా కాకుండా నేరుగా సరిహద్దు గ్రామాల్లో బెల్టుషాపులుకే, అక్కడి నుంచి పొరుగు రాష్ట్రానికి తరలిస్తూ దండుకుంటున్నారు. ఎమ్మార్పీకి కంటే డబుల్.. పక్క రాష్ట్రంలో నిషేధం అమలులో ఉండడంతో ఇక్కడితో పోల్చితే రెట్టింపు ధరలతో విక్రయాలు సాగిస్తున్నారు. సాధారణంగా వైన్సుల్లో కౌంటర్ విక్రయాలు కంటే బెల్టుషాపులకే నిత్యం పెద్ద మొత్తంలో సరకు రవాణా అవుతుంది. ఈ బలహీనతతో మహారాష్ట్ర నుంచి వచ్చే బెల్టుషాపు నిర్వహకులకు ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయాలు చేస్తున్నారు. చీప్ లిక్కర్ క్వాటర్ సీసా రూ.65 ఉంటే మహారాష్ట్ర బెల్టు షాపుల్లో రూ.150 వరకూ విక్రయిస్తున్నారు. ఓసీ క్వాటర్కు ఎమ్మార్పీ రూ.120 ఉంటే స్థానిక బెల్టుషాపుల్లో రూ.150 వరకూ ఉంటే మహారాష్ట్రలో రూ.300 వరకూ అమ్ముతున్నారు. ఇలా ఒక్కో బ్రాండ్‌కు ఒక్కొ తీరుగా రేటు ఫిక్స్ చేసి అమ్ముతున్నారు. అయితే కొంత మంది మరో అడుగు ముందుకేసి సరిహద్దులో అక్రమంగా మద్యం నిల్వ చేసి రూ.20 నుంచి రూ.30 వరకూ అధికంగా ధరలు నిర్ణయించి అమ్ముతున్నారు. వైన్సుల నుంచే.. బెల్టు దుకాణదారులను వైన్సు షాపుల వరకూ రానివ్వకుండా వైన్సుల నుంచి వారి చెంతకు సరఫరా చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి లకడికోట్, రాజురా చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చే మద్యం ప్రియులను ఆకర్షిస్తున్నారు. దీంతో సరిహద్దుల్లో ఉన్న గోయగాం లాంటి బెల్టుషాపుల్లోనే అధికంగా కొనుగోళ్లు చేస్తున్నారు. ఇక సిర్పూర్(టి)సరిహద్దులో ఉన్న పొడ్సా, వెంకట్రావుపేట్, కౌటాల, బెజ్జూరు, చింతలమానెపల్లి మండలం గూడెం గుండా నిత్యం మద్యం తరలిపోతోంది. మహారాష్ట్రలోని ఐరి, ఆల్లపల్లి తదితర ప్రాంతాలకు ప్రాణహిత నదిని దాటించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ అక్రమ దందా నిలవరించేందుకు వాంకిడిలో ఎక్సైజ్ చెక్‌పోస్టు ఉన్నప్పటికీ అటు పోలీసులు, ఇటు అబ్కారీ శాఖ నిలువరించలేకపోతున్నారనేది బహిరంగ సత్యం. -
రేటు చూస్తే ‘కిక్కు’దిగాల్సిందే..
మద్యం దుకాణాలు రాత్రి 8 గంటలకే మూతపడుతుండగా.. మద్యం ప్రియులంతా బార్ల బాట పడుతున్నారు. డిమాండ్ పెరగడంతో అక్కడ ఎమ్మార్పీ కంటే రూ.50 దాకా అదనంగా బాదేస్తున్నారు. ఫలితంగా బార్ల గల్లాపెట్టెలు పొంగిపొర్లుతుండగా.. మందుబాబులు జేబులు తడుముకుంటున్నారు. నిన్నటివరకూ రూ.120 ఉన్న ఓ బ్రాండ్ లిక్కర్ క్వార్టర్‌పై ప్రభుత్వం రూ.20 పెంచగా రూ.140కి చేరింది. అదే బార్‌కు వెళ్లి రూ.200 ఇస్తే చిల్లర వెనక్కు ఇచ్చే పరిస్థితి లేదు. గట్టిగా అడిగితే మందులేదు పొమ్మంటున్నారు. చేసేదేమీలేక మద్యం ప్రియులు బార్ యజమానులు అడిగినంత ఇచ్చి వాళ్లిచ్చింది పుచ్చుకుంటున్నారు. సాక్షి, అనంతపురం సెంట్రల్ : నూతన మద్యం పాలసీని బార్ నిర్వాహకులు అనుకూలంగా మలుచుకున్నారు. రాత్రి 8 గంటలకే మద్యం షాపులు బంద్ కాగా, బార్లు కళకళలాడుతున్నాయి. ఇదే అదునుగా లిక్కర్ ధరలు ఇష్టానుసారం వసూలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ రూ.లక్ష కూడా దాటని ఓ బార్ కౌంటర్.. ఇప్పుడు రూ.4 లక్షలు దాటిపోతోంది. నూతన ఎక్సైజ్ పాలసీతో ‘చుక్క’లు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మద్యపాన నిషేధించడంలో భాగంగా తొలి అడుగు వేసింది. ఈ క్రమంలో ఇటీవలే నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చింది. ఈ క్రమంలో జిల్లాలో 247 మద్యం షాపులుండగా.. దాన్ని 197కు కుదించింది. మద్యంషాపుల వేళల్లోనూ మార్పులు చేసింది. దీంతో రాత్రి 8 గంటలకు మద్యం షాపులు మూతపడుతున్నాయి. ఇక పర్మిట్‌షాపులను పూర్తిగా రద్దు చేయడంతో మద్యం ప్రియులంతా బార్ల బాట పడుతున్నారు. జిల్లాలో 32 బార్లు ఉండగా..అన్నింటిలోనూ గతంతో పోలిస్తే రెట్టింపు వ్యాపారం జరుగుతోంది. అన్నింటిపైనా దోపిడీ బార్ నిర్వాహకులు లిక్కర్‌పైనే కాకుండా వాటర్‌బాటిళ్ల నుంచి ఆహార పదార్థాల వరకూ భారీ రేట్లు అమలు చేస్తున్నారు. డాబాలతో పోలిస్తే 50 నుంచి 60 శాతం ఎక్కువ వసూలు చేస్తున్నారు. అధికారులకు మామూళ్లుతో పాటు వారు వచ్చినప్పుడు మర్యాదలు చూసుకుంటుండడంతో అధికారులెవరూ∙పెద్దగా పెట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తే మద్యం ప్రియుల ఇళ్లకు కాసిన్ని కాసులైనా వెళ్తాయి...లేకపోతే పేదల కష్టార్జితం బారు గల్లాపెట్టెలోకి వెళ్తుంది. నియంత్రించే పరిస్థితి లేదు బార్లలో మద్యం రేట్లను కంట్రోల్ చేసే పరిస్థితి లే దని ఇన్చార్జ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చెబుతున్నారు. సర్వీసు పేరుతో అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారనీ, త్వరలో బార్ల వేళల్లోనూ మార్పులు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, అది అమలైతే వారికి కూడా చెక్ పడుతుందన్నారు. -
ప్రభుత్వ అధీనంలో మద్యం షాపులు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మంగళవారం నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. మద్యపాన నిషేధ సంస్కరణలు అమల్లో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులను ప్రభుత్వం 20శాతం తగ్గించింది. లిక్కర్ అమ్మకాల వేళల్లోనూ మార్పులు చేసింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకూ మాత్రమే మద్యం అమ్మకాలు జరపాలని నిబంధన విధించింది. అలాగే ఎమ్మార్పీ ఉల్లంఘన, బెల్ట్‌షాపుల ఏర్పాటుపై ఉక్కపాదం మోపింది. గ్రామాల్లో మద్యం మహమ్మారిని నిర్మూలించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో 14 వేల 944 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించింది. కొత్త లిక్కర్ పాలసీలో భాగంగా నేటినుంచి ప్రభుత్వ అధీనంలోనే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పలు జిల్లాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం షాపులను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ పెద్దిరాజు ప్రారంభించారు. నియోజకవర్గంలో గతంలో 21 మద్యం షాపులు ఉండగా వాటిని 20% కుదించి.. 17 షాపులను ప్రారంభించారు. ప్రభుత్వం తరపున ఏర్పాటైన మద్యం షాపుల్లో 17మంది సూపర్ వైజర్లు,17 మంది నైట్ వాచ్మెన్లు, 41మంది సేల్స్‌మేన్లగా నియమితులయ్యారు. ఈ మేరకు ఉద్యోగాలు లభించడంతో నిరుద్యోగ యువత ఆనందం వ్యక్తం చేస్తోంది. విచ్చలవిడి మద్యం అమ్మకాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో షాపులను నిర్వహిస్తున్నామని, మద్యం షాపుల సంఖ్యను, అమ్మకాల సమయాన్ని కుదించించడం ద్వారా ఏపీలో దశలవారీగా మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్నామని, ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహోన్నతమైన ఆశయం కచ్చితంగా నెరవేర్చి తీరుతామని ఎక్సైజ్ శాఖ ధీమా వ్యక్తం చేస్తోంది. పుత్తూరు పట్టణంలో.. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు పట్టణంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మద్యం విధానాన్ని అమలు చేశారు. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో గతంలో ఉన్న 29 షాపులును కుదించి 23 షాపులు ప్రవేశపెట్టారు. 23 షాపులలో 77 మందిని సేల్స్ అండ్ క్యాషియర్‌గా నియమించారు. ఈ కొత్త మద్యం విధానంతో మద్యపానాన్ని అంచలంచలుగా నియంత్రిస్తామన్నారు పుత్తూరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మోహన్. సీఎం వైఎస్ జగన్ హామీ ఆదేశాల మేరకు మేం కట్టుబడి పని చేస్తామని మా పరిధిలో ఎక్కడ బెల్టుషాపులు ఉన్నా తొలగిస్తామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మోహన్ తెలిపారు. చదవండి: రాత్రి 8 వరకే మద్యం