మీతో మీఎస్పీ కార్యక్రమంలో బెల్టు దుకాణాల నియంత్రణకు సంబంధించిన ఫిర్యాదులే అధికంగా ఉండడం గమనార్హం.
కర్నూలు, న్యూస్‌లైన్: మీతో మీఎస్పీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 10.30 నుంచి 12 గంటల వర కు ఎస్పీ రఘురామిరెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించగా జిల్లా వ్యాప్తం గా 39 మంది ఫోన్ (94407 95567) ద్వారా శాంతిభద్రతలకు సంబంధించి న పలు సమస్యలు ఆయన దృష్టికి తెచ్చారు. ఇందులో బెల్టు దుకాణాల నియంత్రణకు సంబంధించిన ఫిర్యాదులే అధికంగా ఉండడం గమనార్హం. కర్నూలు మండలం నందనపల్లె, కోడుమూరు మండలం పులకుర్తి, నంద్యాల మండలం ఏకలవ్య నగర్, క్రిష్ణగిరి మండలం సంగాల, కల్లూరు మండలం రేమడూరు గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదు చేసిన ఆయా గ్రామాల ప్రజలు వాటిని అరికట్టాలని ఎస్పీని కోరారు.
ఈ సందర్భంగా వాటి పూర్తి వివరాలను అందజేశారు. ఆయా గ్రామాల్లో నిఘాను తీవ్రతరం చేయడంతో పాటు ఎక్సైజ్‌శాఖ అధికారులతో కలిసి దాడులు నిర్వహిస్తామని ఎస్పీ వారికి హామీ ఇచ్చారు. ఆళ్లగడ్డ పట్టణం, శిరివెళ్ల మండలం ఎర్రగుంట్లలో మట్కా నడుస్తోందని ఫిర్యాదులు రాగా నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో చాలా చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయడం లేదని, మరమ్మతు చేయించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుం డా పలువురు ఎస్పీ దృష్టికి తెచ్చారు. ఆటో డ్రైవర్లు ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఆటో డ్రైవర్లపై కఠినంగా వ్యవహరించాలని కోరగా ఈ మేరకు ఎస్పీ హామీ ఇచ్చారు.