raghu rami reddy
-
టీడీపీ అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి
-
వైఎస్సార్సీపీ నేతల రాస్తారోకో
సాక్షి, వైఎస్సార్ : కేసీ కెనాల్ నుంచి సాగునీరు విడుదల చేయాలంటూ మైదుకూరు నేషనల్ హైవేపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, రైతులపై ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని రఘరామిరెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, రాచమల్లు ప్రసాద్ రెడ్డి, అంజాద్ బాషా పాల్గొన్నారు. ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. -
మైదుకూరులో విభజన హామీలు నెరవేర్చాలంటూ మానవహారం
-
ముసుగేసి.. మాటు వేసి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : నందికొట్కూరు మండలం కోనేటమ్మపల్లికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు రఘురామిరెడ్డిపై కర్నూలులో ప్రత్యర్థులు హత్యాయత్నం చేశారు. వివరాలిలా ఉన్నాయి.. నంద్యాల చెక్ పోస్టు సమీపంలోని నందికొట్కూరు రోడ్డులో ఉన్న దాబా ఎదుట మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో రఘురామిరెడ్డి, అతడి అనుచరులు జగదీశ్వరరెడ్డి, భరత్కుమార్రెడ్డిలతో కలసి ఉన్నాడు. ఇంతలో ముఖానికి మాస్కులు ధరించిన ఐదారుగురు వ్యక్తులు బైక్‌లపై వచ్చి కత్తులు, రాడ్లతో రఘురామిరెడ్డిపై విచక్షణరహితంగా దాడి చేశారు. తలకు తీవ్రగాయాలు కావడంతో ఆయన అక్కడిక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దాడిలో జగదీశ్వరరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రఘురామిరెడ్డిని అశోక్‌రెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి అనే వ్యక్తులు విజయ హాస్పిటల్లో తరలించారు. కాగా, తనపై దాడికి పాల్పడింది బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనుచరులేనని బాధితుడు డీఎస్పీ ఖాదర్బాషాకు వాంగ్మూలం ఇచ్చారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా ఆరేళ్ల క్రితం వరకు రఘురామిరెడ్డి, ఆయన తండ్రి తిరుపతిరెడ్డి బైరెడ్డి వర్గంలో ఉండేవారు. తండ్రి ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురికావడంతో రఘురామిరెడ్డి వర్గాలకు దూరంగా ఉండేవాడు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడిగా ఉంటూ గత ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. బైరెడ్డి అనుచరుల పనే...గౌరు వెంకటరెడ్డి రఘురామిరెడ్డిని హత్య చేయడానికి ముమ్మాటికీ బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలు కుట్ర పన్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి ఆరోపించారు. విజయ హాస్పిటల్లో ఉన్న రఘురామిరెడ్డిని గౌరు పరామర్శించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో వారు హత్యలను ప్రోత్సహిస్తూన్నారని గౌరు ఆరోపించారు. గత ఎన్నికల్లో నందికొట్కూరు మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు సాయి ఈశ్వర్‌ను బైరెడ్డి కుటుంబీకులు హత్య చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రఘురామిరెడ్డి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. -
'జగన్ వెంటే నా పయనం'
కడప : ఎవరెన్ని ప్రచారాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని ఆ పార్టీ నాయకుడు, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం కడప జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ ను రఘురామిరెడ్డి ప్రొద్దుటూరులో కలిశారు. అనంతరం రఘురామిరెడ్డి మాట్లాడుతూ... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెంటే నా పయనం అని తెలిపారు. పార్టీలు మారడం అనైతికమని రఘురామిరెడ్డి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు మరో పార్టీలో చేరుతున్నట్లు వార్తా ఛానళ్లు ఇష్టం వచ్చినట్లు ప్రసారం చేస్తున్నాయని ఆరోపించారు. టీవీ 9 అంటే గౌరవం ఉందని... కానీ వాళ్లు కూడా అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు. పార్టీ మారే అవకాశం లేని మాలాంటి వాళ్ల మీద ఇలాంటి ప్రచారమా... ? అని ప్రశ్నించారు. ఓ పార్టీ ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యేలను వేరే పార్టీ వాళ్లు పిలవడమే తప్పని రఘురామిరెడ్డి ఈ సందర్భంగా అభిప్రాపడ్డారు. ఓ వేళ ఎమ్మెల్యేలు మరోపార్టీలో చేరితే.. నియోజకవర్గాల్లో ఎలా తిరుగుతారన్ని ప్రశ్నించారు. పార్టీ మారిన వాళ్లు... నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి లేదన్నారు. పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యనికి విరుద్ధమన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణలో ఓ న్యాయం. ఏపీలో మరో న్యాయమా అని నిలదీశారు. తెలంగాణలో పార్టీ మారితే... ఎలా వ్యతిరేకిస్తారు... ఇక్కడ ఎలా సమర్థిస్తారు అని అడిగారు. చంద్రబాబుకు నైతిక విలువలు ఉన్నాయా అని రఘురామిరెడ్డి సందేహం వ్యక్తం చేశారు. విలువలు లేని చంద్రబాబు... ఎథిక్స్ పెట్టడం హాస్యాస్పదంగా ఉందని రఘురామిరెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు... టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రఘురామిరెడ్డిపై విధంగా స్పందించారు. -
రేపు ఆకేపాటి ప్రమాణ స్వీకారం
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆకేపాటి అమరనాథరెడ్డి శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామరెడ్డి తెలిపారు. కడపలోని వైఎస్ అతిథి గృహంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అమరనాథరెడ్డిని నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న ఆకేపాటి పార్టీని అన్ని రకాలుగా పటిష్టం చేయగలరన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను సమర్థవంతంగా ఎదుర్కోగల శక్తి ఆకేపాటికే ఉందని చెప్పారు. కాగా ఆకేపాటి ప్రమాణ స్వీకారానికి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా, మండల కో-ఆప్షన్ సభ్యులు సహా అన్ని క్యాడర్ల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని చెప్పారు. పార్టీ అభ్యున్నతికి అందరి సలహా, సూచనలు స్వీకరిస్తామని ఆకేపాటి అమరనాథరెడ్డి తెలిపారు. -
అధికారంలోకి రావడానికి వంద అబద్ధాలు
కడప కార్పొరేషన్: వంద అబద్దాలు ఆడి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని వైఎస్ఆర్సీపీ క్రమశిక్షణా కమిటీ సభ్యులు, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్. రఘురామిరెడ్డి ఎద్దేవా చేశారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మేయర్ కె. సురేష్‌బాబు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అకేపాటి అమర్నాథ్రెడ్డితో కలిసి గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో అధికారపార్టీ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని, వైఎస్ జగన్‌ను విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకుని చర్చను పక్కదారి పట్టించిందన్నారు. తద్వారా నిర్మాణాత్మకమైన చర్చకు అవకాశంలేకుండా వ్యవహరించిందన్నారు. కొత్త రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి వంటి అంశాల ప్రస్తావనే లేకుండా పదిహేను రోజులపాటు విమర్శలతోనే కాలం వెల్లబుచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎదురుదాడితో ఎంతకాలం నెట్టుకొస్తారో చూడాలన్నారు. రుణమాఫీ ఎప్పుడు చేస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరునెలలకు చేస్తారా.. సంవత్సరానికి చేస్తారా.. బడ్జెట్లో కేటాయించిన రూ. 5వేల కోట్లు ఇందుకు సరిపోతాయా... అని ఆయన ప్రశ్నించారు. రుణాలు కట్టాలని లేనిపక్షంలో బంగారు వేలం వేస్తామని ఇప్పటికే రైతులకు బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చాయన్నారు. వేలం వేస్తే ఆ అవమానాన్ని భరించలేక ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే బాధ్యత ఎవరిదని నిలదీశారు. సాగునీటి ప్రాజెక్టులకు ఈ ప్రభుత్వం ఏం చేయబోతోందో చెప్పకుండా ఎంతసేపు వైఎస్ హయాంలో నిధులు దుర్వినియోగమయ్యాయని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. అసెంబ్లీలో రాజధాని రాజధాని విషయమై అధికార పక్షం అనుసరించిన విధానం చాలా నిరంకుశంగా ఉందని మండిపడ్డారు. మద్రాస్ నుంచి విడిపోయినప్పుడు ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో రాజధానిపై అసెంబ్లీలో ఐదురోజులపాటు చ ర్చ జరిగిందని, ఓటింగ్ కూడా నిర్వహించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం చర్చకు అనుమతించ కుండా, ప్రకటన చేసి చర్చించాలనడం అప్రజాస్వామికమన్నారు. ఐదేళ్ల క్రితం రాష్ట్రాన్ని పాలించి, ఈలోకంలో లేకుండా పోయిన వ్యక్తిని పదేపదే విమర్శిస్తున్న అధికార పార్టీ నాయకులు ఆ తర్వాత పాలించిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలను పల్లెత్తు మాట కూడా అన రని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి తెలిపారు. ప్రతిపక్షం ఇచ్చే సలహాలు, సూచనలు స్వీకరించకుండా గొంతునొక్కడం దుర్మార్గమన్నారు. సమావేశంలో జెడ్పీ వైస్ ఛైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, పార్టీనాయకులు యానాదయ్య, కరీముల్లా పాల్గొన్నారు. -
వీళ్లకేం మేసే రోగం!
వాళ్లంతా ప్రభుత్వోద్యోగులు. నెల తిరిగే సరికి వేలాది రూపాయల వేతనం చేతికందుతుంది. ఏ చీకూ చింతా లేకుండా హాయిగా బతికేయొచ్చు. తాము చే సిన పనికి లభించిన వేతనంతో తృప్తిపడదామని అనుకోవడం లేదు. కానీ ఎందుకో ప్రజల సొమ్మును కూడా భోంచేయాలనే దుర్బుద్ధి పుడుతోంది. ఇంకేముంది అందినకాడికి దండుకుంటున్నారు. ఇటీవల జరుగుతున్న పలు సంఘటనలు ప్రభుత్వ ఉద్యోగుల తీరుతెన్నులకు అద్దం పడుతున్నాయి. కడప అర్బన్: కడప ఆర్ట్స్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రఘురామిరెడ్డి 18.60 లక్షల రూపాయలను స్వాహా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అలాగే ఆర్టీఏ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న చక్రపాణి రూ. 5 లక్షలు మాయం చేసేశాడు. ఇక కడప డీసీసీ బ్యాంకు సిబ్బంది ఏకంగా తాకట్టు పెట్టిన బంగారు నగలనే మార్చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆర్టీఏ కార్యాలయంలో ఐదు లక్షలు మాయం.. ఆర్టీఏ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న చక్రపాణి గతనెల 28వ తేదీన రూ.13లక్షలు ట్రెజరీ నుంచి నగదు రూపంలో కార్యాలయానికి తీసుకొచ్చాడు. రూ.5లక్షలను ఉద్యోగులకు వేతనాలుగా పంపిణీ చేశాడు. మిగిలిన రూ.8లక్షలను బీరువాలో ఉంచి సెలవుపై వెళ్లాడు. నాలుగు రోజుల తర్వాత కార్యాలయానికి తిరిగి వచ్చి బీరువా తెరిచి చూస్తే రూ.3లక్షలు మొత్తం మాత్రమే ఉంది. మిగిలిన రూ.5లక్షలు కనిపించలేదు. బీరువాకు వేసిన తాళం వేసినట్లే ఉంటే ఈ ఐదు లక్షలు ఎలా మాయమయ్యాయనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆ ప్రశ్నకు సమాధానం సదరు ఉద్యోగి అయినా చెప్పాలి.. లేదంటే కార్యాలయ ఉన్నతాధికారులైనా చెప్పాలి. ఇవేమీ లేకుండా జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే, డబ్బు గురించి పూర్తిగా విచారించకుండానే సంజాయిషీ ఇవ్వాలని నోటీసు ఇవ్వడం.. అదేరోజు అకౌంటెంట్ రూ.5లక్షలు ఠంచన్‌గా జమ చేసేయడాన్ని చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ విషయం ఆ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఇక్కడి డీటీసీపై సీరియస్ అయ్యారు. రికార్డులు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేగాకుండా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన అకౌంటెంట్ చక్రపాణిని సస్పెండ్ చేశారు. డీసీసీ బ్యాంక్‌లో బంగారు మాయ... చెన్నూరుకు చెందిన సాదక్ అలీ 2012 మే 4న తన అవసరం కోసం 9.5 తులాల బంగారు ఆభరణాలను జిల్లా కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్‌లో తాకట్టు పెట్టి రూ.1.36లక్షలను రుణంగా తీసుకున్నాడు. రుణం తీసుకునే సమయంలో బ్యాంకు అప్రైజర్ వీరబ్రహ్మాచారి నగలను పరిశీలించి వాటి నాణ్యత, విలువను నిర్ధారించాకే రుణం మంజూరైంది. మరలా 2013 జులై 25న రెన్యువల్ చేసేటప్పుడు కూడా అదే అప్రైజర్ బంగారు ఆభరణాలను సరిచూశారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ అధికారుల ఆదేశాల మేరకు గత నెల 27వ తేదీన వీరబ్రహ్మాచారి, మరో అప్రైజర్ పి.గిరి 520 ఖాతాలకు సంబంధించిన బంగారు ఆభరణాలను రెండు రోజుల్లో సరి చూశారు. ఈ క్రమంలో సాదక్ అలీ రెండు రోజుల క్రితం రెన్యువల్ కోసం డబ్బు కట్టేందుకు వెళ్లాడు. ఆ సమయంలో తన నగలు నకిలీవని బ్యాంక్ అధికారులు తె లపడంతో అవాక్కైన సాదక్ అలీ పోలీసులను ఆశ్రయించాడు. మరోవైపు డీసీసీ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఎస్కె వలీచాంద్ కూడా తమ సిబ్బందితో వచ్చి సాదక్ అలీ ఇచ్చిన నగలు నకిలీవని ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు విచారించి ఆ నగలను తీసుకురావాలని చెప్పినప్పటికీ బ్యాంకు అధికారులు నగలను అప్పజెప్పకుండానే కేసు నమోదు చేయాలని కోరడం గమనార్హం. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఇటీవల ఎర్రగుంట్ల ఎంపీడీఓ జయసింహ సాక్షరభారత్ నిధులను స్వాహా చేశారనే కారణంగా అతనిపై క్రిమినల్ కేసు నమోదైంది. గతంలో కడపలో ఓ స్టేట్‌బ్యాంక్ అధికారి కూడా ఇదే రీతిలో మోసాలకు పాల్పడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. జిల్లా ఉన్నతాధికారులు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో మరొకరు ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్ట్స్ కళాశాలలో ఏం జరిగిందంటే.. ఆర్ట్స్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రఘురామిరెడ్డి 2013లో తమ కళాశాలలో డిగ్రీ చదివి వెళ్లిన మారుతీనగర్‌కు చెందిన కృపాకర్ అనే విద్యార్థి పేరు మీద సెంట్రల్ బ్యాంక్‌లో ఖాతా ఉండటంతో తన దగ్గరున్న చెక్కు బుక్కుతో అక్షరాలా రూ.4.30 లక్షలను రాయించి ఇచ్చాడు. ఆంధ్రాబ్యాంక్‌కు చెక్కు వెళ్లి సెంట్రల్ బ్యాంక్‌లో కృపాకర్ ఖాతాలో రూ.4.30లక్షలు జమ అయింది. కృపాకర్‌ను అడ్డుపెట్టుకొని రఘురామిరెడ్డి, అతని స్నేహితుడు ఎంఎం బాషా, వారి సహచరులు చిన్ని, మ్యారేజ్ బ్యూరో నడుపుతున్న కవిత అనే వారు ఎంచక్కా రూ.4.25లక్షలను డ్రా చేసుకున్నారు. సెంట్రల్ బ్యాంక్ మేనేజర్‌కు అనుమానం వచ్చి ఆర్ట్స్ కళాశాల ఖాతా నుంచి ఒకే విద్యార్థికి రూ.4.30లక్షలు ఎందుకు జమ అయిందో సంజాయిషీ అడిగారు. సదరు విద్యార్థిని పిలిపించి అథారిటీ లెటర్ తీసుకురావాలని కోరారు. కృపాకర్ రఘురామిరెడ్డిని సంప్రదించగా కవిత ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటలక్షుమ్మ సంతకాన్ని ఫోర్జరీ చేసి అథారిటీ లెటర్ తయారుచేసి ఇచ్చింది. ఆ సంతకాలలో ఒకటి నకిలీదని బ్యాంక్ మేనేజర్ గుర్తించి నిలదీశారు. ప్రిన్సిపల్‌ను పిలిపించి వ్యవహారాన్ని తేల్చమని చెప్పారు. దీంతో ఆమె రఘురామిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగడంతో రఘురామిరెడ్డి అండ్ పార్టీ వ్యవహారం బయటపడింది. కడప నగరంలో ఆర్ట్స్ కళాశాలకు సంబంధించిన ఖాతాలు బోలెడున్నాయి. ఇదే అదనుగా భావించిన రఘురామిరెడ్డి మొదట తన స్నేహితుడు ఎంఎంబాషా పేరుతో రూ.4600 చెక్కును రాయించి ఎస్బీఐ బ్యాంక్‌కు పంపించాడు. వెంటనే ఆ మొత్తం ఎంఎంబాషా పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది. ఆ తర్వాత మారుతీనగర్‌కు చెందిన కృపాకర్ పేరు మీద రూ.4.30 లక్షలు, రామిరెడ్డి అనే వ్యక్తి పేరు మీద రూ.4,84,500, రూ.4,74,500 అనే రెండు చెక్కులు రాయించాడు. ఇతను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా తెరిచి ఈ మొత్తం ఖాతాలో పడగానే డబ్బును డ్రా చేసుకొని వెంటనే ఖాతా కూడా రద్దు చేసుకున్నాడు. రఘురామిరెడ్డి బంధువు మనోరంజన్‌రెడ్డి అనంతపురంలో వ్యాపారం చేస్తున్నాడు. అతని స్నేహితుడు సర్దార్ ఖాతాలో రూ.4.70లక్షల మొత్తాన్ని జమచేసి వెంటనే డ్రా చేసుకున్నాడు. ఇలా మొత్తం రూ.18.60లక్షలను స్వాహా చేసిన రఘురామిరెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇన్ని లక్షల రూపాయలను స్వాహా చేస్తుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారనేది అర్థంకాని ప్రశ్న. -
ఎంత నిర్లక్ష్యం.. ఏమిటీ దౌర్భాగ్యం?
సాక్షి ప్రతినిధి, కడప: ‘అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు’ అన్నట్లుగా ఉంది జిల్లా యంత్రాంగం తీరు. ఒకటిన్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సిన తెలుగుగంగ కెనాల్ దుస్థితి అందుకు అద్దం పడుతోంది. బ్రహ్మసాగర్‌కు చేరాల్సిన నీరు భూగర్భంలోకి వెళ్తున్నా పట్టించుకున్న నాధుడే లేడు. స్పందించిన ప్రజాప్రతినిధుల్ని సైతం నీరుగార్చే చర్యలకు పాల్పడుతున్న వైనమిది. తెలుగుగంగ కెనాల్ పరిధిలోని ఎస్ఆర్-1 కాలువ 98వ కిలోమీటర్ నుంచి 108 కిలోమీటర్ వరకూ లైనింగ్‌కు గండ్లు పడ్డాయి. అక్కడక్కడ పూడిక పేరుకుపోయింది. వెలుగోడు నుంచి సాగునీరు విడుదలకు యంత్రాంగం శ్రీకారం చుట్టింది. అయితే నీరు భూగర్భంలోకి ఇంకిపోతుందనే ఆందోళన ఆయకట్టుదారుల్లో మెండుగా ఉంది. విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, జయరాములు దృష్టికి తీసుకెళ్లారు. వారు రైతులతో కలిసి కాలువ పనులను పరిశీలించారు. వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే నీరంతా నిష్ర్పయోజనమవుతుందని అధికారులకు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాల్సిందిగా కోరారు. అయితే నిధుల్లేవని, ఇప్పుడే పనులు చేపట్టలేమని అధికారులు పేర్కొన్నారు. ఎమ్మెల్యేల అభ్యర్థన... ఎంపీ స్పందన తెలుగుగంగ కెనాల్‌ను గత బుధవారం పరిశీలించిన ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అక్కడి నుంచే అధికారులకు ఫోన్లో వివరించారు. నిధులు లేవని జవాబు రావడంతో వెంటనే కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రూ.10లక్షలు గ్రాంటు ఎంపీ కోటా ద్వారా మంజూరు చేయాలని కోరారు. ఎంపీ వెంటనే జిల్లా కలెక్టర్ కేవీ రమణకు లేఖ రాశారు. తన నిధుల నుంచి తెలుగుగంగ కాలువలో 98 కిలోమీటరు నుంచి 108 కిలోమీటర్ వరకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. లెటర్ రెఫరెన్సు నెం.173/2014 ద్వారా కోరారు. అయితే ఎంపీ ఫండ్స్ కెనాల్‌కు ఖర్చు చేయరాదని పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి అభ్యర్థనను తిరస్కరించారు. మరీ ఇరిగేషన్ విభాగం నుంచి ఏమైనా ఖర్చుచేసి మరమ్మతులు నిర్వహిస్తారంటే అదీ లేదు. తెలుగుగంగ కె నాల్ 5వేల క్యూసెక్కులు సామర్థ్యంతో నిర్మించింది. ప్రస్తుతం 400 క్యూసెక్కులు వదిలితే కేవలం 150క్యూసెక్కులు మాత్రమే రాగలవని ఇంజనీరింగ్ అధికారులే వివరిస్తున్నారు. పూర్తి స్థాయి నీరు వదిలితే, గండ్లు పడక తప్పని పరిస్థితి. అలాంటి స్థితిలో శరవేగంగా నిర్వహించాల్సిన మరమ్మత్తుల్లో కూడ అధికారయంత్రాంగం నిర్లక్ష్యం వీడడంలేదని ఆయకట్టుదారులు వాపోతున్నారు. -
‘మీతో మీఎస్పీ’కి 39 ఫిర్యాదులు
కర్నూలు, న్యూస్‌లైన్: మీతో మీఎస్పీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 10.30 నుంచి 12 గంటల వర కు ఎస్పీ రఘురామిరెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించగా జిల్లా వ్యాప్తం గా 39 మంది ఫోన్ (94407 95567) ద్వారా శాంతిభద్రతలకు సంబంధించి న పలు సమస్యలు ఆయన దృష్టికి తెచ్చారు. ఇందులో బెల్టు దుకాణాల నియంత్రణకు సంబంధించిన ఫిర్యాదులే అధికంగా ఉండడం గమనార్హం. కర్నూలు మండలం నందనపల్లె, కోడుమూరు మండలం పులకుర్తి, నంద్యాల మండలం ఏకలవ్య నగర్, క్రిష్ణగిరి మండలం సంగాల, కల్లూరు మండలం రేమడూరు గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదు చేసిన ఆయా గ్రామాల ప్రజలు వాటిని అరికట్టాలని ఎస్పీని కోరారు. ఈ సందర్భంగా వాటి పూర్తి వివరాలను అందజేశారు. ఆయా గ్రామాల్లో నిఘాను తీవ్రతరం చేయడంతో పాటు ఎక్సైజ్‌శాఖ అధికారులతో కలిసి దాడులు నిర్వహిస్తామని ఎస్పీ వారికి హామీ ఇచ్చారు. ఆళ్లగడ్డ పట్టణం, శిరివెళ్ల మండలం ఎర్రగుంట్లలో మట్కా నడుస్తోందని ఫిర్యాదులు రాగా నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో చాలా చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయడం లేదని, మరమ్మతు చేయించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుం డా పలువురు ఎస్పీ దృష్టికి తెచ్చారు. ఆటో డ్రైవర్లు ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఆటో డ్రైవర్లపై కఠినంగా వ్యవహరించాలని కోరగా ఈ మేరకు ఎస్పీ హామీ ఇచ్చారు.