'జగన్ వెంటే నా పయనం' | I am with YS Jagan, says Mydukur MLA Raghu Rami Reddy | Sakshi
Sakshi News home page

'జగన్ వెంటే నా పయనం'

Published Thu, Feb 25 2016 10:14 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

'జగన్ వెంటే నా పయనం' - Sakshi

'జగన్ వెంటే నా పయనం'

కడప : ఎవరెన్ని ప్రచారాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని ఆ పార్టీ నాయకుడు, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం కడప జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ ను రఘురామిరెడ్డి ప్రొద్దుటూరులో కలిశారు. అనంతరం రఘురామిరెడ్డి మాట్లాడుతూ...  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెంటే నా పయనం అని తెలిపారు. పార్టీలు మారడం అనైతికమని రఘురామిరెడ్డి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు మరో పార్టీలో చేరుతున్నట్లు వార్తా ఛానళ్లు ఇష్టం వచ్చినట్లు ప్రసారం చేస్తున్నాయని ఆరోపించారు.

టీవీ 9 అంటే గౌరవం ఉందని... కానీ వాళ్లు కూడా అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు. పార్టీ మారే అవకాశం లేని మాలాంటి వాళ్ల మీద ఇలాంటి ప్రచారమా... ? అని ప్రశ్నించారు. ఓ పార్టీ ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యేలను వేరే పార్టీ వాళ్లు పిలవడమే తప్పని రఘురామిరెడ్డి ఈ సందర్భంగా అభిప్రాపడ్డారు. ఓ వేళ ఎమ్మెల్యేలు మరోపార్టీలో చేరితే.. నియోజకవర్గాల్లో ఎలా తిరుగుతారన్ని ప్రశ్నించారు.  పార్టీ మారిన వాళ్లు... నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి లేదన్నారు. పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యనికి విరుద్ధమన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణలో ఓ న్యాయం. ఏపీలో మరో న్యాయమా అని నిలదీశారు.

తెలంగాణలో పార్టీ మారితే... ఎలా వ్యతిరేకిస్తారు... ఇక్కడ ఎలా సమర్థిస్తారు అని అడిగారు. చంద్రబాబుకు నైతిక విలువలు ఉన్నాయా అని రఘురామిరెడ్డి సందేహం వ్యక్తం చేశారు. విలువలు లేని చంద్రబాబు... ఎథిక్స్ పెట్టడం హాస్యాస్పదంగా ఉందని రఘురామిరెడ్డి ఎద్దేవా చేశారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు... టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రఘురామిరెడ్డిపై విధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement