రేపు ఆకేపాటి ప్రమాణ స్వీకారం | tomorrow sworn of Akepati amarnath reddy | Sakshi
Sakshi News home page

రేపు ఆకేపాటి ప్రమాణ స్వీకారం

Published Fri, Sep 12 2014 3:10 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

రేపు ఆకేపాటి ప్రమాణ స్వీకారం - Sakshi

రేపు ఆకేపాటి ప్రమాణ స్వీకారం

కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆకేపాటి అమరనాథరెడ్డి శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామరెడ్డి తెలిపారు. కడపలోని వైఎస్ అతిథి గృహంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అమరనాథరెడ్డిని నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న ఆకేపాటి పార్టీని అన్ని రకాలుగా పటిష్టం చేయగలరన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
 
రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను సమర్థవంతంగా ఎదుర్కోగల శక్తి ఆకేపాటికే ఉందని చెప్పారు. కాగా ఆకేపాటి ప్రమాణ స్వీకారానికి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా, మండల కో-ఆప్షన్ సభ్యులు సహా అన్ని క్యాడర్ల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని చెప్పారు. పార్టీ అభ్యున్నతికి అందరి సలహా, సూచనలు స్వీకరిస్తామని ఆకేపాటి అమరనాథరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement