akepati amarnath reddy
-
చంద్రబాబుది నియంతృత్వ పాలన: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి
సాక్షి, అన్నమయ్య: ఏపీలో కూటమి సర్కార్ భయానక వాతావరణం సృష్టిస్తోంది. వైఎస్ జగన్ తిరుమల దర్శనాన్ని చంద్రబాబు సర్కార్ రాజకీయం చేస్తోంది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేస్తూ వారిని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దీంతో, పోలీసుల వైఖరిపై వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు మండిపడుతున్నారు.అన్నమయ్య జిల్లాలో పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. రాజంపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఆయన తిరుమలకు వెళ్లడానికి వీలు లేదంటూ నోటీసులు ఇచ్చారు. ఆయనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆకేపాటి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్టీ నేతలు ఆయన ఇంటి వద్దకు చేరుకుంటున్నారు.ఈ సందర్బంగా ఆకేపాటి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా సెక్షన్-30 పెట్టలేదు. ఇంతటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. చంద్రబాబుది నియంతృత్వ పాలన. చంద్రబాబు ప్రభుత్వానిది కక్ష సాధింపు చర్య. తిరుమలను రాజకీయానికి వాడుకుంటున్నారు. ఇది కూడా చదవండి: వాడని నెయ్యి.. తయారు కాని లడ్డూ.. జరగని తప్పుపై ‘పచ్చ’గోల -
చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త
-
Rajampeta : పుట్టిన గడ్డ రుణం తీర్చుకున్న ప్రవాసాంధ్రుడు
కడప: దృష్టి.. జీవన ప్రయాణంలో అత్యంత కీలకం. కళ్లు సరిగా ఉంటే.. ఏ పనయినా చేసుకోవచ్చు. కానీ కొందరు కళ్లను సరిగా పట్టించుకోకపోవడం వల్ల అది దృష్టి లోపానికి దారి తీస్తోంది. సరైన ఆహారం తీసుకోకపోవడం, పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల కంట్లో శుక్లాలకు దారి తీస్తుంది. ఇలాంటి అభాగ్యులకు అండగా నిలిచారు అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రుడు వల్లూరు రమేష్ రెడ్డి.ఆకేపాడు గ్రామంలోని అమర్నాథరెడ్డి నివాసంలో చెన్నై శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 12 రోజులపాటు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం రవాణా సదుపాయంతో పాటు ఉండేందుకు వసతి కల్పించారు. ఈ శిబిరం ద్వారా ఏకంగా 238 మంది కంటి శస్త్రచికిత్సలు చేయించుకోవడం నిజంగా గొప్ప విషయం. శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరం ముగింపు సమావేశానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పేద బడుగు బలహీన వర్గాల వారికి అన్నివేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలనే ఉద్దేశంతో పట్టణాన్ని సైతం వదిలి స్వగ్రామంలోనే నివాసం ఉంటూ నిత్యం వివిధ రకాల సేవలను పేదలకు అందిస్తున్న జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి సేవా తత్పరుడని కడప మేయర్ సురేష్ బాబు తెలిపారు. అలాగే వైఎస్సార్సిపి అమెరికా కన్వీనర్ వల్లూరు రమేష్ రెడ్డి తల్లి తండ్రుల జ్ఞాపకార్థం 30 లక్షల రూపాయలు వెచ్చించి ఈ ఉచిత కంటి శిబిరం నిర్వహించి 238 మందికి కంటి చూపు తెప్పించడం చాలా అదృష్టమని అన్నారు. ఎక్కడో అమెరికాలో స్థిరపడి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ పుట్టిన గడ్డను మరవకుండా బడుగులకు సేవలు అందిస్తోన్న వల్లూరు రమేష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 12 రోజులు పాటు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 1032 మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 238 మందిని ఆపరేషన్లు చేయించేందుకు నిర్ణయించారు. పూర్తిగా ఉచితంగా ఈ చికిత్స అందించడంతో పాటు అద్దాలు, మందులను కూడా పంపిణీ చేశారు. ఎప్పుడో ఓసారి ఎక్కడో ఓ చోట ఏవైనా కార్పొరేట్ ఆసుపత్రులు ఒక్కరోజు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుంటారని కానీ 12 రోజులు పాటు ఏకతాటిగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి సేవ చేయాలనే ఆలోచన చాలా గొప్పదని సురేష్‌బాబు కొనియాడారు. రమేష్ రెడ్డి చేసిన సేవకు ప్రతి ఒక్కరూ అభినందనలు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఈ ప్రాంతం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వారందరూ ఆకేపాటి అమర్నాథరెడ్డిని ఆదర్శంగా తీసుకొని వారి వారి స్వగ్రామాల్లో ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తే గ్రామాలు అన్ని విధాల అభివృద్ధి చెందుతాయని చెప్పారు. పుట్టిపెరిగిన గడ్డ అమ్మకు సమానమని, ఆ మాతృభూమికి ఎంతో కొంత సేవ చేసే అవకాశం నిజంగా అదృష్టమన్నారు రమేష్ రెడ్డి వల్లూరు. వైఎస్సార్ కడప జిల్లా నుంచి మూడు దశాబ్దాల కింద అమెరికా వెళ్లిన రమేష్ రెడ్డి ప్రస్తుతం వాషింగ్టన్ డి.సి.లో స్థిరపడ్డారు. ఇటీవలే తన తల్లితండ్రుల స్మృతిలో భాగంగా శంకర నేత్రాలయ ద్వారా ఈ ఉచిత కంటి శిబిరానికి తన వంతుగా చేయూత నిచ్చారు. 👁️ Proud to share that I've made a my contribution to a health camp that provided free eye check-ups for 1000+ patients and free surgeries for 238 people. We’re making a difference in improving lives! 🙏 💪❤️ #HealthcareForAll #CommunityImpact #GivingBack #CMJagan #AndhraPradesh — Ramesh Valluru Reddy (@YSRDist_RameshR) September 7, 2023 ఈ శిబిరానికి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్యులు గజేందర్ కుమార్ వర్మ, డాక్టర్ సురభి, డాక్టర్ శంకర్ హాజరై శిబిరానికి వచ్చిన వారికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేశారు. వీరికి శంకర నేత్రాలయ నుంచి అరుల్ కుమార్, రంజిత్ సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చొప్ప ఎల్లారెడ్డి, వైసీపీ నాయకులు పోలి మురళి, దాసరి పెంచలయ్య, డీలర్ సుబ్బరామిరెడ్డి, మహర్షి, రమేష్ నాయుడు పాల్గొన్నారు. -
వెయ్యేళ్ల అన్నమయ్య ‘కాలి’బాట.. ఎక్కడుందో తెలుసా!
అదిగో అల్లదిగో.. అంటూ శ్రీవారిని స్మరిస్తూ.. వేడుకొంటూ అత్యంతభక్తితో రాజంపేట మండలంలోని తాళ్లపాక వాసి పదకవితాపితామహడు అన్నమాచార్యులు ఏడుకొండలను ఎక్కిన కాలిబాట అది. ఇది వెయ్యేళ్ల కిందటి మాట. ఆహ్లాదరకమైన దట్టమైన అటవీమార్గంలో శ్రీవారిని దర్శించుకునేందుకు ఆ రోజుల్లో పూర్వీకులు వేలసంఖ్యలో వెళ్లేవారు. అన్నమయ్య వారసులు సైతం ఈ మార్గంలో కొండకు నడిచివెళ్లారు. టీటీడీ అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి నడుం బిగించి భక్తులను ఆనందపరవశులను చేస్తోంది. రాజంపేట: కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామిపై 32వేల కీర్తనలను రాసి ఆలపించి, మహాభక్తునిగా ప్రఖ్యాతిగాంచిన శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచి వెళ్లిన కాలిబాటలో వెళ్లడం మహాభాగ్యంగా శ్రీవారిభక్తులు భావిస్తున్నారు. ఆ కాలిబాటలో తిరుమల కొండకు చేరుకుంటున్నారు. అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి.. గతంలో అన్నమయ్య కాలిబాటను పునరుద్ధరించాలని డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆకేపాటి అమర్నాథ్రెడ్డి దివంగత సీఎం వైఎస్‌రాజశేఖరరెడ్డిని కలిసి వినతిపత్రం అందచేశారు. అప్పట్లో వైఎస్సార్ స్పందించి టీటీడీకి ఈ కాలిబాటను పరిశీలించాలని ఆదేశాలు కూడా జారీచేశారు. అయితే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో టీటీడీ బోర్డు చైర్మన్ వైవీసుబ్బారెడ్డి ఆధ్వర్యంలోని పాలకమండలి అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి అమోదం తెలిపింది. ఆ దిశగా చర్యలు చేపట్టడంలో టీటీడీ నిమగ్నమైంది. 18న ఆకేపాటి అన్నమయ్య కాలిబాటలో.. ఈనెల 18న శుక్రవారం జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి 20వసారి వేలాదిమందితో అన్నమయ్య కాలిబాటలో పాదయాత్రను చేపట్టి ఏడుకొండలకు చేరుకోనున్నారు. ఈయనతో పాటు అనేకమంది గోవిందమాలలు ధరించి అన్నమయ్య కాలిబాటలో వెళ్లనున్నారు. ఉదయం ఆకేపాటి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. కాలిబాట స్వరూపం.. ► మామండూరు–బాలపల్లె మధ్య స్వామిపాదాలు నుంచి తిరుమల కాలిబాట ప్రారంభమవుతుంది. పక్షుల కిలకిలలు, సెలయేళ్లు, ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ కొండకు చేరుకుంటుంది. ► అవ్వతాతగుట్టలు, శుక్రవారం బండలు, పురాతన సత్రాలు, ఎర్రిగుంటలు, ఈతకాయల మండపం నుంచి గోగర్భతీర్థం (తిరుమల)చేరుకుంటుంది. ► సుమారు ఈ కాలిబాట 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాలిబాట పూర్తిగా దట్టమైన అడవిలో ఉంది. ► పాదాలు, అక్కడి కోనేరు, సత్రాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కాలిబాటకు వెయ్యేళ్లు... రాజంపేట మండలంలోని తాళ్లపాక నుంచి అన్నమయ్య నడిచి వెళ్లిన కాలిబాట నేడు శిథిలమైంది. వెయ్యేళ్ల క్రితం ఉన్న రహదారి అభివృద్ధికి టీటీడీ దృష్టి సారించింది. ఈ బాట ద్వారా వెయ్యేళ్ల క్రితం నుంచి భక్తులు గోవిందనామస్మరణాలు చేసుకుంటూ శ్రీవారిసన్నిధికి చేరుకుంటూనే ఉన్నారు. ఉత్తర, దక్షిణ భారతీయులకు అనుకూలం... పూర్వం తిరుమలకు ఈ దారి గుండా అధికసంఖ్యలో శ్రీవారి భక్తులు వెళ్లేవారు. అయితే తిరుపతి నుంచి ఏడుకొండల మీదుగా తిరుమల చేరుకోవడం నేడు పరిపాటిగా మారింది. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంతో పాటు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారు తిరుపతికి వెళ్లకుండానే నేరుగా అన్నమయ్య కాలిబాట ద్వారా స్వామి సన్నిధికి చేరుకోగలరు. స్వామి సన్నిధికి చేరుకునే పుణ్యపవిత్రమైన మార్గంగా కాలిబాట ప్రాచుర్యం పెరుగుతోంది. కాలిబాటలో శ్రీవారిని దర్శించుకోవడం మహాభాగ్యం.. పదకవితా పితామహడు తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచివెళ్లిన కాలిబాటలో వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం మహాభాగ్యం. ఇప్పటికే అనేకమంది భక్తులు గోవిందమాల ధరించి ఆ మార్గంలో కొండకు చేరుకుంటున్నారు. ఈ మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు టీటీడీ ముందుకు రావడం శుభపరిణామం. జడ్పీచైర్మన్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి కాలిబాటలో వేలాదిమంది భక్తులతో కొండకు 20వ సారి వెళుతున్నారు. – చొప్పా ఎల్లారెడ్డి, వైస్‌చైర్మన్, ఎఐటీఎస్, రాజంపేట అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి ఆకేపాటి కృషి అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి ఎంతగానో కృషిచేసారు. దివంగత సీఎం, ప్రస్తుతం సీఎం, టీటీడీ చైర్మన్ దృష్టికి కాలిబాట అంశం అనేకసార్లు తీసుకెళ్లారు. ఫలితంగా ఇప్పుడు అన్నమయ్య కాలిబాట అభివృద్ధి దిశగా టీటీడీ అడుగులు వేసింది. అన్నమయ్య కాలిబాటలో వెళ్లే భక్తులకు వైద్య ఆరోగ్యశాఖ కూడా వైద్య సేవలందించేందుకు అందుబాటులో ఉంటారు. – పిల్లిపిచ్చయ్య, అధ్యక్షుడు, రాజంపేట తాలుకా పెన్షనర్ల సంఘం -
‘వివేకా హత్యపై బాబు డైరెక్షన్లో దుష్ప్రచారం’
కడప సెవెన్‌రోడ్స్: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో వైఎస్ కుటుంబంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు డైరెక్షన్లో దుష్ప్రచారం జరుగుతోందని వైఎస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రం కడపలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వివేకా హత్య జరిగిందని గుర్తుచేశారు. చంద్రబాబు అప్పుడే నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించి నిజాలు ఎందుకు వెలికి తీసుకురాలేదని ప్రశ్నించారు. నేడు పథకం ప్రకారం స్క్రిప్ట్ తయారు చేసుకుని దుష్ప్రచారానికి ఒడిగడుతున్నారని చెప్పారు. వైఎస్ కుటుంబానికి రక్తపు మరకలు అంటించాలని ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపై బురద చల్లేందుకు యత్నించడం అన్యాయమని చెప్పారు. అవినాష్‌రెడ్డి సౌమ్యుడని, హత్యారాజకీయాలను ఏనాడూ ప్రోత్సహించలేదని పేర్కొన్నారు. ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని యత్నించడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివేకానందరెడ్డి స్వయాన చిన్నాన్న అని, ఆ కుటుంబాన్ని సీఎం పట్టించుకోలేదనడం దుర్మార్గమని చెప్పారు. వైఎస్ కుటుంబానికి ఉభయ రాష్ట్రాల్లో ఎంతో గౌరవ ప్రతిష్టలున్నాయన్నారు. వివేకా కుటుంబం చంద్రబాబు ఉచ్చులో పడరాదని కోరారు. వైఎస్ కుటుంబంలో చిచ్చుపెట్టడం ద్వారా రాజకీయలబ్ధి పొందాలని చంద్రబాబు యత్నిస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్యకేసులో దోషులను గుర్తించాలని తాము ఆరోజే డిమాండ్ చేశామని గుర్తుచేశారు. తమకు మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి తదితరులపై అనుమానాలున్నాయని చెప్పారు. సీబీఐ అధికారులు వారిని ఎందుకు విచారించరని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీబీఐ అధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి దోషులను చట్టానికి అప్పగించాలన్నారు. వివేకా కుటుంబం అపోహాలు వీడి నిష్పక్షపాతంగా దర్యాప్తు సాగేందుకు యత్నించాలని కోరారు. -
వైఎస్సార్ జిల్లా జడ్పీ చైర్మన్‌గా ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి
-
భావోద్వేగాలను రెచ్చగొట్టడం తగదు
రాజంపేట టౌన్: ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం తగదని తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా హితవు పలికారు. వైఎస్సార్ జిల్లా రాజంపేటలోని ఆకేపాటి భవన్లో ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్‌బాబు, వైఎస్సార్ సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డిలతో కలిసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కాని నాగార్జునసాగర్ నుంచి కాని తమకు కేటాయించిన నీటికంటే ఒక బొట్టు కూడా అదనంగా తాము వాడుకోవడం లేదని స్పష్టం చేశారు. దొంగతనంగానో, తప్పుడు మార్గంలోనో నీళ్లు తీసుకునే తక్కువ స్థాయి ఆలోచనలు తమ ప్రభుత్వానికి లేవన్నారు. నీటి వినియోగంపై తెలంగాణ మంత్రులకు సందేహాలుంటే ఎప్పుడైనా, ఎక్కడైనా నివృత్తి చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో తమ ప్రభుత్వం ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించడం లేదన్నారు. -
అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి చర్యలు
సాక్షి, పల్లంపేట: ఐదు వందల సంవత్సరాల క్రితం తిరుమలకు అన్నమయ్య నడిచిన కాలిబాటను అభివృద్ధి చేసి భక్తులకు సులువైన మార్గం ఏర్పాటుకు త్వరలో చర్యలు చేపడతామని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వెల్లడించారు. కాలిబాట మార్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా సుముఖంగా ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చేపట్టిన తిరుమల మహా పాదయాత్రలో శనివారం ఆయన పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లా పల్లంపేట మండలం అప్పయ్యరాజు పేట వద్ద ఆకేపాటి పాదయాత్ర చేరుకున్న క్రమంలో డిప్యూటీ సీఎం.. ఆకేపాటిని కలిసి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల మహా పాదయాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. 17 వ సారి మహా పాదయాత్ర చేపట్టిన ఆకేపాటి దంపతులకు ఏడుకొండల స్వామి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కడప పార్లమెంటరీ అధ్యక్షుడు సురేష్ బాబు ఆకాంక్షించారు. -
పాదయాత్ర ప్రజల గుండెలను తాకింది
వర్జీనియా : జనరంజక పాలనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి థ్యేయమని ఆ పార్టీ సీనియర్ నేత ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆరాచక పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్న రోజుల్లో ఒక మానవత్వం ప్రజల గుండెలను పాదయాత్ర రూపంలో తాకిందన్నారు. అమెరికాలోని వర్జీనియాలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ, వృద్దాప్య పెన్షన్, ఫీజు రీయింబర్స్మెంట్, పేద ప్రజలకు పక్కా ఇళ్ళు, జలయజ్ఞం లాంటి ప్రజాధరణ పొందిన పథకాలకు రాజన్న పాలనలోనే అంకురార్పణ జరిగిందన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఆంధ్ర ప్రజలు ఎన్నటికీ మరువలేని మానవత్వపు జ్ఞాపకమని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. తనకు వైఎస్సార్ కుటుంబంతో మూడు తరములుగా ఉన్న అనుబంధాన్ని ఈ సభలో గుర్తు చేసుకున్నారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా ప్రజల మనస్సులో నిలిచిన నేత వైఎస్సార్ అని, నిన్నటి రాజన్న పరిపాలనలో అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు, కాంచిన పేదవారి చిరునవ్వులు రేపు మళ్లీ విరబూయాలంటే వైఎస్ జగన్ లాంటి నాయకుడు రాష్ట్రానికి రథ సారథిగా రావాలని పునరుధ్ఘాటించారు. ఈ 2019 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటుందని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్న ధీమాను వ్యక్తంచేశారు. వైఎస్సార్ సీపీ సభ్యులు రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. తరాలు మారినా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి గొప్ప రాజకీయవేత్త, పేదలపాలిటి పెన్నిధి మనకు కానరారని అన్నారు. కులమత ప్రాంతాలకు అతీతంగా ఆజన్మాంతం సామాన్యుడి మదిలో నిలిచిపోయారన్నారు. అలాంటి మహనీయుని ఆశయాలకు వారసుడిగా ఆశయ సాధనలో ధీరుడిగా పాలక పక్షం గుండెల్లో రైల్లు పరిగెత్తిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి నాయకులుగా ఈ ఎన్నికల్లో గెలుపొందేవిధంగా కష్టపడిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. వైఎస్ జగన్‌లాంటి నిజాయిలీ పరుడి పాలన వస్తే కష్టాలు దూరమై సంతోషం చేరువ ఆవుతుందని, మంచిరోజులు రాబోతున్నాయని వైఎస్ జగన్ పాలనకై ఆంధ్ర ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారని అన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ సభ్యులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. పెద్దాయన ఏర్పరచిన దారిలో నడుస్తున్న నేటి తరము యువ నేత వైఎస్ జగన్‌కు మన సంపూర్ణ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం వైఎస్సార్ సీపీ సభ్యులు ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ.. మారిన కాలానికి అనుగుణంగా మన దేశ ఆర్థిక పరిస్థితులు మారాలని, యువతరం ముందుకు రావాలని, ఇప్పుడున్న ప్రభుత్వం ఏ మాత్రం మన సామాన్య ప్రజల కనీస అవసరాలు తీరుస్తున్నారో అందరూ చూస్తున్నారని అన్నారు. వైఎస్సార్ సీపీ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను, ప్రవేశపెట్టిన పథకాలను కొనియాడారు. ప్రస్తుత ప్రభుత్వ తీరు తెన్నులను తూర్పారబట్టారు. వైఎస్సార్ సీపీ సభ్యులు సురేంద్ర బత్తినపట్ల మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కోసం తెలుగు ప్రజలంతా ఎదురుచూస్తున్నారని తెలిపారు. వైఎస్సార్ సీపీ సభ్యులు జయ్ జొన్నల మాట్లాడుతూ.. నిజమైన పరిపాలనకు నిలువుటద్దం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. నవరత్నం గ్రామ సచివాలయం అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటి సభ్యులు సురేన్ బత్తినపట్ల, వెంకట్ కొండపోలు, రామ్ రెడ్డి, సత్య పాటిల్ రెడ్డి, ఆంజనేయ రెడ్డి దొందేటి, నినాద్‌రెడ్డి అన్నవరం, జీపీ నరసింహ రెడ్డి, కమలాకర్ రెడ్డి, స్పాస్కి రెడ్డి, ఏబీ శ్రీనివాస్, ఏబీ నగేష్, సతీష్ రెడ్డి నరాల, శ్రీనివాస్ సోమవారపు, జయ్ జొన్నల, నరసా రెడ్డి పేరం, శివ రెడ్డి, చిన్నిక్రిష్ణా రెడ్డి, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, శ్రీధర్ నాగిరెడ్డి, రాజశేఖర్ బసవరాజు, అమర్ బొజ్జ, ఈశ్వర్ బండా, సుజీత్, వినీత్ లోక, కిరణ్ కుమార్ రెడ్డి, గంగి రెడ్డి ఎద్దుల, వేణుగోపాల్ రెడ్డి, విజయ భాస్కర్ ఏటూరు, శశి, రఘునాథ్ రెడ్డి, సురేష్ రెడ్డి, మరియు అనేకులు పాల్గొన్నారు. ఇండియా నుంచి రఘురామి రెడ్డి రంపా, ఉమాకాంత్, రామలింగ రెడ్డి గజ్జల, రమేష్ రెడ్డి లోక తదితరులు పాల్గొన్నారు. -
ఒక మండలం.. ఐదుగురు ఎమ్మెల్యేలు
సాక్షి, వైవీయూ : రాజంపేట నియోజకవర్గం పరిధిలోని నందలూరు మండలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒకే మండలం నుంచి ఇప్పటి వరకు ఐదుగురు ఎమ్మెల్యేలు కాగా, మరో ఇద్దరు ఇదే మండలంలో పెళ్లిళ్లు చేసుకుని మండలం అల్లుళ్లు కావడం విశేషం. 1967, 1972, 1985 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన బండారు రత్నసభాపతి స్వగ్రామం నందలూరు మండలం యల్లంపేట. అలాగే 1978, 1983, 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికైన కొండూరు ప్రభావతమ్మ, 1989లో ఎమ్మెల్యేగా ఎన్నికైన కసిరెడ్డి మదన్‌మోహన్‌రెడ్డిల స్వగ్రామం నందలూరు మండలంలోని పాటూరు గ్రామం. 1994, 1999లో ఎమ్మెల్యేగా ఎన్నికైన పసుపులేటి బ్రహ్మయ్యది మండలంలోని పొత్తపి గ్రామం. 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన మేడా వెంకట మల్లికార్జునరెడ్డిది మండలంలోని చెన్నయ్యగారిపల్లె. అదే విధంగా 1962లో ఎమ్మెల్యేగా ఎన్నికైన కొండూరు మారారెడ్డి నందలూరు మండలంలో పెళ్లి చేసుకోవడంతో ఆయన ఈ మండలానికి అల్లుడయ్యారు. ఇక 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆకేపాటి అమర్నాథ్రెడ్డి నందలూరు మండలంలోని గట్టుమీదపల్లెలో వివాహం చేసుకోవడంతో ఈయన కూడా నందలూరు మండలం అల్లుడయ్యారు. కాగా ఇదే మండలంలోని ఈదరపల్లెకు చెందిన భూమన కుటుంబ సభ్యులైన భూమన కరుణాకర్‌రెడ్డి 2012 ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్నికవడం గమనార్హం. వీరు గత కొన్ని సంవత్సరాల క్రితమే తిరుపతి చేరుకుని అక్కడి రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుండటం విశేషం. ఈయనతో కలుపుకుంటే మండలం నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి సంఖ్య 6కు చేరుతుంది. -
‘బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు’
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్సీపీలో ఎలాంటి గ్రూపులు లేవని రాజంపేట మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. రాజంపేటలో కొంతమంది బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇక్కడి ప్రజలు రౌడీయిజం, ఫ్యాక్షనిజాన్ని ఒప్పుకోరని, మంచిని ప్రోత్సహిస్తారని అభిప్రాయపడ్డారు. వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఆకెపాటి అమర్నాథ్ రెడ్డితో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మేడా వెల్లడించారు. టీడీపీ నేతలకు రాజంపేటలో నేతలు లేక బయటి నుంచి దిగుమతి చేసుకుంటున్నారని పేర్కొన్నారు. -
‘పసుపు కుంకుమ’తో చంద్రబాబు మోసం
సాక్షి, రాజంపేట : వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను కాపీ కొడుతున్న సీఎం చంద్రబాబు ప్రజల్ని మభ్యపెడుతున్నారని వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ముందు ఎన్నో బూటకపు హామీలిచ్చిన చంద్రబాబు.. నాలుగున్నరేళ్ల తర్వాత ‘పసుపు కుంకుమ’ తో మరోసారి మోసం చేయడానికి వచ్చారని ఎద్దేవా చేశారు. వచ్చే గురువారం (ఫిబ్రవరి 7) కడప మున్సిపల్ స్టేడియంలో బూత్ కమిటీలతో సమావేశంలో ఉంటుందని తెలిపారు. మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, అంజాద్ బాషా, శ్రీనివాసులు, కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేస్బాబులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. దేశంలోనే ఏపీని ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడం ఒక్క వైఎస్ జగన్‌కే సాధ్యమని సురేష్‌బాబు అన్నారు. ఎన్నికలు దగ్గరపడడంతో బాబుకు బీసీలు, మహిళలు, దళితులు కనిపిస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ ఇచ్చే హామీల అమలుకు అమెరికా బడ్జెట్ కూడా సరిపోదవి వ్యాఖ్యానించిన చంద్రబాబు.. ఇప్పుడెందుకు నవరత్నాలకు కాపీ కొడతున్నారని ఫైర్ అయ్యారు. -
టీఆర్ఎస్తో పొత్తు కోసం బాబు శవరాజకీయం
కడప కార్పొరేషన్: తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడానికి హరికృష్ణ మృతదేహం పక్కనుండగానే శవరాజ కీయం చేసింది చంద్రబాబేనని వైఎస్ఆర్సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి అన్నారు. శుక్రవారం కడపలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించడానికి వస్తున్నామంటూ కేసీఆర్ ఫోన్ చేసిన మీదట కేటీఆర్ బృందం వైఎస్ జగన్‌తో భేటీ అయిందన్నారు. రాష్ట్రానికి మేలు చేసే ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు కోసం పక్క రాష్ట్రం మద్దతు ఇస్తామంటే తీసుకోకుండా ఎలా ఉంటామని ప్రశ్నించారు. ఏపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తేనే పొత్తు ప్రసక్తి వస్తుందని, మన రాష్ట్రంలో టీఆర్ఎస్ లేదు కాబట్టి అలాంటి అవకాశమే లేదన్నారు. ఏపీలో 175 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు. టీడీపీతో పొత్తుకు కేటీఆర్ తిరస్కరించడం వల్లే చంద్రబాబు అక్కసుతో ఎల్లో మీడియా ద్వారా వైఎస్ఆర్సీపీపై బురదజల్లుతున్నారని «ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్‌తో, అందుకు మద్దతిచ్చిన బీజేపీలతో దోస్తీ చేసిన చంద్రబాబు ఆ తప్పిదాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నిం చారు. నాలుగేళ్లు ప్రత్యేక హోదా మాటెత్తకుండా హోదా ఏమన్నా సంజీవనా, దానితో అన్నీ జరిగిపోతాయా అంటూ మాట్లాడి ప్యాకేజీకి అంగీకరించారన్నారు. ప్యాకేజీ ఇచ్చినందుకు ప్రధాని మోదీతో సహా అందరినీ సన్మానించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు హోదాను పక్కనబెట్టి ప్యాకేజీకి అంగీకరించడం వల్లే ఈ రోజు హోదా కోసం అన్ని పార్టీల మద్దతు కూడగట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్ వైఎస్ జగన్‌ను కలవకముందే ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారన్నారు. లోక్‌సభలో రాష్ట్రాల సంఖ్యాబలం పెరిగినప్పుడే ఆయా రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని, మన రాష్ట్రంలో ఉన్న 25మంది ఎంపీలకు తెలంగాణలోని 17 మంది కలిస్తే ఆ బలం 42కు పెరిగి కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఈ మేరకు ప్రత్యేక హోదాకు ఏ ప్రాంతీయ పార్టీలు, కూటములు మద్దతు పలికినా వైఎస్ఆర్సీపీ ఆహ్వానించి అభినందిస్తుందన్నారు.విభజన హామీల విషయంలో ఆడి తప్పిన బీజేపీపై చివరి ఏడాదిలో చంద్రబాబు, రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో కలసి యుద్ధం చేస్తానడటం హాస్యాస్పదమన్నారు. టీఆర్ఎస్తో పొత్తుకు ప్రయత్నించి సాక్షాత్తు అసెంబ్లీలోనే తెలుగువారు కలిసి ఉంటే బాగుంటుందని చెప్పిన సీఎం, నేడు విపరీతార్థాలు తీయడం దారుణమన్నారు. కేటీఆర్‌తో జరిగిన సమావేశం ఎన్నికల్లో మద్దతు కోసం కాదని, ఫెడరల్ ఫ్రంట్‌లో చేరుతున్నామని జగన్ ప్రకటించలేదన్నారు. కేంద్రంలో రెండు జాతీయ పార్టీలు రాష్ట్రానికి అన్యాయం చేసిన నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ వల్ల ప్రత్యేక హోదా డిమాండ్‌కు మద్దతు లభిస్తుందన్నది వైఎస్ జగన్ అభిప్రాయమన్నారు. దీన్ని చిలువలు పలువలు చేసి ప్రచారం చేయడంలో అర్థం లేదన్నారు. జిల్లా అధికార ప్రతినిధి రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో మొదటి నుంచి ఒకే మాటపై ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీయేనన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో గొంగళి పురుగును కూడా ముద్దు పెట్టుకుంటానని కేసీఆర్ ప్రకటించినట్లుగా, ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ ఎవరితోనైనా కలుస్తుందన్నారు. హోదా అంశాన్ని కాంగ్రెస్ చట్టంలో పెట్టి ఉంటే న్యాయస్థానాల ద్వారా పోరాటం చేసే వీలుండేదన్నారు. చంద్రబాబు ఏ ఆట ఆడితే దాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక హోదాకు ఏ పార్టీ మద్దతు ఇచ్చినా తమ పార్టీ తీసుకుంటుందని స్పష్టం చేశారు. యూత్ వింగ్ జిల్లా అధ్యక్షుడు బి. నిత్యానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు కారణమైన రెండు ప్రధాన జాతీయ పార్టీలతో కలిసింది చంద్రబాబేనన్నారు. తెలం గాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు వైఎస్ఆర్సీపీపై బురజల్లడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘ఎల్లో మీడియా ద్వారా బురదజల్లే ప్రయత్నం’
-
‘ఎల్లో మీడియా ద్వారా బురదజల్లే ప్రయత్నం’
సాక్షి, వైఎస్సార్: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల భేటీపై టీడీపీ అస్యత ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫెడరల్ ఫ్రంట్‌పై టీడీపీ అసత్య ప్రచాలు చేస్తూ.. ఎల్లో మీడియా ద్వారా వైఎస్ జగన్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందమూరి హరికృష్ణ పార్థీవదేశం సాక్షిగా శవ రాజకీయాలు చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోవడానికి కారణమైన కాంగ్రెస్‌తో సిగ్గులేకుండా చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. -
‘సేవారత్న’ పుస్తకావిష్కరణ
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డిపై ‘సేవా రత్న’ (ప్రేరణ, ప్రాణం, వైఎస్ అనేది ట్యాగ్ లైన్)అనే పుస్తకాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్న శ్రీకాకుళం జిల్లాకు వెళ్లిన వైఎస్సార్ జిల్లా పార్టీ నాయకులు ఆయనతో ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకేపాటి అమర్నాథ్రెడ్డికి, వైఎస్ కుటుంబానికి 35 ఏళ్ల నుంచి సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉందని.. ఆ విషయాలన్నీ ఈ పుస్తకంలో ప్రచురించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పార్టీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు, రాజంపేట మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రాయచోటి, రైల్వేకోడూరు, కడప ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, ఎస్బీ అంజద్‌బాషా పాల్గొన్నారు. -
రాష్ట్రాన్ని బాబు భ్రష్టు పట్టిస్తున్నారు
రాజంపేట రూరల్ : అధికారంలోకి వచ్చినప్పటినుంచి అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి విమర్శించారు. ఆదివారం శింగనవారిపల్లి శ్రీమారమ్మ ఆలయంలో ఆకేపాటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకుడు సి. చలమయ్య నివాసంలో నిర్వహించిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆకేపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకేపాటి విలేకర్లతో మాట్లాడారు. దేశంలో అందరికంటే సీనీయర్‌ని అని, సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకొనే బాబుకు రాష్ట్రాభివృద్ధిపై చిత్తశుద్ధిలేదని ఎద్దేవా చేశారు. 2018 సంవత్సరం చివరికల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానని కల్లబొల్లి హామీలిచ్చారని.. ఇప్పుడు ప్రజలకు ఏమి సమాధానం చెబుతావని ప్రశ్నించారు. బాబు పాలనపై అన్నివర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోయాయని ఆరోపించారు. అన్నదాతల ఆత్మహత్యలను అరికట్టడంలో బాబు ప్రభుత్వం విఫలం అయ్యిందని విమర్శించారు. నిరుద్యోగులకు మొండి చేయి చూపిచిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వైద్యం కోసం ప్రవేశ పెట్టిన పథకాలను నిర్వీర్యం చేసిన బాబు ఎంతో మంది ప్రాణాలను బలిగొన్నారన్నారని ఆరోపించారు. రాజన్న రాజ్యం రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందలన్నా జగనన్న ముఖ్యమంత్రి కావాలన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మనందరి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ నాయకులు బొల్లినేని రామ్మోహన్నాయుడు, సి. నాగేశ్వరచౌదరి, బుర్రు. నాగేశ్వరరావు, ఎం.లక్ష్మీనారాయణ, కె.శంకరయ్యనాయుడు, దాసరి పెంచలయ్య, కె.మణినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
తిరుమలకు చేరిన ఆకేపాటి పాదయాత్ర
చిత్తూరు ,తిరుమల : తమ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని, వైఎస్సార్ జిల్లా రాజంపేట నుంచి తిరుమలకు ఉన్న పురాతన అన్నమయ్య మార్గం పునరుద్ధరణకు నోచుకోవాలని ఆకాంక్షిస్తూ వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి చేపట్టిన మహాపాదయాత్ర సోమవారం తిరుమలకు చేరుకుంది. సుమారు 3 వేల మంది భక్తులతో రాజంపేట మండలం ఆకేపాడు ఆలయాల సముదా యం నుంచి 17వ తేదీ పాదయాత్ర ప్రారంభించారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల అన్నమ య్య మార్గాన్ని పునరుద్ధరించేందుకు దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి చర్యలు చేపట్టారని గుర్తుచేశారు. రాజంపేటలో అన్నమయ్య 108 అడుగుల విగ్రహాన్ని రాజశేఖరరెడ్డి హయాం లో ఏర్పాటు చేశారన్నారు. అన్నమయ్యను గుర్తుంచుకోవాలం టే ఈ దారిని పునరుద్ధరించాలని కోరారు. జగన్మోహన్రెడ్డి సీఎం అయితే వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా పథకా లు ప్రజలకు అందుతాయన్నారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు మా ట్లాడుతూ ఎంతో ఇబ్బంది ఉన్నప్పటికీ స్వామి దయతో కాలిబాటలో తిరుమలకు వచ్చి దర్శించుకోవడం చాలా సం తో షంగా ఉందన్నారు.జగన్ సీఎం అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి మాట్లాడుతూ అమరనాథరెడ్డి చేపట్టిన పాదయాత్రలో పాలుç ³ంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు కష్టాల నుంచి విముక్తి కల్పించడానికి జగన్మోహన్రెడ్డి నాయకత్వం రావాలని ఆశిస్తున్నామన్నారు. ప్రజాసంకల్ప యాత్ర దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటున్నామన్నారు. అంతకుముందు కుక్కలదొడ్డి నుంచి కాలిబాటలో తిరుమలకు చేరుకున్న అమరనాథరెడ్డికి ఘనస్వాగతం లభించింది. పార్టీ తిరుమల నాయకులు పెంచలయ్యతో పాటు పలువురు ఆయనకు ఘనస్వాగతం పలికారు. వీరికి టీటీడీ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసింది. సోమవారం రాత్రి శ్రీవారిని దర్శించుకుని తిరిగి మంగళవారం విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. -
అన్నమయ్య కాలిబాటను అభివృద్ధి చేయాలి
-
‘అతడు లోకేష్‌కు ప్రియ శిష్యుడు’
వైఎస్సార్ జిల్లా: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు చూస్తుంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్లాన్ చేసి చంపేందుకు ప్రయత్నించినట్లుగా స్పష్టంగా తెలుస్తోందని కడప వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంజద్ బాష తెలిపారు. మంగళవారం మైదుకూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రఘురామి రెడ్డి, రాజంపేట పార్లమెంటు వైస్సార్సీపీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిలతో కలిసి పార్టీ కార్యాలయంలో అంజద్ బాష విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబులోని రాక్షసత్వం ఇప్పుడు బయటపడిందని అంజద్ భాషా వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులకి ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే అడ్డుగా ఉన్నారు.. అందుకే పథకం ప్రకారం ఆయన్ను తుదముట్టించాలని చూశారని పేర్కొన్నారు. మా కార్యకర్తలను రెచ్చగొట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.. టీడీపీ నాయకులు ఎన్ని చేసినా మా కార్యకర్తలు సంయమనంతో ఉన్నారు, ఉంటారని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లి షర్మిల చేయించారనడానికి సిగ్గుండాలని తీవ్రంగా మండిపడ్డారు. అలిపిరి సంఘటన వెనక నారా భువనేశ్వరీ, లోకేష్‌లు ఉన్నారని అంటే మీరు ఒప్పుకుంటారా అని సూటిగా అడిగారు. ఆపరేషన్ గరుడ కర్త, కర్మ, క్రియ ఎవరో రాష్ట్ర ప్రజలకి తెలియాలని కోరారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రఘురామి రెడ్డి మాట్లాడుతూ.. నిందితుడు కత్తితో దాడి చేస్తే టీడీపీ నేతలు ఫోర్క్ అనడం ఏమిటని ప్రశ్నించారు. దాడి జరిగిన విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో సీసీ కెమెరాలు కూడా లేకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. రాష్ట్రంలో ఏదైనా జరిగితే అడిగే హక్కు గవర్నర్‌కు లేదా అని సూటిగా టీడీపీ నేతలను ప్రశ్నించారు. ఈ కేసులో కీలక నిందితుడు హర్షవర్దన్ చౌదరీ, లోకేష్‌కు ప్రియ శిష్యుడని వెల్లడించారు. అందుకే చర్యలు లేవని చెప్పారు. ఘటన జరిగిన గంటకే ఎలాంటి విచారణ చేయకుండా ప్రెస్ మీట్ పెట్టి నిందితుడు వైఎస్ఆర్సీపీ వీరాభిమాని అని చెప్పిన డీజీపీతో విచారణ చేయిస్తే వాస్తవాలు బయటకు రావని, స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. నిందితుడి కులం పేరు చెప్పడం దారుణమన్నారు. వైఎస్జగన్ హైదరాబాద్ చేరకముందే డీజీపీ స్పందించడంపై అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే బాధ్యత తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి అవహేళనగా మాట్లాడటం హేయమైన చర్య అని అన్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తే ఆ విజ్ఞత మన ముఖ్యమంత్రికి లేకుండా పోయిందన్నారు. కేంద్రం మీద నెట్టే దానికే పాదయాత్రలో కాకుండా ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం చేశారని వెల్లడించారు. -
'దిక్కుతోచని స్థితిలో రైతన్న'
వైఎస్ఆర్ జిల్లా: రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారయిందని రాజంపేట వైఎస్సార్సీపీ పార్లమెంటరీ అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథరెడ్డి అన్నారు. దిక్కుతోచని పరిస్థితిలో రైతు ఉన్నారని తెలిపారు. పడకేసిన ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతాంగం సాగు, తాగునీరు లేక విలవిలలాడిపోయే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతాంగం కోసం 90 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే, మిగిలిన 10% పనులు పూర్తి చేయలేని స్థితిలో సీఎం చంద్రబాబు నాయడు పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. -
ఇంత ‘చెత్త’ పాలనా?
రాజంపేట(వైఎస్సార్ కడప) : రాజంపేట పట్టణంలో అధ్వానంగా తయారైన పారిశుద్ధ్యం పరిస్థితిపై వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పురపాలన అధ్వానంగా ఉందంటూ తూర్పారబెట్టారు. పారిశుద్ధ్యం పనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించినప్పటి నుంచి మరింత దారుణంగా తయారైందంటూ స్వయంగా ఆయనే చెత్తను ఎత్తివేసి నిరసన తెలిపారు. వివరాల్లోకెళితే.. పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు ప్రైవేటీకరణ చేస్తూ ప్రభుత్వం చేపట్టిన చర్య అభాసుపాలైంది. రాజంపేట మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులు పడకేశాయి. ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉండిపోయింది. ఫలితంగా పట్టణంలో దుర్గంధం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్యంపై వైఎస్సార్సీపీ సమరభేరి మోగించింది. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో ప్రజలతో కలిసి స్వచ్ఛందంగా చెత్త ఎత్తివేసే కార్యక్రమం చేపట్టారు. 20 ట్రాక్టర్లను పెట్టి 20 వార్డులలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు కలిసి చెత్త తొలగింపు పనులు చేపట్టారు. స్వయంగా ఆకేపాటి కూడా చెత్తను తొలగించే పనుల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లాలో ఏ మున్సిపాలిటిలో లేకపోయినప్పటికి రాజంపేట మున్సిపాలిటిలో 279 జీఓను అమలు చేశారు. దీంతో పారిశుద్ధ్యం పనులు క్లీన్‌సిటీ అనే సంస్థకు అప్పగించారు. అప్పటినుంచి పారిశుద్ధ్యం పడకేసింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పట్టణంలోని చెత్తను ట్రాక్టరలో వేసుకొని మున్సిపాలిటీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అయితే రాజంపేట రూరల్ సీఐ నరసింహులు ఆధ్వర్యంలో పోలీసులు ఈ ర్యాలీని అడ్డుకున్నారు. ర్యాలీ మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లకుండా గేటుకు తాళం వేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి మున్సిపల్ రీజినల్ డైరెక్టర్‌తో ఫోన్లో మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్యం పరిస్థితి అధ్వానంగా తయారైందని, ఇలాగే కొనసాగితే చెత్తపై సమరభేరిని మోగిస్తామని, రెండు రోజుల్లో పట్టణంలో పారిశుద్ధ్యం పరిస్థితి మెరుగు పరచాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ చేపట్టిన కార్యక్రమానికి పట్టణ ప్రజలు పెద్దఎత్తున మద్దతు ప్రకటించారు. ఇదిలా ఉండగా ఓవైపు వైఎస్సార్సీపీ నాయకులు ట్రాక్టర్లలో చెత్తను తొలగిస్తుంటే, మరోవైపు మున్సిపల్ సిబ్బంది కూడా హడావుడిగా చెత్తను తొలగించేందుకు ప్రయత్నించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఆకేపాటితో పాటు నేతలు చెత్త ట్రాక్టర్లతో ర్యాలీగా మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకోగానే పోలీసులు రంగప్రవేశం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ కార్యాలయం గేటుకు తాళాలు వేశారు. ప్రజలను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో ఆకేపాటితోపాటు వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ పోలా శ్రీనివాసులరెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఈశ్వరయ్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆకేపాటి మురళీరెడ్డి,బీసీ రాష్ట్ర విభాగం ప్రధానకార్యదర్శి ఈశ్వరయ్య, బీసీ విభాగం రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పసుపులేటి సుధాకర్ నాయకులు కృష్ణారావు, భాస్కర్‌రాజు, కొండూరు విశ్వనాధరాజు, గోవిందు బాలకృష్ణ, బొల్లినేని రామ్మోహన్నాయుడు, దండుగోపి, పెంచలయ్య, గుండు మల్లికార్జునరెడ్డి, మైనార్టీ నాయకులు యూసఫ్, జావిద్, మసూద్, ఖలీల్, ఆలం, స్థానిక నాయకులు మార్కెట్ కృష్ణారెడ్డి, బలిజపల్లె చిన్న తదితరులు ఆందోళనకు దిగారు. -
బంద్‌ను విజయవంతం చేయాలి
రాజంపేట (వైఎస్సార్ కడప): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా, విభజన హామీల అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల 24న తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం తన స్వగృహంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేకహోదా విషయంలో టీడీపీ ఆడుతున్న డ్రామా పార్లమెంటు సాక్షిగా బహిర్గతమైందన్నారు. పార్లమెంటు పరిధిలోని చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలోని వ్యాపార, వాణిజ్యవర్గాలు, విద్యాసంస్థలు, కార్మికులు, ఉద్యోగులు, రాజకీయపార్టీలు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలనిరసన ఢిల్లీకి చేరేలా నినందించాల్సిన ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని పేర్కొన్నారు. బయటపడ్డ‘దేశం’డ్రామాలు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా విషయంలో బీజేపీతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆడుతున్న డ్రామాలు పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మాటల్లో తేటతెల్లమయ్యాయని అమర్నాథ్రెడ్డి అన్నారు. పార్లమెంటులో టీడీపీ ఎంపీలు చేసిన ప్రసంగాలలోని వాదనలన్నీ నాలుగేళ్లుగా వైఎస్సార్సీపీ వినిపించినవేననే విషయాన్ని ప్రజలు కూడా గుర్తించారన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. -
కుమ్మక్కు రాజకీయాలు అభివృద్ధికి ఆటంకం
రైల్వేకోడూరు (వైఎస్సార్ కడప): రాష్ట్ర విభజన నాటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలతో రాష్ట్రాభివృద్ధికి ఆటంకమని వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంటరి నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన ఎమ్మెల్యేతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ప్రత్యేకహోదా విషయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న కడపకు ఉక్కు పరిశ్రమ, రైల్వేజోన్, విద్యాసంస్థలు తదితర వాటిని సాధించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. బీజేపీతో నాలుగేళ్లపాటు అంటకాగి మంత్రి పదవులు అనుభవించి పార్టీ నాయకులు సొమ్ము దండుకోవడానికి ప్రత్యేకప్యాకేజి ఒప్పుకుని రాష్ట్రానికి సీఎం తీరని అన్యాయం చేశారని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రజలు తనను సాగనంపుతారని గ్రహించి చంద్రబాడు కొత్త నాటకాలకు తెరతీశారన్నారు. పార్లమెంట్లో ప్రధాని నరేంద్రమోది, రాజ్‌నాథ్‌సింగ్ చంద్రబాబు నాటకాలను బయటపెట్టారని తెలిపారు. దీంతో చంద్రబాబుకు ఓటు ఎందుకు వేశామా అని ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. మొదటి నుంచి ప్రత్యేకహోదా సాధనకు పోరాటాలు చేసింది వైఎస్సార్సీపీ మాత్రమేనని వారు గుర్తు చేశారు. నేటికీ ప్రత్యేకహోదా ఉద్యమం సజీవంగా ఉందంటే అది జగన్ చేసిన పోరాటాల వల్లనే అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెనగలూరు, రైల్వేకోడూరు జెడ్పీటీసీలు కొండూరు విజయ్‌రెడ్డి, మారెళ్ల రాజేశ్వరి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్‌రెడ్డి, ఓబులవారిపల్లె పార్టీ నాయకులు వత్తలూరు సాయికిషోర్‌రెడ్డి, రైల్వేకోడూరు నాయకులు గుంటిమడుగు సుధాకర్‌రాజు, సీహెచ్ రమేష్, గోపగాని సులోచన యాదవ్, జనార్ధన్‌రాజు తదితరులు పాల్గొన్నారు. రేపటి బంద్‌ను విజయవంతం చేయండి రాష్ట్ర భవిష్యత్ కోసం ఈ నెల 24న ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న బంద్‌ను విజయవంతం చేయాలని ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కోరారు. బంద్‌లో విద్యార్థి సంఘాలు, అన్ని పార్టీన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
టీడీపీ, బీజేపీ మధ్య రహస్య ఎజెండా
రాజంపేట రూరల్ (వైఎస్సార్ కడప) : బీజేపీ,టీడీపీల మధ్య రహస్య ఎజెండా నడుస్తోందనే దానికి నేటి పార్లమెంటు సమావేశాలే నిదర్శనమని వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథరెడ్డి అభిప్రాయపడ్డారు. స్థానిక ఆకేపాటి భవన్లో శుక్రవారం రైల్వేకోడూరు ఎమ్మేల్యే కొరముట్ల శ్రీనివాసులుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గతంలో 13సార్లు వైఎస్సార్సీపీ నోటీసులివ్వగా అనుమతించని స్పీకర్ టీడీపీ ఇచ్చిన తీర్మానానికి తొలి రోజే అనుమతివ్వడం వారి మధ్య ఉన్న లోపాయకారి ఒప్పందానికి నిదర్శనమన్నారు.నేడు ప్రత్యేక హోదా గురించి పార్లమెంటు సమావేశాల్లో చర్చించారంటే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనతేనన్నారు.వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలు ఇచ్చినపుడు టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కేదన్నారు. జననేత వైఎస్ జగన్‌తోనే ప్రత్యేకహోదా సాధ్యమని అన్నారు. ఎమ్మెల్యే కొరముట్ల.శ్రీనివాసులు మాట్లాడుతూ టీడీపీ చేపట్టిన గ్రామదర్శిని కార్యక్రమాన్ని ప్రజలు నిలదీయాలన్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేస్తామని చెప్పిన టీడీపీ మోసం చేసిందన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరిందంటే అది వైఎస్సార్ æముఖ్యమంత్రిగా ఉన్నపుడేనన్నారు. ఆర్భాటానికి రూ. కోట్లు ఖర్చు చేస్తున్న ఈ ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు శూన్యమని అన్నారు. -
వాళ్లతో ఉక్కు పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదు
వైఎస్సార్ జిల్లా: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ వల్ల ఉక్కు కర్మాగారం వచ్చే పరిస్థితి లేదని రాజంపేట వైఎస్సార్సీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ రెడ్డి విమర్శించారు. సుండుపల్లిలో ఆకేపాటి విలేకరులతో మాట్లాడుతూ..సిగ్గు లేకుండా 25 ఎంపీ సీట్లు ఇవ్వండంటున్నచంద్రబాబు 19 ఎంపీలు ఉంటే ఏమి చేయగలిగాడని ప్రశ్నించారు. ఎన్నికల్లో హామీలిచ్చిన ఇరు పార్టీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండి నాలుగు సంవత్సరాలుగా కాపురం చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారం అనుకూలత అనుమతులు ఇవ్వాలి.. అలా ఇవ్వకుండా కేంద్రంపై ఆరోపణలు చేస్తూ రాజకీయ దీక్షలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మహానేత వైఎస్సార్ ఉక్కు కర్మాగారం మంజూరు చేస్తే వాటిని అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్లిన వ్యక్తి చంద్రబాబు నాయుడని చెప్పారు. చంద్రబాబుకు వైఎస్సార్ కలలోకి కూడా గుర్తుకొస్తున్నాడని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి ఉక్కు కర్మాగారం పేరుతో దీక్షలు చేసి విమర్శించడం సిగ్గు చేటని అన్నారు. రెండు సార్లు రాజ్యసభకు ఎంపికైనా ఏనాడూ ఉక్కు కర్మాగారం గురించి పార్లమెంటులో నోరు మెదపని వ్యక్తి సీఎం రమేష్ అని తూర్పారబట్టారు. నాడు ఉక్కు కర్మాగారానికి అడ్డుపడిన చంద్రబాబు నేడు దొంగదీక్షలు అంటూ మోసం చేస్తున్నాడని..అలాంటి బాబు ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పి తప్పు ఒప్పుకోవాలని కోరారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యమని వ్యాఖ్యానించారు -
‘జేసీ దివాకర్‌రెడ్డిని ప్రజలే తరిమికొడతారు’
సాక్షి, కడప : టీడీపీ నేత, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్సీపీ నేత, రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కుటుంబాన్ని విమర్శించడమే ధ్యేయంగా మహానాడులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోకర్ లాంటి దివాకర్ రెడ్డితో మాట్లాడిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ బిక్షతో ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ దివాకర్ ఇప్పుడు ఆ మహానేత కుటుంబాన్నే విమర్శిస్తుంటే ప్రజలు సహించరని, జాగ్రత్తగా ఉండాలంటూ ఆకేపాటి హెచ్చరించారు. ఇటీవల టీడీపీ నిర్వహించిన మహానాడు ఒక పెద్ద మాయలాంటిదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 600 హామీలను మహానాడులో ఎందుకు ప్రస్తావించ లేదని ఆయన టీడీపీ నేతలను ప్రశ్నించారు. జేసీ దివాకర్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని అభిప్రాయపడ్డారు. టీడపీ, బీజేపీలు మూకుమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశాయని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. -
జగన్ విజయం సాధించాలని..
రైల్వేకోడూరు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి విజయం చేకూర్చడం కోసం ఆకేపాటి చేపట్టిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ రాజంపేట పార్టీమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి అన్నమయ్య కాలిబాట ద్వారా తిరుమలకు చేపట్టిన 15వ మహాపాదయాత్ర ఆదివారం రైల్వేకోడూరు పట్ట ణానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుతో కలిసి ఎంపీ ఘనంగా స్వాగతం పలికి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సమస్యలే తన సమస్యలుగా భావిస్తున్న జగనన్నకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలమన్నారు. అందులో భాగంగానే ఆయన చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయం కావాలని తన వంతుగా ఆకేపాటి పాదయాత్ర చేపట్టడం శుభపరిణామం అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకేపాటి శ్రీవారిని కోరుకోవాలన్నారు. అనంతరం ఆకేపాటి మాట్లాడుతూ ఏడు కొండల వాడి దయతో జగనన్న ప్రజా సంకల్పయాత్ర దిగ్విజయం అవుతుందని అన్నారు. శ్రీవారి కరుణ కటాక్షాలతో ఈ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. తాను పాదయాత్ర ద్వారా జగన్ ముఖ్యమంత్రి కావాలని ఏడుకొండల వారిని కోరుకుం టానని అన్నారు. ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటువంటి పాదయాత్రల ద్వారా ఇటు ఆధ్యాత్మికతతోపాటు ప్రజా సమస్యలు తెలుసుకోగలరని అన్నారు. సంఘీభావం: రైల్వేకోడూరు మండలంలోని బాలపల్లెలో ఆదివారం సాయంత్రం పాదయాత్ర చేస్తున్న ఆకేపాటిని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి కలిసి సంఘీభావం తెలిపి ఆయనను పూలమాలతో సత్కరించారు. అనంతరం వివేకానందరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఎలుగెత్తేందుకు జగన్మోహన్రెడ్డికి శ్రీ వెంకటేశ్వరుడు అమితమైన శక్తిని ప్రసాదించాలని ఆకేపాటి కోరాలన్నారు. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ స్వ ప్రయోజనాల కోసం రాష్ట్ర అవసరాలను ఫణంగా పెట్టిన చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలందరూ జగనన్న ప్రజా సంకల్పయాత్రకు మద్దతు తెలపాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు పంజం సుకుమార్‌రెడ్డి, చెవ్వు శ్రీనివాసులురెడ్డి, సీహెచ్ రమేష్, మందల నాగేంద్ర, పి.భరత్‌రెడ్డి, గీతాల నరసింహా రెడ్డి, ఎంవీ రమణ, కరిముల్లా, సి.జయరామిరెడ్డి, రవీంద్రనాయుడుతోపాటు నందలూరు, చిట్వేలి, పుల్లంపేట, పెనగలూరు, ఓబులవారిపల్లె, కోడూరు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సోమశిల ముంపువాసులకు న్యాయం చేయాలి
► పునరావాసం కల్పించకుండా ఖాళీ చేయాలనడం అన్యాయం ►వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి కడప కార్పొరేషన్: సోమశిల ముంపు వాసుల సమస్యలు పరిష్కరించకుండా వారిని ఖాళీ చేయమనడం అన్యాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి అన్నారు. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్బి అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబుతో కలిసి ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సోమశిల ప్రాజెక్టు వల్ల జిల్లాలోని అట్లూరు, భాకరాపేట, ఒంటిమిట్ట, నందలూరు మండలాల పరిధిలోని రైతుల భూములు, ఇళ్లు, ఆస్తులు ముంపునకు గురై తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల నెల్లూరు జిల్లా రైతులకు మాత్రమే మేలు జరిగిందన్నారు. ఒంటిమిట్ట, పెన్నపేరూరు, తప్పెటవారిపల్లె గ్రామాల రైతుల భూములు చాలా వరకూ ముంపునకు గురయ్యాయన్నారు. వారికి అధికారులు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదని, పునరావాసం కల్పించలేదన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముంపువాసులకు వారు కోరినదానికన్నా ఎక్కువగా నష్టపరిహారం అందించారని గుర్తు చేశారు. రైతులు తక్షణం ఖాళీ చేయాలని ఫారెస్ట్ అధికారులు ఒత్తిడి చేయడం అన్యాయమన్నారు. పైర్లు పెట్టుకోవద్దని బలవంతం చేయడం సరికాదన్నారు. సోమశిల ముంపు రైతులకు నష్టపరిహారం చెల్లించి, పునరావాసం కల్పించిన తర్వాతే ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు. ముంపు వాసుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 28వ తేదీ రైతులతో కలిసి భాకరాపేట నుంచి కడపకు పాదయాత్ర నిర్వహించి, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నట్లు చెప్పారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు ముంపుగ్రామాల్లో పర్యటించి, వారి సమస్యలు తెలుసుకున్నారని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే దశలవారీగా ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. 27న టోల్గేట్ ఎదుట ధర్నా– ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చెన్నూరు, చిన్నమాచుపల్లెలో రహదారి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27వ తేదీ టోల్గేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కడప నుంచి కర్నూల్ వరకు కేఎంసీ అనే సంస్థ రహదారిని నిర్మించిందని, ఈమేరకు టోల్గేట్ వసూలు చేస్తోందన్నారు. చెన్నూరు, చిన్నమాచుపల్లెలో అప్రోచ్, సర్వీసురోడ్లు, డ్రైనేజీలు నిర్మించలేదన్నారు. దీనివల్ల పలు కాలనీలకు చెందిన 18వేల మంది ప్రజలు నిత్యం అగచాట్లు పడుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని తాము పలుసార్లు కేఎంసీ వారి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించలేదని చెప్పారు. రహదారి విస్తరణ వల్ల ఇళ్లు, భూములు కోల్పోయిన వారికి ఈనాటికి నష్టపరిహారం ఇచ్చి, పునరావాసం కల్పించలేదన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కారమయ్యేవరకూ ధర్నా విరమించే ప్రసక్తేలేదన్నారు. జి ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి తుమ్మలకుంట శివశంకర్, మైనార్టీ జిల్లా కార్యదర్శి ఎస్ఏ కరిముల్లా, ఎస్ఎండీ షఫీ పాల్గొన్నారు. -
అక్రమార్జనే ధ్యేయంగా టీడీపీ పాలన
► ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలారు ► ప్లీనరీకి పార్టీ శ్రేణులు తరలి రావాలి ► వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి కడప అగ్రికల్చర్: అక్రమార్జనే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వ పాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ నేతలు ధ్వజమెత్తారు. ఆదివారం కడప నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పి రవీంద్రనాథరెడ్డి, ఎస్బి అంజద్‌బాషా పాల్గొని మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ తన మేనిఫెస్టోలో 600 హామీలతో కూడిన బుక్లెట్ విడుదల చేసిందన్నారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. ఆ హామీలను నెరవవేర్చలేదని ప్రశ్నిస్తే ప్రతిపక్షనేతలపైన, ప్రజలపైన కేసులు పెట్టారన్నారు. జేసీ దివాకర్‌రెడ్డి విమానయాన సిబ్బందిపై దాడికి తెగబడితే ఇది తప్పు ఇలా చేయకూడదని సీఎం చెప్పిన పాపాన పోలేదంటే దీని అర్థం ఇలానే చేయండి మనకు ఎవరు అడ్డం వస్తారో చూస్తామన్నట్లు ఉందని అన్నారు. సీఎం, ఆయన తనయుడు లోకేష్ కనుసన్నల్లోనే భూ కుంభకోణాలు, ఇసుక మాఫీయాలు, అక్రమాలు రాష్ట్రంలో విచ్చల విడిగా చోటు చేసుకుంటున్నా నోరు మెదపలేదన్నారు. నవనిర్మాణ దీక్షలు ఎందుకో..: నవనిర్మాణ దీక్షలను ఎందుకు నిర్వహించారో అర్థం కావడంలేదని సాక్షాత్తు అధికారులే అన్నారని, ఎక్కడ అభివృద్ధి జరిగిందని, సీఎం, ఆయన కొడుకు, ఆ పార్టీ నేతలు ప్రతి పనిలోనూ దోచుకుతింటున్నారని అధికారులే చెబుతున్నారన్నారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. -
ఉపఎన్నిక తర్వాత భారీగా వలసలు
కడప: కర్నూలు జిల్లా నంద్యాల ఉపఎన్నిక తర్వాత వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున వైఎస్సార్సీపీలోకి వలసలు తధ్యమని వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఆకెపాటి అమరనాథరెడ్డి చెప్పారు. కడపలో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆకెపాటితో పాటు మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి, రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకెపాటి మాట్లాడుతూ నంద్యాల ఉపఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకునే దమ్మూ ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత పార్టీలోకి భారీ ఎత్తున వలసలు ఉంటాయని చెప్పారు. -
హెక్టారుకు రూ.50 వేలు చెల్లించాలి
► వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి రాజంపేట టౌన్: ఇటీవల వీచిన పెనుగాలులకు నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని మిట్టమీదపల్లె, మేకవారిపల్లె, కొల్లావారిపల్లె, లక్షుంపల్లె, చవనవారిపల్లె గ్రామాల్లో పెనుగాలుల బీభత్సానికి దెబ్బతిన్న అరటి, బొప్పాయి పంటలను గురువారం సాయంత్రం ఆకేపాటి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంట చేతికి వచ్చే సమయంలో గాలుల బీభత్సం వల్ల అరటి, బొప్పాయి పూర్తిగా దెబ్బతినడంతో రైతులకు లక్షలాది రూపాయిల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. నామమాత్రపు పరిహారం చెల్లిస్తే ఊరుకోం ప్రభుత్వం రైతులకు నామమాత్రంగా పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటే ఆందోళన చేసైనా న్యాయం జరిగేలా చేస్తామని స్పష్టం చేశారు. పంట నష్టం గురించి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో లేవనెత్తేందుకు కృషి చేస్తానన్నారు. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఉద్యాన పంటలకు నష్టం వాటిళ్లితే హెక్టారుకు రూ.25 వేల చొప్పున మంజూరు చేశారని ఆకేపాటి గుర్తు చేశారు. ఇప్పుడు పెరిగిన ఖర్చుల దృష్ట్యా ప్రభుత్వం హెక్టారుకు రూ.50 వేల పరిహారం అందజేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం కన్వీనర్ గోవిందు బాలకృష్ణ, నాయకులు శవన వెంకటేశ్వర్లునాయుడు, గిరిప్రసాద్, నల్లపనేని నరసింహులు, నల్లపు రాజయ్య, డీ భాస్కర్‌రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఐక్యతకు ప్రతీక నవమి ఉత్సవాలు
కూచివారిపల్లె (రాజంపేట టౌన్): ప్రజల్లో ఐక్యతకు శ్రీరామనవతి ఉత్సవాలు ప్రతీకలాంటివని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాద్రెడ్డి అభిప్రాయపడ్డారు. మండలంలోని కూచివారిపల్లెలో వెలసిన శ్రీరామాలయంలో వైఎస్సార్ సీపీ యూత్ విభాగం నాయకుడు రెడ్డిమాసి రమేష్‌నాయుడు స్వామివారికి శనివారం ఉభయం సమర్పించారు. ఈకార్యక్రమంలో ఆకేపాటి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సీతారాములను దర్శించుకొని పూజలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఆకేపాటి మాట్లాడుతూ ముఖ్యంగా శ్రీరామనవమి, వినాయకచవితి, పీర్లపండుగలు వంటివి ప్రజల్లో ఐక్యతాభావాన్ని మరింత పెంచుతాయన్నారు. ఈ పండుగలను ప్రతిచోట అన్ని వర్గాల ప్రజలు ఒక కుటుంబ సభ్యుల్లా కలిసిమెలసి ఘనంగా జరుపుకుంటుండటం దేశ ఐక్యతకే నిదర్శనమన్నారు. పండుగలు, ఉత్సవాలు భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలకు చిహ్నాల్లాంటివని తెలిపారు. పండుగలను, శుభ కార్యాలను ప్రజలంతా కలిసి, మెలసి సంతోషంగా జరుపుకోవాలని ఆకేపాటి ఆకాంక్షించారు. అప్పుడే ప్రజల మధ్య చిన్న, చిన్న స్పర్దలు ఉన్నా తొలగిపోతాయని ఆయన తెలిపారు. సమాజంలో సుఖశాంతులు విరాజిల్లాలని ఆకేపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, ఊటుకూరు–1 ఎంపీటీసీ రేవరాజు శ్రీనివాసరాజు, వైఎస్సార్ సీపీ వివిధ విభాగాల కన్వీనర్లు రెడ్డిమాసి రమేష్‌నాయుడు, పోలి మురళీరెడ్డి, రమణారెడ్డి, పసుపులేటి సుధాకర్, పెనిగిలపాటి పెంచలయ్యనాయుడు, గోవిందు బాలక్రిష్ణ, బలిజపల్లె చిన్న తదితరులు పాల్గొన్నారు. -
సీఎం ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారు
కడప కార్పొరేషన్: రాష్ట్ర ముఖ్యమంత్రే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం అత్యంత దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఉపాధ్యాయులు, ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించి ఇళ్లు, ఇళ్లస్థలాలు ఇస్తామని ఎలా హామీలిస్తారని నిలదీశారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా కడపలో కమలాపురం, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, కడపమేయర్ సురేష్‌బాబులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ నిన్న జిల్లాకు వచ్చిన ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు ఆర్జేడీ, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ మద్దతుతో పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేస్తున్న వారికి ఓట్లు వేయించే యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వైఎస్ఆర్సీపీ కోటకు బీటలు వారుతున్నాయని మంత్రి గంటా, టీడీపీ నాయకులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. జిల్లాలో 500 మందికిపైగా వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు ఉన్నారని, సంఖ్యాబలం లేకపోయినా టీడీపీ అనైతికంగా పోటీ పెట్టిందన్నారు. తమ ప్రజా ప్రతినిధులను ప్రలోభాలకు గురిచేసి, ఎర్రచందనం కేసులు పెడతామని బెదిరించి లొంగదీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు చెందిన ప్రజా ప్రతినిధుల ఇళ్ల దగ్గరకు పోయి బలవంతంగా వారితో ఫిర్యాదులు ఇప్పిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అధికారపార్టీ సాగిస్తున్న అరాచకాలను ఖండిస్తున్నామని చెప్పారు. తమ పార్టీ తరఫున స్థానిక సంస్థల నియోజకవర్గానికి పోటీచేస్తున్న వైఎస్ వివేకానందరెడ్డి, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేస్తున్న వెన్నపూస గోపాల్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. -
వారిని మినహా చంద్రబాబు అందర్నీ మోసం చేశారు
రాజంపేట టౌన్ (వైఎస్సార్): చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోసం హిజ్రాలను మినహా అన్ని వర్గాల ప్రజలను మోసగించారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ మద్దతుతో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న గోపాల్‌రెడ్డిని గెలిపించాలని పట్టభద్రుల ఓటర్లను ఆకేపాటి కోరారు. స్థానిక ఆకేపాటి భవన్లో సోమవారం సమావేశం నిర్వహించారు. అమర్నాథ్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల వల్ల నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేని నిరుద్యోగులకు నెలకు రెండువేల నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇవ్వడంతో నిరుద్యోగులు ఎంతో ఆశతో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారన్నారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నిరుద్యోగులను నట్టేట ముంచారని విమర్శించారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలు చేయకుంటే వైఎస్సార్ సీపీ ఘనవిజయం సాధించి వై ఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారని తెలిపారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయింటే నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు ఎంతో మెరుగుపడేవన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయని, ఈ ఎన్నికల్లో కూడా తమ పార్టీ మద్దతు అభ్యర్థులు గెలుపొందేందుకు చంద్రబాబు అడ్డమైన గడ్డిని తినేందుకు వెనకాడడని, విజ్ఞులైన ఓటర్లు బాబు మాటలు విని మోసపోవద్దని కోరారు. -
మహిళల కన్నీటిలో టీడీపీ గల్లంతే!
కడప కార్పొరేషన్: నవ్యాంధ్రప్రదేశ్‌ను మద్యాం«ధ్రప్రదేశ్‌గా మారుస్తున్న టీడీపీ ప్రభుత్వం మహిళల కన్నీటిలో కొట్టుకుపోవడం ఖాయమని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి అన్నారు. ఇక్కడి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శనివారం మైదుకూరు, కమలాపురం, కడప ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పాదయాత్రలో మద్యం వల్ల నాశనమవుతున్న కుటుంబాలను, మహిళల కన్నీటిని చూశా...అధికారంలోకి వస్తే బెల్టు షాపులను పూర్తిగా రద్దు చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ జీవోను సవరించి బీచుల్లో, హోటళ్లు, పర్యాటక కేంద్రాల్లో బార్ లైసెన్సులు ఇస్తున్నారని మండిపడ్డారు. కుటుంబాలను ఛిద్రం చేసి మహిళల జీవితాలను చీకటిమయం చేసే ఈ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రపంచంలో ఏది జరిగినా అది తన వల్లే అని చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటైపోయిందన్నారు. ప్రభుత్వపెద్దలు తమ మూలధనాన్ని సరిచేసుకున్నాకే పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారని ఆరోపించారు. కేంద్రంలోని కీలక నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రికి ఎలా తెలుస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు విదేశాల్లో పర్యటించి తన బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకున్నారని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు వల్ల సామాన్యజనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు 250 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వాలి– రఘురామిరెడ్డి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో విద్యుత్ మీటర్లు వేసిన దాఖలాలు లేవని, ప్రస్తుత ప్రభుత్వం బలవంతంగా వారికి మీటర్లు అమర్చుతోందని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ధ్వజమెత్తారు. కరెంటు బిల్లులు చెల్లించే స్థితిలో వారు లేరన్నారు. రూ.500, రూ.1000నోట్ల రద్దు విషయం వెంకయ్యనాయుడు ద్వారా సీఎంకు తెలిసి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వారు అన్నీ సర్దేసుకున్నాక సామాన్యులపై భారం వేశారని మండిపడ్డారు. సామాన్యులు, రైతులు పనులు మానుకొని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం తాము రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పోరాడుతున్నామని, పవన్ కళ్యాణ్‌తోపాటు ఎవరు కలిసి వచ్చినా స్వాగతిస్తామన్నారు. మద్యం విధానాన్ని ఉద్యమంలా చేస్తున్నారు– రవీంద్రనాథ్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం మద్యం విధానాన్ని ఒక ఉద్యమంలా ప్రజలపై రుద్దుతోందని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ మాట్లాడటం మంచిదేనన్నారు. ప్రధాని హోదాలో నరేంద్రమోదీ అర్థరాత్రి పెద్దనోట్ల రద్దు ప్రకటించి సామాన్యులను హింసకు గురి చేశారన్నారు. నోట్ల రద్దుకు రెండు రోజుల ముందు హెరిటేజ్‌ను రూ.290కోట్లకు అమ్మడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు పులి సునీల్ కుమార్ పాల్గొన్నారు. -
తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లాయి
నందలూరు: తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లాయని వైఎస్సార్సీపీ జిల్లాఅధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆర్అండ్బి బంగ్లా ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడతూ బూటకపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబునాయుడు ఒక్కటి కూడా నెరవేర్చలేదని, దీంతో విసిగి పోయిన ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఒక్కొక్కరు వైఎస్సార్‌సిపీలోకి వలసలు వస్తున్నారని అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఏర్పడిన పార్టీ వైఎస్సార్సీపీ అని అన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు సేవచేయడమే మార్గంగా ఎన్నుకుని ముందుకు వెళుతున్నారని అన్నారు. రానున్నరోజుల్లో తెలుగుదేశంపార్టీకి డిపాజిట్ కూడా దక్కదని ఆయన జోçస్యం చెప్పారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గడపగడప కార్యక్రమంలో ప్రజలనుంచి అపూర్వ స్పందన వస్తుందని ఆయన తెలిపారు. ప్రజలవద్దకు వెళ్లినపుడు చంద్రబాబునాయుడు గురించి, తెలుగుతమ్ముళ్ళ అరాచకాలగురించి తమకు ఫిర్యాదుచేస్తున్నారన్నారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునేవాడే నిజమైన నాయకుడని, ప్రజలను మరిచిన ఏ నేత ఎదిగినట్లు చరిత్రలో లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు గడికోట వెంకటసుబ్బారెడ్డి, నడివీధి సుధాకర్, సిద్దవరం గోపిరెడ్డి, పల్లె గ్రీశ్మంత్‌రెడ్డి, గుండు గోపాల్‌రెడ్డి, గీతాల నరసింహారెడ్డి, మల్లికార్జునరెడ్డి, అజీజ్, సుభాన్, మోడపోతుల సుధాకర్, శివారెడ్డి, చల్లా నాగేంద్ర, అరిగెల సౌమిత్రి, విజయ్‌కుమార్, గాదెల శివయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లాయి
నందలూరు: తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లాయని వైఎస్సార్సీపీ జిల్లాఅధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆర్అండ్బి బంగ్లా ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడతూ బూటకపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబునాయుడు ఒక్కటి కూడా నెరవేర్చలేదని, దీంతో విసిగి పోయిన ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఒక్కొక్కరు వైఎస్సార్‌సిపీలోకి వలసలు వస్తున్నారని అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఏర్పడిన పార్టీ వైఎస్సార్సీపీ అని అన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు సేవచేయడమే మార్గంగా ఎన్నుకుని ముందుకు వెళుతున్నారని అన్నారు. రానున్నరోజుల్లో తెలుగుదేశంపార్టీకి డిపాజిట్‌కూడా దక్కదని ఆయన జోçస్యం చెప్పారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గడపగడప కార్యక్రమంలో ప్రజలనుంచి అపూర్వ స్పందన వస్తుందని ఆయన తెలిపారు. ప్రజలవద్దకు వెళ్లినపుడు చంద్రబాబునాయుడు గురించి, తెలుగుతమ్ముళ్ళ అరాచకాలగురించి తమకు ఫిర్యాదుచేస్తున్నారన్నారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునేవాడే నిజమైన నాయకుడని, ప్రజలను మరిచిన ఏ నేత ఎదిగినట్లు చరిత్రలో లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు గడికోట వెంకటసుబ్బారెడ్డి, నడివీధి సుధాకర్, సిద్దవరం గోపిరెడ్డి, పల్లె గ్రీశ్మంత్‌రెడ్డి, గుండు గోపాల్‌రెడ్డి, గీతాల నరసింహారెడ్డి, మల్లికార్జునరెడ్డి, అజీజ్, సుభాన్, మోడపోతుల సుధాకర్, శివారెడ్డి, చల్లా నాగేంద్ర, అరిగెల సౌమిత్రి, విజయ్‌కుమార్, గాదెల శివయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
సౌమ్యుడు, స్నేహశీలి వైఎస్ వివేకానందరెడ్డి
రైల్వేకోడూరు రూరల్: సౌమ్యుడు, స్నేహశీలి వైఎస్ వివేకానందరెడ్డి అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. రైల్వేకోడూరు పట్టణంలోని వైఎస్సార్ అతిథి గృహంలో శనివారం ఎమ్మెల్యే కొరముట్ల ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో కేడర్‌ను బలపరచడానికే.. ఈ సందర్భంగా ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పార్టీ కేడర్‌ను మరింత బలపరచడానికి వైఎస్ వివేకానందరెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం నిర్ణయించిందని తెలిపారు. నియోజకవర్గ అ«భివృద్ధిలో వైఎస్ వివేకానందరెడ్డి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారన్న నమ్మకం అందరిలో ఉందన్నారు. వైఎస్ ఫ్యామిలీకి ఓటు వేసే సువర్ణావకాశం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలోని వారికి ఓటు వేసే సువర్ణావకాశం మనకు దక్కడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే కొరముట్ల అన్నారు. తప్పుడు కేసులకు భయపడవద్దు: వివేకా అధికార పార్టీకి తప్పుడు కేసులు పెట్టే అలవాటు పరిపాటి అయిందని, తాము అండగా ఉంటామని ఎవరూ భయపడవద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. అందరి అభిప్రాయంతోనే తనను అధిష్టానం ఎంపిక చేసిందని తెలిపారు. తప్పుడు కేసులతో ఎంపీపీ పదవిని పోగొట్టారు– బాబుల్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టి తనను జైలుకు పంపి ఎంపీపీ పదవిని పోగొట్టారని ముద్దా వెంకటసుబ్బారెడ్డి అలియాస్ బాబుల్‌రెడ్డి తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడమని పేర్కొన్నారు. కొల్లంకు ఘన స్వాగతం కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇంటి వద్దనే ఉన్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ కొల్లం బ్రహ్మానందరెడ్డి శనివారం సమావేశానికి హాజరయ్యారు. ఆయనకు పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు మారెళ్ల రాజేశ్వరి, పట్టణ కన్వీనర్ సీహెచ్ రమేష్, ఉప కన్వీనర్ రౌఫ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నందాబాలా, ఆర్వీ.రమణ, మహేష్, కోడూరు, చిట్వేలి, పుల్లంపేట, పెనగలూరు, ఓబులవారిపల్లె మండల కన్వీనర్లు సుధాకర్ రాజు, చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, ముస్తాఖ్, నరసింహారెడ్డి, వత్తలూరు సాయికిషోర్‌రెడ్డి, మైనార్టీ నాయకులు ఆదాం సాహేబ్, ఎస్ఎండీ రఫి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్, జిల్లా మైనార్టీ నాయకులు ఎన్.మస్తాన్, నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎం.నాగేంద్ర, క్షత్రియ నాయకులు పాల్గొన్నారు. -
కమీషన్ల కోసమే బాబు రాజధాని జపం
పులపత్తూరు (రాజంపేట రూరల్): గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు కోకొల్లలుగా ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం కమీషన్ల కోసం రాజధాని జపం చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని పులపత్తూరు, అచ్చనపల్లె, రేణింతల, మందపల్లె గ్రామాలలో ఆకేపాటి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత ప్రజలు తాము పడుతున్న ఇబ్బందులను ఆకేపాటి ఎదుట ఏకరవు పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక వైపు రాష్ట్రంలో డెంగీతో ప్రజలు మత్యువాత పడుతున్నా బాబుకు చీమ కుట్టినట్లు కూడా లేదని అన్నారు. మరో మూడు, నాలుగు నెలల్లో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నందున టీడీపీ నాయకులు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై హడావుడి చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. నెల రోజుల క్రితం వరకు రాజంపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం గురించి అధికారులు, అధికార పార్టీ నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఎన్నికలు వచ్చే సమయంలోనే వీరికి ప్రజలు గుర్తొస్తారా అని ఆయన ప్రశ్నించారు.. ఈ కార్యక్రమంలో పులపత్తూరు ఉప సర్పంచ్ బీము సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు పాపినేని వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జీవనాడులు వదిలేసిన సర్కార్
రాజంపేట: రాష్ట్రానికి జీవనాడులు అయిన మూడు అంశాలకు సంబంధించి గత కొంతకాలంగా చంద్రబాబునాయుడు సర్కారు వదిలేసిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేకహోదా, ప్రత్యేకప్యాకేజీ, పారిశ్రామిక రాయితీలు మొదటి జీవనాడి అన్నారు. జనాభాపరంగా 65శాతానికి వ్యవసాయమే జీవనాడి అని పేర్కొన్నారు. రుణమాఫీ కాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వ్యవసాయ సంజీవిని పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి వ్యవసాయ సంజీవిని అని అమర్నాథ్రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రాష్ట్రం కరువు కాటకాలను జయించగలుగుతుందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు కృష్ణమ్మ సాక్షిగా ప్రత్యేకహోదా కోసం పాటుపడతాన ని చెబుతున్నారని,పార్లమెంటు సాక్షిగా అన్ని విషయాల్లో బీజేపీకి లొంగిపోతున్నారని పేర్కొన్నారు. ఆర్థికపరంగా, పారిశ్రామికపరంగా, వ్యవసాయపరంగా, ప్రాజెక్టులపరంగా, నీటి కేటాయింపులు ఇలా వరుస అన్యాయాలు జరుగుతుంటే చంద్రబాబునాయుడు క్యాబినెట్లో ఈ అంశాలపై చర్చించటానికి తీరిక లేదా అని ప్రశ్నించారు. విభజనచట్టంలోని హామీలే అమలు చేయటం లేదని ఒక వంక అంటుంటే, మరోవంక చంద్రబాబునాయుడు విభజనచట్టంలో పెట్టకపోవడం వల్ల ప్రత్యేకహోదా ఇవ్వలేదంటున్నారని విమర్శించారు. రెండున్నరేళ్లుగా కలిసి కాపురం చేసినా బీజేపీ నేతలు చంద్రబాబు సర్కార్‌కు విదిల్చిందేమీ లేదన్నారు. అయినా బీజేపీతో కొనసాగుతున్నారంటే, ప్రజాప్రయోజనాలు కాకుండా స్వప్రయోజనాలే ఉన్నాయన్నది సుష్పష్టమన్నారు. -
చంద్రబాబుది నయవంచన దీక్ష
► రెండేళ్ల పాలనలో చేసిన మంచి పని లేదు ► మూడేళ్లలో ఏం చేస్తారో చెప్పే సత్తా లేదు ► వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి రాజంపేట: సీఎం చంద్రబాబునాయుడు చేస్తున్నది నవ నిర్మాణ దీక్ష కాదని, నయవంచన దీక్ష అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి విమర్శించారు. శనివారం సాయంత్రం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లడారు. రాష్ట్రాన్ని విభజించటానికి నాలుగు సార్లు లేఖలు ఇచ్చి, విభజనకు అనుకూలంగా లోక్‌సభలో తొలి ఓటు తమ పార్టీదే అని తెలుగుదేశం లీడర్‌తో ప్రకటింప చేశారని ఆరోపించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఇప్పుడు నవ నిర్మాణ దీక్ష చేస్తున్నానంటున్నారని ఎద్దేవా చేశారు. అవినీతి, కుట్ర రాజకీయాల మీద ప్రజలు ధ్వజం ఎత్తాలని చేస్తున్న నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ ప్రకారం.. ప్రజల తొలి లక్ష్యం టీడీపీ ప్రభుత్వమే కావాలన్నారు. కృష్ణా, గోదావర జలాలను అమ్మేశారు: నోటుకు ఓటు కేసు నుంచి బయట పడేందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా, గోదావరి జలాలను అమ్మేశారని ఆరోపించారు. రాష్ట్రంలో పరిపాలన లేదని, రెండేళ్లలో చేసిన మంచి పని లేదని విమర్శించారు. మూడేళ్లలో ఏం పూర్తి చేస్తారో చెప్ప గల సత్తా బాబుకు లేదన్నారు. కానీ విజన్ 2050 అంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని అన్నారు. ప్రజల మనసులోని భావననే అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి చెప్పారని గుర్తు చేశారు. గతంలో మాజీ సీఎం నందమూరి తారకరామరావుపై హైదరాబాద్ వైస్రాయ్ హోటల్ వద్ద చెప్పులతో దాడి చేసిన విషయాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. ఇలాంటి సంస్కృతి చంద్రబాబుకు ఉందని దుయ్యబట్టారు. -
నేడు ఒంటిమిట్టకు వైఎస్ జగన్
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి బుధవారం తెలిపారు. గురువారం ఉదయం 7 గంటలకు వైఎస్ జగన్ హెలికాప్టర్లో కడపకు చేరుకుంటారని ఆయన పేర్కొన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఒంటిమిట్టకు వెళ్లి కోదండరాముని రథోత్సవంలో పాల్గొంటారని వెల్లడించారు. అనంతరం కడప ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్లో బళ్లారికి వెళతారని తెలిపారు. -
చంద్రబాబు కోసం నోరు పారేసుకోవద్దు
♦ నీ స్వార్థం కోసం పార్టీ మారి దిగజారుడు రాజకీయాలా.. ♦ ఎమ్మెల్యే ఆది వ్యాఖ్యలపై ఆకేపాటి ధ్వజం రాజంపేట : ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నోరు పారేసుకోవడం సరికాదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి హెచ్చరించారు. మంగళవారం తన స్వగృహంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. వ్యక్తిగత స్వార్థంతో పార్టీలు మారి డాంభికాలు పలికితే అవి రివర్స్ అవుతాయని హెచ్చరించారు. దివంగతవైఎస్సార్ చలువతో రాజకీయాల్లో రాణించి, ఇప్పుడు అవకాశవాద రాజకీయాలు చేయడం చూస్తుంటే జనం అసహ్యించుకుంటున్నారన్నారు. ‘వ్యక్తిగత లబ్ధి కోసం పార్టీ మారి, ఇప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే నిన్ను దేవుడు కూడా క్షమించడు. వైఎస్సార్ కుటుంబాన్ని విమర్శించే హక్కు లేదు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డిని వ్యక్తిగతంగా విమర్శించడం భావ్యం కాదు. జగన్ కుటుంబానికి సంబంధించి మాట్లాడిన మాటలు మహిళలందరినీ కించ పరిచే విధంగా ఉన్నాయి. నీ స్వప్రయోజనం కోసం పార్టీ మారావనే సంగతి ప్రజలందరికీ తెలుసు. నైతిక విలువలు లేకుండా దిగజారుడు రాజకీయాలు చేయడం తగదు. చంద్రబాబునాయుడుకు దగ్గర కావాలనే లక్ష్యంతో నోటికి ఎంతవస్తే అంత మాట్లాడితే అవి సీఎంకు నచ్చుతాయేమో కానీ ప్రజలు వాటిని క్షమించరనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది’ అంటూ హితవు పలికారు. సమావేశంలో పట్టణ బీసీ కన్వీనర్ పసుపులేటి సుధాకర్, వైఎస్సార్సీపీ యూత్ అధ్యక్షుడు యల్లంరాజు సురేష్‌రాజు పాల్గొన్నారు. -
'చంద్రబాబుపై కేసు నమోదు చేయాలి'
రాజంపేట : రుణమాఫీ కాలేదనే బాధతో రైతు సుబ్రమణ్యంరెడ్డి ఆత్మచేసుకున్న కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేసులు నమోదు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్య ఘటనపై రాజంపేటలో వైఎస్ఆర్ సీపీ నేతలు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు ఆందోళనకు దిగారు. రైతు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రుణమాఫీ కాలేదన్న బెంగతో ఆత్మహత్య చేసుకున్న రైతు సూసైడ్ నోట్ లో 'తన చావుకు చంద్రబాబే కారణమని' పేర్కొన్నడన్న విషయాన్ని ప్రస్తావించారు. చట్ట ప్రకారం చంద్రబాబుపై కేసు నమోదు చేయాలన్నారు. బాధిత రైతు కుటుంబానికి రూ.20 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయానని, ఈ నేపథ్యంలో తన అప్పు పెరిగిపోయిందని, అది తీర్చే మార్గం కానరాక ఆత్మహత్య చేసుకుంటున్నానని రైతు తన సూసైడ్ నోట్ లో పేర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. -
బ్రిటీష్ పాలకులను తలపిస్తున్నారు
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి రాజంపేట : వైఎస్ జగన్మోహనరెడ్డి పిలుపు మేరకు ప్రత్యేక హోదా కోసం శాంతి యుతంగా బంద్ పాటిస్తుంటే నీర్వర్యం చేసేందుకు బ్రిటీష్ పాలకుల్లా అరెస్టులు చేయించడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి దుయ్యబట్టారు. శనివారం ఆయన పోలీస్‌స్టేషన్ వద్ద, తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో ఎవరైనా స్వేచ్ఛగా నిరసన తెలుపుకోవచ్చన్నారు. ప్రశాంతంగా.. బంద్ చేస్తున్న వారిని అరెస్టు చేయడం వెనుక ప్రభుత్వ వ్యూహం దాగి ఉందన్నారు. బంద్ విజయవంతం అవుతోందని గమనించిన ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు. ప్రజల భవిష్యత్ కోసమే వైఎస్ఆర్సీపీ బంద్ చేపట్టిందని చెప్పారు. అందువల్లే ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారన్నారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఆ విషయం గురించి క్యాబినెట్లో చర్చించక పోవడం దుర్మార్గమన్నారు. ఏ ప్యాకేజీ ప్రత్యేక హోదాకు సమానం కాదన్నారు. హోదా సాధించే దాక పోరాటం ఆగదని చెప్పారు. జిల్లా బంద్‌కు సహకరించిన ప్రజలు, సీపీఎం, సీపీఐ, కార్మిక, ప్రజా, విద్యార్థి సంఘాల నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
చరిత్ర హీనుడు చంద్రబాబు
- వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి - 29న బంద్ విజయవంతం చేయాలని పిలుపు రాజంపేట : దిక్కుమాలిన ప్యాకేజీకి మద్దతు పలికి ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్ర హీనుడయ్యారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహనరెడ్డి పిలుపు మేరకు ఈ నెల 29న చేపట్టే బంద్‌ను విఫలం చేయాలని అధికార పార్టీ నేతలు కుట్రలు చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. ఆ దిశగా వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదా కోసం వామపక్షాలతో కలిసి పోరాడుతోందన్నారు. 29న రాష్ట్ర బంద్‌కు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారన్నారు. భూసేకరణ విషయంలో దేశం అంతా వ్యతిరేకిస్తున్న ఆర్డినెన్స్‌ను అడ్డం పెట్టుకొని తొలి నోటిఫికేషన్ జారీ చే సి రైతుల కడుపుకొడుతున్న రాక్షస ప్రభుత్వం ఇదని దుయ్యబట్టారు. ప్యాకేజీకి సై అన్న చంద్రబాబును ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారన్నారు. కేంద్రం నుంచి టీడీపీ తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ వేయకుండా ఉంటే చాలు అని చెప్పటానికే సీఎం ఢిల్లీ వెళ్లారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. -
ప్రత్యేక హోదా సాధించే వరకూ ఉద్యమం
విభజనకు ప్రధాన కారణం చంద్రబాబే విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేదు ధ్వజమెత్తిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి, ఎమ్మెల్యేలు కడప కార్పొరేషన్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేవరకూ ఉద్యమం ఆగదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, కమలాపురం, కడప ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్బి అంజద్‌బాషా స్పష్టం చేశారు. స్థానిక వైఎస్ గెస్ట్ హౌస్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు కలిసి తమ స్వార్థం కోసం ఉమ్మడి రాష్ట్రాన్ని ముక్కలు చేశాయన్నారు. రాజధాని లేకుండా విభజించిన ఏకైక రాష్ట్రం ఇదేనన్నారు. 60 ఏళ్లపాటు ఇరురాష్ట్ర ప్రజలు కలిసి నిర్మించుకొన్న హైదరాబాద్ రాజధానిని తెలంగాణకు ఇవ్వడం బాధాకరమన్నారు. పార్లమెంటులో విభజన అంశాన్ని టేబుల్ ఎజెండాగా ప్రవేశపెట్టి, తలుపులు వేసి అత్యంత దుర్మార్గంగా విభజన చేసిన నీచ చరిత్ర కాంగ్రెస్‌దేనన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని కట్టడి చేయడానికే వారు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు చంద్రబాబేనని నిందించారు. తెలంగాణ వారు కోరక మునుపే తమకు సమ్మతమేనని టీడీపీ పొలిట్‌బ్యూరోలో తీర్మానం చేశారని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాలు అయ్యాక రెండు కళ్ల సిద్ధాంతమంటూ ఇరు రాష్ట్రాల ప్రజలను మోసగించారని మండిపడ్డారు. ఆనాడు రాజ్యసభలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తే ఐదేళ్లు సరిపోదు, పదేళ్లు కావాలని పట్టుబట్టిన బీజేపీ ఈనాడు మాట తప్పడం దారుణమన్నారు. వైఎస్ఆర్సీపీ ఒక్కటే ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధితో పోరాటం చేస్తోందని తెలిపారు. ఎన్డీయేలో టీడీపీ భాగస్వామ్యపక్షంగా కొనసాగుతున్నందున ఆ పార్టీ అధ్యక్షుడుగానీ, ఆ పార్టీ ఎంపీలుగానీ ప్రత్యేక హోదాపై మాట్లాడే పరిస్థితి లేదన్నారు. ప్రత్యేక హోదా రాకపోతే ప్రత్యేక ప్యాకేజీ తెస్తామని టీడీపీ చెప్పడం సరికాదన్నారు. ఆ ప్రత్యేక ప్యాకేజీ చంద్రబాబు వ్యక్తిగత ప్యాకేజీనా, పార్టీ ప్యాకేజీనా చెప్పాలన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న ఏ హామీని కూడా కేంద్రం నెరవేర్చలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మోసం చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఏ ఒక్కచోటా ప్రత్యేక హోదాపై మాట్లాడకపోవడం దారుణమన్నారు. ప్రజలందరూ పార్టీలకతీతంగా దీనిపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 10వ తేది ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కడప మేయర్ కె. సురేష్‌బాబు, జిల్లా అధికార ప్రతినిధి జి. రాజేంద్రప్రసాద్‌రెడ్డి, ఎస్సీ విభాగం జిల్లా కన్వీనర్ పులి సునీల్‌కుమార్ పాల్గొన్నారు. -
25న కలెక్టరేట్ ఎదుట నిరసన
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి వీరపునాయునిపల్లె : రైతు సమస్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర కమిటి పిలుపు మేరకు ఈ నెల 25వ తేదీన జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాధరెడ్డి తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని సంగాలపల్లె గ్రామంలో మండల కన్వీనర్ స్వగృహంలో ఆపార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాదరెడ్డితో కలసి విలేఖరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో రైతు పంట రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారని, దీనితో పాటు మరెన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి వాటిని గాలికి వదలివేశారని విమర్శించారు. ఈనాడు ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్నా రైతులకు విత్తనాలు, ఎరువులు కూడా సరఫరా చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. రైతు సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వ వైఖరికి నిరసనగా 25న చేపట్టే నిరసన కార్యక్రమానికి రైతులు తరలిరావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు తన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా తప్పించుకోలేరన్నారు. రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండడ్‌గా దొరికాడని, ఇందులో చంద్రబాబు ప్రమేయం లేకపోతే రేవంత్‌రెడ్డిని వెంటనే పార్టీ నుంచి సస్పెండు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆపార్టీ నంద్యాల నాయకుడు రామలింగారెడ్డి, మండల కన్వీనర్ రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అవినీతికి మారుపేరు చంద్రబాబు
కడప ఎంపీ, ఎమ్మెల్యేల ధ్వజం కడప కార్పొరేషన్ : అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా నెరవేర్చలేదని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మేయర్ కె. సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనువాసులు, పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్బి అంజద్‌బాషా మండిపడ్డారు. అవినీతికి కేరాఫ్‌గా మారిన చంద్రబాబు ఇపుడు నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం స్థానిక వైఎస్ గెస్ట్ హౌస్‌లో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదివారం ప్రారంభించనున్న కడప ఎయిర్‌పోర్ట్‌కు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పేరు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో నష్టపోయిన ఉద్యాన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ఉలుకూ, పలుకూ లేదని ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనువాసులు ఆవేదన వ్యక్తం చే శారు. తమ నియోజకవర్గంలో 40 వేల ఎకరాల్లో అరటి, మామిడి, పసుపు తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఈ విషయాన్ని తాను ఇప్పటికి నాలుగైదు సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయానని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హమీని కూడా నెరవేర్చలేదన్నారు. అందుకే వైఎస్ జగన్ చేపట్టిన సమరదీక్షకు అన్ని వర్గాల ప్రజలు పోటెత్తారన్నారు. వృద్దులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లు అకారణంగా తొలగించారన్నారు. చంద్రబాబు పాలన బ్రిటీషు పాలనకంటే అధ్వాన్నంగా ఉందని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. పోలీసులను అడ్డుపెట్టుకొని వారు ప్రజల్లోకి వస్తున్నారని, లేకపక్షంలో ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితులున్నాయన్నారు. జిల్లాలో 30 మంది టీడీపీ నాయకులు ఇసుక మాఫియాగా ఏర్పడి కోట్లు గడించారని ఆరోపించారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఎమ్మెల్యేలు సిఫారసు చేసినా దిక్కులేదని మండిపడ్డారు. గతంలో వాయుదూత్లు మాత్రమే దిగే కడప ఎయిర్‌పోర్టుకు 1100 ఎకరాలు భూమితోపాటు రూ. 34కోట్ల నిధులు కేటాయించి వైఎస్ఆర్ పూర్తి చేశారన్నారు. ఎయిర్‌పోర్టు పూర్తయి, కొప్పర్తిలో స్టీల్‌ప్లాంటు ఏర్పడితే జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. దివంగత వైఎస్ఆర్ చలువతో కడప ఎయిర్‌పోర్టు 2012లోనే పూర్తయిందని కడప శాసన సభ్యులు ఎస్బి అంజద్‌బాషా తెలిపారు. రాజకీయ కారణాలతో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దీన్ని ప్రారంభించలేదన్నారు. చంద్రబాబుకు కూడా దీన్ని ప్రారంభించడానికి ఏడాది పట్టిందని విమర్శించారు. వైఎస్ఆర్ కల ఇప్పటికైనా నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని, ఎయిర్‌పోర్టుకు వైఎస్ఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చే శారు. -
రైతు ఆత్మహత్యలంటే బాబుకు లెక్కలేదు
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాధరెడ్డి రాజంపేట : రైతుల ఆత్మహత్యలంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు లెక్కేలేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి విమర్శించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం సమీపంలో జరిగిన ముఖ్యమంత్రి బహిరంగ సభలో గుణుపూరు రాము అనే రైతు ఆత్మహత్యకు యత్నించినా చంద్రబాబు లెక్కచేయకుండా వ్యవ హరించడాన్ని బట్టే రైతులంటే ఆయనకు చిన్నచూపని అర్థమవుతోందన్నారు. గురువారం ఆకేపాటి భవన్లో ఆ యన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన రైతు అప్పుల భారం తట్టుకోలేక..లేఖను సీఎంవైపు విసిరివేశార న్నారు. లేఖ విషయం, రైతు ఆత్మహత్యయత్నం సంఘటనను పోలీసులు, టీడీపీ నాయకు లు బయటికిరాకుండా కప్పిపుచ్చే యత్నం చేశారన్నారు. రైతుల గోడు టీడీపీ సర్కారుకు తగలక తప్పదన్నారు. రైతులను, మహిళలను, నిరుద్యోగులను బూటకపు మాటలతో బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను గాలికి వదిలేశారన్నారు. చంద్రబాబు పాలన యేడాదిలో అభాసుపాలైందన్నారు. అధికారంలోకి వచ్చా క జనానికి మొండిచెయ్యి చూపడం చంద్రబాబుకు కొత్తేమీ కాదన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో విదేశాలలో పర్యటిస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శిం చారు. సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ విదేశీ పర్యటనలో ప్రభుత్వ ఉన్నతాధికారులను వెంట బెట్టుకొని తిరిగారన్నారు. లోకేశ్ ప్రజాప్రతినిధి కాకపోయినా..అధికారికహోదాలో ఐఏఎస్‌లతో కలిసి విదేశీ పర్యటన చేయడం చూస్తుంటే అధికారం దుర్వినియోగం ఎలా జరుగుతుం దో తెలుస్తోందన్నారు. -
ఇది టీడీపీ గెలుపుకాదు.. వైఎస్సార్సీపీ ఓటమి కాదు
ప్రజాస్వామ్యానికి పాతరేశారు కోట్లు పోసి పదవిని కొనుక్కొన్నారు... వీరేం సేవ చేస్తారు ఈ ఎన్నిక చెల్లదు.. ఎప్పటికైనా డీసీసీబీ మాదే డీసీసీబీ ఎన్నికపై వైఎస్సార్సీపీ నేతల వ్యాఖ్యలు కడప కార్పొరేషన్ : జిల్లా సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంకు(డీసీసీబీ)ని టీడీపీ కైవసం చేసుకోవడం ఆ పార్టీకి గెలుపుకాదని, వైఎస్సార్సీపీకి ఓటమి కాదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశ ంలో ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ ప్రజాభిమానంతో డీసీసీబీని వైఎస్సార్సీపీ కైవసం చేసుకోగా, టీడీపీ అప్రజాస్వామికంగా వ్యవహరించి దాన్ని లాక్కుందన్నారు. డెరైక్టర్లందరికీ డబ్బులు ఎరగా వేసి, లొంగని వారిని ఎర్రచందనం కేసుల్లో ఇరికిస్తామని భయబ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. అనేక ఆరోపణలు చేసి ఇద్దరు డెరైక్టర్లకు ఓటు హక్కు లేకుండా చేశారన్నారు. పుల్లయ్య అనే డెరైక్టర్ రెండు సంఘాలకు అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడని, తమ ఎంపీ, ఎమ్మెల్యేలు రాతమూలకంగా ఫిర్యాదు చేసినా అధికారులు కనీసం విచారణ చేసిన పాపాన పోలేదన్నారు. శ్రీమన్నారాయణ అనే వ్యక్తి కో ఆప్షన్ పదవికి నామినేషన్ దాఖలు చేస్తే అది చెల్లదని ప్రక్కనబెట్టారన్నారు. ఇలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరించి డీసీసీబీ ఎన్నిక నిర్వహించారన్నారు. ఈ వ్యవహారం కోర్టులో నడుస్తున్నందున ఈ ఎన్నిక చెల్లదని తె లిపారు. భవిష్యత్తులో తామే డీసీసీబీని కైవసం చేసుకొంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. జిల్లాలో అప్రజాస్వామ్యం రాజ్యమేలుతోంది జిల్లాలో అప్రజాస్వామ్యం రాజ్యమేలుతోందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి అన్నారు. ఈ ఎన్నిక ద్వారా టీడీపీ అప్రతిష్ట మూటగట్టుకోక తప్పదన్నారు. 21 మంది డీసీసీబీ డెరైక్టర్లలో టీడీపీకి చెందిన వారు ఆరుమంది, వైఎస్సార్సీపీకి 15 మంది డెరైక్టర్లు ఉన్నారన్నారు. సహకార వ్యవస్థలోని లొసుగులను ఆసరాగా చేసుకొని, అధికారాన్ని, డబ్బును ఆశచూపి తమ డెరైక్టర్లను వారివైపు లాక్కున్నారని ధ్వజమెత్తారు. కోట్లు పోసి డీసీసీబీ పదవిని కొనుక్కొన్నవారు ప్రజలకు, రైతులకు మేలు చేస్తారా అని సూటిగా ప్రశ్నించారు. ఈ సమావేశంలో కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు జి. రాజేంద్రప్రసాద్‌రెడ్డి, ఎస్. ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. ఎనిమిది మంది డెరైక్టర్లకు ధన్యవాదాలు- ఎంపీ అధికారం, డబ్బు ఆశచూపినా, అక్రమ కేసులు పెడతామని బెదిరించినా చెక్కు చెదరని విశ్వాసంతో పార్టీ వెంట ఉన్న 8 మంది డెరైక్టర్లకు కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. వారి విశ్వాసాన్ని, నిబద్ధతను పార్టీ గుర్తుంచుకొంటుందని చెప్పారు. -
కళారంగానికి కళాకౌముది విశిష్టసేవలు
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి రాజంపేట : రాజంపేట పట్టణంలో కళారంగానికి కళాకౌముది సేవా సంస్థ విశిష్ట సేవలందించిదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాధరెడ్డి గుర్తు చేశారు. శనివారం రాత్రి స్థానిక కాకతీయ విద్యాసంస్థ కళావేదికలో కళా కౌముది సంస్థ అధ్యక్షుడు పోలా వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో సంస్థ 24వ వార్షికోత్సవం సభకు ఆకేపాటి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 1992లో కళా కౌముది సంస్థ వివిధ రకాలుగా కళ,సాహిత్య రంగాలను పెంచి పోషించే విధంగా ముందుకు నడిచిందన్నారు. కళాకౌముది సంస్థ అంటే గుర్తుకొచ్చేది దివంగత టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ ఆకేపాటి చెంగల్‌రెడి అని పేర్కొన్నారు. కళాకౌముది సంస్థను చెంగలరెడ్డి స్థాపించారని, నేటికీ ఆ సంస్థ తన మనుగుడ విషయంలో రాజీ పడకుండా ముందుకువెళుతోందని పేర్కొన్నారు. తాను ఈ సంస్థ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. సంస్థ గౌరవ అధ్యక్షుడు రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఆకేపాటి రజనీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ కళాకౌముది సంస్థ సభ్యుల సహకారంతో 24యేళ్లపాటు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వీడన్ ప్రొఫెసర్ ఆకేపాటి వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ కళాకౌముది సంస్థను దిగ్విజయంగా నిర్వహించడంలో సమష్టి కృషి దాగి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారుడు, కాకతీయవిద్యాసంస్థల అధినేత పోలా శ్రీనివాసులరెడ్డి , పీ.రాధాకృష్ణారెడ్డి, ప్రముఖ వైద్యుడు సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షుడు మలిశెట్టి సుబ్బరాయుడు, కార్యదర్శి ఎన్.శివరాజు, పర్యవేక్షకుడు దరూరి హరినాధ్‌చౌదరి, పట్టణానికి చెందిన కెఎంఎల్ నరసింహులు, పాపినేని విశ్వనాధరెడ్డి, డీలరు సుబ్బరామిరెడ్డి, రాఘవరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, తెలుగుభాష సంరక్షణసమితి ప్రతినిధులు కాకర్లరాముడు, గంగనపల్లె వెంకటరమణ, విద్యాన్ చిన్నయ్యతోపాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం యుపీ రాయుడు కళాబృందంచే అద్భుత ఇంద్రజాల ప్రదర్శన, హాస్యవల్లరి వేణుగోపాల్ చే నిర్వహించి కార్యక్రమం సభికులను అలరించింది. శ్రీచక్ర యూపీ స్కూలు, సరస్వతీ విద్యామందిర్, చక్రశుభ నివాస్ స్కూల్ విద్యార్థుల నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
శాసనసభలో ప్రజాస్వామ్యం ఖూనీ
కడప కార్పొరేషన్: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యేలా అధికార పక్షం వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మేయర్ కె. సురేష్‌బాబుతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకేపాటి మాట్లాడుతూ దేశచరిత్రలో ఎక్కడా జరగని రీతిలో అసెంబ్లీ సమావేశాలు జరిగాయన్నారు. ప్రతిపక్షానికి రక్షణగా, హుందాగా వ్యవహరించాల్సిన సభాపతి టీడీపీ సభ్యుడిలా వ్యవహరించారని మండిపడ్డారు. వైఎస్ జగన్ మాట్లాడుతుంటే అధికార పక్షం నుంచి నిరసన రాకపోయినా మైక్ కట్ చేయడం ప్రతిపక్షనేతను అవమానించడమేనన్నారు. 67 మంది సభ్యులు కలిగిన బలమైన ప్రతిపక్షం నేడు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించే పరిస్థితి వచ్చిందంటే పాలకపక్షం, స్పీకర్ వైఖరే కారణమన్నారు. ప్రజల సమస్యలుగానీ, రైతులు, మహిళల రుణాల మాఫీ అంశంగానీ ప్రస్తావించే అవకాశం కూడా లేకుండా చేయడం బాధాకరమన్నారు. ప్రతిపక్షం గొంతునొక్కడమంటే ప్రజల గొంతునొక్కడమేనన్నారు. టీడీపీ సభ్యులు వీధిరౌడీల్లా, గూండాల్లాగా వ్యవహరించి అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం సిగ్గుచేటన్నారు. ఇది సభను కించపరచమే అవుతుందన్నారు. ఇతర రాష్ట్రాల అసెంబ్లీలలో జరుగుతున్న విపరీతపోకడలను ఇప్పటి వరకూ మనం చూశామని, ఇప్పుడు టీడీపీ పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా అలాంటి దుస్థితి దాపురించిందని పేర్కొన్నారు. ఈ పరిణామాలు తెలుగు ప్రజలను తలదించుకొనేలా చేశాయన్నారు. స్పీకర్ రాజ్యాంగబద్దంగా వ్యవహరించడం లేదని, అన్ని పక్షాలను సమానంగా చూడటం లేదని విమర్శించారు. వ్యక్తిగత దూషణలకే అధిక సమయం వృథా... ప్రతిపక్షనేత అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వ్యక్తిగత దూషణలకు దిగి సమస్యను పక్కదారి పట్టించడం అధికారపక్షానికి ఆనవాయితీగా మారిందని నగర మేయర్ కె. సురేష్‌బాబు విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ స్కూల్లో చదివితే వీరికెందుకండీ...బడ్జెట్‌పై చర్చ సాగుతున్నప్పుడు సంబంధం లేని విషయాలను ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ ప్రతిసారి మైక్ కట్ చేసి మంత్రులకు, టీడీపీ సభ్యులకు మైకులిస్తున్నారన్నారు. ఒక ఫ్యాక్షనిస్టును స్పీకర్‌ను చేస్తే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. గతంలో ముఖ్యమంత్రులు ప్రతిపక్షనేతకు ఎంతో గౌరవం ఇచ్చేవారని, ప్రస్తుత సీఎం చంద్రబాబు నియంతలాగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు తెలియాలంటే ప్రతిపక్షనేతకు అధిక సమయం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి నారు మాధవ్‌రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రాజశేఖర్ పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదాపై మాట మార్చిన బీజేపీ
కడప సెవెన్‌రోడ్స్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట మార్చిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జరుగుతున్న నిరాహార దీక్షా శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆకేపాటి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న విషయం విభజన బిల్లులోనే స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. కాగా బీజేపీ నేత వెంకయ్యనాయుడు విభజన చట్టంలో లేదని చెప్పడం శుద్ద అపబ్దమని దుయ్యబట్టారు. నాటి యూపీఏ ప్రభుత్వం నవ్యాంధ్రకు ఐదేళ్లపాటు స్పెషల్ క్యాటగిరీ స్టేటస్ ఇస్తామని ప్రకటించగా, దాన్ని పదేళ్లకు పెంచాలంటూ ఆనాడు మాట్లాడిన వెంకయ్యనాయుడు నేడు మాట మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తీసుకు రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రానిపక్షంలో ఎన్డీయే నుంచి చంద్రబాబు తక్షణమే బయటికి రావాలని డిమాండ్ చేశారు. డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ మాట్లాడుతూ సీపీఎం మినహా అన్ని పార్టీలు విభజనకు అనుకూలంగా మాట్లాడాయన్నారు. విభజన సందర్బంగా ఆంధ్ర రాష్ట్రానికి నష్టం వాటిల్లకూడదన్న ఉద్దేశ్యంతో నాటి ప్రధాని మన్మోహన్సింగ్ ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకటించారన్నారు. బహుళ ప్రయోజనాలతో సుమారు రూ. 5 లక్షల కోట్లు విలువజేసే హామిలతో చట్టబద్దమైన భరోసా ఇచ్చారన్నారు. కేంద్రంలో ప్రభుత్వాలు మారినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ది విషయంలో ఎలాంటి లోటుపాట్లు జరగకూడదన్న ఉద్దేశ్యంతో 2014 మార్చి 1వ తేది కేంద్ర మంత్రివర్గం ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానించి ప్లానింగ్ కమిషన్‌కు ఆదేశాలు పంపిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. పదేళ్లు ప్రత్యేక హోదాకు అప్పట్లో పట్టుబట్టిన వెంకయ్యనాయుడు నేడు ఇతర రాష్ట్రాలు కూడా అంగీకరించాల్సి ఉంటుందని చెప్పడం ఆయన రెండు నాల్కల ధోరణిని వెల్లడిస్తోందని తూర్పారబట్టారు. ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తర కోస్తాలకు ప్రత్యేక ప్యాకేజీని సాధించలేని చంద్రబాబు సిగ్గూఎగ్గు లేక ఎన్డీయేలో కొనసాగుతున్నారంటూ దుమ్మెత్తి పోశారు. ఈ కార్యక్రమంలో మేయర్ సురేష్‌బాబు, డిప్యూటీ మేయర్ నబీరసూల్, కాంగ్రెస్ నాయకులు సత్తార్, గొర్రె శ్రీనివాసులు, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బండి జకరయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టులపై పోరాడుదాం రండి
కడప కార్పొరేషన్: పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరుతూ అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న పోరాటంలో తెలుగుదేశం కలిసి రావాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక వైఎస్ గెస్ట్ హౌస్‌లో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డితో కలిసి సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సాగునీరు, తాగనీటి అవసరాల కోసం అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించాయన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణించాక జీఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిలిచిపోయాయన్నారు. టీడీపీ ప్రభుత్వం జిల్లాపై అడుగడుగునా వివక్ష చూపుతుండడంతో సాగునీరు కాదుకదా, తాగునీరు కూడా లభించని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాపై ప్రభుత్వం వివక్ష చూపడంలేదని టీ డీపీ నాయకులు చెబుతున్నారని, అయితే సీఎం జిల్లాపై ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితులను అధిగమించడానికి చేసే పోరాటానికి అన్ని రాజకీయపార్టీలు సహకరించాలని పిలుపునిచ్చామన్నారు. ఇందుకు వివిధ రాజకీయపార్టీలు తమ అంగీకారం తెలిపాయన్నారు. ఈ మేరకు ఈనెల 26, 27 తేదీలలో పోతిరెడ్డిపాడు వద్ద 24వ ప్యాకేజీ మొదలుకుని 30వ ప్యాకేజీ వరకూ క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని తీర్మానించామన్నారు. బనకచెర్ల, గోరకల్లు, అవుకు ప్రాంతాలలో ఏఏ పనులు పెండింగ్‌లో ఉన్నాయి.. పూర్తి కావాలంటే ఎన్ని నిధులు కావాలి.. తదితర విషయాలను పరిశీలిస్తామన్నారు. అనంతరం ఈనెల 27వ తేదీ జిల్లాకు రానున్న సాగునీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు, 28వ తేదీ గండికోటకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. సర్వరాయసాగర్ పూర్తి చేయాలని కమలాపురం ఎమ్మెలే దీక్ష ఈ కార్యక్రమం ముగియగానే సర్వరాయ సాగర్ ప్రాజెక్టు పూర్తి చేయాలనే డిమాండ్‌తో కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి దీక్ష చేయనున్నారని ఆకేపాటి చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ జీఎన్ఎస్ఎస్ ప్రాజక్టుకు రూ.1500 కోట్లు, హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుకు రూ.1000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. నీరు- చెట్టు కార్యక్రమానికి రూ.27 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం దానికంటే ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులను పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. క్రిష్ణా, గోదావరి, పెన్నా నీటిని సద్వినియోగం చేసుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆ తర్వాతే నీరు- చెట్టు గూర్చి ఆలోచించాలని సూచించారు. తెలుగుగంగ లైనింగ్ పనులను వెంటనే పూర్తి చేయకపోతే ఒక్క టీఎంసీ నీటిని కూడా నిల్వ చేసుకోలేమని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీబి ఛెర్మైన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, డీసీఎంఎస్ ఛెర్మైన్ విష్ణువర్థన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఎస్. ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. -
'ఒంటిమిట్ట ఆలయాన్ని ఆంధ్రాభద్రాద్రిగా ప్రకటించాలి'
కడప: వైఎస్సార్ జిల్లా రాజంపేటలో ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బుధవారం రాజకీయ అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. కోదండరామస్వామి ఆలయాన్ని ఆంధ్రాభద్రాద్రిగా ప్రకటించాలన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా సమావేశం జరగడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. -
తిరుమల యాత్రను ప్రారంభించిన ఆకేపాటి
కడప: వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఎరుకల సంఘం తిరుమల పాదయాత్రను జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి ఆదివారం కడప నగరంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాజంపేట పట్టణ అధ్యక్షుడు పోలా శ్రీనివాసరెడ్డితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. గత ఏడేళ్లుగా జిల్లాలోని ఎరుకుల సంఘం నాయకులు, కార్యకర్తలు తిరుమల పాదయాత్ర చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి ఎరుకుల సంఘం నాయకులు, కార్యకర్తలు భారీగా హజరయ్యారు. -
93 మందితో వైఎస్సార్సీపీ జిల్లా కమిటీ
ఆదర్శంగా ఉండాలి : జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి జిల్లా కార్యవర్గం రాష్ట్రానికి ఆదర్శంగా పనిచేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి అన్నారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కార్యవర్గాన్ని ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్తులో పార్టీ ఏ పిలుపు ఇచ్చినా కార్యవర్గసభ్యులంతా సమష్టిగా పనిచేసి విజయవంతం చేయాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు పోరాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలన్నారు. కడప కార్పొరేషన్: 93 మంది సభ్యులతో కూడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ప్రకటించారు. పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారి పదిమంది ప్రధాన కార్యదర్శులు, పన్నెండు మంది కార్యదర్శులు, పద్దెనిమిది మంది సంయుక్త కార్యదర్శులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, కోశాధికారి, క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఇద్దరు, 44 మంది కార్యనిర్వాహక సభ్యులతో భారీ కార్యవర్గాన్ని ప్రకటించారు. స్థానిక వైఎస్ గెస్ట్‌హౌస్‌లో బుధవారం నగర మేయర్ కె.సురేష్‌బాబు, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సమక్షంలో ఈ జాబితాను విడుదల చేశారు. కమిటీ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రధాన కార్యదర్శులు: ఎండీ అల్ఫోన్స్(కడప), ఎ. వేణుగోపాల్‌రెడ్డి(రాజంపేట), పి. సుకుమార్ రెడ్డి(కోడూరు), జి. వీరప్రవీణ్ కుమార్ రెడ్డి(కమలాపురం), ఎ.రామక్రిష్ణారెడ్డి(బద్వేల్), ఒ.రసూల్(పులివెందుల), ఎం. దేవనాథరెడ్డి(రాయచోటి), ఎం. దస్తగిరి(మైదుకూరు), ఎల్. సుబ్బయ్య యాదవ్, కె. నాగేంద్రారెడ్డి(ప్రొద్దుటూరు). కార్యదర్శులు: ఎస్. కరీం జిలానీ(కడప), సి. శ్రీనివాసులురెడ్డి(కోడూరు), కొండారెడ్డి(రాజంపేట), ఎస్. శివశంకర్‌రెడ్డి(కమలాపురం), కె. పెద్ద నరసింహ గౌడ్(పులివెందుల), అఫ్జల్ అలీఖాన్(రాయచోటి), పి. రఘురామిరెడ్డి(మైదుకూరు), టి. శ్రీనివాసులురెడ్డి, జి. భాస్కర్‌రెడ్డి(ప్రొద్డుటూరు), సి. జానకీ రామ్‌రెడ్డి, ఎన్. జగదేక రెడ్డి(జమ్మలమడుగు), పి. నాగార్జున రెడ్డి(బద్వేల్). అధికార ప్రతినిధులు: రాజేంద్ర ప్రసాద్‌రెడ్డి(కమలాపురం), టీకే అఫ్జల్ ఖాన్(కడప), పి. విశ్వనాథ్‌రెడ్డి(రాజంపేట), ప్రసాద్‌రెడ్డి, మహబూబ్ హుస్సేన్(ప్రొద్దుటూరు), సుబ్బారావు(కోడూరు). కోశాధికారి: ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి(మైదుకూరు), క్రమశిక్షణ కమిటీ: జి. విజయభాస్కర్‌రెడ్డి(రాజంపేట), ఆర్.వెంకటసుబ్బారెడ్డి (మాసీమ బాబు)(కమలాపురం). సంయుక్త కార్యదర్శులు: ఆయిల్ మిల్ ఖాజా, రామ్మోహన్‌రెడ్డి(ప్రొద్దుటూరు), బి. ఫ్రాన్సిస్, సి. వీర వెంకట స్వామి(మైదుకూరు), వెంకట్‌రెడ్డి, సయ్యద్ అమీర్(రాయచోటి), చాంద్‌బాషా, ఎ. మల్లికార్జున కిరణ్(కడప), సీహెచ్ రమేష్, ఎం. రఫీ(కోడూరు), టి. బాల మల్లారెడ్డి, టి. అమర్నాథ్రెడ్డి(కమలాపురం), ఎస్. శివయ్య, కె. చంద్రశేఖర్‌రెడ్డి(బద్వేల్), ఎం. శివశంకర్‌రెడ్డి, పి. వీరభద్రారెడ్డి(పులివెందుల), జి. సుబ్బారెడ్డి, ఆరమ్రెడ్డి(రాజంపేట). -
అవన్నీ అమ్ముడుపోని సరుకులే
వైఎస్సార్సీపీ నేతల ధ్వజం వైఎస్ గెస్ట్‌హౌస్(కడప కార్పొరేషన్): చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో హెరిటేజ్‌లో అమ్ముడుపోని సరుకును ప్రజలకు అంటగడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తారు. నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, నగర మేయర్ కె. సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి కానుక పేరుతో నాసిరకం సరుకులు పంపిణీ చేస్తున్నారన్నారు. హెరిటేజ్‌లో అమ్ముడుపోకుండా ఉన్న నెయ్యి, డాల్డాలను ప్రజలకు ఇస్తున్నారని ఆరోపించారు. తన స్వంత సంస్థకు లాభం చేకూర్చడానికే ఈ సరుకులు ఇస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు వారు చేస్తున్న తప్పులను కప్పి పుచ్చుకోవడానికి వైఎస్ఆర్ను, వైఎస్ జగన్‌ను విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం ఏర్పడి 9 మాసాలు కావొస్తున్నా జిల్లాకు ఒక్కపైసా నిధులు మంజూరు చేయలేదన్నారు. వస్తాయని భావిస్తున్న బ్రహ్మణి ఉక్కు ఫ్యాక్టరీని, డీఆర్డీఓ ప్రాజెక్టులను రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఎయిర్‌పోర్టు పనులు పూర్తయి సంవత్సరం అవుతున్నా ప్రారంభించేందుకు కూడా సీఎంకు తీరిక దొరకడం లేదన్నారు. సింగపూర్, జపాన్, మలేషియా అంటూ నెలకో దేశం తిరుగుతూ వందల కోట్ల ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారన్నారు. జిల్లాలో తాగు, సాగునీరు లేక వర్షాలు పడక, రుణాలు మాఫీ కాక రైతులు అల్లాడుతుంటే పట్టించుకొనే నాథుడే కరువయ్యాడన్నారు. సమావేశంలో జిల్లా అధికారప్రతినిధి టీకే అఫ్జల్ ఖాన్, యువజన అధ్యక్షుడు చల్లా రాజశేఖర్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఖాజా పాల్గొన్నారు. -
సచిన్ ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వే ఆవిష్కరణ
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు జాతీయం కేంద్ర మంత్రివర్గ విస్తరణ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవంబరు 9న కొత్తగా 21 మందిని తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఇందులో నలుగురు కేబినెట్, ముగ్గురు సహాయ స్వతంత్ర ప్రతిపత్తి, 14మంది సహాయ మంత్రులు ఉన్నారు. దీంతో మంత్రి వర్గసభ్యుల సంఖ్య 66కు చేరింది. మనోహర్ పారికర్‌కు రక్షణ శాఖ, సురేశ్ ప్రభుకు రైల్వే , జగత్ ప్రకాశ్ నడ్డాకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, చౌదరి బీరేందర్ సింగ్‌కు గ్రామీణాభివృద్ధి శాఖలను కేటాయించారు. తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయకు స్వతంత్ర ప్రతిపత్తి గల సహాయమంత్రిగా కార్మిక, ఉపాధి కల్పన శాఖ. ఆంధ్రప్రదేశ్ నుంచి వై.సుజనా చౌదరికి సహాయ మంత్రిగా సైన్స్, టెక్నాలజీ శాఖను కేటాయించారు. ఢిల్లీ అసెంబ్లీ రద్దు ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు కేంద్ర కేబినెట్ నవంబరు 4న సిఫార్సు చేయగా, రాష్ట్రపతి ఆమోదించారు. నవంబరు 11 లోగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు గడువు ఇచ్చింది. ఈమేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజబ్జంగ్ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీలను కోరగా, ఎన్నికలకే మొగ్గు చూపారు. దీంతో గవర్నర్ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేశారు. జయపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రధాని సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకం కింద వారణాసికి సమీపంలోని జయపూర్ గ్రామాన్ని ప్రధాని నరేంద్రమోదీ దత్తత తీసుకున్నారు. ప్రతి పార్లమెంటు సభ్యుడు తమ నియోజక వర్గం నుంచి ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని దాన్ని మోడల్ గ్రామంగా రూపొందించడమే సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన ప్రధాన లక్ష్యం. ఢిల్లీలో ప్రపంచ ఆయుర్వేద సదస్సు ప్రపంచ ఆయుర్వేద ఆరో సదస్సుకు ఢిల్లీ వేదికైంది. దీనికి హాజరైన ప్రధాని నరేంద్రమోదీ ఆయుర్వేద వైద్యానికి భారత్ ప్రాధాన్యమిస్తున్నట్లు ప్రకటించారు. పొగాకు ఉత్పత్తులపై బీహార్ నిషేధం పొగాకు, దాని ఉత్పత్తులపై నిషేధం విధిస్తున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంజీ నవంబరు 7న ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక ఎన్నికల్లో ఓటింగ్ తప్పనిసరి: గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటింగ్‌ను తప్పనిసరి చేసిన తొలి రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. దీని ప్రతిపాదన బిల్లును ఆ రాష్ట్ర గవర్నర్ ఓపీ కోహ్లి ఆమోదించారు. స్థానిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోకపోతే అలాంటి వారికి శిక్ష తప్పదన్నది ఈ బిల్లులోని సారాంశం. వార్తల్లో వ్యక్తులు సీబీడీటీ చైర్‌పర్సన్‌గా అనితా కపూర్ ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) కొత్త చైర్‌పర్సన్‌గా అనితాకపూర్ నవంబరు 5న నియమితులయ్యారు. ఆమె 1978 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారిణి. అక్టోబరు 31న ఉద్యోగ విరమణ చేసిన కె.వి.చౌదరి స్థానంలో అనితాకపూర్ బాధ్యతలు చేపట్టారు. 2015 నవంబరు వరకు ఈ హోదాలో కొనసాగుతారు. దక్షిణ కరోలినా గవర్నర్‌గా నిక్కీ హేలీ అమెరికాలోని దక్షిణ కరోలినా గవర్నర్‌గా భారతీయ సంతతికి చెందిన అమెరికన్ నిక్కీ హేలీ రిపబ్లిక్ పార్టీ తరపున నవంబరు 4న రెండోసారి ఎన్నికయ్యారు. ఆమె 57.8 శాతం ఓట్ల తేడాతో ప్రత్యర్థి విన్సెంట్‌పై విజయం సాధించారు. దక్షిణ కరోలినా ప్రప్రథమ మహిళా గవర్నర్‌గానూ, అమెరికాలో మొట్టమొదటి శ్వేత, జాతేతర గవర్నర్‌గా నిక్కీ చరిత్ర సృష్టించారు. గోవా ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్ పర్సేకర్ గోవా నూతన ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్ పర్సేకర్ (58) నవంబరు 8న బాధ్యతలు చేపట్టారు. 2012 నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న మనోహర్ పారికర్ కేంద్రమంత్రివర్గంలో చేరడంతో ఆ స్థానంలో పర్సేకర్ నియమితులయ్యారు. ఫోర్బ్స్ జాబితాలో మోదీకి 15వ స్థానం ఫోర్బ్స్ పత్రిక నవంబరు 5న విడుదల చేసిన ప్రపంచ శక్తిమంతుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ 15వ స్థానంలో నిలిచారు. మొత్తం 72 మందితో కూడిన ఈ జాబితాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటి స్థానం, అమెరికా అధ్యక్షుడు ఒబామా రెండో స్థానం, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మూడో స్థానంలో ఉన్నారు. అత్యంత శక్తిమంతమైన మహిళగా అరుంధతీ భట్టాచార్య భారత్‌లో అత్యంత శక్తిమంతులైన 50 మంది మహిళా వ్యాపారవేత్తల జాబితాను ఫోర్బ్స్ నవంబరు 9న విడుదల చేసింది. ప్రథమ స్థానంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య నిలిచారు. ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ చందాకొచ్చర్‌కు రెండో స్థానం, యాక్సిస్ బ్యాంక్ ఎండీ,సీఈఓ శిఖాశర్మ కు మూడో స్థానం దక్కింది. అపోలో హాస్పిటల్ ఎంటర్ ప్రైజెస్ ఎండీ ప్రీతారెడ్డి ఏడో స్థానంలో నిలిచారు. గుల్జార్‌కు హెచ్‌సీయూ గౌరవ డాక్టరేట్ కవి, సినీ దర్శకుడు సంపూర న్ సింగ్ కల్రా (గుల్జార్)కు హైదరాబాద్ కేంద్ర విశ్వ విద్యాలయం (హెచ్‌సీయూ) గౌరవ డాక్టరేట్‌ను నవంబరు 6న అందించింది. సాహిత్య రంగంలో విశేష కృషిని గుర్తిస్తూ వర్సిటీ కులపతి సీహెచ్. హనుమంతరావు గుల్జార్‌కు డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. రాష్ట్రీయం తెలంగాణ తొలి బడ్జెట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ నవంబరు 5న శాసనసభకు సమర్పించారు. మొత్తం రూ. 1,00,637 కోట్ల బడ్జెట్లో ప్రణాళికా వ్యయం రూ. 48,640 కోట్లు కాగా, ప్రణాళికేతర వ్యయం రూ. 51,989 కోట్లు. ప్రధాన రంగాలకు కేటాయింపుల వివరాలు... గ్రామీణాభివృద్ధి: రూ.7,579.45 కోట్లు, సాగునీరు: రూ. 6,500 కోట్లు. వ్యవసాయ, అనుబంధ రంగం: రూ. 3,061.71 కోట్లు. విద్య: రూ. 3,663.26 కోట్లు. వైద్యం: రూ. 2,282.86 కోట్లు. ఆంధ్రప్రదేశ్‌లో హరిత పథకం వ్యవసాయాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హరిత అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. హరిత పూర్తి రూపం.. హార్మోనైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అగ్రికల్చర్, రెవెన్యూ, ఇరిగేషన్ ఫర్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఎజెండా. వ్యవసాయం, సాగునీటి పారుదల, రెవెన్యూ శాఖల చొరవతో వ్యవసాయాన్ని మెరుగుపరచడమే హరిత పథకం లక్ష్యం. తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే -2014 రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం: 1,14,840 చ.కి.మీ, జనాభా (2011 నాటికి): 3.51 కోట్లు, రాష్ట్ర స్థూల ఆదాయం (జీఎస్డీపీ): రూ. 3,78,963 కోట్లు, తలసరి ఆదాయం: రూ. 93,151, జీఎస్డీపీలో సాగురంగం వాటా: 17 శాతం, పారిశ్రామిక రంగం వాటా: 27శాతం, సేవారంగం వాటా: 56 శాతం, అక్షరాస్యత: 66.46 శాతం, పట్టణ జనాభా: 39 శాతం, అడవుల విస్తీర్ణం: 28.89 శాతం, సాగునీటి సౌకర్యం: 31.64 లక్షల హెక్టార్లు. ఇంటర్నెట్ వినియోగదారుల్లో హైదరాబాద్‌కు ఆరో స్థానం దేశంలో అత్యధిక అంతర్జాల వినియోగదారులున్న నగరాల జాబితాలో హైదరాబాద్ ఆరోస్థానంలో నిలిచింది. భారత ఇంటర్నెట్, సెల్‌ఫోన్ సంఘం నిర్వహించిన అధ్యయనం ప్రకారం దేశం మొత్తం మీద 24.3 కోట్ల మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారని తేలింది. వీరిలో 1.64 కోట్ల మందితో ముంబయి అగ్ర స్థానం, 1.21 కోట్ల మందితో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచాయి. తెలంగాణలో ఆసరా పథకం ప్రారంభం వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు అందించే ఆసరా పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నవంబరు 8న మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో ప్రారంభించారు. పథకం కింద వృద్ధులు, వితంతువులు, మరనేత, కల్లుగీత కార్మికులతోపాటు ఎయిడ్స్ బాధితులకు నెలకు రూ. 1000, వికలాంగులకు రూ. 1,500లు అందజేస్తారు. అంతర్జాతీయం బెర్లిన్ గోడ కూల్చివేతకు పాతికేళ్లు చారిత్రక బెర్లిన్ గోడ కూల్చివేత ఘట్టానికి పాతికేళ్లు నిండాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో కమ్యూనిస్టుల పాలనలోని నాటి తూర్పు జర్మనీ ప్రభుత్వం 1961లో దీన్ని నిర్మించింది. ఆ తర్వాత 1989 నవంబరు 9న తూర్పు జర్మనీ ప్రభుత్వం పశ్చిమ జర్మనీ వెళ్లేందుకు తమ పౌరులను అనుమతించింది. దీంతో ఆ రోజున వేలమంది జర్మన్లు బెర్లిన్ గోడను కూల్చేశారు. ఆ పరిణామమే జర్మనీ ఏకీకరణకు దారితీసింది. సంక్రమించని వ్యాధులతో ప్రధాన ఆరోగ్య సమస్య భారత్‌లో 2012లో 60 శాతం మరణాలు ఒకరి నుంచి ఒకరికి సంక్రమించని వ్యాధుల వల్లనే సంభవించా యని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎకానమిక్స్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఇన్ ఇండియా పేరుతో విడుదలైన నివేదిక ప్రకారం భారత్‌లో 2012-2030 మధ్య కాలంలో ఎన్సీడీలు, మానసిక ఆరోగ్య స్థితుల వల్ల 4.58 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని తెలిపింది. గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్లు మనుషుల ఆరోగ్యానికి, ఆర్థిక వృద్ధికి, దేశాభివృద్ధికి పెద్ద సమస్య గా మారాయని పేర్కొంది. మొనాకోలో ఇంటర్‌పోల్ సదస్సు మొనాకో వేదికగా 83వ ఇంటర్‌పోల్ సదస్సు జరిగింది. నవంబరు 3-7 తేదీల మధ్య సాగిన ఈ సమావేశంలో భారత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొని హిందీలో ప్రసంగించారు. ఈ అంతర్జాతీయ వేదికపై హిందీలో ప్రసంగించడం ఇదే ప్రథమం. 82వ సదస్సు గతేడాది కొలంబియాలోని కార్టెజినాలో జరిగింది. భారత్-శ్రీలంక సంయుక్త సైనిక విన్యాసాలు భారత్-శ్రీలంక దేశాలు నవంబరు 3న సైనిక విన్యాసాలను ప్రారంభించాయి. దీనికి మిత్రశక్తి అని పేరు పెట్టారు. ఈ విన్యాసాలు కొలంబో సమీపంలోని ఓ దీవిలో నవంబరు 23వరకు నిర్వహించనున్నారు. ఆసియా-పసిఫిక్ మంత్రుల సదస్సు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో గృహ నిర్మాణం-పట్టణాభివృద్ధి ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి ప్లీనరీ నవంబరు 5న జరిగింది. దీనికి కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు హాజరయ్యారు. 2022 నాటికి అందరికీ గృహ వసతి భారత్ లక్ష్యమని ప్రకటించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ జలాంతర్గామి సింధుకీర్తి జల ప్రవేశం భారత నౌకాదళానికి చెందిన ఐ.ఎన్.ఎస్ సింధుకీర్తి జలాంతర్గామి విశాఖపట్టణంలోని హిందూస్థాన్ షిప్‌యార్డ్ బిల్డింగ్ డాక్లో నవంబరు 4న జలప్రవేశం చేసింది. దీన్ని ఐదారునెలల్లో నౌకాదళానికి అప్ప గిస్తారు. ఇది సింధూ ఘోష్‌కు చెందిన డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గామి. బంగాళాఖాతంలో మునిగిన నౌకాదళ నౌక తూర్పు నౌకాదళానికి చెందిన టోర్పెడో రికవరీ వెహికల్ -72 (టీఆర్వీ) నవంబరు 6న బంగాళాఖాతంలో ము నిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. దీన్ని యుద్ధ నౌకల నుంచి ప్రయోగాత్మకంగా పేల్చిన టోర్పెడో లను తిరిగి సేకరించడానికి ఉపయోగిస్తారు. అగ్ని-2 పరీక్ష సక్సెస్ మధ్యశ్రేణి అణ్వస్త్ర క్షిపణి అగ్ని-2ని సైన్యం మరోసారి విజయవంతంగా పరీక్షించింది. నవంబర్ 9న ఒడిశా తీరంలోని వీలర్ ఐల్యాండ్‌లో గల ఐటీఆర్ నుంచి దీన్ని ప్రయోగించారు. 20 మీటర్ల పొడవైన ఈ క్షిపణి వెయ్యి కిలోల పేలోడ్లను మోసుకుపోగలదు. క్రీడలు సచిన్ ఆత్మకథ ఆవిష్కరణ మాజీ క్రికెటర్, భారత రత్న సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వే పుస్తకాన్ని అక్టోబరు 5న ముంబయిలో ఆవిష్కరించారు. తొలికాపీని తన తల్లి రజనికి అందించారు. తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్లో ఎదురైన అనుభవాలు, వివాదాలు, తదితర అంశాలను ఈ పుస్తకంలో వెల్లడించారు. జాతీయ స్క్వాష్ విజేతలు సంధు, జ్యోష్న జాతీయ సీనియర్ స్క్వాష్ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను హరీందర్ పాల్ సింగ్ సంధు కైవసం చేసుకున్నాడు. నవంబర్ 8న ముంబయిలో జరిగిన ఫైనల్లో సౌరభ్ ఘోషల్‌పై విజయం సాధించాడు. సంధుకిదే తొలి జాతీయ టైటిల్. మహిళల టైటిల్‌ను జ్యోష్న చినప్ప గెలుచుకుంది. ఫైనల్లో సచికా ఇంగాలేని ఆమె ఓడించింది. భువనేశ్వర్‌కు పీపుల్స్ ఛాయిస్ అవార్డు భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్కుమార్కు ప్రతిష్టాత్మక ఎల్.జి పీపుల్స్ చాయిస్ అవార్డు వరించింది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఇందుకు జరిగిన ఓటింగ్‌లో పాల్గొని విజేతను ఎన్నుకొన్నారు. ఈ అవార్డు 2010లో సచిన్, 2011, 2012లో సంగక్కర, 2013లో ఎం.ఎస్. ధోనికి లభించింది. హాకీ సిరీస్ భారత్ కైవసం ఆస్ట్రేలియాతో జరిగిన హాకీ సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. నవంబరు 9న పెర్త్‌లో జరిగిన నాలుగో టెస్ట్‌ను భారత్ గెలవడంతో 3-1 తేడాతో సిరీస్‌ను చేజిక్కించుకుంది. ఆస్ట్రేలియాపై భారత్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. -
టీడీపీకి అపఖ్యాతి మిగిలింది
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి ప్రొద్దుటూరు: అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లకు టీడీపీ అపఖ్యాతి తెచ్చుకుంటుందనుకుంటే ఆరు నెలలకే ఆ పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అధ్యక్షతన మంగళవారం ప్రొద్దుటూరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకేపాటి మాట్లాడుతూ వాస్తవానికి వైఎస్సార్సీపీ గత ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు చెప్పాయన్నారు. ఈ విషయాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు రైతులకు రుణమాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ, ఇంటికో ఉద్యోగం, ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపు ఇలా ప్రతి వర్గానికి సంబంధించి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడన్నారు. కానీ ఆ హామీలను విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. బుధవారం జిల్లాలోని అన్ని మండలాల్లో జరపతలపెట్టిన ధర్నా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వీఎస్ ముక్తియార్, ప్రొద్దుటూరు, రాజుపాళెం మండల కన్వీనర్లు కల్లూరు నాగేంద్రారెడ్డి, ఎస్ఏ నారాయణరెడ్డి, ఈవీ సుధాకర్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు మల్లేల రాజారాంరెడ్డి, పార్టీ పట్టణాధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి, 17వ వార్డు కౌన్సిలర్ అనసూయ, గోపవరం సర్పంచ్ దేవీ ప్రసాదరెడ్డి, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి చిప్పగిరి ప్రసాద్ ప్రసంగించారు. మాట మరచిన బాబు మైదుకూరు టౌన్: ఎన్నికల ముందు ఆల్ ఫ్రీ అంటూ మాటలు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోలేక రోజుకో మాట మారుస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి విమర్శించారు. మంగళవారం మైదుకూరులో వైఎస్సార్సీపీ యువనాయకుడు శెట్టిపల్లె నాగిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఆ హామీలను నెరవేర్చలేక తన ఇష్టానుసారంగా పాలన సాగిస్తుంటే ఊరుకుండే ప్రసక్తే లేదన్నారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోంది : ఎమ్మెల్యే రాచమల్లు కార్యకర్తలతో ప్రచారం చేయిం చడం ద్వారా టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ముందు గా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి జైలుకు వెళుతున్నారని, ఇందులో భాగంగా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రొద్దుటూరులో పోటీ చేస్తారని, ఇందుకుగాను రూ.36కోట్లకు ఒప్పందం కుదిరిందని, టీ దుకాణాల వద్ద ప్రచారం చేస్తున్నారన్నారు. ముందుగా తాను రాజీనామా చేస్తున్నానని, తర్వాత జమ్మలమడుగు, రాయచోటి ఇలా ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారన్నారు. ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు. అలాగే తనతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళుతున్నట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కుటుంబంపై తనకు అమితమైన ప్రేమాభిమానాలు ఉన్నాయని, జగన్మోహన్రెడ్డి అడిగితే ఎమ్మెల్యే పదవే కాదు తన ప్రాణాలను అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చె ప్పారు. ఈ జీవితం ఉన్నంత వరకు తాను వైఎస్ కుటుంబంతోనే ఉంటానని తెలిపారు. ఇలాంటి విష ప్రచారాలను కార్యకర్తలు నమ్మవద్దని సూచించారు. -
భూటకపు హామీలతో చంద్రబాబు మోసం: అమర్నాథరెడ్డి
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు. భూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 5 తేదిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ నెల 30 తేదిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశం జరుగుతుందని, ఆ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు హాజరవుతున్నారని అమర్నాథ్ రెడ్డి మీడియాకు తెలిపారు. -
కార్యకర్తల్లో నైతిక స్థైర్యం పెంచాలి
కడప కార్పొరేషన్: పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో నైతిక స్థైర్యం పెంపొందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక వైఎస్ గెస్ట్‌హౌస్‌లో పార్టీ ైరె తు విభాగం మండల కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుకు గౌరవం పెరిగినప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బలంగా నమ్మారని తెలిపారు. ఆ మేరకే సంక్షేమ పథకాలను ప్రజలకు ఉపయోగపడేలా రూపొందించారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు ఇబ్బడిముబ్బడిగా అబద్దపు హామీలు ఇచ్చారన్నారు. వాటిని నమ్మి ఓట్లేసిన ప్రజలు మోసపోయారన్నారు. నాలుగు నెలలైనా సీఎం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఇన్నాళ్లు కంతులు చెల్లించనందున రైతులు, డ్వాక్రా మహిళల రుణాలకు వడ్డీలు పెరిగాయని, చాలాచోట్ల మహిళల పొదుపు డబ్బుజమ చేసుకొంటున్నారని తెలిపారు. ఇంతమందిని మోసం చేసిన చంద్రబాబుపై ఏ కేసు పెట్టాలని ఆయన ప్రశ్నించారు. ఆంక్షలు లేకుండా పూర్తి రుణమాఫీ చేయాలని కోరుతూ ఈనెల 16న మండల కేంద్రాలలో నిర్వహించే ధర్నాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం ఐదేళ్లు ఉంటుందన్న నమ్మకం లేదు నాలుగునెలల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఈ ప్రభుత్వం ఐదేళ్లు ఉంటుందన్న నమ్మకం లేదని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను నిలువునా మోసగించారన్నారు. రాజధాని కమిటీలో నిపుణులను నియమించకుండా తన చుట్టూ ఉండే కోట రీలోని కార్పొరేట్ వ్యక్తులను నియమించార న్నారు. వారు ముందుగానే 8 వేల ఎకరాలు సేకరించి వేలకోట్లు ఆర్జిస్తున్నారని ఆరోపించారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లను ఇంత దారుణంగా తొలగించిన ప్రభుత్వం ఇదేనన్నారు. రోజు రోజుకూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందన్నారు. జెడ్పీ ైఛె ర్మన్ గూడూరు రవి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. కలెక్టర్ మొదలుకొని అధికారులెవ్వరూ ప్రొటోకాల్ పాటించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రైతు విభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి మాట్లాడారు. -
మభ్య పెట్టే ‘జన్మభూమి-మాఊరు’
రాజంపేట: ప్రజల్ని మభ్య పెట్టేందుకే ప్రభుత్వం జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని మళ్లీ తెరపైకి తెచ్చిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆకేపాటి భవన్లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించడం తప్ప, ప్రజలను ఒరిగేదేమీలేదన్నారు. జన్మభూమికి కేటాయించిన నిధులు మంత్రులు, అధికారులు తిరిగేందుకే సరిపోతాయన్నారు. జిల్లాలో 30వేల పింఛన్లు తొలగించారన్నారు. రుణమాఫీ అంటూ రైతులను, డ్వాక్రా మహిళలలను బురిడీ కొట్టించారన్నారు. ఎన్నో ఆశలతో అధికారంలో కూర్చోబెట్టిన జనాన్ని నట్టేట ముంచడమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పని చేస్తోందని ఆయన విమర్శించారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పొట్టకొట్టిన ప్రభుత్వానికి మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతోందన్నారు. పింఛన్లకు అనేక రకాల అడ్డంకులు సృష్టించి అర్హులకు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల పక్షాలన పోరాటం చేస్తామన్నారు. సంక్షేమ ఫలాలు పేదలకు అందేలా తమ పార్టీ కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. వైఎస్ అభివృద్ధి కార్యక్రమాలకే.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి పనులకే టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి పేర్కొన్నారు. అంతేకాని చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమీ లేదనే విషయం ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. ఈ విషయాన్ని గుర్తించి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేలా పాలన చేయాలని సూచించారు. -
రాష్ట్రంలో కత్తెర పాలన: ఆకేపాటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కత్తెర పాలన జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి విమర్శించారు. ప్రతి పథకం విషయంలోనూ కోతలు పెడుతూ పోతున్నారని, ఏదో పేరు చెప్పి అన్నీ తగ్గించేస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చినా, వాటిలో ఏ ఒక్కటీ నెరవేర్చడం లేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రజల పక్షాన తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తామని ఆకేపాటి అమర్నాథ రెడ్డి స్పష్టం చేశారు. -
రేపు ఆకేపాటి ప్రమాణ స్వీకారం
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆకేపాటి అమరనాథరెడ్డి శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామరెడ్డి తెలిపారు. కడపలోని వైఎస్ అతిథి గృహంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అమరనాథరెడ్డిని నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న ఆకేపాటి పార్టీని అన్ని రకాలుగా పటిష్టం చేయగలరన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను సమర్థవంతంగా ఎదుర్కోగల శక్తి ఆకేపాటికే ఉందని చెప్పారు. కాగా ఆకేపాటి ప్రమాణ స్వీకారానికి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా, మండల కో-ఆప్షన్ సభ్యులు సహా అన్ని క్యాడర్ల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని చెప్పారు. పార్టీ అభ్యున్నతికి అందరి సలహా, సూచనలు స్వీకరిస్తామని ఆకేపాటి అమరనాథరెడ్డి తెలిపారు. -
కరెంట్ అఫైర్స్
రాష్ట్రీయం జీవశాస్త్ర విధానాన్ని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్‌లో ఫిబ్రవరి 17-19తేదీల మధ్య మూడు రోజులపాటు బయో ఏషియా-14 సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవశాస్త్ర విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం వల్ల రూ. 20వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. 50 వేల ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయి. రూ.60వేల కోట్ల ఎగుమతులకు అవకాశముంటుంది. జీవ శాస్త్ర రంగాన్ని పారిశ్రామిక రంగం కేటగిరీ కింద పరిగణిస్తారు. ఏక గవాక్ష విధానంలో సంస్థలకు అనుమతులిస్తారు. ఇతర పరిశ్రమలకిచ్చే విద్యుత్ రాయితీలు కల్పిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో విజ్ఞాన కేంద్రాన్ని నెలకొల్పుతారు. ఉత్తమ వారసత్వ నగరంగా తిరుపతి కేంద్ర ప్రభుత్వం 2012-13 సంవత్సరానికి ఉత్తమ వారసత్వ నగరంగా తిరుపతిని ఎంపిక చేసింది. తిరుమల-తిరుపతి దేవస్థానం వల్ల తిరుపతికి ఈ గుర్తింపు లభించింది. ఫిబ్రవరి 18న రాష్ట్రపతి నుంచి టీటీడీ అధికారి ఈ అవార్డును అందుకున్నారు. 2010-11లో హైదరాబాద్, 2011-12లో వరంగల్ ఉత్తమ వారసత్వ నగరాలుగా ఎంపికయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విభజనకు లోక్‌సభ ఆమోదం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడనుంది. రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ ఫిబ్రవరి 18న ఆమోదం తెలపగా, రాజ్యసభ ఫిబ్రవరి 20న ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాత నోటిఫికేషన్లో పేర్కొన్న తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కొనసాగుతాయి. రాజ్యసభలో బిల్లు ఆమోదం సందర్భంగా రెండు రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికి పన్ను రాయితీలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలు, పోలవరం ప్రాజెక్టును కేంద్ర నిధులతో పూర్తి చేయడంతోపాటు ఆంధ్రప్రదేశ్ తొలి ఏడాది ఆదాయ లోటు కేంద్ర బడ్జెట్ నుంచి భర్తీ చేస్తామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి రాజీనామా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014ను లోక్‌సభ ఆమోదించినందుకు నిరసనగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఫిబ్రవరి 19న తన పదవికి రాజీనామా చేశారు. ఈయన ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా 39 నెలలు పనిచేశారు. 2010 నవంబర్ 25న నాటి ముఖ్యమంత్రి కె.రోశయ్య స్థానంలో ఎన్నికయ్యారు. క్రీడలు టెస్ట్ సిరీస్ కివీస్‌దే భారత్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ను ఆతిథ్య న్యూజిలాండ్ గెలుచుకుంది. ఫిబ్రవరి 18న జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగియడంతో మొదటి టెస్టులో విజయం పొందిన కివీస్ విజేతగా నిలిచింది. నాదల్కు రియో టైటిల్ ప్రపంచ నెంబర్‌వన్ రఫెల్ నాదల్ రియో ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. రియో డి జెనెరోలో ఫిబ్రవరి 24న జరిగిన ఫైనల్లో ఉక్రెయిన్‌కు చెందిన అలెగ్జాండర్ డొల్గోపోలోను ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను కురుమీనారా గెలుచుకుంది. ఫైనల్లో క్లారా జెకోపలోవాపై విజయం సాధించింది. దేవ్ వర్మన్‌కు ఢిల్లీ ఓపెన్ టైటిల్ ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్‌ను భారత్‌కు చెందిన సోమ్‌దేవ్‌వర్మన్ గెలుచుకున్నాడు. ఫిబ్రవరి 23న ఢిల్లీలో జరిగిన ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన అలెగ్జాండర్ నెదోవ్ యెసోవ్ను దేవ్ వర్మన్ ఓడించాడు. డబుల్స్ టైటిల్‌ను భారత్‌కు చెందిన సన మ్ సింగ్, సాకేత్ మైనేనీ గెలుచుకున్నారు. ఫైనల్స్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన సాంచయ్, సోన్చాట్ రతివతనాలను ఓడించారు. ఢిల్లీకి హాకీ ఇండియా లీగ్ ట్రోఫీ హాకీ ఇండియా లీగ్ (హెచ్.ఐ.ఎల్) ట్రోఫీని ఢిల్లీ వేవ్ రైడర్స్ జట్టు గెలుచుకుంది. ఫిబ్రవరి 23న ఢిల్లీలో జరిగిన అంతిమ పోరులో పంజాబ్ వారియర్స్‌ను ఢిల్లీ వేవ్‌రైడర్స్ ఓడించి విజేతగా నిలిచింది. వింటర్ ఒలింపిక్స్‌లో రష్యాకు అగ్రస్థానం సోచిలో పదిహేను రోజులపాటు జరిగిన వింటర్ ఒలింపిక్స్ ఫిబ్రవరి 23న ముగిశాయి. ఈ పోటీల్లో ఆతిథ్య రష్యా ఎక్కువ పతకాలను సాధించి అగ్రస్థానంలో నిలిచింది. 13 స్వర్ణపతకాలతో రష్యా ప్రథమస్థానం కైవసం చేసుకుంది. 11 స్వర్ణాలతో నార్వే, 10 స్వర్ణాలతో కెనడా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్ తరపున పాల్గొన్న ముగ్గురు క్రీడాకారులకు ఒక పతకం కూడా దక్కలేదు. కాగా 2018 వింటర్ ఒలింపిక్స్ దక్షిణకొరియాలోని ప్యాంగ్చాంగ్లో జరగనున్నాయి. సీసీఎల్-4 విజేతగా కర్ణాటక సెలబ్రిటీ క్రికెట్ లీగ్(సీసీఎల్) విజేతగా డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక బుల్డోజర్స నిలిచింది. ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లో జరిగిన ఫైనల్స్‌లో కేరళ స్ట్రైకర్సను కర్ణాటక ఓడించింది. జాతీయం సిక్కింకు జాతీయ పర్యాటక అవార్డు 2012-13 సంవత్సరానికి జాతీయ పర్యాటక అవార్డు సిక్కిం రాష్ట్రానికి లభించింది. గ్రామీణ పర్యాటక ప్రాజెక్టుల అమలులో ఉత్తమ రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి శశిథరూర్... సిక్కిం రాష్ట్ర ప్రభుత్వానికి ఫిబ్రవరి 18న న్యూఢిల్లీలో అవార్డును ప్రదానం చేశారు. సిక్కిం రూ. 140 కోట్లతో అనేక పర్యాటక సౌకర్యాలను అభివృద్ధి చేసింది. కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్నాటక రాష్ట్రాలతో పర్యాటకులను ఆకర్షించేందుకు ఒప్పందాలు కుదుర్చుకొని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తోంది. ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సంయుక్తంగా నిలిచాయి. రాజీవ్ హంతకులకు శిక్ష తగ్గింపు మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురికి విధించిన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా తగ్గిస్తూ ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వారి క్షమాభిక్ష పిటిషన్‌పై 11 ఏళ్లుగా కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడం వల్ల శిక్ష తగ్గిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. క్షమాభిక్ష జాప్యం జరిగినందువల్ల తమ శిక్షను పునస్సమీక్షించాలంటూ నిందితులైన సంతన్, మురుగన్, పెరారివాలన్ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఇదిలాఉండగా ఈ కేసులో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం ఫిబ్రవరి 19న నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయంపై సుప్రీం స్టే విధించింది. 1991లో రాజీవ్‌గాంధీ హత్య జరిగిన తరువాత 1998లో టాడాకోర్టు దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. ఈ శిక్షను 1999లో సుప్రీం ఖరారు చేసింది. ఒడియా భాషకు ప్రాచీన హోదా ఒడియా భాషకు ప్రాచీన హోదా కల్పించేందుకు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 20న ఆమోదం తెలిపింది. దీంతో ఈ హోదా ఉన్న భాషల సంఖ్య ఆరుకు చేరింది. సంస్కృతం, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషలకు ఇప్పటి వరకు ఈ హోదా ఉంది. ఈ హోదా దక్కితే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఆర్థిక సాయం అందుతుంది. స్కాలర్స్‌కు రెండు అవార్డులు ఏర్పాటు చేసి అందించవచ్చు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో భాషా పీఠాల ఏర్పాటుకు వీలుంటుంది. ఆకాశ్ క్షిపణి పరీక్ష విజయవంతం ఆకాశ్ క్షిపణిని రక్షణ శాఖ ఒడిశాలోని చాందీపూర్ సమీకృత పరీక్షా కేంద్రం నుంచి ఫిబ్రవరి 24న విజయవంతంగా పరీక్షించింది. మానవరహిత విమానం నుంచి వేలాడే లక్ష్యాన్ని ఆకాశ్ ఛేదించింది. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే ఈ క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఒ.) పూర్తి స్వదీశీ పరిజ్ఞానంతో నిర్మించింది. 25 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే ఈ క్షిపణి 60 కిలోల పేలుడు పదార్థాలను మోసుకుపోతుంది. విష్ణు నార్లికర్‌కు నాయుడమ్మ అవార్డు ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త, పద్మ విభూషణ్ జయంత్ విష్ణు నార్లికర్ 2013 నాయుడమ్మ అవార్డుకు ఎంపికయ్యారు. ఇతర గ్రహాల్లో జీవుల ఉనికిని, అంతరిక్ష రహస్యాలను కనుక్కోవడానికి ఆయ న చేసిన కృషికి గాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు గుంటూరులోని నాయుడమ్మ ట్రస్ట్ ఫిబ్రవరి 22న ప్రకటించింది. మహారాష్ట్రకు చెందిన విష్ణు నార్లికర్‌ను 1965లో పద్మభూషణ్, 2004లో పద్మ విభూషణ్‌తో భారత ప్రభుత్వం గౌరవించింది. అంతర్జాతీయం భారత పర్యటనలో బహ్రెయిన్ రాజు బహ్రెయిన్ రాజు హమద్‌బిన్ ఇసా అల్ ఖలీఫా భారత పర్యటనలో ఫిబ్రవరి 20న ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌తో చర్చలు జరిపారు. వాణిజ్యం, వ్యాపార రంగాల్లో సహకారాన్ని విస్తరించుకొనేందుకు మూడు ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. ద్వైపాక్షిక వాణిజ్యంపై ఇరు దేశాల నాయకులు సమీక్షించారు. భారత కంపెనీలు తమ దేశం లో పెట్టుబడులు పెట్టాలని బహ్రెయిన్ కోరింది. ఇటలీ ప్రధానిగా మటెనో రెంజీ ఇటలీ ప్రధానమంత్రిగా మటెనోరెంజీ ఫిబ్రవరి 22న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 16 మంది మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరించారు. 39 ఏళ్ల రెంజీ ఇటలీకి అత్యంత పిన్న వయసులో ప్రధాని అయిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. రెంజీ గతంలో ఫ్లోరెన్స గవర్నర్‌గా పనిచేశారు. ఏడీబీ ట్రిబ్యునల్ ప్రెసిడెంట్‌గా లక్ష్మీ స్వామినాథన్ ఫిలిప్పీన్స్‌లోని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ట్రిబ్యునల్ ప్రెసిడెంట్‌గా భారత్‌కు చెందిన లక్ష్మీ స్వామినాథన్ ఫిబ్రవరి 21న ఎంపికయ్యారు. ఈమె మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఏడీబీ ట్రిబ్యునల్‌కు ఈమె ఏడో అధ్యక్షురాలు. 1992లో ఏడీబీ ట్రిబ్యునల్ ఏర్పాటైన తర్వాత ఈ పదవి భారత్‌కు దక్కడం ఇదే తొలిసారి. 2010లో ట్రిబ్యునల్‌లో సభ్యులుగా నియమితులైన లక్ష్మీ స్వామినాథన్ 2013 ఆగస్టు నుంచి తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవ హ రిస్తున్నారు. -
అంతర్జాతీయం కరెంట్ అఫైర్స్
నేపాల్ ప్రధామంత్రిగా సుశీల్ కొయిరాలా నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుశీల్ కొయిరాలా(75) ఆ దేశ ప్రధాన మంత్రిగా 2014 ఫిబ్రవరి 10న ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్లో జరిగిన ఓటింగ్‌లో ఆయనకు మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మెజార్టీ లభించింది. సీపీఎన్-యూఎంఎల్ మద్దతుతో ఆయన విజయం సాధించారు. 2008లో నేపాల్‌లో రాజరికం రద్దయ్యాక సుశీల్ కొయిరాలా ఆరో ప్రధానమంత్రి. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు 64వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014 ఫిబ్రవరి 15న బెర్లిన్‌లో ముగిసింది. 11 రోజులపాటు సాగిన ఈ చిత్రోత్సవంలో 400 చిత్రాలను ప్రదర్శించారు. ఇందులో కాంపిటీషన్ కేటగిరీలో 23 చిత్రాలు ఉన్నాయి. గోల్డెన్ బేర్ అవార్డు గెలుచుకున్న ఉత్తమ చిత్రం: బాయ్ రి యాన్ హూ (బ్లాక్ కోల్, థిన్ ఐస్) చైనా చిత్రం సిల్వర్ బేర్ అవార్డు పొందిన చిత్రం: గ్రాండ్ బుదాఫెస్ట్ హోటల్ ఆడియన్స అవార్డు: డి ఫ్రెట్ (ఇథియోపియా చిత్రం) ఉత్తమ నటుడు: లియావో ఫాన్ (చిత్రం - బ్లాక్ కోల్, థిన్ ఐస్) ఉత్తమ నటి: హరూ కురోకి (జపాన్ చిత్రం - ద లిటిల్ హౌస్) ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన చిత్రం హైవే కూడా ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. క్రీడలు కర్ణాటకకు ఇరానీ కప్ క్రికెట్ ఇరానీ కప్‌ను కర్ణాటక గెలుచుకుంది. బెంగళూరులో 2014 ఫిబ్రవరి 12న జరిగిన ఫైనల్స్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాను కర్ణాటక ఓడించింది. కర్ణాటక చివరగా 1998లో ఈ కప్‌ను గెలుచుకుంది. ఐ.పి.ఎల్-7లో యువరాజ్‌సింగ్‌కు 14 కోట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్-7) కోసం బెంగళూరులో 2014 ఫిబ్రవరి 12న జరిగిన వేలంలో యువరాజ్‌సింగ్‌ను బెంగళూరు రూ. 14 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మొత్తం తీసుకున్న తొలి క్రీడాకారుడిగా యువరాజ్‌సింగ్ నిలిచాడు. యువరాజ్ తర్వాత దినేశ్ కార్తీక్ అత్యధిక ధర పలికాడు. కార్తీక్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.12.5 కోట్లకు దక్కించుకుంది. తర్వాత ఇంగ్లండ్‌కు చెందిన కెవిన్ పీటర్సన్‌ను ఢిల్లీ జట్టు రూ. 9 కోట్లకు పొందింది. ఏఐఎఫ్ఎఫ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా సునీల్ ఛెత్రీ ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సునీల్ ఛెత్రీకి 2014 ఫిబ్రవరి 13న ప్రదానం చేశారు. భారత ఫుట్‌బాల్ టీం కెప్టెన్ ఛెత్రీ 2007, 2011లో కూడా ఈ అవార్డును సాధించారు. మహిళా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా ఒయినమ్ బెంబెమ్ దేవి, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా జేజే లాల్పెక్లు అవార్డులు అందుకున్నారు. ఫిక్కీ స్పోర్ట్స అవార్డులు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) అవార్డులను న్యూఢిల్లీలో 2014 ఫిబ్రవరి 13న ప్రదానం చేశారు. స్పోర్ట్స పర్సన్ ఆఫ్ ద ఇయర్: దీపికా కుమారి (ఆర్చరీ) కోచ్ ఆఫ్ ద ఇయర్: బల్దేవ్ సింగ్ (హాకీ) బ్రేక్‌త్రూ స్పోర్ట్స పర్సన్ ఆఫ్ ద ఇయర్: పి.వి. సింధూ (బ్యాడ్మింటన్) టీం ఆఫ్ ద ఇయర్: ఇండియన్ ఉమెన్స ఆర్చరీ టీం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు: రాహుల్ ద్రావిడ్ భారత్‌పై నిషేధం ఎత్తివేసిన ఐఓసీ భారత్ ఒలింపిక్ సంఘం(ఐఓఏ)పై ఉన్న నిషేధాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) 2014 ఫిబ్రవరి 11న ఎత్తివేసింది. ఐఓఏలో ప్రభుత్వ జోక్యం, ఒలింపిక్ చార్టర్‌కు విరుద్ధంగా పదవుల్లో కళంకిత వ్యక్తుల నియామకాలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఐఓఏపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 2012 డిసెంబర్ 4న నిషేధం విధించింది. 2014 ఫిబ్రవరి 9న ఐఓసీ సూచనల ప్రకారం ఐఓసీ పరిశీలకుల ఆధ్వర్యంలో ఐఓఏకి ఎన్నికలు జరిగాయి. పరిశీలకులు ఇచ్చిన సమాచారంతో తృప్తిపడిన ఐఓసీ భారత్‌పై నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో రష్యాలోని సోచిలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ముగ్గురు భారత క్రీడాకారులు స్వతంత్ర ఆటగాళ్లుగా కాకుండా భారత్ తరఫున ఆడేందుకు వీలుంటుంది. ముగింపు కార్యక్రమంలో భారత్ పతాకంతో పాల్గొంటారు. ఆర్థికం 17,63,214 కోట్లతో కేంద్ర మధ్యంతర బడ్జెట్ 2014-15 సంవత్సరానికి కేంద్ర ఆర్థికమంత్రి పి. చిదంబరం మధ్యంతర బడ్జెట్‌ను 2014 ఫిబ్రవరి 17న లోక్‌సభకు సమర్పించారు. ముఖ్యాంశాలు: మొత్తం బడ్జెట్: రూ. 17,63,214 కోట్లు, ప్రణాళికేతర వ్యయం: రూ. 12,07,892 కోట్లు ప్రణాళికా వ్యయం: రూ. 5,55,322 కోట్లు రెవెన్యూ లోటు: రూ. 3,82,923 కోట్లు ద్రవ్యలోటు: రూ. 5,28,631 కోట్లు ప్రాథమిక లోటు: రూ. 1,01,620 కోట్లు కార్లు, బైకులు, టీవీలు, ఫ్రిజ్‌లపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు 2009 ఏప్రిల్ ముందు నాటి విద్యా రుణాలపై వడ్డీపై మారటోరియం సైన్యంలో ఒకే హోదాకు ఒకే పింఛను వర్తింపు శాస్త్ర, సాంకేతిక రంగాలకు తోడ్పడేందుకు రీసెర్చ ఫండింగ్ ఆర్గనైజేషన్ {పధాన కేటాయింపులు: {V>-Ò$-×ాభివృద్ధి: రూ. 82,200 కోట్లు మానవ వనరుల అభివృద్ధి: రూ. 67,398 కోట్లు ఆరోగ్యం కుటుంబ సంక్షేమం: రూ. 33,725 కోట్లు రక్షణ: రూ. 2,24,000 కోట్లు, తాగునీరు, పారిశుధ్యం: రూ. 15,260 కోట్లు ఆహారం, ఇంధనం, ఎరువుల సబ్సిడీ: రూ. 2,46,397 కోట్లు ఎస్సీ ఉప ప్రణాళిక: రూ. 48,638 కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళిక: రూ. 30,726 కోట్లు రైల్వేలకు బడ్జెట్ మద్దతు: రూ. 29,000 కోట్లు 2014-15 రైల్వే మధ్యంతర బడ్జెట్ రైల్వేశాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే 2014-15 మధ్యంతర రైల్వే బడ్జెట్‌ను 2014 ఫిబ్రవరి 12న లోక్‌సభలో సమర్పించారు. 73 కొత్త రైళ్లు ప్రకటించారు. ఇందులో జైహింద్ పేరుతో 17 ప్రీమియం రైళ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు రెండు డబుల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రకటించారు. ఇవి కాచిగూడ-తిరుపతి, కాచిగూడ- గుంటూరు మధ్య నడుస్తాయి. రైల్వేల అభివృద్ధి, ఆధునికీకరణ కోసం ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కోసం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణ, రవాణా చార్జీలను సహేతుకంగా నిర్ణయించడంలో సలహా ఇచ్చేందుకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న రైల్వే టారిఫ్ అథారిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైల్వే నెట్వర్కలోకి మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. కొత్త లైన్లు, డబ్లింగ్ల కోసం 24 సర్వేలు చేపడతారు. బడ్జెట్ స్వరూపం: స్థూల ట్రాఫిక్ వసూళ్లు: 1,60,000 కోట్లు నిర్వహణ వ్యయం: 1,44,199 కోట్లు, నికర ఆదాయం: 19,655 కోట్లు డివిడెండ్: 9,117 కోట్లు, నిర్వహణ నిష్పత్తి: 89.9 కోట్లు మొత్తం మిగులు: 12,728 కోట్లు జాతీయం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజీనామా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి 2014 ఫిబ్రవరి 14న రాజీనామా చేశారు. శాసనసభ రద్దుకు సిఫార్సు చేశారు. వెంటనే శాసనసభకు ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. దీంతో రాష్ర్టపతి పాలన విధించాలని గవర్నర్ చేసిన సిఫార్సును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రాష్ర్టపతి ఆమోదంతో ఫిబ్రవరి 17 నుంచి రాష్ర్టపతి పాలన అమల్లోకి వచ్చింది. జన లోక్‌పాల్ బిల్లును ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టలేకపోవడంతో ఆయన రాజీనామా చేశారు. 70 మంది సభ్యులు ఉన్న సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు 42 మంది వ్యతిరేకించారు. సభలో ఆమ్ ఆద్మీ పార్టీకి 28 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో అరవింద్ కేజ్రీవాల్ 2013 డిసెంబర్ 28న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం 48 రోజులు కొనసాగింది. న్యూఢిల్లీలో ప్రపంచ ఆగ్రో - ఫారెస్ట్రీ కాంగ్రెస్ న్యూఢిల్లీలో 2014 ఫిబ్రవరి 10న ప్రపంచ అటవీ వ్యవసాయ (ఆగ్రో-ఫారెస్ట్రీ) సమావేశం జరిగింది. అధిక పెట్టుబడులను ఆకర్షించేందుకు అటవీ వ్యవసాయ విధానంలో కొత్త విధానాలు అవలంభించాలని రాష్ర్టపతి సూచించారు. ఈ రంగం పర్యావరణ పరంగా సుస్థిర ఆహార ఉత్పత్తి విధానంగా అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. వ్యవసాయం, అటవీ పంటలను సమీకృతం చేయడం వల్ల భూమి క్షీణతను అరికట్టడమే కాకుండా గ్రామీణ ప్రజలకు అవసరమైన కలప, వంటచెరకును అందించవచ్చని పేర్కొన్నారు. రాష్ర్టపతి ఏడు రాష్ట్రాలకు కృషి కర్మణ్ అవార్డులు ప్రదానం చేశారు. 2012-13లో ఆహారధాన్యాల ఉత్పత్తిలో ఉత్తమ పనితీరు కనబరిచిన మధ్యప్రదేశ్, ఒడిశా, మణిపూర్, చత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు ఈ అవార్డులు దక్కాయి. చిరుధాన్యాల ఉత్పత్తిలో మంచి ఫలితాలను సాధించినందుకు ఆంధ్రప్రదేశ్‌కు కూడా కృషి కర్మణ్ అవార్డు లభించింది. ఈ అవార్డును రాష్ర్టపతి నుంచి రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అందుకున్నారు. పత్రికా స్వేచ్ఛలో భారత్‌కు 140వ స్థానం పత్రికా స్వేచ్ఛలో ప్రపంచంలో అత్యంత దయనీయంగా ఉన్న దేశాల సరసన భారత్ చేరింది. పారిస్ కు చెందిన రిపోర్టర్స విత్ ఔట్ బోర్డర్స 2014 ఫిబ్రవరి 12న విడుదల చేసిన నివేదికలో భారత్‌కు 140వ స్థానం దక్కింది. 180 దేశాల జాబితాలో పాకిస్తాన్ 158, చైనా 175, నేపాల్ 120, అఫ్గానిస్తాన్ 128 స్థానాల్లో ఉన్నాయి. ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలువగా అగ్రరాజ్యం అమెరికా 46 స్థానంలో, బ్రిటన్ 33 స్థానంలో నిలిచాయి. 2013లో భారత్‌లో ఎనిమిది మంది జర్నలిస్టులు, ఒక మీడియా వర్కర్ మరణించినట్లు ఆ నివేదిక పేర్కొంది. దర్శకుడు బాలు మహేంద్ర మృతి ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు బాలు మహేంద్ర(75) చెన్నైలో 2014 ఫిబ్రవరి 13న మరణించారు. నెల్లు అనే మలయాళ చిత్రం ద్వారా 1974లో ఛాయాగ్రాహకుడిగా పరిచయమమ్యారు. 27 చిత్రాలకు ఫొటోగ్రఫీ అందించారు. కన్నడ చిత్రం కోకిల ద్వారా దర్శకుడయ్యారు. 22 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా మనవూరి పాండవులు, నిరీక్షణ చిత్రాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు. ఎయిడ్స నియంత్రణ కార్యక్రమం నాలుగో దశ ప్రారంభం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులామ్ నబీ ఆజాద్ జాతీయ ఎయిడ్స నియంత్రణ కార్యక్రమం నాలుగో దశను 2014 ఫిబ్రవరి 12న ప్రారంభించారు. ఇందుకు రూ. 14,295 కోట్లు కేటాయించారు. తొలిసారి ఎయిడ్స నియంత్రణకు అంతర్జాతీయ దాతలు, సంస్థలు అందించే నిధుల కంటే ప్రభుత్వం అందించే నిధులు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం ప్రభుత్వ మద్దతు 63 శాతంగా... అంటే రూ. 11,934 కోట్లు ఉంది. -
కరెంట్ అఫైర్స్
రాష్ర్టం నుంచి రాజ్యసభకు ఆరుగురు రాజ్యసభకు రాష్ర్టం నుంచి ఆరుగురు సభ్యులు ఎన్నికయ్యారు. 2014 ఫిబ్రవరి 7న జరిగిన ఎన్నికల్లో ఆరు స్థానాలకు ఏడుగురు పోటీ చేశారు. స్వతంత్ర అభ్యర్థి ఆదాల ప్రభాకరరెడ్డి పోటీ నుంచి విరమించుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఎం.ఎ. ఖాన్, కేవీపీ రామచంద్రరావు, టి. సుబ్బిరామిరెడ్డి, తెలుగుదేశం నుంచి సీతారామలక్ష్మి, జి. మోహన్‌రావు, టీఆర్ఎస్ నుంచి కె. కేశవరావు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తిరస్కరణ ఓటు వేశారు. రూ. 1,83,129 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2014-15 సంవత్సరానికి రూ. 1,83,129 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 2014 ఫిబ్రవరి 10న శాసనసభకు సమర్పించారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా వచ్చే ఆర్నెల్ల కాలానికి ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఆర్నెల్ల కాలానికి రూ. 79,460 కోట్లు కేటాయించారు. ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వం పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. మొత్తం బడ్జెట్: రూ. 1,83,129 కోట్లు ప్రణాళికేతర వ్యయం: రూ. 1,15,179 కోట్లు ప్రణాళికా వ్యయం: రూ. 67,950 కోట్లు ద్రవ్యలోటు: రూ. 25,402 కోట్లు(జీఎస్డీపీలో 2.6 శాతం) రెవెన్యూ మిగులు: రూ. 474 కోట్లు ప్రధాన కేటాయింపులు: వ్యవసాయం, అనుబంధ రంగాలు: రూ. 6,685.33 కోట్లు గ్రామీణాభివృద్ధి: రూ. 13,661.77 కోట్లు నీటిపారుదల: రూ. 23,311.98 కోట్లు సాధారణ విద్య: రూ. 22,123.09 కోట్లు సంక్షేమం: రూ. 11,650.85 కోట్లు సాధారణ సేవలు: రూ. 62,678.74 కోట్లు అంతర్జాతీయం మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల ‘మైక్రోసాఫ్ట్’ సీఈఓగా రాష్ట్రానికి చెందిన సత్య నాదెళ్ల(46) 2014 ఫిబ్రవరి 4న నియమితులయ్యా రు. ప్రస్తుత సీఈఓ స్టీవ్ బామర్ స్థానంలో నాదెళ్ల బాధ్యతలు చేపడతారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ బిల్‌గేట్స్ స్థానంలో జాన్ థాంప్సన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. మలాలాకు బాలల నోబెల్ పురస్కారం పాకిస్థాన్ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్ జాయ్(16) ప్రపంచ బాలల పురస్కారానికి ఎంపికయ్యారు. ఆమెతో పాటు అమెరికాకు చెందిన జాన్ఉడ్, నేపాల్‌కు చెందిన రాణామగర్ కూడా 2014 సంవత్సరానికి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. స్వీడన్‌కు చెందిన సంస్థ ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రదానం చేస్తుంది. జాన్ఉడ్, రాణామగర్ కూడా పిల్లల విద్య, హక్కుల కోసం పాటుపడుతున్నారు. తొలి ఎలక్ట్రానిక్ కంప్యూటర్‌కు 70 ఏళ్లు మొట్టమొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్‌కు 2014 ఫిబ్రవరి 5 నాటికి 70 ఏళ్లు పూర్తయ్యాయి. 1944 ఫిబ్రవరి 5న ఈ ‘కోలోసస్’ కంప్యూటర్ వినియోగంలోకి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ తన జనరల్స్‌కు పంపిన కోడ్ సందేశాలను డీకోడ్ చేసేందుకు ఉపయోగించారు. క్రీడలు ఐసీసీ చైర్మన్‌గా ఎన్. శ్రీనివాసన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చైర్మన్‌గా ఎన్. శ్రీనివాసన్ 2014 ఫిబ్రవరి 8న సింగపూర్‌లో జరిగిన బోర్డు సమావేశంలో ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం బీసీసీఐ చైర్మన్‌గా ఉన్నారు. ఐఓఏ అధ్యక్షుడిగా ఎన్. రామచంద్రన్ భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) అధ్యక్షుడిగా ఎన్. రామచంద్రన్ 2014 ఫిబ్రవరి 9న న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఈ టోర్నమెంట్ బెంగళూరులో 2014 ఫిబ్రవరి 8న ముగిసింది. విజేతలు: పురుషుల సింగిల్స్: అనూప్ శ్రీధర్(కర్ణాటక). ఫైనల్స్‌లో సౌరభ్ వర్మ(పెట్రోలియం)ను ఓడించాడు. పురుషుల డబుల్స్: చోప్రా ప్రణవ్ జెర్రీ, అక్షయ్ దెవాల్కర్. వీరు ఫైనల్స్‌లో నందగోపాల్, హేమనాగేంద్రబాబులను ఓడించారు. మహిళల సింగిల్స్: తాన్వి లాడ్. ఫైనల్స్‌లో రితూపర్ణాదాస్ను ఓడించింది. మహిళల డబుల్స్: జె. మేఘన, సిక్కి రెడ్డి. వీరు ఫైనల్స్‌లో ప్రజక్తా సావంత్, ఆరతీ సారా సునీల్‌ను ఓడించారు. జాతీయం పద్మశ్రీ అవార్డు గ్రహీత సిల్వెరిన్ స్వెర్ మృతి మేఘాలయ మొదటి పద్మశ్రీ అవార్డు గ్రహీత సిల్వెరిన్ స్వెర్(103) షిల్లాంగ్‌లో 2014 ఫిబ్రవరి 1న మరణించారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో అనేక హోదాల్లో పని చేశారు. జమ్మూలో 101 సైన్స కాంగ్రెస్ 2014 ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు జమ్మూ విశ్వవిద్యాలయంలో జరిగిన 101 సైన్స కాంగ్రెస్‌ను ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్ ప్రారంభించారు. సైన్స కాంగ్రెస్‌లో మన్మోహన్సింగ్ ప్రసంగించడం ఇది ఏడోసారి. రూ. 9,000 కోట్లతో చేపట్టే శాస్త్ర, సాంకేతిక ప్రాజెక్టులను ప్రధాని ప్రకటించారు. వాటిలో రూ. 4,500 కోట్లతో చేపట్టే నేషనల్ మిషన్ ఆన్ హైపర్ఫార్మెన్స కంప్యూటింగ్, రూ. 1,450 కోట్లతో తమిళనాడులో ఏర్పాటు చేసే న్యూట్రినో ఆధారిత అబ్జర్వేటరీ,రూ. 3,000 కోట్లతో జాతీయ భౌగోళిక సమాచార వ్యవస్థ ఉన్నాయి. ప్రఖ్యాత విదేశీ శాస్త్రవేత్తలు భారత్‌లో ఏడాది పాటు పనిచేసేందుకు 25 జవహర్లాల్ నెహ్రూ ఫెలోషిప్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కృషి చేసినందుకు హోమీ జె. బాబా స్మారక అవార్డును రీసెర్చ సెంటర్ ఇమారత్ డెరైక్టర్ జి. సతీష్ రెడ్డికి ప్రదానం చేశారు. 7వ వేతన సంఘం చైర్మన్‌గా అశోక్ కుమార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఏడో వేతన సంఘం చైర్మన్‌గా జస్టిస్ అశోక్ కుమార్ మాథుర్‌ను కేంద్ర ప్రభుత్వం 2014 ఫిబ్రవరి 4న నియమించింది. 50 లక్షల మందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, 30 లక్షల మంది పెన్షనర్ల చెల్లింపులపై వేతన సంఘం సిఫార్సులు చేస్తుంది. రెండేళ్లలో ఈ సంఘం తన నివేదికను సమర్పిస్తుంది. ఈ సిఫార్సులు 2016 జనవరి నుంచి అమల్లోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం పే స్కేళ్లను సవరించేందుకు ప్రతి పదేళ్లకోసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. ‘బ్రహ్మోస్’ క్షిపణి పరీక్ష విజయవంతం బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్‌ని సాల్వో మోడ్ పద్ధతిలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) 2014 ఫిబ్రవరి 7న విజయవంతంగా పరీక్షించింది. అరేబియా సముద్రంలో యుద్ధనౌక ఐఎన్ఎస్ త్రికండ్ నుంచి రెండు క్షిపణులతో నిర్వహించిన పరీక్ష విజయవంతమైంది. సాల్వో మోడ్ పద్ధతిలో ఒకేసారి సమాంతరంగా క్షిపణులను ప్రయోగిస్తారు. బ్రహ్మోస్ 290 కి.మీ. పరిధిలోని లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఘన, ద్రవ ఇంధనాలతో పనిచేసే బ్రహ్మోస్‌ను ఇప్పటికే సైన్యం, నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ఇండో-రష్యన్ సంస్థ ‘బ్రహ్మోస్ ఏరోస్పేస్’ దీన్ని నిర్మించింది. సీబీఐ అదనపు డెరైక్టర్‌గా అర్చనా రామసుందరం కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అదనపు డెరైక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అర్చనా రామసుందరం 2014 ఫిబ్రవరి 7న నియమితులయ్యారు. మహిళా అధికారి ఈ పదవి చేపట్టడం ఇదే తొలిసారి. ఈమె తమిళనాడు కేడర్‌కు చెందిన అధికారి. ఆమె గతంలో తమిళనాడు అదనపు డెరైక్టర్ జనరల్‌గా పనిచేశారు. 2013-14లో జీడీపీ వృద్ధి రేటు 4.9 శాతం 2013-14 సంవత్సర స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలను కేంద్ర గణాంక కార్యాలయం 2014 ఫిబ్రవరి 7న విడుదల చేసింది. 2013-14లో వృద్ధి రేటు 4.9 శాతంగా సీఎస్ఓ అంచనా వేసింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు 2013-14లో వృద్ధికి తోడ్పడ్డాయి. 2012-13లో వృద్ధి రేటు 4.5 శాతంగా పేర్కొంది.ఇది దశాబ్ద కాలంలో అతి తక్కువ. తలసరి ఆదాయం 2004-05 ధరల్లో వాస్తవ ప్రాతిపదికన 2013-14లో రూ. 39,961 ఉండొచ్చని అంచనా. ఇది 2012-13లో రూ. 38,856. ఈ పెరుగుదల 2.8 శాతం మాత్రమే ఉంది. తలసరి ఆదాయం ప్రస్తుత ధరల్లో 2013-14లో రూ. 74,920 ఉంటుందని సీఎస్ఓ అంచనా వేసింది. ఇది గతేడాది *67,839 కంటే 10.4 శాతం ఎక్కువ. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రమణ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2014 ఫిబ్రవరి 8న నియమితులయ్యారు. ఈయన 2013 సెప్టెంబర్ 3 నుంచి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా పనిచేశారు. 73వ రాజ్యాంగ సవరణ వర్తింపునకు జమ్మూ కాశ్మీర్ ఆమోదం జమ్మూకాశ్మీర్ పంచాయతీ రాజ్ చట్టం 1989కు 73వ రాజ్యాంగ సవరణ చట్టం వర్తింపచేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అధ్యక్షతన 2014 ఫిబ్రవరి 8న జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. ఇందువల్ల పంచాయతీలకు ప్రణాళికలు రూపొందించడం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, నిధు ల వినియోగంలో స్వయం ప్రతిపత్తి లభిస్తుంది. షెడ్యూల్డ్ కులాలు, తెగలకు రిజర్వేషన్ కల్పించేందుకు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు వీలు పడుతుంది. పంచాయతీలకు పోటీచేసే అభ్యర్థుల వయసును 25 నుంచి 21కి తగ్గించొచ్చు. జాతీయ అటవీ వ్యవసాయ విధానానికి కేబినెట్ ఆమోదం జాతీయ అటవీ వ్యవసాయ (ఆగ్రోఫారెస్ట్రీ) విధానానికి కేంద్ర కేబినెట్ 2014 ఫిబ్రవరి 6న ఆమోదం తెలిపింది. ప్రతికూల విధానాలు, చట్టపరమైన అడ్డం కులు, పెట్టుబడుల లేమి, అందు బాటులో లేని మార్కెట్ వంటి సమస్యలను అధిగమించడానికి, గ్రామీణ కుటుంబాల జీవన ప్రమాణాలు పెంచడానికి, ఈ విధానాన్ని రూపొందించారు. ఈ విధానం కింద రైతులకు రుణాలు, బీమా సౌకర్యాలు కల్పిస్తారు. ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పిస్తారు.రూ. 200 కోట్లతో నేషనల్ ఆగ్రోఫారెస్ట్రీ మిషన్, నేషనల్ ఆగ్రోఫారెస్ట్రీ బోర్డులను ఏర్పాటు చేస్తారు. సివిల్స్‌కు రెండు అవకాశాలు పెంచిన కేంద్రం సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసే అభ్యర్థులకు మరో రెండు అవకాశాలను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఇందుకు సంబంధించి 2014 ఫిబ్రవరి 10న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది 2014 ప్రిలిమ్స్ పరీక్ష నుంచి అమల్లోకి వస్తుంది. ఓసీ అభ్యర్థులు ప్రస్తుతం 30 ఏళ్ల వయసు వరకు నాలుగుసార్లు మాత్రమే ఈ పరీక్షలు రాయొచ్చు. వెనుకబడిన వర్గాల వారు ఏడుసార్లు రాయొచ్చు. వీరికి మూడేళ్లు సడలింపు ఉంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎన్నిసార్లయినా రాయొచ్చు. వీరికి వయోపరిమితిలో ఐదేళ్లు సడలింపు ఉంది. ప్రస్తుతం కల్పించిన రెండు అవకాశాల వల్ల అన్ని వర్గాల వారికి రెండేళ్ల వయోపరిమితి సడలింపు కూడా ఉంటుంది. -
విద్యార్థిని కాటేసిన డెంగీ
నందలూరు, న్యూస్‌లైన్ : డెంగీ కాటుకు ఓ విద్యార్థి బలయ్యాడు. నందలూరు ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న దుర్గాపురానికి చెందిన యాకసిరి శివకుమార్(14) డెంగీ వ్యాధితో ఆదివారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత మరణించాడు. నాలుగు రోజుల కిందట జ్వరం సోకగా, కడపలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందేవాడు. అయితే ఎంతకూ జ్వరం తగ్గలేదు. దీనికి తోడు ప్లేట్లెట్స్ సంఖ్య బాగా తగ్గిపోవడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించాలని డాక్టర్లు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు శివకుమార్‌ను తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూసినట్లు వారు కన్నీటిపర్యంతమయ్యారు. పెరోల్‌పై వచ్చి.. అంత్యక్రియల్లో పాల్గొన్న తండ్రి విద్యార్థి శివకుమార్ తండ్రి మునెయ్య ఓ కేసులో కడప సబ్‌జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కొడుకు అకాల మరణ సమాచారం అందిన వెంటనే ఆయన ఆవేదనకు గురయ్యారు. తన కొడుకు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అనుమతించాలని ఆయన సబ్‌జైలు అధికారులను కోరగా.. వారు పెరోల్‌పై విడుదల చేశారు. కొడుకు మృతదేహాన్ని చూడగానే ఆయన గుండెలపై పడి రోదించారు. ఆ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరి హృదయం బరువెక్కింది. ఎమ్మెల్యే ఆకేపాటి పరామర్శ విద్యార్థి శివకుమార్ డెంగీతో మరణించినట్లు తెలియగానే రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, ఆ పార్టీ నాయకులు సోమవారం గ్రామానికి చేరుకున్నారు. మృతదేహంపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. ఎంతో భ విష్యత్తు ఉన్న విద్యార్థిని డెంగీతో అకాల మరణం చెందడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. అనంతరం అంత్యక్రియల కోసం తనవంతు నగదు సాయం అందించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల నివాళులు చదువులో చురుగ్గా ఉండడంతో పాటు తమతో ఎప్పుడూ చలాకీగా ఉండే శివకుమార్ అకాల మరణంతో తోటి విద్యార్థులు ఆవేదనకు గురయ్యారు. తాము మంచి తెలివైన విద్యార్థిని కోల్పోయామని ప్రధానోపాధ్యాయుడు కృష్ణయ్య, ఫిజికల్ డెరైక్టర్ కృష్ణ, ఉపాధ్యాయులు అన్నారు. అతని అకాల మృతికి సంతాపంగా రెండు నిమిషాల పాటు పాఠశాలలో ప్రార్థన సమయంలో మౌనం పాటించారు. -
వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు జాతీయం అనర్హత ఆర్డినెన్స్ ఉపసంహరణ వివిధ కేసుల్లో దోషులుగా నిర్ధారితులైన ఎంపీలు, ఎంఎల్ఏలు తక్షణమే అనర్హులు కాకుండా రక్షణ కల్పిస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను కేంద్ర కేబినెట్ అక్టోబర్ 2న ఉపసంహరించుకుంది. ఈ ఆర్డినెన్స్‌కు సెప్టెంబర్ 24న కేంద్రం ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం హైదరాబాద్ సహా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ అక్టోబర్ 3న ఆమోదం తెలిపింది. జూలై 30 నాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానానికి అనుగుణంగా తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కేబినెట్ తీర్మానించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న అంశాల పరిష్కారానికి, విభజన అంశాన్ని పరిశీలించడానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తారు. రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటారు. మంత్రుల బృందం ఆరువారాల్లో సిఫార్సులు చేస్తుంది. భారత రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ బెల్జియం పర్యటన భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన బెల్జియం పర్యటనలో ఆ దేశ ప్రధానమంత్రి ఎలియా డి రూపోతో అక్టోబర్ 3న సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఆర్థిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ప్రధాన మౌలిక సదుపాయాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఉన్నత విద్య తదితర రంగాల్లో ఇరు దేశాలు సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయి. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారతదేశ శాశ్వత సభ్యత్వానికి తమ దేశ మద్దతును ప్రధాని డిరూపో పునరుద్ఘాటించారు. రెమిటెన్సుల్లో భారత్‌కు మొదటి స్థానం ప్రవాసీయులు తమ స్వదేశాలకు పంపే నిధులు (రెమిటెన్సులు) పొందడంలో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. 2013లో భారత్ 71 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు పొంది మొదటి స్థానంలో ఉందని ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో అక్టోబర్ 3న తెలిపింది. చైనా 60 బిలియన్ డాలర్లు పొంది రెండో స్థానంలో నిలిచింది. 26 బిలియన్ డాలర్ల నిధులతో ఫిలిప్పీన్స్ మూడో స్థానంలో ఉంది. 2013లో అభివృద్ధి చెందుతున్న దేశాలు పొందుతున్న మొత్తం రెమిటెన్సులు 414 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షాభియాన్‌కు ఆమోదం ఉన్నత విద్యా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షాభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అక్టోబర్ 3న ఈ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని 12, 13 పంచవర్ష ప్రణాళికల్లో అమలు చేస్తారు. ఈ పథకం కోసం మొత్తం 98,000 కోట్ల రూపాయలు కేటాయించారు. నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 65:35 నిష్పత్తిలో సమకూరుస్తాయి. ఈశాన్య, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లో 90:10 నిష్పత్తిలో నిధులు కేటాయిస్తాయి. సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ప్రత్యేక తరహా రాష్ట్రాల్లో 75:25 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తారు. ఈ పథకం విశ్వవిద్యాలయాలకు, కళాశాలలకు అత్యంత స్వయం ప్రతిపత్తిని కల్పిస్తుంది. టీచింగ్- లెర్నింగ్ క్వాలిటీ, పరిశోధనలను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తుంది. ఈ పథకం కిందకు 316 రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, 13,024 కళాశాలలను తీసుకువస్తారు. ఎస్బీఐ చైర్‌పర్సన్‌గా అరుంధతీ భట్టాచార్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్‌పర్సన్‌గా అరుంధతీ భట్టాచార్య అక్టోబర్ 7న నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. బ్యాంక్ చరిత్రలో ఒక మహిళ ఈ అత్యున్నత స్థాయి బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఆమె ఎస్బీఐ మేనేజింగ్ డెరైక్టర్(ఎండీ), చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. పృథ్వీ-2 ప్రయోగం విజయవంతం దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పృథ్వీ-2 క్షిపణిని అక్టోబర్ 7న మరోసారి విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి దీన్ని ప్రయోగించారు. అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న ఈ క్షిపణి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. 500 కిలోల నుంచి వెయ్యి కిలోల బరువు ఉన్న వార్హెడ్లను మోసుకెళ్తుంది. దీన్ని 2003లో సైన్యంలో ప్రవేశపెట్టారు. కరణ్ థాపర్‌కు ఐపీఐ పురస్కారం సమకాలీన అంశాలపై, వివిధ రంగాల్లో ప్రముఖులతో టీవీ ఇంటర్వ్యూలు నిర్వహించడంలో పేరొందిన కరణ్ థాపర్ ‘ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్స్టిట్యూట్ (ఐపీఐ)-ఇండియా అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ జర్నలిజం ఫర్ 2013’కు ఎంపికయ్యారు. సీఎన్ఎన్ ఐబీఎన్ చానల్లో ‘డెవిల్స్ అడ్వొకేట్’ కార్యక్రమం ద్వారా 2012లో ప్రజా సంబంధిత అంశాలపై విధాన నిర్ణేతలను ఇంటర్వ్యూలు చేయడం ద్వారా వాటిపై దృష్టి సారించేలా కృషి చేసినందుకు ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఐపీఐ-ఇండియా శాఖ అక్టోబర్ 7న తెలిపింది. అంతర్జాతీయం వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ వైద్యశాస్త్రంలో చేసిన కృషికిగాను అమెరికా, జర్మనీలకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలు ఉమ్మడిగా ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. శరీర కణాల్లో అంతర్గతంగా, కణాల మధ్య రవాణా వ్యవస్థపై పరిశోధన చేసిన.. అమెరికాకు చెందిన జేమ్స్ రోత్మాన్, రాండీ షెక్‌మాన్‌తోపాటు జర్మనీ సంతతి శాస్త్రవేత్త థామస్ స్యూదోఫ్‌లను నోబెల్‌కు ఎంపిక చేసినట్లు నోబెల్ జ్యూరీ ప్రకటించింది. ఈ బహుమతి కింద దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలను ముగ్గురు శాస్త్రవేత్తలు అందుకోనున్నారు. డిసెంబర్ 10న స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జరిగే కార్యక్రమంలో వారికి పురస్కారాలను అందజేస్తారు. 2050 నాటికి జనాభాలో భారత్ నెంబర్ వన్ 2050 నాటికి భారత్ 160 కోట్ల జనాభాతో ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశంగా అవతరించనుందని ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోగ్రఫిక్ స్టడీస్ తెలిపింది. ప్రస్తుతం భారత్ జనాభా 120 కోట్లు. ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్న చైనా స్థానాన్ని భారత్ ఆక్రమిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం చైనా జనాభా 130 కోట్లు. ప్రపంచ జనాభా 2050 నాటికి 970 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 710 కోట్ల్లుగా ఉంది. ఒబామా ప్రభుత్వంలో అసిస్టెంట్ సెక్రటరీగా అరుణ్ అమెరికా అంతర్జాతీయ వాణిజ్య విభాగం అసిస్టెంట్ సెక్రటరీగా భారత సంతతికి చెందిన అరుణ్ ఎం.కుమార్‌ను అక్టోబర్ 4న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించారు. ఆయన కె.పి.ఎం.జి కన్సల్టెన్సీ సంస్థలో భాగస్వామిగా, బోర్డు సభ్యుడిగా పనిచేశారు. విదేశీ వాణిజ్య విభాగం అసిస్టెంట్ సెక్రటరీతోపాటు అంతర్జాతీయ వాణిజ్య పరిపాలన విభాగం డెరైక్టర్ జనరల్‌గా కూడా అరుణ్‌కుమార్ నియమితులయ్యారు. వరల్డ్ టాయిలెట్ సమ్మిట్ వరల్డ్ టాయిలెట్ సదస్సు ఇండోనేషియాలో అక్టోబర్ 2న మొదలైంది. ఈ మూడు రోజుల సదస్సులో పబ్లిక్ టాయిలెట్లు లేకపోవడం, బహిరంగ ప్రదేశాల్లో విసర్జన ప్రధానాంశాలుగా చర్చకు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మందికి మరుగుదొడ్ల సౌకర్యం, మురుగునీటి పారుదల సౌకర్యం అందుబాటులో లేదు. డయేరియాతో ప్రతి ఏటా 10 లక్షల మంది పిల్లలు మరణిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. సింగపూర్‌కు చెందిన జాక్సిమ్ 2001లో వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేశారు. 15.7 మిలియన్లమందికి ఆకలి బాధ అభివృద్ధి చెందిన దేశాల్లో 15.7 మిలియన్ల మంది ఆకలి బాధతో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థలు తెలిపాయి. అక్టోబర్ 2న విడుదల చేసిన ప్రపంచంలో ఆహార భద్రత స్థితి - 2013 అనే నివేదికలో 2011-13లో మొత్తం 842 మిలియన్ల మంది ఆకలి బాధతో ఉన్నట్లు తెలిపింది. ఈ సంఖ్య 2010-12లో 868 మిలియన్లుగా ఉండేది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువ మంది ప్రజలు ఆకలి బాధతో ఉండగా, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా 15.7 మిలియన్ల మంది ఆకలితో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. చురుకుగా, ఆరోగ్యంగా జీవించడానికి చాలినంత ఆహారం లేకపోవడాన్ని ఆకలి బాధగా నివేదిక తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల్లో పెరుగుతున్న ఆర్థిక వృద్ధి ఆదాయాల పెరుగుదలకు, ఆహార లభ్యతకు తోడ్పడుతోందని వివరించింది. వ్యవసాయ ఉత్పత్తిలో అధిక వృద్ధి, వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు ఆహార లభ్యతను మెరుగుపరుస్తున్నాయని నివేదిక తెలిపింది. ఈ నివేదికను ప్రతి ఏటా ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో), అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి, ప్రపంచ ఆహార కార్యక్రమం ప్రచురిస్తాయి. షట్‌డౌన్ ప్రకటించిన అమెరికా ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం అక్టోబర్ 1న షట్‌డౌన్ ప్రకటించింది. షట్‌డౌన్ చేయాలంటూ ప్రభుత్వ కార్యాలయాలకు అమెరికా అధ్యక్ష కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. దాదాపు 18 ఏళ్ల తర్వాత అమెరికా షట్‌డౌన్ ప్రకటించింది. 1996లో క్లింటన్ కాలంలో షట్‌డౌన్ విధించారు. ఈ పాక్షిక షట్‌డౌన్ వల్ల అత్యవసర, నిత్యావసర సేవలు తప్ప ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోతాయి. అక్టోబర్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను సెప్టెంబర్ 30న కాంగ్రెస్ ఆమోదించకపోవడంతో షట్‌డౌన్ ప్రకటించాల్సి వచ్చింది. ‘ఒబామా కేర్’ అని పిలిచే ఆరోగ్య పథకంపై రిపబ్లిక్, డెమోక్రటిక్ పార్టీల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో బడ్జెట్‌కు ఆమోదం లభించలేదు. యాజమాన్యాల నుంచి ఆరోగ్య బీమా లేనివారు వ్యక్తిగతంగా ఆరోగ్య బీమా పొందాలనేది ‘ఒబామా కేర్’ చట్టంలోని ముఖ్య నిబంధన. దీన్ని రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. యూకేలో హైకమిషనర్‌గా రంజన్ మథాయ్ భారత మాజీ విదేశాంగ కార్యదర్శి రంజన్ మథాయ్ యునెటైడ్ కింగ్డమ్లో భారత హైకమిషనర్‌గా అక్టోబర్ 1న నియమితులయ్యారు. ప్రస్తుత హైకమిషనర్ జైమిని భగవతీ స్థానంలో మథాయ్ బాధ్యతలు చేపడతారు. ఆయన ఫ్రాన్స్‌లో భారత రాయబారిగా కూడా పనిచేశారు. క్రీడలు సైనా నెహ్వాల్‌కు ‘స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్’ పత్రిక అవార్డు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు స్పోర్ట్స్ పత్రిక ‘స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్’ అవార్డు లభించింది. 2012 సంవత్సరానికి ఉత్తమ క్రీడాకారిణిగా ఆ పత్రిక సైనాను ఎంపిక చేసింది. ఈ అవార్డు రావడం ఆమెకు ఇది రెండోసారి. 2009లో అవార్డు ప్రారంభించినప్పుడు ఈ అవార్డు దక్కింది. ఉత్తమ కోచ్‌గా పుల్లెల గోపీచంద్‌ను పత్రిక ప్రకటించింది. ఉత్తమ యువ ఆటగాడిగా ఉన్ముక్త్ చంద్ (క్రికెట్), ఉత్తమ క్రీడాకారుడిగా విరాట్ కోహ్లి (క్రికెట్) ఎంపికయ్యారు. రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు దక్కింది. ముంబై ఇండియన్స్‌కు టీ-20 టైటిల్ చాంపియన్స్‌లీగ్ టీ-20 క్రికెట్ టైటిల్‌ను ముంబై ఇండియన్స్ గెలుచుకుంది. ఢిల్లీలో అక్టోబర్ 6న జరిగిన ఫైనల్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. ఈ టైటిల్‌ను ముంబై ఇండియన్స్ గెలుచుకోవడం ఇది రెండోసారి. 2011లో మొదటిసారి చాంపియన్స్‌లీగ్ టైటిల్‌ను గెలుచుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా హర్భజన్ సింగ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా డ్వేన్ స్మిత్ ఎంపికయ్యారు. అత్యధిక పరుగులకిచ్చే గోల్డెన్ బ్యాట్ అజింక్యా రహానే (288 పరుగులు, రాజస్థాన్ రాయల్స్), అత్యధిక వికెట్లు పడగొట్టిన క్రీడాకారుడికిచ్చే గోల్డెన్ వికెట్ ప్రవీణ్ తాంబే (12 వికెట్లు, రాజస్థాన్ రాయల్స్)కు దక్కాయి. జోకోవిచ్‌కు చైనా ఓపెన్ టెన్నిస్ టైటిల్ పురుషుల సింగిల్స్: ైచె నా ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సెర్బియాకు చెందిన జోకోవిచ్ సాధించాడు. అక్టోబర్ 6న బీజింగ్‌లో జరిగిన ఫైనల్లో రఫెల్ నాదల్ (స్పెయిన్)ను ఓడించాడు. 2009, 2010, 2012లో కూడా ఈ టైటిల్‌ను జోకోవిచ్ గెలిచాడు. మహిళల సింగిల్స్: సెరెనా విలియమ్స్ (అమెరికా) టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో జంకోవిచ్ (సెర్బియా)ను ఓడించింది. ఇది సెరెనాకు 56వ టైటిల్. మహిళల డబుల్స్: సానియా మీర్జా (భారత్), కారా బ్లాక్ (జింబాబ్వే)లు మహిళల డబుల్స్ టైటిల్ గెలుపొందారు. వీరు ఫైనల్లో వెరా దుషెనివా (రష్యా), అరంటా సన్‌టోంజా (స్పెయిన్)ల జంటను ఓడించారు. వెటెల్‌కు కొరియా గ్రాండ్ ప్రి ఫార్ములావన్ కొరియా గ్రాండ్ ప్రి టైటిల్‌ను రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ సాధించాడు. అక్టోబర్ 6న ముగిసిన రేసులో వెటెల్ మొదటి స్థానంలో నిలవగా, లోటస్ జట్టు డ్రైవర్ రైకోనెన్ రెండో స్థానంలో నిలిచాడు. బోపన్న జోడికి జపాన్ ఓపెన్ జపాన్ ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను రోహన్ బోపన్న (భారత్), రోజర్ వాసెలిన్ (జపాన్) జోడి గెలుచుకుంది. అక్టోబర్ 6న జరిగిన ఫైనల్లో జెమీ ముర్రే (బ్రిటన్), జాన్పీర్స్ (ఆస్ట్రేలియా) జోడిని ఓడించింది. భారత్‌కు అండర్-19 నాలుగు దేశాల క్రికెట్ టైటిల్ అండర్-19 నాలుగు దేశాల క్రికెట్ టోర్నమెంట్ టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. అక్టోబర్ 5న విశాఖపట్నంలో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను.. భారత్ ఓడించింది. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, జింబాబ్వే దేశాలు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాయి. -
ఓటరుకు అభ్యర్థులను తిరస్కరించే హక్కు
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు జాతీయం ఐరాస సాధారణ సభ సమావేశం ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 68వ సమావేశంలో ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ సెప్టెంబర్ 28న ప్రసంగించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు శాశ్వత, తాత్కాలిక సభ్యత్వాలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. దాని కోసం భద్రతా మండలి పునర్నిర్మాణం జరగాలని, సంస్కరణలు చేపట్టాలని కోరారు. ఉగ్రవాదాన్ని అణచి వేయడానికి ఐరాస మరింత నిబద్ధతతో పనిచేయాలన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే దేశాలపై ఎలాంటి ఉపేక్ష చూపించరాదన్నారు. ఇదే సందర్భంలో ఉగ్రవాదానికి కేంద్ర స్థానంగా ఉన్న పాకిస్థాన్ైపై కూడా నిప్పులు చెరిగారు. భారత దేశంలో జమ్మూ కాశ్మీర్ అంతర్భాగమేనని నొక్కి చెప్పారు. ఈ విషయంలో ఎవరి జోక్యాన్ని తాము సహించబోమన్నారు. పాక్ భూభాగంపై రూపుదిద్దుకుంటున్న ఉగ్రవాద కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలన్నారు. కాగా, పేదరికాన్ని పారదోలడానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని సభ్య దేశాలకు సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల మందిపైగా పేదరికంలో మగ్గుతున్నారని, వారికి నేరుగా సంక్షేమ పథకాలు అందచేయడం ద్వారా పేదరికం తగ్గించాలన్నారు. శాంతి, భద్రత, మానవహక్కులు, పాలన వంటివి పరిష్కరించాల్సిన ప్రధాన అంశాలన్నారు. నీరు, ఇంధనం, మహిళల పట్ల వివక్షత వంటి అంశాలకు 2015 తర్వాత అజెండాలో ప్రాధాన్యత నివ్వాలని కోరారు. ఇక సిరియా సంక్షోభం గురించి మాట్లాడుతూ.. ఆ సమస్యకు మిలటరీ చర్యలు పరిష్కారం కాదని చెప్పారు. దీనిని పరిష్కరించడానికి బహుళ దేశాల సదస్సును వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. అయితే రసాయన ఆయుధాల వినియోగాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. ఇజ్రాయెల్, పాలస్తీనా సమస్యను ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలన్నారు. ఇక అణు నిరాయుధీకరణకు అన్ని దేశాలు పూర్తిగా అంగీకరించాలని, నిర్ణీత కాలంలో, వివక్ష లేకుండా పూర్తి చేయాలని కోరారు. దాణా కుంభకోణంలో దోషిగా లాలూప్రసాద్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను పశు దాణా కుంభకోణంలో సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా పేర్కొంది. సెప్టెంబర్ 30న ఇచ్చిన తీర్పులో లాలూతోపాటు మరో 44 మందిని దోషులుగా తేల్చింది. వారిలో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాతోపాటు ప్రస్తుత ఎంపీ జగదీశ్ శర్మ, నలుగురు ఐఏఎస్ అధికారులున్నారు. 1996 నాటి దాణా కుంభకోణంలో 37.7 కోట్ల రూపాయల మేరకు అవినీతికి పాల్పడ్డారని వారిపై అభియోగం. వీరికి శిక్ష ను ఖరారు చేయాల్సి ఉంది. తొలి 5500 హెచ్‌పీ రైలు ఇంజన్ భారత రైల్వేల కోసం తొలిసారిగా అత్యంత శక్తివంతమైన 5500 హెచ్‌పీ రైలు ఇంజన్‌ను సెప్టెంబర్ 26న ప్రారంభించారు. వారణాసిలోని డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ (డీఎల్డబ్ల్యు) ఈ ఇంజన్‌ను రూపొందించింది. ఇది ప్రపంచంలో 22 యాక్సిల్ లోడ్‌తో రూపొందించిన అతిపెద్ద లోకోమోటివ్. అనేక దేశాల్లో దీనికంటే శక్తివంతమైన ఇంజన్లు ఉన్నప్పటికీ అవి అధిక యాక్సిల్ లోడ్‌ను ఉపయోగించేవి. ఈ ఆధునిక రైలు ఇంజన్‌ను నార్త్ సెంట్రల్ రైల్వే పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రవేశపెట్టింది. గంటకు 100 కి.మీ వేగంతో నడిచే ఈ ఇంజన్లో అత్యాధునిక టెక్నాలజీ ఇమిడి ఉంది. ఇది అధిక ఇంధన సామర్థ్యంతో, ఉద్గారాల నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. పెద్ద ఇంజన్లు వాడటం వల్ల రవాణా సామర్థ్యాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి, ప్రయాణీకుల రైళ్లకు అధిక ర వాణా సదుపాయాలు కల్పించడానికి వీలవుతుంది. అభ్యర్థులను తిరస్కరించే హక్కు కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే తిరస్కరించే హక్కును కల్పిస్తూ సుప్రీంకోర్టు సెప్టెంబర్ 27న తీర్పునిచ్చింది. దీంతో పోటీచేస్తున్న అభ్యర్థిని వ్యతిరేకించడం గాని లేదా అందరిని తిరస్కరించే హక్కు ఓటరుకు ఉంటుంది. ఇందుకోసం బ్యాలెట్ పత్రాలు, ఓటింగ్ యంత్రాల్లో ‘పై వారెవరూ కాదు’ (నన్ ఆఫ్ ది అబౌ) అనే బటన్ ఉండాలని కోర్టు పేర్కొంది. ఓటర్లకు తిరస్కరించే హక్కు ఉండాలంటూ ‘పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టుపై తీర్పునిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించే హక్కును నిరాకరిస్తే భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని పేర్కొంది. ఇదిలావుంటే.. రాబోయే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ‘తిరస్కరించే హక్కు’ను అమలులోకి తెచ్చే అవకాశముందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా ఎన్నికల్లో తనకు నచ్చని అభ్యర్థిని తిరస్కరించే విధానం అమలు చేస్తున్న ఫ్రాన్స్, బ్రెజిల్, ఫిన్లాండ్, అమెరికా, బెల్జియం, గ్రీస్, ఉక్రెయిన్, చిలీ, బంగ్లాదేశ్, ఫిన్లాండ్, స్వీడన్, స్పెయిన్ దేశాల సరసన భారత్ చేరనుంది. సుప్రీంకోర్టుకు ప్రత్యేక పోస్టల్ పిన్‌కోడ్ భారత సుప్రీంకోర్టుకు పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రత్యేక పిన్‌కోడ్ - 110201ను సెప్టెంబర్ 26న ప్రవేశపెట్టింది. పెద్ద మొత్తంలో పోస్ట్ పొందే వినియోగదారులకు ప్రత్యేక పిన్‌కోడ్ కేటాయిస్తారు. సుప్రీంకోర్టుకు ప్రత్యేక పిన్‌కోడ్ కేటాయించడం వల్ల సార్టింగ్ ఆఫీసు నుంచి నేరుగా మెయిల్ పొందే అవకాశం ఏర్పడుతుంది. మధ్యలో డెలివరీ పోస్ట్ ఆఫీసు జోక్యం ఉండదు. చేరవేసే కాల వ్యవధిని సగం రోజుకు, పోస్టల్ డిపార్ట్మెంట్కు నిర్వహణ వ్యయాన్ని తగ్గిస్తుంది. త్వరలో అన్ని హైకోర్టులకు కూడా ప్రత్యేక పిన్‌కోడ్స్ కేటాయిస్తారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం తెలిపారు. నాగేశ్వర రెడ్డికి మాస్టర్ ఆఫ్ వరల్డ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అవార్డు హైదరాబాద్‌లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డికి మాస్టర్ ఆఫ్ వరల్డ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అవార్డు లభించింది. చైనాలోని షాంఘైలో సెప్టెంబర్ 23న జరిగిన ప్రపంచ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సదస్సులో ఆ సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ హెన్రీ కోహెన్ బహూకరించారు. ఈ అంతర్జాతీయ అవార్డును ప్రతి నాలుగేళ్లకొకసారి ప్రదానం చేస్తారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు నాగేశ్వర్‌రెడ్డి. జమ్మూలో ఉగ్రవాదుల దాడిలో 12మంది మృతి సైనిక దుస్తుల్లో సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి చొరబడ్డ ముగ్గురు ఉగ్రవాదులు సెప్టెంబర్ 26న జమ్మూ ప్రాంతంలో జంట దాడులకు పాల్పడ్డారు. తొలుత హీరా నగర్ పోలీస్ స్టేషన్‌పైన, తర్వాత ఒక సైనిక శిబిరంపైన దాడులు చేశారు. ఈ దాడుల్లో 12 మంది మరణించారు. సైన్యం ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు కూడా మరణించారు. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే - ఇ- తోయిబా ఈ దాడికి పాల్పడినట్లు సైనిక అధికారులు తెలిపారు. అంతర్జాతీయం కంబోడియా ప్రధాన మంత్రిగా హున్సేన్ ఎన్నిక కంబోడియా ప్రధానమంత్రిగా మరో ఐదేళ్ల కాలానికి హున్‌సేన్‌ను పార్లమెంట్ సెప్టెంబర్ 23న ఎన్నుకుంది. గత 30 ఏళ్లుగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్న హున్‌సేన్‌ను కొత్త కేబినెట్ ఏర్పాటు చేయాల్సిందిగా రాజు నోర్డమ్ సిహమోనీ కోరారు. హున్‌సేన్‌కు చెందిన కంబోడియన్ పీపుల్స్ పార్టీ (సీపీపీ) ఇటీవల జరిగిన ఎన్నికల్లో 68 స్థానాలు గెలుచుకుంది. ప్రతిపక్ష కంబోడియన్ నేషనల్ రెస్క్యూ పార్టీ (సీఎన్‌ఆర్‌పీ)కి 55 స్థానాలు దక్కాయి. ‘క్లింటన్ గ్లోబల్ సిటిజన్స్ అవార్డులు’ భారత పర్యావరణ వేత్త బంకర్ రాయ్, పాకిస్థాన్ విద్యా హక్కుల కార్యకర్త మలాలాలు 2013 సంవత్సరానికి క్లింటన్ గ్లోబల్ సిటిజన్స్ అవార్డులు అందుకున్నారు. వీరికి న్యూయార్క్‌లో సెప్టెంబర్ 25న ఈ అవార్డులు ప్రదానం చేశారు. బంకర్ రాయ్ బేర్పుట్ కళాశాల వ్యవస్థాపకుడు. ఆయన గత 40 ఏళ్లుగా గ్రామీణ సమస్యల పరిష్కారం కోసం ఆ సంస్థ ద్వారా కృషి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1,300కు పైగా ప్రాంతాల్లో 2.39 లక్షల మందికిపైగా విద్యార్థులకు స్వచ్ఛమైన మంచినీటిని అందించేందుకుగాను 10 లక్షల లీటర్ల వర్షపు నీటిని వాడకంలోకి తెస్తున్నారు. పాకిస్థాన్‌లో విద్యాహక్కులకు పోరాడుతున్న మలాలా (16) తాలిబన్ల దాడికి గురైంది. ఆమె మలాల నిధి పేరిట తన కృషిని కొనసాగిస్తోంది. మిస్ వరల్డ్‌గా మెగాన్ యంగ్ ఫిలిప్పీన్స్ సుందరి మెగాన్ యంగ్ (23) మిస్ వరల్డ్-2013గా ఎంపికైంది. ఇండోనేసియాలోని బాలి దీవిలో సెప్టెంబర్ 28న జరిగిన 63వ మిస్ వర్డల్ పోటీల ఫైనల్లో ఆమె విజేతగా నిలిచింది. ఈ పోటీలో ఫ్రాన్స్‌కు చెందిన మేరీన్ లోర్ఫెలిన్ రెండో స్థానంలో, ఘనాకు చెందిన నా ఒకాయిలే షూటర్ మూడో స్థానంలో నిలిచారు. భారత్ తరఫున మిస్ ఇండియా వరల్డ్ నవనీత్ కౌర్ థిల్లాన్ ఈ పోటీలో పాల్గొన్నా, తొలి పది స్థానాల్లో చోటు దక్కించుకోలేకపోయింది. కౌర్‌కు మిస్ మల్టీమీడియా పతకం దక్కింది. కొలంబియా సర్క్యూట్ కోర్టు జడ్జిగా శ్రీనివాసన్ అమెరికాలోని కొలంబియా సర్క్యూట్ కోర్టు న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన శ్రీనివాసన్ (46) సెప్టెంబర్ 27న బాధ్యతలు స్వీకరించారు. తద్వారా అమెరికాలో రెండో అత్యున్నత న్యాయస్థానంగా భావించే సర్క్యూట్ కోర్టు జడ్జిగా నియమితులైన తొలి భారతీయ అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు. శ్రీనివాసన్ గతంలో యునెటైడ్ స్టేట్స్ ప్రిన్సిపల్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. శ్రీనివాసన్ చంఢీగఢ్‌లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు 1970లో అమెరికాకు వలస వెళ్లారు. ఐపీసీసీ నివేదిక ఐక్యరాజ్యసమితికి చెందిన వాతావరణ మార్పుపై అంతర్ ప్రభుత్వ ప్యానెల్ (ఐపీసీసీ) భూ వాతావరణం వేగంగా వేడెక్కుతున్నట్లు హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన నివేదికను స్టాక్‌హోమ్‌లో సెప్టెంబర్ 27న విడుదల చేసింది. భూతాపానికి మానవులు కారణంగా పేర్కొంటూ ఈ శతాబ్దంలో ఉష్ణోగ్రత 0.3 నుంచి 4.8 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుందని అంచనా వేసింది. సముద్ర మట్టాలు 2100 నాటికి 26 నుంచి 82 సెంటీమీటర్లకు పెరుగుతాయి. వడగాల్పులు, వరదలు, కరువు అధికం అవుతాయని పేర్కొంది. వాతావరణం మరింత క్షీణించకుండా అడ్డుకునేందుకు శిలాజ ఇంధనాల వాడకాన్ని తక్షణం తగ్గించాలని తెలిపింది. పారిశ్రామికీకరణ ముందు నుంచి చూస్తే వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ 40 శాతం పెరిగిందని నివేదిక తెలిపింది. గత మూడు దశాబ్దాలపాటు వరుసగా భూ ఉపరితలం వేడెక్కిందని, ఇది 1850 నుంచి ఏ దశాబ్దంతో పోల్చినా ఎక్కువగా ఉందని పేర్కొంది. గత 1400 సంవత్సరాల్లో 1983-2012 మధ్య 30 ఏళ్ల కాలం అత్యధిక వేడి తో కూడిందని తెలిపింది. గ్రీన్హౌస్ ఉద్గారాలను అదుపు చేసేందుకు ప్రభుత్వాలు వెంటనే వాతావరణ కార్యాచరణను ఏర్పాటు చేయాలని, 2015లో ఒప్పందాన్ని రూపొందించాలని ఐపీసీసీ అధిపతి క్రిష్టినా ఫిగ్యురీస్ తెలిపారు. కత్వారీకి కవనాగ్ కవితా పురస్కారం భారతీయ అమెరికన్ కవి రఫీక్ కత్వారీ ప్రతిష్టాత్మక ఐరిష్ అంతర్జాతీయ ప్యాట్రిక్ కవనాగ్ పొయెట్రీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన కవితా సంపుటి ‘ఇన్ అనదర్ కంట్రీ’కి 2013 సంవత్సరానికిగాను ఈ అవార్డును ప్రకటించారు. 41 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన ఈ పురస్కారాన్ని ఐరిష్ జాతీయేతర వ్యక్తికి ప్రకటించడం ఇదే తొలిసారి. క్రీడలు లలిత్‌మోడీపై జీవితకాల నిషేధం ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్‌మోడీపై బీసీసీఐ సెప్టెంబర్ 25న జీవితకాల నిషేధం విధించింది. తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యం, అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. ఇకపై బీసీసీఐకి చెందిన కమిటీల్లో, ఆఫీసుల్లో ఎటువంటి బాధ్యతలు చేపట్టే హక్కు మోడీకి ఉండదు. ఆసియా మహిళల హాకీలో భారత్‌కు కాంస్యం 8వ ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత్‌కు కాంస్య పతకం లభించింది. కౌలాలంపూర్‌లో సెప్టెంబర్ 27న జరిగిన మ్యాచ్‌లో చైనాను ఓడించింది. దక్షిణ కొరియాను ఓడించి జపాన్ ఆసియా కప్‌ను గెలుచుకుంది. ఆసియా రోయింగ్‌లో స్వరణ్ సింగ్‌కు స్వర్ణం చైనాలోని లువాన్ నగరంలో సెప్టెంబర్ 29న ముగిసిన ఆసియా రోయింగ్ పోటీల్లో పురుషుల సింగిల్ స్కల్ ఈవెంట్లో స్వరణ్ సింగ్ పసిడి పతకాన్ని గెలుచుకున్నాడు. మొత్తం మీద భారత్‌కు ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు లభించాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న శ్రీనివాసన్ తిరిగి 2014 వరకు అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఐపీఎల్ చైర్మన్‌గా ఒరిస్సా క్రికెట్ సంఘం అధ్యక్షుడు రంజిబ్ బిశ్వాల్ ఎన్నికయ్యారు. సానియాకు పాన్ పసిఫిక్ డబుల్స్ టైటిల్ జింబాబ్వే క్రీడాకారిణి కారా బ్లాక్, సానియా మీర్జా (భారత్) జంట పాన్ పసిఫిక్ ఓపెన్‌లో మహిళల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. హంపికి తాష్కెంట్ గ్రాండ్ ప్రి టైటిల్ ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి తాష్కెంట్ గ్రాండ్ ప్రి టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. మరో భారత గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదోస్థానంలో నిలిచింది. -
కాంగ్రెస్ దురాలోచనతోనే విభజన: అమరనాథ్ రెడ్డి
వైఎస్ జగన్‌కు రాష్ట్రంలో అడ్డుకట్ట వేయాలనేదే కాంగ్రెస్ దురాలోచనతోనే రాష్ట్ర విభజనకు పూనుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి ఆరోపించారు. ఈ రోజు రాష్ట్రం అగ్నిగుండంగా మారడానికి కారణం సోనియా గాంధీయేనని ఆయన విమర్శించారు. తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న ఆలోచనతోనే విభజనకు సోనియా మొగ్గు చూపారని ఆయన దుయ్యబట్టారు. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ ప్రయత్నిస్తోందని అమరనాథ్‌రెడ్డి నిన్న ఆరోపించారు. 1995, 98 మధ్య కాలంలో బీజేపీని మతతత్వ పార్టీ అంటూ తిట్టి, అంటరానిదిగా పరిగణించి వామపక్షాలతో దోస్తీ చేసిన చంద్రబాబు 1999 సంవత్సరం వచ్చే నాటికి బీజేపీ గాలి వీస్తోందని తెలుసుకుని అటు వెళ్లారని విమర్శించారు. తనపై కేసులు పెడతారని, సీబీఐ దర్యాప్తు జరుగుతుందని భీతిల్లిన చంద్రబాబు కొంత కాలంగా కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నారని.. కేంద్రంలో బీజేపీ వస్తుందేమోనన్న అంచనాతో వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు ప్రారంభించారని విమర్శించారు. -
బీజేపీతో దోస్తీకి బాబు వెంపర్లాట
వైఎస్సార్ సీపీ నేతలు కొరుముట్ల, ఆకేపాటి ధ్వజం మతతత్వ పార్టీ అంటూ తిట్టి మళ్లీ మళ్లీ దగ్గరయ్యే యత్నాలెందుకు? ఇన్నాళ్లూ కేసుల భయంతో కాంగ్రెస్‌తో దోస్తీ.. ఇప్పుడు అధికారం కోసం బీజేపీతో పొత్తా! మోడీ వద్దకు బాలకృష్ణను పంపడంలో మతలబేమిటి? సాక్షి, హైదరాబాద్: ‘‘తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంటుందా..? లేదా దూరంగా ఉంటుందా? దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి మాట్లాడారు. ఇప్పటివరకూ ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కాంగ్రెస్‌తో అంటకాగుతున్న చంద్రబాబు.. ఇపుడు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని వారు పేర్కొన్నారు. ‘‘నరేంద్ర మోడీ హైదరాబాద్‌కు వస్తే చంద్రబాబు తన వియ్యంకుడు బాలకృష్ణను ఆయన వద్దకు పంపించారు. తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకే వెళ్లినట్లు బాలకృష్ణ చెప్పుకొచ్చారు. రెండ్రోజుల కింద టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తమ పార్టీ బీజేపీతో పొత్తు కుదుర్చుకుంటే తప్పేమిటన్నారు. మరోవైపు.. మోడీ కూడా తన ప్రసంగంలో ఎన్టీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. టీడీపీకి ఆహ్వానం పలుకుతున్నట్లుగా సూచనలిచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు భవిష్యత్తులో బీజేపీతో ఎన్నికల పొత్తు పెట్టుకుంటున్నారా.. లేదా? బయటపెట్టాలి’’ అని వారు పేర్కొన్నారు. తన కుమార్తె వివాహ పత్రికను ఇవ్వడానికే మోడీ వద్దకు వెళ్లానని బాలకృష్ణ అనడం చూస్తే.. ‘తాటిచెట్టు ఎక్కింది కల్లు కోసం కాదు, దూడగ డ్డి కోసం...’ అన్నట్లుగా ఉందని ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. గుజరాత్‌ను మోడీ అభివృద్ధి చేస్తే ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు అభివృద్ధి చేస్తారన్న టీడీపీ నేతల మాటలు చూస్తే భవిష్యత్‌లో వారిద్దరూ కలిసేలా ఉందన్నారు. 1995, 98 మధ్య కాలంలో బీజేపీని మతతత్వ పార్టీ అంటూ తిట్టి, అంటరానిదిగా పరిగణించి వామపక్షాలతో దోస్తీ చేసిన చంద్రబాబు 1999 సంవత్సరం వచ్చే నాటికి బీజేపీ గాలి వీస్తోందని తెలుసుకుని అటు వెళ్లారని విమర్శించారు. ‘‘ఇక 99 ఎన్నికల ముందు చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై వంద ఆరోపణలతో బీజేపీ ఒక పత్రాన్ని విడుదల చేస్తూ తాము అధికారంలోకి వస్తే వాటన్నింటిపైనా విచారణ జరిపిస్తామని ప్రకటించింది. దాంతో భయపడిపోయిన చంద్రబాబు.. ఆగమేఘాల మీద పరుగెత్తి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు’’ అని కొరుముట్ల, ఆకేపాటి విమర్శించారు. తనపై కేసులు పెడతారని, సీబీఐ దర్యాప్తు జరుగుతుందని భీతిల్లిన చంద్రబాబు కొంత కాలంగా కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నారని.. కేంద్రంలో బీజేపీ వస్తుందేమోనన్న అంచనాతో వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు ప్రారంభించారని విమర్శించారు. ‘‘బాబు చిదంబరంతోనూ, కాంగ్రెస్ అధిష్టానవర్గం పెద్దలతోనూ రహస్యంగా చర్చలు జరపడం వాస్తవం కాదా? యూపీఏ ప్రభుత్వం స్థిరంగా ఉండటానికి వారికి మద్దతు తెలిపిన మాట నిజం కాదా? శాసనసభలో అవిశ్వాసం సమయంలో విప్ జారీ చేసి మరీ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెట్టిన ఘనత బాబుది కాదా?’’ అని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. వాస్తవానికి ఆరోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టి ఉంటే రాష్ట్రంలో ఈ గందరగోళ పరిస్థితులు నెలకొని ఉండేవి కాదు కదా? రాష్ర్టం అగ్ని గుండంగా మారి ఉండేది కాదు కదా? అని పేర్కొన్నారు. టీడీపీకి ఆహ్వానం పలికేలా మోడీ ప్రసంగించడం కూడా బాబు సూచనల మేరకే జరిగి ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు. కడప లోక్‌సభ ఉప ఎన్నికల సందర్భంగా మతతత్వ పార్టీ అయిన బీజేపీతో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పొత్తు పెట్టుకుంటారంటూ దుష్ర్పచారం చేసిన బాబు ఇపుడు తానే బీజేపీతో కలిసేందుకు తహతహలాడుతున్నారని పేర్కొన్నారు. బాబు చేసిన ఆ తప్పుడు ప్రచారాన్ని ప్రజలెవ్వరూ నమ్మలేదన్నారు. గతంలో ఎన్డీయేకు మద్దతిచ్చినపుడు కూడా బాబు మంత్రి పదవులు వద్దు, రాష్ట్ర అభివృద్ధి వద్దని.. తన ప్రయోజనాలు, తన వాళ్ల ప్రయోజనాలే చూసుకున్నారు తప్ప రాష్ట్ర ప్రజల గురించి మాత్రం ఆలోచించలేదని విమర్శించారు. తన ఆడిటర్‌ను రిజర్వు బ్యాంకు డెరైక్టర్‌గా దక్షిణ భారత ఇన్చార్జిగా నియమింపజేసుకున్న ఘనత బాబుదని ఆరోపించారు. విభజన వ్యవహారంలోకి దివంగత వైఎస్ పేరును లాగితే ప్రజలు క్షమించరని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. తెలంగాణ, రాయలసీమ, కోస్తా మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందాలనేది వైఎస్ కల అని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాకే ఏ నిర్ణయమైనా తీసుకుందామని వైఎస్ చెప్పారని గుర్తు చేశారు. వైఎస్‌పై బురద జల్లుతూ వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాలని జరుగుతున్న ప్రయత్నాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. విభజనపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కేంద్రం ఒక తండ్రిలా అందరికీ సమన్యాయం చేయాలని జగన్, వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారని ఒక ప్రశ్నకు సమాధానంగా కొరుముట్ల, ఆకేపాటి చెప్పారు.