
'ఒంటిమిట్ట ఆలయాన్ని ఆంధ్రాభద్రాద్రిగా ప్రకటించాలి'
కడప: వైఎస్సార్ జిల్లా రాజంపేటలో ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బుధవారం రాజకీయ అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. కోదండరామస్వామి ఆలయాన్ని ఆంధ్రాభద్రాద్రిగా ప్రకటించాలన్నారు.
ప్రభుత్వ లాంఛనాలతో అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా సమావేశం జరగడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.