
అన్నమయ్య, సాక్షి: కూటమి కుట్రలతో జైలు పాలైన ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని వైఎస్సార్‌సీపీ నేతలు శనివారం పరామర్శించారు. అయితే ములాఖత్ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్‌పై గతంలో పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని.. సినీ పరిశ్రమలో కులాల పేరుతో చిచ్చు పెట్టేలా మాట్లాడారని కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో అరెస్టైన పోసాని.. రిమాండ్‌లో ఉన్నారు. పోసానిపై కూటమి ప్రభుత్వం కక్ష గట్టిందని.. ఆయనకు వైఎస్సార్‌సీపీ అన్నివిధాల అండగా ఉంటుందని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో..
రాజంపేట సబ్ జైలులో ఉన్న పోసాని కృష్ణమురళితో స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు ములాఖత్ అయ్యారు. అనంతరం ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పోసాని అనారోగ్యంతో బాధపడుతున్నారని వెల్లడించారు. మరోవైపు.. ములాఖత్ కోసం రైల్వే కోడూరు మాజీ MLA కొరముట్ల శ్రీనివాసులు పెట్టుకున్న విజ్ఞప్తిని జైలు అధికారులు తిరస్కరించారు. దీంతో సబ్ జైలర్ మల్ రెడ్డిపై కొరముట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. పోసాని బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment