Mulaqat
-
11న గుంటూరుకు వైఎస్ జగన్
తాడేపల్లి, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎల్లుండి(సెప్టెంబర్ 11న) గుంటూరు వెళ్లనున్నారు. గుంటూరు జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను జగన్ పరామర్శించనున్నారు. టీడీపీ కార్యాలయం దాడి కేసు తిరగదోడి మరీ.. చంద్రబాబు ప్రభుత్వం సురేష్‌పై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యథేచ్ఛగా వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తూ.. ఇష్టానుసారం కేసులను బనాయిస్తోంది. ఈ క్రమంలో చట్టాన్ని, న్యాయస్థానాలను కూడా ఉల్లంఘిస్తోంది. రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగానే.. నందిగం సురేష్‌ను కూడా అరెస్టు చేశారు. మంగళగిరి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ కేడరే కూటమి టార్గెట్మూడేళ్ల క్రితం(2021) నాటి సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్ర పదజాలంతో దూషణలు చేశారు. దీంతో మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ఘర్షణలకు సంబంధించిన కేసును అధికారంలోకి రాగానే.. చంద్రబాబు ప్రభుత్వం తిరిగి తెరిచింది. ఉద్దేశపూర్వకంగా.. కొంతమంది దగ్గరి నుంచి సాక్ష్యం పేరుతో స్టేట్మెంట్లు తీసుకుంది. ఆపై కొందరు వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టింది. నేరం జరిగిన తర్వాత 60 –70 రోజులు దాటాక సాక్షిని విచారిస్తే చెల్లదు.. అని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ దాన్ని ఉల్లంఘించి మరీ నిందితుల జాబితాను పోలీసులు ఈ కేసులో సిద్ధం చేయడం గమనార్హం. ఈ కేసులో సురేష్ పేరును 80వ నిందితుడిగా చేర్చింది. -
ఎట్టకేలకు ములాఖత్‌కు రాహుల్ గాంధీకి అనుమతి
సాక్షి, హైదరాబాద్: చంచల్‌గూడ జైల్లో ఉన్న ఎన్ఎస్యూఐ నేతలను పరామర్శించేందుకు ఎట్టకేలకు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి అనుమతి దొరికింది. ములాఖత్‌కు అనుమతించాలని మరోసారి విజ్క్షప్తి చేయండంతో అధికారులు అంగీకరించారు. ఈ విషయాన్ని జైళ్ల శాఖ డీజీ జితేందర్ ధృవీకరించారు. రాహుల్‌తో పాటు రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. శనివారం మధ్యాహ్నాం సమయంలో జైల్లో ఉన్న పద్దెనిమిది మంది ఎన్ఎస్యూఐ నేతలను ముగ్గురు కీలక నేతలు పరామర్శిస్తారు. ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి నిరాకరణ నేపథ్యంలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ నిరసనలు చేపట్టగా.. పోలీసులు వాళ్లందరినీ అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
రాహుల్ తెలంగాణ టూర్లో మరో షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టూర్‌కి మరో షాక్ తగిలింది. చంచల్‌గూడ జైల్లో ఉన్న ఎన్ఎస్యూఐ నేతలతో ములాఖత్ అయ్యేందుకు రాహుల్‌కు అనుమతి లభించలేదు. చంచల్‌గూడ జైలు సూపరిండెంట్ ఈ మేరకు రాహుల్‌గాంధీ ఎన్ఎస్ఐయూ నేతలతో ములాఖత్ అయ్యేందుకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ మీటింగ్‌కు వీసీ అనుమతి ఇవ్వని సంగతి ఇదివరకే తెలిసిందే. ఈ క్రమంలో.. కౌన్సిల్ నిర్ణయంపై వర్సిటీలో ఎన్ఎస్యూఐ నేతలు నిరసనకు దిగారు. దీంతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వీళ్లతో ములాఖత్ అయ్యేందుకు రాహుల్ గాంధీని అనుమతించాలంటూ కాంగ్రెస్ నేతలు వినతి పత్రం సమర్పించారు. అయినా అధికారులు అంగీకరించలేదు. మరోవైపు వరంగల్‌లో జరిగే రైతుల సంఘర్షణ సభకు హాజరుకానున్నారు రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఓరుగల్లుకు తరలిపోతున్నాయి. ఇంకోపక్క నల్లగొండ నుంచి అసంతృప్త నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈ సభకు డుమ్మా కొట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చదవండి: ఏ ముఖం పెట్టుకుని ఓయూ వెళతారు? -
జైలు వార్డర్‌పై ఉగ్రవాద ఖైదీల దాడి
-
జైలు వార్డర్‌పై ఉగ్రవాద ఖైదీల దాడి
సాక్షి, హైదరాబాద్ : చంచల్‌గూడ జైలులో వార్డర్‌పై ఐసిస్ ఉగ్రవాద ఖైదీలు శనివారం మధ్యాహ్నం దాడి చేశారు. మొహ్మద్ ఇబ్రహీం యజ్దానీ, ఇల్లియాస్ యజ్దానీ, మహ్మద్ అతాఉల్లాహ్ రహమాన్ అలియాస్ గౌస్‌లు ఈ దాడికి పాల్పడ్డారు. తమ బంధువులతో ములాఖత్ సమయంలో ఈ సంఘటన జరిగింది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఇతర నిందితులను కోర్టుకు హాజరుపరిచేందుకు వికెట్ గేటు(రెండో మెయిన్ గేటు)ను వార్డర్ భరత్‌కుమార్ తెరిచారు. ఆ సమయంలో ములాఖత్ కోరిన తమ వారి కోసం వేచి ఉన్న హై సెక్యూరిటీ కలిగిన ఈ ముగ్గురు ఖైదీలు ఇదే అదనుగా వార్డర్ను తోసుకుని మెయిన్ గేటు వైపు వెళ్లారు. బిగ్గరగా అరుస్తూ జైలు సిబ్బందిని, అధికారులను పరుష పదజాలంతో దూషించడమేగాక మరో వార్డర్ సంపత్‌ను కంటి దగ్గర గాయపరిచారు. ఇతర సిబ్బందికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై డబీర్‌పురా పోలీసు స్టేషన్లో జైలు సూపరింటెండెంట్ ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు.