తాడేపల్లి, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎల్లుండి(సెప్టెంబర్ 11న) గుంటూరు వెళ్లనున్నారు. గుంటూరు జైల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను జగన్ పరామర్శించనున్నారు. టీడీపీ కార్యాలయం దాడి కేసు తిరగదోడి మరీ.. చంద్రబాబు ప్రభుత్వం సురేష్‌పై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే.
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యథేచ్ఛగా వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తూ.. ఇష్టానుసారం కేసులను బనాయిస్తోంది. ఈ క్రమంలో చట్టాన్ని, న్యాయస్థానాలను కూడా ఉల్లంఘిస్తోంది. రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగానే.. నందిగం సురేష్‌ను కూడా అరెస్టు చేశారు. మంగళగిరి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.
ఇదీ చదవండి: వైఎస్సార్‌సీపీ కేడరే కూటమి టార్గెట్
మూడేళ్ల క్రితం(2021) నాటి సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్ర పదజాలంతో దూషణలు చేశారు. దీంతో మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ఘర్షణలకు సంబంధించిన కేసును అధికారంలోకి రాగానే.. చంద్రబాబు ప్రభుత్వం తిరిగి తెరిచింది.
ఉద్దేశపూర్వకంగా.. కొంతమంది దగ్గరి నుంచి సాక్ష్యం పేరుతో స్టేట్‌మెంట్లు తీసుకుంది. ఆపై కొందరు వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టింది. నేరం జరిగిన తర్వాత 60 –70 రోజులు దాటాక సాక్షిని విచారిస్తే చెల్లదు.. అని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ దాన్ని ఉల్లంఘించి మరీ నిందితుల జాబితాను పోలీసులు ఈ కేసులో సిద్ధం చేయడం గమనార్హం. ఈ కేసులో సురేష్ పేరును 80వ నిందితుడిగా చేర్చింది.
Comments
Please login to add a commentAdd a comment