
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టూర్‌కి మరో షాక్ తగిలింది. చంచల్‌గూడ జైల్లో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ నేతలతో ములాఖత్ అయ్యేందుకు రాహుల్‌కు అనుమతి లభించలేదు.
చంచల్‌గూడ జైలు సూపరిండెంట్ ఈ మేరకు రాహుల్‌గాంధీ ఎన్‌ఎస్‌ఐయూ నేతలతో ములాఖత్ అయ్యేందుకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ మీటింగ్‌కు వీసీ అనుమతి ఇవ్వని సంగతి ఇదివరకే తెలిసిందే. ఈ క్రమంలో.. కౌన్సిల్ నిర్ణయంపై వర్సిటీలో ఎన్ఎస్‌యూఐ నేతలు నిరసనకు దిగారు. దీంతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వీళ్లతో ములాఖత్ అయ్యేందుకు రాహుల్ గాంధీని అనుమతించాలంటూ కాంగ్రెస్ నేతలు వినతి పత్రం సమర్పించారు.
అయినా అధికారులు అంగీకరించలేదు. మరోవైపు వరంగల్‌లో జరిగే రైతుల సంఘర్షణ సభకు హాజరుకానున్నారు రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఓరుగల్లుకు తరలిపోతున్నాయి. ఇంకోపక్క నల్లగొండ నుంచి అసంతృప్త నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈ సభకు డుమ్మా కొట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
చదవండి: ఏ ముఖం పెట్టుకుని ఓయూ వెళతారు?
Comments
Please login to add a commentAdd a comment