Chanchalguda Central Prison
-
చంచల్‌గూడ జైలు నుంచి తిరుపతన్న విడుదల
సాక్షి,హైదారబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం మాజీ అడిషినల్ ఎస్పీ మేకల తిరుపతన్న చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ4గా ఉన్న తిరుపతన్నకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో పదినెలల తర్వాత తిరుపతన్న బెయిల్‌పై విడుదలయ్యారు. బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందించిన అనంతరం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. -
కటకటాల్లో అల్లు అర్జున్.. రేవంత్ సాధించిందేమిటి?
సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. సినిమా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అర్జున్ను అరెస్ట్ చేయడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి సాధించిందేమిటి? అన్నది మొట్టమొదటి ప్రశ్న. అలాగే.. దీని వెనుక ఉన్న కుట్ర ఏమిటి? ఈ అంశంపై సినీ రంగం తగు రీతిలో స్పందించిందా? ఈ ఘటనకు ఏపీ రాజకీయాలకు ఉన్న సంబంధాలేమిటి? పుష్ప2 విజయంతో కొందరిలో ఏర్పడ్డ ఈర్ష్య అసూయలే ఈ అరెస్ట్‌కు కారణమా? అల్లూ అర్జున్ ఎదుగుదలను ఎవరు సహించలేకపోతున్నారు? ఇలా.. బోలెడన్ని ప్రశ్నలపై రెండు రాష్ట్రాల్లోనూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. డిసెంబరు నాలుగున జరిగిన తొక్కిసలాట, శుక్రవారం అర్జున్ అరెస్ట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందన అంత అర్థవంతంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే సెలెబ్రిటీలు, సినీ నటులు ప్రజల్లోకి వెళ్లినప్పుడు తొక్కిసలాటలు జరుగుతూంటాయి. అయితే ఇందుకు వారే కారణమవుతారా? అభిమాన నటుడిని చూసే ప్రయత్నంలో ఎగబడే ప్రజలది తప్పు అవుతుందా? గుంపును కట్టడి చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయని థియేటర్ యాజమాన్యం బాధ్యత ఎంతవరకూ? సెలిబ్రిటీ రాక గురించి ముందస్తు సమాచారం ఇచ్చినా సీరియస్‌గా తీసుకోని పోలీసుల తప్పేమీ ఉండదా? ఆ మాటకు వస్తే గతంలో పలు రాజకీయ సభలలో, మతపరమైన ఉత్సవాలలోనూ తొక్కిసలాటలు జరిగాయి. ఆయా సందర్భాలలో రాజకీయ నేతలను, మతపరమైన పెద్దలను అరెస్టు చేశారా? అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. అర్జున్ను శుక్రవారం మధ్యాహ్నం అరెస్టు చేసిన తదుపరి కోర్టు రిమాండ్‌లో చంచల్‌గూడ జైలుకు తీసుకువెళ్లారు. హైకోర్టు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయినా అర్జున్ దాదాపు పన్నెండు గంటలసేపు చంచల్ గూడ జైలులోనే ఉండాల్సి వచ్చింది. శుక్రవారం అరెస్టు చేస్తే, శని, ఆదివారాలు సెలవు దినాలు కనుక అర్జున్‌కు బెయిల్ రాదన్న కుట్రతో ఇది జరిగిందని చాలామంది సందేహిస్తున్నారు. అయితే అర్జున్ లాయర్లు వెంటనే స్పందించి హైకోర్టును ఆశ్రయించి తగు ఉత్తర్వులు పొందినా జైలు అధికారులు సాంకేతిక కారణాలతో విడుదల లేట్ చేసినట్లు ఈ పరిణామం క్రమంపై మీడియా విశేషంగా వార్తలు ఇచ్చింది. యథాప్రకారం టీడీపీ మీడియా తన రాజకీయ కుయుక్తులను ప్రదర్శించింది. అర్జున్ను జైలు నుంచి అప్పుడే విడుదల చేయడం ఏమిటి? అన్న బాధ వారిలో ఉన్నట్లు కవరేజిని బట్టి అర్థమవుతుంది. ఈ అంశానికంటే ముందు రేవంత్ ఢిల్లీలో చేసిన వ్యాఖ్యల మీదే ఎక్కువగా అభ్యంతరాలు కనిపిస్తున్నాయి. సినిమా నటులు ఏమైనా సైనికులా?ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో యుద్దం చేసి వచ్చారా? అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే.. ‘‘సినిమా తీశారు..డబ్బులు సంపాదించుకుంటున్నారు’’ అని కూడా చెప్పారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యాపకం ఉంటుంది. సంపాదన అన్నది ప్రతి వ్యక్తి చేసేదే. అలాగే కొంతమంది సినీ రంగంలోకి వెళతారు. వారిలో కొద్దిమందే సఫలం అవుతుంటారు. ఇదీ చదవండి: సినీ నటులు సైనికులా?ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తించాల్సి ఉంటుంది. ప్రజల జీవితాలను ప్రభావితం చేసేవాటిలో సినిమా రంగం ముఖ్యమైంది. ఈ ప్రాముఖ్యతను గుర్తించే ఒకప్పుడు చెన్నైలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్ కు తరలించడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పలువురు కృషి చేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు వంటివారు సినీ పరిశ్రమ ఇక్కడ అభివృద్ది కావడానికి వీలుగా పలు రాయితీలు ఇచ్చారు. ప్రఖ్యాత నటులు అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీ రామారావు, కృష్ణ తదితర ప్రముఖులు సినీ స్టూడియోలు ఏర్పాటు చేయడానికి, నివాసానికి అవసరమైన స్థలాలు కేటాయించారు. ఫిలింనగర్ పేరుతో ఇప్పుడు వెలుగొందుతున్న ప్రాంతం అంతా అప్పుడు ప్లాన్ చేసినదే. ఆనాటి ప్రభుత్వాలు సినిమాను వ్యాపారంగానే చూసి ఉంటే, హైదరాబాద్‌కు సినీ రంగ పరంగా ఇప్పుడు ఇంత ప్రాధాన్యత వచ్చేదా? ఇన్ని వేల మంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న సంగతి రేవంత్ కు తెలియదా? 1985 ప్రాంతంలో అన్నపూర్ణ స్టూడియో వద్దకు వెళ్లడానికి సరైన దారే ఉండేది కాదు. అలాంటి ఇబ్బందులను ఎదుర్కుని నాగేశ్వరరావు దానిని అభివృద్ధి చేశారు. సినీ రంగంలో తిరుగులేని స్థాయిలో ఉన్న ఎన్టీఆర్ నాచారం వద్ద, అలాగే ముషీరాబాద్ లోను స్టూడియాలు ఏర్పాటు చేశారు. అమీర్ పేట వద్ద సారధి స్టూడియో ఏర్పాటైంది. ఆ తర్వాత పలు రికార్డింగ్ ధియేటర్లు వచ్చాయి. కోట్ల విజయభాస్కరరెడ్డి టైమ్ లో ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్.రెడ్డికి , మరి కొందరికి రికార్డింగ్ థియేటర్ల ఏర్పాటుకు బంజారాహిల్స్‌లో స్థలం ఇచ్చారు. అంతేకాదు. రామోజీఫిలిం సిటీకి కీలకమైన రహదారి కోసం అవసరమైన ఐదెకరాల స్థలాన్ని మరో పారిశ్రామిక వేత్త అయిన సంఘీ నుంచి కోట్ల ప్రభుత్వం వెనక్కి తీసుకుని మరీ ఇచ్చింది. కృష్ణ నగర్ ప్రాంతం జూనియర్ ఆర్టిస్టులకు కేంద్రంగా మారింది. ఖాజాగూడ వద్ద సినీ కార్మికులకోసం ప్రత్యేక కాలనీ చిత్రపురిని ఏర్పాటు చేశారు. ఆనాటి ప్రభుత్వాలు ఇవన్ని ఎందుకు చేశాయి? ఈ సంగతులు రేవంత్ రెడ్డికి తెలియవా? లేక ఆవేశంలో జరిగిన తప్పును సమర్థించుకోవడానికి సిని పరిశ్రమ వారిని ఉద్దేశించి డామేజింగ్ వ్యాఖ్యలు చేశారా? అన్న భావన కలుగుతుంది. ప్రముఖ నటుడు కృష్ణ ఆర్థిక కష్టాలలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వపరంగా సాయం చేశారు. అంతే కాదు. మంచి సినిమాలు తీసేవారి కోసం,ఉత్తమ నటీనటులకు ఉమ్మడి ఏపీలో నంది అవార్డులను ప్రవేశపెట్టారు. రేవంత్ ప్రభుత్వమే ప్రఖ్యాత గాయకుడు గద్దర్ పేరుతో తెలంగాణలో అవార్డులు ఇవ్వడానికి సంకల్పించింది. సినీ నటులను వ్యాపారులుగా చూస్తున్నట్లయితే ఈ అవార్డులు ఎందుకు ఇస్తున్నట్లు? అలాగే జాతీయ స్థాయిలో అవార్డులు ఇస్తారు.జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కూడా అల్లు అర్జున్ పొంది తెలుగు వారికి ఒక ఘనత తెచ్చిపెట్టారు. సినీ పరిశ్రమ ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధితో పాటు, ప్రభుత్వానికి కూడా గణనీయంగా ఆదాయం వస్తుంటుంది. ఉదాహరణకు పుష్ప2 సినిమా ద్వారా సుమారు రూ.300 కోట్ల పన్ను వచ్చిందట. అందువల్ల సినిమా పరిశ్రమను, హీరోలను తక్కువ చేసి మాట్లాడడం రేవంత్‌కు తగదని చెప్పాలి. ఇలాంటి వ్యాఖ్యలు ఆయన అనుభవ రాహిత్యాన్ని సూచిస్తాయన్న విమర్శ ఉంది. సినీ పరిశ్రమకే కాదు..ఇతర రంగాలకూ ప్రభుత్వాలు భూములు ఉచితంగా లేదా, తక్కువ ధరకు కేటాయిస్తాయి. రాయితీలు ఇస్తాయి. రేవంత్ సైతం ఇలాంటి ప్రోత్సహకాలతోనే పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడానికి డావోస్ వరకు వెళ్లి ప్రయత్నించారు. ఇప్పటికే అక్కినేని నాగార్జున ఎన్.కన్వెన్షన్ ను ఆకస్మికంగా కూల్చిన తీరు, నటి సమంతపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వానికి నష్టం చేశాయి. మెగాస్టార్ చిరంజీవిని ఇంకా కాంగ్రెస్ వ్యక్తిగానే రేవంత్ చెప్పడం చిత్రంగానే ఉంది. అలాగే అర్జున్ మామ చంద్రశేఖరరెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న మాట నిజమే కావచ్చు. కానీ ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని అర్జున్ విషయంలో జాగ్రత్తగా ఎందుకు అడుగులు వేయలేదు. అర్జున్ తదితరులు థియేటర్ వద్దకు వస్తున్నారని సంధ్యా ధియేటర్ యాజమాన్యం పోలీసులకు లేఖ రాసినా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అర్జున్ వెళ్లారని చెప్పడం సీఎం స్థాయి వ్యక్తికి తగునా?హోం మంత్రి బాధ్యతలు కూడా రేవంత్ చేతిలోనే ఉన్నాయి. ఆయనకు తెలియకుండా ఈ అరెస్టు జరిగే అవకాశమే లేదు. పోలీసులు తమ తప్పు కప్పి పుచ్చుకునేందుకు రేవంత్‌కు పూర్తి సమాచారం ఇవ్వలేదన్న భావన కలుగుతుంది. దీనివల్ల రేవంత్‌కే అప్రతిష్ట. శాఖమీద సరైన కంట్రోల్ లేదు అనిపిస్తుంది. రేవంత్ చర్యలు అభద్రతాభావంతో చేసినవని మాజీ మంత్రి కేటీఆర్, స్పెషల్షోలకు అనుమతిచ్చినందుకు రేవంత్‌నే అరెస్ట్ చేయాలని ఇంకో మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా రేవంత్ ప్రభుత్వం అర్జున్ను లక్ష్యంగా పెట్టుకని పనిచేసిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా అర్జున్ అరెస్ట్‌ను తప్పుపట్టారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే ఇందులో కుట్ర, అసూయలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఏపీలో చంద్రబాబు తప్పిదాల వల్ల పుష్కరాలలో 29 మంది, కందుకూరు సభలో ఎనిమిది మంది, గుంటూరులో టీడీసీ సభలో చీరల పంపిణీ కారణంగా నలుగురు మరణించారని, అయినా ఆయనపై కేసులు పెట్టలేదని అన్నారు. తెలంగాణలో అర్జున్‌కు సంబంధం లేకపోయినా తొక్కిసలాటలో ఒకరు మరణించారన్న అభియోగంపై అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. అర్జున్ అరెస్ట్ సమాచారం తెలిసిన వెంటనే చిరంజీవి, నాగబాబు తదితరులు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు. కానీ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం సరైన పద్ధతిలో స్పందించ లేకపోయారన్న విమర్శలు వచ్చాయి. ఎన్నికల సమయంలో నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్ధి రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా వెళ్లడమే అల్లు అర్జున్ చెసిన పెద్ద తప్పా? అని కొందరు ప్రశ్నించారు. ఈ కక్షతోనే టీడీపీ, జనసేన ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ ద్వారా ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చన్నది పలువురి డౌటుగా ఉంది. ఇందులో నిజం ఉండవచ్చు. లేకపోవచ్చు కానీ టీడీపీ, జనసేనలు అర్జున్ అరెస్టును ఖండించకపోవడంతో అనుమానాలు వస్తాయి. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రముఖులు కూడా ఒకరిద్దరు తప్ప ఈ ఘటనపై పెద్దగా స్పందించకుండా జాగ్రత్తపడ్డారు. వారిలో ఎక్కువ మంది రేవంత్ చేసిన వ్యాఖ్యలు, అర్జున్ అరెస్టు తీరుపై అంత సంతృప్తిగా లేకపోవచ్చు. మాజీ మంత్రి కేటీఆర్ పై ఈఫార్ములా రేసు నిధుల దుర్వినియోగం కేసు పెట్టడానికి గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయనను అరెస్టు చేయడానికి ముందు, తమ ప్రభుత్వం ఎవరినైనా అరెస్టు చేస్తుందని చెప్పడానికి ఏమైనా ట్రయల్ వేశారా? అన్నది మరో పాయింట్‌గా చెబుతున్నారు. పోలీసులు అర్జున్ను ముందు విచారణకు పిలిచి, తొక్కిసలాట ఘటనలో ఆయన ప్రమేయం ఏ మేరకు ఉంది.అందుకు ఆధారాలు ఏమిటి అన్న అంశాలపై దర్యాప్తు చేసి ఉండాల్సింది.అలా చేయకుండా శుక్రవారం నాడు నేరుగా ఇంటికి వెళ్లి అర్జున్ ను అదుపులోకి తీసుకోవడం లో కుట్ర కోణం ఉందన్నది చాలామంది భావన. పోలీసుల అరాచకాలపై ఏపీలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాము వెనుకబడి పోకూడదన్నట్లుగా తెలంగాణ పోలీసులు కూడా ఇలాంటి అనుచిత చర్యలకు దిగితే వారికే పరువు తక్కువ. అనేక మంది సినీ నటులు పలు కార్యక్రమాలకు అటెండ్ అవుతుంటారు. వస్త్రాల షాపుల ప్రారంభోత్సవాలకు హీరో, హీరోయిన్ లు హాజరవుతుంటారు. ఆయా రాజకీయ పార్టీలకు మద్దతుగా సభలలో పాల్గొంటుంటారు. ప్రభుత్వాలు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాయో తెలియని స్థితిలో ఇకపై వారు భయపడే అవకాశం ఉంటుంది. కానీ ప్రముఖులు నాని, రామ్ గోపాల్ వర్మ వంటి కొద్ది మంది తప్ప మిగిలిన సినీ పరిశ్రమ పెద్దలు ప్రభుత్వాన్ని తప్పు పట్టినట్లు లేదు. చంద్రబాబుతో ఉన్న సంబంధాల రీత్యా, ప్రభుత్వంతో గొడవపడడం ఎందుకు అన్న భయంతో వారు మాట్లాడడం లేదని కొందరు అంటున్నారు. పుష్ప2 సినిమా రికార్డు స్థాయిలో సుమారు రూ.1,500 కోట్ల మేర వసూళ్లు చేయడంపై కొంతమంది సినిమా వారిలో ఈర్ష్యం ఉండవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా మరో సంగతి చెబుతున్నారు. రేవంత్ స్వగ్రామంలో ఒక మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఒక లేఖ రాసి అందులో సీఎం సోదరులపై కొన్ని ఆరోపణలు చేశారు. దానిపై పోలీసులు కేసు పెట్టకుండా, ముందస్తు విచారణ చేసి, వారి తప్పు ఏమీ లేదని తేల్చేశారట. అదే రూల్ అల్లు అర్జున్‌కు వ్యర్తించదా అన్న ప్రశ్న వస్తుంది. ఏది ఏమైనా ఇప్పటికే హైడ్రా కూల్చివేతలు, మూసి గందరగోళంతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ దెబ్బ తిన్నదని అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం సినీ పరిశ్రమపై కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న భావన వస్తే రేవంత్ కు అది మరింత నష్టం చేస్తుంది.విశేషం ఏమిటంటే పార్లమెంటులో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తొలి ప్రసంగం చేసిన రోజున రేవంత్ ప్రభుత్వం ఇక్కడ అర్జున్ అరెస్టుకు పూనుకోవడంతో దేశవ్యాప్తంగా ఈ అంశానికే ప్రాధాన్యత వచ్చిందట. ఫలితంగా ప్రియాంక గాంధీ ఉపన్యాసం ఊసే ఎవరూ పట్టించుకోలేదట. దీనివల్ల కాంగ్రెస్ కు ఏమి లాభం వచ్చింది. రేవంత్ తనకు తానే స్టార్ అని అభివర్ణించుకోవడం తప్పు కాకపోవచ్చు. కాని జనం కూడా ఆయనను స్టార్ అనుకునేలా వ్యవహరించాలి. పాలన సాగించాలి. అలా చేస్తున్నానా? లేదా?అన్నది ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. -
ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. టాలీవుడ్ ప్రముఖుల సంఘీభావం (ఫొటోలు)
-
జైలు ముందు ఆత్మహత్యా యత్నం చేసిన అభిమాని
సంధ్య థియేటర్ దగ్గర మహిళా మృతి చెందిన కేసులో హీరో అల్లు అర్జున్‌ని హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ వచ్చినా సరే రాత్రంతా చంచల్‌గూడ జైలులోనే ఉంచారు. తమ అభిమాన హీరోని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని బన్నీ అభిమాని ఒకరు.. జైలు బయట వీరంగం సృష్టించాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. పోలీసులు సకాలంలో స్పందించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.(ఇదీ చదవండి:కావాలనే జైల్లో ఉంచారు.. పోలీసులపై కేసు పెడతాం: బన్నీ లాయర్)శుక్రవారం ఉదయం అరెస్ట్ అయిన అల్లు అర్జున్‌కి.. 4 వారాల మధ్యంతర బెయిల్ లభించింది. దీంతో శనివారం ఉదయం 6:45 చంచల్‌గూడ జైలు నుంచి బయటకొచ్చాడు. అక్కడి నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లాడు. కాసేపు అక్కడే ఉండి ఇంటికెళ్లాడు. అనంతరం మీడియాతో మాట్లాడాడు. కేసు కోర్టు పరిధిలో ఉందని, ప్రస్తుతం తానే మాట్లాడనని చెప్పాడు. తనకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు చెప్పాడు.తాను బాగానే ఉన్నానని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అల్లు అర్జున్ చెప్పాడు. మరణించిన రేవతి కుటుంబానికి నా సానుభూతి, అనుకోకుండా జరిగిన సంఘటన ఇదని, నిజంగా అలా జరగడం దురదృష్టకరమని పేర్కొన్నాడు. బన్నీ ఇంటికొచ్చేసిన నేపథ్యంలో సుకుమార్, నిర్మాతలు దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, హీరో విజయ్ దేవరకొండ తదితరులు వచ్చి పలకరించారు.(ఇదీ చదవండి: అరెస్ట్ వెనకున్నోళ్లు సర్వనాశనం అయిపోతారు: రైటర్ చిన్నికృష్ణ) -
హీరో అల్లు అర్జున్ విడుదల
-
అల్లు అర్జున్ రిలీజ్ పై ఉత్కంఠ
-
జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల
సాక్షి, హైదరాబాద్: చంచల్‌గూడ జైలు నుంచి నటుడు అల్లు అర్జున్ విడుదలయ్యారు. విడుదల సందర్బంగా సెక్యూరిటీ కారణాల రీత్యా.. అల్లు అర్జున్ వెనుక జైలు వేనుక గేటు నుంచి ఇంటికి వెళ్లిపోయారు. జైలు నుంచి అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడి నుంచి కాసేపట్లో తన ఇంటికి బయలుదేరనున్నారు. మరోవైపు.. అల్లు అర్జున్ ఇంటి వద్దకు సినీ ప్రముఖ్యులు, అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. విడుదల సమయంలో లాయర్లతో పాటుగా అల్లు అరవింద్ కూడా జైలుకు వెళ్లారు. దగ్గరుండి అల్లు అర్జున్ను తన వెంట తీసుకొచ్చారు. ఇక, శనివారం తెల్లవారుజామున అల్లు అర్జున్‌తో పాటుగా సంధ్యా థియేటర్ యాజమాన్యం సభ్యులు కూడా విడుదలయ్యారు. A1, A2తో పాటు A11.. ముగ్గురు బెయిల్‌పై విడుదలయ్యారు.Vachestunnadu 🥺🙏pic.twitter.com/GbSVWaXVT6— Allu Arjun Taruvate Evadina (@AATEofficial) December 14, 2024 అంతకుముందు జరిగింది ఇదీ..పుష్ప–2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలింపు, గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు, నాంపల్లి హైకోర్టులో వాదనలు, రిమాండ్ విధింపు, చంచల్‌గూడ జైలుకు తరలింపు అంతా నాటకీయ పరిణామాల మధ్య జరిగిపోయాయి. అదే సమయంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్, బెయిల్ పిటిషన్లపై వాదనలు, సాయంత్రమే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా.. రాత్రి వరకు కాపీ అందకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో అల్లు అర్జున్ను తరలించిన ప్రతిచోటా భారీగా పోటెత్తిన అభిమానులు, ప్రముఖుల రాకతో దాదాపు 12 గంటల పాటు హైడ్రామా కొనసాగింది. చివరికి అల్లు అర్జున్ శుక్రవారం రాత్రి జైలులోనే ఉండాల్సి వచ్చింది.రిమాండ్ ఖైదీ నంబర్ 7697తో.. అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా.. దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి కాకపోవడంతో ఆయన శుక్రవారం రాత్రి రిమాండ్ ఖైదీగా చంచల్‌గూడ జైల్లో ఉండాల్సి వచ్చింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా.. దానికి సంబంధించిన కాపీ రాత్రి వరకు కూడా ఆన్లైన్లో అప్లోడ్ కాలేదు. అల్లు అర్జున్ న్యాయవాదులు సరి్టఫైడ్ కాపీలను తీసుకువచ్చి జైలు అధికారులకు ఇచ్చినా.. ఒరిజినల్ పత్రాలు కావాలంటూ జైలు అధికారులు అంగీకరించలేదు.రాత్రి 10 గంటల వరకు అల్లు అర్జున్ను జైలు రిసెప్షన్లోనే ఉంచిన సిబ్బంది.. ఆపై మంజీరా బ్యారక్‌లోని క్లాస్–1 రూమ్‌కు తరలించారు. రిమాండ్ ఖైదీగా నంబర్ 7697ను కేటాయించారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ రాత్రి 10.30 గంటల వరకు చంచల్‌గూడ జైలు వద్దే ఉన్నారు. బెయిల్ కాపీ అందితే తన కుమారుడిని వెంట తీసుకువెళ్లాలని భావించారు. కానీ బాధగా ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకుని తన ఇంటికి వెళ్లిపోయారు. ఇక తమ అభిమాన హీరోకు బెయిల్ వచ్చినా విడుదల చేయకపోవడంపై అర్జున్ అభిమానులు జైలు వద్ద నిరసన తెలిపారు.ఎప్పుడేం జరిగిందీ..ఉదయం 11.45: అల్లు అర్జున్ ఇంట్లోకి పోలీసులు మధ్యాహ్నం 12: అరెస్టు చేస్తున్నట్టు అల్లు అర్జున్‌కు చెప్పిన పోలీసులు 12.20: జూబ్లీహిల్స్ నివాసం నుంచి చిక్కడపల్లికి తరలింపు 12.40: చిక్కడపల్లి ఠాణా వద్దకు వచ్చిన దిల్ రాజు, ఇతర ప్రముఖులు 1.00: చిక్కపడపల్లి ఠాణాకు అల్లు అర్జున్‌తో చేరుకున్న పోలీసులు 1.10: పోలీసుస్టేషన్ వద్దకు అల్లు శిరీష్, అరవింద్ 1.15: రిమాండ్ రిపోర్టు సిద్ధం చేసిన దర్యాప్తు అధికారి 2.00: వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్ తరలింపు 2.19: అల్లు అర్జున్‌కు వైద్య పరీక్షలు ప్రారంభించిన వైద్యులు 2.30: అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, ఆయన భార్య సురేఖ 2.45: అల్లు అర్జున్‌కు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి 3.10: నాంపల్లి కోర్టుకు చేరుకున్న అల్లు అర్జున్.. లాయర్ల వాదనలు 5.00: అల్లు అర్జున్‌కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధింపు 5.28: చంచల్‌గూడ జైలుకు అల్లు అర్జున్ తరలింపు 5.40: అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు 7.15: బెయిల్ పేపర్లతో చంచల్‌గూడ జైలుకు చేరుకున్న లాయర్లు 7.30: ఆ పత్రాలు సక్రమంగా లేకపోవడం, ఆర్డర్ ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడంతో జైల్లోనే బన్ని 10.00: జైలు రిసెప్షన్ నుంచి మంజీరా బ్యారక్‌కు అల్లు అర్జున్ -
బెయిల్‌పై భానుకిరణ్ విడుదల
చంచల్‌గూడ (హైదరాబాద్): హైదరాబాద్‌లో 2011 జరిగిన ఫ్యాక్షనిస్టు మద్దెలచెరువు సూరి అలియాస్ గంగుల సూర్యనారాయణరెడ్డి హత్య కేసు ప్రధాన నిందితుడు భానుకిరణ్ బుధవారం బెయిల్‌పై చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ హత్య కేసులో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం తెలిసిందే. చర్లపల్లి జైల్లో ఉన్న భానుని 2016లో చంచల్‌గూడ జైలుకు తరలించారు. బెయిల్‌పై విడుదలైన భానును.. అత్యంత పటిష్ట భద్రత మధ్య అతని అనుచరులు మరో చోటికి తరలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడేందుకు భాను నిరాకరించాడు. అతని అనుచరుడు మన్మోహన్ ఏడేళ్ల శిక్ష పూర్తి చేసుకుని 2018లో విడుదలయ్యాడు. -
జానీ భార్య అయేషా అరెస్ట్‌కు రంగం సిద్ధం?
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ బాషాకు కోర్టు 14రోజులు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో జానీ బాషాను చంచల్గూడా జైలుకు తరలించారు పోలీసులు. ఇక, జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.జానీ బాషా లైంగిక వేధింపులకు పాల్పడిన విషయంలో తన నేరాన్ని ఒప్పుకున్నట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. అలాగే, దురుద్దేశంతోనే ఆమెను తన అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడు. 2019 నుంచే జానీతో బాధితురాలికి పరిచయం ఉన్నట్లు రిపోర్ట్‌లో తెలిపారు. 2020లో ముంబైలోని ఒక హోటల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. లైంగిక దాడి జరిగిన సమయానికి ఆమె వయసు 16 ఏళ్లు మాత్రమే. వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి సుమారు నాలుగేళ్లు దాటుతుంది.షూటింగ్ సమయంలో కూడా వ్యాన్లోనే ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడు. అందుకు ఆమె నిరాకరిస్తే జుట్టు పట్టుకుని బాధితురాలి తలను అద్దానికేసి కొట్టాడు. మత మార్పిడి సైతం చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. ఈ విషయాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని బెదిరింపులకు దిగాడు. తనకున్న పలుకుబడి ఉపయోగించి ఆ యువతికి అవకాశాలు కూడా రాకుండా చేశాడు. జానీ మాస్టర్ భార్య కూడా ఆ యువతిని బెదిరించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ..మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బాధితురాలిని బలవంతం పెట్టాడు. ఒక రోజు జానీ మాస్టర్ బాధితురాలికి ఫోన్ చేసి షూటింగ్‌కు రావాలని సూచించాడు. దీంతో తన తల్లి ఇంట్లో లేదని, ఆరోగ్యం బాలేక ఇంట్లో ఉన్నానని తెలిపింది. దీన్ని ఆసరా చేసుకున్న నిందితుడు బాధితురాలి ఇంటికి వెళ్లి బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జానీ తన భార్య సుమలత అలియాస్ ఆయేషాతో కలిసి బాధితురాలికి ఇంటికి వెళ్లి ఆమెను భయభ్రాంతులకు గురి చేశాడు. చిత్ర పరిశ్రమలో జానీకి ఉన్న పరిచయాల కారణంగా బాధితురాలికి ఎక్కడా పని దొరకుండా ఇబ్బందులకు గురి చేశాడు.ఈ క్రమంలో బాధితురాలు ఇంట్లో లేని సమయం చూసి ఓ రోజు ఆమె ఇంటికి వెళ్లి బాధితురాలితో ఉన్న శారీరక సంబంధం గురించి ఆమె తల్లికి వెల్లడించాడు. ఇక, చిట్టచివరికి బాధితురాలు జానీ అసిస్టెంట్ మోయిన్‌కు ఈ విషయాలు తెలిపింది. అతని సూచన మేరకు బాధితురాలు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ (టీఎఫ్‌టీడీడీఏ) సంఘం అధ్యక్షుడికి ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న జానీ వెంటనే సంఘం డ్రైవర్ రాజేశ్వర్ రెడ్డిని తీసుకొని గోవాకు పరారయ్యాడు. కాగా, కోర్టు వద్ద జానీ మాస్టర్ భార్యను ఈ విషయమై ప్రశ్నించగా అంతా కోర్టులో తేలుతుందని సమాధానం ఇచ్చారు.ఇదిలా ఉండగా.. జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జానీ మాస్టర్ భార్య సుమలత(అలియాస్ ఆయేషా)పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్టు సమాచారం. బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించారన్న కారణంగా సుమలతపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: అభయ్ నోటిదురుసు వల్ల అందరికీ నష్టం.. అర్ధరాత్రి బిగ్‌బాస్ వార్నింగ్ -
రాధాకిషన్ రావును కరిచిన ‘పిల్లి’.. ఆస్పత్రికి తరలింపు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై.. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తెలంగాణ మాజీ టాస్కో ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును ‘పిల్లి’కరిచింది. దీంతో ఆయనకు తీవ్ర రక్తస్త్రావమైంది. సమాచారం అందుకున్న జైలు అధికారులు అత్యవసర చికిత్స కోసం రాధాకిషన్ రావును నారాయణ గూడ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
బిగ్‌బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్, అతని సోదరుడిని జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం రాత్రి అతని స్వగ్రామం గజ్వేల్‌లోని కొల్గూరులో అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు ప్రశాంత్‌ను ఏ-1గా, అతని సోదరుడు మనోహర్‌ను ఏ-2గా పేర్కొంటూ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన తర్వాత వీరిద్దరూ కూడా పరారీలో ఉన్నారు. పోలీసులు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడంతో లాయర్ ద్వారా వారిద్దరూ మళ్లీ ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. సీజన్- 6 కాంటెస్టెంట్ గీతూరాయల్ కారును కూడా ధ్వంసం చేశారు. ఆపై ఆమె కారులోకి చేతులు పెట్టి అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో గీతూ రాయల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినకపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దాంతో అల్లరిమూకలు రోడ్లపైకి పరుగులు తీస్తూ ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలను పగులగొట్టారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కేసు పెట్టడం జరిగింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్‌పై కేసు.. కారణం అన్నపూర్ణ స్టూడియో వద్ద గొడవ జరుగుతున్న సమయంలో బిగ్ బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్ బయటకు వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డగించి మరో గేటు నుంచి పంపారు. కానీ ఆ సమయానికే ప్రశాంత్‌ను ర్యాలీగా తీసుకెళ్లేందుకు అతని సోదరుడు మనోహర్ తన మిత్రుడు వినయ్ ద్వారా రెండు కార్లను అద్దెకు తెచ్చుకున్నారు. ఇది గమనించిన పోలీసులు ఇప్పటికే ఇక్కడ పరిస్థితి గొడవలతో నిండి ఉంది.. ఈ సమయంలో ర్యాలీ అంటే కష్టం.. బయటకు వెళ్లి ఎక్కడైన సభ పెట్టుకోండి అని చెప్పి.. ఆ కార్లను పక్కనపెట్టి పోలీసులు వేరే వాహనంలో ప్రశాంత్‌ను పంపించారు. అవన్నీ లెక్క చేయకుండా ప్రశాంత్ తన అభిమానుల మధ్య ర్యాలీ కోసం అద్దె కార్లతో తిరిగి అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలో పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ మళ్లీ జోక్యం చేసుకుని ప్రశాంత్‌ను రావొద్దని చెప్పినా.. ప్రశాంత్ వినిపించుకోలేదని ఆయన తెలిపారు. ప్రశాంత్‌ను అడ్డగించి పంపించేశారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫైర్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కార్లపై దాడితో పాటు రెండు పోలీసుల వాహనాలు ధ్వంసం అయ్యాయి. అంతటితో ఆగని అల్లరి మూకలు ఆరు ఆర్టీసీ బస్సు అద్దాలను పగలకొట్టారు. ప్రశాత్కు 14 రోజుల రిమాండ్ ప్రభుత్వ ఆస్థుల ధ్వంసం కేసులో జూబ్లీహిల్స్ ఎస్సై మెహర్ రాకేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్, మనోహర్, వినయ్‌తో పాటు అద్దె కార్లను నడిపిన డ్రైవర్లు సాయికిరణ్, రాజుపై కూడా కేసు నమోదు చేశారు. ఈనెల 19న డ్రైవర్లు సాయికిరణ్, రాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రశాంత్, అతని సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ప్రశాంత్, అతని సోదరుడు మనోహర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసులో దాదాపు ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ స్టేషన్లో వారిద్దరినీ విచారించి ఆపై రాత్రి సమయంలోనే జడ్జి ఇంట్లో పల్లవి ప్రశాంత్‌తో పాటు ఆయన సోదరుడిని పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. పల్లవి ప్రశాంత్‌తో పాటు సోదరుడు మనోహర్‌కు కూడా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అర్ధరాత్రి వారిద్దరినీ చల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు. పోలీసులు ముందే హెచ్చరించినా సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ.. ప్రభుత్వ ఆస్థులకు నష్టం కలిగేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని పోలీసులు తెలిపారు. ఫైనల్‌గా వారిద్దరిపై ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసును పోలీసులు నమోదుచేశారు. ఇదేం అభిమానం! బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/lJbSwAFa8Q — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 18, 2023 -
ఎంపీ అవినాష్ రెడ్డి తల్లిదండ్రులిద్దరికీ అస్వస్థత
సాక్షి కర్నూలు/ హైదరాబాద్: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో, వైఎస్ శ్రీలక్ష్మికి కర్నూలు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే, మెరుగైన వైద్య సేవల కోసం శ్రీలక్ష్మిని హైదరాబాద్‌లోని ఏఐజీ తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమెకు చికిత్స అందుతోంది. ఇక, ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఏఐజీ ఆసుపత్రిలోనే ఉన్నారు. మరోవైపు.. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, కోర్టు భాస్కర్ రెడ్డికి రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డికి శుక్రవారం బీపీ పెరగడంతో జైలు అధికారులు వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఉస్మానియా వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం భాస్కర్ రెడ్డిని రేపు నిమ్స్‌కు తరలించనున్నారు జైలు అధికారులు. ఇది కూడా చదవండి: మంచి చేసే ఉద్దేశం వాళ్లకు లేదు.. నారా చంద్రబాబును నమ్మొద్దు: సీఎం జగన్ -
ఎంత తొక్కాలని ప్రయత్నిస్తే అంత పైకి వస్తా: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: పోలీసులతో దురుసుగా వ్యవహరించారన్న కేసులో అరెస్ట్ అయిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తనను ఎంత తొక్కాలని ప్రయత్నిస్తే అంత పైకి వస్తానని పేర్కొన్నారు.ఎందుకు అకారణంగా తనను రోజుల తరబడి హౌజ్ అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. బోనులో పెట్టినా పులి..పులే.. నేను రాజశేఖర్‌రెడ్డి బిడ్డనని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అరాచకాలు ఇంక ఎంతకాలం సహించాలని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పోలీసులు బెదిరించారని.. తన ఆత్మరక్షణ కోసమే మగ పోలీసులను నెట్టివేసినట్లు పేర్కొన్నారు. ఎవరిమీద చేయి చేసుకోలేదని అన్నారు. పోలీసులు ఏ అధికారం ఉందని తనను హౌస్ అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో సిట్ ఆఫీస్‌కు సామాన్యుడికి పోయే పరిస్థితి లేదా? అని నిలదీశారు. ఇక్కడున్నది రాజశేఖర్‌రెడ్డి బిడ్డ.. భయపడటం తెలీదన్నారు. ‘రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటే కేసీఆర్ భయపడుతున్నారు. అందుకే నా మీద ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు. 9 ఏళ్లలో కేసీఆర్ ఏం సాధించారు. కేసీఆర్‌కు పరిపాలన చేతనైందా. అవినీతి చేయడం చేతనైంది. ప్రతిపక్షాల గొంతు నొక్కడం కేసీఆర్‌కు చేతనైంది. కేసీఆర్ ఎప్పుడైనా సెక్రటేరియట్‌కు వెళ్లారా? కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. కొడుకు రియల్ ఎస్టేట్, కుమార్తె లిక్కర్‌స్కాం, చేయడం సాధ్యమైంది. వేలకోట్ల అవినీతి సొమ్ము సంపాదించడమే తెలిసింది. తాలిబన్లలాగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఇది అప్ఘనిస్తాన్ అనకపోతే ఏమనాలి. వైఎస్సార్టీపీకి నాయకురాలు ఒక మహిళ అని పోలీసులకు తెలియదా? పోలీసులు నాపై పడి దాడి చేసే ప్రయత్నం చేశారు. మహిళ అన్న ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరించారు. నాపై మళ్లీ దాడి చేస్తారనే ఉద్ధేశంతోనే పోలీసులను తోసేశాను. పోలీసులు కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నన్ను చూడటానికి అమ్మ వస్తే అది తప్పా? అమ్మతో కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.’ అని షర్మిల పేర్కొన్నారు. చదవండి: తెలంగాణ సర్కార్ వినూత్న ఆలోచన.. చదువుకుంటూనే సంపాదన! -
TSPSC పేపర్ లీక్ కేసులో ఇద్దరికి ఈడీ కస్టడీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల లీక్ వ్యవహారంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. పేపర్ లీక్ కేసులో ఇద్దరు నిందితులను కస్టడీకి తీసుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి అనుమతి లభించింది. రెండు రోజులపాటు వాళ్లను కస్టడీకిలోకి తీసుకుని విచారించొచ్చని కోర్టు ఈడీ అధికారులకు తెలిపింది. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్‌లను ఈడీ ప్రశ్నించేందుకు అనుమతించింది నాంపల్లి కోర్టు. ఈ మేరకు ఈ నెల 17, 18 తేదీల్లో.. అదీ చంచల్‌గూడ జైల్లోనే ఇద్దరిని ప్రశ్నించాలని కోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ల వాంగ్మూలాలను నమోదు చేసేందుకు అనుమతించాలంటూ నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఈడీ. ఈ మేరకు జైల్లోనే నిందితులను విచారించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేలా జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరింది. ఆ విజ్ఞప్తికి కోర్టు అనుకూలంగా ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. -
చంచల్‌గూడ జైలుకు నిహారిక
సాక్షి, క్రైమ్: నవీన్ హత్య కేసులో మరో ఇద్దరు నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది న్యాయస్థానం. నవీన్ హత్య కేసులో పోలీసులు హాసన్, నిహారికలను అరెస్ట్ చేసి.. తాజా నిందితులుగా చేర్చి సోమవారం హయత్ నగర్ న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు పోలీసులు. ఈ కేసులో నిహారిక, హసన్‌లను ఏ2, ఏ3లుగా చేర్చారు. ఇక ఈ నిందితులిద్దరికీ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన హయత్ నగర్ కోర్టు. దీంతో న్యాయమూర్తి నివాసం నుంచి నేరుగా నిహారికను చంచల్‌గూడ జైలుకు, హసన్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. హాసన్ ఈ కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణకు స్నేహితుడు కాగా, నిహారిక గర్ల్‌ఫ్రెండ్. ప్రేమ వ్యవహారం కారణంగానే నవీన్ హత్య జరిగింది. గత నెల 17న జరిగిన నవీన్‌ను అతి కిరాతకంగా హరిహరకృష్ణ హత్య చేశాడు. ఈ హత్య గురించి నిహారికకు కూడా తెలుసని పోలీసులు వెల్లడించారు. అంతేకాదు.. హత్య జరిగిన తర్వాత.. ప్రియుడు హరిహరను గుడ్ బాయ్ అంటూ నిహారిక మెచ్చుకోవడం, ఆపై అవసరం ఉందని చెబితే రూ.1500 ట్రాన్స్ఫర్ కూడా చేసింది. నవీన్‌ను హత్య చేసిన ఘటనాస్థలానికి హరిహర, నిహారిక, హసన్ ముగ్గురు వెళ్లారని పోలీసులు తేల్చారు. మరోవైపు తన ఫోన్లోని సమాచారాన్ని తొలగించడం ద్వారా ఆధారాలను మాయం చేసేందుకు నిహారిక ప్రయత్నించిందని తెలుస్తోంది. -
చంచల్‌గూడ జైలు నుంచి మోహిత్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
-
డ్రగ్స్ కేసులో పోలీసుల కస్టడీకి మోహిత్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ఘరానా ఈవెంట్ల డీజే సప్లయర్, ప్రముఖ హీరోయిన్ నేహా దేశ్‌పాండే భర్త మోహిత్ అగర్వాల్ అలియాస్ మైరోన్ మోహిత్‌ను డ్రగ్స్ కేసులో తమ కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. మూడు రోజుల క్రితం నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ మోహిత్‌ను అరెస్ట్ చేసింది. తాజాగా చంచల్‌గూడ జైలు నుంచి మోహిత్‌ను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. డ్రగ్స్ వాడుతున్న ప్రముఖుల వివరాలు, ఎక్కడి నుంచి డ్రగ్స్ తెచ్చారనే కోణంలో పోలీసుల ప్రశ్నిచనున్నారు. గోవా కింగ్ పిన్ ఎడ్విన్‌తో మోహిత్‌కు గల సంబంధాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే అతడి కాల్ లిస్ట్, వాట్సప్ చాటింగ్‌లపైనా ప్రశ్నించనున్నారు. కాటాక్ట్ లిస్ట్‌లో మొత్తం 50 మందికిపైగా కంజూమర్స్ ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్, గోవా, ముంబైలో ఈవెంట్స్ నిర్వహించిన మోహిత్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలపై పోలీసులు విచారిస్తున్నారు. ఇదీ చదవండి: డీజే ముసుగులో డ్రగ్ పెడ్లింగ్.. సినీనటి నేహా దేశ్‌పాండే భర్త అరెస్ట్ -
నిందితులకు రిమాండ్
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో శనివారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసుల ఎదుట లొంగిపోవాల్సిందిగా ఈ కేసులో ముగ్గురు నిందితులు రామచంద్రభారతి అలియాస్ సతీశ్ శర్మ (ఏ–1), నందకుమార్ (ఏ–2), సింహయాజీ స్వామి (ఏ–3)లను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ వారు లొంగిపోని పక్షంలో పోలీసులు అరెస్టు చేయవచ్చని తెలిపింది. ఈ నెల 27వ తేదీన ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు ముగ్గుర్నీ అరెస్టు చేశారు. సరూర్‌నగర్‌లోని ఏసీబీ కోర్టు జడ్జి ఇంట్లో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించారు. దీంతో పోలీసులు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. క్రిమినల్ రివిజన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ.. ఈనెల 26న రాత్రి మొయినాబాద్ అజీజ్‌నగర్‌లోని ఫామ్‌హౌస్‌పై ఆకస్మిక దాడులు చేసిన పోలీసులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే భౌతికంగా నగదు పట్టుబడకపోవటంతో పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టును జడ్జి తిరస్కరించిన సంగతి తెలిసిందే. కాగా ఏసీబీ కోర్టు జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ సైబరాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్‌పై జస్టిస్ సీహెచ్ సుమలత విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్, నిందితుల తరఫున న్యాయమూర్తి ఇమ్మనేని రామారావు వాదనలు వినిపించారు. నిందితుల వెనుక పెద్దలెవరో నిగ్గు తేల్చాల్సి ఉంది: ఏజీ ‘ఎమ్మెల్యేలకు ఎర కేసులో పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే నిందితుల రిమాండ్ అవసరం. పోలీసులకు ముందుగా ఉన్న సమాచారం మేరకు ఫామ్‌హౌస్‌లో సీసీ కెమెరాలు, వాయిస్ రికార్డర్లు ఏర్పాటు చేశారు. నిందితులు వచ్చిన తర్వాత దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా వారిని అదుపులోకి తీసుకున్నారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ముగ్గురు నిందితులు ప్రయత్నాలు చేశారనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. నిందితులు దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉంది. కిందికోర్టు రిమాండ్‌కు తరలింపునకు ఉత్తర్వులు జారీ చేయకపోవడం చెల్లదు. నిందితులను రిమాండ్‌కు పంపేలా కింది కోర్టుకు ఉత్తర్వులు జారీ చేయాలి. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డ్లిను నిందితులు ప్రలోభపెట్టారనేందుకు అవసరమైన అన్ని సాక్ష్యాధారాలు పోలీసుల వద్ద ఉన్నాయి. నిందితుల ముగ్గురి వెనుక ఉన్న కీలక పెద్దలు ఎవరో నిగ్గు తేల్చాల్సి ఉంది. నిందితులను రిమాండ్‌కు తరలించకపోతే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉంది..’ అని ఏజీ నివేదించారు. సివిల్ పోలీసులకు దర్యాప్తు అధికారం లేదు.. రామారావు వాదనలు వినిపిస్తూ.. ‘ఘటనా స్థలంలో నగదు ఏమీ లభ్యం కాకున్నా, కావాలని కేసులో ఇరికించారు. సీఆర్పీసీలోని 41ఏ కింద నోటీసు ఇవ్వకుండా రిమాండ్‌కు పంపడం చట్ట వ్యతిరేకం. సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన తీర్పుల ప్రకారం 41ఏ కింద నోటీసులు ఇవ్వాల్సిందే. అసలు అవినీతి నిరోధక చట్ట ప్రకారం ఈ కేసు నమోదు, దర్యాప్తు చేసే అధికారం సివిల్ పోలీసులకు లేదు..’ అని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. నిందితులను లొంగిపోవాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులు లొంగిపోయినా, పోలీసులు అరెస్టు చేసినా జ్యుడీషియల్ రిమాండ్ కోసం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సీఆర్పీసీ సెక్షన్లు 50–ఏ, 51, 54,55, 56, 57లను పాటించాలని స్పష్టం చేశారు నందకుమార్ ఇంట్లో అరెస్టు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో షేక్‌పేటలోని ఆదిత్యా హిల్‌టాప్ అపార్ట్మెంట్లోని నందకుమార్ ఇంట్లో ముగ్గుర్నీ అరెస్టు చేసిన పోలీసులు.. సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఎదుట హాజరుపరిచారు. కాసేపటి తర్వాత మెయినాబాద్ ఠాణాకు తరలించి, మరోసారి వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ఇక్కడే రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు. నిందితులు ఇక్కడ ఉన్నంత వరకు పోలీసులు మీడియాతో పాటు ఎవరినీ లోపలికి రానివ్వలేదు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టెస్టుల తర్వాత తిరిగి మెయినాబాద్ పీఎస్‌కు తీసుకొచ్చారు. అనంతరం అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు తరలించారు. అయితే అప్పటికే కోర్టు సమయం ముగియడంతో సరూర్‌నగర్‌లోని జడ్జి ఇంట్లో హాజరుపరిచారు. నిందితుల ఆరోగ్యం దృష్ట్యా రిమాండ్‌కు అనుమతించొద్దని వారి తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన న్యాయమూర్తి, జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు అయ్యేందుకు వాహనం ఎక్కిన నిందితుల ఫొటోలు, వీడియోలు తీస్తున్న మీడియా ప్రతినిధులకు సింహయాజి చెయ్యి ఊపుతూ టాటా చెప్పారు. మునుగోడు ఎన్నికల తర్వాతే కస్టడీ.. కేసు తదుపరి దర్యాప్తును మునుగోడు ఎన్నికల తర్వాతే చేయాలని హైకోర్టు ఆదేశించడంతో, నిందితులను కస్టడీలోకి తీసుకోవాలని భావించిన సైబరాబాద్ పోలీసులకు బ్రేక్ పడినట్లయింది. నవంబర్ 4 తర్వాత కస్టడీ పిటిషన్‌ను సిద్ధం చేస్తామని, కస్టడీ విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇలావుండగా ఫామ్‌హౌస్ సమావేశంపై శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని డెక్కన్ కిచెన్ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించేందుకు నందకుమార్ ఏర్పాట్లు చేశారు. కానీ ఈలోగా హైకోర్టు అరెస్టు ఆదేశాలు ఇవ్వటంతో అది జరగలేదు. -
అంతా నిరుపేద కుటుంబాల వారే...
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసం కేసులో అరెస్టు అయిన 45 మంది నిందితుల్లో దాదాపు అంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారేనని జైలు అధికారులు చెప్తున్నారు. సోమవారం 28 మంది నిందితుల తల్లిదండ్రులు చంచల్‌గూడ జైలు వద్దకు వచ్చి ములాఖత్ ద్వారా తమ కుమారులను కలిశారు. నిందితుల్లో ఒకరు సింగరేణి ఉద్యోగి కుమారుడు కాగా, మరొకరు ఆర్టీసీ ఉద్యోగి కుమారుడని గుర్తించారు. ఈ ఇద్దరూ మినహా మిగిలిన 26 మంది నిందితులూ బెయిల్ కోసం న్యాయవాదుల ఖర్చులు కూడా భరించలేరని పేద కుటుంబాలకు చెందిన వారని అంటున్నారు. తమ కుమారులు ఇలాంటి ఆందోళన, విధ్వంసం చేయడానికి సికింద్రాబాద్ వెళ్తున్నట్లు తమకు చెప్పలేదని, కోచింగ్ కోసం వెళ్తున్నట్లు చెప్పారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. అమాయకులను అరెస్టు చేశారు శుక్రవారం గణేష్ ఎక్కడకు వెళ్లాడో మాకు తెలీదు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. రాత్రి 11 గంటలకు ఎస్సై ఫోన్ చేసి బాబు మా దగ్గర ఉన్నాడని, అతడి ఆధార్ నంబర్ పంపమని చెప్పారు. ఎక్కడ ఉన్నాడని అడిగితే సికింద్రాబాద్ కేసులో పట్టుకున్నామన్నారు. మా బాబు రైల్వేస్టేషన్ గోడ అవతలే ఉన్నాడు. అయినప్పటికీ పోలీసులు పట్టుకున్నారు. అసలు నిందితులు దొరక్కపోవడంతో వాళ్ల ఉద్యోగాల కోసం పోలీసులు అమాయకుల్ని అరెస్టు చేశారు. ములాఖత్‌లో కలిసినప్పుడు మా అబ్బా యి ఇదే చెప్తున్నాడు. మేము స్టేషన్లోకి వెళ్లలేదు... స్టేషన్ గోడ అవతలే పట్టుకుని అరెస్టు చేశారని ఏడుస్తున్నాడు. – అంజయ్య కసారాం, నిందితుడు గణేష్ తండ్రి, సంగారెడ్డి జిల్లా లాయర్ని మాట్లాడుకోవడానికి డబ్బుల్లేవ్ మా పిల్లలు చేయని నేరానికి జైలు పాలయ్యారు. లాయర్ని మాట్లాడుకోవడానికీ డబ్బులు లేవు. దయచేసి మా పిల్లల్ని బెయిల్ మీద బయటకు తీసుకురావాలని చేతులెత్తి మొక్కుతున్నా. మా పిల్లలను కాపాడాలని కేసీఆర్, కేటీఆర్‌లకు విన్నవించుకుంటున్నా. ఇప్పటికే జైలు పాలైన వారి జీవితం నాశనమైంది. మహేందర్ అరెస్టు విషయం తెలిసి మూడు రోజుల క్రితం ఊరి నుంచి రూ.2 వేలు తెచ్చా. ఇప్పుడు ఖర్చులకూ డబ్బుల్లేవు. దీంతో బస్టాండులో పడుకుంటున్నా. ఆర్మీలో చేరాలనేది మా వాడి ఐదేళ్ల కల. ఇప్పుడు అది కలగానే మిగిలిపోయింది. విద్యార్థుల వల్లే వచ్చిన తెలంగాణలో వాళ్లే జైలు పాలవుతారని అనుకోలేదు. మా పిల్లలు ఆర్మీ అధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చామని చెప్తున్నారు. – సాయప్ప, నిందితుడు మహేందర్ మామ, రాంపూర్ గ్రామం, తాండూరు -
తమ పిల్లలకు ఏ పాపం తెలియదంటూ కన్నీరుమున్నిరు
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన: మా పిల్లలకు ఏ పాపం తెలియదు..!
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానని వ్యతిరేకిస్తూ భారీ ఆందోళన చేపట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంస సృష్టించిన కేసులో 46 మంది చంచల్గూడా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. వీరిని కలిసేందుకు తల్లి, దండ్రులు జైలు వద్దకు వచ్చారు. సోమవారం ఉదయం చంచల్‌గూడ జైలుకు చేరుకున్న నిందితుల తల్లిదండ్రులు.. తమ పిల్లలతో ములాఖత్‌లో కలవడానికి వచ్చారు. నిందితులుగా జైలులో ఉన్న తమ పిల్లలకు ఏమౌతుందోననే ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలకు ఏ పాపం తెలియదని జైలు సిబ్బంది వద్ద కన్నీరుమున్నీరు అవుతున్నారు. కాగా, అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ అభ్యర్థులు నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా యువత తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతూ నిర్వహించిన ఆందోళనలు విధ్వంసాన్ని సృష్టించాయి. నిరసనకారుల దాడులతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ భీతావహంగా మారింది. ఈ హింసాత్మక నిరసనల్లో రూ. ఏడు కోట్లకుపైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. -
ఎట్టకేలకు ములాఖత్‌కు రాహుల్ గాంధీకి అనుమతి
సాక్షి, హైదరాబాద్: చంచల్‌గూడ జైల్లో ఉన్న ఎన్ఎస్యూఐ నేతలను పరామర్శించేందుకు ఎట్టకేలకు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి అనుమతి దొరికింది. ములాఖత్‌కు అనుమతించాలని మరోసారి విజ్క్షప్తి చేయండంతో అధికారులు అంగీకరించారు. ఈ విషయాన్ని జైళ్ల శాఖ డీజీ జితేందర్ ధృవీకరించారు. రాహుల్‌తో పాటు రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. శనివారం మధ్యాహ్నాం సమయంలో జైల్లో ఉన్న పద్దెనిమిది మంది ఎన్ఎస్యూఐ నేతలను ముగ్గురు కీలక నేతలు పరామర్శిస్తారు. ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి నిరాకరణ నేపథ్యంలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ నిరసనలు చేపట్టగా.. పోలీసులు వాళ్లందరినీ అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
రాహుల్ తెలంగాణ టూర్లో మరో షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టూర్‌కి మరో షాక్ తగిలింది. చంచల్‌గూడ జైల్లో ఉన్న ఎన్ఎస్యూఐ నేతలతో ములాఖత్ అయ్యేందుకు రాహుల్‌కు అనుమతి లభించలేదు. చంచల్‌గూడ జైలు సూపరిండెంట్ ఈ మేరకు రాహుల్‌గాంధీ ఎన్ఎస్ఐయూ నేతలతో ములాఖత్ అయ్యేందుకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ మీటింగ్‌కు వీసీ అనుమతి ఇవ్వని సంగతి ఇదివరకే తెలిసిందే. ఈ క్రమంలో.. కౌన్సిల్ నిర్ణయంపై వర్సిటీలో ఎన్ఎస్యూఐ నేతలు నిరసనకు దిగారు. దీంతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వీళ్లతో ములాఖత్ అయ్యేందుకు రాహుల్ గాంధీని అనుమతించాలంటూ కాంగ్రెస్ నేతలు వినతి పత్రం సమర్పించారు. అయినా అధికారులు అంగీకరించలేదు. మరోవైపు వరంగల్‌లో జరిగే రైతుల సంఘర్షణ సభకు హాజరుకానున్నారు రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఓరుగల్లుకు తరలిపోతున్నాయి. ఇంకోపక్క నల్లగొండ నుంచి అసంతృప్త నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈ సభకు డుమ్మా కొట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చదవండి: ఏ ముఖం పెట్టుకుని ఓయూ వెళతారు? -
శిల్పా చౌదరికి బెయిల్.. చంచల్‌గూడ జైలు నుంచి విడుదల
సాక్షి, మణికొండ: సంపన్న మహిళలను కిట్టీ పార్టీలకు పిలిచి, అధిక వడ్డీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం అని వారిని నమ్మించి కోట్లు దండుకున్న శిల్పాచౌదరికి ఎట్టకేలకు రాజేంద్రనగర్ కోర్టు గురువారం బెయిలు మంజూరు చేసింది. ఆమెపై ఉన్న 3 కేసులలోను బెయిలు మంజూరవడంతో శుక్రవారం విడుదలయ్యారు. శిల్పాచౌదరికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 10వేల రూపాయల చొప్పున ష్యూర్టీలు సమర్పించాలని చెప్పింది. సమాచారం లేకుండా విదేశీ ప్రయాణం చేయొద్దని .. నిబంధన విధించింది. ఎవరితోనూ ఫోన్లో కానీ, డైరెక్ట్‌గా కానీ, కేసు విషయం మాట్లాడకూడదని సాక్షులను బెదిరించరాదని కోర్టు ఆదేశించింది. అలాగే ప్రతీ శనివారం నార్సింగ్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని తెలిపింది. కాగా గతనెల 13న ఆమెపై దివ్యారెడ్డి అనే మహిళ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయగా 25వ తేదీన శిల్పను అరెస్టు చేసి 26న రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. విచారణ నిమిత్తం 3 సార్లు కస్టడీకి తీసుకుని విచారించినా మహిళల నుంచి తీసుకున్న డబ్బును ఏం చేసిందో మాత్రం నోరు విప్పలేదు. కొందరు మహిళలకు డబ్బు ఇచ్చానని, ఓ ఆసుపత్రి నిర్మాణంలో పెట్టుబడి పెట్టానని, హయత్‌నగర్‌లో ఓ ప్లాటు, గండిపేటలో ఓ విల్లా ఉందని వాటిని అమ్మి తనపై ఫిర్యాదులు చేసిన వారికి డబ్బు తిరిగి ఇచ్చేస్తానని విచారణల్లో పేర్కొంది. చదవండి: పోలీసుల విచారణ.. మౌనమే శిల్పా సమాధానం? -
శిల్పా చౌదరికి రూ.11కోట్లు ఇచ్చిన ఆ బాధితురాలెవరు..?
సాక్షి, హైదరాబాద్: తన పేరు మీద గండిపేటలోని సిగ్నేచర్ విల్లాస్‌లో విల్లా నంబర్–17 మాత్రమే ఉందని కిట్టీ పార్టీలతో సంపన్న వర్గాల మహిళల నుంచి రూ. కోట్లు వసూలు చేసిన తెల్ల శిల్పా చౌదరి పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. పెట్టుబడులు, అధిక వడ్డీల రూపంలో పలువురు బాధితుల నుంచి వసూలు చేసిన సొమ్మును మరో మహిళకు ఇచ్చానని, ఆమె మోసం చేయడంతోనే ఈ ఇబ్బందులు మొదలయ్యాయని తెలిపినట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. నగదు తీసుకున్న మహిళ కూడా ఈవెంట్ మేనేజ్మెంట్లతో పాటు స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నారని చెప్పినట్టు సమాచారం. చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..) శిల్ప, ఆమె భర్త కృష్ణ శ్రీనివాస్ ప్రసాద్‌ల స్థిర, చరాస్తులపై విచారణాధికారులు, నార్సింగి స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటీ) పోలీసులు రెండ్రోజులు ఆరా తీసినట్టు తెలిసింది. వందల సంఖ్యలో బాధితుల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయలతో బినామీ పేర్లతో స్థలాలు కొని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎక్కడెక్కడ కొన్నారు.. ఆస్తులు ఎవరి పేర్ల మీదు ఉన్నాయో తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. శిల్ప కస్టడీ శనివారం మధ్యాహ్నంతో ముగియడంతో ఆమెను తిరిగి చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. రూ.11 కోట్లు ఇచ్చిందెవరు? దివానోస్ పేరిట క్లబ్ ఏర్పాటు చేసిన శిల్ప.. హై ప్రొఫైల్ సెలబ్రిటీలతో నెలలో రెండు సార్లు కిట్టీ పార్టీలు నిర్వహించేది. తనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని, పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు ఇస్తానని ఆశ చూపి ఒక్కొక్కరి నుంచి రూ. కోటి నుంచి రూ. 5 కోట్ల వరకు వసూలు చేసింది. అయితే ఒక్క బాధితురాలు మాత్రం రూ.11 కోట్లు ఇచ్చినట్టు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఆమె ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదన్నారు. చదవండి: (భార్యను భరించలేను.. విడాకులు కావాల్సిందే: సాఫ్ట్వేర్ ఇంజనీర్) బాధితులు వేలల్లో.. ఫిర్యాదులు మూడే! శిల్పా చౌదరి కాల్ డేటా ఆధారంగా ఆమె బాధితుల సంఖ్య వేలల్లోనే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ముగ్గురు మహిళా బాధితులే నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పుప్పాలగూడలోని మహిళ వ్యాపారవేత్త దివ్యారెడ్డి (రూ.1.05 కోట్లు) ఫిర్యాదుతో శిల్ప బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత సూపర్‌స్టార్ కృష్ణ కూతురు ప్రియదర్శిణి (రూ.2.9 కోట్లు) ఫిర్యాదు చేసింది. మూడో బాధితురాలు నార్సింగికి చెందిన వ్యాపారవేత్త రోహిణి (రూ.3.1 కోట్లు) కేసు నమోదు చేసింది. వీళ్ల ముగ్గురు శిల్పకు ఇచ్చిన సొమ్ము రూ.7.05 కోట్లు. శిల్ప చెప్పేదంతా అవాస్తవం తాను వసూలు చేసిన మొత్తంలో రూ.6 కోట్లు జన్వాడకు చెందిన టంగుటూరి రాధికా రెడ్డికి ఇచ్చానని పోలీసులకు శిల్ప చెప్పినట్టు తెలిసింది. ఆమెను పోలీసులు విచారిచంగా శిల్ప చెప్పేదంతా అవాస్తవమని, ఆమెనే తన దగ్గర డబ్బులు తీసుకుందని రాధిక ఆరోపించింది. శిల్ప ఇచ్చిన చెక్కులు, ఇతర పత్రాలను పోలీసులకు సమర్పించినట్లు సమాచారం. -
శిల్పా చౌదరి కేసు: ఆ డబ్బంతా బ్లాక్‌ను వైట్ చేసేందుకే ఇచ్చారా?
మణికొండ: కిట్టీ పార్టీల పేరుతో సంపన్న మహిళలను పరిచయం చేసుకొని వారి నుంచి భారీగా డబ్బు గుంజిన శిల్పా చౌదరిని పోలీసులు శుక్రవారం ప్రశ్నించారు. ఆమెను 2 రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు ఉప్పర్‌పల్లి కోర్టు అనుమతించడంతో శుక్రవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి నార్సింగి స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటీ) శిల్పాచౌదరిని పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చింది. తొలుత విచారణలో ఆమె పెద్దగా సహకరించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. విచారణాధికారులు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలిసింది. అయితే ఆమె ఫోన్ కాల్‌డాటా, వాట్సాప్ చాటింగ్‌లు, బ్యాంక్ స్టేట్మెంట్లపై ప్రశ్నించడంతో విలపించినట్లు సమాచారం. చాలా మంది బ్లాక్‌మనీని వైట్ చేసేందుకు పెట్టుబడి రూపంలో ఇచ్చారని, మరికొందరు అధిక వడ్డీకి ఆశపడి అప్పుగా ఇచ్చారని పోలీసులకు వివరించినట్లు సమాచారం. బాధితుల నుంచి సేకరించిన డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టినది, ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో సమాధానం దాటవేసినట్లు తెలిసింది. సంపన్నుల డబ్బును ఎగ్గొట్టే ఎత్తుగడను శిల్పాచౌదరి అమలు చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకొచ్చారు. శనివారం కూడా ఆమె విచారణ సాగనుంది. -
చంచల్ గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తీన్మార్ మల్లన్న
సాక్షి, హైదరాబాద్: ‘క్యూ న్యూస్’ ఛానల్ అధినేత, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌కు సోమవారం తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంచల్ గూడ జైలు నుంచి తీన్మార్ మల్లన్న బెయిల్‌పై విడుదలయ్యారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని తనను బెదిరించాడని ఓ జ్యోతిష్యుడు కొద్ది రోజుల క్రితం చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో క్యూ న్యూస్ కార్యాలయంలో సైబర్ క్రైం పోలీసులు సోదాలు జరిపారు. కొన్ని హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. చదవండి: Q News Mallanna: తీన్మార్ మల్లన్నపై ఇన్ని కేసులా? బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్నను ఆగష్టులో పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరిపారు. కాగా తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు 38 కేసులు నమోదు అయ్యియి. అందులో 6 కేసులను హైకోర్టు కొట్టివేయగా.. మిగతా 32 కేసుల్లో 31 కేసులకు ఇదివరకే బెయిల్ మంజూరైంది. అయితే పెండింగ్‌లో ఉన్న చిలకలగూడ కేసులో తాజాగా హైకోర్టు బెయిల్ ఇచ్చింది. తీన్మార్ మల్లన్న రెండు నెలలకు పైగా జైల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే బెయిల్ కోసం తీన్మార్ మల్లన్న దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం సోమవారం బెయిల్ మంజూరు చేసింది. -
నాగశౌర్య ఫామ్‌హౌస్ కేసు: కస్టడీలోకి ప్రధాన నిందితుడు
హైదరాబాద్: హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్ పేకాట కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న గుత్తా సుమన్‌ను నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్యపరీక్షలు జరిపిన తర్వాత.. నిందితుడు సుమన్ చౌదరిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. పేకాట, క్యాసినో ఇతర కేసుల వివరాలపై ఆరాతీస్తున్నారు. కాగా, ఫామ్ హౌజ్దేని కోసం తీసుకున్నారు..? ఎవరెవరి పాత్ర ఉంది..? అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడి నుంచి కీలక సమాచారం రాబట్టనున్నట్లు తెలుస్తోంది. చదవండి: నాగశౌర్య ఫామ్‌హౌజ్ కేసు: బర్త్‌డే పార్టీ ముసుగులో పేకాట -
తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్
సాక్షి, హైదరాబాద్: క్యూ నూస్ చానెల్ వ్యవస్థాపకుడు తీన్మార్ మల్లన్నకు సికింద్రాబాద్ కోర్టు శనివారం 14 రోజుల రిమాండ్ విధించింది. సికింద్రాబాద్ మధురానగర్ కాలనీలోని మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు సన్నిధానం లక్ష్మీకాంతశర్మ.. తీన్మార్ మల్లన్న తనపై బెదిరింపులకు పాల్పడడ్డాడంటూ ఫిర్యాదు చేయడంతో శుక్రవారం రాత్రి( ఆగస్టు 27న) మల్లన్నను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా శనివారం మల్లన్నను సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు విచారణలో భాగంగా తీన్మార్ మల్లన్నపై ఐపీసీ సెక్షన్ 306,సెక్షన్ 511 కింద కేసులు పెట్టడంపై అతని తరపు న్యాయవాది ఉమేశ్ చంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫిర్యాదిదారుడు ఎలాంటి సూసైడ్ అటెంప్ట్ చేయలేదని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగా ఏడు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని చిలకలగూడ పోలీసులు కోర్టును అడిగింది. ఈ అంశాలన్నింటిని పరిశీలిస్తామని తెలిపిన కోర్టు మల్లన్నకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం మల్లన్నను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇక తీన్మార్ మల్లన్న తరపు న్యాయవాది ఉమేశ్ చంద్ర బెయిల్ పిటీషన్ దాఖలు చేయనున్నారు. ఇక మల్లన్న కేసు విషయానికి వస్తే.. సికింద్రాబాద్ మధురానగర్ కాలనీలోని మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు సన్నిధానం లక్ష్మీకాంతశర్మ తీన్మార్ మల్లన్న తనపై బెదిరింపులకు పాల్పడడ్డాడంటూ ఏప్రిల్ 22న చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్నోఏళ్లుగా తాను జ్యోతిషాలయం నిర్వహిస్తున్నానని.. కానీ ఇటీవల కొందరు వ్యక్తులు నకిలీ భక్తులను పంపి తనను ఇబ్బంది పెడ్తున్నారని, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు . అతని ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు మల్లన్నకు రెండుసార్లు నోటీసులు అందించారు. అయితే నోటీసులపై మల్లన్న నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. చదవండి: తీన్మార్ మల్లన్నను అరెస్టు చేసిన పోలీసులు..! ఓటుకు కోట్లు కేసు: రేవంత్ రెడ్డికి సమన్లు -
సీబీఐ ఎదుట బొల్లినేని మౌనవ్రతం
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ ఇటీవల అరెస్టు చేసిన మాజీ సీజీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీ సీబీఐకి సహకరించడం లేదు. మే 1 నుంచి 4 వరకు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఇటీవల కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో సోమవారం కూడా బొల్లినేనిని అధికారులు చంచల్‌గూడ జైలు నుంచి కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఎన్ని విధాలా ప్రశ్నించినా.. తనకు అనారోగ్యం ఉందని సమాధానాలు దాటవేసినట్లు సమాచారం. అదే విధంగా రెండు రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టిన విధానం, వాటి డాక్యుమెంట్లు ముందు పెట్టి ప్రశ్నలు సంధించినా నోరు తెరవలేదని తెలిసింది. చివరి రోజు అయిన మంగళవారం కస్టడీ ముగియనుంది. ఆఖరు రోజైనా సమాధానాలు రాబట్టాలన్న పట్టుదలతో ఉన్నారు సీబీఐ అధికారులు. విచారణ అనంతరం బొల్లినేని తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. చదవండి: బొల్లినేని అక్రమాలు ఇన్నిన్ని కాదయా! -
నోరు మెదపని బొల్లినేని శ్రీనివాసగాంధీ
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ అరెస్టు చేసిన మాజీ సీజీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీ నోరు విప్పలేదని సమాచారం. మే 1 నుంచి 4వ తేదీ వర కు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి సీబీఐ కార్యాలయానికి బొల్లినేనిని తీసుకొచ్చారు. కరోనా నేపథ్యంలో పీపీఈ కిట్లు వేసి విచారణకు తీసుకురావడం గమనార్హం. ఈ సందర్భంగా తొలిరోజు విచారణలో సీబీఐ అధికారులకు గాంధీ ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 2019 జూలైలో బొల్లినేనిపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని ఎన్నిసార్లు ఆదేశించినా సహకరించకపోవడంతో నాటకీయ పరిణామాల మధ్య ఏప్రిల్ 20న ఆయన్ని సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఆ రోజు కూడా అనేక అనారోగ్య కారణాలు చూపి అరెస్టు తప్పించుకుందామనుకున్న గాంధీని సీబీఐ ఎట్టకేలకు అరెస్టు చేసింది. శనివారం సీబీఐ అధికారుల ప్రశ్నలకు బొల్లినేని ఎలాంటి సమాధానాలు చెప్పలేదని సమాచారం. గతంలో ఇలాంటి కేసులు ఎన్నో విచారించిన బొల్లినేని ప్రస్తుతం తానే ముద్దాయి కావడంతో కావాలనే సమాధానం చెప్పడం లేదని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. చదవండి: బొల్లినేని అక్రమాలు ఇన్నిన్ని కాదయా! -
జైలు నుంచి విడుదలైన అఖిల ప్రియ
సాక్షి, హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలైన భూమా అఖిలప్రియ జైలు నుంచి విడుదలయ్యారు. కిడ్నాప్ కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉంటున్న ఆమెకు బెయిల్ లంభించడంతో శనివారం బయటకు వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఆమె 18 రోజులుగా జైలులోనే ఉంటున్న విషయం తెలిసిందే. బెయిల్ కోసం విఫల ప్రయత్నాలు చేసినప్పటికీ కోర్టుల్లో అనేక సార్లు నిరాశే ఎదురైంది. ఈ క్రమంలోనే అఖిలప్రియకు బెయిల్ మంజూరు కావడంతో బెయిల్ ఆర్డర్ కాపీలను ఆమె తరుఫు న్యాయవాదులు జైలుకు తీసుకువచ్చారు. అఖిలప్రియకు శుక్రవారం సెసెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తుతో ఇద్దరు షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అఖిల ప్రియ విడుదలతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. (మంత్రిగా ఉన్నప్పటి నుంచే ‘మ్యాన్‌పవర్’!) మరోవైపు అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో 19 మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హఫీజ్‌పేట భూవివాదం నేపథ్యంలో జరిగిన ఈ కిడ్నాప్ కేసులో ముఖ్య నిందితులు అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, అనుచరుడు గుంటూరు శ్రీను, భార్గవ్‌రామ్ తల్లిదండ్రులతో సహా మరో 9 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
జైలు వంటలు లేనట్లేనా..?
సాక్షి, చంచల్‌గూడ: తెలంగాణ జైళ్ల శాఖ చంచల్‌గూడలో రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన మై నేషన్ పేరుతో ప్రారంభించిన ఫుడ్‌కోర్టు మూతపడింది. వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు వంటకాల తయారీలో ప్రత్యేక శిక్షణ ఇప్పించి ఈ కేంద్రంలో నియమించారు. ప్రజలకు రుచికరమైన భోజనం అందించారు. మీల్స్, టిఫిన్స్‌తో పాటు చికెన్ బిర్యానీ విక్రయించారు. బహిరంగ మార్కెట్లో చికెన్ బిర్యానీ రూ.180 నుంచి రూ.220 వరకు లభించగా.. ఈ ఔట్లెట్లో కేవలం రూ.90లకే విక్రయించేవారు. ధర తక్కువగా ఉండటంతో ఈ మార్గంలో వెళ్లేవారు బిర్యానీ రుచి చూసి వెళ్లేవారు. లాక్డౌన్ కారణంగా మార్చి నుంచి మూతపడింది. సిటీ మార్కెట్లోకి ఎపిస్ కుంకుమ పువ్వు చలికాలంలో కేసర్ లేదా కుంకుమపువ్వు వినియోగం పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఎఫ్‌ఎమ్‌జీజీ బ్రాండ్.. ‘ఎపిస్’ సాఫ్రాన్(కుంకుమ పువ్వు)ని సిటీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కుంకుమ పువ్వుని విభిన్న రూపాల్లో వినియోగించడం ద్వారా సాధారణ దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలుగుతుందని భారతీయ వైద్య విధానం చెబుతోందని వీరు వివరించారు. నగరంలోని హైపర్ స్టోర్స్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ప్లాట్‌ఫామ్స్ మీద వన్ గ్రామ్ ఎపిస్ సాఫ్రాన్ ప్యాక్‌ని అందుబాటులోకి తెచ్చామన్నారు. -
ఎమ్మార్వో ఆత్మహత్య; ముందు రోజు ఏం జరిగింది?
అవినీతి అక్రమాస్తుల కేసులో పట్టుబడిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భూ వివాదంలో భారీగా లంచం తీసుకుంటూ కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు పట్టుబడగా.. ఇటీవల అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. కోటి 10 లక్షల లంచం కేసులో నాగరాజు నిందితుడిగా ఉన్నాడు. నెలరోజులుగా ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉన్న నాగరాజు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య! నాగరాజు ఆత్మహత్యపై కస్టోడియల్ డెత్‌గా కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో జైలు సిబ్బందిని విచారించారు. చనిపోయే ముందు రోజులు కస్టడిలో భాగంగా ఏసీబీ అధికారులు నాగరాజును విచారించారు. దీంతో ఆత్మహత్య చేసుకునే ముందు రోజు ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజు ఎవరెవరితో మాట్లాడాడు, ఏం చెప్పాడు, ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయన్న విషయాల్లో దర్యాప్తు సాగుతోంది. చదండి: కీసర నాగరాజా మజాకా! -
మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య
చంచల్‌గూడ: సంచలనం సృష్టించిన రూ.కోటీ పది లక్షల లంచం కేసులో నిందితుడిగా ఉన్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అతడు ఉరివేసుకుని ప్రాణం తీసుకున్నాడు. కీసర మండలం తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్న నాగరాజును ఇటీవ ల రూ.కోటీ పది లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ బృందం దాడులు చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో అతనిపై కేసు నమో దు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం అతన్ని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున జైల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి నాగరాజు కిటికీకి టవల్‌తో ఉరివేసుకుని కనిపించాడు. దీంతో అప్పటికప్పుడు అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెంది నట్లు వైద్యులు ధ్రువీకరించారని జైలు అధికారులు తెలిపారు. ఉస్మానియాలో పోస్టుమార్టం.. అఫ్జల్‌గంజ్/అల్వాల్: నాగరాజు మృతదేహాని కి ఉస్మానియా ఆసుపత్రిలోని మార్చురీలో బుధవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్ నిపుణుడు దేవరాజ్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం పోస్టుమార్టం జరిపింది. అనంతరం మృతదేహాన్ని బంధువుల కు అప్పగించారు. కాగా బుధవారం రాత్రి నాగరాజు మృతదేహాన్ని అల్వాల్‌లోని నివాసానికి తీసుకొచ్చారు. గురువారం అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు వెల్లడించారు. -
కీసర మాజీ తాహసీల్దార్ ఆత్మహత్య
-
కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవలే అవినీతి నిరోధక శాఖ ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంచలగూడ జైలులో ఉన్న నాగరాజు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రూ.కోటి 10 లక్షల లంచం కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. నెలరోజులుగా ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. (1.10 కోట్ల లంచం : ఏసీబీ వలలో తహసీల్దార్) నాగరాజుపై ఏసీబీ ప్రశ్నల వర్షం నకిలీ పాసు పుస్తకాల జారీ విషయంలో కీసర మాజీ తహసీల్దార్ నాగరాజుపై ఏసీబీ మంగళవారం ప్రశ్నల వర్షం కురిపించింది. రెండోసారి అతడిని కస్టడీలోకి తీసుకున్న అధికారులు.. కందాడి ధర్మారెడ్డి, అతడి కుటుంబ సభ్యులకు, ఇతరులకు కలిపి దాదాపు 24 ఎకరాల భూమికి అక్రమ పద్ధతిలో పాసు పుస్తకాలు ఎలా జారీ చేశారని ప్రశ్నించారు. అసలు హక్కుదారులు, వారసులు ఉండగా నకిలీ పత్రాలు ఎలా సృష్టించారు? ఇందుకు ఎవరు సహకరించారు? దీని వెనక ఎంత డబ్బులు చేతులు మారిందని అడిగారు. దీనికితోడు అదే ధర్మారెడ్డి స్థానికంగా ఉన్న 140 ఎకరాలు స్వాహా చేద్దామని చేసిన ప్రయత్నానికి ఎలాంటి సహకారం అందించారని కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. చదవండి: కీసర ఎమ్మార్వో నాగరాజు రిమాండ్ రిపోర్టు కాగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లిదాయర రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వేనంబర్ 604 నుంచి 614 వరకు గల కోర్ట్ ఆఫ్ వార్డ్స్ (గవర్నమెంట్ కస్టోడియన్ ల్యాండ్) 53 ఎకరాల భూముల్లోని 28 ఎకరాలకు సంబంధించి ఓ వర్గానికి అనుకూలంగా రెవెన్యూ రికార్డులో పేర్ల నమోదుతోపాటు, పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు నాగరాజు రియల్ బ్రోకర్ కందాడి అంజిరెడ్డి ఇంట్లో రూ.1.10 కోట్ల నగదు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తేల్సిందే. ఇక అక్రమాలతో కోట్లకు పడగలెత్తిన తహసీల్దార్ నాగరాజుది ఆది నుంచీ అవినీతి చరిత్రేనని తెలుస్తోంది. రెవెన్యూ శాఖలో 15 ఏళ్లుగా టైపిస్టు నుంచి ఆర్ఐ, డీటీ, తహసీల్దార్ వరకు పనిచేసిన ప్రతి స్థాయిలో ఆయన ‘చేతివాటం’ చూపించాడని రెవెన్యూ వర్గాల సమాచారం. (గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్) -
తెలంగాణ జైళ్ల సంస్కరణలు దేశానికే స్ఫూర్తి: డీజీపీ
సాక్షి, హైదరాబాద్ : దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ జైళ్ల శాఖ పనిచేస్తోందని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ చంచల్‌గూడ జైల్లో గురువారం జరిగిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి డీజీపీ మహేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి ప్రిసనర్స్ స్పోర్ట్స్‌మీట్‌ను డీజీపీ, జైళ్లశాఖ డీజీ రాజీవ్‌త్రివేది ప్రారంభించారు. అనంతరం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ జైళ్ల సంస్కరణలు దేశానికే స్ఫూర్తి అని ప్రశంసించారు. పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను తీర్చిదిద్దడంలో రాజీవ్ త్రివేది పాత్ర మరువలేనిదన్నారు. రాజీవ్ త్రివేది ఆధ్వర్యంలో జైళ్లశాఖ మరింత మెరుగవుతుందని పేర్కొన్నారు. అలాగే తన సహచరుడు రాజీవ్ త్రివేది డీజీగా ఉండటం.. తాను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జీవితంలో గుర్తుండిపోయే విషయమన్నారు. రాజీవ్ త్రివేది మంచి క్రీడా వ్యక్తి అని.. క్రీడలు మంచి లక్షణాలను నేర్పిస్తాయన్నారు. క్రీడా స్ఫూర్తితో అందరూ సమిష్టిగా రాణించాలని జైళ్లశాఖ డీజీ రాజీవ్ త్రివేది సూచించారు. తెలంగాణ జైళ్లశాఖను ఉన్నతమైన స్థానంలో తీర్చిద్దుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్, వరంగల్, చర్లపల్లి, సెంట్రల్ హైదరాబాద్ రెంజ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళా రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నం
-
సాధారణ ఖైదీగానే సింగిల్ బ్యారక్‌లో రవిప్రకాశ్
-
చంచలగూడ జైలులో తొలిరోజు రవిప్రకాశ్..
సాక్షి, హైదరాబాద్ : దాదాపు రూ.18 కోట్లు చీటింగ్ చేసిన కేసులో అరెస్ట్ అయిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చంచల్‌గూడ జైలులో సాధారణ ఖైదీగానే సింగిల్ బ్యారక్‌లో ఉన్నారు. కోర్టు ఆయనకు ఈ నెల 18వ తేదీ వరకూ రిమాండ్ విధించడంతో శనివారం రాత్రి 10 గంటలకు జైలుకు తరలించారు. రవిప్రకాశ్‌కు జైలు అధికారులు అండర్ ట్రయిల్ ఖైదీ నెంబర్ 4412ను కేటాయించి... కృష్ణా బ్యారక్‌లో ఉంచారు. ఎవరితో మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్న ఆయన రాత్రంతా సరిగా నిద్రపోలేదని సమాచారం. ఉదయం రవిప్రకాశ్‌కు జైలు సిబ్బంది అల్పాహారంగా కిచిడీ ఇవ్వగా, సగం తిని వదిలేసినట్లు తెలుస్తోంది. ఇక ఆయన బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 9న వాదనలు జరగనున్నాయి. కాగా రవిప్రకాశ్.. మరో డైరెక్టర్ ఎంకేవీఎస్ మూర్తితో కలిసి కుట్రకు పాల్పడి అక్రమ మార్గంలో రూ.18 కోట్లను సొంతానికి వాడుకున్నారంటూ ప్రస్తుత టీవీ9 సీఈవో గొట్టిపాటి సింగారావు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ 409, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి, రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆయనకు ఈ నెల 18వ తేదీ వరకూ రిమాండ్ విధించడంతో శనివారం రాత్రి 10 గంటలకు జైలుకు తరలించారు. చదవండి: రవిప్రకాశ్ అరెస్ట్... -
ఝాన్సీ ఆత్మహత్య కేసులో సూర్య తేజకు రిమాండ్
హైదరాబాద్: టీవీ నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ప్రియుడు మద్దాల సూర్య తేజ (30)ని మంగళవారం పంజగుట్ట పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం, వివాహం చేసుకుంటానని నమ్మక ద్రోహం చేయడం 306, 417 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. తన సర్వస్వం సూర్యనే అనుకున్న ఝాన్సీ తన ప్రాణమైన నటనకు కూడా దూరమైంది. సూర్య మాత్రం ఆమెపై అనుమానం వ్యక్తం చే స్తూ తరచూ గొడవలు పెట్టుకునేవాడని విచారణలో తెలిసింది. ఆమె ఫోన్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టడంతోపాటు సూర్య ఇంట్లో వేరే సంబంధాలు చూడటంతో నాగ ఝాన్సీ తీవ్ర మనోవేదనకు గురయినట్లు సమాచారం. ఆత్మహత్య చేసుకునే ముందు కూడా ఝాన్సీ ఫోన్ చేస్తే అతను స్పందించనట్లు తెలిసింది. తీవ్ర మనోవేదనకు గురైన ఝాన్సీ... గత ఏప్రిల్‌లో ఇద్దరికీ పరిచయం కాగా, జూన్‌లో ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. త్వరలో వివాహం చేసుకుంటామని జూలైలో ఝాన్సీ ఇంట్లో కూడా చెప్పారని తెలిపారు. ఆ తర్వాత సూర్య ఇంటికి వెళ్లి ఝాన్సీ వారం రోజులు అక్కడే ఉందన్నారు. సూర్య పుట్టినరోజు సందర్భంగా నవంబర్‌లో ఝాన్సీ కొంత డబ్బు అతనికి ఇచ్చిందని, దాంతో బైక్ కొనుగోలు చేశారని తెలిపారు. అప్పటి వరకు బాగానే ఉండగా అనంతరం ఇద్దరి మధ్యా చిన్న గొడవలు ప్రారంభమయ్యాయన్నారు. ఝాన్సీ నటించడం, వేరేవారితో మాట్లాడటం సూర్యకు నచ్చేది కాదని, దీంతో ఆమె నటన కూడా మానేసిందని తెలిపారు. ఈ క్రమంలో జనవరి నుంచి సూర్యకు ఇంట్లో వేరే సంబంధం చూస్తున్నారని తెలియడంతో ఝాన్సీ తీవ్ర మనోవేదనకు గురైందన్నారు. ఆత్మహత్య చేసుకునే రెండు రోజుల ముందు నుంచి సూర్యతో మాట్లాడలేదని, కాని ఆత్మహత్య చేసుకునే ముందు సూర్యకు ఫోన్ చేయగా అతను స్పందించలేదన్నారు. మెసేజ్‌లు పెట్టినా అప్పుడు సూర్య ఫోన్లో నెట్ ఆఫ్ చేసి ఉండటంతో అతను అవి చూసుకోలేదని, తర్వాత నెట్ ఆన్ చేసినా ఝాన్సీ ఆ మెసేజ్‌లను డెలీట్ చేసిందని పోలీసులు తెలిపారు. తర్వాత సూర్య పలు మెసేజ్‌లు పెట్టినా ఆమె నుంచి స్పందన రాలేదని వివరించారు. -
చెంచులక్ష్మికి పెట్రోల్ బంక్‌లో ఉద్యోగం
చంచల్‌గూడ: 18 చోరీ కేసుల్లో మూడు సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఘరనా దొంగ చెంచు లక్ష్మీ శుక్రవారం చంచల్‌గూడ మహిళా జైలు నుంచి విడుదలైంది.తరువాత ఆమెకు చంచల్గూడలోని మహిళ పెట్రోల్ బంకుల్లో ఉద్యోగమించ్చారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చోరి కేసుల్లో చెంచు లక్ష్మీ (34) నిందితురాలుగా ఉంది. కాగా పలు కేసుల్లో ఆమె దోషిగా తేలడంతో కోర్టు ఆమె శిక్షలు విధించింది. ఎట్టకేలకు ఆమె జైలు శిక్ష పూర్తి కావడంతో శుక్రవారం జైలు నుంచి విడుదలైంది. కాగా పోలీసులే తనను దొంగగా మార్చారని పలు సందర్భాల్లో ఆమె పోలీసు శాఖపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయమై జైలు అధికారులతో ఆమె మొరపెట్టుకోగా ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోఅధికారులు చెంచు లక్ష్మీకి చంచల్గూడలోని మహిళ పెట్రోల్ బంకుల్లో ఉపాధి కల్పించడంతో ఇల్లు ఏర్పాటు చేసి కొంత డబ్బు కూడా చెల్లించినట్లు జైలు సూపరింటెండెంట్ బషీరాబేగం తెలిపారు. -
జైలులో జగ్గారెడ్డిని కలిసిన కుటుంబ సభ్యులు
-
కేసీఆర్, హరీష్‌ను అరెస్ట్ చేయాలి : జగ్గారెడ్డి భార్య
సాక్షి, హైదరాబాద్ : నకిలీ పాస్‌పోర్టు కుంభకోణం కేసులో అసలు నిందితులైన కేసీఆర్, హరీష్ రావులను వదిలేసి తన భర్తను అక్రమంగా ఇరికించారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలారెడ్డి ఆరోపించారు. బుధవారం చంచల్‌గూడ జైల్లో ఉన్న జగ్గారెడ్డిని ఆయన కుటుంబసభ్యులు ములాఖత్‌లో కలిశారు. జైలు అధికారులు మాత్రం కేవలం జాలీ ములాఖత్‌కు మాత్రమే అవకాశం కల్పించారు. అనంతరం నిర్మలారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జగ్గారెడ్డి చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసని ఆయన మచ్చలేని మనిషి అని పేర్కొన్నారు. అధికార దాహంతోనే జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారని ఆగ్రహించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన కేసీఆర్, హరీష్‌రావులను ఎందుకు అరెస్ట్ చేయటం లేదని ప్రశ్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా అధికారులు సాధారణ ములాఖత్ ఇచ్చారని, జాలీ మధ్యలోనుంచి మాటలు స్పష్టంగా వినిపించటంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
హెల్మెట్ లేకుంటే పెట్రోల్ పోయం
చంచల్‌గూడ: హెల్మెట్ ధరించని వినియోగదారులకు పెట్రోల్ విక్రయించమని తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సామాజిక బాధ్యతగా నేరాలను అదుపు చేయడంలో జైళ్ల శాఖ కీలకపాత్రం పోషించిందని, అదే విధంగా విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పించిందన్నారు. ఇటీవలకాలంలో రోడ్డు ప్రమాదాల బారినపడిన వారు అత్యధికంగా హెల్మెట్ ధరించకపోవడంతో మరణిస్తున్నట్లు దినపత్రికల ద్వారా తెలుసుకున్నట్లు తెలిపారు. దీంతో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 13 పెట్రోల్ బంకులు, నూతనంగా నిర్మించబోయే మరో 8 పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ ధరించని వినియోగదారులకు విక్రయాలు జరపకుండా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జైళ్ల శాఖ సరఫరా చేస్తున్న నాణ్యమైన పెట్రోల్ కోసం ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర ప్రైవేటు పెట్రోల్ బంకుల యజమానులు కూడా ఇలాంటి నిర్ణయం తీసు కుంటే మరణాలు తగ్గే అవకాశం ఉందని తెలిపా రు. బంకుల ద్వారా లాభార్జనే కాకుండా మంచి లక్ష్యాల కోసం జైళ్ల శాఖ పనిచేస్తుందన్నారు. -
మూడు గంటలు.. ముచ్చెమటలు!
కుషాయిగూడ: కోర్టు తీర్పుతో మానసికంగా కుంగిపోయిన ఓ జీవితఖైదీ హైటెన్షన్ కరెంట్ పోల్ ఎక్కి మూడు గంటల పాటు పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని, తనపై అక్రమ కేసు బనాయించి, జైలుపాలు చేసిన శంకర్పల్లి ఎస్సై నాగరాజును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సూసైడ్ నోట్ రాసి కరెంటు స్తంభమెక్కాడు. దీంతో అప్రమత్తమైన జైల్ సిబ్బంది ట్రాన్స్ కో అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం ఫైర్ సిబ్బంది సహకారంతో అతడిని సురక్షితంగా కిందకు దించడంతో కథ సుఖాంతమైంది. సోమవారం చర్లపల్లి కేంద్ర కారాగారంలో చోటు చేసుకున్న సంఘటన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, శేర్గూడానికి చెందిన యండీ ఖాజాపాషా భార్యపై అనుమానంతో 2012లో బానూరు వద్ద ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. కేసును విచారించిన సంగారెడ్డి కోర్టు 2013లో అతడికి జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. అప్పటి నుంచి చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. జైల్లో సత్పప్రవర్తనతో మెలగడంతో ఖాజాపాషాను 2017లో జైల్ పెట్రోల్‌బంకు విధుల నిర్వహణకు కేటాయించారు. గత డిసెంబర్లో పెరోల్‌పై నెలరోజుల పాటు ఇంటికి వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో జిల్లా కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీలు చేసుకున్నాడు. అయితే ఈ నెల 7న హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షను ఖారారు చేస్తు తీర్పునివ్వడంతో మానసికంగా కుంగిపోయిన ఖాజాపాషా జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో పెట్రోల్‌బంకు ఆవరణలో కరెంటు పోల్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. ఎస్సై నాగరాజును సస్పెండ్ చేయాలి నా భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనపై అక్రమంగా కేసు బనాయించి, తన పిల్లలకు దూరం చేసిన అప్పటి శంకర్పల్లి ఎస్సై నాగరాజు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సూసైడ్ నోట్ రాసి కరెంటు పోలెక్కడంతో అప్రమత్తమైన జైల్ సిబ్బంది, కుషాయిగూడ పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాన్స్‌కో అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అధికారులు అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించగా పై నుంచి మాటలు వినిపించక పోవడంతో మరో ఖైదీని పోల్ పైకి పంపి సెల్‌ఫోన్‌ను అందజేసి పలుమార్లు సంభాషించారు. అతని డిమాండ్లను అంగీకరిస్తూ, సదరు ఎస్సైపై చర్యలు తీసుకుంటామని కుషాయిగూడ ఏసీపీ కృష్ణమూర్తి, జైల్ సూపరింటెండెంట్ భాస్కర్ హామీ ఇచ్చినా అతను కిందకు దిగిరాలేదు. ‘‘బతకాలని అనిపించడం లేదని, నేను చనిపోతాను’’ అంటూ ఫోన్ కట్‌చేశాడు. దాదాపు మూడు గంటల పాటు అధికారులు, సహచర ఖైదీలు ఫోన్లో మాట్లాడుతూ సర్ధిజెప్పే ప్రయత్నం చేసినా అతని నిర్ణయంలో మార్పురాలేదు. దీంతో అధికారులు రక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది.. అప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్న చర్లపల్లి ఫైర్ సిబ్బంది తమ వద్ద ఉన్న మ్యాట్లతో ప్రాథమికంగా రక్షణ చర్యలు చేపట్టారు. ఫైర్ ఆఫీసర్ శైఖర్రెడ్డి ఉన్నతాధికారులతో మాట్లాడి 54 ఫీట్ల స్కై లిఫ్ట్‌ను రప్పించారు. కిందపడినా ప్రమాదం జరగకుండా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. ఫైర్ సిబ్బందితో పాటు డిప్యూటీ జైలర్ శోభన్‌బాబు కూడా లిఫ్ట్‌లో పైకి వెళ్లి అతడికి నచ్చజెప్పి కిందకు తీసుకువచ్చాడు. జైళ్లశాఖ డీఐజీ సైదయ్య, చర్లపల్లి ఫైర్ ఆఫీసర్ శేఖర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా అధికారుల నమ్మకాన్ని వమ్ముచేసేలా వ్యవహరించిన ఖాజాపాషాపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అందుకుగాను కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఖాజాపాషాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. కాగా తమకు జైలు అధికారుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని కుషాయిగూడ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. -
బెయిల్‌పై గజల్ శ్రీనివాస్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : లైంగిక వేధింపుల కేసులో చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గజల్ గాయకుడు శ్రీనివాస్ బుధవారం రాత్రి బెయిల్‌పై విడుదల అయ్యాడు. తన సంస్థలోని ఉద్యోగినిపై లైగింక వేధింపులకు పాల్పడిన కేస్‌లో గత మూడు వారాలుగా శ్రీనివాస్ చంచల్‌గూడ జైల్లో వున్న విషయం విదితమే. కోర్టు శ్రీనివాస్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయటంతో జైల్ నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తన కేసు విషయం కోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పుడేమీ మాట్లాడలేనన్నారు. తాను నిర్దోషిగా బయటికి వస్తానన్నారు. తనను కలిసేందుకు వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తన కెరీర్లో వెంట ఉండి ప్రోత్సహించిన మీడియా వారికి ధన్యవాదాలు తెలిపారు. కాగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా పరుగెత్తి కారులో వెళ్లిపోయారు. -
మందకృష్ణకు షరతులతో కూడిన బెయిల్
-
దొరలకో చట్టం.. దళితులకో చట్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దళితులకు ఒక చట్టం.. దొరలకు మరో చట్టం నడు స్తోందని ఎమ్మార్పీ ఎస్ వ్యవస్థాపక అధ్య క్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. 21 రోజులుగా చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న మంద కష్ణకు మంగళవారం సికింద్రాబాద్ సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాత్రి 9 గంటలకు విడుదలయ్యారు. దీక్ష చేసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వక పోయినా ఎమ్మార్పీఎస్ కార్యాలయం వద్ద మంద కృష్ణ రెచ్చగొట్టే ప్రసంగం చేశారని పోలీసులు ఆయనను ఈనెల 2న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చంచల్‌గూడ జైల్లో ఉన్న ఆయనకు బెయిల్ లభించడంతో బయటకు వచ్చా రు. ఆయన జైలు వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25న అన్ని పార్టీలతో అఖిల పక్షం సమావేశం నిర్వహించి వారి సూచనలు, సలహాల మేరకు భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. -
ఖైదీ ఆత్మహత్య
హైదరాబాద్: మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంచల్‌గూడ జైలు ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్ జిల్లా యాంకీ గ్రామానికి చెందిన కుమ్మరి సత్యం (38) కూలిపనులకోసం భార్యతో కలసి కొన్నేళ్లక్రితం మహారాష్ట్రలోని పుణెకు వలస వెళ్లాడు. ఇంటిగొడవల కారణంగా భార్యను హత్య చేసిన కేసులో పుణె కోర్టు 2017లో అతడికి జీవితఖైదు విధించింది. అప్పట్నుంచి చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. కొంతకాలంగా అతడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో జైలు అధికారులు ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్నారు. ఈ నెల 9న అతడిని ఆస్పత్రిలో చేర్పించగా శుక్రవారం ఉదయం 12.30 గంటల సమయంలో బాత్రూమ్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. సిబ్బంది నుంచి ఈ సమాచారం అందుకున్న ఆస్పత్రి ఆర్ఎంఓ మోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. పంచనామా తర్వాత మృతదేహాన్ని జైలు అధికారులకు అప్పగిస్తామని ఎస్సై మహేందర్ చెప్పారు. -
దేశవ్యాప్తంగా వర్గీకరణ ఉద్యమం
హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని గుజరాత్ స్వతంత్య్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ అన్నారు. తెలంగాణలో వెంటనే వర్గీకరణ చేపట్టాలని కోరారు. చంచల్‌గూడ జైల్లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను ఆయన బుధవారం కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖ కుట్ర పన్ని మంద కృష్ణను జైల్లో పెట్టాయని, అక్రమ కేసులు పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. దళిత హక్కుల కోసం కృష్ణమాదిగ కష్టపడుతున్నారని అన్నారు. దళితులు ఏకమై పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. వివిధ అంశాలపై మంద కృష్ణతో చర్చించినట్లు తెలిపారు. నిరుపేద దళితులకు 3 నుంచి 5 ఎకరాల భూమి పంపిణీ చేయాలని ఆయా ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. వర్గీకరణ అంశాన్ని ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్తారా.. అన్న ప్రశ్నను ఆయన దాటవేశారు. -
మందకృష్ణకు జిగ్నేష్, కత్తి మహేష్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ బుధవారం చంచల్‌గూడ జైలులో ఉన్న ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘నా అంతరాత్మ ప్రభోదానుసారం మందకృష్ణను కలిశా. ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలి. హక్కులకై పోరాడుతున్న మందకృష్ణను జైల్లో పెట్టడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. దళితుల ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తీసుకువెళతాం. తెలంగాణలో దళిత సంఘాలన్నీ ఏకం కావాలి. ఎస్సీ వర్గీకరణ తప్పనిసరిగా చేయాలి. అలాగే తెలంగాణలో దళితులకు అయిదు ఎకరాల భూమి ఇవ్వాలి. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘన తెలంగాణలో తీవ్రస్థాయికి చేరుకుంది. రోహిత్ వేముల బతికుంటే నాతో కలిసి వచ్చేవారు’ అని అన్నారు. మందకృష్ణను కలిసిన కత్తి మహేష్ మరోవైపు మందకృష్ణను కత్తి మహేష్ కూడా కలిశారు. చంచల్‌గూడకు వెళ్లి...మందకృష్ణను పరామర్శించారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ చేపడుతున్న పోరాటానికి కత్తి మహేష్ మద్దతు తెలిపారు. కాగా ట్యాంక్‌బండ్ వద్ద అనుమతి లేకుండా ఆందోళనలు నిర్వహించారంటూ మందకృష్ణ మాదిగపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రెండురోజుల క్రితం మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కూడా మందకృష్ణను కలిశారు. -
‘తెలంగాణలో నిర్బంధ, నియంతృత్వ పాలన’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిర్బంధ, నియంతృత్వ పాలన సాగుతోందని.. ప్రజలకు స్వేచ్ఛ, హక్కులు లేకుండా పోయాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. చంచల్‌గూడ జైలులో ఉన్న ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగను తమ పార్టీ నేతలతో పాటు ఆయన కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన భారతి అనే మహిళ సంస్మరణ సభ జరిపినందుకు మందకృష్ణను అరెస్ట్ చేశారని తెలిపారు. ఏబీసీడీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధానమంత్రి వద్దకు అఖిలపక్షాన్ని తీసుకుపోతామని సీఎం కేసీఆర్ హామీయిచ్చారని గుర్తు చేశారు. అదే ముఖ్యమంత్రి.. ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమిస్తున్న మందకృష్ణను అరెస్ట్ చేసి రెండు వారాలు జైల్లో పెట్టించారని ధ్వజమెత్తారు. ఇంత దారుణంగా పాలన సాగుతోందని, అణగారిన వర్గాలకు హక్కులు లేకుండా పోయాయని వాపోయారు. నెరేళ్లలో దళితులను ఇసుక మాఫియా అండతో పోలీసులు వేధింపులకు గురిచేశారని, ఖమ్మంలో మద్దతుధర కోసం డిమాండ్ చేసినందుకు రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టారని తెలిపారు. ఇపుడు మంద కృష్ణను అరెస్ట్ చేసి వేధిస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌పై గజ్వేల్‌లో పోటీ చేసిన వంటేరు ప్రతాప్‌రెడ్డిపై కూడా కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మురళి ముదిరాజ్ కుటుంబాన్ని పరామర్శించినందుకు ఆయనను అరెస్ట్ చేసి హత్య కేసు నమోదు చేశారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. -
తాత్కాలిక బెయిల్‌పై మంద కృష్ణ విడుదల
హైదరాబాద్: చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సోమవారం బెయిల్‌పై విడుదలయ్యారు. మంద కృష్ణ బావ మృతి చెందడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కోర్టు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేసింది. అంత్యక్రియలకు హాజరై తిరిగి మంగళవారం ఆయన జైలుకు రానున్నారు. -
చంచల్‌గూడ జైలుకు కోదండరామ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరామ్ గురువారం చంచల్‌గూడ జైలుకు వెళ్ళారు. జైలులో ఉన్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను కోదండరామ్ కలిశారు. ట్యాంకుబండ్ వద్ద ధర్నాకు ఉపక్రమించారన్న కారణంతో మంద కృష్ణమాదిగను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను కోదండరామ్ పరామర్శించారు. -
చంచల్‌గూడ జైల్లో భద్రతా లోపాలు
-
జైలు వార్డర్‌పై ఉగ్రవాద ఖైదీల దాడి
-
జైలు వార్డర్‌పై ఉగ్రవాద ఖైదీల దాడి
సాక్షి, హైదరాబాద్ : చంచల్‌గూడ జైలులో వార్డర్‌పై ఐసిస్ ఉగ్రవాద ఖైదీలు శనివారం మధ్యాహ్నం దాడి చేశారు. మొహ్మద్ ఇబ్రహీం యజ్దానీ, ఇల్లియాస్ యజ్దానీ, మహ్మద్ అతాఉల్లాహ్ రహమాన్ అలియాస్ గౌస్‌లు ఈ దాడికి పాల్పడ్డారు. తమ బంధువులతో ములాఖత్ సమయంలో ఈ సంఘటన జరిగింది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఇతర నిందితులను కోర్టుకు హాజరుపరిచేందుకు వికెట్ గేటు(రెండో మెయిన్ గేటు)ను వార్డర్ భరత్‌కుమార్ తెరిచారు. ఆ సమయంలో ములాఖత్ కోరిన తమ వారి కోసం వేచి ఉన్న హై సెక్యూరిటీ కలిగిన ఈ ముగ్గురు ఖైదీలు ఇదే అదనుగా వార్డర్ను తోసుకుని మెయిన్ గేటు వైపు వెళ్లారు. బిగ్గరగా అరుస్తూ జైలు సిబ్బందిని, అధికారులను పరుష పదజాలంతో దూషించడమేగాక మరో వార్డర్ సంపత్‌ను కంటి దగ్గర గాయపరిచారు. ఇతర సిబ్బందికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై డబీర్‌పురా పోలీసు స్టేషన్లో జైలు సూపరింటెండెంట్ ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. -
చంచల్‌గూడ జైలులో అల్లు శిరీష్!
నిజమే... అక్షరం పొల్లు పోకుండా మీరు చదివిందంతా నిజమే! యువ హీరో అల్లు శిరీష్ ఓ రోజంతా చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. ఆయన జైలుకు వెళ్లొచ్చి వారమైంది. కానీ, ఈ మేటర్ బయటకు రాలేదు. గుట్టు చప్పుడు కాకుండా అల్లు శిరీష్ జైలుకు వెళ్లొచ్చారు. టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్... డ్రగ్స్ రాకెట్ కేసుతో అల్లు వారబ్బాయికి ఏం సంబంధం లేదు. ఆయనపై ఇతరత్రా కేసులు ఏవీ లేవు. మరి, జైలుకు ఎందుకు వెళ్లారు? అంటే... సిన్మా షూటింగ్ కోసం! ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో అల్లు శిరీష్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నా మధ్య రెండు మూడు రోజులు చంచల్‌గూడ జైలులో షూటింగ్ చేశారు. షూటింగ్ పూర్తయిన తర్వాత పోలీసుల రిక్వెస్ట్ మేరకు అల్లు శిరీష్ ఖైదీలకు మంచి మాటలు చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. సురభి, సీరత్‌కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ కీలక పాత్ర చేస్తున్నారు. -
చంచల్‌గూడ జైల్లో టాలీవుడ్ హీరో
హైదరాబాద్: టాలీవుడ్ నూతన దర్శకుడు వీఐ ఆనంద్ డైరెక్షన్లో మెగా ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్, సురభి జంటగా ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ కొత్త సినిమా షూటింగ్ శనివారం చంచల్‌గూడ పురుషుల జైల్లో జరిగింది. దీంతో జైలు పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. శిరీష్, అవసరాల శ్రీనివాస్, ప్రవీణ్‌లపై జైలు బయట, లోపల కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్ అనంతరం మహాపరివర్తన్లో భాగంగా అల్లు శిరీష్ ఖైదీలను ఉద్దేశించి మాట్లాడారు. తెలిసి, తెలియక చేసిన తప్పులకు జైలు శిక్ష అను భవిస్తున్న ఖైదీలు తప్పులను సరిదిద్దుకొవాలని ఆయన సూచించారు. చంచల్‌గూడ జైల్లో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ సమ్మయ్య, జైలర్లు విజయ్‌కుమార్, వెంకటేశం ఉన్నారు. మరోవైపు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో వేగంగా జరుగుతోంది. సీరత్ కపూర్ మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరకర్తగా ఉన్నారు. -
విందు భోజనానికి నోచుకోని ఖైదీలు
హైదరాబాద్: రంజాన్‌ను పురస్కరించుకొని ప్రత్యేక వంటకాలు వడ్డిస్తారని ఆశపడ్డ చంచల్‌గూడ ఖైదీలకు నిరాశే మిగిలింది. సాధారణ భోజనంతో పాటు ఒక లడ్డూ మాత్రమే జైలు అధికారులు వడ్డించడంతో వారంతా ఆవేదన వ్యక్తంచేశారు. చంచల్ గూడ పురుషుల జైల్లో దాదాపు 350 మంది ముస్లిం ఖైదీలు నెల పాటు రంజాన్ ఉపవాస దీక్షలు పాటించారు. ప్రార్థనలకు ప్రత్యేకంగా జైల్లో ఓ బ్యారెక్ కూడా అధికారులు కేటా యించారు. అయితే రంజాన్ రోజు ప్రత్యేక వంటకాలు వడ్డిస్తారని ఊహించిన ఖైదీలకు నిరాశే ఎదురైంది. ఖైదీల సంక్షేమం, సంస్కరణలు కోసం కృషి చేస్తున్నామని ప్రచారం చేసుకునే ఉన్నతాధికారులకు పం డుగపూట ఖైదీలకు విందు భోజనం వడ్డిం చాలన్న ఆలోచన రాకపోవడం దురదృష్టక రమని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
శిరీష మరణం వెనక మిస్టరీ లేదు
- పోలీసు ఉన్నతాధికారుల పునరుద్ఘాటన - సందేహాలను ఆధారాలతో నివృత్తి చేయాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య చేసుకుందని, ఆమె మరణం వెనుక మరే మిస్టరీ లేదని పోలీస్ ఉన్నతాధికారులు మరోసారి స్పష్టం చేశారు. కటుంబసభ్యుల సందేహాలను శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో నివృత్తి చేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ఆమెది హత్య అని నిర్ధారించేందుకు ఎవరు, ఏ ఆధారం సమర్పించినా పరిగణనలోకి తీసుకోనున్నారు. శిరీష ఆరడుగుల ఎత్తు, 80 కిలోల బరువు ఉందని, అంత బరువును సీలింగ్ ఫ్యాన్ రాడ్ ఎలా ఆపుతుందన్న బంధువుల సందేహంపై అధికారులు స్పందిస్తూ.. శిరీష 5.6 అడుగుల ఎత్తు, 65–70 కిలోల బరువు ఉంటుందని, చనిపోవాలన్న ఉద్దేశ్యంతోనే ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కాళ్లను ముడుచుకుందని, సీలింగ్ ఫ్యాన్ వంద కిలోల బరువునైనా ఆపగలదని నిర్ధారించారు. కుకునూరుపల్లి నుండి తిరిగివచ్చే సమయంలో అరవడం.. కారు నుండి దూకే ప్రయత్నం చేయడంతో కారులో రాజీవ్, శ్రవణ్ ఆమెపై పలుమార్లు దాడి చేయటం వల్లే ఒంటిపై గాయాల య్యాయని పేర్కొన్నారు. బయటే హత్య చేసి తీసుకువచ్చారన్న ఆరోపణపై స్పందిస్తూ.. ఫిల్మ్‌నగర్‌లోని స్టూడియోకు చేరుకున్నాక శిరీష స్వయంగా 3.47 గంటల సమయంలో తన వేలిముద్ర(బయోమెట్రిక్)ను ఉపయోగించి డోర్ తెరిచిందని, తిరిగి 3.54 గం టలకు తన ఫోన్‌తో రాజీవ్‌కు వీడియోకాల్ చేసిన ఆధారాలను చూపు తున్నారు. శిరీష ఆత్మ హత్య చేసుకున్న ప్రవేశాన్ని ఐదుగురు ఫోరెన్సిక్ నిపు ణులు సందర్శించి, అన్ని కోణాల్లో పరిశీలించారని తెలిపారు. ఎస్సై ప్రభాకర్ రెడ్డి కూడా బంజారాహిల్స్ ఎస్సై హరీందర్‌కు 9 మార్లు కాల్ చేసి వాకబు చేశారన్నారు. చంచల్‌గూడ జైలుకు రాజీవ్, శ్రవణ్ కాగా, శిరీష కేసులో నిందితులుగా ఉన్న రాజీవ్, శ్రవణ్‌ను కోర్టు ఉత్తర్వుల మేరకు శనివారం పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. శని వారం ఉదయం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీ క్షల అనంతరం రాజీవ్, శ్రవణ్‌లను బంజారా హిల్స్ పోలీసులు నాంపల్లిలోని మూడో అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరి చారు. వీరిద్దరికి న్యాయమూర్తి రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. శ్రవణ్, రాజీవ్‌లను కస్టడీకి కోరుతూ బంజారా హిల్స్ పోలీసులు కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. శిరీషపై ప్రభాకర్‌రెడ్డి అత్యాచారయత్నం చేశాడని నింది తులు ఇచ్చిన సమాచారం మేరకు శిరీష లోదుస్తుల తోపాటు ఆ రోజు ఆమె ధరించిన డ్రెస్సును, ప్రభాకర్‌రెడ్డి లోదుస్తులను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. -
జైళ్ల శాఖ ‘ఆదాయాల’ బంకు
సాక్షి, చంచల్‌గూడ: తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ఖైదీల సంస్కరణలో విభిన్న ప్రయోగాలు చేసింది. చేస్తూనే ఉంది. తెలిసీతెలియక క్షణికావేశంలో నేరాలకు పాల్పడి జైళ్లకు వచ్చే వారిని నేరస్తులుగా పరిగణించకుండా వారిలో మార్పులు తెచ్చేందుకు వివిధ రకాల వ్యాపారాలను మొదలు పెట్టి అందులో ఖైదీలను భాగస్వామ్యం చేసింది. ఇందులో భాగంగానే జైళ్ల శాక ప్రయోగాత్మకంగా ఆయిల్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో రాష్ట్ర జైళ్ల శాఖ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పాతబస్తీలోని చంచల్‌గూడ ప్రాంతంలో సుధార్ పేరుతో నెలకొల్పిన పెట్రోల్ బంకు విజయవంతంగా వ్యాపారం కొనసాగిస్తుంది. ప్రతి రోజు రూ. 30 లక్షలు అమ్మకాలు జరుపుతుంది. 2013 జూన్‌లో ఈ బంకును ప్రారంభించారు. ప్రభుత్వ బంకు కావడంతో స్వచ్ఛత, తూనికలుకోలతల్లో అవకతవకలకు ఆస్కారం లేకపోవడంతో ప్రజలు ఈ బంకును ఆశ్రయిస్తూ అదిరిస్తున్నారు. ఖైదీలే ఉద్యోగులు.. సాధారణంగా ఖైదీలను జైళ్లలోనే చూస్తుంటాము. ఇక శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు బయట ప్రపంచంతో అసలు సంబంధాలు ఉండవు. కోర్టులకో, ఆసుపత్రులకో తరలిస్తే తప్ప వారికి బయట ప్రపంచం చూసే అవకాశమే ఉండదు. అలాంటిది జైళ్ల శాఖ నేరుగా వారిని ప్రజల మధ్యకు తెచ్చి సహసం చేసిందని చెప్పవచ్చు. రాష్ట్రంలోని వివిధ జైళ్లలోని సత్ప్రవర్తన కలిగి ఉన్న ఖైదీలను హైదరాబాద్ నగరంలోని చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లకు తరలించి వారికి పెట్రోల్ పంపు నిర్వహణకు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఖైదీలను ప్రజాసేవాలో భాగస్వామ్యం చేశారు. బంకు ప్రారంభమైన మొదట్లో ఖైదీలకు రోజువారి వేతనం రూ. 70 అందజేశారు. అమ్మకాలు పెరగడంతో ఇటీవల వారి రోజువారి వేతనాన్ని రూ. 110 పెంచారు. బంకు 24 గంటలు పనిచేస్తుంది. షిఫ్ట్‌కు 20 మంది చొప్పున మొత్తం 61 మంది ఖైదీలు మూడు షిఫ్ట్‌ల వారిగా విధులు నిర్వహిస్తున్నారు. నగరంలోని ఇతర బంకులు బందు పాటించినా ఈ బంకుకు వర్తించదు. యేడాదికి రూ. 4 కోట్ల ఆదాయం.. నగరంలోని ఇతర పెట్రోల్ బంకులతో పోల్చితే అమ్మకాలు అధికంగా ఉన్నాయి. జైళ్ల శాఖకు పెద్ద మొత్తంలో ఆదాయం అందించే స్థాయికి అభివృద్ధి చెందింది. మొదటి సంత్సరంలోనే రూ. 50 కోట్ల టర్నోవర్ సాధించి సూమారు కోటి రూపాయల ఆదాయం గడించింది. ప్రస్తుతం సంవత్సరానికి రూ. 100 నుంచి 120 కోట్ల టర్నోవర్‌తో వ్యాపారం కొనసాగిస్తూ రూ. 4 కోట్ల ఆదాయం సమకూర్చుకుంటుంది. పెట్రోల్ అమ్మకాల్లో దేశంలో ఈ బంకు 8వ స్థానం, తెలంగాణలో 2వ స్థానంలో ఉన్నట్లు జైలు సూపరింటెండెంట్ సైదయ్య తెలిపారు. ఉపాధి కల్పనలో మేటి... ఆదాయం గడించడమే కాకుండా ఉపాధి కల్పనలో కూడా ముందుంది ఈ బంకు. ఈ బంకులో శిక్ష పూర్తి చేసుకుని విడుదలైన ఖైదీలకు నెలకు రూ. 12 వేల వేతనం చొప్పున 16 మందికి ఉద్యోగం కల్పించారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 100 బంకులు నెలకొల్పి ఖైదీలకు ఉపాధి కల్పించేందకు కృషి చేస్తున్నారు జైళ్ల అధికారులు. వేతనం పెంచే యోచనలో... ప్రస్తుతం బంకుల్లో పనిచేస్తున్న శిక్ష ఖైదీలకు రోజుకి రూ. 110 వేతనం ఇస్తున్నారు. ఈ శ్రమ దోపిడిపై ‘సాక్షి’ ప్రతినిధి ఆ శాఖ సమావేశాల్లో పలుమార్లు రాష్ట్ర హోంమంత్రి, జైళ్ల శాఖ డీజీతో ప్రస్తావించగా వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఖైదీలకు రూ. 250 వేతనం పెంచే ప్రతిపాదనను ఆ శాఖ డీజీ ప్రభుత్వానికి పంపినట్లు అధికారులు తెలిపారు. ఖైదీల్లో మార్పు తేవడమే లక్ష్యం : ఖైదీల్లో మార్పు తేవడమే మా ప్రధాన లక్ష్యం. ఆ దిశగా మా శాఖ ఎంతో కృషి చేస్తుంది. ఖైదీల్లో మానసిక, శారీరక ఒత్తిళ్లను దూరం చేసేందుకు విభిన్న కార్యక్రమాలు చేపట్టాము. పెట్రోల్ బంకు నిర్వహణ ఎంతో సంతృప్తినిచ్చింది. మా బంకులో ఆయిల్ అమ్మకాలు అధికంగా ఉన్నాయి. ప్రజలకు నాణ్యమైన, స్వచ్ఛమైన ఆయిల్ విక్రయించి నమ్మకాన్ని చూరగొన్నాము. - బచ్చు సైదయ్య, సూపరింటెండెంట్ చంచల్‌గూడ జైలు నాణ్యమైన పెట్రోల్ దొరుకుతుంది: బంకు ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడే పెట్రోల్ పోయించుకుంటున్నాను. నగరంలో ఎక్కడా లేని విధంగా నాణ్యమైన పెట్రోల్ దొరుకుతుంది. బండి మైలేజీ కూడా పెరిగింది. ఖైదీల సేవాలు, జైళ్ల శాక ప్రయత్నం అభినందనీయం. - దర్శనం పవన్, వినియోగదారుడు -
చంచల్‌గూడలో మహిళా పెట్రోల్ బంక్
ప్రారంభించేందుకు రాష్ట్ర జైళ్ల శాఖ ఏర్పాట్లు హైదరాబాద్: దేశంలోనే మొదటిసారిగా మహిళా ఖైదీలతో నిర్వహించే పెట్రోల్ బంక్‌ను చంచల్‌గూడలో ప్రారంభించేందుకు తెలంగాణ జైళ్ల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఖైదీల సంస్కరణల్లో భాగంగా చంచల్‌గూడ మహిళా జైలులో శిక్ష అనుభవించి విడుదలైన 30 మంది మహిళలకు ఈ బంక్‌లో జీవనోపాధి కల్పించనున్నారు. వీరికి నెలకు రూ.12 వేల వేతనం ఇవ్వనున్నారు. మరో 20 రోజుల్లో ఈ బంక్ వినియోగంలోకి రానుంది. ఖైదీలకు ఉపాధి కల్పించే ప్రయత్నంలో భాగంగానే ఈ పెట్రోల్ బంక్ నెలకొల్పుతున్నామని మహిళా జైలు సూపరింటెండెంట్ బషీరాబేగం పేర్కొన్నారు. -
చంచల్‌గూడ జైలుకు నటుడు ప్రదీప్
చంచల్‌గూడ: చెక్ బౌన్స్ కేసులో నిందితుడిగా ఉన్న బుల్లి తెర నటుడు ప్రదీప్‌ని నగర పోలీసులు శుక్రవారం సాయంత్రం చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఓ చెక్ బౌన్స్ కేసులో ఎర్ర మంజిల్ కోర్టు ప్రదీప్‌పై వారెంట్ జారీ చేయగా పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం అతడికి రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు పంజాగుట్ట పోలీసులు చంచల్‌గూడ జైల్‌కు తరలించారు. అనంతరం అదే రోజు కోర్టు బెయిల్ మంజూరు చేయటంతో గంటల వ్యవధిలో ప్రదీప్ జైలు నుంచి విడుదలయ్యాడు. -
ఈ–ములాఖత్‌తో సమయం ఆదా
⇒ ఖైదీల కుటుంబ సభ్యులకు ఎంతో ఉపయోగకరం ⇒ ‘చంచల్‌గూడ’లో ఈ–ములాఖత్ ప్రారంభంలో హోం మంత్రి నాయిని హైదరాబాద్: జైళ్లలోని ఖైదీలను కలిసేందుకు వచ్చే వారి కుటుంబ సభ్యులకు ఈ–ములాఖత్ ఎంతగానో ఉపయోగపడుతోందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం ఆయన చంచల్‌గూడ జైల్లో నూతనంగా ప్రవేశపెట్టిన ఈ–ములాఖత్ సౌకర్యాన్ని ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ–ములాఖత్ పనితీరును జైళ్ల శాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్ ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నాయిని మాట్లాడుతూ.. గతంలో ములాఖత్ కోసం వచ్చే వారు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేదని, ఈ–ములాఖత్ ద్వారా ఆన్లైన్లో ఇంట్లోనే కూర్చుని ములాఖత్ నమోదు చేసుకోవచ్చని చెప్పారు. దేశంలో ఎక్కడి నుంచైనా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చన్నారు. జెళ్ల శాఖ నిర్వస్తున్న పెట్రోల్ బంక్‌ల ద్వారా ఏటా రూ. 3 కోట్ల ఆదాయం వస్తోంద న్నారు. జైళ్లలో అవినీతిని రుజువు చేస్తే రూ. 5 వేల నగదు బహుమానం ఇస్తామని డీజీ వినయ్‌కుమార్ ప్రకటించారు. కార్యక్రమంలో డీఐజీ నర్సింహ, సూపరింటెండెంట్లు బచ్చు సైదయ్య, బషీరాబేగం తదితరులు పాల్గొన్నారు. ఈ–ములాఖత్ నమోదు ఇలా.. ఖైదీలను ములాఖత్‌లో కలవాలం టే జైలు వద్ద ఉన్న ములాఖత్ నమోదు కేంద్రానికి వచ్చి ఆధార్ జిరాక్స్ అందజేస్తే ములాఖత్‌కు వచ్చే వారితో పాటు జైల్లో ఉన్న వ్యక్తి వివరాలు నమోదు చేసుకుని టోకెన్ నంబర్ ఇస్తారు. సూపరింటెండెంట్ లేదా డిప్యూటీ సూపరింటెండెంట్ ములాఖత్ ఫారమ్‌ను పరిశీలించి అనుమతి ఇస్తారు. దీనికి గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది. సమయం వృథా కాకుండా ఉండేందుకు జైళ్ల శాఖ ఈ–ములాఖత్ ను ప్రవేశపెట్టింది. eprisons. nic. inలో new visit registration ఆప్షన్లో ఆధార్ నంబర్‌తో పాటు ములాఖత్‌కు వచ్చే వారి, ఖైదీ వివరాలు నమోదు చేయాలి. తేదీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. రెండు మూడు గంటల వ్యవధిలో ములాఖత్ అనుమతించబడిందా లేక తిరస్కరించబడిందా తెలిసిపోతుంది. అనుమతించబడిన ములాఖత్ పాస్ ప్రింట్ తీసుకుని జైల్లోని ములాఖత్ కార్యాలయంలో అందజేస్తే సరిపోతుంది. -
చంచల్‌గూడ జైల్లో యంగ్ హీరో!
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. హీరో ఏంటీ.. జైలుకు వెళ్లడం ఏంటని కంగారు అక్కర్లేదండీ. ఎందుకంటే ఓ మూవీ షూటింగ్లో భాగంగా నితిన్ చంచల్‌గూడ జైలులో కొన్ని గంటలు గడిపాడు. 14 రీల్స్ బ్యానర్‌పై హను రాఘవపూడి దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ గురువారం చంచల్‌గూడ పురుషుల జైల్లో జరిగింది. దీంతో ఒక్కసారిగా జైలు ప్రాంగణంలో కొద్దిసేపు సందడి వాతావరణం నెలకొంది. నటులు పృధ్వీ, బ్రహ్మాజీ, హీరో నితిన్‌లపై జైలు లోపల కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అ..ఆ.. సినిమాతో రూ.50 కోట్ల క్లబ్లో చేరిన నితిన్ కొంత విరామం తర్వాత చేస్తున్న ఈ మూవీ షూటింగ్ గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది. ఇప్పటివరకూ జైలులో కొన్ని సీన్లు చిత్రీకరించారు. ఇంకా కొన్ని సీన్లు తీయాల్సి వస్తే మరోసారి ఈ లెటెస్ట్ మూవీ యూనిట్ చంచల్‌గూడలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఓల్డ్ సిటీ కుర్రాడిగా కనిపించేందుకు భారీగా గడ్డం పెంచేసి రఫ్ లుక్‌లో కనిపిస్తున్నాడు నితిన్. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీలో సీనియర్ నటుడు అర్జున్ స్టైలిష్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. -
చంచల్‌గూడలో నితిన్
హైదరాబాద్: చంచల్‌గూడ జైలు వద్ద సినిమా చిత్రీకరణ జరుగుతోంది. హీరో నితిన్ నటిస్తున్న సినిమాకు సంబంధించి గురువారం జైలు లోపల కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు. నటులు పృథ్వీ, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. -
బంకులో ‘చిల్లర’ గొడవ
- ఖైదీ, జైలు సిబ్బందిపై వినియోగదారులు దాడికి యత్నం - చంచల్‌గూడ జైలు పెట్రోల్ బంకులో ఘటన హైదరాబాద్: చిల్లర లేదన్నందుకు కొందరు వినియోగదారులు ఖైదీ, సిబ్బందిపై దాడికి ప్రయత్నించారు. ఈ సంఘటన శుక్రవారం చంచల్‌గూడ జైలు పెట్రోల్ బంకులో చోటుచేసుకుంది. సిబ్బంది, ఖైదీల వివరాల ప్రకారం పెట్రోల్ పోరుుంచుకున్న కొందరు వినియోగదారులు రూ. 2 వేలు నోటు ఇవ్వగా చిల్లర లేదన్న ఖైదీని దూషించడమే కాకుండా అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేయబోయారు. కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. వీరిపై వినియోగదారులు ఒక్కసారిగా దాడి చేయబోయారు. దీంతో సిబ్బంది డబీర్‌పురా పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఖైదీలు, సిబ్బందితో గొడవకు దిగిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ బచ్చు సైదయ్య తెలిపారు. -
చంచల్‌గూడ జైల్లో వైద్య శిబిరం
హైదరాబాద్ : ఆసుపత్రుల యాజమాన్యాలు జైళ్లలో వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని చంచల్‌గూడ పురుషుల జైలు సూపరింటెండెంట్ బచ్చు సైదయ్య అన్నారు. నగరానికి చెందిన ఓ డెంటల్ ఆస్పత్రి యాజమాన్యం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సైదయ్య ప్రారంభించారు. ఈ శిబిరంలో 165 మంది ఖైదీలు దంత సమస్యలపై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఖైదీలను భారీ సంఖ్యలో ఆసుపత్రులకు తరలించడంతో ఇబ్బందులు తలెత్తేవన్నారు. ఈ వైద్య శిబిరాలతో ఆ సమస్య కొంత వరకు తీరిందన్నారు. -
సుశృత మామ జైల్లో గుండెపోటుతో మృతి
హైదరాబాద్: వారం రోజుల క్రితం నగరంలో సంచలనం రేపిన వివాహిత సుశృత ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె మామ శంకర్ రావు ఆదివారం ఉదయం హార్ట్ఎటాక్తో మృతిచెందాడు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన ఆదివారం ఉదయం గుండెపోటుకు గురయ్యాడు. నగరంలోని సైదాబాద్ పూసలబస్తీకి చెందిన సుశృతను వాటర్ హీటర్ ఎక్కువసేపు వాడిందనే నెపంతో వారం రోజుల క్రితం ఆమె భర్త తీవ్రంగా కొట్టాడు. చదవండి: హీటర్ ఎక్కువసేపు పెట్టానని కొట్టిండు! బాత్రూంలో ఉన్న ఆమెను వివస్త్రగా ఉండగానే కుటుంబసభ్యుల ఎదుట తీవ్రంగా కొట్టడంతో మనస్తాపానికి గురైన ఆమె అదే రోజు వాట్సప్‌లో తన తండ్రికి మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తతో పాటు మామ శంకర్రావును అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం శంకర్రావు గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
చంచల్‌గూడకు భానుకిరణ్
హైదరాబాద్: మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి హత్యకేసులో నిందితుడైన భానుకిరణ్‌ను చర్లపల్లి జైలు నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. సూరి హత్య కేసులో అరెస్ట్ అయిన తరువాత భానుకిరణ్ నాలుగేళ్ళుగా చర్లపల్లి జైలులోనే ఉంటున్నాడు. అయితే జైలు కేంద్రంగా భాను పలు అక్రమాలకు పాల్పడుతున్నాడు. దీంతో అతనిని చంచల్ గూడ జైలుకు తరలించడానికి అనుమతి ఇవ్వాలని జైలు అధికారులు నాంపల్లి కోర్టును కోరారు. ఇందుకు కోర్టు అనుమతించడంతో ఈ రోజు మధ్యాహ్నం భానుకిరణ్ ను చంచల్ గూడకు తరలించారు. మరో వైపు భానుకు ప్రాణహాని ఉండటంతో ప్రత్యేక బ్యారక్ ను జైలు అధికారులు ఏర్పాటు చేశారు. -
చర్లపల్లి జైలును సందర్శించిన హైపవర్ కమిటీ బృందం
నగరం నడిబొడ్డున ఉన్న చంచల్‌గూడ జైలు తరలింపు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘనందన్రావులతో కూడిన హైపర్ కమిటీ బృందం గురువారం చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలును సందర్శించింది. చంచల్‌గూడ జైలును చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలుకు మార్చాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలిసిందే. ఈ క్రమంలో చర్లపల్లిలో ఉన్న వసతులను పరిశీలనలో భాగంగానే వారు జైలును సందర్శించి అధికారులతో చర్చించారు. ఓపెన్ ఎయిర్ జైలును ప్రత్యామ్నాయంగా ఎక్కడకు మార్చాలన్న పలు అంశాలపై సమీక్షించి వెళ్లారు. వారితో పాటుగా జైళ్లశాఖ డీజీ వీకే సింగ్, డీఐజీ నరసింహ, చర్లపల్లి జైళ్ల పర్యవేక్షణాధికారులు కొలను వెంకటేశ్వర్ రెడ్డి, రాజేశ్‌లు ఉన్నారు. -
ఖైదీ నంబర్ 150!
చిరంజీవి ఇప్పుడు ఖైదీ. ఆశ్చర్యంగా ఉందా? రీల్ కోసం ఖైదీగా మారారాయన. చిరంజీవి తాజా చిత్రం షూటింగ్ ఇటీవల ఆరంభమైన విషయం తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను మంగళవారం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో చిత్రీకరించారు. ఖైదీ వేషధారణలో ఉన్న చిరంజీవి పాల్గొనగా సీన్స్ తీశారు. జైలు నుంచి తప్పించుకునే సన్నివేశాలు తీశారని సమాచారం. చిరు వేసుకున్న చొక్కాపై 150 అనే అంకెలు కనిపిస్తున్నాయి. బహుశా ఇది చిరంజీవికి 150వ చిత్రం కాబట్టి.. ఖైదీ నంబర్ 150 అని కేటాయించి ఉంటారేమో! -
నకిలీబాబా శివ రిమాండ్
లైఫ్‌స్టైల్ మధుసూదన్‌రెడ్డిని మోసం చేసిన కేసు హైదరాబాద్: పూజల పేరుతో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి లైఫ్‌స్టైల్ మధుసూదన్‌రెడ్డిని మోసం చేసి రూ.1.33 కోట్లతో ఉడాయించి అరెస్ట్ అయిన నకిలీ బాబా బుడ్డప్పగారి శివ(34)ను బంజారాహిల్స్ పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించారు. శివకు సహకరించిన మరో ఇద్దరు నిందితులు ఈగ దామోదర్(44), గడప శ్రీనివాస్‌రెడ్డి(41)లను కూడా రిమాండ్‌కు తరలించారు. వీరందరినీ వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టి చంచల్‌గూడ జైలుకు తరలించారు. నింది తులు ఈ నెల 15న బంజారాహిల్స్ రోడ్‌నం.12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే ప్రముఖ వ్యాపారి గజ్జెల మధుసూదన్‌రెడ్డి అలియాస్ లైఫ్‌స్టైల్ మధుసూదన్‌రెడ్డి నివాసంలో లక్ష్మీపూజ చేస్తే రెట్టింపు డబ్బులవుతాయంటూ పూజల్లో రూ.1.33 కోట్ల నగదు కట్టలు పెట్టించి.. ఆయన కుటుంబ సభ్యులను బురిడీ కొట్టించారు. 17న టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడు, అతడికి సహకరించిన ఇద్దరినీ అరెస్టు చేశారు. బెంగళూరు శివారుల్లో ‘విల్లా’ కోసమే! సాక్షి, హైదరాబాద్: బెంగళూరు శివారు ప్రాంతంలో ఓ పెద్ద విల్లాను కొనుగోలు చేయడమే లక్ష్యంగా బుడ్డప్పగారి శివ భారీ మోసాలకు తెర తీశాడని పోలీసు విచారణలో వెల్లడైంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండుగంపల్లి గ్రామానికి చెందిన శివ...తన ఊరికి దగ్గర్లో ఉన్న ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. బెంగళూరు నగర శివారుల్లో భారీ విల్లాను కొనుగోలు చేసి సెటిల్ అవుదామనుకుని గత ఏడేళ్లలో రూ.4.25 కోట్లకుపైగా మోసాలు చేసిన శివ.. లైఫ్‌స్టైల్ మధుసూదన్‌రెడ్డి ఉదంతంలో పోలీసులకు దొరికిపోవడంతో ఆ కోరికకు బ్రేక్ పడినట్టైంది. నిందితుడు ప్రస్తుతం కుటుంబంతో బెంగళూరు శివారు సజ్జాపురంలో ఉన్న పిల్లారెడ్డి లే అవుట్లో ఓ అద్దె గదిలో ఉంటున్నట్టు పోలీసు విచారణలో వెల్లడించాడు. అయితే తాను అనుకున్న ప్రకారం మధుసూదన్ రెడ్డి ఇంట్లో పూజ తర్వాత ఆయన కుమారుడితో పాటు రూ.1.33 కోట్ల నగదును తీసుకుని దేవాలయాల చుట్టూ కారులో తిప్పేందుకు ఓకే అనడంతో పెద్ద ముప్పే తప్పినట్టైంది. లేకపోతే మత్తుమందు ఎక్కువ డోస్‌లో ఇచ్చి చంపాలనుకుని ప్లాన్ చేసినట్టు సమాచారం. కాగా ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు శివను ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణ సోమవారం జరగనుంది. -
రంగారెడ్డి జిల్లాకు చంచల్‌గూడ జైలు
* 500.21 ఎకరాల భూమి గుర్తింపు * ప్రభుత్వానికి ప్రతిపాదనలు * శాంతిభద్రతల దృష్ట్యా తరలింపు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: చంచల్‌గూడ జైలును నగరానికి దూరంగా తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని నడిబొడ్డున కేంద్ర కారాగారం ఉండడం.. ఖైదీల తరలింపు, వీఐపీ ఖైదీల తాకిడి నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుందని అంచనా వేసిన సర్కారు.. ఈ జైలును రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీంతో యాచారం మండలం మొండిగౌరెల్లి, షాబాద్ మండలం చందన్వెల్లి, వికారాబాద్ మండలం సిద్దలూరు, మం చాల మండలం తాళ్లపల్లిగూడలో అనువైన భూము ల జాబితాను రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు. కనిష్టంగా 500 ఎకరాల విస్తీర్ణం కావాలని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ, ఒకేచోట అంత భూ లభ్యత లేకపోవడంతో ఒకే రెవెన్యూ పరిధిలో వేర్వేరు పార్శిళ్లలో భూములను అన్వేషిస్తోంది. సిద్దలూరులో సర్వే నంబర్ 176, 263, 217లలోని 500.21 ఎకరాలు, మొండిగౌరెల్లిలో సర్వేనం. 19, 68, 127లలో వేయి ఎకరాల అసైన్డ్ భూములను గుర్తించింది. తాళ్లపల్లిగూడ సర్వే నంబర్ 84లో 472 ఎకరాలు, చందన్వెల్లి సర్వే 190లో 500 ఎకరాలు ఎంపిక చేసి ప్రతిపాదనలను సర్కార్‌కి పంపింది. జైలు స్థానంలో రెసిడె న్షియల్ స్కూళ్లు చంచల్‌గూడ జైలులోని ఖైదీలను విచారణ నిమిత్తం జైలు నుంచి కోర్టుకు.. అక్కడి నుంచి తిరిగి జైలుకు తీసుకురావడం ఇబ్బందిగా పరిణమించింది. ఈ నేపథ్యంలో భద్రతా దృష్ట్యా ఇది సురక్షితం కాదని ప్రభుత్వం.. దీన్ని రంగారెడ్డి జిల్లాకు తరలించాలని భావించింది. దీనికి సీఎం కేసీఆర్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. కాగా, జైలు స్థానంలో మైనార్టీ బాల, బాలికలకు రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మొండిగౌరెల్లికి చంచల్‌గూడ జైలు
యాచారం: ఉస్మానియా ఆస్పత్రి, ఛాతీ వ్యాధుల వైద్యశాల, సెక్రటేరియట్ తరలింపునకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా లిస్టులో చంచల్‌గూడ జైలు కూడా చేరింది. తాజాగా చంచల్ గూడ జైలు మార్చేందుకు ప్రయత్నాలు వేగవంతం చేశారు అధికారులు. ఇందుకోసం రంగారెడ్డి యాచారం మండలం మొండిగౌరెల్లిని ఎంచుకోనున్నట్లు సమాచారం. అధికారులు నాగార్జున సాగర్- హైదరాబాద్ రహదారికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొండిగౌరెల్లి సమీపంలో ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూములను పరిశీలించారు. చంచల్‌గూడ జైలు నగరం మధ్యన ఉండడం, వివిధ కేసుల్లో జైలుకు వచ్చే వీవీఐపీలు, తీవ్రవాదులను జైలు నుంచి కోర్టులకు తీసుకెళ్లడం భద్రత సిబ్బందికి కష్టతరంగా మారింది. ఇంతేకాకుండా ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని నగర శివారు, ఔటర్‌రింగు రోడ్డుకు అతి సమీపంలోని ప్రభుత్వ, అసైన్డ్ భూముల ఎంపికపై దృష్టి పెట్టారు. మంచాల, ఇబ్రహీంపట్నం, కందుకూర్ మండలాల్లో కూడా ప్రభుత్వ భూములను పరిశీలించినా మొండిగౌరెల్లినే ఎంపిక చేసే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. -
ఆ కి‘లేడీ’ పై 15 కేసులు
జియాగూడ(హైదరాబాద్ సిటీ): మాయమాటలతో ప్రజలను మోసం చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఓ మహిళను కుల్సుంపురా పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నందున పీడీ యాక్ట్ విధించి చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించినట్లు కుల్సుంపురా ఇన్స్పెక్టర్ రామ్మోహన్రావు తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ ఖాలీజ్‌ఖాన్ దర్గా ప్రాంతానికి చెందిన చల్లా నర్సమ్మ(40) కొన్ని నెలలుగా మాయమాటలు చెప్పి ప్రజల వద్ద నుంచి బంగారు వస్తువులు చోరీ చేస్తోంది. ఈమెపై సుమారు 15 వరకు కేసులు పలు పోలీస్స్టేషన్లలో నమోదై ఉన్నాయి. కాగా కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌లో ఓ కేసులో నిందితురాలు కావడంతో నర్సమ్మను పోలీసులు అరెస్టు చేసి పీడీ యాక్ట్ విధించి చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. -
చంచల్‌గూడ జైలులో ఖైదీ మృతి
హైదరాబాద్: చంచల్‌గూడ కారాగారంలో ఒక రిమాండ్ ఖైదీ మృతిచెందాడు. తిరుమలగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 17వ తేదీన జరిగిన దొంగతనం ఘటనపై డబీర్‌పురా పోలీసులు శ్రీనివాస్(35)ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌లో ఉంచారు. జైలులో ఉండగానే ఇతడు ఆదివారం అర్థరాత్రి అకస్మాత్తుగా చనిపోయాడు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇతని మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. -
చంచల్‌గూడలో ఖైదీల కొట్లాట
హైదరాబాద్: చంచల్‌గూడ జైలులో మంగళవారం ఉదయం ఖైదీల మధ్య కొట్లాట జరిగింది. విదేశీ ఖైదీలను ఉంచే బ్యారక్‌లో గొడవ తలెత్తటంతో అధికారులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడిన నైజీరియా దేశస్థుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
రావెల సుశీల్ కి ముగిసిన పోలీసు కస్టడీ
చంచల్‌గూడ : మహిళను వేధించిన కేసులో పోలీసుల కస్టడీలో ఉన్న ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు సుశీల్, అతని కారు డ్రైవర్ రమేష్‌లను శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులు తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి నిందితులను విచారించేందుకు కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీ విధించిన విషయం తెలిసిందే. కాగా రెండు రోజుల విచారణ ముగియడంతో పోలీసులు ఇద్దరు నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరిచి తిరిగి జైలుకు తరలించారు. -
పోలీసు కస్టడీకి రావెల సుశీల్
హైదరాబాద్: మహిళను వేధించిన కేసులో చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఏపీ మంత్రి రావెల కిషోర్ తనయుడు రావెల సుశీల్, అతని డ్రైవర్ రమేష్‌లను బంజారాహిల్స్ పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 3న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంబేడ్కర్ బస్తీకి చెందిన టీచర్ ఫాతిమా బేగంను వెంబడించి, వేధించిన ఘటనలో సుశీల్, రమేష్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. నిందితులను విచారించేందుకు కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీ విధించింది. దీంతో బంజారాహిల్స్ పోలీసులు మధ్యాహ్నం 2.30 గంటలకు నిందితులిద్దరినీ కస్టడీలోకి తీసుకున్నారు. ఇది ప్రతిపక్ష కుట్ర: సుశీల్ తనపై కేసు నమోదు చేయడం వెనక ప్రతిపక్ష పార్టీ హస్తముందని రావెల సుశీల్ ఆరోపించారు. కస్టడీలోకి తీసుకున్న అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సుశీల్ మాట్లాడుతూ.. తనపై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలన్నారు. ఆ ఘటనలో కేసు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. తాను మంత్రి కుమారుడినైనందునే కేసు పెద్దదైందన్నారు. -
సిట్ కస్టడీలో ‘ఐసిస్ త్రయం’
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)లో చేరేందుకు వెళుతూ మహారాష్ట్రలోని నాగ్‌పూర్ విమానాశ్రయంలో చిక్కిన ముగ్గురు యువకులు అబ్దుల్లా బాసిత్, సయ్యద్ ఒమర్ ఫారూఖ్ హుస్సేనీ, మాజ్ హసన్ ఫారూఖ్‌లను సీసీఎస్ అధీనంలోని సిట్ అధికారులు మంగళవారం కస్టడీలోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఈ ముగ్గురినీ వారం రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. దీంతో సిట్ బృందం చంచల్‌గూడ జైలులో ఉన్న ముగ్గురినీ కస్టడీలోకి తీసుకుని, ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆపై తమ కార్యాలయానికి తీసుకువెళ్లి విచారణ ప్రారంభించారు. వారం రోజుల విచారణలో భాగంగా వీరిని ఆదిలాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు తీసుకువెళ్లనున్నారు. కాశ్మీర్‌కు చెందిన వివాదాస్పద నాయకురాలు అంద్రాబీతో వీరికి సంబంధాలు ఉన్నాయా అనే అంశంపై ఆరా తీయాలని సిట్ నిర్ణయించింది. -
'చంచల్‌గూడ జైలు, రేస్ కోర్స్ తరలించండి'
-
బాలిక అదృశ్యం: యువకుడిపై కేసు
చంచల్‌గూడ : ప్రేమ పేరుతో మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడనే ఆరోపణతో ఓ యువకుడిపై మాదన్నపేట పోలీస్ స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. ఎస్సై వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కుర్మగూడ డివిజన్ చంద్రయ్యహట్స్‌లో నివాసముంటున్న బందయ్య, నిర్మల దంపతుల కుమార్తె(14) స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కాగా ఆదివారం సాయంత్రం కిరాణా షాపునకు వెళ్లిన ఆ బాలిక రాత్రయినా తిరిగిరాలేదు. అన్నిచోట్లా వెతికినా ఆచూకీ తెలియ లేదు. అయితే ఆమె అదృశ్యం వెనుక అదే ప్రాంతానికి చెందిన ఎక్ట్రీషియన్ పి.రాజేష్ అలియాజ్ బబ్లూ (27) హస్తం ఉన్నట్లు బాలిక తల్లి నిర్మల మాదన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజేష్‌పై కేసు నమోదు చేసి కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేసున్నారు. -
త్వరలో ఖైదీలకు క్షమాభిక్ష
సాక్షి, హైదరాబాద్: యావజ్జీవశిక్ష పడిన ఖైదీల క్షమాభిక్షను త్వరలో అమలు చేస్తామని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి జైళ్లశాఖ ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఇటీవలే ముసాయిదా విధి విధానాలు తయారు చేసి ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిపారు. ప్రభుత్వ స్థాయిలో ఖైదీల విడుదలకు రివ్యూ కమిటీని ఏర్పాటు చేసి త్వరలో తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. నూతనంగా నిర్మించిన జైళ్లశాఖ ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం హోంమంత్రి నాయిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణ జైళ్లశాఖను తీర్చిదిద్దామని వివరించారు. మహాపరివర్తన కార్యక్రమం ద్వారా ఖైదీలలో మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు. జైళ్లశాఖ కేవలం ఖైదీల భద్రతా విధులు మాత్రమే కాకుండా.. వారిని ప్రధాన మానవ వనరుగా పరిగణించి పలు సామాజిక సేవా అభివృద్ధి పథకాలు రూపొందించడం అభినందనీయమన్నారు.చంచల్‌గూడ జైలు తరలింపునకు కనీసం నాలుగేళ్ల సమయం పట్టవచ్చని పేర్కొన్నారు. జైళ్లశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగమేళా: డీజీ వీకే సింగ్ జైళ్లశాఖ ఆధ్వర్యంలో శిక్ష పడిన ఖైదీలకు వివిధ రంగాలలో శిక్షణ ఇస్తున్నట్టు డెరైక్టర్ జనరల్ (డీజీ) వీకే సింగ్ తెలిపారు. శిక్ష పూర్తి చేసుకుని జైలు నుంచి బయటకు వెళ్లినవారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఒకట్రెండ్ నెలల వ్యవధిలో ఉద్యోగమేళా నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం వివిధ కంపెనీలను ఆహ్వానిస్తామని తెలిపారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో ప్రభుత్వం కేటాయించిన వెయ్యి ఎకరాల్లో ఓపెన్ జైలు ఏర్పాటుచేయనున్నట్టు చెప్పారు. ఖైదీలను గౌరవప్రదమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్నామని, భవిష్యత్తులో జైళ్లశాఖ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. కార్యక్రమంలో జైళ్లశాఖ హైదరాబాద్ రేంజ్ డీఐజీ నర్సింహ, వరంగల్ రేంజ్ డీఐజీ కె.కేశవనాయుడు, చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ సైదయ్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
జైల్లో ఖైదీ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : నగరంలోని చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఖైదీ గురువారం ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన జైలు సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నగరానికి చెందిన రౌడీషీటర్ రమేష్ ఓ కేసులో చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ క్రమంలో గురువారం జైల్లో మేకులు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గుర్తించిన జైలు సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తరలించారు. -
బ్యూటీషియన్ నందిని జైలుకు తరలింపు
బంజారాహిల్స్: అమ్మిపెడతానని జ్యువెలరీ వ్యాపారి నుంచి బంగారు నగలు తీసుకొని వాటిని తన సొంతానికి వాడుకొని మోసంచేసిన బ్యూటీషియన్ నందినీ చౌదరిని ఒక రోజు విచారణ అనంతరం పోలీసులు తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. పోలీసు విచారణలో ఆమె మరిన్ని విషయాలను వెల్లడించడమే కాకుండా మధ్యవర్తి తీసుకున్న రూ.10 లక్షల విలువ చేసే నెక్లెస్‌ను పోలీసులకు తిరిగి అప్పగించింది. వివరాలు.. అబిడ్స్‌కు చెందిన నగల వ్యాపారి వద్ద బ్యూటీషియన్ నందిని రూ.5 లక్షల అప్పు తీసుకుంది. ఆ వ్యాపారి తనకు డబ్బు ఇప్పించాలంటూ బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని కమాన్‌లోని ఓ నేతను ఆశ్రయించగా ఆయన నందినీ చౌదరిపై ఒత్తిడి తెచ్చి ఆమె వద్ద ఉన్న రూ.10 లక్షల విలువ చేసే నెక్లెస్‌ను తీసుకున్నాడు. నగల వ్యాపారికి నందిని ఇవ్వాల్సిన రూ.5 లక్షలను తానే చెల్లించి నగను తన వద్దే ఉంచుకున్నాడు. విచారణలో నందిని ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆ నెక్లెస్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బంజారాహిల్స్ రోడ్ నెం 9లోని అల్లావుద్దీన్ అనే వ్యాపారి నుంచి కూడా నందిని రూ.2.5 లక్షలు అప్పుగా తీసుకొని ఎగ్గొట్టింది. సదరు వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా, రోజురోజుకూ నందినీ చౌదరి నేరాల చిట్టా పెరుగుతుండటంతో మరోమారు ఆమెను కస్టడీకి తీసుకొని విచారించాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలిసింది. -
ఖైదీల మసాజ్ సెంటర్ ప్రారంభం
జైళ్లశాఖ సంస్కరణలను అభినందించిన డీజీ అనురాగ్‌శర్మ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జైళ్లశాఖ ఆధ్వర్యంలో చంచల్‌గూడ జైలు వద్ద ప్రకృతి చికిత్సాలయ తరహాలో ఏర్పాటుచేసిన మసాజ్ సెంటర్‌ను డీజీపీ అనురాగ్‌శర్మ ప్రారంభించారు. ఖైదీలకు ప్రత్యేక శిక్షణనిచ్చి, వారిచేత కేరళ మాదిరిగా ప్రకృతి చికిత్సలందజేయడం అభినందనీయమన్నారు. అదే విధంగా ఖైదీల ములాఖత్ కోసం వచ్చే సందర్శకులు వేచి ఉండటం కోసం ఏర్పాటు చేసిన విజిటర్స్‌లాంజ్‌ను కూడా డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ములాఖత్ విషయంలో జైళ్లశాఖ అవలంభిస్తున్న నూతన పద్ధతిని పరిశీలించారు. ములాఖత్‌కు వచ్చే వారికి ఏర్పాటు చేసిన సౌకర్యాలు, ప్రతీ ఒక్కరి పూర్తి వివరాల సేకరణ, ప్రత్యేక వెబ్ కెమెరా ద్వారా ఫోటో తీసే విధానం పట్ల డీజీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. జైళ్లశాఖ ఖైదీలకు కల్పిస్తున్న పనులను అడిగి తెలుసుకున్నారు. చంచల్‌గూడ వద్ద నిర్వహిస్తున్న పెట్రోల్‌బంక్‌ను పరిశీలించారు. జైళ్లశాఖ డీజీ వీకే సింగ్ నూతన సంస్కరణల ద్వారా సమకూర్చుకుంటున్న వైనం, సిబ్బంది పనితీరును అనురాగ్‌శర్మ ప్రత్యేకంగా అభినందించారు. -
కమెడియన్ ఆలీ.. ఖైదీల 'శ్రీమంతుడు'
హైదరాబాద్: 'శ్రీమంతుడు' సినిమా స్ఫూర్తితో సినీ నటులు, రాజకీయ నాయకులు పలు గ్రామాలను దత్తత తీసుకుంటున్న వార్తలు చూస్తూనే ఉన్నాం. కాగా, అందరికంటే భిన్నంగా.. దత్తత విషయంలో మరో ముందడుగు వేశారు కమెడియన్ ఆలీ. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం చంచల్ గూడా జైలులో సందడిచేసిన ఆలీ.. నలుగురు మహిళా ఖైదీలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రతి ఏటా గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా సెలబ్రీటీలను తీసుకొచ్చి ఖైదీలతో మాట్లాడించే అధికారులు ఈ సారి ఆలీని ఆహ్వానించారు. జైలు ప్రాంగణంలో ఆడా, మగ ఖైదీలు, అధికారులు పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొన్న ఆలీ.. హాస్యోక్తులతో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా జైళ్ల శాఖ డీఐజీ నర్సింహ మాట్లాడుతూ.. ఓ ఖైదీని దత్తత తీసుకోవాలని అలీకి సూచించారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఆలీ.. నలుగురు మహిళా ఖైదీలను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ కలెక్టర్ బొజ్జ రాహుల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
చంచల్ గూడ సూపరింటెండ్‌పై మానవతారాయ్ ఫిర్యాదు
హైదరాబాద్: చంచల్ గూడ సూపరింటెండ్‌పై ఉస్మానియా విశ్వవిద్యాలయం నేత మానవతారాయ్ ఫిర్యాదు చేశారు. ఓయూలో ప్రిన్సిపల్‌పై దాడి ఘటనకు సంబంధించి తమను జైలుకు తీసుకెళ్లినప్పుడు ఆయన తొమ్మిదిమంది విద్యార్థులపై దాడి చేశారని ఆరోపించారు. ఈ మేరకు జైళ్లశాఖ డీజీ వీకే సింగ్‌కు ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు. -
చికిత్స పొందుతూ మహిళా ఖైదీ మృతి
హైదరాబాద్: గుండె నొప్పితో ఓ మహిళ ఖైదీ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. చంచల్‌గూడ మహిళ జైలు సూపరింటెండెంట్ బషీరా బేగం తెలిపిన వివరాలివీ.. సికింద్రాబాద్ బొల్లారం ప్రాంతానికి చెందిన వడ్డెర రేణుక(39) ఓ హత్య కేసులో నిందితురాలు. ఆమెను పోలీసులు గత ఏడాది డిసెంబర్లో చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆమె రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తోంది. మంగళవారం ఉదయం రేణుకకు అకస్మాత్తుగా గుండె నొప్పి రాగా జైలు వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఉస్మానియా వర్గాలు సమాచారం ఇచ్చినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. మృతురాలి బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఈ ఘటనపై మాదన్నపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సీఐ కేపీవీ రాజు తెలిపారు. -
బాబు డైరెక్షన్.. రేవంత్ యాక్షన్
ఎన్ని కోట్లయినా ఎమ్మెల్సీని గెలుచుకోవాలని వ్యూహం ♦ కనీసం ఐదుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు స్కెచ్ ♦ డీల్ కుదిర్చే బాధ్యతలు రేవంత్‌కు ♦ ఐదేసి కోట్లు ఇస్తామంటూ నలుగురు ఎమ్మెల్యేలకు ఆఫర్ ♦ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు 50 లక్షల అడ్వాన్స్ ♦ స్టీఫెన్‌కు డబ్బులివ్వబోయి ఏసీబీకి చిక్కిన రేవంత్ సాక్షి, హైదరాబాద్: ‘ఎన్ని కోట్లు ఖర్చయినా సరే.. ఎలాగైనా తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలి. కనీసం ఐదుగురు ఎమ్మెల్యేలనైనా కొనుగోలు చేయాలి’.. ఇదీ ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహం. రాష్ర్ట విభజన తర్వాత 40 మంది ఎమ్మెల్సీలతో కొలువుదీరిన మండలిలో టీడీపీకి ప్రస్తుతం ప్రాతినిధ్యం లేకపోయింది. ఇప్పటికే ఐదుగురు టీడీపీ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో చేరిపోవడం, మరొకరు పదవీ విరమణ చేయడంతో ఆ పార్టీకి గడ్డు పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎలాగైనా ఎమ్మెల్యే కోటాలో ఒకరిని మండలికి పంపాలన్న పట్టుదలతో బాబు ఉన్నారు. ఇందుకోసం కోట్లు గుమ్మరించేందుకు సిద్ధపడ్డారు. దీనిలో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని రంగంలోకి దించారు. రేవంత్ కోరుకున్నట్లు వరంగల్ జిల్లాకు చెందిన వేం నరేందర్‌రెడ్డికి టికెట్ ఇచ్చారు. అతణ్ని గెలిపించుకునేందుకు అన్ని విధాలా ఆర్థిక సాయం చేసేందుకు బాబు హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టే నోటిఫికేషన్ వెలువడటంతోనే రేవంత్ రంగంలోకి దిగారు. తెరవెనక బాబు మంత్రాంగం పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు బాబు పెద్ద మంత్రాంగమే నడిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కేటాయించిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని భావించారు. ఇందుకోసం ఆర్థికావసరాలు ఉన్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, నామినేటెడ్ ఎమ్మెల్యేను గుర్తించారు. వీరందరికీ రూ.5 కోట్ల చొప్పున చెల్లించేందుకు సిద్ధమయ్యారు. డబ్బు సమకూర్చే బాధ్యతను టీడీపీకే చెందిన ఓ ఎంపీకి అప్పగించారు. సదరు ఎంపీ సూచనల మేరకు డబ్బును జూబ్లీహిల్స్‌లోని ఓ సినీ నిర్మాత ఇంటికి చేర్చారు. అక్కడి నుంచి కొంత డబ్బును అడ్వాన్స్‌గా ఎమ్మెల్యేలకు చేరవేసే బాధ్యతను రేవంత్‌కు అప్పగించారు. టీఆర్ఎస్ తీరుతో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ అసంతృప్తితో ఉన్నారని అంచనాకు వచ్చిన రేవంత్.. ఆయనను ముగ్గులోకి దింపేందుకు టీడీపీ సానుభూతిపరుడు మాథ్యూస్ జెరూసలెం(మత్తయ్య)ను రంగంలోకి దింపారు. ఇది కొంత ఆలస్యం అవుతుండడంతో మరో మధ్యవర్తి సెబాస్టియన్ రంగ ప్రవేశం చేశారు. రూ.5 కోట్ల డీల్ కావడంతో బాబుతోనూ రేవంత్ మాట్లాడించినట్లు సమాచారం. ఈ తతంగంపై 29వ తేదీ రాత్రే ఏసీబీ చీఫ్ ఎకే ఖాన్‌కు స్టీఫెన్ ఫిర్యాదు చేశారు. వారి సూచనల మేరకే రేవంత్‌తో స్టీఫెన్ సంభాషణలు సాగాయి. రేవంత్‌ను తన ఇంటికి కాకుండా, లాలాగూడలోని తన దగ్గరి బంధువు నివాసానికి పిలిపించారు. పోలింగ్‌కు ముందు రోజు మధ్యాహ్నం నుంచి డీల్‌లో భాగంగా అడ్వాన్స్ చెల్లించే ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు రూ.50 లక్షలు ముట్టజెప్పారు. స్టీఫెన్‌కు కూడా ముట్టజెప్పేందుకు ఆయన చెప్పిన చిరునామాకు వెళ్లి రేవంత్ ఆయన అనుచరులు చిక్కిపోయారు. రేవంత్ అరెస్టు కావడంతో అప్పటికే డబ్బు తీసుకున్న ఎమ్మెల్యే కూడా భయపడి అడ్వాన్స్ సొమ్మును అప్పటికప్పుడు వెనక్కి పంపించినట్లు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు ప్రచారం చేశారు. దీంతో మిగతా ముగ్గురు కూడా తాము డబ్బు తీసుకోబోమంటూ మధ్యవర్తులకు సమాచారం పంపారు. వారి మొబైల్ ఫోన్లను స్విచాఫ్ చేసుకున్నారు. అప్పటికే రేవంత్ వారితో ఒకటికి రెండు సార్లు ఫోన్లో మాట్లాడి డీల్ సెట్ చేశారు. ఈ ఫోన్లతోనే నిఘావర్గాలు అప్రమత్తమయ్యాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యులకు సమాచారం చేరిపోయింది. ఈ సమాచారం ఆధారంగానే గత నెల 29న టీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశంలో సీఎం కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఎవరెవరితో ఎవరు మాట్లాడుతున్నారో తెలుసంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ రంగ ప్రవేశంతో చంద్రబాబు వ్యూహం బెడిసికొట్టింది. అవినీతి నిరోధక శాఖ విచారణలో ఈ అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. వీటి ఆధారంగా మరింత సమాచారాన్ని రాబట్టేందుకు రేవంత్‌ను పది రోజులపాటు కస్టడీలోకి తీసుకోవాలని ఏసీబీ భావిస్తోంది. -
చంచల్‌గూడ నుంచి చర్లపల్లికి...
-
రేవంత్.. ఖైదీ నెంబర్ మారింది
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఖైదీ నెంబర్ 4170 కేటాయించారు. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డిని మంగళవారం సాయంత్రం చంచల్‌గూడ జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. అనంతరం ఆయనకు చర్లపల్లి జైలులో ఖైదీ నెంబర్ 4170 కేటాయించినట్టు జైలు అధికారులు పేర్కొన్నారు. అంతకు ముందు చంచల్‌గూడ జైలులో 14 రోజుల రిమాండులో ఉన్న రేవంత్‌కు 1779 కేటాయించారు. అయితే చంచల్ గూడ జైలులో రిమాండులో ఉన్న ఆయనను చర్లపల్లి జైలుకు తరలించాలని ఏసీబీ కోర్టులో అధికారులు రిక్విజిషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో చర్లపల్లి జైలుకు మార్చి.. అక్కడ కొత్త ఖైదీ నెంబరు ఇచ్చారు. -
చంచల్‌గూడ నుంచి చర్లపల్లికి రేవంత్ తరలింపు
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని చంచల్‌గూడ జైలు నుంచి చర్లపల్లి జైలుకు మంగళవారం తరలించారు. ఆయన్ను చంచల్‌గూడ జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండులో ఉన్న ఆయనను చర్లపల్లి జైలుకు తరలించాలని ఏసీబీ కోర్టులో అధికారులు రిక్విజేషన్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. మరోవైపు రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 5వ తేదీకి వాయిదా పడింది. శుక్రవారం కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ అధికారులను కోర్టు ఆదేశించారు. కాగా రాజకీయంగా కుట్రచేసి రేవంత్‌ను ఇరికించారని ఆయన తరపున లాయర్లు అంటున్నారు. -
చంచల్‌గూడ నుంచి చర్లపల్లికి..
-
చంచల్‌గూడ నుంచి చర్లపల్లికి..
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని చంచల్‌గూడ జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండులో ఉన్న ఆయనను చర్లపల్లి జైలుకు తరలించాలని ఏసీబీ కోర్టులో అధికారులు రిక్విజేషన్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. మరోవైపు రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 5వ తేదీకి వాయిదా పడింది. శుక్రవారం కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ అధికారులను కోర్టు ఆదేశించారు. కాగా రాజకీయంగా కుట్రచేసి రేవంత్‌ను ఇరికించారని ఆయన తరపున లాయర్లు అంటున్నారు. -
భూకంప బాధితులకు ఖైదీల చేయూత
హైదరాబాద్: నేపాల్ భూకంప బాధితులకు చంచల్‌గూడ కారాగారంలోని ఖైదీలు తమ వంతు సాయం అందించారు. ఈ మేరకు జైలు సూపరింటెండెంట్ బి. సైదయ్య ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఆదివారం ఖైదీలకు ఆహారంలో మాంసం అందజేస్తారు. కాగా, ఆదివారం చంచల్‌గూడ జైల్లోని 821 మంది ఖైదీలు ఒక రోజు మాంసాహారం మానేసి అందుకయ్యే ఖర్చు రూ. 47,200ను విరాళంగా అందివ్వాలని తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ అధికారులను కోరారు. వారి వినతి మేరకు ఈ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి పంపుతున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. -
జైల్లో 'ఉగ్ర' నిరశన
హైదరాబాద్: చంచల్‌గూడ జైల్లో ఉన్న ఐఎస్ఐ తీవ్రవాదులు మంగళవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఇటీవల ఇన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఐఎస్ఐ తీవ్రవాది వికారుద్దీన్‌కు మద్దతుగా ఈ దీక్ష చేపడుతున్నట్లు తీవ్రవాదులు రాతపూర్వకంగా లేఖ ఇచ్చారని జైలు సూపరింటెండెంట్ సైదయ్య తెలిపారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఐదుగురు ఉగ్రవాదులు జాహిద్, ఖలీమ్, ఆబిద్ హుస్సేన్(అలీభాయ్), బిశ్వాక్, షకీల్‌లు ఉన్నారు. కాగా ప్రతిరోజులాగే వారికి ఆహారం అందజేసిన ట్లు అధికారులు తెలిపారు. వీరు దీక్ష చేపట్టడం వెనుక ఎవరి ఆదేశాలైనా ఉన్నాయా లేక జైలు నుంచి కోర్టుకు తరలించే క్రమంలో వీరికి ఎవరైనా సమాచారం ఇచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదులను ఆఖరుసారిగా ఈ నెల 9న విచారణ నిమిత్తం నాంపల్లి కోర్టుకు తరలించారు. -
డీసీ బ్రదర్స్‌ను కలిసిన కుటుంబ సభ్యులు
హైదరాబాద్: చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ టి. వెంకట్రామిరెడ్డిని శనివారం ఆయన సతీమణి మంజుల, పిల్లలు గాయత్రీరెడ్డి, విజయ్‌రెడ్డిలు ప్రత్యేక ములాఖత్‌లో కలిసి వెళ్లారు. ఇదే కేసులో జైల్లో ఉన్న వెంకట్రామిరెడ్డి సోదరుడు ,మరోసహ నిందితుడు అయిన వినాయక రవిరెడ్డిని కూడా ఆయన సతీమణి శాంతి ప్రియదర్శినీరెడ్డి కలిశారు. -
రెండో రోజు సీబీఐ కస్డడీకి డీసీ నిందితులు
హైదరాబాద్: రుణాల పేరుతో కెనరా బ్యాంక్‌ను మోసం చేసి కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిన కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మన్ వినాయక రవిరెడ్డిలను సీబీఐ అధికారులు మంగళవారం రెండోరోజు కస్టడీకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలులో ఉదయం 9.30 గంటలకు కస్టడీలోకి తీసుకుని కోఠిలోని సీబీసీ కార్యాలయానికి తరలించారు. విచారణ సమయంలో రవిరెడ్డికి ఛాతీ నొప్పి రావడంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వెంకట్రామిరెడ్డిని తిరిగి జైలుకు తరలించారు. -
బీవీ శ్రీనివాసరెడ్డి విడుదల
హైదరాబాద్: ఓఎంసీ కేసులో నిందితుడిగా ఉన్న ఓఎంసీ బీవీ శ్రీనివాసరెడ్డి శుక్రవారం చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. 2011, సెప్టెంబర్ 5న ఆయనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓఎంసీ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డి కూడా నేడు జైలు నుంచి విడుదలయ్యారు. -
చవితి పందిళ్లలో గీతాల దరువు
విమలక్క అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పచ్చని చెట్లు... కలుషితం లేని హృదయాలు... ఏ ఇంటికెళ్లినా ఆప్యాయత... ఎవరిని కదిలించినా మమత... విభిన్న సంస్కృతుల వేదికై... భిన్నత్వంలోనూ ఏకమై... నిఖార్సయిన మానవ విలువలకు నిలువెత్తు రూపం నాటి నగరం. చిన్ననాడే విప్లవమార్గం పట్టి... ఉద్యమ గీతికలను వంటబట్టించుకుని... ప్రజా పోరాటాల వారధిగా మారిన ‘అరుణోదయ’ విమలక్కది ఈ భాగ్యనగరితో నాలుగున్నర దశాబ్దాల అనుబంధం. ఆ ‘జ్ఞాపకం’ సిటీ ప్లస్‌కు ప్రత్యేకం... అది 1970... మా ఊరు నల్లగొండ జిల్లా ఆలేరు నుంచి అమ్మతో కలసి హైదరాబాద్ వచ్చా. ఉప్పల్‌లో దిగి... అక్కడి నుంచి నడుచుకుంటూ చంచల్‌గూడ జైలుకు వెళ్లాం. నాన్న బండ్రు నర్సింహయ్యను కలిసేందుకు. నగరానికి రావడం అదే తొలిసారి. అంతా చెట్లు, చేమలు... అడవిలా ఉండేది. ఇక్కడికి మా ఊరు దాదాపు 75 కిలోమీటర్లు. అక్కడి నుంచి రైలు లేదంటే కట్టెల లారీల్లో ప్రయాణం. రైలేతే నో టికెట్. నాన్న కోసం వచ్చిపోతుండేవాళ్లం. తరువాత ముషీరాబాద్ జైలుకు వెళ్లేవాళ్లం. నగరం ఇంత పెద్దగా ఉంటుందా అనిపించింది. ఉప్పల్‌లో ఇరానీ హోటల్ ఉండేది. అందులో చాయ్ తాగుతుంటే... ఆ రుచే వేరు. అక్కడ ఆ పేరుతోనే బస్టాప్... ‘ఇరానీ చాయ్’. చార్మినార్ మట్టి గాజులు సిటీకి ఎప్పుడు వచ్చినా అంబర్‌పేట్‌లోని చిన్నాన్న ఇంట్లోనే బస. వారం పదిరోజులు ఉండేవాళ్లం. బేగంపేటలో షాపింగ్. చార్మినార్‌లో మట్టి గాజులు కొనుక్కునేదాన్ని. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ‘సంగమ్’ థియేటర్లో సినిమాలు చూసేవాళ్లం. రామంతపూర్, పార్శీగుట్ట, రాంనగర్ బస్తీలే నా ప్రపంచం. ఓయూతో అనుబంధం... నా పదకొండో ఏట నుంచి ఉస్మానియా యూనివర్సిటీతో ఎంతో అనుబంధం. నాకు ఇంతకంటే అద్భుతమైన, అందమైన విశ్వవిద్యాలయం కనిపించలేదు. అప్పట్లో నన్ను పిలిచి పాటలు పాడించుకొనేవారు. 1974లో ఓయూలోనే అరుణోదయ పురుడు పోసుకుంది. రామసత్తయ్య నాకు పాటలు నేర్పారు. బుర్రకథ నేర్చుకోవడానికి కానూరి వెంకటేశ్వరరావు తాతయ్య ఇంటికి వెళ్లేదాన్ని. ఇక వినాయక చవితి పందిళ్లను విప్లవగీతాలకు వేదికగా చేసుకొని గళం వినిపించేవాళ్లం. నాటి పీడీఎస్‌యూ నాయకురాలు, ప్రొఫెసర్ లక్ష్మి రూమ్‌లో మకాం. దట్టమైన చింత చెట్లు. వాటి మధ్య నుంచి రాకపోకలు. ఎంత తిరిగినా అప్పట్లో భయమన్నది లేదు. ఇప్పుడు..! రోజుకు లెక్కలేనన్ని దారుణాలు, మహిళలపై అఘాయిత్యాలు. క్యాంపస్‌లో ఓ బడ్డీ ఉండేది. అందులో చాయ్, సమోసా, బాదం పాలు స్పెషల్. ముచ్చట్లకూ సెంటర్ అదే. క్యాంపస్ పార్కులో కూర్చుంటే ఎంతో ఆహ్లాదం. బస్తీలే ప్రపంచం... ఆలేరులో నా క్లాస్‌మేట్స్‌లో కొంతమంది ఇక్కడ ఉంటున్నారు. అప్పుడప్పుడూ కలుస్తుంటాం. నచ్చే ఫుడ్ అంటే... ఎక్కువగా బస్తీల్లోనే ఉండటం వల్ల అక్కడ వారు పెట్టిందే తినడం. ఎప్పుడన్నా హోటల్‌కు వెళితే బిర్యానీ ఆర్డర్ చేసేవాళ్లం. కానీ బిర్యానీ, ఇరానీ చాయ్‌లో ఇప్పుడా టేస్ట్ లేదు. ఇప్పుడెక్కడున్నాయి..! నాటి మానవ సంబంధాలు కోల్పోని జనారణ్యం తెలుసు. కల్మషం లేని చిరునవ్వులు, ఆప్యాయత, అనుబంధాలూ చూశా. ఎవరింటికి వెళ్లినా ఎన్ని రోజులైనా ఉండగలిగే పరిస్థితి. సహజమైన, స్వచ్ఛమైన ప్రేమ, మమకారం. నేడు... నగరీకరణ నేపథ్యంలో నగరం చుట్టూ ఉన్న వందల గ్రామాలు, పల్లెలు, బస్తీలు విధ్వంసం అయ్యాయి. ప్రపంచీకరణ పేరుతో మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారాయి. ఎవరింటికన్నా వెళితే... ఎప్పుడు పోతావని చూస్తున్నారు. నగరాన్ని పట్టిన కాలుష్యంలా... మనసులూ కలుషితమయ్యాయి. లక్షల రూపాయల జీతాలు తెచ్చుకుంటున్నా... విశాలమైన భవనాల్లో ఉంటున్నా... మనసులు ఇరుకైపోయాయి. నాడు ఇరుకు గదుల్లో బతికినా హృదయాలు విశాలం. చావు- పుట్టుకలు సహజం. ఈ రెండింటి మధ్య ఉన్న చిన్న సమయంలో మనమేం చేస్తున్నామన్నది ముఖ్యం. పుట్టేటప్పుడు ఏమీ తెచ్చుకోం. పోయేటప్పుడూ ఏమీ తీసుకుపోం. ఎప్పటికీ మిగిలేది మంచితనం, మానవత్వం. నేను కోరుకునేది ఒక్కటే... నాటి మమకారాలు, ప్రేమలు మళ్లీ ఈ మహానగరంలో చిగురించాలని. -
పతాన్ కుమార్ బెయిల్ పై విడుదల
-
'నన్ను ఎవరో చాకచక్యంగా ఇరికించారు'
హైదరాబాద్ : సైనిక రహస్యాలను ఉగ్రవాదులకు చేరవేసిన కేసులో రిమాండ్‌లో ఉన్న సైనికోద్యోగి పటన్ కుమార్ పొద్దార్ (40) గురువారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. ఆగస్టు 3న అతన్ని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేయడం, బుధవారం నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మిలటరీ అధికారి మేజర్ రంజిత్ సంతకం చేసిన కీలక డాక్యుమెంట్లు పాకిస్తాన్ ఉగ్రవాదులకు చేరాయి. ఈ డాక్యుమెంట్లను ఈ-మెయిల్ ద్వారా ఈ ఏడాది జూన్ 7న అనుష్క అగర్వాల్‌కు పటన్ పంపినట్లు సీసీఎస్ పోలీసుల విచారణలోతేలింది. అనుష్క, పటన్లు ఉపయోగించిన ఫోన్ నంబర్లు ఎవరి పేర్లపై తీసుకున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. కీలక ర హస్యాలను పటన్, అనుష్కకు చేరవేసినట్టు గుర్తించారు. ప్రతిఫలంగా పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా మంగళ్గిరి ఎస్బీఐ బ్రాంచ్‌లో ఉన్న అతని అకౌంట్‌కు దశలవారీగా అనుష్క అగర్వాల్ డబ్బులు పంపినట్లు తేలింది. ఆమె ఆదేశాల మేరకు పటన్ అకౌంట్లోకి డబ్బులు వేసిన ఆసీఫ్ అలీ మాత్రమే పోలీసులకు చిక్కాడు. మిగతా చోట్ల నుంచి పటన్ అకౌంట్లోకి డబ్బులు వేసిన వారు ఇంకా చిక్కలేదు. నన్ను ఇరికించారు: పటన్ నిస్వార్ధంగా విధులు నిర్వహిస్తున్న తనను ఎవరో చాకచక్యంగా ఈ కేసులో ఇరికించారని జైలు నుంచి విడుదలైన పటన్ కుమార్ పొద్దార్ 'సాక్షి' వద్ద వాపోయాడు. తన అకౌంట్లో ఎవరు డబ్బులు వేశారో తెలియదన్నారు. తనతో వెబ్ కెమెరాలో మాట్లాడినదీ, ఫేస్బుక్ ద్వారా చాటింగ్ చేసినదీ ఒకే యువతని చెప్పాడు. కాగా ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థకు మన సైన్యానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు చేరినట్టు తెలిసింది. దీంతో పాటు 'స్వీట్స్' అనే పదానికి అర్థాన్నీ మన పోలీసులు కనుగొన్నారు. దేశ సైనిక రహస్యాలను పాక్‌కు చేరవేసిన కేసులో పట్టుబడిన పటన్ కుమార్ పొద్దార్, పాక్ ఐఎస్ఐ ఉగ్రవాది అనుష్క అగర్వాల్‌ల ఈ మెయిల్ సంభాషణలను పరిశీలించి... 'స్వీట్స్' అనే పదానికి మన పోలీసులు అర్థాన్ని తెలుసుకున్నారు. సైనిక రహస్యాలను పంపినందుకు పటన్ బ్యాంక్ అకౌంట్‌కు అనుష్క అగర్వాల్ జూలై 22న 2014 సంవత్సరంలో రూ.20వేలు పంపించింది. అదే రోజు రాత్రి 11.30 గంటలకు చాటింగ్‌లో మాట్లాడుతూ తాను 'స్వీట్స్ పంపించాను చేరాయా?' అని అనుష్క అడిగింది. అందుకు పటన్ సమాధానం చెబుతూ సరే చూస్తాను అని చెప్పాడు. మరుసటి రోజు తన అకౌంట్లో డబ్బులు ఉండడంతో ఆ విషయాన్ని చాటింగ్‌లో ఆమెకు చేరవేశాడు. ఈ సంభాషణతో 'స్వీట్స్' అనే పదానికి అర్థం 'డబ్బులు' అని తేలింది. -
చర్లపల్లి, చంచల్ గూడలో జామర్లు: వీకే సింగ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జైళ్లలో అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటామని జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ అన్నారు. కరప్షన్ ప్రీ అడ్మిస్ట్రేటివ్ అడ్మిషన్లకు కృషి చేస్తున్నామని వీకే సింగ్ మీడియాకు తెలిపారు. అవినీతిక అడ్డుకట్ట వేయలేకపోతే పూర్తి బాధ్యత నాదేనని ఆయన అన్నారు. 3 నెలల కాలంలో జైళ్లలో అవినీతిని నిర్మూలిస్తామన్నారు. చంచల్ గూడ, చర్లపల్లి జైళ్లలో జామర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అన్ని జైళ్ల శాఖలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విద్యదానం కార్యక్రమం ఖైదీలలో మంచి సత్పలితాలను ఇస్తోందని వీకేసింగ్ చెప్పారు. -
ఆ ఖైదీలకు క్షమాభిక్ష, ములాఖత్‌లు కట్
హైదరాబాద్ : చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఖైదీలు సెల్ఫోన్లు వాడిన వ్యవహారంపై అధికారులు చర్యలు చేపట్టారు. సెల్ఫోన్లు వాడిన 12మంది ఖైదీలకు క్షమాభిక్షతో పాటు వారికి ములాఖత్‌లను కట్ చేశారు. అలాగే 12మంది ఖైదీలో ఆరుగురిని చంచల్‌గూడ జైలుకు, మరో ఆరుగురిని వరంగల్ జైలుకు తరలించారు. ఇక ఫోన్లో మాట్లాడుతూ ఓ టీవీ ఛానల్‌కు చిక్కిన వీరాస్వామిని అధికారులు వరంగల్ సెంట్రల్ జైలుకు పంపారు. చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఓ ఖైదీ న్యాయవాదికి ఫోన్ చేసి... తనకు బెయిల్ ఇప్పించాలంటూ కోరిన విషయం సోమవారం ఓ టీవీ చానల్లో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో జైళ్లశాఖ ఉన్నతాధికారులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైల్లో గత అర్థరాత్రి జైలు సిబ్బంది సమక్షంలో పోలీసు ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఖైదీలతో పాటు జైలు సిబ్బందిపై అధికారులు చర్యలు చేపట్టారు. -
ఆసిఫ్‌అలీని జైలులోనే విచారించండి
సీసీఎస్ పోలీసులకు కోర్టు ఆదేశాలు పటన్‌ను విచారించేందుకు సిద్ధమైన ఆర్మీ హైదరాబాద్: సైనిక రహస్యాలను బహిర్గతం చేసిన కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌పై ఉన్న ఆసిఫ్‌అలీని ఈ నెల 16, 17 తేదీల్లో జైలులోనే విచారించాలని నాంపల్లి కోర్టు సీసీఎస్ పోలీసులను ఆదేశించింది. ఆసిఫ్‌అలీని ఐదు రోజుల పోలీసు కస్టడీకి ఇస్తూ ఇటీవల కోర్టు ఆదేశించిన ఆనంతరం తన ఆరోగ్యం బాగులేదని ఆసిఫ్అలీ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు పై విధంగా తిరిగి ఆదేశాలు జారీ చేసింది. ఆసిఫ్‌అలీని విచారిస్తే అనుష్కఅగర్వాల్ ఎవరు అనే విషయం తెలుస్తుందని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు. అనుష్క ట్రాప్‌లో పడి మిలటరీ రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేసిన ఉదంతంలో ప్రధాన నిందితుడైన సికింద్రాబాద్ ఆర్డిలరీ సెంట ర్ సుబేదార్ పటన్‌కుమార్ పొద్దార్‌ను గత నెల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పటన్, ఆసిఫ్అలీలు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. కాగా, పటన్‌ను ఆర్మీ అధికారులు విచారించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్మీ అతని కస్టడీ కోరుతూ శుక్రవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సాంకేతిక అడ్డంకుల కారణంగా కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో అన్ని సవరించుకుని సోమవారం తిరిగి పిటిషన్ వేయడానికి ఆర్మీ అధికారులు సిద్ధమవుతున్నారు. -
ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి ఖైదీల పరారీ
సాక్షి, హైదరాబాద్: భార్యను ములాఖత్‌కు అనుమతించలేదన్న కోపంతో ఓ అండర్ ట్రయల్ ఖైదీ వేసిన పథకంతో ఆస్పత్రి నుంచి చికిత్స పొందుతున్న పదకొండుమంది పరారయ్యారు. రెడ్ అలర్ట్ ప్రకటించిన పోలీసులు మంగళవారం సాయంత్రానికి ఎనిమిది మందిని పట్టుకోగా... మరో ముగ్గురు ముంబైలో ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. వీరికోసం వేట ముమ్మరం చేశారు. సోమవారం రాత్రి 9.30-12.30 మధ్య జరిగిన ఈ ఘటన వివరాలివి... నాంపల్లిలోని ఛాపెల్ రోడ్ ఫాహుద్దీన్ ఖురేషీ (38)పై అబిడ్స్, నాంపల్లి ఠాణాల్లో వరకట్న వేధింపుల కేసుతో పాటు మాదకద్రవ్యాలు కలిగిన తదితర కేసులు నమోదై ఉన్నాయి. ఫలితంగా చంచల్‌గూడ జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. ఇతడి మానసిక పరిస్థితి బాలేకపోవడంతో జైలు అధికారులు ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఖురేషీ రెండో భార్య అతడిని కలిసేందుకు రాగా ఆర్ఎంఓ ఓంప్రకాష్ అనుమతించలేదు. దీంతో ఖురేషీ దాదాపు రెండు గంటల పాటు ప్రిజనల్ వార్డులో హంగామా సృష్టించాడు. వార్డు కబోర్డులో ఉన్న తోటి రోగుల కేస్షీట్లను తీసుకుని అగ్గిపెట్టెతో వాటికి నిప్పుపెట్టాడు. దీనివల్ల తీవ్రంగా పొగ రావడంతో ఆందోళన చెందిన సిబ్బంది వార్డులో ఉన్న 50 మంది రోగులను పక్కవార్డుకు మార్చారు. ఈ హడావిడిలో అక్కడే ఉన్న ఆక్సిజన్ సిలిండర్‌తో గోడకు రంధ్రం చేసి ఖురేషీ మరో పదిమంది ఖైదీలతో పారిపోయాడు. ప్రిజనల్ వార్డుకు అనుకుని ఉన్న క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న మాజీ ఉద్యోగులు ప్రశ్నించగా కత్తితో బెదిరించాడు. దీంతో భయపడిన వారు 11మంది ఖైదీలు వెళ్లిపోయాక ఆస్పత్రి అధికారులకు సమాచారం అందించారు. ఆస్పత్రి అధికారుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ‘రెడ్ అలర్ట్’ ప్రకటించి ఎనిమిదిమందిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశామని పశ్చిమ మండలం డీసీపీ సత్యనారాయణ తెలిపారు. ఖురేషీ టవేరా కారు (ఏపీ09 బిసి 7909)లో రెండో భార్యతో ముంబై పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మిగిలిన వారూ వీరితో పాటే ఉండవచ్చన్న అనుమానాలున్నాయి. ఖైదీలు పారిపోవడం వెనుక ఆస్పత్రి సిబ్బంది ప్రమేయం, నిర్లక్ష్యం ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురికీ ఘనమైన నేరచరిత్ర ఉందనీ, వారు సామాన్యులపై దాడులకు పాల్పడే అవకాశం కూడా ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
జైలు నుంచి విడుదలైన మోపిదేవి
హైదరాబాద్ :మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణకు సోమవారం సాయంత్రం చంచలగూడ జైలు నుంచి విడుదలయ్యారు. సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో17 నెలలగా జైలులో గడిపిన మోపిదేవి జైలు నుంచి విడుదలయ్యారు. కాగా, సీబీఐ కోర్టు రెండు లక్షలవి రెండు పూచికత్తులను కోర్టుకు సమర్పించాలని షరతు విధించింది. పాస్‌పోర్టుకు సంబంధించిన వివరాలను అఫిడవిట్ రూపంలో కోర్టుకు అందజేయాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. సాక్ష్యులను ప్రభావితం చేయరాదని. న్యాయస్థానం స్పష్టం చేసింది. మౌలిక సదుపాయాలు, నౌకాయనం శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉన్న మోపిదేవి వెంకట రమణ నిబంధనలకు విరుధ్దంగా వాన్‌పిక్‌కు భూములు కేటాయించారని సీబీఐ అభియోగాలు మోపింది. మోపిదేవిని సీబీఐ గతేడాది మే 24న అరెస్ట్ చేసింది. అంతకు ముందు సీబీఐ కోర్టు ...మోపిదేవి వెన్నునొప్పి శస్త్రచికిత్స కోసం 45 రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ గడువు ముగియటంతో ఆయన ఈనెల 25న కోర్టులో లొంగిపోయారు. ఈ నేపథ్యంలో మోపిదేవి కోర్టులో లొంగిపోయి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. -
బెయిల్‌పై విజయసాయిరెడ్డి విడుదల
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసులో నిం దితుడిగా ఉన్న ఆడిటర్ వేణుంబాక విజయసాయిరెడ్డి బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. బెయిల్ మంజూరు చేస్తూ ప్రత్యేక కోర్టు విధించిన షరతుల మేరకు సాయిరెడ్డి తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి పూచీకత్తు బాం డ్లను కోర్టుకు సమర్పించారు. వాటిని ఆమోదించిన కోర్టు.. సాయిరెడ్డిని విడుదల చేయాలంటూ చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌కు ఉత్తర్వులు జారీచేసింది. కోర్టు ఉత్తర్వులు అందుకున్న జైలు అధికారులు మధ్యాహ్నం 2.50 నిమిషాలకు సాయిరెడ్డిని విడుదల చేశారు. అప్పటికే ఆయన అభిమానులు, వైఎస్ఆర్సీపీ నేత లు, మిత్రులు భారీ సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నారు. వైఎస్ఆర్సీపీ నేత శేషారెడ్డి, పల్లపు రాము సాయిరెడ్డికి మిఠాయి తినిపించి, పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. మొదటి అరెస్టు.. జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో సీబీఐ మొదటగా అరెస్టు చేసింది విజయసాయిరెడ్డినే. గత ఏడాది జనవరి 2న విచారణకు హాజరైన సాయిరెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు సీబీఐ ప్రకటించింది. 110 రోజుల తర్వాత సాయిరెడ్డికి ఏప్రిల్ 30న సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ హైకోర్టును ఆశ్రయించినా.. చుక్కెదురైంది. దాంతో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జగన్ కేసులో దర్యాప్తు పెండింగ్‌లో ఉందన్న కారణంగా సాయిరెడ్డి బెయిల్‌ను సుప్రీంకోర్టు గత మే 9న రద్దుచేసింది. జూన్ 5న సీబీఐ ప్రత్యేక కోర్టులో లొంగిపోయిన సాయిరెడ్డి.. అప్పటి నుంచి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తికావడంతో.. సాయిరెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానిని పరిశీలించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
బెయిల్‌పై సునీల్‌రెడ్డి విడుదల
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎమ్మార్ ప్రాపర్టీస్ వివాదం కేసులో గత 20 నెలలుగా చంచల్‌గూడ జైల్లో ఉన్న సునీల్‌రెడ్డి సోమవారం బెయిల్‌పై విడుదలయ్యారు. శనివారం సునీల్‌రెడ్డికి సీబీఐ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా ఆదివారం సెలవుదినం కావడంతో సోమవారం విడుదలయ్యారు. ఈ సందర్భంగా సునీల్‌రెడ్డిని తోడ్కొని వెళ్లేందుకు ఆయన అభిమానులు, బంధువులు, మిత్రులు భారీ సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నారు. ఆయనకు పుష్పగుచ్ఛాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. -
జాతీయ, అంతర్జాతీయ మీడియా ఆసక్తి.. వై.ఎస్. జగన్ విడుదలపై ప్రసారం
-
జగన్ కోసం జనం
-
జన ప్రభంజనం
జగన్మోహన్రెడ్డి మంగళవారం మధ్యాహ్నం బెయిల్‌పై విడుదలవుతారన్న వార్తను తెలుసుకున్న అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఉదయం నుంచే చంచల్‌గూడ, నల్లగొండ చౌరస్తా, మోజంజాహి మార్కెట్, గాంధీభవన్, లక్డీకాపూల్, ఖైరతాబాద్ చౌరస్తా, తాజ్దక్కన్, జీవీకే, నాగార్జున సర్కిల్, జూబ్లీ చెక్‌పోస్ట్, కళింగభవన్ చౌరస్తా, లోటస్‌పాండ్‌లలో జగన్మోహన్రెడ్డి రాకకోసం ఎదురుచూశారు. చంచల్‌గూడ, లోటస్‌పాండ్ పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేసినప్పటికీ వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. పోలీసులు పలుమార్లు లాఠీలు ఝుళిపించినా.. అభిమానుల ఈలలు, కేరింతలు, నినాదాలతో చంచల్‌గూడ -లోటస్‌పాండ్ రహదారి దద్దరిల్లిపోయింది. సాయంత్రం చంచల్‌గూడలో ఉత్సాహంగా మొదలైన జగన్మోహన్రెడ్డి యాత్ర ఆయన నివాసానికి చేరుకునే వరకు అదే జోష్‌తో కొనసాగింది. సుమారు ఆరున్నర గంటల పాటు 18 కి.మీ.లకు పైగా సాగిన ప్రయాణంలో అభిమానులు కాన్వాయ్ వెంట పరుగులు తీస్తూ వైఎస్ కుటుంబానికి జేజేలు పలికారు. చంచల్‌గూడ జైలు ఆవరణలో పోలీస్ కుటుంబ సభ్యులు మొదలుకుని భారీ ఎత్తున తరలివచ్చిన మైనారీటీలు జగన్‌తో కరచాలనానికి పోటీపడ్డారు. నాంపల్లిలోని వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, సిబ్బంది రోడ్డు పొడవునా నిలబడి జగన్మోహన్రెడ్డికి అభినందనలు తెలిపారు. ప్రైవేటు వ్యాపారవాణిజ్య సంస్థలు, కొనుగోలుదారులు సైతం షాపుల ముందు నిలబడి జగన్మోహన్రెడ్డి అభివాదానికి, ప్రతివాదం చేస్తూ.. విజయం మనదేనంటూ సంజ్ఞలు చేశారు. మోజంజాహీ మార్కెట్లో జీహెచ్ఎంసీ కార్పోరేటర్ కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అభిమానులు స్వాగతం పలకగా, లక్డీకాపూల్ చౌరస్తాలో పార్టీ నాయకులు పి.విజయారెడ్డి ఆధ్వర్యంలో గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలతో స్వాగతిస్తూ జగన్మోహన్రెడ్డికి హారతి పట్టారు. వీరతిలకం దిద్ది ఆశీర్వదించారు. టపాసులు పేల్చి పూల వర్షం కురిపించారు. ఇదే కూడలిలో పలు బస్తీల మహిళలు పిల్లా పాపలతో ఉదయం పదకొండు గంటల నుంచే జగన్ రాక కోసం వేచిచూశారు. పంజగుట్ట నాగార్జున సర్కిల్లో రెండు ఫ్లై ఓవర్ల మీద నుంచి పూలవర్షం కురిపించి అభిమానం చాటుకున్నారు. వైఎస్ఆర్సీపీ వికలాంగుల విభాగం చైర్మన్ పంగా నర్సింహులు యాదవ్ తన మూడ చక్రల వాహనంపై జైలుకు వచ్చారు. ఆయన వాహనం పార్టీ ప్రచార రథాన్ని తలపించింది. గాంధీభవన్ వద్ద గోషామహల్ నియోజకవర్గం నాయకులు సయ్యద్ సాజిద్ అలీ, మెట్టు రాఘవేంద్ర, జితేంద్ర తివారీ, బ్రిజ్‌రాజ్‌సింగ్, దీపక్‌సింగ్, కపిల్‌లతో పాటు వందలాది మంది కార్యకర్తలు స్వాగతం పలికారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లో పలువురు ఐటీ ఉద్యోగులు జగన్మోహన్రెడ్డి అభివాద దృశ్యాలను తమ సెల్ఫోన్లలో రికార్డు చేసుకున్నారు. ఇదే రోడ్డులోని హెరిటేజ్ (చంద్రబాబు సంస్థ) ఫ్రెష్ ఉద్యోగులు సైతం బయటకు వచ్చి జగన్మోహన్రెడ్డిని చూసి కేరింతలు కొడుతూ అభివాదం చేశారు. లోటస్‌పాండ్ ఆవరణలో అభిమానులు పేల్చిన బాణాసంచా వెలుగులతో ఆ ప్రాంతం దీపావళి శోభను సంతరించుకుంది. వెన్నంటి కదిలిన నాయకగణం జగన్మోహన్రెడ్డి విడుదల కోసం ఉదయం నుంచే చంచల్‌గూడకు చేరుకున్న నగర నాయకులు ఆయన ఇంటికి చేరే వరకు వెన్నంటి ఉన్నారు. సీఈసీ సభ్యులు కె.శివకుమార్, జనక్‌ప్రసాద్, పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ ఆదం విజయ్‌కుమార్, యువజన విభాగం కన్వీనర్ పుత్తా ప్రతాపరెడ్డి, నగరంలోని పలు నియోజకవర్గాల సమన్వయకర్తలు బి.జనార్దన్‌రెడ్డి, జంపన ప్రతాప్, మతీన్ ముజదాది, వడ్డేపల్లి నర్సింగ్‌రావు, పి.విజయారెడ్డి, దేపా భాస్కర్‌రెడ్డి, సేవాదళ్ రాష్ట్ర కన్వీనర్ కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, కార్పొరేటర్లు కాలేరు వెంకటేశ్, గుడిమెట్ల సురేష్‌రెడ్డి, సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి, వెంకట్రావు, లింగాల హరిగౌడ్, బొడ్డు సాయినాథ్‌రెడ్డి, ముక్కా రూపానందరెడ్డి, పీవి అశోక్‌కుమార్, అమృతసాగర్, శేఖర్‌గౌడ్, రాచమల్ల సిద్ధేశ్వర్, మోహన్‌కుమార్, సూర్యనారాయణరెడ్డి, వెల్లాల రాంమోహన్, కొలను శ్రీనివాసరెడ్డిల ఆధ్వర్యంలో పలువురు అభిమానులు, కార్యకర్తలు జగన్మోహన్రెడ్డికి ఆయా కూడళ్లలో స్వాగతం పలికారు. ఇంకా జగన్‌ను చూసేందుకు వచ్చిన వారిలో రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మల, రంగారెడ్డిజిల్లా మహిళా అధ్యక్షురాలు అమృతాసాగర్, మైనార్టీ నాయకులు షేక్ హర్షద్, బొడ్డుసాయినాథ్రెడ్డి, పల్లపు రాము, నగర అధ్యక్షులు ఆదం విజయ్‌కుమార్ ఎడ్ల వాసుదేవరెడ్డి, ప్రధాన కార్యదర్శి మూల హరీష్‌గౌడ్, వంగా మధుసూదన్‌రెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు సిద్దాల సంకీర్త్ , సేవాదళ్ నాయకురాలు శ్రీలత, వైఎస్ఆర్సీపీ వికలాంగుల విభాగం చైర్మన్ పంగా నర్సింహులు యాదవ్, రాష్ట్ర మైనార్టీ నాయకుడు మసూమ్, క్రిసోలైట్, శ్రీలత, సూరజ్ ఎస్దానీ, సుమతీమోహన్, లలిత, మహతి తదితరులు ఉన్నారు. ఆకట్టుకున్న జగన్ వేషధారులు చంచల్గూడనుంచి లోటస్పాండ్దారిలో ఉదయం నుంచే జగన్మోహన్రెడ్డి కోసం ఎదురుచూస్తున్న అభిమానుల ను జగన్ మాస్క్‌లు ధరించిన పలువురు ఆకట్టుకున్నారు. జగన్ కాన్వాయ్ వచ్చే గంట ముందు నుంచే జగన్మోహన్రెడ్డి మాస్క్‌లు మొహానికి తగిలించుకుని అభివా దం చేశారు. కొన్ని చోట్ల నిజమైన జగన్మోహన్రెడ్డి అని పొరబడి, ఆయనతో కరచలనానికి పలువురు పోటీ పడ్డారు. -
జగన్ కోసం జనం
* చంచల్‌గూడ జైలు నుంచి లోటస్‌పాండ్ వరకు పోటెత్తిన జన సునామీ మంగళవారం సరిగ్గా సాయంత్రం 3.55 గంటలకు తెల్లరంగుపై నీలం రంగు చారల చొక్కా వేసుకున్న జగన్ జైలు నుంచి బయటికొచ్చారు. ఆ వెంటనే ‘వచ్చాడదిగో పులివెందుల పులి బిడ్డ’ అంటూ అభిమానులు పెద్దపెట్టున నినాదాలు చేశారు... పావురాలను పైకి ఎగురవేశారు. సాక్షి, హైదరాబాద్: రాజధానిలో దారులన్నీ మంగళవారం చంచల్‌గూడ వైపే మళ్లాయి. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన జనంతో మలక్‌పేట్, చంచల్‌గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్, డబీర్‌పురా పరిసరాలు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మంగళవారం విడుదలవుతారని తెలియడంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుదీర్ఘ కాలం తర్వాత తమ మధ్యకు తిరిగి వస్తున్న ప్రియతమ నేతను కళ్లారా చూసుకునేందుకు, కరచాలనం చేసేందుకు చంచల్‌గూడ జైలు ముందు ఉదయం 8 గంటల నుంచే జనం భారీ సంఖ్యలో బారులు తీరారు. చూస్తుండగానే 11 గంటలకల్లా జైలు ఎదురుగా ఉండే ప్రాంతమంతా అభిమానులతో కిక్కిరిసిపోయింది. అభిమానుల తాకిడి పెరిగే కొద్దీ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జైలు ప్రాంగణంలోకి ఎవరినీ రానీయకుండా ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. వాహనాలను జైలు ప్రాంగణానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే నిలిపేశారు. ప్రజాప్రతినిధుల వాహనాలను కూడా అనుమతించకపోవడంతో వారంతా జైలు దాకా నడిచే వచ్చారు. తమ నాయకుడు ఎప్పుడెప్పుడు బయటికొస్తాడా, ఎప్పుడు ఆయనతో కరచాలనం చేస్తామా అనే ఆరాటం అందరి ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. ఎండ నిప్పులు చెరుగుతున్నా ఎవరూ అంగుళమైనా కదల్లేదు. తిండి, నీరూ కూడా పట్టించుకోకుండా జైలు గేటు వైపే దృష్టి నిలిపి నిలబడ్డారు. అక్కడ ఏ చిన్న అలజడి రేగినా జగనేవస్తున్నారంటూ కేరింతలు కొట్టారు. పెద్ద సంఖ్యలో వచ్చిన యువత జగన్ మాస్కులు ధరించి సందడి చేశారు. కాసేపు తొక్కిసలాట కూడా జరిగింది. జగన్ వచ్చిన వేళ... అసంఖ్యాక అభిమాన జనం ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. సరిగ్గా సాయంత్రం 3.55 గంటలకు తెల్లరంగుపై నీలం రంగు చారల చొక్కా వేసుకున్న జగన్ జైలు నుంచి బయటికొచ్చారు. లోపలి నుంచి జైలు ప్రధాన ద్వారం దాకా జగన్‌ను వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి ఎత్తుకుని తీసుకొచ్చారు. వైఎస్సార్సీపీ మహిళా నేతలు జైలు గేటు వద్ద గుమ్మడికాయతో ఆయనకు దిష్టి తీశారు. జగన్ బయటికి రాగానే దిక్కులు పిక్కటిల్లేలా జయజయ ధ్వానాలు చేశారు. ఆయనపై పూలవర్షం కురిపించారు. ప్రవాహంలా ఆయన వైపు తోసుకెళ్లారు. వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలిన జగన్‌కు, జైలు గేటు నుంచి ఎదురుగా నిలిపిన వాహనం వరకు చేరుకోవడం కూడా గగనంగా మారింది. అభిమానులందరికీ జగన్ రెండు చేతులూ జోడించి ఆప్యాయంగా అభివాదం చేశారు. వాహనం ఫుట్‌బోర్డుపై నుంచుని చుట్టూ చూస్తూ చేతులూపారు. చిరునవ్వుతో అందరినీ పలకరించారు. ఎట్టకేలకు భారీ పోలీసు భద్రత నడుమ జగన్ కాన్వాయ్ చంచల్‌గూడ నుంచి ముందుకు సాగింది. అడుగడుగునా అభిమాన జనం జగన్‌కు నీరాజనం పట్టారు. పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులంతా వాహనాల పెకైక్కి కూర్చుని మరీ ప్రయాణించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు సైతం ఆయనతో కరచాలనం చేసేందుకు దారిపొడవునా పోటీలు పడడం విశేషం. చంచల్‌గూడ నుంచి నల్లగొండ క్రాస్‌రోడ్స్, చాదర్‌ఘాట్, మొజాం జాహీ మార్కెట్, గాంధీభవన్, నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకాపూల్, ఖైరతాబాద్, తాజ్ డెక్కన్, జీవీకే, నాగార్జున సర్కిల్, కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, ఫిలింనగర్ రోడ్డు దాకా అడుగడుగునా ప్రజాభిమానం వెల్లువెత్తింది. అన్నిచోట్లా ఆగుతూ, అతి నెమ్మదిగా సాగుతూ ఐదున్నర గంటల అనంతరం జగన్ ఎట్టకేలకు రాత్రి 9.30 గంటలకు లోటస్‌పాండ్ నివాసానికి చేరుకున్నారు. చంచల్‌గూడ-చాదర్‌ఘాట్ చంచల్‌గూడ జైలు నుంచి చాదర్‌ఘాట్ దాకా అభిమానులు అసంఖ్యాకంగా రోడ్లకు ఇరువైపులా బారులు తీరారు. జగన్ కాన్వాయ్‌పై అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. ‘పులివెందుల పులిబిడ్డ’, ‘ఏపీ కా షేర్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఛావ్‌ణీ చౌరస్తాలో కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. వైఎస్సార్సీపీ సాంస్కృతిక విభాగం కళాకారులు ఆటపాటలతో అలరించారు. మొజాంజాహీ మార్కెట్ చౌరస్తా వద్ద ఎటు చూసినా జన సందోహమే నెలకొంది. మార్కెట్ నుంచి బేగంబజార్, అఫ్జల్‌గంజ్ రోడ్లపైకి అభిమానులు భారీగా తరలివచ్చారు. మార్కెటింగ్ మంత్రి ముకేశ్ గౌడ్ క్యాంపు కార్యాలయం సమీపంలో రోడ్డుపై పూలు, పండ్ల వ్యాపారులు, స్థానికులు టపాకాయలు కాల్చారు. జగన్‌ను పూలమాలలతో సత్కరించారు. జగన్ వాహనం నుంచి దిగి అందరికీ అభివాదం చేశారు. ఆయనతో కరచాలనానికి అంతా పోటీ పడ్డారు. కాన్వాయ్ గాంధీభవన్ సమీపానికి చేరుకోగానే గోషామహల్ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున నినాదాలతో స్వాగతం పలికారు. లక్డీకాపూల్ చౌరస్తాలో లంబాడాల నృత్యాలు వైఎస్సార్సీపీ ఖైరతాబాద్ నియోజకవర్గ నాయకురాలు విజయారెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచే పార్టీ నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో లక్డీకాపూల్ బస్టాప్ వద్దకు చేరుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై లంబాడా మహిళలు నృత్యాలతో ఆకట్టుకున్నారు. సాయంత్రం 6.10 నిమిషాలకు అక్కడికి చేరుకున్న జగన్ కారు నుంచి అభిమానులకు అభివాదం చేశారు. విజయారెడ్డి మహిళలతో కలిసి జగన్‌కు హారతిచ్చి ఘన స్వాగతం పలికారు. లక్డీకాపూల్ పాత ఫ్లైఓవర్ మీదుగా భారీ ర్యాలీగా సాయంత్రం 6.45 గంటలకు జగన్ ఖైరతాబాద్ చౌరస్తా వద్దకు చేరుకున్నారు. పంజాగుట్ట చౌరస్తాలో కోలాహలం జగన్ పంజాగుట్ట చౌరస్తాకు వస్తున్నారన్న సమాచారంతో సాయంత్రం 4 నుంచే పెద్ద ఎత్తున అభిమానులు అక్కడి వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వేల సంఖ్యలో అభిమానులు బ్యాండుమేళాలతో నృత్యాలు చేస్తూ, బాణసంచా కాలుస్తూ సందడి చేశారు. పంజాగుట్ట ఫ్లైఓవర్ మీదకూ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జిమీదనుంచి తమ ప్రియతమ నేతను చూడవచ్చని వారంతా భావించారు. చివరికి జగన్ అక్కడికి రావడం లేదని తెలిసి వారంతా నిరాశ చెందారు. చెన్నారెడ్డి విగ్రహం మీదుగా కాన్వాయ్ ముందుకుసాగడంతో అభిమానులు కాన్వాయ్‌ను అనుసరించారు. నాగార్జున సర్కిల్ సమీపంలోని ఫ్లై ఓవర్‌పైనుంచి అభిమానులు కాన్వాయ్‌పై పూలవర్షం కురిపించారు. మొరాయించిన స్కార్పియో నాగార్జున సర్కిల్ నుంచి కొద్దిగా ముందుకెళ్లగానే పంజాగుట్ట శ్మశాన వాటిక వద్ద జగన్ బులెట్ ప్రూఫ్ స్కార్పియో వాహనం మొరాయించింది. దాంతో ఆయన మరో స్కార్పియోలోకి మారారు. టీవీ9, హెరిటేజ్ సంస్థల ముందు నుంచి కాన్వాయ్ వెళ్లినపుడు ఆయా సంస్థల ఉద్యోగులు కేరింతలు కొడుతూ జగన్‌కు అభివాదం చేయడం కనిపించింది. నాగార్జున సర్కిల్ నుంచి లోటస్‌పాండ్ వరకు మార్గమధ్యంలోని దుకాణాల నిర్వాహకులు జగన్ రాక కోసం ఆసక్తిగా నిరీక్షించారు. దుకాణాల బయటకు వచ్చి అభివాదం చేశారు. కేబీఆర్ పార్క్ చౌరస్తాలో వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని జగన్ కాన్వాయ్కి ఘన స్వాగతం పలికారు. అనంతరం జూబ్లీహిల్స్ చౌరస్తా కూడా జనసంద్రంగా మారింది. సరిగ్గా 9.30 గంటలకు జగన్ లోటస్‌పాండ్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అభిమానుల పూలవర్షం , మహిళల నృత్యాలు, యువకుల కేరింతల నడుమ జై జగన్ నినాదాలు మిన్నంటాయి. జగన్‌కు బాల్కనీ నుంచి కుటుంబ సభ్యులు అభివాదం చేశారు. జైలు వద్దకు వచ్చిన నాయకులు... ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, గొల్లబాబూరావు, బి.గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, టి. బాలరాజు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కె.శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మేకాశేషుబాబు, దేవగుడి నారాయణరెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డి, మాజీఎమ్మెల్యేలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, వై.బాలనాగిరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, జోగిరమేష్, కొడాలినాని, పేర్నినాని, గొట్టిపాటి రవికుమార్, మద్దాల రాజేష్ కుమార్, బూచేపల్లి శివప్రసాదరెడ్డి, సామినేని ఉదయభాను లతో పాటు ఇతర నేతలు హెచ్ఏ రెహ్మాన్, కొల్లి నిర్మల, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పుత్తాప్రతాప్‌రెడ్డి, ఎంవీఎస్ నాగిరెడ్డి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, బి.జనార్ధన్‌రెడ్డి, ఆదం విజయ్‌కుమార్, కాలేరు వెంకటేష్, దేప భాస్కర్‌రెడ్డి, కొలను శ్రీనివాసరెడ్డి, ఈసీ శేఖర్‌గౌడ్, కొండా రాఘవరెడ్డి, కె.సురేశ్‌రెడ్డి, ధన్‌పాల్‌రెడ్డి తదితర నాయకులున్నారు. అలాగే బంధువులు వైఎస్ వివేకానందరెడ్డి, కడప మాజీ మేయర్ పి.రవీంధ్రనాథ్‌రెడ్డి, సోదరుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, బంధువు యశ్వంత్‌రెడ్డి తదితరులు మధ్యాహ్నమే జైలు వద్దకు చేరుకున్నారు. పోలీసులు ఊహించనంతగా.. సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మంగళవారం జైలు నుంచి విడుదల సందర్భంగా పోలీసులు చేపట్టిన భద్రతా చర్యలు తల్లకిందులయ్యాయి. నిఘా సంస్థల ఊహకు కూడా అందని రీతిలో అభిమానులు చంచల్‌గూడ జైలు వద్దకు చేరుకోవటంతో భద్రతా సిబ్బంది అవాక్కయ్యారు. జగన్‌ను స్వాగతించేందుకు వందల సంఖ్యలో జనం వస్తారని ఉన్నతాధికారులు భావించారు. అందుకు తగ్గట్టుగానే ఒక కంపెనీ బీఎస్ఎఫ్, మూడు ప్లాటూన్ల ఏపీఎస్పీ బలగాలు, దక్షిణ మండలం పరిధిలోని 10 మంది సీఐలు, 30 మంది ఎస్ఐలు, 90 మంది కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుళ్లతో పాటు తూర్పు, దక్షిణ మండలాలకు చెందిన టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో డీసీపీ తరుణ్‌జోషి మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచే జైలు వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. అయితే ఉదయం 8 గంటల నుంచే జనం పెద్ద సంఖ్యలో జగన్‌కు స్వాగతం పలికేందుకు జైలు వద్దకు వచ్చారు. జన ప్రవాహం చూస్తుండగానే అంతకంతకూ పెరుగుతూ పోయింది. సుదూర ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా అభిమానులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తరలివచ్చారు. నిఘా సంస్థలు కూడా ఇంత మంది వస్తారని ఊహించలేదు. అభిమానులను అదుపు చేసేందుకు ముళ్లకంచెలు, బారికేడ్లు ఏర్పాటుచేశారు. చంచల్‌గూడ జైలు ప్రధాన ద్వారం నుంచి మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలను జైలుకు చాలా దూరంలోనే నిలిపేశారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మీడియాను మాత్రమే జైలు ప్రధాన ద్వారం దాకా అనుమతించారు. అయితే అభిమానులు, కార్యకర్తలు బారికేడ్లు, ముళ్ల కంచెలు దాటుకుంటూ జైలు ప్రధాన గేటు ముందుకు దూసుకువచ్చారు. పోలీసులు లాఠీచార్జి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ.. అభిమానులు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా నిలబడ్డారు. ఎస్కార్ట్నూ నెట్టేసిన అభిమానులు... జగన్ వెళ్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి ఎస్కార్ట్‌గా పోలీసు వాహనాల కాన్వాయ్ వచ్చినప్పటికీ.. జైలు నుంచి కేవలం రెండు వందల మీటర్ల దూరం వరకు రాగానే అభిమానుల వాహనాలు ఒక్కసారిగా కాన్వాయ్ మధ్యలోకి దూసుకువచ్చాయి. దీంతో జగన్ కాన్వాయ్ ముందు, వెనకాల పోలీసు ఎస్కార్ట్ వాహనాలు చెల్లాచెదురయ్యాయి. -
అదే జగన్.. అదే ఉత్సాహం
* రెండు చేతులు జోడిస్తూ.. అభివాదం చేస్తూ.. * అమ్మలను చేరదీస్తూ.. చిన్నారులను ముద్దాడుతూ.. సాక్షి, హైదరాబాద్: అందరిలోనూ ఒక్కటే ఉత్కంఠ... అంతటా ఒకే ఉద్విగ్నిత... వేలాదిగా జనప్రభంజనం... వేర్వేరు ప్రాంతాలు... వేర్వేరు వర్గాలు... అయినా అందరిలోనూ ఒకేఒక్క ఉత్సాహపూరిత భావన... సుదీర్ఘ నిరీక్షణ తరువాత తమ అభిమాన నేతను ఎప్పుడెప్పుడు చూస్తామా...! అన్న ఆతృత. ఆ క్షణాలు రానే వచ్చాయి. దాదాపు 16 నెలల తర్వాత... మంగళవారం మధ్యాహ్నం సరిగ్గా 3 గంటల 55 నిమిషాలకు వారి నిరీక్షణ ఫలించింది. ఒకే ఒక్కడుగా... అలుపెరుగని పోరాటం సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చంచల్‌గూడ జైలునుంచి జనం మధ్యకు వచ్చారు. ఆయన రాకతో ఒక్కసారిగా అక్కడున్న వారి మది ఒక్కసారిగా పులకరించింది. ఉత్సాహం ఉరకలెత్తింది. కేరింతలతో తమను తాము మరిచిపోయారు. తన కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న లక్షలాది జనం, తనపై ఎన్నో ఆశలు పెంచుకున్న కోట్లాది ప్రజలను మనసారా పలకరించేందుకు జగన్ కూడా చెదరని చిరునవ్వులతో వారి మధ్యలోకి వచ్చారు. గతంలో ఓదార్పు యాత్ర సందర్భంగా ఆయనలో ఎంతటి ఉత్సాహం, ఆదరణ, అభిమానం కనిపించాయో ఇప్పుడవి ఆయనలో అంతకు రెట్టింపుగా ప్రతిఫలించాయి. అప్పటిమాదిరిగానే అందరినీ ఆప్యాయంగా అక్కున చేర్చుకొన్నారు. మార్గమధ్యంలో వీలున్న చోటల్లా వాహనం దిగి అక్కలు, అవ్వలను పలకరించారు. చిన్నారులను ఎత్తుకుని ముద్దాడారు. భద్రతా సిబ్బంది ఎంతగా తోసినప్పటికీ ఒక ప్రవాహంలా మీద పడుతున్నా... అభిమానులను.. వాహనంపైపైకి తోసుకొస్తున్నా... అందరినీ ఆయన నవ్వుతూ పలకరించారు. తన వాహనం డోరును సగభాగం తెరిచి, ఫుట్ బోర్డుపై నిలబడి అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు. తోపులాట జరుగుతుంటే పడిపోతారంటూ పలుచోట్ల అభిమానులను వారించారు. జగన్‌లో కించిత్ మార్పు కూడా రాలేదనీ, అవే పలకరింపులు, నవ్వుతూ అదే పలకరింపులు, అదే ఓపిక, సహనం, అన్నీ కలగలిపి 2010లో ఓదార్పు యాత్ర చేపట్టినప్పుడున్న ఆత్మస్థైర్యంతోనే ఉన్నారని జనమంతా అనుకోవడం వినిపించింది. 20 కిలోమీటర్ల పాటు రోడ్డు పొడవునా వేలాది మంది జనానికి, మేడలు మిద్దెలపై నుంచి తనను చూసేందుకు ఉత్సాహంగా బారులు తీరిన వారికి చేతులూపుతూ జగన్ ముందుకు సాగారు. ఆద్యంతం 2010 ఏప్రిల్ 9న ఓదార్పు యాత్రను ప్రారంభించి 300 రోజులకు పైగా కొనసాగించినప్పుడు వెల్లువెత్తిన ఆప్యాయత, ప్రేమాభిమానాలే దారిపొడవునా పునరావృతమయ్యాయి. -
జాతీయ, అంతర్జాతీయ మీడియా ఆసక్తి.. వై.ఎస్. జగన్ విడుదలపై ప్రసారం
జగన్ బయటకు వచ్చిన దృశ్యాలను విస్తృతంగా ప్రసారం చేసిన చానళ్లు న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్రెడ్డి మంగళవారం బెయిల్‌పై చంచల్‌గూడ జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన దృశ్యాలను రాష్ట్రంలోని తెలుగు వార్తా చానళ్లతోపాటు జాతీయ వార్తా చానళ్లు కూడా విస్తృతంగా ప్రసారం చేశాయి. హెడ్‌లైన్స్ టుడే, టైమ్స్ నౌ, ఎన్డీటీవీ, జీ న్యూస్, డీడీ న్యూస్, ఆజ్‌తక్ చానళ్లు ప్రతి 10 నిమిషాలకు ఓసారి జగన్మోహన్రెడ్డి ర్యాలీగా ఇంటికి చేరే దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించాయి. దీనికి రిపోర్టర్ల వ్యాఖ్యానాలను కూడా జత చేశాయి. హెడ్‌లైన్స్ టుడే అయితే ఏకంగా ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులు...జగన్మోహన్రెడ్డి బయటకొచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీల భవిష్యత్తుపై రాజకీయ విశ్లేషకులతో అరగంటపాటు ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. పలు మరాఠీ, కన్నడ వార్తాచానళ్లు కూడా జగన్ ర్యాలీ దృశ్యాలను ప్రసారం చేశాయి. ద హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, హిందుస్థాన్ టైమ్స్ బిజినెస్ స్టాండర్డ్, లైవ్ మింట్, ఫస్ట్ పోస్ట్ వంటి జాతీయ ఆంగ్ల దినపత్రికలు, ద వీక్ వంటి వారపత్రికలు సైతం తమ వెబ్సైట్లలో జగన్ విడుదల వార్తను ప్రముఖంగా ప్రస్తావించాయి. ‘జగన్మోహన్రెడ్డి వాక్స్ అవుట్ ఆఫ్ జైల్ ఆఫ్టర్ 16 మంత్స్...’, ‘జగన్ రెడ్డి వాక్స్ అవుట్ ఆఫ్ జైల్ టు రైజింగ్ రిసెప్షన్...’ అంటూ శీర్షికలు పెట్టాయి. ఆయా వెబ్సైట్లలో ఈ వార్తను చదివిన నెటిజన్లు దీనిపై హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తూ వారి అభిప్రాయాలను పొందుపరచడం కూడా కనిపించింది. కుట్రలు, కుతంత్రాలను ఛేదించుకొని జగన్ విడుదల కావడం సంతోషంగా ఉందంటూ ఎక్కువ మంది నెటిజన్లు పేర్కొన్నారు. ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థ బీబీసీ సైతం జగన్మోహన్రెడ్డి బెయిల్‌పై విడుదల వార్తను తన వెబ్సైట్లో పొందుపరిచింది. ద లయన్ ఈజ్ బ్యాక్: జగన్ బెయిల్‌పై విడుదలైన వెంటనే ఫేస్బుక్, ట్విట్టర్లలో వేలకొద్దీ పోస్టులు, ట్వీట్లు దర్శనమిచ్చాయి. జగన్ ర్యాలీ దృశ్యాల షేరింగులు, లైకులు కూడా పెద్ద సంఖ్యలో కనిపించాయి. ‘హీ ఈజ్ ద రూలర్...’, ‘ద లయన్ ఈజ్ బ్యాక్...’, ‘ద కింగ్ ఆఫ్ ఆంధ్ర వైఎస్ జగన్ ఈజ్ బ్యాక్...’, ‘జగన్ బెయిల్‌పై విడుదలైన కొద్దిసేపటికే ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీ పాలకులకు వెన్నులో వణుకు మొదలవుతుందనేందుకు ఇది సంకేతం’, ‘మైకేల్ జాక్సన్ తర్వాత ఈ రోజు జగన్‌ను చూసేందుకు వెల్లువలా వచ్చిన ప్రజాభిమానాన్ని చూశా...’, ‘భారీ జనసందోహం...ఎప్పుడూ అంత మం దిని చూడలేదు..’, ‘ఇక రాజకీయాలన్నీ మారిపోతాయి..’, ‘రాష్ట్ర విభజన సమస్యకు పరిష్కా రం దొరికినట్లే..’ వంటి ట్వీట్లు, పోస్టులతో నెటిజన్లు, అభిమానులు హోరెత్తించారు. ‘కింగ్ ఈజ్ కింగ్.. ఎవర్ అండ్ ఎవర్’, ‘ఓన్లీ ఒన్’, ‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేరు’ వంటి పోస్టులు ఫేస్బుక్లో ప్రత్యక్షమయ్యాయి. వీటికి క్షణాల్లో లక్షల సంఖ్యలో లైకులు, షేరింగ్‌లు వచ్చాయి. మంగళవారం సాయంత్రం నుంచి ఫేస్బుక్లో ఏ పేజీ క్లిక్చేసినా జనంలోకి జగన్ వచ్చాడనే వార్తే హైలెట్ అయ్యింది. ఉదయం నుంచే ‘ఈ రోజు అన్న బయటకు వస్తాడు’ అంటూ మొదలైన హడావుడి సాయంత్రమయ్యే సరికి పతాకస్థాయికి చేరుకుంది. మంగళవారం రాత్రికి లోటస్‌పాండ్‌కు చేరుకున్న జగన్ కాన్వాయ్ ఫొటోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. అభిమానులు వీటికి లక్షల సంఖ్యలో లైకులు, షేరింగ్ చేసి తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు. ‘ఫేస్బుక్లో మేము ఈరోజు షేర్ చేసుకున్న స్వీటెస్ట్ న్యూస్ ఇదే’ అని ఉద్విగ్నతకు లోనైనవారు లెక్కలేనంత మంది ఉన్నారు. ‘కంగ్రాట్స్ జగన్ సర్’ అని శుభాభినందనలను పంచుకున్న వారెందరో. ఓ నెటిజెన్ అయితే జగన్ అదృష్ట సంఖ్యను ఏడుగా లెక్కగట్టాడు. జగన్ జైలులో గడిపిన 484 రోజులను 4+8+4=16 అని, 16 నెలలు అంటే 1+6=7 అని, జగన్ దాఖలు చేసుకున్న ఏడో బెయిల్ పిటిషన్‌కే వచ్చిందని గుర్తుచేశాడు. -
జగన్నాథ యాత్రలా..
* జైలు నుంచి జనం మధ్యకు జగన్ * అభిమానుల పూల వర్షం నడుమ ఇంటికి * సునామీని తలపిస్తూ పోటెత్తిన జనప్రవాహం * చంచల్‌గూడ నుంచి లోటస్‌పాండ్ దాకా ప్రభంజనమే * 20 కి.మీ. దూరానికి ఏకంగా ఐదున్నర గంటల పైనే * అందరినీ పలకరిస్తూ, అభివాదం చేస్తూ సాగిన జగన్ * హారతి పట్టిన షర్మిల.. స్వాగతం పలికిన విజయమ్మ, భారతి జనం.. జనం.. జనం.. పిల్లలు మొదలుకుని చంటిపిల్లల తల్లుల దాకా... యువతీయువకుల నుంచి వయోవృద్ధుల దాకా... చంచల్‌గూడ నుంచి లోటస్‌పాండ్ దాకా ఎటు చూసినా సముద్రాన్ని తలపిస్తూ జనమే. 20 కిలోమీటర్ల దారి పొడవునా అడుగడుగునా జగన్నామ జపం చేస్తూ జన ప్రభంజనమే. 16 నెలల చెర వీడి తిరిగి తమ మధ్యకు వస్తున్న ప్రియతమ నేతను కళ్లారా చూసుకోవడానికి, హృదయపూర్వకంగా స్వాగతం పలకడానికి రాష్ట్రం నలుమూలల నుంచీ అశేష సంఖ్యలో అభిమానులు హైదరాబాద్‌కు పోటెత్తారు. మంగళవారం ఉదయానికే చంచల్‌గూడ వద్ద పిల్ల కాలువలా మొదలైన జన సందోహం మధ్యాహ్నానికల్లా వెల్లువలా మారింది. ఇక జన నేత బయటికి వచ్చే సమయానికైతే జైలు వద్ద జన ప్రవాహం అచ్చంగా సునామీనే తలపించింది. అంతా ఆత్రుతతో, ఎంతో ఉత్కంఠతో, అంతులేని ప్రేమాభిమానాలతో ఎదురు చూసిన సమయం ఎట్టకేలకు రానే వచ్చింది. మధ్యాహ్నం 3.55కు జైలు నుంచి జగన్ బయటికి అడుగు పెట్టారు. అంతే. కట్టలు తెంచుకున్న అభిమానంతో జనమంతా ఒక్కసారిగా ఆయనకేసి దూసుకెళ్లారు. తమ నేతను కళ్లారా చూసుకునేందుకు, కరచాలనం చేసేందుకు అంతా ఒక్కసారిగా మున్ముందుకు తోసుకెళ్లారు. ‘జై జగన్’ అంటూ పెద్దపెట్టున వారు చేసిన నినాదాలతో చంచల్‌గూడ పరిసరాలన్నీ ప్రతిధ్వనించాయి. ముందు జాగ్రత్తగా పోలీసులు పకడ్బందీగా ఏర్పాటు చేసిన మూడంచెల ముళ్ల కంచెలు కూడా అభిమాన జన ప్రవాహంలో కొట్టుకుపోయాయి. జాతీయ వార్తా చానళ్లన్నీ జగన్ విడుదలకు విశేష ప్రాధాన్యమిచ్చాయి. పలు చానళ్లు ప్రత్యేక బులెటిన్లు కూడా నడిపాయి. ఇక రాష్ట్ర చానళ్లయితే మధ్యాహ్నం నుంచీ రాత్రి దాకా ప్రత్యక్ష ప్రసారం చేశాయి. అంతర్జాతీయ మీడియా కూడా జగన్ విడుదల వార్తను ప్రముఖంగా ప్రసారం చేసింది. ఇక ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ సైట్లయితే మంగళవారం పూర్తిగా జగన్మయంగా మారాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచీ టీవీలకే అతుక్కుపోయిన కోట్లాది మంది రాష్ట్ర ప్రజలు కూడా హర్షధ్వానాలు చేస్తూ, కేరింతలు కొడుతూ, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మిఠాయిలు పంచుకుంటూ, బాణసంచా కాల్చుకుంటూ సంతోషంలో మునిగిపోయారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది. చెరగని చిరునవ్వుతో అభిమానులను పలకరిస్తూ, అడుగడుగునా కురిసిన పూల వర్షంలో తడుస్తూ జగన్ ఒక్కో అడుగూ ముందుకు సాగారు. వీలున్న చోటల్లా వాహనం దిగారు. అవ్వా అక్కలను పలకరించారు. పసిపిల్లలను ఎత్తుకుని ముద్దు చేశారు. అందరి అభినందనలను, అభివందనాలను ప్రేమాప్యాయతలతో స్వీకరించారు. జన నేతను తమ సెల్ ఫోన్లలో వీడియో తీసేందుకు దారి పొడవునా ప్రజానీకం పోటీలు పడ్డారు. జగన్ యాత్ర అచ్చంగా జగన్నాథ రథయాత్రను తలపించింది. మధ్యాహ్నం 3.55కు చంచల్‌గూడ వద్ద మొదలై, 20 కిలోమీటర్ల దూరంలోని లోటస్‌పాండ్ నివాసానికి చేరుకునేందుకు ఏకంగా ఐదున్నర గంటలు పట్టింది. రాత్రి 9.30 తర్వాత ఇంటికి చేరుకున్న జగన్‌కు ఘన స్వాగతం లభించింది. సోదరి షర్మిల హారతి పట్టారు. మాతృమూర్తి విజయమ్మ, భార్య భారతి, పిల్లలు ఆనందబాష్పాలు రాల్చారు. బంధుమిత్రులు సాదరంగా ఆహ్వానం పలికారు. -
లోటస్ పాండ్ చేరుకున్న జగన్
-
హారతితో స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు
-
నాగార్జున సర్కిల్ మీదుగా కదులుతున్న జగన్ కాన్వాయ్
-
జగన్ నినాదాలతో మారుమోగుతున్న కాన్వాయ్
-
పోటెత్తిన అభిమానం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి జైలు నుంచి విడుదల అయిన అనంతరం తన నివాసానికి చేరే క్రమంలో హైదరాబాద్ నగర వీధులు అభిమానంతో పోటెత్తాయి. దీనిలో భాగంగా ఖైరతాబాద్ లో ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్. జగన్ రాకతో లక్డీకాపూల్ దగ్గర జన సందోహం ముజాంజహి మార్కెట్ వద్ద జగన్ అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న దృశ్యం. -
అభిమానుల జేజేల మధ్య లక్డీకాపూల్ చేరుకున్న జగన్ కాన్వాయ్
-
ఖైరతాబాద్ చేరుకోనున్న జగన్ కాన్వాయ్
-
ఖైరతాబాద్ వీధుల్లో కొనసాగుతున్న ఆత్మీయయాత్ర
-
జగన్ రాకతో పులకించిన హైదరాబాద్ వీధులు
-
జగన్ రాకతో పులకించిన హైదరాబాద్ వీధులు
చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన జగన్ లోటస్‌పాండ్‌లోని తన నివాసానికి బయలుదేరారు. అభిమానులు అధికంగా రో్డ్లపైకి రావడంతో కాన్యాయ్ నెమ్మదిగా కదులుతోంది. ప్రస్తుతానికి ఆరు కిలో మీటర్లు ప్రయాణించిన జగన్ కు అభిమానుల తాకిడితో రెండు గంటల సమయం పట్టింది. దీంతో తన నివాసం లోటస్ పాండ్ కు చేరడానికి మరింత సమయం పట్టే ఆస్కారం ఉంది. -
మోహంజాహి మార్కెట్‌కు చేరుకోనున్న కాన్వాయ్
-
జనంలోకి జగన్..అభిమానుల సంబరాలు
-
చంచల్ గూడ నుండి బయలు దేరిన జగన్ కాన్వాయ్
-
జనంలోకి జగన్..అభిమానుల సంబరాలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్‌సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి మంగళవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. -
జగన్‌కు పూలతో ఘనస్వాగతం
హైదరాబాద్: చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్‌సభ సభ్యుడు జగన్మోహన రెడ్డికి అభిమానులు పూలతో ఘనస్వాగతం పలికారు. జైలు నుంచి బయటకు వచ్చిన జగన్‌ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు అభిమానులు తోచుకువచ్చారు. కిక్కిరిసిన జనంలో నుంచి వాహనం కదలడం కూడా కష్టమైపోయింది. ఎటు చూసినా జనమే జనం. రాష్ట్రం నలుమూల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో కదిలి వచ్చారు. జై జగన్ అన్న నినాదాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. 485 రోజులు జైలులో ఉండి, బయటకు వచ్చిన యువనేతను చూసేందుకు యువత ఉత్సాహంగా తోసుకొనితోసుకొని ముందుకు వస్తున్నారు. చిరునవ్వుతో అందరికీ రెండు చేతులు జోడించి అభివాదం చేస్తున్నారు. జైలు నుంచి ఆయన వాహనం వెళ్లే రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. కాన్వాయ్ వెంటే జనం నడుస్తున్నారు. జైలు వద్ద నుంచి ఆయన నివాసం లోటస్పాడ్ వరకు రోడ్డుకు ఇరువైపుల జనం బారులు తీరి ఉన్నారు. ఆ జనవాహినిని తప్పించుకొని ఆయన ఇంటికి చేరుకోవడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది. -
వైఎస్ జగన్ బెయిలుపై విడుదల
-
వైఎస్ జగన్ బెయిలుపై విడుదల
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్‌సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి ఈ సాయంత్రం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. నాంపల్లిలోని ప్రత్యేక సీబీఐ కోర్టు జగన్‌కు నిన్న సాయంత్రం బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కోర్టు కోరిన షూరిటీలు సమర్పించిన తరువాత జగన్ విడుదల ఉత్తర్వులపై న్యాయమూర్తి దుర్గాప్రసాద్‌రావు మంగళవారం సంతకం చేశారు. కోర్టు సిబ్బంది ఆ ఉత్తర్వులను చంచల్‌గూడ జైలు అధికారులకు అందజేశారు. కోర్టు ఆదేశాలను పరిశీలన తర్వాత జైలు అధికారులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విడుదల చేశారు. గతంలో ఉన్న విధంగా ప్రభుత్వం బులెట్ ప్రూఫ్ వాహనాన్ని, భద్రతా సిబ్బందిని సమకూర్చింది. జగన్ విడుదల సందర్భంగా జైలు వద్దకు భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. జైలు వద్ద కోలాహలంగా ఉంది. చంచల్‌గూడ జైలు పరిసరాలన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. జగన్ బయటకు రాగానే అభిమానుల ఆనందానికి హద్దులులేకుండా పోయింది. జైలు నుంచి బయటకు వచ్చిన జగన్ నవ్వుతూ ప్రజలకు అభివాదం చేశారు. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటకీ అభిమానులను అదుపు చేయడం కష్టమైపోయింది. -
జగన్ విడుదలకు కోర్టు ఉత్తర్వులు జారీ
-
జగన్ విడుదలకు కోర్టు ఉత్తర్వులు జారీ
హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదలకు నాంపల్లి సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విడుదల ఆర్డర్‌పై న్యాయమూర్తి దుర్గాప్రసాద్‌రావు మంగళవారం సంతకం చేస్తారు. కోర్టు సిబ్బంది ఆ ఉత్తర్వులను చంచల్‌గూడ జైలు అధికారులకు అందజేయనున్నారు. కోర్టు ఆదేశాల పరిశీలన తర్వాత... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయటకు వస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తవడానికి మరో రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి అయిదు గంటల మధ్యలో జగన్ మోహన్ రెడ్డి చంచల్‌గూడ జైలు నుంచి విడుదల కానున్నారు. జగన్ విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లు ఆయన తరపు న్యాయవాది అశోక్ రెడ్డి తెలిపారు. కోర్టు తెలిపిన అన్ని ష్యూరిటీలను అందచేసినట్లు తెలిపారు. -
జగన్ జామీను పత్రాల పరిశీలన పూర్తి
హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్‌కు సంబంధించి జామీను పత్రాల పరిశీలన పూర్తయింది. వైఎస్ అవినాష్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి మంగళవారం ష్యూరిటీ పత్రాలను నాంపల్లి సీబీఐ కోర్టుకు సమర్పించారు. వీరు సమర్పించిన పత్రాలను న్యాయమూర్తి దుర్గాప్రసాద్ పరిశీలించారు. జామీను ఇచ్చిన అవినాష్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి వ్యక్తిగత వివరాలను న్యాయమూర్తి తెలుసుకున్నారు. ష్యూరిటీ పత్రాలను పరిశీలించిన కోర్టు... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదలకు సంబంధించిన పత్రాలు సిద్ధమని సిబ్బందిని ఆదేశించింది. విడుదల ఆర్డర్ సిద్ధమైన వెంటనే... న్యాయమూర్తిపై వాటిపై సంతకం చేస్తారు. కోర్టు సిబ్బంది ఆ ఆదేశాలను చంచల్‌గూడ జైలు అధికారులకు అందజేస్తారు. జైల్లో కోర్టు ఆదేశాల పరిశీలన తర్వాత... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయటకు వస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తవడానికి దాదాపు గంటన్నర నుంచి రెండు గంటల సమయం పట్టవచ్చు. -
చంచల్‌గూడ జైలు వద్ద ఉద్రిక్తం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బెయిల్‌పై విడుదల అవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు, జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో చంచల్‌గూడ జైలుకు మంగళవారం చేరుకున్నారు. ఆ నేపథ్యంలో పోలీసులకు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దాంతో చంచల్‌గూడ జైలు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జైలు పరిసర ప్రాంతాల్లో మూడంచల భద్రతను ఏర్పాటు చేశారు. అందుకోసం నగరంలోని 17 పోలీసు స్టేషన్లకు చెందిన పోలీసు బలగాలను మోహరించిన సంగతి తెలిసిందే. -
చంచల్‌గూడ వద్ద మూడంచెల భారీ భద్రత
-
చంచల్‌గూడ వద్ద మూడంచెల భారీ భద్రత
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత చంచలగూడ జైలు నుంచి విడుదల కానున్నారు. దాంతో తమ ప్రియతమ నేతను చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చంచలగూడ జైలు వద్దకు తరలి వస్తున్నారు. దాంతో పోలీసులు జైలు వద్ద మూడంచెల భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఒక కంపెనీ బీఎస్ఎఫ్, మూడు ప్లాంటూన్స్ ఏపీఎస్పీ...తో పాటు సౌత్ జోన్‌లోని 17 పోలీస్ స్టేషన్లకు సంబంధించి సిబ్బంది అక్కడ మోహరించారు. ముళ్లకంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. -
చంచల్‌గూడ జైలు వద్ద కోలాహలం
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్‌సభ సభ్యుడు జగన్మోహన రెడ్డికి బెయిలు మంజూరైందని తెలియడంతో అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చంచల్గూడా జైలు వద్దకు తరలివెళుతున్నారు. జైలు పరిసరాలు కోలాహలంగా మారాయి. ఆ చుట్టుపక్కల ప్రజలు కూడా సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి నేతలు, కార్యకర్తలు, అభిమానులు హైదరాబాద్ తరలి వస్తున్నారు. తమ నాయకుడికి బెయిల్ రావడంతో జంట నగరాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో చేసుకున్నారు. స్వీట్లు పంచుతూ హర్షం వ్యక్తం చేశారు. బాణాసంచా కాల్చి సంతోషం వెలిబుచ్చారు. మహానేత వైఎస్ఆర్ విగ్రహాలకు దండలు వేసి నివాళి అర్పించారు. కుషాయిగూడలో సింగిరెడ్డి ధనపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. -
జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే కాటసాని
-
జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే కాటసాని
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్‌సభ సభ్యుడు జగన్మోహన రెడ్డిని ఈరోజు చంచల్‌గూడ జైలులో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కలిశారు. కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ సిపిలో చేరిన తర్వాత తొలిసారి జగన్‌ను కలిశారు. అనంతరం కాటసాని విలేకరులతో మాట్లాడుతూ సమైక్యాంధ్రకు కట్టుబడి పనిచేస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ను ప్రజలు జగన్ రూపంలో చూసుకుంటున్నారన్నారు. వైఎస్ పథకాలు ప్రజలకు అందాలంటే అది జగన్ వల్లే సాధ్యం అని చెప్పారు. -
జగన్ రిమాండ్ 3 వరకు పొడిగింపు
ప్రత్యేక కోర్టుకు హాజరైన ధర్మాన, సబిత సాక్షి, హైదరాబాద్: తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు అక్టోబర్ 3 వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డిల రిమాండ్నూ అదే తేదీ వరకు పొడిగించింది. వారి రిమాండ్ గడువు ముగియడంతో శుక్రవారం చంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపర్చారు. అలాగే ఇతర చార్జిషీట్లలో నిందితులుగా ఉన్న మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, రాంకీ సంస్థల అధినేత అయోధ్యరామిరెడ్డి, గనుల శాఖ మాజీ డెరైక్టర్ వీడీ రాజగోపాల్, నిమ్మగడ్డ ప్రకాశ్, ఈశ్వర్ సిమెంట్స్ పూర్వ ఎండీ సజ్జల దివాకర్‌రెడ్డి, దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియా, ఉద్యోగులు సంజయ్ ఎస్.మిత్రా, నీల్కమల్ బేరి, జయ్‌దీప్‌బసు తదితరులు కోర్టు ఎదుట హాజరయ్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు వెంకట్రామిరెడ్డి, మన్మోహన్సింగ్, శామ్యూల్, శ్రీలక్ష్మితో పాటు ఫార్మా కంపెనీల ప్రతినిధుల హాజరు మినహాయింపు కోరుతూ వారి తరఫు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేయగా... కోర్టు అందుకు అనుమతించింది. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే నెల 3కు వాయిదా పడింది. ఇదిలా ఉండగా ఇదే కేసులో నిందితుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావుకు వెన్నునొప్పి చికిత్స కోసం ప్రత్యేక కోర్టు ఇటీవల 45 రోజులు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఆసుపత్రిలో చేరిన కారణంగా కోర్టుకు హాజరుకాలేకపోతున్నట్లు మోపిదేవి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. కాగా, అన్ని చార్జిషీట్లను కలిపి విచారించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్, దర్యాప్తు పూర్తయ్యే వరకూ అభియోగాల నమోదు ప్రక్రియను ఆపాలంటూ ఇతర నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణను కోర్టు ఈనెల 23కు వాయిదా వేసింది. ఎమ్మార్, ఓఎంసీ కేసుల్లో రిమాండ్ పొడిగింపు ఎమ్మార్, ఓఎంసీ కేసుల్లో నిందితులు సునీల్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి, అలీఖాన్‌ల రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు వచ్చేనెల 3 వరకు పొడిగించింది. వీరందరి రిమాండ్ ముగియడంతో బెంగళూరు జైలు నుంచి గాలి జనార్దన్‌రెడ్డి, అలీఖాన్‌లను, చంచల్‌గూడ జైలు నుంచి సునీల్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డిలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఎమ్మార్ కేసులో నిందితులైన బీపీ ఆచార్య, కోనేరు రాజేంద్రప్రసాద్, విజయరాఘవ హాజరుకాగా... సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యం సహా ఇతర నిందితులు హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు అనుమతించింది. ఓఎంసీ కేసులో గనుల శాఖ మాజీ డెరైక్టర్ వీడీ రాజగోపాల్ కోర్టు ఎదుట హాజరుకాగా...అనారోగ్యం కారణంగా ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించగా కోర్టు అనుమతించింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు వచ్చేనెల 3కు వాయిదా వేసింది. -
జగన్ బెయిల్ పిటిషన్‌పై 23న తీర్పు
-
వైఎస్సార్ సీపీ అధినేతతో సబ్బం హరి భేటీ
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి : వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడినప్పటి నుంచి ఆయన వెంటే ఉన్న ఎంపీ సబ్బం హరి తన పయనం జగన్‌తోనేనని మరో మారు కుండబద్ధలు కొట్టారు. మంగళవారం చంచల్ గూడ జైల్లో జగన్మోహన్రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య చాలా సేపు పార్టీ వ్యవహారాలకు సంబంధించిన చర్చ జరిగింది. జగన్ సూచన మేరకు ఇక సమైక్యాంధ్ర పోరాటంలో కీలకంగా పనిచేయాలని హరి నిర్ణయించుకున్నారు. మూడున్నరేళ్లుగా జగన్‌తోనే హరి పయనిస్తున్నారు. సాంకేతికంగా కాం గ్రెస్‌లో ఉన్నప్పటికీ తాను జగన్ మనిషినేననీ, వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీ నుంచే పోటీకి దిగుతానని హరి అనేక సార్లు ప్రకటించారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నం దుకు నిరసనగా ఇటీవలే ఆయన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌తో తన అనుబంధం ఎప్పుడో తెగిపోయిందని ప్రకటించారు. వైఎస్సార్ సీపీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉండాలని నిర్ణయం తీసుకోవడం, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్ దీక్షల అనంతరం పార్టీ శ్రేణుల్లో సమైక్యాంధ్ర ప్రదేశ్ ఉద్యమ తీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు, పార్టీ వ్యవహారాల గురించి చర్చించడానికి సబ్బం హరి మంగళవారం జైల్లో జగన్‌ను కలిశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఇక నేరుగా కీలక పాత్ర పోషించాలని జగన్ సూచించడంతో హరి ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇదే సందర్భంలో జిల్లాలో పార్టీ వ్యవహారాలు, మూడు రోజుల కిందట జరిగిన షర్మిల సమైక్య శంఖారావం యాత్రకు సంబంధించిన అంశాల పై కూడా ఇద్దరూ చర్చించారు. తాను కాంగ్రెస్ దూతగా జగన్‌ను కలుస్తున్నానని జరుగుతున్న విషప్రచారంపై ఆయన మండిపడుతూ జగన్ కాంగ్రెస్‌తో కలవాల్సిన అవసరమే లేద న్నారు. తాను జగన్ మనిషిగానే ఆయన్ను కలుస్తున్నానని స్పష్టంగా చెప్పారు. నాలుగు నెలల్లో విచారణ పూర్తి చేసి చార్జిషీటు వేస్తామని సీబీఐ సుప్రీం కోర్టుకు చెప్పినందువల్ల చట్టప్రకారం బెయిల్ పొందడానికి జగన్ అర్హుడనే విషయాన్ని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైఎ స్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానన్నారు.