బెయిల్‌పై భానుకిరణ్‌ విడుదల | Bhanu Kiran Released From Jail After 12 Years | Sakshi
Sakshi News home page

బెయిల్‌పై భానుకిరణ్‌ విడుదల

Published Thu, Nov 7 2024 7:43 AM | Last Updated on Thu, Nov 7 2024 7:43 AM

Bhanu Kiran Released From Jail After 12 Years

చంచల్‌గూడ (హైదరాబాద్‌): హైదరాబాద్‌లో 2011 జరిగిన ఫ్యాక్షనిస్టు మద్దెలచెరువు సూరి అలియాస్‌ గంగుల సూర్యనారాయణరెడ్డి హత్య కేసు ప్రధాన నిందితుడు భానుకిరణ్‌ బుధవారం బెయిల్‌పై చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ హత్య కేసులో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం తెలిసిందే. 

చర్లపల్లి జైల్లో ఉన్న భానుని 2016లో చంచల్‌గూడ జైలుకు తరలించారు. బెయిల్‌పై విడుదలైన భానును.. అత్యంత పటిష్ట భద్రత మధ్య అతని అనుచరులు మరో చోటికి తరలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడేందుకు భాను నిరాకరించాడు. అతని అనుచరుడు మన్మోహన్‌ ఏడేళ్ల శిక్ష పూర్తి చేసుకుని 2018లో విడుదలయ్యాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement