Maddelacheruvu Suri
-
బెయిల్‌పై భానుకిరణ్ విడుదల
చంచల్‌గూడ (హైదరాబాద్): హైదరాబాద్‌లో 2011 జరిగిన ఫ్యాక్షనిస్టు మద్దెలచెరువు సూరి అలియాస్ గంగుల సూర్యనారాయణరెడ్డి హత్య కేసు ప్రధాన నిందితుడు భానుకిరణ్ బుధవారం బెయిల్‌పై చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ హత్య కేసులో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం తెలిసిందే. చర్లపల్లి జైల్లో ఉన్న భానుని 2016లో చంచల్‌గూడ జైలుకు తరలించారు. బెయిల్‌పై విడుదలైన భానును.. అత్యంత పటిష్ట భద్రత మధ్య అతని అనుచరులు మరో చోటికి తరలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడేందుకు భాను నిరాకరించాడు. అతని అనుచరుడు మన్మోహన్ ఏడేళ్ల శిక్ష పూర్తి చేసుకుని 2018లో విడుదలయ్యాడు. -
ఆ ఒక్క కారణంతో సూరికి టికెట్ ఇవ్వలేదు
-
టీడీపీ నేతలపై గంగుల భానుమతి ఫిర్యాదు
-
గంగుల భానుమతి ఫిర్యాదు
సాక్షి, అనంతపురం: తన భర్తకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్స్ పెట్టిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు మద్దెలచెరువు సూరి సతీమణి గంగుల భానుమతి ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా ఎస్పీ సత్య యేసుబాబును కలిసి గురువారం ఈ మేరకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... పరిటాల రవి చాలా మంచివాడని తన భర్త అన్నట్టుగా ఫేస్బుక్లో పోస్ట్ చేశారని తెలిపారు. తెలుగు దేశం పార్టీ అంటే తనకు ప్రాణం అని మద్దెలచెరువు సూరి పేర్కొన్నట్టుగా తప్పుడు రాతలు రాశారని వాపోయారు. తన భర్తను దుర్మార్గంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిటాల కుటుంబం కారణంగా ఎంతో మందిని కోల్పోయామన్నారు. తన కుటుంబంపై సోషల్ మీడియాలో అబద్దాలు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన ఫిర్యాదుపై ఎస్పీ సానుకూలంగా స్పందించారని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీయిచ్చారని వెల్లడించారు. వైఎస్సార్సీపీ నేతపై ఎస్సై దౌర్జన్యం పరిటాల సునీత వర్గీయులపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వైఎస్సార్ సీపీ నాయకుడిపై రామగిరి ఎస్సై హేమంత్ దురుసుగా ప్రవర్తించారు. రామగిరిలో పెట్టిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఫ్లెక్సీలను మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయులు చించివేశారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వైఎస్సార్ సీపీ నేతకురుబ ముత్యాలుపై ఎస్సై హేమంత్ దౌర్జన్యం చేశారు. ఎస్సై వైఖరికి నిరసనగా పోలీస్‌స్టేషన్ వద్ద వైఎస్సార్ సీపీ కార్యకర్తల ధర్నాకు దిగారు. పరిటాల వర్గీయుల కనుసన్నల్లో ఎస్సై హేమంత్ పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తప్పుడు కేసు బనాయించారు: భానుకిరణ్
-
భానుకిరణ్‌కు యావజ్జీవం
సాక్షి, హైదరాబాద్/చంచల్‌గూడ: ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్దెలచెర్వు సూర్యనారాయణరెడ్డి అలియాస్ సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు మలిశెట్టి భానుకిరణ్ అలియాస్ భానును న్యాయస్థానం దోషిగా తేల్చింది. భానుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. భాను ప్రైవేటు గన్‌మన్ మన్మోహన్సింగ్ బదౌరియాను సైతం దోషిగా తేల్చిన కోర్టు... అతనికి ఐదేళ్ల జైలు విధించింది. వారితోపాటు నిందితులుగా ఉన్న మరో నలుగురిని నిర్ధోషులుగా తేల్చింది. భానుకిరణ్‌కు ఐపీసీ సెక్షన్ 307 కింద యావజ్జీవ కారాగారంతోపాటు రూ. 20 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకుంటే మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. నిషేధిత ఆయుధాలను ఉపయోగించినందుకు ఆయుధ చట్టంలోని సెక్షన్ 27 (2) కింద పదేళ్ల కఠిన కారాగారశిక్ష, రూ. 20 వేల జరిమానా కూడా విధించింది. జరిమానా చెల్లించకుంటే మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తెలిపింది. సూరి హత్య విషయం గురిం చి రహస్యంగా ఉంచినందుకు భాను గన్‌మన్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం... అతనికి ఐపీసీ సెక్షన్ 212 కింద ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 5 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో 6 నెలల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు, సాక్ష్యాధారాలను ధ్వంసం చేసినందుకు ఐపీసీ సెక్షన్ 201 కింద మరో ఐదేళ్ల జైలుశిక్ష రూ. 5 వేల జరిమానా విధించింది. ఈ మేరకు నాంపల్లి మొదటి అదనపు సెషన్స్ జడ్జి కుంచాల సునీత మంగళవారం తీర్పునిచ్చారు. దోషులు ఏకకాలంలో శిక్షలను అనుభవించాలని ఆమె తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటికే జైల్లో ఉన్న కాలాన్ని మినహాయించాలన్నారు. నిందితులుగా ఉన్న శూలం సుబ్బయ్య, బోయ వెంకట హరిబాబు, ఆవుల వెంకటరమణ, కటిక వంశీధర్‌రెడ్డిలను నిర్ధోషులుగా తేల్చిన న్యాయమూర్తి... వారిపై అభియోగాలను సీఐడీ రుజువు చేయలేకపోయింద న్నారు. దోషులు ఈ తీర్పును హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చన్నారు. గత ఆరున్నరేళ్లుగా భానుకిరణ్ చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉండగా మన్మోహన్ ఎనిమిదేళ్లుగా రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. 2011లో హత్య.. 2012లో అరెస్ట్... మద్దెలచెర్వు సూరి 2011 జనవరి 3న సాయంత్రం తన అనుచరుడు మల్లిశెట్టి భానుకిరణ్ చేతిలో హత్య కు గురయ్యారు. సూరితోపాటు కారులో ప్రయాణిస్తున్న భానుకిరణ్ యూసఫ్‌గూడ ప్రాంతానికి రాగా నే తనవద్ద ఉన్న 0.32 ఎంఎం తుపాకీతో సూరిని కాల్చి చంపి పరారయ్యాడు. ఈ హత్యపై తొలుత బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయగా ఆ తరువాత కేసు సీసీఎస్‌కు అక్కడి నుంచి సీఐడీకి బదిలీ అయింది. దర్యాప్తు అనంతరం సంబంధిత కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. భాను పరారీలో కావటంతో అతన్ని పక్కనపెట్టి మిగిలిన వారిపై చార్జిïషీట్ దాఖలు చేశారు. సీఐడీ అధికారులు 2012 ఏప్రిల్ 21న జహీరాబాద్ వద్ద భానుకిరణ్‌ను అరెస్టు చేసి మరో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో సీఐడీ 150 మందిని సాకు‡్ష్యలుగా పేర్కొనగా విచారణలో 92 మందినే విచారించారు. 56 మంది సాక్ష్యాలను కోర్టు ముందుంచారు. సూరి అనుచరుడిగా భా ను అన్ని ఆర్థిక లావాదేవీలను చూసే వాడని, సూరి తో భానుకున్న అంతర్గత శతృత్వం, ఇతర నిందితులతో భానుకున్న సాన్నిహిత్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న సీఐడీ వాదనతో ఏకీభవిస్తున్నట్లు జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. తప్పుడు కేసు బనాయించారు: భానుకిరణ్ శిక్షల ఖరారు ముందు న్యాయస్థానం భానుకిరణ్, మన్మోహన్‌లను ఏదైనా ఉంటే చెప్పుకోవాలని సూచించింది. దీనికి భానుకిరణ్ స్పందిస్తూ తనపై తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు. తనకు శిక్ష విధించే ముందు సానుభూతితో తన కేసును పరిశీలించాలని కోరారు. మన్మోహన్సింగ్ కూడా ఇదే మాట చెప్పాడు. అయితే తీర్పు వెలువడేటప్పటికే మన్మోహన్ శిక్షాకాలం పూర్తి కావడంతో రాత్రి 8 గంటలకు అతన్ని చంచల్‌గూడ జైలు నుంచి విడుదల చేశారు. కోర్టు తీర్పుతో భానుకిరణ్ కలత చెందినట్లు తెలుస్తోంది. దోషులు.. నిందితులు.. అభియోగాలు ఏ1 భానుకిరణ్ : ఐపీసీ సెక్షన్లు 302, 120బి, 302 రెడ్‌విత్ 34, 304 రెడ్‌విత్ 109, 212, 201, ఆయుధ చట్టం సెక్షన్ 27(2) ఏ2 మన్మోహన్సింగ్ : ఐపీసీ సెక్షన్లు 120బి, 109 ఏ3 శూలం సుబ్బయ్య : ఐపీసీ సెక్షన్లు 120ఎ, 34, 109, ఆయుధాల చట్టం సెక్షన్ 25(1బీ) ఏ4 బోయ వెంకట హరిబాబు : ఐపీసీ సెక్షన్లు 120ఎ, 34, 109, 212 ఏ5 ఆవుల వెంకటరమణ : ఐపీసీ సెక్షన్లు 120ఎ, 34, 109, 212, ఏ6 కటిక వంశీధర్‌రెడ్డి : 120ఎ, 34, 109, 212 -
‘పరిటాల కుటుంబసభ్యులే సూత్రధారులు’
అనంతపురం: ఏపీ మంత్రి పరిటాల సునీత కుటుంబసభ్యులే సూరి హత్య కేసులో ప్రధాన సూత్రధారులని మద్దెలచెరువు సూరి సతీమణి గంగుల భానుమతి ఆరోపించారు. సూరి హత్య కేసు తీర్పు అనంతరం గంగుల భానుమతి విలేకరులతో మాట్లాడారు. మంత్రి పరిటాల సునీత కుటుంబీకులపై విచారణ జరిపి ఉంటే బాగుండేదన్నారు. భాను కిరణ్ ఓ కాంట్రాక్టు కిల్లర్ అని, పరిటాల సునీత కుటుంబం భానుకిరణ్‌కు సుపారీ ఇచ్చి హత్య చేయించిందని ఆరోపించారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌కు ఉరిశిక్ష పడి ఉంటే సంతోషించే వాళ్లమని చెప్పారు. భానుకిరణ్ విశ్వాసఘాతకుడని పేర్కొన్నారు. సూరి పేరు చెప్పి భానుకిరణ్ కోట్ల రూపాయల సెటిల్మెంట్లు చేశారని వ్యాఖ్యానించారు. 2011 జనవరి 4న హైదరాబాద్‌లో గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెరువు సూరి హత్యకు గురయ్యాడు. సూరికి నమ్మకమైన అనుచరుడిగా ఉన్న భానుకిరణ్‌యే ఈ హత్యకు పాల్పడ్డాడు. కారు ముందు సీటులో కూర్చున్న సూరిపై వెనక సీటులో కూర్చున్న భానుకిరణ్ కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం పరారై మధ్యప్రదేశ్‌లో తలదాచుకున్నాడు. 2012, ఏప్రిల్‌లో భానుకిరణ్ అనూహ్యంగా జహీరాబాద్‌లో పోలీసులకు పట్టుబట్టాడు. సుదీర్ఘ విచారణ తర్వాత భానుకిరణ్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తూ హైకోర్టులో తీర్పు వెలువడింది. -
సూరీ హత్యకేసులో సీఐడీ కోర్టు తుది తీర్పు
సాక్షి, హైదరాబాద్: గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నాంపల్లి సీఐడీ కోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. సూరి హత్యకేసులో భానుకిరణ్‌ను దోషిగా తేలుస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌కి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. భానుకు సహకరించిన మన్మోహన్‌కు అయిదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా ఖరారు చేసింది. సూరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుబ్బయ్య, హరిబాబు, వంశీ, వెంకటరమణలను నిర్దోషులుగా ప్రకటిస్తూ విడుదల చేసింది. 2011, జనవరి 3న సూరి హత్య జరిగింది. సూరీ అతడి ప్రధాన అనుచరుడు భానుకిరణ్, డ్రైవర్ మధుమోహన్ జూబ్లీహిల్స్ నుంచి సనత్‌నగర్ వెళ్తుండగా యూసుఫ్‌గూడలోని నవోదయ కాలనీ సమీపంలో సూరిపై భానుకిరణ్ పాయింట్ బ్లాంక్‌లో కాల్పులు జరిపి హతమార్చాడనే ఆరోపణలపై కోర్టు విచారించింది. డ్రైవర్ మధు ఇచ్చిన ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 8 ఏళ్లపాటు ఎన్నో మలుపులు తిరిగిన ఈ హత్య కేసులో కోర్టు 117 మంది సాక్షులను విచారించింది. భాను కిరణ్‌పై పోలీసులు మూడు చార్జి షీట్లు నమోదు చేశారు. -
పరిటాల సునీత అండతోనే సూరీ హత్య : భానుమతి
సాక్షి, అనంతపురం: మద్దెలచెరువు సూరీ హత్యకేసులో ప్రధాన నిందితుడైన భానుకిరణ్‌కు ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు విధించాలని సూరీ భార్య గంగుల భానుమతి హైకోర్టును అభ్యర్థించారు. మద్దెలచెరువు సూరీ హత్యకేసు విషయమై ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. తమకు హైకోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని అన్నారు. భానుకిరణ్ సూరీ పేరు చెప్పి జిల్లాలో సూమారు 700 కోట్ల రూపాయలు సెటిల్మెంట్లు చేశారని ఆరోపించారు. తన భర్త సూరీ హత్య వెనుక మంత్రి పరిటాల సునీత హస్తం ఉందని ఆమె ఆరోపించారు. పరిటాల కుటుంబం అండ లేకపోతే భానుకిరణ్ ఇంతటి దారుణానికి పాల్పడేవాడు కాదని అన్నారు. పరిటాల కుటుంబ అండతోనే ఈ దారుణానికి పాల్పడ్డాని భానుమతి తెలిపారు. -
భాను కిరణ్‌కు ఏడాది జైలు, జరిమానా
సాక్షి, హైదరాబాద్ : మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌కు కోర్టు ఏడాది జైలు శిక్ష, 10 వేల రూపాయల జరిమానా విధించింది. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడన్న కేసులో నిందితుడు భాను కిరణ్‌తో పాటు మరో ఇద్దరికి శిక్ష విధించింది. అక్రమ ఆయుధాలు, హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న భానును కొన్నేళ్ల కిందట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం అక్రమ ఆయుధాల కేసు విచారణ అనంతరం న్యాయస్థానం భాను కిరణ్‌కు జైలుశిక్ష, జరిమానా విధించింది. మద్దెల చెరువు సూరి హత్య కేసుకు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. సూరి హత్య కేసులో అరెస్టయిన భానుకిరణ్ ప్రస్తుతం జైల్లోనే ఉన్న విషయం తెలిసిందే. -
భానుకిరణ్ బెయిల్‌పై సాయంత్రం తీర్పు
హైదరాబాద్: సంచలనం సృష్టించిన మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ బెయిల్ పిటిషన్ పై సోమవారం తీర్పు వెలవడనుంది. గడిచిన మూడేళ్లుగా జైలులో ఉంటోన్న భానుకిరణ్.. తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా నాలుగు రోజుల క్రితం కోర్టును ఆశ్రయించాడు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ సాయంత్రం తీర్పును వెల్లడించనుంది. బెయిల్ మంజూరుచేస్తే భానుకిరణ్ పారిపోయే అవకాశం ఉందని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. 2011జనవరి 3న మద్దెలచెరువు సూరి హత్యకు గురైన తర్వాత ఏడాదిన్నరపాటు అజ్ఞాతంలోకి వెళ్లిన భానుకిరణ్.. ఆ తరువాత పోలీసులకు చిక్కాడు. బయటికి వస్తే సూరి అనుచరులనుంచి ప్రాణహాని ఉందని భావించిన భాను.. ఒకటిరెండు సార్లకు మించి బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు. తాజాగా నాలుగు రోజుల కిందట బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. -
మద్దెలచెరువు సూరి హత్య కేసు దర్యాప్తు పూర్తి
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి (సూరి) హత్య కేసులో దర్యాప్తు పూర్తి చేసినట్టు సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్ చెప్పారు. నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగుతోందని తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున యూసుఫ్ గూడ ప్రాంతంలో కారులో వెళ్తున్న సూరిని కాల్చిచంపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అనంతపురం జిల్లాకు చెందిన భానుకిరణ్ నిందితుడిగా ఉన్నాడు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. అనంతపురం జిల్లాను ఒకప్పుడు కుదిపేసిన ఫ్యాక్షన్ రాజకీయాల్లో సూరి కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. పరిటాల రవి, సూరి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ నేపథ్యంగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రెండు చిత్రాలు తీశారు.