భాను కిరణ్‌కు ఏడాది జైలు, జరిమానా | One Year Jail For Accused Bhanu Kiran | Sakshi
Sakshi News home page

భాను కిరణ్‌కు ఏడాది జైలు, జరిమానా

Published Wed, May 9 2018 4:34 PM | Last Updated on Wed, May 9 2018 5:03 PM

One Year Jail For Accused Bhanu Kiran - Sakshi

భాను కిరణ్‌ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్ : మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌కు కోర్టు ఏడాది జైలు శిక్ష, 10 వేల రూపాయల జరిమానా విధించింది. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడన్న కేసులో నిందితుడు భాను కిరణ్‌తో పాటు మరో ఇద్దరికి శిక్ష విధించింది. అక్రమ ఆయుధాలు, హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న భానును కొన్నేళ్ల కిందట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం అక్రమ ఆయుధాల కేసు విచారణ అనంతరం న్యాయస్థానం భాను కిరణ్‌కు జైలుశిక్ష, జరిమానా విధించింది. మద్దెల చెరువు సూరి హత్య కేసుకు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. సూరి హత్య కేసులో అరెస్టయిన భానుకిరణ్ ప్రస్తుతం జైల్లోనే ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement