bhanu kiran
-
బెయిల్‌పై భానుకిరణ్ విడుదల
చంచల్‌గూడ (హైదరాబాద్): హైదరాబాద్‌లో 2011 జరిగిన ఫ్యాక్షనిస్టు మద్దెలచెరువు సూరి అలియాస్ గంగుల సూర్యనారాయణరెడ్డి హత్య కేసు ప్రధాన నిందితుడు భానుకిరణ్ బుధవారం బెయిల్‌పై చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ హత్య కేసులో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం తెలిసిందే. చర్లపల్లి జైల్లో ఉన్న భానుని 2016లో చంచల్‌గూడ జైలుకు తరలించారు. బెయిల్‌పై విడుదలైన భానును.. అత్యంత పటిష్ట భద్రత మధ్య అతని అనుచరులు మరో చోటికి తరలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడేందుకు భాను నిరాకరించాడు. అతని అనుచరుడు మన్మోహన్ ఏడేళ్ల శిక్ష పూర్తి చేసుకుని 2018లో విడుదలయ్యాడు. -
తప్పుడు కేసు బనాయించారు: భానుకిరణ్
-
భానుకిరణ్‌కు యావజ్జీవం
సాక్షి, హైదరాబాద్/చంచల్‌గూడ: ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్దెలచెర్వు సూర్యనారాయణరెడ్డి అలియాస్ సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు మలిశెట్టి భానుకిరణ్ అలియాస్ భానును న్యాయస్థానం దోషిగా తేల్చింది. భానుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. భాను ప్రైవేటు గన్‌మన్ మన్మోహన్సింగ్ బదౌరియాను సైతం దోషిగా తేల్చిన కోర్టు... అతనికి ఐదేళ్ల జైలు విధించింది. వారితోపాటు నిందితులుగా ఉన్న మరో నలుగురిని నిర్ధోషులుగా తేల్చింది. భానుకిరణ్‌కు ఐపీసీ సెక్షన్ 307 కింద యావజ్జీవ కారాగారంతోపాటు రూ. 20 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకుంటే మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. నిషేధిత ఆయుధాలను ఉపయోగించినందుకు ఆయుధ చట్టంలోని సెక్షన్ 27 (2) కింద పదేళ్ల కఠిన కారాగారశిక్ష, రూ. 20 వేల జరిమానా కూడా విధించింది. జరిమానా చెల్లించకుంటే మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తెలిపింది. సూరి హత్య విషయం గురిం చి రహస్యంగా ఉంచినందుకు భాను గన్‌మన్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం... అతనికి ఐపీసీ సెక్షన్ 212 కింద ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 5 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో 6 నెలల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు, సాక్ష్యాధారాలను ధ్వంసం చేసినందుకు ఐపీసీ సెక్షన్ 201 కింద మరో ఐదేళ్ల జైలుశిక్ష రూ. 5 వేల జరిమానా విధించింది. ఈ మేరకు నాంపల్లి మొదటి అదనపు సెషన్స్ జడ్జి కుంచాల సునీత మంగళవారం తీర్పునిచ్చారు. దోషులు ఏకకాలంలో శిక్షలను అనుభవించాలని ఆమె తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటికే జైల్లో ఉన్న కాలాన్ని మినహాయించాలన్నారు. నిందితులుగా ఉన్న శూలం సుబ్బయ్య, బోయ వెంకట హరిబాబు, ఆవుల వెంకటరమణ, కటిక వంశీధర్‌రెడ్డిలను నిర్ధోషులుగా తేల్చిన న్యాయమూర్తి... వారిపై అభియోగాలను సీఐడీ రుజువు చేయలేకపోయింద న్నారు. దోషులు ఈ తీర్పును హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చన్నారు. గత ఆరున్నరేళ్లుగా భానుకిరణ్ చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉండగా మన్మోహన్ ఎనిమిదేళ్లుగా రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. 2011లో హత్య.. 2012లో అరెస్ట్... మద్దెలచెర్వు సూరి 2011 జనవరి 3న సాయంత్రం తన అనుచరుడు మల్లిశెట్టి భానుకిరణ్ చేతిలో హత్య కు గురయ్యారు. సూరితోపాటు కారులో ప్రయాణిస్తున్న భానుకిరణ్ యూసఫ్‌గూడ ప్రాంతానికి రాగా నే తనవద్ద ఉన్న 0.32 ఎంఎం తుపాకీతో సూరిని కాల్చి చంపి పరారయ్యాడు. ఈ హత్యపై తొలుత బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయగా ఆ తరువాత కేసు సీసీఎస్‌కు అక్కడి నుంచి సీఐడీకి బదిలీ అయింది. దర్యాప్తు అనంతరం సంబంధిత కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. భాను పరారీలో కావటంతో అతన్ని పక్కనపెట్టి మిగిలిన వారిపై చార్జిïషీట్ దాఖలు చేశారు. సీఐడీ అధికారులు 2012 ఏప్రిల్ 21న జహీరాబాద్ వద్ద భానుకిరణ్‌ను అరెస్టు చేసి మరో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో సీఐడీ 150 మందిని సాకు‡్ష్యలుగా పేర్కొనగా విచారణలో 92 మందినే విచారించారు. 56 మంది సాక్ష్యాలను కోర్టు ముందుంచారు. సూరి అనుచరుడిగా భా ను అన్ని ఆర్థిక లావాదేవీలను చూసే వాడని, సూరి తో భానుకున్న అంతర్గత శతృత్వం, ఇతర నిందితులతో భానుకున్న సాన్నిహిత్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న సీఐడీ వాదనతో ఏకీభవిస్తున్నట్లు జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. తప్పుడు కేసు బనాయించారు: భానుకిరణ్ శిక్షల ఖరారు ముందు న్యాయస్థానం భానుకిరణ్, మన్మోహన్‌లను ఏదైనా ఉంటే చెప్పుకోవాలని సూచించింది. దీనికి భానుకిరణ్ స్పందిస్తూ తనపై తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు. తనకు శిక్ష విధించే ముందు సానుభూతితో తన కేసును పరిశీలించాలని కోరారు. మన్మోహన్సింగ్ కూడా ఇదే మాట చెప్పాడు. అయితే తీర్పు వెలువడేటప్పటికే మన్మోహన్ శిక్షాకాలం పూర్తి కావడంతో రాత్రి 8 గంటలకు అతన్ని చంచల్‌గూడ జైలు నుంచి విడుదల చేశారు. కోర్టు తీర్పుతో భానుకిరణ్ కలత చెందినట్లు తెలుస్తోంది. దోషులు.. నిందితులు.. అభియోగాలు ఏ1 భానుకిరణ్ : ఐపీసీ సెక్షన్లు 302, 120బి, 302 రెడ్‌విత్ 34, 304 రెడ్‌విత్ 109, 212, 201, ఆయుధ చట్టం సెక్షన్ 27(2) ఏ2 మన్మోహన్సింగ్ : ఐపీసీ సెక్షన్లు 120బి, 109 ఏ3 శూలం సుబ్బయ్య : ఐపీసీ సెక్షన్లు 120ఎ, 34, 109, ఆయుధాల చట్టం సెక్షన్ 25(1బీ) ఏ4 బోయ వెంకట హరిబాబు : ఐపీసీ సెక్షన్లు 120ఎ, 34, 109, 212 ఏ5 ఆవుల వెంకటరమణ : ఐపీసీ సెక్షన్లు 120ఎ, 34, 109, 212, ఏ6 కటిక వంశీధర్‌రెడ్డి : 120ఎ, 34, 109, 212 -
‘పరిటాల కుటుంబసభ్యులే సూత్రధారులు’
అనంతపురం: ఏపీ మంత్రి పరిటాల సునీత కుటుంబసభ్యులే సూరి హత్య కేసులో ప్రధాన సూత్రధారులని మద్దెలచెరువు సూరి సతీమణి గంగుల భానుమతి ఆరోపించారు. సూరి హత్య కేసు తీర్పు అనంతరం గంగుల భానుమతి విలేకరులతో మాట్లాడారు. మంత్రి పరిటాల సునీత కుటుంబీకులపై విచారణ జరిపి ఉంటే బాగుండేదన్నారు. భాను కిరణ్ ఓ కాంట్రాక్టు కిల్లర్ అని, పరిటాల సునీత కుటుంబం భానుకిరణ్‌కు సుపారీ ఇచ్చి హత్య చేయించిందని ఆరోపించారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌కు ఉరిశిక్ష పడి ఉంటే సంతోషించే వాళ్లమని చెప్పారు. భానుకిరణ్ విశ్వాసఘాతకుడని పేర్కొన్నారు. సూరి పేరు చెప్పి భానుకిరణ్ కోట్ల రూపాయల సెటిల్మెంట్లు చేశారని వ్యాఖ్యానించారు. 2011 జనవరి 4న హైదరాబాద్‌లో గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెరువు సూరి హత్యకు గురయ్యాడు. సూరికి నమ్మకమైన అనుచరుడిగా ఉన్న భానుకిరణ్‌యే ఈ హత్యకు పాల్పడ్డాడు. కారు ముందు సీటులో కూర్చున్న సూరిపై వెనక సీటులో కూర్చున్న భానుకిరణ్ కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం పరారై మధ్యప్రదేశ్‌లో తలదాచుకున్నాడు. 2012, ఏప్రిల్‌లో భానుకిరణ్ అనూహ్యంగా జహీరాబాద్‌లో పోలీసులకు పట్టుబట్టాడు. సుదీర్ఘ విచారణ తర్వాత భానుకిరణ్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తూ హైకోర్టులో తీర్పు వెలువడింది. -
పరిటాల సునీత అండతోనే సూరీ హత్య : భానుమతి
సాక్షి, అనంతపురం: మద్దెలచెరువు సూరీ హత్యకేసులో ప్రధాన నిందితుడైన భానుకిరణ్‌కు ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు విధించాలని సూరీ భార్య గంగుల భానుమతి హైకోర్టును అభ్యర్థించారు. మద్దెలచెరువు సూరీ హత్యకేసు విషయమై ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. తమకు హైకోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని అన్నారు. భానుకిరణ్ సూరీ పేరు చెప్పి జిల్లాలో సూమారు 700 కోట్ల రూపాయలు సెటిల్మెంట్లు చేశారని ఆరోపించారు. తన భర్త సూరీ హత్య వెనుక మంత్రి పరిటాల సునీత హస్తం ఉందని ఆమె ఆరోపించారు. పరిటాల కుటుంబం అండ లేకపోతే భానుకిరణ్ ఇంతటి దారుణానికి పాల్పడేవాడు కాదని అన్నారు. పరిటాల కుటుంబ అండతోనే ఈ దారుణానికి పాల్పడ్డాని భానుమతి తెలిపారు. -
సూరి హత్యకేసు నిందితుడు భానుపై మరోకేసు
సాక్షి, సిటీబ్యూరో : మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భానుకిరణ్‌కు 2009 నాటి అక్రమ ఆయుధాల కేసులో శిక్ష విధిస్తూ న్యాయస్థానం బుధవారం తీర్పు ఇచ్చింది. ఇతడితో పాటు రాజశేఖర్‌రెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, వినోద్‌లనూ దోషులుగా తేల్చి శిక్ష విధించింది. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాలు. అసాంఘిక ముఠాలకు అక్రమ ఆయుధాలను సరఫరా చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ ముఠాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2009 మార్చ్ 11న పట్టుకున్నారు. వీరి నుంచి 20 తుపాకులు, 42 తూటాలు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో అరెస్టు అయిన వారిలో ఏపీఎస్పీ మాజీ కానిస్టేబుల్, పదవీ విరమణ చేసిన ఆర్మీ జవాన్‌తో మద్దెలచెరువు సూరికి అనుచరుడిగా వ్యవహరించిన భాను కిరణ్ సైతం ఉన్నాడు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం రాంపల్లికి చెందిన పొరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఈ ముఠాకు నాయకుడు. ఇతను 2007లో ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అగ్రికల్చరల్ బీఎస్సీ చేస్తున్న సమయంలో ఫిరోజాబాద్‌కు చెందిన ఆయుధాల స్మగ్లర్‌తో పరిచయమైంది. అతని సాయంతో అక్రమ ఆయుధాలు తక్కువ ధరకు సేకరించి, వాటిని రాష్ట్రానికి తరలించి అధిక ధరలకు విక్రయించడం ప్రారంభించాడు. దీనికోసం ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. హైదరాబాద్‌కు ఓ వ్యక్తి ఆక్రమ ఆయుధం కలిగి ఉన్నాడనే సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ మధ్య మండల బృందం రంగారెడ్డి జిల్లా మాదాపూర్‌కు చెందిన సోలెం సుబ్బయ్య అలియాస్ సుబ్బును అరెస్టు చేసింది. ఇతని నుంచి ఓ కంట్రీమేడ్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకుంది. సుబ్బును విచారిస్తున్న సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి ఆయుధాలు అక్రమంగా ఎలా సరఫరా అవుతున్నాయనే విషయంపై చిన్న తీగ దొరికింది. దీని ఆధారంగా దర్యాప్తు చేసిన అప్పటి అధికారులైన టాస్క్‌ఫోర్స్ డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ మద్దిపాటి శ్రీనివాసరావు, ఎస్సైలు ఎన్సీహెచ్ రంగస్వామి, బి.నవీన్‌రెడ్డి, కె.శ్రీనివాస్, జె.రాంబాబు తమ బృందాలతో నగర వ్యాప్తంగా జల్లెడపట్టారు. బేగంపేట రోడ్లో ఉన్న ట్రాన్సిస్ట్ హోటల్‌పై బుధవారం దాడి చేసి పొరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందిన సర్వేష్, సంజయ్ భరద్వాజ్, మహ్మద్ జఫార్, జహంగీర్ ఖాన్ అలియాస్ సమీర్‌లను పట్టుకున్నారు. వీరిచ్చిన సమాచారం మేరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసి భాను కిరణ్, ఏపీఎస్పీ సెకండ్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసిన ఎర్ల మాధవయ్య, ముల్లా అబ్దుల్ రవూఫ్, కర్నూ లు జిల్లాకు చెందిన భంగిరాజు, బోనం వినోద్ అలియాస్ చక్రి, కడప జిల్లాకు చెందిన మాజీ ఆర్మీ జవాన్ కర్ణ శివప్రసాద్‌రెడ్డిలను అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం సీఐడీకి బదిలీ అయింది. మొత్తం 13 మంది నిందితులు కాగా... బుధ వారం నలుగురిపై నేరం నిరూపణ అయింది. -
భానుకిరణ్‌కు ఏడాది జైలు
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో ఎం.భానుకిరణ్‌కు నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించింది. భానుకిరణ్ మద్దెలచెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు. అక్రమ ఆయుధాల కేసుకు సంబంధించి భానుతో పాటు రాజశేఖర్‌రెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, డి.వినోద్లకు కూడా ఏడాది జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ బుధవారం కోర్టు తీర్పునిచ్చింది. జరిమానాను చెల్లించని పక్షంలో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని వెల్లడించింది. సూరి హత్య జరగకముందే భాను తదితరులను అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతో 2009 మార్చి 11న సికింద్రాబాద్‌లో బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో వారి నుంచి 8 పిస్తోళ్లు, 12 తపంచాలు, 42 తూటాలు, 12 మ్యాగజైన్లు (తూటాలు పెట్టుకునే కవచం), ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు తీర్పు వెలువరించింది. కాగా మద్దెలచెరువు సూరి హత్య కేసు ఇంకా విచారణ కొనసాగుతోంది. భాను ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు. -
అక్రమంగా ఆయుధాల కేసులో భాను కిరణ్‌కు ఏడాది జైలు
-
భాను కిరణ్‌కు ఏడాది జైలు, జరిమానా
సాక్షి, హైదరాబాద్ : మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌కు కోర్టు ఏడాది జైలు శిక్ష, 10 వేల రూపాయల జరిమానా విధించింది. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడన్న కేసులో నిందితుడు భాను కిరణ్‌తో పాటు మరో ఇద్దరికి శిక్ష విధించింది. అక్రమ ఆయుధాలు, హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న భానును కొన్నేళ్ల కిందట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం అక్రమ ఆయుధాల కేసు విచారణ అనంతరం న్యాయస్థానం భాను కిరణ్‌కు జైలుశిక్ష, జరిమానా విధించింది. మద్దెల చెరువు సూరి హత్య కేసుకు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. సూరి హత్య కేసులో అరెస్టయిన భానుకిరణ్ ప్రస్తుతం జైల్లోనే ఉన్న విషయం తెలిసిందే. -
చంచల్‌గూడకు భానుకిరణ్
హైదరాబాద్: మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి హత్యకేసులో నిందితుడైన భానుకిరణ్‌ను చర్లపల్లి జైలు నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. సూరి హత్య కేసులో అరెస్ట్ అయిన తరువాత భానుకిరణ్ నాలుగేళ్ళుగా చర్లపల్లి జైలులోనే ఉంటున్నాడు. అయితే జైలు కేంద్రంగా భాను పలు అక్రమాలకు పాల్పడుతున్నాడు. దీంతో అతనిని చంచల్ గూడ జైలుకు తరలించడానికి అనుమతి ఇవ్వాలని జైలు అధికారులు నాంపల్లి కోర్టును కోరారు. ఇందుకు కోర్టు అనుమతించడంతో ఈ రోజు మధ్యాహ్నం భానుకిరణ్ ను చంచల్ గూడకు తరలించారు. మరో వైపు భానుకు ప్రాణహాని ఉండటంతో ప్రత్యేక బ్యారక్ ను జైలు అధికారులు ఏర్పాటు చేశారు. -
అక్షయపాత్ర అంటూ ఘరానా మోసం
హైదరాబాద్ లో మరో ఘరానా మోసం వెలుగుచూసింది. యురేనియం పేరిట కొందరు వ్యక్తులు టోకరా వేశారు. పిడుగు పడినప్పుడు తమ వద్ద ఉన్న పాత్రలో చుట్టుప్రక్కల ఉన్న యురేనియం అంతా చేరుతుందని ప్రచారం చేశారు. యురేనియానికి వెలకట్టలేని ధర పలుకుతుందని ప్రచారం చేశారు. ఇది సూరి హత్య కేసులోని ప్రధాన నిందితుడు భాను కిరణ్ ముఠా పనిగా అనుమానిస్తున్నారు. 18 మంది ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నట్లు సమాచారం. భాను కిరణ్ జైల్లో ఉండే చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. గంగాధర్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అనే ఇద్దరు ముఠా నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. బెంగుళూరులో కోహ్లీ అనే వ్యక్తి అక్కడి నుంచే ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లుగా తెలియవచ్చింది. తమ వద్ద ఒక అక్షయలాంటి పాత్ర ఉందని, పిడుగు పడినప్రదేశంలో ఆ పాత్ర ఉంచితే చుట్టుప్రక్కల ఉన్న యురేనియాన్ని ఆ పాత్ర ఆకర్షిత్తుందని, దానిని అమ్ముకుంటే రూ. కోట్లు వస్తాయని చెప్పి వారు ప్రచారం చేస్తున్నారని, వీరి వలలో చాలా మంది వీఐపీలు పడినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో గంగాధర్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారికి జైల్లో ఉన్న భానుకిరణ్ నుంచి ఫోన్ వచ్చినట్లుగా సీఐడీ పోలీసులు గుర్తించారు. 15 రోజుల క్రితం యురేనియం విషయంలో మోసపోయిన ఓ ఎన్నారై డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆయన దీనిని సీఐడీ అధికారులకు అప్పగించారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు గురువారం బెంగెళూరులో కోహ్లీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఈ ముఠాలో ఎవరెవరు ఉన్నది తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నారు. -
చర్లపల్లి జైలులో భానుకిరణ్ నుంచి 'బాటిల్స్' స్వాధీనం
హైదరాబాద్ : చర్లపల్లి సెంట్రల్ జైలులో పోలీసు ఉన్నతాధికారులు శనివారం ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మానస్ బ్యారక్ లో 10 మందు బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అయితే ఈ బాటిళ్లు మద్దెల చెరువు సూరి హత్యకేసులో నిందితుడు భానుకిరణ్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. భాను కిరణ్ వద్ద నుంచి సదరు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించారు. భాను కిరణ్‌కి మద్యం బాటిళ్లు ఎవరు అందజేశారు అనే అంశంపై ఉన్నతాధికారులు జైలు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. కాగా జైలులో మందు బాటిళ్లు దొరకడంపై జైళ్లశాఖ ఉన్నతాధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
భానుకిరణ్ బెయిల్‌పై సాయంత్రం తీర్పు
హైదరాబాద్: సంచలనం సృష్టించిన మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ బెయిల్ పిటిషన్ పై సోమవారం తీర్పు వెలవడనుంది. గడిచిన మూడేళ్లుగా జైలులో ఉంటోన్న భానుకిరణ్.. తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా నాలుగు రోజుల క్రితం కోర్టును ఆశ్రయించాడు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ సాయంత్రం తీర్పును వెల్లడించనుంది. బెయిల్ మంజూరుచేస్తే భానుకిరణ్ పారిపోయే అవకాశం ఉందని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. 2011జనవరి 3న మద్దెలచెరువు సూరి హత్యకు గురైన తర్వాత ఏడాదిన్నరపాటు అజ్ఞాతంలోకి వెళ్లిన భానుకిరణ్.. ఆ తరువాత పోలీసులకు చిక్కాడు. బయటికి వస్తే సూరి అనుచరులనుంచి ప్రాణహాని ఉందని భావించిన భాను.. ఒకటిరెండు సార్లకు మించి బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు. తాజాగా నాలుగు రోజుల కిందట బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. -
భాను కిరణ్ వద్ద మళ్లీ మందు బాటిల్, బిర్యానీ
హైదరాబాద్ : చర్లపల్లి సెంట్రల్ జైల్లో మద్దెలచెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ వద్ద మరోసారి మద్యం, బిర్యానీని జైలు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ అతని వద్ద నుంచి మద్యం బాటిళ్లు, బిర్యానీ ప్యాకెట్లు, సెల్ ఫోన్లు, భారీగా నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాసులకు కక్కుర్తిపడి కరుడుగట్టిన నేరస్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలు సిబ్బందిపై వస్తున్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో జైళ్ల శాఖ డీజీ తనిఖీలు నిర్వహించి.... సదరు సిబ్బందిపై వేటు వేసినా ఫలితం లేకపోయింది. జైలు సిబ్బంది మామూళ్లు తీసుకొని బిర్యానీ, మద్యం దగ్గర నుంచి బయటి వ్యక్తులతో మాట్లాడి దందాలు చేసేందుకు సెల్ఫోన్లు కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారులు తనిఖీలు నిర్వహించినా అవి తూతూ మంత్రంగానే మిగిలిపోతున్నాయి. -
జైల్లో భాను వద్ద మద్యం...బిర్యానీ...సెల్ ఫోన్...
నగరంలోని చర్లపల్లి జైల్లులో జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ) కృష్ణంరాజు గత అర్థరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా మద్దిలచెరువు సూరీ హత్య కేసులో ప్రధాన నిందితుడు బానుకిరణ్, మహ్మద్ పహిల్వాన్, యాదగిరిల వద్ద ఉన్న మద్యం బాటిళ్లు, బిర్యానీ పాకెట్లు, సెల్ పోన్లు, భారీగా నగదును డీజీ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌తోపాటు జైలు సిబ్బందిపై డీజీ నిప్పులు చెరిగారు. గట్టి నిఘా ఉన్న జైలులోకి 'అవి' ఎలా వస్తున్నాయాంటూ మండిపడ్డారు. వెంటనే వివరణ ఇవ్వాలని సదరు అధికారులను ఆయన ఆదేశించారు. అందుకు అధికారులు మీనామేషాలు లెక్కపెట్టారు. దాంతో డీజీ కృష్ణం రాజు అక్కడికక్కడే జైలు సూపరింటెండెంట్‌తోపాటు మరికొంత మంది ఉన్నతాధికారులకు ఛార్జీ మెమోలు జారీ చేశారు. ఖైదీలకు మద్యం, సెల్ ఫోన్లు, బిర్యానీ పాకెట్లు జైలు సిబ్బంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆగమేఘాలపై అందజేస్తున్నారని సమాచారం. అయితే జైలు సిబ్బంది కష్టాన్ని గుర్తించిన ఖైదీలు పెద్ద మొత్తంలో నజరానాలు ఇస్తున్నారని వినికిడి. -
భానుకిరణ్‌కు ఆయుధం అమ్మిన డీలర్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెలచెరువు సూరి హత్యకేసులో నిందితుడైన మలిశెట్టి భానుకిరణ్‌కు ఆయుధం అమ్మడంతోపాటు ప్రభుత్వానికి తప్పుడు సమాచారాన్ని ఇచ్చిన కేసులో ఆయుధ డీలర్ సయద్ రఫీక్ అహ్మద్‌ను రాష్ట్ర నేర పరిశోధన విభాగం(సీఐడీ) పోలీసులు అరెస్టు చేశారు. సీఐడీ అదనపు డీజీ టి.కృష్ణప్రసాద్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. భానుకిరణ్ నకిలీ అడ్రస్ ఇవ్వడం ద్వారా ఖమ్మం జిల్లా కలెక్టర్ నుంచి ఆయుధ లెసైన్సు పొందాడు. తప్పుడు అడ్రస్ ద్వారా ఆయుధ లెసైన్సు పొందేందుకు భానుకిరణ్‌కు ఆయుధ డీలర్ సయద్ రఫీక్ అహ్మద్ సహకరించినట్లు సీఐడీ విచారణలో తేలింది. దీంతో అహ్మద్‌ను సీఐడీ పోలీసులు అరెస్టుచేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.