మద్దెలచెరువు సూరి కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో ఎం.భానుకిరణ్‌కు నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించింది. భానుకిరణ్ మద్దెలచెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు. అక్రమ ఆయుధాల కేసుకు సంబంధించి భానుతో పాటు రాజశేఖర్‌రెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, డి.వినోద్‌లకు కూడా ఏడాది జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ బుధవారం కోర్టు తీర్పునిచ్చింది. జరిమానాను చెల్లించని పక్షంలో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని వెల్లడించింది.
సూరి హత్య జరగకముందే భాను తదితరులను అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతో 2009 మార్చి 11న సికింద్రాబాద్‌లో బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో వారి నుంచి 8 పిస్తోళ్లు, 12 తపంచాలు, 42 తూటాలు, 12 మ్యాగజైన్‌లు (తూటాలు పెట్టుకునే కవచం), ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు తీర్పు వెలువరించింది. కాగా మద్దెలచెరువు సూరి హత్య కేసు ఇంకా విచారణ కొనసాగుతోంది. భాను ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment