Imprisonment
-
ట్యూషన్ టీచర్‌కు 111 ఏళ్ల జైలు.. ఏం నేరం చేశాడంటే..?
తిరువనంతపురం: విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ట్యూషన్ టీచర్‌కు కేరళలోని స్పెషల్ ఫాస్ట్–ట్రాక్ కోర్టు ఏకంగా 111 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. సంరక్షకుడిగా వ్యవహరించాల్సిన వ్యక్తి, ఇటువంటి నేరానికి పాల్పడినందున జాలి చూపాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగి అయిన మనోజ్(44) తను ఉండే ఇంట్లోనే ట్యూషన్లు చెబుతుండేవాడు. అతడి వద్దకు వచ్చే 11వ తరగతి బాలికను 2019లో ఓ రోజు ప్రత్యేక క్లాసుకని పిలిపించుకున్నాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదంతా సెల్ఫోన్లో షూట్ చేశాడు.ఈ ఘటనతో భయపడిపోయిన బాలిక ట్యూషన్‌కు వెళ్లడం మానేసింది. మనోజ్ తన ఘనకార్యాన్ని చెప్పుకునేందుకు ఆ ఫొటోలను మరికొందరికి పంపాడు. విషయం తెలిసి బాధితురాలి కుటుంబీకులు ఫోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మనస్తాపానికి గురైన మనోజ్ భార్య ఆత్మహత్యకు పాల్పడింది. మనోజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి సెల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. బాలికపై అత్యాచారం జరిపిన ఫొటోలు అందులో ఉన్నట్లు గుర్తించారు.అయితే, అదే సమయంలో ఆఫీసులో ఉన్నట్లు అక్కడి రిజిస్టర్‌లోని సంతకం చూపి పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించాడు. కానీ, మనోజ్ ఫోన్లోని కాల్ రికార్డుల ఆధారంగా అవన్నీ తప్పని తేలింది. దీంతో, ప్రత్యేక కోర్టు నిందితుడికి 111 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.1.05 లక్షల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది అదనంగా జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని జడ్జి ఆర్.రేఖ తీర్పు వెలువరించారు. -
చిన్నారిపై లైంగికదాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
నెల్లూరు (లీగల్): నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మిక్కిలింపేట గ్రామానికి చెందిన బాలిక 2020 ఫిబ్రవరి 16వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఇంటిముందు ఆడుకుంటుండగా సమీపంలోని ఇంట్లో నివసించే ఉప్పు రవికుమార్ అనే యువకుడు బాలికను ఇంటికి తీసుకుపోయి లైంగిక దాడికి పాల్పడ్డాడు.బాలిక తల్లి అదేరోజు కొడవలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు రవికుమార్‌ను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారణలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో నెల్లూరు పోక్సో ప్రత్యేక కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 20 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. -
పరువు నష్టం కేసులో ఎంపీ సంజయ్‌రౌత్‌కు 15 రోజులు జైలు
ముంబై: శివసేన(ఉద్దవ్ వర్గం) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌కు న్యాయస్థానంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో సంజయ్‌రౌత్‌కు ముంబై కోర్టు 15 రోజులు జైలు శిక్ష విధించింది. బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య భార్య మేధ సోమయ్య దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఆయనకు 15 రోజులు జైలు శిక్ష విధిస్తూ ముంబై కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 500 కింద రౌత్‌ను దోషిగా నిర్ధారిస్తూ.. ఆయనకు రూ.25 వేలు జరిమానా కూడా విధిస్తున్నట్లు వెల్లడించింది.మేధ సోమయ్య ముంబైలోని రుయా కళాశాలలో ఆర్గానిక్ కెమెస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె యువ ప్రతిష్టాన్ అనే స్వచ్చంద సంస్థ నడుపుతున్నారు. అయితే తన ఎన్జీవతో కలిసి ఆమె రూ.100 కోట్ల మరుగుదొడ్ల కుంభకోణానికి పాల్పడినట్లు రౌత్ ఆరోపించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పలు మీడియాల్లో కథనాలు ప్రసారం అయ్యాయి. చదవండి: ఎన్నాళ్లు జైల్లో ఉంచుతారు?.. ఈడీకి సుప్రీం కోర్టు మందలింపువీటిని ఖండించిన కిరీట్ సోమయ్య సతీమణి మేధ.. ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై తప్పుడు ఆరోపణలు చేశారని కోర్టును ఆశ్రయించారు. 2022 నుంచి రౌత్ తనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని, అవి పలు పత్రికలు, ఎలక్ట్రానిక్‌తోపాటు సోషల్ మీడియాలోనూ ప్రచురితమయ్యాయని తన పిటిషన్లో పేర్కొన్నారు. తనతోపాటు తన భర్తపై సంజయ్ రౌత్ పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేశారని చెబుతూ.. పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.మరోవైపు సంజయ్ రౌత్ న్యాయవాది, ఆయన సోదరుడు సునీల్ రౌత్ మాట్లడుతూ.. బెయిల్ పిటిషన్ వేస్తామని తెలిపారు. అలాగే ఈ ఉత్తర్వులపై ముంబై సెషన్స్ కోర్టులో అప్పీలు చేస్తామని చెప్పారు. -
కోర్టు ధిక్కార కేసులో అధికారులకు జైలు శిక్ష, జరిమానా
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో అప్పటి గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే (ప్రస్తుతం రవాణా, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి)కు హైకోర్టు రూ.2 వేల జరిమానా విధించింది. ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) ఎస్.శ్రీనివాస్‌కు 2 నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. ఈ మేరకు న్యా యమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖర్ శుక్రవా రం తీర్పు వెలువరించారు.వారిద్దరినీ రిజి స్ట్రార్ (జ్యుడీషియల్) ముందు లొంగిపోవాలని ఆదేశించారు. ఈ తీర్పు వెలువడగానే, దీనిని సవాలు చేస్తూ కాంతిలాల్ దండే, శ్రీనివాస్‌లు వేర్వేరుగా ధర్మాసనం ముందు కోర్టు ధిక్కార అప్పీళ్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పు అమలును రెండు వారాలు నిలిపేసింది. తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.పదోన్నతినివ్వడం లేదంటూ పిటిషన్..తన సుదీర్ఘ సర్వీసు ఆధారంగా సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ)గా పదోన్నతినివ్వడం లేదంటూ గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జి క్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) బి.వసంత 2021లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు నాలుగు నెలల్లో ఏఈలు, ఏఈఈలు, డీవైఈఈల సీనియారిటీ జాబితా ఖరారు చేయాలని 2022లో అధికారులను ఆదేశించారు. అనంతరం అధికారులు ఈ ఆదేశాలను అమలు చేయడంలేదంటూ వసంత కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఆగస్టు 1న మరోసారి విచా రణకు రాగా.. న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖరరావు అధికారుల తీరును తీవ్రంగా ఆక్షేపిస్తూ ఈ నెల 9న తీర్పు ఇచ్చారు. కోర్టుకు హాజరైన ఇరువురు అధికారులు కోర్టు ఆదేశాల అమలుకు మరింత గడువు కోరారు. దీంతో న్యాయమూర్తి తన ఉత్తర్వుల అమలును మూడు వారాలు నిలిపివేశారు. తిరిగి ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా.. గతంలో శిక్ష విధించిన నేపథ్యంలో వెంటనే రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని ఇరువురినీ ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
రష్యా హక్కుల నేతకు 30 నెలల జైలు
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగిన తీరును తీవ్రంగా తప్పుబడుతూ వ్యాసాలు రాసిన రష్యా మానవ హక్కుల కార్యకర్తపై అక్కడి కోర్టు కన్నెర్రజేసింది. ప్రభుత్వ చర్యను తప్పుబడుతూ ఆర్టికల్స్ రాయడం నేరమంటూ 70 ఏళ్ల ఒలెగ్ ఓర్లోవ్‌కు 30 నెలల కారాగార శిక్ష విధిస్తూ మాస్కో కోర్టు తీర్పు చెప్పింది. రాజకీయ దురుద్దేశ్యంతో పెట్టిన కేసు ఇది అని ఆయన చేసిన వాదనలను కోర్టు పట్టించుకోలేదు. ఆయనకు రెండు సంవత్సరాల 11 నెలల జైలు శిక్ష వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించగా రెండు సంవత్సరాల ఆరునెలల శిక్షను కోర్టు ఖరారుచేసింది. ఈ కేసులో గతంలోనే విచారణ ముగిసింది. అప్పుడు ఆయనకు కొంతమేర జరిమానా కట్టాలని మాత్రమే కోర్టు సూచించింది. అయితే పుతిన్ ప్రభుత్వంపై విమర్శలను సహించేది లేదని, కఠిన శిక్ష వేయాల్సిందేనని ప్రాసిక్యూషన్ ఈ కేసు పునర్విచారణను కోరి చివరకు ఇలా శిక్ష పడేలా చేసింది. గతంలో నోబెల్ శాంతి బహుమతి పురస్కారాన్ని అందుకున్న మానవహక్కుల సంస్థ ‘మెమోరియల్’కు ఓర్లోవ్ సహ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఓర్లోవ్‌ను శిక్షించడాన్ని మెమోరియల్ సంస్థ తీవ్రంగా తప్పుబట్టింది. తమ ఉద్యమం ఆగదని పేర్కొంది. -
Toshakhana corruption case: తోషఖానా కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు 14 ఏళ్ల జైలుశిక్ష
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌కు కష్టాల మీద కష్టాలు వచ్చిపడుతున్నాయి. తోషఖానా కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు, ఆయన భార్య బుష్రా బీబీకి ఇస్లామాబాద్ కోర్టు 14 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధించింది. విదేశీ నాయకులు ఇచ్చిన ఖరీదైన బహుమతులను విక్రయించి, సొమ్ము చేసుకున్నట్లు ఇమ్రాన్ దంపతులపై అభియోగాలు నమోదయ్యాయి. దర్యాప్తులో అదంతా నిజమేనని తేలడంతో న్యాయస్థానం బుధవారం శిక్ష ఖరారు చేసింది. దోషులకు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. పదేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనరాదంటూ కోర్టు ఇమ్రాన్ ఖాన్‌పై అనర్హత వేటు కూడా వేసింది. 1.5 బిలియన్ల జరిమానా చెల్లించాలని ఇమ్రాన్ దంపతులను ఆదేశించింది. ఫిబ్రవరి 8న పాకిస్తాన్ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. విదేశాలకు అధికారిక పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి దేశాధినేతలు బహుమతులు ఇస్తుంటారు. అవన్నీ ప్రభుత్వానికే చెందుతాయి. తోషఖానాలో భద్రపర్చాల్సి ఉంటుంది. ఇమ్రాన్ మాత్రం సొంత ఆస్తిలాగా అమ్మేసుకున్నారు. అధికార రహస్యాల వెల్లడి కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు మూడు రోజుల క్రితం 10 సంవత్సరాల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. -
బంగ్లాదేశ్ నోబెల్ గ్రహీతకు 6 నెలల జైలు
ఢాకా: బంగ్లాదేశ్ ఆర్థిక వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనస్(83)కు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మరో ముగ్గురితో కలిసి ఆయన స్థాపించిన గ్రామీణ్ టెలికం సంస్థలో కార్మికుల సంక్షేమ నిధిని నెలకొల్పడంలో విఫలమైనట్లు మూడో కార్మిక న్యాయస్థానం జడ్జి షేక్ మరీనా సుల్తానా సోమవారం యూనస్‌కు ఆరు నెలల జైలు శిక్ష విస్తూ తీర్పు వెలువరించారు. అంతేకాదు, తలా రూ.19 వేల జరిమానా విధించారు. అనంతరం వారు పెట్టుకున్న పిటిషన్ల మేరకు నలుగురికీ బెయిల్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ తీర్పును వీరు హైకోర్టులో సవాల్ చేసుకునే వీలుంటుంది. ఈ నెల 7న బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. -
చెక్ బౌన్స్ కేసులో దోషిగా మంత్రి
బెంగళూరు: కర్ణాటక పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ మంత్రి మధు బంగారప్పను చెక్ బౌన్స్ కేసులో ప్రత్యేక కోర్టు దోషిగా తేలి్చంది. ఫిర్యాదుదారులైన రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థకు రూ.6.96 కోట్లు జరిమానాగా చెల్లించాలని ఆయనను ఆదేశించింది. మరో రూ.10 వేలను కర్ణాటక ప్రభుత్వానికి చెల్లించాలని స్పష్టం చేసింది. జరిమానా చెల్లించకపోతే ఆరు నెలలపాటు సాధారణ జైలు శిక్ష అనుభించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఇటీవల తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆకాశ్ ఆడియో–వీడియో ప్రైవేట్ లిమిటెట్‌ను మొదటి నిందితులుగా, ఆకాశ్ ఆడియో–వీడియో ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మధు బంగారప్ప రెండో నిందితుడిగా కోర్టు గుర్తించింది. రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ నుంచి మధు బంగారప్ప రూ.6 కోట్లు డిపాజిట్ రూపంలో తీసుకున్నారు. చాలా రోజులు తిరిగి చెల్లించలేదు. గట్టిగా నిలదీయగా చెక్కు ఇచ్చారు. బ్యాంకు ఖాతాలో నగదు లేకపోవడంతో అది బౌన్స్ అయ్యింది. దాంతో రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. -
జైలు నుంచే చదువు.. పీజీ గోల్డ్ మెడల్ కైవశం
కోవెలకుంట్ల: జైలు శిక్షపడిన యువ ఖైదీ అక్కడి అధికారుల సహకారం, పట్టుదలతో లా కోర్సు చదివి న్యాయవాద పట్టాతో తన తండ్రిని నిర్దోషిగా నిరూపించేందుకు న్యాయస్థానంలో వాదించి గెలిచిన ఘటనను 20 ఏళ్ల క్రితం స్టూడెంట్ నంబర్ –1 సినిమాలో చూశాం. అదే తరహాలో యావజ్జీవ కారాగార శిక్షపడిన ఓ యువకుడు నిజ జీవితంలో విజయం సాధించి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నంద్యాల జిల్లా సంజామల మండలం పేరుసోముల గ్రామానికి చెందిన దూదేకుల నడిపి మాబుసా, మాబున్నీ కుమారుడు మహమ్మద్ రఫీ 2014లో బీటెక్ చదివేవాడు. ఆ సమయంలో ప్రేమ వ్యవహారంలో ఇదే గ్రామానికి చెందిన ఓ యువతి హత్యకు కారకుడని భావించి ఆ యువకుడిపై పోలీస్‌స్టేషన్‌లో హత్యకేసు నమోదైంది. కోర్టులో విచారణ అనంతరం 2019 జూలై నెలలో రఫీకి జీవితఖైదు విధించారు. అప్పటి నుంచి కడప కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఖైదీలను సైతం అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో అక్కడి జైలు అధికారులు చదువుపై ఆసక్తి ఉన్న వారిని గుర్తించారు. పది చదివిన వారిని దూర విద్య కోర్సుల ద్వారా పై చదువులకు ప్రోత్సహించారు. శిక్షపడే నాటికే డిగ్రీ పూర్తి చేసిన మహమ్మద్ రఫీకి చదువుపై ఉన్న మక్కువను గుర్తించి అప్పటి జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్, ఇతర జైలు అధికారులు ప్రోత్సాహమందించారు. 2020లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ చేసేందుకు అవకాశం కల్పించారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి ర్యాంకు మహమ్మద్ రఫీ ఎంఏ సోషియాలజీలో అడ్మిషన్ పొందాడు. వివిధ రకాల పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ను సమకూర్చుకుని జైలులోనే నాలుగు గోడల మధ్య కష్టపడి చదివాడు. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు 2022లో పరీక్షలకు అనుమతి ఇచ్చారు. అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని యూనివర్సిటీ పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఎంఏ సోషియాలజీలో మొదటి ర్యాంకుతో గోల్డ్ మెడల్ కైవశం చేసుకున్నాడు. జైలులో ఉంటున్న రఫీకి పీజీ పట్టా గోల్డ్ మెడల్ ప్రదానం చేయాలని యూనివర్సిటీ అధికారులు ఇటీవల జైలు అధికారులకు సమాచారం అందించారు. కోర్టు అనుమతితో నాలుగు రోజులు బెయిల్ మంజూరు కావడంతో గురువారం హైదరాబాద్‌లోని అంబేడ్కర్ యూనివర్సిటీలో వైస్ చాన్స్‌లర్ జగదీశ్ ఆధ్వర్యంలో గోల్డ్‌మెడల్ బహూకరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ తన జీవితం జైలు పాలైనప్పటికీ చదువుపై ఉన్న మమకారంతో పట్టుదలతో పీజీ సాధించానన్నారు. తన తల్లిదండ్రులకు ఈ గోల్డ్‌మెడల్ అంకితం చేస్తున్నట్లు తెలిపారు. -
ఖతార్‌లో 8 మంది భారతీయులకు మరణ శిక్ష రద్దు
న్యూఢిల్లీ: ఖతార్‌లో గూఢచర్యం ఆరోపణలపై మరణ శిక్ష పడిన 8 మంది భారత నావికాదళం మాజీ అధికారులకు భారీ ఊరట లభించింది. వారికి విధించిన మరణ శిక్షను ఖతార్ అప్పిలేట్ కోర్టు రద్దు చేసింది. ఈ శిక్షను కేవలం జైలు శిక్షగా మారుస్తూ గురువారం కీలక తీర్పు వెలువరించింది. అయితే, వారు ఎంతకాలం జైలులో శిక్ష అనుభవించాలన్నది తెలియరాలేదు. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అల్–దాహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ కేసులో ఖతార్ కోర్టు 8 మందికి శిక్షను తగ్గించినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. గూఢచర్యం కేసులో 8 మంది నేవీ మాజీ అధికారులు 2022 ఆగస్టులో ఖతార్‌లో అరెస్టయ్యారు. అప్పిలేట్ కోర్టు తాజా తీర్పును భారత దౌత్య విజయంగా నిపుణులు అభివరి్ణస్తున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాప్–28 సదస్సు సందర్భంగా ఇటీవల దుబాయ్‌లో ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్–థానీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఖతార్‌లో 8 మంది భారతీయులకు విధించిన మరణ శిక్ష గురించి ఈ భేటీలో మోదీ ప్రస్తావించినట్లు సమాచారం. శిక్ష నుంచి వారికి విముక్తి కలి్పంచాలంటూ మోదీ చేసిన విజ్ఞప్తి పట్ల ఖతార్ పాలకులు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఖతార్‌లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమంపై అల్–థానీతో చర్చించినట్లు ఈ భేటీ తర్వాత మోదీ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మరణ శిక్షను రద్దు చేసి, జైలు శిక్షగా కుదిస్తూ ఖతార్ కోర్టు తీర్పు ప్రకటించింది. బాధితులకు అండగా ఉంటాం ఖతార్ కోర్టు తాజా తీర్పునకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎదురు చూస్తున్నామని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. తదుపరి చర్యల విషయంలో న్యాయ నిపుణులతో, బాధితుల కుటుంబ సభ్యులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని వెల్లడించింది. కోర్టులో గురువారం జరిగిన విచారణకు ఖతార్‌లోని భారత రాయబారి, ఇతర అధికారులు, బాధితుల కుటుంబ సభ్యులు కొందరు హాజరయ్యారని తెలియజేసింది. బాధితులకు అండగా ఉంటామని, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టంచేసింది. ఏమిటీ కేసు? 8 మంది భారత మాజీ అధికారులు ఖతార్ రాజధాని దోహాకు చెందిన అల్–దాహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అనే ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నారు. ఈ సంస్థ ఖతార్ సైనిక దళాలకు, సెక్యూరిటీ ఏజెన్సీలకు శిక్షణ ఇస్తోంది. ఇతర సేవలు అందిస్తోంది. అల్–దాహ్రా సంస్థలో పని చేస్తున్న 8 మంది భారతీయులను గత ఏడాది ఆగస్టులో ఖతార్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తమ దేశ రహస్యాలను చోరీ చేస్తున్నట్లు వారిపై అభియోగాలు మోపారు. ఇతర దేశాలకు సమాచారం చేరవేస్తూ గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు. అయితే, ఈ అభియోగాలను బహిరంగపర్చలేదు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఖతార్ కోర్టు 8 మందికి మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచి్చంది. దీంతో భారత ప్రభుత్వం న్యాయ పోరాటం ప్రారంభించింది. శిక్షను వ్యతిరేకిస్తూ ఖతార్‌లోని కోర్టు ఆఫ్ అప్పీల్‌ను ఆశ్రయించింది. ఖతార్‌లో శిక్ష పడిన వారిలో నవతేజ్ గిల్, సౌరభ్ వశి‹Ù్ట, పూర్ణేందు తివారీ, అమిత్ నాగ్‌పాల్, ఎస్.కె.గుప్తా, బి.కె.వర్మ, సుగుణాకర్ పాకాల, సైలర్ రాగేశ్ ఉన్నారు. వీరిలో సుగుణాకర్ పాకాల ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందినవారు. -
ఇన్నేళ్ళకు న్యాయం!
మూడు దశాబ్దాల పైచిలుకు క్రితం కేసులో బాధితులకు ఎట్టకేలకు కాసింత ఊరట దక్కింది. పోలీసుల దమనకాండకు ప్రతిరూపమైన తమిళనాడు వాచాత్తి ఘటనలో సెప్టెంబర్ 29న మద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ఆ రకంగా చిరకాలం గుర్తుండిపోతుంది. మారుమూల గ్రామంలోని గిరిజనులపై దాడి చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణమైన కేసు అది. అటవీ, పోలీసు అధికారులతో సహా మొత్తం 269 మంది దోషులంటూ కింది కోర్టు ఏనాడో తీర్పు ఇచ్చింది. దోషులు పైకోర్టును ఆశ్రయించి, జాగు చేశారు. తాజాగా మద్రాస్ హైకోర్ట్ ఆ అప్పీళ్ళను కొట్టివేసింది. కింది కోర్ట్ తీర్పును హైకోర్ట్ సమర్థించడమే కాక, 215 మందినీ దోషులుగా తీర్మానిస్తూ, ఒక్కొక్కరికీ 1 నుంచి 10 ఏళ్ళ పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. బాధితులకు ఇన్నాళ్ళకైనా న్యాయం దక్కిందనే భావన కలుగుతోంది. ప్రజాస్వామ్యం పట్ల, న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం మిగులుతోంది. నిజానికి, తమిళనాట ధర్మపురి జిల్లాలో తూర్పు కనుమల్లో నెలకొన్న గిరిజన గ్రామం వాచాత్తి గురించి ముప్ఫయ్యేళ్ళ క్రితం ఎవరూ విననైనా విని ఉండరు. కేవలం 655 మంది, అందులోనూ 643 మంది మలయాళీ షెడ్యూల్డ్ తెగల వారున్న 200 గడపల గ్రామం అది. కానీ, ఆ రోజు జరిగిన ఆ దారుణ ఘటనతో ఒక్కసారిగా ఆ గ్రామం వార్తల్లో నిలిచింది. గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ, పోలీసులు, అటవీ అధికారులు గ్రామంపై దాడి చేశారు. అక్కడ గిరిజనులపై సాగించిన అమానుషం, బడికెళ్ళే ఓ చిన్నారి సహా 18 మంది మహిళలపై సామూహిక అత్యాచారం, తాగునీటిలో విషం కలిపిన తీరు, పశువుల్ని ఊచకోత కోసి ఊరి బావిలో పడేసిన వైనం... ఆ గ్రామం రూపురేఖల్నే మార్చేశాయి. ‘గంధపు చెక్కల స్మగ్లింగ్ గ్రామం’ అని ముద్రవేస్తూ అమాయకులపై అధికారులు సాగించిన ఆ దమనకాండ ఓ మాయని మచ్చ. కేంద్ర నేర దర్యాప్తు సంస్థ (సీబీఐ) లోతుగా విచారించి అధికారుల తప్పు తేల్చినా, ఏళ్ళ తరబడి వాయిదా పడుతూ వచ్చిన న్యాయం ఇన్నాళ్ళకు దక్కింది. బాధితులకు కాస్తయినా ఊరట దక్కింది. 1992 జూన్ 20 నుంచి మూడు రోజులు సాగిన అమానుష ఘటనలో మొత్తం 269 మంది నిందితులు కాగా, వారిలో 54 మంది న్యాయ విచారణ కాలంలోనే కన్నుమూశారు. మిగిలినవారికి ఇప్పుడు శిక్ష పడింది. ఈ కథ ఇక్కడి దాకా రావడం వెనుక న్యాయం కోసం సుదీర్ఘంగా సాగిన పోరాటం ఉంది. అప్పట్లో అధికారులపై కేసులు నమోదు కాకపోగా, గిరిజనులపైనే స్థానిక పోలీసులు ఎదురు కేసులు పెట్టిన పరిస్థితి. గిరిజనులు తమ ఇళ్ళను తామే ధ్వంసం చేసుకున్నారని అధికారులు బుకాయించారు. హైకోర్ట్ ఆదేశిస్తే గానీ చివరకు సీబీఐ దర్యాప్తు జరగలేదు. అంతరాయాలతో విచారణ సుదీర్ఘంగా 19 ఏళ్ళు సాగి, చివరకు 2011లో ధర్మపురి సెషన్స్ కోర్ట్ అధికారులను దోషులుగా తేల్చి, శిక్ష వేసింది. దోషులు మద్రాస్ హైకోర్ట్‌ను ఆశ్రయించడంతో మరో 11 ఏళ్ళ సుదీర్ఘ కాలం గడిచిపోయింది. ఈ కేసు విచారణ సత్వరమే పూర్తి చేయాలని హైకోర్ట్ న్యాయమూర్తి ఒకరు ఈ ఏడాది మొదట్లో పట్టుబట్టడంతో ఇప్పటికైనా కథ ఓ కొలిక్కి వచ్చింది. చిత్రం ఏమిటంటే – వాచాత్తి దమన కాండపై అప్పట్లోనే ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైతే, ప్రభుత్వంలో ఉన్నత హోదాల్లో ఉన్నవారు అలాంటి నేరాలకు పాల్పడరంటూ జడ్జి దాన్ని కొట్టేయడం! జయలలిత సారథ్యంలోని అప్పటి అన్నాడీఎంకె పాలకులు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఆ తరువాత అధికారంలో ఉన్న డీఎంకె, అన్నాడీఎంకె సర్కార్లూ తమ బ్యూరోక్రాట్లకు కాపు కాసేందుకే ప్రయత్నించాయి. కొందరు ఉద్యమకారులు, లాయర్లు, నిజాయతీపరులైన అధికారులు, జడ్జీల వల్ల చివరకు న్యాయం జరిగింది. అత్యాచార బాధితులు పట్టువిడవకుండా పోరాడడంతో ఇప్పటికైనా సత్యం గెలిచింది. కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయదేవత సాక్షిగా ధర్మం నిలిచింది. కేవలం 655 మంది ఆదివాసీలు బలమైన రాజ్యవ్యవస్థతో తలపడి, విజయం సాధించడం చరిత్రాత్మకం. ఆ రకంగా ఇది బలవంతులపై బలహీనుల గెలుపు. ఆదివాసీల హక్కుల గెలుపు. న్యాయవ్యవస్థ స్వతంత్రమనీ, పాలకుల తప్పులను సైతం సహించదనీ రుజువైంది. ఎస్సీ– ఎస్టీ చట్టం ఇప్పటికీ బలంగానే ఉందని తేలింది. అయితే, నేటికీ కొనసాగుతున్న అనేక దమనకాండ కేసుల్లో ఇంత సుదీర్ఘ పోరాటం, సత్యాన్ని వెలికితీసి దోషులకు శిక్షపడేలా బృహత్ యత్నం సాధ్యమేనా? న్యాయం దక్కడంలో ఆలస్యమైతే, న్యాయం చేయనట్టే! వాచాత్తి ఘటనలో అపరిమిత ఆలస్యమైంది. దోషుల్లో పలువురు బెయిల్‌పై బయట గడిపి, ఉద్యోగ ప్రయోజనాలన్నీ పొంది, హాయిగా రిటైరయ్యారు. ఇప్పటికైనా దోషులను శిక్షించడమే కాక, బాధితులకు తగిన న్యాయం చేయాలి. నష్టపరిహారాలిస్తే సరిపోదు. నలుగురిలో గౌరవంగా బతికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. వలసవాద బ్రిటీషు పాలన లక్షణాలను పోలీసులు, అధికారులు ఇప్పటికైనా వదిలించుకొంటే మేలు. తమిళనాట గిరిజనులపై అమానుషాల నుంచి మిజోరమ్‌లో గ్రామాల దహనం, కశ్మీర్లో నిర సనకారులపై కాల్పుల దాకా దశాబ్దాలుగా చూస్తున్నవే. బ్రిటీషు దౌర్జన్యానికి మన భారతీయ పోలీ సులు వారసులుగా మారిన వైనానికి ఇవి ప్రతీకలు. పదే పదే సాగుతున్న మానవహక్కుల ఉల్లంఘనకు సాక్ష్యాలు. అందుకే, ‘‘దాడుల పేరిట చట్టవ్యతిరేక చర్యలకు’’ పోలీసులు బరి తెగించడం దుస్సహమని కోర్ట్ అన్న మాట కీలకం. నిన్నటికి నిన్న కూడా వార్తల్లో కనిపిస్తున్న ఇళ్ళపై దుర్మార్గ దాడుల ధోరణిని వ్యవస్థ సత్వరమే వదిలించుకోవాలి. వాచాత్తి కేసు గుర్తుచేస్తున్న పాఠం అదే! -
కామాంధులకు 20 ఏళ్ల జైలు, జరిమానా
కామంతో కళ్లు మూసుకు పోయి అభం శుభం తెలియని చిన్నారులపై లైంగికదాడికి పాల్పడిన వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు కామాం ధులకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయస్థానాలు శుక్రవారం సంచలన తీర్పులిచ్చాయి. కర్నూలు(లీగల్)/పార్వతీపురంటౌన్/అనంతపురం: కామంతో కళ్లు మూసుకుపోయి వేర్వేరు ప్రాంతాలకు చెందిన అభం శుభం తెలియని చిన్నారులపై లైంగికదాడికి పాల్పడిన ముగ్గురు కామాంధులకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయస్థానాలు శుక్రవారం సంచలన తీర్పునిచ్చాయి. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం జిల్లెల గ్రామానికి చెందిన పెరుమాళ్ల వెంకటేశ్వర్లు కుమార్తె (17) నంద్యాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతూ హాస్టల్లో ఉండేది. 2019 నవంబర్ 12వ తేదీన కళాశాల నుంచి ఇంటికి వచ్చిన కుమార్తెను భయపెట్టి మధ్యాహ్నం సమయంలో ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. పదిరోజుల అనంతరం తన తండ్రి చేసిన అఘాయిత్యం గురించి తల్లికి చెప్పింది. దీంతో తల్లి, కుమార్తె నందివర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి వెంకటేశ్వర్లుపై పోక్సో చట్టం, ఐపీసీ 376 కింద కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో కర్నూలు జిల్లా పోక్సో న్యాయస్థానం న్యాయమూర్తి జి.భూపాల్‌రెడ్డి ముద్దాయికి 20 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా కొత్తవలసలోని ఓ పాఠశాలలో నాలుగోతరగతి చదువుతున్న చిన్నారిని విడిచిపెట్టి తల్లి ఎటో వెళ్లిపోయింది. చిన్నారి ఐరన్ షాపులో పనిచేస్తున్న తండ్రి వద్దనే ఉంటూ చదువుకుంటోంది. 2022 సంవత్సరం జూలై నెలలో చిన్నారి ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు కసాయి తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వారం రోజుల తరువాత చిన్నారి పుట్టినరోజు సందర్భంగా నిందితుడు కేక్ తెచ్చాడు. దీంతో చిన్నారి తన స్నేహితురాలిని ఇంటికి ఆహ్వానించింది. బాధితురాలితో పాటు ఆమె స్నేహితురాలు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నిద్రపోతుండగా ఇద్దరిపైనా కసాయి తండ్రి లైంగికదాడికి యత్నించాడు. చిన్నారులు ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టాడు. విషయాన్ని బాధితురాలి స్నేహితురాలు తన తల్లికి చెప్పింది. వెంటనే ఆమె ఇద్దరు బాలికలను తీసుకెళ్లి రెండు ఘటనలపైనా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పటి పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్ కేసు నమోదు చేశారు. రెండు కేసుల్లోనూ నేరం రుజువు కావడంతో ఎస్సీ, ఎస్టీ పోక్సోకోర్టు ఇన్చార్జి జడ్జి షేక్‌సికిందర్ బాషా ముద్దాయికి ఒక్కో కేసులో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. బాధిత చిన్నారులు ఒక్కొక్కరికీ రూ.4 లక్షల నష్ట పరిహారాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఈ వివరాలను పార్వతీపురం మన్యం జిల్లాఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. అదే విధంగా శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల గ్రామంలో తల్లిదండ్రులతో కలసి 13 ఏళ్ల బాలిక ఉండేది. 2019 ఆగస్టు 7వ తేదీన తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పూజారి ఈశ్వరయ్య అనే వ్యక్తి బాలికపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రులు గోరంట్ల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ముద్దాయిపై అభియోగాలు రుజువు కావడంతో 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష , రూ.5 వేల జరిమానా విధిస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి రాజ్యలక్ష్మి తీర్పు చెప్పారు. అలాగే బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. -
బీజేపీ ఎంపీకి బిగ్ షాక్.. రెండేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
BJP MP Ramshankar Katheria.. లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. బీజేపీ ఎంపీకి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, ఆయన లోక్‌సభకు అనర్హుడయ్యే అవకాశం కూడా ఉంది. అయితే, సదురు ఎంపీకి ఓ వ్యక్తిపై దాడి కేసులో కోర్టు జైలు విధించడం విశేషం. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఇతావా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి రామ్ శంకర్ కటారియాకు ఆగ్రా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఒక వ్యక్తిపై దాడి చేసిన కేసులో కటారియాకు కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ శనివారం తీర్పును వెల్లడించింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ నుంచి అనర్హత వేటు పడే అవకాశమున్నది. కాగా, 2011లో ఆగ్రాలోని విద్యుత్ సరఫరా కంపెనీ మేనేజర్‌పై తన అనుచరులతో కలిసి దాడి చేశారు. నాడు ఆగ్రా ఎంపీగా ఉన్న ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక, 12 ఏళ్ల నాటి దాడి కేసుపై ఆగ్రా కోర్టు విచారణ జరిపింది. రామ్ శంకర్ కటారియాను దోషిగా నిర్ధారించింది. రెండేళ్లు జైలు శిక్షతోపాటు రూ.50,000 జరిమానా విధించింది. ఇదిలా ఉండగా.. కోర్టు తీర్పుపై బీజేపీ ఎంపీ రామ్ శంకర్ స్పందించారు. కోర్టు తీర్పును గౌరవిస్తానని తెలిపారు. అయితే రెండేళ్ల జైలు శిక్షపై పైకోర్టులో అప్పీల్ చేస్తానని చెప్పారు. దీనికి సంబంధించిన న్యాయ విధానాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. రామ్ శంకర్ కటారియా నవంబర్ 2014 నుండి జూలై 2016 వరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. అతను పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆఫ్ డిఫెన్స్ మరియు కన్సల్టేటివ్ కమిటీ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సభ్యుడుగా కొనసాగారు. #WATCH | "...I appeared before the court normally. Court has given a decision against me today. I respect the court, I have the right to appeal and I will exercise it," says BJP MP Ramshankar Katheria #RamshankarKatheria pic.twitter.com/QVmx8pfcAX — NewsMobile (@NewsMobileIndia) August 5, 2023 ఇది కూడా చదవండి: గుజరాత్లో బీజేపీకి షాక్.. జనరల్ సెక్రెటరీ ప్రదీప్ గుడ్ బై -
బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఆటో డ్రైవర్‌కు 15 ఏళ్లు జైలు
విశాఖ లీగల్: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఆటోడ్రైవర్‌కు 15 ఏళ్లు జైలుశిక్ష, రూ.50వేలు జరిమానా విధిస్తూ విశాఖ నగరంలోని ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనందిని గురువారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా ఏడాదిపాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. పోక్సో చట్టం కింద బాలికకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షలు పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి సూచించారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ అందించిన వివరాల మేరకు... విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రాంజీ ఎస్టేట్‌కు చెందిన పదహారేళ్ల బాలిక 2016లో నగరంలోని రామా టాకీసు వద్ద ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరింది. మరికొందరు బాలికలతో కలిసి ఆమె ప్రతి రోజు ఆటోలో కళాశాలకు వెళ్లేది. ఈ క్రమంలో 2016, సెప్టెంబర్ 29న ఆటో డ్రైవర్ సాయిగణేష్(25) ఆ బాలికను ఒంటరిగా రామాటాకీస్ దగ్గర నుంచి పోర్టు స్టేడియం రోడ్డు మీదుగా అక్కయ్యపాలెం పైపుల సందులోకి తీసుకువెళ్లాడు. అక్కడ బాలికతో వికృతంగా ప్రవర్తించి లైంగిక దాడి చేశాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో తిరిగి ఆటోలో తీసుకువచ్చి ఆమె ఇంటి దగ్గర వదలిపెట్టాడు. ఆటో డ్రైవర్ లైంగికదాడికి పాల్పడిన విషయాన్ని బాధితురాలు తన తల్లికి తెలియజేసింది. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో తొలుత ఆమెను సెవెన్ హిల్స్ ఆస్పత్రికి, ఆ తర్వాత కేజీహెచ్‌కి తరలించి చికిత్స చేయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విశాఖ నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేశారు. అనంతరం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో 15 ఏళ్లు జైలు శిక్ష, రూ.50వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. -
అంగ్ సాన్ సూకీ జైలు శిక్ష తగ్గింపు
బ్యాంకాక్: పదవీచ్యుతురాలైన అంగ్ సాన్ సూకీ(78) జైలు శిక్షను తగ్గిస్తున్నట్లు మయన్మార్ సైనిక ప్రభుత్వం ప్రకటించింది. రెండున్నరేళ్ల క్రితం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సూకీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని సైనిక పాలకులు కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అనంతరం సూకీపై 19 నేరారోపణలు మోపారు. వీటిలో కొన్నిటిపై విచారణ జరిపిన సైనిక కోర్టులు సూకీకి 33 ఏళ్ల జైలు శిక్షలు విధించాయి. బౌద్ధులు మెజారిటీగా ఉన్న మయన్మార్‌లో మంగళవారం ‘గౌతమ బుద్ధుని మొదటి ఉపన్యాస’దినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ సందర్భంగా మిలటరీ కౌన్సిల్ చీఫ్, సీనియర్ జనరల్ మిన్ సుమారు 7 వేల మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించారు. వీరిలో సూకీ, మాజీ అధ్యక్షుడు విన్‌మింట్ ఉన్నారు. సూకీకి ఆరేళ్ల జైలు శిక్షను తగ్గిస్తున్నట్లు తెలిపారు. దీని ప్రకారం, ఆమె మరో 27 ఏళ్లపాటు జైలు జీవితం గడపాలి. -
దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసు: నలుగురికి పదేళ్ల జైలు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: హైదరాబాద్‌లో దిల్సుఖ్నగర్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర చేసిన కేసులో ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన నలుగురికి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు బుధవారం పదేళ్ల జైలు శిక్ష విధించింది. వీరిలో డానిశ్ అన్సారీ, అఫ్తాబ్ ఆలం (బిహార్), ఇమ్రాన్ ఖాన్ (మహారాష్ట్ర), ఒబైదుర్ రెహా్మన్ (హైదరాబాద్) ఉన్నారు. వీరికి 2006 వారణాసి పేలుళ్లకు, 2007 ఫైజాబాద్, లక్నో పేలుళ్లు, 2008 జైపూర్, ఢిల్లీ, అహ్మదాబాద్ వరుస పేలుళ్లు, 2010 బెంగళూరు స్టేడియం పేలుడు, 2013 హైదరాబాద్ జంట పేలుళ్లతో సంబంధాలున్నట్టు ఎన్ఐఏ పేర్కొంది. పాకిస్తాన్‌కు చెందిన కుట్రదారులతో కలిసి పథక రచన చేసినట్టు వివరించింది. ఈ కేసుల్లో ప్రత్యేక కోర్టు ఇప్పటికే యాసిన్ భక్తల్ తదితరులపై అభియోగాలు మోపడం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ ఢిల్లీ వీరిని 2013 జనవరి–మార్చి మధ్య అరెస్టు చేసింది. చదవండి: Chandrayaan-3: ఆవలి దిక్కున... జాబిలి చిక్కేనా! -
దేశద్రోహానికి ఏడేళ్ల జైలు శిక్ష
న్యూఢిల్లీ: దేశద్రోహం కేసుల్లో దోషులకు విధించే జైలుశిక్షను కనిష్టంగా మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ పెంచాలని భారత న్యాయ కమిషన్ సిఫార్సు చేసింది. దీనివల్ల నేర తీవ్రతను బట్టి శిక్ష విధించే అవకాశం న్యాయస్థానాలకు లభిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు ఈ నివేదికను న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్ రితూరాజ్ అవస్థీ (రిటైర్డ్) ఇటీవల కేంద్ర న్యాయ శాఖ మంత్రి మేఘ్వాల్కు సమర్పించారు. దేశద్రోహానికి జైలు శిక్షను ఏడేళ్లకు పెంచాలంటూ న్యాయ కమిషన్ సిఫార్సు చేయడాన్ని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ తప్పుబట్టారు. దేశద్రోహ చట్టాన్ని మరింత క్రూరంగా మార్చేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. మెక్సికోలో కలకలం.. -
సూరత్ కోర్టులో వాదనలు.. ‘మరీ ఇంత పెద్ద శిక్షా ?’
సూరత్: మోదీ ఇంటి పేరును అనుచితంగా వాడారనే పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష, ఎంపీగా అనర్హత వేటును ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తరఫున ఆయన న్యాయవాదులు గురువారం సూరత్ కోర్టులో వాదనలు వినిపించారు. ‘ నేర నిరూపణ విధానం సవ్యంగా లేదు. ఈ కేసులో ట్రయల్ కోర్టు జడ్జి అసమతుల్య సాక్ష్యాధారాలను ఆధారం చేసుకుని తీర్పు చెప్పారు. ఎలక్ట్రానిక్ సాక్ష్యాలతో మొత్తం కేసు ఆధారపడింది. రాఫెల్ కేసులో రాహుల్ చెప్పిన బేషరతు క్షమాపణ అంశాన్ని ఈ కేసుకు సంబంధంలేకున్నా ఇందులో జతచేశారు. మరీ ఇంత పెద్ద శిక్షా ?. ఈ కేసులో గరిష్ట శిక్షను అమలుచేయాల్సిన అవసరం లేదు’ అని అదనపు సెషన్స్ జడ్జి ఆర్పీ మొగెరా ముందు రాహుల్ లాయర్ ఆర్ఎస్ ఛీమా వాదించారు. శిక్షను నిలుపుదల చేయాలని కోరారు. ‘ దొంగలందరి ఇంటి పేరు మోదీ అనే ఎందుకుంది? అనే ప్రసంగం చేసే నాటికి రాహుల్ దేశంలోనే రెండో అతిపెద్ద పార్టీకి అధ్యక్షునిగా ఉన్నారు. దేశ ప్రజలపై ఆయన ప్రసంగ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రసంగాన్ని సంచలనం చేయాలనేది ఆయన ఉద్దేశ్యం. ఇలాంటి పరువునష్టం కేసులు ఆయన వేర్వేరు చోట్ల చాలా ఎదుర్కొంటున్నారు. రాఫెల్ కేసులో అనుచిత వ్యాఖ్యలు, ఆనక క్షమాపణల తర్వాతా ఆయన ఇలాంటి ప్రసంగాలు చేశారు’ అని పరువునష్టం కేసు వేసిన పూర్ణేశ్ మోదీ తరఫు లాయర్ హర్షిత్ తోలియా వాదించారు. తర్వాత జడ్జి తీర్పును 20వ తేదీకి వాయిదావేశారు. -
సత్ప్రవర్తనతో రెండు నెలల ముందే... సిద్ధూ విడుదల
పటియాలా: పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ జైలుశిక్ష ముగించుకుని శనివారం పటియాలా కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. బయటకు రాగానే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేశారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను బానిసలుగా తమ ఇష్టానికి వాడుకుంటున్నారు. పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన తెచ్చేందుకు కుట్ర పన్నుతున్నారు’ అని మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆప్ నేత, సీఎం భగవంత్ మాన్‌ను అక్బారీ (పత్రికల్లో ప్రకటనలిచ్చే) ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. రాష్ట్రం శాంతిభద్రతలు, రుణాల సమస్యల వలయంలో చిక్కుకుందన్నారు. ‘దేశాన్ని నిరంకుశ పాలన పట్టిపీడించిన ప్రతిసారి దేశంలో విప్లవం పుట్టుకొస్తుంది. అలా ఈసారి పుట్టుకొచ్చిన విప్లవమే రాహుల్ గాంధీ’ అని సిద్ధూ వ్యాఖ్యానించారు. 1988లో ఒక రోడ్డు ప్రమాద గొడవలో ఘర్షణ పడటంతో ఒకరి మృతికి కారణమైన నేరానికి సిద్ధూకు సుప్రీంకోర్టు గత ఏడాది మేనెలలో ఒక ఏడాదిపాటు జైలుశిక్ష విధించిన విషయం విదితమే. సత్ప్రవర్తన కారణంగా సిద్ధూ 10 నెలలకే విడుదలయ్యారని ఆయన న్యాయవాది తెలిపారు. సిద్ధూ విడుదల సందర్భంగా జైలు ప్రాంతం ఆయన మద్దతుదారులతో నిండిపోయింది. -
కీచక తండ్రికి మరణించే దాకా జైలుశిక్ష
బంజారాహిల్స్: కన్నకూతురికి భోజనంలో నిద్రమాత్రలు కలిపి తినిపించి ఆమె నిద్రపోయాక కొంతకాలంపాటు అత్యాచారానికి పాల్పడిన కీచక తండ్రికి న్యాయస్థానం మరణించే వరకు జైలుశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వలసవచ్చింది. కుటుంబ పెద్ద జూబ్లీహిల్స్‌లోని ఓ అపార్ట్మెంట్ వద్ద వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. 2003లో వివాహమైన ఈ దంపతులకు 16 ఏళ్ల కూతురు, 14 ఏళ్ల కొడుకు ఉన్నారు. సొంత జిల్లాలోని బంధువుల ఇంట్లో కొడుకు 8వ తరగతి చదువుతుండగా కూతురు తల్లిదండ్రుల వద్దే ఉంటూ 9వ తరగతి మధ్యలోనే ఆపేసి ఇంట్లోనే ఉంటోంది. 2021 జూలై 16న కూతురు తీవ్ర అనారోగ్యానికి గురై వాంతులు చేసుకోగా ఆందోళన చెందిన తల్లి నాంపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి నాలుగు నెలల గర్భవతి అని తేల్చారు. దీంతో కూతురిని నిలదీయగా తండ్రి భోజనంలో నిద్రమాత్రలు కలిపి తినిపించి నిద్రపోయాక అత్యాచారానికి పాల్పడేవాడని చెప్పింది. నిద్రలోంచి లేచి చూసుకుంటే తన ఒంటిపై బట్టలుండేవి కావని, ఒళ్లంతా నొప్పులు ఉండేవని వివరించింది. ఓసారి మద్యం మత్తులో ఇంటికొచ్చి మరోసారి లైంగికదాడికి పాల్పడ్డాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే అందరినీ చంపేస్తానని బెదిరించడంతో భయపడి మిన్నకుండిపోయానని రోదించింది. ఈ ఉదంతంపై బాధితు రాలి తల్లి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడు వెంకటరమణను అరెస్టుచేసి నాంపల్లిలోని 12వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. వెంకటరమణపై పక్కా ఆధారాలు సమర్పించారు. వాదనలు విన్న జడ్జి అనిత శుక్రవారం వెంకటరమణను దోషిగా తేల్చి అతనికి మరణించే వరకు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. -
80 ఏళ్ల వయసులో వెంటాడిన జైలు శిక్ష
సాక్షి, అమరావతి: ఓ ప్రధానోపాధ్యాయుడి నుంచి రూ.5 వేల లంచం డిమాండ్ చేసినందుకు ఏసీబీ అధికారులు 25 ఏళ్ల క్రితం పెట్టిన కేసు ఓ మాజీ ఎంపీడీవోను వృద్ధాప్యంలోనూ వెంటాడింది. 80 ఏళ్ల వయసులో ఆ అధికారి జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఎదురైంది. తన వయసు 80 ఏళ్లని.. అనారోగ్యంతో బాధపడుతున్నానని తెలిపిన ఆ మాజీ ఎంపీడీవో.. తనను కనికరించాలని అభ్యర్థించాడు. నిర్ధ్వందంగా తిరస్కరించిన హైకోర్టు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే గరిష్ట శిక్షతో కాకుండా కనిష్ట శిక్షతో సరిపెట్టింది. లంచం తీసుకున్నందుకు ఏసీబీ పెట్టిన కేసును కొట్టేస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టేసింది. అప్పటి అధికారికి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద 6 నెలల జైలు, రూ.5వేల జరిమానా విధించింది. అలాగే సెక్షన్ 13(1)(డీ) కింద ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. ఈ రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు శుక్రవారం తీర్పు వెలువరించారు. విధుల్లోకి చేర్చుకునేందుకు లంచం డిమాండ్ కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన యూవీ శేషారావు అప్పట్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసే వారు. ఆయనకు అదే జిల్లాలోని నడిమ తిరువూరు పాఠశాలకు బదిలీ కావడంతో.. విధుల్లో చేరేందుకు వెళ్లిన శేషారావును విధుల్లో చేర్చుకోలేదు. దీంతో ఆయన పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ)ను ఆశ్రయించగా.. ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ట్రిబ్యునల్ ఉత్తర్వులను అమలు చేయడంతో పాటు జీతం బకాయిలను ఇప్పించాలని కోరుతూ శేషారావు అప్పటి తిరువూరు ఎంపీడీవో బత్తిన వెంకటేశ్వరరావు వద్దకు వెళ్లారు. ఇందుకు వెంకటేశ్వరరావు రూ.5 వేల లంచం అడిగారు. ఇవ్వలేనని చెప్పినా వినలేదు. దీంతో శేషారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శేషారావు నుంచి లంచం తీసుకుంటుండగా ఎంపీడీవో వెంకటేశ్వరరావును ఏసీబీ అధికారులు 1998లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసుపై విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు లంచం తీసుకున్నారనేందుకు ఎలాంటి సాక్ష్యాలు లేవంటూ వెంకటేశ్వరరావుపై ఏసీబీ పెట్టిన కేసును కొట్టేస్తూ 2005లో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏసీబీ అధికారులు 2007లో హైకోర్టులో అప్పీల్ చేశారు. అప్పటి తీర్పును తప్పుపట్టిన హైకోర్టు ఈ అప్పీల్‌పై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు విచారణ జరిపి శుక్రవారం తీర్పు వెలువరించారు. ఏసీబీ ప్రత్యేక కోర్టు తీర్పును తప్పుపట్టారు. వెంకటేశ్వరరావు లంచం తీసుకున్నారనేందుకు ఆధారాలు ఉన్నాయని తేల్చారు. లంచం డిమాండ్ చేశారనేందుకు, లంచం తీసుకున్నారనేందుకు ఏసీబీ అధికారులు పూర్తి సాక్ష్యాధారాలను కోర్టు ముందుంచారని తెలిపారు. ఈ సాక్ష్యాధారాలను ఏసీబీ ప్రత్యేక కోర్టు సరైన కోణంలో విశ్లేషించలేదని ఆక్షేపించారు. వాదనల సమయంలో తన వయసు 80 ఏళ్లని, అనారోగ్యంతో బాధపడుతున్నానని వెంకటేశ్వరరావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనను తోసిపుచ్చుతున్నట్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే అవినీతి నిరోధక చట్టంలో నిర్దేశించిన గరిష్ట శిక్షకు బదులు కనిష్ట శిక్ష విధిస్తున్నట్టు పేర్కొన్నారు. సెక్షన్ 7 కింద 6 నెలల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా, సెక్షన్ 13(1)(డీ) కింద ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. -
ఎర్రచందనం స్మగ్లర్‌కు ఐదేళ్ల జైలు
తిరుపతి లీగల్: తమిళనాడు తిరువణ్ణామలై జిల్లా పోలూరు తాలూకా, ఇరుంజీ గ్రామానికి చెందిన ఎర్రచందనం స్మగ్లర్ ధనపాల్ రాజా కు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.పది లక్షల జరిమానా విధిస్తూ రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ కోర్టు జడ్జి నాగరాజు సోమవారం తీర్పు చెప్పినట్లు ఆ కోర్టు ఏపీపీ కె.నగేష్ తెలిపారు. కోర్టు కానిస్టేబుళ్లు నందకుమార్, శివకుమార్ తెలిపిన కేసులోని వివరాల మేరకు.. శేషాచలం అటవీ ప్రాంతంలోని ఎర్రచందనం దుంగల రక్షణ కోసం ఎస్వీఎన్పీ శ్యామల రేంజ్ నాగపట్ల సెక్షన్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ హరిబాబు, సిబ్బంది 2016 ఆగస్టు 29వ తేదీ సాయంత్రం కూంబింగ్ నిర్వహించారు. చెట్లు నరుకుతున్న శబ్దం విని పోలీసులు తోళ్లగుంట రిజర్వు ఫారెస్ట్ వద్దకు వెళ్లగా సుమారు 20 నుంచి 30 మంది స్మగ్లర్లు పోలీసులపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు తమ రక్షణ కోసం ఉన్నతాధికారుల ఆదేశాలతో రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు పరారయ్యారు. 2016 ఆగస్టు 30వ తేదీ రాత్రి పోలీసులు అదే ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించి నిందితుడు ధనపాల్ రాజాని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన జడ్జి నిందితుడు ధనపాల్ రాజాకు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా సొమ్ము చెల్లించని యెడల మరో రెండేళ్లు అధికంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు. -
జిలేబీ బాబాకు 14 ఏళ్ల జైలు
చండీగఢ్: తనను తాను దేవుడిగా ప్రచారం చేసుకుంటూ అరాచకాలు సాగించిన జిలేబీ బాబా అలియాస్ అమర్‌వీర్ అలియాస్ బిల్లూ అలియాస్ అమర్‌పురి (63) పాపం పండింది. 100 మందికిపైగా మహిళలపై అత్యాచారం చేసి, వీడియోలు తీసినట్లు అతడిపై ఆరోపణలున్నాయి. ఓ బాలికపై రెండు సార్లు అత్యాచారం చేసిన కేసులో పోక్సో చట్టం సెక్షన్ 6 కింద అతనికి 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు హరియాణాలోని ఫతేహాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు అదనపు జిల్లా జడ్జి బల్వంత్‌సింగ్ బుధవారం ప్రకటించారు. జిలేబీ బాబాను హరియాణా పోలీసులు 2018లో అరెస్టు చేశారు. అతడి ఫోన్లో 120కి పైగా అశ్లీల వీడియో క్లిప్పింగ్‌లను గుర్తించారు. జిలేబీ బాబా హరియాణాలోని తోహన్ పట్టణంలో బాబా బాలక్‌నాథ్ మందిరం అధినేతగా ప్రాచుర్యం పొందాడు. మహిళలకు మాదకద్రవ్యాలిచ్చి అత్యాచారం చేయడం, ఆ దురాగతాన్ని వీడియోలో చిత్రీకరించడం, వాటిని చూపి బ్లాక్మెయిల్ చేసి బాధితుల నుంచి డబ్బులు గుంజడం అతని స్టైల్. -
ధన బ్యాంక్ కేసులో 21 మందికి పదేళ్ల శిక్ష
ఏలూరు (టూటౌన్): డిపాజిటర్లకు రూ.3 కోట్లు ఎగవేసిన ఏలూరు ధన బ్యాంక్ కేసులో 21 మందికి పదేళ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తూ ఏలూరు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి కోర్టు న్యాయమూర్తి సి.పురుషోత్తంకుమార్ సోమవారం తీర్పునిచ్చారు. దీంతోపాటు ఒక్కొక్కరికీ రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తొలిసారి డిపాజిటర్స్ యాక్ట్ కేసులో ముద్దాయిలకు శిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో 20 ఏళ్ల న్యాయపోరాటం ఫలించింది. కేసు పూర్వాపరాలివీ.. జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, ప్రత్యేక పీపీ లామ్ అజయ్ ప్రేమ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. 2002లో ఏలూరు టూటౌన్ పరిధిలోని ధన బ్యాంక్ పలువురు డిపాజిటర్లకు రూ.3 కోట్లను చెల్లించకుండా మోసం చేసింది. అప్పట్లో ధన బ్యాంక్‌కు చెందిన మొత్తం 27 మందిపై ఎస్సై ఎం.సుధాకర్ కేసు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ బి.పెద్దయ్య ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేశారు. మొత్తం 27 మంది ముద్దాయిల్లో ఐదుగురు చనిపోగా.. ఒకరు పరారీలో ఉండటంతో మిగిలిన 21 మందికి న్యాయమూర్తి శిక్షను ఖరారు చేశారు. శిక్షపడిన వారిలో రావూరి సత్యసాగర్ (బ్యాంక్ చైర్మన్), తల్లాప్రగడ నాగేంద్రప్రసాద్, గోలి కృష్ణకుమారి, అమ్మనమంచి శివాజీ, రావిపాటి వీరవెంకట రామారావు, బాదంపూడి లక్ష్మీకుమారి, చింతా గిరి, కొవ్వూరి శ్రీనివాసరావు, ఇనుగంటి వెంకట సతీష్, బండారు నర్సింహమూర్తి, మామిడిబత్తుల నాగ శ్రీనివాస్, జక్కంపూడి శ్రీనివాస్, దాసరి బోసురాజు, గొల్ల భాస్కర సత్యనారాయణ ప్రసాద్, నక్కా శ్రీనివాసరావు, బోడ సాంబమూర్తి, రావూరి నాగ వెంకట సత్యనారాయణ, గుమ్మిడి వెంకట రమణమూర్తి, చెన్నకేశవులు రంగనాథ్, దుగ్గిరాల శేషసాయి సత్యశేఖర్, గద్దె ఉషారాణి ఉన్నారు. గుండాల గోపి అనే నిందితుడు ఇప్పటికీ పరారీలో ఉండగా.. దుగ్గిరాల రవికుమార్, పయ్యావుల దామోదరరావు, బాలనాగు సోమేశ్వరగుప్త, దళపతి కోటమరాజు, గద్దె రుష్యేంద్ర నాగవెంకటప్రసాద్ మృతి చెందారు. -
Hyderabad: మందుబాబుకు 30 రోజుల జైలు
సాక్షి, హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడపవద్దని పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేసే వాహనదారుల కళ్లు బైర్లుకమ్మేలా కోర్టు తీర్పు వెలువరించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 రోజుల జైలు శిక్ష విధించింది. వరుసగా నాలుగుసార్లు డ్రంకన్ డ్రైవ్ (డీడీ) కేసులలో గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన సదరు మందుబాబుకు కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. రక్తంలో ఆల్కాహాల్ స్థాయి (బీఏసీ) 50గా ఉంది. ఇక, శంషాబాద్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో పట్టుబడిన మరో మందుబాబుకు 22 రోజుల పాటు జైలు శిక్ష ఖరారైంది. ఈయన బీఏసీ 550గా నమోదయింది. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గత నెలలో 3,835 డీడీ కేసులు నమోదయ్యాయి. 93 మందికి కోర్టు జైలు శిక్షను, రూ.1.21 కోట్లు జరిమానాను విధించింది. కాగా గత నెలలో 18 మంది మైనర్ మందుబాబులు పట్టుబడ్డారు. ఆయా కేసులలో న్యాయస్థానం రూ.22 వేలు జరిమానా ఖరారు చేసింది. మొత్తం 479 మంది వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) రద్దు కోసం ట్రాఫిక్ పోలీసులు సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ)లకు సిఫార్సు చేశారు. అత్యధికంగా 615 డీడీ కేసులు రాజేంద్రనగర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో నమోదయ్యాయి. ఆయా కేసులలో న్యాయస్థానం రూ.18.52 లక్షలు జరిమానా, మొత్తం 13 మందికి జైలు శిక్షను విధించింది. ఏకంగా 153 మంది వాహనదారుల డీఎల్ రద్దుకు ఆదేశించారు. చదవండి: (మాగుంట కుటుంబంలో విషాదం) -
లైంగికదాడి కేసులో ఇద్దరికి 20 ఏళ్లు జైలు
కర్నూలు (లీగల్): యువతిపై లైంగిక దాడి కేసులో ఇద్దరికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ ఏడవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి బుధవారం తీర్పు చెప్పారు. కేసు వివరాల ప్రకారం... కర్నూలు తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామచంద్రానగర్‌కు చెందిన ఒక యువతి (23) తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో సోదరి సహాయంతో 2016, డిసెంబర్లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. ఆమె తిరిగి ఇంటికి వెళ్లగా, మానసిక స్థితి సరిగా లేని తన తండ్రి కనిపించలేదు. దీంతో తమ కుటుంబానికి పరిచయస్తుడైన ఎల్లన్న(30) వద్దకు వెళ్లి తన తండ్రి గురించి అడిగింది. ‘మీ తండ్రి డోన్ రోడ్డు వైపు వెళ్లాడు. తీసుకువద్దాం పదా..’ అని ఆ యువతిని ఎల్లన్న తన బైక్‌పై ఎక్కించుకుని దూరంగా ముళ్లపొదల వైపు తీసుకువెళ్లి ఆపాడు. అక్కడకు శివకళాధర్(32) అనే వ్యక్తి వచ్చి తాను పోలీసునని బెదిరించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఎల్లన్న కూడా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసు విచారణలో యువతిపై ఇద్దరు లైంగిక దాడికి పాల్పడినట్లు రుజువైంది. దీంతో ఎల్లన్న, శివకళాధర్‌కు 20 ఏళ్లు కఠిన కారాగారశిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జి.భూపాల్‌రెడ్డి తీర్పు చెప్పారు. జరిమానా మొత్తాన్ని ఫిర్యాదికి ఇవ్వాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. -
మాల్యాకు 4 నెలల జైలు
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు 4 నెలల జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధించింది. నాలుగు వారాల్లో జరిమానా కట్టకుంటే మరో 2 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది. మాల్యా తీరును ఖండిస్తూ ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘మాల్యా తన ప్రవర్తన పట్ల ఎన్నడూ పశ్చాత్తాపం వెలిబుచ్చలేదు. క్షమాపణలూ చెప్పలేదు. కాబట్టి కోర్టు గౌరవాన్ని కాపాడేందుకు ఆయనకు ఈ శిక్ష విధించడ తప్పనిసరి’’ అని న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్ఆర్ భట్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. శిక్ష అనుభవించేందుకు వీలుగా మాల్యాను తక్షణం భారత్ రప్పించాలని కేంద్ర హోం శాఖకు సూచించింది. మాల్యాపై రూ.9,000 కోట్లకు పైగా రుణాల ఎగవేత కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉండగానే కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 4 కోట్ల డాలర్లను ఆయన తన పిల్లలకు బదిలీ చేశారు. ఇది కోర్టు ధిక్కరణేనంటూ 2017 మేలో కోర్టు తీర్పు ఇచ్చింది. 4 కోట్ల డాలర్లను 8 శాతం వార్షిక వడ్డీతో నాలుగు వారాల్లోగా రికవరీ ఆఫీసర్ వద్ద జమ చేయాలని మాల్యాను, ఆయన పిల్లలను ఆదేశించింది. లేదంటే రికవరీకి ఆఫీసర్ చర్యలు చేపడతారని పేర్కొంది. -
న్యూసెన్స్‌కు 112 రోజుల జైలు
సాక్షి, హైదరాబాద్: ప్రజా జీవనానికి ఇబ్బందులు కలిగిస్తూ పదేపదే న్యూసెన్స్‌కు పాల్పడుతున్న వ్యక్తులపై నమోదయ్యే పెట్టీ కేసులను న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఇలాంటి ఓ వ్యక్తికి 13వ స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఏకంగా 112 రోజుల జైలు శిక్ష విధించింది. పెట్టీ కేసులో ఈ స్థాయిలో జైలు పడటం ఇదే తొలిసారి. కార్ఖానా బస్తీలో నివసించే మహ్మద్ సలీం పేరు చెప్తే ఆ ప్రాంత వాసులకు హడల్. అనునిత్యం మద్యం తాగి రోడ్డుపై హంగామా సృష్టిస్తుంటాడు. తన కుటుంబీకుల పైనే దాడులు చేస్తూ అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిని దుర్భాషలాడతాడు. అప్పుడప్పుడు నగ్నంగా రోడ్లపైకి వచ్చి పబ్లిక్ న్యూసెన్స్ చేస్తుంటాడు. దీనికి సంబంధించి ఫిర్యాదు అందిన ప్రతిసారీ కార్ఖానా పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించే వారు. పోలీసుస్టేషన్‌లోనూ ఇతడితో అధికారులకు తలనొప్పే. గోడకు తల కొట్టుకోవడం, చేతులు కోసుకోవడం వంటివి చేస్తూ ఇబ్బందులు కలిగించే ప్రవర్తిస్తుంటాడు. సలీంపై ఇప్పటికే పలుమార్లు పోలీసులు పెట్టీ కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆదివారం మరోసారి బస్తీలో రాద్ధాంతం చేశాడు. మద్యం మత్తులో తల్లిదండ్రులపై దాడికి దిగాడు. అడ్డుకున్న స్థానికులనూ దుర్భాషలాడాడు. పోలీసులపైనా విరుచుకుపడి.. డయల్–100కు ఫిర్యాదు రావడంతో కార్ఖానా పోలీసుస్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు ఘటనాస్థలికి చేరుకున్నారు. వీరిపైనా విరుచుకుపడిన సలీం అభ్యంతరకరంగా ప్రవర్తించి, వారి విధి నిర్వహణకు అడ్డు తగిలాడు. బస్తీ వాసులకు పదేపదే ఇబ్బందులు సృష్టిస్తున్న సలీం విషయాన్ని కార్ఖానా ఇన్స్పెక్టర్ బి.రవీందర్ తీవ్రంగా పరిగణించారు. ఇతడికి వైద్య పరీక్షలు చేయించడంతో పాటు నగర పోలీసు యాక్ట్, ఐపీసీలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అవసరమైన ఆధారాలతో సోమవారం కోర్టులో సలీంను హాజరుపరిచి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అభియోగపత్రాల్లో పొందుపరిచిన ఇతడి వ్యవహారశైలి, గత చరిత్ర తదితరాలను గమనించిన న్యాయమూర్తి 112 రోజులు జైలు శిక్ష విధించారు. చట్టాన్ని అతిక్రమించినా, పబ్లిక్ న్యూసెన్స్‌కు పాల్పడినా ఇలాంటి చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ బి.రవీందర్ స్పష్టం చేశారు. (చదవండి: యువ గాయని అపహరణ.. ఆపై దారుణ హత్య!) -
మాట మార్చిన సిద్ధూ.. ప్లీజ్ కొంచెం టైమ్ ఇవ్వండి
పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. 1988 నాటి కేసులో కోర్టు ఆయనుకు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై సిద్ధూ గురువారం స్పందిస్తూ.. కోర్టు తీర్పును గౌరవిస్తానని, పోలీసులకు లొంగిపోతానని అన్నారు. ఇంతలోనే శుక్రవారం సిద్ధూ మాట మార్చారు. ఆరోగ్య కారణాల రీత్యా లొంగిపోవడానికి మరికొన్ని వారాల సమయం కావాలని నవజోత్ సింగ్ సిద్ధూ కోరారు. దీంతో, సిద్ధూ తరఫున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ మేరకు సింఘ్వీ.. సీజేఐ ఎన్వీ రమణను కలవాలని ఏఎం ఖన్వీల్కర్ సూచించారు. ఇక, కేసు రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్, జస్టిస్ ఎస్కే కౌల్‌తో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇంకా తమకు అందలేదని, శుక్రవారం ఉదయం ఛండీగఢ్ కోర్టు నుంచి పాటియాలా పోలీస్‌స్టేషన్‌కు వస్తాయని అధికారులు తెలిపారు. అనంతరం సమన్లను సిద్ధూకి అందించి లొంగిపోవాలని కోరుతున్నామని పోలీసులు చెప్పారు. అరెస్టు చేసిన వెంటనే సిద్ధూను వైద్య పరీక్షల కోసం స్థానిక ఆసుపత్రికి తరలిస్తామని స్పష్టం చేశారు. Will submit to the majesty of law …. — Navjot Singh Sidhu (@sherryontopp) May 19, 2022 ఇది కూడా చదవండి: లాలూ ప్రసాద్ యాదవ్, కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చిన సీబీఐ -
లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి జైలు
విశాఖ లీగల్: మాయమాటలతో మోసం చేసి లైంగికదాడి చేసిన యువకుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమాన విధిస్తూ నగరంలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎల్.శ్రీధర్ సోమవారం తీర్పునిచ్చారు. జరిమాన చెల్లించని పక్షంలో అదనంగా నెల రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి తీర్పులో స్పష్టం చేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలాది శ్రీనివాసు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు పొట్నూరి గిరీష్ కుమార్ (22) గాజువాక పరిధిలోని మల్కాపురం దగ్గర గుడివాడ అప్పన్న కాలనీలో ఉంటున్నాడు. వృత్తిరీత్యా ప్రైవేటు పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన 19ఏళ్ల యువతితో పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని ప్రేమాయణం సాగించాడు. యువతికి దగ్గరై శారీరక సుఖం పొందాడు. పలుమార్లు లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. మరోవైపు రూ.50వేల వరకూ నగదు తీసుకున్నాడు. పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి గిరీష్ తల్లిదండ్రులు తిరస్కరించారు. కులాన్ని తక్కువ చేసి దూషించారు. ఈ క్రమంలో యువతి తండ్రి ఫిర్యాదు మేరకు మల్కాపురం పోలీసులు 2016 ఫిబ్రవరి 22న నిందితునిపై ఎస్సీ, ఎస్టీ చట్టం, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పటి పోలీస్ ఇన్స్పెక్టర్ రంగనాథం బాధితుల వాంగ్మూలాలను నమోదు చేశారు. ఏసీపీలు ఎం.రాజారావు, ప్రవీణ్‌కుమార్ కేసు దర్యాప్తు చేసి నేరాభియోగపత్రాన్ని దాఖలు చేశారు. నిందితుని తల్లిదండ్రులపై కేసు రుజువు కానందున వారిని నిర్దోషులుగా న్యాయస్థానం విడుదల చేసింది. నేరం రుజువు కావడంతో గిరీష్‌కి న్యాయమూర్తి పైవిధంగా తీర్పు నిచ్చారు. -
హత్యాయత్నం కేసులో ఐదుగురికి పదేళ్ల జైలు
విజయవాడ లీగల్: భార్యాభర్తలను హత్య చేయాలనే ఉద్దేశంతో పెట్రోల్ పోసి తగులబెట్టినట్లుగా దాఖలైన కేసులో ఐదుగురు నిందితులపై నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికీ పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ మహిళా సెషన్స్ జడ్జి జి.ప్రతిభాదేవి బుధవారం తీర్పు చెప్పారు. కేసు వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన జూలూరి రమాదేవితో జూలూరి హనుమంతరావుకు రెండో వివాహం జరిగింది. ఈ వివాహం హనుమంతరావు మొదటి భార్య పిల్లలకు ఇష్టం లేదు. ఆస్తి వ్యవహారాల్లో వారికి తండ్రి హనుమంతరావుతో విభేదాలున్నాయి. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడికి చెందిన హనుమంతరావు కుమార్తె కొడుకు గూడూరు సత్యనారాయణ అలియాస్ మణికంఠ హనుమంతరావు వద్ద ఉండేవాడు. రమాదేవితో రెండో వివాహం తర్వాత సత్యనారాయణతో పాటు తమ పిల్లలను కూడా హనుమంతరావు దూరం పెట్టాడు. దీంతో మొదటి భార్య కుమారులయిన జూలూరి సుబ్బారావు, మాధవరావు తమ మేనల్లుడు సత్యనారాయణతో కలసి హనుమంతరావు, రమాదేవి హత్యకు కుట్ర పన్నారు. సత్యనారాయణ తమ స్వగ్రామమైన దుగ్గిరాల మండలం చింతలపూడికి చెందిన తన స్నేహితులు తెనాలికి చెందిన గూడూరు వినయ్‌కుమార్, వీణను 2014 అక్టోబర్ 28వ తేదీ మధ్యాహ్నం ముందుగా ఇబ్రహీంపట్నం తీసుకొచ్చాడు. పథకంలో భాగంగా గూడూరు వినయ్‌కుమార్, వీణ కలసి రమాదేవి ఇంటికి వెళ్లి మంచినీళ్లు అడిగారు. అనంతరం తాము తెచ్చుకున్న ప్లాస్టిక్ సంచిలో నుంచి పెట్రోల్ బాటిల్‌ను తీసి రమాదేవి, హనుమంతరావుపై పోసి నిప్పంటించి పారిపోయారు. కాలిన గాయాలతో దంపతులిద్దరూ కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి గొల్లపూడిలోని ఆంధ్ర ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులైన సుబ్బారావు, మాధవరావు, సత్యనారాయణ, వినయ్ కుమార్, వీణపై 307, 326, 452, 436, 120బి ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ప్రాసిక్యూషన్ తరఫున సీఎంఎస్ పోలీసులు 24 మంది సాక్షులను ప్రవేశపెట్టగా ఏపీపీ జి.దైవప్రసాద్ విచారించారు. కోర్టు విచారణలో నిందితులపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. -
బాలిక పట్ల అసభ్య ప్రవర్తనకు ఐదేళ్ల జైలు శిక్ష
విజయవాడ లీగల్: ఏడేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ స్పెషల్ జడ్జ్ ఫర్ ట్రయల్ ఆఫ్ అఫెన్సెస్ అండర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 కమ్ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎస్.రజని మంగళవారం తీర్పు చెప్పారు. కేసు వివరాల ప్రకారం.. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామంలో బాధిత బాలిక కుటుంబం కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. నిందితుడు షేక్ బాజీ (44) అదే ప్రాంతంలో నివసిస్తున్నాడు. 2016 మార్చి 19వ తేదీ సాయంత్రం స్నేహితులతో ఆడుకుని ఇంటికి తిరిగి వస్తున్న బాలికకు చాక్లెట్ ఇస్తానని ఆశచూపిన నిందితుడు టెర్రస్‌పైకి తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ కేసులో మొత్తం 10 మంది సాక్షులను కోర్టు విచారించింది. నిందితుడిపై నేరం రుజువు కావడంతో ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
పాక్‌లో జిహాద్ పేరుతో నిధులు సేకరించొద్దు
లాహోర్: పాకిస్తాన్లో జిహాద్ పేరుతో నిధులను సేకరించేందుకు ప్రజలను ప్రేరేపించొద్దని, అలా ఎవరు చేసినా అది రాజద్రోహం కిందికి వస్తుందని లాహోర్ హైకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా యుద్ధాన్ని ప్రకటిస్తే అందుకు అవసరమైన డబ్బులు సేకరించడం దేశానికి సంబంధించిన పని అని వెల్లడించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ కోసం నిధులు సేకరించినందుకు దోషులుగా తేలి ఐదేళ్లు శిక్ష పడిన ఇద్దరు ఉగ్రవాదుల అప్పీళ్లను తోసిపుచ్చుతూ ఇటీవల తీర్పు నిచ్చింది. ‘తెహ్రీకీ తాలిబాన్ నిషేధిత సంస్థ. దేశానికి ఎంతో నష్టం చేసింది. దేశ ముఖ్య నాయకులు లక్ష్యంగా పని చేసింది. దేశంలో ఉగ్రవాదం పెంచడానికి ప్రయత్నింది. ఆర్థికంగా మద్దతు లేనిదే ఇదంతా సాధ్యం కాదు’ అని వ్యాఖ్యానించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు డబ్బులు అందించారంటూ ఈ నెలలో అరెస్టయిన ఇద్దరు తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు యాంటీ టెర్రరిస్టు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. -
నమ్మకస్తుడిగా ఉంటూ ఒంటరిగా ఉన్న యజమాని భార్యపై..
కర్నూలు (లీగల్)/బనగానపల్లె రూరల్: ఇంటి యజమానికి నమ్మకస్తుడిగా ఉంటూ అతని భార్యపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తికి కర్నూలు ఏడవ అదనపు జిల్లా కోర్టు జైలు శిక్ష విధించింది. బనగానపల్లె మండలం నందివర్గం పోలీసుస్టేషన్ పరిధిలోని టంగుటూరు గ్రామంలో శివనాగిరెడ్డిది వ్యవసాయ కుటుంబం. తన ట్రాక్టర్‌కు బందెల పెద్దయ్య అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేసేవాడు. 2015 మార్చి 24వ తేదీన ఇంట్లో ఒంటరిగా ఉన్న యజమాని భార్య (26)పై అత్యాచార యత్నానికి ప్రయత్నించగా ఆమె గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. చదవండి: ప్రేయసి ఫోన్ లిఫ్ట్ చేయలేదని.. ఎంత పనిచేశావ్ తరుణ్.. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పట్లోనే బందెల పెద్దయ్యపై నందివర్గం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. కేసు విచారణలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 5,500 లు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఎస్.చినబాబు సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.నరేంద్రనాథ్ రెడ్డి వాదనలు వినిపించారు. -
తాటతీస్తున్న టెక్నాలజీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చట్టబద్ధంగా పడుతున్న శిక్షలశాతం పెరుగుతోంది. పోలీసుల దర్యాప్తులోని సాంకేతిక సంస్కరణలకు తోడు నిందితుల గుర్తింపునకు, ఆధారాల సేకరణకు ఎప్పటికప్పుడు పాటిస్తున్న మెళకువలు శిక్షల శాతాన్ని పెంచాయి. ఈ మేరకు పోలీస్ శాఖ తన వార్షిక నివేదిక లో పలు వివరాలు వెల్లడించింది. గతంలో నిందితులకు శిక్షల శాతం 11, 12 ఉండేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అది గత ఐదేళ్లు క్రమంగా పెరుగుతూ గతేడాది 50 శాతానికి చేరుకున్నట్లు పేర్కొంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత మేర శిక్షలశాతం నమోదు కాకపోవడం గమనార్హం. గతేడాదిలో ఒకరికి ఉరి... 2021లో న్యాయస్థానాలు ఒక నిందితుడికి ఉరిశిక్ష, 82 కేసుల్లో 126 మందికి జీవితఖైదు విధించాయి. ఒక కేసులో నిందితుడికి 30 ఏళ్లు, మరో నిందితుడికి 25 ఏళ్ల శిక్ష విధించాయి. మరో 21 మంది ఖైదీలకు 20 ఏళ్లు, ఒకరికి 15 ఏళ్లు, ఒకరికి 14 ఏళ్ల శిక్ష విధించాయి. 2021లో ఒకరోజు జైలుశిక్ష నుంచి ఉరిశిక్ష వరకు పడినవారి జాబితాలో 38,812 మంది ఉన్నారు. 126 మందికి జీవితఖైదు శిక్షపడ్డగా.. వారిలో 92 మంది హత్యకేసుల్లో నిందితులేనని, మరో 9 మంది మర్డర్ ఫర్ గెయిన్ కేసుల్లో, ఇంకో 25 మంది లైంగిక దాడి(అత్యాచారం) కేసుల్లో నేరస్తులని పోలీస్‌శాఖ తెలిపింది. మహిళలపై దాడుల కేసులో... గతేడాది లైంగికదాడి చేసి హత్య చేసిన ఉదంతాల్లో, వరకట్న వేధింపులతో హత్య చేసిన కేసుల్లో, లైంగికదాడి కేసు, సాధారణ హత్య కేసుల్లో మొత్తం 39 మందికి జీవితఖైదును కోర్టులు విధించాయి. 8 మంది వరకట్న వేధింపులకు పాల్పడి హత్య చేసినవారు కాగా, లైంగికదాడికి పాల్పడి హతమార్చిన కేసులో ఇద్దరు, లైంగికదాడి కేసుల్లో 9 మంది, మహిళల హత్య కేసుల్లో 20 మందికి జీవితఖైదు పడింది. 2021లో పోక్సో యాక్ట్ కేసుల్లో ఒకరికి ఉరిశిక్ష పడగా, 18 మందికి న్యాయస్థానాలు జీవితఖైదు విధించినట్టు పోలీస్ శాఖ స్పష్టం చేసింది. కోర్టులు ఒకరికి 30 ఏళ్లు, ఒకరికి 25, 21 మందికి 20 ఏళ్లు, ఇద్దరు నిందితులకు 15 ఏళ్లు, 14 ఏళ్లు పోక్సో కేసుల్లో శిక్ష విధించాయని తెలిపింది. -
వేట.. పేలుతున్న తూటా
రుద్రవరం: అధికారుల కన్నుకప్పి కొందరు నల్లమల అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల వేట సాగిస్తున్నారు. వన్యప్రాణుల మాంసానికి, చర్మానికి మంచి డిమాండు ఉండటంతో రహస్యంగా వేట కొనసాగిస్తున్నారు. కొందరు నాటు తుపాకులతో వేటాడుతుండగా, ఇంకొందరు ఉచ్చులు బిగించి వాటిలో చిక్కిన వన్యప్రాణులను హతమార్చి.. వాటి మాంసాన్ని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లాలోని రుద్రవరం, చెలిమ రేంజి పరిధిల్లో ఈ తతంగం సాగుతోంది. నేల రాలుతున్న జింకలు నంద్యాల డివిజన్లో రుద్రవరం, చెలిమ రేంజిలలో వేలాది హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఆళ్లగడ్డ, రుద్రవరం, శిరివెళ్ల, చాగలమర్రి మండలాల్లోని పలు గ్రామాలు అటవీ ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్నాయి. ఆయా గ్రామాల వారంతా అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆత్మరక్షణ నిమిత్తం కొందరు నాటు తుపాకులు, వేట కొడవళ్లు కలిగి ఉన్నారు. కాలక్రమేణా వాటిని జంతువులను వేటాడేందుకు వినియోగిస్తున్నారు. వీరు ఆయుధాలతో రహస్యంగా అడివిలోకి వెళ్లి వన్య ప్రాణులను ప్రధానంగా జింకలను హతమార్చుతున్నారు. మాంసాన్ని బయటకు తరలించి కిలో రూ.500 ప్రకారం విక్రయిస్తున్నా రని సమాచారం. నామమాత్రపు దాడులు వేటగాళ్ల చేతుల్లో జింకలు మృత్యువాత పడుతున్నా అటవీ అధికారులు మాత్రం తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎవరైనా సమాచారం అందిస్తే నామమాత్రపు దాడులు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రుద్రవరం మండలం హరినగరం వద్ద బహిరంగంగా వన్యప్రాణి మాంసాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడిచేసి నిందితులను వదిలిపెట్టి కేవలం మాంసాన్ని స్వాధీనం చేసుకొని ఆపై అగ్నిలో కాల్చివేశారు. అదే గ్రామంలో ఓ నాటు తుపాకీ కూడా లభించింది. అయినప్పటికీ నిందితుడికి సరైన శిక్ష వేయించలేక పోయారు. అటవీ ప్రాంతంలో మరో నాటు తుపాకీ దొరికినట్లు చూపించారు. అలాగే ఇటీవలే గోస్పాడు మండలం దీబగుంట్ల వద్ద ఇరువురు నిందితులు జింక మాంసంతో పట్టుబడ్డారు. వారిని విచారించగా ఆళ్లగడ్డ మండలం పెద్దకందుకూరు మెట్ట ఆల్ఫా కళాశాల సమీపంలో జింకను వేటాడినట్లు చెప్పారు. కొరవడిన సంరక్షణ వన్య ప్రాణులు అటవీ ప్రాంతంలో జీవించలేక బయటకు వచ్చి మృత్యువాత పడుతున్నాయి. ప్రధానంగా రుద్రవరం మండలంలోని ఆర్.నాగులవరం, చందలూరు, తువ్వపల్లె, టీ.లింగందిన్నె, పేరూరు, శ్రీరంగాపురం, పెద్దకంబలూరు, అప్పనపల్లె, ఆళ్లగడ్డ మండలం ఓబులంపల్లె, నల్లగట్ల, కందుకూరు, చింతకొమ్మదిన్నె, మిట్టపల్లె, చాగలమర్రి మండలం ముత్యాలపాడు, బోదనం తదితర ప్రాంతాలలో జింకల సంచారం అధికంగా ఉంటోంది. అటువంటి ప్రదేశాల్లో అధికారుల నిఘా కొరవడటంతో వేట యథేచ్ఛగా సాగుతోంది. మిట్టపల్లె సమీపంలోని ఎర్రచెరువు వద్ద తెలుగు గంగ 28వ బ్లాక్ ఉప ప్రధాన కాల్వలో ఒకే ప్రదేశంలో వరుసగా రెండు పెద్ద పులులు మృతి చెందాయి. వాటి మృతికి కారణాలు ఇంత వరకు కనుగొన లేకపోయారు. మిట్టపల్లె, నల్లగట్ల ప్రాంతాల్లో జింకల కళేబరాలు లభించాయి. ఇలా విచ్చలవిడిగా వేట సాగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వన్య ప్రాణులు, అడవి జంతువుల సంరక్షణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అందుబాటులో ఉండని సిబ్బంది నల్లమల అటవీ ప్రాంతాన్ని సంరక్షిస్తామని బాధ్యతలు చేపట్టిన అటవీ అధికారులు అడవికి 20, 40 కిలోమీటర్ల దూరంలోని ఆళ్లగడ్డ, నంద్యాల వంటి పట్టణాల్లో నివాసాలు ఉంటున్నారు. పగటిపూట మాత్రం కార్యాలయాలు, ఠాణాల వద్ద అటుఇటు కలియతిరిగి వెళ్తున్నారు. రాత్రి సమయాల్లో అటవీ సంరక్షణ గాలికి వదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వన్యప్రాణులను వేటాడితే జైలే వేట కారణంగా నేలకొరుగుతున్న వన్య ప్రాణులపై రుద్రవరం రేంజి అధికారి శ్రీపతి నాయుడును వివరణ కోరగా వన్య ప్రాణులను వేటాడితే జైలుశిక్ష ఖాయమని హెచ్చరించారు. ఇటీవల జరిగిన పలు సంఘటనలతో అటవీ శాఖ అప్రమత్త మయ్యిందన్నారు. ఇందులో భాగంగానే నల్లమల అటవీ ప్రాంతంలో రహస్యంగా ట్రాప్ కెమెరాలు అమర్చామన్నారు. అలాగే వేట సాగే పలు ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. అలాగే గ్రామాల్లో వన్య ప్రాణులను వేటాడితే కేసులు, పడే శిక్షలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఫారెస్టు గదులు సక్రమంగా లేకçపోవడం వల్లే సమీప పట్టణాల్లో సిబ్బంది నివాసముంటున్నారని తెలిపారు. -శ్రీపతి నాయుడు, రుద్రవరం రేంజి అధికారి -
కోర్టు ధిక్కార కేసులో.. పలువురు ఐఏఎస్‌లకు జైలుశిక్ష
సాక్షి, అమరావతి: 2015 నాటి భూసేకరణకు సంబంధించిన ఒక కోర్టు ధిక్కార కేసులో పలువురు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు జైలుశిక్ష, జరిమానా విధించింది. అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌కు నాలుగు వారాల జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా.. ప్రస్తుత ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్‌సింగ్ రావత్‌కి నెలరోజుల జైలు, రూ.2వేల జరిమానా.. అప్పటి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజుకు రెండు వారాల జైలుశిక్ష, రూ.1000 జరిమానా.. అప్పటి మరో కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు, ప్రస్తుత కలెక్టర్ ఎన్వీ చక్రధర్‌లకు రూ.2వేల చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం తీర్పు వెలువరించారు. అప్పీల్‌కు వెళ్లేందుకు వీలుగా న్యాయమూర్తి తన తీర్పు అమలును నాలుగు వారాలపాటు నిలుపుదల చేశారు. కేసు పూర్వాపరాలివీ.. నెల్లూరు జిల్లాలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ కోసం భూమిని కేటాయించాలని ఆ సంస్థ డైరెక్టర్ జిల్లా కలెక్టర్‌ను కోరారు. దీనికి స్పందించిన కలెక్టర్ పదెకరాలు కేటాయించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా.. నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం, ఎర్రగుంటకు చెందిన తాళ్లపాక సావిత్రికి అదే మండలం కనుపూరు బిట్–2లో ఉన్న మూడెకరాలను కూడా తీసుకోవాలని నిర్ణయించారు. అనంతరం.. ఆ భూమిని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ డైరెక్టర్‌కు స్వాధీనం చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. అయితే, సావిత్రమ్మకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. దీంతో ఆమె 2017లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు, ఆమెకు పరిహారం ఇవ్వాలంటూ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. అయితే.. హైకోర్టు ఆదేశించినా అధికారులు ఎలాంటి పరిహారం ఇవ్వకపోవడంతో సావిత్రమ్మ 2018లో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో నాటి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్, ప్రస్తుత ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్, అప్పటి సీసీఎల్ఏ అనిల్ పునేఠా, జిల్లా కలెక్టర్లు ముత్యాలరాజు, ఇంతియాజ్, చక్రధర్, ఆర్డీఓ హరిత, తహసీల్దార్ సోమ్లా బాణావత్ తదితరులను ప్రతివాదులుగా చేర్చింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులందరినీ ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు వారు కౌంటర్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ముందుకు విచారణకు రాగా.. ఆయన అధికారులందరి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చారు. చివరకు ఈ ఏడాది మార్చి 3న పరిహారం మొత్తాన్ని సావిత్రమ్మ బ్యాంకు ఖాతాలో జమచేశారు. అందరి కౌంటర్లు పరిశీలించిన న్యాయమూర్తి, కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన నాలుగేళ్ల తర్వాత అధికారులు పరిహారం మొత్తాన్ని పిటిషనర్ ఖాతాలో జమచేశారన్నారు. కోర్టు ధిక్కారం కింద అధికారులను శిక్షించేందుకు ఇది తగిన కేసని తెలిపారు. పరిహారం చెల్లింపులో జరిగిన జాప్యానికి రెవెన్యూ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, అప్పటి, ప్రస్తుత కలెక్టర్లే బాధ్యులని తేల్చారు. వారికి జైలుశిక్ష, జరిమానా విధించి మిగిలిన అధికారులపై కోర్టు ధిక్కార చర్యలు మూసివేశారు. సావిత్రమ్మను ఇబ్బందిపెట్టినందుకు ఆమెకు ఖర్చుల కింద రూ.లక్ష చెల్లించాలని ఆదేశించారు. ఈ మొత్తాన్ని బాధ్యులైన అధికారుల నుంచి వసూలుచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. -
బాలికపై లైంగిక దాడి కేసులో ఇరవై ఏళ్ల జైలు శిక్ష
చిత్తూరు అర్బన్: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది. ఇలాంటి ఘటనల్లో కేసులను సత్వరమే విచారించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫాస్ట్‌ట్రాక్ న్యాయస్థానంతో బాధితులకు సత్వర న్యాయం లభించింది. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన బి.గంగాధర్‌కు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ చిత్తూరులోని ‘పోక్సో’ ప్రత్యేక న్యాయస్థానం గురువారం తీర్పునిచ్చింది. ప్రత్యేక అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లీలావతి కేసు వివరాలు వెల్లడించారు. 2018 జనవరి 13న మదనపల్లెలో.. రాజస్థాన్ నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన ఏడేళ్ల బాలికపై లైంగికదాడి జరిగింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో అప్పటి మదనపల్లె టూటౌన్ సీఐ నరసింహులు కేసు దర్యాప్తు చేసి మదనపల్లె పట్టణం గొల్లపల్లెకు చెందిన గంగాధర్‌ను అరెస్టు చేసి అదే నెల 17న కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణలో పోలీసులు సరైన సాక్ష్యాలు చూపడంతో గంగాధర్‌కు శిక్ష విధిస్తూ పోక్సో న్యాయస్థానం ఇన్చార్జ్ న్యాయమూర్తి యు.ప్రసాద్ తీర్పునిచ్చారు. జరిమానా చెల్లిస్తే ఆ మొత్తాన్ని బాధిత కుటుంబానికి ఇవ్వాలని, చెల్లించకుంటే అదనంగా మరో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. -
లొంగిపోయిన జాకబ్ జుమా
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా తాజాగా అధికారుల ఎదుట లొంగిపోయారు. అరెస్టు చేయడానికి న్యాయస్థానం విధించిన డెడ్‌లైన్‌కు కొన్ని నిమిషాల ముందు లొంగుబాటు ప్రక్రియ ముగిసింది. ఆయన 2009 నుంచి 2019 వరకూ దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా పనిచేశారు. పదవీ కాలంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. జాకబ్ జుమాకు వ్యతిరేకంగా ఫిర్యాదు అందడంతో కేసులు నమోదయ్యాయి. విచారణ కమిషన్ ముందు హాజరు కావాలని దక్షిణాఫ్రికా రాజ్యాంగ న్యాయస్థానం ఆదేశించగా, ఆయన అందుకు నిరాకరించారు. దీంతో కోర్టు ధిక్కరణ కింద జుమాకు న్యాయమూర్తి 15 నెలల జైలు శిక్ష విధించారు. బుధవారం అర్ధరాత్రి లోగా లొంగిపోవాలని ఆదేశించారు. లేకపోతే అరెస్టు తప్పదని స్పష్టం చేశారు. దీంతో చేసేదిలేక జాకబ్ జుమా లొంగిపోయారు. లొంగిపోయిన తర్వాత పోలీసు అధికారులు తనపట్ల అనుచితంగా ప్రవర్తించారని జుమా ఆరోపించారు. జుమాకు జైలు శిక్ష విధిస్తూ రాజ్యాంగ న్యాయస్థానం ఇచ్చిన తీర్పునుసవాలు చేస్తూ ఆయన తరపు న్యాయవాదులు గురువారం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. అయితే, హైకోర్టులో జుమాకు ఉశపమనం దక్కే అవకాశాలు తక్కువేనని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
నాందేడ్ లష్కరే తొయిబా కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పు
ముంబై: నాందేడ్ లష్కరే తొయిబా కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పును వెలువరించింది.ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులకు జైలు శిక్షను ఎన్ఐఏ కోర్టు విధించింది. ముజామిల్, సాదిక్, అక్రంకు పదేళ్ల జైలు శిక్షను విధించింది. 2012లో ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. హిందూ నేతలు , జర్నలిస్ట్ లు ,రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులను హత మార్చేందుకు వ్యూహ రచన చేశారు. హైదరాబాద్, నాందేడ్, బెంగుళూర్ ప్రాంతాల్లో హింస ప్రేరేపించేలా కుట్ర పన్నారని ఎన్ఐఏ పేర్కొంది.వీరు హైదరాబాద్ కు చెందిన ఇండియన్ మోస్ట్ వాంటెడ్ సిద్ధికి బిన్ ఉస్మాన్, ఫుర్ఖాన్ భాయ్ ల తో అక్రమ్ సంబంధాలు కల్గి ఉన్నారు. చదవండి: అంబానీ కారు బాంబు కేసులో మరో పోలీస్ అరెస్టు -
లైంగిక దాడి కేసులో ఐదేళ్ల జైలు
కర్నూలు (లీగల్): చాక్లెట్ ఆశ చూపించి ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఓ మానవ మృగానికి కర్నూలు జిల్లా మొదటి అదనపు న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. కర్నూలులోని బండిమెట్టకు చెందిన ఆరేళ్ల బాలిక నగరపాలక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నది. అమ్మమ్మ ఇంట్లో ఉంటూ రోజూ పాఠశాలకు వెళ్లి వచ్చేది. గత ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లి తిరిగి పాఠశాలకు హాజరైంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పాఠశాల ముందు ఆడుకుంటుండగా నగరంలోని కల్లా వీధికి చెందిన గౌండా పనిచేసే షేక్ ఖాజాబాషా తన సైకిల్‌పై అక్కడికి వచ్చాడు. చాక్లెట్ ఇస్తానని నమ్మించి బాలికను సైకిల్‌పై తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక గట్టిగా కేకలు వేయడంతో చెంప దెబ్బలు కొట్టి రోడ్డుపై వదిలి వెళ్లిపోయాడు. బాలిక ఇంటికి రాకపోవడంతో అమ్మమ్మ పాఠశాల వద్దకు వెళ్లింది. అప్పటికే తాళం వేయడంతో ఆందోళన చెంది వెతుకుతుండగా బాలిక స్నేహితురాలు తారసపడింది. పుస్తకాల సంచి ఇచ్చి మధ్యాహ్నం నుంచి పాఠశాలకు రాలేదని చెప్పింది. కొద్దిసేపటి తర్వాత బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి అమ్మమ్మ, తాతకు విషయం చెప్పింది. దీంతో వారు కర్నూలు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ టి.నాగరాజు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితుడిని అదేరోజు అరెస్ట్ చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో ఖాజాబాషాకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి బి.శ్యాంసుందర్ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున పీపీ హేజ్కెల్ వాదించారు. -
‘లవ్ జిహాద్’ వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లవ్ జిహాద్ పేరిట జరిగే బలవంతపు మత మార్పిడి వివాహాలను అడ్డుకోవడానికి ఆర్డినెన్స్ తెచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ తెచ్చిన వారానికి, ఓ హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి మధ్య జరుగనున్న వివాహ వేడుకను పోలీసులు నిలిపివేశారు. బుధవారం లక్నోలోని పారా ప్రాంతంలో వివాహ వేడుకలు ప్రారంభం కావడానికి ముందు, పోలీసులు అక్కడకి చేరుకుని ఇరు వర్గాలను స్థానిక పోలీస్ స్టేషన్‌కి రావాలని కోరారు. వివాహానికి ముందు లక్నో జిల్లా మేజిస్ట్రేట్ నుంచి ఇరువర్గాలు అనుమతి పొందాలని వారికి సూచించారు. ఈ క్రమంలో.. పెళ్లి విషయంలో బలవంతం ఏదీ లేదని, ఇరు కుటుంబాల సమ్మతితోనే వివాహం జరుగుతుందని, మత మార్పిడి ఉద్దేశం లేదని ఇరు వర్గాలు పోలీసులకు తెలియజేశాయి. ఏదేమైనా చట్టపరంగా అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసిన తర్వాతనే వివాహం జరిపించనున్నట్లు వారు పేర్కొన్నారు. కొత్త ఆర్డినెన్స్ ఏం చెబుతోంది? ఇక వివాహం పేరుతో బలవంతపు మత మార్పిడికి పాల్పడే వారికి గరిష్ఠంగా పదేళ్ళ జైలు శిక్ష విధించవచ్చునని ఈ ఆర్డినెన్స్(2020) పేర్కొంది. పెళ్లి కోసం మతం మారాలంటూ బలవంతం చేసేవారికి ఒక ఏడాది నుంచి ఐదేళ్ళ వరకు జైలు శిక్ష, 15,000 రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. మైనర్లను, ఎస్సీ, ఎస్టీ మహిళలను బలవంతంగా మతం మార్చేవారికి 3 సంవత్సరాల నుంచి పదేళ్ళ వరకు జైలు శిక్ష, 25,000 రూపాయల జరిమానా విధించవచ్చని ఆర్డినెన్స్ తెలిపింది. సామూహిక మతమార్పిడులకు పాల్పడితే 3 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 50000 రూపాయల జరిమానా విధించవచ్చు. (చదవండి: విడాకులు కోరిన ఐఏఎస్ దంపతులు) జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలి: పోలీస్ అధికారి సురేష్ చంద్ర రావత్ ‘‘వేర్వేరు మతాలకు చెందిన అమ్మాయి, అబ్బాయి వివాహం చేసుకోనున్నట్లు డసెంబర్ 2న సమాచారం అందింది. మేము అక్కడికి చేరుకుని, ఇరు వర్గాలను స్థానిక పోలీస్ స్టేషన్‌కు రావాలని సూచించాం. ఇరు కుటుంబాలకు కొత్తగా తెచ్చిన బలవంతపు మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్ కాపీని అందించి, చట్ట ప్రకారం జిల్లా మేజిస్ట్రేట్‌తో లిఖితపూర్వకంగా అనుమతి తీసుకోవాలని సూచించాం. ఒకవేళ వివాహం తరువాత మతం మారే ఉద్దేశం ఉంటే కనీసం రెండు నెలల ముందుగానే జిల్లా మేజిస్ట్రేట్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.’’ అని లక్నో సీనియర్ పోలీస్ అధికారి సురేశ్ చంద్ర రావత్ మీడియాకు తెలిపారు. -
ఐదేళ్ల జైలు.. కోటి జరిమానా
న్యూఢిల్లీ: ఢిల్లీ, పరిసర రాష్ట్రాల్లో వాయు కాలుష్యానికి కారణమయ్యే వారికి భారీగా జరిమానా, జైలుశిక్ష విధించేలా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీనిప్రకారం కాలుష్య కారకులకు ఏకంగా కోటి రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. గరిష్టంగా ఐదేళ్ల దాకా జైలు శిక్ష పడే ప్రమాదం కూడా ఉంది. ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ బుధవారం సంతకం చేయడంతో వెంటనే అమల్లోకి వచ్చింది. ఆర్డినెన్స్‌ను కేంద్ర న్యాయ శాఖ గురువారం విడుదల చేసింది. దీని ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీ, హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ నిమిత్తం 22 ఏళ్ల క్రితం నాటి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ(ఈపీసీఏ)ని రద్దు చేసి, దాని స్థానంలో ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఈ కమిషన్‌లో 20 మందికిపైగా సభ్యులు ఉంటారు. ఆర్డినెన్స్ నియమ నిబంధనలను, ప్రత్యేక కమిషన్ ఆదేశాలను ఉల్లంఘిస్తే కోటి రూపాయల జరిమానా లేదా ఐదేళ్ల దాకా జైలు శిక్ష విధించవచ్చు. కమిషన్ చైర్మన్‌ను కేంద్ర పర్యావరణం, అటవీ శాఖ మంత్రి అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ కమిటీలో రవాణా, వాణిజ్య, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర శాఖల మంత్రులు, కేబినెట్ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఢిల్లీకి పొరుగున ఉన్న రాష్ట్రాల్లో ప్రతిఏటా పంట వ్యర్థాలను దహనం చేస్తుంటారు. దీనివల్ల ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. పంట వ్యర్థాల దహనాన్ని, తద్వారా వాయు కాలుష్యాన్ని అరికట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యింది. ఈ వ్యాజ్యంపై న్యాయస్థానం ఇటీవలే విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కమిషన్ ఏం చేస్తుందంటే.. ►ఏయే ప్రాంతాల్లో గాలి నాణ్యతను ఎంత స్థాయిలో ఉండాలో నిర్ధారించే అధికారం కమిషన్‌కు కట్టబెట్టారు. ►చట్టాన్ని ఉల్లంఘిస్తూ వాయు కాలుష్యానికి కారణమవుతున్న కంపెనీలు/ప్లాంట్లను కమిషన్ తనిఖీ చేస్తుంది. ►అలాంటి కంపెనీలు/ప్లాంట్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేస్తుంది. ►కమిషన్ తనంతట తానుగా(సుమోటో) లేదా ఫిర్యాదుల ఆధారంగా ఆదేశాలు జారీ చేస్తుంది. ►కమిషన్ తన వార్షిక నివేదికలను నేరుగా పార్లమెంట్‌కు సమర్పిస్తుంది. ►కమిషన్ ఆదేశాలను సివిల్ కోర్టుల్లో సవాలు చేసేందుకు వీల్లేదు. జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో సవాలు చేయొచ్చు. -
అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య మాజీ అధ్యక్షుడికి రెండేళ్ల జైలు
పారిస్: అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) మాజీ అధ్యక్షుడు లామినే డియాక్‌కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. రష్యా డోపీలను నిషేధించకుండా పోటీల్లో పాల్గొనేలా అవినీతికి పాల్పడటంతో పారిస్ కోర్టు 87 ఏళ్ల డియాక్‌ను దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేసింది. సెనెగల్ దేశానికి చెందిన ఆయన 1999 నుంచి 2015 వరకు సుదీర్ఘకాలం పాటు ఐఏఏఎఫ్‌లోనే అత్యంత ప్రభావవంతమైన అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే ఆయన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారించిన కోర్టు జైలుశిక్షతోపాటు 5 లక్షల యూరోలు (రూ. 4 కోట్ల 34 లక్షలు) జరిమానా కూడా విధించింది. శిక్ష ఖరారు చేస్తున్న సమయంలో డియాక్ కోర్టులోనే ఉన్నారు. ఆయన అవకతవకలు, అవినీతి ఉదంతాలపై ఈ శిక్షను విధిస్తున్నట్లు మహిళా న్యాయమూర్తి తీర్పును చదివి వినిపించారు. రష్యా డోపీలకు ఉద్దేశపూర్వకంగానే అండదండలు అందించినట్లు కోర్టు తేల్చిందని ఆమె చెప్పారు. -
‘ఆమెకు 24 సంవత్సరాల శిక్ష సరైందే’
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోనే అత్యంత భారీ సెక్స్ రాకెట్ నిర్వాహకురాలికి స్థానిక కోర్టు 24 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. సోను పంజాబన్ అలియాస్ గీతా అరోరాగా గుర్తింపు పొందిన ఈ మహిళ ఢిల్లీలోనే అత్యంత భారీ సెక్స్ రాకెట్‌ను నిర్వహించినట్టు ఆమెపై వచ్చిన ఆరోపణలు రుజువయ్యాయని కోర్టు తెలిపింది. దాంతో ద్వారకా జిల్లా కోర్టు బుధవారం ఆమెకు 24 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఆమెతో పాటు సహ నిందితుడైన సందీప్‌కు 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. కోర్టు తీర్పు సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సోను పంజాబన్ ఓ మహిళ అయినప్పటికి అన్ని హద్దులను దాటింది. ఆమెకు కఠిన శిక్షే సరైందని’ పేర్కొన్నారు. సోను పంజాబన్, సందీప్ కలసి చిన్న వయసు బాలికలను వ్యభిచార కూపంలోకి దింపేవారు. ఇందుకు గాను మైనర్ బాలికల కిడ్నాప్‌లకు కూడా పాల్పడ్డారు. ఈ క్రమంలో పోలీసులు 2014లో ఓ బాలిక ఫిర్యాదు మేరకు సోను పంజాబన్‌పై నిజాఫ్గఢ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆమె ఆరుగురు సహాయకులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. సందీప్ మీద కిడ్నాప్, సెక్స్ రాకెట్, లైంగిక దాడి కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు తీహార్ జైల్లో ఉంచారు. కొన్ని రోజుల క్రితం సోను పంజాబన్ తీహార్ జైల్లో మందులు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. దాంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స తర్వాత కోలుకుంది. ఈ కేసులో బాధితురాలు అయిన బాలిక కిడ్నాప్‌కు గురైనప్పుడు 12 సంవత్సరాల పది నెలల వయసు అని పోలీసులు తెలిపారు. 2009లో బాలికను కిడ్నాప్ చేసిన సందీప్.. ఆమెను మరొకరికి విక్రయించాడు. ఈ క్రమంలో బాలికను దాదాపు 12 మందికి విక్రయించారు. బాధితురాలికి భారీ ఎత్తున మత్తు పదార్థాలు ఇచ్చారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఒకసారి బాలిక సోను పంజాబన్ చెర నుంచి తప్పించుకుని నిజాఫ్గఢ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. తాను అనుభవించిన నరకం గురించి పోలీసులకు చెప్పింది. బాలిక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సోను పంజాబన్‌ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం కూడా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. -
సౌదీలో మైనర్లకు మరణశిక్ష రద్దు
దుబాయ్: నేరగాళ్లకు బహిరంగంగా కఠిన శిక్షలు అమలు చేస్తూ విమర్శలనెదుర్కొంటున్న సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. నేరాలకు పాల్పడిన మైనర్లకు మరణశిక్షను రద్దు చేసింది. కొరడా దెబ్బలకు బదులుగా జైలు శిక్ష, జరిమానా, సామాజిక సేవను శిక్షలుగా విధించాలని రాజు సల్మాన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఓ అధికారి తెలిపారు. ఇప్పటికే కనీసం పదేళ్లు జైలు శిక్ష అనుభవించిన వారికి సంబంధించిన కేసులను సమీక్షించాలని, శిక్షలను తగ్గించాలని సల్మాన్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నట్లు సమాచారం. దీని ఫలితంగా షియా వర్గానికి చెందిన ఆరుగురు మైనర్లకు మరణ శిక్ష తప్పినట్లయింది. సంప్రదాయాలకు, ఇస్లామిక్ చట్టాలకు పెద్ద పీట వేసే సౌదీ అరేబియాలో రాజు సల్మాన్ తాజా నిర్ణయం వెనుక ఆయన కుమారుడు, మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రమేయం ఉందని భావిస్తున్నారు. మరోవైపు, మహిళా హక్కుల కార్యకర్తలు, సంస్కరణ వాదులపై అణచివేత చర్యలు ఆయన పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. 2018లో సౌదీ రచయిత జమాల్ ఖషొగ్గీని టర్కీలో హత్య చేయించడంపై సల్మాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. -
డేటా దుర్వినియోగానికి జైలు శిక్ష..
న్యూఢిల్లీ: వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసిన పక్షంలో కంపెనీలు ఇకపై భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రానుంది. కోట్ల రూపాయల జరిమానాలు కట్టడంతో పాటు వాటి ఎగ్జిక్యూటివ్‌లు జైలు శిక్షలు కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన వ్యక్తిగత డేటా భద్రత బిల్లుకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీన్ని ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి. వ్యక్తిగత డేటా భద్రత బిల్లు నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో సదరు కంపెనీ .. రూ. 15 కోట్ల దాకా లేదా తన అంతర్జాతీయ టర్నోవరులో 4 శాతం మొత్తాన్ని జరిమానాగా కట్టాల్సి వస్తుంది. ఒకవేళ వ్యక్తుల డేటాను కావాలనే చట్టవిరుద్ధంగా ప్రాసెసింగ్ చేశారని తేలిన పక్షంలో సదరు కంపెనీలో డేటా వ్యాపార విభాగానికి ఇంచార్జిగా ఉన్న ఎగ్జిక్యూటివ్‌కు మూడేళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే తమ డేటాను పూర్తిగా తొలగించేలా తగు చర్యలు తీసుకోవడానికి వ్యక్తులకు హక్కులు లభిస్తాయి. డేటా బిల్లులో మరికొన్ని ముఖ్యాంశాలు.. ► వ్యక్తులకు సంబంధించిన కీలక డేటాను అన్ని ఇంటర్నెట్ కంపెనీలు.. భారత్‌లోనే భద్రపర్చాలి. ఒకవేళ విదేశాల్లో ప్రాసెస్ చేయాల్సి వస్తే.. చట్ట నిబంధనలకు లోబడి, ఆయా వ్యక్తుల నుంచి కచ్చితంగా పూర్తి అనుమతులు తీసుకోవాలి. ► ఆరోగ్యం, మతం, రాజకీయ అభిప్రాయాలు, బయోమెట్రిక్స్, జన్యుపరమైన, ఆర్థికపరమైన వివరాలను కీలక డేటాగా పరిగణించడం జరుగుతుంది. కీలక డేటాలో మార్పులు, చేర్పుల గురించి కేంద్రం ఎప్పటికప్పుడు ప్రకటిస్తుంది. ► చిన్నపాటి ఉల్లంఘనలకు కంపెనీలపై రూ. 5 కోట్లు లేదా గ్లోబల్ టర్నోవరులో 2% దాకా జరి మానా విధించవచ్చు. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులకు జైలు శిక్ష కూడా విధించవచ్చు. -
విజయవాడ కోర్టు సంచలన తీర్పు
సాక్షి, విజయవాడ : నగరంలోని పోక్సో స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. కాగా, 2017లో కృష్ణారావు అనే వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు.. పోక్సో యాక్ట్ కింద కృష్ణారావుకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ప్రస్తుతం మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్న తరుణంలో పోక్సో యాక్ట్ స్పెషల్ కోర్టు వెలువరించిన తీర్పుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
వాటిని చంపితే జైలుశిక్ష అనుభవించాల్సిందే!
సాక్షి,శ్రీకాకుళం : ‘జాతీయ జంతువు పెద్దపులిని చంపినా... కొండ చిలువను చంపినా.. ఒకే రకమైన శిక్ష తప్పదని, వణ్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అతిక్రమిస్తే ఎవ్వరినీ విడిచి పెట్టేది లేదని జిల్లా అటవీ శాఖాధికారి సందీప్ కృపాకర్ గుండాల హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల కొండ చిలువలను హతం చేస్తున్న ఘటనలు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని కూడా చట్టం ప్రకారం నేరంగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. వణ్యప్రాణి సంరక్షణ చట్టం (1972) ప్రకారం షెడ్యూల్–1 కేటగిరీలో పెద్దపులి, నెమలి, జింక, ఫిషింగ్ క్యాట్, కొండ గొర్రె, ఏనుగు, చిరుత పులి, ఎలుగు బంటి తదితర జంతువులతోపాటు కొండ చిలువలను చంపితే చట్టప్రకారం ఏడాది నుంచి ఆరేళ్ల వరకు కఠిన జైలుశిక్షతోపాటు భారీ జరిమానా విధిస్తామని వివరించారు. జిల్లాలో 15 రోజుల్లోనే లావేరు, బూర్జ, గార, నందిగాం, పలాస, ఆమదాలవలస తదితర మండలాలతోపాటు ఏజెన్సీ మండలాల్లోనూ పది వరకు కొండచిలువలను చంపేసినట్లుగా పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. ఇది నిజంగా దారుణమన్నారు. కొండచిలువలు ఎక్కడైనా తారసపడితే.. వెంటనే తమ అటవీ శాఖాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ విషయంలో ప్రజలు మరింత అవగాహన కలిగించుకోవాలన్నారు. సచివాలయాల్లో అటవీ శాఖ అధికారుల వివరాలు జిల్లాలో వణ్యప్రాణి సంరక్షణ చట్టం అమల్లో భాగంగా అన్ని మండలాల్లోనూ సచివాలయాలతోపాటు పలు ప్రభుత్వ భవనాల వద్ద స్థానిక అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచుతామని డీఎఫ్‌వో సందీప్ కృపాకర్ తెలియజేశారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీ శాఖ చట్టంపై అవగాహన కలిగించేలా తమ అధికార బృందంతో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నామని వివరించారు. ఇందులో ప్రజలను భాగస్వాములను చేస్తామన్నారు. అదేవిధంగా ఇదే చట్టం ప్రకారం షెడ్యూల్–3లో అడవి పందిని చంపినా కచ్చితంగా నేరంగానే కేసులు నమోదు చేస్తామన్నారు. ఇటీవల పొందూరు మండలంలో ఓ కేసును నమోదు చేసినట్లు గుర్తు చేశారు. అటవీ శాఖ అధికారులు, సిబ్బంది కూడా చట్టాలపై పూర్తి అవగాహనతో ఉండాలని, వణ్యప్రాణులను చంపిన వారిపై ఎక్కడి నుంచి సమాచారం వచ్చినా, వెంటనే అప్రమత్తమై, క్షేత్ర స్థాయిలో వాస్తవాలను గుర్తించి నిందితులపై కేసులను నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇకమీదట వణ్యప్రాణుల సంరక్షణకు అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లుగా ప్రకటించారు. -
వివాహేతర సంబంధం కేసులో టీడీపీ నాయకుడికి జైలుశిక్ష
సాక్షి, ధర్మవరం : వివాహేతర సంబంధం కేసులో టీడీపీ నాయకుడికి మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జి క్రిష్ణవేణమ్మ తీర్పునిచ్చారు. బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఈశ్వరయ్య తన మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన తర్వాత ఆమె భర్త శ్రీకాంత్ మనస్తాపానికి గురై కిరోసిన్ పోసుకొని నిప్పటించుకుని మూడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మృతుని సోదరి ఫిర్యాదు మేరకు బత్తలపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఈశ్వరయ్య, అతడి మరదలు రాధపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ముద్దాయిలు ఈశ్వరయ్య, రాధలకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ జడ్జి క్రిష్ణవేణమ్మ తీర్పు వెలువరించారు. -
పోలీసుల దాడిలో దిగ్భ్రాంతికర విషయాలు
జాన్ జోన్ డార్‌స్టెన్‌కు సరిగ్గా పాతికేళ్లు ఉంటాయి. ఓ రోజు భయం భయంగా పొలాల గుండా పరిగెత్తుకుంటూ సమీపంలోని బార్ కెళ్లి. ఐదు బీర్లకు ఆర్డర్ ఇచ్చారు. సర్వర్ తీసుకొచ్చిన బీర్లను తీసుకున్నప్పటికీ ఆయన చేతులు వాటిని పట్టుకోలేక వణికిపోతున్నాయి. కౌంటర్ మీదున్న యజమాని ఆ విషయాన్ని గమనించి ఆ యువకుడి చేతిలోని బీర్లను తీసుకొని విషయం ఏమిటని ప్రశ్నించారు. సమీపంలోని ఓ ఫామ్ హౌజ్‌లో తన కుటుంబం బంధించి ఉందని, విడిపించాల్సిందిగా అడ్రస్ చెప్పి బీర్లు తీసుకొని పారిపోయారు. బార్ యజమాని క్రిస్ వెస్టర్బీక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వచ్చి ఆ ఫామ్ హౌజ్‌ను తనిఖీ చేశారు. బార్‌కు వెళ్లి ఫిర్యాదు చేసిన పాతికేళ్ల జాన్ జోన్ అందులో ఓ దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగు చూసింది. గీత్ వాన్ డార్‌స్టెన్ అనే మధ్య వయస్కుడు, ఆయన ఐదుగురు పిల్లలు ఫామ్‌హౌజ్ సెల్లార్‌లోని ఓ చీకటి గదిలో బంధీలుగా ఉన్నారు. ఒక్క కిటికీ కూడా లేని ఆ చిన్న చీకటి గదిలో వారు గత తొమ్మిదేళ్లుగా బందీలుగా ఉన్న విషయం తెల్సి పోలీసులు అవాక్కయ్యారు. వారిలో 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లు మధ్యన ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. వారిలో పెద్దవాడే బార్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు ఉత్తరాన 60 కిలోమీటర్ల దూరంలోని రూయినర్‌వోల్డ్ చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణం పొలాల్లోనే ఈ ఫామ్ హౌజ్ ఉంది. ఆ ఫామ్ హౌజ్‌లో చాలా గదులు ఉన్నప్పటికీ అన్ని గదుల్లోనూ కొత్తగా చేసిన ఫర్నీచర్ ఉంది. చిన్న చీకటి గదిలోనే వారిని బందీలుగా ఉంచారు. కిడ్నాపర్ జోసఫ్, జాన్ జోన్ కుటుంబం పక్కపక్కన అద్దెకున్న ఇల్లు బందీల మాటలు గమ్మత్తుగా ఉన్నాయని, ఏదో దైవ భాష మాట్లాడుతున్నట్లు కలగా పులగంగా మాట్లాడుతున్నారని, వారి ఒక్క మాట కూడా తమకు అర్థం కావడం లేదని, వారిని వైద్య చికిత్సల నిమిత్తం ఆస్పత్రికి పంపించామని కేసును దర్యాప్తును చేస్తున్న పోలీసులు తెలిపారు. బందీలు తామున్న గదిలోనే తిని, ఆ రూములోనే ఇంతకాలం పడుకున్నట్లు తెలుస్తోందని వారు చెప్పారు. ఇంతకాలం బయటి ప్రపంచానికి దూరం అవడం వల్ల వారు అలా మాట్లాడుతున్నారా ? మరేమైనా ఉందా ? అన్న విషయం దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు. వారిని అలా బంధించినన వ్యక్తిని ఆస్ట్రియాకు చెందిన 58 ఏళ్ల జోసఫ్ బ్రన్నర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వృత్తిరీత్యా వడ్రింగి పనులు చేసుకొని బతికే జోసఫ్ ...16 ఏళ్ల క్రితం గీత్‌వాన్ డార్‌స్టెన్ కుటుంబం అద్దెకున్న పక్క అద్దెకు ఉండేవాడు. గీత్‌వాన్ చెక్క బొమ్మలు చేయడంలో మంచి నేర్పరి. ఆయన బొమ్మలు చెక్కితే జోసఫ్ చెక్క పడవులు తయారు చేసేవాడు. ఇద్దరు కలిసి వాటిని వాటిని విక్రయించేవారు. గీత్‌వాన్ నలుగురితో కలుపుగోలుగా ఉంటే జోసఫ్ మాత్రం ఎవరితో మాట్లాడేవాడు కాదు. పలకరించినా మాట్లాడకుండా తనపని తాను చేసుకొని పోయేవాడు. 2008లో అతను అద్దె ఇల్లు ఖాళీచేసి ఎటో వెళ్లి పోయాడు. జాన్ కుటుంబానికి చెందిన ‘నేచురల్ హోమ్స్’ షాపు 2010లో గీత్‌వాన్ కుటుంబం ఇళ్లు ఖాళీ చేసి ఎటో వెళ్లి పోయింది. అప్పుడే గీత్‌వాన్ కుటుంబాన్ని జోసఫ్ కిడ్నాప్ చేసి ఫామ్ హౌజ్‌లో బంధించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పటికీ గీత్‌వాన్ భార్య బతికే ఉందని, ఆ తర్వాత కొంత కాలానికి ఆమె మరణించినట్లు ఆమె పెద్ద కుమారుడి కథనం ద్వారా తెలుస్తోంది. అయితే ఆమెను ఎక్కడ సమాధి చేశారో, కుటుంబ సభ్యులకు ఎవరికి తెలియదట. జోసఫ్ ఫామ్ హౌజ్ గేట్‌కు ఎప్పుడూ తాళం వేసి ఉంచేవాడని, ఎవరిని దరిదాపుల్లోని రానిచ్చేవాడు కాదని, ఇంటికి ఓ కెమేరాను కూడా అమర్చుకున్నాడని, పొరుగు పొలాల వారు తెలిపారు. జాన్ జోన్ వెళ్లిన బారు ఇదే (మీడియాతో మాట్లాడుతున్న బార్ యజమాని క్రిస్) జోసఫ్‌కు ఓ ట్రక్కుందని, ఆ ట్రక్కులో వారానికి సరఫడా ఆహార పదార్థాలు, సరుకులు తెచ్చేవాడని, ఒక్కరికి అన్ని సరుకులు ఎందుకబ్బా! తమకు అనుమానం వచ్చేదని, మాట్లాడని ఆ మూర్ఖుడితో మాటలెందుకు పడాలని ఎప్పుడు ప్రశ్నించలేదని వారన్నారు. ఆ ఇంటిలో కాకుండా ఆరు మైళ్ల దూరంలో జోసఫ్ ఓ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేసుకొని అక్కడే పనిచేసుకునే వాడని, వారానికి రెండు, మూడు సార్లకు మించి ఫామ్ హౌజ్‌లో కనిపించే వాడు కాదని, వచ్చినప్పుడు కూడా ఏవో ఇంటి మరమ్మతులు ఒంటరిగా చేస్తూ కనిపించే వాడని వారు తెలిపారు. ఆ ఇంటిలో ఇంత గూడుపుఠాణీ ఉందని తాము తెలుసుకోలేకపోయామని చెప్పారు. ఇంతకు ఆ ఫామ్‌హౌజ్ జోసఫ్ సొంతం కాదు. కిరాయికి తీసుకున్నది. నెల నెల టంచనుగా అద్దె చెల్లిస్తున్నందున తాము కూడా ఫామ్‌హౌజ్‌ను మధ్యలో తనిఖీ చేసుకోలేదని యజమాని తెలిపారు. పోలీసు అధికార ప్రతినిధి రమోనా ఈ వింత సంఘటన వెనక సమాధానం లేని అనేక శేష ప్రశ్నలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. కుటుంబాన్ని బంధించిన గది తలుపుకు ఓ బండరాయి మాత్రమే అడ్డంగా ఉందని, దాన్ని తొలగించి తప్పించుకునే అవకాశం బందీలకు ఉన్నా కూడా వారు అలా చేయలేదని చెప్పారు. కనీసం గది బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన దాఖలాలు లేవు. వారు తీవ్ర భయాందోళనలు, మానసిక ఆందోళనకు గురినట్లు మాత్రం కనిపిస్తోందని చెప్పారు. జ్వార్ట్లూయీ నగరంలో గీత్‌వాన్ కుటుంబానికి ‘నేచురల్ హోమ్స్’ పేరిట ఓ షాపు కూడా ఉంది. పోలీసులు ఇప్పుడు ఆ షాప్‌పై దాడిచేయగా, షాపును తాము గత పదేళ్లుగా అద్దెకు తీసుకొని నడుపుతున్నామని, కొత్తలో ఎవరో వచ్చి అద్దె తీసుకెళ్లే వారని, ఇప్పుడు ఎవరూ రావడం లేదని షాపు వారు చెప్పారట. గీత్‌వాన్ పెద్ద కుమారుడు జాన్ జోన్ రెండు, మూడు సార్లు స్థానిక బారు వద్దకు వెళ్లి బీరు తాగాడట. అప్పుడు ఎవరికీ తమ బంధీ గురించి ఫిర్యాదు చేయలేదట. ఎందుకు ? 2010 వరకు సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్న జాన్ జోన్ తాము రూయినర్‌వోల్డ్ పట్టణానికి షిప్ట్ అవుతున్నామని కూడా సోషల్ మీడియాలో 2010లో పేర్కొన్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాకు ఆయన పూర్తిగా దూరమయ్యారు. చీకటి గది నుంచి విముక్తి పొందిన తర్వాత గత జూలై నెల నుంచి జాన్ జోన్ మళ్లీ సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉన్నారు. అయనప్పటికీ తమ చీకటి జీవితం గురించి ఒక్క ముక్క కూడా ఆయన వెల్లడించలేదు. ఎందుకు ? కిడ్నాపర్ జోసఫ్ బ్రన్నర్‌ను ఈ రోజు (గురువారం) ఆమ్స్టర్డామ్ కోర్టు ముందు విచారణకు హాజరుపర్చారు. ఆయన కోర్టుకు ఏమి చెప్పిందీ తెలియరాలేదు. కేసు దర్యాప్తులో పోలీసులకు ఏమాత్రం సహకరించని జోసఫ్ కోర్టు ముందు కూడా నోరు విప్పలేదని పోలీసుల అధికార ప్రతినిధి రమోనా తెలిపారు. కొన్ని కేసుల మిస్టరీ ఎప్పటికీ విడిపోదని, ఇది కూడా అలాంటిదే కావచ్చని ఆమె అన్నారు. -
వృద్ధులను నిర్లక్ష్యం చేస్తే జైలుశిక్షే..
సాక్షి, ఖమ్మం : ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చెదిరిపోవడంతో పెద్దవారిని కుటుంబం గమనించడం తగ్గిపోయింది. ఫలితంగా పెద్దలు ప్రత్యేకించి వితంతువులు వారి జీవనసంధ్యా కాలం ఒంటరిగానూ, భౌతికంగా, ఆర్థికంగా ఏ ఆసరా లేకుండా గడపాల్సి వస్తోంది. వయసు మీరడం అనేది ప్రధానమైన సామాజిక మార్పునకు దారితీస్తుంది. పెద్దవారి సంరక్షణకు వారి భద్రతకు శ్రద్ధ అవసరం. దీనిని దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్లో 2007 ఏడాదిలో తల్లిదండ్రుల, వృద్ధుల పోషణ సంక్షేమ చట్టం అమలులోకి తెచ్చారు. చట్టంలోని సదుపాయాలు.. ఆస్తిని వారసత్వం ప్రకారం పొందే సంతానంపైన విధిగా బాధ్యతలు ఉంచింది. మెరుగైన వైద్యసదుపాయాలను వృద్ధులకు కల్పించడంతోపాటు వారి జీవనాన్ని, వారి ఆస్తులను సంరక్షించే సదుపాయాలను కల్పిస్తుంది. తల్లిదండ్రులతో సహా వృద్ధుడు తమ స్వార్జితం ద్వారా లేకపోతే తనకు గల ఆస్తి ద్వారా నిర్వహణ జరుపుకోలేనప్పుడు ఈ చట్టం సెక్షన్ 5 ప్రకారం షరతులకు లోబడి దరఖాస్తు చేసుకోవచ్చు. వారి సంతానం తల్లిదండ్రుల అవసరాలను తీర్చేవిధంగా, వారు సాధారణ జీవనం కొనసాగించేలా చూడాల్సిన బాధ్యత ఉంది. వృద్ధుల నిర్వహణ కోసం నెలసరి వేతనాన్ని విడుదల చేస్తూ సంతానానికి లేనిపక్షంలో బంధువులకు ఉత్తర్వులు జారీ చేయవచ్చు. ట్రిబ్యునల్ నేర శిక్షా స్మృతి 1973 జుడీషియల్ అధికారాలు కలిగి, ప్రతివాదులు హాజరు కాని ఎడల కేసును ఏకపక్షంగా విచారిస్తుంది. సెక్షన్–7ను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వంలోని ఉప డివిజనల్ అధికారి హోదా కలిగిన అధికారి ట్రిబ్యునల్‌ను నిర్వహిస్తారు. సంతానం, బంధువులు.. వృద్ధుల నిర్వహణలో నిర్లక్ష్యం, తిరస్కారాన్ని సెక్షన్ 9 వివరిస్తుంది. సదరు ఉత్తర్వు రాష్ట్ర ప్రభుత్వ నియమావళికి లోబడి నెలకు రూ.10వేలకు లోబడి ఉంటుంది. వృద్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. వృద్ధులు, తల్లిదండ్రులు ట్రిబ్యునల్ ఉత్తర్వు ద్వారా బాధించబడితే అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు 60రోజుల్లోగా సెక్షన్ 16ను అనుసరించి దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అనువైన చోట్ల అవసరం ఉందని భావిస్తే జిల్లాకు ఒకటి చొప్పున వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేసి కనీసం 150 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తుంది. సంరక్షణ, భద్రత కల్పించాల్సిన వృద్ధులను విడిచిపెట్టినా.. పరిత్యాగం చేసే విధంగా బుద్ధి పూర్వకంగా వ్యవహరించినా శిక్షార్హం. శిక్షా కాలం గరిష్టంగా 3నెలల జైలుశిక్ష, అపరాధ రుసుము గరిష్టంగా రూ.5వేలు, లేకపోతే రెండింటినీ విధించవచ్చు. సీనియర్ సిటిజన్లకు నల్సా స్కీమ్ –2016 ఈ చట్టం ప్రకారం వృద్ధులు న్యాయసేవాసంస్థలను ఆశ్రయించలేనప్పుడు ప్యానల్ లాయర్స్, పారా లీగల్ వలంటీర్ల సహాయంతో వారిని న్యాయసేవాసంస్థ వద్దకు తీసుకొచ్చి సమస్యలను పరిష్కరిస్తారు. ఆ మేరకు వారికి సంస్థ శిక్షణను ఇచ్చింది. న్యాయసేవాసంస్థ వృద్ధులను వారి కుమారులు అశ్రద్ధ చేయకుండా వారిలో చైతన్యం కలిగించేందుకు న్యాయసేవాసంస్థ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందుకుగాను ప్యానల్ లాయర్స్, పారా లీగల్ వలంటీర్లతో స్పెషల్ సెల్స్ ఏర్పాటు చేశారు. 2017 ఏడాదిలో 47 క్యాంప్‌ల ద్వారా 880మంది వృద్ధులు లబ్ధిపొందారు. 2018లో 16 క్యాంపుల ద్వారా 1538మంది లబ్ధిపొందారు. 2019 ఏడాది ఇప్పటి వరకు 13 క్యాంపుల ద్వారా 1092 మందికి లబ్ధి చేకూర్చారు. శిక్షలు కఠినంగానే ఉంటాయి న్యాయసేవాసంస్థ ద్వారా వృద్ధుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, వారికి వారసుల నుంచి ఆసరా కల్పించడానికి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. అనేకమంది వృద్ధులకు చేయూతను అందించాం. న్యాయసేవాసంస్థ ద్వారా వృద్ధులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడానికి, ఆస్తులను సంరక్షించే సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. వృద్ధులను నిర్లక్ష్యం చేస్తే జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు. – వినోద్ కుమార్, న్యాయ సేవాసంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి, ఖమ్మం -
అత్యాచారం కేసులో ఏడేళ్ల జైలు
సాక్షి, తిరుపతి: ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో తిరుపతి రూరల్ జీవకోన క్రాంతినగర్‌కు చెందిన కుసునూరు చరణ్‌కుమార్‌కు ఏడేళ్ల జైలుశిక్ష, రూ.25 వేలు జరిమానా విధిస్తూ తిరుపతి నాలుగో అదనపు జిల్లా జడ్జి రాంగోపాల్ మంగళవారం తీర్పు చెప్పారు. జరిమానా సొమ్ము రూ.25 వేలులో రూ.20వేలు బాధిత యువతికి చెల్లించాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. కోర్టు మానిటరింగ్ అధికారులు, కోర్టు కానిస్టేబుల్ రమేష్ కథనం మేరకు గంగాధర నెల్లూరు మండలానికి చెందిన 19 సంవత్సరాల యువతి స్థానిక ఎస్వీ మెడికల్ కళాశాలలోని డీఎంఎల్టీ సెకండ్ ఇయర్ కోర్సు చదువుతూ స్థానిక ఎమ్మార్‌పల్లెలోని ప్రభుత్వ బీసీ బాలికల హాస్టల్లో ఉండేవారు. చరణ్‌కుమార్ అదే కళాశాలలో మొదటి సంవత్సరం చదివి మధ్యలో చదువు ఆపేశాడు. ఆ యువతి వెంట ఇతడు ప్రేమ పేరుతో రోజూ వెంటపడేవాడు. 2011 ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం 8.45 ప్రాంతంలో ఆ యువతి కళాశాలకు నడిచి వెళుతుండగా చరణ్‌కుమార్ క్రైమ్ పోలీసు స్టేషన్ సమీపంలో వెంబడించాడు. తన ఇంట్లో పూజా కార్యక్రమం ఉందని, తనతో రావాలని తిరిగి వదిలి పెడతానని చెప్పాడు. అందుకు ఆ యువతి ఒప్పుకోలేదు. అయితే అతడు మాయమాటలు చెప్పి బలవంతంగా ద్విచక్ర వాహనంలో టౌన్ క్లబ్ సమీపంలోని ఇంటిలోకి ఆమెను తీసుకెళ్లాడు. ఆ ఇంటి యజమాని టీ గిరి, అతని బంధువు కే నాగరాజ సహాయంతో ఆమెకు కూల్‌డ్రింక్స్‌లో మత్తుమాత్రలు కలిపి ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు గంటల తర్వాత మత్తు వదలిన ఆ యువతిని గిరి ఆటోలో హాస్టల్‌కు పంపాడు. బాధితురాలు ఈ సంఘటన విషయాలను ఇద్దరు స్నేహితురాళ్లకు, హాస్టల్ వార్డన్‌కు తెలిపింది. తరువాత కూడా నిందితుడు చరణ్‌కుమార్ బాధిత యువతికి ఫోన్‌చేసి విషయాన్ని ఎవరికైనా చెబితే అంతుచూస్తానని బెదిరించాడు. బాధితురాలు ఈ మేరకు స్థానిక వెస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులు గిరి, నాగరాజపై నేరం రుజువుకాకపోవడంతో వారిపై కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు చరణ్కుమార్పై అత్యాచారం కింద కేసు నిరూపణ కావడంతో అతనికి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. -
‘మై ఓట్ నాట్ ఫర్ సేల్’
సాక్షి, మంగళగిరి : ప్రస్తుత స్వారత్రిక ఎన్నికల సందర్భంగా వాట్సప్‌లో మై ఓట్ నాట్ ఫర్ సేల్ చిత్రం హల్చల్ చేస్తుంది. ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేలా ఉండటంతో ఈ చిత్రాన్ని షేర్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించింది. ఓటుకు నోటిచ్చినా... తీసుకున్నా... నేరమే అని ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది పబ్లిక్ యాక్డ్ 1951లో సెక్షన్ 123(1) చెబుతుంది. ఈ చట్టంలోని 171(బీ) ప్రకారం ఏ వ్యక్తి అయినా ఓటర్ను ప్రలోభపరిచినా, ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగదు, ఇతరత్రా కానుకలు తీసుకున్నా, ఏడాది జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. సెక్షన్ 171(సీ) ప్రకారం ఓటర్లను ప్రలోభపరిచినా, బెదిరించినా, అనుకూలంగా ఓటు వేయాలని దాడి చేసినా ఏడాది జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తారు. కేసు తీవ్రతను బట్టి రెండూ విధించవచ్చు. -
జాని మాస్టర్‌కు జైలు శిక్ష
మేడ్చల్: రెండు డ్యాన్స్ గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ కేసులో ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్‌కు మేడ్చల్ ఎఎస్‌జే కోర్టు న్యాయమూర్తి జయప్రసాద్ ఆరు నెలల జైలు శిక్ష, రూ. 1000 జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు ఇచ్చారు. సీఐ గంగాధర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. షేక్ జానీ పాషా(డ్యాన్స్ మాస్టర్) తన అనుచరులు ఐదుగురితో కలిసి 2014లో మరో డ్యాన్స్ గ్రూపుతో గొడవపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మేడ్చల్ పోలీసులు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి జయప్రసాద్ బుధవారం జాని మాస్టర్‌తో పాటు అతని అనుచరులు ఐదురురికి ఆరు నెలల జైలు శిక్ష రూ.1000 జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారు. -
తమిళనాడు మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష
చెన్నై: తమిళనాడు మంత్రి బాలకృష్ణారెడ్డికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. 1998లో హోసూర్‌లో బస్సుపై రాళ్లదాడికి పాల్పడిన కేసులో ఆయనకు శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లేలా వ్యవహరించినందుకు గాను న్యాయస్థానం ఆయన శిక్ష విధిస్తూ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో 108 మంది నిందితులు ఉండగా, వారిలో 16 మందిని కోర్టు దోషులుగా తెల్చింది. ఈ తీర్పుతో బాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యే, మంత్రి పదవిని కోల్పోనున్నారు. కాగా, ప్రత్యేక కోర్టు తీర్పుపై బాలకృష్ణారెడ్డి మంగళవారం మద్రాసు హైకోర్టును ఆశ్రయించనున్నట్టుగా సమాచారం. కాగా, తమిళనాడు క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బాలకృష్ణారెడ్డి హోసూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
మాజీ ఎమ్మెల్యేకి పదేళ్ల జైలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: బాలికపై అత్యాచారం కేసులో డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఎం. రాజ్‌కుమార్ (52)కు పదేళ్ల జైలు శిక్ష, రూ.42 వేల జరిమానా విధిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. 2006లో పెరంబలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో కేరళ రాష్ట్రం ఇడిక్కి జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలిక ఇతని ఇంట్లో పనిచేసింది. అయితే పనిలో చేరిన కొద్ది రోజులకే ఆ బాలిక తన తల్లికి ఫోన్ చేసి ఇక్కడ ఉండలేనని, తనను తీసుకెళ్లాలని కోరింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పెరంబలూరు ప్రయాణమవుతుండగా, రాజ్‌కుమార్ స్నేహితుడు జయశంకర్ ఫోన్ చేసి అనారోగ్యం కారణంగా బాలికను ఆస్పత్రిలో చేర్పించినట్టు చెప్పాడు. తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లి బాలికను చూడగా స్పృహలేని స్థితిలో కనిపించింది. చికిత్స పొందుతూనే మరణించింది. తన కూతురు మరణంలో పలు అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెరంబలూరు పోలీసులు కేసు నమోదు చేసి, శవపంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలో ఆమె అత్యాచారానికి గురై మరణించినట్లు తేలింది. దీంతో డీఎంకే మాజీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్, అతని స్నేహితులు జయశంకర్, అన్బరసు, మహేంద్రన్, హరికృష్ణ, పన్నీర్ సెల్వం సహా ఏడుగురిపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును సీబీసీఐడీ విచారణ చేపట్టి రాజ్‌కుమార్‌ను అరెస్టు చేసింది. కేసు పెరంబలూరు న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న సమయంలోనే పన్నీర్ సెల్వం చనిపోయాడు. రాజ్‌కుమార్ మాజీ ఎమ్మెల్యే కావడంతో ప్రజా ప్రతినిధుల నేరాల విచారణకు ఏర్పడిన ప్రత్యేక కోర్టుకు ఈ కేసు చేరింది. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శాంతి నిందితులైన మాజీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్, జయశంకర్‌కు పదేళ్ల జైలు శిక్ష, రూ. 42 వేల జరిమానా విధించారు. -
ఊచలు లెక్కపెట్టాల్సిందే..
సాక్షి,మహబూబ్‌నగర్ క్రైం: ఇక నుంచి రోడ్లపైకి మద్యం సేవించి వాహనాలు నడుపుతే కఠినమైన కేసులతో పాటు.. పది నుంచి 60రోజుల జైలు శిక్ష విధించనున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, కార్లు, ఆటోలు, లారీలపై పోలీసులు ఎక్కువగా దృష్టి పెట్టనున్నారు. ఎక్కువమంది వాహనదారులు పట్టణంలో మద్యం కొనుగోలు చేసి బండమిదీపల్లి నుంచి తాటికొండ రోడ్డు వైపుతో పాటు, ఇటు నవాబ్‌పేట రోడ్డు ఫతేపూర్ మైసమ్మ పరిసర ప్రాంతాల వైపు.. హన్వాడ వైపు మద్యం తీసుకెళ్లి నిత్యం వందల సంఖ్యలో పార్టీ లు చేసుకుంటూ వస్తున్నారు. ఆదివారం రోజు అయితే సాయంత్రం సమయంలో తాటికొండ రోడ్డు వైపు వెళ్తే రోడ్డుకు ఇరువైపులా ఐదు.. నుంచి పది మంది వరకు బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా చెట్లకింద కూర్చోని మద్యం సేవిస్తూ కన్పింస్తుంటారు. ఎంత తాగితే ఎక్కువ.. బ్రీత్ అనలైజర్ ఆల్కహాల్‌లోని ఇథనాల్‌ను పసిగట్టే సెన్సార్ ఉంటుంది. ఇందులో కొన్ని రసాయన పదార్థాలను నిక్షిప్తం చేస్తారు. మద్యం తాగిన వ్యక్తి పరికరంలోకి గాలి ఊదినప్పుడు అతని శ్వాసలో కరిగి ఉన్న ఇథైల్ ఆల్కహాల్ సెన్సార్‌ను చేరుతుంది. ఇది శ్వాసలో ఇథనాల్ ఎంతశాతం ఉందో నమోదు చేస్తోంది. 0–30మిల్లీ గ్రాములు నమోదు సాధారణంగా చెబుతారు. 30మి.గ్రా ఆపైన నమోదైతే కేసు నమోదు చేసి జరిమానా వేస్తారు. ఇలా రెండుసార్లు దొరికితే లైసెన్స్ రద్దు చేస్తారు. 100మి.గ్రా పైగా నమోదైతే జైలుకు పంపుతారు. పోలీస్ నిబంధనల ప్రకారం.. ఒక యూనిట్ లేదా 100మిల్లీలీటర్ల రక్తంలో 0.03 శాతం లేదా 30మిల్లీ గ్రాములు మించి ఆల్కహాల్ ఉంటే.. మోటారు వాహనచట్టం 185 సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు. తాగిన మోతాదును బట్టి రూ.2వేలు జరిమానా, వారం నుంచి పది రోజుల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఇదే నేరాన్ని పునరావత్తం చేస్తే ఎక్కువ రోజులు జైలు శిక్షతో పాటు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు జరిమానా విధించే ప్రమాదం ఉంది. వినూత్నంగా శిక్షలు.. మొదట్లో డ్రంకెన్‌డ్రైవ్ కేసుల్లో ఎక్కువ మోతాదులో తాగి దొరికిన వారికి జరిమానాతో పాటు కౌన్సెలింగ్ నిర్వహించి వదిలిపెట్టేవారు. ప్రస్తుతం చట్టాలకు మరింత పదునుపెట్టారు. మోతాదుకు మించి అతిగా తాగిన వారికి 5నుంచి 20రోజుల జైలు శిక్షలు విధించడం ప్రారంభం చేశారు. మళ్లీ మళ్లీ డ్రంకెన్‌డ్రైవ్‌లో దొరికిన వారికి గరిష్టంగా 35రోజుల వరకు జైలు శిక్ష విధిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించి.. వారికి జీవో నం. 26ప్రకారం పాయింట్లు ఇస్తోంది. 24నెలల్లో 12పాయింట్లు దాటిన వారి డ్రైవింగ్ లైసెన్స్ ఏడాదిపాటు రద్దు చేస్తారు. ఏడాదిలో లైసెన్స్ పునరుద్ధరించాక మళ్లీ 12పాయింట్లు సాధిస్తే రెండేళ్లపాటు తర్వాత మళ్లీ ఇలాగే చేస్తే మూడేళ్లపాటు రద్దు చేస్తారు. ద్విచక్ర వాహనదారుడు మద్యం తాగితే 4పాయింట్లు, నాలుగు చక్రాల వాహనదారుడు మద్యం తాగితే 4పాయింట్లు, బస్సు, క్యాబ్ వాహనదారుడు మద్యం తాగితే 5పాయింట్లు, ఆటో డ్రైవర్ తన పక్కన ప్రయాణికుడిని కూర్చొబెట్టుకుంటే, హెల్మెట్ లేకుంటే, సీటు బెల్టు పెట్టకుంటే 1పాయింటు వేస్తారు. డ్రంకెన్‌డ్రైవ్‌లో 15రోజుల శిక్షపడిన వారు ఇద్దరు, 10రోజుల శిక్షపడిన వారు 12మంది, వారం రోజులు శిక్షపడిన వారు 51మంది, 35రోజుల శిక్షపడిన వారు ఇద్దరు, 30రోజుల శిక్ష పడిన వారు ఇద్దరు, 3రోజులు 87మంది, 5రోజులు 21మంది, 2రోజులు 34, ఒక్కరోజు జైలు శిక్షపడిన వారు నలుగురు ఉన్నారు. కేసులు పెరుగుతున్నాయి : జిల్లా కేంద్రంలో నిత్యం తనిఖీలు చేయడంతో పాటు డ్రంకెన్‌డ్రైవ్ నిర్వహిస్తున్నాం. అయినా కేసులు పెరుగుతున్నాయి. వాహనదారుల్లో చైతన్యం కలిగించినా మార్పు రావడం లేదు. పట్టుబడిన ప్రతిసారి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎంవీ యాక్టును మరింత కఠినంగా చేయడంతో పాటు తనిఖీలు మరింత పెంచడం జరుగుతుంది. దీంతో పాటు డ్రంకెన్‌డ్రైవ్‌పై ప్రత్యేక దృష్టి పెడుతాం. ప్రతి వాహనదారుడు నిబంధనలు తెలుసుకోవాలి. రోడ్డుపై వాహనం నడిపే సమయంలో వాటిని పాటిస్తే ఎవరికి ఫైన్ కట్టాల్సిన అవసరం ఉండదు. – అమర్నాథ్రెడ్డి, ట్రాఫిక్ సీఐ -
భానుకిరణ్‌కు ఏడాది జైలు
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో ఎం.భానుకిరణ్‌కు నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించింది. భానుకిరణ్ మద్దెలచెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు. అక్రమ ఆయుధాల కేసుకు సంబంధించి భానుతో పాటు రాజశేఖర్‌రెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, డి.వినోద్లకు కూడా ఏడాది జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ బుధవారం కోర్టు తీర్పునిచ్చింది. జరిమానాను చెల్లించని పక్షంలో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని వెల్లడించింది. సూరి హత్య జరగకముందే భాను తదితరులను అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతో 2009 మార్చి 11న సికింద్రాబాద్‌లో బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో వారి నుంచి 8 పిస్తోళ్లు, 12 తపంచాలు, 42 తూటాలు, 12 మ్యాగజైన్లు (తూటాలు పెట్టుకునే కవచం), ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు తీర్పు వెలువరించింది. కాగా మద్దెలచెరువు సూరి హత్య కేసు ఇంకా విచారణ కొనసాగుతోంది. భాను ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు. -
గుండెల్ని కాల్చి తిన్నాడు..!
వాషింగ్టన్: చేసిన పాపం ఊరికే పోదంటారు. లైబీరియా అంతర్యుద్ధంలో వందలాది మందిని పొట్టనపెట్టుకుని అమెరికాకు పారిపోయివచ్చిన ఓ నర హంతకుడి విషయంలో అదే రుజువైంది. ఓ తీవ్రవాద సంస్థకు చెందిన కమాండర్ మొహమ్మద్ జబ్బతెహ్(51) గతాన్ని వెలికితీసిన అమెరికా అధికారులు అతన్ని కటకటాల వెనక్కు నెట్టారు. ఈ కేసు విచారణ సందర్భంగా అతని బాధితులు ఇచ్చిన వాంగ్మూలాలు విన్న న్యాయమూర్తులు సైతం విస్తుపోయారు. లైబీరియా నుంచి విచారణకు హాజరైన ఓ మహిళ(60) జడ్జీల ముందు వాంగ్మూలమిస్తూ.. ‘జంగిల్ జబ్బాగా పేరుగాంచిన మొహమ్మద్ జబ్బతెహ్, అతని సైనికులు మా ఊరిపై 1991లో దాడిచేశారు. నా భర్తతో పాటు, మరిది గుండెల్ని పెకలించి హత్యచేశారు. తర్వాత తినేందుకు వీలుగా ఆ గుండెలను వండాలని ఆదేశించారు’ అని కన్నీటి పర్యంతమయ్యారు. ‘ధైర్యం తెచ్చుకో. వెంటనే మంట రాజేసి ఆ గుండెల్ని వండకుంటే జబ్బతెహ్ నీతో పాటు నన్నూ చంపేస్తాడు’ ఆ దళ సభ్యుడు ఒకరు తనతో చెప్పాడని పేర్కొన్నారు. లైబీరియాలోని ఓ తీవ్రవాద సంస్థకు చెందిన జబ్బతెహ్ అత్యంత కిరాతకుడిగా ముద్రపడ్డాడు. 1991–98 మధ్య చెలరేగిన అంతర్యుద్ధంలో అతని సైనికులు వందలాది మందిని ఊచకోత కోశారు. చిన్నారులను సైనికులుగా మార్చడం, హత్యలు, బహిరంగ అత్యాచారాలు వంటి అకృత్యాలకు పాల్పడ్డారు. అనంతరం 1998లో అమెరికాకు శరణార్థిగా పారిపోయిన జబ్బతెహ్.. అక్కడే వివాహం చేసుకుని ఫిలడెల్ఫియాలో వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు. అయితే అమెరికాలో ప్రవేశించేముందు తన నేర చరిత్రను జబ్బతెహ్ అధికారులకు వెల్లడించలేదు. 2013లో జబ్బతెహ్ గతాన్ని గుర్తించిన హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు.. అప్పట్లో జరిగిన మారణహోమం బాధితుల్ని సాక్షులుగా ప్రవేశపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో పలువురు సాక్షుల్ని విచారించిన ధర్మాసనం.. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన కేసులో జబ్బతెహ్‌ను గతేడాది అక్టోబర్‌లో దోషిగా తేల్చింది. అమెరికా చట్టాలను ఉల్లంఘించిన నేపథ్యంలో జబ్బతెహ్‌కు 30 ఏళ్ల వరకూ జైలుశిక్ష విధించే అవకాశముందనీ, అలాగే అతణ్ని వెంటనే స్వదేశానికి పంపేస్తారని అధికారులు తెలిపారు. కాగా, ఈ కేసులో గురువారం ఇక్కడి కోర్టు జబ్బతెహ్‌కు శిక్ష ఖరారు చేయనుంది. -
ఆర్టీసీ డ్రైవర్‌కు ఆర్నెళ్ల జైలు
నందిపేట్ (ఆర్మూర్): రోడ్డు ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఆర్నెళ్ల జైలుశిక్షతో పాటు రూ.1500 జరిమానా విధిస్తూ ఆర్మూర్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. నందిసేట్ ఎస్సై సంతోష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జోర్పూర్ గ్రామానికి చెందిన ఏడ మహేశ్ తన స్నేహితుడైన బచ్చు రాముతో కలిసి 2015 మార్చి 31న పొలానికి వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన ఆర్మూర్ డిపో బస్సు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా, మహేశ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసు గురువారం విచారణకు రాగా ప్రమాదానికి కారణమైన బస్ డ్రైవర్ మేకల రాజశేఖర్‌కు ఆర్నెళ్ల జైలు శిక్షతో పాటు రూ.1500 జరిమానా విధిస్తూ ఆర్మూర్ మేజిస్ట్రేట్ ఉదయ్‌కుమార్ తీర్పు చెప్పారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ప్రవీణ్ నాయక్, ఇన్వెస్టిగేషన్ అధికారిగా జాన్‌రెడ్డి వ్యవహరించారు. -
బిగ్ బుల్‌కు షాక్: జైలు శిక్ష, జరిమానా
సాక్షి, ముంబై: మాజీ స్టాక్ బ్రోకర్లు కేతన్ పరేఖ్, కార్తీక్ పరేఖ్‌లకు సెబీ ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించింది. స్టాక్ ఎక్స్చేంజ్లో భారీ అక్రమ లావాదేవీలు లాంటి పలు కేసుల్లో నేరస్తుడిగా తేలిన పరేఖ్బ్రదర్స్కు మూడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ. 5 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు సెబీ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. కేతన్, కార్తీక్ డైరెక్టర్లుగా ఉన్న పాంథర్ ఫిన్‌కార్ప్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సెబీ నిబంధనలను వ్యతిరేకంగా షాంక్ టెక్నాలజీస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుంచి పరిమితికి మించి షేర్లను అక్రమంగా కొనుగోలు చేసింది. ఈ ఉల్లంఘనల పై విచారణను 2003 లో పూర్తి చేసిన సెబీ రూ.6.5 లక్షల జరిమానా విధించింది. దీనిపై నిందితులు సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (సాట్)ను ఆశ్రయించారు. అయితే దీన్ని(2007) తోసి పుచ్చడంతో పాటు 45రోజులలోపు ఈ జరిమానాను చెల్లించాల్సిందిగా ఆదేశించింది. అయితే సాట్ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేయక పోవడంతో ఈ కేసు ముగిసిందని సెబీ కోర్టు ప్రకటించింది. అలాగే జరిమానాను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని సెబీని పరేఖ్ బ్రదర్స్‌కు వేడుకున్నారు. ఇది సెబీ నిబంధనలకు విరుద్ధమంటూ ఈ ప్రతిపాదను తోసి పుచ్చింది. పెనాల్టీని చెల్లించకపోవడంతో తదుపరి చర్యలకు సెబీ ఉపక్రమించింది. పలుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ బేఖాతరు చేయడంతో కోర్టుముందు హాజరుకావల్సిందిగా కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే గత నవంబరులో కోర్టుకు హాజరైన కేతన్ పరేఖ్‌ను కస్టడీకి తరిలించగా అప్పటినుంచి జైల్లోనే ఉన్నాడు. దీనిపై విచారించిన సెబీ ప్రత్యేక కోర్టు తాజా తీర్పునిచ్చింది. -
వీఆర్వోకి రెండేళ్ల జైలుశిక్ష!
సాక్షి, విజయవాడ : విజయవాడ ఏసీబీ కోర్టు తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం మండపం వీఆర్వో వెంకటరెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతొ పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. వెంకటరెడ్డి 2015లో రూ.2500 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. వెంకటరెడ్డిని పోలీసులు కోర్టులో హాజరుపరచగా 2015లో రూ.2500 లంచం తీసుకోవడం నిజమేనని కోర్టు నిర్థారించింది. దీంతో వెంకటరెడ్డికి శిక్షను ఖరారు చేస్తూ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. -
బంగ్లా మాజీ ప్రధాని జియాకు జైలు
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, ప్రతిపక్ష నాయకురాలు ఖలీదా జియా(72)కు ఓ అవినీతి కేసులో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. దీంతో డిసెంబర్లో జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీచేయకుండా ఆమె అనర్హతకు గురయ్యే వీలుంది. తన భర్త, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహ్మాన్ జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన అనాథ శరణాలయానికి సేకరించిన విదేశీ నిధులను దుర్వినియోగం చేసిన కేసులో ఢాకా ప్రత్యేక కోర్టు గురువారం ఈ తీర్పు వెలువరించింది. జియా కొడుకు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తారిక్‌నూ దోషిగా తేల్చిన కోర్టు..ఆయనతో పాటు మరో నలుగురికి 10 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం తారిక్ లండన్‌లో అజ్ఞాతంలో ఉన్నారు. దోషులందరికి ఈ కేసులో సమాన పాత్ర ఉన్నా జియా వయసు, సమాజంలో ఉన్న గౌరవం రీత్యా ఆమెకు కాస్త తక్కువ శిక్ష విధిస్తున్నట్లు జడ్జి మహ్మద్ అక్తారుజ్జమాన్ తన తీర్పు ప్రతిలో పేర్కొన్నారు. తాజా తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని జియా తరఫు లాయర్ వెల్లడించారు. తీర్పు రాగానే జియా మద్దతుదారులు, అభిమానులు ఆందోళనలకు దిగి ఢాకాలో పలుచోట్ల హింసకు పాల్పడ్డారు. కోర్టు బయట గుమిగూడిన ఆందోళనకారులను చెదరగొట్టడం పోలీసులకు కష్టమైంది. భారీ భద్రత నడుమ జియాను కేంద్ర కారాగారానికి తరలించారు. ప్రతిపక్ష బీఎన్పీకి అధినేత్రిగా వ్యవహరిస్తున్న ఆమె.. మూడుసార్లు ప్రధానిగా పనిచేశారు. కాగా, అంతకు ముందు జియా తన మద్దతుదారులు, బంధువులకు ధైర్యవచనాలు చెప్పి కోర్టుకు బయల్దేరారు. ‘మీరేం భయపడకండి. ధైర్యంగా ఉండండి. నేను క్షేమంగా తిరిగొస్తా’ అని ఆమె అన్నారు. జియా గతంలో చేసిన పాపాలకు ఫలితంగానే ఈ శిక్ష పడిందని ఆమె ప్రధాన ప్రత్యర్థి, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. -
ముగ్గురికి రెండు యావజ్జీవ కారాగారశిక్షలు..
సాక్షి, అన్నానగర్: దంపతులతో సహా ముగ్గురి హత్య కేసులో అన్న, తమ్ముడు సహా ముగ్గురికి రెండు యావజ్జీవకారాగార శిక్షలు విధిస్తూ తొడుంబుళా కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దిండుక్కల్ జిల్లా అడియాలి నగర్ లా హాస్టల్ నడుపుతూ వచ్చిన కుంజుమహ్మద్ (65), ఇతని భార్య ఆయిషామ్మా (60), అత్త నాచ్చి (85) హత్యకు గురయ్యారు. ఆయిషామ్మా, నాచ్చిల నగలు కనపడలేదు. దీనిపై అడియాలి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అప్పుడు ఆ హాస్టల్లో ఉంటున్న కర్నాటక రాష్ట్రానికి చెందిన రాఘవేంద్ర (23), రాకేష్ గౌడ (26), మంజునాథ్ (21) ముగ్గురు యువకులు నగలు, నగదుకి ఆశపడి వారిని హత్య చేసి పరారైనట్లు తెలిసింది. అనంతరం పోలీసులు వారిని పట్టుకుని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ తొడుబుళా కోర్టులో జరుగుతూ వచ్చింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి శుక్రవారం హత్య కేసులో అరెస్టు అయిన ముగ్గురికి రెండు యావజ్జీవ కారాగారశిక్షలు, తలా రూ.27 వేల 500 జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
బండ్ల గణేష్ కు ఆరునెలల జైలు శిక్ష
-
బండ్ల గణేష్ కు ఆరునెలల జైలు శిక్ష
ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా కూడా విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న గణేష్ కు షరతులతో కూడిన బెయిల్ ను న్యాయస్థానం మంజూరు చేసింది. ఎన్టీఆర్, కాజల్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమాను బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు. చిన్న చిన్న పాత్రలతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్, రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారాడు. తరువాత వరుసగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించి బ్లాక్ బస్టర్ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. -
ఇద్దరు చైన్స్నాచర్లకు జైలు
ఇరగవరం: చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరికి 10 నెలలు జైలు శిక్ష విధించినట్టు ఇరగవరం ఎస్సై జి.శ్రీనివాస్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని ఏలేటిపాడులో రోడ్డుపై నడిచివెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును తూర్పుగోదావరి జిల్లా చిన కాపవరానికి చెందిన వానపల్లి అ య్యప్ప, జిల్లాలోని కడియద్దకు చెందిన పొట్లకర్ల స్వామి లా క్కుపోయారు. ఈ కేసులో నిందితులిద్దరికీ న్యాయమూర్తి జి. వీణ 10 నెలల చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. -
హత్యకేసులో నలుగురికి జీవిత ఖైదు
ఏలూరు (సెంట్రల్): ఆస్తి కోసం ఒంటరిగా ఉన్న మహిళ ఇంటికి నిప్పు పెట్టి హత్య చేసిన కేసులో నలుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాటపర్రు గ్రామంలోని రామాలయం వీధిలో నివాసముండే గంటా పార్వతి అనే మహిళ వెంకట్రావు అనే వ్యక్తిని దత్తత తీసుకుంది. అతడి భార్య సరోజిని అత్త పార్వతిని ఇంటి నుంచి వెళ్లిపోమ్మనగా ఆమె నిరాకరించింది. దీంతో 2013 జనవరి 3న పార్వతి ఇంట్లో ఒంటరిగా ఉండగా సరోజిని, వెంకట్రావు, మరికొందరు కలిసి ఆమె ఇంటికి నిప్పు పెట్టారు. స్థానికులు మంటలను అదుపుచేసి గాయాలైన పార్వతిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పార్వతి మృతిచెందింది. పార్వతి ఫిర్యాదు మేరకు ఏలూరు రూరల్‌స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో గంటా సరోజిని, వెంకట్రావు, చాటపర్రు గ్రామానికి చెందిన అనమిల్లి నాగమణి, వీరవాసరం గ్రామానికి చెందిన కొల్లు వెంకటేశ్వరరావుకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికీ రూ.1,000 జరిమానా విధిస్తూ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి తీర్పు చెప్పారు. -
కట్నం అడిగారు.. జైలుకెళ్లారు..
తణుకు(పశ్చిమగోదావరి జిల్లా): వరకట్నం కేసులో తణుకు కోర్టు తల్లీకొడుకులకు జైలు శిక్ష విధించింది. అదనపు కట్నం తీసుకురమ్మని, మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారనే ఆరోపణలు రుజువు కావడంతో తల్లి, కొడుకులకు ఆర్నెల్లుపాటు జైలుశిక్ష విధిస్తూ తణుకు కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పోలీసుల వివరాల ప్రకారం తణుకు పట్టణానికి చెందిన తిరుబిల్లి రేఖరోహిణి బెంగళూరు పట్టణంలోని హౌరమావు గ్రామానికి చెందిన జోసఫ్ రాజేష్‌లకు ఆరేళ్లక్రితం వివాహం అయ్యింది. కొన్నాళ్ల తర్వాత అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తుండటంతో రేఖరోహిణి పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఏఎస్సై ఆర్.బెన్నిరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న బాధితురాలి భర్త జోసఫ్ రాజేష్, అత్త జోసఫ్ సెలీనాలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టులో వాదోపవాదాలు అనంతరం తణుకు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి.శేషయ్య జోసఫ్ రాజేష్, జోసఫ్ సెలీనాలకు అర్నెల్లు జైలుశిక్షతోపాటు ఒకొక్కరికి రూ. 500 చొప్పున జరిమాన విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమాన చెల్లించని పక్షంలో మరో నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాలని తీర్పుచెప్పారు. -
కట్నం కేసులో తల్లీకొడుకులకు జైలు
తణుకు: అదనపు కట్నం తీసుకురమ్మని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారనే ఆరోపణలు రుజువు కావడంతో తల్లి, కుమారుడికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తణుకు కోర్టు న్యాయమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. తణుకు సీఐ సీహెచ్ రాంబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తణుకుకు చెందిన తిరుబిల్లి రేఖరోహిణికి బెంగళూరుకు చెందిన జోసఫ్ రాజేష్‌తో ఆరు నెలల క్రితం వివాహమైంది. కొన్నాళ్ల తర్వాత అదనపు కట్నం తీసుకురావాలని భర్త వేధిస్తుండటంతో రేఖరోహిణి పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఏఎస్సై ఆర్.బెన్నిరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులుగా ఉన్న బాధితురాలి భర్త జోసఫ్ రాజేష్, అత్త జోసఫ్ సెలీనాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వాదోపవాదాల అనంతరం రాజేష్, సెలీనాకు జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ రూ.500 చొప్పున జరిమానా విధిస్తూ తణుకు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి.శేషయ్య తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో నెల పాటు జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ మణి వాదించగా సీఐ రాంబాబు, ఎస్సై జి.శ్రీనివాసరావు, కోర్టు కానిస్టేబుల్ ఎస్.సంగయ్య సహకరించారు. చీటింగ్ కేసులో నిందితుడికి రెండేళ్లు.. తాడేపల్లిగూడెం రూరల్ : నకిలీ సర్టిఫికెట్తో ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేస్తున్న నేరంపై ఓ వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిందని పట్టణ పోలీసులు సోమవారం తెలి పారు. వివరాలిలా ఉన్నాయి.. చాగల్లు మండలం కూడవల్లి గ్రామానికి చెందిన గుదే వివేకానందస్వామి నకిలీ సర్టిఫికెట్తో తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో ఉద్యోగం సంపాదించాడు. 2014లో అప్పటి డిపో మేనేజర్ మూర్తి ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై కొండలరావు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో వివేకానంద స్వామికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ జడ్జి ఎండీఈ ఫాతిమా తీర్పు చెప్పారని పోలీసులు తెలిపారు. -
హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్తా
విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సాక్షి, విశాఖపట్నం: కోర్టు ఆదేశాల మేరకే జూపిటర్ ఆటోమొబైల్స్ సంస్థకు భవన నిర్మాణం కోసం షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేశామని విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. జీవీఎంసీ కమిషనర్‌గా ఉన్న సమయంలో కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని ప్రవీణ్‌కుమార్‌కు హైకోర్టు 30 రోజుల జైలు శిక్ష, రూ.1,500 జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆదివారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. జూపిటర్ ఆటో మొబైల్స్ సంస్థ భవన నిర్మాణానికి 2009లో దరఖాస్తు చేసిందని, వివిధ కారణాల వల్ల జాప్యం జరగ్గా ఆ సంస్థ కోర్టును ఆశ్రయించిందన్నారు. విశాఖ కలెక్టర్‌కు జైలుశిక్ష ఆ సంస్థకు నాలుగు వారాల్లో అనుమతులు మంజూరు చేయాలని హైకోర్టు 2014 డిసెంబర్లో ఆదేశించిన విషయం వాస్తవమేనన్నారు. అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించకపోవడంతో అనుమతుల మంజూరులో జాప్యం జరిగిందని, అన్ని పత్రాలు సమర్పించిన తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు అనుమతులు మంజూరు చేశామన్నారు. హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్తానని స్పష్టంచేశారు. -
విశాఖ కలెక్టర్‌కు జైలుశిక్ష
సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కార కేసులో గ్రేటర్ విశాఖపట్నం నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పూర్వ కమిషనర్, ప్రస్తుత జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు ఉమ్మడి హైకోర్టు జైలుశిక్ష విధించింది. ఉద్దేశ పూర్వకంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఆయనకు 30 రోజుల సాధారణ జైలుశిక్ష, రూ.1,500 జరిమానా విధించింది. 4 వారాల్లో జరిమానా చెల్లిం చాలని, లేకుంటే మరో నెలపాటు జైలుశిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. దీనిపై అప్పీల్ దాఖలు చేసుకునేందుకు వీలుగా ఈ తీర్పు అమలును 4 వారాల పాటు నిలుపుదల చేసింది. జైలుశిక్ష అనుభవించే సమయంలో ప్రవీణ్ కుమార్‌కు రోజుకు రూ.300 జీవన భృతి కింద చెల్లించాలని అధికారులను ఆదే శించింది. ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఇటీ వల తీర్పు చెప్పారు. విశాఖకు చెందిన జుపిటర్ ఆటోమొబైల్స్ వాల్తేర్ వార్డు లోని ప్లాట్ నంబరు 44లో భవన నిర్మాణం నిమిత్తం జీవీఎంసీకి 2009లో చేసుకున్న దరఖాస్తును జీవీఎంసీ అధి కారులు తిరస్కరించారు. దీన్ని సవాలు చేస్తూ జుపిటర్ ఆటోమొబైల్స్ హైకోర్టులో వేర్వేరు సంవత్సరాల్లో పలు పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై విచారణ జరిపిన జస్టిస్ రామచంద్రరావు.. భవన నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలని ఆదేశిం చినా దరఖాస్తును జీవీఎంసీ అధికారులు తిరస్కరించారు. దీంతో జుపిటర్ జీవీఎంసీ అప్పటి కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. -
ప్రొఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు
హైదరాబాద్: ప్రొఫెసర్ సాయిబాబాకు మహారాష్ట్రలోని గడ్చిరోలి ఓ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఆయనకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని విశ్వసించి ఈ మేరకు తీర్పునిచ్చినట్లు న్యాయస్థానం పేర్కొంది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను గడ్చిరోలి పోలీసులు 2014లో అరెస్టు చేశారు. వికలాంగుడైన ఆయన తీవ్ర అనారోగ్యంగా ఉండడంతో తర్వాత ప్రభుత్వం విడుదల చేసింది. ఆయనపై ఉన్న ఆరోపణలను గడ్చిరోలి న్యాయస్థానం ఇటీవల విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపైనే ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు జేఎన్టీయూ విద్యార్థి హేమ్ మిశ్రా, మాజీ జర్నలిస్టు ప్రశాంత్ రాహి తదితరులకు కూడా ఇదేవిధంగా జీవిత ఖైదు విధించింది. -
భార్యను హత్య చేసిన భర్తకు జీవితఖైదు
ఏలూరు(సెంట్రల్) : అనుమానంతో భార్యను చంపిన భర్తకు జీవితఖైదు విధిస్తూ న్యాయస్థానం శుక్రవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. పెదపాడు మండలం కలపర్రు గ్రామానికి చెందిన కడిమి రమేష్‌కి ఏడేళ్ల క్రితం స్వాతితో వివాహమైంది. అప్పటి నుంచి అనుమానంతో రమేష్ స్వాతిని వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో 2012 జనవరి 1న ఆమె పీక కోసి అతి దారుణంగా చంపేశాడు. దీనిపై స్వాతి బంధువులు ఫిర్యాదు మేరకు పెదపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయస్థానంలో నేరం రుజువు కావడంతో రమేష్‌కు జీవితఖైదు, రూ.6 వేలు జరిమానా విధిస్తూ ఫ్యామీలీ కోర్టు న్యాయమూర్తి సి.రమాదేవి తీర్పు చెప్పారు. -
నకిలీ నోట్ల దోషులకు శిక్ష సబబే..
ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్, బంగ్లాదేశ్ జాతీయులతో కలసి నకిలీ రూ.500, రూ.1,000 నోట్లను పెద్ద ఎత్తున చలామణిలోకి తీసుకొచ్చిన కేసులో పలువురికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును ఉమ్మడి హైకోర్టు సమర్థించింది. ప్రత్యేక కోర్టు శిక్షను సవాల్ చేస్తూ మసూద్ అక్తర్ అన్సారీ, మహ్మద్ షఫీ, షేక్ అక్రమ్ దాఖలు చేసిన క్రిమినల్ అప్పీళ్లను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎంఎస్కే జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. నిందితులు నేరం చేసినట్లు ఎన్ఐఏ నిరూపించగలిగిందని, ప్రత్యేక కోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని జైలుశిక్ష విధించిందని, కాబట్టి అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే నకిలీ నోట్ల చలామణి వెనుక కుట్ర ఉందని మాత్రం నిరూపించలేకపోయారని పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మోర్జన్ హుస్సేన్, రకీబ్ షేక్ మరికొందరు ఓ బృందంగా ఏర్పడి నకిలీ నోట్లను చలామణి చేయాలని నిర్ణయించారు. ఇందుకు వారు పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్ అలియాస్ షేక్ అలియాస్ అన్వర్, బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫ్ షేక్‌తో పాటు దుబాయ్‌లో ఉండే మరికొంత మంది సాయం తీసుకున్నారు. బెంగళూరు నుంచి ఢిల్లీకి పార్శిళ్ల ద్వారా నకిలీ నోట్లను పంపి, అక్కడ తమ బృందంలోని వారితో నోట్లను పంపిణీ చేయించే వారు. రూ.1 లక్ష నకిలీ నోట్లు పంపిణీ చేస్తే, వీరికి రూ.50 వేలు అసలైన నోట్లు ఇచ్చే వారు. మోర్జన్ హుస్సేన్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ జాతీయులతో కలసి నకిలీ నోట్లను చలామణి చేస్తున్న సమాచారం అందుకున్న ఎన్ఐఏ.. వారి ఫోన్ సంభాషణలను కేంద్రం అనుమతితో రికార్డ్ చేసింది. దీంతో హుస్సేన్‌ను బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో 2012లో అరెస్ట్ చేశారు. విచారణలో అతను వెల్లడించిన వివరాల ఆధారంగా మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జాతీయులు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. వీరితో పాటు మొత్తం 28 మందిని నిందితులుగా చేర్చిన ఎన్ఐఏ.. ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. విచారణ అనంతరం నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.1,000 జరిమానా విధిస్తూ 2015లో తీర్పునిచ్చింది. తీర్పును సవాల్ చేస్తూ శిక్ష పడిన వారిలో ముగ్గురు హైకోర్టులో వేర్వేరుగా అదే ఏడాది అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై జస్టిస్ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఏటీఎం రంగరామానుజం.. ఎన్ఐఏ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.విష్ణువర్దన్‌రెడ్డి వాదనలు వినిపించారు. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసేందుకు పాక్ ప్రతీ రోజూ రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు అక్రమ పద్ధతుల్లో నకిలీ నోట్లను దేశంలోకి తీసుకొస్తోందని, ప్రస్తుత కేసులో కూడా నకిలీ నోట్లను చలామణి చేస్తున్నారని, తద్వారా వచ్చిన నిజమైన డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని విష్ణువర్దన్‌రెడ్డి వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థిస్తూ, దోషుల అప్పీళ్లను కొట్టేసింది. -
బాలికను మోసగించిన కేసులో వ్యక్తికి ఏడేళ్ల జైలు
కొయ్యలగూడెం : బాలికను నమ్మించి మోసం చేసిన కేసులో ఓ వ్యక్తికి ఏడేళ్ల కారాగార శిక్షను న్యాయమూర్తి విధించారు. ఎస్సై ఎస్.ఎస్.ఎస్.పవన్‌కుమార్ కథనం ప్రకారం.. కొయ్యలగూడెం గ్రామానికి చెందిన బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఏలేటి దిలీప్‌కుమార్ లైంగికదాడి చేశాడు. ఈ మేరకు బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో వాదోపవాదాల అనంతరం నిందితుడిపై నేరం రజువు కావడంతో జూనియర్ సివిల్ జడ్జి బి.సత్యానందం అతనికి ఏడేళ్ల కారాగార శిక్ష విధించారు. -
అత్యాచారం కేసులో జైలు శిక్ష
హిందూపురం రూరల్ : హిందూపురం రూరల్ మండలం గోళ్లాపురానికి చెందిన దళిత రవి(32)కు అత్యాచారం కేసులో ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ స్థానిక జిల్లా అదనపు సెషన్స్‌కోర్టు జడ్జి జొన్న నాగశేషయ్య గురువారం తీర్పు చెప్పారని ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. గ్రామంలోని బీడీ కొట్టుకు వెళ్లిన నిందితుడు అక్కడ ఎవరూ లేకపోగా, కొట్టులో ఒంటరిగా ఉన్న వివాహితపై 2015 జులై 11న నిందితుడు అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి పోలీసులు కేసు నమోద చేసి దర్యాప్తు చేశారు. నిందితుడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, కేసు పూర్వపరాలు పరిశీలించి నిందితుడికి ఎనిమిదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధించారని పేర్కొన్నారు. -
కారు చోరీ కేసులో ముగ్గురికి జైలు
గణపవరం (నిడమర్రు) : కారు చోరీ కేసులో ముగ్గురికి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించినట్లు సీఐ ఎ¯ŒS.దుర్గాప్రసాద్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం 2016 ఏప్రిల్‌లో గణపవరానికి చెందిన షేక్ సపుల్లా, గంధవరపు బాలాజీ, ఎస్కే గౌస్ బాషా కలిసి భీమవరానికి చెందిన పొదిలి శ్రీరామచంద్రమూర్తి కారును అద్దెకు తీసుకు వెళ్లారు. కేశవరం సమీపంలో కారు డ్రైవర్‌ను కొట్టి ఆ కారును తీసుకు వెళ్లిపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్‌చేసి తాడేపల్లిగుడెం కోర్టులో హాజరుపరచగా.. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ఫస్ట్ ఏజేఎఫ్సీఎం ఎం.వి.ఎ¯ŒS.పద్మజ నిందితులకు రెండేళ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో నెల రోజులు శిక్ష కొనసాగించాలని తీర్పులో పేర్కొన్నారు. -
కారు చోరీ కేసులో ముగ్గురికి జైలు
గణపవరం (నిడమర్రు) : కారు చోరీ కేసులో ముగ్గురికి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించినట్లు సీఐ ఎ¯ŒS.దుర్గాప్రసాద్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం 2016 ఏప్రిల్‌లో గణపవరానికి చెందిన షేక్ సపుల్లా, గంధవరపు బాలాజీ, ఎస్కే గౌస్ బాషా కలిసి భీమవరానికి చెందిన పొదిలి శ్రీరామచంద్రమూర్తి కారును అద్దెకు తీసుకు వెళ్లారు. కేశవరం సమీపంలో కారు డ్రైవర్‌ను కొట్టి ఆ కారును తీసుకు వెళ్లిపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్‌చేసి తాడేపల్లిగుడెం కోర్టులో హాజరుపరచగా.. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ఫస్ట్ ఏజేఎఫ్సీఎం ఎం.వి.ఎ¯ŒS.పద్మజ నిందితులకు రెండేళ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో నెల రోజులు శిక్ష కొనసాగించాలని తీర్పులో పేర్కొన్నారు.