వేధింపుల కేసులో నలుగురికి జైలు
Published Fri, Oct 7 2016 2:15 AM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM
తణుకు అర్బన్ : భార్యను వేధించిన కేసులో భర్తతోపాటు అతని తల్లిదండ్రులకు న్యాయమూర్తి రెండేళ్ల జైలు శిక్ష విధించారు. కోర్టు లైజనింగ్ అధికారి ఆర్.బెన్నిరాజు కథనం ప్రకారం.. 2012లో అత్తిలి గ్రామానికి చెందిన మైపాల రజనీ కుమారి తన భర్త శివప్రసాద్ వేధిస్తున్నాడని, అతనికి అత్తమామలు వెంకటలక్ష్మి, ఉమాపతి, మధ్యవర్తి వెంకటేశ్వరరావు వంత పాడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై నమోదైన కేసుపై కోర్టులో వాదోపవాదాల అనంతరం భర్త, అత్తమామలపై నేరం రుజువు కావడంతో రెండేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ.. మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్రీవిద్య తీర్పు చెప్పారు. మధ్యవర్తి కంబాల వెంకటేశ్వరరావుకు ఏడాది జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించారు.
Advertisement