మార్చి 7న మున్నాభాయ్‌కి విముక్తి | Sanjay Dutt will walk out a free man in March from the Yeravada Central Jail | Sakshi
Sakshi News home page

మార్చి 7న మున్నాభాయ్‌కి విముక్తి

Published Tue, Dec 8 2015 2:53 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మార్చి 7న మున్నాభాయ్‌కి విముక్తి - Sakshi

మార్చి 7న మున్నాభాయ్‌కి విముక్తి

పుణె: మహారాష్ట్ర ఎరవాడ సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ అగ్రనటుడు సంజయ్ దత్‌కు త్వరలోనే విముక్తి లభించనుంది. వచ్చే ఏడాది మార్చి 7న ఆయన జైలు నుంచి విడుదల కానున్నారని అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి. 42 నెలల శిక్షాకాలం పూర్తిచేసుకుని జైలు నుంచి విడుదల అవుతాడని తెలుస్తోంది.18 నెలలు అండర్ ట్రయల్ ఖైదీగానూ సంజయ్ ఉన్నాడు.

1993 ముంబైలో జరిగిన వరుస పేలుళ్ల కేసుకు సంబంధించి అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడని ఆరోపణలపై టాడా చట్టం కింద సంజయ్ దత్ కు జైలుశిక్ష పడిన విషయం అందరికీ విదితమే. శిక్షాకాలంలో తోటి ఖైదీలతో సత్ర్పవర్తనతో మెలిగిన సంజయ్‌ దత్‌ ఇప్పటికే పలుమార్లు పెరోల్‌ మీద బయటకు వచ్చి కుటుంబ సభ్యులతో గడిపారు. బాలీవుడ్ టాప్‌ హీరోల్లో ఒక్కరైన సంజయ్‌దత్ 'మున్నాభాయ్‌ ఎంబీబీఎస్', 'లగేరహో మున్నాభాయ్‌', 'ఖల్‌నాయక్‌' వంటి హిట్‌ సినిమాల్లో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement