Yerawada jail
-
స్టార్ హీరో సినిమాలు మానేస్తున్నాడా..!
న్యూఢిల్లీ: ముంబై బాంబు పేలుళ్ల కేసులో పుణె ఎరవాడ జైలులో శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన బాలీవుడ్ టాప్ హీరో సంజయ్ దత్. ఆయన శనివారం నాడు బాంబు లాంటి వార్త పేల్చారు. ఇకనుంచి తాను ఎవరికోసమూ సినిమా చేయనని చెప్పారు. ఇండియా టుడే కాంక్లేవ్ 2016లో పాల్గొన్న సంజయ్ ఇకపై సినిమాల విషయంలో ఎలా ఉండబోతున్నాడో వివరించాడు. తొలుత ఈ వార్త విన్న వారంతా సంజూ బాయ్ సినిమాలు తీయరేమోనని ఆశ్చర్యపోయారు. అయితే, ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్నారు. తన పిల్లలు ఇఖ్రా, షాహ్రాన్ ల స్కూలు ఫంక్షన్లకు హాజరవుతున్నానని చెప్పాడు. తాను జైలుకు వెళ్లినప్పుడు వారికి కేవలం రెండేళ్లేనని, తాను ఎన్నో వేడుకలలో పాల్గొనలేకపోయానని ఈ సీనియర్ హీరో బాధపడ్డాడు. ఇప్పటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అయితేనే చేయాలని నిర్ణయించుకున్నట్లు క్లారిటీ ఇచ్చాడు సంజయ్. ప్రస్తుతం సిద్ధార్థ ఆనంద్, విధు వినోద్ చోప్రా, మున్నాబాయ్ 3 మూవీ ప్రాజెక్టుల కోసం అగ్రిమెంట్ చేసుకున్నట్లు పేర్కొన్నాడు. అయితే 'మున్నాబాయ్ 3' షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమం అవుతుందని చెప్పుకొచ్చాడు సంజయ్. -
మార్చి 7న మున్నాభాయ్‌కి విముక్తి
పుణె: మహారాష్ట్ర ఎరవాడ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ అగ్రనటుడు సంజయ్ దత్‌కు త్వరలోనే విముక్తి లభించనుంది. వచ్చే ఏడాది మార్చి 7న ఆయన జైలు నుంచి విడుదల కానున్నారని అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి. 42 నెలల శిక్షాకాలం పూర్తిచేసుకుని జైలు నుంచి విడుదల అవుతాడని తెలుస్తోంది.18 నెలలు అండర్ ట్రయల్ ఖైదీగానూ సంజయ్ ఉన్నాడు. 1993 ముంబైలో జరిగిన వరుస పేలుళ్ల కేసుకు సంబంధించి అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడని ఆరోపణలపై టాడా చట్టం కింద సంజయ్ దత్ కు జైలుశిక్ష పడిన విషయం అందరికీ విదితమే. శిక్షాకాలంలో తోటి ఖైదీలతో సత్ర్పవర్తనతో మెలిగిన సంజయ్ దత్ ఇప్పటికే పలుమార్లు పెరోల్ మీద బయటకు వచ్చి కుటుంబ సభ్యులతో గడిపారు. బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒక్కరైన సంజయ్‌దత్ 'మున్నాభాయ్ ఎంబీబీఎస్', 'లగేరహో మున్నాభాయ్', 'ఖల్నాయక్' వంటి హిట్ సినిమాల్లో నటించారు. -
మున్నాభాయ్‌కి భారీ ఊరట!
ముంబై: ప్రస్తుతం ఎరవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కు భారీ ఊరట లభించే అవకాశం కనిపిస్తున్నది. ఆయనను శిక్షాకాలం గడువు కన్నా దాదాపు ఆరు నెలలు ముందే విడుదలే చేసే అవకాశముందని ఓ మహారాష్ట్ర దినపత్రిక తెలిపింది. జైల్లో మున్నాభాయ్ సత్ప్రవర్తనే అందుకు కారణమట. జైలుశిక్షాకాలంలో ఖైదీ సత్ప్రవర్తనతో వ్యవహరిస్తే అతనికి 114 రోజులపాటు శిక్షను తగ్గించే అవకాశముంది. ఈ మేరకు చట్టాల్లో ఉన్న ఓ క్లాజును ఎరవాడ జైలు అధికారులు పరిశీలిస్తున్నారని ఆ పత్రిక తెలిపింది. ఆ క్లాజు ఏం చెప్తోంది..! జైలు నిబంధనలకు సంబంధించిన ఓ క్లాజు ప్రకారం ఖైదీ ప్రవర్తన బాగుంటే అతనికి మూడు రోజులు సెలవు ఇస్తారు. అదేవిధంగా తాను ఎంచుకున్న వృత్తిలో మెరుగైన ప్రదర్శన కనబరిస్తే నాలుగు రోజుల వరకు సెలవు పొందే అవకాశముంది. ఈ లెక్కన ఓ నెలలో ఏడురోజుల వరకు సెలవు పొందవచ్చు. అంతేకాకుండా ఒక ఏడాదికాలంలో ఖైదీ ఆదర్శప్రాయమైన ప్రవర్తన కనబరిస్తే అతనికి 30రోజల వరకు సెలవు ఇవ్వవచ్చు. ఈ సెలవు 30 రోజులా లేక 60 రోజులా లేక 10 రోజులా అన్నది నిర్ణయించే అధికారం జైలు సబ్ సూపర్ వైజర్, చీఫ్ సూపర్ వైజర్, సీనియర్ పోలీసుల అధికారుల చేతిలో ఉంటుంది. మున్నాభాయ్ సత్ప్రవర్తన.. జైలులో అత్యంత బుద్ధిమంతుడిగా ఉంటూ తోటి ఖైదీలతో స్నేహంగా మెలుగుతున్న మున్నాభాయ్ కి నెలకు ఏడు రోజులు, సంవత్సరానికి 30 రోజుల చొప్పున తన ఐదేళ్ల శిక్షాకాలంలో మొత్తం 114 రోజుల సెలవు దొరికే అవకాశముంది. దీంతో శిక్షాకాలం నిర్ణీత గడువు కన్నా దాదాపు ఆరు నెలలముందే సంజయ్ విడుదల కావొచ్చునని భావిస్తున్నట్టు ఆ దినపత్రిక తెలిపింది. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో అక్రమ ఆయుధాలు కలిగిఉన్నాడని ఆరోపణలతో సంజయ్ దత్ కు జైలుశిక్ష పడింది. ఇప్పటికే ఆయన పలుసార్లు పెరోల్ మీద జైలు నుంచి బయటకు వచ్చి కుటుంబసభ్యులతో గడిపారు. -
జైలుకు తిరిగి వెళ్లిన మున్నాభాయ్
ముంబై: 1993నాటి వరుస బాంబు పేలుళ్ల కేసులో పెరోల్ గడువు ముగియడంతో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ పుణెలోని ఎరవాడ జైలుకు తిరిగి వెళ్లారు. భార్య మాన్యతాదత్‌కు చికిత్స చేయించాల్సి ఉండడంతో గతేడాది డిసెంబర్ 21న ఆయన పెరోల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. సంజయ్ శనివారం ముంబైలోని తన నివాసం నుంచి స్నేహితుడు బంటీ వాలియా వెంట రాగా పుణెకు వెళ్లారు. -
ఎర్రవాడ జైల్లో సంజయ్ దత్ కు మద్యం సరఫరా!
1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో పూణేలోని ఎర్రవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్ పై మహారాష్ట్ర కౌన్సిల్ లో బీజేపీ నేత వినోద్ తావ్ డే ఫిర్యాదు చేశారు. ఎర్రవాడ జైలులో సంజయ్ దత్ కు బీరు, రమ్ లాంటి మద్యపానీయాల్ని జైలు సిబ్బంది సరఫరా చేస్తున్నారని వినోద్ ఆరోపించారు. జైలు నిబంధనలకు వ్యతిరేకంగా సంజయ్ దత్ కు జైలు అధికారులు సహకరిస్తున్నారని ఆయన విమర్శించారు. అంతేకాక మహారాష్ట్రలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆయన అన్నారు. అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసులు పెరిగిపోయాయని వినోద్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా భద్రత కల్పించడంపై హోమంత్రి ఆర్ ఆర్ పాటిల్, మంత్రులు సతేజ్ పాటిల్, వర్షా గైక్వాడ్ లు తగిన చర్యలు తీసుకోవాలని విజ్క్షప్తి చేశారు. -
ఎర్రవాడ జైలుకు సంజయ్ దత్!
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పూణే లోని ఎర్రవాడ జైలుకు బుధవారం ఉదయం ముంబైలోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లాడు. 1993 ముంబై పేలుళ్ల కేసులో ఎర్రవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 1 తేదిన 14 రోజుల పెరోల్ పై ఎర్రవాడ జైలు నుంచి విడుదలయ్యారు. ఆతర్వాత మరో పదిహేను రోజులు పొడిగించారు. సంజయ్ దత్ కాలిలో రక్తం గడ్డ కట్టినందున వైద్య పరీక్షల కోసం పెరోల్ పై విడుదల చేశారు. పెరోల్ గడువు పూర్తి కావడంతో ఈ ఉదయం బాంద్రాలోని తన నివాసం నుంచి ఉదయం 6.30 నిమిషాలకు పూణే బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట భార్య మాన్యత ఉన్నారు. కాలి గాయం ఇంకా మానలేదు. 'త్వరలో విడుదల కావాలని దేవుడ్ని ప్రార్ధించాలి అని అభిమానులను కోరారు. పెరోల్ పై ఉన్న కాలంలో వ్యక్తిగత జీవితానికి భంగం కలుగకుండా ఉన్నందుకు మీడియాకు కృతజ్క్షతలు' అని అన్నారు. . అభిమానులకు, ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. -
యెర్వాడ జైలులో ఖైదీ ఆత్మహత్య
పింప్రి, న్యూస్‌లైన్: యెర్వాడ జైలులో ఓ ఖైదీ ఆదివారం సాయంత్రం తనకు తానుగా ఓ పదునైన ఆయుధంతో తీవ్రంగా గాయపర్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ జైలులో ఖైదీ ఆత్మహత్య చేసుకోవడం ఇది రెండవసారి. ఈ సంఘటన విషయమై జైలు అధికారులు అందజేసిన వివరాల ప్రకారం.. జాంబూర్వాడిలోని అంబేగావ్కు చెందిన ప్రహ్లాద్ వామన్ వీర్ జూలైలో కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్యను హత్య చేసి శిక్ష అనుభవిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం జైలులో ప్రత్యక్షంగా చాలా మంది ఖైదీలు చూస్తుండగానే తన వద్ద ఉన్న పదునైన ఆయుధంతో పొడుచుకున్నాడు. ఇది గమనించిన జైలు సిబ్బంది అతడిని వెంటనే జైలు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదిలా ఉండగా యెర్వాడ జైలులో ఏడాది క్రితం శిక్ష అనుభవిస్తున్న ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన సిద్ధిక్‌ను శరత్ మోహలే అనే ఖైదీ హత్య చేయగా, నాలుగు నెలల క్రితం ఒక ఖైదీ టవల్‌తో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
సంజయ్ దత్ స్టేజి షో వాయిదా
ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఎరవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ హీరో సంజయ్ దత్ గురువారం నిర్వహించాల్సిన ప్రదర్శన వాయిదా పడింది. జైలు సిబ్బందికి నిధులు సేకరించాలనే తలంపుతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కాగా భద్రత కారణాల రీత్యా జైలు అధికారులు వాయిదా వేశారు. కొన్ని రోజుల తర్వాత స్టేజి షో ఉంటుందని మహారాష్ట్ర జైళ్ల శాఖ చీఫ్ మీరన్ బోర్వాన్కర్ తెలిపారు. తేదీని త్వరలో ప్రకటించనున్నట్టు చెప్పారు. ఐతే భద్రత కారణాలకు సంబంధించి వివరాలు వెల్లడించలేదు. బలందర్వా ఆడిటోరియంలో నిర్వహించదలచిన ఈ షోను తిలకించేందుకు అభిమానులు అమితాసక్తి చూపారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ కూడా వస్తారని భావించారు. సంజయ్ దత్ తాను నటించిన మున్నాభాయ్ సినిమాలోని సన్నివేశాలతో పాటు పాటలకు డాన్స్ చేయనున్నాడు. -
పూణే ధియేటర్ లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రదర్శన!
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేందుకు రంగం సిద్ధమవుతోంది. 1993లో ముంబై నగరంలో జరిగిన పేలుళ్ల కేసులో పూణేలోని ఎర్రవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్.. నిధుల సేకరణ కోసం సెప్టెంబర్ 26 తేదిన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొననున్నట్టు జైలు అధికారులు తెలిపారు. జైళ్ల శాఖ సిబ్బంది సంక్షేమానికి చేపట్టిన నిధుల సేకరణ కోసం బల్గంధర ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో సంజయ్ దత్ పాల్గొననున్నాడని జైలు సూపరింటెండెంట్ యోగేశ్ దేశాయ్ తెలిపారు. రెండుగంటలపాటు జరిగే కార్యక్రమం కోసం ఎంపిక చేసిన ఖైదీల్లో సంజయ్ దత్ ఒకరని జైలు అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే కళాకారులకు భారీ భద్రతను ఏర్పాటు చేసామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్, హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ లు పాల్గొననున్నారని జైలు అధికారులు తెలిపారు. -
పెరోల్‌పై సంజయ్‌దత్ విడుదలయ్యే అవకాశం!
1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో పూణేలోని ఎర్రవాడ జైలులోశిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ పెరోల్‌పై విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ఎర్రవాడ జైలు అధికారులు వెల్లడించారు. వైద్య చికిత్స కోసం 20 రోజుల క్రితమే పిటిషన్ దాఖలు చేయగా, సంజయ్‌దత్ పెరోల్ పిటిషన్ ను పరిశీలిస్తున్నట్టు జైలు సూపరింటెండెంట్ యోగేష్ దేశాయి తెలిపారు. అయితే సంజయ్ ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నరనే వివరాలను వెల్లడించడానికి యోగేష్ నిరాకరించారు. సంజయ్‌దత్ పిటిషన్ డివిజినల్ కమిషనర్‌కు పంపామని వెల్లడించారు. సంబంధిత అధికారుల నుంచి నివేదిక అందిన తర్వాతనే సంజయ్‌దత్ బెయిల్ విడుదలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పెరోల్‌పై విడుదల చేసే సమయంలో, జైలులో సంజయ్ దత్ ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఏడాదిన్నర శిక్షాకాలం పూర్తి చేసుకున్న సంజయ్‌దత్ మరో 42 నెలల శిక్షాకాలాన్ని పూర్తి చేయడానికి పూణేలోని ఎర్రవాడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.