పెరోల్‌పై సంజయ్‌దత్ విడుదలయ్యే అవకాశం!
1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో పూణేలోని ఎర్రవాడ జైలులోశిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ పెరోల్‌పై విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ఎర్రవాడ జైలు అధికారులు వెల్లడించారు. వైద్య చికిత్స కోసం 20 రోజుల క్రితమే పిటిషన్ దాఖలు చేయగా, సంజయ్‌దత్ పెరోల్ పిటిషన్ ను పరిశీలిస్తున్నట్టు జైలు సూపరింటెండెంట్ యోగేష్ దేశాయి తెలిపారు.
అయితే సంజయ్ ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నరనే వివరాలను వెల్లడించడానికి యోగేష్ నిరాకరించారు. సంజయ్‌దత్ పిటిషన్ డివిజినల్ కమిషనర్‌కు పంపామని వెల్లడించారు. సంబంధిత అధికారుల నుంచి నివేదిక అందిన తర్వాతనే సంజయ్‌దత్ బెయిల్ విడుదలపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
పెరోల్‌పై విడుదల చేసే సమయంలో, జైలులో సంజయ్ దత్ ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఏడాదిన్నర శిక్షాకాలం పూర్తి చేసుకున్న సంజయ్‌దత్ మరో 42 నెలల శిక్షాకాలాన్ని పూర్తి చేయడానికి పూణేలోని ఎర్రవాడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.