ఎర్రవాడ జైల్లో సంజయ్ దత్ కు మద్యం సరఫరా!
1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో పూణేలోని ఎర్రవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్ పై మహారాష్ట్ర కౌన్సిల్ లో బీజేపీ నేత వినోద్ తావ్ డే ఫిర్యాదు చేశారు. ఎర్రవాడ జైలులో సంజయ్ దత్ కు బీరు, రమ్ లాంటి మద్యపానీయాల్ని జైలు సిబ్బంది సరఫరా చేస్తున్నారని వినోద్ ఆరోపించారు. జైలు నిబంధనలకు వ్యతిరేకంగా సంజయ్ దత్ కు జైలు అధికారులు సహకరిస్తున్నారని ఆయన విమర్శించారు.
అంతేకాక మహారాష్ట్రలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆయన అన్నారు. అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసులు పెరిగిపోయాయని వినోద్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా భద్రత కల్పించడంపై హోమంత్రి ఆర్ ఆర్ పాటిల్, మంత్రులు సతేజ్ పాటిల్, వర్షా గైక్వాడ్ లు తగిన చర్యలు తీసుకోవాలని విజ్క్షప్తి చేశారు.