పూణే ధియేటర్ లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రదర్శన!
పూణే ధియేటర్ లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రదర్శన!
Published Thu, Sep 5 2013 9:48 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేందుకు రంగం సిద్ధమవుతోంది. 1993లో ముంబై నగరంలో జరిగిన పేలుళ్ల కేసులో పూణేలోని ఎర్రవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్.. నిధుల సేకరణ కోసం సెప్టెంబర్ 26 తేదిన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొననున్నట్టు జైలు అధికారులు తెలిపారు.
జైళ్ల శాఖ సిబ్బంది సంక్షేమానికి చేపట్టిన నిధుల సేకరణ కోసం బల్గంధర ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో సంజయ్ దత్ పాల్గొననున్నాడని జైలు సూపరింటెండెంట్ యోగేశ్ దేశాయ్ తెలిపారు. రెండుగంటలపాటు జరిగే కార్యక్రమం కోసం ఎంపిక చేసిన ఖైదీల్లో సంజయ్ దత్ ఒకరని జైలు అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే కళాకారులకు భారీ భద్రతను ఏర్పాటు చేసామని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్, హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ లు పాల్గొననున్నారని జైలు అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement