జై బోలో గణేశ్‌ మహారాజ్‌కి...జై! | bollywood actors vinayaka chavithi celebrations | Sakshi
Sakshi News home page

జై బోలో గణేశ్‌ మహారాజ్‌కి...జై!

Published Sun, Sep 16 2018 12:22 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

bollywood actors vinayaka chavithi celebrations - Sakshi

మాధురీ దీక్షిత్‌, తమన్నా

పండగ రోజు షూటింగ్‌లకు కాస్త గ్యాప్‌ ఇచ్చి వినాయక చవితి సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా జరుపుకున్నారు బాలీవుడ్‌ సినీ తారలు. ఇంట్లో పండగ చేసుకుని ఇరుగింటికి పొరుగింటికి కూడా వెళ్లారు. ఈ తొమ్మిది రోజులూ బాలీవుడ్‌లో ఇలా సందడి సందడిగా ఉంటుంది. సల్మాన్‌ ఖాన్‌ సోదరి అర్పితా ఖాన్‌ అయితే ఘనంగా పూజా కార్యకమాలు ఏర్పాటు చేసి, ఇండస్ట్రీ ప్రముఖులను ఆహ్వానించారు.

కత్రినా కైఫ్, ఆమె చెల్లి ఇసబెల్లా కైఫ్, సంజయ్‌దత్, ఆయన సతీమణి మాన్యతా దత్, సోహా అలీఖాన్, సల్మాన్‌ ప్రేయసి లూలియా వంటూర్, షారుక్‌ ఖాన్, ఆయన సతీమణి గౌరీ ఖాన్‌.. ఇలా చాలా మంది స్టార్స్‌ అర్పితాఖాన్‌ అండ్‌ ఆయుష్‌ శర్మల ఇంటి వినాయకుడ్ని సందర్శించారు. ఈ ప్రముఖులు కొన్ని కెమెరా కళ్లకు చిక్కారు. ఇక ఇక్కడే ఉన్న ఫొటోలో చూశారుగా గణేశ్‌ మహరాజ్‌ని మాధురీ దీక్షిత్‌ ఎంత భక్తిగా ప్రార్థిస్తున్నారో. ప్రతి ఏడాదిలానే శిల్పా శెట్టి తన భర్త రాజ్‌ కుంద్రాతో కలసి స్వయంగా మార్కెట్‌కి వెళ్లి వినాయకుడ్ని కొని తెచ్చారు. నిమజ్జనం రోజున ఆమె చేసే సందడి మామూలుగా ఉండదు. క్రేజీ స్టార్స్‌ తమన్నా, శ్రద్ధాకపూర్‌లను చూస్తున్నారా? నవ్వులు చిందిస్తూ పూజ చేస్తున్నారు.

మరో బ్యూటీ సోనమ్‌ కపూర్‌కి పెళ్లయ్యాక వచ్చిన తొలి వినాయక చవితి ఇది. ఆమె కూడా ఘనంగా జరుపుకున్నారు. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ గాళ్‌ కంగనా రనౌత్‌ సెలబ్రేషన్స్‌లో మాత్రం వెనక్కు తగ్గుతారా? తన సోదరి రంగోలి రనౌత్‌ కొడుకుతో కలిసి హ్యాపీ వినాయక చవితి చెప్పారు. అలాగే సెన్సేషనల్‌ స్టార్‌ సన్నీ లియోన్‌ ఇంట్లో కూడా పండగ వాతావరణం వచ్చింది. ఇక్కడున్న ఫొటోలో ఆమె భర్త డానియల్, సన్నీల దత్త పుత్రిక నిషాలను చూడొచ్చు. ఇదే రేంజ్‌లో షారుక్‌ఖాన్, అనుష్కా శర్మ.. ఇలా మరెందరో బాలీవుడ్‌ తారలు పండగని ఘనంగా జరుపుకున్నారు. బచ్చన్‌ ఫ్యామిలీని మరచిపోతే ఎలా? ఆ ఇంటి పండగ సందడి కూడా బ్రహ్మాండంగా వినిపించిందని బాలీవుడ్‌ టాక్‌.


సోదరి తనయుడితో కంగనా రనౌత్‌; భర్త రాజ్‌ కుంద్రా, తనయుడు వియాన్‌తో శిల్పా


శ్రద్ధాకపూర్‌


దత్త పుత్రిక, భర్తతో సన్నీ


 కత్రినా, ఇసబెల్లా, ; చెల్లి ఇంటి దారిలో సల్మాన్‌...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement