ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కొవిడ్ నాటి పరిస్థితుల నేపథ్యంలో ది వ్యాక్సిన్ వార్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే తాజాగా ఆయన చేసిన కామెంట్స్ బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లో అతను చేసే పాలిటిక్స్ తనకు నచ్చవని విమర్శలు చేశారు. కానీ నేను కూడా షారుక్ అభిమానినే అని ప్రస్తావించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన స్టార్ హీరోపై విమర్శలు చేయడంపై బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. షారూక్ రాజకీయాలు చేయడం వల్ల బాలీవుడ్ ప్రతిష్ఠ మసకబారిందన్నారు.
(ఇది చదవండి: రజనీకాంత్ నా కుటుంబానికి ఎంతో సాయం చేశాడు: కన్నడ సూపర్ స్టార్)
వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ..' నేను కూడా షారుక్‌కు అభిమానినే. ఆయనకు చరిష్మా ఉంది. కానీ అతను చేసే రాజకీయాలే నాకు నచ్చవు. ఇలాంటి వారి వల్ల బాలీవుడ్‌కు చెడ్డ పేరు వస్తుంది. అయితే వీళ్లు స్టార్‌డమ్ లేకుండా దేన్నీ అంగీకరించరు. ప్రేక్షకులకు ఏమీ తెలియదని భావిస్తారు. నేను కేవలం ప్రజలకు నచ్చే సినిమాలు తీస్తా. కానీ వాళ్లు బాక్సాఫీస్ కలెక్షన్ల కోసమే సినిమాలు తీస్తారు. ఏదైనా మూవీ హిట్ అయితే.. అది షారుక్ సక్సెస్ అంటారు. కానీ నా చిత్రాలు హిట్ అయితే ప్రేక్షకుల విజయంగా భావిస్తా. మాది భిన్న వైఖరి అయినప్పటికీ.. షారుక్‌తో సినిమా తీయడానికి కూడా నేను సిద్ధం.' అని అన్నారు. మరో వైపు డైరెక్టర్ కరణ్ జోహార్‌పై విమర్శలు చేశారు.
ముఖ్యంగా స్టార్ డమ్‌ను అతిగా కీర్తించడం వెనుక కరణ్ జోహార్ ఉన్నాడని వివేక్ ఆరోపించారు. అతను మధ్యతరగతి నుంచి వచ్చిన ప్రతిభావంతుల ఎదుగుదలను అడ్డుకుంటున్నాడని విమర్శలు చేశారు. కరణ్ కేవలం స్టార్ సిస్టమ్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే మరోవైపు షారుక్ ఖాన్‌పై కామెంట్స్ చేయడాన్ని నెటిజన్స్ తప్పుబడుతున్నారు. ఈ కామెంట్స్‌కు వ్యతిరేకంగా చాలామంది కౌంటర్ అటాక్ చేస్తున్నారు. మిస్టర్ కంగనా అంటూ విమర్శలు చేస్తున్నారు. అగ్నిహోత్రి ఓ మానసిక రోగి అంటూ పోస్టులు పెడుతున్నారు.
(ఇది చదవండి: మరో హిట్‌కు సిద్ధమైన ఆదాశర్మ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!)
Comments
Please login to add a commentAdd a comment