బాలీవుడ్ బుల్లితెర నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ మరణంపై ప్రముఖ నిర్మాత, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి విచారం వ్యక్తం చేశారు. ఎలాంటి వైద్యుల సూచనలు పాటించకపోవడమే దీనికి కారణమని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. శారీరక ధృడత్వం సాధించాలనే పిచ్చి వల్లే ఇలా జరుగుతోందన్నారు. దీనికంతటికి మరో కారణం ఇన్‌స్టాగ్రామ్ పిచ్చి అంటూ సూర్యవంశీ మృతిపై వివేక్ మాట్లాడారు.
వివేక్ ట్వీట్ చేస్తూ, “ఇది చాలా విషాదకరం. ఎటువంటి వైద్య సలహా లేకుండా బాడీని పెంచుకోవాలనే పిచ్చి హడావిడి చాలా ప్రమాదకరం. హైపర్-జిమ్మింగ్ అనేది మంచిది కాదు. దీనికి ఇన్‌స్టాగ్రామ్ పిచ్చి కూడా ఒక కారణం. కచ్చితంగా దీన్ని నియంత్రించాలి. దీనిపై సమాజం పునరాలోచించుకోవాలి. ఓహ్ సిద్ధాంత్ ఓం శాంతి.' అంటూ రాసుకొచ్చారు.
గతంలో హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ జిమ్‌లో పని చేస్తున్నప్పుడే గుండెపోటు రావడంతో దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అతను సెప్టెంబర్ 21న మరణించారు. తాజాగా ఇప్పుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ 46 ఏళ్ల వయసులోనే జిమ్‌లో కసరత్తులు చేస్తూ కన్నుమూశారు.
This so tragic & sad.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) November 11, 2022
The mad rush to build aggressive body, without any medical advise is so dangerous. Hyper-Gymming is a relatively new phenomenon which got mad impetus due to Instagram. It needs to be regulated for sure. Society needs to rethink.
Oh, Siddhanth… ॐ शांति। pic.twitter.com/bK0kDA8gIG
Comments
Please login to add a commentAdd a comment