Parineeta Director Pradeep Sarkar Passes Away At 68 - Sakshi
Sakshi News home page

Pradeep Sarkar : ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి

Published Fri, Mar 24 2023 10:08 AM | Last Updated on Fri, Mar 24 2023 10:32 AM

Parineeta Director Pradeep Sarkar Passes Away At 68 - Sakshi

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు ప్రదీప్‌ సర్కార్‌(68)కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమశారు. ఈ విషయాన్ని ఆయన బంధువు, నటి నీతు చంద్ర శ్రీవాత్సవ వెల్లడించారు.

పరిణీత, లగా చునారీ మే దాగ్, మర్దానీ, హెలికాప్టర్ ఈలా వంటి సూపర్ హిట్ చిత్రాలకు ప్రదీప్ దర్శకత్వం వహించారు.ప్రదీప్ మృతి విషయాన్ని ఆయన సోదరి మాధురి కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ప్రదీప్ దాదా మృతిని జీర్ణించుకోలేకపోతున్నాననంటూ బాలీవుడ్ అగ్రనటుడు అజయ్ దేవగణ్ విచారం వ్యక్తం చేశారు. ప్రదీప్‌ సర్కార్‌ మృతి పట్ల పలవురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement