pradeep
-
గుర్రంపై ఊరేగుతూ ప్రాణాలొదిలిన పెళ్లికొడుకు
ష్యోపూర్(ఎంపీ): పెళ్లి సంబరాల్లో మునిగితేలుతున్న ఓ పెళ్లికొడుకు హఠాన్మరణం అక్కడి వారందరినీ హుతాశులను చేసింది. మధ్యప్రదేశ్‌లోని ష్యోపూర్ జిల్లాలో పెళ్లివేడుకలో ఈ విషాదం చోటుచేసుకుంది. పెళ్లి సందర్భంగా గుర్రంపై ఊరేగుతూ శుక్రవారం రాత్రి వరుడు విగతజీవిగా మారిన వైనం శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూన్స్‌వాడా గ్రామానికి చెందిన 26 ఏళ్ల ప్రదీప్ జాట్ పెళ్లివేడుక శుక్రవారం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా అక్కడి వేదికవైపు ప్రదీప్ పెళ్లికొడుకు దుస్తుల్లో గుర్రంపై బయల్దేరారు. ఇదే సమయంలో హఠాత్తుగా ముందుకు ఒరిగి అలాగే గుర్రంపై కూలబడిపోయారు. ఇది గమనించిన బంధువులు వెంటనే ప్రదీప్‌ను జాగ్రత్తగా కిందకు దింపి హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతని ప్రాణం పోయిందని జిల్లా ఆస్పత్రి సివిల్ సర్జన్ డాక్టర్ ఆర్బీ గోయల్ ధృవీకరించారు. గుండెపోటు కారణంగా పెళ్లికొడుకు ప్రాణాలు కోల్పోయి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. పెళ్లికొడుకు ప్రదీప్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ)కి ష్యోపూర్ జిల్లా అధ్యక్షునిగా గతంలో పనిచేశారు. -
ఆన్లైన్ నుంచి అక్షింతల దాకా
ప్రేమను.. పెళ్లితో స్థిరపరచేది అదే! అయితే దానికి బాటలు వేసేవి మాత్రం పరస్పర నమ్మకం, గౌరవాలే! అలాంటి లవ్ స్టోరే ఇది! దాదాపు ఏడేళ్లపాటు ఒకరినొకరు చూసుకోకుండా పెళ్లితో ప్రేమను గెలిపించుకున్న ఆ జంటలోని అమ్మాయి.. రైతా, ఫిన్లండ్. అబ్బాయి .. ప్రదీప్, హైదరాబాద్. ప్రేమకథా కాలం.. 1997.. స్కూలింగ్ పూర్తి చేసుకున్న రైతా ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో ఇంగ్లిష్ భాషను నేర్చుకుంటోంది. ఫ్లూయెన్సీ కోసం యాహూ చాట్‌లో చాటింగ్ స్టార్ట్ చేసింది. ఆన్లైన్లో ఒకరోజు ప్రదీప్ పరిచయం అయ్యాడు. సంభాషణలో ఆధ్యాత్మికం, తాత్వికం, మతపరమైన అంశాల నుంచి సామాజిక, రాజకీయ, పర్యావరణ విషయాలు, ప్రపంచ పౌరుల బాధ్యతలు వంటి వాటి మీద ప్రదీప్కున్న అవగాహనకు రైతా ముచ్చటపడింది. ప్రదీప్‌కూ రైతా పట్ల అదే భావన. నెమ్మదిగా స్నేహం పెరిగింది. వ్యక్తిగత వివరాలను పంచుకున్నారు. ప్రదీప్‌కి రైతా మీద ప్రేమ మొదలైంది. అప్పటికీ ఆ ఆన్లైన్ స్నేహం వయసు నాలుగేళ్లు. అప్పట్లో వెబ్కామ్స్ లేవు.. కాబట్టి ఒరినొకరు చూసుకోలేదు. కనీసం ఫొటోలు కూడా ఎక్సే ్చంజ్ చేసుకోలేదు. ఒక రోజు ప్రదీప్ మెయిల్ పెట్టాడు ‘రకస్తాన్ సినువా (నువ్వంటే ఇష్టం).. నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని. సంభ్రమాశ్చర్యాలు రైతాకు. ఎందుకంటే ఫిన్లండ్ లో అంత త్వరగా ఎవరూ పెళ్లి ప్రపోజల్ తీసుకురారు. అలాంటిది అబ్బాయి కనీసం తనను చూడనైనా చూడకుండా పెళ్లికి ప్రపోజ్ చేశాడు అని! ఓకే చెప్పింది. ఇద్దరిళ్లల్లో విషయం చెప్పేశారు. ప్రదీప్ జాతకంలో విదేశీ పిల్లే రాసి ఉందని, అదే జరగబోతోందని అతని తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పలేదు. కానీ రైతా వాళ్లింట్లోనే ఒప్పుకోలేదు. కారణం అక్కడ మీడియా లో ఇండియా గురించి ఉన్న వ్యతిరేక ప్రచారమే! వాళ్లను ఒప్పించే ప్రయత్నంలో.. ప్రదీప్‌ను చూస్తే ఒప్పుకుంటారు అన్న ఆశతో‘ఫిన్లండ్ రండి’ అంది రైతా. వెంటనే వీసాకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే వీసా‘రిజెక్టయ్యింది. దాంతో‘నేనే హైదరాబాద్ వస్తాను’ అంటూ అభయమిచ్చింది రైతా! ‘ఎయ్ (.. వద్దు)’ అన్నారు ఆమె తల్లిదండ్రులు. ‘మిక్సీ (ఎందుకు)?’ అడిగింది అమ్మాయి. ‘ఇండియా సేఫ్ కాదు’ స్పష్టం చేశారు. వాదించింది రైతా. అయినా ఒప్పుకోలేదు తల్లిదండ్రులు. ఈసారి ప్రదీప్ యూకేలో చదువును బహానా (సాకు)గా మలచుకున్నాడు. వీసా ఓకే అయింది. యూకే నుంచి తేలిగ్గానే ఫిన్లండ్కి వీసా దొరికింది. రైతా ఆనందానికి అవధుల్లేవు. పరిచయం అయిన ఏడేళ్లకు ఒకరినొకరు చూసుకోబోతున్నారు. ఆ క్షణం రానేవచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నాక ఇంకా నచ్చారు! రైతా తల్లిదండ్రులకూ నచ్చాడు ప్రదీప్! కానీ అమ్మాయి అక్కడికి వెళ్లి ఉండగలదా? అప్పటికీ ఇండియా మీద ఇంకా సానుకూలమైన అభి్రపాయానికి రాలేదు వాళ్లు. ‘ఉంటాను’ ధైర్యం చెప్పింది. ట్రయల్ గా హైదరాబాద్‌ను విజిట్ చేసింది కూడా! ఇక్కడి సోషల్ లైఫ్‌ను ఇష్టపడింది. ప్రదీప్ తల్లిదండ్రులకూ రైతా చాలా నచ్చింది. రైతా కుటుంబం కూడా హైదరాబాద్ వచ్చి, ప్రదీప్ కుటుంబాన్ని కలిసింది. అలా ఏడేళ్ల వాళ్ల ప్రేమ ఇరు కుటుంబ సభ్యుల ఆమోదం, ఆశీర్వాదంతో ఏడడుగుల బంధమైంది. వాళ్ల పెళ్లికిప్పుడు ఇరవై ఏళ్లు. నలుగురు పిల్లలు. ప్రదీప్ కోసం రైతా శాకాహారిగా మారింది. తెలుగు నేర్చుకుంది. ప్రదీప్ జీవితంలోనే కాదు బిజినెస్‌లోనూ భాగస్వామైంది. ప్రదీప్ ఫీనిష్ నేర్చుకున్నాడు. తన కోసం ఆమె చేసుకున్న, చేసుకుంటున్న సర్దుబాట్లను అతను గుర్తిస్తాడు. అమె అభి్రపాయాలను గౌరవిస్తాడు. రైతా తల్లిదండ్రులు తన కూతురు చాలా అదృష్టవంతురాలని పొంగిపోతారు. ‘‘మేమొక మాట అనుకున్నాం.. పెళ్లనే గొప్ప బంధంలోకి అడుగుపెడుతున్నాం. మనమధ్య వచ్చే ఏ తగవైనా మన రిలేషన్‌షిప్‌ని మరింత స్ట్రాంగ్ చేయాలి తప్ప వీక్ చేయకూడదు అని. దాన్నే ఆచరిస్తున్నాం!’ అని చెబుతోంది రైతా. – సరస్వతి రమ -
పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్
గతేడాది బిగ్‌బాస్ 7 తమిళ సీజన్లో పాల్గొన్న ప్రదీప్ ఆంటోని వివాదానికి కారణమయ్యాడు. తనతో పాటు హౌసులోకి వచ్చిన లేడీ కంటెస్టెంట్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో రెడ్ కార్డ్ జారీ చేసి, షో నుంచి అర్థాంతరంగా బయటకు పంపేశారు. ఈ సీజన్లో తిరిగి పాల్గొంటాడని అన్నారు. కానీ అది రూమర్ అని తేలిపోయింది. ఇప్పుడు ఇతడు పెళ్లి చేసుకున్నాడు.(ఇదీ చదవండి:'పుష్ప 2' కోసం తమన్.. 'కాంతార' మ్యూజిక్ డైరెక్టర్ కూడా)గత కొన్నాళ్లుగా పూజ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న ప్రదీప్ ఆంటోని.. జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇప్పుడు గురువారం (నవంబర్ 7) క్రిస్టియన్ పద్ధతిలో పూజని పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని తోటి బిగ్‌బాస్ కంటెస్టెంట్ సురేశ్ చక్రవర్తి పోస్ట్ చేశాడు. కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పుకొచ్చాడు. డాడా, అరువి, వాళ్ తదితర సినిమాలు చేసిన ప్రదీప్ ఆంటోని.. ఇప్పుడిప్పుడే నటుడిగా నిలదొక్కుకుంటున్నాడు.ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బిగ్ బాస్ 8వ సీజన్ నడుస్తోంది. తెలుగులో ఎప్పటిలానే నాగార్జున హోస్టింగ్ చేస్తుండగా.. తమిళంలో మాత్రం ఈసారి కమల్ హాసన్ తప్పుకొన్నాడు. దీంతో విజయ్ సేతుపతి కొత్త హోస్ట్‌గా వచ్చాడు. దాదాపు 70 రోజులు అయిపోయినా సరే తెలుగు సీజన్ అంతంత మాత్రంగానే సాగుతోంది. తమిళంలో పర్లేదనిపించేలా నడుస్తోంది.(ఇదీ చదవండి: హైదరాబాద్‌లోని హనుమాన్ గుడిలో జాన్వీ ప్రత్యేక పూజలు) -
నేలకేసి కొట్టి పసికందు హత్య
చిత్తూరు రూరల్: ఏడాదిన్నర పసికందును తండ్రే నేలకేసి కొట్టి చంపిన ఉదంతం చిత్తూరు మండలం దిగువ మాసాపల్లిలో శనివారం వెలుగుచూసింది. బీఎన్ఆర్ పేట ఎస్ఐ వెంకట సుబ్బమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. తవణంపల్లి మండలం మాధవరం సమీపంలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన ఓ మహిళకు ఐరాల మండలం జంగాలపల్లికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. మూడేళ్ల క్రితం భర్త వదిలేయడంతో ఆమె చిత్తూరు జిల్లా దిగువ మాసాపల్లికి వచ్చి ప్రదీప్ (34) అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ నేపథ్యంలో వారికి ఏడాదిన్నర క్రితం కుమారుడు పుట్టాడు. కాగా.. ఆ మహిళ ఇటీవల దిగువ మాసాపల్లిలోనే ఓ కోళ్లఫారంలో పనికి కుదిరింది. కాగా.. ప్రదీప్ శుక్రవారం మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో పసికందు ఏడుస్తుండటంతో బిడ్డను నేలకేసి కొట్టి చంపేశాడు. ఆ తరువాత తేరుకుని ఇంటిపై నుంచి పడి బిడ్డ మృతి చెందాడని చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. బంధువులకు అనుమానం రావడంతో మహిళ సోదరుడు బీఎన్ఆర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి.. పసికందు మరణానికి కారణమైన తండ్రి ప్రదీప్‌ను అరెస్ట్ చేశారు. -
ప్రియురాలితో సింపుల్‌గా నటుడి ఎంగేజ్మెంట్
తమిళ బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటుడు ప్రదీప్ ఆంటోని పెళ్లికి రెడీ అయ్యాడు. ప్రియురాలితో ఏడడుగులు వేయనున్నాడు. ఈ మేరకు ఆదివారం (జూన్ 16న) అతడి నిశ్చితార్థం కూడా జరిగింది. ఇరు కుటుంబాలు సహా అత్యంత దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో ఈ ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రదీప్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.కాగా ప్రదీప్ ఆంటోని తమిళ బిగ్‌బాస్ ఏడో సీజన్‌తో పాపులర్ అయ్యాడు. ముక్కుసూటిగా మాట్లాడేవాడు. అయితే ఆ ధోరణి చాలామందికి నచ్చేది కాదు. తన కుళ్లు జోకులు కూడా బిగ్‌బాస్ హౌస్‌లో కొందరు ఇష్టపడలేదు. అసభ్య జోకులు వేస్తున్నాడని, బూతులు మాట్లాడుతున్నాడని, తన ప్రవర్తన బాగోలేదని మాయ, పూర్ణిమ, జోవిక, నిక్సెన్, కూల్ సురేశ్, శరవణ విక్రమ్, అక్షయ వంటి పలువురు కంటెస్టెంట్లు బిగ్‌బాస్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కమల్ హాసన్ రెడ్ కార్డు చూపించి తనను బయటకు పంపించేశారు. సినిమాల విషయానికి వస్తే దాదా, అరువి, వాళ్ వంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్నాడు. Got engaged, yesterday 🙏 #FamilyMan#EnakulaamNadakathuNuNinaichen #ParavaillaPonnuKudukurangaEnnaNambi#90sKidsSaadhanaigal pic.twitter.com/vyg0DuCnaQ— Pradeep Antony (@TheDhaadiBoy) June 17, 2024 చదవండి: మరికొద్ది రోజుల్లో పెళ్లి.. ప్రియుడి ఇంట్లో ప్రత్యక్షమైన హీరోయిన్ -
Sharanya Pradeep: అంబాజీపేటతో ఫిదా చేసిన 'శరణ్య ప్రదీప్' ఫోటోలు వైరల్
-
London : యూకేలో మేమంతా సిద్ధం
లండన్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు యునైటెడ్ కింగ్డమ్ (UK) నుంచి వైఎస్సార్సిపి నేతలు సంఘీభావం ప్రకటించారు. వైఎస్సార్సిపికి మద్ధతుగా యూకేలోని వేర్వేరు ప్రాంతాల్లో ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. మేమంతా సిద్ధం #memanthasiddham ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం యాత్రకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కొనియాడారు YSRCP UK కన్వీనర్లు Dr ప్రదీప్ చింతా , ఓబుల్ రెడ్డి పాతకోట. UKలోని లెస్టర్‌లో మేమంతా సిద్ధం సంఘీభావ సభ నిర్వహించారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి 59 నెలలుగా కష్టపడుతున్నారని, ఈ ఒక్క నెలా విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులంతా జగనన్నకోసం కష్టపడి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని Dr ప్రదీప్ చింతా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో YSRCP UK కమిటీ సభ్యులు జనార్దన్ చింతపంటి, నారాయణరెడ్డి, కార్తీక్ భూమిరెడ్డి, చాళుక్య , ఆదిత్య, క్రాంతి పాలెం, కూమార్ రెడ్డి, పురుషోత్తంరెడ్డి యనుముల, సతీష్ నర్రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సతీష్ ఉగ్గుముడి, పునీత్ తదితరులు పాల్గొన్నారు. UK నలుమూలలనుండి పలువురు వైఎస్సార్సిపి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. యుద్ధానికి సిద్ధం దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టాలకు వేదికగా ‘మేమంతా’ సిద్ధం బస్సు యాత్ర జరుగుతోందన్నారు ప్రదీప్ చింతా. ఐదేళ్లు తమకు కాపు కాచిన సీఎం జగన్‌కు ఊరూరా.. అడుగడుగునా జనం నీరాజనం పడుతున్నారని, జననేతను చూసేందుకు.. కరచాలనం.. మాట కలిపేందుకు.. ఫొటోల కోసం ఆరాటం చూస్తుంటే.. ప్రజల గుండెల్లో సీఎం జగన్‌కు ఎంత అభిమానం, అప్యాయత ఉందో తెలిసిపోతోందన్నారు. మండుటెండల్లోనూ గంటల తరబడి రోడ్డుపై జననేత కోసం ఓపిగ్గా నిరీక్షిస్తున్నారని, చంటి బిడ్డలను చంకనేసుకుని బస్సు వెంట తల్లులు పరుగులు తీస్తున్నారన్నారు. టీవీల్లో మేమంతా సిద్ధం యాత్ర చూస్తుంటే ప్రతీ వైఎస్సార్సిపి కార్యకర్త గుండె ఉప్పొంగిపోతోందని, ఇన్నాళ్లు పడ్డ కష్టం ప్రజల కళ్లలో కనిపిస్తోందన్నారు. మేమంతా సిద్ధం యాత్ర ఒరవడికి కూటమి కొట్టుకుపోవడం ఖాయమన్నారు. జూన్ 4న విడుదలయ్యే ఫలితాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నామని చెప్పారు ప్రదీప్. -
సరికొత్త కథనంతో వస్తోన్న దర్శిని.. లిరికల్ సాంగ్ రిలీజ్!
వికాస్ జీకే, శాంతి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం దర్శిని. ఈ చిత్రానికి డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వం వహిస్తున్నారు. వీ4 సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై డాక్టర్ ఎల్వీ సూర్యం నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి అందమా అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ.. మేము అనుకున్నట్లు సినిమా అవుట్‌పుట్ వచ్చింది, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. కాగా.. ఈ సినిమాకి నిజాని అంజన్ సంగీతం అందించారు. -
స్టార్ జంటకు కలిసిరాని కొత్త ఏడాది.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్!
లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తోన్న చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC). ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని తమిళంలో నయనతార భర్త శివన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీ వివాదంలో చిక్కుకుంది. అసలు ఎందుకు సమస్య ఎక్కడ వచ్చింది? ఆ వివాదం ఎందుకు మొదలైందో తెలుసుకుందాం. ఈ చిత్రానికి ఎల్ఐసీ టైటిల్ పెట్టడంపై ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొషన్ ఆఫ్ ఇండియా (LIC) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమా టైటిల్ తమ సంస్థ పేరును గుర్తు చేసేలా ఉందంటూ వెల్లడించింది. ఈ మేరకు మూవీ టైటిల్ మార్చాలంటూ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌కు ఎల్ఐసీ లీగల్ నోటీసులు పంపినట్లు ఓ నివేదిక వెల్లడించింది. అంతే కాకుండా.. ఎల్ఐసీ సినిమా టైటిల్‌ను ఏడు రోజుల్లోగా మార్చాలని.. లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది. ఈ విషయంలో విఘ్నేశ్‌తో పాటు మూవీ నిర్మాణ సంస్థ సెవెన్ స్క్రీన్ స్టూడియోస్‌కు నోటీసులు పంపినట్లు సమాచారం. పేరు మార్చకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని ఎల్ఐసీ హెచ్చరించినట్టు తెలుస్తోంది. అయితే ఎల్ఐసీ పంపిన నోటీసులకు మూవీ టీమ్ నుంచి ఇంకా అధికారికంగా స్పందన రాలేదు. అయితే ఇప్పటికే నయనతార నటించిన అన్నపూరణి చిత్రం కూడా వివాదానికి దారితీసింది. ఈ సినిమాలో హిందువులు మనోభావాలు దెబ్బతినేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా నయనతార భర్త సినిమా సైతం వివాదంలో చిక్కుకుంది. కాగా.. ఈ చిత్రం ప్రముఖ నటుడు ఎస్జే సూర్య కీలకపాత్ర చేస్తున్నారు. ప్రదీప్ సోదరి పాత్రలో ఈ చిత్రంలో నయనతార కూడా నటిస్తారని తెలుస్తోంది. చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. -
ఘనంగా వినోద్ ఫిల్మ్ అకాడమీ తృతీయ వార్షికోత్సవం
వినోద్ ఫిల్మ్ అకాడమీ దిన దిన ప్రవర్ధమానమై మరింతగా ఎదగాలని ప్రముఖ సినీ నిర్మాత డాక్టర్ పుట్టగుంట వెంకట సతీష్ అన్నారు. మంగళవారం ప్రసాద్ లాబ్స్ లో జరిగిన వినోద్ ఫిల్మ్ అకాడమీ తృతీయ వార్షికోత్సవంలో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అకాడమీతో తన అనుబంధాన్ని వివరించారు. ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడే విజయం వరిస్తుందని ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీదేవి ప్రసాద్ అన్నారు. నటుడు ప్రదీప్ మాట్లాడుతూ నటనలో ఉండే టెక్నిక్ ను పట్టుకోవాలని అన్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రముఖ దర్శకుడు ఏ మోహన్ గాంధీ విద్యార్థులను ఆశీర్వదించారు. దొరసాని చిత్ర దర్శకుడు శ్రీ కేవీఆర్ మహేంద్ర మాట్లాడుతూ తాను ఎల్లప్పుడూ కొత్త నటులకు అవకాశం ఇస్తూ ఉంటానని ప్రకటించారు. మాటల రచయిత లక్ష్మీ భూపాల్ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో కోద్ది మంది మాత్రమే ఉంటారని అందులో తాము ఉండడం ఎంతో అదృష్టమని అన్నారు. అకాడమీ వ్యవస్థాపకుడు వినోద్ ప్రసంగిస్తూ.. తమ సంస్థ అందరికీ అందుబాటులో ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ టెక్నాలజీ నిపుణులు నల్లమోతు శ్రీధర్, జబర్దస్త్ అప్పారావు, యూ ట్యూబ్ ఫాదర్ సతీష్ , టిఏంటి డి ఎ యూ అధ్యక్షుడు రాజశేఖర్ ,బబ్లు, ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
కోట్లను వదిలేసి యాంకరింగ్ లో జాయిన్ అయ్యాను
-
చాలా బాధలు అనుభవించాను యాంకర్ అవ్వడానికి
-
పెళ్లిపై నా ఉద్దేశం ఇదే అంటున్న యాంకర్ ప్రదీప్
-
చూడడానికి ఇలా ఉంటాం కానీ మా కష్టాలు వేరు..!
-
ఇద్దరం ఒకేసారి వచ్చాం... ఇప్పుడు తను నా బెస్ట్ ఫ్రెండ్
-
ఆ హీరోయిన్ నా షో మొత్తం మార్చేసింది: ప్రదీప్
-
నాగార్జున గారిని షో కి పిలిచి చాలా ఇబ్బంది పెట్టాను..!
-
నన్ను బాధ పెట్టిన సంఘటన అది: యాంకర్ ప్రదీప్
-
ఇవి నా ఫేవరెట్ సినిమాలు అని అంటున్న యాంకర్ ప్రదీప్
-
ఈ ఏడాది నా జీవితం పూరిపూర్ణమైంది
‘‘ఈ వేదికపై (శిల్ప కళా వేదిక) జరిగిన వందల ఆడియో ఫంక్షన్లకు వచ్చాను. నా పాటలు కూడా ఆవిష్కరించబడ్డాయి. కానీ ఆ ఫంక్షన్స్‌లో హీరోలను చూసేందుకు ప్రేక్షకులు వచ్చేవారు. కానీ ఈ రోజు ఇక్కడ పాట హీరో.. సంగీతం హీరో.. సాహిత్యం హీరో. ‘తాజ్‌మహల్’ సినిమాతో నన్ను రామానాయుడుగారు పరిచయం చేశారు. 1995లో మొదలైన నా ప్రయాణం 2023 వరకూ.. 28 సంవత్సరాలు.. 860కి పైగా సినిమాలు.. 3600లకు పైగా పాటలు రాశాను. ఈ ఏడాది నాకు, నా జీవితానికి, నా సాహిత్యానికి పరిపూర్ణతను తీసుకొచ్చింది. ఈ ఏడాది నాపై పురస్కారాల వర్షం కురిసింది. ఫిబ్రవరిలో గోల్డెన్‌గ్లోబ్ అవార్డు, హాలీవుడ్ క్రిటిక్స్ చాయిస్, క్రిటిక్స్ అవార్డు, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్, బాంబే హంగామా అవార్డు, ఉత్తమ జాతీయ గీతరచయిత అవార్డు.. ఇలా వరుసగా ఒకే సంవత్సరం నన్ను ఆరు పురస్కారాలు వరించాయి. మన తెలుగుకు వెయ్యేళ్ల సాహిత్య చరిత్ర ఉంది. రెండువేల సంవత్సరాల భాషా చరిత్ర ఉంది. నా మిత్రుడు ఒకరు ‘సంకల్పం’ అనే పుస్తకం తెలుగులో రాసి, ఈ పుస్తకం కోసం వారం రోజులు సెలవు పెట్టి అమెరికా నుంచి వచ్చారు. ఆ తర్వాత అమెరికా వెళ్లినప్పుడు ఆయన సహోద్యోగి ఎందుకు సెలవు పెట్టారని అడగ్గా... తెలుగు భాష పుస్తకం కోసం అని చెప్పగా.. ఆవిడ తెలుగు అంటే.. ఆ నాటు నాటు లాంగ్వేజ్ అన్నారట. ప్రపంచంలో తెలుగు అనేది ఒకటి ఉందని చాలామందికి తెలియదు. కానీ మొట్టమొదటిసారి ‘నాటు పాట’తో ఇది నాటు భాష అని తెలిసింది. ఈ పాట సృష్టికర్తల్లో నేను ఒకడిని. నా జన్మ చరితార్థమైంది. ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించిన నిహారిక, ప్రదీప్, సరస్వతిలకు, వారి కుటుంబసభ్యులకు ధన్యవాదాలు’’ అని అన్నారు. ఈ ఏడాది ఆస్కార్, జాతీయ అవార్డులతో పాటు మరెన్నో అవార్డులను సొంతం చేసుకున్న రచయిత చంద్రబోస్‌ని సత్కరించడానికి ‘తెలుగు జాతీయ చంద్రబోస్’ పేరిట శనివారం హైదరాబాద్‌లో నటుడు ప్రదీప్ ఓ వేడుక నిర్వహించారు. ఈ వేదికపై చంద్రబోస్‌ని, ఆయçన సతీమణి, నృత్యదర్శకురాలు, దర్శకురాలు సుచిత్రా చంద్రబోస్‌ని సత్కరించారు. ఈ సందర్భంగా రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ– ‘‘ఆస్కార్, జాతీయ అవార్డు అందుకున్న చంద్రబోస్‌గారికి మా కవి కులం తరఫున అభినందనలు. బోస్‌గారి ప్రయాణం, ప్రస్థానం ఆదర్శవంతంగా ఉంటాయి. ఈ గొప్పదనం, ఆదర్శం ఒక్కరోజులో రాదు. తొలి రోజు నుంచే కష్టపడుతూ ఉండాలి. ఓ రచయితకు జరిగిన ఈ సన్మానాన్ని అక్షరానికి జరిగిన సన్మానంలా భావిస్తున్నాను’’ అన్నారు. ఈ వేడుకలో పలువురు కళాకారులను సన్మానించారు. మురళీమోహన్, ముప్పలనేని శివ, ఎంఎం శ్రీలేఖ, చంద్రబోస్ సోదరుడు రాజేందర్‌తో పాటు పలువురు సినీ, టీవీ నటీనటులు పాల్గొన్నారు. -
NKR21:కల్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ!
కొత్త సినిమా కబురు చెప్పారు హీరో కల్యాణ్‌రామ్. ఆయన హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఫిల్మ్ రూపొందనుంది. జూలై 5న (బుధవారం) కల్యాణ్‌రామ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్థన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. (కల్యాణ్ రామ్ 'డెవిల్' గ్లింప్స్.. డైరెక్టర్ పేరు లేకుండానే! కల్యాణ్ రామ్ కెరీర్లో ఇది 21వ సినిమా. కాబట్టి #NKR21 పేరుతో సినిమాను అనౌన్స్ చేస్తూ పోస్టర్ని విడుదల చేశారు. పోస్టర్లో రక్తంతో తడిసిన కళ్యాణ్ రామ్ చేతిని చూడవచ్చు. మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కల్యాణ్ రామ్ కనిపించబోతున్నారట. ‘‘కల్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న సినిమా ఇది. అవుట్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. The FIST of FURY 🔥👊🔥@NANDAMURIKALYAN in an action-packed powerful role ❤️🔥#NKR21 shoot begins soon 🔥#HappyBirthdayNKR @PradeepChalre10 #AshokaMuppa @SunilBalusu1981 @harie512 @AshokaCOfficial pic.twitter.com/qb9S2TwCee — NTR Arts (@NTRArtsOfficial) July 5, 2023 -
లవ్... క్రైమ్
ప్రదీప్ విరాజ్, దివ్య ఖుష్వా జంటగా మనోజ్ ఎల్లుమహంతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ముహుర్తపు సన్నివేశానికి దర్శకుడు వి. సముద్ర కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా క్లాప్ ఇచ్చారు. బిజినెస్‌మ్యాన్ రామ్ ఎర్రమ్ స్క్రిప్ట్‌ని చిత్రయూనిట్‌కు అందించారు. లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని బీఎన్కే (బంగారు నవీన్ కుమార్) నిర్మించనున్నారు. దర్శకుడు మనోజ్ మాట్లాడుతూ– ‘‘క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోని ప్రతి సీన్ ఉత్కంఠభరితంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘అన్ని కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో ఉంటాయి’’ అన్నారు బీఎన్కే. ఈ సినిమాకు కెమెరా: పంకజ్ తట్టోడ. -
దేశ రహస్యాలు పాక్‌కు లీక్ చేసిన డీఆర్డీఓ శాస్త్రవేత్త.. నిఘా వైఫల్యమేనా?
న్యూఢిల్లీ: కొన్ని సార్లు.. అంతా సవ్యంగానే ఉంటుందనుకుంటాం. దేశం సురక్షితంగా ఉందని భావిస్తాం. అనుభవజ్ఞులైన అధికారులు, సరిహద్దుల్లో సైన్యం కంటికి రెప్పలా ఉంటుందని భావిస్తాం. నిజమే.. మనం అనుకుంటున్న దాంట్లో 99% నిజమే. అయితే ఎక్కడో ఓ చోట, ఎవరో ఒకరు నమ్మక ద్రోహానికి సిద్ధంగా ఉంటారు. మదర్ ఇండియాకు వెన్నుపోటు పొడిచేందుకు వెనక్కు రారు. అలాంటి వారిలో అత్యున్నత అధికారులు ఉండడమే ఆశ్చర్యకరం. పైగా పాకిస్తాన్, చైనాలాంటి దేశాలు విసిరే హానీ ట్రాప్‌లో చిక్కడం మరింత విస్మయకరం. మహిళ అందాల కోసం దేశాన్ని తాకట్టు పెట్టే జాబితా పెరిగిపోతోంది. గత నెల రోజులుగా భారత రక్షణ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న వ్యక్తి ప్రదీప్ కురుల్కర్. భారత రక్షణ వ్యవస్థలోని కీలక వింగ్ DRDOలో అత్యున్నత అధికారిగా ఉన్న ప్రదీప్.. ఇప్పుడు దేశ రహస్యాలను లీక్ చేసిన మాయగాడిగా మిగిలిపోయాడు. వలపు వలలో చిక్కి దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్‌కు లీక్ చేశాడు డీఆర్డీవో టాప్ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్. ఓ అజ్ఞాత మహిళ మాయలో పడి అడిగిన వివరాలన్నీ అందించాడు. భారత ఆయుధ సంపత్తిలో కీలకంగా ఉన్న బ్రహ్మోస్, అగ్ని, యాంటి శాటిలైట్ క్షిపణులకు సంబంధించిన రహస్యాలను శత్రు దేశానికి చేరవేశాడు. ప్రదీప్‌కు వలపు వల విసిరి రహస్యాలు రాబట్టుకున్న మహిళ తనను తాను జర్దాస్ గుప్తా. లండన్ లో నివసిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. పక్కా స్కెచ్ వేసి ఈయన్ను ట్రాప్ చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో సోషల్ మీడియా ద్వారా ప్రదీప్‌ను పరిచయం చేసుకుంది. మొదట ఆకట్టుకునే మెసెజ్‌లు, ఆ తర్వాత అందాలు ఆరబోసే వీడియో కాల్స్, రాత్రుళ్లు కవ్వించే మాటలు.. తనను ట్రాప్ చేస్తోందని తెలుసుకోలేక పోయిన ప్రదీప్ ఆమె మాయలో పడ్డాడు. వేరే దేశానికి రమ్మని పిలిస్తే క్షణం కూడా ఆలోచించకుండా వెళ్లిపోయాడు. భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌ను కూడా తిలకించారు. ఇద్దరూ కొన్నాళ్లు ఎంజాయ్ చేశారు. ఈ మహిళ అందానికి దాసోహమైన ప్రదీప్.. ఆమె ఏం అడిగినా కాదనకుండా అన్ని వివరాలు వెల్లడించాడు. దేశభద్రత గురించి పట్టించుకోకుండా తెలిసిన రహస్యాలన్నీ లీక్ చేశాడు. ఈ మత్తులో జరుగుతున్న ద్రోహం గురించి ప్రదీప్ కనిపెట్టలేకపోయాడా అన్నది ఓ మిలియన్ డాలర్ క్వొశ్చన్. ఇలాంటి ఆపరేషన్స్‌పై సైన్యంలో ఎందరికో అవగాహన కల్పించిన ప్రదీప్.. తానే ఆ గోతిలో పడ్డాడు. బ్యాడ్ ఎగ్జాంపుల్ గా మిగిలిపోయాడు. 1988 నుంచి డీఆర్డీఓలో 1988 నుంచి పనిచేస్తున్నారు ప్రదీప్. గ్రేడ్-హెచ్ ఔట్ స్టాండింగ్ కేటగిరీ సైంటిస్ట్‌గా ఉన్నారు. ఇది అత్యంత కీలకమైన హోదా. కేంద్రంలో అదనపు కార్యదర్శి హోదాతో సమానం. ఇంతటి కీలక హోదాలో ఉన్న వ్యక్తి దేశ సమాచారాన్ని లీక్ చేయడం ఒకింత విస్మయం కలిగించే విషయం. దీన్ని ఆరంభంలోనే నిఘావర్గాలు కనిపెట్టలేకపోడవంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సెక్యూరిటీ వైఫల్యంపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దేశభద్రతలో డీఆర్డీఓ అత్యంత కీలకం. దేశవ్యాప్తంగా 50 ల్యాబొరేటరీలు ఉన్నాయి. 5వేల మందికిపైగా శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇప్పడు ప్రదీప్ వలపు వ్యవహారం బహిర్గతం కావడంతో వీరిపైనా విశ్వాసం సన్నగిల్లే పరిస్థితి వచ్చింది. ప్రదీప్ విషయం తెలిసిన వెంటనే అధికారులు చర్యలు చేపట్టారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్)పుణెలో రెండు వారాల క్రితం అతడ్ని అరెస్టు చేసింది. అనంతరం కోర్టులో హాజరు పరచి కస్టడీలోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన కస్టడీలోనే ఉన్నారు. ఇప్పుడు ప్రదీప్ ఏ ఏ రహస్యాలు చేరవేశాడన్నది లెక్క తేలాల్సిన అంశం. భారత రక్షణ వ్యవస్థలో ముఖ్యంగా ఆయుధ వ్యవస్థలో అంతర్గత లోపాలను బయటకు రానివ్వరు. సైన్యంలో టాప్ అధికారులకు మాత్రమే కొన్ని విషయాలు తెలుస్తాయి. ప్రదీప్ ఎంతవరకు ఉప్పందించాడు, ఎక్కడెక్కడ ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి? వేటిని మార్చుకోవాలి? ఇవీ ఇప్పుడు సైన్యంలోని టాప్ అధికారుల ముందున్న పెద్ద ఛాలెంజ్. చదవండి: చైనా చాట్‌జీపీటీ.. మరీ ఇంత దారుణమా.. తప్పుడు సమాధానాలు చెప్తే ఎలా? -
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి
చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు ప్రదీప్ సర్కార్(68)కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమశారు. ఈ విషయాన్ని ఆయన బంధువు, నటి నీతు చంద్ర శ్రీవాత్సవ వెల్లడించారు. పరిణీత, లగా చునారీ మే దాగ్, మర్దానీ, హెలికాప్టర్ ఈలా వంటి సూపర్ హిట్ చిత్రాలకు ప్రదీప్ దర్శకత్వం వహించారు.ప్రదీప్ మృతి విషయాన్ని ఆయన సోదరి మాధురి కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రదీప్ దాదా మృతిని జీర్ణించుకోలేకపోతున్నాననంటూ బాలీవుడ్ అగ్రనటుడు అజయ్ దేవగణ్ విచారం వ్యక్తం చేశారు. ప్రదీప్ సర్కార్ మృతి పట్ల పలవురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. The news of Pradeep Sarkar’s demise, ‘Dada’ to some of us is still hard to digest. My deepest condolences 💐. My prayers are with the departed and his family. RIP Dada 🙏 — Ajay Devgn (@ajaydevgn) March 24, 2023 Very sad to know about our dearest director @pradeepsrkar dada. I started my career with him. He had an aesthetic talent to make his films look larger than life. From #Parineeta#lagachunrimeindaag to a no. Of movies. Dada, you will be be missed. #RestInPeace 🙏😔 @SrBachchan pic.twitter.com/TDxUOP2quG — Nitu Chandra Srivastava (@nituchandra) March 24, 2023 -
నిఖిల్ సింహా క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో తారల సందడి (ఫొటోలు)
-
పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ ప్రదీప్..?
-
పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ ప్రదీప్? వధువు ఎవరంటే!
తెలుగు స్టార్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు ఒకరు. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్ తనదైన యాంకరింగ్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ప్రదీప్ కామెడీ టైమింగ్‌కు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. ఒకవైపు పలు టీవీ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హీరోగా కూడా మారాడు. ఇదిలా ఉంటే బులితెరపై ఎంతో క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. చదవండి: ఈ స్టార్ యాంకర్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? అందరికంటే ఎక్కువ ఎవరికంటే! అందుకే తరచూ పెళ్లి రూమర్స్‌తో వార్తల్లో నిలుస్తుంటాడు ప్రదీప్. తాజాగా మరోసారి ప్రదీప్ పెళ్లి వార్తలు తెరపై వచ్చాయి. అయితే గతంలో ఇప్పటికే పలుమార్లు ప్రదీప్ పెళ్లంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే వాటిని ప్రతిసారి ఖండించాడు. కానీ ఈసారి మాత్రం ప్రదీప్ నిజంగానే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రదీప్ చేసుకోబోయే అమ్మాయి పేరు, ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతును వివాహం చేసుకోబోతున్నాడంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. నవ్య.. ప్రదీప్ పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్‌ని, ఆ పరిచయమే స్నేహం, ప్రేమగా మారిందంటున్నారు. చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం కొంతకాలంగా వీరిద్దరు రిలేషన్లో ఉన్నారని, ఇప్పుడు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంలో ఇరుకుటుంబాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిలిం దూనియాలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించి ఇరుకుంటుంబాలు చర్చించుకుంటున్నారట. త్వరలోనే ప్రదీప్ గుడ్‌న్యూస్ చెప్పబోతున్నాడని సన్నిహితవర్గాలంటున్నాయి. అయితే వీరి మతాలు కూడా వేరే అనేది విశ్వసనీయ సమాచారం. మరీ ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే ప్రదీప్ నుంచి క్లారిటీ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. నవ్య.. ప్రదీప్‌తో పాటు చాలా మంది సెలబ్రెటీలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుందట. బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు కూడా ఆమె కాస్ట్యూమ్ డిజైన్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Navya Marouthu (@navya.marouthu) View this post on Instagram A post shared by Navya Marouthu (@navya.marouthu) -
యాంకర్ ప్రదీప్ పెళ్లి అయిపోయిందా? ఆయన ఏమన్నాడంటే..
తెలుగు టాప్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు కూడా ఒకరు. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్ తన యాంకరింగ్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ప్రదీప్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఇటీవలె ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హీరోగా మారి అలరించాడు. ఇదిలా ఉండగా కొంతకాలంగా యాంకర్ ప్రదీప్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని, పొలిటికల్ లీడర్ కూతురితోనే అతని వివాహం అని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.గతంలో కూడా అతని పెళ్లిపై రకారకాల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఓ షోలో భాగంగా తనని తాను ఇంటర్వ్యూ చేసుకున్న ప్రదీప్ ఊతపదం ఏంటని అడగ్గా.. నీ యంకమ్మ అని సమాధానమిచ్చాడు. మీకు నిజంగా పెళ్లయిపోయింది కదా? అని అడగ్గా.. నాలుగైదుసార్లు అయిపోయింది, యూట్యూబ్ లో చూడలేదా నువ్వు అని తనపై తానే కౌంటర్స్ వేసుకున్నాడు.ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
శారీరక సంబంధంతోనే పెద్దలు వివాహం చేస్తారని నమ్మించి..
సాక్షి, నూజివీడు (పశ్చిమగోదావరి): శారీరక సంబంధంతోనే పెద్దలు వివాహం చేస్తారని నమ్మించి మోసం చేయడంతో మనస్తాపంతో ఎలుకలమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువతి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని స్టేషన్‌తోటకు చెందిన రాణిమేకల రాణి(20) ఇంటర్ వరకు చదివింది. అదే ఏరియాకు చెందిన డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న కొండా ప్రదీప్‌కుమార్, రాణి ఆరునెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం రెండు నెలల క్రితం వారి ఇళ్లల్లో తెలిసి వీరి ప్రేమను అంగీకరించలేదు. దీంతో వీరు సైతం మాట్లాడుకోవడం లేదు. ఈ నేపధ్యంలో ఆగస్టు మొదటి వారంలో ప్రదీప్ మళ్లీ రాణితో మాటలు కలిపి ఇద్దరం శారీరకంగా ఒక్కటైతే పెద్దలు కచ్ఛితంగా పెళ్లికి అంగీకరిస్తారని చెప్పి నమ్మించాడు. 10వ తేదీన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో శారీరకంగా ఒక్కటయ్యారు. మరుసటి రోజు నుంచి ప్రదీప్ యువతితో మాట్లాడటం మానేశాడు. మహిళ భయంతో 27న తన తల్లి మంజులకు జరిగిన విషయాన్ని చెప్పింది. ఆమె పెద్దలతో చెప్పగా, వారు ప్రదీప్, అతని తల్లిని వివాహం చేసుకోవాలని అడగగా నిరాకరించారు. దీంతో 28న ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాణి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయాన్ని తల్లికి చెప్పగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (అత్తతో అసభ్యంగా ప్రవర్తించిన అల్లుడికి ఐదేళ్ల శిక్ష) -
అన్యాయాలపై సంధించిన సూటి ప్రశ్న!
మోసం పునాదులమీద నిలబడ్డ మీ సంకుచిత మత విశ్వాసాలని ధ్వంసం చేస్తాను కూకటివేళ్లతో సమూలంగా పెకలించి వేస్తాను మతవిద్వేషపు కళంకాన్ని ఊడ్చేస్తూ నా ఆశలు సగర్వంగా ఆకాశంలో ఎగురుతాయి – జోష్ మలీహాబాదీ అది 1972 ఏప్రిల్ 14 సాయంత్రం. జార్జిని ధూల్ పేట కిరాయి గూండాలు హత్య చేశారని ఒక మిత్రుడు హడావుడిగా వచ్చి చెప్పాడు. నమ్మలేదు. హిమాయత్ నగర్లో ఉన్న మరొక మిత్రుని దగ్గరకు వెళ్లే సరికి అప్పటికే జార్జి హత్యపై తాను రాసిన కరపత్రంతో కనిపించాడు. చావు అంత తేలికగా తన దగ్గరకు రాదని జార్జి తరచూ మాతో చెప్పేవాడు. ఏప్రిల్ 15న డీడీ కాలనీలోని ఇంటిదగ్గర శవపేటికలో జార్జి మృత దేహం మా కళ్ళముందున్నది. తన దేహంపై 32 కత్తిపోట్లు... హంతకుల ద్వేషానికి సాక్ష్యంగా! రెండువేల మంది విద్యార్థులు గుమికూడారు. కన్నీళ్ళు, నిశ్శబ్దం అలుముకున్న ఉద్విగ్న విషాద వాతావరణం. అంతలో ఎవరిదో ఒక గొంతు నుండి ‘జార్జిరెడ్డి అమర్ రహే’ నినాదం! వేల గొంతులు ఒక్కటిగా పిక్కటిల్లాయి. ఆర్ఎస్ఎస్ కార్యాలయం ముందునుంచి జార్జి శవయాత్ర సాగేటప్పుడు కట్టలు తెగిన ఉద్రేకం! మేము అప్పుడు నిగ్రహం పాటించకపోతే ఏమయ్యేదో తెలియదు. జార్జిని నారాయణగూడ శ్మశానవాటికలో ఖననం చేశాం. ఎవరీ జార్జి? అత్యంత ప్రతిభాశాలియైన విద్యార్థి. అణుభౌతిక శాస్త్రంలో స్వర్ణపతక గ్రహీత. పీహెచ్డీ పరిశోధనకు నమోదు చేసుకోవాలనుకున్నపుడు, ఫిజిక్స్ డిపార్ట్ మెంట్లో ప్రొఫెసర్లు ఎవరూ తనకి గైడ్‌గా ఉండడానికి సిద్ధపడలేదనీ, ఒక ఆస్ట్రానమీ ప్రొఫెసర్ ముందుకు వచ్చిన తర్వాతనే తాను పరిశోధనకు ఉపక్రమించాడనీ అనుకునేవాళ్ళు. పరీక్షా పత్రాలలో తన జవాబులను చదివిన ప్రొఫెసర్ ఒకరు తనని ప్రత్యక్షంగా చూడాలని బొంబాయి నుంచి వచ్చి కలిశాడు. అయితే జార్జిని యాభై సంవత్సరాల తర్వాత గుర్తు చేసుకుంటున్నది అసాధారణమైన ఈ ప్రతిభాపాటవాల వల్ల మాత్రమే కాదు. జార్జి అణగారిన ప్రజల గురించి ఆలోచించేవాడు. ఆ రోజులలో రిక్షాలు ఎక్కువగా ఉండేవి. ఒకసారి మేము రిక్షా కార్మికుల గురించి మాట్లాడుకుంటున్నాం. ‘ఒక మనిషి రిక్షాని ఎగువకి లాగుతుంటే, ఇంకో మనిషి ఆ రిక్షాలో కూర్చోవడాన్ని చూస్తే ఎలా అనిపిస్తుంద’ని జార్జి అడగడం నాకు గుర్తుంది. జార్జి స్వార్థంలేని మనిషి. జార్జి అత్యంత సాహసోపేతమైన వ్యక్తి. అన్యాయాన్ని సహించక ఎదురుతిరిగేవాడు. సిద్ధాంత రాజకీయ చర్చలలో ప్రశ్నలతో ఆలోచనలు రేకెత్తించేవాడు. వివిధ కళాశాలల విద్యార్థులతో అధ్యయన బృందాలు నెలకొల్పి పుస్తకాలపై చర్చించే వాడు. సైన్స్ కాలేజిలోని ఆస్ట్రానమీ డిపార్ట్ మెంట్ పక్కనే ఉండిన ఒక క్యాంటీన్ తన చర్చలకు ఒక కేంద్రంగా ఉండేది. అక్కడ కూర్చుని మేం వివిధ అంశాలపై చర్చిస్తూ జార్జి విశ్లేషణలను వింటూ ఉండేవాళ్ళం. అక్కడకు వచ్చేవాళ్ళలో ‘అట్లాస్ ష్రగ్డ్’, ‘ఫౌంటెన్ హెడ్’ వంటి అయన్ రాండ్ పుస్తకాలను చేతిలో పెట్టుకుని చర్చించే మార్క్సిస్ట్, సోషలిస్టు వ్యతిరేకులు కూడా వుండేవాళ్ళు. సైన్సు, తత్వశాస్త్రం, సిద్ధాంతం, విప్లవం వంటి అంశాలపై నిశితమైన చర్చలు అక్కడ ఉండేవి. అచ్చెరువొందించే తెలివితేటలూ, అన్యాయానికి స్పందించి తిరగబడడంతో పాటు, ప్రగతిశీల భావాలని ప్రోదిచేసి విద్యార్థులను సమీకరించిన కృషియే జార్జిని ప్రత్యేకంగా నిలబెట్టింది. నిర్దిష్టమైన పోలికలు లేకపోయినా జార్జి... తన నడక, నడవడికలతో విప్లవ స్ఫూర్తి ‘చే గువేరా’ని స్ఫురింపజేసేవాడు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో సైన్స్ గ్రాడ్యుయేషన్ విద్యార్థిగా ఉన్న నాకు జార్జి సహచరునిగా పనిచేసే అవకాశం లభించింది. జార్జి మరణం తర్వాత పీడీఎస్‌యూ ఆవిర్భావానికి దారులు వేసిన ప్రగతిశీల విద్యార్థుల బృందంలో నేనొకడిని. ఆనాటి పరిస్థితులపై ‘క్రైసిస్ ఇన్ క్యాంపస్’ పేరుతో ఒక డాక్యుమెంటరీ వచ్చింది. అందులో జార్జి సమాజంలో హింస గురించీ, ధిక్కారాన్ని సహించని వ్యవస్థ శాంతియుత నిరసనను ఎలా హింసతో అణచివేస్తుందో వివరిస్తాడు. ఆ చర్చ, ప్రశ్నలు ఇప్పటికీ వర్తించేవే. ‘చావు మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఎప్పుడైనా రావచ్చున’నే చే గువేరా మాటలని జార్జి ఉటంకించేవాడు. జార్జి జీవితం చావును ధిక్కరించడంలో వుంది. జార్జి మరణం సమాజంలో అన్యాయాలపై సంధించిన సూటైన ప్రశ్న! (క్లిక్: ఉస్మానియా ఎరుపెక్కిన వేళ...) 1960ల నాటి విప్లవ జ్వాల... జార్జి వంటి అసాధారణమైన వ్యక్తులను సృష్టించింది. ప్రజల కోసం మరణించిన స్ఫూర్తిగా జార్జి కొనసాగుతున్నాడు. సంక్లిష్టమైన పరిస్థితులలో, వేర్వేరు రూపాలలో జార్జి వారసత్వం ఈనాటికీ కొనసాగుతూనేవుంది. జార్జి ఆలోచనలూ, రేకెత్తించిన ప్రశ్నలూ, మెరుగైన సమసమాజ స్వప్నాలూ ఇంకా సజీవంగానే వున్నాయి. ఆ స్వప్నాలను ఎవ్వరూ చిదిమి వేయలేరు. యాభై సంవత్సరాల తర్వాత కూడా చావును ఎదిరించి గేలి చేసిన ధిక్కారానికి ప్రతీకగా, సజీవంగా జార్జి నిలిచి వున్నాడు! (క్లిక్: మలి అంబేడ్కరిజమే మేలు!) - బి. ప్రదీప్ వ్యాసకర్త జార్జిరెడ్డి సహచరుడు bpkumar05@rediffmail.com -
పరుగుల ప్రదీప్ మెహ్రాకు ఊహించని సాయం
Midnight Runner Pradeep Mehra News: అర్ధరాత్రి రోడ్ల వెంట పరుగులు.. అదీ సైన్యంలో చేరాలనే లక్ష్యంతో.. ఇంకేం ప్రదీప్ మెహ్రా ఓవర్ నైట్ సెన్సేషన్ అయ్యాడు. ఆపై ఆ కుర్రాడిని ఈ-సెలబ్రిటీని చేసేందుకు ప్రయత్నాలు సాగగా.. తన ప్రయాణాకి ఆటంకం కలిగించొద్దంటూ సున్నితంగా మీడియాను వేడుకున్నాడు ఈ ఉత్తరాఖండ్ కుర్రాడు. ఈ తరుణంలో.. ప్రదీప్ మెహ్రాకు సాయం మాత్రం అందుతోంది. ప్రదీప్ తల్లి చికిత్స కోసం, అతని కల నెరవేరేందుకుగానూ రెండున్నర లక్షల రూపాయల చెక్ సాయం అందించింది షాపర్స్ స్టాప్. ఈ విషయాన్ని మొదటి నుంచి మెహ్రాకు తోడుగా ఉంటున్న జర్నలిస్ట్, దర్శకుడు వినోద్ కాప్రీ తెలియజేశాడు. తనకు సాయం అందిస్తున్న వాళ్లకు ప్రదీప్ సైతం కృతజ్ఞతలు చెప్తున్నాడు. చదవండి: అమ్మ అనారోగ్యం.. ఆర్మీ కల.. ప్రదీప్ పరుగుల కథ ఇది! నోయిడా సెక్టార్ 16 దగ్గర మెక్‌డొనాల్డ్‌లో పని చేసే ప్రదీప్ మెహ్రా.. తానుండే చోటుకి దాదాపు 10 కిలోమీటర్ల దూరం పరుగుల మీదే ప్రతీరోజూ చేరుకుంటున్నాడు. ఈ క్రమంలో ఓరోజు ఆ కుర్రాడి గురించి ఆరా తీసిన వినోద్ కాప్రీ.. లిఫ్ట్ ఇస్తానని చెప్పినా వద్దంటూ తనమానాన తాను పరుగులతోనే వెళ్లిపోయాడు. ఆ వీడియో ఆనంద్ మహీంద్రా లాంటి ప్రముఖులతో పాటు ఎంతో మందిని కదిలించింది కూడా. This is PURE GOLD❤️❤️ नोएडा की सड़क पर कल रात 12 बजे मुझे ये लड़का कंधे पर बैग टांगें बहुत तेज़ दौड़ता नज़र आया मैंने सोचा किसी परेशानी में होगा , लिफ़्ट देनी चाहिए बार बार लिफ़्ट का ऑफ़र किया पर इसने मना कर दिया वजह सुनेंगे तो आपको इस बच्चे से प्यार हो जाएगा ❤️😊 pic.twitter.com/kjBcLS5CQu — Vinod Kapri (@vinodkapri) March 20, 2022 This morning @atulkasbekar took my address and with in few hours , a @PUMA sports kit with Running shoes, Apparels, backpack , socks was there at my door step for #PradeepMehra and with in no time we delivered it to him. Love you Atul ❤️ love you Tweeple❤️❤️ Thanks #Puma pic.twitter.com/MZws0nBd8L — Vinod Kapri (@vinodkapri) March 21, 2022 -
వైరల్ అయినందుకు సంతోషం, కానీ..: పరుగుల ప్రదీప్ మెహ్రా
Pradeep Mehra Running Video: అనుకున్నది సాధించే క్రమంలో ఆటంకాల గురించి ఆలోచించి.. ఆగిపోయేవాళ్లే ఎక్కువ. కానీ, అవాంతరాలను అలవోకగా దాటేయాలనుకునే ప్రదీప్ మెహ్రా లాంటి వాళ్లు ఎంత మంది ఉంటారు చెప్పండి!. 19 ఏళ్ల ప్రదీప్.. భారత ఆర్మీలో చేరాలనే ఒకే ఒక్క లక్ష్యంతో తాను పని చేసే చోటు నుంచి ఉంటున్న చోటుకి దాదాపు 8 కిమీపైనే అర్ధరాత్రి పరుగులు తీస్తుండడం, అది కాస్త వీడియో రూపంలో ఇంటర్నెట్లో వైరల్ కావడం తెలిసిందే. అయితే.. తన రన్నింగ్ వీడియో వైరల్ కావడంపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయని ఉత్తరాఖండ్ ఆల్మోరాకు చెందిన ప్రదీప్.. అనవసరంగా తనను ఓ సెలబ్రిటీని చేయొద్దంటూ వేడుకుంటున్నాడు. అది ఎందుకో అతని మాటల్లోనే తెలుసుకుందాం. ఫిల్మ్‌మేకర్ వినోద్ కాప్రి.. నొయిడా నుంచి బరోలా మధ్య ప్రదీప్ మెహ్రా ఉరుకులను షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో వైరల్ అయ్యాక.. ప్రదీప్ రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకోవాలని కాప్రి ఆరాటపడ్డాడు. ఈ క్రమంలో మరోసారి ప్రదీప్‌ను కలిశాడు. ‘‘అతిగా ఫేమ్ దక్కినా నాకు ఇబ్బందే. ఇంటర్వ్యూల కోసం ఎగబడడమో లేదంటే నన్నొక సెలబ్రిటీగా మార్చేయడమో చేస్తారు. అప్పుడు నా లక్ష్యంపై నేను దృష్టి సారించలేను. కాబట్టి, ఇదంతా నాకొద్దు. దయచేసి వేడుకుంటున్నా నా కోసం వేరే ఎవరూ రావొద్దు. ప్రశాంతంగా నా పని నన్ను చేసుకోనివ్వండి’’ అని వేడుకుంటున్నాడు ఆ కుర్రాడు. “मेहनत सुनसान होनी चाहिए, कामयाबी का शोर होना चाहिए” ये कहते हुए #PradeepMehra ने मीडिया से अपील की है कि वो उसे उसके लक्ष्य में फ़ोकस रहने दे और परेशान ना करें🙏🏻🙏🏻 pic.twitter.com/B6OptUQ8Je — Vinod Kapri (@vinodkapri) March 21, 2022 ‘‘నా శ్రమ నిశబ్దంగానే సాగిపోవాలి. ఎందుకంటే నా విజయాన్ని నేను ప్రపంచానికి బిగ్గరగా చాటి చెప్పాలి కదా. అందుకే ఇలాంటి ఫేమ్లకు దూరంగా ఉండాలనుకుంటున్నా. సెల్ఫీల కోసం కొందరు వస్తుంటే.. సిగ్గుగా అనిపిస్తోంది. ఇప్పటికే చాలామంది ఇంటర్వ్యూలంటూ ఇబ్బంది పెడుతున్నారు. నా తల్లి ట్రీట్మెంట్కి సాయం దొరికింది. సాయం అందించినందుకు కృతజ్ఞతలు. ఇక చాలు. ఇంకేం వద్దు. నా లక్ష్యం దేశ సేవే’’ అని క్లారిటీగా చెప్పేశాడు ఆ కుర్రాడు. కాస్తంత ఫేమ్ దక్కినా, అనుకోకుండా వైరల్ అయినా ఎలా క్యాష్ చేసుకోవాలా? అని ఆలోచించే వాళ్లు ఉన్న ఈ రోజుల్లో.. ప్రదీప్ మెహ్రా లాంటి వాళ్లు ఎంత మంది ఉంటారు చెప్పండి. This morning @atulkasbekar took my address and with in few hours , a @PUMA sports kit with Running shoes, Apparels, backpack , socks was there at my door step for #PradeepMehra and with in no time we delivered it to him. Love you Atul ❤️ love you Tweeple❤️❤️ Thanks #Puma pic.twitter.com/MZws0nBd8L — Vinod Kapri (@vinodkapri) March 21, 2022 ఇదిలా ఉంటే.. సినీ నిర్మాత అతుల్ కస్బేకర్, ప్రదీప్ కోసం షూస్, దుస్తులు, బ్యాక్‌ప్యాక్‌ను వినోద్ కాప్రి ద్వారా పంపించాడు. వాటిని దగ్గరుండి మరీ ప్రదీప్‌కు అందజేసి ఆల్‌ది బెస్ట్ చెప్పాడు కాప్రి. ఇక పలువురు ఇంటర్నెట్ వేదికగా ఆ కుర్రాడిని అభినందిస్తున్నారు. ఇక కాప్రి కూడా యూట్యూబ్ ఛానెల్స్‌కు, మీడియాకు ప్రదీప్ మెహ్రాను అలాగే వదిలేయాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు కూడా. సంబంధిత వార్త: అమ్మ అనారోగ్యం, ఆపై.. ప్రదీప్ పరుగుల కథ ఇది! -
ఐటీఐ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్..
ఐటీఐ మ్యుచువల్ ఫండ్ తాజాగా ఐటీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇది నవంబర్ 29తో ముగుస్తుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రదీప్ గోఖలే, ప్రతిభ్ అగర్వాల్ దీనికి ఫండ్ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. ప్రధానంగా బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, రేటింగ్ ఏజెన్సీలు, కొత్త తరం ఫిన్‌టెక్ సంస్థలు మొదలైన వాటిలో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. నాణ్యమైన సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని సంస్థ సీఈవో జార్జ్ హెబర్ జోసెఫ్ తెలిపారు. -
ఎకానమీ రికవరీ వేగవంతం: పీహెచ్‌డీసీసీఐ
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ ఇటీవలి నెలల్లో వేగవంతం అయ్యిందని ఇండస్ట్రీ చాంబర్ పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ ప్రదీప్ ముల్తానీ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ భారీగా జరగడం, పండుగల సీజన్, వినియోగ డిమాండ్ మెరుగుపడ్డం, పారిశ్రామిక సెంటిమెంట్ బాగుండడం దీనికి కారణమని తెలిపారు. పీహెచ్‌డీసీసీఐ ఎకానమీ జీపీఎస్ ఇండెక్స్ సెప్టెంబర్‌లో 113.1 వద్ద ఉంటే, అక్టోబర్‌లో 131కి పెరిగిందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే సూచీ 78.7 నుంచి 114.8కి ఎగసిందని తెలిపారు. వస్తు సేవల పన్ను వసూళ్లు, పాసింజర్ వాహన విక్రయాలు, సెన్సెక్స్ సగటు రోజూవారీ కదలికల ప్రాతిపదికన పీహెచ్‌డీసీసీఐ ఎకానమీ జీపీఎస్ ఇండెక్స్ కదలికలు ఉంటాయి. ఆయా అంశాలు ఎకానమీ పురోగతికి సానుకూలంగా ఉన్నాయని ప్రదీప్ ముల్తానీ పేర్కొన్నారు. సవాళ్లూ ఉన్నాయ్... అయితే అధిక కమోడిటీ ధరలు, ముడిపదార్థాల సరఫరాల కొరత సమస్యలుగా ఉన్నాయన్నారు. వినియోగం పెరగడానికి, ప్రైవేటు పెట్టుబడులు పురోగమించడానికి ఈ సవాళ్ల పరిష్కారం తక్షణ అవసరమని సూచించారు. గృహ వినియోగం మరింత పటిష్ట పడాల్సి ఉందని వివరించారు. ఆయా అంశాలు పెట్టుబడుల పురోగతికి దోహదపడతాయని ప్రదీప్ ముల్తానీ పేర్కొన్నారు. -
ఎనిమిదేళ్ల చిన్నవాడిని పెళ్లాడిన నటి
ముంబై: బాక్సర్ ప్రదీప్ ఖరేరా(25) మరాఠి నటి మానసి నాయక్‌ను వివాహమాడాడు. పుణెలో అత్యంత సన్నిహితుల మధ్య మహరాష్ట్రీయుల సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కొత్తజంట సోషల్ మీడియాలో షేర్ చేసింది. గులాబీ రంగు లెహంగాలో వధువు మానసి చూడముచ్చటగా కనిపించగా.. వరుడు ప్రదీప్ బంగారు వర్ణపు షేర్వాణీ ధరించి హుందాగా కనిపించాడు. పెళ్లి వేడుక అనంతరం కొత్తజంట వరుడి స్వస్థలం హర్యానాకు తిరిగి వచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి వివాహానంతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు వెల్లడించింది.(చదవండి: దయచేసి నన్ను ఫాలో కావొద్దు) కాగా గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న తాము త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు మానసి- ప్రదీప్ ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మంగళవారం వివాహ బంధంతో ఒక్కటైనట్లు తెలిపారు. ప్రొఫెషనల్ బాక్సర్‌గా గుర్తింపు పొందిన ప్రదీప్ ఖారారే.. వరల్డ్ బాక్సింగ్ కౌన్సిలింగ్ ఏషియన్ టైటిల్ సాధించి సత్తాచాటాడు. ఇక మానసి.. జబర్దస్త్, తూక్యా తుక్విలా నగ్యా నచ్విలా వంటి సినిమాలతో పాటు పలు టీవీ సీరియల్స్‌లో నటించారు. బాగ్తోయి రిక్షావాలా అనే డాన్స్ నంబర్‌తో ఆమె పాపులర్ అయ్యారు. ఇక తన పెళ్లి అనంతరం మానసి మాట్లాడుతూ.. ఎట్టకేలకు మిసెస్ ఖరేరా అయినందుకు సంతోషంగా ఉందని, ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించేలేనంటూ హర్షం వ్యక్తం చేశారు. తన సోల్‌మేట్‌తో పాటు అతడి కుటుంబం కూడా ఎంతో ఆప్యాయంగా తనను అక్కున చేర్చుకుందని చెప్పుకొచ్చారు. కాగా ప్రదీప్- మానసి కంటే ఎనిమిదేళ్లు చిన్నవాడు. -
కిచెన్ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్
లాక్డౌన్..నగరవాసిని ఇంటికే పరిమితం చేసింది. దీంతో కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఎప్పుడూ దొరకని ఇంత తీరిక ఇప్పుడు లభించడంతో సద్వినియోగం చేసుకుంటున్నారు. తమకు ఇష్టమైన పనులు చేస్తూ సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, సినీ, టీవీ నటులు అందరూ ఇలా లాక్డౌన్ టైంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఆయన మాటల్లో మీరే వినండి. (న్యూ కట్) నేను ఇంట్లో ఏం చేస్తున్నానో తెలిస్తే మీకు మంచి వినోదం అవుతుంది. ఉదయం టిఫిన్ నా భార్య చేస్తుంది. మధ్యాహ్నం కూరగాయలు అన్నీ కట్ చేసి, నేనే వంట చేస్తున్నా. కృష్ణాజిల్లా పాలకూర చేయడంలో నేను స్పెషలిస్ట్.. అందుకే ఎక్కువగా చేస్తున్నాను. ‘వద్దండి.. నాకు బోర్ కొడుతోంది, నేను చేస్తా’ అని మా ఆవిడ అంటున్నా, వినకుండా నేనే చేస్తున్నా. బీరకాయ పాలకూర, టమోటా రోటి పచ్చడి, (టమోటాలు కొనే పని కూడా లేదు.. ఇంట్లోనే చెట్లు ఉన్నాయి.. కోయడం చేయడమే). (లాక్డౌన్: విరుష్కలు ఏం చేస్తున్నారో చూశారా?) ఈ విధంగా వంటిల్లుని నేను స్వాధీనపరచుకున్నా.. ఇప్పుడు యోధుణ్ణి నేను. ‘అదేంటండి? అంటుంది’ మా ఆవిడ. పనీ పాటా లేదు. ఏదో ఒక పని చేయకపోతే తిన్నది అరగదు అన్నాను. ‘అయితే పనిమనిషి రాలేదు.. బయట ఊడవండి’ అంది. నేను ఊడవను అన్నాను. సరే.. కారు కడగండి అంది. నన్ను డామినేట్ చేసి మా అబ్బాయి బాలాజీ అప్పటికే కారు కడిగేస్తున్నాడు.. సో.. నాకు వంట పని ఒక్కటే కనిపించింది.. చేస్తున్నా. చూడండి మగాళ్లలారా. పని లేదు.. పని లేదు అని ఏడవడం కాదు. నీకు వచ్చిన పనిని సిగ్గు లేకుండా, మొహమాట పడకుండా చేయాలి. నా వ్యక్తిగత అనుభూతి ఏంటంటే వంట చేసేటప్పుడు చాలా రిలాక్స్ అయిపోతున్నాను.. ఆ సమయంలో నా ఒత్తిడి అంతా తగ్గిపోతోంది. – రాజేంద్రప్రసాద్ వంటింట్లో అమ్మకు సాయం చేస్తూ... ఈ ఖాళీ సమయంలో వంటింట్లో అమ్మకు సాయం చేస్తున్నా. శనివారం బెండకాయ వేపుడు చేశా. కనీసం ఈ మూడు వారాలైనా తన తల్లికి సహాయ పడాలని ఆమెపై కొంత పనిభారం తప్పించాలనే ఉద్దేశంతోనే వంటలకు శ్రీకారం చుట్టా. అంతేకాదు ఈ రోజు ఇల్లు కూడా శుభ్రం చేశా. మీరంతా కనీసం ఈ 21 రోజులైనా ఇళ్ళల్లో ఉండి తల్లికి ఇంటి పనుల్లో సాయపడండి. – ప్రదీప్, యాంకర్ (కరోనా ఎఫెక్ట్: ‘ఆమె మాట’కే ఇప్పుడు క్రేజ్) -
స్వాతికి తెలియదు
స్వాతికే కాదు.. సీతకు, శ్వేతకూ తెలియదు. పల్లవికి, ప్రవల్లికకూ తెలియదు. బాధ్యతగా ఆమె పప్పుల్నీ, ఉప్పుల్నీ లెక్కగట్టి మూడు పూటలా ఇంటిని నడిపిస్తున్నప్పుడు.. బాధ్యతగా అతడూ అప్పుల్నీ, తప్పుల్ని ఏరోజు కారోజు ఇంటికి రాగానే చీటీలో రాసి ఆమె చేతిలో పెట్టాలి. నెలకోసారి.. పే స్లిప్ చూపించడం కాదు. గైస్.. ఒక రూపాయి అప్పు చేసేముందు ఆమెకు ఫోన్ చేసి చెప్పండి.. ఫోన్‌కి పది రూపాయలు అవుతున్నా సరే! ఒక సంతకం పెట్టే ముందు ఆమె అనుమతి తీసుకోండి.. ఆమె కోసం మీరు కొనబోతున్న శ్వేత సౌధపు అగ్రిమెంట్ కాగితాలైనా సరే. ఉదయం ఆఫీస్‌కి వెళ్లిన నాన్న సాయంత్రం కొత్త కారుతో ఇంటికి వస్తే పిల్లలు వాకిట్లోకి ఒక్క గెంతు గెంతి ‘హే.. కొత్త కారు’ అని కారులోకి దూకి కూర్చుంటారు. మరీ చిన్నపిల్లలైతే వెళ్లి స్టీరింగ్ సీట్లో కూర్చొని స్టీరింగ్‌ని ‘జుయ్జుయ్’మని తిప్పుతారు. ‘మనదేనా నాన్నా’.. పిల్లలు అడిగే మొదటి ప్రశ్న. ‘ఎక్కడికెళ్దాం నాన్నా’.. రెండో ప్రశ్న. పిల్లల్ని ఎత్తుకుని బుగ్గలపై ముద్దుపెడుతూ భార్య వైపు చూస్తాడు అతడు. ‘మనదే కారు’ అంటూ ఒక ముద్దు. ‘నువ్వు చెప్పు ఎక్కడికెళదామో’ అంటూ ఇంకో ముద్దు. పిల్లలు అడిగినట్లే ఆమెకూ ఒక ప్రశ్న అడగాలని ఉంటుంది. ‘ఎక్కడిదండీ కారు?’ అని. కానీ అడగదు. అడిగితే, కారు ఎలా ఉందో చెప్పకుండా, కారు ఎలా వచ్చిందో చెప్పమని అడుగుతుందేమిటి’ అని భర్త నొచ్చుకుంటాడేమోనని ఆమె భయం. నొచ్చుకుంటాడన్న భయంతో ఆమె అతడిని చాలానే అడగలేదు. పెళ్లయి ఏడెనిమిదేళ్లు అవుతున్నా ఏ నెలలోనూ జీతమెంత అని భర్తను అడగలేదు. జీతంలో కటింగ్స్ ఎన్ని అని అడగలేదు. ఇంట్లోకి ఒకేసారి హైఎండ్ ఏసీ, ఫ్రిజ్, వాషింగ్‌మిషన్, టీవీ.. ఇంకా రెండుమూడు ‘చిన్న వస్తువుల్ని’ పిల్లల ఆటబొమ్మల్లా భుజాన మోసుకొచ్చిప్పుడు కూడా భుజం మీద నుంచి బరువును దింపిందే తప్ప, దింపాక పెరిగే వాటి బరువు గురించి అతడిని అడగలేదు. ‘ఈఎమ్ఐల్లో తెచ్చా. చిటికెలో అయిపోతాయి’ అని అన్నప్పుడు కూడా ఎవ్రీ మంత్ శాలరీ కన్నా, ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్ ఎక్కువైపోవు కదా’ అని అడగలేదు. అడిగితే అతడు నొచ్చుకుంటాడు. ‘చిన్న వస్తువుల్ని’ ఇంటికి తెచ్చిన కొన్నాళ్లకే ఓరోజు అతడు ఆమె కళ్లకు గంతలు కట్టి కారులో ఓ పెద్ద ఇంటికి తీసుకెళ్లాడు. గంతలు విప్పాక, కళ్లు నులుముకుని చూసి, అప్పుడు మాత్రం అడిగింది, ‘ఎవరిల్లండీ, బాగుంది’ అని! ‘మనదే!’ అనలేదు అతను. ‘నీదే’ అన్నాడు. ‘నీ కోసమే’ అన్నాడు. అతడెప్పుడూ అలాగే మాట్లాడతాడు. మాట్లాడ్డం కాదు, నిజంగానే అతడు చేసేవన్నీ ఆమె కోసమే. చేయాలనుకునేవన్నీ ఆమె కోసమే. ‘ఇప్పుడున్న ఇంటికే అంత అద్దె కడుతున్నాం. ఈ ఇంటికి ఇంకా ఎక్కువ ఉండదా’ అంది.. కొత్త గోడల్ని, కొత్త తలుపుల్ని, కొత్త కిటికీల్ని తడిమి చూస్తూ. పెద్దగా నవ్వి, ఆమె చుట్టూ చేతులు వేసి గాల్లోకి లేపాడు అతడు. ‘ఇది మన సొంతిల్లు. నీ కోసం, పిల్లల కోసం కొన్న ఇల్లు’ అన్నాడు. ‘ఇకనుంచి మనం అద్దె కట్టనక్కర్లేదు’ అన్నాడు. ‘ఆ కట్టేదేదో మన సొంత ఇంటికి కట్టుకుంటే సరిపోతుంది’ అన్నాడు. కట్టుకున్నది సొంతిల్లు అవుతుంది కానీ, నెల నెలా కట్టేది సొంతిల్లు అవుతుందా! ఆ మాటే ఆమె అనబోయింది. అతడు అననివ్వలేదు. ప్రశ్నలు కట్టిపెట్టు అని ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. అతడి చేతుల్లో ఆమె భద్రంగా ఉంది. ఇంత భద్రత కొత్తింట్లో ఉంటుందా.. పది వేల అద్దెకు బదులు నెలనెలా కట్టే ఇరవై వేల లోన్ కట్టవలసిన ఇంట్లో?! అతడు సంతోషంలో ఉన్నాడు. తనకొచ్చిన సందేహాలన్నీ భర్తకూ వచ్చి ఉంటాయి. అయినా సంతోషంగా ఉన్నాడూ అంటే.. తను వేరుగా సందేహపడాల్సిందేమీ లేదు. కుడికాలు లోపలికి పెట్టింది. పిల్లలు ‘ఓ.. ఓ..’ అంటూ కొత్తింట్లోని హాల్లోకి, బెడ్రూమ్లోకి, కిచెన్‌లోకి, బాత్రూమ్లోకి, బాల్కనీలోకి పరుగులు తీస్తున్నారు. ఎంత పిల్లల్తో పోటీపడి పరుగెత్తలేని కాలమైనా రోజుల్ని, వారాల్ని దాటి నెల దగ్గరికి వచ్చేస్తుంది. నెల తర్వాతి నెలకూ వచ్చేస్తుంది. ‘కాస్త టైట్‌గా ఉంది గురూ. వచ్చే నెల రెణ్ణెల్ల ఇంట్రెస్ట్ కలిపి ఇచ్చేస్తా..’ ఆమె వాకిట్లో ముగ్గేస్తోంది. అతడు ఆమెకు వినిపించనంత దూరం వెళ్లి ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆఫీస్‌లోనే కాదు, ఇంట్లో ఉన్నప్పుడైనా ఫోన్లో ఏ ఉద్యోగం చేస్తుంటే ఆ మాటలే రావాలి. టెకీ అయితే అదేదో జార్గాన్ ఉంటుంది. ఫ్లోచార్టు, డీబగ్, లైఫ్ సైకిల్, టెస్టబుల్ కోడ్.. ఇలాంటి మాటలు రావాలి. డాక్టర్ అయితే రిపోర్ట్స్ అనీ, ఇన్వెస్టిగేషన్ అనీ, మెడికల్ హిస్టరీ అనీ రావాలి. జర్నలిస్ట్ అయితే ప్రెస్‌మీట్ అని, స్కూప్ అనీ, లీడ్ అనీ ఏవో ఉంటాయి. అవి రావాలి. ఇవేమీ కాకుండా టైట్‌గా ఉందనీ, ఒకేసారి రెణ్ణెల్లదీ ఇచ్చేస్తాననీ అంటున్నాడంటే.. అదీ ముంగిట్లో ముగ్గు పడే వేళ నుంచే కొత్తగా ‘టైట్ టాక్’ మొదలవుతోందంటే.. ఏనాడూ భార్యాబిడ్డల్తో కలిసి కూర్చుని భోజనం చేసే స్థిమితం కూడా లేని అతడు.. త్వరలోనే త్వరగా ఇంటికి రాబోతున్నాడనే! త్వరగా ఇంటికి వచ్చిన ఆ రాత్రి.. తనని చూసి కేరింతలు కొడుతూ నిద్రమానుకున్న పిల్లలతో కలిసి.. తండ్రీ బిడ్డల్ని చూసి మురిసిపోతున్న భార్యతో కలిసి.. భోజనం చేయబోతున్నాడనే! బయటి నుంచి తను తెచ్చిన ‘ఫుడ్ ఐటమ్స్’ని అందరి భోజనంలో తలా ఇంత చేర్చి పిల్లలకు, భార్యకు తనే మొదటి ముద్ద తినిపించబోతున్నాడనే! హైదరాబాద్‌లో శనివారం రాత్రి ఇలాగే ఓ కుటుంబం ‘కలిసి భోజనం’ చేసింది! అతడు, ఆమె, ఇద్దరు పిల్లలు. ఆరేళ్లొకరికి. ఏడాదిన్నరొకరికి. టెకీ అతను. చిన్న వయసే. పెద్ద కంపెనీలో పని. పెద్ద జీతం. అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాడు. బిజినెస్ చేసి అప్పు తీర్చాలనుకున్నాడు. బిజినెస్ కోసం మళ్లీ అప్పు చేశాడు. బాగా బతకడం కోసం కాదు ఇవన్నీ. ఇంకా బాగా బతకడం కోసం. చివరికి బతకలేక తనను, కుటుంబాన్ని చంపుకున్నాడు! జీతం అప్పును పుట్టిస్తుంది. అప్పును కట్టలేదు. ఒకట్రెండు వాయిదాలైతే జీతం తీర్చేస్తుంది. అప్పుల్ని, వడ్డీల్ని తీర్చే కెపాసిటీ ఎంత పెద్ద జీతానికైనా ఉండదు. ఆ సంగతి అతడికెవరూ చెప్పలేకపోయారా! ఇంత జరుగుతోందని అతడెవరికైనా చెబితేనే కదా! భార్యకు కూడా చెప్పలేదు. చనిపోతూ తండ్రికి రాసిన ఉత్తరంలో మాత్రం చెప్పాడు. ‘స్వాతికి ఇవేవీ తెలియదు నాన్నా..’ అని చెప్పాడు! స్వాతి అతడి భార్య. అతడు నొచ్చుకుంటాడని అతడిని ఏనాడూ ఎందుకు, ఎలా అని అడగని భార్య.. ‘బతకాలని ఉంది స్వాతీ’ అని ఒక్కమాట అని ఉంటే.. బతకలేనంత కష్టం ఏమొచ్చిందో అడిగి తెలుసుకుని ఉండేది. కష్టమో, నష్టమో కలిసే బతుకుదాం అని ధైర్యం చెప్పి ఉండేది. మాటైనా చెప్పకుండా భార్యనీ పిల్లల్నీ తనతో తీసుకుపోయాడు! l -
‘భగత్ సింగ్ నగర్’ మోషన్ పోస్టర్ లాంచ్
గ్రేట్ ఇండియా మీడియా హౌస్ సమర్పణలో వలజ గౌరి, రమేష్ ఉడత్తు నిర్మాతలుగా, వలజ క్రాంతి దర్శకత్వంలో ప్రదీప్ వలజ, మిధున ధన్పాల్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం ‘భగత్ సింగ్ నగర్’. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి చేతుల మీదుగా ప్రసాద్ ల్యాబ్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ముందుగా ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీకి న్యూ కమర్స్ ట్రూ స్టోరీస్‌తో వస్తున్నారు. ఇది అభినందించవలసిన విషయం. భగత్ సింగ్ నగర్ అనగానే నాకు విజయవాడ గుర్తొచ్చింది. లవ్ థ్రిల్లర్ స్టోరీ అని విన్నాను. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియచేస్తున్నా అన్నారు. దర్శకుడు క్రాంతి మాట్లాడుతూ.. ‘కొత్త వాడిని అయినా, నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. ఇక సినిమా విషయానికి వస్తే... భగత్ సింగ్ నగర్ అనే స్లమ్ ఏరియాలో జరిగే లవ్ స్టోరీతో మొదలై థ్రిల్లర్‌గా టర్న్ అయ్యే చిత్రం. ఇక నిర్మాత రమేష్ గారు కేవలం డబ్బు పెట్టడమే కాదు.. నేను స్ట్రెస్‌లో ఉన్నప్పుడు చాలా మోటివేట్ చేసేవారు. ఆయన లేకపోతే నేను ఈ వేదిక లేదు. ఓ మంచి సినిమా చేసాము ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు. హీరో ప్రదీప్ వలజ మాట్లాడుతూ... ‘ముంబయిలో యాక్టింగ్ కోర్సు చేసాను. మా నాన్న మునిచంద్ర గారే దగ్గరుండి చేర్పించారు. ఇలా పేరెంట్స్ సపోర్ట్ ఉండటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అందుకు నేను మానాన్నకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక యాక్టింగ్ కోర్సు అవగానే అవకాశం కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. ఆ కష్టం లేకుండానే మా అన్నయ్య క్రాంతినే డైరెక్ట్ చేసి అవకాశం ఇచ్చాడు. కానీ షూటింగ్ టైంలో మాత్రం చాలా కష్టపెట్టాడు. మా కష్టానికి తగ్గట్టు సినిమా బాగోచ్చింది. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు. హీరోయిన్ మిధున ధన్ పాల్ మాట్లాడుతూ.. ‘మలయాళంలో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ అయ్యింది. తెలుగులో నా మొదటి సినిమా ఇది. అందరూ ఎంతో సహకరించారు. ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నా’ అన్నారు. నిర్మాత రమేష్ మాట్లాడుతూ... ‘ఎన్ ఆర్ ఐ అంటే ఏమీ తెలియదు అనుకుంటారు. కానీ మేము వెళ్ళేది కూడా ఇక్కడ నుంచే కదా.. అందులోనూ నేను ఒక బిజినెస్ మ్యాన్‌ను. నాకు తెలిసింది రెండే ఒకటి సక్సెస్, మరోటి ఫెయిల్యూర్. కనుక ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. మంచి సినిమా చేసాను అనే ఫీలింగ్ నాకుంది’ అన్నారు. -
విభేదాలే మణిక్రాంతి హత్యకు ప్రధాన కారణం
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మణిక్రాంతి హత్యకేసులో నిందితులను విజయవాడ పోలీసులు శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రధాన నిందితుడు ప్రదీప్‌తో పాటు క్యాబ్ డ్రైవర్ భవానీ ప్రసాద్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి, సెక్షన్ 302, 498-A కింద కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ విజయరావు మాట్లాడుతూ...భార్యభర్తల మధ్య విభేదాలే మణిక్రాంతి హత్యకు ప్రధాన కారణమన్నారు. సీసీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షులు, ఆయుధం పిడి, మృతురాలి రక్త నమూనా ఆధారంగా కేసు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. దారుణం: భార్య తలను శరీరం నుంచి వేరు చేసి.. హత్యకు ముందురోజు మణిక్రాంతి ఇంటివద్ద క్యాబ్ డ్రైవర్ భవానీ ప్రసాద్, ప్రదీప్ రెక్కీ నిర్వహించారన్నారు. అయితే తల లేకున్నా డీఎన్ఏ ద్వారా మృతదేహాన్ని గుర్తించవచ్చని అన్నారు. డీఎన్ఏ టెస్ట్ ద్వారా నిందితులకు శిక్షపడేలా చేస్తామన్నారు. వర్షాలతో పాటు వరదల కారణంగా తల కొట్టుకుపోయి ఉంటుందని తాము భావిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ సహకారంతో తల కోసం తీవ్రంగా గాలించామన్నారు. అలాగే హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు ప్రదీప్ ఉపయోగించిన సెల్ ఫోన్ కూడా ఇంకా దొరకలేదని తెలిపారు. నిందితుడు ప్రదీప్‌పై సత్యనారాయణపురం, సూర్యారావుపేట, మాచవరం పోలీస్ స్టేషన్స్ పరిధిలో పలు కేసులు ఉన్నాయన్నారు. చదవండి: మణిక్రాంతి కుటుంబానికి వాసిరెడ్డి పద్మ పరామర్శ కాగా ఈ నెల 11వ తేదీన విజయవాడ సత్యనారాయణపురం శ్రీనగర్ కాలనీలో మణిక్రాంతిని ఆమె భర్త ప్రదీప్ తలనరికి పాశవికంగా హత్య చేశాడు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మణిక్రాంతి భర్త ప్రదీప్‌పై పోలీసులకు దాదాపు 10సార్లు ఫిర్యాదు చేసింది. అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకుంది. ఈ క్రమంలో మణిక్రాంతిపై పగ పెంచుకున్న ప్రదీప్ ఆమెపై కత్తితో దాడి చేసి తల నరికి కాలువలో పడేశాడు. మణిక్రాంతి తల ఇంతవరకు దొరకలేదు. దీంతో తల లేకుండానే వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. వేరే గత్యంతరం లేకపోవడంతో కుటుంబ సభ్యులు మణిక్రాంతి మొండానికి అంత్యక్రియలు చేశారు. -
కొత్త ఇన్వెస్టర్ రూ.4,500 కోట్లు తేవాలి
న్యూఢిల్లీ: నిధుల కటకటతో బ్యాంకుల అధీనంలోకి వెళ్లిన జెట్ ఎయిర్వేస్ నిర్వహణకు కొత్త ఇన్వెస్టర్ కనీసం రూ.4,500 కోట్లను తీసుకురావాల్సి ఉంటుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ పేర్కొన్నారు. ఎస్బీఐ ఆధ్వర్యంలోని 26 బ్యాంకుల కమిటీ వచ్చే నెలలో జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించనున్నాయి. జెట్ ఎయిర్వేస్ చక్కని సంస్థ అని, ఇన్వెస్టర్ల నుంచి ఎంతో ఆసక్తి ఉన్నట్టు రజనీష్ కుమార్ చెప్పారు. ఏప్రిల్ 9 నాటికి ఆసక్తి వ్యక్తీకరణలను స్వీకరించి, ఏప్రిల్ 30 నాటికి బిడ్లను ఆహ్వానించాలన్నది బ్యాంకుల ప్రణాళిక. ‘‘ఫైనాన్షియల్ ఇన్వెస్టర్ లేదా ఎయిర్‌లైన్ లేదా నరేష్ గోయల్ లేదా ఎతిహాద్ ఎవరైనా కావొచ్చు. ఎయిర్‌లైన్‌ను సొంతం చేసుకునేందుకు ఎవరినీ నిషేధించలేదు’’ అని రజనీష్ కుమార్ అన్నారు. జీతాలు ఇవ్వండి బాస్.. పెండింగ్‌లో ఉన్న తమ జీతాలను వెంటనే ఇప్పించాలంటూ జెట్ పైలట్ల సంఘం నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ (ఎన్ఏజీ) ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్‌ను కోరింది. జీతాలు చెల్లించకపోతే ఏప్రిల్ ఒకటి నుంచి సేవలను నిలిపివేస్తామని 1,100 మంది ఉద్యోగులతో కూడిన ఈ సంఘం హెచ్చరించడం గమనార్హం. జెట్ ఎయిర్వేస్కు రూ.1,500 కోట్ల అత్యవసర లిక్విడిటీని అందించనున్నట్లు ఎస్బీఐ ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగుల నుంచి నూతన యాజమాన్యానికి విన్నపాలు పెరిగినట్లు తెలుస్తోంది. -
అసలు కథ
‘యాంకర్ రమ్య భారతి ఇక లేరు.. ఆమె వాక్చాతుర్యం, నవ్వు శాశ్వతంగా మనల్ని వీడి పోయాయి.. గుండెపోటుతో నిద్రలోనే కన్ను మూసిన అందాల తార... బుల్లి తెరకు తీరని లోటు...’ సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త హోరెత్తిపోయింది.రమ్య భారతి చాలా ఫేమస్ యాంకర్. నవ్వుతూ సందర్భోచిత వ్యాఖ్యానంతో, పంచ్‌లతో, సునిశిత హాస్యంతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఆమెకు అభిమానులెందరో ఉన్నారు. ఆమె ఇంటి ముందు జనం బారులు తీరారు. క్యాంపులో ఉన్న భర్త రాజశేఖర్‌కి ఫోన్ చేశారు. వెంటనే వచ్చాడు. వీరి మాటలు నమ్మక, ‘నా బంగారం నన్ను విడిచిపోదు...’ అంటూ ఆశగా డాక్టర్ని పిలిపించాడు. కాని అతని ఆశ నిరాశ చేస్తూ డాక్టర్ ఆమె మరణించిన విషయం ధ్రువపరచి వెళ్ళిపోయాడు. రాజశేఖర్ గుండెలవిసేలా ఏడుస్తున్నాడు. పని మనిషి ‘రాత్రి తొమ్మిది వరకు ఆమె బాగానే ఉంది’ అని చెప్పింది. బంధువులంతా వచ్చారు. దహనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అకస్మాత్తుగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇది సహజ మరణం కాదని, హత్య అని అనుమానంగా ఉందని రమ్య భారతి తల్లి ఫిర్యాదు చేసిందంటూ వచ్చి, ఆమె భర్తను, పనిమనిషిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ‘రమ్యతో పాటే టీవీ చానల్లో పనిచేసే ప్రదీప్ తరచు ఇంటికి వస్తుండే వాడని, రాజశేఖర్ లేనప్పుడల్లా ఇద్దరూ కలిసి తిరుగుతుండే వాళ్లని, ముందురోజు కూడా రాజశేఖర్ టూర్లో ఉండటంతో అతను రాత్రి చాలా పొద్దు పోయేవరకు ఉన్నాడని’ భయపడుతూ చెప్పింది పనిమనిషి. తెల్లవారి పనిమనిషి వచ్చేసరికి గడియ తెరిచే ఉందని, లోపలికెళ్ళేసరికి రమ్య భారతి ఒక్కతే మంచంపై పడుకుని ఉందని, ఇంకా లేవలేదని లేపబోతే చల్లగా తగిలిందని, ఇంటి పక్క వారికి చెబితే వారు అయ్యగారికి ఫోన్ చేశారని చెప్పింది. సీఐ బెడ్రూమ్ని పరిశీలించాడు. నిజంగానే అక్కడ ఘర్షణ జరిగినట్లు , పగిలిన చేతి గాజు ముక్క, అడ్డం పడి ఉన్న ఫ్లవర్ వాజు, ఆమె వెంట్రుకలు లాంటివి, పెరటి వైపు కారు టైర్ల గుర్తులు, బెడ్ రూమ్‌లో ప్రదీప్ వేలిముద్రలు అనుమానాస్పదంగా కనిపించాయి. కాని కేవలం వాటి వల్ల నిర్ధారణకు రాలేం. పరారవుతున్న ప్రదీప్‌ని అదుపులోకి తీసుకుని వారిదైన శైలిలో ప్రశ్నించారు. అతను ‘నాకూ, ఆమెకూ సంబంధం ఉంది. ఆ రోజు రాత్రి పన్నెండు గంటల వరకు ఆమెతో గడిపి వెళ్లిపోయాను. అంతకు మించి నాకే పాపం తెలీదు’ అన్నాడు.‘నంగనాచి... నా బిడ్డను నాశనం చేసి బుకాయిస్తున్నాడు, బంగారంలా చూసుకునే అల్లుడి నుంచి వల వేసి నా బిడ్డను లోబరుచుకున్నాడు. నాలుగు తగిలించండి... వాడే నిజం కక్కుతాడు... నా బిడ్డ దగ్గర నుంచి డబ్బంతా దోచుకున్నాడు..’ రమ్య భారతి తల్లి ఏడుస్తూ అరుస్తోంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి రాజశేఖర్‌కు సంకెళ్ళు వేశారు. అంతా నివ్వెర పోయారు. ‘సర్... నా భార్యను బంగారంలా చూసుకుంటాను.. అసలు నిన్నేం జరిగిందో నాకు తెలీదు.... తప్పు చేసిన వాడిని వదిలి, ఇప్పుడు వచ్చిన నన్ను ఇలా అనుమానించడం అమానుషం...’ గింజుకున్నాడు రాజశేఖర్.‘మిస్టర్... మాకు అన్ని ఆధారాలూ దొరికాయి.. నువ్వు నిన్న రాత్రి వెనక వైపు నుండి ఇంటికి వచ్చి ఆమెను చంపి మళ్ళీ వెళ్ళిపోయావు కదా.... నీ మీద అనుమానం రాకుండా ఉండటానికి అంతా ఫోన్ చేసి చెప్పాక అందరి ముందూ అప్పుడే వచ్చినట్లు బిల్డప్ ఇచ్చావు... ఇంకా బుకాయించకు. నిజాయతీగా ఒప్పేసుకుంటే శిక్ష తగ్గుతుంది..’ సీఐ హూంకరించాడు. షాక్ తిన్న రాజశేఖర్ ఇంకా బుకాయించడం వల్ల లాభం లేదనుకున్నాడు. ‘నిజమే... ఆమెను నా ప్రాణంలా చూసుకున్నా... కాని ఆమె మరొకరి వలలో పడింది. చూచాయగా వాళ్ళు వీళ్ళు ఈ విషయం నా దృష్టికి తీసుకొచ్చినా ఆమెను అనుమానించలేదు.. మీడియాలో ఇది మామూలే అనుకున్నా... ఎప్పుడు టూర్ కెళ్ళినా ఎప్పుడొస్తానో చెప్పేవాడిని. ఈసారి అలాగే రేపు వస్తానని చెప్పాను. కాని ముందు రోజే అంటే నిన్ననే అయిపోవడంతో రాత్రి ఇంటికి వచ్చాను. ఇంటి ముందు ఆగి ఉన్న కారు నాలో అనుమానాన్ని రేకెత్తించింది. ఇంటి వెనుక కారు ఆపి , వెనుక గేట్ గుండా బెడ్ రూమ్ కిటికీ దగ్గర కొచ్చాను. వాళ్ళిద్దరూ తప్పు చేస్తూ కనబడ్డారు. అసహ్యం వేసింది. ఎంత బాగా చూసుకున్నాను తనను, ఏడుపొచ్చింది. ఆ బాధలో ఆ చీకట్లో షాక్‌లో ఉండగానే ప్రదీప్ వెళ్ళిపోయాడు. నేను లోనికెళ్ళాను. కొంచెం కంగారు పడింది. మాటలతో అనవసరం అనిపించింది. రేపటి వరకు టూర్ కాబట్టి ఇప్పటి వరకు ప్రదీప్ ఉన్నాడు కాబట్టి , చంపితే ఎవరికీ అనుమానం రాదనుకున్నాను. అదే బెడ్ రూమ్‌లో దిండుతో ఆమె ముఖంపై అదిమి ఊపిరి ఆడకుండా చేశాను. తర్వాత పక్క సరి చేసి, చక్కగా నిద్రపోయినట్లు పడుకోబెట్టి , కింద పడిన గాజుపెంకులు అవి ఏరి , వెళ్ళిపోయాను. నా బెడ్రూమ్లో నా ఫింగర్ ప్రింట్స్, భర్తనే కాబట్టి అనుమానం రాదు, ప్రదీప్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ ఎవరైనా అనుమానించినా అటే అనుమానం వెళుతుంది అనుకున్నా. కాని మీరింత తొందరగా ఎలా కనిపెట్టారో నాకింకా అర్థం కావడం లేదు..’ అయోమయంగా అన్నాడు. ‘దోషి ఎదో ఒక చోట ఎప్పుడైనా చట్టానికి దొరికి పోతాడు. ఇంటి వెనక ఉన్న మీ కారు టైర్ గుర్తులు, వీధి మలుపు పై ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలో రాత్రి మీ కారు ఈ వీధిలోకి రావడం వెళ్ళడం రికార్డ్ అయ్యింది. చనిపోయిన సమయం దానికి సరిగ్గా సరిపోయింది. ఇలాంటివెన్నో చూసిన అనుభవం... ఎప్పటికీ డబ్బులిచ్చి, ప్రేమ కురిపించే ఆమెను ప్రదీప్ చంపడానికి కారణం కూడా కనిపించలేదు. భర్త కనుక సహజంగానే మరొకరితో ఉన్న బంధం బాధిస్తుంది, ఆ కోణంలో దర్యాప్తు చేశాం..’ అంటూ ముగించాడు సీఐ. - నామని సుజనా దేవి -
ఎలా బయటపడ్డారు?
అమర్, ప్రదీప్ వర్మ, ఉదయ్, అభి, సి.టి, ఖాదర్, లక్ష్మీ, శృతి, కావ్య, దేవి, వీణ, జాస్మిన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘చెడ్డీ గ్యాంగ్’. ఇందులో శ్రీనివాస రెడ్డి కీలక పాత్ర పోషించారు. కనగాల రమేష్ చౌదరి దర్శకత్వంలో విక్కి రాజ్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమైంది. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. రమేష్ మాట్లాడుతూ– ‘‘దాదాపు 32ఏళ్లుగా అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్‌గా చిత్రపరిశ్రమలో పని చేసిన నేను దర్శకునిగా తెరకెక్కించిన తొలి చిత్రమిది. సాఫ్ట్వేర్ కంపెనీలో బాగా పనిచేసే ఓ పది మంది ఉద్యోగులను ఆ కంపెనీ ఎండీ కేరళ టూర్‌కి పంపిస్తాడు. కేరళ అడవుల్లో జరుగుతున్న కోయవారి జాతరకు వెళ్లిన ఆ పదిమంది అక్కడే ఇరుక్కుపోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితుల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎలా బయటపడ్డారనేది చిత్రకథాంశం. మలేసియాలో తీసిన క్లైమాక్స్ ఓ హైలైట్. దాదాపు 125 రోజుల పాటు రెండు షెడ్యూల్స్‌లో ఈ సినిమాను తెరకెక్కించాం. బాలీవుడ్ బ్యూటీ స్నేహా కపూర్ చేసిన స్పెషల్ సాంగ్ అదనపు ఆకర్షణ’’ అన్నారు. ఈ సినిమాకు ప్రదీప్ వర్మ సంగీతం అందించారు. -
బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా యాంకర్ ప్రదీప్
బిగ్‌బాస్ సీజన్ 2కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వ్యాఖ్యాత నేచురల్ స్టార్ నాని శని, ఆది వారాల్లో చెబుతున్న పిట్టకథలు, హౌస్‌మేట్స్‌తో జరుపుతున్న సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నాని ముందుగా చెప్పినట్టుగానే ఏమైనా జరగవచ్చు అన్నది నిజమే అనిపిస్తోంది. బిగ్‌బాస్ హౌజ్‌లో ఎలిమినేషన్‌తో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా కొత్త సెలబ్రిటీల ఎంట్రీ ఉండటంతో బిగ్ బాస్ హౌస్‌కి రాబోతున్న కంటెస్టెంట్ ఎవరన్నదానిపై సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సీజన్ వన్‌లో వైల్డ్‌కార్డు ద్వారా దీక్షా పంత్, నవదీప్‌లు హౌజ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా బిగ్ బాస్ హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హీరోయిన్ హెబ్బా పాటేల్ వస్తుందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యాంకర్ ప్రదీప్ మాచిరాజు బిగ్‌బాస్ హౌస్‌కి లగేజ్‌తో సహా దిగిన ఓ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ప్రదీప్‌ను చూసిన కంటెస్టెంట్లంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రదీప్ రాగానే అందరూ హత్తుకుని అతనికి ఆహ్వానం పలికారు. ప్రదీప్ నువ్వు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండవులే.. వారం రోజుల్లో పంపించేస్తాం అని ఆటపట్టించగా.. రాగానే మొదలు పెట్టారా అని ప్రదీప్ సమాధానం ఇచ్చారు. మీ వాడిని మీలో ఒడిని కాబట్టి మీలాగ ఇక్కడికి ఖాళీ చేతులతో రాదలచుకోలేదని చెప్పి, ఒక్కొక్కరి గురించి చెబుతుండగా.. కంటెస్టెంట్లు అందరూ కంటతడి పెట్టుకున్నారు. పోను పోను నేను పోకుండా ఉండటానికే ప్రయత్నం చేస్తానని ప్రదీప్ పేర్కొన్నారు. అయితే 16 మందితో మొదలైన బిగ్ బాస్ షో ను ఇప్పటికే ఐదు మంది (సంజన, నూతన్ నాయుడు, కిరిటీ, శ్యామల, భానుశ్రీ) హౌజ్ నుంచి ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం 12 మంది ఉన్నారు. ప్రదీప్ హౌజ్‌లో ఎన్ని రోజులు ఉంటారో వేచిచూడాల్సిందే. అయితే ఆయన గెస్ట్‌గా మాత్రమే హౌజ్‌లోకి వచ్చారని తెలుస్తోంది. . @impradeepmachi makes a Grand Entry to the Bigg House 😉#BiggBossTelugu2 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/mXZVXMnjCl — STAR MAA (@StarMaa) July 19, 2018 -
గుర్రమెక్కావా? అయితే చచ్చావే..
ఒకప్పుడు.. వాళ్లు వీధుల్లో నడిస్తే మట్టి మలినమవుతుందన్నారు.. అడుగులను చెరిపేసేందుకు వెనక తాటాకులు కట్టుకోమన్నారు.. ఉమ్మి నేలపైపడ్డా అరిష్టమేనని మూతికి ముంత తగిలించి తిరగమన్నారు.. వారి మేనిని సోకే గాలిని మళ్లించలేమనుకున్నారేమో.. ఊరుఊరునే తూర్పుకి తరలించేశారు.. కాలం మారిందని.. ఇప్పుడా పరిస్థితి లేదనుకుంటున్నారేమో.. దళితులపై దాష్టీకానికి తాజా తార్కాణం గుజరాత్లో వెలుగు చూసింది.. గుర్రమెక్కాడని.. పట్టుమని పాతికేళ్లయినా నిండని యువకుడిని పొట్టన బెట్టుకున్నారు. గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలోని తంబి ఓ కుగ్రామం.. అక్కడ నివసించే ప్రదీప్ రాథోడ్ అనే యువకుడు.. చాలా ముచ్చటపడి.. తండ్రి చెవినిల్లు కట్టి మరీ ఓ గుర్రాన్ని కొనుక్కున్నాడు. అప్పుడప్పుడూ గుర్రమెక్కి సవారీకి వెళ్లడమూ ప్రదీప్‌కు ఇష్టమైన పని. ఇది కాస్తా.. అక్కడి రాజ్‌పూత్‌లకు కంటగింపుగా మారింది. అగ్గి మీద గుగ్గిలమయ్యారు. గుర్రం దిగు, లేదా నీ కడుపులో బల్లేలు దిగుతాయన్నారు. ఆ ఊళ్లో వాళ్లే కాదు పక్క ఊళ్లలోని వాళ్లు కూడా బెదిరింపులకు దిగారు. నువ్వు గుర్రం ఊసెత్తొద్దని.. అయినా వింటేనా? నా గుర్రం.. నా ఇష్టం అన్నాడు ప్రదీప్. షేడెడ్ జీన్స్ వేసుకుని, కాలుమీద కాలేసుకుని, గుర్రం మీద దర్జాగా రాజులా కూర్చొని ఫొటోకి ఫోజు కూడా ఇచ్చాడు ఆత్మగౌరవం కలిగిన ఆ కుర్రాడు. అంతే అగ్రవర్ణాలకి కడుపులో కాలింది. ఒక రోజు.. ఠీవీగా ప్రదీప్‌ని ఎక్కించుకుని వెళ్లిన గుర్రం ఒంటరిగా తిరిగొచ్చింది. రాథోడ్ తండ్రి గుండెలు గుభేలుమన్నాయి. యజమాని ప్రదీప్ రాథోడ్‌ని చంపేశారు. ఈ ఘటన గత నెలాఖరున జరిగింది. ప్రదీప్ ఒక్కడే కాదు సుమా! గుజరాత్లో ఇలాంటి చావులు కొత్తకాదు. అమ్మాయిలపై అకృత్యాలు అంతకన్నా కొత్తకాదు. అక్కడ భూస్వాములైన క్షత్రియులు చెప్పిందే శాసనం. కాదూ కూడదంటే రాథోడ్లాగే తలెగరేసిన వారి తలలు తెగనరికేస్తారు. కేసులేవీ ఠాణాలకు ఎక్కనూ ఎక్కవు. ఇది అన్యాయమని ఎవరైనే ప్రశ్నిస్తే ‘అబ్బే ఆ కుర్రాడంత మంచోడేం కాదు. గతంలో ఎప్పుడో ఓ అమ్మాయి ముందు పిల్లిమొగ్గలు వేసిన ‘దుష్ట చరిత్ర’కూడా ఉంద’ని కాకమ్మ కబుర్లు చెప్పే ఘటికులు అక్కడి ఖాకీలు. -
ప్రదీప్ ట్వీట్ : వెంటనే స్పందించిన కేటీఆర్
బుల్లి తెర యాంకర్‌గా మంచి పేరు సంపాదించుకున్న ప్రదీప్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. డ్రంక్ అండ్ డ్రైవ్ సమయంలో ప్రదీప్ పోలీసులకు పట్టుబడినప్పటికీ, అతన్ని వదిలేయమంటూ ఏకంగా పోలీసులకే రిక్వెస్ట్‌లు పెట్టారు. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రదీప్.. తాజాగా ఓ మంచి పనిచేసి మళ్ళీ వార్తల్లో నిలిచాడు. టాయిలెట్ లేని పాఠశాల అంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ట్విట్టర్లో పోస్టు పెట్టింది. చర్లపల్లిలో 40 ఏళ్ల క్రితం ఈ పాఠశాలను నిర్మించారు. కానీ ఇప్పటివరకు ఆ పాఠశాలలో టాయిలెట్ లేదు. ఆ స్కూల్లో 120 మంది అమ్మాయిలు, 100 మంది అబ్బాయిలు చదువుకుంటున్నారు. టాయిలెట్స్ లేని కారణంతో విద్యార్ధులు భోజనం తర్వాత మంచి నీళ్లు కూడా తాగరు. ఎందుకంటే నీళ్ళు తాగితే టాయిలెట్ కొస్సాం చాలా దూరం వెళ్లాల్సి వస్తుందని తెలుపుతూ వీ కేర్ అనే ఎన్జీవో సంస్థ ఈ ట్వీట్ చేసింది. ఈ పోస్ట్‌పై యాంకర్ ప్రదీప్ స్పందించాడు. ఈ పోస్టును రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ....చర్లపల్లిలోని ఆ పాఠశాలకు తమ టీమ్ వెళ్లి పరిశీలించిందని, నిజంగానే అక్కడ చాలా సమస్యలున్నాయని ప్రదీప్ ట్వీట్ చేశాడు. ప్రధానంగా బాలికలు టాయిలెట్ లేకపోవడంతో చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, ఆ పాఠశాలలో చదువుకొంటున్న బాలికల కోసం ఏదైనా చేయమని మంత్రి కేటీఆర్‌ను కోరాడు. ప్రదీప్ ట్వీట్‌పై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ తక్షణ చర్యల కోసం మేడ్చల్ కలెక్టర్‌ను ఆదేశించారు. పని పూర్తి అయ్యాక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కూడా చెప్పారు. కేటీఆర్ ఆదేశాలపై స్పందించిన కలెక్టర్.. డీఈవో రేపు ఆ పాఠశాలకు వెళ్ళి టాయిలెట్లను పరిశీలిస్తారు. పాత వాటి స్థానంలో కొత్తవి నిర్మిచేలా చర్యలు తీసుకుంటామని ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించడంపై ప్రదీప్ హర్షం వ్యక్తం చేశాడు. కేటీఆర్‌కు ధన్యవాదలు తెలిపాడు. A School with No Toilet This Govt School in Cherlapally was constructed 40 years but does not have a toilet.There are 120 girls and 100 boys. Children do not drinking adequate water after their lunch as they had to go long distances to relieve themselves. Please help@KTRTRS pic.twitter.com/fpYehP57QC — V Care NGO (@NGOVcare) February 7, 2018 Our team checked it personally..kids facing lots of problems...specially girls@KTRTRS sir can we do sumthing asap pls@bonthurammohan https://t.co/05BUjE7P2s — Pradeep Machiraju (@impradeepmachi) February 9, 2018 Thanks Collector Garu. Pls post the pictures after work is done so as to bring closure https://t.co/yVcLNqJMXN — KTR (@KTRTRS) February 10, 2018 Thanqsomuch sir🙏 https://t.co/isQBQoE9dN — Pradeep Machiraju (@impradeepmachi) February 9, 2018 -
అనగనగా ఓ దెయ్యం
‘‘ఇప్పటివరకూ ఎన్నో దెయ్యం సినిమాలు వచ్చాయి. కానీ, మా ‘దెయ్యం చెప్పిన కథ’ చిత్రం హారర్ సినిమాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. మూస ధోరణి కాకుండా విభిన్నమైన కథా, కథనాలతో పూర్తి హారర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాం’’ అని దర్శకుడు ప్రదీప్ అన్నారు. నూతన నటీనటులతో ఆయన దర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్‌చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎస్వీయన్‌రావు సారథ్యంలో ఆరాధ్య ప్రొడక్షన్స్ పతాకంపై పెనాక దయాకర్‌రెడ్డి ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ప్రదీప్ మాట్లాడుతూ– ‘‘దెయ్యం ప్రధాన పాత్రగా సాగే ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేసేలా ఉంటుంది. అన్ని సినిమాల్లాగా కమర్షియల్ హంగులు, సెట్టింగులు ఉండవు. ఈ చిత్రం ద్వారా 29 మంది కొత్తవారిని పరిచయం చేయబోతున్నాం. హీరోయిన్ అరోహి బాగా యాక్ట్ చేసింది’’ అన్నారు. ‘‘చిన్న బడ్జెట్లో ప్రదీప్ ఈ సినిమాను చక్కగా తెరకెక్కిస్తున్నారు. చిత్రాన్ని మార్చిలో విడుదల చేయాలనుకుంటున్నాం. ప్రదీప్ దర్శకత్వంలోనే ‘దెయ్యంతో ఓ రాత్రి’ చిత్రాన్ని ఫిబ్రవరిలో ప్రారంభిస్తున్నాం’’ అన్నారు దయాకర్‌రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: నవీన్ .జె, కెమెరా, ఎడిటింగ్, దర్శకత్వం: ప్రదీప్. -
మళ్లీ తప్పు చేయను: ప్రదీప్
సాక్షి, హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడిపిన కేసులో టీవీ యాంకర్ మాచిరాజు ప్రదీప్‌కు కోర్టు గట్టి షాకిచ్చింది. ఆయన డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడేళ్ల పాటు రద్దు చేసింది. రూ.2,100 జరిమానా విధించింది. ఈ మేరకు నాంపల్లి కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగిన ప్రదీప్.. అనంతరం కారు నడుపుతూ జూబ్లీహిల్స్‌లో పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ తనిఖీల్లో పట్టుబడిన విషయం తెలిసిందే. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో ఆయన ‘బ్లడ్ ఆల్కాహాల్ కౌంట్ (బీఏసీ) ఏకంగా 178 పాయింట్లుగా నమోదైంది. దీంతో ఆయన కారును సీజ్ చేసిన పోలీసులు.. ప్రదీప్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు నిర్వహించే కౌన్సెలింగ్‌కు ప్రదీప్ హాజరుకావాల్సి ఉన్నా.. కొద్ది రోజులపాటు కనబడకుండా పోయారు. అయితే ముందే నిర్ణయమైన మేరకు షూటింగులలో పాల్గొనాల్సి వచ్చిందని.. పోలీసులు, కోర్టుల ఆదేశాల మేరకు నడుచుకుంటానని ఒక వీడియో విడుదల చేశారు. తర్వాత ఈ నెల 8న గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో పోలీసుల కౌన్సెలింగ్‌కు తన తండ్రితో కలసి హాజరయ్యారు. తాజాగా శుక్రవారం కోర్టులో విచారణకు హాజరయ్యారు. తప్పు అంగీకరించిన ప్రదీప్ శుక్రవారం ఉదయం సాధారణ డ్రంకెన్ డ్రైవ్ కేసులను విచారించిన నాంపల్లి కోర్టు న్యాయమూర్తి.. 150 పాయింట్లకన్నా ఎక్కువ బీఏసీ నమోదైన కేసులను మధ్యాహ్నం విచారించారు. దీంతో ప్రదీప్ సుమారు రెండు గంటల సమయంలో కోర్టుకు వచ్చారు. కోర్టు హాల్లోకి వెళ్లగానే న్యాయమూర్తికి నమస్కారం చేశారు. మీ పేరు, తండ్రి పేరు ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించగా.. ప్రదీప్ సమాధానాలు చెప్పారు. ‘‘మద్యం తాగి కారు నడిపారా, మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా?’’అని న్యాయమూర్తి అడగగా.. ప్రదీప్ ‘‘నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. మద్యం తాగి కారు నడిపాను..’’అని అంగీకరించారు. దీంతో న్యాయమూర్తి స్పందిస్తూ... ‘‘మీరు మద్యం తాగి వాహనాలు నడపవద్దని ప్రచారం చేశారని చెబుతున్నారు.. మీరే మద్యం తాగి కారు నడపడం ఏమిటి..?’’అని ప్రశ్నించారు. దీంతో ప్రదీప్ న్యాయమూర్తికి నమస్కరిస్తూ.. ‘‘తప్పు జరిగింది. మళ్లీ ఇలాంటి తప్పు చేయను. నా కారుకు డ్రైవర్ ఉన్నారు. కానీ ఘటన జరిగిన రోజున డ్రైవర్ రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నేనే కారు నడపాల్సి వచ్చింది..’’అని వివరణ ఇచ్చారు. అనంతరం న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడేళ్లపాటు రద్దు చేయడంతోపాటు రూ.2,100 జరిమానా విధించారు. మళ్లీ తప్పు చేయను: ప్రదీప్ కోర్టు నుంచి బయటకు వచ్చిన ప్రదీప్ మీడియాతో మాట్లాడారు. ‘పోలీసుల కౌన్సెలింగ్ తర్వాత కోర్టుకు హాజరుకావాలని ఆదేశించడంతో కోర్టుకు వచ్చాను. న్యాయవాదిని పెట్టుకోలేదు. న్యాయమూర్తి నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ముందుగానే నిర్ణయించుకున్నాను. మద్యం తాగి వాహనం నడిపానని న్యాయమూర్తి ముందు ఒప్పుకున్నాను. మళ్లీ ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటా..’’అని పేర్కొన్నారు. -
ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కోర్టు సంచలన తీర్పు
-
నాంపల్లి కోర్టుకు హాజరైన ప్రదీప్
సాక్షి, హైదరాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు విచారణ నిమిత్తం టీవీ యాంకర్ ప్రదీప్ శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. తండ్రితో కలిసి ప్రదీప్ ఇవాళ కోర్టుకు వచ్చాడు. మరోవైపు ప్రదీప్ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, డ్రంక్ అండ్ డ్రైవ ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. గత ఏడాది డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి జరిపిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ప్రదీప్ పరిమితి మించి మద్యం సేవించి వాహనాన్ని నడుపుతూ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. బ్రీత్ అనలైజర్‌లో సుమారు 178 పాయింట్లు చూపించింది. దీంతో ప్రదీప్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8న తన తండ్రితో కలసి గోషామహల్‌లోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్‌కు ప్రదీప్ హాజరయ్యాడు. ఈ కౌన్సిలింగ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే అనర్థాలు వివరించడంతోపాటు.. మరోసారి తాగి వాహనం నడుపవద్దంటూ ప్రదీప్‌కు పోలీసుల సూచనలు ఇచ్చారు. ఇక తాను చేసిన తప్పును మరెవరూ చేయవద్దంటూ ప్రదీప్ ఓ వీడియోను పోస్ట్ చేసిన విషయం విదితమే. -
22న కోర్టుకు యాంకర్ ప్రదీప్
హైదరాబాద్: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ యాంకర్ మాచిరాజు ప్రదీప్ ఈ నెల 22న కోర్టుకు హాజరు కానున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ అధికారులకు ఆయన సమాచారం అందించారు. గత నెల 31న అర్ధరాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నం. 45లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో ప్రదీప్ మద్యం సేవించి కారు నడుపుతూ పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 8న తన తండ్రితో కలసి గోషామహల్‌లోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. అనంతరం ఈ నెల 16న కోర్టుకు హాజరవుతానని ఇటీవల పోలీసులకు సమాచారం ఇచ్చారు. 16న కోర్టుకు సెలవు కావడంతో మళ్లీ 22కి ఆయన హాజరు వాయిదా పడింది. నాంపల్లిలోని నాలుగో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు ప్రదీప్‌ను పోలీసులు హాజరు పరచనున్నారు. అదేరోజు ఆయనకు శిక్ష ఖరారు కానుంది. -
రెండు రోజులు టైం ఇవ్వండి: ప్రదీప్
సాక్షి, హైదరాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన బుల్లి తెర నటుడు ప్రదీప్ నేడు (బుధవారం) నాంపల్లి కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే తాను షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉండలం వల్ల కోర్టుకు హాజరు కాలేక పోతున్నానని, మరో రెండు రోజులు గడువు ఇవ్వాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. ప్రదీప్ వినతిని పరిగణలోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు రెండు రోజుల అనంతరం విచారణకు హాజరవ్వాలని ఆదేశించారు. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి జరిపిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ప్రదీప్ పరిమితి మించి మద్యం సేవించి వాహనాన్ని నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. బ్రీత్ అనలైజర్‌లో సుమారు 178 పాయింట్లు చూపించింది. దీంతో ప్రదీప్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ప్రదీప్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో ప్రదీప్ కౌన్సిలింగ్‌కు వస్తాడా? రాడా? అన్నది తెలియక పోలీసులు సైతం అయోమయంలో పడ్డారు. అయితే తాను ఎక్కడికీ వెళ్లలేదని, షూటింగ్ ఉండటం వల్లనే హాజరు కాలేకపోయానని ప్రదీప్ తెలిపాడు. ఈ నెల 8వ తేదీన తన తండ్రితో కలిసి గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యాడు. కౌన్సిలింగ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే అనర్థాలు వివరించడంతోపాటు.. మరోసారి తాగి వాహనం నడుపవద్దంటూ ప్రదీప్‌కు పోలీసుల సూచనలు ఇచ్చారు. -
నేను చేసింది దయచేసి ఎవరూ చేయకండి!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ యాంకర్ ప్రదీప్ సోమవారం పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. గంటకుపైగా ప్రదీప్ కౌన్సెలింగ్ కొనసాగింది. అనంతరం ప్రదీప్ మీడియాతో మాట్లాడారు. పోలీసులు ఇచ్చిన తేదీ ప్రకారమే తాను కౌన్సెలింగ్‌కు హాజరయ్యానని, తాను కౌన్సెలింగ్‌కు రాకపోవడం ఏమీలేదని ప్రదీప్ తెలిపారు. ఈ విషయంలో చట్టప్రకారంగా నిబంధనలన్నింటినీ అనుసరించినట్టు తెలిపారు. ‘పోలీసుల కౌన్సెలింగ్‌లో చాలా విషయాలు తెలుసుకున్నాను. కౌన్సెలింగ్ చాలా కీలకమైంది. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయన్నది, తాగి నడపడం వల్ల శరరీంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఎందుకు తాగి నడపకూడదు అన్నది కౌన్సెలింగ్‌లో చాలా క్లారిటీగా వివరించారు. ఈ విషయాలను నాకు తోచినంత వరకు మిగతావారికి చెప్పేందుకు ప్రయత్నిస్తాను. ఈ విషయంలో నాకు సహకరించిన ట్రాఫిక్ పోలీసులు, మీడియా, కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు అందరికీ ధన్యవాదాలు’ అని ప్రదీప్ అన్నారు. ’ నేను చేసింది దయచేసి ఇంకెవరూ చేయకండి’ అని ఆయన ప్రజలను కోరారు. గత నెల 31వ తేదీ అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన యాంకర్ ప్రదీప్ సోమవారం గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ప్రదీప్ గతకొన్ని రోజులుగా పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజరుకాని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రదీప్ వస్తాడా? రాడా? అన్నది తెలియక పోలీసులు సైతం అయోమయంలో మునిగిపోయిన తరుణంలో ఎట్టకేలకు ట్రాఫిక్ పోలీసుల ముందు ప్రదీప్ హాజరయ్యాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే అనర్థాలు వివరించడంతోపాటు.. మరోసారి తాగి వాహనం నడుపవద్దంటూ ప్రదీప్‌కు పోలీసుల సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. తండ్రితో కలిసి ప్రదీప్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యాడు. వాహనం నడుపుతున్న సమయంలో ఏరకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కుటుంబసభ్యులకు పోలీసులు వివరించనున్నారు. బేగంపేటకు వస్తానని.. గోషామహల్‌కు..! డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిపోయిన ప్రదీప్ వ్యవహారశైలి ఇన్నాళ్లు అంతుపట్టనిరీతిలో ఉన్న సంగతి తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం బేగంపేట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ప్రదీప్ కౌన్సెలింగ్‌కు హాజరవుతారని భావించారు. ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ చౌహాన్‌కు ప్రదీప్ సమాచారం కూడా అందించారు. కానీ ప్రదీప్ అనూహ్యంగా గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రదీప్ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోవడంతో పోలీసులు కేపీహెచ్‌బీలోని ఆయన కార్యాలయంతోపాటు మణికొండలోని నివాసంలో నోటీసులు అందించేందుకు ప్రయత్నించారు. అయితే, అతను అందుబాటులో లేకపోవడంతో వెనక్కి వచ్చారు. దీంతో ప్రదీప్ పరారీలో ఉన్నట్లు ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. ఇది తెలుసుకున్న ప్రదీప్ గత శుక్రవారం వీడియో ద్వారా తాను త్వరలోనే కౌన్సెలింగ్‌కు హాజరుకాబోతున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం తల్లి లేదా భార్యను కౌన్సెలింగ్‌కు తీసుకురావాల్సి ఉంటుంది. పెళ్లి కాలేదు కాబట్టి తల్లిని తీసుకొని రావాలని నిబంధనలను పోలీసులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా కారు అద్దాలకు బ్లాక్‌ఫిలిం ఏర్పాటు చేసుకున్న ఘటనలోనూ ప్రదీప్‌పై పోలీసులు జరిమానా విధించేందుకు సిద్ధమవుతున్నారు. -
కౌన్సిలింగ్‌కు వస్తాడా...?
-
డ్రంకెన్ డ్రైవ్ కేసు : ప్రదీప్ ఎక్కడ?
హైదరాబాద్: డ్రంకెన్‌డ్రైవ్ కేసులో దొరికిపోయిన టీవీ యాంకర్ ప్రదీప్ వ్యవహారశైలి అంతుపట్టనివిధంగా తయారైంది. సోమవారం మధ్యాహ్నం బేగంపేట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్‌కు ప్రదీప్ హాజరుకావాల్సి ఉంది. ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ చౌహాన్‌కు ప్రదీప్ సమాచారం కూడా అందించారు. కానీ ప్రదీప్ బేగంపేట స్టేషన్‌కు వస్తారా, రారా అనే సందిగ్ధంనెలకొంది. డిసెంబర్ 31న అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రదీప్ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోవడంతో పోలీసులు కేపీహెచ్‌బీలోని ఆయన కార్యాలయంతోపాటు మణికొండలోని నివాసంలో నోటీసులు అందించేందుకు యత్నించి అందుబాటులో లేకపోవడంతో వెనక్కి వచ్చారు. దీంతో ప్రదీప్ పరారీలో ఉన్నట్లు ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. ఇది తెలుసుకున్న ప్రదీప్ గత శుక్రవారం వీడియో ద్వారా తాను కౌన్సెలింగ్‌కు హాజరుకాబోతున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం తల్లి లేదా భార్యను కౌన్సెలింగ్‌కు తీసుకురావాల్సి ఉంటుంది. పెళ్లి కాలేదు కాబట్టి తల్లిని తీసుకొని రావాలని నిబంధనలను పోలీసులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా కారు అద్దాలకు బ్లాక్‌ఫిలిం ఏర్పాటు చేసుకున్న ఘటనలోనూ ప్రదీప్‌పై పోలీసులు జరిమానా విధించేందుకు సిద్ధమవుతున్నారు. -
కౌన్సెలింగ్‌కు హాజరుకానున్న ప్రదీప్
హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు పట్టుబడి, తప్పించుకు తిరుగుతున్న ప్రముఖ యాంకర్ మాచి రాజు ప్రదీప్ సోమవారం బేగంపేట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్‌కు హాజరుకానున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ చౌహాన్‌కు ప్రదీప్ సమాచారం అందించారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రదీప్ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోవడంతో పోలీసులు కేపీహెచ్‌బీలోని ఆయన కార్యాలయంతోపాటు మణికొండలోని నివాసంలో నోటీసులు అం దించేందుకు యత్నించి అందుబాటులో లేకపోవడంతో వెనక్కి వచ్చారు. దీంతో ప్రదీప్ పరారీలో ఉన్నట్లు ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. ఇది తెలుసుకున్న ప్రదీప్ శుక్రవారం వీడియో ద్వారా తాను కౌన్సెలింగ్‌కు హాజరుకాబోతున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం తల్లి లేదా భార్యను కౌన్సెలింగ్‌కు తీసుకురావాల్సి ఉంటుంది. పెళ్లి కాలేదు కాబట్టి తల్లిని తీసుకొని రావాలని నిబంధనలను పోలీసులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా కారు అద్దాలకు బ్లాక్‌ఫిలిం ఏర్పాటు చేసుకున్న ఘటనలోనూ ప్రదీప్‌పై పోలీసులు జరిమానా విధించేందుకు సిద్ధమవుతున్నారు. -
ప్రదీప్ పిల్లోడు.. పిల్లోడైతే పాలు తాగాలి!
సాక్షి, హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన యాంకర్ ప్రదీప్ వ్యవహారం ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అడ్డంగా దొరికిపోయినప్పటికీ పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజరుకావడానికి ప్రదీప్ ముందుకు రావడంలేదు. కారణం ఏమిటంటే.. నాకు షూటింగ్‌లు ఉన్నాయి.. అందుకే రావడం లేదు అని ఓ వీడియో మెసేజ్ పోస్టు చేశాడు. ఇంకా రెండురోజులు చూసి ప్రదీప్‌కు వ్యతిరేకంగా వారెంట్ జారీచేయాలని హైదరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు యాంకర్ ప్రదీప్ వ్యవహారంపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చనే జరుగుతోంది. మద్యం తాగి వాహనాలు నడపవద్దంటూ ప్రజలకు హితవు పలికిన ప్రదీప్ ఆఖరికీ మద్యం తాగి వాహనం నడుపుతూ దొరికిపోయాడు. అతని బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో ఏకంగా 178 పాయింట్లు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ యాంకర్ ప్రదీప్‌పై అభిమానం చాటుకునేలా కామెంట్ పెట్టారు. "సార్ మా యాంకర్ ప్రదీప్ ని ఒగ్గేయండి. పాపం చిన్నపిల్లోడు. తెలియక చేసేశాడు" అంటూ ఫేస్బుక్లో హనీ భవానీ అనే నెటిజన్ కామెంట్ పెట్టారు. దీనికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ తమదైన శైలిలో బదులిచ్చారు. "ఎవరినీ కించపరచడం లేదు.. చిన్నపిల్లోడు అయితే పాలు తాగాలి కాని మందు తాగి నడపడం కరెక్ట్ కాదు కదా? సెలబ్రిటీలు అందరికీ ఆదర్శంగా ఉండాలి.. అడ్మిన్ హెచ్" అంటూ ఆ అభిమాని కామెంట్‌కు దీటుగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
యాంకర్ ప్రదీప్‌కు అడిషనల్ డీసీపీ హెచ్చరిక
హైదరాబాద్ : ఒక వేళ గడువు లోపు టీవీ యాంకర్ ప్రదీప్ కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోతే కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని అడిషనల్ డీసీపీ అమరకాంత్ రెడ్డి హెచ్చరించారు. విలేకరులతో మాట్లాడుతూ..కోర్టు అనుమతితో వారెంట్ జారీ చేసి అరెస్ట్ చేస్తామని తెలిపారు. ప్రదీప్ షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల రాలేక పోయాను అని ఓ వీడియో చూశామని చెప్పారు. ప్రదీప్ వచ్చిన తరువాత రెండు గంటల పాటు తల్లిదండ్రులు సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వయిస్తామని అన్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది డ్రంక్ డ్రైవ్ కేసులు తగ్గాయని వెల్లడించారు. జైలుకి వెళ్లిన వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని, కౌన్సెలింగ్‌కు హాజరయ్యే ప్రక్రియలో వీఐపీలకే కాదు, సామాన్యులకు కూడా గడువు ఇస్తామని వివరించారు. -
'నాలా ఇంకెవరూ తప్పు చేయొద్దు'
-
నాలా ఇంకెవరూ తప్పు చేయొద్దు..
సాక్షి, హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయిన స్టార్ యాంకర్ ప్రదీప్ వ్యవహారం త్వరలోనే ఓ కొలిక్కి రానుంది. ప్రస్తుతం కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని పోలీసులు పట్టుబడుతున్నా ప్రదీప్ రాకపోవడంతో అతడు పరారీలో ఉన్నట్లు కథనాలు వచ్చాయి. అయితే ఈ విషయంపై యాంకర్ ప్రదీప్ ఓ వీడియో ద్వారా స్పందించారు. తాను తప్పుచేసినట్లు అంగీకరించిన ప్రదీప్.. ఇంకెవరూ తనలాగా తప్పుచేయకూడదంటూ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాను ఇప్పటికీ పోలీస్ కౌన్సెలింగ్‌కు ఎందుకు హాజరుకాలేదు, ఇతరత్రా విషయాలను వీడియో ద్వారా ప్రదీప్ షేర్ చేసుకున్నారు. ఆ వీడియోలో ప్రదీప్ ఏమన్నారంటే.. 'అందరికీ నమస్కారం.. నేను మీ ప్రదీప్ మాచిరాజు. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఏం జరిగిందో అందరికీ తెలుసు. దాని తర్వాత జరిగే ప్రతి ప్రొసీడింగ్స్‌ను చట్ట ప్రకారమే ఫాలో అవుతాను. నాకు వచ్చిన సూచనల ప్రకారం పోలీస్ కౌన్సెలింగ్ కానీ, దాని తర్వాత జరిగే ప్రతి ప్రొసీడింగ్‌కు హాజరు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను. అయితే ఈలోగా నేను ముందుగానే కమిట్ అయిన ప్రోగ్రామ్స్, ఇతర ఈవెంట్ల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాను. అందువల్ల నేను అందుబాటులో లేనంటూ కొందరు ఆందోళన చెందుతున్నారు. తెలియజేసేది ఏమంటే షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్లనే కౌన్సెలింగ్‌కు హాజరుకాలేకపోయాను. కంటిన్యూగా ఫోన్ మోగడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ మిస్ అయుండొచ్చు. దయచేసి మీడియా మిత్రులకుగానీ, ప్రేక్షకులకు గానీ తెలియజేయడం ఏమనగా.. చట్ట ప్రకారం అన్ని ప్రొసీడింగ్స్ ఫాలో అవుతాను. గతేడాది డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ఓ వీడియో గురించి చెప్పాను. అవును.. దురదృష్టవశాత్తూ నేను అందులో లభించాను. నేను తెలియజేసేది ఏమంటే.. నేను చేసిన తప్పు ఇంకెవరూ చేయకూడదని కోరుకుంటున్నాను. అందరూ నన్ను అర్థం చేసుకుంటారని భావిస్తున్నానంటూ' ప్రదీప్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే గత డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిపోయిన మందుబాబులు దాదాపు కౌన్సెలింగ్‌కు హాజరుకాగా, యాంకర్ ప్రదీప్ మాత్రం రాలేదు. ప్రదీప్ పోలీస్ కౌన్సెలింగ్‌కు గత మూడురోజులుగా హాజరుకాకపోవడంతో అతని కోసం ఇళ్లు, కార్యాలయంలో పోలీసులు ఆరా తీసినా అందుబాటులోకి రాలేదని సమాచారం. ప్రదీప్ పరారయ్యాడని, జైలు శిక్ష పడుతోందని కౌన్సెలింగ్‌కు హాజరుకావడం లేదని ప్రచారం అవుతుండగా తన గురించి ఆందోళన చెందవద్దని.. త్వరలోనే లా ప్రొసీడింగ్స్ ఫాలో అవుతానంటూ ఓ వీడియోను ప్రదీప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బ్రీత్ అనలైజర్‌తో ప్రదీప్‌ను పరీక్షించినప్పుడు 178 పాయింట్లు రావడంతో పాటు.. ఈ స్టార్ యాంకర్ నడుపుతున్న వాహనం అద్దాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా బ్లాక్‌ఫిల్మ్ ఉండటంతో ఆర్టీఏ చట్ట ప్రకారం కూడా అతనిపై చర్యలు తీసుకొనే అవకాశముందని తెలుస్తోంది. నాలా ఇంకెవరూ తప్పు చేయొద్దు -
కౌన్సెలింగ్‌కు హాజరుకాని యాంకర్
-
అంతుపట్టని ప్రదీప్ వ్యవహారం
సాక్షి, హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అడ్డంగా దొరికిపోయిన యాంకర్ ప్రదీప్ వ్యవహారం అంతుచిక్కడం లేదు. ఎట్టిపరిస్థితుల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సిందేనని పోలీసులు పట్టుబడుతున్నా.. ప్రదీప్ మాత్రం రావడం లేదు. దీంతో అతను పరారీలో ఉన్నట్టు భావించి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్టు కనిపిస్తోంది. గత నెల 31వ తేదీ అర్ధరాత్రి యాంకర్ ప్రదీప్ మద్యం తాగి వాహనం నడుపుతూ.. ట్రాఫిక్ పోలీసులకు దొరికిపోయాడు. మంగళవారం కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉండగా అతను రాలేదు. దీంతో బుధవారం ఎట్టిపరిస్థితుల్లో కౌన్సెలింగ్‌కు ప్రదీప్ హాజరుకావాల్సిందేనని, ఒకవేళ హాజరుకాకపోతే.. చార్జ్‌షీట్ దాఖలుచేసి.. వారెంట్ జారీచేస్తామని, ప్రదీప్‌ను కోర్టు ముందు హాజరుపరుస్తామని పోలీసులు హెచ్చరించారు. అయినా ప్రదీప్ దిగిరాలేదు. పోలీసుల ముందు హాజరుకాలేదు. కౌన్సెలింగ్‌కు డుమ్మా కొట్టారు. ఇప్పటికే 31వ తేదీ అర్ధరాత్రి దొరికిపోయిన మందుబాబులు దాదాపు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఈ క్రమంలో బుధవారం కూడా ప్రదీప్ రాకపోవడం.. గురువారమైనా అతను వస్తాడా? రాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రదీప్ సెలబ్రిటీ యాంకర్ కావడంతో ఈ కేసుపై మీడియా దృష్టి ప్రధానంగా ఉంది. అయినప్పటికీ ప్రదీప్ వరుసగా డుమ్మా కొడుతుండటం పోలీసులను కూడా విస్మయానికి గురిచేస్తోంది. అతని కోసం ఇంట్లో, కార్యాలయంలో పోలీసులు ఆరా తీసినా.. అందుబాటులో లేడని తెలుస్తోంది. మణికొండలోని ఓ ఫామ్‌హౌజ్‌లో ప్రదీప్ ఉంటున్నాడని అంటున్నారు. వాహనం నడుపుతున్న సమయంలో ప్రదీప్ బాగా మద్యం సేవించి ఉన్నాడని, బ్రీత్ అనలైజర్‌లో 150 పాయింట్లు దాటితే.. జైలుశిక్షపడే అవకాశముంటుందని, ప్రదీప్‌ను పరీక్షించినప్పుడు 178 పాయింట్లు వచ్చిందని, కాబట్టి అతనికి జైలుశిక్ష పడే అవకాశముందని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రదీప్ పోలీసులను తప్పించుకొని తిరగడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. అతను కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోతే.. చార్జ్‌షీట్ దాఖలుచేసి.. వారెంట్ జారీచేయాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా ప్రదీప్ నడిపించిన వాహనం అద్దాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా బ్లాక్‌ఫిల్మ్ ఉండటంతో ఆర్టీఐ చట్ట ప్రకారం కూడా అతనిపై చర్యలు తీసుకొనేఅవకాశముందని తెలుస్తోంది. -
పరారీలో యాంకర్ ప్రదీప్
హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ టీవీ యాంకర్ మాచిరాజు ప్రదీప్ (35) పరారీలో ఉన్నట్లు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ నెల 2న బేగంపేట, గోషామహల్లో ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్లకు తల్లి లేదా భార్యతో కౌన్సెలింగ్‌కు ఆయన హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయన మంగళవారం కౌన్సెలింగ్‌కు హాజరు కాలేదు. దీంతో నోటీసులు అందించేందుకు పోలీసులు బుధవారం మణికొండలోని ఆయన ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. కూకట్‌పల్లిలోని కార్యాలయానికి వెళ్లిన పోలీసులకు అక్కడ కూడా చుక్కెదురైంది. ఫోన్ కూడా స్విచ్చాఫ్‌లో ఉండటంతో ఆయన పరారీలో ఉన్నట్లు పోలీసులు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. గురువారం కూడా కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోతే శాంతిభద్రతల విభాగం పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
యాంకర్ ప్రదీప్ ఎక్కడ.. ఈ రోజు హాజరవుతాడా? లేదా?
సాక్షి, హైదరాబాద్: న్యూఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయిన ప్రముఖ యాంకర్ ప్రదీప్ మూడురోజులైనా పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు. ప్రదీప్ మంగళవారం కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంది. దీంతో బుధవారం ఆయన ఎట్టిపరిస్థితుల్లో కౌన్సెలింగ్‌కు హాజరై తీరాల్సిందేనని పోలీసులు అంటున్నారు. మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నేపథ్యంలో ప్రదీప్ అజ్ఞాతంలో ఉన్నాడని కథనాలు వస్తున్నాయి. గత నెల 31వ తేదీ అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ మందుబాబులకు పోలీసులు మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే, మీడియా దృష్టి ప్రధానంగా ఈ కేసుపై ఉండటంతో ప్రదీప్ భయపడి నిన్న కౌన్సెలింగ్‌కు గైర్హాజరై ఉండొచ్చునని, ఈ రోజు ఆయన వస్తాడని తాము భావిస్తున్నామని పోలీసులు అంటున్నారు. కౌన్సెలింగ్‌కు ఎట్టిపరిస్థితుల్లో హాజరుకావాల్సిందే! మద్యం తాగి వాహనాలు నడపొద్దని ప్రజలకు హితవు పలికిన ప్రదీపే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడటం కలకలం రేపుతోంది. 31వ తేదీ పట్టుబడిన ప్రదీప్ రెండురోజులైనా పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు బుధవారం వరకు గడువు ఉంది. ఒకవేళ బుధవారం రాకపోతే.. ప్రదీప్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేసి.. వారెంట్ జారీచేసి.. కోర్టులో ప్రవేశపెడతామని అడిషనల్ డీసీపీ అమర్‌కాంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ప్రదీప్ చర్యను బట్టి తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. కౌన్సెలింగ్‌కు హాజరైతే.. తాగి నడపడం వల్ల కలిగే దుష్ర్పభావాల గురించి అతనికి వివరించి అవగాహన కల్పిస్తామని చెప్పారు. అనంతరం కోర్టులో ప్రవేశపెడతామని, మద్యం సేవించిన స్థాయిని బట్టి జరిమానా లేదా ఒకటి రెండు రోజులు జైలుశిక్ష పడే అవకాశముందని వివరించారు. మీడియా అటెన్షన్‌కు భయపడి నిన్న కౌన్సెలింగ్ ప్రదీప్ రాకపోయి ఉండొచ్చునని, ఈ రోజు వస్తాడని ఆశిస్తున్నామని చెప్పారు. కౌన్సెలింగ్ ఎగ్గొట్టే అవకాశమే లేదని, కౌన్సెలింగ్ రాకపోయినా.. వారెంట్ జారీచేసి.. మొదట కౌన్సెలింగ్ నిర్వహించిన తర్వాతే కోర్టులో హాజరుపరుస్తామని అడిషనల్ డీసీపీ స్పష్టం చేశారు. -
న్యూ ఇయర్ వేడుకల్లో కిక్కే కిక్కు..!
-
యాంకర్ ప్రదీప్ ; నీతులుచెప్పి.. గోతిలోపడి..!
సాక్షి, హైదరాబాద్ : ‘మద్యం సేవించి వాహనం నడుపరాదు’ .. రోడ్డుమీద అడుగుతీసి అడుగేస్తే ఈ సందేశం కనిపిస్తూఉంటుంది. అయినాసరే కొందరు అస్సలు పట్టించుకోరు. తాగి నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి అమాయకులను చంపేసిన ఘటనలు కోకొల్లలు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంలో హైదరాబాద్‌లో భారీ స్థాయిలో 2,499 కేసులు నమోదయిన దరిమిలా డ్రంకెన్‌డ్రైవ్‌పై అవగాహన మరోసారి చర్చనీయాంశమైంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు తనిఖీలు చేపట్టిన పోలీసులు.. వేలమందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ఖరీదైనకార్లతో నగరంలోని పోలీస్ స్టేషన్లన్నీ షోరూమ్‌లను తలదన్నాయి. ఆయా కేసులు మంగళవారం కోర్టుల్లో విచారణకు రానున్నాయి. ప్రదీప్ వీడియో వైరల్ : మద్యం తాగి వాహనం నడుపుతూ చిక్కినవారిలో టీవీ యాంకర్ ప్రదీప్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 వద్ద నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో అర్ధరాత్రి 2.50 గంటల సమయంలో పోలీసులు ప్రదీప్ కారును ఆపారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా.. బ్లడ్ ఆల్కాహాల్ కంటెంట్ (బీఏసీ) 178గా నమోదైంది. సాధారణంగా 35 బీఏసీ దాటితేనే పరిమితికి మించి మద్యం తాగినట్లు పరిగణిస్తారు. దీంతో పోలీసులు ప్రదీప్ బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. బీఏసీ స్థాయి 35 నుంచి 150 పాయింట్ల వరకు ఉంటే కేసులు, జరిమానాలతో సరిపెడతారు. 150 పాయింట్లు దాటితే మాత్రం రెండు రోజుల నుంచి 10 రోజుల వరకు జైలుశిక్ష విధించే అవకాశముంది. కాగా, డ్రంకెన్‌డ్రైవ్, ట్రాఫిక్ అవేర్నెస్పై ప్రదీప్ గతంలో చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘నీతులు చెప్పినవారే గోతిలో పడ్డారు’ తరహా శీర్శికలతో ప్రదీప్ వీడియో విపరీతంగా షేర్ అవుతోంది. మరికొద్ది సేపట్లో ప్రదీప్.. నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. యాంకర్ ప్రదీప్ ; నీతులుచెప్పి.. గోతిలోపడి..! -
ఒక్కరోజు కిక్కు 200 కోట్లు
సాక్షి, హైదరాబాద్ : కొత్త సంవత్సర వేడుకల్లో రాష్ట్రవ్యాప్తంగా మద్యం ఏరులైపారింది. మందుబాబులు ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా ఏకంగా రూ.200 కోట్లకుపైగా విలువైన మద్యాన్ని తాగేశారు. ఎక్సైజ్ శాఖ ప్రాథమిక లెక్కల ప్రకారం డిసెంబర్ 31 ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా రూ.207.7 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈ ఒక్క నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా రూ.1,700 కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరిగాయి. ఇందులో పాత హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వాటాయే 600 కోట్లు దాటడం గమనార్హం. ‘గ్రేటర్’పరిధిలోనే రూ.125 కోట్ల విక్రయాలు నూతన సంవత్సర వేడుకల్లో గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాల పరిధిలోనే ఏకంగా రూ. 125 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు అంచనా. పాత రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలతో పాటు గ్రేటర్లోకి వచ్చే ఇతర జిల్లాల ప్రాంతాల్లో కలిపి ఈ విక్రయాల అంచనా వేశారు. ఇక వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో రూ.20 కోట్లకుపైగా అమ్మకాలు జరిగాయి. ఇక డిసెంబర్ నెల మొత్తంగా చూసినా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌బీసీఎల్) ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఒక్క నెలలోనే రూ.1,700 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇందులో పాత రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలోనే రూ.602 కోట్ల అమ్మకాలు ఉండడం గమనార్హం. భాగ్యనగరంలో ఫుల్ జోష్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈసారి నూతన సంవత్సర వేడుకలు ‘ఫుల్’జోష్‌తో జరిగాయి. హైదరాబాద్ పరిధిలోని 542 బార్లు, పబ్‌లు, 300 మద్యం దుకాణాలు, 134 ఈవెంట్లలో మద్యం పొంగిపొర్లింది. కొత్త ఏడాది వేడుకల్లో గతసారి రూ. 100 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరగగా.. ఈసారి రూ.125 కోట్లకుపైగా నమోదయ్యాయి. నగరవ్యాప్తంగా సుమారు 7 లక్షల కాటన్ల (ఒక్కో కాటన్లో 12 సీసాలు) బీర్లు, మరో ఐదు లక్షల కాటన్ల మేర ఐఎంఎల్ మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి మద్యం ధరలు పెరిగినా కూడా అమ్మకాలు పెరగడం గమనార్హం. 2,499 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు పోలీసులు ఆదివారం రాత్రి హైదరాబాద్ వ్యాప్తంగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లలో 2,499 మంది పట్టుబడ్డారు. టోలిచౌకి పరిధిలో ఉన్న బాపూఘాట్ వద్ద, నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంతంలో జరిగిన తనిఖీల్లో అత్యధికంగా 145 మంది చొప్పున ‘డ్రంకెన్’డ్రైవర్లు చిక్కారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ట్రైడెంట్ ఆస్పత్రి వద్ద ఓ ఫార్చునర్ కారు డ్రైవర్‌కు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా.. బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ 347 నమోదవడం గమనార్హం. ఇక మద్యం తాగి వాహనం నడుపుతూ చిక్కినవారిలో బుల్లితెర యాంకర్ ప్రదీప్ కూడా ఉన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 వద్ద నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో అర్ధరాత్రి 2.50 గంటల సమయంలో పోలీసులు ప్రదీప్ కారును ఆపారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా.. బ్లడ్ ఆల్కాహాల్ కంటెంట్ (బీఏసీ) 178గా నమోదైంది. సాధారణంగా 35 బీఏసీ దాటితేనే పరిమితికి మించి మద్యం తాగినట్లు పరిగణిస్తారు. దీంతో పోలీసులు ప్రదీప్ బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. కాగా మద్యం తాగి వాహనాలు నడిపినవారి నుంచి 1,310 బైక్‌లు, 276 కార్లు, ఇతర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారికి మంగళ–బుధవారాల్లో కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి.. న్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు. సాధారణంగా బీఏసీ స్థాయి 35 నుంచి 150 పాయింట్ల వరకు ఉంటే కేసులు, జరిమానాలతో సరిపెడతారు. 150 పాయింట్లు దాటితే మాత్రం రెండు రోజుల నుంచి 10 రోజుల వరకు జైలుశిక్ష విధించే అవకాశముంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన యాంకర్ ప్రదీప్ రాత్రి 2.45 గంటల వరకు మెట్రో జర్నీ హైదరాబాద్ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నవారికి సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు ఆదివారం రాత్రి 2.45 గంటల వరకు మెట్రో రైళ్లను నడిపారు. రోజు మొత్తంగా 1.07 లక్షల మంది మెట్రో ప్రయాణం చేయగా.. అందులో అర్ధరాత్రి దాటిన ప్రయాణించినవారు 6 వేల మందికిపైగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆర్టీసీ కూడా ప్రధాన మార్గాల్లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు బస్సులు నడిపింది. ఒక్కరోజు కిక్కు 200 కోట్లు -
న్యూఇయర్ : మందుబాబులపై కొరడా
సాక్షి, హైదరాబాద్ : కొత్తసంవత్సరం వేకువజామునే మందుబాబులకు చుక్కలుచూపించారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు చేపట్టిన పోలీసులు.. పెద్ద సంఖ్యలో కేసులు నమోదుచేశారు. బ్రీత్ అనలైజర్ టెస్టులో దొరికిపోయిన ప్రముఖుల్లో టీవీ యాంకర్ ప్రదీప్ కూడా ఉన్నారు. ప్రదీప్‌కు జైలు తప్పదేమో!: నూతన సంవత్సరం సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు తనీఖీలు చేశారు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 45 వద్ద ప్రదీప్ కారును పోలీసులు ఆపారు. బ్రీత్ అనలైజ్ చేయగా.. 178 పాయింట్లు నమోదయ్యాయి. సాధారణంగా 35 పాయింట్లు దాటితేనే వాహనదారుడికి శిక్ష, వాహనం సీజ్ లాంటి చర్యలుంటాయి. మోతాదు కంటే చాలా ఎక్కువ మద్యం సేవించి, వాహనం నడిపిన ప్రదీప్‌కు సవరించిన నిబంధనలను అనుసరించి భారీ శిక్షలు పడే అవకాశం ఉంది. అయితే పోలీసులు కేసును ఎలా నమోదుచేస్తారనేది తెలియాల్సిఉంది. వేలకొద్దీ కేసులు : ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లారి వరకు స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ చేపట్టిన నగర పోలీసులు వేలకొద్దీ కేసులు నమోదు చేశారు. సుమారు 1200 వాహనాలను సీజ్ చేశారు. పట్టుబడిన మందుబాబులు అందరికీ మంగళవారం తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో చర్యలు కూడా అంతే తీవ్రంగా తీసుకునేందుకు యత్నిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కిన యాంకర్ ప్రదీప్ -
అశ్లీలమే అతడి పెట్టుబడి..
సాక్షి, హైదరాబాద్: ఎడాపెడా వెబ్సైట్ల ఏర్పాటు.. రేటింగ్ కోసం అశ్లీల లింకులు.. సెలబ్రిటీల ఫొటోల మార్ఫింగ్.. ఇలా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ రూ. లక్షలు సంపాదిస్తున్న వెబ్సైట్ల నిర్వాహకులపై సీఐడీ దృష్టి సారించింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐడీ సైబర్ క్రైమ్ అధికారులు మూడు అశ్లీల వెబ్సైట్ల నిర్వాహకుడు దాసరి ప్రదీప్ ను అరెస్ట్ చేశారు. ఇతడి విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చినట్టు సీఐడీ వర్గాలు తెలిపాయి. ప్రదీప్ ఒక వెబ్ సైట్లో పెట్టిన అశ్లీల పోస్టును తనకే చెందిన మరో రెండు వెబ్సైట్లలోనూ వేరే లింకుతో పోస్టు చేసేవాడు. ఇలా ఈ మూడు సైట్లకూ రేటింగ్ వచ్చేది. దీంతో ప్రతీ వారం గూగుల్ నుంచి ప్రదీప్ అకౌంట్‌కు ఒక్కో వెబ్సైట్ ద్వారా రూ.5 వేల చొప్పున రూ.15 వేలు వచ్చినట్టు సీఐడీ గుర్తించింది. ప్రకటనలతో రూ. 40 వేలు.. అశ్లీల లింక్స్‌తో వారానికి రూ.15 వేలు సంపా దించిన ప్రదీప్‌కు.. గూగుల్ నుంచి తన సైట్లలో ప్రకటనల ద్వారా నెలకు రూ.40 వేలు సంపా దించినట్టు విచారణలో బయటపెట్టాడని అధి కారులు తెలిపారు. ఇలా మూడేళ్లుగా సెలబ్రిటీ లపై అశ్లీల పోస్టులు పెట్టి ప్రదీప్ రూ.20 లక్షల కుపైగా సొమ్ము చేసుకున్నట్టు వెల్లడైంది. -
నిమ్స్‌లో బిల్డింగ్ ఎక్కి రోగి హంగామా
హైదరాబాద్: ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ రోగి శనివారం ఉదయం నిమ్స్ ఆస్పత్రిలో హంగామా చేశాడు. తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయాలని, అలాగే అమెరికాలో ట్రీట్ మెంట్ చేయించుకునేందుకు ఎనిమిది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భవనం పై నుంచి కిందకు దూకుతాని బెదిరింపులకు దిగాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని, అతడిని ఎట్టకేలకు కిందకు దించారు. వివరాల్లోకి వెళితే... కుత్బుల్లాపూర్‌కు చెందిన ప్రదీప్(20) అనే యువకుడు ముఖంపై మచ్చలకు చికిత్స నిమిత్తం 2007 సంవత్సరం నుంచి నిమ్స్ వైద్యశాలకు వస్తున్నాడు. అయితే ఈ చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకం కింద అవకాశం లేదని, పైగా భారత దేశంలో కూడా ఈ చికిత్స లేదని, అమెరికా వెళ్లాలని వైద్యులు చెబుతూ వస్తున్నారు. అయితే ఇన్నేళ్లుగా వైద్యులు తనను పట్టించుకోవడంలేదని, ఆరోగ్యశ్రీతో అయినా లేక అమెరికా పంపి అందుకు అయ్యే వైద్య ఖర్చులకు ఎనిమిది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఉదయం నిమ్స్ భవనంపైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఈ క్రమంలో ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ దయాకర్ ద్వారా వైద్యులు ఒక లేఖను రూపొందించి భవనంపైకి పంపి అతనిద్వారా రోగికి దాన్ని అందజేశారు. దీంతో అతన్ని ఎలాగో కిందకు తీసుకురాగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కోసం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఉదయం 8 గంటల నుంచి 9.55 వరకు భవనంపైనే నిలబడి హల్చల్ చేశాడు. -
ప్రేమించలేదని యువతిపై యాసిడ్ దాడి
-
ప్రేమించలేదని యువతిపై యాసిడ్ దాడి
- కొంతకాలంగా యువతి వెంట పడుతున్న ప్రదీప్ - మాట్లాడాలంటూ ఇంట్లోంచి బయటికి పిలిచి దాడి - ముఖంపై యాసిడ్ చల్లి పరారీ.. 40% కాలిన గాయాలు - కుత్బుల్లాపూర్‌లో ఘటన హైదరాబాద్: తాను ఎంతగా వెంటపడుతున్నా ప్రేమించడం లేదనే ఉన్మాదంతో ఓ యువతిపై ప్రదీప్ అనే యువకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. మాట్లాడాలంటూ ఇంట్లోంచి బయటికి పిలిచి.. ముఖంపై యాసిడ్ చల్లి పరారయ్యాడు. హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. కుత్బుల్లాపూర్‌లోని దత్తత్రేయనగర్‌లో నివసించే ఖబీరా బేగం (17) సుభాష్‌నగర్‌లోని ఓ ఫ్యాన్ల కంపెనీలో పనిచేస్తోంది. షాపూర్‌నగర్ కళావతినగర్‌కు చెందిన ప్రదీప్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడుతున్నాడు. ఇందుకు ఖబీరా ససేమిరా అనడంతో కక్ష పెంచుకున్నాడు. సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఆమె ఇంటికి వద్దకు వచ్చాడు. ఏదో మాట్లాడాలంటూ ఫోన్ చేసి ఇంటి బయటికి రమ్మన్నాడు. ఆమె బయటికి రాగానే.. తన వెంట తెచ్చిన యాసిడ్‌ను ఖబీరాబేగం ముఖంపై చల్లి పరారయ్యాడు. దీనిపై స్థానికులు సమాచారమివ్వడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. 40% కాలినగాయాలైన బాధితురాలిని సురారం మల్లారెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. ప్రదీప్‌ను పట్టుకునేం దుకు 4 బృందాలతో గాలింపు చేపట్టారు. అతడి ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అమెరికాలో తెలుగు ఇంజనీర్ దుర్మరణం
రాలీ: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు ప్రదీప్ దుర్మరణం చెందారు. భార్యతో కలిసి ప్రయాణిస్తుండగా మినీ బస్సు ప్రమాదానికి గురికావడంతో ప్రదీప్ అక్కడిక్కడే మృతిచెందారు. నార్త్‌కరోలీనాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. ప్రమాదంలో ప్రదీప్ భార్య కార్తీకతోపాటు మరికొందరికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. వీరికి ఏడాది కిందటే వివాహమైంది. భువనగిరికి చెందిన ప్రదీప్ ఎనిమిదేళ్ల కిందటే అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా స్థిరపడ్డారు. ఏడాది కిందటే భువనగరికే చెందిన అమ్మాయితో అతనికి వివాహమైంది. అనంతరం భార్యను కూడా అమెరికా తీసుకెళ్లాడు. తన పుట్టినరోజు వేడుకలు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ప్రదీప్ అనూహ్యంగా చనిపోయారు. మృతుడు భువనగిరి మాజీ కౌన్సిలర్ మురళి కుమారుడు. మరణవార్త తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. -
తెర వెనుక విషాదం
-
కోనేరు ప్రసాద్ కుమారుడి ఇంట్లో సీబీఐ సోదాలు
హైదరాబాద్: ఫిలింనగర్‌లోని ప్రముఖ పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్ కుమారుడు ప్రదీప్ నివాసంపై సీబీఐ అధికారులు దాడులు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారుల బృందాలు ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌లలో ప్రదీప్‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
యువ ప్రదీపం ఆరిపోయింది!
మొన్న దీపావళికి ఇంటికొస్తానన్న కొడుకు రాలేదు. వెలుగూ రాలేదు. ఏమైందోనని ఆందోళనతో ఫోన్ చేస్తే... ఫోన్ స్విచ్చాఫ్. రాత్రంతా నిద్రలేదు. తెల్లారినా బిడ్డ రాలేదు. కానీ ఓ కబురు వచ్చింది... ఎక్కడో కశింకోటలో ఎవరో అమ్మాయి గురించి అక్టోబర్ 28 శుక్రవారం సాయంత్రం గొడవైంది.. అక్కడ ఇరవై... పాతికమంది కుర్రోళ్లు కలిసి తమ బిడ్డ ప్రదీప్‌ను కలబడి కొట్టారని! ఆ తల్లి మనసు తల్లడిల్లింది. భర్త, బంధువులు... విశాఖపట్నం జిల్లాలోనే విశాఖ సమీపంలోని అగనంపూడి పంచాయతీలోని దానబోయినపాలెం గ్రామస్థులు, స్నేహితులు కలిసి బిడ్డ ఆచూకీ కోసం కశింకోటకెళ్లారు. పోలీసులు వాచీ, చైన్ చూపించి... ‘ఇవి మీవాడివేనా’ అని అడిగారు. ‘మా బిడ్డవేనండి... ఏమైంది?’ అని అడిగితే, ‘ఎవరో ఇచ్చి వెళ్లారు. మీవాడివైతే తీసుకువెళ్లండి’ అని కసురుకున్నారు. కనీసం మిస్సింగ్ కేసు పెట్టమన్నా కుదరదన్నారు. ఆ తర్వాత సోమవారం రాత్రి అనకాపల్లి సమీపంలోని ఉమ్మలాడ వద్ద శారదా నదిలో ఆ కుర్రాడు శవమై తేలాడు. మృతదేహం ఉబ్బిపోయింది. పచ్చబొట్టు చూసి.. అది తన బిడ్డ శవమేనని గుర్తించారు. షాక్‌కు గురైన తండ్రి నేటికీ తేరుకోలేదు.. ఇక గుండెలవిసేలా రోదిస్తున్న ఆ అమ్మను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. ఆ తల్లితండ్రుల పుత్రశోకం వెనుక ఆ బిడ్డ అమాయకపు ప్రేమ తప్ప మరేదీ లేదు. ఆ కుర్రాడు ప్రేమించిన అమ్మాయినే మరొక బలవంతుడు ఇష్టపడ్డాడు. అదే ఆ కుర్రాడు చేసిన నేరమైంది. ఆ బలవంతుడికి అధికార పార్టీ అండగా నిలిచింది. గూండాలకు టీడీపీ ప్రజాప్రతినిధులు రక్షణగా నిలిచారు. ప్రేమించిన అమ్మాయితో మాట్లాడుతుండగానే, జనమంతా చూస్తుండగానే నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపేశారన్న వాదనలు ఉన్నాయి. అసలేం జరిగిందంటే.. అవంతి కళాశాలలో కశింకోటకు చెందిన ఓ యువతి బీటెక్ సెకండియర్ చదువుతోంది. అదే కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న అగనంపూడి పంచాయతీ, దానబోయినపాలెం గ్రామానికి చెందిన ప్రదీప్‌తో పరిచయం ప్రేమగా మారింది. అయితే ఆమెను కశింకోటకు చెందిన టీడీపీ నేత బుదిరెడ్డి చిన్నా బంధువు సాయి కూడా ఇష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆ యువతి, ప్రదీప్ స్నేహాన్ని జీర్ణించుకోలేకపోయాడు. గత అక్టోబరు 28న ప్రదీప్ కశింకోట వచ్చి యువతిని కలిశారు. అదను కోసం చూస్తున్న సాయి, తన మిత్రులతోపాటు మరికొంతమంది యువకులను పోగేసుకొచ్చి వచ్చి ప్రదీప్‌ను తీవ్రంగా కొట్టారు. స్థానికులు, మహిళలు వారించినా వినకుండా చావబాదారు. విచక్షణ రహితంగా కొట్టిన దెబ్బలకు తట్టుకోలేని ప్రదీప్ అక్కడికక్కడే చనిపోగా, మృతదేహాన్ని శారదా నదిలో పడేస్తే కొట్టుకుపోతుందనే ఉద్దేశంతో ఉమ్మలాడ వద్ద నదిలో పడవేసి ఉంటారని భావిస్తున్నారు. బుదిరెడ్డి చిన్నా ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందని, అతనితోపాటు హత్యకు కారకులైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. చివరకు ప్రజల, మీడియా ఒత్తిడి పెరగడంతో పోలీసులు బుదిరెడ్డి చిన్నాతో సహా ఆరుగురిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. పౌరులు ఆందోళన, పోరాటం చేస్తే తప్ప పాలకులు స్పందించకపోవడం శోచనీయం అని స్థానికులు వాపోతున్నారు. ప్రేమిస్తే చంపేస్తారా? నేను, నా భర్త దర్జీలుగా రేయింబవళ్లు కష్టపడ్డాం. రాత్రిళ్లు భోజనం చేస్తే నిద్ర వస్తుందని కడుపు మాడ్చుకుని మెలకువగా ఉండి మరీ దుస్తులు కుట్టేవాళ్లం. మేమింత కష్టపడినా ఒక్కగానొక్క కొడుకును మాత్రం దర్జాగా పెంచాం. చక్కగా చదువుకుంటున్నోడు ఇలా అర్ధంతరంగా బలైపోతాడనుకోలేదు. అయినా.. మా కొడుకు చేసిన నేరమేంటి? అనవసరంగా ఎవరితోనూ మాట్లాడడు. తన పని తాను చేసుకోవడం తప్ప ఎవరినీ ఇబ్బంది పెట్టడు. అలాంటిది ఎవరినో ప్రేమించాడట! ఆ విషయం కూడా మాకు చెప్పలేదు! ఇప్పుడే తెలిసింది.. అయినా ప్రేమిస్తే చంపేస్తారా? అంత కర్కశంగా చంపేందుకు వాళ్లకు మనసు ఎలా వచ్చింది? ‘మీ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్న విషయం మాకిష్టం లేదు’ అని మాకు చెబితే మేమే మందలించుకునే వాళ్లం. నాలుగుకొట్టినా మా బిడ్డను మాకు అప్పజెప్పి ఉంటే మేము చూసుకునేవాళ్లం. కానీ ఏ అవకాశం ఇవ్వకుండా బిడ్డను మాకు కాకుండా చేశారే! మా ఇంటి ఆశాదీపాన్ని ఆర్పేశారే! మేము ఎవరి కోసం బతకాలి? హంతకుల్ని కఠినంగా శిక్షించాలి! హంతకుల్ని కఠినంగా శిక్షించాలి. ఎవరో ఎంపీలు, ఎమ్మెల్యేల బలం వాళ్లకుందని అంటున్నారు. కానీ మా కొడుకు ఆత్మకు శాంతి చేకూరాలంటే నిజమైన హంతకులకు శిక్షపడాలి. హంతకుల్ని కాపాడడానికి ప్రయత్నించిన పోలీసులనూ శిక్షించాలి. ఇలా మరో తల్లికి పుత్రశోకం లేకుండా చూడాలి. - సత్యవతి, ప్రదీప్ తల్లి మీ కొడుక్కి ఇలా జరిగితే మా అబ్బాయి చదివేది.. టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాసరావు వాళ్ల కాలేజి. ఇప్పుడు వాళ్లొచ్చి... కేసు గురించి మేం చూస్తామని చెబుతున్నారు. మీ కొడుక్కే ఇలా జరిగితే ఇలానే స్పందిస్తారా? కొడుకుని పెంచి ఇంతవాణ్ణి చేసింది కసాయి చేతుల్లో చావడానికా? నా కొడుకుని కర్కశంగా చంపిన వాళ్లను కఠినంగా శిక్షించడానికి న్యాయం, చట్టం ముఖం చాటేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి. మాకు దిక్కెవరు? మా అబ్బాయిని బలి తీసుకున్న రాక్షసులను శిక్షించేదెవరు? కనీసం ఎక్కడున్నాడో చెప్పమని పోలీసుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. b- రాము, ప్రదీప్ తండ్రి -
ప్రదీప్ హత్యకేసులో నిందితుల కోసం ప్రత్యేక బృందాలు
కశింకోట : ఇంజినీరింగ్ విద్యార్థి దానబాల ప్రదీప్ హత్య కేసులో నిందితులను పట్టుకోవడానికి, విచారణకు ప్రత్యేక బృందాలను నియమించినట్టు డీఎస్పీ పురుషోత్తం గురువారం రాత్రి తెలిపారు. గత నెల 28న ప్రదీప్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసు నిందితుల్లో బుదిరెడ్డి చిన్న పరారీలో ఉన్నాడని చెప్పారు. అలాగే మరో నిందితుడు ఆర్మీ ఉద్యోగి కిరణ్‌ను ఆర్మీ నుంచి రప్పించడానికి లేఖ పంపుతున్నామని తెలిపారు. వీరితోపాటు మిగిలిన నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రదీప్‌కు పోస్టుమార్టం నివేదిక రావడానికి మరో మూడు రోజులు పడుతుందని చెప్పారు. ఆ నివేదికను కోర్టుకు సమర్పించి, అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈలోగా కేసు దర్యాప్తు యథావిధిగా జరుగుతుందన్నారు. -
ప్రదీప్ మృత దేహానికి నేడు పోస్ట్ మార్టం
-
అట్టుడికిన అగనంపూడి
జాతీయ రహదారి దిగ్బంధం ప్రదీప్ ది ముమ్మాటికీ హత్యే టీడీపీ నేతలే చేరుుంచారంటూ ఆరోపణ నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు అవంతి కళాశాల విద్యార్థి అనుమానాస్పద మృతి ఘటనపై జాతీయ రహదారితో సహా అగనంపూడి అట్టుడికిపోరుుంది. మృతుని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అగనంపూడి వద్ద జాతీయ రహదారిని దిగ్బంధం చేయగా, కళాశాల విద్యార్థులు అనకాపల్లిలో నిరసనలతో హోరెత్తించారు. వేలాది మంది విద్యార్థులు భారీ ర్యాలీగా తరలివచ్చి ధర్నాకు దిగడం.. అత్యుత్సాహంతో పోలీసులు లాఠీచార్జి చేయడంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నారుు.- అనకాపల్లి టౌన్/ అగనంపూడి అగనంపూడి నిర్వాసితకాలనీ దానబోరుునపాలేనికి చెందిన దానబాల రాము కుమారుడు ప్రదీప్(20) మాకరపాలెంలోని అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ (నాలుగో సంవత్సరం) చదువుతున్నాడు. గత నెల 28న ప్రదీప్ తన స్నేహితుడు తులసికుమార్తో కలిసి కళాశాలకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో కశింకోటకు చెందిన ఒక విద్యార్థినితో.. కశింకోటలో బస్సు దిగాడు. ప్రదీప్ కూడలిలో ఆమెతో మాట్లాడు తుండగా, కొంతమంది దుండగులు ప్రదీప్‌ను అందరూ చూస్తుండగానే చితక్కొడుతూ అక్కడ నుంచి అపహరించుకుపోయారు. కుమారుడు ఇంటికి రాకపోవడంతో అదేరోజు రాత్రి ప్రదీప్ తండ్రి రాము కశింకోట పోలీసులకు ఫిర్యాదు చేయగా కిడ్నాప్ కేసుగా నమోదు చేశారు. కాగా 29న ఉమ్మలాడ వద్ద శారదానదిలో ప్రదీప్ శవమై తేలడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తమ కుమారుడిని కిడ్నాప్ చేసి హతమార్చారంటూ రాము తీవ్ర స్థారుులో ఆరోపించారు. కుటుంబ సభ్యులకు మద్దతుగా దానబోరుునపాలెం గ్రామస్తులు, మరో పక్క అవంతి కళాశాల విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. సోమవారం అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేయగా, మంగళవారం తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. దద్దరిల్లిన హైవే.. తొలుత అవంతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో కలిసి గ్రామస్తులు అగనంపూడి కూడలి వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే హత్య జరిగిందని, ఎస్ఐని సస్పెండ్ చేయాలని, హంతకులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. వీరికి మాజీ ఎమ్మెల్యే చింతల పూడి వెంకట్రామయ్య, 56వ వార్డు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జి.పూర్ణానందశర్మ, గుర్రం శ్రీను, ఎల్.వి.రమణ, తెలుగుదేశం నాయకులు బలిరెడ్డి నాగేశ్వరరావు, సత్యనారాయణ, కూర్మాపు రవి తదితరులు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. వీరి ఆందోళన కారణంగా జాతీయ రహదారిపై గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోవడంతో గాజువాక, స్టీల్‌ప్లాంట్, దువ్వాడ, పరవాడ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పది మందిపై కేసు నమోదు చేశారు. విద్యార్థులు, గ్రామస్తులు అక్కడ నుంచి కారులు, బస్సులు, లారీల్లో అనకాపల్లికి తరలివెళ్లారు. అనకాపల్లిలో భారీ ర్యాలీ..ధర్నా అనకాపల్లి పట్టణంలో ర్యాలీ, ధర్నాలతో హోరెత్తించారు. అధికార పార్టీకి చెందిన నేతల అండతో కశింకోటకు చెందిన కొందరు యువకులు ప్రదీప్ చంపేసి నదిలోకి విసిరేశారని, తక్షణమే నిందితులను అరెస్టు చేయాం టూ నినదించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థులు వేలాదిగా తరలిరాగా వీరికి వైఎస్సార్సీపీ, ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు మద్దతుగా పాల్గొన్నారు. పట్టణంలోని రింగ్ రోడ్డు నుంచి పెద నాలుగు రోడ్ల జంక్షన్ వరకూ వరకూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారం చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలి...ప్రదీప్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న వారిపై సీఐ విద్యాసాగర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో విద్యార్థులు సీఐతో వాగ్వాదానికి దిగారు. ఆందోళనను విరమించాల్సిందిగా సీఐ ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ దశలో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాటలు జరిగారుు. ఒకానొక దశలో పరిస్థితి అదుపు తప్పే సూచనలు కనిపించాయి. సీఐ విద్యాసాగర్ అత్యుత్సాహంతో విద్యార్థులపై చేరుుచేసుకోవడంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. అనంతరం ఆందోళన కారు లు ఎన్టీఆర్ వైద్యాలయానికి చేరుకుని ఎదురుగా బైఠారుుంచి పెద్దపెట్టున నినాదాలు చేశా రు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం వైఫల్యం కనిపిస్తుందంటూ నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు సీఎం డౌన్ డౌన్ ..ఎంపీ అవంతి శ్రీనివాసరావు డౌన్ డౌన్, అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కశింకోట ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి, దోషులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారుు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికారు. సాయంత్రం వరకు ఆస్పత్రి వద్ద నిరసన కొనసాగింది. చివరకు డీఎస్పీ పురుషోత్తం చేరుకొని పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. ఆందోళనను విరమించారు. దీనిని హత్య కేసుగా నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రదీప్ మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. దానబోరుునపాలెంలో విషాదం ఆడుతూ పాడుతూ తిరిగిన ప్రదీప్ హత్యకు గురవడంతో దానబోరుునపాలెం, దిబ్బపాలెం, అగనంపూడి నిర్వాసిత కాలనీల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు మృతుడి ఇంటికి చేరుకుని సంఘీభావం తెలిపారు. మృతుని ఇంటి వద్ద తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, అవంతి కళాశాల విద్యార్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. అమర్‌తో సహా స్థానిక నేతల మద్దతు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్తో పాటు ఆ పార్టీ స్థానిక నేతలు ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద ఆందోళన కారులకు మద్దతు పలికారు. తక్షణమే ఈ కేసు విషయంలో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యేలు కావాలనే నిందితులకు కొమ్ము కాస్తున్నారని అమర్నాథ్ ధ్వజమెత్తారు. ఎన్నో మలుపులు.. కశింకోట: ఇంజనీరింగ్ విద్యార్థి దానపాల ప్రదీప్‌ను తీవ్రంగా కొట్టి హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. గత నెల 28న కశింకోట వచ్చిన ప్రదీప్, పరిచయం ఉన్న ఓ ఇంజనీరింగ్ విద్యార్థినితో కలిసి ఉండటాన్ని సహించలేక స్థానికులైన సారుు, సాకేత్, కిరణ్, తదితరులు తీవ్రంగా కొట్టి గాయపరచినట్లు సమాచారం. మొదట సంతబయల, డీపీఎన్ హైస్కూలు వెనుక, కోనేరు ప్రాంతాల్లో తీవ్రంగా కొట్టారు. అప్పటికే ప్రదీప్ నడవలేని స్థితిలో రక్తం కారుస్తూ ఉన్నట్లు స్థానికులు తెలిపారు. దీనివల్లే ప్రదీప్ మతి చెంది ఉంటాడని, అనంతరం వాస్తవం మరుగుపరచడానికి ఆటోలో తీసుకెళ్లి నదిలో పడేసి ఉంటారని, ఇది హత్యే అరుు ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. అరుుతే పోలీసుల దర్యాప్తులో ప్రదీప్‌ను కొట్టడం వాస్తవమేనని అంగీకరించిన నిందితులు ఆటోలో రూ.50 ఖర్చులకు ఇచ్చి సొంత ఊరు పంపామని పేర్కొన్నారు. దీంతో మొదట కిడ్నాప్ కేసుగా నమోదు చేసి తాజాగా తండ్రి రాము ఫిర్యాదుతో హత్య కేసుగా మార్పు చేసి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో కశింకోట ప్రాంతంలో భయాందోళనలు వ్యక్తం మవుతున్నారుు. ఇటువంటి సంఘటనలు పునరావతం కాకుండా పోలీసు అధికారులు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హత్యకేసుగా నమోదు కశింకోట: శారదా నదిలో శవమై లభించిన ఇంజనీరింగ్ విద్యార్థి దానపాల ప్రదీప్ అనుమానాస్పద మతిని పోలీసులు మంగళవారం హత్య కేసుగా నమోదు చేశారు. అనకాపల్లి ట్రాఫిక్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ బి.మధుసూదనరావు మంగళవారం ఈ సంగతి తెలిపారు. మాకవరపాలెం వద్ద ఒక ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న అగనంపూడి ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి ప్రదీప్ ఓ విద్యార్థినిని కలవడానికి వచ్చి కశింకోటలో గత నెల 28న కిడ్నాప్‌కు గురి కావడం, ఆ తర్వాత శారదానదిలో అనుమానాన్పద స్థితిలో శవమై లభ్యం కావడం తెలిసిందే. మొదట అనుమానాస్పద కేసుగా నమోదు చేసి, తండ్రి రాము ఫిర్యాదుతో తాజాగా హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. తన కుమారుని హత్యకు ప్రధానంగా కశింకోటకు చెందిన టీ డీపీ నాయకుడు బుదిరెడ్డి చిన్నతోపాటు కిరణ్, సారుు, సాకేత్,ప్రసన్న, తదితరులు కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని తండ్రి ఫిర్యాదు చేశారన్నారు. అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రదీప్ శవానికి ఇంక్వెస్టు నిర్వహించామన్నారు. బాధితుల డిమాండ్ మేరకు విశాఖ కెజిహెచ్లో బుధవారం శవానికి పోస్టుమార్టం జరగనుందన్నారు. దీంతో కేసులో వాస్తవాలు వెల్లడి కాగలవన్నారు. కేసు దర్యాప్తులో ఉందన్నారు. నిందితుడికి టీడీపీ నేత అండ! అనకాపల్లి: ఇంజినీరింగ్ విద్యార్థి ప్రదీప్‌పై దాడికి వ్యూహరచన చేసి అతని మృతికి కారణమైన యువకునికి కశింకోటకు చెందిన ఒక కీలక టీడీపీ నేత కొమ్ము కాస్తున్నారన్న విషయంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నారుు. అందుకే పోలీసులు కూడా ఉదాశీన వైఖరిని ప్రదర్శించారు. టీడీపీ నేత తనకున్న పలుకు బడితో కేసును నీరుగార్చేందుకు ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడనే కోణంలోనే దర్యాప్తు జరిగేలా తప్పుదారి పట్టించారు. ఈ క్రమంలోనే పోలీసులు కూడా మొదట్లో సీరియస్‌గా ఈ కేసును తీసుకోలేదు. అధికారపార్టీ నేతల ఒత్తిడి పోలీసులపై ఉండడంతోనే ప్రదీప్‌కు సంబంధించిన కేసు పక్కతోవ పట్టేలా కుటిల పన్నాగాలు పన్నారని అర్ధమవుతోంది. దీనికిగానూ ప్రదీప్‌ను 28వతేదీ రాత్రి ఆటోలో పంపించామని కొట్టినవారు చెబుతున్నారు. అలాంటపుడు ఆటోలో వెళ్తున్న ప్రదీప్ 31వతేదీ నాటికి శారదానదిలో ఎలా శవమై తేలాడో వారికే తెలియాలి. పోనీ ఆటోల్లోంచి ప్రదీప్ గెంతి వేస్తే డ్రైవర్ తప్పకుండా పోలీసులకు సమాచారాన్ని ఇచ్చేవాడు. రెండు రోజుల ఆందోళనలు తీవ్ర దుమారాన్ని రేపడంతో అనకాపల్లిలో నిర్వ హించాలని భావించిన పోస్టుమార్టంను కేజీహెచ్‌కు తరలించారు. -
ఇంజినీరింగ్ విద్యార్థి అనుమానాస్పద మృతి
విశాఖపట్నం: అనుమానాస్పదస్థితిలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. విశాఖకు చెందిన ప్రదీప్ అనే విద్యార్థి మృతదేహం శారదానది వద్ద లభ్యమైంది. ప్రియురాలి బంధువులే అతడిని కొట్టి చంపారంటూ ప్రదీప్ బంధువులు ఆరోపిస్తున్నారు. కశింకోట పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మృతదేహంతో అతడి బంధువులు రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ జాం ఏర్పడింది. ప్రదీప్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. -
బీటెక్ స్టూడెంట్ కిడ్నాప్, హత్య..
విశాఖపట్నం: నాలుగు రోజుల కిందట కిడ్నాపైన ఇంజనీరింగ్ విద్యార్థి శవమై కనిపించిన సంఘటన విశాఖపట్నం జిల్లాలో కలకలంరేపుతోంది. మాకవరంపాలెంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతోన్న ప్రదీప్.. సోమవారం సాయంత్రం అనకాపల్లిలోని శారద నది తీరంలో విగతజీవిగా కనిపించాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కు పోలీసులకు సమాచారం అందించారు. ప్రేమ వ్యవహారమే ప్రదీప్ హత్యకు కారణమని స్నేహితులు చెబుతుండగా, తల్లిదండ్రులు మరిన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మాకవరంపాలెంలోని అవంతి కాలేజీకి చెందిన బీటెక్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ ప్రదీప్ ను ఈ నెల 28న గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. అదే కాలేజీలో బీటెక్ సెకండ్ ఇంయర్ చదువుతోన్నఅమ్మాయితోపాటు కశింకోట వద్ద బస్సు దిగిన ప్రదీప్.. ఆమెతో కలిసి చాట్ తింటుండగా కిడ్నాప్ ఘటన జరిగింది. విషయం తెలిసిన వెంటనే ప్రదీప్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈలోగా.. అనకాపల్లి సమీపంలోని శారద నదిలో సోమవారం సాయంత్రం ప్రదీప్ మృతదేహం లభ్యమైంది. నది వద్దకు చేరుకున్న పోలీసులు ప్రదీప్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్ మార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి ప్రదీప్ తల్లిదండ్రులు, బంధువులతోపాటు స్నేహితులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కొన్నేళ్లుగా ప్రదీప్ కు, అతని క్లాస్ మేట్ కు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, ఆ కారణం వల్లే హత్య జరిగి ఉండొచ్చని మృతుడి స్నేహితులు పేర్కొన్నారు. హత్యకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ప్రదీప్ బంధువులు సైతం హత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.