ప్రదీప్ దొరికినట్లు ఎక్కడా సమాచారం లేదు | pradeep not into police custody, says kamal hasan reddy | Sakshi
Sakshi News home page

ప్రదీప్ దొరికినట్లు ఎక్కడా సమాచారం లేదు

Published Fri, Sep 11 2015 12:38 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

ప్రదీప్ దొరికినట్లు ఎక్కడా సమాచారం లేదు - Sakshi

ప్రదీప్ దొరికినట్లు ఎక్కడా సమాచారం లేదు

హైదరాబాద్ : ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ భార్య సుప్రియ హత్య కేసులో రెండో నిందితుడు ప్రదీప్ దొరికినట్లు తమకు ఎక్కడా సమాచారం అందలేదని డీసీపీ కమలాహాసన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రదీప్ అరెస్ట్ అంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తడంపై శుక్రవారం కమలాహాసన్రెడ్డి స్పందించారు. ప్రదీప్ అరెస్ట్ అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. అయితే అక్రమ సంబంధం అన్న అనుమానంతోనే భార్య సుప్రియను ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామకృష్ణ హత్య చేశాడని వెల్లడించారు.

భార్యను హత్య చేసిన రామకృష్ణ... ఆమె మృతదేహన్ని వికారాబాద్ అటవీ ప్రాంతంలో పూడ్చి పెట్టిన సంగతి తెలిసిందే. అందుకు అతడి స్నేహితుడు ప్రదీప్ సహాయ సహకారాలు అందించినట్లు పోలీసుల విచారణలో రామకృష్ణ తెలిపాడు. దీంతో అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ప్రదీప్ను పోలీసులు అదుపులో తీసుకున్నారంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. దీంతో డీసీపీ కమలాహాసన్రెడ్డి పైవిధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement