DCP
-
నార్సింగి పీఎస్ పరిధిలో జంట హత్యల కలకలం
-
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో జంట హత్యల కలకలం
-
ఫోన్‌ట్యాపింగ్ కేసు.. హైకోర్టుకు మాజీ డీసీపీ
సాక్షి,హైదరాబాద్:ఫోన్ ట్యాపింగ్‌లో కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్‌రావు హైకోర్టులో శుక్రవారం(అక్టోబర్18) బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్‌రావు అరెస్టయి రిమాండ్‌లో ఉన్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్‌రావును పంజాగుట్ట పోలీసులు ఏ4గా చేర్చారు. రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. బెయిల్‌పై తదుపరి విచారణ ఈనెల 23కు హైకోర్టు వాయిదా వేసింది. ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మరో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్నారు. పోలీసులు ఆయనను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదీ చదవండి: స్పెల్లింగ్ చెబితే.. రేవంత్‌కు రూ.50 లక్షల బ్యాగ్ గిఫ్ట్ ఇస్తా: కేటీఆర్ -
డీసీపీ ఫిర్యాదు..ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు
సాక్షి,హైదరాబాద్:హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో శనివారం(సెప్టెంబర్14) కేసు నమోదైంది. అడిషనల్ డీసీపీ హరిచందద్రారెడ్డి ఫిర్యాదుతో బీఎన్ఎస్ఎస్ 132 కింద కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు.గురువారం తన ఇంటిపై ఎమ్మెల్యే గాంధీ దాడి తర్వాత కౌశిక్‌రెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి సైబరాబాద్ కమిషనరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి తనను బెదిరించారని డీసీపీ ఫిర్యాదు చేశారు. కాగా, కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన కేసులో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై గచ్చిబౌలి పోలీసులు ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, గాంధీ మధ్య వాగ్యుద్ధం ముదిరి దాడులు, కేసుల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసు -
ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఎవరినీ వదలం: వెస్ట్‌జోన్ డీసీపీ
సాక్షి,హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటివారున్నా చట్టపరమైన చర్యలుంటాయని వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. మంగళవారం(జులై 30) ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ నాయకులున్నా ఎవరున్నా వారిపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. ‘ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు నలుగురు అరెస్ట్ అయ్యారు.మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. విదేశాల్లో ఉన్న ఆ ఇద్దర్ని రప్పించడానికి చట్టపరంగా ప్రాసెస్ జరుగుతోంది. కేసులో ఇప్పటివరకు సేకరించిన సాక్షాధారాలతో చార్జ్ షీట్ దాఖలు చేశాం. దాఖలు చేసిన చార్జిషీట్‌ను కోర్టు అంగీకరించింది. త్వరలో బలమైన సాక్షాలను సేకరించి అనుమానితులను విచారిస్తాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఇప్పటికే ఒక టీం పని చేస్తోంది. -
రియాల్టర్ కమ్మరి కృష్ణ హత్య కేసును చేధించిన పోలీసులు
-
రాధాకిషన్ రావును కరిచిన ‘పిల్లి’.. ఆస్పత్రికి తరలింపు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై.. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తెలంగాణ మాజీ టాస్కో ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును ‘పిల్లి’కరిచింది. దీంతో ఆయనకు తీవ్ర రక్తస్త్రావమైంది. సమాచారం అందుకున్న జైలు అధికారులు అత్యవసర చికిత్స కోసం రాధాకిషన్ రావును నారాయణ గూడ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కంచరపాలెం ఘటనలో ఏం జరిగిందో చెప్పిన DCP
-
బీజేపీ నేత కొడుకు పేర్లు బయటపెట్టిన మాదాపూర్ డీసీపీ
-
హైదరాబాద్‌లో డ్రగ్స్ వ్యాప్తిపై డీసీపీ చెప్పిన సంచలన విషయాలు
-
పంజాగుట్టలో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ అరెస్ట్
-
ఈ కేసులో ఎంతటివారినైనా వదినే ప్రసక్తిలేదు: వెస్ట్ జోన్ డిసిపి విజయ్‌కుమార్
-
హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీపై బదిలీ వేటు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీపై బదిలీ వేటు పడింది. ఈసీ ఆదేశాలతో ప్రభుత్వం బదిలీ చేసింది. నాలుగేళ్లుగా టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీగా రాధాకృష్ణ కొనసాగుతున్నారు. పదవీ విరమణ తర్వాత ఓఓస్డీగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్స్ లభించాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ►టీఎస్పీఎస్ఏ జాయింట్ డైరెక్టర్‌గా రంగనాథ్ ►టీఎస్పీఎస్ఏ డిప్యూటి డైరెక్టర్ గా రాజేంద్ర ప్రసాద్ ►సీఐడీ ఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి ►గ్రే హౌoడ్స్ ఎస్పీగా వెంకటేశ్వర్లు ►సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా నితికా పంత్ ►సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా రోహిత్ రాజ్ ►ట్రాఫిక్ డీసీపీగా ఆర్. వెంకటేశ్వర్లు ►పెద్దపల్లి డీసీపీగా సునీతా మోహన్ -
పోలీసులకు హ్యాకర్ వార్నింగ్.. పర్సనల్ డేటా బయటపెడతామంటూ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఏకంగా పోలీసు ఉన్నతాధికారి ఫోన్ హ్యాకింగ్‌కు గురి కావడం కలకలం సృష్టించింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మరికొందరు పోలీసుల ఫోన్లను కూడా హ్యాక్ చేసి సమాచారం బయటకు తీస్తామని హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. తెలంగాణలో ఎన్నికల సమయం కావడంతో పోలీసు యంత్రాంగం నిత్యం తనిఖీలు, బందోబస్తు విధుల్లో నిమగ్నమై ఉంది. ఇలాంటి తరుణంలో సైబరాబాద్ పరిధిలోని ఒక డీసీపీ ఫోన్ హ్యాక్ అయ్యింది. శనివారం ఉదయం నుంచి విధి నిర్వహణలో నిమగ్నమైన ఆ డీసీపీ ఫోన్ మధ్యాహ్న సమయంలో అకస్మాత్తుగా హ్యాకింగ్‌కు గురైనట్టు గుర్తించారు. దాదాపు 2 గంటల సమయం ఫోన్ పూర్తిగా అవతలి వారి చేతిలోకి చేరినట్టు నిర్ధారించారు. అతికష్టమ్మీద సైబర్ నిపుణులు డీసీపీ ఫోన్‌ను సాధారణ స్థితికి తీసుకొచ్చినట్లు సమాచారం. ఇది హ్యాకర్ల పనేనా?.. లేక ఎవరైనా గిట్టని వారు చేశారా? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక డీసీపీ స్థాయి అధికారి ఫోన్ హ్యాక్ చేయటం.. పోలీసు అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అయితే, నగరంలో ఒక ఐటీ ఉద్యోగిపై సదరు డీసీపీ చేయిచేసుకోవటం వల్లనే ఐటీ నిపుణులు ఫోన్ హ్యాక్ చేసి సమాచారం. ఫోన్లోని వ్యక్తిగత వీడియోలు బయటపెట్టినట్టు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు.. రాబోయే రోజుల్లో మరికొందరి పోలీసుల సమాచారం కూడా ఇదే విధంగా వెలికితీస్తామంటూ తమ పోస్టు ద్వారా హెచ్చరించటం గమనార్హం. దీంతో, అప్రమత్తమైన పోలీసులు.. సదరు హ్యాకర్ కోసం గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: ప్రియుడు మోసం చేశాడనే ప్రవల్లిక ఆత్మహత్య -
ప్రియుడు మోసం చేశాడనే ప్రవల్లిక ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ ఆత్మహత్యకు పాల్పడిన మర్రి ప్రవల్లిక (23) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రియుడు తనని కాదని మరొకరితో వివాహానికి సిద్ధం కావడంతో మనస్తాపం చెంది ఆమె సూసైడ్ చేసుకుందని సెంట్రల్ జోన్ డీసీపీ ఎం. వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు శనివారం డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ప్రవల్లిక అశోక్‌నగర్‌లోని ఓ వసతి గృహంలో ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ‘‘ఆత్మహత్యపై శుక్రవారం రాత్రి సమాచారం రావడంతో అక్కడికి వెళ్లాం. ఆమె గదిలో సూసైడ్ లెటర్ దొరికింది. ఆమె సెల్‌ఫోన్ కాల్ రికార్డ్‌లు, వాట్సాప్ చాటింగ్‌లతో పాటు ఆమె స్నేహితులను విచారించాం. ప్రవల్లిక మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి గ్రామానికి చెందిన శివరామ్ రాథోడ్‌తో ప్రేమ వ్యవహారం నడిపినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించాం. ప్రియుడితో ఫొటోలు, సీసీటీవీ ఫుటేజ్‌లు కూడా ఉన్నాయి. తనను మోసం చేసి శివరామ్ మరో యువతిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇరువురి మధ్య జరిగిన చాటింగ్‌లను గుర్తించాం. శివరామ్, ప్రవల్లిక ఇద్దరు కలిసి నగరంలో ఓ హోటల్‌కు వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ కూడా లభ్యమైంది. మరింత విచారణ కోసం మృతురాలి సెల్‌ఫోన్, సీసీటీవీ ఫుటేజ్, సూసైడ్ నోట్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాం. ఫోరెన్సిక్ రిపోర్ట్, ప్రవల్లిక చాటింగ్స్ ఆధారంగా శివరామ్ రాథోడ్‌పై కేసు నమోదు చేస్తామని డీసీపీ వివరించారు. అలాగే సూసైడ్ నోట్, లెటర్‌పై ఉన్న హ్యాండ్ రైటింగ్ ప్రవల్లికదేనా కాదా అనేది నిర్ధారించేందుకు ఆమె నోట్‌బుక్స్ కూడా సీజ్ చేసినట్లు చెప్పారు. ఏం జరిగిందంటే.. శుక్రవారం సాయంత్రం హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ప్రవల్లిక ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న విద్యార్ధి సంఘాల నేతలు అడ్డుకున్నారు. గ్రూప్–2 పరీక్ష వాయిదా వేయడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. అర్ధరాత్రి వరకూ మృతదేహాన్ని హాస్టల్లోనే ఉంచి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాజకీయ పార్టీలు కూడా రంగంలోకి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రేమ వ్యవహారమే ప్రవళ్లిక ఆత్మహత్యకు కారణమని తేల్చారు. పక్షం రోజుల కితమే హాస్టల్లో చేరిక కాగా, 15 రోజుల క్రితం హాస్టల్లో జాయిన్ అయిన ప్రవల్లిక సంధ్య, అక్షయ శ్రుతిలతో కలిసి ఉండేది. ఎక్కువగా ఎవరితో మాట్లాడేది కాదని అంటున్నారు. ప్రవల్లిక ఉరివేసుకున్న రూమ్‌లో సూసైడ్ నోట్‌తో పాటు లవ్ సింబల్స్‌తో ఉన్న ఓ లెటర్‌ను కూడా పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. మృతురాలి సెల్ ఫోన్ లో తాను ప్రేమించిన శివరామ్ మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని ఫ్రెండ్స్‌తో చేసిన చాటింగ్స్‌ను పోలీసులు గుర్తించారు. ప్రేమగురించి కుటుంబసభ్యులకు తెలుసు–డీసీపీ డిగ్రీ పూర్తి చేసిన తరువాత ప్రవల్లిక ఎలాంటి గ్రూప్స్ పరీక్షలకు అప్లయ్ చేయలేదని డీసీపీ వెంకటేశ్వర్లు చెప్పారు. ఎలాంటి పోటీ పరీక్షలు కూడా రాయలేదన్నారు. ప్రవల్లిక ప్రేమ విషయం కూకట్‌పల్లిలో డిగ్రీ చదువుతున్న తమ్ముడు ప్రణయ్‌తో పాటు తల్లిదండ్రులకు కూడా తెలుసే ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు. వారి వద్ద మరింత సమాచారం సేకరిస్తామన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఆందోళనలు చేసి పోలీసులపై రాళ్లురువి్వన కేసులో బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేస్తామని డీసీపీ స్పష్టం చేశారు. నివేదిక కోరిన గవర్నర్.. ప్రవల్లిక ఆత్మహత్యపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఆమె ఆత్మహత్యపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, టీఎస్పీఎస్సీ కార్యదర్శిలను ఆదేశించారు. ప్రవల్లిక ఆత్మహత్య పట్ల తీవ్ర బాధను వ్యక్తం చేసిన గవర్నర్, ఆమె కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. రాహుల్ గాందీ, ఖర్గే సంతాపం ప్రవల్లిక ఆత్మహత్య బాధాకరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్విట్టర్ వేదికగా స్పందించారు. పరీక్షల నిర్వహణలో బీఆర్ఎస్ ప్రభుత్వ ఉదాసీనతే కారణమని ఆరోపించారు. -
కేటుగాళ్లతో ఖాకీల సెటిల్మెంట్లు
హైదరాబాద్: .. అదేంటి? కొట్టేసిన సొమ్మును సైబర్ నేరస్తులు తిరిగి రీ ఫండ్ చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా? అక్కడే ఉంది అసలు మ్యాజిక్కు!! ‘రీ ఫండ్’ తెర వెనక అసలేం జరిగిందంటే.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సాంకేతిక ఆధారాలతో సైబర్ నేరస్తుల ఏ బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ అయ్యిందో గుర్తించారు. నిందితుడు ఢిల్లీలో ఉన్నట్లు నిర్ధారించుకుని, అక్కడికి వెళ్లి 2–3 రోజులు గాలించి నేరస్తుడిని పట్టుకున్నారు. బాధితురాలి నుంచి కొట్టేసిన సొమ్మును రీ ఫండ్ చేస్తే వదిలేస్తామని నిందితుడితో సెటిల్మెంట్ చేశారు. దీంతో కేటుగాడు బాధితురాలి ఖాతాకు నగదును బదిలీ చేశాడు. అరెస్టు, కేసులు లేకుండా చేసినందుకు నిందితుడి నుంచి సదరు పోలీసులు డబ్బు వసూలు చేశారు. హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత బాధితురాలికి న్యాయం జరిగిందనే కోణంలో లోక్ అదాలత్‌లో రాజీ కుదిర్చి, కేసును విత్‌డ్రా చేయించారు. ‘లెక్క’ చెప్తేనే దర్యాప్తు.. సాధారణంగా కేసు నమోదు, రిమాండ్ రిపోర్టు, చార్జ్‌షీట్ దాఖలు వంటి అధికారం సివిల్ పోలీసులకు ఉంటుంది. కానీ, రాచకొండ సైబర్ క్రైమ్‌లో మాత్రం ఇతర విభాగానికి చెందిన పోలీసులదే హవా. ఏ కేసు నమోదు చేయాలి, దర్యాప్తు చేయాలనే నిర్ణయం కూడా వీళ్లదే అంటే అతిశయోక్తి కాదు. ఇతర రాష్ట్రాల్లో దాక్కున్న సైబర్ నేరస్తులను పట్టుకొచ్చేందుకూ సివిల్ పోలీసులు కాకుండా వీరే వెళ్లడం, సెటిల్మెంట్లు చేయడం పరిపాటిగా మారింది. మోసపోయామని ఠాణా మెట్లు ఎక్కే బాధితులతోనూ ‘లెక్క’ మాట్లాడుకున్న తర్వాతే కేసు దర్యాప్తు ముందుకు సాగుతుందని, లేకపోతే నిందితులు దొరకడం లేదని 2–3 నెలల తర్వాత కేసులను క్లోజ్ చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏళ్లుగా ఒక్కచోటే తిష్ట.. సాధారణంగా పోలీసు విభాగంలో దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేసే వారికి స్థానచలనం ఉంటుంది. అయితే సైబర్ క్రైమ్‌లో మాత్రం ఐదేళ్లకు మించి కానిస్టేబుళ్లు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు పనిచేస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవటం గమనార్హం. ఐదేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్న ఐదుగురు కానిస్టేబుళ్లను ఇటీవల వేరే స్టేషన్‌కు బదిలీ చేశారు అయితే కనీసం రిలీవ్ ఆర్డర్ కూడా చేతికి అందకముందే ‘పెద్దల’ అండదండలతో మళ్లీ అక్కడే పోస్టింగ్ తెచ్చుకోవటం వీరికే చెల్లింది. ‘కొన్ని నెలల క్రితం రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఓ ఐటీ ఉద్యోగిని సైబర్ నేరస్తుల వలలో చిక్కి... రూ.లక్షల్లో మోసపోయింది. దీంతో ఆమె సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. తాజాగా సదరు బాధితురాలు ఠాణాకు వచ్చి తాను మోసపోయిన సొమ్ము తిరిగి ఖాతాలో జమైందని, కేసు ఉపసంహరించుకుంటానని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులే దగ్గరుండి మరీ లోక్ అదాలత్‌లో రాజీ కుదిర్చారు.’ ఏఆర్ టీంను రిటర్న్ చేయాలని నిర్ణయించాం – అనురాధ, డీసీపీ, రాచకొండ సైబర్ క్రైమ్ ప్రస్తుతం రాచకొండ సైబర్ క్రైమ్‌లో నాతో సహా ఇద్దరు ఏసీపీలు కూడా కొత్తగా వచ్చారు. వారు సైబర్ క్రైమ్‌ల దర్యాప్తు, ఇతరత్రా అంశాలపై సాంకేతికంగా పట్టు సాధించాల్సి ఉంది. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న ఏఆర్ టీంను వెనక్కి పంపించాలని నిర్ణయించాం. కొన్ని సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితురాలికి తెలియకుండా వారి కుటుంబ సభ్యులే సైబర్ మోసం చేసినట్లు దర్యాప్తులో గుర్తించాం. ఇలాంటి కేసులలో బాధితుల విజ్ఞప్తి మేరకు విత్‌డ్రా చేస్తున్నాం. -
డింపుల్ హయాతి అసహనం.. ఆయనెక్కడ అంటూ మంత్రి కేటీఆర్‌కే ట్వీట్
హీరోయిన్ డింపుల్ హయాతి పేరు ఈమధ్య ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. హైదరబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో జరిగిన వివాదంతో కొన్నిరోజులుగా డింపుల్ పేరు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ మధ్య ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజ, యాగం వంటి కార్యక్రమాలు జరిపించింది. అలా సోషల్ మీడియాలో వెరీ పాపులర్ అయిపోయింది. ఈ బ్యూటీ హైదరాబాద్ ట్రాఫిక్‌లో ఇరుక్కుంది. ఆ ట్రాఫిక్ వల్ల ఆమె అసహనానికి గురైంది. దీంతో ట్రాఫిక్ డీసీపీ ఎక్కడంటూ ట్విట్టర్లో ప్రశ్నించింది. (ఇదీ చదవండి: దేవుడు ఉన్నాడు.. వాళ్లు అన్యాయం చేస్తే ఎంతవరకైనా వెళ్తా: గుణశేఖర్) అంతటితో ఆగకుండా ఏకంగా తెలంగాణ మంత్రి కేటీఆర్, తెలంగాణా సీఎంఓ ట్విటర్ ఖాతాలకు ట్యాగ్ చేసింది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎదైనా మెడికల్ ఎమర్జెన్స్తో ఉన్న వారు ఈ ట్రాఫిక్‌లో చిక్కుకొని ఉంటే పరిస్థితి ఏంటి..? ఇంట్లో నుంచి అడుగుపెట్టాలంటే భయం వేస్తుంది. ప్రభుత్వం ఏమైన డీజల్,పెట్రోల్ ఉచితంగా ఇస్తుందా.. అంటూ ఆమె ట్వీట్ చేసింది. ఇంకేముంది హైదరాబాద్‌లో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కుంటున్న వారు డింపుల్‌ను సపోర్ట్ చేస్తున్నారు. హయాతీ డేరింగ్ చూసి నెటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు. హైదరాబాద్‌లో యూ టర్న్ అయ్యే పాయింట్లు కొన్ని మార్చడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కొందరు కామెంట్లు చేస్తున్నారు. (ఇదీ చదవండి: తమన్నాకు గోల్డెన్ ఛాన్స్.. మరోసారి ఆయనతో రొమాన్స్‌కు రెడీ) హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో డింపుల్ హయాతిలు ఇద్దరూ ఒకే అపార్ట్మెంట్లో ఉంటారు. కొన్నిరోజుల క్రితం వీరిద్దరి మధ్య కార్ పార్కింగ్ వివాదం నడిచిన విషయం తెలిసిందే. ఆ గొడవ కోర్టు వరకు వెల్లడంతో ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. అతన్ని టార్గెట్ చేసేందుకే డింపుల్ ఈ తరహా ట్వీట్ చేసిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. I mean seriously this is getting worse than anything just to reach your house it takes more than an hour now where’s the traffic dcps ? What if there is a medical emergency? Can we even step out in Hyderabad ? We don’t get fuel free dear government. @KTRBRS @TelanganaCMO pic.twitter.com/0Z4oCblc3K — Dimple Hayathi (@DimpleHayathi) July 19, 2023 -
మల్కాజ్గిరి కిడ్నాప్ కేసు: చంపేస్తామని బెదిరించి 2కోట్లు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు కోసమే బాలుడిని కిడ్నాప్ చేశారు. బాలుడిని కిడ్నాప్ చేసి రూ. 2కోట్లు డిమాండ్ చేయాలనుకున్నారు. ఈ కేసులో ఓ మైనర్ బాలుడి హస్తం కూడా ఉందని డీసీపీ జానకి స్పష్టం చేశారు. కాగా, డీసీపీ జానకి ఈ కేసు వివరాలను శనివారం మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ఈ నెల 15న బాలుడి అదృశ్యంపై కేసు నమోదైంది. కాలనీలో ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాలేదు. వాట్సాప్ ద్వారా బాలుడి పేరెంట్స్‌కు కాల్ వచ్చింది. పోలీసు కేసు వెనక్కి తీసుకోవాలని కిడ్నాపర్లు బెదిరించారు. ఒకే కాలనీలో ఉండేవాళ్లే బాలుడిని కిడ్నాప్ చేశారు. రవి, శివ నెలరోజులుగా బాలుడి కిడ్నాప్‌నకు ప్లాన్ చేశారు. డబ్బు కోసమే బాలుడిని కిడ్నాప్ చేశారు. బాలుడిని కిడ్నాప్ చేసి రూ.2కోట్లు డిమాండ్ చేయాలనుకున్నారు. ఈ కేసులో ఓ మైనర్ బాలుడి హస్తం కూడా ఉంది. 8 బృందాలతో 36 గంటల్లోనే కేసును ఛేదించాం. జనగామ జిల్లా రామన్నగూడెం వద్ద కిడ్నాపర్లను పట్టుకున్నాం. ప్రధాని నిందితుడు రవి సహా ముగ్గురిని అరెస్ట్ చేశాం. ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ కెమెరా ఎవిడెన్స్ కీలకం అయింది. నిందితులపై ఐపీసీ సెక్షన్ 366 కిడ్నాప్ కేస్ నమోదు చేసినట్టు తెలిపారు. మరోవైపు.. బాబు తండ్రి శ్రీనివాస్ కిడ్నాప్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. కిడ్నాపర్ల నుంచి మా బాబును కాపాడిన పోలీసులకు ధన్యవాదాలు. కిడ్నాపర్లు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. పోలీసులకు చెబితే బాబును చంపేస్తామని బెదిరించారు. భారీగా డబ్బు డిమాండ్ చేశారు. మా పక్కింటి వాళ్లే ఇలా చేస్తారని అనుకోలేదు. 1989 నుంచి హైదరాబాద్‌లో ఉన్నాను. నాకు, నా కుటుంబానికి శత్రవులు ఎవరూ లేరు అని తెలిపారు. ఇది కూడా చదవండి: నిఘా ఉన్నా కూడా.. కక్కుర్తిపడి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు -
పెట్టుబడుల పేరుతో మోసగిస్తున్న ముఠా అరెస్ట్
-
డీసీపీతో గొడవ.. బాయ్‌ఫ్రెండ్ మ్యాటర్ లీక్ కావడంతో డింపుల్ అప్సెట్!
హీరోయిన్ డింపుల్ హయాతి పేరు ఈమధ్య ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో జరిగిన వివాదంతో కొన్నిరోజులుగా డింపుల్ పేరు హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ మొత్తం వ్యవహారంతో డింపుల్ చాలా అప్సెట్ అయినట్లు తెలుస్తుంది. ఆమె బయటకు కూడా రావడానికి ఇష్టపడటం లేదని స్వయంగా డింపుల్ లాయర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అసలే వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్న డింపుల్ ఇప్పుడు ఈ ఇష్యూతో అనసరంగా తన రిలేషన్షిప్ విషయం బయటపడిందని ఫీల్ అవుతుందట. విక్టర్ డేవిడ్ అనే వ్యక్తితో డింపుల్ కొంతకాలంగా సహజీవనం చేస్తుంది. ఇద్దరూ ఇప్పుడు ఒకే ఇంట్లో కలిసుంటున్నారు. కానీ ఇంతవరకు ఈ విషయం ఎక్కడా బయటపడలేదు. అయితే డీసీపీతో జరిగిన గొడవలో డింపుల్ బాయ్‌ఫ్రెండ్ గురించి లీక్ అయ్యింది. ఈ విషయంపైనే డింపుల్ చాలా అసహనంగా ఉందట. కాగా డింపుల్ హయతి, ఆమె బాయ్‌ఫ్రెండ్ విక్టర్ డేవిడ్ ఇద్దరి స్వస్థలం విజయవాడ అని తెలుస్తుంది. అతను గ్రాఫిక్ డిజైనర్ అట. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారి లివింగ్ రిలేషన్లో ఉంటున్నారు. ఇంతకాలం ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచినా డీసీపీతో తలెత్తిన వివాదంతో వీరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. -
డింపుల్‌తో డీసీపీ అసభ్యంగా ప్రవర్తించారు : న్యాయవాది
హీరోయిన్ డింపుల్ హయాతి, డీసీపీ రాహుల్ హెగ్డేల మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ ఇష్యూపై డింపుల్ న్యాయవాది పాల్ సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. జంతువులను హింసిస్తుంటే డీసీపీని డింపుల్ వారించిందని, దీంతో ఆయన కక్ష పెంచుకున్నారని తెలిపారు. ''డింపుల్‌తో డీసీపీ చాలాసార్లు ర్యాష్‌గా మాట్లాడారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. డింపుల్ పార్లింగ్ ప్లేసులో కావాలనే కోన్స్ పెట్టారు. అయినా రోడ్డుపై వుండాల్సిన సిమెంట్ బారికేడ్స్, కోన్స్ ప్రైవేట్ స్థలంలోకి ఎలా వచ్చాయి? ఇదే విషయాన్ని రెండు నెలలుగా అడుగుతున్నాం. జంతువులను హింసిస్టుంటే డింపుల్ వారించింది. అందుకే ఆ కక్షతోనే డీసీపీ ఇలా తప్పుడు కేసు పెట్టారు. డింపుల్ ఎక్కడా కారును తన్నిన ఫుటేజీ లేదు. కానీ ఆమెను తప్పుగా చిత్రీకరించడానికి చూస్తున్నారు. జరిగిన పరిణామాలు చూసి డింపుల్ మానసిక ఒత్తిడికి గురైంది, ఆమె బయటకు వెళ్లేందుకు కూడా భయపడుతుంది. డీసీపీ నుంచి డింపుల్‌కు ప్రాణహాని ఉంది. ఇప్పటికే ఆమెకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ కేసను న్యాయపరంగా ఎదుర్కొంటాం'' అంటూ ఆమె న్యాయవాది పేర్కొన్నారు. -
'డింపుల్‌తో డీసీపీ ర్యాష్‌గా మాట్లాడారు.. అందుకే కాలితో తన్నారు'
రామబాణం ఫేం డింపుల్ హయాతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే వివాదం సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. హీరోయిన్ డింపుల్ హయాతిపై కావాలనే తప్పుడు కేసు పెట్టారని డింపుల్ తరఫు న్యాయవాది పాల్ సత్యనారాయణ ఆరోపించారు. డింపుల్‌తో డీసీపీ చాలాసార్లు ర్యాష్‌గా మాట్లాడారని అన్నారు. అంతే కాకుండా డింపుల్ కారు పార్కింగ్ ప్లేస్‌లో కోన్స్ పెట్టారని రోడ్డు మీద సిమెంట్ బ్రిక్స్ ప్రైవేట్ ఆపార్ట్‌మెంట్‌లోకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని తాము రెండు నెలలుగా అడుగుతున్నామని తెలిపారు. ఈ విషయంలో తాము లీగల్‌గానే పోరాటం చేస్తామని వెల్లడించారు. (ఇది చదవండి:డింపుల్ హయాతి కేసులో ట్విస్ట్.. కారుకు వరుస చలాన్లు!) డింపుల్ తరఫు న్యాయవాది పాల్ సత్యనారాయణ మాట్లాడుతూ..'డింపుల్‌పై కావాలనే తప్పుడు కేసు పెట్టారు. డింపుల్‌తో డీసీపీ చాలాసార్లు రాష్‌గా మాట్లాడారు. డింపుల్ పార్కింగ్ ప్లేస్‌లో కోన్స్ పెట్టారు. డింపుల్ ఒక సెలబ్రిటీ. చాలాసార్లు చెప్పినా వినకపోవడంతో అసహనంతో కోన్స్‌ను కాలుతో తన్నారు. డీసీపీపై డింపుల్ కేసు పెడతాను అని బెదిరించడంతో.. తిరిగి డింపుల్పైనే కేసు పెట్టారు. ఆమెను వేధించాలనేదే డీసీపీ ఉద్దేశం. క్వార్టర్స్‌లో ఉండకుండా డీసీపీ ఇక్కడ ఎందుకు ఉన్నారు.' అంటూ ఆరోపించారు. #heroinepolicecase #DimpleHayathi పై తప్పుడు కేస్ పెట్టారు అంటున్న #డింపుల్ లాయర్ Advocate questions #ips why cement bricks & traffic #triangles came into apartment parking area. ? Lot of turns & twists in this case against @DimpleHayathi Truth need to comeout.#18fms #18f pic.twitter.com/sn8nScTAZM — Narayana Pragada (@pragada1) May 23, 2023 లీగల్‌గానే ఫైట్ చేస్తాం: సత్యనారాయణ న్యాయవాది మాట్లాడుతూ.. 'సిమెంట్ బ్రిక్స్ తేవాలి అంటే.. చిన్న క్రేన్‌తో తేవాలి. ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్లో వాటిని ఎలా తెస్తారో ముందు చెప్పాలి. ప్రభుత్వ ప్రాపర్టీని మిస్ యూజ్ చేస్తున్నారు. ఒక డీసీపీ స్థాయి వ్యక్తి ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో తెలియదా?. అమ్మాయి మీదకి వెళ్లి మాట్లాడతారా? ఒక సెలబ్రిటీగా.. అందులోనూ పోలీస్ ఆఫీసర్‌పై కేసు పెట్టేందుకు వెనుకాడింది. కానీ ఐపీఎస్ తన డ్రైవర్‌తో కేసు పెట్టించారు. డింపుల్ కూడా ఫిర్యాదు చేసింది.. కానీ తీసుకోలేదు. 4 గంటలు పీఎస్‌లో కూర్చోపెట్టారు. ఈ కేసులో మేము లీగల్‌గానే ఫైట్ చేస్తాం.' అని అన్నారు. (ఇది చదవండి: హన్సికను వేధించిన టాలీవుడ్ టాప్ హీరో.. ఎవరై ఉంటారబ్బా?) -
కాసేపట్లో హన్మకొండలో డీసీపీ కార్యాలయానికి ఈటెల
-
పలు నకిలీ డాక్యుమెంట్స్‌తో భారీ మొత్తంలో అవినీతి
-
ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
జనగామ: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండలగూడెం బాలసాయిబాబా ట్రస్ట్ భూములను రక్షించే క్రమంలో తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ప్రజా గాయకుడు గద్దర్ కోరారు. ఈ మేరకు శనివారం వెస్ట్‌జోన్ డీసీపీ సీతారాంను జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. రెండు షిఫ్టులు పని చేసేలా నలుగురు గన్మెన్లను రక్షణగా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గద్దర్ మాట్లాడుతూ బాలసాయిబాబా ట్రస్ట్ భూములను ప్రభుత్వానికి అప్పగించాలని కొంతకాలంగా పోరాటం చేస్తున్నానని చెప్పారు. భూముల పరిరక్షణకు తరుచూ ఈ ప్రాంతానికి వస్తున్నానని, పలువురు ప్రజాప్రతినిధులు, రియల్టర్లతో తనకు ప్రాణహాని ఉన్నట్లు తెలిసిందన్నారు. మండలగూడెం రియల్టర్ల చేతిలో ఉన్న 59 ఎకరాల బాలసాయిబాబా ట్రస్ట్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న పేరుతో అక్కడే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని గద్దర్ డిమాండ్ చేశారు. బాలసాయిబాబా కుటుంబ సభ్యులు ఆ భూములను హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి విక్రయించినట్లు సమాచారం ఉందని, భూముల వివరాలు కావాలని మూడు రోజుల కిందట సమాచార హక్కు చట్టం కింద రఘునాథపల్లి రెవెన్యూ అధికారులను కోరినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఓసారి తనపై హత్యాయత్నం జరిగిందని, బాలసాయిబాబా భూములను కాపాడేందుకు చేస్తున్న పోరాటంలో రక్షణ కల్పించాలని కలెక్టర్ శివలింగయ్య, డీసీపీ సీతారాంకు గద్దర్ విన్నవించారు. -
జింఖానా గ్రౌండ్ తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదు: అడిషనల్ సీపీ
-
ఖాజాగూడలో హత్య.. జిన్నారంలో కాల్చివేత
గచ్చిబౌలి: తమ అంతస్తుకు తగ్గట్లుగా ఆర్థికంగా లేడని కూతురు ప్రేమ వివాహన్ని జీర్ణించుకోలేక ఓ తండ్రి సుపారీ ఇచ్చి అల్లుడిని హత్య చేశాడని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రేమ వివాహం చేసుకున్న నారాయణరెడ్డి హత్య కేసు వివరాలను ఆమె వెల్లడించారు. పొదల కొండపల్లి గ్రామం, కొమరోలు మండలం, ప్రకాశం జిల్లాకు చెందిన శనివారపు మెంకట నారాయణరెడ్డి(25) సాఫ్ట్వేర్ ఇంజనీర్. కేపీహెచ్బీలో నివాసం ఉంటున్నాడు. తన స్వగ్రామానికి చెందిన రవళిని సంవత్సరం క్రితం ప్రేమ వివాహం చేసుకొని ఢిల్లీలో ఉంటున్నారు. రవళిని పంపిస్తే పెద్దల సమక్షంలో వివాహం జరిపిస్తామని రవళి తండ్రి వెంకటేశ్వర్‌రెడ్డి, సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి నమ్మించి రప్పించారు. రవళిని ఇంటి వద్ద ఉంచుకొని వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న వెంకట నారాయణరెడ్డి తనతో భార్య కలిసి ఉన్న ఫొటోలను బందువులకు, తెలిసిన వారికి చూపించి పెళ్లి కాకుండా అడ్డుకుంటున్నాడు. ఈ క్రమంలో ద్వేషం పెంచుకున్న రవళి తండ్రి వెంకటేశ్వర్‌రెడ్డి తన కూతురును ప్రేమ వివాహం చేసుకున్న వెంకట నారాయణరెడ్డిని అడ్డుతొలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన బందువైన చైతన్యపురిలో నివాసం ఉంటూ ఐస్‌క్రీం పార్లర్ నిర్వహించే గాజులపల్లి శ్రీనివాస్‌రెడ్డి(20)కి రూ.4.5 లక్షలకు సుపారీ ఇచ్చాడు. అడ్వాన్సుగా రూ.50 వేలు ఇవ్వగా శ్రీనివాస్‌రెడ్డి, అదే గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ కమలపాటి కాశి(20), షేక్ ఆషిక్(20)లు కలిసి నూజివీడు వెళ్లి కారు అద్దెకు తీసుకున్నారు. తిరిగి కారులో షేక్‌పేటకు వచ్చి లాడ్జిలో అద్దెకు ఉన్నారు. జూన్ 26న కేపీహెచ్‌బీలోని రెడ్ చిల్లీ రెస్టారెంట్‌కు వెంకట నారాయణరెడ్డిని రప్పించారు. కూల్‌డ్రింక్స్‌లో కొద్ది మోతాదులో మత్తు బిల్లలు కలిపి ఇచ్చారు. కొద్ది సేపటికే వెంకట నారాయణరెడ్డి తనకు పని ఉందని చెప్పి ఇంటికి వెళ్లిపోయాడు. జూన్ 27న పార్టీ జరుపుకుందామని రాయదుర్గం రావాల్సిందిగా పిలిచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో ఖాజాగూడ చెరువు వద్ద కారులో ముందు సీట్లో కూర్చున్న వెంకటనారాయణ రెడ్డి మెడకు టవల్, చార్జర్ కేబుల్ బిగించి హతమార్చారు. చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం సమీపంలోని ఓ పెట్రోల్ బంక్‌లో బాటిల్లో పెట్రోల్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి జిన్నారం అటవీ ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని కాల్చి వేశారు. అక్కడి నుంచి కర్నూల్‌కు వెళ్లాడు. తన బావమరిది వెంకట నారాయణ రెడ్డి కనిపించడం లేదని, సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ ఉందని జూన్ 30న కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టి నిందితుడు కాశిని అరెస్ట్ చేశారు. కాశి అరెస్ట్ అయిన విషయం తెలుసుకున్న శ్రీనివాస్‌రెడ్డి, అషిక్లు కర్నూల్‌కు పారిపోయి ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు అస్వస్థతకు గురికావడం గమనించి ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న రవళి తండ్రి వెంకటేశ్వర్‌రెడ్డి, సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల నుంచి రూ.7,160, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
ఆ పబ్స్ పై కఠిన చర్యలు తీసుకుంటాం: డీసీపీ శిల్పవల్లి
-
అత్యాచార ఘటనతో హోంమంత్రి మనవడికి సంబంధం లేదు: వెస్ట్‌జోన్ డీసీపీ
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో రాష్ట్ర హోం మంత్రి మనవడు వున్నాడనేది పూర్తిగా అవాస్తవం అని వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ సృష్టం చేశారు. సీసీ కెమెరాల్లో అతను ఎక్కడా కనిపించ లేదని, అన్నీ పరిశీలించాకే క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలిపారు. బాలిక అత్యాచార ఘటనపై శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు చేశామన్నారు. సెక్షన్ 354, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. బాలిక చెప్పిన వివరాల ప్రకారం.. ఐదుగురు నిందితులను గుర్తించామని పేర్కొన్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని, మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు వివరించారు. నిందితుల్లో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నారన్నారు. ఈ కేసులో ఓ ప్రముఖ వ్యక్తి కుమారుడి పాత్ర ఉన్నట్లు ఆధారాలు లభించాయని తెలిపారు. అయితే అతడు మైనర్ కావడంతో వివరాలు వెల్లడించలేకపోతున్నామన్నారు. ఈ కేసును ఏసీపీ స్థాయి అధికారి విచారణ చేస్తున్నారని, నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే కొడుకుకు సంబంధించిన ఆధారాలు కూడా లభించలేదని డీసీపీ పేర్కొన్నారు. చదవండి: బాలిక అత్యాచారం కేసు.. పోలీసుల అదుపులో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడు -
చేసిన పొరపాటు గుర్తించా... ఆరోజే డిసైడయ్యా: సుమిత్ సునిల్
డాక్టర్, పోలీసు.. ప్రజా సేవకు అవకాశం ఉన్న వృత్తులు. అందుకే ఆ రంగాలంటే చాలా ఇష్టం. ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్‌గా సేవలందిస్తూనే ఐపీఎస్ అయ్యా..అని డీసీపీ–1గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గరుడ సుమిత్ సునీల్ అన్నారు. సాక్షితో ఆయన పలు విషయాలు పంచుకున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే.. సాక్షి, విశాఖపట్నం: జీవితంలో మనకు తెలియకుండా జరిగే తప్పులు కొన్నైతే..భాష రాకపోతే జరిగే పరిణామాలు ఒక్కోసారి ఇబ్బంది పెడుతుంటాయి. తాను మహారాష్ట్రలో పుట్టడంతో ఆంగ్లం, హిందీ భాషలే బాగా వచ్చు. వైద్య వృత్తి చేస్తూ ఐపీఎస్ అయ్యాను. దాదాపు అంతా ఆంగ్లంనే బోధన.. పైగా నా స్నేహితులు కూడా ఇంగ్లిష్, హిందీ వచ్చినవాళ్లే.. దీంతో మిగిలిన భాషలు నేర్చుకునే అవకాశం రాలేదు.. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో ట్రైనీగా పనిచేస్తున్నప్పుడు ఓ ఎస్ఐ పనితీరు బాగోలేదని ఫిర్యాదు(తెలుగులో) వచ్చింది. అయితే తెలుగు రాకపోవడంతో ఏ ఎస్ఐ మీద ఫిర్యాదు వచ్చిందో అతడికే విచారించమని ఫార్వర్డ్ చేశా...తరువాత ఆ ఫిర్యాదును ఇంగ్లిషులోకి తర్జుమా చేసి చెప్పాలని సహచర ఉద్యోగికి చెప్పగా...చేసిన పొరపాటు గుర్తించా... ఆరోజే డిసైడయ్యా...తెలుగు కచ్చితంగా నేర్చుకోవాలని. ఇప్పుడు తెలుగు బాగా నేర్చుకున్నాను. గ్రేహౌండ్స్ అసల్ట్ కమాండర్‌గా, విశాఖ రేంజ్ పరిధిలో నర్సీపట్నం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎస్ఈబీ ఏఎస్పీగా ఓఎస్డీగా, శ్రీకాకుళం ఏఎస్పీగా, కాకినాడ ఏపీఎస్పీ మూడవ బెటాలియన్ కమాండెంట్‌గా పనిచేశా..దీంతో తెలుగు రాయడం, చదవడం బాగా వచ్చింది. సీపీ శ్రీకాంత్ ఆదేశాల మేరకు నగరంలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా విధులు నిర్వహిస్తా..విశాఖ నగర పరిస్థితులు, వాతావరణమంటే చాలా ఇష్టం. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెరుగుతున్న టెక్నాలజీతో పాటు సైబర్ నేరాలు కూడా రోజు రోజుకీ పెరుగుతున్నాయి. గడిచిన మూడేళ్లలో నగరంలో సైబర్ నేరాలు పరిశీలిస్తే..ఆన్లైన్లో రుణాలు, ఉద్యోగాలు, ఆకర్షణీయమైన ఆఫర్లు, లక్కీడ్రాల పేర్లతో అధిక శాతం మంది యువతే మోసపోతున్నారు. అలాగే బ్యాంకు తరహా మోసాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. బ్యాంకుల నుంచి అని ఎవరైనా ఫోన్ చేస్తే ఎవరూ నమ్మవద్దు. బ్యాంకు అధికారులు వ్యక్తిగత సమాచారం ఎట్టిపరిస్థితుల్లో అడగరు. ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. విజిబుల్ పోలీసింగ్ పెంచుతాం నిర్మానుష్య ప్రాంతాల్లో లైట్లు వేయడం, అక్కడ పెట్రోలింగ్ వాహనాలను పెంచడం. విజిబుల్ పోలీసింగ్ పెంచడం చేస్తున్నాం. ఇప్పటికే నైట్‌బీట్ సిస్టం ద్వారా దొంగతనాలు, చోరీలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నాం. రాత్రి సమయాల్లో ప్రయాణికులకు కూడా భద్రత కల్పించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. మహిళ భద్రతకు అధిక ప్రాధాన్యం ఇప్పటికే నగరంలో దిశ పెట్రోలింగ్ టీంలను ఉన్నాయి. వీకెండ్స్‌లో పర్యాటకుల తాకిడి ఉండడం కారణంగా బీచ్‌కు వచ్చిన మహిళలకు భద్రతగా పెట్రోలింగ్ టీంలు పనిచేస్తాయి. ఇప్పటికే అన్ని విద్యాసంస్థల్లో దిశయాప్ డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకున్నాం. స్పందన సమస్యలు త్వరిగతిన పరిష్కారం.... నగర డీసీపీ–1గా బాధ్యతలు స్వీకరించి పది రోజులు అవుతోంది. ఇక్కడ పరిస్థితులకు అలవాటు పడ్డా. ఇప్పటికే పలువురు తమ తమ సమస్యలు, వినతులు ఇస్తున్నారు. స్పందన కు వచ్చిన ప్రతి సమస్య త్వరితగతిన పరిష్కరించేందుకు కృషిచేస్తా. ప్రతి సోమవారం స్పందనలో ప్రజలు తమ తమ సమస్యలను చెప్పుకోవచ్చు. అంతే కాకుండా ప్రతి రోజు ప్రజలు డీసీపీ–1 కార్యాలయంలో సమస్యలు చెప్పుకోవచ్చు. -
‘వుయ్ కేన్’ కార్యక్రమంలో ఫెమినా మిస్ ఇండియా- 2020 మానస వారణాసి
-
చేతిలో పైసా లేదు..భర్త కోసం 1400 కి.మీ. ప్రయాణం
లూథియానా:భార్య మీద అలిగి ఇంట్లోంచి వెళ్లిపోయిన భర్తను వెతుక్కుంటూ బయలుదేరింది ఓ భార్య .దీనిలో విశేషం ఏముంది అనుకుంటున్నారా? అక్కడే అసలు విషయం దాగి ఉంది, దాదాపు 1400 కిలోమీటర్లు దూరంలో ఉన్న భర్తను వెతుక్కుంటూ బయలుదేరింది.19 ఏళ్లు ఆమె చేతిలో చిల్లి గవ్వ లేకుండా పాట్నా నుంచి పంజాబ్ లోని లూథియానా వరకూ ప్రయాణించింది. ఆమెకు తెలిసిందల్లా ఒకటే..తన భర్త లూథియానాలోని సలేమ్ తబ్రీ ప్రాంతంలోని ఓ చోట పనిచేస్తున్నాడు. దీంతో తన ఇద్దరు పిల్లలను పాట్నాలో తెలిసినవారి వద్ద వదిలేసి లూథియానా వచ్చి భర్తను వెతికే పనిలో పడింది. భర్త కోసం పిచ్చిదానిలా వెతకటం ప్రారంభించింది. అలా వెతుకుతుండగా లూథియానాలో బుద్ దేవ్ అనే వ్యక్తి ఆమెకు కలిశాడు.ఈ ప్రాంతంలో కొత్తగా కనిపిస్తున్నావు,ఇలా ఎవరి కోసం వెతుతున్నావ్ అనిఅడిగాడు. దానికి ఆమె చెప్పిన కథ విని ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు.తిండి పెట్టి ఆశ్రయం ఇచ్చాడు.తరువాత ఆమెను లూథియానా నగర అదనపు డీసీపీ ప్రగ్యా జైన్ వద్దకు తీసుకెళ్లాడు. కానీ ఆమె భర్త గురించి పూర్తి వివరాలు చెప్పలేకపోయింది.తనకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పెళ్లైందని..నా భర్త పేరు జాన్. ఇద్దరు పిల్లలు పుట్టాక చిన్న గొడవ వల్ల తనను పిల్లలను వదిలి ఇల్లు వదిలిపెట్టి వచ్చేశాడని తెలిపింది. తరువాత ఫోన్ చేసి నేను లూథియానాలో ఉన్నానని చెప్పాడని..కానీ రమ్మంటే నేను రాను అని చెప్పాడని వాపోయింది. డీసీపీ ప్రగ్యా జైన్ ఆమె ఇచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా పలు రకాలుగా యత్నించినా ఆచూకీ లభించలేదు. అలా అతని ఫోన్ నంబర్ ఆధారంగా చివరకు ఆమె భర్త జాన్‌ను కనిపెట్టారు. మొదట ఈమె ఎవరో తెలీదని జాన్ అబద్దాలు ఆడాడు.కానీ పోలీసులు భయపెట్టటంతో ఆమె నా భార్య అని ఒప్పుకున్నాడు. పోలీసుల కౌన్సిలింగ్ తో ఆమెతో కలిసి ఉండేందుకు ఒప్పుకున్నాడు. త్వరలోనే బీహార్ నుంచి పిల్లలను తీసుకొచ్చి లూథియానాలోనే ఉంటామని చెప్పాడు. చదవండి:పాముకు ఊపిరి ఊది ప్రాణం నిలిపిన యువకుడు, వీడియో వైరల్ -
క్రీడాకారులకు ‘సాక్షి’ ప్రోత్సాహం భేష్
మొయినాబాద్: క్రీడల్లో గెలుపు, ఓటమి సమానమేనని, క్రీడాకారులు పోరాట పటిమ, క్రీడా స్ఫూర్తిని చాటాలని శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి అన్నారు. ‘సాక్షి’ మీడియా గ్రూప్, వీఐటీ–ఏపీ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సాక్షి’ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ముగిసింది. నగర శివారులోని మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ సమీపంలో ఉన్న ఎస్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీలో మంగళవారం జూనియర్, సీనియర్ విభాగంలో రీజినల్ స్థాయి ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. అనంతరం ఏర్పాటు చేసిన బహుమతుల ప్రదానోత్సవానికి శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్రీడాకారులను గుర్తించేందుకు ‘సాక్షి’ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 676 జట్లతో ‘సాక్షి’ ప్రీమియర్ లీగ్ నిర్వహించడం భేష్ అన్నారు. యువతను ప్రోత్సహిస్తున్న ‘సాక్షి’ ‘సాక్షి’ మీడియా గ్రూప్ విద్యార్థులు, యువతను ప్రోత్సహించేందుకు అనేక రకాల ఈవెంట్స్ నిర్వహిస్తోందని, అందులో ఎస్పీఎల్ ఒకటని సాక్షి కార్పొరేట్ కమ్యూనికేషన్ డైరెక్టర్ రాణిరెడ్డి అన్నారు. అనంతరం.. జిల్లా స్థాయి, రీజినల్ స్థాయిలో విన్నర్స్, రన్నర్స్ జట్టకు డీసీపీ ప్రకాష్‌రెడ్డి చేతులమీదుగా బహుమతులు అందజేశారు. జూనియర్ విభాగంలో జిల్లాస్థాయిలో విజయం సాధించిన భవన్స్ శ్రీఅరబిందో జూనియర్ కాలేజ్ ఏ జట్టు, రన్నర్‌గా నిలిచిన భవన్స్ శ్రీఅరబిందో జూనియర్ కాలేజీ బి జట్లకు, సీనియర్ విభాగంలో జిల్లాస్థాయి విజయం సాధించిన భవన్స్ వివేకానంద డిగ్రీ కాలేజ్ జట్టు, రన్నర్‌గా నిలిచిన సర్దార్‌పటేల్ డిగ్రీ కాలేజ్ జట్లకు బహుమతులు అందించారు. రీజినల్ స్థాయిలో జూనియర్ విభాగంలో విజయం సాధించిన భవన్స్ శ్రీఅరబిందో జూనియర్ కాలేజ్ జట్టు, రన్నర్‌గా నిలిచిన మహబూబ్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల జట్టుకు, సీనియర్ విభాగంలో విజేతగా నిలిచిన భవన్స్ వివేకానంద డిగ్రీ కాలేజ్ జట్టు, రన్నర్‌గా నిలిచిన మహబూబ్‌నగర్ విద్యా సమితి(ఎంవీఎస్) డిగ్రీ కాలేజ్ జట్టుకు ట్రోఫీ, సరి్టఫికెట్లు, నగదు బహుమతులు అందజేశారు. జూనియర్, సీనియర్లో భవన్స్ విజయం రీజినల్ స్థాయిలో మంగళవారం జరిగిన జూనియర్, సీనియర్ విభాగాల్లో భవన్స్ జట్లు విజయం సాధించాయి. మొదట జరిగిన జూనియర్ విభాగం మ్యాచ్‌లో మహబూ బ్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల జట్టు, భవన్స్ శ్రీఅరబిందో జూనియర్ కాలేజ్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ జట్టు 94 పరుగులు చేసింది. 95 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భవన్స్ జట్టు 97 పరుగులు చేసి టైటిల్ గెలుచుకుంది. సీనియర్ విభాగంలో.. రీజినల్ స్థాయిలో సీనియర్ విభాగం మ్యాచ్ భవన్స్ వివేకానంద డిగ్రీ కాలేజ్, మహబూబ్‌నగర్ విద్యా సమితి(ఎంవీఎస్) డిగ్రీ కాలేజట్ జట్ల మధ్య జరిగింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భవన్స్ జట్టు 155 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఎంవీఎస్ జట్టు 85 పరుగులే చేసింది. దీంతో భవన్స్ విజయాన్ని అందుకుని ట్రోఫీని గెలుచుకుంది. ( చదవండి: వామ్మో.. రోజుకు లక్ష కేసులు తాగేస్తున్నారు! ) -
‘మహేష్ మర్డర్ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం’
సాక్షి, విజయవాడ: మహేష్ మర్డర్ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హత్య, దోపిడి(మర్డర్ ఫర్ గెయిన్)తో పాటు మరణాయుధాల చట్టం ప్రకారం నిందితులపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. అయితే నిందితులు ఇద్దరు ఆటోలో వచ్చినట్టు గుర్తించామని మహేష్ హత్య తర్వాత నిందితులు కారు వదిలిన ప్రాంతంలో సీసీ ఫుట్టేజ్‌లను పరిశీలిస్తున్నామని చెప్పారు. (చదవండి: బెజవాడ మహేష్ హత్య కేసులో కొత్త కోణం) కాల్పుల సమయంలో మహేష్‌తో పాటు స్పాట్లో ఉన్న నలుగురినీ విచారిస్తున్నామని తెలిపారు. మహేష్ కుటుంబ సభ్యుల అనుమానాలపై కూడా దర్యాప్తు చేస్తున్నామని, మహేష్‌పై నిందితులు మొత్తం తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిపారని, అయిదు రౌండ్లు కాదని డీసీపీ స్ఫష్టం చేశారు. బులెట్ల ఆధారంగా నిందితులు 7.5 ఎమ్ఎమ్ బుల్లెట్లు వాడినట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తును పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వేగవంతం చేస్తున్నామని డీసీపీ వెల్లడించారు. -
బాంద్రా డీసీపీ- రియా ఫోన్ కాల్స్
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తి కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కాల్ లిస్ట్‌కు సంబంధించి ఇప్పుడు ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. బాంద్రా డీజీపీ అభిషేక్ త్రిముఖితో రియా పలుమార్లు మాట్లాడినట్లు తెలుస్తోంది. రియాకు అభిషేక్ రెండు సార్లు కాల్ చేసినట్లు, రియా అభిషేక్‌కు రెండు పర్యాయాలు కాల్ చేసినట్లు ఉంది. కాల్స్‌తో పాటు ఒక మెసేజ్ కూడా చేశారు. దీనిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముంబై పోలీసులు మాత్రం రియాను మొదట కేసుకు సంబంధించి విచారించగా తాను షాక్‌లో ఉన్నానని ఇప్పుడు ఏం చెప్పలేనని అన్నట్టు తెలిపారు. మరో సారి కేసుకు సంబంధించి మెసేజ్ చేసినప్పుడు రియా స్పందించలేదని తెలిపారు. ఇక రియాతో పాటు సుశాంత్ ఆత్మహత్య విషయంలో నిందుతులుగా ఉన్న అందరితోనూ అభిషేక్ టచ్‌లో ఉన్నారని ముంబై పోలీసులు తెలిపారు. (దిశ మరణించిన రాత్రి ఏం జరిగింది?) ఇదిలా వుండగా బిహార్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు ప్రభుత్వం కేసును సీబీఐకు అప్పగించిన సంగతి తెలిసిందే. రియా చక్రవర్తి మీద కేసు నమోదు చేసిన సీబీఐ ఆమెను విచారిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె కాల్ డేటాపై విచారణ మొదలు పెట్టారు. వీటిలో ఎక్కువ సార్లు రియా తన తమ్ముడుకి కాల్ చేసింది. తరువాత తన తండ్రితో ఎక్కువసార్లు మాట్లాడినట్టు తేలింది. చదవండి: రియా వచ్చిన కారు ఎవరిదో తెలుసా! -
సుశాంత్ కేసు: డీసీపీ సంచలన వ్యాఖ్యలు
ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముంబై డీసీపీ ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ బంధువు, హరియాణా సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు.. రియా మీద ఒత్తిడి పెంచాల్సిందిగా తనను కోరారని తెలిపారు. వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని విడదీయాలని తనను అభ్యర్థించారని వెల్లడించారు. వివరాల్లోకి వెళితే... డిప్యూటీ పోలీస్ కమిషనర్ పరమ్‌జిత్‌సింగ్ దహియా ఒక టీవీ చానల్‌తో మాట్లాడుతూ.. ‘సుశాంత్ బావ, హరియాణా పోలీస్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఓపీ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో నాతో ఒక విషయం చెప్పారు. రియా చక్రవర్తిని అనధికారికంగా పోలీస్ స్టేషన్‌కు పిలిచి.. ఆమెపై ఒత్తిడి తేవాల్సిందిగా నన్ను కోరారు. రియా, సుశాంత్‌ను తన కంట్రోల్లో పెట్టుకుందని అతడి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. కనుక రియాను సుశాంత్ జీవితం నుంచి తప్పించాలి. అందుకే ఆమె మీద ఒత్తిడి తీసుకురండి. వారి మధ్య ఉన్న బంధాన్ని వీడదీయండి’ అని ఓపీ సింగ్ తనతో చెప్పారన్నారు దహియా. (బాలీవుడ్‌తో సంబంధాలు నిజమే: ఆదిత్య ఠాక్రే) అయితే ఇందుకు సంబంధించి సుశాంత్ కుటుంబం తమకు లిఖితపూర్వక ఫిర్యాదును సమర్పించలేదని దహియా తెలిపారు. ఫిబ్రవరి 18, 25 తేదీలల్లో వాట్సాప్ సందేశాల ద్వారా ఓపీ సింగ్ తనకు అనధికారిక అభ్యర్థన చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 5న సింగ్ ముంబైకి వచ్చారని.. తన రాక గురించి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు తెలియజేయమని కోరారు అన్నారు. అంతేకాక మిరాండా అనే వ్యక్తిని ఎటువంటి ఫిర్యాదు, దర్యాప్తు లేకుండా ఒకరోజు పోలీసు కస్టడీలో ఉంచాలని ఓపీ సింగ్ తనను అభ్యర్థించినట్లు దహియా చెప్పారు. అయితే అందుకు తాను అంగీకరించలేదని ఫిర్యాదు లేకుండా ఎవరినీ పోలీస్ స్టేషన్‌కి పిలిచి తన అదుపులో ఉంచడం సాధ్యం కాదని తెలిపానన్నారు. అంతేకాక ఇది నిబంధనలకు వ్యతిరేకమని ఓపీ సింగ్‌కు తెలియజేశానన్నారు. దహియా ఏప్రిల్ 1 వరకు బాంద్రా ప్రాంత మండల పోలీసు అధిపతిగా ఉన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే క్వారంటైన్‌కు తరలింపు
సాక్షి, విజయవాడ : లాక్డౌన్ పూర్తిస్థాయిలో అమలవుతుందని డీసీపీ హర్షవర్దన్ తెలిపారు. నిబంధనలు పాటించని వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నామని పేర్కొన్నారు. హాట్ స్పాట్ ప్రాంతాల్లో కఠిన చర్యలు చేపట్టడంతో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని వివరించారు. డ్రోన్, సీసీ కెమెరాలతో నిఘా ఉంచి పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నామని, అనవరసంగా రోడ్లపైకి వచ్చే వారి ద్విచక్రవాహనాలు సీజ్ చేయడంతో కొంత వరకు పరిస్థితిని అదుపుచేశామని అన్నారు. ఇక పడమటలో పోలీసులు ల్యాండ్ మార్చ్ నిర్వహిచి ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజలెవరూ ఇళ్లనుంచి బయటకు రావొద్దని కోరారు. ప్రభుత్వాలు సూచించే జాగ్రత్తలను ప్రజలందరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. (క్వారంటైన్ కేంద్రాలపై నిరంతర పరిశీలన) -
‘పోలీసుల అదుపులో ఇద్దరు ప్రొఫెసర్లు’
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని ఇద్దరు ప్రొఫెసర్లను అదుపులోకి తీసుకొని స్థానిక ఎమ్మార్వో ముందు బైండ్ ఓవర్ చేస్తున్నామని విశాఖ డీసీపీ - 1 రంగారెడ్డి అన్నారు. ఏయూ ఎంఎల్ఆర్ విభాగానికి చెందిన కె.రమేష్‌బాబుపై 498ఏ కేసుతో పాటు అక్రమ సంబంధం ఆరోపణలు ఉన్నాయని రంగారెడ్డి వెల్లడించారు. కాగా, 498 ఏ కేసు ఇంకా విచారణలోనే ఉందని ఆయన అన్నారు. సోషల్‌వర్క్ విభాగాధిపతి రాగాల స్వామిదాస్ విద్యార్థులు పట్ల ద్వందార్థ మాటలతో వేధిస్తున్నారని మీడియాలో కథనాలు రావటంతో సుమోటోగా తీసుకున్నామని ఆయన చెప్పారు. ఇద్దరు ప్రొఫెసర్లను సీఆర్ పీసీ 41 /109 సెక్షన్ కింద అదుపులో తీసుకున్నామని తెలిపారు. ర్యాగింగ్ జరపకుండా కౌన్సిలింగ్ చేయాల్సిన ఆచార్యులే పోలీసులు, ఎమ్మార్వో కౌన్సిలింగ్ తీసుకోవటం దురదృష్టకరమన్నారు. అత్యున్నత సంస్థలో పనిచేసే వారు దిగజారి ప్రవర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీసీపీ రంగారరెడ్డి అన్నారు. విద్యార్థులు, పరిశోధకులు ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలని రంగారెడ్డి చెప్పారు. ఫిర్యాదు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన భరోసా ఇచ్చారు. త్వరలోనే ఏయూ క్యాంపస్‌లో వర్చువల్ పోలీస్ స్టేషన్ ప్రారంభిస్తామని రంగారెడ్డి తెలిపారు. వర్చువల్ పోలీసు స్టేషన్ ద్వారా ఏయూ విద్యార్థులు ఫిర్యాదులు చేయవచ్చని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ వీసీతో కలసి పోలీసులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని డీసీపీ రంగారెడ్డి అన్నారు. -
జ్యుడీషియల్ కస్టడీకి నర్సింహారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై అరెస్టు చేసిన సిద్దిపేట అదనపు డీసీపీ నర్సింహారెడ్డిని గురువారం హైదరాబాద్‌లోని ఏసీబీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు పరిచినట్టు ఏసీబీ డైరెక్టర్ జనరల్ రమణకుమార్ తెలిపారు. అనంతరం ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమాస్తులు కూడబెట్టాడనే ఆరోపణలపై బుధ, గురువారాల్లో సిద్దిపేటలోని నర్సింహారెడ్డి నివాసం, కార్యాలయంతో పాటు, హైదరాబాద్, మహబూబ్‌నగర్, జహీరాబాద్, షాద్‌నగర్, అయ్యవారిపల్లె, అతని బంధువులు, ఇతర అనుమానితుల నివాసాల్లో తనిఖీలు చేసినట్లు పేర్కొన్నారు. బుధవారం రాత్రి పొద్దుపోయాక నర్సింహారెడ్డిని హైదరాబాద్‌కు తరలించారు. అతని నివాసంతోపాటు బంధువుల ఇళ్లలో నిర్వహించిన తనిఖీల్లో 1.5 కేజీల బంగారం, రూ.5.33 లక్షల నగదు, రూ.6.37 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, గోల్కొండ వద్ద ఒక విల్లా, రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి, గొల్లపల్లిలో 14 ప్లాట్లు, సిద్దిపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 20 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ.5.02 కోట్లు ఉంటుందని, మార్కెట్ విలువ ప్రకారం రూ.10 కోట్ల పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించడంతో నర్సింహారెడ్డిని అరెస్టు చేసినట్లు తెలిపారు. తాండూరులోనూ ఆస్తులు? నర్సింహారెడ్డికి వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోనూ ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు మండలంలోని ఓగిపూర్‌లో విలువైన నాపరాతి గనులు ఉన్నట్లు సమాచారం. అయితే ఆయన పేరుతో కాకుండా బినామీ పేర్లపై ఈ గనులు ఉన్నట్లు తెలుస్తోంది. -
అడిషినల్ డిసిపి ఇంట్లో ఏసీబీ సోదాలు
-
రాజేంద్రనగర్ పేలుడు ఘటనపై డీసీపీ దర్యాప్తు
-
జర్నలిస్టుపై చేయి చేసుకున్న డీసీపీ
-
జర్నలిస్టు మీద చేయి చేసుకున్న డీసీపీ : వీడియో వైరల్
కోల్‌కతా : వార్తలను కవర్ చేయడానికి వెళ్లిన టీవీ జర్నలిస్టు మీద ఓ పోలీస్ ఆఫీసర్ చేయి చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియో సోమవారం వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది. వివరాల్లోకెళితే.. పశ్చిమ బెంగాల్లో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య శనివారం నుంచి ఘర్షణలు జరుగుతున్నాయి. శనివారం బీజేపీ నేత, బరాక్‌పూర్ ఎంపీ అర్జున్ సింగ్ తలకు గాయమవడంతో ఆదివారం ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎంపీ అర్జున్ సింగ్ నివాసమైన ‘మజ్దూర్ భవన్’ లో ప్రవేశించడానికి డీసీపీ అజయ్ ఠాకూర్ ప్రయత్నించాడు. ఈ సంఘటనలను కవర్ చేయడానికి వెళ్లిన స్థానిక టీవీ జర్నలిస్టును డిప్యూటీ కమిషనర్ అజయ్ ఠాకూర్ చెంప మీద కొట్టిన వీడియో బయటపడింది. అయితే ఇంతకు ముందు కూడా అజయ్ ఠాకూర్ ఇలా ప్రవర్తించాడని అక్కడి జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. అంతేకాక, పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మ కొట్టడం వల్లనే తన తలకు గాయమైందని ఎంపీ అర్జున్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. -
జూనియర్ డాక్టర్ని చెంపపై కొట్టిన డీసీపీ
సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్లపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఓ జూనియర్ డాక్టర్‌పై డీసీపీ చేయి చేసుకోవడంతో కలకలం రేగింది. విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్శిటి ఎదుట ఆందోళన చేస్తున్న జూడాలపై డీసీపీ హర్షవర్దన్ చేయి చేసుకున్నారు. ఒక జూనియర్ డాక్టర్ కాలర్ పట్టుకుని హర్షవర్దన్ చెంపపై కొట్టడంతో ఆగ్రహించిన జూడాలు డీసీపీ తీరుపై డీజీపీ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. -
ఆ విశ్వాసం నన్ను ఐపీఎస్ స్థాయికి చేర్చింది..
చిన్నప్పటి నుంచే చదువంటే చాలా ఇష్టం.. ఆడపిల్ల అనే ఆంక్షలు దరిదాపునకు కూడా రానీయని తల్లిదండ్రులు. అమ్మనాన్న ఇచ్చిన పూర్తి స్వేచ్ఛ ఉన్నత విద్యభ్యాసానికి దారితీసింది. పుట్టింది.. పెరిగింది.. చదివింది అంతా బెంగళూరులోనే. అందుకే ఉన్నత విద్య మరింత చేరువైంది. నాన్నకు ఉద్యోగరీత్యా బదిలీ అయినా.. మా చదువు దెబ్బతినొద్దనే ఉన్నత ఆశయంతో బెంగళూరులోనే కుటుంబాన్ని ఉంచారు. ఆయన త్యాగంతోనే నా విద్యభ్యాసానికి ఎక్కడా ఎలాంటి ఆటంకమూ కలగలేదు. నాన్న పెట్టుకున్న అచంచల విశ్వాసం నన్ను ఐపీఎస్ స్థాయికి చేర్చింది.. అంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు మంచిర్యాల జిల్లా డీసీపీ రక్షిత కె.మూర్తి. ఉన్నత చదువు.. ఉన్నతస్థాయి ఉద్యోగం.. అత్యున్నత వ్యక్తిత్వంలో నాన్నే నాకు స్ఫూర్తి అంటున్న డీసీపీ.. ‘సాక్షి’ పర్సనల్ టైంలో మరిన్ని విశేషాలు పంచుకున్నారు. సాక్షి, మంచిర్యాల/మంచిర్యాలటౌన్: మా నాన్న కృష్ణమూర్తి. సేల్స్‌ట్యాక్స్ విభాగంలో ఉద్యోగి. ఉద్యోగరీత్యా నాన్న తరచూ ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లేవారు. అయినా.. తనవల్ల కుటుంబం ఇబ్బంది పడొద్దని.. పిల్లల చదువుకు ఆటంకం కలగొద్దని కుటుంబాన్ని బెంగళూరు నుంచి కదలనీయలేదు. ఆయన మాత్రమే బదిలీ అయిన ప్రాంతాలకు వెళ్లే వారు. నాన్నకు మాపై నమ్మకం ఎక్కువ. మాకు పూర్తిస్వేచ్ఛ కల్పించారు. నాన్నకు నన్ను ఉన్నతంగా చూడాలని ఉండేది. ఇదే చదవాలని.. ఇదే చేయాలని ఏనాడూ పట్టుబట్టలేదు. చదువులో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అందుకే ఇష్టమైన చదువును ఎలాంటి ఇబ్బంది లేకుండా చదవగలిగాను. మా నాన్న బదిలీపై ఇతర ప్రాంతాల్లో ఉండాల్సి రావడంతో అమ్మ ఉష అన్నీ చక్కబెట్టేది. నాకు తమ్ముడు అర్జున్, చెల్లి రిషిక ఉన్నారు. మా ముగ్గురిలో నేనే చదువులో ముందుండేదాన్ని. ఇంటికి పెద్దదాన్ని కావడంతో చెల్లి, తమ్ముడికి చదువులో కొద్దిగా మెరుగయ్యేందుకు సాయం చేసేదాన్ని. మొదట చదువులో కొంత వెనుకబడి ఉన్న తమ్ముడు, చెల్లి ఇద్దరూ ఆ తరువాత ముందుకు దూసుకెళ్లారు. తమ్ముడు బీకాం పూర్తిచేసి యూఎస్‌లో మాస్టర్స్ చదువుతున్నాడు. చెల్లి బీటెక్ పూర్తిచేసి ఓ ప్రైవేట్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. నేను ఐపీఎస్ పూర్తిచేసి డీసీపీగా పనిచేస్తున్న. అందుకే మా కుటుంబాన్ని చూస్తే నాకు ఎంతో ధైర్యంగా ఉంటుంది. బెంగళూరులోనే విద్యాభ్యాసం నా విద్యభ్యాసమంతా బెంగళూరులోనే సాగింది. బెంగళూరులోని బోల్డ్ విన్స్ గరల్స్ పాఠశాలలో చదువు ప్రారంభించి.. అక్కడే ఇంటర్ పూర్తి చేశాను. 2008లో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్‌లో బెంగళూరులోని ఎంఎస్ సిద్దరామయ్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తయ్యింది. 2012లో మొదటిసారి యూపీఎస్సీ రాశాను. 2013లో ఇండియన్ పోస్టల్ సర్వీస్‌కు ఎంపికై ఏడాదిపాటు శిక్షణ పూర్తి చేసుకున్న. 2013లో మరోసారి యూపీఎస్సీ రాసి.. రెవెన్యూ సర్వీస్ విభాగానికి ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న. 2014లో 117వ ర్యాంకుతో ఐపీఎస్‌కు ఎంపికయ్యా. 2015 ఐపీఎస్ బ్యాచ్‌లో నన్ను తెలంగాణకు కేటాయించారు. 2018 మార్చి 13న గోదావరిఖని ఏసీపీగా బాధ్యతలు స్వీకరించాను. చదువు తప్ప మరో ధ్యాస లేదు అమ్మ చెబుతూ ఉండడం వల్లనో.. చదువు కోవాలన్న కోరికతోనో తెలియదుగానీ.. నాకు చిన్ననాటి నుంచి బాగా చదువుకోవాలనే తాపత్రయం ఎక్కువ. నాకు చదువు తప్ప మరో ధ్యాసలేదు. వంట చేయడం అస్సలు రాదు. అన్ని అవసరాలూ అమ్మనే తీర్చేది. మేం కిచెన్‌లోకి వెళ్లింది తక్కువే. ఏ అవసరం ఉన్నా మా అమ్మనే చూసుకోవడంతో వంట చేయాల్సిన అవసరం రాలేదు. అమ్మ వండిన వంటలంటే చాలా ఇష్టం. ఎవరు వండినా తినేదాన్ని కాదు. అందుకేనేమో నాకు నేను వంట చేసుకోవాలనో.. నేర్చుకోవాలనో అనుకోలేకపోయి ఉంటాను. అందుకే నన్ను వంటవచ్చా అని ఎవరైనా అడిగితే నాకు చదువు ఒక్కటే వచ్చు.. వంట రాదు అని చెప్పేస్తా. స్నేహితుల్లో నేనే పోలీస్ మా కుటుంబంలో ఎక్కువమంది పోలీస్‌శాఖలో పనిచేస్తున్నారు. అదే నాకు స్ఫూర్తినిచ్చి ఐపీఎస్ కావాలన్న ఆలోచన వచ్చిందో.. ఏమో తెలియదుగానీ.. మా స్నేహితుల్లో నేనొక్కదానే పోలీస్. నాతో పాటు చదువుకున్న స్నేహితులు వివిధ రంగాల్లో.. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నారు. నేను పోలీసు కావడంతో మా స్నేహితులు కూడా నన్ను చూసి ఆనందిస్తుంటారు. పుట్టి పెరిగింది అంతా బెంగళూరులోనే కావడంతో స్నేహితులంతా అక్కడివారే. మొదటిసారి బెంగళూరును వదిలి గోదావరిఖనిలో ఉద్యోగంలో చేరడంతో మా కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. అమ్మ చేతి వంటనే నాకు అలవాటు. ఇక్కడ నేను ఏంతింటానో అనే బెంగ పట్టుకుంది. ఇక్కడ వంటవారికి మా అమ్మ అన్ని వంటకాలను దగ్గరుండి నేర్పించింది. ప్రతిరోజు నా యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉంటారు. అన్నిరకాల వంటకాలను ఇష్టంగా తింటా. ఆటల్లో టెన్నీస్ అంటే ఎంతో ఇష్టం. స్కూల్ నుంచి కళాశాల వరకు ఎక్కువగా బాస్కెట్‌బాల్, ఖోఖో, త్రోబాల్ ఎక్కువగా ఆడేదాన్ని. అలా అని జిల్లాస్థాయి ప్లేయర్‌ను కాదు. ప్రయాణాలు చేయడం అంటే ఇష్టం. అందుకే బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేయడంలో ఎలాంటి ఇబ్బందులూ లేవు. విద్యతోనే ఆత్మవిశ్వాసం విద్యతోనే ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి ఒక్కరిలో చదువు ఉంటే వారిలో ఆత్మస్థైర్యం అధికంగా ఉంటుంది. నేను పోలీస్రంగాన్ని ఎంచుకున్న. నా ఉద్యోగ బాధ్యతను సమర్థవంతగా నిర్వహిస్తా. మరో ఉద్యోగంలోకి వెళ్లాలన్న ఆలోచన లేదు. నిందితులను పట్టుకోవడం.. బాలికలు, మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా చూడడం నా ప్రధాన లక్ష్యం. దొంగతనాలు, నేరాల అదుపునకు ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చర్యలు తీసుకుంటా. ఉద్యోగ బాధ్యతలతో బిజీగా ఉండడంతో కుటుంబసభ్యులతో ఎక్కువగా గడపలేకపోతున్నాననే భావన ఉంది. ఉద్యోగాల్లో ఇవన్నీ సహజం. మహిళలు ధైర్యంగా ఉండాలి. కచ్చితంగా ప్రతి బాలికనూ చదివించడం ద్వారా వారి భవిష్యత్‌కు బాటలు వేయాలి. -
ఇద్దరు డీసీపీల బదిలీ
కృష్ణ జిల్లా ఎస్పీగా రవీంద్రబాబు, ఈస్టు గోదావరి జిల్లా ఎస్పీగా హష్మీ గ్రేహౌండ్ గ్రూప్ కమాండర్‌గా రాహుల్‌దేవ్ శర్మ రైల్వే ఎస్పీగా కోయ ప్రవీణ్, విశాఖ డీసీపీ–1గా విక్రాంత్ పాటిల్ డీసీపీ–2గా ఉదయభాస్కర్ బిల్లా ద్వారకానగర్(విశాఖ దక్షిణ): రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీసీపీ–1గా విధులు నిర్వహిస్తున్న ఎం.రవీంద్రబాబును కృష్ణా జిల్లా ఎస్పీగా, డీసీపీ–2 నయి హష్మీని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. అలాగే విశాఖ పోలీస్ కమిషనరేట్ డీసీపీ–1గా చిత్తూరు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను, డీసీపీ–2గా ఉదయ భాస్కర్ బిల్లాను నియమించారు. గతంలో విక్రాంత్ పాటిల్ విజయనగరం జిల్లా ఓఎస్డీగా పనిచేశారు. అనంతరం చిత్తూరు జిల్లా ఎస్పీగా బదిలీపై వెళ్లారు. ఎం.రవీంద్రబాబు కడప జిల్లాకు చెందిన ఎం.రవీంద్రబాబు 2001 గ్రూప్–1 అధికారి. గురజాల, వరంగల్ రూరల్, గుంటూరు టౌన్లో డీఎస్పీగా పనిచేశారు. అలాగే ఓఎస్డీ విజయనగరం, హైదరాబాద్ టాస్క్ఫోర్సులో డీఎస్పీగా, తరువాత విజయవాడ డీఎస్పీగా, గ్రేహౌండ్స్ డీఎస్పీగా, కృష్ణా జిల్లాలో విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్ డీసీపీగా పనిచేశారు. 2018లో విశాఖ డీసీపీ–1గా బదిలీపై వచ్చారు. ఇప్పుడు కృష్ణా జిల్లా ఎస్పీగా బదిలీపై వెళ్తున్నారు. నయిం హష్మీ 2013 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హష్మీ 2018 నవంబర్‌లో విశాఖ పోలీస్ కమిషనరేట్ డీసీపీ–2గా బదిలీపై వచ్చారు. గతంలో రెండేళ్లు రంపచోడవరంలో పనిచేశారు. పది నెలలు కడప ఏఎస్డీగా పనిచేశారు. కడప అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తూ విశాఖకు డీసీపీగా వచ్చారు. తనపై నమ్మకం ఉంచి ప్రభుత్వం బదిలీ చేసిందని, మరింత బాధ్యతగా విధులు నిర్వహిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. విశాఖ అంటే తనకు చాలా ఇష్టమని.. విశాఖ ప్రజలు చాలా మంచి వారని.. అభిమానిస్తారన్నారు. విక్రాంత్ పాటిల్ 2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన విక్రాంత్ పాటిల్‌ది కర్ణాటక, దార్వాడ్. 2018లో విజయనగరం జిల్లా ఓఎస్డీగా పనిచేశారు. అక్కడ నుంచి చిత్తూరు జిల్లా ఎస్పీగా బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. విశాఖ పోలీస్ కమిషనరేట్‌కు డీసీపీ–1గా బదిలీపై వస్తున్నారు. ఉదయ్ భాస్కర్ ఆంధ్రాకు చెందిన ఉదయభాస్కర్ జమ్ము కాశ్మీర్ క్యాడర్ (ఐపీఎస్) అధికారి. ప్రస్తుతం విశాఖ సీఐడీ ఎస్పీగా డిప్యూటేష¯Œన్లో పనిచేస్తున్నారు. ఈయన విశాఖ పోలీస్ కమిషనరేట్‌కు డీసీపీ–2గా బదిలీపై వస్తున్నారు. ఆయన భార్య ఆదాయ పన్నుల శాఖలో పనిచేస్తున్నారు. -
పత్రికల్లో వచ్చిన కథనాలతో.. ముఠా చీటింగ్
విశాఖపట్నం : ప్రభుత్వ శాఖల్లో అవినీతి అధికారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు డీసీపీ రవీంద్ర తెలిపారు. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా అవినీతి అధికారుల సమాచారాన్ని ముఠా సేకరించేందన్నారు. శ్రద్ధా ఆసుపత్రి కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చిన తర్వాత డాక్టర్ రవీంద్ర వర్మను ముఠా సంప్రదించిందని డీసీపీ రవీంద్ర చెప్పారు. హెల్త్ సెక్రెటరీ పీఏగా పరిచయం చేసుకుని కిడ్నీ కేసు నుంచి తప్పించేందుకు రూ.10లక్షలు ముఠా డిమాండ్ చేసిందన్నారు. ఈ వ్యవహారంలో వెంకట నారాయణ, వెంకట సురేశ్, మహాలక్ష్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు వెంకట నారాయణపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల కేంద్రంగా ముఠా పనిచేస్తోంది. నాలుగు సెల్ ఫోన్లు, లక్ష50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. -
అక్రమ దందాలపై దృష్టి
మంచిర్యాలక్రైం: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో అక్రమదందాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని మంచిర్యాల డీసీపీ రక్షిత కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ‘జిల్లాలో నేరాలు, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, అక్రమ దందాలు, రౌడీ షీటర్స్, గంజాయి, గు ట్కా, అటవీ సంరక్షణ, వణ్యప్రాణుల హత్యలు, ఈవ్‌టీజింగ్‌లపై ముందుగా ఆరాతీస్తాను. మండలాల వారీగా ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో ఎటువంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి అనే దానిపై పరిశీలన చేస్తా. నేరం ఏ శాఖకు సంబంధించిందో గుర్తించి సంబంధిత అధికా రుల సమన్వయంతో చట్టపరిధిలో కేసులను పరి ష్కరించేందుకు ప్రయత్నం చేస్తా..’ అని అన్నారు. డీసీపీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంగళవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. మహిళల రక్షణకు మీరు తీసుకునే చర్యలు..? డీసీపీ : జిల్లాలో ఈవ్‌టీజింగ్ పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై దృష్టి సారిస్తాను. కళాశాల విద్యార్థులకు ఈవ్‌టీజింగ్ వల్ల కలిగే పర్యవసానాలపై ముందుగా అవగాహన కల్పించి అటువంటి నేరాలకు పాల్పడకుండా చర్యలు తీసుకుం టాం. షీ టీమ్‌పై ప్రత్యేక దృష్టి సారించి మహిళల రక్షణకు అండగా ఉంటా, మహిళలకు సంబంధించిన నేరాలకు పాల్పడితే కఠినంగా శిక్షలుంటా యని హెచ్చరిస్తాం. కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ఇతర బహిరంగ ప్రదేశాలు, సినిమా టాకీస్ల వద్ద నిఘా ఏర్పాటు చేస్తాం. పోలీస్‌శాఖకు చెందిన మహిళా రక్ష, మహిళా మిత్ర అధికారులను నియమించి సమస్య తీవ్రతను బట్టి వంటనే పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారంటే తల్లిదండ్రుల పెంపకంలోనూ లోపం ఉందన్నది గుర్తించాలి. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ నిర్మూలనకు ఎన్జీవోస్, మహిళా సంఘాల ద్వారా అవగాహన సదస్సులు నిర్వహిస్తా. నేరాల అదుపునకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు.. డీసీపీ : సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించి నేరాల అదుపునకు చర్యలు తీసుకుంటాం. నేరం చేసి తప్పించుకుని తిరుగుతన్న దొంగలను టెక్నాలజీ సాయంతో త్వరగా పట్టుకుంటాం. పోలీస్ శాఖకు అనేక సాఫ్ట్వేర్లు అందుబాటులోకి వచ్చాయి. ఒక సాఫ్ట్వేర్ 500మంది పోలీసులతో సమానం. ప్రజలతో ఎలా మమేకం అవుతారు.. డీసీపీ : పోలీసులు ప్రజల పట్ల స్నేహభావంతో మెలిగేలా ప్రయత్నిస్తాం. కాలనీలు, గ్రామాలు, మండలాల్లో ఏళ్ల తరబడి పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలపై దృష్టి సారిస్తా. ఇందులో ఇతర శాఖల సమన్వయంతోనే ముందుకు వెళ్తాం. గొడువలు జరిగిన చోట జులుంతో కాకుండా ఫ్రెండ్లీ పోలీస్‌గా సామరస్యంగా శాంతియుత వాతావరణంలో సమస్యను పరిష్కరించాలని సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చి పరిష్కారానికి కృషి చేస్తాం. ప్రజలతో పోలీస్‌లు మమేకం కావడం ద్వారా ప్రజలకు పోలీసులపై నమ్మకం పెరుగుతోంది. నేరం చేసిన వారికి శిక్షపడేలా చర్యలు తీసుకుంటాం. నేరస్తులకు ఫ్రెండ్లీ పోలీసింగ్ పనిచేయదు. నేరస్తులపై కఠినంగా వ్యవహరిస్తా. ఫిర్యాదుదారులు నేరుగా కలిసి ఫిర్యాదు చేయవచ్చు. జిల్లాలో సివిల్ తగాదాలు ఎక్కువగా ఉన్నాయి.. వాటి విషయంలో ఎలా వ్యవహరిస్తారు.. డీసీపీ : జిల్లాలో సివిల్ తగాదాలు, భూ సంబంధ సమస్యలు అధికంగా ఉన్నాయని విన్నా, ఇదివరకు ఇక్కడ పని చేసిన అధికారులు సివిల్ తగాదాల్లో పలు ఆరోపణలు ఎదుర్కొని విధుల నుంచి తొలగించిన విషయాన్ని ప్రస్తావిస్తూ... పోలీసుల్లో మొదట మార్పు తెచ్చేందుకు కృషి చేస్తాను. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాకపోతే వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తా. ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తీసుకునేందుకు సైతం వెనుకాడేది లేదు. తప్పు చేసిన వారు ఎంతటి అధికారు(నేను సైతం)లైన శిక్ష అనుభవించక తప్పదు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులను మర్యాద పూర్వకంగా ఆహ్వానించి వారి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేందుకు కృషి చేస్తాం. సివిల్ తగాదాల్లో పోలీసుల జోక్యం ఉండదు. అవి సివిల్ కోర్టులోనే పరిష్కరించుకోవాలి. సమాజంలో ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటా. జిల్లాలో మావోయిస్టుల ప్రభావంపై మీరేమంటారు..? డీసీపీ : జిల్లాలో మావోయిస్టుల ప్రభావం లేదు.అయినా వారి కదలికలపై దృష్టి సారిస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మావోయస్టులకు పేరున్న జిల్లా కాబట్టి ఇతర జిల్లాల పోలీస్అధికారుల సమన్వయంతో ముందుకు వెళ్తాం. మారుమూల గ్రామాలపై దృష్టి సారించి అభివృద్ధికి కృషి చేస్తాం. యువత అసాంఘిక కార్యకలపాలకు ఆకర్షితులు కాకుండా వారికి అవగాహన కల్పిస్తాం. ప్రజాహిత కార్యక్రమాల ద్వారా వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషిచేస్తాం. భూ మాఫియపై, ఇసుక రవాణా ఎక్కువగా ఉంది దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు. డీసీపీ : మంచిర్యాల జిల్లాలో భూ మాఫియా, ఇసుక మాఫియ ఆగడాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. భూ మాఫియాపై ప్రత్యేక దృష్టిసారిస్తాం. దౌర్జన్యాన్ని సహించేది లేదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు. చట్టపరమై చర్యలు తీసుకుంటాం. భూ సమస్యలుంటే కోర్టులో, రెవెన్యూ పరంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. అధికార, ధనదాహంతో దౌర్జన్యాలకు దిగితే చట్టపరమైన చర్యలు తప్పవు. కోర్టు పరిధిలో తేలాల్సిన భూ వివాదాల జోలికి వెళ్లం. అక్రమ ఇసుక రవాణాపై దృష్టి సారిస్తా. అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. అసెంబ్లీ ఎన్నికలను ప్రత్యక్షంగా చూశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు. డీసీపీ : అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో ఏసీపీగా ఉన్నాను. సీపీ సత్యనారాయణ సూచనలు, సలహాల మేరకు అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా విజయవంతం చేశాం. చెన్నూర్ నియోజకవర్గంలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కోటపెల్లి, నీల్వాయి, అర్జున్‌గుట్ట, సిర్సా, అన్నారం తదితర గ్రామాల్లో యాంటీ నక్సల్స్ టీమ్‌లు, ప్రత్యేక కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు నిర్వహించాం ఆదే తరహాలో పార్లమెంటు ఎన్నికలు సైతం ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తాం. -
సెంట్రల్ జోన్ డీసీపీ పేరుతో నకిలీ ఈ–మెయిల్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మధ్య మండల డీసీపీ అధికారిక ఈ–మెయిల్‌ను పోలిన దానిని సృష్టించిన దుండగులు దానిని వినియోగించి అమెరికాలో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ సంతోష్‌కుమార్‌కు బెదిరింపు మెయిల్ పంపారు. అతడి భార్య పేరుతో మరో మెయిల్‌ను క్రియేట్ చేసిన దుండగులు ఆమె పేరుతో ఈస్ట్‌జోన్ పోలీసులకు సంతోష్‌కుమార్‌పై ఫిర్యాదు చేస్తూ మరో మెయిల్ పంపారు. ఇటీవల భారత్‌కు వచ్చిన బాధితులు మధ్య మండల డీసీపీని సంప్రదించారు. ఆయన సూచనల మేరకు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నగరంలోని చంపాపేట్ ప్రాంతానికి చెందిన సంతోష్‌కుమార్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. గత ఏడాది మే నుంచి అతడికి కొందరు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వివిధ ఈ–మెయిల్స్ ద్వారా అసభ్య పదజాలంతో, మార్ఫింగ్ ఫోటోలతో కూడిన మెయిల్స్ వస్తున్నాయి. గత నెల 12న ఈ వ్యవహారం శృతిమించింది. హైదరాబాద్ కమిషనరేట్‌లోని మధ్య మండల డీసీపీ అధికారిక ఈ–మెయిల్‌ను పోలిన దానిని నేరగాళ్లు సృష్టించారు. డీసీపీ ఈ–మెయిల్ (dcp&cz.hyd.tspolice.gov.in) గా ఉంటుంది. అయితే దుండగులు రూపొందించింది (dcp&cz.hydpol.gov.inn@mail.com) గా ఉంది. దీనిని వినియోగించి సంతోష్‌కు ఈ–మెయిల్ పంపిన దుండగులు కేసు పేరుతో బెదిరించారు. తాము మధ్య మండల డీసీపీ ఎన్.విశ్వప్రసాద్ కార్యాలయం నుంచి ఈ మెయిల్ చేస్తున్నామని, మీపై సైబర్ క్రైమ్ ఒకటి నమోదైందని అందులో పేర్కొన్నారు. దర్యాప్తు కోసం మీ చిరునామా సహా పూర్తి వివరాలు అందించాలని కోరారు. అంతటితో ఆగని దుండగులు ఈ నెల 8న సంతోష్‌కుమార్ భార్య కవిత పేరుతో మరో ఈ–మెయిల్ సృష్టించి, ఆమె పంపినట్లు తూర్పు మండల డీసీపీకి పంపారు.అందులో తనను సంతోష్ వేధిస్తున్నాడని, తాను గర్భవతినని సహా పలు ఆరోపణలు చేర్చారు. అమెరికాలో ఉన్న అత్తింటి వారు తనను బంధించడంతో పాటు డబ్బు కోసం వేధిస్తున్నారని అందులో పేర్కొన్నారు ఈ వ్యవహారాలు శృతి మించడంతో బాధితుడు సంతోష్‌కుమార్ ఇటీవల భారత్‌కు వచ్చాడు. గత నెల 21న మధ్య మండల డీసీపీ విశ్వప్రసాద్‌ను కలిసి అసలు విషయం ఆరా తీశాడు. ఆయన కేసులు, ఈ–మెయిల్స్ బూటకమని చెప్పడంతో పాటు ఈ విషయంపై సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. దీంతో బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ప్రాథమిక ఆధారాలను బట్టి నిందితులు సిటీకి చెందిన వారే అయి ఉంటారని భావిస్తున్నారు. సంతోష్‌తో ఉన్న వ్యక్తిగత గొడవల నేపథ్యంలోనే ఇలా చేసి ఉంటారని, అందుకే ముందుగా అభ్యంతరకరమైన మెయిల్ పంపిన వాళ్లు ఆపై సెంట్రల్ జోన్ డీసీపీ పేరుతో ఆయనకు... అతడి భార్య పేరుతో ఈస్ట్‌జోన్ డీసీపీకి మెయిల్ పంపారని తెలిపారు. సంతోష్‌తో ఎవరెవరికి వ్యక్తిగత స్పర్థలు ఉన్నాయి? వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అనే అంశాలను ఆరా తీస్తున్నారు. మరోపక్క సాంకేతికంగా దుండగులు వాడిన ఈ–మెయిల్స్ మూలాలను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నారు. -
పథకం ప్రకారమే బావని హత్య చేశాడు.!
సాక్షి, విజయవాడ: కుటుంబ కలహాల నేపథ్యంలో బావాబావమరదుల మధ్య జరిగిన వివాదంలో బావమరిదిని బావ హతమార్చిన ఘటన సత్యనారాయణపురంలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో నింధితుడిని డీసీపీ నవాబ్ జాన్ అరెస్ట్ చేసి, విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ కలహాలతోనే రైల్వే గేట్‌మ్యాన్ రాజును కత్తులతో విచక్షణా రహితంగా తన చెల్లెలు భర్త శేఖరే హత్య చేశాడు. తన భార్య పుట్టింటికి రావడవం లేదనే మనస్థాపంతో ఆమె కుటుంబ సభ్యులపై పగ పెంచుకున్న శేఖర్, పథకం ప్రకారమే తన బావని హతమార్చాడని వెల్లడించారు. హత్య జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించామని డీసీపీ తెలిపారు. ఐదువేల కోసం హతమార్చాడు -
నేరాల నియంత్రణకే కార్డన్ సెర్చ్
ఆలేరు : నేరాల నియంత్రణకే కార్డన్ సెర్చ్ చేపడుతున్నామని యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్చార్జ్ డీసీపీ కె.నాగరాజు తెలిపారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆలేరు పట్టణంలోని సుభాష్‌నగర్, ఆదర్శనగర్‌లలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని 29 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలతో పాటు ఒక రౌడీషీటర్‌ను, ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్ముతున్న ఇరువురిపై ఎక్సైజ్ కేసు నమోదు చేశామని, 3 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అంతే కాకుండా ద్విచక్ర వాహనాలను నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వాహనాలు నడిపే వారు విధిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించాలని కోరారు. రాత్రి 2గంటల నుంచి ఉదయం 6గంటల వరకు సోదాలు కొనసాగాయి. ఏసీపీ శ్రీనివాసాచార్యులు, 8 మంది సీఐలు, 10మంది ఎస్ఐలు, 17 మంది ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 51 మంది సివిల్ పోలీసులు, 13 మంది మహిళ పోలీసులు, హోంగార్డులు, 34 మంది ఎఆర్, సీసీఎస్, క్లూస్‌టీం, ఎస్‌ఓటీలు పాల్గొన్నారు. -
కానిస్టేబుల్ కూతురిని రేప్ చేసిన డీసీపీ
ఔరంగాబాద్: మహిళకు రక్షణ కరువైన దేశంలో రక్షకభటుడే కీచకుడిగా మారిన వ్యవహారం ఇంకాస్త ఆందోళన కలిగిస్తున్నది. తన వద్ద పనిచేస్తోన్న కానిస్టేబుల్ కూతురికి మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ).. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడటమేకాక వేధింపులతో నరకం చూపించాడు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఎండీసీ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కేసు నమోదైంది. దర్యాప్తు అధికారి డీసీపీ వినాయక్ ధక్నే తెలిపిన వివరాలివి... తీవ్రంగా హింసించాడు: ఔరంగాబాద్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోన్న మహిళకు 23 ఏళ్ల కూతురుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తన కూతురికి ఏదైనా మంచి ఉద్యోగం చూసిపెట్టమని డీసీపీ రాహుల్ శ్రీరామ్‌ను అభ్యర్థించిందా మహిళా కానిస్టేబుల్. ఆ సాకుతో యువతిని ఇంటికి పిలిపించుకున్న ఆ డీసీపీ తన పాడుబుద్ధిని ప్రదర్శించాడు. అంతటితో ఊరుకోకుండా నెలల తరబడి ఆమెను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాడు. అతని హింస తారాస్థాయికి చేరడంతో బాధితురాలు కొద్దిగా ధైర్యం తెచ్చుకుని జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పింది. ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి డీసీపీ రాహుల్‌పై ఫిర్యాదు చేశారు. పోలీస్ శాఖలో కలకలం.. సెలవులో డీసీపీ: మహిళా కానిస్టేబుల్ కూతురిపైనే ఉన్నతాధికారి అకృత్యానికి పాల్పడటం మహారాష్ట్ర పోలీసు శాఖలో సంచలనం రేపింది. ఈ ఉదంతంపై ఉన్నతాధికారులు వేగంగా స్పందించారు. ‘‘బాధితురాలి ఫిర్యాదుమేరకు ప్రాధమిక దర్యాప్తు అనంతరం డీసీపీ రాహుల్ శ్రీరామ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశాం. ప్రస్తుతం అతను సెలవుపై వెళ్లిపోయాడు. మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించి, చార్జిషీటు దాఖలు చేస్తాం’’ అని దర్యాప్తు అధికారి వినాయక్ మీడియాకు తెలిపారు. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సిఉంది. -
మహేష్ భగవత్‌పై డీసీపీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : రాచకొండ డీసీపీ పులిందర్ రెడ్డి, తన ఉన్నతాధికారి రాచకొండ పోలీస్ కమీషనర్‌పై మానవహక్కుల కమీషన్లో ఫిర్యాదు చేశారు. కమీషనర్ మహేష్ భగవత్ తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడంటూ పులీందర్ రెడ్డి తనన ఫిర్యాదులో పేర్కొన్నారు. డీసీపీ ఫిర్యాదును స్వీకరించిన కమీషన్ సమగ్ర విచారణకు ఆదేశించింది. ఆగస్టు ఒకటో తేదీన రిపోర్టు ఇవ్వాలని తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ మహేందర్ రెడ్డికి మానవహక్కుల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. -
భర్తను కడతేర్చిన మొదటి భార్య
స్టేషన్‌ఘన్‌పూర్: కట్టుకున్న భర్తను కర్కశంగా, అతికిరాతకంగా తలవెనుక భాగాన భార్య రాడ్డుతో కొట్టి దారుణంగా చంపిన సంఘటన మండలంలోని శివునిపల్లి శివారులో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, సీఐ రావుల నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన రాయపురం ధర్మయ్య(56) రైల్వేలో గ్యాంగ్మన్ (మొకద్దం)గా పనిచేస్తున్నాడు. ధర్మయ్యకు ఇద్దరు భార్యలు. మొదట శాంతమ్మను వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అయితే భార్య, భర్తల మధ్య మనస్పర్థలు, గొడవల కారణంతో దాదాపు 20 ఏళ్ల క్రితం ఆమెను వదిలి వెంకటలక్ష్మీని రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్యతో కలిసి ధర్మయ్య స్థానిక రైల్వే క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. అతని రెండో భార్యకు ఇద్దరు కొడుకులు. అయితే ఇద్దరు భార్యల పిల్లలు, ధర్మయ్య రెండో భార్య వెంకటలక్ష్మీ ధర్మయ్యతో స్థానిక రైల్వే క్వార్టర్స్‌లోనే ఉంటారు. మొదటి భార్య శాంతమ్మ శివునిపల్లి శివారులో పాత హరికృష్ణ థియేటర్ సమీప కాలనీలో ఒంటరిగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె శివునిపల్లి మూడో వార్డు సభ్యురాలిగా పనిచేస్తుంది. మొదటి భార్యకు మెయింటనెన్స్ కింద ప్రతీ నెల రూ.10 వేలు ధర్మయ్య వేతనం నుంచి వస్తాయి. కాగా ధర్మయ్య కుమార్తె స్వప్న 2012 సెప్టెంబర్ 12న ఘన్‌పూర్‌కు చెందిన ముదిరాజ్ కులస్తుడు శ్రీనివాస్‌ను ప్రేమవివాహం చేసుకుంది. శ్రీనివాస్ ఛత్తీస్‌గడ్‌లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలం సాఫీగా సాగిన వారి దాంపత్య జీవితంలో గొడవలు ప్రారంభమయ్యాయి. స్వప్నతో మనస్పర్థలు రావడంతో శ్రీనివాస్ ఆమెను కాపురానికి తీసుకెళ్లడం లేదు. ఈ క్రమంలో పలుమార్లు కుల పెద్దలతో పంచాయితీలు అయ్యాయి. అయితే పంచాయితీలకు స్వప్న తల్లి అయిన ధర్మయ్య మొదటి భార్య ఎందుకు రావడం లేదని శ్రీనివాస్ పదే పదే అడుగుతుండగా పంచాయితీలు వాయిదా పడేవి. తిరిగి ఆదివారం (ఈనెల 22న) పంచాయతీ నిర్వహించారు. తిరిగి బుధవారానికి పంచాయితీని వాయిదా వేశారు. అయితే పంచాయతీ అనంతరం ధర్మయ్య మద్యం సేవించాడు. రాత్రి రైల్వేక్వార్టర్స్లోని రెండో భార్య ఇంటికి కాకుండా మొదటి భార్య శాంతమ్మ ఇంటికి వెళ్లాడు. అతని వెంట మద్యం, బీరు బాటిళ్లు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. రాత్రి భార్యాభర్తలు మద్యం సేవించారని, రాత్రి మాటమాట పెరిగి గొడవ పడినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న ఆమె రాడ్డుతో అతని తల వెనుక భాగాన రెండు చోట్ల గట్టిగా కొట్టడంతో తల పగిలి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా హంతకురాలు పోలీసుస్టేషన్లో లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. విషయం తెలుసుకున్న స్థానిక సీఐ రావుల నరేందర్, ఎస్సైలు రవి, విద్యాసాగర్ సంఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం డీసీపీ మల్లారెడ్డి, ఏసీపీ వెంకటేశ్వబాబు అక్కడకు చేరుకుని హత్య జరిగిన తీరుపై విచారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. డీసీపీ విచారణ ఈ ఘటనపై స్థానిక ఏసీపీ కార్యాలయంలో డీసీపీ మల్లారెడ్డి విలేకర్లతో మాట్లాడారు. హత్య ఘటనపై ధర్మయ్య రెండో భార్య వెంకటలక్ష్మీ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు. కుటుంబ కలహాలు, మద్యం మత్తుతో మొదటి భార్య హత్య చేసిందని నిర్ధారించినట్లు తెలిపారు. అయితే ఈ హత్య ఆమె ఒక్కతే చేసిందా, లేదా ఎవరైనా సహకరించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా శివునిపల్లిలో హత్య జరిగిన సంఘటన గ్రామంలో కలకలంరేపింది. గ్రామస్తులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకుని రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసి విచారం వ్యక్తం చేశారు. -
గుర్తింపు కార్డులు చూసి ఇళ్లు అద్దెకివ్వండి
అత్తాపూర్: నేరస్తులను గుర్తించేందుకు శంషాబాద్ డీసీపీ పద్మజారెడ్డి ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్, బాబానగర్, హసన్‌నగర్ ప్రాంతాలలో పోలీసులు బుధవారం అర్ధరాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆరు మంది రౌడీ షీటర్లతో పాటు 12 మంది అనుమానితులను, 50 ద్విచక్ర వాహనాలు, 30 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. బైక్‌లకు, ఆటోలకు ఎలాంటి పత్రాలు లేవని డీసీపీ తెలిపారు. కార్డన్ సెర్చ్ నిర్వహించడంతో పాటు ప్రజలను పలు విషయాలపై అప్రమత్తం చేశారు. ఎలాంటి గుర్తింపు కార్డులు లేని వారికి ఇళ్లను అద్దెకు ఇవ్వవద్దని సూచించారు. అనుమానితులు కనపడితే వెంటనే 100 నెంబర్‌కు సమాచారం అందించాలని, నేరం చేయడంతో పాటు నేరస్తులకు ఆశ్రయం కల్పించడం కూడా నేరమే అని డీసీపీ తెలిపారు. ద్విచక్ర వాహనాలు భారీ ఎత్తున లభ్యమవడంతో వీటిని ఏఏ ప్రాంతాలలో కోనుగోలు చేశారు, ఎవరు వీరికి అమ్మారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్డన్ సెర్చ్‌లో శంషాబాద్ డీసీపీ పద్మజారెడ్డితో పాటు రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్, రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ సురేష్‌తో పాటు 150 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అర్ధరాత్రి 3 గంటలకు ప్రారంభమైన కార్డన్ సెర్చ్ ఉదయం 6 గంటల వరకు కొనసాగింది. ప్రతి ఒక్కరి ఆధార్‌కార్డును తనిఖీ చేయడంతో పాటు ఇళ్లను కూడా పోలీసులు సోదాలు చేశారు. -
ఆ నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ(హెచ్‌సీయూ) విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన దుండగులను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ విశ్వప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం యూనివర్సీటీకి చెందిన ఓ యువతి ప్రవీణ్ అనే తన స్నేహితునితో కలిసి నల్లగండ్ల లేక్ వద్దకు వెళ్లింది. అక్కడే మాటు వేసి ఉన్న నలుగురు దుండగులు వీరిద్దరిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. వారి వద్ద ఉన్న డబ్బులు లాక్కున్నారు. అనంతరం ఆ నలుగురు యువతిపై లైంగికదాడికి యత్నించారు. ఆమె తన స్నేహితుడు ప్రవీణ్ సాయంతో దుండగుల నుంచి తప్పించుకొని బయటపడింది. అనంతరం యూనివర్సిటీ మిత్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఈ మేరకు రంగంలోకి దిగి డాగ్ స్క్వాడ్ సాయంతో దుండగులని పట్టుకున్నామని డీసీపీ తెలిపారు. అయితే ఆ నలుగురు మైనర్లు కావడం గమనార్హం. వారిలో ఇద్దరు పాత నేరస్తులేనని డీసీపీ పేర్కొన్నారు. -
అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచి..
-
అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచి..
సాక్షి, హైదరాబాద్: రోజు రోజుకూ నగరంలో దుండగుల అగడాలు పెరిగిపోతున్నాయి. ఓ వ్యాపారిపై చాదర్‌ఘాట్ బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్ర కత్తులతో దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముగశిర్ అనే వ్యక్తికి కోఠిలో కార్ డెకరేషన్ షాపు ఉంది. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో బైక్‌పై ఇంటికి వెళ్తున్న అతనిపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. అతని వద్ద ఉన్న నగదు బ్యాగ్‌ను లాక్కొనే ప్రయత్నాం చేశారు. ఆ వ్యాపారి బ్యాగ్‌ను ఇవ్వకపోవడంతో కత్తులతో పొడిచి నగదు బ్యాగ్‌తో పరారయ్యారు. అందరూ చూస్తుండగానే దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్రం దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. వెస్ట్‌జోన్ డీసీపీ మాట్లాడుతూ.. త్వరలోనే దుండగులను అదుపులోకి తీసుకుంటామన్నారు. వారి కోసం అన్ని వైపుల గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నామని అన్నారు. వ్యాపారి బ్యాగ్‌లో రూ. 1.90 లక్షలు ఉన్నట్లు ఆయన తెలిపారు. -
బాలికల ఆందోళన
సాక్షి, జయపురం : హాస్టల్ వార్డెన్‌ను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ కొరాపుట్ జిల్లా బందుగాం సమితి కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం విద్యార్థినులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ మేరకు బందుగాం సమితి విద్యాధికారి (బ్లాక్‌ఎడ్యుకేషన్ ఆఫీసర్) కార్యాలయానికి తాళాలు వేశారు. అంతేకాకుండా ఆ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఆ పాఠశాల వార్డెన్ లలిత బిశ్వాల్ అనేక సమయాలలో హాస్టల్లో తమపట్ల కఠినంగా వ్యవహరిస్తూ, తిడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. తమపట్ల వార్డెన్ వ్యవహరిస్తున్న తీరు, వేధింపులపై పాఠశాల విద్యార్థినులు బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి(బీఈఓ)కార్యాలయంలో నాలుగు రోజుల క్రితం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కానీ బీఈఓ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మరోమార్గం లేక బీఈఓ కార్యాలయానికి తీళాలు వేసి ఆందోళన చేపట్టినట్లు విద్యార్థినులు వెల్లడించారు. విద్యార్థినులు మూకుమ్మడిగా వచ్చి బీఈఓ కార్యాలయానికి తాళాలు వేసి అక్కడ బైఠాయించారు. వార్డెన్‌ను బదిలీ చేసేంత వరకు తాము ఆందోళన విరమించేంది లేదని ధర్నా కొనసాగిస్తామని హెచ్చరించారు. డీపీసీ హామీతో ఆందోళన విరమణ ఈ విషయం తెలిసిన డీపీసీ మహేష్ చంద్రనాయక్ జిల్లా కేంద్రం నుంచి హుటాహుటిన బందుగాం చేరుకుని ఆందోళన చేస్తున్న విద్యార్థినులతో చర్చలు జరిపారు. దాదాపు రెండుగంటల పాటు విద్యార్థినులతో చర్చించి వారి ఆరోపణలు తెలుసుకుని ఈ విషయంపై కలెక్టర్‌కు నివేదిస్తామని అంతేకాకుండా పది రోజుల్లో సమస్యను పరిష్కరించగలమని హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీతో విద్యార్థినులు శాంతించి సాయంత్రం 5 గంటల తరువాత ఆందోళన విరమించారు. అనంతరం ఆయన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయానికి వెళ్లి విద్యార్థినుల ఆరోపణలపై ప్రధానోపాధ్యాయునితో చర్చించారు. అక్కడ కూడా వార్డెన్‌ను బదిలీ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేసినట్లు తెలిసింది. -
చదువుతోనే సాధికారత
మహిళలు లింగ వివక్ష, వేధింపుల నుంచి బయటపడి సాధికారత వైపు అడుగులు వేయాలంటే వారు చదువుకోవాలని, విద్యతోనే మహిళల జీవితాల్లో మార్పురాగలదని శంషాబాద్ డీసీపీ పి.వి.పద్మజ అన్నారు. అయితే, చదువు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా సమాజాన్ని అవగతం చేసుకునే విధంగా ఉండాలన్నారు. మహిళల సాధికారతపై పద్మజ ‘సాక్షి’తో మాట్లాడారు. డీసీపీ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే.. సాక్షి, శంషాబాద్: మాది కర్నూలు జిల్లా కోవెల కుంట్ల గ్రామం. మా నాన్న రిటైర్డ్ ఎస్పీ వాసుదేవరెడ్డి. బాల్యమంతా చిత్తూరు జిల్లాలోనే గడిపాను. మదనపల్లిలోని రిషివ్యాలీ, చిత్తూరులోని మహర్షి విద్యాలయంలో పాఠశాల విద్య పూర్తి చేశాను. బీఎస్సీ అగ్రికల్చర్ కర్నూలులోని మహానంది వద్ద చదువుకున్నా. డిగ్రీ రెండో సంవత్సరంలోనే నా వివాహమైంది. ఆ తర్వాత ఎంఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేశాను. సివిల్ సర్విస్ ఉద్యోగం చేయాలని చిన్న నాటి నుంచే నా మనస్సులో నాటుకుంది. 2004లో సివిల్ సర్విస్ తొలిసారి రాయగా.. ఐఎఫ్ఎస్ వచ్చింది. కొన్ని కారణాల వల్ల దానిని వదులుకున్నాను. పెళ్లైన ఏడేళ్ల తర్వాత 2007లో గ్రూప్ వన్ పరీక్షలు రాసి తొలిప్రయత్నంలో మంచి ర్యాంకు సాధించాను. గ్రూప్ వన్ ఉద్యోగిగా శిక్షణకు సంబంధించిన పరీక్షల్లో తొలి ర్యాంకు సాధించాను. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా హోం మినిస్టర్ ట్రోఫీ అందుకోవడం గొప్ప అనుభూతి. శిక్షణ అనంతరం మల్కాజ్గిరి ఏసీపీగా తొలి పోస్టింగ్ వచ్చింది. అది నా జీవితంలో ఎంతో కీకలమైంది. ఆ తర్వాత నిజామాబాద్ అదనపు ఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం శంషాబాద్ డీసీపీగా పట్టణ గ్రామీణ వాతావరణ కలియికలో ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువగా పనిచేసే అవకాశం వచ్చింది. పోలీసు శాఖ నిరంతరం సవాళ్లతో కూడుకున్న రంగం కావడంతో ఎప్పుడు అంతా కొత్తగానే ఉంటుంది. ఇందులోను వివిధ విభాగాల్లో సమాజానికి సేవలందించే అవకాశం విస్తృతంగా ఉంటుంది. పెళ్లి వయసు మారాలి అమ్మాయిలున్న తల్లిదండ్రులు వారికి పద్దెనిమిదేళ్ల వయస్సు రాగానే పెళ్లి చేసెయ్యాలనుకుంటారు. వివాహంపై పూర్తిస్థాయి అవగాహన లేకుండా పెళ్లిళ్లు చేయడంతో ఆడపిల్లలు అనేక సమస్యల్లో చిక్కుకుపోతున్నారు. డిగ్రీ పూర్తిచేయాలన్నా కనీసం 20 ఏళ్లు పడుతుంది. అదే పెళ్లికి మాత్రం 18 ఏళ్లు నిర్ధారించడం ఎంతవరకు భావ్యం. కనీసం డిగ్రీ ఉంటేనే ఈ రోజుల్లో ఏదైనా ఓ ఉద్యోగం సాధ్యమవుతుంది. అందుకే పెళ్లికి ఉన్న కనీస వయస్సుల్లో కూడా మార్పులు చేయాలి. తల్లిదండ్రులు అమ్మాయి భారం అన్న దృక్పథాన్ని మార్చుకోవాలి. మనలోని ఆ భావన వీడాలి.. కొన్ని పనులు కేవలం పురుషలకే సాధ్యం అన్న భావనను ముందు మహిళలు వీడాలి. అమ్మాయిలు అనుకుంటే సాధించనది ఏదీ ఉండదు. సాంకేతి పరిజ్ఞానంతో పాటు అన్ని రంగాలు, ఉద్యోగాల్లో మహిళలు ఉన్నతంగా రాణిస్తున్నారు. క్రీడల్లో సైతం ఒలిపింక్ పతకాలను సాధించి దేశం గర్వించేలా చేస్తున్నారు. ఎందులోనూ మహిళలు తమను తామకు తక్కువగా అంచనా వేసుకోవద్దు. విజయాలను సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందడుగు వేయాలి. కౌన్సెలింగ్ ఇస్తున్నాం.. మహిళల, బాలికలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు షీ టీంల దృష్టికి వస్తున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. కొందరు మహిళలు ఇంట్లో ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానంగా అహం, అనుమానం అన్నవి దంపతుల మధ్య కనిపిస్తున్నాయి. తమకు తాముగా పరిష్కరించుకునే సమస్యలను కూడా తీవ్రంగా మార్చుకుంటూ సమస్యల ఊబిలో చిక్కిపోతున్నారు. చాలా మందికి కౌన్సెలింగ్ ఇచ్చి సమస్య పరిష్కరిస్తున్నాం వేధింపులు పెరిగాయి సమాజంలో లైంగిక వేధింపులు పెరిగాయి. కుటుంబ సభ్యులు కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మైనార్టీ వయస్సులో ఉన్న పిల్లల పట్ల కూడా అమానుషకరమైన సంఘటనలు అక్కడక్కడ చోటు చేసుకుంటున్నాయి. వీటిని నిరోధించడానికి ప్రతి ఒక్కరూ చైతన్యం కావల్సిన అవసరం ఉంది. విద్యతోనే వివక్ష దూరం.. సమాజంలో లింగ వివక్ష ఆది నుంచి బలంగానే ఉందనేది వాస్తవం. అయితే, మారుతున్న పరిస్థితుల్లో ఏ మతం, కులంలోనైనా చదువుకున్న నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఇది క్రమేణా తగ్గుముఖం పడుతుంది. విద్య లేని చోట ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ వివిక్ష రూపుమాపడానికి పుస్తకాల విద్యనే కాకుండా సమాజాన్ని కూడా అన్ని కోణాల్లో చదవాలి. అప్పుడే దీనిని పూర్తిస్థాయిలో రూపు మాపవచ్చు. కొన్ని చోట్ల పేదరికం కూడా ఈ వివక్షకు కారణమవుతోంది. కాలేజీకి పంపుతున్నారు కదా అన్న ధోరణిలో అమ్మాయిలు కూడా కాలక్షేపం కోసం చదివితే మాత్రం జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వారే కారణంగా మారుతారు. -
డాబాపై చిన్నారి తల.. మొండెం ఆచూకీ లేదు..!
సాక్షి, హైదరాబాద్: ఓ డాబాపై మూడు నెలల చిన్నారి తల.. ఎవరో ముష్కరులు చిన్నారి తలను తెగ్గోసి అక్కడ పడేశారు.. మొండెం ఆచూకీ లేకుండా చేశారు.. ఇది జరిగింది బుధవారం.. పౌర్ణమి, సంపూర్ణ చంద్ర గ్రహణం కావడంతో నరబలిగా కలకలం. సమీపంలోని జనంలో భయాందోళన.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని చిలుకానగర్‌లో జరిగిన ఘటన ఇది. రాజశేఖర్ అనే ఓ క్యాబ్ డ్రైవర్ ఇంటి డాబాపై గురువారం ఉదయం చిన్నారి తలను గుర్తించారు. మొండెం ఆచూకీ లేకపోవడం, ఘటనా స్థలిలో పరిస్థితులను బట్టి ఇది నరబలి అయి ఉంటుందని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. మరోవైపు వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగిందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. డాబాపై తల కనిపించడంతో.. ఉప్పల్ సర్కిల్ చిలుకానగర్ డివిజన్ పరిధిలోని మైసమ్మ దేవాలయం సమీపంలో నివసించే రాజశేఖర్ (35) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం కుటుంబమంతా మేడారం జాతరకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆయన అత్త బాల లక్ష్మి ఉతికిన బట్టలు ఆరేసేందుకు డాబాపైకి వెళ్లారు. అక్కడ ఎవరో చిన్నారి తల కనబడటంతో వచ్చి కుటుంబీకులకు చెప్పారు. డాబాపైకి వెళ్లి చూసిన రాజశేఖర్.. వెంటనే ఉప్పల్ పోలీసులకు సమాచారమిచ్చారు. చిన్నారి తల దొరికిందన్న వార్త దావానలంలా వ్యాపించడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్తతలు తలెత్తకుండా రాచకొండ జాయింట్ కమిషనర్ తరుణ్ జోషి సహా పెద్ద సంఖ్యలో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గ్రహణ సమయంలో బలి ఇచ్చారా? డాబాపై కనిపించిన తల మూడు నెలల చిన్నారిదిగా పోలీసులు భావిస్తున్నారు. అయితే మొండెం లభించకపోవడంతో ఆడపిల్లా, మగపిల్లాడా అన్నది తెలియలేదు. ప్రాథమికంగా లభించిన ఆధారాలు, రక్తం మరకలను బట్టి బుధవారమే హత్య జరిగి ఉంటుందని.. ఆ రోజున పౌర్ణమి, చంద్రగ్రహణం కూడా కావడంతో క్షుద్రపూజలు, నరబలి అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. డాబాపై తల ఉన్న పరిస్థితిని బట్టి ఎవరో తెచ్చి అక్కడ పెట్టి ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించారు. తలపై కుడిచెవి పూర్తిగా తెగిపోయి ఉందని, దవడపై కత్తి గాట్లు ఉన్నాయని గుర్తించారు. ఇవన్నీ నరబలి అనుమానాలకు బలాన్నిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక చిన్నారి మొండెం కోసం చుట్టుపక్కల ప్రాంతాలు, డ్రైనేజీలు, శ్మశాన వాటికల్లో గాలిస్తున్నారు. ] అక్కడికక్కడే తిరిగిన జాగిలాలు చిన్నారి మిస్సింగ్‌కు సంబంధించి ఉప్పల్ సహా చుట్టుపక్కల పోలీసుస్టేషన్లలో ఎలాంటి ఫిర్యాదు అందలేదు. దీంతో ఎవరైనా సంబంధీకులే ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇక పోలీసు జాగిలాలు కూడా చిన్నారి తల లభించిన డాబా పైనుంచి ఆ ఇంటి ముందుకు, ఎదురుగా ఉన్న నరహరి అనే వ్యక్తి ఇంటి వద్దకు తిరిగి రోడ్డు మీదకు వచ్చి ఆగాయి. అయితే ఈ రెండు ఇళ్లలోని ఓ ఇంట్లోని దేవుడి గది వరకూ జాగిలాలు వెళ్లినట్లు తెలిసింది. దీంతో క్షుద్రపూజల కోణంపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ రెండు ఇళ్లతో పాటు సమీపంలోని మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ముమ్మర దర్యాప్తు చేస్తున్నాం ‘‘చిలుకానగర్‌లోని ఓ ఇంటిపై చిన్నారి తల లభించింది. దీనిపై హత్య కేసు నమోదు చేసి, ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాం. నిందితులను గుర్తించి, పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి..’’ – ఉమా మహేశ్వరశర్మ, మల్కాజ్గిరి డీసీపీ ఉన్నత స్థాయి విచారణ జరగాలి ‘‘మూఢ నమ్మకాలతో పసిపిల్లల ఉసురు తీస్తున్నారు. చిలుకానగర్ ఘటన ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు కనబడుతోంది. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి..’’ – అచ్యుతరావు, బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు -
రావులపాలెం టు ఇందూరు
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): గంజాయి స్మగ్లర్లను పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నా ఆగడంలేదు. ఏపీలోని రావులపాలెం నుంచి ఇందూరుకు గం జాయి రవాణా అవుతోంది. ఈ క్రమం లో స్మగ్లర్లపై పోలీసులకు పక్కా సమా చారం రావడంతో వలపన్ని పట్టుకుంటున్నారు. ఈ వివరాలను ఆదివారం డీసీపీ శ్రీధర్‌రెడ్డి విలేకరులకు వెల్లడించారు. నిజామాబాద్ ఆటోనగర్‌కు చెం దిన మునావర్ అలీ గతేడాది 2017 మే నెలలో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబట్టాడు. ఇతడిపై ఆంధ్ర లో 6 కేసులు, మహారాష్ట్రలో ఒకటి, వరంగల్ జిల్లా బచ్చన్నపేట్ పీఎస్‌లో ఒకటి, నిజామాబాద్ ఆరోటౌన్‌లో ఒక కేసు నమోదయ్యాయి. నగర శివారులో తనిఖీల్లో అరెస్టు ఈనెల 27న పెద్దిరాజు, క్యాతం శ్రీనివాస్‌తో 70 కిలోల గంజాయిని ఏపీ10 ఏడీ 1454 నంబరుగల ఇండిగో కారులో 28న ఉదయం నిజామాబాద్ నగర శివారు మాధవనగర్‌కు చేరుకున్నారు. ఇంతలో నిజామాబాద్ రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్రీధర్, పోలీసుల తో కలిసి అర్సపల్లి మాధవనగర్ బైపాస్ పై వాహనాల తనిఖీలు చేశారు. స్మగ్లర్ల కారును పోలీసులు తనిఖీలు చేయగా గంజాయి బాగోతం బయటపడింది. రవాణా చేస్తున్న పెద్దిరాజు, క్యాతం శ్రీనివాస్‌ను పోలీసులు విచారించారు. ము నావర్ అలీకి సప్లయ్ చేస్తున్నామన్నారు. దీంతో పోలీసులు మునావర్ అలీ ఇంటి పై దాడిచేశారు. ఇంట్లో 10 కిలోల గం జాయి లభ్యం కావటంతో వెంటనే అత డిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 80 కిలోల గంజాయిని(రూ.12 లక్షల విలువ) స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. వీరి నుంచి 5సెల్ఫోన్లు, రూ.వెయ్యి, కారును స్వాధీనం చేసుకు న్నామన్నారు. ప్రతిభ చూపిన పోలీసులను డీసీపీ అభినందించారు. వీరికి రివార్డులకు సీపీకి విన్నవిస్తామన్నారు. గుట్కా వ్యాపారి అరెస్టు.. నగరంలోని హైమదీబజార్‌లో గుట్కా వ్యాపారం చేస్తున్న షేక్ అహ్మద్‌ను అరెస్టు చేశామని డీసీపీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. శనివారం అబు బకార్ షాపు, గో దాంలపై పోలీసులు దాడిచేసి 75 కార్టన్ల గుట్కాను పట్టుకున్నారన్నారు. ఇది నిర్మ ల్ జిల్లా బాసర్‌కు చెందిన కరీం సప్లయ్ చేస్తున్నట్లు గుర్తించామని, అతడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగామన్నారు. పథకం పన్నారిలా.. గంజాయి కేసులో విజయవాడ సబ్జైల్లో శిక్ష అనుభవిస్తున్న మునావర్ అలీకి ఇదే జైలులో శిక్ష అనుభవిస్తున్న మరో గంజాయి స్మగ్లర్ ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాడెర్ మండలం పాలకొల్లుకు చెందిన క్యాతం శ్రీనివాస్‌రావుతో పరిచయం ఏర్పడింది. వా రిద్దరు బెయిల్‌పై గతేడాది నవంబర్ లో జైల్ నుంచి విడుదలయ్యారు. అయినా మునావర్ ప్రవర్తనలో మా ర్పురాలేదు. ఇతడు మళ్లీ గంజాయి రవాణాపై దృష్టి సారించాడు. క్యాతం శ్రీనివాస్‌తో కలిసి ఈనెల 13న రావులపాలేం గ్రామానికి వెళ్లి పెద్దిరాజును పరిచయం చేసుకున్నారు. 80 కిలోల గంజాయి కావాలంటే, పెద్దిరాజు ప్రస్తుతం తన వద్ద 10 కిలోలు మాత్రమే ఉందని, మిగతా 70 కిలోల గంజాయి 15 రోజుల తర్వాత పంపిస్తానని చెప్పాడు. దాంతో మునావర్ రూ.80 వేలు పెద్దిరాజుకు చెల్లించి 10 కిలోల గంజాయినినిజామాబాద్‌కు తెచ్చాడు. -
కార్డన్ సెర్చ్..29 వాహనాలు స్వాధీనం
సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయంజాల్ వైఎస్సార్ నగర్లో ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 26 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలు, 1 మారుతి ఓమ్ని, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 8మంది అనుమానితులను ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక బెల్ట్ షాపును సీజ్ చేశారు. -
31న ట్రాఫిక్ ఆంక్షలుంటాయ్
విజయవాడ: నూతన సంవత్సరం సందర్భంగా ఈనెల 31వ తేదీన డ్రంకన్ డ్రైవ్ నిర్వహిస్తామని డీసీపీలు కాంతి రాణా, గజరావ్ భూపాల్‌రావులు శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆ రోజున రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, హైస్పీడ్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్ చేయొద్దని వాహనదారులకు సూచనలు చేశారు. నగరంలో బైక్ ర్యాలీలకు అనుమతి లేదని, పోలీసుల అనుమతితోనే నూతన సంవత్సర వేడుకలు నిర్వహించాలన్నారు. హాస్పటల్స్ సమీపంలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. నూతన సంవత్సరం రోజున రూరల్ ఏరియాలో కోడి పందేలు, పేకాట నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే లాటరీలు వస్తున్నాయని ఫోన్ కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు సూచించారు. -
మాదాపూర్ అడిషినల్ డీసీపీపై బదిలీ వేటు
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి తీరు వివాదాస్పదంగా మారింది. ముత్యాల యోగి కుమార్ అనే వ్యక్తిని బూటు కాలితో తన్నిన షీటీమ్స్ ఇన్చార్జి, మాదాపూర్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డిని సిటీ ఆర్మ్డ్ రిజర్వు(సీఎఆర్) హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. షార్టు ఫిలింలో నటించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హారిక ఫిర్యాదు మేరకు యోగిని విచారణకు పిలిచి ఏడీసీపీ గంగిరెడ్డి బూటు కాలితో తన్నినట్లు ఉన్న వీడియో టీవీ చానళ్లలో, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందులో వాస్తవం ఎంత ఉందో విచారణ చేపట్టాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. ఈమేరకు డీసీపీ విశ్వప్రసాద్‌ను విచారణ అధికారిగా నియమించిన విషయం విదితమే. ఈ క్రమంలో గంగిరెడ్డిని బదిలీ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు. తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ హారిక హైదరాబాద్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. యోగి ఈ వివాదంపై ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో స్పందించిన తాను ఆమెను వేదించలేదని.. కేవలం పది వేల రూపాయల విషయంలో జరిగిన వివాదమే ఇందుకు కారణమని తెలిపాడు. అదే సమయంలో డీసీపీ గంగిరెడ్డి తనపై దాడి చేస్తున్న వీడియోను తాను రిలీజ్ చేయలేదని ఆ వీడియో కూడా హారికనే షూట్ చేసిన తన మిత్రులకు షేర్ చేసిందని చెప్పారు. -
చెంబు కావాలా నాయనా!, పంచ్‌లు..సెటైర్లు
‘ఈ ఇత్తడి చెంబును చూశారా.. దీనికి శక్తులున్నాయట. ఈ విషయం ఇక్కడ కనిపిస్తున్నారే వీరు చెప్పేదాకా నాకూ తెలీదు.. వీరంతా రైస్ పుల్లర్స్ చెంబులు అమ్ముతుంటారు.. ఒక్కసారి వీరితో మాట్లాడారంటే విలేకర్లు అన్న సంగతి కూడా మరిచిపోయి మీరూ కొనేస్తారు. వీరిలో ఒకడు నిట్‌లో ఎంటెక్ చేశాడు. ఆ విషయం చెబుతుంటే ఇప్పుడు సిగ్గుపడుతున్నాడు’.. ఇదేదో ఆషామాషీ వ్యక్తి అన్న ఛలోక్తులు కాదు.. కమిషనర్ స్థాయి అధికారి విసిరిన హాస్యోక్తులు. నగర ఇన్చార్జి కొత్వాల్ వీవీ శ్రీనివాసరావు రైస్ పుల్లింగ్ గ్యాంగ్‌కు సంబంధించి గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని ఆద్యంతం ఛలోక్తులతో నింపేశారు. సాక్షి,సిటీబ్యూరో: బియ్యాన్ని ఆకర్షించడం తో పాటు అతీంద్రియ శక్తులు ఉన్నాయంటూ కొన్ని నాణాలను చూపించి మోసాలు చేసే ముఠాలను ఇప్పటి వరకు చూశాం. అయితే నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్న గ్యాంగ్ మాత్రం నాణాల స్థానంలో బిందెలను వినియోగించింది. ‘రైస్ పుల్లర్’ గా పిలిచే వీటిని అంతర్జాతీయ మార్కెట్ లో కోట్ల ధర ఉంటుందని, ఇవి దగ్గర ఉంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్మించి రూ.లక్షల్లో దండుకుంది. ఈ ముఠాకు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నట్లు ఇన్చార్జి పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. భారీ హంగులతో కార్యాలయం... ప్రకాశం జిల్లా బోదనపాడుకు చెందిన ఆంజనేయులు వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ దళారి. ఇతను తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు ‘రైస్ పుల్లర్ల’ వ్యాపారం ప్రారంభించాడు. వరంగల్‌లో ఎన్ఐటీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేసి, ప్రస్తుతం జీడిమెట్లలో ఉంటూ సివిల్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్న మహ్మద్ ఫజలుద్దీన్, రెడీమేడ్ షాపులో సేల్స్‌మెన్‌గా పని చేస్తున్న గౌలిగూడకు చెందిన బాబుల్, ఇంజిన్ ఆయిల్ సేల్స్‌మెన్‌గా పని చేస్తున్న బాబూరావులతో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. ఆంజనేయులు కస్టమర్లను తేలిగ్గా బుట్టలో వేసుకునేందుకు సికింద్రాబాద్ ఎస్డీ రోడ్‌లోని సూర్య టవర్స్‌లో కార్పొరేట్ హంగులతో ఓ కార్యాలయం ఏర్పాటు చేశాడు. వీరంతా వివిధ మార్గాల్లో బాధితులను అక్కడికి రప్పించి వారితో సమావేశం కావడం, ‘డెమోలు’ చూపించడం కోసం ఈ ఆఫీస్‌ను వాడుకునేవారు. ఐదుగురు కారు డ్రైవర్లకు టోకరా... ఈ గ్యాంగ్‌లో కీలక సభ్యుడైన బాబూరావు గతేడాది ప్రయాణించిన వాహనానికి బోయిన్‌పల్లికి చెందిన విష్ణుమూర్తి డ్రైవర్‌గా వ్యవహరించారు. అతడితో తాను డీఆర్డీఓ సంస్థలో శాస్త్రవేత్తగా పరిచయం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ‘రైస్‌పుల్లర్స్’ విషయం ప్రస్తావనకు తెచ్చిన అతను, ఇక్కడ కేవలం రూ.లక్షల ఖరీదు చేసే ఆ పాత్రలకు అతీతశక్తులు ఉన్నందున విదేశాల్లో రూ.కోట్లకు అమ్ముడుపోతాయని చెప్పాడు. ఓ శాస్త్రవేత్తే ఇలాంటి విషయం చెప్పడంతో నమ్మిన విష్ణుమూర్తి వాటిపై ఆరా తీయగా అతను ఆంజనేయుల్ని రంగంలోకి దింపగా... రైస్ పుల్లర్ బిందెకు ఉన్న మహిమలకు సంబంధించిన వీడియోలను వాట్సాప్‌లో విష్ణుకు చూపించాడు. ఆపై దాని ఖరీదు రూ.20 లక్షలని చెప్పాడు. అంత మొత్తం విష్ణు ఒక్కడే వెచ్చించలేకపోవడంతో అతడికి పరిచయస్తులైన మరో నలుగురు డ్రైవర్లతో కలిసి డబ్బు సర్దుబాటు చేశాడు. ఇది తీసుకున్న ముఠా వారిని మోసం చేసింది. మైన్స్ వ్యాపారం పేరుతో మరొకరికి వేములవాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రమేష్‌కు కొన్నాళ్ళ క్రితం వ్యాపార లావాదేవీల నేపథ్యంలో ఆంజనేయులుతో పరిచయమైంది. తాను మైన్స్ (ఖనిజాల) వ్యాపారం చేస్తానంటూ చెప్పిన ఆంజనేయులు ఆపై అసలు కథ ప్రారంభించాడు. అతీతశక్తులున్న రైస్ పుల్లర్స్ ఇప్పిస్తానంటూ నమ్మించి తన కార్యాలయానికి తీసుకువెళ్ళాడు. అక్కడకు కస్టమర్ల మాదిరిగా వచ్చిన బాబుల్, బాబూరావు, ఫజలుద్దీన్ గతంలో తాము కూడా రైల్ పుల్లర్ బిందె కొన్నామని, ఆపై తమ దశ మారిపోయిందని రమేష్‌ను నమ్మించి, ఆయన నుంచి రూ. 33 లక్షలు తీసుకుని అడ్డంగా ముంచేశారు. ఈ ముఠాకు కోల్‌కతాలో బీటా ట్రేడర్స్ నిర్వాహకుడు రాహుల్ హుడా సైతం సహకరిస్తున్నాడు. ఎవరైనా వినియోగదారుడు ఈ గ్యాంగ్ నుంచి రైస్‌పుల్లర్ ఖరీదు చేయడానికి ముందుకు వస్తే ఇతడు రంగంలోకి దిగుతాడు. ఆంజనేయులు ఆఫీస్‌కు వచ్చే రాహుల్ సదరు బిందెకు రకరకాల పరీక్షలు చేస్తున్నట్లు నటించి చివరకు అది నిజమైన రైస్‌పుల్లర్‌గా సర్టిఫికేషన్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఈ కేటుగాళ్ళు చేతిలో అనేక మంది మోసపోయినప్పటికీ కేవలం విష్ణుమూర్తి, రమేష్ మాత్రమే ఫిర్యాదు చేశారు. పోలీసుల అదుపులో నిందితులు, స్వాధీనం చేసుకున్న నగదు విష్ణు ఇచ్చిన ఆధారాలతో.. ఈ ముఠాపై బోయిన్పల్లి, మహంకాళి ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు బి.శ్రవణ్‌కుమార్, పి.చంద్రశేఖర్‌రెడ్డి, కేఎస్ రవి, కె.శ్రీకాంత్ దర్యాప్తు చేపట్టారు. ఎస్డీ రోడ్‌లోని కార్యాలయంలో నిందితులు లేకపోవడం, వారి సెల్ఫోన్లు పని చేయకపోవడం దర్యాప్తునకు అడ్డంకులు సృష్టించాయి. దీంతో బాధితుల్లో ఒకరైన విష్ణు డ్రైవర్ కావడం, గతంలో అతడు బాబూరావును తీసుకుని పలుచోట్లకు వెళ్ళడంతో అతడిచ్చి ఆధారాలతో టాస్క్‌ఫోర్స్ గురువారం మొత్తం నలుగురినీ పట్టుకోగలిగింది. వీరి నుంచి రూ.34.19 లక్షల నగదు, ఇన్నోవా వాహనం, రైస్ పుల్లర్స్‌గా చెప్పిన మూడు చిన్న బిందెలు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుంది. కోల్‌కతాకు చెందిన రాహుల్ కోసం గాలిస్తున్నారు. పంచ్‌లు..సెటైర్లు నగర పోలీసులు నిర్వహిం చే విలేకరుల సమావేశాలు సాధారణంగా నేరాలకు సంబంధించే ఉంటాయి. అందునా.. కొత్వాల్ స్థాయి అధికారి ప్రెస్మీట్లో వాతావరణం గంభీరంగా ఉంటుంది. అయితే నగర ఇన్చార్జ్ కొత్వాల్ వీవీ శ్రీనివాసరావు ఈ ‘సంప్రదాయాన్ని’ మార్చారు. రైస్ పుల్లింగ్ గ్యాంగ్‌కు సంబంధించి గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని ఆద్యంతం చలోక్తులతో నింపేశారు. దీంతో కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్ నవ్వులతో నిండిపోయింది. నిందితుల నుంచి పోలీసులు నగదు, రైస్ పుల్లర్స్‌గా చెప్పిన బిందెలతో పాటు ఓ ఇన్నోవా కారునూ రికవరీ చేశారు. సీపీ రికవరీ వస్తువులను చూపుతూ ‘అన్నీ ఇక్కడ పెట్టాం కానీ, కారు తెచ్చిపెట్టలేకపోయాం’ అన్నారు. నిందితుల్లో ఒకరు వరంగల్ ఎన్ఐటీలో పీజీ చేశారు. విలేకరుల సమావేశంలో అతను ముఖందాచుకోగా ‘ఈయనే ఎంటెక్ చేసింది. ఆ విషయం చెప్తుంటే సిగ్గుపడుతున్నారు’ అన్నారు. రైస్ పుల్లర్స్‌గా చెప్పినవి వాస్తవానికి ఇత్తడి బిందెలు. ఇవి ఖరీదు చేసి మోసపోయిన వారికి ఎందుకు పని చేస్తాయంటూ విలేకరులు ప్రశ్నించగా... ‘కొన్నాక ఏ యూజ్ లేకపోతే అన్నం వండుకోవడానికో, మంచినీళ్ళు పట్టుకోవడానికో’ అన్నారు. ‘రైస్ పుల్లర్స్’ ఖరీదు చేయడానికి ఆసక్తి చూపిన కస్టమర్లను నిందితులు ఎలా నమ్మిస్తారో ప్రత్యక్షంగా చూపాలని విలేకరులు కోరగా, కొత్వాల్ స్పందిస్తూ... ‘చూసి మీరు కూడా ట్రై చేస్తారా ఏంటి?’ అంటూ ప్రశ్నించారు. ఇది టీజరేనంటూ నగర ఇన్చార్జి కొత్వాల్‌గా వీవీ శ్రీనివాసరావు నవంబర్ 12న బాధ్యతలు తీసుకున్నారు. ఆపై కేసుకు సంబంధించి ఆయన నిర్వహించిన తొలి విలేకరుల సమావేశం ఇదే. త్వరలో వార్షిక విలేకరుల సమావేశం కూడా నిర్వహించాల్సి ఉంది. ఈ విషయాన్నే ఆయన తనదైన శైలిలో ప్రస్తావిస్తూ... ‘యాన్యువల్ రిలీజ్‌కు ఇది టీజర్ లాంటిది’ అని పేర్కొన్నారు. నిందితులతో మాట్లాడించాలని కోరగా ‘వాళ్ళు కాస్సేపు మాట్లాడితే మీరూ ఓ చెంబు కొంటారు. ఎందుకులే’ అంటూ దాటవేశారు. ఈ సందర్భంగా ఫొటో జర్నలిస్ట్ రికవరీ చేసిన కరెన్సీ చూపమని కొత్వాల్‌ను సైగలతో కోరుతూ కరెన్సీ వైపు చేయి చూపించారు. దీనికీ ‘స్పందించిన’ వీవీ శ్రీనివాసరావు ‘ఆ డబ్బు కావాలా... మీకు ఇవ్వలేం’ అంటూ చలోక్తి విసిరారు. సాధించనిదే వదలడు సీసీ వీవీ శ్రీనివాసరావుకు విధి నిర్వహణలో తనకు తానే సాటి అని ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన ఏదైనా ఓ విషయంపై దృష్టి పెడితే ఎంతకష్టమైనా అందులో విజయం సాధిస్తారు. వీవీ శ్రీనివాసరావు కుమార్తె ఓ దశలో ఫ్రెంచ్ భాష నేర్చుకోవాలని భావించారు. ఆమెకు ఆ భాష నేర్పడం కోసం ఆయన ఇంటర్నెట్ను ఆశ్రయించి కొన్నాళ్ళ పాటు అకుంఠిత దీక్షతో ఫ్రెంచ్ భాషను అనర్గళంగా నేర్చుకుని... తన కుమార్తెకూ నేర్పారు. ప్రస్తుతం సీపీ ఆ భాషను మాట్లాడటం, రాయడం, చదవడం చేయగలరు. -
ఎంసెట్ లీకేజీ విచారణలో డీఎస్పీ కక్కుర్తి
-
ఢిల్లీకి వెళుతున్న ‘నాయక్’
సాక్షి,విశాఖపట్నం: సిటీకి కొత్త సీపీ వస్తే నెలన్నరగా కనీసం ఒక్కసారైనా కలవకుండా డిపార్ట్మెంట్ వారెవరైనా ఉంటారా.. సీపీగా ఎవరున్నా తనదారి తనదే అన్నట్లు అధికారిౖయెనా వ్యవహరిస్తారా..మాట వరసకు కూడా అలా అనుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరూ సాహసించరు. కానీ వాళ్లందరికీ విరుద్ధంగా జి.రాంగోపాల్ నాయక్ వ్యవహరించారు. అంతే కాదు ఉన్నతాధికారులతో ఏనాడూ సఖ్యతగా లేని ఆయన తాను తగ్గాల్సి రావడం ఇష్టం లేక ఏకంగా మాత సంస్థకు వెళ్లిపోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరడంతో ప్రభుత్వం అంగీకరించి ఢిల్లీకి పంపిచేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆది నుంచీ ఆయనంతే: రాంగోపాల్ నాయక్ ప్రస్తుతం జోన్–2 డీసీపీగా ఉన్నారు. ఢిల్లీ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి కావడంతో కేంద్ర స్థాయిలో అనేక మంది రాజకీయ నాయకులు, పెద్దలతో మంచి పరిచయాలున్నాయి. అండమాన్ నుంచి విశాఖ బదిలీౖయె వచ్చారు. గత సీపీ అమిత్‌గార్గ్ హయాంలో కొత్త జోన్లు ఏర్పడ్డాయి. వాటిలో జోన్–2కు నాయక్ డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. కానీ అమిత్‌గార్గ్‌కు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. తన పరిధి దాటి వెళ్లి మరీ వివాదాల్లో తలదూర్చేవారు. ముఖ్యంగా ల్యాండ్ సెటిల్మెంట్లు ఆయనకు చెడ్డ పేరు తీసుకువచ్చాయి. దానికి తోడు రౌడీ షీటర్లపై దష్టి సారించి వారిని ఇబ్బందులకు గురి చేయడం ద్వారా ‘ప్రయోజనం’ పొందేవారనే విమర్శలు ఎదుర్కొన్నారు. కేవలం ఆ ప్రయోజనం కోసమే కొత్తగా రౌడీ షీట్లు తెరవమని సిబ్బందిపై ఒత్తిడి తెచ్చేవారని డిపార్ట్మెంట్ కోడై కూస్తోంది. ఇలాంటి అనేక వివాదాలు ముసిరినప్పుడు కూడా సీపీ అమిత్‌గార్గ్ నాయక్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. చర్యలకు ఉపక్రమించిపప్పుడల్లా ఉన్నత స్థాయిలో రాజకీయ నాయకుల నుంచి ఫోన్లు చేయించేవారని, వాటికి సమాధానం చెప్పలేక సీపీ సైతం మిన్నకుండిపోయేవారని సమాచారం. అయితే కొత్త సీపీగా టి.యోగానంద్ రావడంతో నాయక్ ఆలోచనలో పడ్డారు. యోగానంద్ వ్యవహార శైలి తెలుసుకుని ఆయనతో విభేదించి పని చేయలేమని గ్రహించారు. తన ఇష్టానుసారం ఉండటం కుదరనుకున్న నాయక్ ఆయన వస్తున్నారనగానే సెలవు పెట్టి వెళ్లిపోయారు. దాదాపు నెలన్నరగా పేరెంట్ డిపార్ట్మెంట్కు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఒక దశలో ఆశలు సన్నగిల్లడంతో ఈ నెల 11న తిరిగి విధుల్లో చేరాలనుకున్నారు. కానీ పెద్దల అండతో చివరికి అనుకున్నది సాధించుకున్నారు. -
లష్కర్ బోనాలకు పటిష్ట భద్రత
-
హైదరాబాద్‌లో అర్ధరాత్రి కార్డెన్‌సెర్చ్
-
హైదరాబాద్ లో కార్డెన్ సర్చ్
- 56 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కృష్ణానగర్, జవహర్ నగర్, ఇందిరా నగర్, నేరేడ్ మెట్, వినాయక నగర్ లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా 56 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 14 మంది పాత నేరస్తులు, రౌడీ షీటర్లు ఉన్నారు. 1328 ఇళ్లు, 15 లాడ్జిల్లో తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 93 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, ఏడు ఆటోలు, ఒక తల్వార్, ఒక గ్యాస్ సిలిండర్, రూ.7.5లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సెర్చ్ లో మల్కాజ్ గిరి డీసీపీ రామ చంద్రారెడ్డితో పాటు.. నలుగురు ఏసీపీలు, 12 మంది సీఐలు, ఎస్ ఐలు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లోనూ ‘కాల్ మనీ’ దందా
-
హైదరాబాద్‌లోనూ ‘కాల్ మనీ’ దందా
► అక్రమ వడ్డీ వ్యాపారుల భరతం పట్టిన దక్షిణ మండలం పోలీసులు ► వేధింపులకు పాల్పడితే నిర్భయంగా ఫిర్యాదు చేయండి: డీసీపీ హైదరాబాద్: పేదల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఉన్న కొద్దిపాటి ఆస్తులను జీపీఏ, ఎస్పీఏ చేయించుకొని రుణాలిస్తున్న ఘరానా వడ్డీ వ్యాపారుల ఆగడాలకు దక్షిణ మండల పోలీసులు చెక్ పెట్టారు. డీసీపీ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో 25 టీమ్‌లు పాతబస్తీలో ఏకకాలంలో దాడులు నిర్వహించి 56 మంది వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. పురానీహవేలీలోని తన కార్యాలయంలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీసీపీ వివరాలు వెల్లడించారు. పాతబస్తీలోని వడ్డీ వ్యాపారులపై ఇప్పటికే పెద్ద ఎత్తున దాడులు చేసి దందాలను మూయించడం జరిగిందన్నారు. నలుగురిపై పి.డి. యాక్ట్‌లు కూడా ప్రయోగించామన్నారు. వడ్డీ వ్యాపారులు కొత్త పంథాలో పేదల ఆస్తులను తమ పేర్లపై జీపీఏ చేయించుకొని 40-50 శాతం వడ్డీకి రుణాలిస్తున్నారన్నారు. రెండు మూడు నెలల్లో నే ఆస్తులను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని పేదలను రోడ్డున పడేస్తున్నారన్నారు. ఇలాంటి ఘటనలపై సమాచారం అందడంతో పాతబస్తీ అంతటా దాడులు నిర్వహించినట్లు చెప్పారు. మొత్తం 56 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఫైనాన్స్ బుక్‌లు, రికార్డ్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన వారిలో 30 మందిపై గతంలోనే కేసులు నమోదైనట్లు తేలిందన్నారు. ఎక్కువ కేసులు నమోదైన వారిపై పి.డి. యాక్ట్‌లు ప్రయోగిస్తామన్నారు. వివరాలను పూర్తిగా పరిశీలించిన తరువాత చర్యలు తీసుకుంటామన్నారు. పాత నగరంలో మరో వారం రోజుల పాటు ఈ డ్రైవ్ కొనసాగిస్తామన్నారు. పట్టుబడిన వారిలో రౌడీషీటర్లు, జీహెచ్ఎంసీ ఉద్యోగులు కూడా ఉన్నట్లు చెప్పారు. వడ్డీ వ్యాపారుల్లో ఒక మహిళ కూడా ఉండడం గమనార్హం. ఈ సమావేశంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబురావు, చార్మినార్, మీర్‌చౌక్, సంతోష్‌నగర్‌ల ఏసీపీలు అశోక చక్రవర్తి, శ్రీనివాసరావు, వి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నిర్భయంగా ఫిర్యాదు చేయండి.... పాతబస్తీలో ఫైనాన్సర్లు వేధింపులకు గురిచేసినా, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినా.. ఎలాంటి భయం లేకుండా తమకు ఫిర్యాదు చేయాలని డీసీపీ సత్యనారాయణ బాధితులకు సూచించారు. స్థానిక స్టేషన్లలో గాని, నేరుగా తనకు(9490616476) ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. -
ప్రదీప్ దొరికినట్లు ఎక్కడా సమాచారం లేదు
హైదరాబాద్ : ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ భార్య సుప్రియ హత్య కేసులో రెండో నిందితుడు ప్రదీప్ దొరికినట్లు తమకు ఎక్కడా సమాచారం అందలేదని డీసీపీ కమలాహాసన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రదీప్ అరెస్ట్ అంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తడంపై శుక్రవారం కమలాహాసన్రెడ్డి స్పందించారు. ప్రదీప్ అరెస్ట్ అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. అయితే అక్రమ సంబంధం అన్న అనుమానంతోనే భార్య సుప్రియను ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామకృష్ణ హత్య చేశాడని వెల్లడించారు. భార్యను హత్య చేసిన రామకృష్ణ... ఆమె మృతదేహన్ని వికారాబాద్ అటవీ ప్రాంతంలో పూడ్చి పెట్టిన సంగతి తెలిసిందే. అందుకు అతడి స్నేహితుడు ప్రదీప్ సహాయ సహకారాలు అందించినట్లు పోలీసుల విచారణలో రామకృష్ణ తెలిపాడు. దీంతో అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ప్రదీప్‌ను పోలీసులు అదుపులో తీసుకున్నారంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. దీంతో డీసీపీ కమలాహాసన్రెడ్డి పైవిధంగా స్పందించారు. -
50 మంది బాలకార్మికులకు విముక్తి
-
ఏఎస్పీ రమా రాజేశ్వరి బదిలీ
నల్లగొండ క్రైం : జిల్లా అదనపు ఎస్పీ రమా రాజేశ్వరి బదిలీ అయ్యారు. ఈమెను మల్కాజ్గిరి డీసీపీగా ఉద్యోగ్యోన్నతిపై బదిలీ చేస్తూ ఆదివారం ఉన్నతస్థాయి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 11 నెలల పాటు పని చేసిన తనకు ఎనలేని సంతృప్తి మిగిలిందన్నారు. విభిన్న రకాలైన కేసుల విచారణ, పరిష్కారం ద్వారా అనుభవం గడించానని, జిల్లా ఎస్పీ టి.ప్రభాకర్‌రావు మార్గదర్శకంలో పలు కేసులను విజయవంతంగా చేధించగలిగానని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా 2014 సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించగలగడం శాఖాపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ తృప్తినిచ్చిందన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు, సంఘటనలపై సత్వరమే స్పందించడంతో పాటు కేసులను పరిశోధించి జాతీయస్థాయిలో ఒక నివేదికను అందజేయడం వల్ల తగిన గుర్తింపు లభించిందన్నారు. మహిళల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపైన సీఎంకు నివేదిక ఇచ్చినట్లు వివరించారు. దీనికి స్పందించిన ప్రభుత్వం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్భయ వార్డు ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతుందుని చెప్పారు. -
ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు: డీసీపీ
ఏలూరు: విజయవాడ-ఏలూరు హైవేపై కాల్పుల ఘటనలో మరణించిన ముగ్గురి వ్యక్తుల అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం పినకడిమిలో పూర్తయ్యాయని విజయవాడ డీసీపీ ఇక్బాల్ తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మూడు మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేశామన్నారు. నిందితుల కోసం పినకడిమిలో 20 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించినట్టు డీసీపీ వెల్లడించారు. నిందితుల బంధువుల ఇంట్లో కూడా సోదాలు పూర్తి చేశామని ఆయన అన్నారు.