
పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా అవినీతి అధికారుల సమాచారాన్ని ముఠా సేకరించి స్కెచ్ వేసేది.
విశాఖపట్నం : ప్రభుత్వ శాఖల్లో అవినీతి అధికారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు డీసీపీ రవీంద్ర తెలిపారు. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా అవినీతి అధికారుల సమాచారాన్ని ముఠా సేకరించేందన్నారు.
శ్రద్ధా ఆసుపత్రి కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చిన తర్వాత డాక్టర్ రవీంద్ర వర్మను ముఠా సంప్రదించిందని డీసీపీ రవీంద్ర చెప్పారు. హెల్త్ సెక్రెటరీ పీఏగా పరిచయం చేసుకుని కిడ్నీ కేసు నుంచి తప్పించేందుకు రూ.10లక్షలు ముఠా డిమాండ్ చేసిందన్నారు. ఈ వ్యవహారంలో వెంకట నారాయణ, వెంకట సురేశ్, మహాలక్ష్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు వెంకట నారాయణపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల కేంద్రంగా ముఠా పనిచేస్తోంది. నాలుగు సెల్ ఫోన్లు, లక్ష50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.