హైదరాబాద్ లో కార్డెన్ సర్చ్ | Police detained 56 people in Carden Searching of Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో కార్డెన్ సర్చ్

Published Sun, Mar 13 2016 8:29 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Police detained 56 people in Carden Searching of Hyderabad

- 56 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్

నగరంలోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కృష్ణానగర్, జవహర్ నగర్, ఇందిరా నగర్, నేరేడ్ మెట్,  వినాయక నగర్ లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా 56 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 14 మంది పాత నేరస్తులు, రౌడీ షీటర్లు ఉన్నారు. 1328 ఇళ్లు, 15 లాడ్జిల్లో తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 93 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, ఏడు ఆటోలు, ఒక తల్వార్, ఒక గ్యాస్ సిలిండర్, రూ.7.5లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సెర్చ్ లో మల్కాజ్ గిరి డీసీపీ రామ చంద్రారెడ్డితో పాటు.. నలుగురు ఏసీపీలు, 12 మంది సీఐలు, ఎస్ ఐలు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement