ప్రియురాలి కోసం కొట్టుకున్నారు.. | Street Fight For Lpver In Banjarahills hyderabad | Sakshi
Sakshi News home page

ప్రియురాలి కోసం కొట్టుకున్నారు

Published Mon, Sep 3 2018 8:00 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Street Fight For Lpver In Banjarahills hyderabad - Sakshi

బంజారాహిల్స్‌: తన ప్రియురాలిని గత రెండు నెలలుగా మాయ మాటలు చెప్పి తన వద్ద ఉంచుకున్నాడంటూ ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ఆ యువతి ఉంటున్న ఇంటికి వెళ్లి గొడవ పడటమే కాకుండా ఆమెకు ఆశ్రయం ఇచ్చిన యువకుడిపై తన అనుచరులతో కలిసి దాడి చేశాడు. బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే... విజయవాడ మాచవరంకు చెందిన రేవంత్‌ బీటెక్‌ చదివే సమయంలో తన క్లాస్‌మేట్‌తో ప్రేమలో పడ్డాడు. ఐదేళ్లుగా   ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల రేవంత్‌ ప్రవర్తన నచ్చని యువతి అతడితో బ్రేకప్‌ చేసుకొని బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.3 అరోరాకాలనీలో ఉంటున్న తన స్నేహితుడు అఖిల్‌(26) వద్దకు వచ్చింది.

కన్సల్టెంట్‌గా పని చేస్తున్న అఖిల్‌ తన గదిలో ఆమెకు ఆశ్రయం ఇచ్చాడు. ఇది జీర్ణించుకోలేని రేవంత్‌ కొద్దిరోజులుగా ఆమెను హెచ్చరిస్తున్నాడు. అక్కడి నుంచి రాకపోతే అంతు చూస్తానని బెదిరించాడు. ఆమెను తన ఇంటికి పంపించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని శనివారం రాత్రి అఖిల్‌ను ఫోన్‌లో బెదిరించాడు.  ఆదివారం 30 మంది అనుచరులతో కలిసి ఆమె ఉంటున్న ఇంటి వద్ద గొడవ చేశాడు. అఖిల్‌కు రేవంత్‌కు మధ్య ఘర్షణ జరగడంతో  అఖిల్‌ అతడి స్నేహితులకు గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రేవంత్, అతడి అనుచరులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement