
బంజారాహిల్స్ : బాకీ డబ్బులతో పాటు వడ్డీ చెల్లించకపోతే కూతురిని కిడ్నాప్ చేస్తానంటూ బెదిరిస్తున్న ఓ వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకృష్ణానగర్‌కు చెందిన శంకరాచారి కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. అతను వ్యక్తిగత అవసరాల నిమిత్తం వెంకటగిరికి చెందిన లక్ష్మి అనే మహిళ నుంచి పలుమార్లు అప్పు తీసుకుని తిరిగి చెల్లాంచాడు. కొన్నిసార్లు వడ్డీ చెల్లించడం ఆలస్యం కావడంతో తన కారుతో పాటు బైక్‌ను కూడా కుదువ పెట్టాడు. రెండు రోజుల క్రితం లక్ష్మి, పద్మతో పాటు సత్యనారాయణ అనే వ్యక్తి శంకరాచారి ఇంటికి వచ్చి అతని భార్యతో తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నారు. వడ్డీ డబ్బులు చెల్లించకపోతే కూతురిని కిడ్నాప్ చేస్తానంటూ బెదిరించాడు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment