హైదరాబాద్: బంజారాహిల్స్, హుమాయూన్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్‌జోన్ డీసీపీ ఆధ్వర్యంలో సుమారు 350 మంది పోలీసులు మీరజ్ కాలనీ, నబీ కాలనీ తదితర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 35 మంది అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతోపాటు సరైన పత్రాలు లేని 50 వాహనాలు సీజ్ చేశారు.