హైదరాబాద్ సౌత్ జోన్ లో కార్డన్ సెర్చ్
హైదరాబాద్: సౌత్ జోన్ పరిధిలో పోలీసులు శనివారం వేకువజాము నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సంతోష్ నగర్, బాబానగర్, కంచన్ బాగ్ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. జంతు కళేబరాలతో ఉత్పత్తులు తయారుచేస్తున్న పరిశ్రమలపై పోలీసులు ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో 300 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నకిలీ ఆయిల్ తయారుచేసే రెండు కేంద్రాలపై దాడి చేశారు. పెద్ద సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందింది. వీరిలో మైనర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.