dcp satyanarayana
-
సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తే ఊరుకోం
-
పోలీసులు అదుపులో కరడుగట్టిన నేరస్థులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్ర నగర్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. దాదాపు 250 మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ సిబ్బందితో తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీలో సరైన ధ్రువపత్రాలు లేని 62 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. తాము అదుపులోకి తీసుకున్న 15 మంది అనుమనితులో ముగ్గురు కరడుగట్టిన నేరస్థులున్నారని సమాచారం. నిషేధిత కార్బైడ్‌తో మామిడి పండ్లను మగ్గిస్తున ఒమర్ అనే నిర్వాహకుడిని అదుపులోకి తీసుకొని 300 ప్యాకెట్ల కార్బైడ్‌ని సీజ్ చేశారు. కార్డెన్ సెర్చ్ నిర్వహించేందుకు సహకరించాలని పాతబస్తీ ప్రజలను కోరినట్లు డీసీపీ వి సత్యనారాయణ తెలిపారు. -
‘అమ్మాయిలను అమ్మేసే ముఠా అరెస్ట్’
-
‘అమ్మాయిలను అమ్మేసే ముఠా అరెస్ట్’
హైదరాబాద్: పేద ముస్లిం కుటుంబాలకు మాయ మాటలు చెప్పి మైనర్ బాలికలను అరబ్ షేక్‌లు దుబామ్ తరలిస్తున్నారని సౌత్ జోన్ డీసీపీ వి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కాంట్రాక్టు మ్యారేజీలు, మైనర్ బాలికలను దుబాయ్‌కు అమ్మేసే గ్యాంగ్‌ను అరెస్ట్ చేశామని వెల్లడించారు. 12 బ్రోకర్లు, 3 ఒమన్ షేక్‌లు, 2 ఖాజీలను పట్టుకున్నట్టు తెలిపారు. హైదరాబాద్ ఖాజీ అలీ అబ్దుల్లా రఫై ఓల్టా కూడా అరెస్టైన వారిలో ఉన్నాడని చెప్పారు. 38 మంది బ్రోకర్లను గుర్తించామని, అందులో 15 మంది ఒమన్‌కు చెందినవారని తెలిపారు. కేరళ, కర్ణాటక, ముంబై నుంచి వీసాలు తెప్పించి హైదరాబాద్ మైనర్ బాలికలను గల్ఫ్ దేశాలకు తరలిస్తున్నారని పేర్కొన్నారు. పట్టుబడిన అరబ్ షేక్‌ల వద్ద అనేక రకాల స్టిరాయిడ్స్, లైంగిక సామర్థ్యాన్ని పెంచే మాత్రలు లభించాయన్నారు. ఒక్కో ఖాజీ 10 మంది మైనర్ బాలికలను పెళ్లి చేసుకుంటున్నట్లు గుర్తించామన్నారు. ఒమన్ దేశానికి రాయాబార కార్యాలయం ద్వారా లేఖ రాసి ఇలాంటి వారిని మన దేశానికి రాకుండా చూస్తామన్నారు. పదే పదే ఇలాంటి నేరాలకు పాల్లడుతున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. పట్టబడ్డ అబ్దుల్ రఫై ఖాజీ ఇప్పటివరకు 50 వివాహాలు చేశాడని, దుబాయ్‌లో చాలా వరకు అమ్మాయిలను సరఫరా చేసేది ఇతడేనని డీసీపీ తెలిపారు. -
పాతబస్తీలో అరబ్‌షేక్‌లు, బ్రోకర్ల అరెస్ట్
-
పాతబస్తీలో అరబ్‌షేక్‌లు, బ్రోకర్ల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ కాంట్రాక్ట్ మ్యారేజ్ అడ్డాలపై సౌత్ జోన్ పోలీసులు సోమవారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. నగరంలోని పాతబస్తీ, ఫలక్‌నుమ, చంద్రాయణగుట్ట, తలాబ్‌కట్టా ప్రాంతాల్లోని ఖాజీల ఇళ్లు, కార్యాలయాలపై పోలీసులు ఏకకాలంలో తనిఖీలు దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఖాజీ అలీ అబ్దుల్లా రఫైతో పాటు పలువురు అరబ్‌షేక్‌లు, బ్రోకర్లు ఉన్నారని డీసీపీ సత్యనారాయణ వెల్లడించారు. రఫైపై పీడీ యాక్ట్ ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. అమాయకులైన యువతులను, బాలికలను అరబ్‌షేక్‌లకు ఇచ్చి బలవంతంగా వివాహాలు చేయడం, విదేశాలకు తీసుకెళ్లి వారికి నరకం చూపిస్తుంటారన్న విషయం తెలిసిందే. బ్రోకర్ల సాయంతో యువతుల కుటుంబాలకు డబ్బు ఆశచూపి పెళ్లిచేసుకుని విదేశాలకు తీసుకెళ్తారు అరబ్‌షేక్‌లు. ఇటీవల నమోదైన కొన్ని కేసులతో ఈ అంతర్జాతీయ మ్యారేజ్ కాంట్రాక్ట్ అడ్డాలపై పోలీసులు దృష్టిసారించారు. ఈ నేపథ్యంలోనే నిఘా ఉంచిన కొన్ని మ్యారేజ్ అడ్డాలపై దాడులు నిర్వహించి పలువురు అరబ్‌షేక్‌లు, బ్రోకర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆయుబ్ఖాన్ అనుచరులే లక్ష్యంగా కార్డన్ సెర్చ్
-
పాతబస్తీలో అర్ధరాత్రి నుంచి కార్డన్ సెర్చ్
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో బుధవారం అర్థరాత్రి నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 250 మంది పోలీసులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. పాతబస్తీలోని 40 ప్రాంతాల్లో పోలీసులు అణువణువు సోదాలు నిర్వహించారు. ఆయుబ్ఖాన్ అనుచరులే లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఈ కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఆయుబ్ ఖాన్ ప్రధాన అనుచరుడు ఖురేషిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ మావోయిస్టు సాంబశివుడు సోదరుడు రాములు హత్యకేసులో నిందితుడు అయిన బాడర్ యూసఫ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రాములు హత్యకేసులో ఏ17గా బాడర్ యూసఫ్ ఉన్న విషయం తెలిసిందే. -
పాతబస్తీలో పోలీసుల కార్డన్ సెర్చ్
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో శనివారం తెల్లవారుజామున నుంచి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కామటిపుర, బార్కాస్, వట్టేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 21 మంది రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, నాలుగు ఆయుధాలు, 65 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ తేనె, వెనిగర్, అల్లం పేస్ట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు తయారీ గోడౌన్‌ను సీజ్ చేశారు. కల్తీ పాల తయారీ కేంద్రంతో పాటు రెండు కబేళ కేంద్రాలను పోలీసులు సీజ్ చేశారు. -
పాతబస్తీలో ఆరుగురు రౌడీషీటర్లు అరెస్ట్
హైదరాబాద్ : పాతబస్తీలోని మాదన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు బుధవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 44 బైకులతోపాటు మూడు ఆటోలను సీజ్ చేశారు. అలాగే ఆరుగురు రౌడీషీట్లర్లతోపాటు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7 మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో దాదాపు 250 మంది పోలీసులు ఈ కార్డన్ సెర్చ్‌లో పాల్గొన్నారు. -
ఉగ్రవాదుల టార్గెట్‌లో భాగ్యలక్ష్మి ఆలయం: డీసీపీ
చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయం చాలా కాలంగా ఉగ్రవాదుల టార్గెట్‌లో ఉందని, అందువల్ల ఈ ఆలయం చుట్టూ సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేశామని హైదరాబాద్ దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ తెలిపారు. రంజాన్ మాసంలోని చివరి శుక్రవారం కావడంతో నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఒక ఐజీ స్థాయి అధికారితో 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఉందని తెలిపారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి ఆలయం, మక్కా మసీదులలో భద్రతను ఆయన సమీక్షించారు. నెట్ చాటింగ్, మొబైల్ సంభాషణలను ట్రాక్ చేయడం ద్వారానే ఉగ్రవాదుల అరెస్టు సాధ్యమైందని డీసీసీ సత్యనారాయణ వెల్లడించారు. ఇంటర్నెట్ కార్యకాలాపాలపై నిఘా పెంచామని, సున్నితమైన ప్రాంతాలలో భద్రతను మరింత పెంచామని ఆయన చెప్పారు. -
హైదరాబాద్ సౌత్ జోన్ లో కార్డన్ సెర్చ్
హైదరాబాద్: సౌత్ జోన్ పరిధిలో పోలీసులు శనివారం వేకువజాము నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సంతోష్ నగర్, బాబానగర్, కంచన్ బాగ్ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. జంతు కళేబరాలతో ఉత్పత్తులు తయారుచేస్తున్న పరిశ్రమలపై పోలీసులు ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో 300 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నకిలీ ఆయిల్ తయారుచేసే రెండు కేంద్రాలపై దాడి చేశారు. పెద్ద సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందింది. వీరిలో మైనర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
'కార్డన్ సెర్చ్‌తో తగ్గిన క్రైం రేట్'
చాంద్రాయణగుట్ట: పాత నగరంలో ఏడాదిన్నర కాలంగా నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్ సత్ఫలితాలనిచ్చిందని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే నేరాలు తగ్గుముఖం పట్టాయని, పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చే వరకు కార్డన్ సెర్చ్‌లను కొనసాగిస్తామని చెప్పారు. దక్షిణ మండలం పోలీసులు ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున నిర్వహించిన కార్డన్ సెర్చ్ వివరాలను ఆయన విలేకరులకు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలివీ.. ఫలక్‌నుమాలోని వట్టేపల్లి, గుంటల్ షా బాబా దర్గా ప్రాంతాలలో సుమారు 300 మంది పోలీసులు టీం టీంలుగా ఏర్పడి సోదాలు జరిపారు. ఇందులో 17 మంది అనుమానిత రౌడీషీటర్లను అదుపులోకి తీసుకొని, వారి నుంచి రెండు తల్వార్లు, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, ఒక స్కూల్ బస్సును స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలకు పాల్పడుతున్న కొందరు సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఫలక్‌నుమా ఏరియాలో తలదాచుకుంటున్నారని డీసీపీ తెలిపారు. ఇటీవల కాటేదాన్‌లో బ్యాంక్ వద్ద కూడా కాల్పుల ఘటన నేపథ్యంలో ఇక్కడి ప్రజలు కార్డన్ సెర్చ్ నిర్వహించాలని తమను కోరారని వివరించారు. -
నిబంధనలు ఉల్లంఘించిన 12మందికి జైలు
చార్మినార్, మీర్‌చౌక్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 12 మందికి జైలు శిక్ష పడిందని నగర ట్రాఫిక్ అదనపు డీసీపీ సత్యనారాయణ తెలిపారు. నిబంధనలు కఠినతరం కావడంతో వాహనదారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. చార్మినార్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎలాంటి డ్రై వింగ్ లైసెన్స్ లేకుండా ఆటోలను నడుపుతున్న నలుగురికి జరిమానాతో పాటు జైలు శిక్ష పడిందన్నారు. అలాగే, మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో డ్రై వింగ్ లైసెన్స్ లు లేకుండా ఆటోలను నడపుతున్న ఏడుగురిపై రెండోసారి కేసులు నమోదు కావడంతో నాంపల్లిలోని ఆరో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు మూడు రోజుల జైలు శిక్షతో పాటు రూ.700 జరిమానా విధించిందని వివ రించారు. పాతబస్తీలో ఇప్పటి వరకు 2,100 మంది వాహనదారులు లైసెన్స్ లేకుండా వాహనాలతో పట్టుబడ్డారని...25 వేల మంది వాహనదారులు హెల్మెట్ లేకుండా దొరికారని..3 వేల మంది ఎలాంటి డ్రై వింగ్ లైసెన్స్ లేనివారు పట్టుబడ్డారన్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారెవైరె నా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనన్నారు. -
పాతబస్తీలో రీపోలింగ్: ఆయనను దూరం పెట్టండి!
హైదరాబాద్: పాతబస్తీలోని పూరానాపూల్ డివిజన్లో శుక్రవారం జరగనున్న రీ పోలింగ్‌కు డీసీపీ సత్యనారాయణను దూరంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. పూరానాపూల్‌లో మంగళవారం జరిగిన పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్, ఎంఐఎం శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ డివిజన్లో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. అయితే పోలింగ్ సందర్భంగా డీసీపీ సత్యనారాయణ వ్యవహరించిన తీరుపైనా ఫిర్యాదులు రావడంతో ఎన్నికల విధులకు ఆయనను దూరం ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. 52 డివిజన్ పూరానాపూల్లోని 36 పోలింగ్ బూత్‌లలో శుక్రవారం ఉదయం 7గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 34,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 225 మంది ఎన్నికల సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటారు. ఈ రీపోలింగ్ కారణంగానే జీహెచ్ఎంసీ ఎన్నికల కౌటింగ్ ను శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించి.. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఫలితాలు ప్రకటించాలని అధికారులు నిర్ణయించారు. -
12 గంటల వరకు 21.65 శాతం పోలింగ్
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 12 గంటల వరకు 21.65 శాతం నమోదయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ క్రమక్రమంగా పుంజుకుంటోంది. 9 గంటలవరకు తక్కువగా ఉన్న పోలింగ్ ఆ తర్వాత పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరడంతో ఓటింగ్ శాతంలో వృద్ధి కనిపిస్తోంది. వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి జనార్ధన్ రెడ్డి తెలిపారు. అన్ని ప్రాంతాల్లో ఇప్పటివరకు ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతోందన్నారు. పాతబస్తీలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాజకీయ పార్టీల నుంచి ఇప్పటివరకు 37 ఫిర్యాదులు అందాయని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. పాతబస్తీలో 5 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 9 డివిజన్లను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి అక్కడ పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు డీసీపీ వివరించారు. -
కుక్కల కట్టడికి చర్యలు
చార్మినార్ : పండుగలు వస్తున్నాయంటే... రౌడీషీటర్లు, అసాంఘిక శక్తుల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉంటారు. అయితే ప్రస్తుతం వీరితో పాటు దక్షిణ మండలం పోలీసులు కుక్కలపై (గ్రామసింహాలు) కూడా దృష్టి పెట్టారు. గతంలో జరిగిన కొన్ని ఘటనలను దృష్టిలో ఉంచుకొని డీసీపీ సత్యనారాయణ కుక్కలను కట్టడి చేయాలని నిర్ణయించారు. ఓ వైపు వినాయక ఉత్సవాలు.. మరోవైపు ఈనెల 25న జరుగనున్న బక్రీద్ పండుగ నేపథ్యంలో పోలీసులు పాతబస్తీలో రౌడీషీటర్లను బైండోవర్ చేయడంతో పాటు పాతనేరస్తుల కదలికలపై నిఘా పెట్టారు. అలాగే, ఇరు వర్గాల మధ్య ఘర్షణకు కారణమవుతున్న కుక్కలను కట్టడి చేయాలని డీసీపీ నిర్ణయించారు. చార్మినార్, మీర్‌చౌక్, సంతోష్‌నగర్, ఫలక్‌నుమా ఏసీపీ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్ల ప్రాంతాల్లో కుక్కల బెడద లేకుండా ఇప్పటి నుంచే జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులు, సిబ్బందితో కలిసి కుక్కల సంచారాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని సూచించారు. కుక్కలతో ఇరు వర్గాల ఘర్షణలు... బక్రీద్ పండుగ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో రోడ్లపై కనిపించే జంతువుల వ్యర్థాలను కుక్కలు తింటుంటాయి.అయితే,కొన్ని కుక్కలు ఆ వ్యర్థాలను తమకు ఇష్టమైన ప్రదేశాలకు తీసుకెళ్లి ప్రశాంతంగా తింటుంటాయి. ఇలా తీసుకెళ్లే కుక్కల వల్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. జంతువుల వ్యర్థాలను వినాయక మండపాలు, మండపాల సమీపంలోకి తీసుకె ళ్లి వదిలేస్తే.. మండపాల నిర్వాహకులు, భక్తులకు ఆగ్రహం వచ్చి ఇరువర్గాల మధ్య ఘర్షణలకు దారితీయొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ముందుగా కుక్కలను కట్టడి చేయడం శ్రేయస్కరమని భావిస్తున్నారు. గట్టి బందోబస్తు... జంట పండుగల కోసం ఇప్పటికే పాతబస్తీలో అదనపు బలగాలను రప్పించి బందోబస్తులో నియమించామన్నారు. ఒక కంపెనీ ఇండో టిబెటియన్ బార్డర్ పోలీసులు, రెండు కంపెనీల సీఆర్పీఎఫ్, రెండు కంపెనీల ఆర్‌ఏఎఫ్‌లతో పాటు 2 వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారన్నారు. శాంతి సామరస్యంతో పండుగలు జరుపుకోవాలి... జంట పండుగులను ఇరువర్గాల ప్రజలు శాంతి సామరస్యాలతో జరుపుకోవాలి. గణేశ్ వేడుకలు, బక్రీద్ సందర్భంగా పాతబస్తీలో గట్టి బందోబస్తు కొనసాగిస్తున్నాం. వినాయక మండపాల నిర్వాహకులు 9వ రోజు (ఈనెల 25న)న పెద్ద సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనానికి తరలించే అవకాశాలున్నాయి. అదే రోజు బక్రీద్ పండుగ ఉన్నందున భక్తులు తమ విగ్రహాల నిమజ్జనాన్ని ఒక రోజు ముందు చేసుకోవడంలేదా..26వ తేదీకి వాయిదా వేసుకుంటే బాగుంటుంది. -వి.సత్యనారాయణ, దక్షిణ మండలం డీసీపీ -
పిల్లలను అక్రమ రవాణా చేసే ముఠా అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో పోలీసులు అర్థారాత్రి నుంచి కార్డ్ ఆన్ సెర్చ్ కొనసాగుతోంది. ఈ తనిఖీల్లో భాగంగా పిల్లలను అక్రమంగా రవాణా చేసే బీహార్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ముమ్ముర తనిఖీల్లో 700 మంది పోలీసులు పాల్గొన్నారు. అందిన ప్రాథమిక సమాచారం మేరకు తనిఖీలు చేపట్టిన సౌత్ జోన్ పోలీసుల బృందం అక్కడి భవానీ నగర్లో 250మందికి పైగా బాలకార్మికులకు విముక్తి కల్పించారు. బాల కార్మికులతో పనిచేయిస్తున్న వారిని కఠినంగా శిక్షిస్తాం, అవసరమైతే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీసీపీ సత్యనారాయణ తెలిపారు. -
పోలీసు వలయంలో మాన్గార్ బస్తీ
నాంపల్లి: మంగళవారం తెల్లవారు జామున 2 గంటలకు పశ్చిమ మండలం డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సుమారు 350 మంది పోలీసులు హబీబ్‌నగర్ ఠాణా పరిధిలోని మాన్గార్ బస్తీ, సమీపంలోని అఫ్జల్‌సాగర్, జవహర్‌నగర్‌లను చుట్టుముట్టారు. 36 బృందాలుగా ఏర్పడి కార్డన్ అండ్ సర్చ నిర్వహించారు. అన్ని ఇళ్లకు వెళ్లి నిద్రలో ఉన్న వారిని లేపి సోదాలు జరిపారు. ఉదయం 5 గంటల వరకు తనిఖీలు చేశారు. 56 మంది అనుమానిత నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు.40 తులాల బంగారం, కిలో వెండి, రూ.75 వేల నగదు, మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. దాడులకు నిరసనగా ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోబోగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అదుపులో తీసుకున్న వారిలో ముగ్గురు రెండు హత్య కేసుల్లో నిందితులని, మిగతా వారు వంద కేసుల్లో నేరస్తులని తెలిసింది. ఏసీపీ కార్యాలయం కిటకిట... మాన్గార్ బస్తీ, అఫ్జల్సారగ్ బస్తీల్లోని కొందరిని నేరస్తులుగా అనుమానితులను పోలీసులు గోషామహల్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏసీపీ కార్యాలయం కిటకిటలాడింది. హబీబ్‌నగర్ పోలీసులు వారి వివరాలు తెలుసుకోవడంతో పాటు ఆధార్, రేషన్ కార్డులను తీసుకున్నారు. బయటి రాష్ట్రాల్లో బంగారం తాకట్టు... మాన్గార్ బస్తీలో ఉంటున్న నేరస్తులందరూ హైదరాబాద్‌తో పాటు నాందేడ్, గుల్బర్గా పట్టణాల్లో తాకట్టుపెట్టి డబ్బులు తెచ్చుకున్నట్లు పోలీసులకు రసీదులు లభించాయి. పరారీలో ఉన్న రిసీవర్ల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. భారీగా మద్యం బాటిళ్లు లభ్యం... మాన్గార్ బస్తీలో ఉండే నేరస్తుల ఇళ్లల్లో భారీగా మద్యం బాటిళ్లు దొరికాయి. వీరందరూ వైన్ షాపులు బంద్ ఉన్న సమయాల్లోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ ఇక్కడ మద్యాన్ని అమ్ముతుం టారు. అంతేకుండా గుడుంబా, గంజాయి కూడా విక్రయిస్తుం టారు. ఈ మద్యం బాటిళ్ల వ్యవహారంలో ఓ ఎస్సై పాత్ర ఉన్నట్లు సమాచారం. అతడిని కూడా పోలీసులు విచారించినట్లు తెలిసింది. వీడిన హత్యాయత్నం కేసు మిస్టరీ: ముగ్గురు బాలనేరస్తుల అరెస్టు కార్డన్ అండ్ సర్చ్‌లో ఓ హత్య కేసు మిస్టరీ వీడింది. 16-17 ఏళ్ల లోపు ఉన్న ముగ్గురు పాతబాలనేరస్తులను పోలీసులు విచారించగా హత్య విషయాన్ని బయటపెట్టారు. జల్సాలకు అలవాటుపడ్డ ఈ ముగ్గురూ ఫుట్‌పాత్‌పై నిద్రించేవారిని టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసిన వ్యక్తి ముక్కు వద్ద వైట్నర్ ఉంచి అతడు మరింత మత్తులోకి వెళ్లేలా చేస్తారు. తర్వాత దాడి చేసి, డబ్బు దోచుకుంటారు. ఇదే క్రమంలో ఈనెల 11న గోకుల్‌నగర్ సమీపంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న 45 ఏళ్ల వ్యక్తిపై వైట్నర్ ప్రయోగించారు. అతను అంతలోనే మేల్కోవడంతో తలపై బండరాయితో మోదారు. ఇది గమనించిన ఓ వ్యక్తి హబీబ్‌నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి అపస్మారకస్థితిలో ఉన్న బాధితుడిని ఉస్మానియాకు తరలించగా.. చికిత్సపొందుతూ ఈనెల 15న మృతి చెందాడు. కాగా, మంగళవారం కార్డన్ అండ్ సర్చ్‌లో పోలీసులు సదరు ముగ్గురు బాలనేరస్తులను అదుపులోకి తీసుకొని విచారించగా.. ఈనెల 11న తాము ఓ వ్యక్తిని హత్య చేశామని వెల్లడించారు. దీంతో ముగ్గురినీ జువైనల్ హోంకు తరలించారు. -
కోర్టు ఆదేశాల మేరకే రంభపై కేసు: డీసీపీ
-
కోర్టు ఆదేశాల మేరకే రంభపై కేసు: డీసీపీ
హైదరాబాద్: అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ నటి రంభ సోదరుడు శ్రీనివాస్ వెంకటేశ్వర్రావు భార్య పల్లవి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని వెస్ట్ జోన్ డీసీసీ సత్యనారాయణ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు రంభ, తల్లిదండ్రులు, శ్రీనివాసరావులపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. త్వరలోనే వారికి నోటీసులు పంపుతామని వెల్లడించారు. వారి వాంగ్మూలాన్ని తీసుకుంటామని చెప్పారు. కేసుపై అన్నివైపుల విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పల్లవి భర్త శ్రీనివాస్‌తో పాటు రంభ, అత్త ఉషారాణి, మామ వెంకటేశ్వర్రావుపై బంజారాహిల్స్ పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
ఆన్లైన్లో వ్యభిచారం!
హైదరాబాద్: నగరంలో ఆన్లైన్ పద్ధతిలో వ్యభిచారాన్ని నడుపుతున్నట్లుగా తమకు సమాచారం వచ్చిందని వెస్ట్‌జోన్ డిసిసి సత్యన్నారాయణ తెలిపారు. వ్యభిచార గృహాలపై దాడి చేసేందుకు వెళ్లిన ఇద్దరు జూబ్లీహిల్స్ కానిస్టేబుల్స్‌పై కొందరు దుండగులు చేసిన దాడి వివరాలను ఆయన వెల్లడించారు. సమాచారం వచ్చిన వెంటనే అడిషనల్ డిసిపి గన్‌మేన్, జూబ్లీహిల్స్ హెడ్‌కానిస్టేబుల్ కొండారెడ్డి వ్యభిచార గృహంపై దాడి చేయడానికి వెళ్లారని తెలిపారు. సుధాకర్ అనే వ్యక్తి కిచెన్‌లో చాకుతో వాడిపై దాడిచేసినట్లు చెప్పారు. గ్రిల్ ఊడదీసి నిందితుడు పారిపోయారన్నారు. ఇద్దరు పోలీసులు మఫ్టీలో ఉన్నారని, సరైన బందోబస్తు ఉండిఉంటే, ఈ ఘటన జరిగి ఉండేదికాదన్నారు. బ్రోకర్ జగదీష్‌ను పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఎస్ఐ, సీఐలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కానిస్టేబుళ్లు దాడిచేసినట్లు డిసిపి చెప్పారు. అధికారుల దృష్టికి తీసుకురాకుండా ఈ దాడులు చేశారని, అత్యుత్సాహంతో చేశారా? లేక వసూళ్ల కోసం చేశారా? అన్నది ఆరా తీస్తున్నట్లు ఆయన వివరించారు. సరైన భద్రత లేకుండా దాడి చేయడం పొరపాటేనన్నారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డీసీపీ సత్యన్నారాయణ చెప్పారు.