12 గంటల వరకు 21.65 శాతం పోలింగ్ | GHMC Election 21.65 percentage till 12 | Sakshi
Sakshi News home page

12 గంటల వరకు 21.65 శాతం పోలింగ్

Published Tue, Feb 2 2016 12:41 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

GHMC Election 21.65 percentage till 12

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 12 గంటల వరకు 21.65 శాతం నమోదయింది.

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 12 గంటల వరకు 21.65 శాతం నమోదయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ క్రమక్రమంగా పుంజుకుంటోంది. 9 గంటలవరకు తక్కువగా ఉన్న పోలింగ్ ఆ తర్వాత పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరడంతో ఓటింగ్ శాతంలో వృద్ధి కనిపిస్తోంది. వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి జనార్ధన్ రెడ్డి తెలిపారు. అన్ని ప్రాంతాల్లో ఇప్పటివరకు ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతోందన్నారు.

పాతబస్తీలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాజకీయ పార్టీల నుంచి ఇప్పటివరకు 37 ఫిర్యాదులు అందాయని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. పాతబస్తీలో 5 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 9 డివిజన్లను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి అక్కడ పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు డీసీపీ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement