చార్మినార్, మీర్‌చౌక్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 12 మందికి జైలు శిక్ష పడిందని నగర ట్రాఫిక్ అదనపు డీసీపీ సత్యనారాయణ తెలిపారు. నిబంధనలు కఠినతరం కావడంతో వాహనదారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. చార్మినార్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎలాంటి డ్రై వింగ్ లైసెన్స్ లేకుండా ఆటోలను నడుపుతున్న నలుగురికి జరిమానాతో పాటు జైలు శిక్ష పడిందన్నారు.
అలాగే, మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో డ్రై వింగ్ లైసెన్స్ లు లేకుండా ఆటోలను నడపుతున్న ఏడుగురిపై రెండోసారి కేసులు నమోదు కావడంతో నాంపల్లిలోని ఆరో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు మూడు రోజుల జైలు శిక్షతో పాటు రూ.700 జరిమానా విధించిందని వివ రించారు.
పాతబస్తీలో ఇప్పటి వరకు 2,100 మంది వాహనదారులు లైసెన్స్ లేకుండా వాహనాలతో పట్టుబడ్డారని...25 వేల మంది వాహనదారులు హెల్మెట్ లేకుండా దొరికారని..3 వేల మంది ఎలాంటి డ్రై వింగ్ లైసెన్స్ లేనివారు పట్టుబడ్డారన్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారెవైరె నా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనన్నారు.